సమస్యల పరిష్కారమే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారమే ధ్యేయం

Published Tue, Apr 22 2025 12:46 AM | Last Updated on Tue, Apr 22 2025 12:46 AM

సమస్య

సమస్యల పరిష్కారమే ధ్యేయం

జిల్లా పరిధిలో సోమవారం పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. వేసవితాపం కొనసాగింది. నైరుతి దిశగా గంటకు 8 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి.
ధర్మవరంలో ముస్లింల భారీ ర్యాలీ
మున్సిపల్‌ కార్యాలయంలో అవినీతి అనకొండ
పాలబావిలో గంగ పూజ

బిందెడు నీటికి బండెడు కష్టాలు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న 727 గ్రామాల ప్రజల దాహార్తి తీర్చే శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం గడ్డు పరిస్థితిని

ఎదుర్కొంటోంది.

చీనీ టన్ను రూ.23,800

అనంతపురం మార్కెట్‌యార్డులో సోమవారం చీనీకాయలు టన్ను

గరిష్ట ధర రూ.23,800 పలికాయి.

మంగళవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్‌

ప్రశాంతి నిలయం: అనంతపురంలోని జిల్లా కోర్టులో సోమవారం సాయంత్రం నూతన జిల్లా జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన భీమారావును కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు.

తగ్గుతున్న

చింత పండు ధరలు

హిందూపురం అర్బన్‌: హిందూపురం వ్యవసాయ మార్కెట్‌లో గత మూడు వారాలుగా చింత పండు ధరలు పడిపోతున్నాయి. సోమవారం 881.70 క్వింటాళ్ల చింత పండు వచ్చింది. మార్కెట్‌లో ఈ నామ్‌ పద్ధతిలో వేలం పాటలు సాగాయి. కరిపులి రకం క్వింటా గరిష్ట ధర రూ.19,500, కనిష్ట ధర రూ.8 వేలు , సగటు ధర రూ.15 వేలు పలికింది. అలాగే ప్లవర్‌ రకం క్వింటా గరిష్ట ధర రూ.12,500, కనిష్ట ధర రూ.4,420, సగటు ధర రూ.8 వేలు పలికింది. గత వారంతో పోలిస్తే కరిపులి రకం క్వింటాపై రూ.1000 తగ్గుదల కనిపించింది. వాతావరణ మార్పులు, చల్లదనంతో ధరలు తగ్గుముఖం పట్టినట్లు మార్కెట్‌ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు.

దొంగతనం కేసులో

ముద్దాయికి మూడేళ్ల జైలు

పుట్టపర్తి టౌన్‌: కొత్తచెరువులో జరిగిన రెండు దొంగతనాల కేసులో ముద్దాయి అమర్నాథ్‌నాయుడుకు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ పుట్టపర్తి జేఎఫ్‌సీఎమ్‌ కోర్టు జడ్జి రాకేష్‌ సోమవారం తీర్పు వెల్లడించారు. కొత్తచెరువులో జరిగిన రెండు దొంగతనాలపై విచారణ జరిపి అమర్నాథనాయుడుపై 2012లో కేసును నమోదు చేసి విచారణ జరిపి రిమాండ్‌కు తరలించారు. ఏపీపీ మైలాబాబు, రాజేంద్రప్రసాద్‌ తమ వాదనలు వినిపించారు. వాదనలు విన్న జడ్జి రాకేష్‌ ముద్దాయిపై అభియోగాలు రుజువు కావడంతో మూడు సంవత్సరాలు జైలు శిక్ష, వెయ్యి రూపాయలు జరిమానా విధించారు.

చిలమత్తూరు సమీపంలోని బైరేకుంట చెరువులో

మట్టి తవ్వుతున్న దృశ్యం

చిలమత్తూరు: బాలయ్య ఇలాకాలో దందాలు పెచ్చుమీరాయి. సినిమా షూటింగులతో బాలకృష్ణ బిజీగా ఉంటే.. ఆయన పీఏలతో పాటు అనుచర గణం నియోజకవర్గంలోని సహజ సంపదను దోచేసే పనిలో నిమగ్నమయ్యారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నదులు, చెరువులలో మట్టి, ఇసుకను విచ్చలవిడిగా తరలిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఎవరైనా అడిగితే మాత్రం పీఏలు చెప్పారంటూ తమ అక్రమ వ్యాపారాలను సాగించేస్తున్నారు.

మట్టి మాఫియాకు కేరాఫ్‌గా చిలమత్తూరు..

రాష్ట్ర సరిహద్దు అయిన చిలమత్తూరు మండలం మట్టి మాఫియాకు కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ 44వ నంబరు జాతీయ రహదారి, గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే, 544ఈ జాతీయ రహదారి, పుట్టపర్తి వరకూ నాలుగు లేన్ల రహదారులు ఉండటంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు భూములు కొనుగోలు చేసి అగ్రి లేఔట్లను జోరుగా అభివృద్ధి చేసుకుంటున్నారు. అయితే భూములు ఎత్తుపల్లాలు ఉండటంతో వాటిని లెవలింగ్‌ చేసుకోవడానికి ఇష్టానుసారంగా మట్టిని చెరువుల నుంచి తరలిస్తున్నారు.

నేరుగా పీఏలతోనే బేరం !

రియల్టర్లు నేరుగా ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలతోనే స్థానిక టీడీపీ నేతల ద్వారా టచ్‌లోకి వెళ్లిపోయి మట్టి దందాను సాగిస్తున్నారన్న విమర్శలున్నాయి. అభివృద్ధి మాట పక్కనపెట్టి వారి స్వలాభాలకే ప్రాధాన్యం ఇస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఇటీవల హిందూపురానికి చెందిన ఓ టీడీపీ నేత .. 44వ నంబరు జాతీయ రహదారి దగ్గర ఉన్న రియల్టర్‌కు చెందిన భూమి లెవలింగ్‌ కోసం వందలాది లోడ్‌ల మట్టిని అక్రమంగా లేపాక్షి నాలెడ్జి హబ్‌ భూముల నుంచి తరలించారు. ఇందుకోసం మండలస్థాయి టీడీపీ నేత అనుచరుడి అకౌంట్‌లోకి రోజుకు రూ.50 వేల చొప్పున రియల్టర్‌ చెల్లించినట్లు సమాచారం. ఇదంతా పురంలో ఉన్న ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలకు చేర్చారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి.

అన్నీ అధికారులకు తెలిసే..

హిందూపురం నియోజకవర్గంలో మట్టి దందా విషయం ఇరిగేషన్‌ , మైనింగ్‌శాఖ అధికారులకు తెలిసినా ఏమీ చేయలేకపోతున్నారన్న విమర్శలున్నాయి. కేవలం పీఏల భయంతో మిన్నకుండిపోతున్నట్లు చెబుతున్నారు. మండలంలో కొడికొండ – మొరసలపల్లి ప్రధాన రహదారి పక్కనే ఇటుక బట్టీల కోసం ఓ టీడీపీ నేత వందలాది లోడ్ల మట్టిని డంప్‌ చేశారు. దీనికి ఎలాంటి అనుమతి లేదు. రైతులకు మట్టి తోలుకునేందుకు వంద నిబంధనలు పెట్టే అధికారులు ఇలాంటి అక్రమార్కులపై చర్యలు ఎందుకు తీసుకోరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

కళావిహీనంగా నదులు..

మట్టి దందాతో పాటు అక్రమంగా ఇసుక తరలింపు ద్వారా తమ్ముళ్ల ఆదాయం మూడు పువ్వులు, ఆరు కాయలుగా మారింది. నదుల్లోని సహజ వనరుల సొమ్మంతా టీడీపీ నేతల ఇళ్లకు చేరుతోంది. యథేచ్ఛగా ఇసుక దోపిడీ ద్వారా నదులన్నీ కళావిహీనంగా కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని పెన్నా, చిత్రావతి, కుషావతి నదులు ఇసుక దిబ్బలతో నీటితో కళకళలాడేవి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవి కళావిహీనంగా మారాయి. ఇసుక దోపిడీ కారణంగా వేసవిలో నదుల్లో ఉన్న నీరంతా ఆవిరైపోయింది. సహజ వనరులు ఇలాగే ఖాళీ చేస్తే కరువు సంభవించడం ఖాయమని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలు స్థానికంగా ఉండే నేతలను బినామీలుగా అడ్డుపెట్టుకొని సహజ వనరులను దోచుకుంటూ నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా మార్చేందుకు కుట్ర చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు.

ధర్మవరం: వక్ఫ్‌ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకునే వరకూ పోరాటం చేస్తామని ముస్లిం నాయకులు స్పష్టం చేశారు. వక్ఫ్‌ సవరణ చట్టాన్ని రద్దు చేయాలంటూ ధర్మవరం పట్టణంలో ముస్లింలు, సంయుక్త మస్జీద్‌ కమిటీల ఆధ్వర్యంలో సోమవారం భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. జామియా మస్జీద్‌ నుంచి పీఆర్‌టీ సర్కిల్‌, గాంధీ సర్కిల్‌ మీదుగా కళాజ్యోతి, కాలేజ్‌ సర్కిల్‌ వరకూ నిరసన ర్యాలీ చేపట్టారు. సీపీఐ, సీపీఎం, వైఎస్సార్‌సీపీ, క్రైస్తవ సంఘాలు, బీఎస్పీ, ఎమ్మార్పీఎస్‌, సీఐటీయూ, ఏఐటీయూసీ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం కాలేజ్‌ సర్కిల్‌ వద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు.

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తారా?

ముస్లిం మతపెద్దలు తాహీర్‌ మౌలానా తాహీర్‌, తాయూబ్‌ మాట్లాడుతూ వక్ఫ్‌ బోర్డు సవరణ చట్టం అమలు చేయడం ద్వారా వక్ఫ్‌ ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందన్నారు. ఏళ్ల నాటి వక్ఫ్‌ ఆస్తులకు ఇప్పుడు రికార్డులను చూపించి హక్కులను పొందాలనడం సమంజసం కాదని తెలిపారు. వక్ఫ్‌ ఆస్తులతో రియల్‌ ఎస్టేట్‌ చేసేందుకు కొంత మంది స్వార్థ పరులు ప్రయత్నిస్తున్నారన్నారు. సవరణ చట్టంలోని లోపాలను సర్వోన్నత న్యాయస్థానం ఎత్తిచూపినా ఇంకా మొండి పట్టు పట్టడం మంచిది కాదన్నారు. వక్ఫ్‌ సవరణ చట్టాన్ని రద్దు చేసేవరకు ఆందోళనలు చేస్తామని అవసరమైతే ఆమరణ దీక్ష చేసేందుకు వెనుకాడబోమన్నారు.

రాజకీయ లబ్ధికోసమే..

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని పరిహాసం చేసేవిధంగా నల్ల చట్టాలను తెచ్చి అమలు చేసేందుకు యత్నిస్తోందని సీపీఐ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ముసుగు మధు, సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న, వైఎస్సార్‌సీపీ మైనార్టీ నాయకులు షేక్‌ చాంద్‌బాషా, కాంట్రాక్టర్‌ వలి, సాధిక్‌, పాస్టర్లు మోసేజ్‌ గ్రేసయ్య, సుందర్‌సింగ్‌ విమర్శించారు. వక్ఫ్‌ సవరణ చట్టాన్ని కేవలం రాజకీయ లబ్ధికోసమే కేంద్రం ప్రవేశపెట్టిందన్నారు. ఇలాంటి చట్టాలకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మద్దతు తెలపడం దారుణమన్నారు. వక్ఫ్‌ సవరణ చట్టాన్ని తక్షణం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

ప్రశాంతి నిలయం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన అర్జీలను అధికారులు శ్రద్ధతో పరిష్కరించాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. పింఛన్లు, ఇంటి పట్టాలు, ఇల్లు, భూ సమస్యలు తదితర వాటిపై 304 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్‌ చేతన్‌ మాట్లాడుతూ నిర్ణీత గడువులోపు నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలని అధికారులను ఆదేశించారు. లక్ష్యాలను సాధించడంలో ఏవైనా సమస్యలు ఉంటే విజయవాడలోని ఆయా శాఖల ఉన్నతాధికారులకు తెలియజేస్తే సమస్యలకు పరిష్కారం చూపిస్తారన్నారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీలోపు నమోదు డ్రైవ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటనల్లో ఇచ్చిన హామీల సమగ్ర నివేదికలు మంగళవారంలోపు సిద్ధం చేయాలన్నారు.

