
ఒంగోలు నివాసి మృతి
కదిరి టౌన్: స్థానిక తాయి గ్రాండ్ లాడ్జ్ మెట్లు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడిన ఒంగోలుకు చెందిన కోటేశ్వరరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒంగోలుకు చెందిన శ్రీనివాసులు తన కారు డ్రైవర్ కోటేశ్వరరావుతో కలసి అనంతపురంలో బంధువుల ఇంట జరిగిన శుభకార్యానికి వచ్చారు. ఈ క్రమంలో కదిరిలోని తన స్నేహితుడు రమణను మాట్లాడేందుకు సోమవారం సాయంత్రం వచ్చి తాయిగ్రాండ్ లాడ్జ్‌లో గదిని అద్దెకు తీసుకున్నాడు. టిఫెన్ కోసం వచ్చిన కోటేశ్వరరావు తిరిగి లాడ్జ్ మెట్లు ఎక్కుతుండగా అదుపు తప్పి కిందపడడంతో తలకు బలమైన గాయమైంది. కదిరి ఏరియా ఆస్పత్రిలో చికిత్స నిర్వహిస్తుండగా పరిస్థితి విషమించి ఆయన మృతి చెందాడు. ఘటనపై కదిరి పోలీసులు కేసు నమోదు చేశారు.