
భూగర్భ జలమట్టం పడిపోవడం.. నీటి పథకాలు పనిచేయకపోవడంతో చు
గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్) విభాగం ఆధ్వర్యంలో ఈ ఏడాది వేసవికి సంబంధించి రూ.5.87 కోట్లతో 284 పనులను చేపట్టినట్లు ఆ శాఖాధికారులు పేర్కొన్నారు. అయితే ఏ గ్రామంలో చేపట్టారో.. ఎక్కడ సమస్య పరిష్కరించారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇందులో 85 చోట్ల బోరుబావుల తవ్వకానికి రూ.85 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. కానీ ఆ పనులెక్కడా కనిపించడం లేదు.
జిల్లాలోని 51 గ్రామాలు వాల్టా చట్టం పరిధిలో ఉండగా ఆయా గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. కానీ ఆ దిశగా యంత్రాంగం చర్యలు తీసుకోలేదు. పాలకులూ కనీసం పట్టించుకోలేదు. ఇక ఇతర ప్రాంతాల్లో కొత్తగా బోర్లు వేసే అవకాశం ఉన్నా...ఎవరూ స్పందించడం లేదు. కేవలం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే నీటి సమస్యకు కారణమని జనం అంటున్నారు. ముఖ్యంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించడంలో యంత్రాంగం విఫలమైందంటున్నారు.
సాక్షి, పుట్టపర్తి
వేసవి ఆరంభంలోనే తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది తగినంత వర్షాలు కురవక పోవడం.. భూగర్భ జలమట్టం పడిపోవడంతో బోరుబావులు ఎండిపోయాయి. దీంతో రక్షిత మంచినీటి పథకాలు అలంకార ప్రాయంగా మారాయి. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా సాగు, తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఏ గ్రామంలో చూసినా నీటి సమస్య వెంటాడుతోంది. ‘నీళ్లో రామచంద్రా’ అంటూ జనం నిట్టూరుస్తున్నారు. తాగునీటి కోసం రోడ్లెక్కి ఆందోళనకు దిగుతున్నారు. అధికారులు సమస్యకు తాత్కాలిక పరిష్కారం చూపుతుండగా... వారం రోజుల్లోనే మళ్లీ నీటి కష్టాలు పునరావృతమవుతున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు చర్యలు లేకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పుట్టపర్తి, బుక్కపట్నం, ఓడీ చెరువు, లేపాక్షి, మడకశిర, హిందూపురం, రొళ్ల, అగళి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో ఇప్పటికే ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. అయినా పాలకుల్లో చలనం రాలేదు. ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కిన రోజు మాత్రం రెండు నీటి ట్యాంకర్లను పంపించి చేతులు దులుపుకుంటున్నారు.
జిల్లా కేంద్రం పుట్టపర్తిలో తాగునీటి సమస్య తీవ్రతరమైంది. ఇక్కడ బహుళ అంతస్తుల భవనాలు ఉండగా...తాగునీటి సమస్యతో జనం అల్లాడిపోతున్నారు. మూడు, నాలుగు ఫోర్లలో ఉంటున్న వారు నీరు రాక నరకం చూస్తున్నారు. ముఖ్యంగా మున్సిపల్ కార్యాలయం వెనుక సందులో రెండురోజులకోసారి అర్ధరాత్రి వేళ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కుతున్నారు. జిల్లా కేంద్రమైనప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని.. సమయానికి నీళ్లు రావడం కష్టంగా మారిందని వాపోతున్నారు. శ్రీసత్యసాయి తాగునీటి పథకం ఉన్నప్పటికీ.. ఉద్యోగులకు ప్రభుత్వం సమయానికి జీతాలు ఇవ్వకపోవడంతో సమస్య జఠిలమైంది. పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని బుక్కపట్నం మండలం చిలకలగడ్డపల్లిలోనూ తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. తాగునీటి కోసం మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఓడీ చెరువు మండలంలోనూ రక్షిత తాగునీటి పథకాలు పనిచేయకపోవడంతో ప్రజలు వ్యవసాయ బోర్ల వద్ద నుంచి నీరు తెచ్చుకుంటున్నారు.
