సంక్షేమం, అభివృద్ధే ధ్యేయం
మడకశిర: సంక్షేమం, అభివృద్ధే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవాణా, క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన పది నెలలోనే అన్ని ప్రభుత్వ శాఖలను గాడిలో పెట్టిన ఘనత సీఎం చంద్రబాబుదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 16,500 డీఎస్సీ పోస్టుల ప్రక్రియకు శ్రీకారం చుట్టామని, పోలీస్‌శాఖలో వివిధ పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. అమరావతి పునఃనిర్మాణ పనులకు మే 2న ప్రధాని నరేంద్రమోదీచే శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు. ఆ తర్వాత మంత్రి మడకశిరలో రూ.2 కోట్లతో నిర్మించిన బాల్‌బ్యాడ్మింటన్ హాలు, టేబుల్ టెన్నిస్ కోర్టు తదితర వాటిని పరిశీలించారు. అనంతరం కదిరి–అనంతపురం, కదిరి–రాయచోటి సర్వీసులను ప్రారంభించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం, బాబూ జగ్జీవన్‌రామ్ నూతన విగ్రహాల స్థాపనకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదిలా ఉండగా డిపోలో జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ లాభాలు వచ్చే 150 డిపోల్లో ప్రతి డిపోకు కొత్తగా 20 బస్సులు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం కొత్తగా గ్రామీణ ప్రజల సౌకర్యార్థం 1000 అదనపు బస్సులు నడుతున్నామని తెలిపారు. ప్రభ్తుత్వం, ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా డిపోలను అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడతున్నామని తెలిపారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, డీపీటీఓ మధూసూదన్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర రవాణా, క్రీడా శాఖ మంత్రి
రాంప్రసాద్‌రెడ్డి


