అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చేది లేదు
16వ వార్డు కౌన్సిలర్ సతీష్‌రెడ్డి
మడకశిర: ‘‘నేను వైఎస్ జగన్ వీరాభిమానిని. ఆయన అవకాశం కల్పించబట్టే కౌన్సిలర్‌ను అయ్యాను. నా ప్రాణం ఉన్నంత వరకూ రాజకీయాల్లో జగన్ వెంటనే నడుస్తాను. అమ్మపాలు తాగి రొమ్ముగుద్దను. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీకి ద్రోహం చేయను’’ అని 16వ వార్డు కౌన్సిలర్ సతీష్‌రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ గుర్తుపై కౌన్సిలర్‌గా విజయం సాధించిన తాను వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతానన్నారు.
ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మడకశిర మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌లపై టీడీపీ ప్రవేశపెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి తాను మద్దతిచ్చే ప్రసక్తే లేదన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టాటని కోరుతూ కొందరు కౌన్సిలర్లు కలెక్టర్‌కు ఇచ్చిన నోటీసులో తాను సంతకం చేయలేదని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా తన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఉంటే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.
బావిలో పడి వృద్ధుడి మృతి
గుడిబండ: దప్పిక తీర్చుకోవడం కోసం బావిలోకి దిగిన ఓ వృద్ధుడు కాలుజారి అందులో పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు..కరికెర గ్రామానికి చెందిన హనుమంతరాయప్ప(72) శనివారం గ్రామ సమీపాన తన పొలం వద్దకు వెళ్లాడు. దప్పిక వేయడంతో నీరు తాగేందుకు బావిలోకి దిగాడు. ఈక్రమంలో కాలుజారి అందులో పడిపోయాడు. ఈత రాకపోవడంతో నీటి మునిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న మడకశిర అగ్నిమాపకశాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని నీటిలో మునిగిన హనుమంతరాయప్ప మృతదేహాన్ని బయటికి తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ రాజ్‌కుళ్లాయప్ప తెలిపారు.

ప్రాణం ఉన్నంత వరకూ జగన్ వెంటే