అర్హులకే ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలు..

జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఎస్సీ లబ్ధిదారులకు 604 యూనిట్లు పంపిణీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో బ్యాంక్‌ అధికారులు, వివిధ శాఖల అధికారులతో కలసి డీసీసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రూ.25.14 కోట్ల విలువతో 604 యూనిట్లను ఎస్సీ లబ్ధిదారులకు అందించేందుకు ఆమోదం తెలిపామన్నారు. అర్హులకు మాత్రమే అవి అందేలా చూడాలన్నారు. రొద్దం, తనకల్లులను కరువు మండలాలుగా గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు. ఆ రెండు మండలాల్లో రుణాలు రీ షెడ్యూల్‌ చేయాలని ఆదేశించారు.

అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి..

జిల్లాలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉల్లాస్‌ కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. 2025–26లో జిల్లాలో మొత్తం 33,749 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు పేర్కొన్నారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేయాలన్నారు. మే 5వ తేదీ నుంచి సెప్టెంబర్‌ వరకూ నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌, డీఆర్‌ఓ విజయసారథి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ సూర్యనారాయణరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, అడల్ట్‌ ఎడ్యూకేషన్‌ డీడీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

8లో

న్యూస్‌రీల్‌

హిందూపురం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. సహజ వనరులను దోచేస్తూ అడ్డదిడ్డంగా సంపాదిస్తోంది. ముఖ్యంగా కొందరు టీడీపీ నాయకులు చెరువుల్లో మట్టిని యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నేరుగా ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏల పేర్లతోనే

దందా చేస్తుండటంతో అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

బాలయ్య ఇలాకాలో

రెచ్చిపోతున్న మట్టి మాఫియా

నేరుగా ఎమ్మెల్యే పీఏలతో డీల్‌ !

బినామీలుగా టీడీపీ నాయకులు

రియల్టర్ల నుంచి

రోజువారీగా వసూళ్లు

చోద్యం చూస్తున్న ఇరిగేషన్‌,

మైనింగ్‌శాఖ అధికారులు

కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌

వక్ఫ్‌ సవరణ చట్టం రద్దు చేసే దాకా

పోరాటం చేస్తామని ముస్లిం పెద్దల స్పష్టీకరణ

కేసులు నమోదు చేస్తాం

హిందూపురం నియోజకవర్గంలోని చెరువుల్లో మట్టిని కేవలం రైతులు పొలాల్లోకి తోలుకునేందుకు మాత్రమే అనుమతి ఇస్తున్నాం. ఇప్పటి వరకూ వెంచర్లు, కమర్షియల్‌ వ్యాపారులకు ఎక్కడా మట్టి తవ్వుకునేందుకు అనుమతులు ఇవ్వలేదు. ఎవరైనా మట్టి తవ్వకాలు చేపట్టినట్లు తమ దృష్టికి తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. కేసులు కూడా నమోదు చేస్తాం.

– యోగానంద,

ఇరిగేషన్‌, డీఈ, హిందూపురం

సమస్యల పరిష్కారమే ధ్యేయం 1
1/9

సమస్యల పరిష్కారమే ధ్యేయం

సమస్యల పరిష్కారమే ధ్యేయం 2
2/9

సమస్యల పరిష్కారమే ధ్యేయం

సమస్యల పరిష్కారమే ధ్యేయం 3
3/9

సమస్యల పరిష్కారమే ధ్యేయం

సమస్యల పరిష్కారమే ధ్యేయం 4
4/9

సమస్యల పరిష్కారమే ధ్యేయం

సమస్యల పరిష్కారమే ధ్యేయం 5
5/9

సమస్యల పరిష్కారమే ధ్యేయం

సమస్యల పరిష్కారమే ధ్యేయం 6
6/9

సమస్యల పరిష్కారమే ధ్యేయం

సమస్యల పరిష్కారమే ధ్యేయం 7
7/9

సమస్యల పరిష్కారమే ధ్యేయం

సమస్యల పరిష్కారమే ధ్యేయం 8
8/9

సమస్యల పరిష్కారమే ధ్యేయం

సమస్యల పరిష్కారమే ధ్యేయం 9
9/9

సమస్యల పరిష్కారమే ధ్యేయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement