తల్లీ బిడ్డల క్షేమమే ముఖ్యం
పుట్టపర్తి అర్బన్: గర్భిణులకు తల్లీ బిడ్డల సంరక్షణపై పూర్తి అవగాహన కల్పించివారి పరిరక్షణకు తోడ్పాటు అందించాలని డీఎంహెచ్‌ఓ ఫైరోజాబేగం ఆదేశించారు. మాతా శిశు మరణాలకు సంబంధించి జిల్లా స్థాయి సబ్ కమిటీ మీటింగ్‌ను గురువారం స్థానిక డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ జిల్లాలో మార్చి నెలలో శిశు మరణాలు 3, ఒక మాతృ మరణం సంభవించాయన్నారు. ప్రతి నెలా జరిగే రివ్యూ ద్వారా సిబ్బంది అవగాహన పెంచుకోవాలని తద్వారా గర్భిణీలకు అవగాహన పెంచవచ్చన్నారు. గర్భిణులకు ప్రతి నెలా 9న జరిగే శిక్షణలో అవగాహన కల్పించాలని సూచించారు. గర్భిణుల గ్రూపును తయారు చేసి ఆరోగ్య విద్యను అందించాలన్నారు. ఏ తల్లీ .. బిడ్డకు జన్మనిస్తూ చనిపోకూడదని, ఏ బిడ్డ జన్మిస్తూ చనిపోరాదన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ తిప్పేంద్రనాయక్, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు మంజువాణి, సెల్వియాసాల్మన్, నాగేంద్రనాయక్, వైద్యులు సునీల్, శ్రీలత, నీరజ, కార్తీక్, ఐసీడీఎస్ పీడీ శారద , డీపీహెచ్‌ఎన్‌ఓ వీరమ్మ, 108 ఈఓ అబ్దుల్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.


