
పొలాలకు వెళ్లే దారేదీ..?
ఇద్దరు రైతులపై కేసులు
పొలాలకు దారి ఎందుకు వదలరంటూ దోరణాలపల్లికి చెందిన రైతులు నంజిరెడ్డి, నారాయణరెడ్డి రియల్టర్ రెడ్డెప్పశెట్టిని ప్రశ్నించారు. మీరు దారి ఇవ్వకపోతే.. మేమూ తిరగనివ్వం అని అంటే ఆగ్రహించిన రెడ్డప్పశెట్టి సదరు రైతులపై కేసులు పెట్టించి కోర్టుల చుట్టూ తిప్పుతున్నాడు. ఆయనకొక న్యాయం.. మాకొక న్యాయమా అంటూ బాధిత రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. రాజ్యాంగేతర శక్తిగా మారి ఇంతటి దాష్టీకానికి పాల్పడుతున్నా ప్రభుత్వాలు, అధికారులు ఎందుకు స్పందించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.