
నాటుసారా తయారు చేస్తే చర్యలు
పుట్టపర్తి టౌన్: జిల్లా వ్యాప్తంగా నాటు సారా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ప్రొహిబిషన్ ఎక్‌పైజ్ జిల్లా అధికారి గోవిందనాయక్ హెచ్చరించారు. నవోదయం 2.0 భాగంగా నాటు సారా నిర్మూలకు సోమవారం బుక్కపట్నం మండలం నార్శింపల్లి తండాలో జిల్లా అధికారులలో కలసి దాడులు నిర్వహి ంచారు. 540 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసి, 4 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. నార్శింపల్లి తండాకు చెందిన అలివేలుబాయి, కిరణ్‌నాయక్, శ్రీరాములు నాయక్‌పై కేసు నమోదు చేశారు. పుట్టపర్తి రూరల్ మండలం వెంగలమ్మచెరువు గ్రామంలో దాడులు నిర్వహించి 90 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, గంగులయ్యపై కేసు నమోదు చేశారు. దాడుల్లో అసిస్టెంట్ ప్రొహిబిషన్ అధికారి నరసింహులు, సీఐ నాగరాజు, ఎస్‌ఐ ఉమామహేశ్వర్‌రాజుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
బెల్లపు ఊట ధ్వంసం
కదిరి అర్బన్: బాలప్పగారిపల్లి తండా సమీపంలోని కొండగుట్టల్లో సోమవారం ఎకై ్సజ్ పోలీసులు దాడులు నిర్వహించి, అక్రమంగా నిల్వ ఉంచిన 452 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. దాడుల్లో అనంతపురం ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ అలీ, ఎకై ్సజ్ సీఐ శ్రీధర్, బాబు, దత్తాత్రేయతో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.