సీఎం చంద్రబాబు బావమరిది, సినీనటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో నెలరోజుల ముందే నీటి కష్టాలు మొదలయ్యాయి. ఏ వార్డులో చూసినా నీటి సమస్య వెంటాడుతోంది. ట్యాంకర్ రూ.500 వెచ్చించి నీరు కొనుగోలు చేసి వినియోగిస్తున్న దుస్థితి ఏర్పడిందని ప్రజలు వాపోతున్నారు. ఎమ్మెల్యే చుట్టపు చూపుగా వచ్చి వెళ్తారని.. సమస్యలు పరిష్కరించే వారే లేరని చెబుతున్నారు. లేపాక్షి మండలంలోనూ తాగునీటి కోసం ఇటీవల మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. గుక్కెడు తాగునీరివ్వలేని పాలకుల తీరును నిరసించారు.
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మవరం పట్టణంలో నీటి సమస్య వేధిస్తోంది. సరైన సమయానికి నీరు రావడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రతరం కాగా, రెండు రోజుల కిందట ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. మంత్రి సత్యకుమార్ నియోజకవర్గంలో నెలకొన్న నీటి సమస్య పరిష్కరించడంలో విఫలం అవుతున్నారని విమర్శించారు. గడిచిన ఐదేళ్లలో ఏనాడూ నీటి సమస్య కనిపించలేదని ప్రజలే చెబుతున్నారు.
కర్ణాటక సరిహద్దున ఉన్న మడకశిర నియోజకవర్గ వ్యాప్తంగా నీటి సమస్య ప్రజలను వేధిస్తోంది. ఏ గ్రామంలో చూసినా తాగునీటి కష్టాలే కనిపిస్తున్నాయి. దీనికి తోడు చాలా గ్రామాలు వాల్టా చట్టం పరిధిలో ఉండటంతో సమస్య మరింత తీవ్రంగా మారింది. పాలకులు గ్రామాలకు నీళ్లు ఇవ్వక.. ప్రజలు బోర్లు వేసుకోలేక.. నానా అవస్థలు పడుతున్నారు. మడకశిర, రొళ్ల, అగళి మండలాల్లో ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. పొలాల్లోని బోర్ల వద్ద నీటి కోసం యుద్ధాలకు దిగుతున్నారు.
12.9 మీటర్లు
ప్రస్తుతం జిల్లా
భూగర్భ జలమట్టం
రూ.5.87 కోట్లు
ఆర్‌డబ్ల్యూస్ ద్వారా కేటాయించిన
నిధులు
ఆర్‌డబ్ల్యూఎస్ పనులెక్కడ?
ముందస్తు చర్యలేవీ?
ఊరూరా నీటికష్టాలు
జిల్లాలో తీవ్రమైన తాగునీటి సమస్య
రోజూ ఏదో చోట రోడ్డెక్కుతున్న ప్రజలు
పుట్టపర్తి, హిందూపురం,
మడకశిరలో దాహం కేకలు
ధర్మవరంలోనూ సరిపడా
అందని తాగునీరు
ప్రత్యామ్నాయ చర్యలు
తీసుకోవడంలో అధికారుల విఫలం
ప్రజల నీటి సమస్యలు పట్టించుకోని అధికారులు, పాలకులు
51
వాల్టా చట్టం కింద
ఉన్న గ్రామాలు
284
సమ్మర్ యాక్షన్ ప్లాన్ కింద ఆర్‌డబ్ల్యూస్ ద్వారా చేపట్టిన పనులు
పుట్టపర్తిని వెంటాడుతోన్న దాహార్తి..
మంత్రి ఇలాకాలో తీరని కష్టాలు..
బాలయ్య అడ్డాలో దాహం.. దాహం
మడకశిర వ్యాప్తంగా నీటియుద్ధాలు..

భూగర్భ జలమట్టం పడిపోవడం.. నీటి పథకాలు పనిచేయకపోవడంతో చు

భూగర్భ జలమట్టం పడిపోవడం.. నీటి పథకాలు పనిచేయకపోవడంతో చు

భూగర్భ జలమట్టం పడిపోవడం.. నీటి పథకాలు పనిచేయకపోవడంతో చు