‘పురం’ మార్కెట్‌కు తగ్గిన పట్టుగూళ్లు | - | Sakshi
Sakshi News home page

‘పురం’ మార్కెట్‌కు తగ్గిన పట్టుగూళ్లు

Published Sat, Apr 26 2025 12:48 AM | Last Updated on Sat, Apr 26 2025 12:48 AM

‘పురం

‘పురం’ మార్కెట్‌కు తగ్గిన పట్టుగూళ్లు

మూడురోజులుగా

1,500 కిలోల లోపేరాక

హిందూపురం అర్బన్‌: రాష్ట్రంలోనే పేరుగాంచిన హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్‌కు సరుకు రావడం తగ్గిపోయింది. సీజన్‌లో రోజూ 8 టన్నుల నుంచి 12 టన్నుల వరకు పట్టుగూళ్లు వచ్చేవి. అన్‌ సీజన్‌లో అయితే 3 టన్నులకు తగ్గకుండా పట్టుగూళ్లు వచ్చేవి. కానీ మూడు రోజులుగా మార్కెట్‌కు 1,500 కిలోలలోపే పట్టు గూళ్లు రావడంతో మార్కెట్‌ అధికారులను కలవరపాటుకు గురిచేసింది. ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు, వైరస్‌తో దిగుబడి తగ్గడంతో పట్టుగూళ్లు ఉత్పత్తులు తగ్గాయి. కర్ణాటక ప్రాంతాల్లోని మార్కెట్లలో ధరలు కాస్త ఎక్కువగా ఉండటంతో అరకొర దిగుబడిని కూడా రైతులు అక్కడికే తీసుకెళ్తున్నారు. దీంతో హిందూపురం మార్కెట్‌కు వచ్చే పట్టుగూళ్లు తగ్గిపోయాయి.

కిలో బైవోల్టిన్‌ పట్టుగూళ్లు రూ.662..

హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్‌లో కిలో బైవోల్టిన్‌ పట్టుగూళ్లు గరిష్టంగా రూ.662 వరకూ పలుకుతున్నాయి. ఈ నెల 23వ తేదీన 824 కిలోలు, 24వ తేదీన 979 కిలోలు, 25వ తేదీన 1,481 కిలోల పట్టుగూళ్లు మార్కెట్‌కు వచ్చాయి. కిలో పట్టు గూళ్లు (భైవోల్టిన్‌) గరిష్టంగా రూ. 662, కనిష్టం రూ.358, సరాసరిన రూ. 582 ప్రకారం ధర పలికాయి. కర్ణాటక ప్రాంత మార్కెట్లలో ఒకటి, రెండు లాట్లకు ఎక్కువ రేటు చూపుతారని, మిగతా వాటికి ఇక్కడి కంటే తక్కువే ధర వస్తోందని హిందూపురం మార్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మిరెడ్డి తెలిపారు. రైతులు దూరభారం వెళ్లి మోసపోవద్దని సూచించారు. నాణ్యమైన పట్టుగూళ్లకు స్థానికంగానే మంచి ధర లభిస్తోందని ఆయన వెల్లడించారు.

సజావుగా

ధ్రవపత్రాల పునఃపరిశీలన

అనంతపురం మెడికల్‌: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఉపాధ్యాయుల మెడికల్‌ సర్టిఫికేషన్‌ పునఃపరిశీలన ప్రక్రియ శుక్రవారం సజావుగా సాగింది. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పరిశీలనకు హాజరయ్యారు. ఆస్పత్రిలోని డీఈఐసీ, బర్న్స్‌ వార్డు, ఆప్తాల్మిక్‌ వార్డుల్లో ధ్రువపత్రాల పరిశీలన జరిగింది. ఆర్థో హెచ్‌ఓడీ, ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఆత్మారాం, వైద్యులు డాక్టర్‌ ఆనంద్‌ బాబూ నాయక్‌, డాక్టర్‌ ప్రశాంతి, తదితరులు సర్టిఫికెట్లను పరిశీలించారు.

మే 19 నుంచి

ఓపెన్‌ పది, ఇంటర్‌ పరీక్షలు

పుట్టపర్తి టౌన్‌: ఓపెన్‌ 10వ తరగతి, ఇంటర్‌ పరీక్షలు మే 19 తేదీ నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ కృష్టప్ప తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయన్నారు. అలాగే మే 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఇంటర్‌ విద్యార్థులకు ప్రాక్ట్రికల్స్‌ ఉంటాయని వెల్లడించారు.

అందుబాటులో

పాలిసెట్‌ హాల్‌టికెట్లు

హిందూపురం: ఏపీ పాలిసెట్‌–2025 (ఆంధ్రప్రదేశ్‌ పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌) హాల్‌ టిక్కెట్లు www. polycetap.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు హిందూపురం పాలిటెక్నిక్‌ కళాశాల నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 30వ తేదీన పరీక్ష ఉంటుందని అభ్యర్థులు వెబ్‌సైట్‌ ద్వారా హాలుటికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. ఏదైనా సమస్య తలెత్తితే సమీపంలోని సహాయ కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.

‘పురం’ మార్కెట్‌కు  తగ్గిన పట్టుగూళ్లు 1
1/2

‘పురం’ మార్కెట్‌కు తగ్గిన పట్టుగూళ్లు

‘పురం’ మార్కెట్‌కు  తగ్గిన పట్టుగూళ్లు 2
2/2

‘పురం’ మార్కెట్‌కు తగ్గిన పట్టుగూళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement