Parvathipuram Manyam
-
తక్షణమే చెల్లించాలి
ఉపాధి హామీ బకాయి బిల్లులు విజయనగరం ఫోర్ట్: ఉపాధి వేతన దారులకు బకాయి ఉన్న 9 నుంచి 13 వారాల ఉపాధి హామీ బకాయి బిల్లులు తక్షణమే చెల్లించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గాడి అప్పారావు డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ చట్టం ఉద్దేశానికి నేటి పాలకులు, అధికారులు తూట్లు పొడుస్తున్నారన్నారు. పనులు కావాలన్న వారికి 15 రోజులకు పనులు ఇవ్వాలని, లేని పక్షంలో 16వ రోజు నుంచి కార్మికులకు భృతి చెల్లించాలని చట్టం చెబుతున్నా చాలా గ్రామాల్లో ఇది అమలు కావడం లేదన్నారు. వేతనదారులకు 9 నుంచి 13 వారాల పాటు బిల్లులు చెల్లించకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. రోజురోజుకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రోజువారీ వేతనం రూ.600 చెల్లించాలని డిమాండ్ చేశారు. -
వారి క్రమశిక్షణ స్ఫూర్తిదాయకం
విజయనగరం క్రైమ్: సుదీర్ఘ కాలం పోలీసుశాఖలో బాధ్యతాయుతంగా ఎంతో క్రమ శిక్షణతో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన పోలీస్‌కంట్రోల్ రూమ్ ఎస్సై ఎన్ని సత్యానందరావు, గుర్ల పీఎస్ హెచ్‌సీ ఎ.భాస్కరరావులకు ఎస్పీ వకుల్ జిందల్ జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందల్, మాట్లాడుతూ పోలీసుశాఖలో సుదీర్ఘ కాలం మంచి సేవలందించి నేడు ఉద్యోగ విరమణ చేస్తున్న ఎస్సై ఎన్ని సత్యానందరావు, హెడ్ కానిస్టేబుల్ అదపాక భాస్కరరావులకు శుభాకాంక్షలు తెలిపారు. పోలీసు విధులను నిర్వహించడంలో క్రమశిక్షణ, అంకిత భావంతో పనిచేసి, ఇతర పోలీసు ఉద్యోగులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని ప్రశంసించారు. ఉద్యోగ విరమణ చేస్తున్న పోలీసు అధికారులకు ఏ సమస్య వచ్చినా తాను అందుబాటులో ఉంటానని, వారికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తానని ఎస్పీ వకుల్ జిందల్ భరోసా కల్పించారు. అనంతరం, ఉద్యోగ విరమణ చేసిన ఎస్సై ఎన్ని సత్యానందరావు దంపతులను, హెడ్ కానిస్టేబుల్ భాస్కరరావు దంపతులను పోలీసుశాఖ తరఫున ఎస్పీ వకుల్ జిందల్ శాలువాలు, పూలమాలలు, గిఫ్ట్, సన్మాన పత్రాలతో సత్కరించి, ఘనంగా వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) పి.సౌమ్యలత, ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, ఆర్వీఆర్కే చౌదరి, కంట్రోల్ రూమ్ సీఐ వైకుంఠరావు, ఎస్సైలు జగదీశ్వరరావు, శంకర్రావు, పోలీస్ అసోసియేషన్ అడహాక్ సభ్యుడు కె.శ్రీనివాసరావు, కో ఆపరేటివ్ కార్యదర్శి నీలకంఠం నాయుడు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆత్మీయ వీడ్కోలు సభలో ఎస్పీ వకుల్ జిందల్ -
అంగరంగ వైభవంగా పోలమాంబ చండీహోమం
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, గిరిజన ఆరాధ్య దేవత శంబర పోలమాంబ అమ్మవారి 10వ జాతర మహోత్సవాల్లో భాగంగా అంగరంగ వైభవంగా మంగళవారం చండీహోమం కార్యక్రమం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. పోలమాంబ అమ్మవారి చదురుగుడి, వనంగుడి ఆలయాల్లో కొలువైన పోలమాంబ అమ్మవార్లకు ఈవో వీవీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పుష్పాలంకరణ చేశారు. చదురుగుడి వద్ద 11 హోమగుండాలను ఏర్పాటుచేసి, వేద పండితులు అంపోలు రుద్ర కోటేశ్వర శర్మ, డీఎల్ ప్రసాదరావు, బాలబాబు శర్మ ఆధ్వర్యంలో చండీ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు . పూర్ణాహుతి కార్యక్రమంలో గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్ నాయుడు, పార్వతీపురం మన్యం జిల్లా దేవాదాయ శాఖ అధికారి ఎస్.రాజారావు, సీనియర్ సహాయకులు శ్రీనివాసరాజు, సర్పంచ్ వెదుళ్ల సింహాచలమమ్మ, ఎంపీటీసీ టి.పోలి నాయుడు, ఉపసర్పంచ్ అల్లు వెంకటరమణ, ఉత్సవ కమిటీ సభ్యులు నైదాన తిరుపతిరావు, మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్లు పూడి దాలినాయుడు, వసంతల భాస్కరరావు, గంజి కాశినాయుడు, మావుడి మాజీ సర్పంచ్ అక్యాన తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ మోసం..!
కానిస్టేబుల్‌నని చెప్పి..వీరఘట్టం: హలో.. నేను వీరఘట్టం కానిస్టేబుల్‌ను. ఎస్సై గారు హాస్పిటల్లో ఉన్నారు. అర్జెంట్‌గా రూ.55 వేలు కావాలి. నా వద్ద క్యాష్ ఉంది. మీరు ఫోన్‌పే చేస్తే క్యాష్ ఇచ్చేస్తానని నమ్మబలికాడో సైబర్ కేటుగాడు. అర్జెంట్ అంటూ పదేపదే ఫోన్ చేయడంతో అతను చెప్పింది నిజమేనని నమ్మిన వీరఘట్టానికి చెందిన ప్రతాప్ అనే వ్యక్తి సోమవారం రూ.28 వేలు ఫోన్‌పే చేశాడు. ఫోన్‌పే కొట్టిన పది నిమిషాల్లో అవతలి వ్యక్తి ఫోన్ స్విచాఫ్ అయ్యింది. దీంతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఆరా తీస్తే అటువంటి వ్యక్తి ఇక్కడ ఎవరూ లేరని తేలింది. అంతేకాకుండా ఎస్సై కళాధర్ విధుల్లో ఉన్నారు. దీంతో తాను మోసపోయానని ప్రతాప్‌కు అర్థమైంది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొంప ముంచిన వాట్సాప్ గ్రూప్.. వీరఘట్టం, పాలకొండ, పార్వతీపురానికి చెందిన 469 వ్యాపారులు,ఇతర ఉద్యోగులు, సామాన్యులు అందరూ కలిసి ‘వి.జి.టి.యం నీడ్ మనీ ట్రాన్స్ఫర్స్ వీరఘట్టం’ అనే వాట్సాప్ గ్రూప్‌లో ఉన్నారు.ఎవరికై నా డబ్బులు కావాలన్నా, ఫోన్ పే కావాలన్నా ఒకరికొకరు పరిచయస్తులు కావడంతో సులువుగా మనీ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఏడాది కాలంగా ఈ గ్రూప్ నడుస్తోంది.ఈ గ్రూప్‌లో మెసేజ్ రావడంతో ఇదే గ్రూపులో ఉన్న ప్రతాప్ అవతల వ్యక్తిని నమ్మి మోసపోయాడు. ఈ వాట్సాప్ గ్రూప్ నా కొంప ముంచిందంటూ లబోదిబోమంటున్నాడు. స్విచాఫ్ అయిన నంబర్.. ప్రతాప్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు 7569341175 నంబర్ వివరాలు ఆరా తీయగా ఈ నంబర్ మోశ్యా శ్రీరామ్ అనే పేరు మీద ఉంది.అడ్రస్‌ను పరిశీలించగా సన్ ఆఫ్ మోశ్యా బలరాం బేటా, తాజంగి, చింతపల్లి, విశాఖపట్నం–531116 అని ఉంది. ఆ ఫోన్ నంబర్ మాత్రం స్విచాఫ్ వస్తోంది. విజ్జత గల వ్యాపారులు ఇటువంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హితవు పలుకుతున్నారు. రూ.28 వేలు ఫోన్‌పే చేసిన బాధితుడు లబోదిబోమంటూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు -
వంశధార నది దాటిన జంట ఏనుగులు
భామిని: మండలంలోని బిల్లుమడ రైతులు ఊపిరి పీల్చుకున్నారు. భామిని మండలం బిల్లుమడకు చేరిన జంట ఏనుగులు ఘీంకరిస్తూ మంగళవారం వంఽశధార నదిని దాటాయి. ఇప్పటికే ఒడిశా గ్రామాల్లో మరో రెండు ఏనుగుల జట్టు వీడిన రెండు ఏనుగుల జంట కోసం పాకులాడుతున్నట్లు తెలిసింది. వంశధార నదీ తీరంలోని ఒడిశాకు చెందిన పురిటిగూడ–గౌరీ గ్రామాల మధ్య రెండు ఏనుగుల జంటలు కలిసి ఊరట చెందాయని స్థానిక రైతులు తెలిపారు. రజక సంఘం పట్టణ నూతన కమిటీ ఎంపికవిజయనగరం టౌన్: ఉమ్మడి విజయనగరం, జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో విజయనగరం పట్టణ నూతన కమిటీ ఎంపిక మంగళవారం కార్యాలయంలో నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడిగా కోనాడ పైడిచిట్టి, ఉపాధ్యక్షుడిగా రామనేంద్రపు సురేష్, కార్యదర్శిగా కొవ్వూరి అప్పలరాజు, సహాయ కార్యదర్శిగా ముత్యాల సతీష్, కోశాధికారిగా జంపా నాగరాజు, కమిటీ సభ్యులను ఎంపిక చేశారు. కార్యక్రమంలో అప్పికొండ సన్యాసిరావు, తంగేటి భాస్కరరావు, జంపా చిన్న, మడిపల్లి రాజారావు, సురేష్, శంకర్, రాజా, సురేష్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 100 సారా ప్యాకెట్లు స్వాధీనంపార్వతీపురం రూరల్: పట్టణ పోలీసులు తనిఖీల్లో భాగంగా పట్టణంలో గల పాత రెల్లివీధిలో వంద సారా ప్యాకెట్లతో మీసాల శివకుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు టౌన్ ఎస్సై గోవింద మంగళవారం తెలిపారు. విద్యుత్ షాక్‌తో వలస కార్మికుడి మృతిసీతంపేట: మండలంలోని కిల్లాడ గ్రామానికి చెందిన వూయక రాహుల్ (20) అనే గిరిజన యువకుడు వలస వెళ్లి అక్కడ విద్యుత్ షాక్‌తో రెండు రోజుల క్రితం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఉపాధి లేక పొట్ట చేతబట్టుకుని కొద్ది నెలల కిందట మచిలీపట్నం వలసవెళ్లాడు. అక్కడ చేపల చెరువుకు కాపలాగా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగానే గతనెల 31న చేపలచెరువుకు వెళ్లి పనిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మరణించాడు. కుమారుడి మృతివార్త విన్న తల్లిదండ్రులు తిరుపతిరావు,నీలమ్మలు గుండెలవిసేలా రోదించారు. స్వగ్రామం కిల్లాడలో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. వడదెబ్బతో వృద్ధురాలు..వీరఘట్టం: స్థానిక మేజర్ పంచాయతీలోని ముచ్చర్లవీధికి చెందిన మంతిన గౌరమ్మ(85) వడదెబ్బతో మృతి చెందినట్లు వీధివాసులు తెలిపారు. వారం రోజులుగా ఎండల తీవ్రత ఎక్కుగా ఉండడంతోనే వృద్ధురాలు మృతి చెందిందని స్థానికులు అంటున్నారు. మంగళవారం ఉదయం పింఛన్ తీసుకున్న తర్వాత కొద్ది సేపటికే మృతి చెందినట్లు స్థానికులు చెప్పారు. ఆమెకు కుటుంబసభ్యులు, బంధువులు ఎవరూ లేకపోవడంతో వీధిలో ఉన్నవారే ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. యువతకు స్ఫూర్తి భగత్‌సింగ్ విజయనగరం గంటస్తంభం: పాలకుల విధానాలపై, సామ్రాజ్యవాద దోపిడి పీడలకు వ్యతిరేకంగా పోరాడిన వీరులు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్ అని ఎన్‌వైఎస్ జిల్లా అధ్యక్షుడు ఎం.అప్పలరాజు అన్నారు. మంగళవారం నవయువ సమాఖ్య ఆధ్వర్యంలో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల దురగతాలను వ్యతిరేకిస్తూ స్వయం పాలన సాధించాలని తిరుగుబాటు జెండాను ఎగరవేసి స్వాతంత్ర పోరాటంలో యువకులకు ఉరి తొలగించిన వ్యక్తి భగత్ సింగ్ అని గుర్తు చేశారు. సోషలిస్టు వ్యవస్థ లేని దోపిడి రహిత సమాజం ఏర్పడుతుందని నినదించిన వ్యక్తి భగత్ సింగ్ అని తెలిపారు. కార్యక్రమంలో పీడీఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.భాస్కరరావు పాల్గొన్నారు. -
స్మార్ట్ మీటర్ల బిగింపును తిప్పికొట్టాలి
విజయనగరం గంటస్తంభం: ప్రజలపై భారాలు వేసేలా స్మార్ట్ మీటర్లను అమర్చుతున్నారని, దీన్ని తిప్పికొట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్మి వర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు కోరారు. ‘స్మార్ట్ మీటర్ మా ఇంటికి వద్దు’ అనే పోస్టర్‌ను మంగళవారం 46వ డివిజన్ ఎల్బీజీ నగర్లో జిల్లా కమిటీ సభ్యులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదానీతో చేసుకున్న సెకీ ఒప్పందం వల్ల ప్రజలపై విపరీతమైన భారం పడుతోందని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. స్మార్ట్ మీటర్ల పగలగొట్టండి అని పిలుపునిచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట మార్చి అవే స్మార్ట్ మీటర్ల ప్రతి ఇంటికి బిగించడానికి రంగం సిద్ధం చేయడం దుర్మార్గమన్నారు. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని అప్పట్లో చెప్పిన పవన్‌కల్యాణ్ నేడు నోరు మెదపకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలని, స్మార్ట్‌మీటర్ల విధానం తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మరో విద్యుత్ ఉద్యమానికి నాంది పలుకుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు పి.రమణమ్మ, బి.రమణ, రేవరాజు, అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ప్రవేశాలకు ఆరాటం!
సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురంటౌన్: సాధారణంగా పదో తరగతి పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతనే ఇంటర్మీడియట్లో ప్రవేశాలు జరుగుతాయి. ఫెయిల్/పాస్ తేలిన తర్వాత.. వచ్చిన మార్కుల ఆధారంగా ఇష్టమైన సబ్జెక్టులో సీటు దొరుకుతుంది. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల పుణ్యమానీ ప్రవేశాల్లో పోటీ పెరిగింది. ఫలితాలు రాకుండానే ఇంటర్మీడియట్లో విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. రేటు బట్టి సీటు కేటాయింపు జరుగుతోంది. ఇప్పుడు ఆ జాఢ్యం ప్రభుత్వానికీ అంటుకున్నట్లు ఉంది. ఈ ఏడాది నూతన విద్యావిధానమంటూ ఇంటర్ విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చారు. విద్యాసంవత్సరంలో మార్పులు చేశారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం తరగతులను ఏప్రిల్ 1 నుంచే ప్రారంభించేశారు. ఆ మేరకు జిల్లావ్యాప్తంగా మంగళవారం నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. 7 నుంచి ప్రవేశాలు కల్పిస్తున్నాం.. ప్రభుత్వం నిర్ణయం మేరకు మంగళవారం నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సర తరగతులు ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరం ప్రవేశాలు ఈ నెల 7 నుంచి కల్పిస్తాం. టెన్త్ ఫలితాలతో సంబంధం లేకుండా హాల్ టికెట్ల ఆధారంగానే ప్రవేశాలు పొందవచ్చు. ఈ ఏడాది కూడా పదో తరగతి ఫలితాలు బాగుంటాయి. అందరూ ఉత్తీర్ణులవుతారనే నమ్మకం ఉంది. సిలబస్‌లోనూ మార్పులు ఉంటాయి. విద్యార్థులకు టెక్ట్స్, నోట్ పుస్తకాలు కూడా అందజేయనున్నాం. – మంజులవీణ, జిల్లా ఇంటర్ విద్య అధికారిణి 7 నుంచి మొదటి సంవత్సరం ప్రవేశాలు జిల్లాలో ఈ ఏడాది జనరల్, ఒకేషనల్, ప్రైవేట్ విద్యార్థులు కలిపి మొత్తం 9,335 మంది ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యారు. 10,363 మంది పదో తరగతి పరీక్షలు రాయగా.. వీరిలో ఎంతమంది ఉత్తీర్ణులవుతారో చూడాలి. పదో తరగతి రాసిన వారికి ఈ నెల 7 నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తున్నారు. పది పరీక్షలు రాసిన విద్యార్థులందరికీ ఫలితాలతో సంబంధం లేకుండా హాల్ టికెట్ల ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు. ఫలితాలు వెల్లడైనన తర్వాత పాసైన వారిని కొనసాగించి, ఫెయిలైన వారిని తొలగిస్తారు. ఈ నిర్ణయంపై విద్యార్థి సంఘాల నుంచి విస్మయం వ్యక్తమవుతోంది. ఒకవేళ విద్యార్థులను తొలగిస్తే వారి మానసిక స్థితి మీద ఆ ప్రభావం పడుతుందని ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు ఇంటర్ పరీక్షల తర్వాత వేసవి సెలవులు, జూన్ 1 నుంచి కొత్త విద్యాసంవత్సరం ఆరంభమయ్యేది. నూతన విధానం ఫలితంగా ఏప్రిల్ 1 నుంచి విద్యాసంవత్సరం ప్రారంభించి, రెండో సంవత్సరం ఇంటర్మీడియట్ తరగతులను నిర్వహించనున్నారు. ఏప్రిల్ 24 నుంచి మరలా వేసవి సెలవులు ఇవ్వనున్నారు. నూతన విద్యావిధానమంటూ ఇంటర్ విద్యలో సమూల మార్పులు ఏడో తేదీ నుంచి మొదటి సంవత్సరం ప్రవేశాలు పదో తరగతి పరీక్షలు పూర్తి కాకుండానే హడావిడి పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు హాల్‌టికెట్‌తోనే ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశం పొందే వెసులుబాటు కల్పించడంతో ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులను చేర్చుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఆయా కళాశాలల అధ్యాపకులు, సిబ్బంది ప్రవేశాల కోసం రోడ్డెక్కారు. ఆయా యాజమాన్యాలు కూడా సిబ్బందికి టార్గెట్లు ఇవ్వడంతో విద్యార్థుల తల్లిదండ్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో 52 వరకు ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలలు ఉండగా.. ఇక్కడి సిబ్బంది సైతం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరాలని పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ప్రాథేయపడుతున్నారు. ఇంకా ఫలితాలు రాకుండానే విద్యార్థులను ఎలా, ఏ సబ్జెక్టులో చేర్చుతామని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. -
ఫాంపాండ్స్‌తో భూగర్భ జలాల పెంపు
కొమరాడ: ఉపాధిహామీ నిధులతో చేపట్టే ఫాం పాండ్స్‌తో భూగర్భ జలాలు పెరిగి సాగునీటి కొరత తీరుతుందని జిల్లా ప్రత్యేక అధికారి నారాయణ భరత్ గుప్తా తెలిపారు. కొమరాడ మండలం విక్రంపురం పంచాయతీ పరిధిలోని ఉపాధిహామీ పనులను కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్, డ్వామా పీడీతో కలిసి మంగళవారం పరిశీలించారు. పశువుల నీటితొట్టెల నిర్మాణ పనులను ప్రారంభించారు. తమ్మన్నదొరవలస గ్రామంలో నిర్మించిన మినీ గోకులాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. నందాపురం గ్రామంలో నిర్మితమవుతున్న ఫారం పాండ్స్‌ను తనిఖీ చేశారు. ఏటా సాగు భూమిని సారవంతం చేసుకుంటూ బహుళ పంటల వైపు సాగితే అధిక లాభాలు వస్తాయన్నారు. చేపల పెంపకానికి ఫాంపాండ్లను వినియోగించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ కె.రామచంద్రరావు, ఇంజినీరింగ్ శాఖ అధికారులు, స్థానిక నాయకలు కళింగి మల్లేశ్వరరావు, దేవకోటి వెంకటినాయుడు, తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రత్యేక అధికారి నారాయణ భరత్ గుప్తా -
ఎరుకులపేటలో నారాయణమూర్తి సందడి
గజపతినగరం రూరల్: ిసనీ హీరో, నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి గజపతినగరం మండలం పాతబగ్గాం పంచాయతీ పరిధిలోని ఎరుకులపేటలో మంగళవారం సందడి చేశారు. గ్రామానికి చెందిన వర్ధమాన సినీనటుడు, రేలారేరేలా గాయకుడు రఘు ఇంటికి వచ్చారు. త్వరలో తాను తీస్తున్న నూతన సినిమాలో రఘుతో పాట పాడించడంతో పాటు చిన్నపాటి పాత్రను పోషించడంపై చర్చించేందుకు వచ్చినట్టు నారాయణమూర్తి తెలిపారు. ఆయనను చూసేందుకు గ్రామంలోని మహిళలు, చిన్నారులు గుమిగూడారు. సెల్ఫీలు దిగారు. అందరూ బాగుండాలి అంటూ ఆయన గ్రామస్తులను దీవించి అక్కడ నుంచి బయలు దేరారు. -
కేంద్రీయ విద్యాలయంలో ఖాళీ సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం అర్బన్: పట్టణంలోని కేంద్రీయ విద్యాలయంలో వివిధ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు విద్యాలయ ప్రిన్సిపాల్ దిలీప్ మోడీ మంగళవారం తెలిపారు. 2వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకు ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 2 నుంచి 11వ తేదీ వరకు (ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు) దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. దరఖాస్తు ఫారాలను విద్యాలయం నుంచి, లేదంటే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. పూర్తి సమాచారం, సీట్ల ఖాళీల వివరాల కోసం విద్యాలయ వెబ్సైట్ ‘విజయనగరం.కేవీఎస్.ఏసీ.ఐఎన్’ను సందర్శించవచ్చని వివరించారు. విజయనగరంతో విడదీయలేని అనుబంధం ● పైడితల్లిని దర్శించుకున్న శైలజ దంపతులు ● అలరించిన స్వరసాగర సంగమం ● ఘనంగా గురునారాయణ కళాపీఠం నాలుగో వార్షికోత్సవం విజయనగరం టౌన్: మహనీయులు నడయాడిన నేలపై తాము అడుగుపెట్టడం ఎంతో ఆనందంగా ఉందని, విజయనగరంతో తమకు విడదీయలేని అనుబంధం ఉందని మధురగాయని, చలన చిత్రనటులు ఎస్.పి.శైలజ, శుభలేఖ సుధాకర్ దంపతులు పేర్కొన్నారు. స్థానిక ఆనందగజపతి కళాక్షేత్రంలో మంగళవారం రాత్రి నిర్వహించిన గురునారాయణ కళాపీఠం నాల్గొవ వార్షికోత్సవ వేడుకలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాపీఠం వ్యవస్థాపకులు బి.ఎ.నారాయణ నేతృత్వంలో గాయనీ, గాయకులు పవన్ చరణ్, సంతోష్ కిరణ్, సురభిశ్రావణి, హారికా శివరామ్, ఆత్మీయ గాయని, సినీనటి పడాల కళ్యాణిలు సినీ, భక్తి గీతాలు అలపించి ఆహుతుల కరతాళధ్వనులందుకున్నారు. ఎస్పీ శైలజ మయూరి చిత్రంలోని పాటను అలంపి శ్రోతలను అలరించారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ జి.సన్యాసమ్మ, గౌరవాధ్యక్షులు డోల మన్మథకుమార్, గౌరవ కార్యదర్శి నడిపేన శ్రీనివాసరావు, కోశాధికారి బి.పద్మావతి, యార్లగడ్డ బాబూరావు, గుడిశ శివకుమార్, ఉప్పుప్రకాష్, ఇమంది రామారావు, వైవీవీ సత్యనారాయణ, అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. పైడితల్లి సేవలో శైలజ దంపతులు ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారిని శైలజ, సుధాకర్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ ఇన్చార్జి ఈఓ కేఎన్‌వీడీ ప్రసాద్ నేతృత్వంలో వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శైలజ దంపతులకు వేదాశీస్సులతో పాటు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు. -
147 కేజీల గంజాయి స్వాధీనం
విజయనగరం క్రైమ్: జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మొపుతున్నారు. గడిచిన వారం రోజుల్లో భారీ స్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్సీ వకుల్ జిందల్ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా 147కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చూపించారు. గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు నిందితులను విలేకరుల ముందు ప్రవేశపెట్టారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలానికి చెందిన బోగవిల్లి గోవిందరావు, సాగుపిల్లి అనిల్ కుమార్, బంక రామసురేష్, అంబిడి బాలరాజులు రామభద్రపురం మండలంలోని కొట్టక్కి జంక్షన్ వద్ద గంజాయి విక్రయానికి పాల్పడుతున్నట్లు అందిన పక్కా సమాచారంతో రామభద్రపురం పోలీసులు, ఆ నలుగురు నిందితులను అదుపులోకి ప్రశ్నించడంతో గంజాయి సరఫరా గుట్టు రట్టైందని ఎస్పీ చెప్పారు. దీంతో నిందితుల దగ్గర ఉన్న 147 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. పోలీసుల అదుపులో నలుగురు నిందితులు -
రెంటికీ చెడిన.. రేవటిగూడ
కనీస సదుపాయాలు లేవు.. మా ఊరు ఇటు ఆంధ్రాకు, అటు ఒడిశాకు చెందకుండా ఉంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. కనీస సౌకర్యాలు లేవు. రేషన్ లేదు, పెన్షన్ రావడం లేదు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పార్వతీపురం కలెక్టరేట్లో అధికారులను కలిసి సమస్య చెప్పుకొంటాం. – మందంగి దేబురు, రేవటిగూడ ఆంధ్రాలోనే ఉంచాలి.. మాది ఒడిశాలోని కొరాపుట్ జిల్లా అంటున్నారు. మాకు ఆ ప్రాంతం చాలా దూరం. ఆంధ్రాలోనే ఉంచాలని అడుగుతున్నాం. పార్వతీపురం మండలం పెదమరికి పంచాయతీలో మమ్మల్ని విలీనం చేయాలి. మా గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి. ఇప్పటికే పలుమార్లు అధికారులను కలిసి వేడుకున్నా ఫలితం ఉండటం లేదు. – మందంగి బొండయ్య ఆధార్‌కార్డు లేదు.. రెండు రాష్ట్రాలకూ చెందకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఎవరూ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. గ్రామంలో అభివృద్ధి పనులేవీ జరగడం లేదు. మా దగ్గర ఓట్లు లేవు కదా.. ఇంకెవరు పట్టించుకుంటారు. ఆంధ్రాలోనే ఉంచాలని అడుగుతున్నాం. రేషన్‌కార్డు, ఆధార్ కార్డు ఇప్పించాలి. – ఆరిక రౌతు, రేవటిగూడ సాక్షి, పార్వతీపురం మన్యం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని కొటియా గ్రామాల మధ్య వివాదం కొన్ని దశాబ్దాలుగా సాగుతూ వస్తున్న విషయం విదితమే. ఆ గ్రామాలపై పట్టు సాధించేందుకు ఇరు రాష్ట్రాలూ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే.. ఆంధ్ర రాష్ట్ర యంత్రాంగం కంటే.. ఒడిశా యంత్రాంగమే ఆ గ్రామాల విషయంలో దూకుడు మీద వెళ్తోంది. ఇరు రాష్ట్రాల నుంచి సంక్షేమ పథకాలను, ఆధార్, రేషన్‌కార్డులను కొటియా ప్రజలు పొందారు. ఒడిశా ప్రభుత్వం అక్కడ మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసింది. దీనికి కారణం అక్కడ విలువైన మైనింగ్ నిక్షేపాలు ఉండడం వల్లేనని.. అందుకే ఒడిశా పట్టువీడటం లేదని సమీప గ్రామ ప్రజల ఆరోపణ. ఇదే పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని రెండు రాష్ట్రాల సరిహద్దులో మరో గ్రామం ఉండిపోయింది. 45 సంవత్సరాలుగా అటు ఒడిశా పట్టించుకోక.. ఇటు ఆంధ్రా నుంచీ స్పందన లేక అక్కడి గిరిజన ప్రజలు నలిగిపోతున్నారు. జిల్లాలోని సాలూరు నియోజకవర్గ పరిధి కొదమ నుంచి దాదాపు 40 గిరిజన కుటుంబాల వారు పోషణ కోసం సుమారు 45 ఏళ్ల కిందట పార్వతీపురం మండలం పెదమరికి పంచాయతీ సమీపంలోని రేవటిగూడ గిరిజన గ్రామానికి విచ్చేసి, స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. కొంత భూమిలో జీడి, మామిడి, వరి సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. పార్వతీపురం జిల్లా కేంద్రానికి ఈ ప్రాంతం దాదాపుగా పది కిలోమీటర్ల దూరంలో ఉంటే.. ఒడిశాలోని కొరాపుట్ జిల్లాకు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. గతంలో ఈ ప్రాంతంలో కొరాపుట్ జిల్లా పరిధిలోనిదే అని చెబుతూ నలుగురైదుగురికి అక్కడి ప్రభుత్వం ఆధార్, రేషన్‌కార్డులు, పింఛన్లు కూడా ఇచ్చింది. ఆ తర్వాత పట్టించుకోవడం మానేసింది. జంఝావతిలో నీరు పారితే.. అటు ఒడిశా వైపు వెళ్లడానికి పూర్తిగా రాకపోకలు స్తంభించిపోతాయి. తమను ఆంధ్రాలోనే ఉంచాలని ఇక్కడి గిరిజనులు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు. సాగు భూములకు హక్కు పత్రాలు ఇవ్వడంతో పాటు.. ఆధార్, రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇతర ప్రభుత్వ పథకాలు ఇవ్వాలని కోరుతున్నారు. అటు ఒడిశాలో కాక.. ఇటు ఆంధ్రాలో లేక.. పార్వతీపురానికి సమీపంలో ఉన్న గిరిజన గ్రామం దుస్థితి ఆధార్, రేషన్‌కార్డులు లేక గ్రామస్తుల ఇక్కట్లు -
డిప్యుటేషన్ ద్వారా ‘డైట్’ అధ్యాపక ఖాళీల భర్తీ
విజయనగరం అర్బన్: డైట్ కళాశాలలో ఖాళీగా ఉన్న బోధన సిబ్బందిని ఫారిన్ సర్వీస్ నియామక నిబంధనల మేరకు డిప్యుటేషన్ పద్ధతిలో నియామకం చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు డీఈఓ యు.మాణిక్యం నాయుడు మంగళవారం విడుదల చేసిన షెడ్యూల్లో పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న స్కూల్ అసిస్టెంట్, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. డీఈఓల ద్వారా సంబంధిత ప్రిన్సిపాల్స్‌కు దరఖాస్తులు సమర్పించుకోవాలి. 11 నుంచి 13వ తేదీల మధ్యలో దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. అర్హత పొందిన దరఖాస్తుదారులకు ఈ నెల 16, 17వ తేదీల్లో రాత పరీక్ష, 19వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అర్హులైన వారికి డిప్యుటేషన్ ఉత్తర్వులు ఈ నెల 21వ తేదీన అందజేస్తారు. 22వ తేదీనే విధుల్లో చేరాలని షెడ్యూల్లో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ‘డీఈఓ విజయనగరం’ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. 16, 17వ తేదీల్లో రాత పరీక్ష -
ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత
సంతకవిటి: మండలంలోని అప్పలాగ్రహారం గ్రామంలో ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీస్ బలగాల నడుమ మండలాధికారులు ఆక్రమణలను తొలగించారు. వివరాల్లోకి వెళ్తే... గ్రామంలోని కాలువ గట్టును అనుసరించి ఉన్న గ్రామకంఠంను అదే గ్రామానికి చెందిన పిన్నింటి లచ్చయ్య, కుటుంబ సభ్యులు ఆక్రమించారు. దీనిపై గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు తహసీల్దార్ సత్యం, ఎంపీడీఓ సురేష్‌కుమార్, రెవెన్యూ సిబ్బంది ఆక్రమణల తొలగింపునకు మంగళవారం వచ్చారు. ఆక్రమణదారుకు ఇదివరకే పంపించిన నోటీస్‌ను చూపించారు. గడువు ముగిసినా ఆక్రమణలు తొలగించక పోవడంపై ప్రశ్నించారు. జేసీబీతో అధికారులే దగ్గరుండి ఆక్రమణలు తొలగించేందుకు సమాయత్తమయ్యారు. ఈ సమయంలో ఆక్రమణదారు, కుటుంబ సభ్యులు ఒక్కసారి అధికారులపై తిరగబడ్డారు. వెంటనే అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ఐ ఆర్.గోపాలరావు, రేగిడి ఎస్ఐ పి.నీలావతి, పోలీస్ బలగాలు గ్రామానికి చేరుకున్నాయి. భారీపోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగించారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పికెట్‌ను ఏర్పాటు చేసినట్టు ఎస్ఐ ఆర్.గోపాలరావు తెలిపారు. రెవెన్యూ సిబ్బంది అలసత్వంతోనే.. రెవెన్యూ సిబ్బంది అలసత్వంతోనే పరిస్థితి ఇంతవరకు వచ్చిందని గ్రామస్తులు పలువురు ఆరోపిస్తున్నారు. ఆక్రమణల ప్రారంభంలోనే ఫిర్యాదు చేసినా రెవెన్యూ సిబ్బంది స్పందించలేదని వాపోయారు. రెండు రోజుల కిందట జిల్లా స్థాయి అధికారులను ఆశ్రయించడంతో అధికారుల్లో చలనం వచ్చిందన్నారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ అప్పలాగ్రహారంలో ఆక్రమణల తొలగింపు -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్‌లు శాస్త్రోక్తంగా నిత్య పూజాదికాలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించారు. ఆలయ ఇన్చార్జ్ ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.ప్రత్యేక పుష్పాలంకరణలో పైడితల్లి అమ్మవారు -
16.12శాతం వృద్ధి సాధనే లక్ష్యం
పార్వతీపురంటౌన్: జిల్లాలో 16.12 శాతం వృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశామని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో జిల్లా ప్రగతిపై తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గతే డాది తలసరి ఆదాయం రూ.1,67,543లు కాగా, ఈ ఏడాది రూ.1,94,048లుగా అంచనా వేస్తూ వృద్ధి రేటు 16.12 శాతం సాధించేందుకు కృషిచేస్తున్నామన్నారు. జిల్లాలో 49.27 శాతం ప్రాథమిక రంగం (వ్యవసాయ, అనుబంధ రంగాలు), 9.09 శాతం పారిశ్రామిక, 41.64 శాతం సేవా రంగాల నుంచి వృద్ధి ఉండబోతుందన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో వృద్ధి సాధంచేందుకు కృషిచేస్తున్నామన్నారు. డ్వాక్రా సీ్త్రనిధి, ఐటీడీఏ నిధుల నుంచి గొర్రెలు, పశువులు, కోళ్లు పెంపకం వంటి కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తామన్నారు. ఉపాధిహామీ పథకం కింద 128.91 లక్షల పనిదినాలు సృష్టించబడ్డాయన్నారు. గతేడాది కంటే 5 లక్షల పనిదినాలు అధికంగా చేసినట్టు వెల్లడించారు. జిల్లాలో 280 ప్రధాన ట్యాంకులు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేయడంతోపాటు ఆక్రమణలు తొలగింపుపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా నీటియాజమాన్య సంస్థ పథక సంచాలకుడు కె.రామచంద్రరావు పాల్గొన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి జిల్లాలో మంజూరు చేసిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం తక్షణమే పూర్తిచేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. గృహ నిర్మాణం, ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలు, ఇంజినీరింగ్ పనులు తదితర అంశాలపై మండల అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 7,134 మరుగుదొడ్లు పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. 4 వేల గృహాలను మూడు నెలల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. సాలూరు మున్సిపాలిటీలో 437 మందికి, పార్వతీపురం మున్సిపాలిటీలో 548 మందికి, పాలకొండలో 197 మందికి అదనపు సహాయం చేసినట్టు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు సూర్యఘర్ యూనిట్ల ఏర్పాటుకు స్థలాన్ని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ శోభిక, జిల్లా రెవెన్యూ అధికారి హేమలత, కేఆర్ఆర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డా.ధర్మచంద్రారెడ్డి, వివిధ శాఖాధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ -
జాడలేని చలివేంద్రాలు!
మండుతున్న ఎండలు..●40 డిగ్రీలకు చేరుకుంటున్న ఉష్ణోగ్రతలు ●ఉదయం నుంచే ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న వాహనచోదకులు, ప్రయాణికులు ●చలివేంద్రాలపై ప్రకటనలకే పరిమితమవుతున్న అధికారులు సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో మార్చి నెలలోనే ఎండలు ఠారెత్తించాయి. 40 డిగ్రీలకు పగటి ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. ఇంకా ఏప్రిల్ మొదలైంది. మున్ముందు ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ ప్రభావం కనిపిస్తోంది. మధ్యాహ్నం 12 గంటలయ్యేసరికి రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాయంత్రమైనా వేడి వాతావరణం తగ్గడం లేదు. ఇళ్లలో ఉన్నప్పటికీ.. ఏసీలు, కూలర్లు ఉంటేనే గానీ.. భరించలేని పరిస్థితి. వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జిల్లాలోని బలిజిపేట, భామిని, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, పార్వతీపురం, సీతానగరం తదితర మండలాల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలోని 15 మండలాల పరిధిలో గత నెల 30వ తేదీన నాలుగు మండలాలు, 31న 10 మండలాల్లో వేడిగాలుల ప్రభావం కనిపించింది. ఈ నెల ఒకటో తేదీన మంగళవారం కూడా ఎనిమిది మండలాల్లో వేడిగాలులు ఉంటాయని విపత్తుల నిర్వహణ శాఖ చెబుతోంది. వారం రోజుల కిందట రాత్రి వేళ కురిసిన గాలులు, వర్షం మినహాయించి.. మిగిలిన రోజుల్లో చినుకు జాడ లేకపోవడంతో మూగజీవాలు సైతం నీటి కోసం అల్లాడిపోతున్నాయి. పశువులకు తాగునీరు అందించేందుకు జిల్లాలో 411 పశువుల తొట్టెలు మంజూరయ్యాయి. వీటి పనులు ప్రారంభించాల్సి ఉంది. కానరాని చలివేంద్రాలు గతంలో వేసవిలో ప్రభుత్వపరంగా మంచినీటి చలివేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకునేవారు. మండల కేంద్రంతో పాటు.. రద్దీ కూడళ్లలో వీటిని ఏర్పాటు చేసేవారు. ఇందు కో సం ప్రభుత్వాలు ప్రత్యేకంగా నిధులు కేటాయించేవి. దీంతో పాటు.. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సహకారంతో కొన్ని ప్రాంతాల్లో మజ్జిగ, మంచినీటి చలివేంద్రాలు వెలిసేవి. ఏప్రి ల్ వస్తున్నా ప్రభుత్వపరంగా చలివేంద్రాల జాడ ఎక్కడా లేదు. కేవలం అధికారుల ప్రకటనలకే పరిమితమవుతున్నాయన్న విమర్శలు ప్రయాణికులు, వాహనచోదకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. దాహం వేస్తే మంచినీటి బాటిళ్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. రూ.20 చొప్పున నీటి బాటిల్ కొనుగోలు చేసుకోవాల్సి వస్తోందని బాటసారులు, వాహనచోదకులు చెబుతున్నారు. దీనిని వ్యాపారులు సొమ్ముచేసుకుంటున్నారు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో శుద్ధిచేయని నీటినే సీసాల్లో నింపి విక్రయిస్తున్నారు. ఇటువంటి నీటిని తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఉపాధి హామీ పను ల వద్ద మజ్జిగ, తాగునీరు, మెడి కల్ కిట్లు, టెంట్లు వంటివి కానరావడం లేదు. ఎండల్లోనే వేతనదారులు పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రత్యేకంగా పనుల వద్ద ఈ సౌకర్యాలు కల్పించడానికి పెద్దఎత్తున నిధులు విడుదలవుతున్నా.. క్షేత్రస్థాయిలో వాటి జాడ కనిపించడం లేదు. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల వడదెబ్బ బారిన పడకుండా వివిధ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. ●ఎక్కువగా నీటిని తాగాలి. కొబ్బరినీరు, ఓఆర్ఎస్ ద్రావణం, ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజు వంటివాటితోపాటు.. నీటి శాతం అధికంగా లభించే కర్బూజా వంటివాటిని తీసుకోవాలి. ●వీలైనంత వరకు ఎండలో తిరగడం తగ్గించాలి (ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల్లోపు). తప్పనిసరి పరిస్థితుల్లో టీపీ, చలువ కంటి అద్దాలు, గొడుగు ధరించాలి. లేత కాటన్ రంగు దుస్తులను ధరించాలి. ●శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. సురక్షిత నీటినే తాగాలి. ●తీవ్రమైన ఎండలో బయటకు వెళ్లినప్పుడు తల తిరగడం, వాంతులు, ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడితే వెంటనే దగ్గరలోని వైద్యుడిని సంప్రదించాలి. ●ఇంటి వాతావరణం చల్లగా ఉంచుకోవాలి. ఎండలతో జాగ్రత్తలు తప్పనిసరి.. -
ప్లేట్ కాంపోనెంట్ ప్రారంభం
విజయనగరం ఫోర్ట్: పట్టణంలోని రెడ్‌క్రాస్ సొసైటీలో సీఎస్ఆర్ నిధులు రూ.76.01 లక్షలతో ఏర్పాటు చేసిన ప్లేట్ లెట్స్ యూనిట్‌తో పాటు, ఎస్డీపీ యూనిట్‌ను రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మితో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్‌క్రాస్ విశేషమైన సేవలను అందిస్తోందన్నారు. కాంపోనెంట్ యూనిట్ ద్వారా ఉమ్మడి జిల్లాల్లో అవసరమైన వారికి రక్తంతో పాటు రెడ్ బ్లడ్ సెల్స్, ఫ్రెష్ ఫ్రోజెన్ ఫ్లాస్మా, ప్లేట్ లెట్స్, క్రయాప్రెసిపిరేట్, సింగిల్ డోనర్ ప్లేట్‌లెట్స్‌ను సరఫరా చేస్తుందన్నారు. ఆరోగ్య వంతులంతా ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కె.రాణి, జిల్లా సైనిక సంక్షేమ అధికారి మజ్జి కృష్ణారావు, రెడ్‌క్రాస్ చైర్మన్ కేఆర్డీ ప్రసాదరావు, కార్యదర్శి సత్యం, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎం.జయచంద్రనాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల హామీలు నీటి మూటలేనా?
● ఉచిత బస్సు ప్రయాణం తుస్సుమనిపించారు ● ఉత్తుత్తి ప్రజాదర్బారులతో కాలం వెళ్లదీత ● సమాచార హక్కు చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తున్న యంత్రాంగం ● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర సాలూరు రూరల్: ఎన్నికల హమీలు నీటిమూటలేనా?.. ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని ఎన్నికల ప్రచారంలో గొప్పగా చెప్పిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఇప్పుడు మహిళలకు ఏం సమాధానం చెబుతారని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ప్రశ్నించారు. సాలూరులోని తన నివాసంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు ఉత్తుత్తి హామీలిచ్చిన కూటమి నేతలు ఇప్పుడు డైవెర్షన్ పాలిటిక్స్‌తో పబ్బంగడుపుకుంటున్నారని విమర్శించారు. సంక్షేమ పథకాల అమలుపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాదర్బార్లు, గ్రామసభలు, గ్రీవెన్సులు పెట్టి ప్రజలకు ఏదో చేస్తున్నామని మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఇంతవరకు ప్రజాసమస్యల పరిష్కర వేదికకు ఎన్ని వినతులు వచ్చాయి, ఎన్ని పరిష్కరించారన్న విషయం తెలుసుకునేందుకు ఆర్టీఐ ప్రతినిధి పిరిడి రామకృష్ణ ఽసమాచార హక్కుచట్టానికి దరఖాస్తు చేసి నెలరోజులవుతున్నా ఇంతవరకు జిల్లా అధికారుల నుంచి స్పందనలేదన్నారు. పాచిపెంట మండలం కేసలి పంచాయతీ సమాచారానికి టీడీపీ నాయకుడు సమాచార హక్కు చట్టం ప్రకారం వివరాలు కావాలని దరఖాస్తుచేసుకుంటే వెంటనే ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వ భూములు ఆక్రమణపై సమాచారం కోసం స్వయంగా తాను దరఖాస్తు చేసినా సమాచారం ఇవ్వకపోవడం దారుణమన్నారు. న్యాయవాది రేగుమహేశ్వరరావు పెట్టిన దరఖాస్తుకు కూడా అధికారులు స్పందించలేదన్నారు. చట్టం తమకంటే ఎక్కువ కాదనుంకుంటే కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించారు. తన స్నేహితుడు ప్రిన్సిపాల్‌గా పనిచేసి రిటైర్ అయి నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఎలాంటి బెనిఫిట్స్ అందలేదని దరఖాస్తు చేసుకుంటే, సమస్య పరిష్కారం కాకుండానే పరిష్కరించామని మెసేజ్ పంపించారన్నారు. మేధావుల పరిస్థితే ఇలా ఉంటే సామన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థంచేసుకోవచ్చన్నారు. అభివృద్ధి పనులు నిరంతర ప్రక్రియ అభివృద్ధి పనులు కొనసాగించడం ప్రభుత్వాల నిరంతర ప్రక్రియ అని మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర అన్నారు. సిమిడివలస బీటీ రోడ్డు ప్రారంభ అంశంపై స్పందిస్తూ గత తెలుగుదేశం ప్రభుత్యంలో కొబ్బరికాయ కొట్టి విడిచిపెట్టిన కందుల పదం వంతెన, మోసూరు వంతెన, సాలూరు వేగావతి నదిపై పాంచాలి వెళ్లే వంతెన, సాలూరు 100 పడకల ఆస్పత్రి నిర్మాణాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తిచేసిందన్నారు. సిమిడి వలస రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించామని, ఇప్పుడు రోడ్డు పూర్తికావడంతో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ప్రారంభించారన్నారు. రోడ్డు నిర్మాణం పూర్తి కావడం మంచివిషయమన్నారు. సమావేశంలో వైస్ చైర్మన్ వంగపండు అప్పలనాయుడు, వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్, మండల నాయకుడు దండి శ్రీను, మాజీ కౌన్సిలర్ పిరిడి రామకృష్ణ , కౌన్సిలర్ సింగారపు ఈశ్వరరావు పాల్గొన్నారు. -
తాగునీటి ఎద్దడి నివారణ చర్యలు తీసుకోండి
● టెలికాన్ఫరెన్స్‌లో అధికారులను ఆదేశించిన కలెక్టర్ పార్వతీపురంటౌన్: జిల్లాలో నీటి నాణ్యత పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహించాలని, వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చలివేంద్రాలు విరివిగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అధికారులను సోమవారం టెలికాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. ఆరోగ్య, ఆర్డబ్ల్యూఎస్ శాఖలు సంయుక్తంగా నీటినాణ్యత పరీక్షలు పక్కాగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రధాన కూడళ్లు, గ్రామ పంచాయతీ, మండల స్థాయిలో అవసరమైన అన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాలు, సంస్థలు, సంఘాల సహకారంతో చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. మున్సిపాల్టీలు, గ్రామ పంచాయతీలు, ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఎండ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఉపాధిహామీ పనుల సమయాల్లో మార్పులు చేయాలన్నారు. పశుసంవర్ధకశాఖ ప్రతిపాదనల మేరకు జిల్లాలో 411 పశువుల తొట్టెలను తక్షణమే నిర్మించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. -
మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మినుములు కొనుగోలు
పార్వతీపురంటౌన్: నాఫెడ్, మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మినుములు కొనుగోలు చేస్తామని జేసీ ఎస్.ఎస్.శోభిక సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రబీసీజన్‌లో సాగు చేసిన అపరాల కొనుగోలుకు పేర్లు నమోదు ప్రక్రియ ప్రారంభించామన్నారు. క్వింటా మినుములు ధర రూ.7,400లుగా మద్ధతుధర నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఈ క్రాప్, ఈకేవైసీ చేయించుకున్న రైతులు తమ పరిధిలోని రైతు సేవా కేంద్రాల్లో సీఎం యాప్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. బిల్లుమడలో ఏనుగులు ● విడిపోయిన నాలుగు ఏనుగుల గుంపు భామిని: ఇన్నాళ్లూ కలిసికట్టుగా తిరిగిన నాలు గు ఏనుగుల గుంపు సోమవారం విడిపోయింది. భామిని మండలం పాత బిల్లుమడ సమీ పంలోకి రెండు ఏనుగులు, వంశధార నది ఆవ ల ఒడిశాకు చెందిన గౌరీ–వన్న గ్రామాల మధ్యన మరో రెండు ఏనుగులు తిరుగుతున్నా యి. అటవీ అధికారులు అప్రమత్తమై ఏనుగు ల సంచారాన్ని గమనిస్తున్నారు. ఎలాంటి కవ్వి ంపు చర్యలు చేపట్టవద్దని ఆయా గ్రామాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పైడితల్లిని దర్శించుకున్న గానకోకిల విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారిని గానకోకిల, పద్మశ్రీ పి.సుశీల సోమవారం రాత్రి దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం వేదపండితులు పూర్ణకుంభంతో ఆమెకు స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించిన అనంతరం ఆలయ ఇన్చార్జి ఈఓ కేఎన్‌వీడీవీ.ప్రసాద్ ఆధ్వర్యంలో వేదపండితులు ఆమెకు వేదాశీస్సులు, అమ్మవారి శేషవస్త్రాలను, ప్రసాదాలను అందజేశారు. విజయనగరంలోని గురునారాయణ కళాపీఠం వార్షికోత్సవ వేడుకలకు ఆమె హాజరయ్యారు. కళాపీఠం నిర్వాహకులు ఆమెను పురస్కారంతో సత్కరించారు. నేటి నుంచి ఇంటర్మీడియట్ తరగతులు విజయనగరం అర్బన్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర తరగతులను మంగళవారం నుంచి ప్రారంభించనున్నట్టు ఇంటర్మీడియట్ ఆర్ఐఓ మజ్జి ఆదినారాయణ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 72 ప్రభుత్వ, 107 ప్రైవేటు జనరల్ ఇంటర్మీడియట్, వృత్తి విద్యాకోర్సుల కళాశాలల్లోని ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర బోధన సిలబస్ ప్రారంభించాలని ఆయా ప్రిన్సిపాల్స్‌కు ఆదేశాలు పంపామన్నారు. సైకిల్‌పై భద్రాచలానికి.. నెల్లిమర్ల రూరల్: రాముడిపై తనకు ఉన్న అమితమైన విశ్వాసంతో ఓ భక్తుడు మండుటెండను సైతం లెక్క చేయకుండా భద్రాచలానికి సైకిల్‌పై పయనమయ్యాడు. తాను రాసిన రామకోటిని భద్రాచలంలో స్వామికి సమర్పించేందుకు సెగలుకక్కుతున్న ఎండను సైతం లెక్క చేయలేదు. వయసు మీద పడినప్పటికీ అపారమైన భక్తి భావంతో రామనామాన్ని జపిస్తూ శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొత్తరకొండ గ్రామానికి చెందిన లంక ప్రకాశరావు సోమవారం రామతీర్థానికి చేరుకున్నాడు. గడిచిన 20 ఏళ్ల నుంచి సైకిల్‌పై భద్రాచలం రామయ్య సన్నిధికి వెళ్తున్నట్టు తెలిపారు. రెండు రోజుల కిందట పయనమై మార్గంమధ్యలో ఉన్న అరసవిల్లి సూర్యనారాయణస్వామిని దర్శించి.. సుమారు 200 కిలో మీటర్లు ప్రయాణం సాగించి రామతీర్థం చేరుకున్నట్టు చెప్పారు. రాత్రికి రామతీర్థంలో బస చేసి మంగళవారం ఉదయం బయలుదేరుతానని తెలిపారు. సింహాచలం, అన్నవరం, ద్వారపూడి మీదుగా సుమారు 429 కిలోమీటర్లు దూరంలో ఉన్న భద్రాచలానికి చేరుకుంటానన్నారు. -
అంతర్జాతీయ పోటీలకు కోమటిపల్లి యువకుడు
దత్తిరాజేరు: మండలంలోని కోమటిపల్లి గ్రామానికి చెందిన దీసరి భానుప్రసాద్ అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికై నట్లు సంయుక్త భారతీయ ఖేల్ ఫౌండేషన్ (ఎస్బీకేఎఫ్) ప్రతినిధులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల విశాఖలో జరిగిన పోటీల్లో పాల్గొన్న భానుప్రసాద్ మొదటి స్థానం సాధించాడని పేర్కొన్నారు. ఏప్రిల్ 3 నుంచి 7 వరకు నేపాల్‌లో జరగనున్న అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో భానుప్రసాద్ తలపడనున్నాడన్నారు. ఇదిలా ఉంటే ప్రయాణ ఖర్చుల కోసం జనసేన జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మామిడి దుర్గాప్రసాద్ ఐదు వేల రూపాయలను భానుప్రసాద్‌కు అందజేశారు. -
రెల్లి కులస్తుల ఆందోళన
విజయనగరం టౌన్: జిల్లాను యూనిట్‌గా చేసి ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని, రెల్లి కులస్తులకు వర్గీకరణలో రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని, వర్గీకరణ అనేది కులగణన చేపట్టిన తర్వాతనే చేయాలని విజయనగరం రెల్లి సామాజిక వర్గం ప్రతినిధులు బంగారు దుర్గారావు, యర్రంశెట్టి వాలి, శ్రీను తదితరులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం విజయనగరం బాలాజీ జంక్షన్ వద్ద ఆందోళన చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగి రెల్లికులస్తులకు అన్యాయం చేయవద్దన్నారు. భావితరాలకు ఈ ఫలాలు అందాలంటే వర్గీకరణ విషయంలో తమకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో సామాజిక వర్గ ప్రతినిధులు రామారావు, సతీష్, రమణ, రఘు, సభ్యులు పాల్గొన్నారు. రిజర్వేషన్ శాతాన్ని పెంచాలంటూ డిమాండ్ -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
వీరఘట్టం/పాలకొండ రూరల్: మండలంలోని తూడి జంక్షన్ వద్ద సీఎస్పీ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మీసాల తిరుపతిరావు (39) అనే వ్యక్తి శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై జి.కళాధర్ సోమవారం తెలిపారు. మృతుని భార్య సరస్వతి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. బైక్‌పై వస్తున్న తిరుపతిరావును వెనుక నుంచి వస్తు న్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు. తిరుపతిరావు మృతితో పాలకొండ మండలం పొట్లిలో విషాదఛాయలు అలము కున్నాయి. మృతుడికి భార్యతో పాటు హర్షవర్థన్, సుధీర్ అనే ఇద్దరు కుమారులున్నారు.పోలీసుల అదుపులో గంజాయి నిందితులు..?రామభద్రపురం: మండలంలోని కొట్టక్కి పోలీస్ చెక్‌పోస్టు వద్ద ఫిబ్రవరి 10వ తేదీన ఒడిశా నుంచి తరలిస్తున్న 150 కిలోల గంజాయి పోలీసులకు పట్టుబడగా.. కారు వదిలేసి అందులో ఉన్న నిందితులు పరారైన సంగతి తెలిసిందే. వెంటనే ఈ వ్యవహారంపై సీఐ నారాయణరావు, ఎస్సై వి. ప్రసాదారావు కేసు నమోదు చేసి ముమ్మర దర్యాపు చేపట్టడంతో నలుగురు నిందితులు దొరికి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అదుపులో ఉన్న నలుగురు నిందితుల్లో ఒకరు అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు గ్రామానికి చెందిన వాడు కాగా.. ఇద్దరు విశాఖ జిల్లా అనందరంపురానికి చెందిన వారని తెలిసింది. అలాగే ఇంకొకరు విజయనగరం జిల్లా ఎస్.కోటకు చెందిన వ్యక్తి అని సమాచారం. వీరు ఈ గంజాయిని ఎక్కడి నుంచి తెస్తున్నారు..? ఎక్కడికి తీసుకెళుతున్నారు..? అక్రమ రవాణా వెనుక ఎవరున్నారు..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. నిందితులను ఎస్పీ ఎదుట మంగళవారం హాజరుపరచనున్నట్లు సమాచారం.జోరుగా గ్రావెల్ తవ్వకాలుభామిని: మండలంలోని బురుజోల – పసుకుడి మెట్ట వద్ద గ్రావెల్ అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. మూడు రోజులుగా తవ్వకాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏకంగా జేసీబీలతో తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్ల సహాయంతో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి తవ్వకాలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.రైల్వే ట్రాక్‌పై మృతదేహంసీతానగరం: మండలంలోని సీతానగరం – గుమ్మిడివరం గ్రామాల మధ్య గల రైల్వే ట్రాక్‌పై ఓ వ్యక్తి మృతదేహాన్ని సోమవారం గుర్తించారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న రైల్వే హెచ్‌సీ బి. ఈశ్వరరావు మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రైలు నుంచి జారిపడి మృతి చెందాడా.. లేక రైలు ఢీ కొనడం వల్ల ప్రమాదం జరిగిందా అన్న విషయమై పోలీసులు విచారణ చేపడుతున్నారు. మృతుడి వద్ద లభించిన ఆధారాలను బట్టి అతను ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన అరుణ బలేరా (40) సన్నాఫ్ మోహన్ బలేరాగా గుర్తించారు. -
స్లాట్ బుకింగ్స్‌తో రిజిస్ట్రేషన్లు
విజయనగరం రూరల్: రిజిస్ట్రేషన్లను మరింత సులభతరం చేయడానికి ప్రభుత్వం తీసుకు వచ్చిన స్లాట్ బుకింగ్ విధానాన్ని ఈ నెల రెండో తేదీ నుంచి విజయనగరం ఆర్వో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రారంభించనున్నట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ ఎ.నాగలక్ష్మి తెలిపారు. పట్టణంలోని దాసన్నపేటలో ఉన్న ఆర్వో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా రిజిస్ట్రార్ ఏవీ కుమారితో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భూ క్రయ, విక్రయదారులకు సమయం వృథా కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం స్లాట్ బుకింగ్ విధానం తీసుకువచ్చిందని చెప్పారు. ఈ విధానం వల్ల పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నారు. పబ్లిక్ డేటా ఎంట్రీ విధానం ద్వారా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సబ్ రిజిస్ట్రార్లు ఎస్వీ ప్రసాద్, కేఏ షీలా, సిబ్బంది, క్రయ విక్రయదారులు పాల్గొన్నారు. -
అనుమానాస్పదంగా ఉద్యోగి మృతి
రణస్థలం: మండలంలోని బంటుపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న యూనైటెడ్ బ్రూవరీస్ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగి పిన్నింటి అప్పలసూరి(47) అనుమానాస్పదంగా మృతి చెందాడు. జేఆర్‌పురం పోలీసులు, పరిశ్రమ వర్గాలు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం జనరల్ డ్యూటీకి వెళ్లిన మృతుడు అప్పలసూరి సాయంత్రం 4.30 గంటల సమయంలో పరిశ్రమలోని వాష్ రూమ్‌లో ప్లాస్టిక్ పైపునకు ప్యాకింగ్ రోప్‌తో ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడు. కొంత సమయం తర్వాత గుర్తించిన తోటి ఉద్యోగులు జేఆర్‌పురం పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈయన పరిశ్రమలోని కేస్ ఫ్యాకర్ మిషన్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. బంటుపల్లి పంచాయతీ ప్రజలకు ఆర్ఎంపీగా వైద్య సేవలు అందిస్తుంటాడని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఉరివేసుకుని చనిపోయి ఉండడంపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతునికి భార్య అమ్ములు, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడు స్వగ్రామం నరసన్నపేట దగ్గర లుకలాం కాగా, గత 30 ఏళ్లుగా ఉద్యోగరీత్యా జేఆర్‌పురం పంచాయతీలోని జీఎంఆర్ కాలనీలో నివాసముంటున్నాడు. జేఆర్‌పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
గిరిజన రైతు కంట కన్నీరు..
● జీడిమామిడికి తెగుళ్ల దెబ్బ ● తగ్గనున్న దిగుబడి ● ఆందోళనలో రైతులుసీతంపేట: గిరిజనుల ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తున్న జీడిపంట ఈ ఏడాది దెబ్బతింది. అగ్గి తెగులు వల్ల కొన్ని ప్రాంతాల్లో పూత మాడిపోవడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. పూర్తిస్థాయిలో దిగుబడి రాకపోవడంతో గిరిజనులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. అధిక ఉష్ణోగ్రత, తేనె మంచుతో పూత రాలేదు. అక్కడక్కడ తోటల్లో కొద్దిపాటి పూత వచ్చిందంటే అది కూడా మాడిపోయింది. సీతంపేట ఐటీడీఏ పరిధిలో టీపీఎంయూ పరిధిలోని ఏడు మండలాల్లో దాదాపు 15 వేల హెక్టార్లలో జీడిపంట సాగవుతుండగా.. ఈ పంటపై సుమారు 12 వేల మంది రైతులు ఆధారపడి ఉన్నారు. ఏప్రిల్, మే నెలల్లో పంట చేతికందాల్సి ఉంది. అయితే ఈ ఏడాది సుమారు ఐదువేల హెక్టార్లలలో కూడా పంట పూర్తి స్థాయిలో పండిన దాఖలాలు లేవు. గతంలో ఈ సీజన్లో సుమారు రెండు నుంచి మూడు వేల టన్నుల వరకు జీడిపిక్కల దిగుబడి ఉండేది. ఈ ఏడాది వెయ్యి టన్నుల లోపు కూడా దిగుబడి వచ్చే అవకాశం కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు. ప్రతి ఏటా ఒక్కో గిరిజన కుటుంబానికి జీడి పంట వల్ల రూ.50 వేల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఆదాయం వచ్చేది. ఈ ఏడాది రూ.20 వేలు కూడ వచ్చే అవకాశం లేదని రైతులు చెబుతున్నారు. ఎక్కువగా కుశిమి, కోడిశ, శంభాం, కె.గుమ్మడ, దోనుబాయి, పొల్ల, పెదరామ, మర్రిపాడు, పూతికవలస, చిన్నబగ్గ, పెద్దబగ్గ, కీసరజోడు, తదితర పంచాయతీల పరిధిలో జీడి ఎక్కువగా సాగవుతోంది. ఉద్యానవన పంటలను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో గతంలో ఐటీడీఏ కూడా జీడిమామిడి మొక్కలు సరఫరా చేసింది. అవి కూడా సరైన దిగుబడి ఇవ్వకపోవడంతో ఏం చేయాలో తెలియక రైతులు తలలు పట్టుకుంటున్నారు. -
పచ్చ తమ్ముడి బరితెగింపు
● అధికారుల మాట బేఖాతర్ ● రచ్చబండను నేలమట్టం చేసిన వైనంఇచ్ఛాపురం రూరల్: అధికారంలో ఉన్నామన్న అహంకారంతో టీడీపీ నాయకుడు బరితెగించాడు. తన స్థలానికి అడ్డుగా ఉన్నటువంటి 30 ఏళ్ల నాటి రచ్చబండను నేలమట్టం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కె.శాసనాం గ్రామంలో 30 ఏళ్ల క్రితం స్థానిక గ్రామ పెద్ద కారంగి కారయ్య అనే వ్యక్తి రచ్చబండను నిర్మించాడు. అందులో రావి చెట్టును నాటి త్రినాథస్వాముల వారి విగ్రహాలను ప్రతిష్టించారు. అయితే అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఇసురు ఫకీరు తన సొంత భూమికి రచ్చబండ అడ్డుగా ఉందంటూ, ఈనెల 19న రచ్చబండను పెకిలించేందుకు ప్రయత్నించాడు. దీంతో గ్రామస్తులు పోలీసు, రెవెన్యూశాఖాధికారులకు ఫిర్యాదులు చేశారు. తహసీల్దార్ ఎన్.వెంకటరావు ఆదేశాల మేరకు ఈనెల 21, 23 తేదీల్లో మండల, గ్రామ సర్వేయర్లు, వీఆర్వో సంఘటనా స్థలానికి వెళ్లి కొలతలు తీశారు. రచ్చబండ ప్రభుత్వ స్థలంలో ఉందని, రచ్చబండకు పది అడుగుల దూరంలో ఫకీరు స్థలం ఉందని తేల్చి చెప్పారు. రచ్చబండపై ఫకీరుకు ఎటువంటి అధికారం లేదని, తొలగించేందుకు ప్రయత్నిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే తమ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో అధికారుల మాటలు భేఖాతరు చేస్తూ, ఇసురు ఫకీరు తన అనుచరులతో ఆదివారం రచ్చబండను కూల్చడంతో పాటు 30 ఏళ్లనాటి చెట్టును తొలగించేశాడు. దీంతో సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
చీకటిలోనే రాకపోకలు..
పిల్లలు ఇబ్బంది పడుతున్నారు పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు ప్రత్యేక తరగతులు ముగించుకుని ఇంటికి వచ్చే సమయానికి చీకటి పడడంతో ఇబ్బంది పడుతున్నారు. వారు ఇంటికి చేరుకునేంత వరకు భయంభయంగా ఉంటోంది. విషసర్పాలు, కీటకలు ఎక్కువగా సంచరిస్తుంటాయి. అధికారులు స్పందించి లైట్లు వేయాలి. – ఎం.గిరిప్రసాద్, వసుంధర్నగర్ ప్రమాదాలు జరిగే అవకాశం.. రాష్ట్రీయ రహదారి కావడంతో భారీ వాహనాలు అతివేగంతో రాకపోకలు సాగిస్తుంటాయి. విద్యుత్ దీపాలు లేకపోవడంతో వాహనం వెళ్లిపోయిన తర్వాత కాసేపు రోడ్డు కనిపించడం లేదు. ఆ సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అధికారులు స్పందించి వీధి లైట్లు ఏర్పాటు చేయాలి. – గండి రాంబాబు, విద్యానగర్ పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రమైన పార్వతీపురం పట్టణ ప్రారంభంలో రహదారికి ఇరువైపులా విద్యుత్ దీపాలు లేకపోవడంతో అంధకారం నెలకొంది. దీంతో చీకటిలోనే రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రీయ రహదారికి అనుసరించి ఉన్న వైకేఎం కాలనీ, వసుంధర నగర్, శక్తినగర్, ఆఫీషియల్ కాలనీ, విద్యానగర్ వరకు రహదారికి ఇరువైపులా విద్యుత్ లైట్లు లేవు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు సాయంత్రం ఏడు దాటితే ఇంటి నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. ఉద్యోగస్తులు, విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో చీకటిలోనే భయం భయంగా ఇంటికి చేరుకుంటున్నారు. అధికారులు స్పందించి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని ఆయా ప్రాంతాల వాసులు కోరుతున్నారు. ఇబ్బందిపడుతున్న ప్రజలు -
పేరాపురంలో దొంగతనం
● నాలుగు తులాల బంగారు ఆభరణాలు, రెండు లక్షల రూపాయల నగదు అపహరణ పూసపాటిరేగ: మండలంలోని పేరాపురం గ్రామంలో దొంగతనం జరిగింది. బాధితులు, పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన గురుగుబిల్లి కసవయ్య కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 26న తిరుపతి వెళ్లాడు. దర్శనం అనంతరం 29వ తేదీ అర్ధరాత్రి ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో ఇంటి తలుపు తెరిచి ఉండడంతో వెంటనే లోనికి వెళ్లి చూడగా బీరువాలోని నాలుగు తులాల బంగారు ఆభరణాలు, రెండు లక్షల రూపాయల నగదు కనిపించలేదు. వెంటనే స్థానిక పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయగా.. ఎస్సై ఐ. దుర్గాప్రసాద్, తదితరులు ఆదివారం గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బీరువాను క్షుణ్ణంగా పరిశీలించి, తెలిసిన వారు దొంగతనం చేశారా.. బయట వ్యక్తులు వచ్చారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రజలకు పోలీసులు ఉన్నారన్న నమ్మకం పెరగాలి
సాక్షి, పార్వతీపురం మన్యం: ‘‘మహిళలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తే ఏ రంగంలోనైనా విజేతలవుతారు. అమ్మాయిలు ఇష్టమైన రంగాన్ని ఎంచుకోవాలి. డాక్టర్, పోలీస్, ఇంజినీర్.. ఇలా ఏదైనా సరే! దాన్ని సాధించేందుకు ఎదురైన ప్రతి సవాల్‌నూ ఛాలెంజింగ్‌గా తీసుకోవాలి. ఎవ్విరిథింగ్ ఈజ్ పాజిబుల్.. కష్టపడితే గెలుపు మన ముందు వచ్చి వాలుతుంది..’’ ............................................................... ‘‘పార్వతీపురం మన్యం జిల్లా లాంటి ఏజెన్సీ ప్రాంతంలో పని చేయడం గొప్ప అనుభూతినిస్తోంది. ఇక్కడ గిరిజన జనాభా అధికం. నిరక్షరాస్యత కూడా ఉంది. గత కొన్నేళ్లుగా కొంత మార్పు కనిపిస్తోంది. బాలికలు విద్య, క్రీడలు, ఇతర రంగాల్లో ప్రావీణ్యం పొందుతున్నారు. వారిలో మరింత చైతన్యం తీసుకొచ్చేందుకు నా వంతుగా ప్రయత్నిస్తున్నా. పాఠశాలలు, కళాశాలలకు స్వయంగా వెళ్లి వివిధ అంశాలపై వివరిస్తున్నా. కేవలం భద్రతనే కాదు.. కెరియర్ కోసం కూడా వివరిస్తుండటం సంతృప్తినిస్తోంది.’’ ............................................................... చిన్నప్పుడు అందరిలానే తనూ ఒక సాధారణ అమ్మాయి. చదువు, ఆటపాటలే లోకం. డిగ్రీ చదువుతున్న సమయంలో.. సమాజంలో తన పాత్ర ఏమిటో అవగతమైంది. ఈ సొసైటీకి.. ప్రధానంగా మహిళలు, బాలికల కోసం ఏం చేయాలన్న ప్రశ్నలోనే.. ‘ఐపీఎస్’ అన్న లక్ష్యం బోధపడింది. ఆమే.. యువ ఐపీఎస్ అధికారిణి, పార్వతీపురం ఏఎస్పీ అంకిత సురాన. అత్యున్నతమైన ఇండియన్ పోలీస్ సర్వీస్‌కు ఎంపిక కావడమే కాదు.. శిక్షణలోనూ ప్రతిభను చూపారు. నేడు విధి నిర్వహణలోనూ ‘ఫ్రెండ్లీ పోలీస్’ అన్న పదానికి అసలైన నిర్వచనం చెబుతూ, క్లిష్టమైన కేసుల్లోనూ తన మార్కు చూపిస్తూ.. విజయవంతమైన అధికారిణిగా గుర్తింపు పొందారు. రాష్ట్రానికి మారుమూలన ఉన్న పార్వతీపురం మన్యం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, యువతకు దిశానిర్దేశం చేయడంలో ముందుంటున్నారు. తన కుటుంబ నేపథ్యం, ఈ రంగంలోకి రావడానికి కారణం, విధి నిర్వహణలో సక్సెస్ఫుల్ జర్నీని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... శిక్షణ తర్వాత చాలా మార్పు సివిల్స్ సాధించిన తర్వాత శిక్షణ పూర్తయ్యాక నాలో చాలా మార్పు వచ్చింది. పట్టుదల పెరిగింది. ప్రజలకు సేవ చేయడాన్ని స్ఫూర్తిగా తీసుకున్నా. బాలలు, మహిళల రక్షణ కోసం పని చేయాలని అనిపించింది. ఈ రంగంలో తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సహించారు. 2023లో గ్రేహౌండ్స్‌లో విశాఖలో విధుల్లో చేరా. తర్వాత పార్వతీపురం ఏఎస్పీగా వచ్చా. ఈ జాబ్ పొందడం చాలా లక్కీ! మరిచిపోలేని అనుభూతి.. రాష్ట్రస్థాయి రిపబ్లిక్‌డే వేడుకల పరేడ్ కమాండర్‌గా వ్యవహరించడం మరిచిపోలేని అనుభూతి. గర్వపడే సందర్భం. చాలా ఆనందం అనిపించింది. ఒక వారం శిక్షణ పొంది విజయవంతంగా పరేడ్ పూర్తి చేయగలిగాం. నాకు అవకాశమిచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నేటి తరానికి ఇచ్చే సందేశం.. నథింగ్ ఈజ్ ఇంపాజిబుల్. ఎవ్విరిథింగ్ ఈజ్ పాజిబుల్. నేటి తరం బాలికలు, యువతకు చెప్పేదొకటే. విద్యార్థి దశలో చదువు, కెరియర్‌పైనే దృష్టి పెట్టాలి. మీరు ఏ రంగంలో రాణించాలనుకుంటున్నారో గట్టిగా నిర్ణయించుకోవాలి. దాని సాధన దిశగా సాగాలి. పదో తరగతి తర్వాత కెరియర్ కౌన్సెలింగ్ చాలా ముఖ్యం. ఈ దశలో ఇతర విషయాల జోలికి వెళ్లకుండా, అనవసరంగా సమయం వృథా చేయకుండా భవిష్యత్తు కోసం ఆలోచిస్తే.. మంచి జీవితం లభిస్తుంది. శాంతిభద్రతల పరిరక్షణలో... కుటుంబ నేపథ్యం.. ప్రజల సహకారం ఉంటేనే.. నేను ఎక్కడ పనిచేసినా.. అక్కడ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు, చిన్నారులకు భద్రత కల్పించగలిగితే చాలు.. అంతకంటే సంతృప్తి ఉండదు. ప్రత్యేకించి మహిళలు, చిన్నారులకు పోలీస్‌పై నమ్మకం పెంచేలా పనిచేయగలగాలి. విధి నిర్వహణలో ప్రతి కేసునూ సవాల్‌గానే తీసుకుంటా. పోక్సో కేసులు, వరకట్నం, ఎస్సీ, ఎస్టీ కేసులు, శాంతిభద్రతలు.. ఇలా ఏదైనా బాధితులకు న్యాయం చేయాలి. అప్పుడే విధి నిర్వహణలో సంతృప్తి చెందగలం. మహిళల హక్కులు, చట్టాలపైన అవగాహన కల్పిస్తున్నాం. మహిళా దినోత్సవం సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ, ఇతర కార్యక్రమాలు చేశాం. చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. ఏ ఒక్కరూ భయపడకూడదు. ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలి. ఇటీవల ఒక పోక్సో కేసు వచ్చింది. ఆ అమ్మాయి చాలా డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. వారం రోజులు కౌన్సెలింగ్ ఇచ్చాం. ఇప్పుడు ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఇంటర్ పరీక్షలు రాసుకుంటోంది. డ్రోన్ నిఘా వ్యవస్థను పటిష్టం చేశాం. ఈవ్‌టీజింగ్, జూదం, గంజాయి, సారా అక్రమ రవాణా వంటివాటిని డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ, కట్టడి చేస్తున్నాం. ప్రతి ముఖ్య కూడళ్లలోనూ సీసీ కెమెరాలు పెట్టాం. జిల్లాలో టాప్ 20 నేరస్తులను గుర్తించాం. వారిపై నిరంతరం ఓ కన్నేసి ఉంచుతున్నాం. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా శక్తి యాప్ అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం పార్వతీపురం, పాలకొండ, సాలూరుల్లో టీమ్స్ పని చేస్తున్నాయి. వీరికి ప్రత్యేకంగా ఓ వాహనం ఉంటుంది. 100, 112 నంబర్లకు కూడా అత్యవసర సమయంలో ఫిర్యాదు చేయవచ్చు. నిమిషాల వ్యవధిలోనే పోలీసులు అక్కడ ఉంటారు. గంజాయి, సారా రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నాం. కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. బాలికల కోసం స్వీయ రక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి.. ఏ విధంగా రక్షణ పొందాలి, భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం. పాఠశాలల్లో ఈగల్ టీమ్స్ ద్వారానూ అవగాహన పెంచుతున్నాం. చిన్నారులు, మహిళల రక్షణ కోసం వన్‌స్టాప్ సెంటర్ ఉంది. అక్కడ వారికి అవసరమైన అన్ని విధాల మద్దతు కూడా లభిస్తుంది. సైబర్ క్రైమ్ మోసాలు రోజుకో విధంగా కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ప్రజలు వాటి బారిన పడకుండా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఆయా ఎస్‌హెచ్‌వోల ద్వారా చేపడుతున్నాం. పోలీస్ సిబ్బంది సొంత సమస్యలపైనా ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా గ్రీవెన్స్ నిర్వహించి, ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం. పార్వతీపురంలో పని చేయడం గొప్ప అనుభూతి అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదు లక్ష్యం కోసం నిరంతరం శ్రమిస్తే విజయం సులువే ప్రతి కేసునూ ఛాలెంజింగ్‌గా తీసుకుంటా.. మహిళల భద్రత.. చైతన్యం ప్రథమ కర్తవ్యం ‘సాక్షి’తో ఏఎస్పీ అంకిత సురానా మా సొంత ప్రాంతం మహారాష్ట్ర. పదో తరగతి వరకు అక్కడే చదివా. తర్వాత కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. ఇంటర్ (బైపీసీ) తర్వాత హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ బయోకెమిస్ట్రీ డిగ్రీ, సల్సార్ యూనివర్సిటీలో క్రిమినల్ జస్టిస్ మేనేజ్మెంట్లో పీజీ పూర్తిచేశా. తల్లిదండ్రులు కౌసల్య, మహవీర్ సురానా. నాన్న వ్యాపార రంగంలో ఉన్నారు. ఇంట్లో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగంలో లేరు. అందరూ ప్రైవేట్ ఉద్యోగాలు, వ్యాపారాలే. మా కుటుంబం నుంచి నేను మొదటి పోలీస్ అధికారి కావడంతో మా కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఉన్నారు. డిగ్రీలో ఉంటుండగానే కెరియర్ కోసం ఆలోచించా. సమాజానికి సేవ చేయాలని, ప్రజలకు దగ్గరగా ఉండే వృత్తిలో చేరాలని కోరిక. ఆ క్రమంలోనే సివిల్స్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నా. డిగ్రీ చదువుతూనే.. సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించాను. లక్ష్యంపైనే గురి. మూడుసార్లు విజయం రాకపోయినా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. నాలుగో ప్రయత్నంలో సివిల్స్ సాధించాను. 398వ ర్యాంకు వచ్చింది. ఐపీఎస్‌కు ఎంపికయ్యా. 2021 బ్యాచ్ మాది. ప్రజలను సురక్షితంగా ఉంచడం బాధ్యత. ఇదే సమయంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖపరంగా ఎంత చేసినా.. ప్రజల నుంచీ సహకారం అవసరం. ట్రాఫిక్ రూల్స్ పాటించడం, ప్రయాణ సమయంలో హెల్మెట్ ధారణ వంటివాటిలో ఎవరికివారు బాధ్యతగా వ్యవహరించాలి. పిల్లలు తప్పుడు దారిలో వెళ్లకుండా తల్లిదండ్రులు పర్యవేక్షణ చేయాలి. సమాజంలో ప్రధానంగా పోలీసులంటే భయం పోవాలి. 24 గంటలూ పోలీసులు అందుబాటులో ఉంటారు. ఏ సమయంలోనైనా ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలి. చుట్టుపక్కల అసాంఘిక కార్యకలాపాలు జరిగినా.. ఒక్క ఫొటో ద్వారానైనా శక్తి యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇతర పోలీస్ శాఖ టోల్‌ఫ్రీ నంబర్లనూ వినియోగించవచ్చు. శక్తి యాప్.. సేఫ్టీయాప్. ప్రధానంగా మహిళల వద్ద ఉండాలి. ఒక్క బటన్ ప్రెస్ చేస్తే పోలీసులు ఉంటారు. -
ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి..
సాలూరు: శ్రీరామచంద్రుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్థిల్లాలని మాజీ డిప్యూటీ సీఎం, మాజీ గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక రాజన్నదొర ఆకాంక్షించారు. పట్టణంలోని వెలమపేట, డబ్బివీధి, తదితర ప్రాంతాల్లో శ్రీరామనవమి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీతారాముల విగ్రహాలను రథంలో ఉంచి మేళతాళాల నడుమ ఊరేగించారు. ఈ కార్యక్రమంలో పీడిక రాజన్నదొర పాల్గొని రథం లాగారు. ఈ సమయంలో భక్తులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయడంతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. బైక్ రికవరీ పార్వతీపురం రూరల్: రెండు రోజుల వ్యవధిలో పోయిన బైక్‌ను పోలీసులు రికవరీ చేశారు. పార్వతీపురం రూరల్ ఎస్సై బి. సంతోషి తెలియజేసిన వివరాల మేరకు.. ఈ నెల 28న పార్వతీపురం రూరల్ పరిధి వైకేఎం కాలనీలోని ఓ కిరాణా దుకాణం వద్ద పార్క్ చేసిన పల్సర్ ఎన్ఎస్ 200 ద్విచక్ర వాహనాన్ని ఎవరో దొంగిలించారు. దీంతో బాధితుడు ఆదిత్య (సీతానగరం మండలం) మరుచటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్సై సంతోషి ఆధ్వర్యంలో పోలీసులు సమీపంలో ఉన్న సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా మక్కువ మండలానికి చెందిన ఇద్దరు మైనర్ల నుంచి బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి గంట్యాడ: ద్విచక్ర వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలియజేసిన వివరాల మేరకు.. కొఠారుబిల్లి కనకదుర్గమ్మ ఆలయం వెనుక ఉంటున్న కురిమిశెట్టి కృష్ణ అనే వ్యక్తి ఇంటికి వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన ద్విచక్ర వాహనచోదకుడు ఢీకొట్టాడు. దీంతో కృష్ణ తలకు బలమైన గాయాలు కావడంతో స్థానికులు విజయనగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కృష్ణ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. గంట్యాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు వీరఘట్టం: మండలంలోని తూడి జంక్షన్ వద్ద సీఎస్పీ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మీసాల తిరుపతిరావు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. పాలకొండ మండలం పొట్లి గ్రామానికి చెందిన తిరుపతిరావు వీరఘట్టం నుంచి తన స్వగ్రామానికి బైక్‌పై వెళుతుండగా.. పాలకొండ నుంచి పార్వతీపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో తిరుపతిరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి 108 వాహనంలో పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. తప్పిన పెను ప్రమాదం వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలోని బాతుపురం–చినవంక ఆర్అండ్బీ రోడ్డులో ఆదివారం సాయంత్రం ఒక భారీ మర్రిచెట్టు కొమ్మ రోడ్డుపై విరిగిపడింది. అయితే ఆ సమయంలో వాహన రాకపోకలు, ప్రయాణికులు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ రోడ్డులో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. చెట్టుకొమ్మ రోడ్డుకి అడ్డంగా పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో స్థానికులంతా కలిసి చెట్టుకొమ్మను తొలగించారు. -
వినియోగానికి నోచుకోని నిధులు
● వీరఘట్టం మేజర్ పంచాయతీలో మూలుగుతున్న నిధులు ● అభివృద్ధి పనులపై దృష్టి సారించని పాలకవర్గం వీరఘట్టం: జిల్లాలోని అత్యధిక జనాభా ఉన్న వీరఘట్టం మేజర్ పంచాయతీకి ఎంతో ఘన చరిత్ర ఉంది. ఎందరో మహానుభావులు ఈ పంచాయతీలో పాలన చేసి ప్రజలందరిచే శభాష్ అనిపించుకున్నారు. అయితే ప్రస్తుతం షాడో పాలనలో ఉన్న ఈ మేజర్ పంచాయతీలో నిధులు పుష్కలంగా ఉన్నా వినియోగానికి నోచుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.98 లక్షలు.. అలాగే జనరల్ ఫండ్ నిధులు సుమారు రూ.28 లక్షలు మూలుగుతున్నాయి. మొత్తం వీరఘట్టం మేజర్‌పంచాయతీ ఖజానాలో రూ.1.26 కోట్లు ఉన్నాయి. అయినా ఈ నిధులు అభివృద్ధి పనులకు ఉపయోగించకపోవడం శోచనీయం. అభివృద్ధి చేయాల్సిన కొన్ని పనులు.. స్థానిక కొత్త బస్టాండ్‌లో కల్వర్టు చాలా ఏళ్ల కిందట కూలిపోయింది. దీన్ని బాగు చేయాల్సి ఉంది. అలాగే రెల్లివీధి సమీపంలో ఉన్న శ్మశానవాటిక రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. శ్మశానవాటిక పరిసరాలు కూడా దారుణంగా ఉన్నాయి. దీంతో శ్మశానవాటికకు వెళ్లే సమయంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే చాలా వీధుల్లో వీధి కుళాయిలు పాడయ్యాయి. ట్యాప్‌లు లేక తాగునీరు వృథాగా పోతోంది. వీటిని బాగు చేయాల్సిన అవసరం ఉంది. అంబేడ్కర్ జంక్షన్ నుంచి బార్నాలవీధి రోడ్డు దారుణంగా ఉంది. అలాగే సెగిడివీధి నుంచి రెల్లివీధి మీదుగా బీసీ కాలనీకి వెళ్లే రోడ్డు అత్యంత దారుణంగా ఉంది. యల్లంకి వీధిలో ఎవరైనా మృతి చెందితే వారి అంత్యక్రియలకు అష్టకష్టాలు పడాల్సిందే. శ్మశానవాటికకు సరైన రహదారి సౌకర్యం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు పరిష్కారానికి ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు, పంచాయతీ పాలకవర్గం సభ్యులు స్పందించి అందుబాటులో ఉన్న నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ప్రతిపాదనలు చేశాం.. పంచాయతీలో రూ.1.28 కోట్లు నిధులు అందుబాటులో ఉన్నాయి. వీటితో కొన్ని అభివృద్ధి పనులు చేసేందుకు ఇటీవల రూ.30 లక్షలతో ప్రతిపాదనలు చేశాం. టెక్నికల్ అనుమతులు వస్తే పనులు ప్రారంభిస్తాం. – బి.కోటేశ్వరరావు, పంచాయతీ ఇన్చార్జ్ ఈఓ -
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు
● జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం: పవిత్ర రంజాన్ సందర్భంగా అల్లాహ్ తన కరుణతో అందరినీ దీవించాలని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస రావు (చిన్న శ్రీను)ఆకాంక్షించారు. అందరికీ ఆరోగ్యం, శ్రేయస్సు, ప్రశాంతత లభించాలని కోరారు. రంజాన్ మాసం జీవితాల్లో వెలుగులు నింపాలనీ, ప్రేమ, శాంతి, సామరస్యాన్ని అందించాలనీ ఆకాంక్షించా రు. సోమవారం రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆయన ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలు, ప్రార్థనలతో మన హృదయాలను శుద్ధి చేసుకోవాలని, విజయానికి మార్గం సుగమం కావాల ని ఆయన అభిలషించారు. ఈకేవైసీ గడువు పెంపు పార్వతీపురం: జిల్లాలో రేషన్ కార్డుదారులు ఈకేవైసీ చేయించుకునేందుకు ప్రభుత్వం గడువు పెంచింది. ఈ మేరకు ఏప్రిల్ నెలాఖరు వరకు గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రేషన్ పంపిణీ పటిష్టంగా అమలు చేసేందుకు కార్డులో ఉన్న సభ్యులందరికీ ఈకేవైసీ ఉండాలని పేర్కొంది. ఈ మేరకు రేషన్ దుకాణాల వద్ద డీలర్లు ఈకేవైసీ చేపట్టారు. జిల్లాలో 15 మండలాల్లో 8,23,638 మంది ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉండగా ఇంకా 80 వేల మంది వరకు ఈకేవైసీ చేయించుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు. రేషన్ కార్డుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ‘పైడితల్లి’కి ఉగాది శోభ విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం ఆదివారం ఉగాది శోభను సంతరించుకుంది. ఆలయ ఇంచార్జ్ ఈఓ కెఎన్‌విడివి.ప్రసాద్ నేత్రత్వంలో అమ్మవారికి పుష్పాలంకరణలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అనంతరం అమ్మవారికి బూరెలతో నివేదన చేశారు. ఆలయమంతా పుష్పాలతోనూ, యాపిల్ పండ్లు, ద్రాక్ష పండ్లతో అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం ఉగాది పర్వదినం పురస్కరించుకుని వేదపండితులను ఘనంగా సత్కరించి వారికి నగదు పురస్కారాలను అందజేశారు. స్థానిక రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడి ఆవరణలో అమ్మవారికి నేతేటి ప్రశాంత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో వేదపండితులు రాళ్లపల్లి రామసుబ్బారావు పంచాంగ శ్రవణం చేశారు. కార్యక్రమంలో వేదపండితులు దూసి శివప్రసాద్, తాతా రాజేష్, సాయికిరణ్, నరసింహమూర్తి, దూసి కృష్ణమూర్తిలు సహకార మందించారు. రామతీర్థానికి శ్రీరామనవమి శోభ నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామతీర్థం శ్రీ రామస్వామి వారి దేవస్థానానికి శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నుంచి కల్యాణ వసంతోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. వేకువ జామున స్వామి కి సుప్రభాత సేవ, బాలభోగం తదితర కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. అనంతరం ఆస్థాన మండపంలోనికి స్వామివారిని వేచింపజేసి విశ్వక్సేరాధన, అంకురారోపణ, ఋత్విగ్వరణం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన సుమారు 40 మంది ఋత్విక్కులచే ఈ నెల 6వ తేదీ వరకు శ్రీమద్రామాయణ, సుందరకాండ, సహస్ర నామ తులసీ దళార్చన, కుంకుమార్చనలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఆ రోజు శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారాముల కల్యాణాన్ని వేడుకగా జరిపించనున్నారు. వేద రుత్విక్కులచే పారాయణాలు స్వామివారి ఆస్థాన మండపం వద్ద వివిధ ప్రాంతా ల నుంచి విచ్చేసిన రుత్విక్కులచే శ్రీమద్రామయణం, సుందరకాండ పారాయణాలు, సుదర్శన శతకం, నాలాయర దివ్య ప్రబంధ, తులసీ దళార్చన, కుంకుమార్చన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం యాగశాలలో సుందరాకాండ, గాయత్రీ రామాయణాలు, సుదర్శన శతకం హోమాలను నిర్వహించి అగ్నిప్రతిష్టాపనను గావించారు. రాత్రి 7గంటలకు స్వామివారిని రామతీర్థం తిరువీధుల్లో ఊరేగించారు. ఈఓ వై.శ్రీనివాసరావు, అర్చకులు సాయిరామాచార్యులు, నరిసింహాచార్యులు పాల్గొన్నారు. -
అందివచ్చిన కొడుకు అనంత లోకాలకు...
● మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య ● మృతుడి స్వస్థలం సాలూరు మండలం శివరాంపురంఅక్కిరెడ్డిపాలెం: ఒక్కగానొక్క కొడుకు అందివచ్చాడని ఆనందంతో ఆ తల్లిదండ్రులు ఉన్నారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో కానీ ఆ కొడుకు ఉరివేసుకున్నాడని తెలియడంతో ఆ కుటుంబం తల్లడిల్లి పోయింది. గాజువాక సీఐ ఎ.పార్థసారథి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సాలూరు మండలం శివరాంపురానికి చెందిన వసంతల యతీష్ కుమార్ (25) పరవాడలోని వసుధా ఫార్మా కంపెనీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మరో యువకుడు రాజశేఖర్‌తో కలిసి గాజువాకలోని చైతన్యనగర్‌లో సీఎంఆర్ సెంట్రల్ వెనుక ప్రాంతంలో అద్దెకు ఉంటున్నారు. శుక్రవారం ఐపీఎల్ మ్యాచ్‌ను ఇరువురూ కలిసి మద్యం సేవిస్తూ చూశారు. రాత్రి కొంత సమయం తర్వాత రాజశేఖర్ పడుకున్నాడు. అర్ధరాత్రి రాజశేఖర్‌కు మెలకువ వచ్చింది. అప్పటికే యతీష్ ఫ్యానుకు దుప్పటితో ఉరివేసుకుని వేలాడుతూ ఉన్నాడు. వెంటనే రాజశేఖర్ 112కు డయల్ చేసి ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి సీఐ పార్థసారథి సిబ్బందితో చేరుకుని వివరాలు సేకరించారు. యతీష్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. కాగా యతీష్ కుమార్ తండ్రి రామారావు వ్యవసాయం చేస్తుంటాడని, తల్లి, సోదరి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఐటీఐ చేసిన యతీష్ కుమార్ చాలీచాలని జీతం వస్తుండడంతో మనస్తాపం చెంది కొద్ది రోజులుగా మద్యం అతిగా సేవిస్తున్నాడని అతని స్నేహితులు తెలిపారు. -
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి..
● 107,108 జీఓలు రద్దు చేయాలి ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీవిజయనగరం గంటస్తంభం: విద్యారంగ సమస్యలు పరిష్కరించేంతవరకు పోరాటం చేస్తామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్‌జీ అన్నారు. శనివారం స్థానిక అమర్‌భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఐదు మెడికల్ కళాశాలలు మాత్రమే మంజూరు చేయడం సరికాదన్నారు. పైగా ఆయా కళాశాలల్లో పేదవారికి స్థానం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా మచిలీపట్నం, నంద్యాల, ఏలూరు, రాజమండ్రి, విజయనగరంలో ఏర్పాటు చేయనున్న కళాశాలల్లో 35 శాతం సీట్లు అమ్ముకునేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 107, 108 జీఓలను రద్దు చేయాలని కోరారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా సభ్యుడు ఎన్. నాగభూషణం మాట్లాడుతూ .. విజయనగరం జిల్లాలో గిరిజన యూనివర్సిటీకి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించకపోవడం అన్యాయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్మి పి.గౌరీశంకర్, ఉపాధ్యక్షుడు ఎ.సుమన్, శ్రావణ్‌కుమార్, ప్రవీణ్‌కుమార్, శంకరరావు, నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి చర్యలు
● కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పార్వతీపురం టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఎ. శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. ఇందులో భాగంగా నాలుగు ఫిర్యాదులకు సంబంధించిన విచారణను శనివారం స్థానిక కలెక్టరేట్లో చేపట్టారు. జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్ శోభిక, డీఆర్ఓ హేమలత, జిల్లా రిజిస్ట్రార్ పి. రామలక్ష్మి పట్నాయక్, జిల్లా సర్వే, భూమి రికార్డుల అధికారి పి. లక్ష్మణరావు, సంబంధిత తహసీల్దార్లు, ఫిర్యాదుదారుల సమక్షంలో విచారణ చేపట్టి, సమస్యలను పరిష్కరించారు.జాతీయ స్థాయి పోటీలకు జ్యోత్స్న విజయనగరం: గుంటూరులో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఎ. జ్యోత్స్న అద్భుత ప్రతిభ కనబరిచింది. నెహ్రూ యువకేంద్ర సంఘటన్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన డిబేట్లో ప్రథమ బహుమతి కై వసం చేసుకుని జాతీయ పోటీలకు ఎంపికై ంది. ఢిల్లీలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో కూడా రాణించాలని పలువురు ఆకాంక్షించారు. ఈ మేరకు జ్యోత్స్నను కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్, నెహ్రూ యువ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ కేవీ ఉజ్వల్ శనివారం ప్రత్యేకంగా అభినందించారు. బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్ మెంటాడ: మండలంలోని కై లాం గ్రామానికి చెందిన ఇద్దరు బెట్టంగ్ రాయుళ్లను ఆండ్ర ఎస్సై కె. సీతారామ్ శనివారం అరెస్ట్ చేశారు. ఆన్లైన్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు దాడి చేపట్టగా ఓ ఇంటిలో ఇద్దరు నిందితులు పట్టుబడ్డారు. వారి నుంచి ల్యాప్‌టాప్, పది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
గంజాయి సరఫరా చేసే వ్యక్తి అరెస్ట్
విజయనగరం క్రైమ్: మూడేళ్ల కిందట నమోదైన కేసులో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు గంజాయి సరఫరా చేసే గోపాల్ అనే వ్యక్తిని వన్‌టౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వన్‌టౌన్ సీఐ శ్రీనివాస్ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. 2022లో గంజాయి సరఫరా చేస్తూ పిపెండస్, శిశుమహర్ అనే ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. అప్పట్లో వారిపై కేసు నమోదు చేశారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు వారికి గంజాయి సరఫరా చేసిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు జిల్లా మేకవరం పంచాయతీకి చెందిన గోపాల్‌గా పోలీసులు నిర్ధారించారు. ఈక్రమంలో గోపాల్‌ను శనివారం జిల్లా కేంద్రంలో అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. 12 కిలోల గంజాయి స్వాధీనం దత్తిరాజేరు: మండలంలోని కోమటిపల్లి ఆటోస్టాండ్ సమీపంలో కొంతమంది వ్యక్తుల నుంచి రెండు చిన్న బ్యాగులలో ఉన్న సుమారు 12 కిలోల గంజాయిని పెదమానాపురం పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై ఎస్సై జయంతి వద్ద ప్రస్తావించగా.. గంజాయి స్వాధీనం చేసుకున్న మాట వాస్తవమేనని, అయితే నిందితులు తప్పించుకుపోవడంతో, వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. -
ఆర్మీ లెఫ్టినెంట్‌గా శ్రీవాత్సవ్
వీరఘట్టం: మండలంలోని నీలానగరం గ్రామానికి చెందిన పెరుమాలి శ్రీవాత్సవ్ ఆర్మీ లెఫ్టినెంట్‌గా ఎంపికయ్యాడు. ఈ మేరకు చైన్నెలోని ఆర్మీకి చెందిన ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఓటీఏ) నుంచి ట్రైనింగ్ లెటర్ వచ్చింది. ఆరు నెలల కిందట శ్రీవాత్సవ్ ఆర్మీ సర్వీస్ సెలక్షన్ బోర్డు పరీక్ష రాసి, రెండు నెలల కిందట ప్రయాగ్‌రాజ్‌లో ఇంటర్వ్యూ కూడా పూర్తి చేసుకున్నాడు. చైన్నెలో ట్రైనింగ్ పూర్తి చేస్తే లెఫ్టినెంట్ హోదాలో ఆర్మీలో సేవలందించనున్నాడు. ఇతని తండ్రి సింహాచలం పోలీస్‌శాఖలో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుండగా.. తల్లి సునీత పాలకొండలోని ఓ ప్రైవే ట్ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఇదీ నేపథ్యం.. శ్రీవాత్సవ్ నీలానగరంలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుకున్నాడు. ఆరు నుంచి 12 వరకు విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక్ స్కూల్లో చదువుకున్నాడు. రాజాం జీఎంఆర్‌లో బీటెక్ పూర్తి చేశాడు. లెఫ్టినెంట్‌గా ఎంపిక కావడంతో గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు. -
టీడీపీలో వర్గపోరు..
రామభద్రపురం: టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీలో నెలకొన్న వర్గపోరు బయటపడింది. ఈ క్రమంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం శనివారం వేర్వేరుగా జరుపుకున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చింతల రామకృష్ణ ఒక వర్గం గాను... టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండక తిరుపతినాయుడు, స్థానిక ఎంపీటీసీ సభ్యులు వసంతుల తిరుపతిరావు, బవిరెడ్డి చంద్ర మరో వర్గంగా విడిపోయారు. మండల కేంద్రంలో ఉన్న పార్టీ కార్యాలయానికి కూడా మండక తిరుపతినాయుడు రాని పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే బేబీనాయన, పార్టీ మండల అధ్యక్షుడు కరణం భాస్కరరావు ఇరువర్గాలను కలిపేందుకు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇటీవల జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికలలో కూడా వైఎస్సార్సీపీ పోటీ చేయకపోయినా టీడీపీలో రెండు వర్గాలు పోటీ చేశాయి. పీఏసీఎస్ చైర్మన్ పదవికి ఎవరి ప్రయత్నం వారు చేసుకుంటున్నారు. పదవుల పందేరం జరిగితే పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి మరింత బహిర్గతమయ్యే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో మండల కేంద్రంలో పార్టీ కార్యాలయం ఉన్నప్పటికీ..రాజాం రూట్లో మరో కార్యాలయం ప్రారంభించి టీడీపీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడకు వెళ్లాలో తెలియక తలలు పట్టుకున్నారు. వేర్వేరుగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం -
గర్జించిన గిరిజనం
–8లోమా వాళ్లే.. ఉద్యోగం ఇచ్చేయ్.. కూటమి నేతలు అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరించి అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ ఇతరులను ఇబ్బంది పెడుతున్నారు. ఆదివారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2025సీతంపేట/పార్వతీపురం: కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలవుతున్నా ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలుచేయకపోవడం, గిరిజన సంక్షేమాన్ని పట్టించుకోకపోవడంపై గిరిజనులు గర్జించారు. ర్యాలీగా వచ్చి సీతంపేట, పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయాలను శనివారం ముట్టడించారు. అక్కడే బైఠాయించి ఆందోళనకు దిగారు. పార్వతీపురంలో ఐటీడీఏ చాంబర్ వద్దనే ధర్నా చేశారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను దుమ్మెత్తి పోశారు. అనంతరం సమస్యలు పరిష్కరించాలంటూ సీతంపేట, పార్వతీపురం ఐటీడీఏ ఏపీఓలు చిన్నబాబు, మురళీధర్‌లకు వినతిపత్రాలు అందజేశారు. ఆందోళనలో పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు ఎం.తిరుపతిరావు, ఎం.లక్షణరావు, సీదారాపు అప్పారావు, ఎం.కృష్ణమూర్తి, వాసు, సీతారాం, రామారావు, రాము, సోములు, అనిల్, కె.సాంబమూర్తి, రాజశేఖర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే వచ్చేనెల 15న ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. డిమాండ్లు ఇవీ... ● ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలి. ● అటవీ ఉత్పత్తులను జీసీసీ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి. కొత్తగా చెక్‌డ్యాంలు, చెరువులు నిర్మించాలి. ● గిరిజన గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారించాలి. ● సీతంపేట వంద పడకల ఆస్పత్రి వద్ద భవన నిర్మాణ పనులు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి. ● గిరిజనులు పండిస్తున్న జీడి, చింతపండు, చీపురు తదితర పంటలకు మద్దతు ధర కల్పించాలి. ● కురుపాం, సాలూరు, సీతంపేట మండలాల్లో జీడి పిక్కల పరిశ్రమను, ప్రాసెసింగ్ సెంటర్‌ను ఏర్పాటుచేయాలి. 80 కిలోల జీడి పిక్కల బస్తాను రూ.16 వేలుకు కొనుగోలు చేయాలి. ● గిరిజన గ్రామాలకు తాగునీరు, బస్సు, రోడ్ల సదుపాయం కల్పించాలి. గిరిజనులు సాగుచేసిన పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. ● గిరిజన యువత ఉన్నత విద్యకు పీజీ, డైట్, ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయాలి. ● కురుపాం, సాలూరు మండల కేంద్రాల్లో వంద పడకల ఆస్పత్రులు ఏర్పాటు చేయాలి. ● 3,4, 5 తరగతుల విద్యార్థులకు చదువును దూరం చేసే మోడల్ స్కూల్ పాఠశాల విధానాన్ని నిలుపుదల చేయాలి. అటవీ ఉత్పత్తులు కొనుగోలు వేగవంతం చేయాలి పార్వతీపురం: గిరిజనుల ఆందోళనపై పార్వతీపురం ఐటీడీఏ పీఓ అశోతోష్ శ్రీవాస్తవ స్పందించారు. జీసీసీ ఆధ్వర్యంలో అటవీ ఉత్పత్తుల కొనుగోలును వేగవంతం చేయా లని, మద్దతు ధర చెల్లించాలని శనివారం ఓ ప్రకటనలో అధికారులను ఆదేశించారు. న్యూస్‌రీల్ -
విద్యార్థి మృతిపై నివేదిక ఇవ్వండి
పార్వతీపురం టౌన్: సీతంపేట ఐటీడీఏ పరిధి దోనుబాయి ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు ఆదేశించారు. విద్యార్థి సవర చలపతిరావు పాఠశాలలో 9వ తరగతి చదువుతూ మంచం పైనుంచి పడి శుక్రవారం మృతి చెందిన విషయమై సంబంధిత అధికారులతో డీవీజీ శనివారం మాట్లాడారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సబ్‌జైల్ ఆకస్మిక తనిఖీ విజయనగరం లీగల్: జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ (న్యూ ఢిల్లీ) ఉత్తర్వుల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి జిల్లా కేంద్రంలోని సబ్ జైల్‌ను శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా న్యాయ అవగాహన సదస్సు నిర్వహించి ఖైదీలకు చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం సబ్ జైల్లో కొనసాగుతున్న జైల్ లీగల్ ఎయిడ్ క్లినిక్‌లను పరిశీలించారు. జైల్లో ఉన్న ముద్దాయిలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ముఖ్య కర్తవ్యమని చెప్పారు. అలాగే వంటగదిని పరిశీలించారు. పరిశీలనలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెనన్స్ కౌన్సిల్ కె. సూర్య ప్రకాష్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ డి. సీతారాం, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పీబీఎస్ సాయి పవిత్ర, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సూపరింటెండెంట్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిబ్బంది పాల్గొన్నారు. మెడికల్ ఏజెన్సీ లైసెన్స్ రద్దు ● మరో పది మెడికల్ షాపుల లైసెన్స్‌లను తాత్కాలికంగా నిలిపివేత విజయనగరం ఫోర్ట్: నిబంధనలు అతిక్రమించిన ఓ మెడికల్ ఏజెన్సీ లైసెన్స్‌ను రద్దు చేయడంతో పాటు మరో పది మెడికల్ దుకాణాల లైసెన్స్‌లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఔషధ నియంత్రశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె. రజిత తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. ఆపరేషన్ గరుడలో భాగంగా కొద్ది రోజుల కిందట జిల్లాలో పలు మెడికల్ షాపులను (మందుల దుకాణాలు) విజిలెన్స్, ఔషధ నియంత్రణశాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారని చెప్పారు. ఈ క్రమంలో పది మెడికల్ షాపుల్లో కాలం చెల్లిన మందులు ఉన్నాయని, అదేవిధంగా జిల్లా కేంద్రంలోని రత్నం ఫార్మాస్యూటికల్స్ ఏజెన్సీలో కాలం చెల్లిన మందులు అధిక మొత్తంలో ఉండడంతో పాటు డాక్టర్ ప్రిస్కప్షన్ లేకుండా మత్తు కలిగించే దగ్గు మందులు విక్రయస్తున్నట్లు గుర్తించామన్నారు.దీంతో ఏజెన్సీ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న పది మందుల షాపుల లైసెన్స్‌లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు చెప్పారు. అప్రమత్తంగా ఉండండి నెల్లిమర్ల: ఈవీఎం గొడౌన్ భద్రతపై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. మండల కేంద్రంలోని గొడౌన్‌ను శనివారం ఆయన సందర్శించారు. షట్టర్లకు వేసిన సీళ్లను తెరిపించి, లోపల గదుల్లో ఉంచిన ఈవీఎంలను పరిశీలించారు. అనంతరం దగ్గరుండి సీళ్లు వేయించారు. పరిశీలనలో డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, ఆర్డీఓ డి.కీర్తి, తహసీల్దార్ సుదర్శనరావు, ఎన్నికల సూపరింటెండెంట్ భాస్కరరావు, ఇతర రెవెన్యూ సిబ్బంది, రాజకీయ పార్టీల ప్రతినిధులు సముద్రపు రామారావు పాల్గొన్నారు. -
● విశ్వావసుకు స్వాగతం
ఇంటి ముంగిట మామిడి తోరణాలు... రైతన్నల ఏరువాక సన్నాహాలు... వేద పండితుల పంచాంగ శ్రవణాలు.. కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుట్టే ఉగాది పర్వదినం అందరిలోనూ సంతోషం నింపాలి. కోయిల గానంలా ప్రతి ఒక్కరి జీవితం సాగిపోవాలి. ప్రతి ఇంటా ఉగాది వేడుకగా సాగాలి. మామిడి పచ్చడిలోని షడ్రుచుల సమ్మేళనమే జీవితమని గుర్తెరిగి సాగిపోవాలి. చైత్రమాసపు చెలిౖమై వచ్చిన తెలుగు సంవత్సరాదికి విజయనగరం జిల్లా కేంద్రంలోని నర్తనశాల డ్యాన్స్ అకాడమీ చిన్నారులు సంప్రదాయబద్ధంగా శనివారం ముందస్తు స్వాగతం పలికారు. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం -
మా వాళ్లే.. ఉద్యోగం ఇచ్చేయ్..
● కూటమి నాయకుల అధికార దర్పం.. ● లక్కిడాం పీఏసీఎస్‌లో ఇద్దరికి ఉద్యోగాలు ● నిబంధనల ప్రకారం కుదరదన్న ఉద్యోగులు ● వారిపై ఒత్తిడి తీసుకువచ్చిన మంత్రి బంధువుగంట్యాడ: కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ ఇతరులను ఇబ్బంది పెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయాలని అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీంతో అధికారుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందాన తయారైంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేమని ఎవరైనా చెబితే.. ఏం మా మాట అంటే లెక్కలేదా అని బెదిరింపులకు దిగుతున్నారు. మంత్రి బంధువు రుబాబు.. గంట్యాడ మండలంలోని లక్కిడాం సొసైటీ (ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం) లో పని చేయడానికి ఇద్దరు వ్యక్తులను కూటమి నేతలు పంపించారు. వాస్తవంగా సొసైటీలో వారి అవసరం లేకపోయినా పంపించారు. తమకు సరిపడా సిబ్బంది ఉన్నారని సొసైటీ అధికారులు చెప్పినా కూటమి నేతలు పట్టించుకోవడం లేదు. వారిని తీసుకుంటారా లేదా అని తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్నారు. ఇప్పడు ఏకంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బంధువు ఒకరు రంగప్రవేశం చేసి ఆ ఇద్దరినీ సొసైటీ ఉద్యోగులుగా పరిగణిస్తూ తీర్మానం చేయాలని సొసైటీ అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీఎల్ఈసీ ఆమోదం తప్పనిసరి డిస్ట్రిక్ట్ లెవిల్ ఎంపవర్డ్ కమిటీ (డీఎల్ఈసీ) ఆమోదం లేకుండా ఎటువంటి నియామకాలు చేపట్టకూడదని 2019లో ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా కమిటీ ఆమోదం లేకుండా నియమకాలు చేపడితే వారిని తొలగించే అధికారం కమిటీకి ఉంటుంది. నోటిఫికేషన్ లేకుండా నియామకాలు.. ఏదైనా సంస్థలో ఖాళీలు ఏర్పడితే నిబంధనల ప్రకారం ఆయా ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి. రాత పరీక్ష గాని, మెరిట్ ఆధారంగా గాని నియామకాలు చేపట్టాలి. కాని కూటమి నాయకులు తమ మాటే నిబంధన అన్నట్లు వ్యవహరిస్తున్నారు. లక్కిడాం సొసైటీ వ్యవహారంలో కూటమి నేతలు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా ఆరోపణులు వినిపిస్తున్నాయి. ఇప్పటికే లక్కిడాం సొసైటీ నష్టాల్లో ఉన్నట్టు ఆరోపణులు వినిపిస్తున్నాయి. అవసరం లేకపోయినా ఉద్యోగులను నియమిస్తే వారికే ఇచ్చే జీతాల వల్ల సొసైటీ మరింత నష్టాల్లోకి వెళ్లే అవకాశం ఉంది. నా దృష్టికి వచ్చింది.. 2019 హెచ్ఆర్ పాలసీ ప్రకారం సొసైటీకి ఒక డీఈఓ ఉండాలి. లక్కిడాం సొసైటీకి ప్రస్తుతం ఒకరున్నారు. మరో ఇద్దరి కోసం సొసైటీలో తీర్మానం చేయాలన్న విషయం తన దృష్టికి వచ్చింది. సర్వేలు, ఇతర అవసరాల కోసం సిబ్బంది అవసరం అనుకుంటే ఎన్ని రోజులు అవసరమో అన్ని రోజులకు మాత్రమే తీసుకోవాలి. అటువంటి వారికి రోజువారీ వేతనం చెల్లించవచ్చు. పి. రమేష్, జిల్లా సహకార అధికారి -
అప్రమత్తతే ప్రధానం
పార్వతీపురంటౌన్: వేసవి కాలంలో ప్రజారోగ్యంపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా వైద్యరోగ్యశాఖ అధికారి డాక్టర్ భాస్కరరావు ఆదేశించారు. స్థానిక ఆరోగ్య కార్యాలయం నుంచి జూమ్ కాన్షరెన్స్‌లో వైద్యాధికారులు, 108 సిబ్బందికి శనివారం పలు సూచనలిచ్చారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ప్రాథమిక, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉండాలన్నారు. బుధ, శని వారాల్లో నిర్వహించే టీకా కార్యక్రమాన్ని ఉదయం త్వరగా ప్రారంభించాలన్నారు. ఆస్పత్రుల్లో విద్యుత్ అంతరాయం లేకుండా ఇన్వెర్టర్, బ్యాటరీల పనితీరు గమనించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి డాక్టర్ టి.జగన్మోహనరావు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ భాస్కరరావు -
మాటిచ్చి.. మాయచేశారు..!
అధికారంలోకి వచ్చిన వెంటనే రైతన్నలకు రూ.20వేలు పెట్టుబడి సాయం అన్నారు.. తుస్‌మనిపించారు. అమ్మఒడిని కాస్త తల్లికి వందనంగా పేరుమార్చి.. ఏడాదిగా ఏమార్చారు. చేనేత కార్మికుడు సాయం అడిగితే.. రిక్తహస్తం చూపిస్తున్నారు. నిరుద్యోగ భృతిపై ప్రశ్నించిన యువతపై.. కన్నెర్రచేస్తున్నారు. ఉగాది సాక్షిగా వలంటీర్లను కొనసాగిస్తామని... జీతం రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీని.. తుంగలోకి తొక్కిన కూటమి ప్రభుత్వం తీరుపై జనం భగ్గుమంటున్నారు. చంద్రబాబు అండ్ కో తీరుతో జిల్లాలోని 530 సచివాలయాల పరిధిలోని 8,774 వలంటీరు కుటుంబాలు ఉపాధిలేక రోడ్డున పడ్డాయని వాపోతున్నారు. ఉగాది వేళ గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వలంటీర్లకు అందజేసిన ప్రోత్సాహకాలను తలచుకుని ప్రస్తుత ప్రభుత్వ తీరును దుమ్మెత్తి పోస్తున్నారు. – పార్వతీపురంటౌన్● ఆశ చూపి.. పొట్టకొట్టిన కూటమి ● గౌరవవేతనం రూ.10 వేలకు పెంచుతామంటూ గతేడాది ఉగాది రోజున ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు ప్రకటన ● ఎవరినీ తొలగించం అంటూ హామీ ● అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవస్థను నిర్వీర్యం చేసిన వైనం ● రోడ్డున పడిన 5,638 మంది వలంటీరు కుటుంబాలుజగనన్న ఉంటే బాగుండేది. గతంలో జగనన్న ప్రభుత్వంలో వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి గ్రామాల్లో ప్రజలకు సేవలందించే అవకాశం కల్పించారు. ఉత్తమ సేవలు అందించిన వలంటీర్లకు సేవారత్న, సేవామిత్ర పురస్కారాలను అందించేవారు. రెట్టింపు ఉత్సాహంతో విధులు నిర్వహించేవాళ్లం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వలంటీర్ల వ్యవస్థను రద్దుచేశారు. మాకు అన్యాయం చేశారు. – సౌజన్య, వలంటీర్, పార్వతీపురం పట్టణంనమ్మించి మోసం చేశారు కూటమి నేతలు ఎన్నికల ముందు వలంటీరుకు రూ.10వేలు వేతనం అందజేస్తామని హామీ ఇచ్చారు. తీరా అధికారం చేపట్టిన తరువాత రెట్టింపు చేయడం పక్కన పెడితే వలంటీర్ వ్యవస్థనే తీసేశారు. ఏటా ఉగాది సమయానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సేవా మిత్ర, సేవా వజ్ర, సేవారత్న పురస్కారాలతో గౌరవించేది. కూటమి ప్రభుత్వం వలంటీర్లను పూర్తిగా మోసం చేసింది. – ఎస్.అనిల్, వలంటీర్, పార్వతీపురం పట్టణంఅంతన్నారు... ఇంతన్నారు... ఎన్నికల ముందు కూటమి నేతలు అధికారంలోకి వస్తే అంత చేస్తాం.. ఇంతచేస్తాం అంటూ నమ్మించారు. అధికారం చేపట్టాక ప్రజాసంక్షేమాన్ని పక్కనపెట్టాను. అన్నివర్గాల ప్రజలకు క్షోభ మిగిల్చారు. వలంటీర్ జీతంతో బతికే మాలాంటి కుటుంబాలకు అన్యాయం చేశారు. మా ఉసురు తప్పకుండా తగులుతుంది. – సాయి గణేష్, వలంటీర్, పార్వతీపురం పట్టణం -
మాదకద్రవ్యాల రవాణాపై డ్రోన్లతో నిఘా‘
● కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్పార్వతీపురంటౌన్: జిల్లాలో మాదకద్రవ్యాల రవాణా, విక్రయాల నియంత్రణకు డ్రోన్లతో నిఘా పెట్టామని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ పోలీస్ అధికారులకు సూచించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన జిల్లా మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. సారా తయారీని పూర్తిగా నిర్మూలించాలని సూచించారు. అసైన్డ్ భూముల్లో ఎవరైనా సారా తయారుచేస్తే వారి భూ పట్టాలు రద్దుచేస్తామని హెచ్చరించారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని, ఎకై ్సజ్ శాఖ పనితీరు మెరుగుపడాలన్నారు. అటవీ ప్రాంతాల్లో సారా తయారీ, అమ్మకాలు జరగకుండా పర్యవేక్షణ జరగాలని అటవీశాఖ అధికారి ప్రసూన తెలిపారు. ఎస్పీ ఎస్.వీ.మాధవ్ రెడ్డి మాట్లాడుతూ గత నెల జిల్లాలో 288 కిలోల గంజాయి స్వాధీ నం చేసుకున్నట్లు తెలిపారు. 394 పాఠశాలలు, కళాశాలలో ఈగల్ క్లబ్‌లు ఏర్పాటు చేశామని వివరించారు. ప్రతిరోజూ డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. నిరంతర నిఘా జిల్లా డ్రగ్ కంట్రోల్ అధికారి బి.ఆశ మాట్లా డుతూ పార్వతీపురం పట్టణంలో 4 మందుల దుకాణాలపై దాడులు నిర్వహించామని, 3 దుకాణాలు నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరపడాన్ని గుర్తించామని, వాటిలైసెన్సులు రద్దు చేస్తామన్నారు. జిల్లా ఎకై ్సజ్ అధికారి శ్రీనాథుడు మాట్లాడుతూ 168 గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించామని, 74 గ్రామాల్లో గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటుచేసినట్టు వివరించారు. అనంతరం ఈగల్ టీమ్ అవగాహన కార్యక్రమాల పోస్టర్‌ను అధికారులు ఆవిష్కరించా రు. కార్యక్రమంలో ఏఎస్పీ అంకిత సురానా, ఎస్డీసీ సి.రామచంద్రా రెడ్డి, పాలకొండ డీఎస్పీ ఎ.రాంబాబు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ ఇంజిన్ కింద పడి వ్యక్తి మృతి
బొబ్బిలి రూరల్: మండలంలోని సీహెచ్ బొడ్డవలస పంచాయతీ పరిధి కేశాయవలస గిరిజన గ్రామంలో టేకు మొక్కలకు నీళ్లుపోస్తున్న వాటర్ ట్యాంకు ట్రాక్టర్ బోల్తా పడడంతో ట్రాక్టర్ ఇంజిన్ కింద పడి, పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం కాశీపేట గ్రామానికి చెందిన పెదిరెడ్డి పోలిరాజు(58)మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కేశాయవలస గ్రామానికి చెందిన కొండగొర్రె నీలమ్మ పొలంలో టేకు మొక్కలకు నీళ్లు పోసేందుకు వాటర్ట్యాంకర్తో వెళ్తున్న పోలిరాజు పొలంలో ఎత్తుపల్లాలను గమనించకపోవడంతో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో పోలిరాజు ట్రాక్టర్ కింద పడగా అక్కడికక్కడే మృతిచెందాడని సీఐ సతీష్‌కుమార్ తెలిపారు. మృతుడి కుమారుడు సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు ఎస్సై జ్ఞానప్రసాద్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సీహెచ్‌సీకి తరలించామని సీఐ తెలిపారు.మృతుడు పోలిరాజుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి..భామిని: మండలం పసుకుడికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి మువ్వల జయరాం(18) శుక్రవారం శ్రీకాకుళంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడినట్లు బత్తిలి ఎస్సై డి.అనిల్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఘటనపై ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇటీవల జయరాం ఇంటర్మీడియట్ సెకెండియర్ పరీక్షలు భామినిలో రాశాడు. పరీక్షల అనంతరం సరదాగా గడుపుతున్న జయరాం ఈ నెల 2న పసుకుడి నుంచి లివిరి డోలోత్సవ యాత్రకు స్నేహితులతో కలిసి బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదంజరిగి తీవ్రగాయాలపాలయ్యడు. వెంటనే 108 అంబులెన్సు లో కొత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించి శ్రీకాకుళంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బత్తిలి ఏఎస్సై కొండగొర్రి కాంతారావు ఆద్వర్యంలో కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. మృతుడికి తల్లిదండ్రులతో పాటు ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. పసుకుడిలో జరిగిన అంతిమ సంస్కారంలో తోటి విద్యార్థులు, టీచర్లు, బంధువులు పాల్గొని జయరాంకు ఘనంగా నివాళులు అర్పించారు. అనుమానాస్పద స్థితిలో యువతి..సాలూరు రూరల్: మండలంలోని మర్రివానివలస గ్రామానికి చెందిన వాకాటి ఐశ్వర్య (20) చీపురువలస గ్రామసమీపంలో మామిడితోటలో అనుమానాస్పద స్థితిలో చెట్టుకు ఉరివేసుకుని మృతి చెంది ఉన్నట్లు రూరల్ ఎస్సై నరసింహమూర్తి తెలిపారు. ఈ మేరకు ఆయన చెప్పిన సమాచారం ప్రకారం విశాఖపట్నంలోని ఒక బట్టల షాపులో పనిచేస్తున్న ఆమె ఇటీవల ఇంటికి వచ్చి రెండురోజుల క్రితం పనికి వెళ్లింది. శుక్రవారం చీపురువలస గ్రామసమీపంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పోలీస్ సిబ్బంది సమస్యలకు ఒకరోజు
● వెల్ఫేర్డేలో విజ్ఙాపనలు స్వీకరించిన ఎస్పీ విజయనగరం క్రైమ్: పోలీస్‌శాఖలో పనిచేస్తున్న సిబ్బంది ఎదుర్కొంటున్న, ఎదురవుతున్న అనుభవిస్తున్న సమస్యలకు పరిష్కారం చూపించనున్నట్లు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలోని తన చాంబర్లో శుక్రవారం పోలీస్ వెల్ఫేర్ డేను ఎస్పీ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా పోలీస్‌శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఎస్పీ వకుల్ జిందల్ విజ్ఞాపనలు స్వీకరించి చర్యలు చేపట్టారు. లివిరి సమీపంలో ఏనుగుల గుంపుభామిని: మండలంలో ఏనుగుల గుంపు అలజడి సృష్టిస్తోంది. శుక్రవారం మండలంలోని లివిరి పంట పొలాల్లో నాలుగు ఏనుగుల గుంపు ప్రవేశించి పంటలు నాఽశనం చేస్తున్నాయి. వంఽశదార నదీ తీరం వెంబడి ఏనుగుల గుంపు ప్రయాణం కొనసాగుతోంది. భామిని గ్రామంలోకి ఏనుగుల గుంపు ప్రవేశిస్తుందని మండల కేంద్రం రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో ఏనుగులు గుంపు పంటలన్నీ పాడుచేస్తున్నప్పటికీ అధికార కూటమి నాయకులు ఇచ్చిన హామీ మరిచి మౌనం వహించడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పిచ్చి కుక్క కరిచి 9 మందికి గాయాలువీరఘట్టం: స్థానిక మేజర్ పంచాయతీలోని బార్నాలవీధి రోడ్డులో శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో పిచ్చికుక్క స్వైర విహారం చేయడంతో జనం భయంతో పరుగులు తీశారు. ఆ వీధిలో నడుచుకుంటూ వచ్చిన 9 మందిపై పిచ్చి కుక్క దాడి చేయడంతో వారంతా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కోట శ్రీరాములు, జి.నాగరాజు, ఎం.ధరణి, సుజాత, జి.పార్వతి, పి.రామిశెట్టి, కె.గంగులు, బి.ధర్మారావు, కె.రవి ఉన్నారు. వారందరికీ వీరఘట్టం ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించారు. వారిలో నలుగురికి తీవ్రంగా గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. రెండు బైక్‌లు ఢీకొని యువకుడు మృతి వేపాడ: మండలంలోని కొత్త బొద్దాం జంక్షన్లో గురువారం అర్ధరాత్రి రెండు బైక్‌లు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా నలుగురు గాయాలపాలయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఎస్.కోట నుంచి ఎల్.కోట వైపు ద్విచక్రవాహనం వెళ్తుండగా ఎల్.కోట నుంచి ఎస్.కోట వైపు వెళ్తున్న మరో ద్విచక్రవాహనం కొత్త బొద్దాం జంక్షన్ దగ్గర ఢీకొన్నాయి. దీంతో ప్రమాదంలో రెండు వాహానాలపై ఉన్న ఐదుగురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఎస్.కోట నుంచి ఎల్.కోట వైపు వెళ్తున్న వాహనచోదకుడు బసవబోయిన కార్తీక్ (19) మృతిచెందాడు. ఎస్.కోట కోటవీధికి చెందిన కార్తీక్‌కు తల్లిదండ్రులు, సోదరి ఉన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై బి.దేవి తెలిపారు. -
గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలల ఏర్పాటుకు వినతి
విజయనగరం అర్బన్: ఉమ్మడి విజయనగరం జిల్లాలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను అదనంగా ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరావుకు ఉపాధ్యాయులు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. జిల్లాలో గిరిజన బాలికల కోసం కేవలం రెండే రెండు ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయన్నారు. దీనివల్ల ఆ పాఠశాలల్లో ఉన్న సీట్లు భర్తీ అయిపోతే చదువుకోవాలనుకుంటున్న బాలికలు విద్యకు దూరమవుతున్నారని తెలియజేశారు. వినతిని స్వీకరించిన చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరావు మాట్లాడుతూ విద్య ప్రాథమిక హక్కు అని, పిల్లలు అందరూ చదువుకునేలా చూడాల్సి బాధ్యత అందరి మీదా ఉందన్నారు. జిల్లాలోని సమస్యను ప్రభుత్వానికి నివేదించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. -
శాశ్వత లోక్ అదాలత్‌ను వినియోగించుకోండి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి విజయనగరం లీగల్: శాశ్వత లోక్ అదాలత్‌ను ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటే ఇరుపార్టీలకు మేలు చేస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికల్యాణ్ చక్రవర్తి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఉత్తర్వుల మేరకు శుక్రవారం జిల్లా కోర్టు ఆవరణలో పాలీగల్ వలంటీర్స్‌కు, శాశ్వత లోక్ అదాలత్ ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్, విశ్రాంత జిల్లా న్యాయమూర్తి జి.దుర్గయ్య మాట్లాడుతూ శాశ్వత లోక్ అదాలత్‌లో వ్యాజ్యం వేయడం వల్ల ఎటువంటి కోర్టు ఫీజు ఉండదన్నారు. దీనిమీద తీర్పు చెప్పనున్నారని, ఇక్కడ తీర్పు చెప్పిన మీదట దానికి ఆపీల్ ఉండదని స్పష్టం చేశారు. హాజరైన పారా లీగల్ వలంటీర్స్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ వలంటీర్స్ అందరూ శాశ్వత లోక్ అదాలత్ గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఇన్చార్జి కార్యదర్శి బీహెచ్‌వీ లక్ష్మీకుమారి, శాశ్వత లోక్ అదాలత్ సిబ్బంది, పారా లీగల్ వలంటీర్స్ పాల్గొన్నారు. -
ఇదీ యంత్రాంగం తీరు..!
● కూటమి నేతల సిఫారసు ఉంటేనే వ్యవసాయ యంత్రాల మంజూరు ● కూటమి ఆదేశాలు అధికారులు అమలు చేస్తున్నారనే ఆరోపణలువిజయనగరం ఫోర్ట్: ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రంధి దేముడు. ఈయనది గంట్యాడ మండలంలోని పెదవేమలి గ్రామం. వ్యవసాయ యంత్ర పనిముట్లు రాయితీపై ఇస్తామని రైతు సేవా కేంద్రం సిబ్బంది చెప్పడంతో దుక్కిసెట్టు కోసం దరఖాస్తు చేశాడు. దుక్కిసెట్టు నిమిత్తం రైతు కట్టాల్సిన వాటాను చెల్లించడానికి రైతు సేవా కేంద్రం సిబ్బందిని అడిగితే మీకు దుక్కి సెట్టు మంజూరు చేయలేం అని తేల్చి చెప్పడంతో మిన్నుకుండిపోయాడు. ఈ పరిస్థితి ఈ ఒక్క రైతుదేకాదు. జిల్లాలోని అనేక మంది రైతులది. అందరికీ అన్నం పెట్టే రైతులతో కూటమి నేతలు రాజకీయాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యంత్ర పరికరాల కోసం దరఖాస్తు చేసిన రైతులు ఏపార్టీ వారా? అని అరా తీస్తున్నారు. కూటమి పార్టీకి చెందిన రైతులైతే వారికి యంత్ర పరికరాల మంజూరుకు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. తటస్థంగా ఉండే రైతులైతే వారికి యంత్ర పరికరాలు మంజూరు చేయవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు కూడా అధికార పార్టీకి చెందిన నేతల ఆదేశాలను తు.చ తప్పకుండా అమలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీకు తెలియంది ఏం ఉంది? అధికార పార్టీ నేతలు చెప్పినట్లు చేయాల్సిందే కదా అంటూ వ్యవసాయ శాఖకు చెందిన ఓ అధికారి వాఖ్యానించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కూటమి నేతల వ్యవహార శైలి తెలిసిన చాలామంది రైతులు యంత్ర పరికరాల కోసం దరఖాస్తు చేయలేదు. దరఖాస్తు చేసినా కూటమి నేతలు మంజూరు కానివ్వరనేది రైతుల భావన. 456 మంది దరఖాస్తు వ్యవసాయ యంత్ర పరికరాల కోసం రైతులు జిల్లావ్యాపంగా 456 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వాటికి సంబంధించి కూటమి నేతలు చెప్పి న లబ్ధిదారుల జాబితాను అధికారులు సిద్ధం చేసిన ట్లు తెలిసింది. 50 శాతం రాయితీపై యంత్ర పరికరాలు ఇవ్వనున్నారు. దుక్కి సెట్లు, మోటార్ స్ప్రేయర్స్, పవర్ టిల్లర్స్, బ్రష్ కట్టర్స్, పవర్వీటర్స్, రోటోవీడర్స్ యంత్ర పరికరాలు ఇవ్వనున్నారు. వ్యవసాయ యంత్ర పరికరాల రాయితీకి సంబంధించి ప్రభుత్వం జిల్లాకు రూ.2.50 నిధులు కేటా యించినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారుదరఖాస్తులు పరిశీలించి మంజూరు జిల్లాలో యంత్ర పరికరాల కోసం 456 మంది దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తులను పరిశీలించి యంత్ర పరికరాలు మంజూరు చేయనున్నాం. వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారి -
సెంట్రల్ జీఎస్టీ ఇన్స్పెక్టర్లుగా తెర్లాం యువకులు
తెర్లాం: జిల్లాలోని తెర్లాం మండలం, తెర్లాం పంచాయతీ పరిధిలోని చిన్నయ్యపేట గ్రామానికి చెందిన చింత జ్యోతిస్వరూప్, తెర్లాం మండల కేంద్రానికి చెందిన చిప్పాడ హరీష్‌లు ఇటీవల జరిగిన ఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షలో మంచి ప్రతిభ కనబరిచి సెంట్రల్ జీఎస్టీ ఇన్స్పెక్టర్లుగా ఎంపికయ్యారు. ఆ యువకుల నేపథ్యం ఇలా ఉంది. చింత జ్యోతిస్వరూప్:. చిన్నయ్యపేట గ్రామానికి చెందిన చింత శంకరరావు, అరుణల కుమారుడు. విశాఖపట్నంలోని గాయత్రి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. ఇటీవల జరిగిన ఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షలో 390 మార్కులకుగాను 350 మార్కులు సాధించి ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 836వ ర్యాంక్ సాధించి సెంట్రల్ జీఎస్టీ ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యాడు. జ్యోతిస్వరూప్ తండ్రి శంకరరావు విశాఖపట్నంలోని ఓ కోచింగ్ సెంటర్లో రీజనింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తుండగా తల్లి అరుణ గృహిణి. కుమారుడు జ్యోతిస్వరూప్ జీఎస్టీ ఇన్స్పెక్టర్గా ఎంపిక కావడంపట్ల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిప్పాడ హరీష్.. తెర్లాం గ్రామానికి చెందిన చిప్పాడ రమణ, మంగరత్నంల కుమారుడు. హరీష్ ప్రస్తుతం చైన్నెలో ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్లో టాక్స్ అసిస్టెంట్‌గా ఏడాదిన్నగా పనిచేస్తున్నాడు. ఇటీవల జరిగిన ఎస్ఎస్సీ సీజీఎల్ ప్రవేశ పరీక్షకు హాజరై 390మార్కులకుగాను 346మార్కులు సాధించి ఆలిండియా ఓబీసీ కేటగిరీలో 1602 ర్యాంక్ కై వసం చేసుకుని సెంట్రల్ జీఎస్టీ ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యాడు. హరీష్ తండ్రి రమణ మండలంలోని పణుకువలస ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తుండగా, తల్లి మంగరత్నం తెర్లాంలోని శ్రీవేంకటేశ్వర విద్యాసంస్థల కరస్పాండెంట్. కుమారుడు హరీష్ సెంట్రల్ జీఎస్టీ ఇన్స్పెక్టర్గా ఎంపిక కావడంపట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తంచేశారు. చిన్నయ్యపేటకు చెందిన జ్యోతిస్వరూప్ తెర్లాంకు చెందిన హరీష్ ఎంపిక -
క్షయ నిర్ధారణ పరీక్షల్లో దేశంలోనే జిల్లా టాప్
విజయనగరం ఫోర్ట్: క్షయవ్యాధి నియంత్రణలో విజయనగరం జిల్లాకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. క్షయ వ్యాధి నియంత్రణ ప్రత్యేక వందరోజుల ఉద్యమంలో దేశంలోనే అత్యధిక క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసిన జిల్లాగా గుర్తింపు పొందింది. క్షయవ్యాధి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం దేశంలోని 347 జిల్లాల్లో వంద రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని గత ఏడాది డిసెంబర్ 7న ప్రారంభించింది. ఈ ఉద్యమంలో భాగంగా రాష్ట్రంలో విజయనగరం జిల్లా వంద రోజుల టీబీ నియంత్రణ కార్యక్రమానికి ఎంపికై ంది. దీనిలో భాగంగా క్షయవ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, క్షయవ్యాధి లక్షణాలు కలిగి ఉన్న వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు జిల్లాలో చేపట్టారు. వంద రోజుల కార్యక్రమానికి ఎంపికై న 347 జిల్లాల అన్నింటిలో విజయనగరం జిల్లాలో అత్యధికంగా 45,195 క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి దేశంలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ వెల్లడించారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా మార్చి 24న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ జేపీ నడ్డా నుంచి క్షయ నియంత్రణపై విజయనగరం జిల్లాకు చెందిన కేంద్ర బృందం ప్రతినిధి పి.రమేష్ అవార్డు స్వీకరించారని తెలిపారు. ఈ ఘనతను సాధించడంలో కృషి చేసిన డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి, జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ కె.రాణి, క్షయ నివారణ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. వైద్యారోగ్యశాఖను అభినందించిన కలెక్టర్ అంబేడ్కర్ -
బార్ అసోసియేషన్ ఏకగ్రీవం
పార్వతీపురంటౌన్: పార్వతీపురం బార్ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవమ య్యాయి. ఈ మేరకు అధ్యక్షుడిగా నల్ల శ్రీనివాసరావు ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి బి.సత్యనారాయణ శుక్రవారం పేర్కొన్నారు. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు పార్వతీపురం బార్ అసోసియేషన్‌కు 2025–26 సంవత్సరానికి గాను ఎన్నికలు నిర్వహించామని తెలిపారు. ఈ నెల 17 నామినేషన్ వేసిన వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికలో ఉపాధ్యక్షుడిగా సూర్ల కృష్ణ, జనరల్ సెక్రటరీగా నీలం రాజేశ్వరరావు, జాయింట్ సెక్రటరీగా ఎంవీ వెంకట రాఘవేంద్ర, కోశాధికారిగా మంత్ర పూడి వెంటకరమణలను ఎన్నుకున్నారని వివరించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని బార్ అసోసియేషన్ సభ్యులు సత్కరించారు. విజయనగరంలో.. విజయనగరం లీగల్: విజయనగరం జిల్లా కేంద్ర న్యాయవాదుల సంఘం ఎన్నికల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. సంఘం అధ్యక్షుడిగా కలిశెట్టి రవిబాబు, సంయుక్త కార్యదర్శిగా బార్నాల సీతారామరాజు ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రవిబాబు 58 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి ధవళ వెంకట రావుపై విజయం సాధించారు. కాగా సంయుక్త కార్యదర్శిగా బార్నాల సీతారామ రాజు తన ప్రత్యర్థి సారిక సతీష్‌పై కేవలం నాలుగు ఓట్లు స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. కార్యదర్శిగా నలితం సురేష్ కుమార్, ఉపాధ్యక్షుడిగా పి.శివప్రసాద్, కోశాధికారిగా కళ్ళెంపూడి వెంకట్రావు, లైబ్రరీ కార్యదర్శిగా తాడిరాజు, స్పోర్ట్స్ సెక్రటరీగా చిన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
తాగునీటి పథకం ఉన్నా... ఊటనీరే గతి
చిత్రంలో ఊటనీటిని సేకరిస్తున్నది గుమ్మలక్ష్మీపురం మండలం కుక్కిడి పంచాయతీ కె.శివడ కాలనీ మహిళలు. గ్రామంలో 5 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన రక్షిత మంచి నీటి పథకం ఉన్నా వారం రోజులుగా పనిచేయడం లేదు. నీటి సరఫరా నిలిచిపోయింది. తాగునీటికి కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. చేసేదిలేక గ్రామ సమీపంలో కలుషిత ఊటనీటితో దాహం తీర్చుకుంటున్నారు. అధికారులు స్పందించి తక్షణమే నీటి సమస్యను పరిష్కరించాలని, లేదంటే ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. – గుమ్మలక్ష్మీపురం -
వేదనలో రైతన్న..
–IIలోశనివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2025ఇటీవల కురిసిన ఈదురు గాలులతో కూడిన వర్షం... అరటి, మొక్కజొన్న పంటలను ధ్వంసం చేసింది. రైతన్న నడ్డివిరిచింది. ఆదుకోవాలంటూ అన్నదాత వేడుకుంటున్నా పాడైన పంటలను పరిశీలించేవారు, నష్టం అంచనా వేసేవారు కరువయ్యారు. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏటా పెట్టుబడి సాయంతో పాటు ఉచిత పంటల బీమా సదుపాయం వల్ల విపత్తుల సమయంలో రైతన్నకు ఆర్థిక సాయం ఠంచన్‌గా అందేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో రైతన్న ఆవేదన చెందుతున్నాడు. దుకునేవారు లేక... ! సుభద్రమ్మవలస పామాయిల్ తోటలో ఏనుగుల గుంపు ఇదీ ‘యంత్రాంగం’ తీరు..! ప్రజాధనంతో కొనుగోలుచేసిన వ్యవసాయ యంత్ర పరికరాలు అనర్హులకు చేరుతున్నాయి. సాక్షి, పార్వతీపురం మన్యం: మండువేసవిలో జిల్లాలో ఇటీవల కురిసిన వర్షం.. ప్రజానీకానికి ఉపశమనమిచ్చినా, ఉద్యాన రైతులకు మాత్రం తేరు కోని కష్టాన్ని మిగిల్చింది. రాత్రి సమయంలో దాదాపు రెండు గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షం వల్ల పొలాలు, కళ్లాల్లో నీరు చేరింది. గాలుల వల్ల చెట్లు నేలకొరిగాయి. ప్రధానంగా మొక్కజొన్న, అరటి పంటలకు వర్షం నష్టం మిగిల్చింది. రైతును ఆదుకోవాల్సిన అధికార యంత్రాంగం పట్టనట్లు వ్యవహరిస్తోంది. పంట నష్టం నిబంధనల వల్ల పరిహారం కూడా అందని పరిస్థితి దాపురించింది. ఇప్పటికీ నేలకొరిగిన పంటలను చూసి రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. పాలకొండ రూరల్: ఇటీవల కురిసిన భారీ వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం డిమాండ్ చేసింది. పాలకొండ మండలం లుంబూరు గ్రామంలో వావిలపల్లి రమణమూర్తితో పాటు పలువురు రైతులకు చెందిన అరటి తోటల్లో జరిగిన నష్టాన్ని సంఘ ప్రతినిధులు పరిశీలించారు. అకాల వర్షం కారణంగా అరటి, జీడి, మామిడి పంటలకు తీవ్ర నష్టం ఏర్పడిందన్నారు. కొద్ది రోజుల్లో పంట చేతికి వచ్చే సమయంలో దిగుబడి నేలపాలైందన్నారు. ఉద్యాన, వ్యవసాయ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందజేయాలని కోరారు. ఈ పరిశీలనలలో రైతు సంఘ నాయకులు అప్పలనాయుడు, కిమిడి రామూర్మినాయుడు, పి.వైకుంఠరావు, దాసు తదితరులు ఉన్నారు. చిత్రంలో మండుటెండలో నడుచుకుంటూ వెళ్తున్న గిరిజన విద్యార్థులది సీతంపేట మండలంలోని జమ్మడుగూడ గ్రామం. గ్రామంలో పాఠశాల లేకపోవడంతో దాదాపు 16 మంది చిన్నారులు అర కిలోమీటరు దూరంలోని కాగుమానుగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. వాహన సదుపాయం లేకపోవడంతో ప్రతి రోజు నడవాల్సిందే. మండే ఎండలో ఇలా శుక్రవారం పాఠశాల విడిచిపెట్టిన తర్వాత క్యూ పద్ధతిలో నడుచుకుంటూ గ్రామానికి చేరుకున్నారు. దాతలు దయతలచి ఆటో సదుపాయం కల్పిస్తే చిన్నారులకు ఈ కష్టాలు తప్పేవంటూ వీరిని చూసిన వారిలో చర్చసాగింది. – సీతంపేట గత ఆదివారం రాత్రి జిల్లాలో 25.4 మి.మీ వర్షపాతం నమోదైంది. వర్షంతోపాటు, గాలులు వీయడం వల్ల పంటలకు నష్టం ఏర్పడింది. వీరఘట్టం, పాలకొండ, పార్వతీపురం, బలిజిపేట, సీతానగరం, భామిని తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ ప్రభావంతో సీతానగరం మండలంలో కంకులదశలో ఉన్న మొక్కజొన్న పంట నేలకొరిగింది. పాలకొండ మండలంలో అరటిపంటకు నష్టం ఏర్పడింది. మండలంలోని లుంబూరు గ్రామానికి చెందిన వావిలపల్లి రమణమూర్తి అనే రైతుకు చెందిన సుమారు ఎకరా అరటి తోట గెలలతోసహా పడిపోయింది. పంట గెలలు వేసి మరి కొద్ది రోజుల్లో ఫలసాయం చేతికి అందుతుందనే సమయంలో నేలకొరగడంతో పెట్టుబడి కూడా దక్కదని రైతు ఆవేదన చెందుతున్నాడు. జిల్లాలోని కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సైతం అరటిపంట దెబ్బతింది. బలిజిపేట మండలంలోని అరసాడ, చెల్లింపేట, పణుకువలస తదితర ప్రాంతాల్లో మొక్కదశలో ఉన్న నువ్వు చేను నీటపాలవ్వడం పంటను కాపాడుకునేందుకు రైతులు ఆపసోపాలు పడ్డారు. జిల్లాలో సుమారు 80 నుంచి 120 ఎకరాల వరకు అరటి పంటకు నష్టం వాటిల్లినట్టు సమాచారం. నిబంధనల శరాఘాతం పంటలో 33 శాతంపైగా నష్టం జరిగితేనే పరిహారం ఇవ్వాలనే ప్రభుత్వ నిబంధన వల్ల రైతులకు అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాస్తవ అంచనాలు వేయించి, ప్రభుత్వ నిబంధనలను సవరిస్తేనేగానీ బాధిత రైతులకు పరిహారం అందే పరిస్థితి ఉండదు. కొన్నిచోట్ల పంటపై పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంది. భారీ వర్షం, గాలులకు జిల్లాలో అరటి పంట దెబ్బతింది. గెలలు నేలవారాయి. కొద్దిరోజుల్లో పంట ఫలసాయానికి వచ్చే సమయంలో ఈ విపత్తు సంభవించింది. ప్రభుత్వ నిబంధన మేరకు 33 శాతం దాటి నష్టం ఉంటే పరిహారం అందిస్తారు. ఈ లెక్కన చూసుకుంటే రైతుకు పరిహారం అందడం కష్టమే. ప్రభుత్వం మానవతాదృక్పథంతో ఆలోచించి, క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులను ఆదుకోవాలి. క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులను ఆదుకోవాలి – బుడితి అప్పలనాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం న్యూస్రీల్పశుతాగునీటి తొట్టెలు నిర్మాణం కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ప్రభుత్వం స్పందించాలి మొక్కజొన్న, అరటి రైతులకు కష్టం.. అకాల వర్షం.. రైతుకు నష్టం నేలకొరిగిన అరటి పట్టించుకోని యంత్రాంగం నష్టపోయిన పంటలనూ పరిశీలించని వైనం గగ్గోలు పెడుతున్న రైతు కుటుంబాలు -
ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని సంతకాల సేకరణ
బొబ్బిలి: తమ ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని పారిశుధ్య కార్మికులు కోరుతున్నారు. ఇదే విషయమై సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పొట్నూరు శంకరరావు స్థానిక పట్టణంలోని పారిశుధ్య కార్మికులతో సంతకాల సేకరణ గురువారం చేపట్టారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన వారి సేవలను గుర్తించాలని శంకరరావు కోరారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా వారిని పొగడడం కాదని వారి పట్ల చిత్తశుద్ధి నిబద్దత ఉంటే వారిని శాశ్వత ఉద్యోగులను చేయాలన్నారు. ఆప్కాస్ వంటి ప్రైవేటు ఏజెన్సీకి తమ ఉద్యోగాల భర్తీ, నిర్వహణ బాధ్యతలు అప్పగించవద్దని పారిశుధ్య కార్మికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు కలిగిన వినతిపత్రాన్ని మున్సిపల్ శాఖామంత్రి నారాయణకు కూడా పంపిస్తామన్నారు. కార్యక్రమంలో జి.గౌరి, జె.శంకరరావు తదితరులు పాల్గొన్నారు. కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ బొబ్బిలి: దైవ సేవకుడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్యను నిరసిస్తూ క్రైస్తవులంతా స్థానిక పట్టణంలోని సీబీఎం చర్చి ఆవరణలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ గురువారం చేపట్టారు. దైవసేవకుడి హత్య వెనక ఉన్న నిందితులను తక్షణమే గుర్తించి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రోజురోజుకూ క్రైస్తవ సమాజంపై దాడులు పెరుగుతున్నాయని, లౌకిక దేశంలో ఇలాంటి దుర్ఘటనలు దురదృష్టకరమన్నారు. అనంతరం పాస్టర్ ప్రవీణ్ మృతికి సంతాపం ప్రకటించారు. కార్యక్రమంలో వేణు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
● ఐటీఐ విద్యార్థుల అద్భుత సృష్టి
చిత్రంలో ఈగిల్‌ను చూశారా.. ఇది విజయనగరం ఐటీఐ విద్యార్థుల అద్భుత సృష్టికి నిలువెత్తు రూపం. మెకానికల్ విభాగానికి చెందిన విద్యార్థులు 16 బైక్ చైన్స్, 2,500 చైన్ లింక్స్‌తో ఈగిల్‌ను సృష్టించారు. దీనిని గాజువాక సిటీ ఐటీఐలో డ్యూయల్ వీఈటీ (సీమెన్స్– టాటా స్ట్రైవ్ సంయుక్త) నిర్వహణలో బుధవారం నిర్వహించిన ‘ప్రాజెక్టు ఇన్నోవేషన్ చాలెంజ్ కాంపిటేషన్–2025 జోన్–1 పోటీల్లో ప్రదర్శించారు. మొత్తం 30 ప్రదర్శనల్లో ‘ఈగిల్’ ప్రాజెక్టు మొదటి బహుమతిని సొంతం చేసుకుంది. ఎమ్మెల్సీ చిరంజీవిరావు, కార్పొరేటర్ సరసింహపాత్రుడు, ప్రభుత్వ ఐటీఐ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ ఆర్వీ రమణ, ఐఎంసీ చైర్మన్ బాలాజీ, కోరమండల్ ప్రతినిధి శ్రీనివాసరావు, టాటా స్ట్రైవ్ ప్రతినిధులు రమేష్, మార్కండేయులు, సంతోష్, జోన్– ఐటీఐ ప్రిన్సిపాల్స్ చేతుల మీదుగా విద్యార్థులు బహుమతిని అందుకున్నారు. – విజయనగరం అర్బన్ -
● పింఛన్ కోసం పాట్లు
నడవలేనివారు కొందరు... బంగురుతూ వచ్చేవారు మరికొందరు.. కర్రసాయంతో, మరొకరి తోడుతో ముందుకు సాగిన వారు ఇంకొందురు... ఒకరికి ఒకరు తోడుగా వెళ్లినవారు కొందరు... ఇలా.. పింఛన్ అర్హతల నిర్ధారణకు విజయనగరం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో గురువారం నిర్వహించిన సదరం శిబిరానికి వచ్చేందుకు దివ్యాంగులు అష్టకష్టాలు పడ్డారు. మండుతున్న ఎండలో రాకపోకలకు నరకయాతన అనుభవించారు. కొందరు సొమ్మసిల్లి రోడ్లమీదనే కూర్చొండిపోయారు. ఇవెక్కడి కష్టాలు ‘బాబూ’ అంటూ నిట్టూర్చారు. వైద్యుల వద్ద తమ అర్హతలను నిర్ధారించుకున్నాక మెల్లగా ఇంటిబాట పట్టారు. దీనికి ఈ చిత్రాలే సజీవ సాక్ష్యం. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం -
టీటీసీ వేసవి ట్రైనింగ్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
పార్వతీపురం టౌన్: టీటీసీ వేసవి ట్రైనింగ్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖాధికారి ఎన్. తిరుపతినాయడు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కడప, అనంతపురంలలో మే 1నుంచి జూన్ 11 వరకు శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 3 నుంచి 25వరకు ప్రభుత్వ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్సీ.ఏపీ.జీఓవీ.ఇన్‌లో ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. మే 1 2025 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు 45ఏళ్లలోపు వయస్సు గల వారు అర్హులని పేర్కొన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని సంబంధిత ధ్రువీకరణ పత్రాలు, అప్లికేషన్‌తో పాటు జిల్లా విద్యాశాఖాధి కారి కార్యాలయంలో మే 1వ తేదీన హాజరు కావాలని సూచించారు. పోలమాంబ హుండీల ఆదాయం లెక్కింపుమక్కువ: E™èl¢-Æ>…{«§ýl$ÌS CÌS-ÐólË$µ Ôèæ…ºÆý‡ ´ùÌS-Ð]l*…º AÐ]l$Ã-ÐéÇ çßæ$…yîlÌS B§éĶæ*-°² VýS$Æý‡$-ÐéÆý‡… §ólÐ]l-§éĶæ$-Ô>Q íܺ¾…¨ ÌñæMìSP…^éÆý‡$. Ôèæ…ºÆý‡ ´ùÌS-Ð]l*…º AÐ]l$Ã-ÐéÇ 8,9 gê™èl-Æý‡-ÌS-ÌZ ¿ýæMýS$¢-Ë$ çßæ$…yîl-ÌZÏ çÜÐ]l$-ǵ…^èl$-MýS$¯]l² M>¯]l$-MýS-ÌS¯]l$ ÌñæMìSP…^èl-V> ₹4,11,188 B§éĶæ$… Ð]l_a…§ýl° DK çÜ*Æý‡Å-¯éÆ>Ķæ$-×æ ™ðlÍ´ëÆý‡$. çßæ$…yîlÌS ÌñæMìSP…ç³# M>Æý‡Å-{MýS-Ð]l$…-ÌZ ´ëÆý‡Ó-¡ç³#Æý‡… Ð]l$¯]lÅ… hÌêÏ §ólÐ]l-§éĶæ$ Ô>Q A«¨M>Ç G‹Ü.Æ>gêÆ>Ð]l#, {V>Ð]l$ çÜÆý‡µ…^Œl Ððl§ýl$âýæÏ íÜ…à^èl-ÌS-Ð]l$Ð]l$Ã, Eç³-çÜ-Æý‡µ…^Œl AË$Ï Ððl…MýS-rÆý‡-Ð]l$-×æ, Ð]l*i O^ðlÆý‡Ã¯ŒS ç³Nyìl §éÍ ¯éĶæ¬yýl$, E™èlÞÐ]l MýSÑ$sîæ Ð]l*i O^ðlÆý‡Ã¯ŒS O¯ðl§é¯]l çÜ*Æý‡Å-¯éÆ>Ķæ$-×æ, ™èl¨™èl-Æý‡$-Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. గడ్డి మందుతాగి వ్యక్తి ఆత్మహత్యగుర్ల: మండలంలోని నాగళ్లవలసకు చెందిన సంబర రమేష్ (51) గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రమేష్‌కు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉండడంతో తట్టుకోలేక బుధవారం గడ్డి మందు తాగేశాడు. గమనించిన కుటుంబసభ్యులు జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మృతుని భార్య ఉమ అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. కుమారుడు సూర్య ఉన్నాడు, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.నారాయణ రావు తెలిపారు. -
బైక్‌ల దొంగ అరెస్ట్
పార్వతీపురం రూరల్: ఆర్టీసీ కాంప్లెక్స్‌లు, రైల్వేస్టేషన్లు, రద్దీగల ప్రదేశాల్లో పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడుతున్న నిందితుడ్ని అదుపులోకి తీసుకుని రూ.17 ద్విచక్ర వాహనాలను స్వాధీ నం చేసుకున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్‌రెడ్డి గురువారం తన కార్యాలయంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొంతకాలంగా గుమ్మలక్ష్మీపురం గ్రామానికి చెందిన నిమ్మల శివాజీ అనే వ్యక్తి చెడు వ్యసనాలకు బానిస కావడంతో ఈ తరహా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. నిందితుడ్ని పట్టుకునేందుకు పట్టణ, జిల్లా సీసీఎస్ పోలీసులు బృందాలుగా ఏర్పడి ద్విచక్రవాహనాల దొంగతనం జరిగిన ప్రదేశాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీ లించగా నిందితుడు రైల్వేస్టేషన్ వైపు నడిచివెళ్లి తిరుగు ప్రయాణంలో మోటార్ సైకిల్‌పై రావడాన్ని గమనించి గుర్తించినట్లు చెప్పారు. ప్రాథమిక దర్యాప్తులో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న నిందితుడిని గుర్తించి ముందస్తు సమాచారంతో పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సంచరిస్తున్న నింది తుడ్ని గురువారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. చోరీకి పాల్పడే విధానం ద్విచక్రవాహనాల పాత తాళాలను కొన్నింటిని సేకరించి పార్వతీపురం, విజయనగరం లాంటి ప్రాంతాలకు బస్సులో వెళ్లి రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఎక్కు వ సమయం పార్కింగ్‌లో ఉండే ద్విచక్రవాహనాల ను గమనించి తన వద్ద ఉన్న ఆ తాళాలతో ప్రయత్నించి ఏదైనా ద్విచక్ర వాహనానికి తాళం సరిపోతే ఆ ద్విచక్రవాహనాన్ని స్టార్ చేసి అక్కడి నుంచి పరా రవుతాడు. దొంగతనంగా తీసుకువెళ్లిన ద్విచక్రవాహనాలను తన చెడు వ్యసనాల నిమిత్తం రూ.3వేల నుంచి రూ.5వేలకు విక్రయిస్తాడు. 13 వాహనాల వివరాలు గురింపు స్వాధీనం చేసుకున్న 17 వాహనాల్లో 13 వాహనాల ను పోలీసులు గుర్తించగా వాటిలో పార్వతీపురం పట్టణ పరిధిలోనివి 7, సీతానగరం పోలీస్‌స్టేషన్ పరిధిలో 1, విజయనగరం జిల్లా పరిధిలో 4, విశాఖపట్నం హార్బర్ పీఎస్ పరిధిలో 1 ఉన్నాయి. మిగిలిన మరో నాలుగు వాహనాలకు సంబంధించిన వివరాల కోసం దర్యాప్తు జరుగుతోందని ఎస్పీ తెలిపారు. పట్టుబడిన వాహనాలను త్వరలో యజ మానులకు అందించనున్నట్లు చెప్పారు. 17 ద్విచక్ర వాహనాలు స్వాధీనం ఎస్పీ ఎస్వీ మాధవ్‌రెడ్డి -
అమెరికా మెచ్చిన అందం.. తెర్లాం అమ్మాయి సొంతం
● ‘మిస్ తెలుగు యుఎస్ఏ’ తుదిపోటీలకు సాయిసాత్విక ● ఆమెది తెర్లాం మండలం సోమిదవలస గ్రామం ● మే నెలలో జరగనున్న ఫైనల్ పోటీలు తెర్లాం: అమెరికా మెచ్చిన అందం మన తెర్లాం మండలం సోమిదవలసకు చెందిన యువతి చందక సాయిసాత్విక సొంతం. ఓ వైపు చదువు.. మరోవైపు అందంతో అందరినీ ఆకర్షిస్తోంది. ఎమ్మెస్సీ చదువుకోసం అమెరికా వెళ్లిన యువతి డల్లాస్‌లో తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ‘మిస్ యూఎస్ఏ–2025’ పోటీల్లో తలపడి తుదిపోటీలకు ఎంపిక కావడం తెర్లాం మండలం సోమిదవలస వాసుల్లో ఆనందం నింపింది. మే 25న జరగనున్న ఫైనల్ పోటీల్లో తలపడనుంది. తను విజయం సాధించడానికి భారతీయులంతా తనకు ఓటు వేయాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తిచేస్తోంది. సాయిసాత్విక తండ్రి చందక సూర్యకుమార్ మెకానికల్ ఇంజినీరు కాగా, తల్లి సబిత రేషన్ డీలర్. ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం రాజాంలోని సెంట్ఆన్స్ పాఠశాలలో, బీఎస్సీ అగ్రికల్చర్ బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో చదువుకుంది. డేటా ఎనలైటికల్ కోర్సులో ఎమ్మెస్సీ చదవడం కోసం అమెరికా వెళ్లింది. అమెరికాలోని టెక్సాస్‌లోని ఆస్ట్రిన్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న అక్క సాయిసుస్మిత, బావ వద్ద ఉంటూ మిస్ తెలుగు యుఎస్ఏ–2025 పోటీల్లో పాల్గొంది. సుమారు 300 మంది తెలుగు అమ్మాయిలు పాల్గొన్న పోటీల్లో ఫైనల్‌కు చేరుకుంది. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ కావాలన్నది సాయిసాత్విక కోరికని, చిన్నతనం నుంచి వ్యాసరచన పోటీల్లో తలపడి బహుమతులు గెలుచుకుందని తల్లి సబిత తెలిపారు. అమెరికా తెలుగు అమ్మాయిల పోటీల్లో కుమార్తె విజయం సాధించేందుకు ప్రతిఒక్కరూ ఓటుతో మద్దతు తెలపాలని కోరారు. -
పక్కా డాక్యుమెంట్ రీ సర్వే జరగాలి
కొమరాడ: జిల్లాలో జరుగుతున్న రెండవ విడత రీ సర్వేలో డాక్యుమెంట్లు పక్కాగా ఉండాలని, సమగ్ర విచారణ చేపట్టి తుది నిర్ణయం తీసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోబిక సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆమె కొమరాడ మండలంలోని విక్రంపురం గ్రామంలో పర్యటించారు ఈ సందర్భంగా రెండవ విడత రీ సర్వే పనులపై తనిఖీ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ రీ సర్వే చేపడతున్న గ్రామల్లో ముందుగా రైతులకు సమాచారం అందించి తగు రశీదులను పొందాలని స్పష్టం చేశారు. భూముల రీసర్వేలో తలెత్తిన లోపాలను భూయజమానికి ముందుగా నోటీస్ ద్వారా తెలియజేయాలని ఆదేశించారు. వివాదాస్పద భూములకు సంబంధించిన వివరాలు ఆయా రిజిస్టర్లలో నమోదు చేయాలని చెప్పారు. రీ సర్వేలో ఎక్కడా లోపాలు ఉండరాదని అందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ తహసీల్డార్ శివయ్య మండల సర్వేయిర్ వంశీ తదితరులు పాల్గున్నారు. -
ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష
పార్వతీపురం: ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో 2025–26 విద్యాసంవత్సరంలో ఐదవతరగతి ప్రవేశానికి, 6,7,8,9 తరగతులలో బ్యాక్ లాగ్ ఖాళీల ప్రవేశానికి ఏప్రిల్ 20న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షను ఏప్రిల్ 6న నిర్వహించనున్నట్లు తొలుత ప్రకటించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల సొసైటీ గురుకులం, తాడేపల్లి, గుంటూరు వారి ఆదేశాల మేరకు ఏప్రిల్ 6న జరగాల్సిన పరీక్షను ఏప్రిల్ 20 తేదీకి మార్పు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే విద్యార్థులు ప్రవేశంకోసం ఆన్లైన్లో ఏప్రిల్ 9వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరాఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఏపీటీడబ్ల్యూఆర్‌ఎస్ పి.కోనవలస, ఏపీటీడబ్ల్యూఆర్‌ఎస్ (బాలికలు) కురుపాం, ఏపీటీడబ్ల్యూఆర్‌ఎస్ (బాలురు) భద్రగిరి, ఏపీటీడబ్ల్యూ ఆర్ఎస్ (బాలురు) కొమరాడ కేంద్రాల్లో నిర్వహించనున్న పరీక్షలకు హాజరుకావాలని పిలుపునిచ్చారు. సీతంపేటలో మలేరియా నివారణ క్యాంపు కార్యాలయం సీతంపేట: సీతంపేటలో మలేరియా నివారణ క్యాంపు కార్యాలయం యథావిధిగా ఏర్పాటైంది. 2021లో ఇక్కడ ఉన్న జిల్లా మలేరియా నివారణ కార్యాలయాన్ని శ్రీకాకుళానికి తరలించారు. కేవలం సబ్యూనిట్ ఆఫీస్ మాత్రమే ఇక్కడ ఉండేది. సీతంపేట ఐటీడీఏ పరిధిలోని పలు మండలాల్లో మలేరియా పాజిటివ్ కేసులు నమోదు కావడం, పర్యవేక్షణ తగ్గడంతో స్థానిక పాత స్టేట్ బ్యాంకు వద్ద కార్యాలయం ఏర్పాటుచేశారు. రెండు రోజుల కిందట సిబ్బంది విధుల్లో చేరారు. శ్రీకాకుళం జిల్లా మలేరియా నివారణాధికారి పి.వి.సత్యనారాయణ పర్యవేక్షించనున్నారు. మలేరియా నివారణ కన్సల్టెంట్, ఏఎంఓ, హెల్త్ అసిస్టెంట్లు, సబ్యూనిట్ ఆఫీసర్, నాల్గో తరగతి సిబ్బంది సేవలందించనున్నారు. భూముల రీ సర్వేకు రైతులు సహకరించాలి రేగిడి: భూముల రీ సర్వేకు రైతులు సహకరించాలని జిల్లా ల్యాండ్ సర్వే అఽధికారి రమణమూర్తి రైతులకు సూచించారు. మండలంలోని అంబఖండి గ్రామంలో గురువారం రీ సర్వేకు సంబంధించి అధికారులు, రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు పొలాల్లోకి వెళ్లి సర్వే చేసిన సమయంలో ఆ భూములకు సంబంధించిన ప్రతి రైతు తప్పనిసరిగా ఉండాలన్నారు. చట్టపరంగా రైతులకు సంబంధించిన భూములకు పూర్తిస్థాయిలో హక్కులు కల్పిస్తామని తెలిపారు. కొన్ని భూములకు ఆధారాలు లేవని, అటువంటి భూములను అధికారులు హక్కులో ఉన్న రైతులకు రికార్డులో పొందుపరిచేలా చూడాలని సర్పంచ్ గోవిందనాయుడు అధికారులను కోరారు. సర్వే చేసిన అనంతరం ప్రతి రైతుకు నోటీస్ ఇస్తామని, అటువంటి వాటిలో ఎటువంటి సవరణలు ఉన్నా సంబంధిత తహసీల్దార్‌కు తెలియజేస్తే వాటిని పునఃసర్వే చేస్తామని రమణమూర్తి స్పష్టంచేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ సత్యవాణి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే శ్రీనివాసరావు, తహసీల్దార్ ఎం.చిన్నారావు, రైతులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో ధన్వంతరి హోమం
విజయనగరం టౌన్: స్థానిక మన్నార్ రాజగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో గురువారం ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో ప్రాజెక్ర్ట్ చైర్మన్ బొడ్డు వెంకటేశ్వర ప్రసాద్ (పండు) నేతృత్వంలో వేదపండితులు శ్రీ ధన్వంతరి హోమాన్ని ఆద్యంతం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 60 మంది రుత్విక్కులు, 54 హోమగుండాలు, 163 మంది దంపతులతో అంగరంగ వైభవంగా యాగప్రక్రియ నిర్వహించారు. ఆరోగ్యప్రదాత శ్రీ ధన్వంతరికి ప్రత్యేక పూజలు చేశారు. లోక కళ్యాణార్థం నిర్వహించిన హోమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సభ్యులు సేవలందించారు. కార్యక్రమంలో సురేష్, రమేష్, గోపాల్ జగదీష్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
జీఎస్టీ అధికారిగా బాడంగి కుర్రాడు
బాడంగి: విజయనగరం జిల్లా బాడంగి గ్రామానికి చెందిన వంగపండు అభిషేక్ అనే యువకుడు పోటీ పరీక్షలో ప్రతిభ చూపాడు. కేంద్ర స్థాయిలో ఇటీవల జరిగిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ స్థాయి పరీక్షలో 390కు 354 మార్కులు సాధించి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 640వ ర్యాంక్ సాధించాడు. సెంట్రల్ జీఎస్టీ అధికారిగా కొలువు సాధించాడు. అభిషేక్ ఖరగ్‌పూర్ ఐఐటీలో బీటెక్, ఎంటెక్ పూర్తిచేశాడు. తల్లి వెంకటలక్ష్మి హైస్కూల్ టీచర్ కాగా, తండ్రి శ్రీను వ్యాపారి. అభిషేక్‌ను తల్లితండ్రులతో పాటు గ్రామస్తులు, స్నేహితులు అభినందించారు. -
108.. 24/7 ఇంజిన్ ఆన్!
ఆపద సమయంలో ఆదుకునే 108 వాహనానికే కష్టం వచ్చింది. సీతానగరం మండలానికి గతంలో మంజూరైన 108 వాహనం మరమ్మతులకు గురి కావడంతో కొద్దిరోజుల కిందట మరో వాహనాన్ని తీసుకొచ్చారు. అది కూడా తరచూ మొరాయిస్తుండడంతో మరొక వాహనాన్ని ఇచ్చారు. పోనీ.. ఇప్పుడున్న వాహనమైనా సక్రమంగా ఉందా.. అంటే అదీ లేదు. ఇంజిన్ సమస్య ఉంది. ఇంజిన్ ఆపితే మళ్లీ కదలడానికి తల ప్రాణం తోకకు వస్తుంది. దీంతో నిరంతరం వాహన సిబ్బంది ఇంజిన్‌ను ఆన్‌చేసే ఉంచుతున్నారు. దీనివల్ల లోపల వేడిగా అవుతుందని.. పనిలేని సమయంలో వాహనం డోర్లన్నీ.. ఇదిగో ఇలా తీసి ఉంచుతున్నారు. ఈ చిత్రాన్ని చూసి.. ఆపద్బాంధవికే కష్టం వస్తే చెప్పుకునే దిక్కులేకపోయిందంటూ స్థానికులు నిట్టూర్చుతున్నారు. – సీతానగరం -
ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించాలి
● అధికారులను ఆదేశించిన కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్వతీపురంటౌన్: జిల్లాలో శ్రీ విశ్వావసు ఉగాది వేడుకలను సంప్రదాయ రీతిలో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆయన ఉగాది వేడుకల ఏర్పాట్లపై సంబంధిత శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని లయ న్స్ కల్యాణ మంటపం వేదికగా ఈ నెల 30వ తేదీన ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించాలని స్ప ష్టం చేశారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా మామిడి తోరణాలు, ఆరటిచెట్లతో అలంకరణ ఉండాలన్నారు. వేదిక లోపల, వెలుపల ప్రభుత్వ చిహ్నాలతో బ్యానర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని మంగళ వాయిద్యాలు, పంచాంగ శ్రవణం, వేద పండితుల ఆశీర్వచనం, ఉగాది వచ్చ డి, పులిహోర వంటి ప్రసాదాల ఏర్పాట్లపై దేవదా య శాఖ అధికారులు బాధ్యత తీసుకోవాలని కోరా రు. ఆహ్వాన పత్రికల ముద్రణ చేపట్టి మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులను ఘనంగా దుశ్శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించాలని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోభిక, డీఆర్ఓ కె.హేమలత, డీపీఆర్ఓ ఎల్.రమేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. క్రమశిక్షణ, సన్మార్గానికి మారుపేరు రంజాన్ క్రమశిక్షణ, సన్మార్గానికి మారుపేరు రంజాన్ మాసమని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. రంజాన్ పండగ సందర్భంగా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమం స్థానిక లయన్స్ కల్యాణ మంటపంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ మాసంలో ముస్లింలు ఆధ్యాత్మికంగా మరింత లగ్నమై ఉవటారని, దైవానికి దగ్గర కావడమే కాకుండా దాతృత్వం, కరుణ, సహనం వంటి మంచి లక్షణాలు పెంపొందించుకుంటారని ప్రశంసించారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫార్ విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఆర్ఎస్. జాన్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి ఎం.డి గయాజుద్దీన్, డీపీఓ పి.వీరరాజు తదితరులు పాల్గొన్నారు. -
మరో మూడు రోజులే గడువు..!
● రేషన్ లబ్ధిదారుల్లో ఆందోళన ● ఈనెల 31లోగా ఈకేవైసీ చేయించాలి ● జిల్లాలో 2,77, 153 రేషన్‌కార్డులు ● కార్డుల్లో సభ్యులు 8,23,638 మంది ● 7లక్షల మంది వరకు ఈకేవైసీ పూర్తిపార్వతీపురం: రేషన్ పంపిణీలో అక్రమాల కారణంగా చౌకదుకాణాల్లో బియ్యం పక్కదారి పట్టి దుర్వినియోగం కాకుండా చేయాలనే ఉద్దేశంతో రేషన్‌కార్డుల్లోని సభ్యలంతా ఈకేవైసీ చేయించుకుని అర్హులైన వారికి మాత్రమే సబ్సిడీ బియ్యం అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఈకేవైసీ చేయించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని 15 మండలాల్లో 2,77,153 రేషన్ కార్డులుండగా అందులో 8,23,638 మంది సభ్యులున్నారు. ఇంతవరకు లక్షమంది వరకు ఈ కేవైసీ చేయించుకోలేదు. ఈకేవైసీ చేయించుకునేందుకు ఈ నెల 31వరకు గడువు ఉండగా త్వరితగతిన ఈకేవైసీ చేయించుకోవాలని అధికారులు లబ్ధిదారులకు సూచిస్తున్నారు. వలస దారుల ఆవేదన బతుకు తెరువుకోసం యువకులు, వ్యవసాయ కూలీలు హైదరాబాద్, విశాఖపట్నం, చైన్నె, బెంగళూరు తదితర ప్రాంతాలకు వలస వెళ్లారు. పండగలు, శుభకార్యాలకు, సొంత గ్రామాలకు వచ్చి తమ రేషన్ కార్డులో పేర్లను తొలగించకుండా జాగ్రత్తలు పడుతున్నారు. అలాగే విద్యాభ్యాసం కోసం ఇతర పట్టణాలకు, ప్రాంతాలకు వెళ్లిన విద్యార్థుల విషయంలోను, వృద్ధులకు వేలిముద్రలు పడని కారణంగా ఈకేవైసీ సమస్య తలెత్తుతోందని పలువురు లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈకేవైసీ చేయించుకోకపోతే సంక్షేమ పథకాలు దూరమవుతామని సర్వత్రా ఆందోళన చెందుతున్నారు. మొరాయిస్తున్న సర్వర్లు ఈకేవైసీ చేయించుకునేందుకు సర్వర్లు కూడా తరచూ మొరాయిస్తున్నాయి. అందరూ ఒకేసారి ఈకేవైసీ చేయించుకునేందుకు తరలివస్తున్న కారణంగా సర్వర్లు పనిచేయడం లేదు. ఉదయ, రాత్రి సమయాల్లో సర్వర్ సమస్య లేనప్పటికీ మిగిలిన సమయాల్లో రేషన్ షాపులు, ఆధార్, మీసేవ కేంద్రాల్లో లబ్ధిదారులు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయం పనివేళల్లో ఎక్కువమంది ఈకేవైసీకి రావడంతో సర్వర్లకు లోడ్ ఎక్కువై మొరాయిస్తున్నట్లు సాంకేతిక విభాగ నిపుణులు చెబుతున్నారు. చాలామంది రేషన్ కార్డు లబ్ధిదారులు కేవలం చౌక దుకాణానికి వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలని భావించడం వల్ల కూడా సమస్య తలెత్తుతోందని పలువురు అంటున్నారు. ఈకేవైసీ చేయించుకోవాలి రేషన్ కార్డుల్లో కుటుంబసభ్యులందరూ ఈకేవైసీ చేయించుకోవాలి. మిగిలిన మూడు రోజుల్లో తప్పనిసరిగా చేయించుకోవాలి. లబ్ధిదారులందరికీ ఈకేవైసీ చేసేలా సిబ్బందిని ఆదేశించాం. ఈకేవైసీ చేయించుకోకపోతే ప్రభుత్వ పథకాలకు దూరమవుతారు. లబ్ధిదారులంతా సమీపంలోని చౌక దుకాణాలు, మీసేవా కేంద్రాలకు వెళ్లి ఈకేవైసీ చేయిచుకోవాలి. ఐ.రాజేశ్వరి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్, పార్వతీపురం మన్యం జిల్లా -
జాతీయ కబడ్డీ పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: జాతీయస్థాయిలో జరగనున్న కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లాకు చెందిన క్రీడాకారులు అవకాశం దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎన్.అనురాధ, ఇ.సుమంత్‌లు ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు బీహార్ రాష్ట్రంలో జరగనున్న అంతర్ రాష్ట్ర కబడ్డీ పోటీల్లో పాల్గొననున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించి జాతీయ పోటీలకు అర్హత సాధించిన క్రీడాకారులను జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.రంగారావుదొర, కార్యదర్శి కేవీ.ప్రభావతి, ఆర్గనైజింగ్ కార్యదర్శి నడిపేన.లక్ష్మణరావు, పీడీ వి.సౌదామిని అభినందించారు. రాష్ట్ర జట్టు తరఫున ఆడనున్న ఇద్దరు క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో ఆడి జిల్లా ఖ్యాతిని జాతీయస్థాయిలో చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. -
విద్యార్థినులకు ‘శక్తి టీమ్స్‘ ప్రత్యేక శిక్షణ
విజయనగరం క్రైమ్: ఆపద సమయంలో ఉన్న మహిళలు, విద్యార్థినులకు ‘శక్తి టీమ్స్‘ మెలకువలతో కూడిన ప్రత్యేక శిక్షణ ఇస్తాయని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. వివిధ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినుల ఆత్మరక్షణకు అవసరమైన మెలకువలను శక్తి టీమ్స్ నేర్పుతాయన్నారు. వారిలో చైతన్యం నింపుతూ, ఆపద సమయాల్లో ఎలాంటి ఆందోళన చెందకుండా స్పందించేందుకు అవసరమైన మానసిక పరిపక్వత పొందేందుకుఈ ‘శక్తి టీమ్స్‘ చర్యలు చేపడతాయని చెప్పారు. ఈ మేరకు శక్తి టీమ్స్ కళాశాలలు, పాఠశాలలను సందర్శించే సమయంలో విద్యార్ధినులతో మమేకమవుతాయన్నారు. ఏదైనా ఆపద సమయం ఏర్పడినపుడు, మహిళల రక్షణకు విఘాతం కలిగే సంఘటన జరిగినప్పుడు భయపడకుండా, పరిస్థితిని అర్థం చేసుకుని ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధమయ్యే విధంగా అప్రమత్తం కావాలని పిలుపునిచ్చారు. మీ రక్షణ కోసం శక్తి టీమ్స్ పని చేస్తాయని దీంతో పాటు డయల్ 112,లేదా 100 నంబర్లకు కాల్ చేసి పోలీస్ శాఖ సహాయం పొందవచ్చని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. -
వక్ఫ్‌బోర్డు చట్టాల సవరణ వెనక్కి తీసుకోవాలి
● కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు కరీం విజయనగరం ఫోర్ట్: ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన వక్ఫబోర్డ్ చట్టాల సవరణ అంశాన్ని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం విజయనగరం జిల్లా అధ్యక్షుడు కరీం డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక డీసీసీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖబరస్థాన్ భూములు లాక్కునే ప్రయత్నంలో భాగమే చట్టసవరణ చేయడమని ఆరోపించారు. చట్టసవరణ అంశాన్ని వెనక్కి తీసుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు టీడీపీ సెక్యులర్ పార్టీ అంటారని, వక్ఫ్‌బోర్డు చట్ట సవరణ బిల్లును ఆయన వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్కే. సమీర్, ఎ.రహమాన్, డాక్టర్ తిరుపతిరావు, డాక్టర్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రేగాననెల్లిమర్ల రూరల్: వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రేగాన శ్రీనివాసరావును నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. నెల్లిమర్ల మండలంలోని సీతారామునిపేట గ్రామానికి చెందిన ఆయన గతంలో టూరిజం కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రెండోసారి వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడికి కృతజ్నతలు తెలిపారు. -
పోలీసుల పల్లెనిద్ర
● గ్రామస్తులతో మీతోనే మేము అంటున్న సీఐలు, ఎస్సైలు విజయనగరం క్రైమ్: ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో జిల్లాలోని పోలీస్ అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పల్లెల్లో నిద్ర చేసి మీతోనే మేము అని పల్లె వాసులకు భరోసా కల్పించారు. ఈ విధంగా గ్రామస్తులతో మమేకమవుతూ వారి సమస్యలను విని, క్షేత్రస్థాయిలో పరిష్కరిస్తున్నారు. తద్వారా పల్లెల్లో స్థానికులతో మమేకమవడమే కాకుండా ఆయా గ్రామాలలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు పల్లెనిద్రతో ఓ కన్నేశారు. అలాగే గ్రామంలోకి వెళ్లి రాత్రి పడుకునే ముందు ఒకసారి గ్రామస్తులతో సమావేశమై సైబర్ నేరాలు, మహిళల భద్రత, శక్తి యావ్, రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. దీనిపై ఎస్పీ వకుల్ జిందల్ గురువారం మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను, శాంతిభద్రతల సమస్యలను గుర్తిస్తూ, వాటి పరిష్కారానికి సత్వరం చర్యలు చేపట్టేందుకు సంబంధిత పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. అడాప్షన్ కానిస్టేబుల్స్ వారి పరిధిలోని గ్రామాల్లో నెలలో రెండు సార్లు పల్లెనిద్ర చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా పార్టీలకు అతీతంగా గ్రామస్తులతో మమేకం కావాలని, గ్రామసమస్యలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సమస్యల గురించి వారితో చర్చించి, గ్రామాల్లో ఎటువంటి వివాదాలు, అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రెండునెల్లో 72 గ్రామాల్లో పల్లెనిద్ర గ్రామాల్లోకి వచ్చే కొత్త వ్యక్తులు, హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తుల నడవడికపై నిఘా పెట్టాలని, వారు జీవనం ఏవిధంగా సాగిస్తున్నది తెలుసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. గడిచిన రెండు నెలల్లో జిల్లాలో 10మంది సీఐలు, 30మంది ఎస్సైలు 72 గ్రామాల్లో పల్లెనిద్ర చేసి, గ్రామస్తులతో మమేకం కావడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని, ప్రజల్లో పోలీసుశాఖ పట్ల నమ్మకం, విశ్వాసం పెరుగుతున్నాయని ఎస్పీ వకుల్ జిందల్ సంతృప్తి వ్యక్తం చేశారు. -
ట్రూఅప్, విద్యుత్ సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలి
చికెన్బ్రాయిలర్ లైవ్ డ్రెస్డ్ స్కిన్లెస్ శ్రీ108 శ్రీ186 శ్రీ196విజయనగరం గంటస్తంభం: సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విద్యుత్ ట్రూఅప్ చార్జీలు, సెకి విద్యుత్ ఒప్పందం రద్దు డిమాండ్లతో శుక్రవారం విద్యుత్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్మి వర్గ సభ్యుడు రెడ్డి శంకర్రావు పిలుపునిచ్చారు. ‘విద్యుత్ సాకులు’ అనే పుస్తకాన్ని విజయనగరం కోట జంక్షన్ వద్ద కార్మికులతో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఎటువంటి విద్యుత్ చార్జీలు పెంచమని చెబుతూనే, ట్రూఅప్ చార్జీల పేరుతో ఇప్పటికే రూ.17 వేల కోట్లు ప్రజలపై భారం వేసిందన్నారు. మళ్లీ సెకి ఒప్పందం ప్రకారం విద్యుత్ భారాలు ప్రజలపై వేయడం దుర్మార్గమని, తక్షణమే సెకి ఒప్పందం, ట్రూఅప్ విద్యుత్ సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే మరో విద్యుత్ ప్రజాపోరాటం జరగనుందని హెచ్చరించారు. విద్యుత్ కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించనున్న ధర్నాలో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మేసీ్త్ర రాజు పాల్గొన్నారు. నేడు విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా -
బాలబాలికలను లైంగికంగా వేధిస్తే 20ఏళ్ల జైలుశిక్ష
విజయనగరం/నెల్లిమర్ల రూరల్: లైంగికంగా బాల,బాలికలను వేధించినా, అవమాన పరిచినా..నేరం చేసిన వ్యక్తికి కనీసం 20 ఏళ్ల జైలుశిక్ష విధించనున్నట్లు ఫ్యామిలీ కోర్టు జడ్జి కె.విజయకల్యాణి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవా అధికార సంస్థ ఉత్తర్వుల మేరకు విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికల్యాణ్ చక్రవర్తి ఆదేశాలతో బుధవారం ఆమె నెల్లిమర్ల మండలంలోని కొండగుంపాం గ్రామంలో పోక్సో చట్టంపై న్యాయఅవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ దగ్గర వారే మన బాలికలపై నేరానికి పాల్పడుతుంటారని, అటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు వారి పిల్ల లపట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. ఈ సందర్భంగా గుడ్‌టచ్, బ్యాడ్‌టచ్ గురించి తల్లిదండ్రులకు తెలియజేశారు. ప్రస్తుత పిల్లలు టీనేజ్ వయస్సులో లేనిపోని ఆకర్షణలకు గురవుతుంటారని, ఇంటర్నెట్ ప్రభావానికి లోనుకాకుండా విద్యపై దృష్టి సారించాలని చెప్పారు. ఏ విషయాన్నైనా నిర్భయంగా తల్లిదండ్రులకు చెప్పాలని సూచించారు. అపరిచిత వ్యక్తుల దగ్గర జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్యక్రమంలో బొబ్బిలి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం.రోహిణీరావు,, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ డి.సీతారాం, కొండగుంపాం గ్రామసర్పంచ్ పి.అప్పన్న, నెల్లిమర్ల ఎస్సై ఎం.గణేష్, కొండగుంపాం గ్రామ సచివాలయ కార్యదర్శి ఎల్.తౌడు, సచివాలయ సిబ్బంది, జిల్లా న్యాయ సేవాధికార సిబ్బంది, పోలీస్‌సిబ్బంది పాల్గొన్నారు. ఫ్యామిలీ కోర్టు జడ్జి కె.విజయకల్యాణి -
కొండ చీపుళ్ల కొనుగోలుకు టెండర్ల ఖరారు
సీతంపేట: గిరిజనుల వద్ద నుంచి కొండచీపుళ్ల కొనుగోలుకు అడ్వాన్స్ టెండర్లు బుధవారం ఖరారయ్యాయి. ఐటీడీఏ కార్యాలయంలో పీఓ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి, జీసీసీ డీఎం సంధ్యారాణి సమక్షంలో టెండర్లు నిర్వహించారు. 16 మంది టెండర్‌దారులు హాజరయ్యారు. గిరిజన సహకార సంస్థ ఒక్కో కొండచీపురు గ్రేడ్ వన్ గిరిజనుల వద్ద నుంచి రూ.45కి కొనుగోలు చేసి రూ.47కు వ్యాపారులకు విక్రయిస్తుంది. గ్రేడ్ టు చీపురు ఒకటి రూ.40కి కొనుగోలు చేసి రూ.42కు, గ్రేడ్–3 చీపురు కట్ట రూ.35కు కొనుగోలు చేసి రూ.37కు వ్యాపారులకు విక్రయించనున్నారు. కొండచీపురు కొనుగోలు చేసిన ధరపై రూ.2 మార్జిన్‌ను కలిపి సేల్ బిల్లు వ్యాపారులకు ఇవ్వనున్నారు. అటవీశాఖ నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా పర్మిట్లు కూడా జీసీసీ ఇవ్వనుంది. వారపు సంతల వద్దే కొనుగోలు చేసి వెంటనే వ్యాపారులకు విక్రయించే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో జీసీసీ మేనేజర్లు దాసరి కృష్ణ, గొర్లె నరసింహులు, తదితరులు పాల్గొన్నారు. -
వంటావార్పుతో కార్మికుల ఆందోళన
వేపాడ: మండలంలోని బొద్దాంలో చెక్‌పోస్టువద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో రైతులు, కార్మికులు బుధవారం వంటావార్పుతో ఆందోళన నిర్వహించారు. చెక్‌పోస్టు ఎత్తివేయాలని లేదా వెసులుబాటు కల్పించాలంటూ కార్మికులు నినాదాలు చేశారు. ఈ ఆందోళనపై స్పందించిన ఉత్తరాంధ్ర మైన్స్ అండ్ జియాలజీ విజిలెన్స్ ఎ.డి. అజయ్‌కుమార్ బొద్దాం చేరుకుని సమస్యపై ఆరాతీశారు. దీనిపై సీఐటీయూ జిల్లానేత చల్లాజగన్ మాట్లాడుతూ ప్రైవేట్ చెక్‌పోస్టు సిబ్బంది, విజిలెన్స్ బోర్డులు పెట్టుకుని అక్రమాలుచేస్తున్నారని ఎ.డికి వివరించారు. రైతులు సొంత పొలాల్లో నుంచి మట్టితోలుకున్నా, గృహనిర్మాణదారులు పునాదులు పూడ్చుకోవడానికి తెచ్చుకున్నా అక్రమంగా వసూలు చేస్తున్నారని ఈ ఇబ్బందుల నుంచి రైతులు, ట్రాక్టర్ డ్రైవర్లకు విముక్తి కలిగించాలని కోరారు. దీనిపై ఎ.డి.అజయ్‌కుమార్ మాట్లాడుతూ మట్టి, కారురాయి తోలకాలకు మినహాయింపు కల్పిస్తామన్నారు. అయితే లే అవుట్ల వ్యాపారాలకు తోలేవాటికి పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రైవేట్ చెక్‌పోస్టుల నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. దీంతో కార్మికులు ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ ఎ.జి.మల్లేశ్వర్రావు, బొద్దాం గ్రామపెద్ద ఎర్రా సన్యాసిరావు, యూనియన్ నాయకులు గేదెల శ్రీను, తూర్పాటి సతీష్, శ్యామ్, కృష్ణ, రవి, శివప్రసాద్, రామకృష్ణ, బాలు, సన్నిబాబు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రూరల్ సీఐ అప్పలనాయుడు, వల్లంపూడి ఎస్సై దేవి, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. -
డోలీ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రయత్నం
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాను డోలీ రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ సీఎం చంద్రబాబు నాయుడికి తెలిపారు. రెండవ రోజు జరిగిన కలెక్టర్ల సదస్సులో బుధవారం ఆయన జిల్లా ప్రగతిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. జిల్లాలో గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉందని, కొండ ప్రాంతాల్లో రహాదారి సదుపాయం లేక డోలీలు వినియోగిస్తున్నారని, ఆ పరిస్థితి కనిపించకుండా ఉండేలా రహదారి సదుపాయం కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. 250 మంది ప్రజలున్న ఆవాసాలకు కూడా రహదారి సదుపాయం కల్పించాలనే దిశగా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. అపరాల సాగును కూడా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో అనీమియా ఎక్కువగా ఉందని తాన్ని కూడా తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం జిల్లా తలసరి ఆదాయం రూ. 1.67 లక్షలుగా ఉందని దాన్ని వచ్చే 2025–56 ఆర్ధిక సంవత్సరంలో రూ. 1.94 లక్షలకు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా ప్రగతికి పర్యాటరంగం ఎంతో దోహదపడుతుందని, పర్యాటక రంగంలో జిల్లాను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచించామని వివరించారు. జిల్లాలో ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజి నిర్మాణం 60 శాతం పూర్తి కావచ్చిందని తెలిపారు. కందుల సాగుకు ప్రోత్సాహం తలసరి ఆదాయం పెంచే దిశగా చర్యలు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ -
ఇంజినీరింగ్ అసిస్టెంట్‌పై మరోసారి దర్యాప్తు
రామభద్రపురం: మండలకేంద్రంలోని సచివాలయం ఇంజినీరింగ్ అసిస్టెంట్ సతీష్‌పై దర్యాప్తు ముమ్మరం చేశారు. అందులో భాగంగా బుదవారం ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ప్రమీలా గాంధీ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సులోచనరాణితో కలిసి దర్యాప్తు చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఏడాది క్రితం బీఎల్వో విధులు సక్రమంగా నిర్వహించకపోవడంతో పాటు అతడి సమాధానం కూడా బాగాలేదన్న ఉద్దేశంతో తహసీల్దార్ సులోచనరాణి ఆర్డీవోకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.ఆర్డీవో కూడా కలెక్టర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో అప్పటి కలెక్టర్ సదరు ఇంజినీరింగ్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. సదరు ఇంజినీరింగ్ అసిస్టెంట్ సతీష్‌కు దాదాపు 6 నెలల క్రితం పోస్టింగ్ కూడా ఇచ్చేశారు. అయితే అప్పట్లో దర్యాప్తు సక్రమంగా జరగలేదని, ఇప్పుడు మళ్లీ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. తహసీల్దార్ సులోచనరాణిని అప్పట్లో ఏం జరిగిందో ఎస్డీసీ ప్రమీలా గాంధీ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రత్నం పాల్గొన్నారు. -
రైతుసేవా కేంద్రం పరిశీలన
విజయనగరం ఫోర్ట్: అపరాల (పెసర, మినుము) పంటలను రైతులు విక్రయించేసిన తరువాత ప్రభుత్వం అపరాల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్న అంశంపై సాక్షిలో బుధవారం ‘ఎవరి లాభం కోసం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ ఎన్. వెంకటేశ్వరరావు స్పందించారు. ఈ మేరకు జామి మండలంలోని విజినిగిరిలో ఏర్పాటు చేసిన అపరాల కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. రైతులు మాత్రమే అపరాలను విక్రయించుకోవాలని దళారులు ఎవరైనా అపరాలు విక్రయించడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జెడ్పీ చైర్మన్‌కు వైఎస్సార్సీపీ నాయకుల పరామర్శవిజయనగరం: జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావును వైఎస్సార్సీపీ నాయకులు బుధవారం పరామర్శించారు. ఇటీవల జెడ్పీ చైర్మన్ చిన్న కుమారుడు మృతి చెందిన నేపథ్యంలో పార్టీ నాయకురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి జెడ్పీ చైర్మన్‌ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తొలుత ఆమె మృతిచెందిన ప్రణీత్ బాబు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. కోటదుర్గమ్మ హుండీల ఆదాయం లెక్కింపుపాలకొండ: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పాలకొండ కోటదుర్గమ్మ హుండీల ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. ఉదయం 10 గంటల నుంచి దేవదాయ ధర్మాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో హుండీలను తెరిచి ఆదాయాన్ని సిబ్బంది లెక్కించారు. ఈ నెల 3వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 23 రోజులకు గాను రూ.3,08,943 ఆదాయం సమకూరినట్లు ఈవో సూర్యనారాయణ తెలిపారు. అలాగే 36 గ్రాముల బంగారం, 1900 గ్రాముల వెండి హుండీల్లో లభించిందని వివరించారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిసాలూరు: రామభద్రపురం మండలం చింతలవలస గ్రామానికి చెందిన టి.గౌరమ్మ(47) సాలూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో బుధవారం మృతిచెందింది. ఈ ఘటనపై సీఐ అప్పలనాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మక్కువ మండలంలోని ఎర్రసామంతవలస వద్ద చర్చికి ప్రార్థనలకు వెళ్లి వస్తున్న క్రమంలో ద్విచక్రవాహనంపై ముగ్గురు ప్రయాణిస్తుండగా సాలూరులోని కోటవీధి జంక్షన్ వద్ద బైక్ మధ్యలో కూర్చున్న గౌరమ్మ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. అదే సమయంలో రైల్వే స్తంభాల లోడుతో వెళ్తున్న లారీ ఆమైపె నుంచి వెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జయి వెంటనే మరణించింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ిపీడీఎస్ బియ్యం పక్కదారి..!
విజయనగరం ఫోర్ట్: ఇటీవల గజపతినగరం మండలంలోని ఓ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన 300 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని సివిల్ సప్లయిస్ అధికారులు పట్టుకుని సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ● కొద్దినెలల క్రితం గంట్యాడ మండలం చంద్రంపేట గ్రామంలో ఉన్న రైస్ మిల్లు గొడౌన్‌కు పీడీఎస్ బియ్యం తరలిస్తున్నట్లు రెవెన్యూ అధికారులకు సమాచారం రావడంతో వీఆర్వో వెళ్లి రెండున్నర టన్నుల పీడీఎస్ బియ్యాన్ని, తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. ● ఇదే మండలంలో ఉన్న మరో మిల్లులో ిపీడీఎస్ బియ్యం తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో సివిల్ సప్లైస్, రెవెన్యూ అధికారులు మిల్లు వద్దకు చేరుకుని పీడీఎస్ బియ్యం తరలించే వాహనాన్ని పట్టుకున్నారు. వాహనంలో తరలిస్తున్న పీడీఎస్ బియ్యం 1500 కేజీలుగా గుర్తించారు. వాటిని అధికారులు సీజ్ చేసి మిల్లు యాజమానిపైన, తరలించిన వ్యక్తిపైన కేసులు నమోదు చేశారు. ● ఇలా ఈ మూడు చోట్లే కాదు. జిల్లాలోని అనేక చోట్ల పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. కొంతమంది వ్యాపారులు పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు తరలిస్తున్నారు. కొంతమంది వ్యాపారులు పీడీఎస్ బియ్యాన్ని మిల్లులకు తరలిస్తూ మిల్లులో బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి వాటినే మళ్లీ ప్రజాపంపిణీ వ్యవస్థ గొడౌన్లకు తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చోద్యం చూస్తున్న అధికారులు పీడీఎస్ బియ్యం అధికారుల కళ్లముందే తరలిపోతున్నా తమకేమీ కనబడడం లేదన్న రీతిన వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో పీడీఎస్ బియ్యం ఎక్కువగా పక్కదారి పట్టిస్తున్నా గ్రామాల్లో ఉండే వీఆర్వోలు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో యథేచ్ఛగా పీడీఎస్ బియ్యం తరలిపోతున్నట్లు తెలుస్తోంది. 2024–25 లో 90 కేసులు నమోదు: 2024–25 లో పీడీఎస్ తరలించిన 90 మందిపై 6 ఎ కేసులు నమోద య్యాయి. 1959 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. 2025–26లో 23 మందిపై 6 ఎ కేసులు నమోదయ్యాయి. 99.86 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. టన్నుల కొద్దీ తరలిస్తున్న వ్యాపారులు రైస్ మిల్లుల్లో రీసైక్లింగ్ మళ్లీ అవే బియ్యం పౌరసరఫరాల శాఖ గొడౌన్లకు తరలింపుఆకస్మిక తనిఖీలు చేస్తున్నాంపీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టించకూడదు. సీ ఎస్డీటీలు ఆకసిక్మక తనిఖీలు చేపడుతూ కేసులు నమోదు చేస్తున్నారు. ఒక వేళ ఎవరైనా పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టించినట్లయితే అటువంటి వారిపై 6ఎ కేసులు నమోదు చేసి జాయింట్ కలెక్టర్ కోర్టులో ప్రవేశపెడతాం. కె.మధుసూదన్‌రావు, జిల్లా పౌరసరఫరాల అధికారి -
మట్టి మాఫియా ఆగడాలు
రామభద్రపురం: మండలంలో మట్టిమాఫియా ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అధికార పార్టీ నాయకుల అండతో గ్రామాల్లోని చెరువులు, చెరువు పోరంబోకు, గెడ్డ పోరంబోకుల నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ చోటామోటా నాయకులు వారి జేబులు నింపుకుంటున్నారు. టీడీపీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు ఉండడం, ఒక వేళ ఫిర్యాదు వచ్చినా నామమాత్రంగా పరిశీలించి మిన్నకుండిపోవడంతో మండలంలో మట్టి మాఫియా పేట్రేగిపోతూ అక్రమ రవాణా సాగిస్తోంది. ఎన్నడూలేని విధంగా రాత్రింబవళ్లు మట్టిని తరలిస్తున్నారని స్థానికులు ఆవేదన చెందుతున్నా అటువైపు కన్నెత్తి చూసే సాహసాన్ని కూడా అధికార యంత్రాంగం చేయడం లేదు. ఎవరో ఒకరు ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే అటువైపు వెళ్తున్నారు తప్ప..అక్రమ రవాణాను అడ్డుకుందామన్న స్పృహ వారికి లేదని, ఒక వేళ అడ్డుకున్నా అధికార పార్టీ నాయకుల నుంచి ఫోన్‌కాల్ వచ్చిన వెంటనే వెనుదిరుగుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని కొట్టక్కి రెవెన్యూ పరిధిలో రేయింబవళ్లు చెరువు పోరంబోకు, చెరువులు, గెడ్డ పోరంబోకులో జేసీబీలతో విలువైన మట్టిని తవ్వి వందలాది ట్రాక్టర్లు, పెద్దపెద్ద ట్రక్కులు, లారీల ద్వారా మన్యం జిల్లా సాలూరు పట్టణానికి చెందిన మాఫియా అక్రమంగా తరలిస్తున్నారు. రామభద్రపురం నుంచి సాలూరు వెళ్లే ఎన్‌హెచ్ 26 రోడ్డు పక్కన ఉన్న సైట్లు ఎత్తు చేసుకుంటున్నారు. రెవెన్యూ అధికారులకు ఎంతోకొంత ముట్టజెప్పడంతో పాటు స్థానిక టీడీపీ నాయకుడు, సాలూరుకు చెందిన ఓ చౌదరికి ఒక్కో ట్రాక్టర్‌కు రూ.150 వరకు ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారం మనదే అడ్డుకునేవారే లేరంటూ అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు సైతం అడ్డుకోవడానికి కూడా వీల్లేదంటూ చోటా నాయకులు హుకుం జారీ చేసి మరీ మట్టి తవ్వకాలు నిర్వహించడం గమనార్హం. అక్రమార్కులు మట్టి ఎక్కడికి తరలిస్తున్నారో తెలిసినా అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో రెవెన్యూ అధికారులు అక్రమ తవ్వకాలను అడ్డుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. ప్రకృతి సంపదను దోపిడీ చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారని గ్రామస్తులు ప్రత్యక్షంగా ఆందోళన చేసినా..లేక ఫిర్యాదు చేసినా అధికారులు అడపాదడపా దాడులు చేస్తూ మమ అన్పిస్తున్నారు తప్ప కట్టడి చేసే ప్రయత్నాలు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. యథేచ్చగా రవాణా ప్రభుత్వ ఆదాయానికి గండి అధికార పార్టీ నాయకుల అండతో రెచ్చిపోతున్న అక్రమార్కులు చేతులెత్తేసిన రెవెన్యూ యంత్రాంగంఫిర్యాదు చేసినా స్పందన లేదు మూడు రోజులుగా పగలు, రాత్రి తేడా లేకుండా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. వెళ్లి అడ్డుకుని, ఈ విషయంపై రెవెన్యూ అధికారులకు స్వయంగా ఫిర్యాదు చేశాను. కనీస స్పందన లేదు. మొన్న జూనియర్ అసిటెంట్ వచ్చి అడ్డుకుని జేసీబీలు, ట్రాక్టర్లు, టిప్పర్లు తహసీల్దార్ కార్యాలయానికి తరలిస్తుండగా ఎక్కడి నుంచో ఫోన్ రావడంతో వెంటనే వదిలేసి వెళ్లిపోయారు. మండలంలో ఇసుక, మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. సంబంధిత అధికారులకు ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే అటువైపు వెళ్తున్నారు కానీ అడ్డుకోవడం లేదు. అలమండ ఆనందరావు, సీపీఐ జిల్లా జాయింట్ సెక్రటరీ, కొట్టక్కి సిబ్బందిని పంపి అడ్డుకుంటాం.. మాకు ఫిర్యాదు అందింది. కానీ వారి సొంత భూమిలో తవ్వుకుని, వారి పొలంలోనే వేసుకుంటున్నామని చెబుతున్నారు. మా అధికార సిబ్బందిని పంపించగా వెళ్లి పరిశీలించారు. తవ్వడం వాస్తవమే. అయితే వారి సొంత పొలం తవ్వుకుని వేసుకుంటున్నారని చెబుతున్నారు. అయినా నిబంధనల ప్రకారం ఎక్కడ తవ్వినా అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. మరోసారి సిబ్బందిని పంపించి అక్రమ రవాణాను అడ్డుకుంటాం. ఎ సులోచనరాణి, తహసీల్దార్, రామభద్రపురం -
తప్పుడు ఆరోపణలు తగవు
పాలకొండ రూరల్: మహానుభావుల పేరు పెట్టుకుని తప్పుడు ఆరోపణలు చేస్తూ వైఎస్సార్ సీపీ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించినా వినేవారు లేరన్నది టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు గుర్తెరగాలని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ హితవు పలికారు. గత ప్రభుత్వంలో లిక్కరు కుంభకోణం జరిగిందంటూ పార్లమెంట్లో తప్పుడు ఆరోపణలు చేయడాన్ని బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు. జగన్ హయాంలో ఏ ఒక్క డిస్టలరీకి అనుమతులు ఇవ్వలేదన్న విషయం తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు అనుమతులతో పుట్టుకొచ్చిన డిస్టలరీలకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంతో సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఆ డిస్టలరీల ద్వారా జరిగిన మద్యం సరఫరాల్లో అవకతవకలు ఉంటే టీడీపీదే బాధ్యతన్నారు. కూటమి కుటిల రాజకీయాలను ప్రజలు, మేధావులు, ఓటర్లు గమనిస్తున్నారన్నారు. ఇప్పటికై నా తప్పుడు వాఖ్యలు మానుకొని, మహానుభావుల పేరు పెట్టుకున్నందుకు హూందాగా వ్యవహరించాలని హితవుపలికారు. లిక్కరుపై ఎంపీ కృష్ణదేవరాయుల వాఖ్యలు అవాస్తవం ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ -
ఏసీబీ వలకు చిక్కిన మత్స్యశాఖాధికారి
● సీడ్ ఏజెన్సీకి బిల్లులు చెల్లించినందుకు రూ.60 వేలు డిమాండ్ ● ఏసీబీ అధికారులను ఆశ్రయించిన ఏజెన్సీ నిర్వాహకుడు ● వలపన్ని పట్టుకున్న అధికారులుపార్వతీపురంటౌన్: బలహీన వర్గాలకు చెందిన మత్స్యకారులకు సీడ్ బిల్లుల చెల్లింపులో పార్వతీపురం మన్యం జిల్లా మత్స్యశాఖాధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖాధికారులకు బుధవారం పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. పాలకొండ మండలం టీడీ పురానికి చెందిన బొప్పన అప్పన్నదొరకు చెందిన కోటదుర్గ ఫిష్ సీడ్ సంస్థలోని విత్తన నిల్వలను తనిఖీ చేసి, రూ.60 లక్షల బిల్లు మంజూరు చేసినందుకు జిల్లా మత్స్యశాఖాధికారి వేముల తిరుపతయ్య రూ.60 వేలు డిమాండ్ చేశారు. బాధితుడు అప్పన్నదొరకు లంచం ఇవ్వడం ఇష్టంలేక విజయనగరంలోని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వలపన్నాం. బాధితుడి నుంచి పార్వతీపురంలోని మత్స్యశాఖ కార్యాలయంలో రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నాం. ఆయనపై కేసు సమోదు చేసి, డబ్బులు సీజ్ చేశాం. నిందితుడిని విశాఖపట్టణంలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. దాడిలో సీఐలు మహేశ్వరరావు, భాస్కరరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
వెంకటరాజపురాన్ని వీడని ఏనుగులు
జియ్యమ్మవలస: మండలంలోని వెంకటరాజపురం, గవరమ్మపేట, బాసంగి, చింతలబెలగాం పరిసరాల్లోని పంట పొలాలను ఏనుగులు వారంరోజుల నుంచి వీడడం లేదు. బుధవారం ఉదయం వెంకటరాజపురంలోని అరటి, పొట్టతో ఉన్న వరి పంటను ధ్వంసం చేయడంతో రైతులకు నష్టంవాటిల్లింది. స్థానిక కూటమి నేతలు స్పందించి ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన రైతులకు పరిహారం అందజేయాలని రైతులు కోరుతున్నారు.గిరిజన గురుకుల ప్రవేశపరీక్ష వాయిదా సీతంపేట: గిరిజన గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి, మిగిలిన తరగతుల్లో ఖాళీలకు వచ్చేనెల 6వ తేదీన జరగనున్న రాతపరీక్ష అదే నెల20కు వాయిదా పడినట్టు గిరిజన సంక్షేమశాఖ డీడీ అన్నదొర బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 9వ తేదీ వరకు ప్రవేశ పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. నేడు ఇఫ్తార్ విందు పార్వతీపురం టౌన్: రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందును పార్వతీపురం పట్టణంలోని లయన్స్ క్లబ్లో గురువారం సాయంత్రం 6 గంటలకు ఏర్పాటుచేస్తామని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఆర్ఎస్ జాన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఇఫ్తార్ విందుకు ముస్లింలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. పోలమాంబ 9వ జాతర ఆదాయం రూ.2.36లక్షలు మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి తొమ్మిదవ వారం జాతర ఆదాయాన్ని ఈవో వి.వి.సూర్యనారాయణ సమక్షంలో బుధవారం లెక్కించారు. శీఘ్ర దర్శనం, ప్రత్యేక దర్శనం, కేశ ఖండన టికెట్ల విక్రయ రూపంలో రూ.89,260, మహా అన్నదానం విరాళాల రూపంలో 81,335, లడ్డూ, పులిహోర ప్రసాదం విక్రయంతో రూ.66,105ల కలిపి రూ.2,36,700ల ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు. రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం విజయనగరం టౌన్: ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంలో రుణాల కోసం మైనార్టీ వర్గాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఏపీఎస్ఎమ్ఫ్సీ విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల కార్యనిర్వహక సంచాలకులు ఆర్.ఎస్.జాన్ బుధవారం ప్రకటనలో తెలిపారు. పథకం కింద గరిష్ఠ ప్రాజెక్టు వ్యయపరిమితి తయారీ రంగానికి రూ.50 లక్షలు, సేవా రంగానికి రూ.20 లక్షలు రుణం అందజేస్తారన్నారు. ప్రాజెక్ట్ ఏర్పాటు చేయు ప్రాంతం, లబ్ధిదారుల వర్గీకరణను బట్టి కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ప్రాజెక్టు విలువలో 15 శాతం నుంచి 35 శాతం వరకు ఉంటుందన్నారు. లబ్ధిదారుని వాటాగా సాధారణ వర్గానికి చెందిన వారికి 10 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లు, మాజీ సైనికులు, దివ్యాంగులు తదితర వారికి 5 శాతంతో ఏదైనా బ్యాంక్ నుంచి రుణ సహాయం కల్పిస్తారన్నారు. మరిన్ని వివరాలకు కలెక్టరేట్లో ఉన్న కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. పైడితల్లి హుండీల ఆదాయం లెక్కింపు విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి ఆలయ హుండీల ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. అమ్మవారి కల్యాణ మండపం ఆవరణలో నిర్వహించిన లెక్కింపు ప్రక్రియను ఆలయ ఇన్చార్జి ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్ పర్యవేక్షించారు. 86 రోజులకు చదురుగుడి హుండీల నుంచి రూ.34,51,576లు, 35 గ్రాముల 700 మిల్లీ గ్రాముల బంగారం, 449 గ్రాముల వెండి, వనంగుడి హుండీల నుంచి రూ.9,43,375లు, 6 గ్రాముల 400 మిల్లీ గ్రాముల బంగారం, 682 గ్రాముల వెండి లభించిందని ప్రసాద్ తెలిపారు. అన్నదానం హుండీల నుంచి రూ.45,823లు వచ్చిందన్నారు. కార్యక్రమంలో రామతీర్థం ఆలయ సహాయ కమిషనర్ వై.శ్రీనివాసరావు, శ్రీవారి సేవకులు, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
నిమ్మగడ్డితో
–8లో.. గురువారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2025నిమ్మగడ్డి తైలంలో ఔషధ గుణాలు ఔషధ గుణాలు ఉన్న నిమ్మగడ్డి ఆయిల్ ఆయుర్వేదంలో ఎంతో ఉపయుక్తమైనది. నిమ్మగడ్డి ఆకుల నుంచి సుగంధ తైలం లభిస్తుంది. తైలాన్ని పరిమళాల పరిశ్రమలు, సబ్బులు, కృత్రిమ విటమిన్–ఏ తయారీకి ఉపయోగిస్తారు. నిమ్మగడ్డి తైలంలో సిట్రాల్ అనే రసాయనం ఉంటుంది. ఆకులను సువాసన కోసం హెర్బల్ తేనీటి పానీయాలలో, వంటలలో వాడుతారు. మొక్కలు దట్టంగా పెరిగి భూమి కోతను నివారించడానికి కూడా ఉపయోగపడుతాయి.న్యూస్‌రీల్ -
అపార్ట్‌మెంట్‌పై నుంచి పడి రిటైర్డ్ హెచ్ఎం మృతి
బొబ్బిలి: పట్టణంలోని నాయుడు కాలనీలో గల ఓ ఆపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న రిటైర్డ్ హెచ్ఎం వై.శ్యామ్‌సుందర్(80) రెండో అంతస్తు నుంచి పడిపోయి మంగళవారం మృతిచెందారు. బాడంగి మండలం పాల్తేరులో హెచ్ఎంగా రిటైరైన ఆయన బొబ్బిలిలోని ప్రముఖ వైద్యుడు, ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ వై.విజయమోహన్ తండ్రి. మంగళవారం మేడపై ఉన్న ఆయన ఆకస్మాత్తుగా కళ్లు తిరిగి కిందికి పడిపోయినట్లు, ఆల్జీమర్స్‌తో కొద్దికాలంగా బాధపడుతున్నట్లు కోడలు గ్రేస్కుమారిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశామని ఎస్సై ఆర్.రమేష్ కుమార్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని ఎస్సై చెప్పారు. -
పరీక్షలంటే భయాన్ని వీడండి
సాలూరు: విద్యార్థులు పరీక్షలంటే భయాన్ని విడనాడాలని సబ్‌కలెక్టర్, ఇన్చార్జ్ ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన పాచిపెంట మండలంలోని పి.కోనవలస గిరిజన గురుకుల బాలుర పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు వండిన భోజనాన్ని రుచి చూసి మెనూ పరిశీలించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ పరీక్షలు ఏ విధంగా రాస్తున్నారు? ఏ విధమైన ప్రణాళిక ద్వారా చదువుతున్నారు? ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు లక్ష్యంతో కూడిన విద్యను అభ్యసించాలని సూచించారు. పరీక్షల్లో ప్రణాళికా బద్ధంగా చదవడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడిలో కొలువైన అమ్మవారికి సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్‌లు శాస్త్రోక్తంగా పూజాధికాలు జరిపారు. రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడిలో అర్చకులు నేతేటి ప్రశాంత్ అమ్మవారిని పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించారు. ఆలయం వెనుక ఉన్న వేప, రావిచెట్ల వద్ద దీపారాధనలు చేశారు. కార్యక్రమాలను ఆలయ ఇన్చార్జి ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్ పర్యవేక్షించారు. రాజీపేట పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపుజియ్యమ్మవలస: మండలంలోని చింతలబెలగాం పంచాయతీ రాజీపేట పరిసర ప్రాంతాల్లోని పంట పొలాల్లో ఏనుగులు మంగళవారం దర్శనమిచ్చాయి. ఉదయం వెంకటరాజపురంలోని వరిపంటను ధ్వంసం చేసి సాయంత్రానికి వెంకటరాజపురం, బాసంగి మీదుగా చింతలబెలగాం, రాజీపేట గ్రామంలోకి జారుకున్నాయి. రాత్రి సమయమంలో గ్రామంలోకి చొచ్చుకు రావడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. వరిపంట, అరటి ఉండడంతో పంటలను ధ్వంసం చేస్తే పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు తగుచర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విద్యార్థినికి డీఈఓ అభినందనలుపాచిపెంట: లక్నోలో ఇటీవల జరిగిన 1500 మీటర్లు, 3వేల మీటర్ల పరుగుపందెంలో పాచిపెంట మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని జోత్స్న పాల్గొంది. అండర్ 17 విభాగంలో జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్న విద్యార్థినిని డీఈఓ నాయుడు మంగళవారం అభినందించారు. విద్యార్థినికి పాఠశాల హెచ్ఎం ఈశ్వరరావు, ఉపాధ్యాయులు తదితరులు అభినందనలు తెలిపారు. మహిళ మృతిపై కేసు నమోదురాజాం సిటీ: పట్టణ పరిధి మల్లికార్జునకాలనీ 7వ లైన్లో నివాసం ఉంటున్న కెల్ల లక్ష్మి (44) మృతిచెందడంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. వీధిలో దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రెవెన్యూ సిబ్బంది సహాయంతో ఇంటి తలుపులు తీయగా ఇంటిలోపల ఆమె మృతదేహం కనిపించిందని ఎస్సై తెలిపారు. మూడు రోజుల క్రితమే ఆమె మృతిచెంది ఉంటుందని, ఇంట్లో ఒక్కతే ఉండేదని, ఆమె కుమారుడు దుర్గాప్రసాద్ విశాఖపట్నంలో ఉంటున్నాడని చెప్పారు. ఆమె కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
వయోశ్రేష్టుల సంరక్షణ చట్టాన్ని అమలు చేయాలి
విజయనగరం టౌన్: వయోశ్రేష్టుల సంరక్షణ చట్టాన్ని ప్రతి జిల్లాలో కచ్చితంగా అమలుచేయాలని ఆలిండియా సీనియర్ సిటిజన్స్ కాన్ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్, రాష్ట్ర వయోశ్రేష్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంపరాల నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో వయోశ్రేష్టుల రాష్ట్ర కార్యవర్గ కౌన్సిల్ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సబ్‌డివిజనల్ స్థాయిలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి రెవెన్యూ సబ్ డివిజన్ స్ధాయిలో వచ్చే సమస్యలను పరిష్కరించాలని, కలెక్టర్ స్థాయిలో అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటుచేసి జిల్లా స్థాయిలో వచ్చే వయోశ్రేష్టుల సమస్యలను 90 రోజుల్లో పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతి జిల్లాలోనూ కమిటీలు వేసి మూడు నెలలకొకసారి కమిటీ సమావేశం నిర్వహించి వయోశ్రేష్టుల సంక్షేమంపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వయోశ్రేష్టుల శేషజీవితం ఆధ్యాత్మికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా సమృద్ధిగా ఉండేలా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్ర అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ కట్టమూరి చంద్రశేఖర్ ప్రార్థన గీతంతో ప్రారంభమైన సమావేశంలో రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పరమేశ్వర రెడ్డి, కార్యదర్శి రామచంద్రరావు, అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు, సత్యనారాయణమూర్తి, వెంకటరమణ, తదితరులు దివంగత కేపీ ఈశ్వర్ మృతిపట్ల మౌనం పాటించారు. సమావేశంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆర్.ఎస్.కుప్పూరావు, ప్రతినిధులు త్రినాథప్రసాద్, బసవమూర్తి, జగన్నాథరావు, గిడుతూరి పైడితల్లి, అధిక సంఖ్యలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
తరలిపోతున్న వృక్ష సంపద..!
● పట్టించుకోని రెవెన్యూ, అటవీశాఖ అధికారులుకొమరాడ: మండలం నుంచి వేలాది రూపాయల విలువ చేసే అటవీ సంపద రాత్రివేళ నాటుబళ్లు, ట్రాక్టర్ల సహాయంతో తరలిపోతోంది. పట్టించుకోవాల్సిన రెవెన్యూ, అటవీశాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణులు వినిపిస్తున్నాయి. అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా వృక్ష సంపద నరికి వేస్తుండడంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. ఒడిశా సరిహద్దు నుంచి టేకు కలప చడీచప్పుడు లేకుండా రవాణా సాగిస్తున్నారు. ఈ వ్యవహారంలో కొంతమంది అక్రమ వ్యాపారులు, రెవెన్యూ సిబ్బంది కుమ్మకై ్కనట్లు తెలుస్తోంది. టేకుకలప తరలించాలంటే కచ్చితంగా రెవెన్యూ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. కొమరాడ మండలం నుంచి పార్వతీపురం సా మిల్లులకు తరలించిన తరువాత అక్కడినుంచే సంబంధిత శాఖ అధికారులకు మామూళ్లు వెళ్తాయని సమాచారం. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
హైరిస్క్ గర్భిణుల పట్ల అప్రమత్తం
భామిని: ఆస్పత్రి ప్రసవాలకు ప్రాధాన్యం ఇచ్చి,హైరిస్క్ గర్భిణుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాదికారి డాక్టర్ భాస్కరరావు సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన భామిని మండలంలోని బత్తిలి, భామిని, బాలేరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను అకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. బత్తిలి పీహెచ్సీలో నిర్వహిస్తున్న నూట్రీ–గార్డెన్‌ను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రులకు వస్తున్న రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. భామిని పీహెచ్సీలో మందుల నిల్వలు పరిశీలించి,ల్యాబ్‌లో చేస్తున్న పరీక్షలను గుర్తించారు. బాలేరు పీహెచ్సీలో వైద్యసిబ్బంది హాజరు పట్టీ పరిశీలించారు. డీఎంహెచ్ఓ వెంట బత్తిలి డాక్టర్లు రవీంద్ర, దామోదరరావు, భామిని వైద్యులు సోయల్, సంతోషిలక్ష్మి, బాలేరు వైద్యాధికారి శివకుమార్, సీహెచ్ఓ భాస్కరరావు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కరరావు -
డ్రోన్ దెబ్బ.. పేకాటరాయుళ్ల అబ్బా..!
విజయనగరం క్రైమ్: జిల్లాలో డ్రోన్స్ సహాయంతో పేకాట, కోడి పందాలకు పోలీసులు చెక్ పెడుతున్నారు. విజయనగరంలోని హుకుంపేట శివారు, పూసపాటిరేగ మండలం వెంపడాం వద్ద మంగళవారం పోలీసులు డ్రోన్స్ ఉపయోగించి పేకాట ఆడుతున్న, కోడి పందాలు నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు వచ్చిన కచ్చితమైన సమాచారంతో విజయనగరం టూటౌన్ సీఐ టి.శ్రీనివాసరావు సిబ్బంది హుకుంపేట శివారులో పార్కింగ్ చేసిన లారీలో పేకాట ఆడుతున్న వారిపైకి డ్రోన్‌ను వంపి, శివారు ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు నిర్ధారించుకుని, రైడ్ చేసి పారిపోతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.12,600 నగదు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కోడి పందాల శిబిరంపై దాడిఅలాగే జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న పూసపాటిరేగ మండలం వెంపడాం గ్రామ శివారులో కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు ఎస్బీ పోలీసులకు వచ్చిన సమాచారంతో వారిపైకి డ్రోన్ పంపి, సుదూర ప్రాంతంలో కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు నిర్ధారించుకుని భోగాపురం రూరల్ సీఐ జి.రామకృష్ణ, పూసపాటిరేగ ఎస్సై దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్‌సిబ్బంది రైడ్ చేసి, కోడి పందాలు ఆడుతూ, పారిపోతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.15,600 నగదు, రెండు కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నట్లు ఈ సందర్బంగా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. నేర నియంత్రణలోను, శివారు ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు డ్రోన్స్‌ను వినియోగిస్తున్నామని, పట్టణ, గ్రామ శివారు ప్రాంతాలపై డ్రోన్స్ సహాయంతో నిఘా పెడుతున్నామని ఎస్పీ ఈ సందర్భంగా చెప్పారు. -
ఇరుగ్రామాల యాదవుల కొట్లాట
బాడంగి: గొర్రెల మేత విషయంలో ఇరుగ్రామాలకుచెందిన యాదవులు కొట్లాటకు దిగడంతో ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం మండలంలో జరగ్గా గాయపడిన వారి బంధువులు తెలిపిన సమాచారం ఇలా ఉంది. మండలంలోని గొల్లాది, కామన్నవలస గ్రామాలకుచెందిన యాదవులు గొడవపడి కర్రలతో కొట్టుకోగా కామన్నవలసకు చెందిన పడాల లక్షుం, కామేశ్వరరావు, సింహాచలం, ఆదినారాయణలు, గొల్లాదికి చెందిన ఈపు ఈశ్వరరావు, చప్పసత్యం గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురిని 108లో స్థానిక ఆస్పత్రికి తీసుకురాగా ప్రథమచికిత్స చేసిన డాక్టర్ హారిక వారిలో ఈపుఈశ్వరరావు, పడాల లక్షుంల పరిస్థితి విషమించడంతో విజయనగరం ఆస్పత్రికి తరలించాలని సూచించారు. ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు క్షతగాత్రుల బంధువుల నుంచి ఫిర్యాదు తీసుకుని పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరుగురికి గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం -
కూటమి చిన్నచూపు
గూడులేని పేదలపై..● ఎన్నికల ముందు ప్రతిఒక్కరికీ ఇంటిస్థలం ఇస్తామని హామీ ● గత ప్రభుత్వంలో 27వేల మందికి ఇళ్లు మంజూరు ● జిల్లాలో 6,980 మంది ఇళ్లు లేనివారు ● గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల స్థలాలు ఇవ్వాలి ● టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాలి ● గిరిజనులు సాగుచేస్తున్న పోడు భూములకు పట్టాలివ్వాలి ● కలెక్టరేట్ ఆవరణలో సీపీఐ ఆధ్వర్యంలో ధర్నాపోడుపట్టాలివ్వాలి మేము సాగు చేసుకుంటున్న భూములకు పోడు పట్టాలివ్వాలి. గతంలో ఎన్నికల ముందు టీడీపీ నాయకులు మా గ్రామానికి వచ్చి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. తీరా అధికారం చేపట్టిన తరువాత ఇప్పటి వరకు ఎటువంటి ప్రస్తావన లేదు. అధికారులు తక్షణమే మాకు పట్టాలు మంజూరు చేయాలి. – కొండగొర్రి లక్ష్మి, లిడికి వలస గ్రామంకాళ్లరిగేలా తిరుగుతున్నాం.. ఇంటిస్థలం మంజూరు చేయాలని గత ఆరు నెలలుగా కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. ప్రభుత్వం నుంచి సైట్లు ఓపెన్ కావడం లేదని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. మంజూరు చేయడం అవకాశం లేదని ఎన్నికల ముందు చెబితే బాగుండేది. ఎన్నికల ముందు చెప్పేదొకటి, అధికారం చేపట్టిన తరువాత చేసేదొకటి. మాకు ఇంటి స్థలం మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. – పి. వెంకటస్వామి, దిగువమండ గ్రామం, గుమ్మలక్ష్మీపురంప్రభుత్వం స్పందించాలి ప్రజలకిచ్చిన హామీలు అమలుచేయడంపై కూటమి ప్రభుత్వం స్పందించాలి. ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పోడు పట్టాలు, ఇళ్ల పట్టాలు అందజేయడంలేదు. – బి.కృష్ణ, బుట్టగూడ గ్రామం, గుమ్మలక్ష్మీపురం -
అడ్డదారి..!
ఆయన దారి..సాక్షి, పార్వతీపురం మన్యం: అనగనగా ఓ నాయకుడు.. తాను ఎదగాలనుకున్న క్రమంలో అడ్డుగా ఉన్న వారందరినీ తొక్కుకుపోయాడు. చివరికి తాను అనుకున్న పీఠంపై ఆసీనులయ్యాడు. అక్కడితో ఆగలేదు.. మున్ముందు ముప్పు రాకుండా, తెలివిగా పావులు కదిపాడు. అప్పటికే ఉన్న సీనియర్లకు పొగపెట్టాడు. అధిష్టానం వద్ద ఉన్నవీలేనివీ నూరిపోశాడు. పార్టీ దరిదాపులకు కూడా వారిని రానీయకుండా చేయడంలో విజయం సాధించాడు. అక్కడితో ఆగిపోతే ‘రాజకీయం’ ఏముంటుందనుకున్నాడో.. లేక, సొంతంగా తన బలగాన్ని తయారు చేసుకోవాలనుకున్నాడో.. లేదంటే, అధిష్టానం వద్ద ‘సెహభాష్’ అనిపించుకోవాలని అనుకున్నాడో ఏమో... నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించి పక్క పార్టీలో ఉన్న ‘చోటా’ నేతలను మచ్చిక చేసుకోవడం మొదలుపెట్టాడు. వారిని కలుపుకొంటూ, తనను నమ్మి పెద్ద ఎత్తున పార్టీలోకి వస్తున్నారని ‘బిల్డప్’ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇదీ.. జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఒక నాయకుడు ఆడుతున్న ‘రాజకీయ’ జూదం. విజేత ఎవరైనా.. ‘విశ్వాసం’పైనే మచ్చ ఈ జూదంలో ఎవరు గెలుస్తారన్నది తర్వాత విషయం. వారి పన్నిన వ్యూహం ఫలిస్తుందో లేదో కాలం తేలుస్తుంది. ప్రజలు మాత్రం వెన్నుపోటు నాయకుల ‘విశ్వాసం’పైనే చర్చించుకుంటున్నారు. ఇంకా ఎన్నాళ్లూ లేని పదవి కోసం విలువలను ‘తాకట్టు’ పెట్టాలా? అని గుసగుసలాడుకుంటున్నారు. తమను గెలిపించిన ప్రజల మాటకు విలువిస్తారో.. లేకుంటే తమ రాజకీయ నాయకుల ప్రలోభాలే వారికి ముఖ్యమో చూడాలి. -
గిరిశిఖర గ్రామాల్లో ఆగని మరణాలు
శృంగవరపుకోట: గిరిశిఖర గ్రామాల్లో మరణమృదంగం వినిపిస్తోంది. ఒక తల్లి గర్భశోకం మరిచిపోకముందే మరో తల్లికి గర్భశోకం కలుగుతోంది. ఎస్.కోట మండలం ధారపర్తి పంచాయతీ వరుస మరణాలతో వణుకుతోంది. స్పందించాల్సిన వైద్యారోగ్యశాఖ చేష్టలుడిగి చూస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరణాలు ఏకారణంతో జరుగుతున్నాయన్న కనీస విచారణ లేకుండా వైద్యులు చేతులు దులిపేసుకుంటున్నారని గిరిజనులు వాపోతున్నారు. ధారపర్తి గ్రామానికి చెందిన కురిన బోయిన గంగులు–సీతమ్మల ఐదు నెలల కుమారుడు మంగళవారం ఉదయం విజయనగరంలోని ఘోషా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. రెండు నెలల కిందట ఇదే పంచాయతీకి చెందిన జన్ని విజయ్ అనే చిన్నారి తనువుచాలించాడు. ఈ ఘటనపై ఆదివాసీ గిరిజన సంఘ సభ్యులు, చనిపోయిన చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబీకులు అంతా తమ ప్రాణాలకు సరైన గ్యారంటీ దక్కడం లేదని, చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసి పోతుంటే వైద్యసిబ్బంది నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారంటూ ఆందోళనకు దిగారు. చిన్నారుల మరణానికి సకాలంలో వాక్సినేషన్ వేయకపోవడమే కారణమన్న వాదన వినిపిస్తోంది. పంచాయతీలోని చిన్నారులకు వాక్సినేషన్ లేకుండా చేసిన భారీ తప్పిదానికి వైద్యారోగ్యశాఖ అధికారులు ఇద్దరు ఉద్యోగులను బదిలీ చేసి చేతులు దులిపేసుకున్నా... చిన్నారుల మరణాలు అందరినీ కలచివేస్తున్నాయి. రిఫర్ చేశాం.. ధారపర్తికి చెందిన చిన్నారి మరణం పట్ల ఎస్.కోట ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీల స్పందించారు. తొలుత చిన్నారి తక్కువ బరువుతో పుట్టాడని, జిల్లా కేంద్రంలో ఘోషా ఆస్పత్రిలో వైద్య సేవలు అందజేశారు. ఈ నెల 3వ తేదీన చిన్నారికి ఆయాసం రావడంతో ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. వారం రోజుల పాటు వైద్యసేవలు అందజేశాం. కోలుకున్నాక ఈ నెల 10న డిశ్చార్జ్ చేశాం. తిరిగి 23వ తేదీ రాత్రి 11.30కి చిన్నారి ఆరోగ్యం క్షీణించిందంటూ ఆస్పత్రికి తెచ్చారు. ఎలాంటి సమస్య లేకున్నా ఆయాసం తగ్గక పోవడంతో జీవక్రియలకు సంబందించి ఇబ్బంది ఉండొచ్చని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ పిడియాట్రిక్స్‌కు 24వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు రిఫర్ చేశాం. ఘోషా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి చనిపోయినట్టు తెలిసిందని తెలిపారు. అనారోగ్యంతో మరో చిన్నారి మృతి అంతు చిక్కని కారణాలు ఆందోళనలో ధారపర్తి గిరిజనులు వ్యాక్సినేషన్ లేకపోవడమే కారణమా? -
2వేల ఎకరాలు నిమ్మగడ్డి సాగుకు అనుకూలం●
● 4,240 హెక్టార్లలో అంతర పంటల సాగుకు ప్రణాళికలు ● సీఎం చంద్రబాబుకు వివరించిన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్పార్వతీపురంటౌన్: జిల్లాలో రెండు వేల ఎకరాలు నిమ్మగడ్డి సాగుకు అనుకూలంగా ఉన్నాయని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ సీఎం చంద్రబాబు నాయుడుకు వివరించారు. రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో భాగంగా రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ మంగళవారం మాట్లాడుతూ ఈ ఏడాది 1000 ఎకరాల్లో నిమ్మగడ్డి సాగుకు ప్రణాళికలు సిద్ధంచేశామన్నారు. వచ్చేఏడాది నాటికి 2 వేల ఎకరాల్లో సాగుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఒడిశా రాష్ట్రంలోని రైతులు వేల ఎకరాల్లో నిమ్మగడ్డి సాగుతో పాటు అంతర పంటలను సాగుచేస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నారన్నారు. ఆ దిశగా జిల్లాలోని రైతులను ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడించారు. 4,240 హెక్టార్లలో అంతర పంటల సాగుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఇతర పంటలను సాగు చేసుకునేలా ప్రోత్సహించేందుకు రైతులను ఎక్స్పోజర్ విజిట్‌కు తీసుకెళ్లినట్టు వివరించారు.స్పందించిన అధికారులు జియ్యమ్మవలస రూరల్: జియ్యమ్మవలస మండల కేంద్రంలో తాగునీటి వెతలపై ఇటీవల ఖాళీ బిందెలతో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట మహిళలు ధర్నా చేశారు. జిల్లాలో తాగునీటి వెతలపై ఇటీవల ‘ప్ర‘జల’ పాట్లు’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. తాగునీటి సరఫరాకు వీలుగా ఎంపీడీఓ ఎస్.రమేష్ స్థానిక హరిజనవాడ సమీపంలో రిగ్‌బోర్ తీయించారు. -
కొటియా వివాదాన్ని పరిష్కరించాలి
సాలూరు రూరల్: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొటియా గ్రూపు గ్రామాల వివాదాన్ని పరిష్కరించాలని, గిరిజనులపై ఒడిశా ప్రభుత్వ దౌర్జన్యాలను ఆంధ్రా ప్రభుత్వం అడ్డుకోవాలంటూ సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఎగువసెంబిలో గిరిజనులు మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా మండల కమిటీ నాయకుడు మర్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ 21 కొటియా గ్రామా ల సమస్య దశాబ్దాలుగా కొనసాగుతోందన్నారు. ఒడిశా–ఆంధ్రాలో ఒకే ప్రభుత్వం ఉన్నందున సమస్యకు చెక్ చెప్పాలన్నారు. ఎన్నో ఆశలతో మంత్రి సంధ్యారాణిని గెలిపించినా సమస్య పట్టించుకోవడం లేదన్నారు. సెంబిలో ఒడిశా అధికారులు కంచె వేసి గిరిజనుల భూములను ఆక్రమించడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు గెమ్మెల జానకిరావు, కోనేటి సుబ్బా, తాడంగి చరణ్, మర్రి మహేష్, తదితరులు పాల్గొన్నారు. -
ఊరిబడి రక్షణకు పోరుబాట
● ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులు తరలించవద్దు ● యూపీ పాఠశాలలను కొనసాగించాలి ● యూటీఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌కు భారీ ర్యాలీ ● అక్కడ ఆందోళనపార్వతీపురం టౌన్: ఊరిబడిని రక్షించాలని, ప్రాథమిక పాఠశాలలను యథావిధిగా కొనసాగించాలని యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు రెడ్డి మోహన్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయం నుంచి కల్టెరేట్ వరకు ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ కమిటీ చైర్మన్లు, విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఆర్వో హేమలతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పంచాయతీలో ఒక మోడల్ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలని, ఏ ప్రాథమిక పాఠశాల నుంచి 3,4,5 తరగతులను తరలించ వద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూపీ పాఠశాలలను యథావిధిగా కొనసాగించాలని, తెలుగు, ఇంగ్లిష్, సమాంతర మీడియం కొనసాగించాలని కోరారు. ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వర్యం చేయకుండా బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు ఎస్.మురళీమోహన్రావు, కె.విజయగౌరి, జిల్లా నాయకులు టి.రమేష్, కె.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
కళ్లకు గంతలు కట్టొద్దు
శృంగవరపుకోట: గిరిజనుల కళ్లకు గంతలు కట్టకుండా ప్రభుత్వం నిజాలు చెప్పాలని ఏపీ గిరిజన సంఘం సభ్యులు విజ్ఞప్తిచేశారు. గిరిజన బాలికల కోసం ఎస్.కోట పట్టణంలో బాలికల ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయాలని వేడుకున్నారు. ఎస్.కోట మండలంలోని ధారపర్తి పంచాయతీ పరిధిలోని చిలకపాడు గ్రామంలో పలువురు గిరిజన విద్యార్థులు, చిన్నారులు, వారి తల్లిదండ్రులతో కలిసి సంఘ నాయకులు జె.గౌరీష్, జె.భీమయ్య, మంగళయ్యలు మంగళవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చిన్నా పెద్ద అంతా మోకాళ్లపై నిల్చొని కలెక్టర్, ప్రభుత్వ పెద్దలకు నమస్కారాలు చేస్తూ తమ గోడు వినిపించారు. జిల్లా కేంద్రమైన విజయనగరంలో 160 మందికి సరిపడే భవనంలో 260 మందికి అడ్మిషన్లు ఇచ్చారని, ఆపై చేరిన బాలికలను పార్వతీపురం, సాలూరులోని ఆశ్రమ పాఠశాలలకు పంపుతున్నారన్నారు. తమ పిల్లలు చదవాలని కొండలు, కోనలు దించి ఆడపిల్లలను పంపుతున్నారని, వారికి రోగమొచ్చినా, కష్టమొచ్చినా 50 నుంచి 70 కి.మీ మేర గిరిజన తల్లిదండ్రులు ప్రయాణాలు చేయాల్సి వస్తోందని చెప్పారు. మన్యానికి ముఖ ద్వారంగా ఉన్న ఎస్.కోటలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ఏర్పాటుచేసి బాలికా విద్యను ప్రోత్సహించాలని కోరారు. బాలికల చదువు సమస్యలను నిజాయితీగా అధ్యయనం చేయాలని డిమాండ్ చేశారు. నిజాలు చెప్పాలని గిరిజన సంఘం వినతి మోకాళ్లపై వేడుకోలు.. ‘కోట’ బాలికల ఆశ్రమ పాఠశాల కోసం ఆందోళన -
క్షయ రహిత భారత్‌కు సహకరించండి
విజయనగరం ఫోర్ట్: క్షయ రహిత భారత్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద ర్యాలీని జెండా ఊపి ఆమె ప్రారంభించారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2025 నాటికి క్షయ వ్యాధిని అంతం చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. క్షయ రోగులు అందరూ పూర్తి కాలం మందులు వాడితే వ్యాధి నయం అవుతుందని తెలిపారు. క్షయ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలో ఉన్న కఫం పరీక్ష కేంద్రంలో పరీక్ష చేయించుకోవాలని సూచించారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన వైద్యసిబ్బందికి ప్రశంసాపత్రాలు, మెమెంటోలు అందజేశారు. సమావేశంలో డీఐఓ డాక్టర్ అచ్యుతకుమారి, ఎన్‌సీడీపీఓ డాక్టర్ సుబ్రమ్మణ్యం, డీఎంఓ మణి తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి -
మూడు రిజిస్ట్రేషన్లు..ఆరు స్టాంపులు..!
● యథేచ్ఛగా స్టాంపు వెండర్ల దోపిడీ ● ఇ–స్టాంప్‌లపై అక్రమంగా వసూలు ● సబ్‌రిజిస్టార్ కార్యాలయంలో మాన్యువల్ స్టాంప్లకు బ్రేక్ ● సిండికేట్‌గా మారిన విక్రయదారులురూ.30లు అఽధికం రాజాంలో ఈ స్టాంప్ పత్రాల విక్రయంలో అధికంగా వసూలు జరుగుతోంది. ఇటీవల రూ.50లు స్టాంప్ పత్రం నిమిత్తం వెళ్తే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద లేదు. ఆ ఇ–స్ట్టాంప్ బయట వెండర్ వద్ద తీసుకుంటే రూ.30లు అదనంగా వసూలు చేశారు. – ఏవీ అర్జున్, డోలపేట, రాజాం -
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 275 అర్జీలు
విజయనగరం అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 275 వినతులు అందాయి. అత్యధికంగా రెవెన్యూ శాఖకు 117, దేవాదాయ శాఖకు 46, పోలీస్‌శాఖకు 31, డీఆర్డీఏకు 19, జిల్లా పంచాయతీ రాజ్ శాఖకు 10, విద్యుత్ పంపిణీ సంస్థకు 5, వైద్యారోగ్యశాఖకు ఐదు, పాఠశాల విద్యాశాఖకు 4 చొప్పున వినతులు అందగా మిగిలినవి ఇతర శాఖలకు చెందినవిగా నమోదయ్యాయి. వినతులను జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, డిప్యూటీ కలెక్టర్లు మురళి, ప్రమీలా గాంధీ స్వీకరించారు. ఎస్పీ గ్రీవెన్స్ సెల్‌కు 42 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించేందుకు ఎస్పీ వకుల్ జిందల్ ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక‘ (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టం) కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ఎస్పీవకుల్ ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను శ్రద్ధగా విన్నారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, వాటి పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. ఈ పీజీఆర్ఎస్లో మొత్తం 42 ఫిర్యాదులు ఆయన స్వీకరించారు. ఫిర్యాదుల్లో భూతగాదాలకు సంబంధించి 15, కుటుంబ కలహాలకు సంబంధించి 4, మోసాలకు పాల్పడినట్లు 8, ఇతర అంశాలపై 15 ఫిర్యాదులు ఉన్నాయి. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీసీ ఆర్బీ సీఐ శంకర్రావు, ఎస్బీ సీఐలు పాల్గొన్నారు. -
మధ్యవర్తిత్వం ద్వారా సులభంగా కేసుల పరిష్కారం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కల్యాణచక్రవర్తి విజయనగరం లీగల్: మధ్యవర్తిత్వంలోని మెలకువలను నేర్చుకోవడం ద్వారా కేసులను చాలా సులభంగా పరిష్కరించవచ్చునని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయికల్యాణచక్రవర్తి అన్నారు. ఈ మేరకు సోమవారం 40 గంటల మీడియేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో నిర్వహించిన శిక్షణలో న్యాయవాదులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మధ్యవర్తిత్వంలో భాగంగా శిక్షణ ఇవ్వడానికి తమిళనాడు రాష్ట్రానికి చెందిన రత్నతార, కేరళ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ సిరాజ్ ఎంపికై న న్యాయవాదులకు శిక్షణ ఇస్తారన్నారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో వ్యాజ్యాలను మానవతా దృక్పథంతో పరిశీలించి ఉభయ పార్టీల ద్వారానే పరిష్కారం రాబట్టాలని న్యాయవాదులకు సూచించారు. ఈ మధ్యవర్తిత్వం వల్ల ఉభయ పార్టీలకు సమయం డబ్బు వృథా కాకుండా ఉంటాయని, అదేవిధంగా కోర్టులో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులకు పరిష్కారం చూపంవచ్చన్నారు. వ్యాజ్యాల పరిష్కారానికి రాజీ కూడా ఒక మార్గమేనని ఆయన స్పష్టం చేశారు. శిక్షణ పొందుతున్న ఉమ్మడి జిల్లాల న్యాయవాదులను శిక్షణ గురించి అడిగి తెలుసుకున్నారు. శిక్షణను అందిస్తున్న మాస్టర్ ట్రైనీస్‌తో మాట్లాడి శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఇన్చార్జి కార్యదర్శి బీహెచ్‌వీ లక్ష్మీకుమారి పాల్గొన్నారు. -
జెడ్పీ చైర్మన్‌కు వైఎస్సార్సీపీ నాయకుల పరామర్శ
విజయనగరం: జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావును వైఎస్సార్సీపీ నాయకులు సోమవారం పరామర్శించారు. ఇటీవల జెడ్పీ చైర్మన్ చిన్న కుమారుడు మృతిచెందిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ నాయకులు ఆయనను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతకుముందు మృతిచెందిన ప్రణీత్ బాబు చిత్రపటం వద్ద పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, తుని మాజీ శాసనసభ్యుడు జక్కంపూడి రాజా, పాలకొండ మాజీ ఎమ్మెల్యే తలేభద్రయ్య, ప్రస్తుత కూటమి ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు, మాజీ స్మార్ట్ సిటీ చైర్మన్ జీవీ వెంకటేశ్వరరావు, మాజీ వుడా చైర్మన్ రవి రాజు, వివిధ మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు పంచాయతీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మాజీ చైర్మన్లు, మాజీ డైరెక్టర్లు పరామర్శించిన వారిలో ఉన్నారు. -
మన బడి.. మరింత దూరం
ఉద్యమం తీవ్రతరం ప్రభుత్వ నిర్ణయాన్ని తా ము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పిల్లల తల్లిదండ్రుల తో కలసి పోరాటానికి సిద్ధమయ్యాం. యూపీ పాఠశాలలను యథాతథంగా కొనసాగించాలి. ప్రాథమిక పాఠశాలల నుంచి విద్యార్థులను విలీనం చేయవద్దు. పంచాయతీకి ఒక మోడల్ ప్రైమరీ పాఠశాల పెట్టాలి. ఎల్కేజీ, యూకేజీ పెడితే విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెరుగుతుంది. సమాంతర మీడియం ఉండాలి. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమం కొనసాగుతుంది. – ఎస్.మురళీమోహనరావు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పోరాటానికి సిద్ధమవుతున్న ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వ విద్యను కాపాడుకునేందుకు యూటీఎఫ్ వంటి ఉపాధ్యాయ సంఘాలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ‘మన ఊరి బడిని కాపాడుకుందాం’ నినాదంతో ఇప్పటికే ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ఈ నెల 25న జిల్లా కేంద్రంలో డీఈవో కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. అప్పటికీ ప్రభుత్వం దిగి రాకుంటే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని యూటీఎఫ్ నాయకులు చెబుతున్నారు. ● కొన్ని మూసివేత.. మరికొన్ని విలీనం ● విద్యార్థుల తరలింపునకు యోచన ● సర్కారు విద్య నిర్వీర్యానికి కూటమి ప్రభుత్వం కుట్ర ● ఆందోళనకు సిద్ధమవుతున్న యూటీఎఫ్ సాక్షి, పార్వతీపురం మన్యం/సీతానగరం: పేద విద్యార్థులకు చదువును దూరం చేసి, ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేసేందుకు కూట మి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. సర్కా రు విద్యకు పెద్దపీట వేసి, నాడు–నాడుతో పాఠశాలల రూపురేఖలు మార్చి, విప్లవాత్మక విద్యా సంస్కరణలతో విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తే... ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని అనేక ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను మూసివేసేందుకు, మరోచోట విలీనం చేసే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొద్దిరోజులుగా విద్యార్థుల తల్లిదండ్రులు చేస్తున్న ఆందోళనలను ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. విద్యాహక్కు చట్టాన్ని కాలరాస్తూ.. విద్యార్థులను ఊరికి దూరంగా ఉండే పాఠశాలలకు పంపించే ఏర్పాట్లను చేస్తోంది. పాఠశాలలను ఫౌండేషన్ (1, 2 తరగతులు), బేసిక్ ప్రైమరీ (1–5 తరగతులు), మోడల్ ప్రైమరీ (తరగతికి ఒక టీచర్ ఉంటారు. ఐదు తరగతులు ఉంటాయి), హైస్కూల్‌గా విభజిస్తున్నారు. మోడల్ ప్రైమరీ పాఠశాల ఏర్పాటు చేస్తామంటూనే.. పక్కనున్న ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న నెపంతో 3, 4, 5 తరగతులను అందులోకి విలీనం చేస్తున్నారు. ఈ విధంగా మండలానికి 7 నుంచి 10 స్కూళ్ల వరకు ప్రభావితం అవుతున్నాయి. ఇక్కడ 1, 2 తరగతులు మాత్రమే ఉండగా.. భవిష్యత్తులో అక్కడికి కొత్తగా ఇంకెవరూ చేరరని, తద్వారా పూర్తిగా ఆయా పాఠశాలలను మూసివేయడమే దీని వెనుక ప్రభుత్వ ఉద్దేశమని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. సీతానగరం మండలంలోని బల్ల కృష్ణాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 15 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ పాఠశాలను ఎత్తివేసి, గెడ్డలుప్పి యూపీ పాఠశాలలో విలీనం చేయనున్నారు. ఈ పాఠశాలకు వెళ్లాలంటే రాష్ట్రీయ రహదారి, సువర్ణముఖి నది దాటాల్సి ఉంటుంది. సుమారు కిలోమీటరు దూరం విద్యార్థులు నడిచి వెళ్లాలి. పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. సీతానగరం బగ్గందొరవలస ప్రాథమిక పాఠశాలలో 16 మంది విద్యార్థులు చదువుతుండగా.. ప్రభుత్వ విధానం వల్ల వీరు కూడా గెడ్డలుప్పి వెళ్లి చదువుకోవాల్సి ఉంటుంది. రామవరంలోని పాఠశాల ఆర్.వెంకంపేటలో విలీనం కానుంది. ఇక్కడికి వెళ్లాలంటే రెండు కిలోమీటర్ల ప్రయాణం. మధ్యలో పెద్ద చెరువు ఉంది. శ్మశాన వాటికను దాటుకుని వెళ్లాలి. ఒక్క సీతానగరం మండలంలోనే 20 పాఠశాలలు విలీనం కానున్నాయి. వాస్తవానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాడు–నాడు పథకం కింద పాఠశాలల భవనాలను సుందరంగా తీర్చిదిద్దింది. ప్రహరీలు, మొక్కల పెంపకం, రంగురంగుల టేబుళ్లు, ఆహ్లాదకర వాతావరణంలో పాఠశాలలు నడుస్తున్నాయి. వాటిని నిరుపయోగంగా వదిలేయడంతో పాటు.. ఊరి బడి దూరం కానుందని తెలియడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లల చదువు ఏం కావాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్వతీపురం మండలంలోని పెదమరికి, జమదల, పుట్టూరు, కృష్ణపల్లి, కోరి, అడ్డాపుశీల, కోటవానివలస, సంగంవలస.. ఇలా ఎనిమిది చోట్ల 6,7,8 తరగతులున్న యూపీ పాఠశాలు మరోచోట హైస్కూల్‌కు విలీనం కానున్నాయి. చినమరికి పాఠశాలలో 3, 4, 5 తరగతులను పెదమరికిలో కలుపుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ 1, 2 తరగతులే ఉంచగా.. వచ్చే విద్యాసంవత్సరానికి ఈ పాఠశాలలో కొత్తగా విద్యార్థులను ఎవరు చేర్చుతారని.. తద్వారా పిల్లలు లేరన్న నెపంతో పాఠశాలను ఎత్తివేస్తారని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. పిల్లలను ఎలా చదివించగలం? మా పాప వాసంతి బళ్ల కృష్ణాపురంలో ఐదో తరగతి చదువుతోంది. ఇప్పుడు దూరంలో ఉన్న మరో పాఠ శాలకు పంపాలంటున్నా రు. మా ఊరిలోని బడిని వదిలి, అంత దూరం పంపించాలంటే సాధ్యమేనా? చిన్న పిల్లలు రహదారులు, నదులు దాటి ఎలా వెళ్లగలరు. – పెద్దింటి సత్యవతి, బల్లకృష్ణాపురం, సీతానగరం మండలం ఊరికి దూరంగా బడి... ప్రైమరీ పాఠశాలలు.. కొన్ని గ్రామాలకు దూరం కానున్నాయి. చిన్నపిల్లలు చదువుకోసం రెండు, మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అంత దూరం తమ పిల్లలను ఎలా పంపగలమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇక.. యూపీ పాఠశాలలకు చరమగీతం పాడి, 6, 7, 8 తరగతులను సమీపంలోని హైస్కూల్లోకి విలీనం చేస్తున్నారు. జిల్లాలో ఈ విధంగా 110 వరకు పాఠశాలలు ప్రభావితం అవుతున్నాయి. కొన్నింటిని తరలించడం, మరికొన్నింటిని విలీనం చేయడం వల్ల తమ విద్యార్థులు చదువుకు దూరమవుతారని, ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఇప్పటికే భామిని, పాలకొండ, పార్వతీపురం తదితర ప్రాంతాల నుంచి పిల్లల తల్లిదండ్రులు పలుమార్లు ధర్నాలు నిర్వహించారు. కలెక్టరేట్‌కు వచ్చి అధికారులకు అర్జీలిచ్చారు. అవన్నీ బుట్టదాఖలే అయ్యాయి. విలీనం దిశగానే విద్యాశాఖ అధికారులు ముందుకు వెళ్తున్నారు. -
వర్షార్పణం
ఎం.రాజపురంలో ఈదురు గాలులకు నేలమట్టమైన అరటి పంట పంటలు పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు ప్రాంతా ల్లో ఆదివారం అర్ధారాత్రి నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతా ల జలమయమయ్యాయి. అరటి, జీడిమామిడి, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. నువ్వుపంట నేలమట్టమైంది. నూర్పిడిచేసి కళ్లాల్లో ఉంచిన ధాన్యం బస్తాలు తడిసిముద్దయ్యాయి. వీరఘ ట్టం మండలంలోని వీరఘట్టం, దశుమంతపురం, చలివేంద్రి, చిట్టపులివలస, కంబర, నడిమికెల్ల, విక్రమపురం, నడుకూరు గ్రామాల్లో సుమారు 50 ఎకరాల్లో అరటి తోటలు, 250 ఎకరాల్లో జీడి మామిడి తోటలు ధ్వంసమయ్యాయని, సుమా రు రూ.50 లక్షల పంట నష్టం జరిగినట్టు రైతులు చెబుతున్నారు. పంటల నష్టం అంచనా వేస్తామ ని తహసీల్దార్ చందక సత్యనారాయణ తెలిపా రు. వేసవి దుక్కులకు వర్షం ఉపకరిస్తుందని పలువురు రైతులు పేర్కొన్నారు. – వీరఘట్టం/గుమ్మలక్ష్మీపురం/రేగిడి -
కూటమి నాయకుల గలాటా
● మండల సమావేశంలో ఉద్రిక్తం ● ఎమ్మెల్సీని సమావేశానికి రానీయకుండా కూటమి ఎత్తులు ● సుమారు మూడు గంటల పాటు నాటకీయ పరిణామాలుపాలకొండ: కూటమి నాయకుల నక్కజిత్తుల ఎత్తులతో పాలకొండ మండల సర్వసభ్య సమావేశం సోమవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జీవోలను కాదని వారు చెప్పిన విధంగా సమావేశం నిర్వహించేలా అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో గందరళగోళంగా మారింది. పోలీసులు, అఽధికారులు కూటమి నాయకుల చేష్టలను చూస్తూ చేష్టలుడిగి ఉండాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించి వివరాలు పరిశీలిస్తే..సోమవారం ఉదయం 10 గంటలకు మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌కు ఆహ్వానం పంపలేదు. అయినప్పటికీ జీవో నంబర్ 44 ప్రకారం తాను సమావేశానికి వెళ్లే హక్కు ఉందంటూ ఎమ్మెల్సీ విక్రాంత్, ఎంపీటీసీలు, సర్పంచ్‌లతో పాటు సమావేశ మందిరానికి ఉదయం 11 గంటలకు చేరుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని కింద ఎంపీపీ గదిలో కూర్చున్నారు. కూటమికి చెందిన సభ్యులు అక్కడే కూర్చుని ఎమ్మెల్సీ విక్రాంత్‌ను సమావేశ మందిరం నుంచి పంపిచేస్తేనే తాము ఆ సమావేశానికి వస్తామని ఎంపీడీవోకు తెలిపారు. దీంతో ఎంపీడీవో విజయరంగారావు ఎమ్మెల్సీ విక్రాంత్‌ను సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లిపోవాలని కోరారు. దీనిపై విక్రాంత్ స్పందిస్తూ జీవో 44 ప్రకారం తాను సమావేశానికి రావడానికి హక్కు ఉందని తాను సమావేశంలో ఉంటానని పట్టుబట్టారు. ఎంపీడీవో పోలీసుల ద్వారా విక్రాంత్‌ను బయకు పంపించేందుకు ప్రయత్నించడంతో అక్కడ గందరగోళం నెలకొంది. మండలంలోని ఇతర ప్రాంతాల నుంచి సమావేశ మందిరానికి చేరుకున్న కూటమి నాయకులు అరుపులు, కేకలు వేస్తూ కవ్వింపు చర్యలకు దిగారు. సీఐ చంద్రమౌళి, ఎస్సై ప్రయోగమూర్తిలు విక్రాంత్‌ను సమావేశం నుంచి వెళ్లిపోవాలని కోరారు. దీనిపై విక్రాంత్ మాట్లాడుతూ జీవో 44 చెల్లదని ఎంపీడీవో రాతపూర్వకంగా ఇస్తే వెళ్లిపోతానని స్పష్టం చేశారు. దీంతో ఎంపీడీవో పంచాయతీరాజ్ చట్టం మేరకు జీవో 44 చెల్లదని విక్రాంత్‌కు నోటీసు అందించారు. అనంతరం ఎమ్మెల్సీ విక్రాంత్, తమ సభ్యులతో పాటు 2.30 గంటలకు బయటకు వెళ్లిపోయారు. మండలిలో ఫిర్యాదు చేస్తా: ఎమ్మెల్సీ విక్రాంత్ ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సమావేశానికి తనను హాజరుకాకుండా అవమానపరిచిన సంఘటనపై ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ తీవ్రంగా స్పందించారు. మండల అభివృద్ధి కోసం తగిన సూచనలు సలహాలు అందించాలని, ఈ ప్రాంత రైతుల సమస్యలపై చర్చించాలని తాను సమావేశానికి హాజరైనట్లు తెలిపారు. కూటమి నాయకుల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గి జీవో44ను విస్మరించారని విమర్శించారు. దీనిపై తాను శాసన మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేస్తానని, న్యాయపరంగా పోరాటం చేస్తానని తెలిపారు. ఏక పక్షంగా సమావేశం.. మండల సమావేశం సోమవారం మధ్యాహ్నం నుంచి కూటమి నాయకులతో అధికారులు ఏకపక్షంగా కొనసాగించారు. వాస్తవానికి మండలంలో 12 మంది ఎంపీటీసీలు ఉంటే వారిలో 10మంది వైఎస్సార్సీపీ ఎంపీటీసీలే. వారిలో నలుగురు ఎంపీటీసీలను ఇటీవల కూటమి నేతలు తమ పార్టీలో చేర్చుకున్నారు. అప్పటికీ ఇరుపార్టీలకు 6 చొప్పున ఎంపీటీసీలు ఉన్నారు. ఇక సర్పంచ్ల విషయంలో 33 పంచాయతీలకు 25 పంచాయతీల్లో వైఎస్సార్ మద్దతుదారులే సర్పంచ్‌లుగా ఉన్నారు. ఎమ్మెల్సీ విక్రాంత్‌తో పాటు వారంతా వెళ్లిపోవడంతో ఉన్న కూటమి మద్దతు దారులతోనే సమావేశం పూర్తిచేశారు. -
సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
పార్వతీపురంటౌన్: ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లో సోమవారం ఆమె పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ, డీఆర్ఓ కె.హేమలత, కేఆర్ఆర్సీ ఎస్డీసీ పి.రామచంద్రారెడ్డిలతో కలిసి 98 వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పీజీఆర్ఎస్ ద్వారా అందిన అర్జీలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి పరిష్కరించాలని సూచించారు. జిల్లా అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలను పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఎటువంటి అర్జీలు రీ ఓపెన్ కాకుండా చర్యలు ఉండాలన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగురాలైన పాలకొండ మండలానికి చెందిన సుందరగిరి శ్రీజా భవానీ తనకు టచ్‌ఫోన్ కావాలని ఇదివరకే వినతిపత్రాన్ని అందజేయడంతో ఆమెకు టచ్‌ఫోన్ అందజేశారు. పీజీఆర్ఎస్లో అందించిన కొన్ని అర్జీలు ● జియ్యమ్మవలస మండలం గడసింగుపురం నుంచి పి. తాతబాబు తదితరులు తమ గ్రామంలోని ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ పనికిరానివారి పేర్లతో అక్రమాలకు పాల్పడడమే కాకుండా ఒక్కో వేతన దారు నుంచి రూ.200 చొప్పున అవినీతికి పాల్పడుతున్నారని, దానిపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. ● పార్వతీపురం మండలం డోకిశీల గ్రామంలో గల పొలాలకు ఆధారమైన పంటకాలువ పూర్తిగా కబ్జాకు గురైందని, ఆ కాలువ ద్వారా 200 ఎకరాల్లో సాగుభూములు, 15 చెరువులు ఆధారపడి ఉన్నాయన్నారు. కబ్జాతో రైతులకు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని, కబ్జాదారులపై చర్యలు చేపట్టాలని కోరారు. ● కురుపాం మండలం రెల్లిగూడ గ్రామానికి గతంలో నిర్మించిన గ్రావెల్ రోడ్డు పూర్తిగా పాడైనందున తమ గ్రామాలకు అంబులెన్స్, రేషన్ వాహనం రావడం లేదని, రోడ్డు మంజూరు చేయాలని గ్రామ సర్పంచ్ బి.అరుణ గ్రామస్తులతో కలిసి అర్జీ చేశారు. ● పాలకొండ మండలం బుక్కురుపేట గ్రామానికి చెందిన సంధ్యారాణి పెండింగ్‌లో ఉన్న తన ఇంటి బిల్లును మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు. సమస్యలపై విచారణ చేసి న్యాయం పార్వతీపురం రూరల్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన సమస్యల పరిష్కారానికి అలసత్వం చేయకుండా విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసుశాఖ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించారు. జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల నుంచి అర్జీలను స్వీకరించారు. వారితో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సోమవారం వచ్చిన 13 ఫిర్యాదుల్లో కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రుల వేధింపులు, వరకట్న వేధింపులు, భూ ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీ వసూళ్లు, ప్రేమపేరుతో మోసం వంటి ఫిర్యాదులు ఉన్నాయి. ఈ మేరకు వచ్చిన సమస్యల పరిష్కారానికి సంబంధిత పోలీసు అధికారులతో ఎస్పీ స్వయంగా ఫోన్ ద్వారా మాట్లాడి ఆయా సమస్యలను, వాటి పూర్వాపరాలను పరిశీలించి వాస్తవాలైతే చట్టపరిధిలో తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. పీజీఆర్ఎస్కు 40 వినతులు సీతంపేట: సీతంపేట ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 40 వినతులు వచ్చాయి. పీఓ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి వినతులు స్వీకరించారు. బర్నగ్రామానికి రేషన్ బియ్యం పంపిణీ చేయాలని ఎ.చిన్నారావు, సీసీరహదారి మంజూరు చేయాలని ఈతమానుగూడకు చెందిన రాజేష్ అర్జీలు అందజేశారు. మంచినీటి సదుపాయం కల్పించాలని కుశిమి బంగారుగూడ గిరిజనులు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీఓ చిన్నబాబు, ఈఈ రమాదేవి, ఏపీడీ సన్యాసిరావు, డీఈ మధుసూదనరావు, సీడీపీఓ రంగ లక్ష్మి పాల్గొన్నారు. పీజీఆర్ఎస్కు 98 వినతులు -
కూటమి బరి తెగింపు!
మంగళవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2025–8లోపార్టీ మారకపోతే వార్డుల్లో ఏ పనీ చేయనీయబోమని పలువురిని కూటమి నాయకులు బెదిరించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నియమితులయ్యారన్న కారణంతో పలువురు చిరుద్యోగులను విధుల నుంచి తప్పించారు. ఇతర పనులేవీ మంజూరు చేయనీయమంటూ పలువురు కౌన్సిలర్లకు హెచ్చరి కలు జారీ చేశారు. దీంతోపాటు... పలువురికి ఇంటి స్థలం, రూ. 10 లక్షలు ఇస్తామన్న ఆశ చూపి టీడీపీలోకి చేర్చుకున్నారన్న ప్రచారం పట్టణంలో జోరుగా సాగుతోంది. భయపెట్టి, బెదిరించి, ప్రలోభపెట్టి ఫిరాయింపులను ప్రోత్సహించారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలో పార్వతీపురం పురపాలక సంఘ పరిధిలో గానీ.. నియోజకవర్గంలో గానీ చేసిన అభివృద్ధి అంటూ ఏదీ లేదు. ఉన్న ఉద్యోగాలను తీసివేయడమే గానీ.. కొత్తగా ఒకరిని నియమించింది లేదు. నియోజకవర్గంలో అభివృద్ధిని పూర్తిగా పక్కనపెట్టేసి.. ఫిరాయింపులపైనే స్థానిక ఎమ్మెల్యే దృష్టి సారించారన్న విమర్శ లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఫిరా యింపుల నేపథ్యంలో టీడీపీ అవిశ్వాస తీర్మా నం నోటీసు అందజేసింది. ఫలితంగా వైఎస్సార్సీపీకి కోరం తక్కువవుతుంది. సంఖ్యాబలం చూసుకుని, చైర్ పర్సన్ సీటు కోసం కూటమి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. ఇదే కూటమి ప్రభుత్వం ఎత్తుగడగా కనిపిస్తోంది. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నడుస్తున్న కౌన్సిలర్లపై స్థానిక ఓటర్లు ఇప్పటికే మండిపడుతున్నారు. ఒక పార్టీ గుర్తుతో గెలిచి మరో పార్టీలో కలిసి వెన్నుపోటు రాజకీయాలకు తెరతీయడంపై గుర్రుమంటున్నారు. తిరిగి మాతృపార్టీకి వస్తారా.. లేదంటే విశ్వాసాన్ని విడిచిపెట్టి అవిశ్వాస తీర్మానానికి అనుగుణంగా ముందుకు సాగుతారా అన్న చర్చ పట్టణవాసుల్లో సాగుతోంది. 26న ఇ–అడ్వాన్స్ టెండర్లు సీతంపేట:ఇ–అడ్వాన్స్ టెండర్లను ఈనెల 26న నిర్వహించనున్నట్టు ఐటీడీఏ పీఓ యశ్వంత్‌కుమార్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపా రు. 5వేల కొండచీపుర్లు, 100 క్వింటాళ్ల కుంకు డు, 100 క్వింటాళ్ల పసుపు కొమ్ముల విక్రయానికి టెండర్లు ఆహ్వానిస్తున్నామన్నారు. వివరాలకు జీసీసీ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. గవరమ్మపేటలో ఏనుగుల గుంపు జియ్యమ్మవలస: మండలంలోని గవరమ్మపే ట, వెంకటరాజపురం పంట పొలాల్లో సోమవా రం ఏనుగులు దర్శనమిచ్చాయి. వెంకటరాజపురంలోని బంటు అప్పలనాయుడు, దత్తి వెంకటనాయుడు, బంటు గౌరునాయుడుకు చెంది న జొన్న, అరటి తోటలు ధ్వంసం చేశాయి. ప్రభుత్వం స్పందించి తక్షణమే నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. పకడ్బందీగా ఏపీపీఎస్సీ పరీక్షలు విజయనగరం అర్బన్: జిల్లాలో మంగళ, బుధవారాల్లో జరగనున్న ఏపీపీఎస్సీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై తన చాంబర్లో సంబంఽధిత అధికారులతో సోమవారం సమావేశమయ్యారు. 25న అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్, 25, 26వ తేదీల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అనలిస్ట్ గ్రేడ్–2 ఉద్యోగాలకు, 26న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీ సర్ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్ ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. జిల్లాలో ఎంవీజీఆర్ కళాశాల, అయాన్ డిజిటల్, లెండి ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ట్రాన్స్‌కో ఎస్ఈ లక్ష్మణరావు, పరీక్షల సూపరింటెండెంట్ భాస్క రరావు, ఏపీపీఎస్సీ సెక్షన్ ఆఫీసర్ ఎం.బాలరాజు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కె.అనిల్‌కుమార్ పాల్గొన్నారు. వెబ్సైట్లో మ్రెరిట్ జాబితా విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, వైద్య కళాశాల్లో స్పీచ్ థెరపిస్టు, ఓటీ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్ పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ జాబితా వెబ్ సైట్లో పెట్టామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మలీల సోమవారం తెలిపారు. అభ్యంతరాలుంటే వైద్య కళాశాలలో ఏప్రిల్ ఒకటో తేదిలోగా లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరారు. సాక్షి, పార్వతీపురం మన్యం: కూటమి నాయకులు బరి తెగించారు. అధికా ర దర్పంతో అడ్డదారులు తొక్కారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పార్వతీపురం మున్సిపాలిటీ లో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లే లక్ష్యంగా ప్రలోభాల పర్వానికి దిగి.. నయానో భయానో తమ దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు సాగించారు. సంఖ్యాబలం లేకపోయినప్పటికీ, మున్సిపల్ చైర్పర్స న్ కుర్చీపై కన్నేసిన ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ... దానిపై తమవారిని కూర్చోబెట్టేందుకు అన్ని దా రులూ వెతికారు. ఒక్కొక్కరినీ తమ పార్టీల్లోకి లా క్కొన్నారు. చివరిగా సోమవారం ఉదయం మరో ఇద్దరిని కలిపేసుకుని, సాయంత్రం ఆగమేఘాలపై జేసీ ఎస్.ఎస్.శోభికను కలిసి అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారు. కొద్దిరోజుల కిందట పాలకొ ండ చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకునేందుకు అస్త్రశ స్త్రాలన్నీ ఉపయోగించారు. స్వయంగా కూటమి పార్టీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి బరిలో దిగారు. అయినప్పటికీ..పాలకొండ నగర పంచాయతీకి చెందిన కౌన్సిలర్లు వైఎస్సార్సీపీ పట్ల తమ విశ్వాసాన్ని చూపుకొన్నారు. ఎన్ని ప్రలోభాలకు పాల్పడినా వెరవలేదు. దీంతో కూటమి ఎత్తులు చిత్తయ్యాయి. విశ్వాసంపై నీళ్లు చల్లి.. అవిశ్వాసం పార్వతీపురం పురపాలక సంఘ పరిధిలో 30 వార్డులు ఉన్నాయి. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా 18వ వార్డుకు చెందిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్ బోను గౌరీశ్వరి కొనసాగుతున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో కేవలం ఐదు స్థానాల్లోనే టీడీపీ అభ్యర్థులను ఓటర్లు గెలిపించారు. బీజేపీ ఒక స్థానం, ఇద్దరు స్వతంత్రులు ఎన్నికల బరిలో గెలవగా.. 22 స్థానా ల్లో వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేసింది. ఇందులో 10, 19, 26వ వార్డులను అప్పటి ఎమ్మె ల్యే అలజంగి జోగారావు ఏకగ్రీవం చేయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. స్థానిక ఎమ్మెల్యే విజయచంద్ర వైఎస్సార్సీపీ, ఇండిపెండెంట్ కౌన్సిలర్లే లక్ష్యంగా.. ప్రలోభాలకు తెర తీశారు. అధికారంలో వచ్చిన తర్వాత ఇద్దరు స్వతంత్రులు, ఒక బీజేపీ కౌన్సిలర్, పదిమంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీలోకి చేర్చుకున్నారు. తాజాగా ఒకటో వార్డు స్వతంత్ర కౌన్సిలర్ ఆర్.శివకుమార్ (బంగారునాయుడు), వైఎస్సార్సీపీకి చెందిన 30వ వార్డు కౌన్సిలర్ రణభేరి చిన్నంనాయుడును టీడీపీలో చేర్చుకున్నారు. వాస్తవానికి ఒకటో వార్డు కౌన్సిలరు శివకుమార్ గెలిచిన వెంటనే బీజేపీలోకి జంప్ అయ్యారు. తర్వాత వైఎస్సార్సీపీలోకి, అనంతరం టీడీపీలోకి గోడ దూకారు. మరలా కొద్దిరోజుల తర్వాత వైఎస్సార్సీపీలో చేరగా.. తాజాగా మరోసారి పార్టీ మారి, టీడీపీ కండువా కప్పుకున్నారు. కూటమిది అడ్డదారి! తమ దారి అడ్డదారి అని కూటమి నాయకులు మరోసారి నిరూపించుకున్నారు. ఓటర్లు, ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా బీజేపీ, స్వతంత్రులు, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసి తమ పార్టీలో కలుపుకున్నారు. దీంతో కూటమి బలం 18కి చేరింది. ఎప్పటి నుంచో చైర్పర్సన్ కుర్చీపై తమ వారిని కూర్చోబెట్టేందుకు తహతహలాడుతున్న ఎమ్మెల్యే విజయచంద్ర.. నిమిషమైనా ఆలస్యం చేయకుండా సోమవారం సాయంత్రమే జేసీ శోభికను కలసి అవిశ్వాస తీర్మానం నోటీసు దగ్గరుండి అందజేశారు. వాస్తవానికి వైఎస్సార్సీపీ బీఫారంతో గెలిచిన పలువురు కౌన్సిలర్లు.. గత ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు వెన్నుపోటు రాజకీయాలకు తెరతీశారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న నేపథ్యంలో పలువురిపై వైఎస్సార్సీపీ సస్పెన్షన్ వేటు కూడా వేసింది. పార్వతీపురం రూరల్: క్రికెట్ బెట్టింగ్స్‌కు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టామని, బెట్టింగ్‌లకు పాల్పడిన, ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటా మని ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి హెచ్చరించారు. తన కార్యాలయంలో విలేకరులతో సోమవారం మాట్లాడారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో ఆన్లైన్, ఆఫ్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాల వలలో చిక్కుకు ని జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు హితవుపలికారు. బెట్టింగ్స్ పెను భూతం వంటివని, ఆశచూపి అథఃపాతాళానికి నెట్టివేస్తాయన్నారు. డబ్బులు పోగొట్టు కున్న అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటను ఉదహరించారు. క్రికెట్ వినోదం కోసమే చూడాలే తప్ప బెట్టింగ్‌ల వైపు మొగ్గు చూపకూడదన్నారు. తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ ఉండాలన్నారు. బెట్టింగ్‌లకు పాల్పడితే వారికి నచ్చజెప్పి ఆ ఊబిలోనుంచి బయటకు తీసుకురావాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు. అనుమానితులపై నిఘా పార్వతీపురం జిల్లా వ్యాప్తంగా గతంలో బెట్టింగ్‌లకు పాల్పడిన వారు, అనుమానితులపై పోలీస్ నిఘా ఉంచామన్నారు. జిల్లాలో ఎవరైనా బెట్టింగ్ లకు పాల్పడుతున్నట్లు తెలిస్తే 112/100కు డయల్ చేయాలని లేదా సమీపంలో ఉన్న పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు. న్యూస్రీల్ప్రలోభాలు.. బెదిరింపులు పార్వతీపురం మున్సిపల్ చైర్ పర్సన్ పీఠంపై ఎమ్మెల్యే కన్ను భయపెట్టి.. ప్రలోభపెట్టి కౌన్సిలర్లకు ఎర ఇంటి స్థలం, రూ.10 లక్షలకు బేరమంటూ ప్రచారం అధికార దర్పంతో అడ్డదారులు జేసీ శోభికకు అవిశ్వాస తీర్మానం నోటీసు -
అప్రమత్తంగా లేకుంటే అక్షయం
● క్షయ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే కఫం పరీక్ష చేయించాలి ● 60 ఏళ్లు దాటిన వారు, పొగ తాగేవారికి పరీక్ష అవసరం ● 100 రోజుల క్షయ కార్యక్రమంలో 861 కొత్త కేసులు గుర్తింపు ● నేడు ప్రపంచ క్షయ దినోత్సవంవిజయనగరం ఫోర్ట్: ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాప్తి చెందే అంటువ్యాధి క్షయ. క్షయ వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. దీని వల్ల వ్యాధి వ్యాప్తిని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సోమవారం ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. క్షయ వ్యాధిని గుర్తించి 6 నెలల పాటు మందులు వాడడం ద్వారా వ్యాధిని పూర్తిగా నివారించవచ్చు. అయితే వ్యాధి పట్ల నిర్లక్ష్యం చేస్తే మృత్యువాత పడే ప్రమాదం ఉంది. వ్యాధి లక్షణాలు ఉన్నప్పటికీ కొంతమంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అటువంటి వారికి ప్రాణాలు మీదికి వస్తుంది. తగు జాగ్రత్తలు పాటించడం ద్వారా వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చు. వ్యాధి లక్షణాలు: రెండు వారాలకు మించి దగ్గు, రెండు వారాలకు మించిన జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, ఛాతీలో నొప్పి, కఫంలో రక్తపు జీరలు రావడం, రాత్రి పూట చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆలసటగా ఉండటం, మెడ వద్ద వాపులు క్షయ వ్యాధి లక్షణాలు. మైక్రో బాక్టీరియా చుబర్‌క్యూలోసిస్ అనే బాక్టీరియా వల్ల గాలి ద్వారా ఈ వ్యాప్తి చెందుతుంది. రోగి దగ్గినప్పుడు ఉమ్మి తుంపర్ల ద్వారా కూడా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: క్షయ వ్యాధి రాకుండా ఉండాలంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ధూమపానం, మద్యపానం, సురక్షతం కాని లైంగిక సంబంధాలు వంటి వాటికి దూరంగా ఉండాలి. క్షయ వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే మందులను పూర్తి కాలం పాటు వాడాలి. సాధారణ క్షయ వ్యాధికి 6 నెలల పాటు, మధ్యలో మానివేసి తిరిగి ప్రారంభిస్తే 8 నెలల పాటు, మొండి క్షయ వ్యాధికి రెండేళ్ల పాటు మందులు వాడాలి. అలా కాకుండా మందులను మధ్యలో మానివేస్తే రోగ నిరోధక శక్తి క్షీణించి మృత్యవాత పడే ప్రమాదం ఉంది.క్షయ పరీక్ష చేసుకోవాల్సిన వారు: 60 ఏళ్లు దాటిన వారు, సుగర్ వ్యాధి గ్రస్తులు, మద్యం, పొగతాగేవారు. గతంలో క్షయ వ్యాధి మందులు వాడిన వారు, క్షయ వ్యాధి మందులు వాడిన వారి కుటుంబసభ్యులు, ఎత్తుకు తగ్గ బరువు లేని వారు, క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి. 861 కేసులు గుర్తింపు: జిల్లాలో 100 రోజుల టీబీ కార్యక్రమాన్ని 2024 డిసెంబర్ 7 నుంచి మార్చి 23 వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 5,59,899 మందిని స్క్రీనింగ్ చేసి 43,413 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు. 33, 637మందికి ఎక్స్‌రే తీయగా 861 క్షయ కేసులు నమోదయ్యాయి. -
వాగ్దేవి సమారాధనం సంస్థ వార్షికోత్సవానికి సర్వం సిద్ధం
● సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి విజయనగరం టౌన్: విద్యలనగరం విజయనగరంలో శ్రీ పైడితల్లి అమ్మవారి దివ్యాశీస్సులతో సంస్కృతి, సంప్రదాయ పరిరక్షణకు వేద సంస్కృతాంధ్ర భాషలలో ఎవరైతే స్థానికంగా విశేష కృషిచేసి ఉంటారో అటువంటి పెద్దలను సముచిత రీతిలో సంస్థ వార్షికోత్సవం రోజున సత్కరించుకునేందుకు ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు వాగ్దేవి సమారాధనం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక ధర్మపురి రోడ్డులో ఉన్న సంస్థ ఆవరణలో ఆదివారం వివరాలు వెల్లడించారు. ఉగాది పర్వదినం, సంస్థ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ దార్లపూడి శివరామకృష్ణకు వాగ్దేవి సాహిత్య స్రష్ట అనే పురస్కారంతో, డాక్టర్ బొంతు గురవయ్యకు వాగ్దేవి వరపుత్ర పురస్కారంతో సత్కరించుకుంటున్నామని తెలిపా రు. సంస్ధ ప్రధానకార్యదర్శి డాక్టర్ నాగమల్లిక మా ట్లాడుతూ గురజాడ గ్రంథాలయంలో విశ్వావసునామ సంవత్సర ఉగాది రోజున ఉదయం 10 గంటల నుంచి నిర్వహించే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సాహిత్య పర్యవేక్షకులు సాహితి, రుగ్వేదాచార్యులు రాంభట్ల సన్యాసిరాజు, శంబర కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
గురుకులాలు, కళాశాలల్లో సీసీ కెమెరాలు
● సజావుగా పదోతరగతి పరీక్షలు ● గురుకుకాల రాష్ట్ర కార్యదర్శి వీఎన్ మస్తానయ్యబొబ్బిలి: రాష్ట్రంలోని 50 గురుకులాలు, మరో పది కళాశాలల్లో సీసీ కెమెరాలతో భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు గురుకులాల రాష్ట్ర కార్యదర్శి వీఎన్ మస్తానయ్య తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన బొబ్బిలిలోని గురుకులాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఒక్కో గురుకులానికీ 8 చొప్పున మొత్తం 480 కెమెరాలను అమర్చేందుకు సంబంధిత వ్యక్తులతో మాట్లాడామని, త్వరలోనే కెమెరాలను అమర్చనున్నట్లు చెప్పారు. గురుకులాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల పర్యవేక్షణ సులువవుతుందన్నారు. అన్ని విభాగాలను అనుసంధానం చేస్తూ సీసీ కెమెరాల ద్వారా ప్రిన్సిపాల్స్, పీఈటీ, పీడీలు విద్యార్థులకు క్రమశిక్షణను మరింత మెరుగుపర్చేందుకు వీలవుతుందన్నారు. బొబ్బిలి గురుకులానికి ప్రహరీ, కంచెల నిర్మాణం ఒక కొలిక్కి వచ్చిందన్నారు. ఇప్పటికే ప్రహరీ దాదాపు పూర్తి కావచ్చిందని, త్వరలో మిగిలిన కొద్దిపాటి భాగం కూడా దాతల సాయంతో నిర్మాణం చేయనున్నట్లు చెప్పారు. మన బడి నాడు–నేడులో భాగంగా కొన్ని భవనాలు నిర్మించగా మిగిలిన పాత భవనాలను తొలగించాల్సి ఉందన్నారు. అలాగే గురుకులాల్లో రెసిడెన్షియల్ అనే పదానికి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా స్థానికంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అందుకోసం ఇక్కడ సిబ్బంది నివాస గృహాల నిర్మాణం కావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం నిధుల సమస్య ఉన్న కారణంగా పాత డార్మిటరీలను ఆధునికీకరించి కొద్దిమంది సిబ్బందినైనా స్థానికంగా ఉండేందుకు వీలుగా నిర్మాణాలు చేయనున్నామని తెలిపారు. దీనిపై అక్కడికక్కడే సంబంధిత ఈఈతో ఫోన్లో మాట్లాడారు. కళాశాలగా ఎచ్చెర్ల గురుకులం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల సమీపంలోని ఎస్ఎం పురంలో ఉన్న గురుకులాన్ని కళాశాలగా అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదించామని చెప్పారు. బొబ్బిలి గురుకులాన్ని కూడా చాలా సంవత్సరాలుగా కళాశాలగా మార్చాలన్న డిమాండ్, ప్రతిపాదనలు ఉన్నందున, ఇక్కడి కమిటీలు, స్థానికులు మంత్రి, ప్రజాప్రతినిధుల ద్వారా దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్ఎం పురం వద్ద ఉన్న గురుకులానికి చెందిన ప్రభుత్వ భూమి ఇప్పుడు ఆక్రమణలకు గురైనట్లు గుర్తించామన్నారు. మరో 11 ఎకరాలు మిగిలి ఉన్నందున దానిని సంరక్షించుకునేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినట్లు చెప్పారు. గురుకులాల్లో సిబ్బంది కొరతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ప్రస్తుతం గురుకులాల్లో జరుగుతున్న పదో తరగతి పరీక్షలకు తాను పరిశీలకుడిగా వ్యవహరిస్తున్నానని, పరీక్షలు ప్రశాంతంగానే జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కె.రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. -
పార్వతీపురం మన్యం జిల్లాలో 1451 క్షయ కేసులు
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో 20 పంచాయతీలను క్షయ రహిత పంచాయతీలుగా ఎంపిక చేసి జిల్లాలో 49 డిజిగ్నేటేడ్ మైక్రోస్కోప్ సెంటర్లు, 7 టీబీ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు 1451 మందికి క్షయ పాజిటివ్‌గా గుర్తించారు. వారిలో 1117 మందికి చికిత్స పూర్తి చేశారు. జనవరి 2025 నుంచి ఇప్పటివరకు 507 మందిని గుర్తించి వారికి చికిత్స అందించారు. 700 మంది పౌష్టికాహారం కిట్లుప్రస్తుతం జిల్లాలో ఏడు వందల మంది పౌష్టికాహారం కిట్లు పొందుతున్నారని జిల్లా క్షయ నియంత్ర అధికారి డాక్టర్ ఎం.వినోద్ తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారిలో కనీసం 10 నుంచి 15 శాతం మందికి కఫం పరీక్షలు చేయాలని ఆదేశించామని చెప్పారు. ఏఎన్ఎం, అశ కార్యకర్తలు క్షయరోగులను పరామర్శించి, మందులు వేసుకుంటున్నారో లేదో గమనించడమే కాకుండా ప్రతి రెండు నెలలకు ఒకసారి ‘కఫం’ పరీక్షకు పంపించాలని సూచించినట్లు చెప్పారు. -
ఘనంగా ద్విగళ అష్టావధానం
పాలకొండ: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం శ్రీ సూర్యచంద్ర కళాసాహితి ఆధ్వర్యంలో ద్విగళ అష్టావధానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ విక్రాంత్ పాల్గొని అవధాని బంకుపల్లి రమేష్ శర్మ, అవధాన చంద్రమస శతావధాని చంద్రశేఖర శర్మ, అవధాన చంద్రమస శతావధాని సాయికుమార్ శర్మలను సన్మానించారు. విశ్వావసు నామసంవత్సర ఉగాధి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కణపాక చౌదరినాయుడు, సింహచలాచార్య, బౌరోతు శంకరరావు, దిలీప్‌కుమార్, సాహితి శ్రీనివాసరావు, వెలమల మన్మథరావు, కడగల రమణ, గారాల సూర్యం తదితరులు పాల్గొన్నారు. ఖేలో ఇండియా పారా గేమ్స్‌లో రజతంవిజయనగరం: ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండవ ఖేలో ఇండియా పారా గేమ్స్‌లో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన కిల్లక లలిత సిల్వర్ మెడల్ కై వసం చేసుకుని జిల్లా పేరు మరోసారి మారు మోగించిందని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ తెలిపారు. ఈ పోటీల్లో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి 1200 మంది వరకు పారా క్రీడాకారులు పాల్గొన్నారని, టి–11 కేటగిరికి సంబంధించి 400 మీటర్ల పరుగు పందెంలో గట్టి పోటీ నెలకొన్నప్పటికీ లలిత అసామాన్య ప్రతిభ కనబరిచి సిల్వర్ మెడల్ సాధించడం అభినందనీయమని, ఇది జాతీయస్థాయిలో జిల్లాకు దక్కిన గౌరవమన్నారు. లలిత ను పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు, రా ష్ట్రకార్యదర్శి వి. రామస్వామి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు, కలెక్టర్ డాక్టర్. బీఆర్. అంబేడ్కర్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావులు అభినందించారని తెలియజేశారు. సీనియార్టీ జాబితా తయారీకి ఏకీకృత విధానం తప్పనిసరిపార్వతీపురంటౌన్: వివిధ జిల్లాలకు చెందిన విద్యాశాఖాధికారులు సీనియార్టీని రూపొందించడంతో ఒకే నిర్దిష్ట నియమాలు అనుసరించకపోవడం వల్ల అనేక పొరపాట్లు జరుగుతున్నాయని ఏపీటీఎఫ్ పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి ఎన్. బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాలు, రిజర్వేషన్ రోస్టర్ పాయింట్ల ప్రకారం రూపొందించారని, బదిలీలకు రిజర్వేషన్లు వర్తించవు కాబట్టి బదిలీలు కోరుకునే ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. బదిలీల్లో వ్యక్తిగతంగా ప్రిఫరెన్షియల్ కేటగిరీ, పనిచేసే పాఠశాల హెచ్ఆర్ఏ, పూర్తి సర్వీసు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పాయింట్లు కేటాయిస్తారన్నారు. బదిలీల పాయింట్లు సమానంగా వస్తే వయస్సును బట్టి సీనియార్టీ నిర్ణయిస్తారని పేర్కొన్నారు. వివిధ జిల్లాల విద్యాశాఖాధికారులు సీనియార్టీ రూపొందించడంలో ఒకే నిర్దిష్ట నియమాలు అనుసరించకపోవడం వల్ల పొరపాట్లు జరుగుతున్నాయని, వాటిని సవరించే విధంగా స్పష్టమైన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సంగీత, సాహిత్యాలతో పైడితల్లికి ఘనంగా నీరాజనం విజయనగరం టౌన్: శ్రీ పైడిమాంబ కళానికేతన్ ఆధ్యాత్మిక సేవా సంఘం 27వ వార్షికోత్సవాన్ని ఏప్రిల్ 22న గురజాడ కళాభారతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు సంస్థ వ్యవస్ధాపకుడు ఆర్.సూర్యపాత్రో పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక సంఘం కార్యాలయం ఆవరణలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంగీత, సాహిత్య కార్యక్రమాలతో పైడితల్లి అమ్మవారికి ఘనంగా నీరాజనాలర్పిస్తూ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అదే రోజు అమ్మవారి భక్తిగీతాలపపై భజన సీడీలను ఆవిష్కరిస్తామన్నారు. సంస్థ గౌరవాధ్యక్షుడు, ప్రముఖ సాహితీవేత్త నాలుగెస్సుల రాజు మాట్లాడుతూ పైడిమాంబ కళానికేతన్ సంస్ధ 27వ వార్షికోత్సవానికి ప్రముఖులతో పాటు, పలువురు పెద్దలు హాజరుకానున్నారన్నారు. ఆ రోజు వేకువజామునుంచి అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం నిర్వహించే సభా కార్యక్రమంలో పలువురిని సముచితరీతిలో సత్కరిస్తామన్నారు. కార్యక్రమంలో సంస్ధ ప్రతినిధులు తాడిరాజు, తదితరులు పాల్గొన్నారు. శ్రీపైడిమాంబ కళానికేతన్ ఆధ్యాత్మిక సేవా సంఘం వ్యవస్ధాపకుడు పాత్రో -
వానర సైన్యం!
వామ్మో..టెక్కలి : గూడేం.. టెక్కలి మండలంలోని ఈ గ్రామం పేరు వినగానే మొదటగా గుర్తుకు వచ్చేది కార్గిల్ పోరాట యోధులే. పలువురు సైనికులు అప్పటి యుద్ధంలో పాల్గొని గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు. ఇదే గ్రామం మామిడి పంటకు సైతం ప్రసిద్ధి. ఇక్కడి మామిడిపండ్లకు ఇతర రాష్ట్రాల్లో ఎంతో గిరాకీ. అటువంటి గూడేం గ్రామస్తులకు ఇప్పుడు వానరాల గుంపు కంటికి కునుకులేకుండా చేస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు గానీ గుంపులుగా సంచరిస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి. మామిడి పంటలు, మునగ, మొక్కజొన్న పంటలను నాశనం చేస్తున్నాయి. ఇళ్లల్లో చొరబడి అకస్మాత్తుగా దాడులకు తెగబడుతున్నాయి. గత కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి ఉండటంతో గ్రామస్తులు భయాందోళనతో బిక్కుబిక్కుమంటున్నారు. ఏటా మామిడి పంటతో లాభాలను చవిచూస్తున్న తమకు ఈ ఏడాది ఈ కోతుల బెడద వల్ల ఇప్పటికే తీవ్రమైన నష్టం వాటిల్లిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అటవీశాఖాధికారులు కనీస చర్యలు చేపట్టడం లేదని వాపోతున్నారు. ఇప్పటికై నా అటవీ శాఖాధికారులు స్పందించి గ్రామంలో కోతుల బెడద లేకుండా చూడాలని కోరుతున్నారు. బెంబేలెత్తిపోతున్న గూడేం గ్రామస్తులు గుంపులుగా తిరుగుతున్న కోతులు మామిడి, మునగ, మొక్కజొన్న పంటలు నాశనం -
లారీ ఢీకొని భార్యాభర్తల మృతి
సాలూరు: మండలంలోని నెలిపర్తి పంచాయతీ వంగర గుడ్డివలస గ్రామానికి చెందిన భార్యాభర్తలు సాలూరు పట్టణంలో లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందారు. ఆదివారం జరిగిన ఈ సంఘటనపై సీఐ అప్పలనాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వంగరగుడ్డివలస గ్రామానికి చెందిన భార్యాభర్తలు మజ్జి రాము(51), గురిబారి(47)లు సాలూరు పట్టణానికి వచ్చి సొంత పనులు ముగించుకుని ఆదివారం రాత్రి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయల్దేరారు. ఈ క్రమంలో పట్టణంలో బైపాస్ రోడ్డు వై జంక్షన్ వద్ద వారి బైక్‌ను ఒడిశా నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమద ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.కాగా ఆ భార్యాభర్తలు విజయవాడలో వలస పనులకు వెళ్లి ఇటీవలే తమ స్వగ్రామానికి వచ్చినట్లు తెలియవస్తోంది. -
ఉపశమనం ఇచ్చిన చిరు జల్లులు
భామిని: మండలంలో పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన చిరు జల్లులతో వాతావరణం కాస్త చల్లబడింది. రోజంతా మబ్బులు పట్టి సాయంకాలానికి చిరు జల్లులు కురువడంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో కురిసిన వర్షం వాతావరణాన్ని చల్లబరిచింది. యువతకు పీఎం ఇంటర్న్‌షిప్ : కలెక్టర్ పార్వతీపురం టౌన్: ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని యువత సద్వినియోగం చేసుకొవాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31వ తేదీ వరకు గడువుందని తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ, డిప్లమో, బీటెక్ ఉత్తీర్ణులైన వారు దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 500కు పైగా ప్రముఖ పరిశ్రమలలో ఇంటర్న్‌షిప్ పొందవచ్చని సూచించారు. వయస్సు 21 నుంచి 24 మధ్య ఉండాలని, ఏడాదికి కుటుంబ ఆదాయం రూ.8 లక్షల్లోపు ఉండాలని తెలిపారు. ఏడాది పాటూ జరిగే ఈ శిక్షణకు ఎంపికై న వారికి నెలకు రూ.5000 స్టైఫండ్ లభిస్తుందని, అలాగే ఒకే మొత్తంగా రూ.6000 ప్రొత్సాహకాన్ని కూడా అందజేయడం జరుగుతుందని వివరించారు. ఎంపికై న వారికి ప్రధానమంత్రి జ్ఞానజ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాల కింద బీమా రక్షణ కల్పించడం జరుగుతుందని తెలిపారు. వివరాలకు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని సంప్రదించవచ్చనని సూచించారు. మే 1 నుంచి సాలూరు – విశాఖ పాసింజర్ రైలు! బొబ్బిలి: సాలూరు – విశాఖ పాసింజర్ రైలు మే 1 నుంచి నడపనున్నట్టు రైల్వే వర్గాల ద్వారా తెలిసింది. ఈ రైలు రోజుకు రెండు సార్లు విశాఖ, సాలూరు మధ్య బొబ్బిలి జంక్షన్ మీదుగా నడవనుంది. చాలా ఏళ్లుగా ఇక్కడ ఉన్న బొబ్బిలి రైల్ బస్సు కొన్ని ట్రిప్పులను బొబ్బిలి – సాలూరు మధ్య నడిపేవారు. నిత్యం కిక్కిరిసే ప్రయాణికులతో నడుస్తున్న ఈ రైల్‌బస్ కరోనా కారణంగా రైల్వే అధికారులు నిలిపివేశారు. అనంతరం సాధారణ రైళ్లు, ఎక్స్‌ప్రెస్‌లు, గూడ్స్ రైళ్లు పట్టాలెక్కినా రైల్‌బస్‌ను రైల్వే వర్గాలు నడపలేదు. కొన్నాళ్ల కిందట రైల్వే వర్గాలు విశాఖ, సాలూరు మధ్య బొబ్బిలి మీదుగా రైలును నడపనున్నట్టు ప్రకటించాయి. దీనికోసం రైలు ట్రాక్‌ను పటిష్టపరిచారు కూడా! చివరకి మళ్లీ వాయిదా పడింది. అయితే ఈ రైలును ఈ ఏడాది మే 1 నుంచి నడపనున్నట్టు తెలుస్తోంది. రైల్వే సాంకేతికాఽధికారులు సాలూరు లైన్ వద్ద ఆదివారం గేటును అమర్చారు. బొబ్బిలి నుంచి రైలు బయలుదేరిన వెంటనే రాజ్‌మహల్ వద్ద లెవెల్ క్రాసింగ్ ఉంది. ఇక్కడ క్యాబిన్‌ను కూడా నిర్మించి ఇప్పుడు గేటు కూడా ఏర్పాటు చేశారు. ఈ విషయమై రైల్వే సాంకేతికాధికారులు మే 1 నుంచి విశాఖ, సాలూరు రైలును నడపనున్నట్టు వెల్లడించారు. ఘనంగా నృత్య కళాభారతి వార్షికోత్సవం విజయనగరం టౌన్: భారతీయ విద్యాకేంద్ర నిర్వహణలోని నృత్య కళాభారతి ద్వితీయ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. సద్గురు శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాన్ని నిర్వహించారు. నృత్య కళాభారతి నుంచి గుమ్చీ, శంకరమఠం, కోట మీదుగా బీవీకే పాఠశాల వరకూ తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం పాఠశాలలో త్యాగరాజ స్వామి పూజాకార్యక్రమం, పంచరత్న సేవ అనంతరం త్యాగరాజ విరచిత పంచరత్న కీర్తనలను కళాకారులు ఆలపించారు. కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ ఎం.ఏడుకొండలు ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో మహారాజా సంగీత, నృత్య కళాశాల అధ్యక్షులు కెఎవిఎల్ఎన్. శాస్త్రి పట్టణానికి చెందిన కళాకారులు ఎం.నీలాద్రిరావు, రాంచరణ్, పద్మావతి, రామచంద్ర శేఖర్, పద్మప్రియ, కళాభిమానులు తదితరులు పాల్గొన్నారు. -
ఆలయంలో దేవుడి విగ్రహాల ధ్వంసం
● పునర్నిర్మాణ దశలో దుండగుల దుశ్చర్య ● బోడసింగిపేటలో ఘటన ● దుర్గాదేవి, గరుత్మంతుడు విగ్రహాల ధ్వంసం బొండపల్లి: మండలంలోని బోడసింగిపేట గ్రామంలో జాతీయ రహదారి 26కు ఆనుకోని పునర్నిర్మాణంలో ఉన్న సీతారామ ఆలయంలో దేవుడి విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ధ్వంసం చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. గ్రామంలో గతంలో ఉన్న ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో దీన్ని పునర్నిర్మించేందుకు గ్రామస్తులంతా ఐక్యంగా శ్రీకారం చుట్టారు. పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. పెద్దాపురానికి చెందిన శిల్ప కళాకారులు ఆలయ నిర్మాణ పనులు చేస్తున్నారు. ఇంతలోనే ఆలయం వెలుపల గోడకు ఆనుకోని నిర్మాణ తుది దశలో ఉన్న దుర్గాదేవి విగ్రహంతో పాటు గరుత్మంతుడు విగ్రహాల చేతులు, కాళ్లను దుండగలు ధ్వంసం చేశారు. రోజూలాగే ఆదివారం ఉదయం పనులకు వచ్చిన శిల్ప కళాకారులు విగ్రహాలు ధ్వంసం కావడం చూసి గ్రామ పెద్దలకు విష యం తెలిపారు. సర్పంచ్ కోరాడ జానకీరాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ యు.మహేష్ ఆలయం వద్దకు చేరుకొని ధ్వంసమైన విగ్రహాలను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా గ్రామానికి ఆనుకొని రెండు మద్యం దుకాణాలు ఉండడంతో మందుబాబులే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా విగ్రహాల ధ్వంసం విషయం తెలుసుకున్న రాష్ట్ర చిన్న, మధ్య తరహ, ఎన్ఆర్ఐ వ్యవహరాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆలయానికి వచ్చి పరిశీలించారు. -
సోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2025
అన్నదాతకు కూటమి పాలనలో అన్నీ కష్టాలే.. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో వాణిజ్య పంటల సాగు విస్తీర్ణం పెంచాలని దానికి అనుగుణంగా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని కూటమి నేతలు కబుర్లు చెప్పారు. తీరా రైతులు ప్రభుత్వంపై నమ్మకంతో వాణిజ్య పంటల్లో ఒకటైన కోకో సాగు చేశారు. తీరా దిగుబడులు వచ్చేసరికి తనకేమీ సంబంధం లేనట్టు వ్యవహరిస్తోంది. ఫలితంగా కోకో గింజల కొనుగోలులో కంపెనీలు సిండికేట్‌గా ఏర్పడి రైతులను నష్టాల నట్టేట ముంచేస్తున్నాయి. అయినా కూటమి పాలకులకు చీమ కుట్టినట్టైన లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరు మారకుంటే ఆందోళన బాట పడతామని హెచ్చరిస్తున్నారు. పార్వతీపురం టౌన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక వాణిజ్య పంటల సాగును పెంచండి.. ఆర్థికంగా ఎదగండి అంటూ పిలుపునిచ్చింది. తీరా వాణిజ్య పంటలను సాగు చేస్తున్న రైతులకు ఇప్పుడు అన్యాయం చేస్తున్న పరిస్థితి నెలకొంది. వాణిజ్య పంటల్లో ఒకటైన కోకో రైతుల్లో ప్రభుత్వ తీరు ఆందోళన కలిగిస్తోంది. కోకో సాగు తరువాత వచ్చిన గింజలను కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ వైఖరితో కోకో గింజలను రైతుల వద్దే నిల్వ ఉంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు కంపెనీలు వీటిని సక్రమంగా కొనుగోలు చేయకపోవడంతో గింజల నాణ్యత దెబ్బతింటుంది. దీంతో రైతులు తీవ్రంగా కలత చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలి ప్రభుత్వం, అధికారులు తక్షణమే జోక్యం చేసుకొని కోకో రైతులకు న్యాయం చేయకపోతే కంపెనీల మోసాలకు గురై పెద్ద ఎత్తున నష్టపోయి అప్పులు పాలవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో ఉద్యాన శాఖాధికారులు, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని రైతుల వద్ద ఉన్న కోకో గింజలను అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా రూ.900 ధర ఇచ్చి కంపెనీలు కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయంలో మరింత ఆలస్యం అయితే కోకో రైతులు ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో 600 హెక్టార్లలో.. జిల్లాలో ఎక్కువగా గిరిజన, మైదాన ప్రాంతాల్లో కోకో పంటను పండిస్తున్నారు. మొత్తంగా జిల్లాలో 600 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో దళారుల హవా నడుస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో కిలో ధర రూ.900 ధర పలుకుతుండగా దళారులు రూ.500 నుంచి 550కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. మరీ డిమాండ్ చేస్తే రూ.600 దాటడం లేదు. ఓ వైపు ప్రభుత్వం వాణిజ్య పంటలు పండించాలంటూ ప్రకటనలు చేస్తుందని, పంటలు పండించిన తరువాత గిట్టుబాటు ధర లేకుండా దళారుల పాలవ్వడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యూస్రీల్నాణ్యత ప్రమాణాలు పాటించాలి ధర లేక దిగాలు..! పడిపోయిన ధర అంతర్రాష్ట్ర మార్కెట్లో కిలో రూ.900 స్థానిక మార్కెట్లో రూ.600లే.. జిల్లాలో 600 హెక్టార్లలో పంట సాగు రైతులను నష్టపరిచే చర్యలను అరికట్టాలి కంపెనీలు సిండికేట్‌గా మారి రైతులను నష్టపరుస్తున్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకొని దీన్ని అరికట్టాలి. అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా రైతుల వద్ద ఉన్న కోకో గింజలను కొనుగోలు చేయాలి. రూ.900లకు కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. జిల్లాలో ప్రోసెసింగ్ యూనిట్లు ఏర్పాట్లు చేసి రైతులను ఆదుకోవాలి. – ఎస్.సత్యనారాయణ, సుంకి గ్రామం, గరుగుబిల్లి మండలం ప్రభుత్వం కొనుగోలు చేయాలి కోకో గింజలను కంపెనీలు కొనుగోలు చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వమే గింజలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. కోకో గింజల కొనుగోలు కంపెనీలతో అధికారుల సమక్షంలో కోకో రైతులు, రైతు సంఘాలతో సమావేశాలు నిర్వహించి సమస్యను పరిష్కరించాలి. దళారుల చేతికి పంట వెళ్లకుండా ప్రభుత్వం రూ.900లకే కొనుగోలు చేయాలి. – ఎం.సత్యంనాయుడు, పార్వతీపురం కోకో పంట దిగుమతులు వచ్చే సమయంలో రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. జిల్లాలో 600 హెక్టార్లలో ప్రస్తుతం పంట సాగవుతుంది. ధర హెచ్చతగ్గుల విషయంలో అధికారులు కమిటీ వేశారు. కమిటీ నిర్ణయాలకు అనుగుణంగా ధర ఉంటుంది. రైతులకు మేలు చేకూరేలా పంట కొనుగోలు చేసేలా చర్యలు చేపడతాం. – శ్యామల, జిల్లా ఉద్యాన శాఖాధికారిని, పార్వతీపురం మన్యం -
ఊరి బడిని కాపాడుకుందాం...
మన ఊరి బడిని మనమే కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందంటూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ప్రభుత్వ చర్యలను తిప్పికొట్టేందుకు.. బడిని కాపాడుకునేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఏకమవ్వాలని పిలుపునిస్తున్నారు. వీరఘట్టం మండలం కిమ్మి, గడగమ్మ గ్రామాల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో మన ఊరి బడిని మనమే కాపాడుకుందాం.. అంటూ నినదించారు. దీనికి సంబంధించి పోస్టర్లను ఆవిష్కరించారు. ఆందోళనలో ఆ సంఘ నాయకులు ఎస్.మురళీమోహనరావు, మజ్జి పైడిరాజు, అరసాడ చంద్రమోహన్, కర్రి సింహాచలం, బి.వాసుదేవరావు, శీలా గణేష్‌తో పాటు కిమ్మి సర్పంచ్ గురాన రామ్మోహనరావు, ఎస్ఎంసీ చైర్మన్ వాన సంతోషమ్మ, గడగమ్మ సర్పంచ్ వి.సూర్యనారాయణ, ఎస్ఎంసీ వైస్ చైర్మన్ పి.దయానంద్, గ్రామస్తులు పాల్గొన్నారు. – వీరఘట్టం -
బోడసింగిపేటలో చోరీ
బొండపల్లి: మండలంలోని బోడసింగిపేట గ్రామంలో గిట్టుపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో శనివారం వేకువజామున ఒక దుకాణంలో చోరీ జరిగింది. దుకాణంలో కొంత నగదుతో పాటు విలువైన కిరాణా సామగ్రి అపహరించుకుపోయారు. కనిమెరక గ్రామానికి చెందిన జి.శ్రీనివాస్ గుప్తా బోడసింగిపేటలో కిరాణా దుకాణాన్ని కొన్నాళ్లుగా నడుపుతున్నాడు. రోజూలాగే శుక్రవారం రాత్రి దుకాణం మూసి ఇంటికి వెళ్లిపోయాడు. శనివారం ఉదయం వచ్చి చూడగా దుకాణం షట్టర్లు పగులకొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ యు.మహేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారారాలను సేకరించారు. దుకాణంలో ఉంచిన రూ.12వేల నగదుతో పాటు రూ.13 వేల విలువ చేసే కిరాణా వస్తువులు అపహరించుకుపోయినట్టు బాధితుడు గుప్తా తెలిపాడు. బెల్లం ఊట ధ్వంసం సీతంపేట: సీతంపేట ఏజెన్సీలోని కుశిమిగూడ పరిధిలో మూడు వేల లీటర్ల పులిసిన బెల్లం ఊటలు శనివారం ధ్వంసం చేసినట్టు ఎస్ఐ వై.అమ్మన్నరావు శనివారం తెలిపారు. సారా వంటకాలు చేస్తున్నారనే సమాచారం అందడంతో దాడులు జరిపినట్టు తెలిపారు. భూమిలో డ్రమ్ములతో పాతి ఉంచిన బెల్లం ఊటలు వెలికి తీసి పారబోసి, డ్రమ్ములు స్వాధీనం చేసుకున్నామన్నారు. బాసంగిలో గజరాజుల గుంపు జియ్యమ్మవలస: మండలంలోని బాసంగి పంట పొలాల్లో గజరాజుల గుంపు శనివారం సాయంత్రం కనిపించాయి. ఉదయం వెంకటరాజపురం, బాసంగి, గదబవలసలో వరి పంటలను ధ్వంసం చేసిన గజరాజులు సాయంత్రానికి బాసంగి పరిసర ప్రాంతాల్లోకి చేరాయి. రాత్రికి మళ్లీ వెంకటరాజపురం, గవరమ్మపేట గ్రామాల్లోకి చొచ్చుకు రావడంతో గ్రామస్తులు భయాందోళనలు చెందుతున్నారు. రబీ వరి పంట ఉభాలు వేసి నెల రోజులు కావడంతో పంటలను ధ్వంసం చేస్తే పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. 258 కేజీల గంజాయి స్వాధీనం పాచిపెంట: మండలంలో రెండు కార్లలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నట్లు రూరల్ సీఐ రామకృష్ణ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్ వద్ద పట్టుబడిన గంజాయిని చూపించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. శుక్రవారం మధ్యాహ్నం మండలంలో కొటికిపెంట పంచాయతీ గోగాడవలస సమీపంలో హరిత రహదారిపై అనుమానాస్పదంగా రెండు కార్లు ఉన్నాయని మాతుమూరు ఇంచార్జ్ వీఆర్ఓ తమకు సమాచారం ఇచ్చారని తెలిపాడు. ఈ మేరకు పాచిపెంట ఎస్ఐ వెంకటసురేష్ సిబ్బందితో ఆ ప్రదేశానికి వెళ్లి కార్లలో గంజాయి ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
పీఎం ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలి
విజయనగరం అర్బన్: ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ కార్యక్రమానికి నిరుద్యోగ యువత ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోరారు. దీనికి సంబంధించి విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పది ఆపై తరగతులు ఉత్తీర్ణులైన వారంతా ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 550 పరిశ్రమల్లో వీరికి శిక్షణ ఇస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి కమిటీ సమావేశం కలెక్టరేట్ చాంబర్లో శనివారం జరిగింది. ముందుగా జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ యువత నైపుణ్యాన్ని పెంచేందుకు, ఉపాధి కల్పించేందుకు జిల్లాలో తీసుకున్న చర్యలను వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యువత నైపుణ్యాన్ని పెంచేందుకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించి పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలని ఆదేశించారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను సమీక్షించారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ ఎ.కళ్యాణ చక్రవర్తి, సీపీఓ పి.బాలాజీ, మెప్మా పీడీ చిట్టిరాజు, జిల్లా ఉపాధి అధికారి అరుణ తదితర అధికారులు పాల్గొన్నారు. పనస చెట్లను విరివిగా పెంచాలి బొబ్బిలి వీణల తయారీకి ఉపయోగించే పనస కలప కొరత ఉందని, దీనిని నివారించేందుకు విస్తృతంగా పనస చెట్లను పెంచాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సూచించారు. పనస నర్సరీలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే అటవీ శాఖకు ఆదేశించడం జరిగిందని చెప్పారు. ఉపాధి హామీ, కన్వర్జెన్నీ పనులు, పల్లె పండగ, ఉల్లాస్ పరీక్ష తదితర అంశాలపై ఎంపీడీఓలు, ఏపీఓలు, పీఆర్ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫారమ్ పాండ్స్ తవ్వడానికి జిల్లాలో శనివారం నుంచి ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించినట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ నుంచి డ్వా మా పీడీ ఎస్.శారదాదేవి, పంచాయితీరాజ్ ఎస్ఈ ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
యథేచ్ఛగా విక్రయాలు..!
ఇదీ పరిస్థితి పాలకొండ పట్టణంలో కొన్నాళ్ల వరకు ప్లాస్టిక్‌పై నిషేధం విధించినా.. తర్వాత అధికారులు పట్టు సడలించటంతో మళ్లీ మొదటికి వచ్చింది. గతంలో 50 కేసులు నమోదు చేసి సుమారు రూ.40 వేలు అపరాధ రుసుము వసూలు చేశారు. తర్వాత ఈ అంశంపై పటిష్ట చర్యలు చేపట్టకపోవడంతో పాలకొండలో పాలథీన్ నిషేధం అటకెక్కింది. పార్వతీపురం పట్టణంలో వీటి వినియోగం భారీగా ఉంటోంది. మొత్తం చెత్త ఉత్పత్తిలో 30–40 శాతం భాగం దీనిదే. ఇప్పటి వరకు కేవలం 45 కేసులు నమోదు చేసి రూ.85 వేలు మాత్రమే అపరాధ రుసుం విధించటం దీనికి తార్కాణం. అయినా ప్లాక్టిక్ వినియోగం తగ్గలేదు. కురుపాం నియోజకవర్గానికి ఒడిశా నుంచి భారీగా పాలథీన్ సంచులు, తదితరాలు చేరుకుంటున్నాయి. పాలథీన్ నిషేధంలో సాలూరు నగర పంచాయతీలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ప్లాస్టిక్ అమ్మకాలపై కఠిన చర్యలు చేపడితే, వినియోగం క్రమేపీ తగ్గుతుందని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. -
పట్టుమని 20 నిమిషాలు వస్తే ఒట్టు...
తాగునీరా.. మురుగునీరా? సాలూరు రూరల్: సాలూరు పట్టణంలో రెండు దశాబ్దాల క్రితం వేసిన పైప్లైన్లు కావడంతో చాలా వరకు దెబ్బతిన్నాయి. ఫలితంగా కుళాయిల ద్వారా వస్తున్న తాగునీటిలో బురద, నలకలు ఉంటున్నాయి. పట్టణ వాసులకు స్వచ్ఛమైన నీటిని అందించాలని ప్రజలు కోరుతున్నారు. సాలూరులో సరఫరా అవుతున్న కలుషిత నీరు సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో వేసవి ఆరంభంలోనే దాహం కేకలు వినిపిస్తున్నాయి. ప్రజలకు సమృద్ధిగా తాగునీరు అందజేస్తామంటూ ప్రభుత్వ యంత్రాంగం చెబుతున్న మాటలు ఆచరణ దూరంగా ఉంటున్నాయి. తాగునీరు అందక ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. పార్వతీపురం పురపాలక సంఘంలో నాలుగు రోజులకోసారి తాగునీటిని అందిస్తున్న పరిస్థితి నెలకొంది. సాలూరు పురపాలక సంఘంలో నీటిలో కాలువ వ్యర్థాలు వస్తుండడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన ప్రాంతాలు సైతం గుక్కెడు నీటి కోసం అల్లాడిపోతున్నారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లక్షలాది రూపాయలు వెచ్చించి.. ఇంటింటికీ కుళాయిలు వేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ట్యాంకుల్లో నీటి సరఫరా చేయక, నిరుపయోగంగా వదిలేశాయి. జిల్లాలో నీటి సమస్యను అరికట్టేందుకు వాటర్ గ్రిడ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. 15 మండలాలకు నీటిని అందించడానికి తోటపల్లి, పెద్దగెడ్డ, వెంగళరాయసాగర్ జలాశయాలను గుర్తించారు. భామిని, సీతంపేట మండలాలకు హిరమండలం బ్యారేజీ నుంచి ఇవ్వాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకోసం రూ.2వేల కోట్లకుపైగా వ్యయమవుతోందని అంచనా వేస్తున్నారు. ఇది ఎప్పటికి కార్యరూపం దాల్చుతుందో చూడాలి. ప్రకటనలకే పరిమితం వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చేస్తామంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు చేస్తుందే తప్ప.. ఆచరణలో సాధ్యం కావడం లేదు. క్రాస్ ప్రొగ్రాం అంటూ అన్ని మండల కేంద్రాల్లో యంత్రాంగం చేసిన హడావిడి కొద్దిరోజులకే పరిమితమైంది. వేసవి ప్రారంభంలోనే తాగునీటికి ఇంత ఇబ్బంది ఉంటే రానున్న రెండు నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని గిరిజన, పట్టణ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటికీ తాగునీరు అందించేందుకు గత ప్రభుత్వ హయాంలో జల్‌జీవన్ మిషన్ పథకం పనులు ప్రారంభిస్తే.. అందులో చాలా వరకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిలుపు చేసింది. జిల్లాలో మొత్తం 3,302 వరకు పనులు మంజూరు కాగా.. దాదాపు రూ.526 కోట్లు కేటాయింపులు చేశారు. ఇందులో వివిధ కారణాలను చూపి 2,013 పనులను కూటమి ప్రభుత్వం వచ్చాక రద్దు చేయడం గమనార్హం. ఫలితంగా ఈ వేసవిలో ప్రజలకు తాగునీటి ఇక్కట్లు తప్పడం లేదు. పాలకొండలో దాహం కేకలు పాలకొండ: పాలకొండ నగర పంచాయతీలో సుమారు 38 వేల మంది జనాభా ఉంటే.. తాగునీటి సరఫరా రోజుకు 6 లక్షల లీటర్ల దాటి జరగడం లేదు. వాస్తవానికి రోజుకు 20 లక్షల లీటర్ల వరకు తాగునీటిని జనాభా ప్రాతిపదికన అందించాల్సి ఉంది. వేసవి వస్తే పట్టణంలోని కొత్తగా ఏర్పడిన కాలనీలకు నీటి సరఫరా జరగడం లేదు. ఒక్కొక్క రోజు ఒక్కో ప్రాంతానికి నీటి సరఫరా నిలిపివేస్తున్నారు. వేసవిలో పైపులైన్ మరమ్మతులు జరిగితే రెండుమూడు రోజులపాటు పూర్తిగా బంద్ కావాల్సిందే. 50 ఏళ్ల నాటి పైపులైన్లు కావడంతో కాలువల్లో ఉన్న పైపులు శిథిలమై కుళాయిల ద్వారా మురుగు, బురదనీరు వస్తోంది. గారమ్మకాలనీ, బుట్టిమటం కాలనీలకు కనీసం పైపులైన్లు వేయని దుస్థితి నెలకొంది. నాన్అమృత్ పథకం ద్వారా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.57లక్షలు మంజూరు చేసి పైపులైన్ సిద్ధం చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ పైపులైన్లను గాలికి వదిలేసింది. గుమ్మలక్ష్మీపురం: కురుపాం నియోజకవర్గంలోని జియ్యమ్మవలస మండల కేంద్రంలో గల ఎస్సీ, ఎస్టీ వీధులకు సక్రమంగా తాగునీటి సరఫరా జరగక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. రెండురోజులకోసారి కుళాయిల ద్వారా తాగునీరు కేవలం 20 నిమిషాలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. రోజూ తాగునీటి సరఫరా చేయాలని స్థానికులు కోరుతున్నారు. గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో రెండురోజులకోసారి నీటి సరఫరా అవుతోంది. వేసవి దృష్ట్యా ప్రతిరోజూ కనీసం ట్యాంకుల ద్వారా అయినా సరఫరా చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
ఒడిశా ఆగడాలపై తహసీల్దార్‌కు ఫిర్యాదు
సాలూరు రూరల్: ఒడిశా ప్రభుత్వం కొటియా గ్రామాల గిరిజనులపై చేస్తున్న దౌర్జన్యాన్ని నిలువరించాలని తహసీల్దార్ రమణమూర్తికి ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు శనివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం మండల కమిటీ సభ్యుడు తాడంగి సన్నం, బాధిత గిరిజనుడు తాడంగి భీమ మాట్లాడుతూ కొటియా గిరిజన గ్రామాల గిరిజనుల భూములను ఆక్రమించి కంచె వేస్తున్న ఒడిశా అధికారులను ఆంధ్రా అధికారులు అడ్డుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన పొడు పట్టా భూముల్లో దౌర్జన్యంగా కంచె వేస్తుంటే అడ్డుకున్న గిరిజనులపై ఒడిశా అధికారులు దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు. తమపై ఒడిశా అధికారులు దౌర్జన్యం చేస్తుంటే ఆంధ్రా అధికారులు పట్టించుకోవడం లేదని గిరిజనులు వాపోయారు. కొటియా గ్రామాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరారు.ఉగాది కాదు.. ఇది కూటమి దగా! శృంగవరపుకోట : రానున్న ఉగాది వలంటీర్లకు కూటమి ప్రభుత్వం చేసే దగా.. అని ఏపీ గ్రామ వార్డు వలంటీర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దేవరాజు అన్నారు. శనివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల వేళ వలంటీర్ల వ్యవస్థను పటిష్టం చేస్తామని, రూ.10వేల వేతనం ఇస్తామని ఇప్పుడు మాట తప్పారన్నారు. ఎన్నికల్లో గెలుపొందాక వలంటీర్ల వ్యవస్థకు చట్టబద్దత లేదని మాట మార్చారన్నారు. కూటమి సర్కారును నిలదీసేందుకు ఈ నెల 30వ తేదీన ఆందోళన కార్యక్రమానికి సిద్ధం కావాలన్నారు. బాబు అధికారంలోకి వచ్చాక వలంటీర్ల వ్యవస్థపై గొడ్డలి వేటు వేశారన్నారు. -
27న విజ్ఞాన యాత్ర
పార్వతీపురంటౌన్: విజ్ఞాన యాత్రలో భాగంగా ఈ నెల 27న ఒడిశా రాష్ట్రం రాయగడలోని ఆరు ప్రాంతాలను విద్యార్థులు సందర్శించనున్నారు. ఈ మేరకు సైన్స్ ఎక్స్పోజర్ విజిట్ వాల్‌పోస్టర్‌ను కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌తో పాటు విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారులు శనివారం ఆవిష్కరించారు. రాయగడ పరిసర ప్రాంతాల్లోని మినరల్ వాటర్ ప్లాంట్ అండ్ బేవరేజ్ లిమిటెడ్, జె.కె.పేపర్ మిల్లు, నాగావళి ప్లాంటోరియం అండ్ సైన్స్ మ్యాజియం, పీమాకేం లైమ్‌స్టోన్ ఇండస్ట్రీ, ఇండియన్ మెటల్స్ అండ్ ఫెర్రో ఎల్లాయిస్ లిమిటెడ్, ఫారంపాత్ సందర్శన కోసం జిల్లా నుంచి 130 మంది విద్యార్థులతో పాటు 30 మంది ఉపాధ్యాయులు వెళ్లనున్నారు. కార్యక్రమంలో డీఈఓ ఎన్.తిరుపతినాయుడు, జిల్లా సైన్స్ అధికారి లక్ష్మణ్, సమగ్ర శిక్ష ఏసీపీ ఆర్.శంకర్, తదితరులు పాల్గొన్నారు. 25 వరకు గడువు పెంపు పార్వతీపురం: బీసీ వర్గాలకు మంజూరు చేసే స్వయం ఉపాధి యూనిట్ల దరఖాస్తు గడువును ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు పొడిగించినట్లు బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.గడ్డెమ్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని బీసీ, ఈబీసీ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తిగల వారు హెచ్‌టీటీ పీఎస్://ఏపీఓబీఎంఎంఎస్.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తులను సమర్పించాలన్నారు. సమర్పించిన దరఖాస్తులను ఆయా మండలాల్లోని ఎంపీడీఓలకు, మున్సిపల్ కమిషనర్‌కు అందజేయాలని పేర్కొన్నారు. ఏనుగుల జోన్ వద్దు సీతానగరం: మండలంలోని అమ్మాదేవి కొండ చుట్టూ ఉన్న ప్రజల ప్రాణాలకు ముప్పుతేచ్చే ఏనుగుల జోన్ ఏర్పాటుకు నిరసనగా సీపీఎం ఆధ్వర్యంలో శనివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏనుగుల జోన్ ఏర్పాటుచేసి వ్యవసాయం చేయకుండా చేయొద్దన్నారు. రైతుల పొట్టకొట్టొద్దంటూ నినదించారు. జోన్ ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు బి.అప్పా రావు, రెడ్డి వేణు, ఈశ్వరరావు, రమణమూర్తి, వెంకటరమణ, రాంబాబు, పి.సింహాచలం, తవుడన్న, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. క్షయ నిర్మూలనలో భాగస్వాములు కావాలి పార్వతీపురంటౌన్: క్షయ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ కోరారు. ఈ నెల 24న ప్రపంచ క్షయ నిర్మూలన దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో శనివారం పోస్టర్ విడుదల చేశారు. క్షేత్ర స్థాయిలో సర్వే చేసి క్షయ వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో కఫం పరీక్షలు, ఎక్స్‌రే యంత్రాలు, సిబినాట్, 19 ఆర్టీపీసీఆర్ టీబీ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయ న్నారు. వ్యాధిగ్రస్తులకు 6 నెలలకు సరిపడా మందులు ఇవ్వడంతో పాటు ప్రతినెల రూ. 1000 చొప్పున ఖాతాలో జమచేయాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.భాస్కరరావు, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్మోహన్రావు, జిల్లా క్షయ నియంత్రణ అధికారి వినోద్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
ఫారంపాండ్స్తో భూగర్భజలాల పెంపు
గరుగుబిల్లి: ఫారంపాండ్ల నిర్మాణంతో వాననీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాలను పెంపొందించుకోవచ్చని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. ప్రపంచ జలదినోత్సవం సందర్భంగా గరుగుబిల్లి మండలం కొంకడివరం గ్రామంలో ఉపాధిహామీ నిధులతో నిర్మించిన సామూహిక ఫారంపాండ్స్ పనులను ఆయన శనివారం పరిశీలించారు. గ్రామంలో కొత్తగా ఫారంపాండ్ నిర్మాణం పనులను ఆయన గునపాంతో తవ్వి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్త ప్రాణకోటికి జలమే జీవనాధారమని, జలాల ఆవశ్యకతను తెలుసుకొని వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. భూగర్భ జలాలను పెంపొందించుకోకుంటే భవిష్యత్‌లో నీటి కష్టాలు తప్పవన్నారు. భావితరాలకు నీటి కొరత లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. గ్రామంలో ఫారంపాండ్ పను లు ప్రారంభించిన రైతు అల్లు తిరుపతినాయుడును కలెక్టర్ దుశ్శాలువతో సత్కరించారు. ఆయిల్ పామ్ సాగును పెంచాలి ఆయిల్‌పామ్ సాగును పెంపొందించేందుకు రైతు లు ముందుకు రావాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ రైతులకు పిలుపునిచ్చారు. మండలంలోని కొంకడి వరంలో సర్పంచ్ అల్లు అప్పలనాయుడు సాగుచేస్తున్న ఐదెకరాల ఆయిల్ పామ్ పంటను పరిశీలించి అభినందించారు. రైతులు వాణిజ్య పంటలపై ఆసక్తి చూపాలన్నారు. ఉద్యానవన పంటలను సాగుచేసే రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ కె. రామచంద్రరావు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ ఓ.ప్రభాకరరావు, తహసీల్దార్ పి.బాల, ఎంపీడీఓ జి.పైడితల్లి, సర్పంచ్ అల్లు అప్పలనాయుడు పాల్గొన్నారు. కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ -
నాలుగు రోజులకోసారి నీటి సరఫరా..
పార్వతీపురం టౌన్/రూరల్/బలిజిపేట: పార్వతీపురం పట్టణంలో నాలుగురోజులకోసారి కుళాయిల ద్వారా నీటి సరఫరా అవుతోంది. అది కూడా 20 నిమిషాల్లోపే. అరకొర నీరు ఎలా సరిపోతుందంటూ పట్టణ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరేట్‌కు ఆనుకుని ఉన్న వీధుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కొద్దిరోజుల క్రితం పీజీఆర్ఎస్ కార్యక్రమంలోనూ ఇదే సమస్యపై మహిళలు వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్ ఆవరణలో ధర్నాలు సైతం చేశారు. దీనికితోడు పలు వీధుల్లో కుళాయిల ద్వారా బురదనీరు వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని డోకిశీల, గోచెక్క తదితర గిరిజన గ్రామాల్లో తాగునీరు సమయానికి సరఫరా చేయకపోవడంతో నూతులు, వాగులకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బలిజిపేట మండలం తుమరాడ, బర్లి గ్రామాల్లో నీటి సమస్య ఎక్కువగా ఉంది. మహిళలు ఖాళీ బిందెలతో నిరసనలు తెలిపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పార్వతీపురం మండలంలో డోకిశీల గ్రామంలో తాగునీటి ఎద్దడి కారణంగా మహిళలు సమీపంలోఉన్న ఆశ్రమ పాఠశాలకు వెళ్లి ప్రతి రోజూ తాగునీరు తెచ్చుకునే పరిస్థితి ఉంది. -
20.16 లక్షల మొక్కల పెంపకం
వీరఘట్టం: జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచేందుకు ఈ ఏడాది 18 నర్సరీల్లో 20.16 లక్షల మొక్కలు పెంచాలన్నది లక్ష్యంగా నిర్ణయించామని జిల్లా అటవీశాఖ అధికారి జి.ఎ.పి. ప్రసూన అన్నారు. వీరఘట్టం మండలం రేగులపాడులో కొత్తగా ఏర్పాటు చేసిన నర్సరీను ఆమె శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మొక్కల పెంపకం బాధ్యతను అటవీ సెక్షన్, బీట్ ఆఫీసర్లకు అప్పగించామన్నారు. ప్రస్తుతం పాలకొండ రేంజ్ పరిధిలో 20,507 హెక్టార్లు, కురుపాం రేంజ్ పరిధిలో 32,681 హెక్టార్లు, పార్వతీపురం రేంజ్లో 26,301 హెక్టార్లు, సాలూరు రేంజ్లో 28,230 హెక్టార్లు కలిపి జిల్లా మొత్తం 1,07,719 హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయన్నారు. వన నర్సరీల్లో పెంచే మొక్కలను ఈ ఏడాది జిల్లాలోని పార్వతీపురం, కొమరాడ, గరుగుబిల్లి, సీతానగరం, వీరఘట్టం, సీతంపేట, భామిని, పాలకొండ అటవీ ప్రాంతాల్లో నాటించి అటవీ విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. త్వరలో కుంకీ ఏనుగులను తెప్పించి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తున్న 11 ఏనుగుల గుంపును సీతానగరం మండలం గుచ్చిమి వద్ద ఏర్పాటుచేస్తున్న తాత్కాలిక ఎలిఫెంట్ జోన్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఆమె వెంట పాలకొండ రేంజర్ కె.రామారావు, వీరఘట్టం సెక్షన్ ఆఫీసర్ పి.రవిబాబు, సోషల్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సోమేశ్వరరావు, తదితరులు ఉన్నారు. జిల్లా అటవీశాఖ అధికారి ప్రసూన -
ప్రజలు సహకరించాలి
ప్లాస్టిక్ చేతి సంచులు, కవ ర్లు నగరంలో నిషేధించాం. ప్రజలు తమ వంతు సహకారం అందించాలి. వ్యాపా రులు పర్యావరణానికి హాని చేకూరని చేతి సంచులను విక్రయించాలి. ప్రజలు గుడ్డ చేతి సంచుల వినియోగించి ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్టేందుకు సహకరించాలి. – శ్యామ్ ప్రసాద్, కలెక్టర్, పార్వతీపురం మన్యం కఠిన చర్యలు తప్పవు ప్లాస్టిక్ సంచుల వాడకం తగ్గించాలి. వాడిన వాటిని చెత్త కుప్పల్లో, కాలువల్లోకి వదిలేస్తున్నారు. నిషేధం పక్కాగా అమలు చేస్తాం. స్వర్ణాంధ్రా–స్వచ్ఛాంధ్రా కార్యాక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు పక్కాగా చర్యలు చేపడతాం. – టి.జయరాం, నగర పంచాయతీ కమిషనర్,పాలకొండ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.. నిషేధిత ప్లాస్టిక్ సంచుల వినియోగం వల్ల కలిగే అనర్ధాలపై తరచూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్లాస్టిక్ సంచులు విక్రయించే వ్యాపారులతో కూడా మాట్లాడాం. నిషేధిత ప్లాస్టిక్ సంచులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. – బి.వెంకటరమణ, ఎంపీడీఓ, వీరఘట్టం -
పది మూల్యాంకనం నుంచి మినహాయింపు ఇవ్వాలి
విజయనగరం అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకనం విధుల్లో మినహాయింపు కోరిన ఉపాధ్యాయులకు అనుమతి ఇవ్వాలని పీఆర్టీయూ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. జిల్లా కమిటీ సభ్యులు ఈ మేరకు శనివారం డీఈఓ యు.మాణిక్యంనాయుడుని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. పదో తరగతి సబ్జెక్టు టీచర్లను మూల్యాంకనం విధుల్లో వేసినపుడు తొలిత ఆసక్తి ఉన్న వారిని ఎంపిక చేయాలని కోరారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి అనుమతి ఇస్తూ ఇంకా అవసరం ఉన్న పరిస్థితులను గుర్తించిన తరువాతే తప్పనిసరి విధులుగా కేటాయించాలని సూచించారు. జిల్లా కేంద్రంలో చేపడుతున్న సీనియారిటీ అభ్యంతరాలను సమర్పించడానికి గడువు పెంచాలని కోరారు. డీఈఓని కలిసిన వారిలో జిల్లా అధ్యక్షులు డి.శ్రీనివాస్, ఉత్తరాంధ్ర మీడియా ఇన్చార్జ్ బంకపల్లి శివప్రసాద్, పట్టణ కమిటీ అధ్యక్షుడు చిట్టి రామునాయుడు, రావాడ రామకృష్టణ, రెడ్డి శంకరరావు, లక్ష్మణరావు తదితరులు ఉన్నారు. డీఈఓకి పీఆర్టీయూ జిల్లా కమిటీ వినతి -
ఆరోగ్యశ్రీ రోగికి డబ్బుల చెల్లింపు
విజయనగరం ఫోర్ట్: ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) పథకం వర్తించినప్పటకీ రోగుల నుంచి ఇంప్లాట్స్ పేరిట అదనపు వసూళ్లకు పాల్పడుతున్న వైనంపై ఈ నెల 17న సాక్షిలో ‘ఆరోగ్యశ్రీ రోగుల నుంచి అదనపు వసూళ్లు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆరోగ్యశ్రీ అధికారులు స్పందించారు. పట్టణంలోని గాయత్రి ఆస్పత్రిలో వెన్నుపూస శస్త్రచికిత్స చేసుకున్న రోగి గోవింద నుంచి సిబ్బంది రూ. 25 వేలు వసూలు చేశారు. ఆరోగ్యశ్రీ టీమ్ లీడర్ జనార్దనరావు, ఆరోగ్యమిత్ర మురళీధర్ ఆస్పత్రి ప్రతినిధుల నుంచి రూ. 25 వేలు వసూలు చేసి బాధిత వ్యక్తికి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ రోగుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. -
బాడీ బిల్డింగ్ పోటీలకు సిద్ధం
పార్వతీపురం టౌన్: జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డుల గల ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆదివారం జరగనున్న 31వ మిస్టర్ ఆంధ్రా బాడీ బిల్డింగ్ పోటీలకు రంగం సిద్ధమైంది. ఆర్నాల్డ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరగనున్నాయి. రెండోసారి మన్యం జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించనుండడంతో పోటీదారుల్లో ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి 200 మంది బాడీ బిల్డర్లు పోటీ పడనున్నట్టు నిర్వాహకులు హరిశంకర్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 31వ మిస్టర్ ఆంధ్రా బాడీ బిల్డింగ్ పోటీలను నిర్వహించేందుకు అసోసియేషన్ సభ్యులు ఏర్పాట్లు చేశారని తెలిపారు. పోటీలకు సంబంధించి 16 మంది న్యాయ నిర్ణేతల నిర్ణయం తుది తీర్పుగా భావించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి వచ్చిన పోటీదారులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశామని తెలిపారు. -
డయేరియా బాధితులకు ఆర్థిక సాయం
సాక్షి ప్రతినిధి, విజయనగరం/గుర్ల: డయేరియా ప్రబలి గత ఏడాది అక్టోబరులో 13 మంది ప్రాణాలు కోల్పోతే వారిలో పది మంది తాలూకు కుటుంబసభ్యులకు మాత్రమే జనసేన పార్టీ ఆర్థిక సాయం అందింది. ఐదు నెలల కిందట గుర్లలో పర్యటన సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుర్ల డయేరియా మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గుర్లలో శనివారం నెల్లిమర్ల ఎమ్మెల్యే (జనసేన) లోకం నాగమాధవి, ఆమె భర్త లోకం ప్రసాద్ ఆధ్వర్యంలో చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, ఎంఎస్ఎంఈ చైర్మన్ టి.శివశంకర్ పాల్గొన్నారు. గుర్ల అంటే గుర్లలో వారికి మాత్రమే... గత ఏడాది అక్టోబరులో గుర్ల మండల కేంద్రంతో పాటు సమీపంలోని కోటగండ్రేడు, నాగళ్లవలస గ్రామాల్లోనూ డయేరియా విజృంభించింది. దీంతో గుర్లలో పది మంది, కోటగండ్రేడులో ఒకరు, నాగళ్లవలసలో ఇద్దరు చనిపోయారు. కానీ కూటమి ప్రభుత్వం కోటగండ్రేడుకు చెందిన మరడాన అప్పలనర్సమ్మ ఒక్కరే డయేరియా కారణంగా చనిపోయారని ప్రకటించి చేతులు దులుపుకుంది. వైఎస్సార్సీపీ తరఫున రూ.2 లక్షల చొప్పున 13 మంది కుటుంబసభ్యులకు ఆర్థిక సాయం చేస్తామన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు గత ఏడాది నవంబరు 26న శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడైన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) చెక్కులు అందజేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జనసేన తరఫున కేవలం పది మంది కుటుంబాలకు మాత్రమే ఆర్థిక సాయం అందించారు. కూటమి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన డయేరియా మృతురాలు అప్పలనర్సమ్మ కుటుంబాన్ని జనసేన విస్మరించడం గమనార్హం. పవన్ కళ్యాణ్ గుర్ల అన్నారని, ఆ గ్రామంలోని పది మంది కుటుంబాలకు మాత్రమే చెక్కులిచ్చి సరిపెట్టడం చర్చనీయాంశమైంది. పది మంది మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున అందజేత -
టూరిజం ఛాయా చిత్ర పోటీలు
పార్వతీపురంటౌన్: ఉత్తమ పర్యాటక ఛాయాచిత్రాలను పర్యాటకశాఖ ఆహ్వానిస్తోందని టూరిజం అధికారి ఎన్.నారాయణ రావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఫొటోగ్రాఫర్లు, కథకులు, ప్రభావశీలురు, పౌరులు భారతదేశ సాంస్కృతిక, సహజవారసత్వ సారాంశాన్ని సంగ్రహించే ఉత్తమ ఛాయా చిత్రాలను సమర్పించాలని కోరారు. పర్యాటక మంత్రిత్వశాఖ దేఖో అపనా దేశ్– పీపుల్ చాయిస్ –2024 నినాదం కింద మార్చి 7న దేఖో అపనా దేశ్ ఫోటో కాంటెస్ట్‌ను ప్రారంభించిందని దేశంలోని వివిధ ప్రాంతాల్లో విభిన్నమైన పర్యాటక ప్రాంతాల గొప్పతనాన్ని చాటండం, ప్రవర్శించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అన్ని రాష్ట్రాలు తమ చురుకై న భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోందని, పర్యాటక గమ్యస్థానాలు, తమ పర్యాటక సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు, సందర్శకులను ఆకర్షించడానికి ఇది ఒక విలువైన వేదిక కానుందని తెలిపారు. ఎంట్రీల సమర్పణకు చివరితేది ఏప్రిల్ 7 అని తెలిపారు. స్థానిక ఫొటోగ్రాఫర్లు, పౌరులు, టూరిజం బోర్డుల ఇతర సంబంధిత భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడానికి మంచి అవకాశఽమని తెలియజేశారు. -
అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం
గరుగుబిల్లి: తోటపల్లి ప్రాజెక్టు వద్ద శుక్రవారం ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు స్థానిక ఎస్సై పి.రమేష్ నాయుడు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. తోటపల్లి ప్రాజెక్టు నాల్గవ గేటు వద్ద యువకుడి మృతదేహం తేలియాడుతూ ఉన్నట్లు సమాచారం అందిందన్నారు. ఈ మేరకు మృతదేహాన్ని బయటకు తీసిన తరువాత మృతుడిని పార్వతీపురం పట్టణంలో గల జగన్నాథపురం ప్రాంతానికి చెందిన ఆలవెల్లి రాజా(26)గా గుర్తించారు. ఈనెల 19 బుధవారం ఉదయం నుంచి కుమారుడు ఆలవెల్లి రాజా ఆచూకీ లేకపోవడంతో తండ్రి శ్రీనివాసరావు పార్వతీపురం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పట్టణ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేయగా శుక్రవారం తోటపల్లి జలాశయం వద్ద రాజా మృతదేహం లభ్యమైంది. మృతికి గల కారణాలు తెలియకపోవడంతో అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. -
రైల్వే ఉద్యోగుల నిరసన
విజయనగరం టౌన్: ఈస్ట్‌కోస్ట్ రైల్వేశ్రామిక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక రైల్వేస్టేషన్ ఆవరణలో ఉద్యోగులు, యూనియన్ నాయకులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డివిజనల్ కోఆర్డినేటర్ పీవీ.మౌళీశ్వరరావు మాట్లాడుతూ పెరిగిన ట్రాఫిక్ కారణంగా అన్ని ఎల్సీ గేట్లకు 8 గంటల రోస్టర్‌ను అమలుచేయాలన్నారు. ట్రాక్ మెయింటైనర్లకు సైకిల్ అలవెన్స్చెల్లింపును నిర్ధారించాలని, రన్‌ఓవర్ కేసుల్లో స్టేషన్ మాస్టర్లకు మెమోలు ఇచ్చే ట్రాక్ మెయింటైనర్లను నివారించాలని బదులుగా సీయూజీ ఫోన్ల ద్వారా సంబంధిత కీమాన్, ట్రాక్ మాన్ల నుంచి వివరాలను పొందడంపై పీడబ్ల్యూవే సూపర్ వైజర్ల ద్వారా మెమోలను అందించేందుకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఆక్యుపెన్సీని పెంచేందుకు క్వార్టర్స్ మెరుగైన నిర్వహణ చేపట్టాలని కోరారు. సేఫ్టీ కేటగిరీలో పనిచేస్తున్న ఉద్యోగులకు రిస్క్, హార్ట్షిప్ అలవెన్స్ అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో శ్రామిక్ కాంగ్రెస్ విజయనగరం బ్రాంచ్ కార్యదర్శి బి.సత్యనారాయణ, శ్రీకాకుళం బ్రాంచ్ కార్యదర్శి ఎస్.దంతేశ్వరరావు, సెంట్రల్ ఆఫీస్ బేరర్ ఎం.అనిల్ కుమార్, బి.శ్రీనివాసరావు, అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. -
పాము కాటుతో వ్యక్తి మృతి
జియ్యమ్మవలస రూరల్: మండలంలోని రావాడ రామభద్రపురం గ్రామానికి చెందిన బిడ్డిక వెంకటి (55) పాముకాటుతో శుక్రవారం మృతిచెందాడు. సాయంత్రం 6 గంటల సమయంలో పొలం పనులు ముగించుకుని వస్తుండగా మార్గమధ్యంలో నాగుపాము కాటువేసింది. ఈ విషయాన్ని కుటుంబీకులకు తెలియజేసి, రావాడ రామభద్రపురం పీహెచ్సీలో చేరాడు. అక్కడి వైద్యులు ప్రాథమిక వైద్యసేవలు అందించి మెరుగైన వైద్యం నిమిత్తం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఈ మేరకు 108లో పార్వతీపురం తరలిస్తుండగా మార్గమధ్యంలో వెంకటి మృతిచెందాడు. అయినప్పటికీ కుటుంబసభ్యులు సమీపంలోని చినమేరంగి సీహెచ్‌సీకి తీసుకెళ్లగా వెంకటి మృతిచెందినట్లు అక్కడి వైద్యురాలు పూర్ణ చంద్రిక ధ్రువీకరించారు. -
వేతనదారులకు నిలువనీడ కరువు
సీతంపేట: పార్వతీపురం మన్యం జిల్లాలో సీతంపేట మండలం ఎంఎన్ఆర్ఈజీఎస్ పనులు చేయడంలో ముందంజలో గత కొన్నేళ్లుగా ఉంది. ఈ మండలంలో ఎక్కువ పనులు జరుగుతాయి. అటువంటి ఈ మండలంలో ఉపాధి వేతనదారులకు నిలువ నీడ లేదు. మండుటెండలో విలవిల్లాడుతున్నారు. వేసవి వచ్చినా కనీసం టెంట్లు కూడా లేకపోవడంతో వేతనదారులకు అవస్థలు తప్పడం లేదు. అసలే వేసవి కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపాధి పనులు చేస్తుంటారు. ఆ సమయంలో అత్యధికంగా ఎండ కాస్తోంది. ఉదయం 8 గంటలైతే భానుడు భగభగ మంటున్నాడు. సాయంత్రం 5 గంటల వరకు ఎండలు మండుతున్నాయి. విశ్రాంతి తీసుకోవడానికి కనీసం నీడ లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని వేతనదారులు వాపోతున్నారు. అలాగే పని సమయంలో వడదెబ్బ వంటివి, చిన్నచిన్నదెబ్బలు తగులుతుంటాయి. ఈ సమయంలో ప్రాథమిక చికిత్స చేయడానికి మెడికల్ కిట్లు పని ప్రదేశం వద్ద ఉండాలి. వాటిని కూడా ప్రభుత్వం ఇంతవరకు సప్లై చేయకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు వాపోతున్నారు. వేతనదారులు డీహైడ్రేషన్‌కు గురైతే ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా లేని పరిస్థితి ఉంది. బకాయిలు రూ.5 కోట్లకు పైనే.. వేతనదారులకు చెల్లించాల్సిన వేతనాల బకాయిలు రూ.కోటి వరకు ఉండవచ్చని అంచనా. మెటీరియల్ కాంపొనెంట్‌లో వేసిన రహదారులు, హార్టీకల్చర్, ఇతర పనులు దాదాపు 200 వరకు జరగడంతో వాటికి చెల్లించాల్సిన బకాయిలు రూ.4 కోట్ల వరకు ఉండవచ్చని సమాచారం. వేతనదారులు చేసిన భూ అభివృద్ధి పనులు వంటి వాటికి ఎప్పటికప్పుడు వేతనాలు చెల్లించాల్సి ఉంది. దాదాపు ఉపాధి వేతనదారులు జాబ్‌కార్డులు ఉన్నవారు 18 వేల మంది ఉన్నారు. వారిలో వందరోజుల పనులు పూర్తి చేసిన వారు 80 శాతం వరకు ఉండడంతో ప్రస్తుతం పనులు చేస్తున్న వేతనదారులు 3 వేలమంది ఉన్నారు. భూ అభివృద్ధి, టెర్రాసింగ్, ఫార్మ్పౌండ్ పనులు వేతనదారులు చేస్తున్నారు. ఇలా 150 వరకు పనులు చేశారు. సరాసరి ఒక్కో వేతనదారుకు రోజుకు రూ.270 వరకు వేతనం గిట్టుబాటవుతుంది. రెండు నెలలుగా బకాయి వేతనాలు చెల్లించకపోవడంతో నానా అవస్థలు పడుతున్నామని వేతనదారులు ఆవేదన చెందుతున్నారు. కొలతలకు టేప్ సప్లై లేదు.. ఉపాధి పనులు చేసిన వేతనదారుల పనులు ఎంత పూర్తి చేశారనేది సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ ఇతర సిబ్బంది కొలతలు వేయడానికి వీలుగా టేపులు సప్లై చేయాల్సి ఉన్నప్పటికీ అవికూడా సరఫరా చేయని పరిస్థితి ఉంది. కేవలం ఎవరి సామగ్రి వారు తెచ్చుకునే పనుల కొలతలు వేస్తున్నారు. పనిప్రదేశంలో మెడికల్ కిట్లు లేవు మండుటెండలోనే పనులు 8 వారాలుగా వేతనాలు అందక విలవిలటెంట్లు తాత్కాలికంగా వేసుకోమన్నాం వేతనదారులు పనిచేసిన చోట టెంట్లు తాత్కాలికంగా వేసుకుంటున్నారు. ఎండ తీవ్రత లేని సమయంలో ఉదయం 7 నుంచి 11 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 వరకు పనులు చేసుకుంటున్నారు. బకాయి నిధులు మంజూరైన వెంటనే వేతనదారులకు వేతనాలు చెల్లించడానికి చర్యలు తీసుకుంటాం. శ్రీహరి, ఏపీడీ, ఎంఎన్ఆర్ఈజీఎస్ -
ఫెన్సింగ్ పోటీల్లో కానిస్టేబుల్‌కు కాంస్యం
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్‌శాఖలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ ఇటీవల పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో జరిగిన 1వ ఆలిండియా పోలీస్ క్లస్టర్ పోటీల్లో కాంస్యపతకం సాధించిన పీసీ బీఎస్ ఎన్ మూర్తికి ఎస్పీ వకుల్ జిందల్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీని ట్రాఫిక్ సీఐ సూరినాయుడుతో పాటు కానిస్టేబుల్ మూర్తి శుక్రవారం కలిశారు. జిల్లాకు చెందిన బీఎస్ఎన్ మూర్తి పోలీస్ శాఖ నిర్వహించిన జాతీయపోటీల్లో ఫెన్సింగ్ విభాగంలో రాష్ట్ర పోలీసు జట్టు తరఫున పాల్గొని కాంస్య పతకం సాధించాడు. కాంస్య పతకం సాధించిన కానిస్టేబుల్ మూర్తిని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అభినందించారని ఎస్పీ వకుల్ జిందల్ ఈ సందర్భంగా తెలిపారు. పతకాలు సాధించిన పోలీస్‌సిబ్బందికి త్వరలో ప్రోత్సాహక నగదు బహుమతిని, అదనంగా వార్షిక ఇంక్రిమెంట్ అందించనున్నామని తెలిపారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎన్.గోపాల నాయుడు, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు పాల్గొన్నారు. అభినందించిన ఎస్పీ వకుల్ జిందల్ -
ప్రశాంతంగా పది పరీక్షలు
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.తిరుపతి నాయుడు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 67 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. శుక్రవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 10,363 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా 10,314 మంది హాజరయ్యరని, 49 మంది గైర్హాజరయ్యరని తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు లేకుంగా పరీక్ష సజావుగా నిర్వహించామన్నారు. 61 పరీక్షా కేంద్రాల్లో వర్యవేక్షక బృందం 6 కేంద్రాల్లో తాను సందర్శించినట్లు తెలిపారు. డీఈఓ ఎన్.తిరుపతి నాయుడు -
శాఖాపరమైన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
పార్వతీపురం రూరల్: పోలీస్ సిబ్బంది విధుల్లో ఎదుర్కొంటున్న సమస్యలను విజ్ఞాపనల ద్వారా స్వీకరించి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి సిబ్బంది శాఖాపరమైన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం తన కార్యాలయంలో పోలీస్‌శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ఎదుర్కొంటున్న శాఖాపరమైన సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది విన్నవించిన సమస్యల్లో సత్వర పరిష్కారానికి అవకాశం ఉన్న వాటిని తక్షణమే పరిష్కరిస్తామని వెంటనే పరిష్కారం కాని సమస్యలకు త్వరలో పరిష్కారం చూపుతామన్నారు. అలాగే సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ సిబ్బందికి వృత్తి, ఆరోగ్య, వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి సిబ్బందికి ప్రత్యేకంగా గ్రీవెన్స్‌డేను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు వచ్చిన సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సీసీ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి -
జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు వెల్ఫేర్ డే
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ శాఖ సిబ్బంది సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎస్పీ వకుల్ జిందల్ స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలోని తన చాంబర్లో ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం పోలీసు వెల్ఫేర్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది నుంచి విజ్ఞాపనలు స్వీకరించి, పరిశీలించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతానని చెప్పారు. ఆకట్టుకున్న గుర్రాల పరుగు ప్రదర్శనవేపాడ: మండలంలోని బానాది గ్రామంలో అభయాంజనేయస్వామి తీర్థం సందర్భంగా నిర్వహించిన గుర్రాల పరుగు ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ పరుగు ప్రదర్శనలో 12 గుర్రాలు పాల్గొన్నాయి. వాటిలో రామన్న పాలెంకు చెందిన విక్రమ్ గుర్రం ప్రథమస్థానంలో నిలిచి రూ.12 వేలు, రెండోస్థానంలో చేనుల అగ్రహారానికి చెందిన మణి జెర్సీ నిలిచి రూ. పదివేలు సాధించాయి. మూడో స్థానంలో రామన్నపాలెంకు చెందిన చోడమాంబిక గుర్రం, నాల్గో స్థానంలో ఎల్.కోటకు చెందిన సింగపూర్ సత్యనారాయణ గుర్రం నిలిచి నగదు బహుమతులు సాధించాయి. విజేతలకు ఆలయ ధర్మకర్తలు, పెద్దలు కమిటీ సభ్యులు నగదు బహమతులు అందజేశారు. ‘గేట్’ లో కార్తికేయ కుశల్ కుమార్‌కు 79వ ర్యాంక్విజయనగరం అర్బన్: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్–2025) ఫలితాల్లో పట్టణ విద్యార్థి గంట కార్తికేయ కుశల్ కుమార్ జాతీయ ర్యాంక్ 79 సాధించాడు. గేట్‌లోని ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ (ఈసీఈ) సబ్జెక్టులో 842 స్కోర్‌తో 79వ ర్యాంక్ తెచ్చుకున్నాడు. కార్తికేయ బీటెక్ కాలికట్ ఎన్ఐటీలో చదివాడు. మొదటి ప్రయత్నంలోనే మంచి ర్యాంక్ సాధించిన కార్తికేయ తండ్రి జి.సునీల్ కుమార్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా తల్లి శోభ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయిని. పోక్సో కేసులో 12 ఏళ్ల జైలుశిక్షభామిని: మండలంలోని బిల్లుమడకు చెందిన మండల శివ అనే ముద్దాయికి పోక్సో కేసులో విచారణ అనంతరం శుక్రవారం 12 ఏళ్ల జైలు శిక్షను కోర్టు విధించినట్లు బత్తిలి ఎస్సై డి.అనిల్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 2021లో బిల్లుమడ గ్రామంలో ఓ చిన్నారిపై మండల శివ అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాధితుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా జిల్లా న్యాయమూర్తి విచారణ అనంతరంనేరారోపణ నిర్ధారించి శిక్ష విధించినట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలుసీతంపేట: మండలంలోని మాసడుగూడ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఎదురెదురుగా వస్తున్న ద్విచక్రవాహనాలు ఢీకొట్టుకోవడంతో ఎస్.గణపతి, మనోజ్‌లకు గాయాలు కాగా స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించడంతో మెరుగైన వైద్యం కోసం గణపతిని రిమ్స్‌కు రాఫర్ చేసినట్లు ఏరియా ఆస్పత్రి ప్రధానవైద్యాధికారి బి.శ్రీనివాసరావు తెలిపారు. దీనిపై ఎటువంటి ఫిర్యాదు తమకు అందలేదని ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు. అదృశ్యం కేసు నమోదుపార్వతీపురం రూరల్: మండలంలోని అడ్డాపుశీల గ్రామానికి చెందిన నీలయ్య జనవరి 20 నుంచి ఆచూకీ లేకపోవడంతో ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై బి.సంతోషి తెలిపారు. బంధువులు, పరిచయస్తుల ఇళ్ల వద్ద భర్త ఆచూకీ కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందంటూ భార్య ఫిర్యాదు చేసిన మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
నెలాఖరుకు పథకాల మంజూరు
విజయనగరం అర్బన్: బ్యాంకులకు కేటాయించిన లక్ష్యాల మేరకు ఈ నెలాఖరులోగా పథకాలను మంజూరు చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోరారు. వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై కలెక్టర్ శుక్రవారం సమీక్షించారు. వివిధ పథకాలు, వాటి మంజూరులో బ్యాంకుల పరిస్థితిని ఎల్డీఎం వీవీరామణమూర్తి వివరించారు. నాబార్డ్ డీడీఎం నాగార్జున మాట్లాడుతూ వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాబార్డ్ పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ (పీఎల్‌సీపీ)ను వివరించారు. సుమారు రూ.10,650.32 కోట్ల అంచనాతో ఈ రుణ ప్రణాళికను రూపొందించినట్లు చెప్పారు. దీని ఆధారంగానే జిల్లా వార్షిక రుణ ప్రణాళికను రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ ప్రణాళికను కలెక్టర్, ఇతర అధికారులు ఆవిష్కరించారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ ఎ.కల్యాణ చక్రవర్తి, వ్యవసాయ శాఖ జేడీ వీటీరామారావు, పశుసంవర్ధకశాఖ డాక్టర్ వైవీరమణ, జెడ్పీ సీఈఓ బీవీ సత్యనారాయణ, మెప్మా పీడీ చిట్టిరాజు, ఉద్యాన, మత్సశాఖల డీడీలు జమదగ్ని, నిర్మలాకుమారి, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ ఈడీలు వెంకటేశ్వరరావు, పెంటోజీరావు, వివిధ బ్యాంకుల అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ అంబేడ్కర్ -
‘బంగారు కొండ’పై ఒడిశా కన్ను
సాలూరు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొటియా పల్లెల్లో ఒడిశా ప్రభుత్వం దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. ఇటీవల జల్‌జీవన్ మిషన్ పనులకు వెళ్లిన ఆంధ్రా సిబ్బందిని అడ్డుకుంది. సామగ్రిని సీజ్‌చేసి పోలీసులతో భయపెట్టింది. తాజాగా ఆంధ్రాప్రభుత్వం గిరిజనులకు పంపిణీ చేసిన ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూములను లాక్కునేందుకు పూనుకుంది. గిరిజనుల పోడు సాగుకు ఆధారమైన గంజాయిభద్ర పంచాయతీ ఎగువశెంబి వద్ద ఉన్న బంగారు కొండ దురాక్రమణకు ఒడిగట్టింది. ఒడిశా అధికారులు పోలీస్ బలగాలతో శుక్రవారం వచ్చి భూమి పూజచేసి, కొండచుట్టూ సిమెంట్ పోల్స్‌ను పాతారు. దీనిని అడ్డుకున్న గిరిజనులపై దౌర్జన్యానికి దిగారు. ఇక్కడ ఏమీ చేయడానికి లేదని, ఈ భూముల్లోకి ఇకపై ఎవరూ రాకూడదని హెచ్చరికలు జారీచేశారు. ఒడిశా అధికారులు దౌర్జాన్యాన్ని వీడియోలు, ఫొటోలు తీయకుండా గిరిజనుల నుంచి సెల్ఫోన్లు లాక్కున్నారు. తొలి రోజు కొండచుట్టూ కొంత మేర పోల్స్‌ను పాతారు. మిగిలిన ప్రాంతంలో పాతేందుకు వీలుగా పోల్స్‌ను సిద్ధం చేశారు. పవర్‌స్టేషన్ నిర్మాణం కోసమని ఒడిశా అధికారులు చెబుతున్నా, ఇదంతా ఇక్కడ ఉన్న విలువైన ఖనిజ నిక్షేపాలు కొల్లగొట్టేందుకేనని గిరిజనులు ఆరోపిస్తున్నారు. మైనింగ్‌కు సన్నాహాలు? వివాదాస్పద కొటియా గ్రూపు గ్రామాలు ఉండే కొండల్లో విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. ఈ ప్రాంతాలను సొంతం చేసుకునేందుకు గతంలో ఒడిశా ప్రభుత్వం కవ్వింపు చర్యలకు పాల్పడగా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాటి ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొర ఆంధ్రా అధికారులను అప్రమత్తం చేసి అడ్డుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొటియా పల్లెలపై ఆంధ్రా ప్రభావం సన్నగిల్లుతోంది. దీంతో ఒడిశా అధికారుల దౌర్జన్యం పెరిగిందని స్థానిక గిరిజనులు చెబుతున్నారు. స్పందించని మంత్రి? వివాదాస్పద కొటియా పల్లెల్లో ఒడిశా దుందుడుకు గిరిజనులకు పోలీసులతో బెదిరింపు కొండచుట్టూ స్తంభాల ఏర్పాటు సాగుభూములు లాక్కోవడంతో ఆందోళన గతంలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు అందజేసిన ఆంధ్రా ప్రభుత్వం పవర్ స్టేషన్ నిర్మాణం కోసమంటూ బుకాయింపు... మైనింగ్ తవ్వకాలకే కొండ ఆక్రమణ అంటున్న గిరిజనం మౌనం దాల్చిన గిరిజన సంక్షేమశాఖ మంత్రి! కొటియా పల్లెల్లో ఒడిశా దురాక్రమణలకు పాల్పడుతున్నా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కిమ్మనకపోవడంపై విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. మంత్రి మౌనం వెనుక ఆంత్యర్యమేమిటో అర్థం కావడం లేదంటూ గిరిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రెండు చోట్ల బీజేపీ పాలిత ప్రభుత్వాలే ఉన్నాయని, సమస్యను పరిష్కరించాల్సిన పాలకు లు మిన్నకుండడాన్ని గిరిజనులు తప్పుబడుతున్నా రు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కొటియా గ్రామాల అంశంపై నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒడిశా సీఎమ్ నవీన్‌పట్నాయక్‌తో చర్చించిన అంశాన్ని గుర్తుచేస్తున్నారు. నాడు ప్రతిపక్షంలో ఉంటూ విమర్శలు చేసిన నేటి మంత్రి గుమ్మి డి సంధ్యారాణి... ప్రత్యేక చొరవ చూపాలని, దశాబ్దాల కొటియా గ్రూప్ గ్రామాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా సీఎం చంద్రబాబుతో మాట్లాడాలని గిరిజనులు కోరుతున్నారు. -
ప్రాజెక్టుల నిధులకు ప్రతిపాదనలు
విజయనగరం అర్బన్: జిల్లా వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు సాధించాలంటే తోటపల్లి కుడి ప్రధాన కాలువ, తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టులు పూర్తి కావాలి... దీనికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని త్వరలో జరిగే కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఆయా ప్రాజెక్టుల పనులు, భూసేకరణ, పునరావాసం పూర్తి చేసేందుకు ఏ మేరకు నిధులు అవసరమవుతాయో జలవనరుల శాఖ అధికారులు నివేదిక అందజేయాలని ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో శుక్రవారం మాట్లాడారు. తోటపల్లి కుడి ప్రధాన కాలువ, తారకరామ సాగరం ప్రాజెక్టులను పూర్తిచేస్తే సుమారు 50 వేల ఎకరాల అదనపు ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. వ్యవసాయ రంగంలో అదనపు ఉత్పత్తిని, ఆదాయాన్ని సాధించే అవకాశం ఉంటుందన్నారు. మరోవైపు నగరానికి మంచినీటి సరఫరా, భోగాపురం ఎయిర్‌పోర్టుకు నీటి సరఫరా జరిగే అవకాశం ఉన్నందున ఈ ప్రాజె క్టు త్వరగా పూర్తిచేయాల్సిన అవసరాన్ని వివరిస్తా మని చెప్పారు. కలెక్టర్ల సదస్సు మార్చి 25, 26 తేదీల్లో అమరావతిలో జరగనుందని, జిల్లా అభివృద్ధి ప్రణాళికలపై ప్రజంటేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వివిధ శాఖల అధికారులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎంతమేరకు లక్ష్యాలు సాధించగలమో పేర్కొంటూ వాస్తవిక అంచనాలను మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. -
ప్రభుత్వానికి బుద్ధి చెబుదాం
● నిర్వాసితులను మోసం చేయడం అన్యాయం ● ఎంపీ మాట మార్చడం బాధాకరం ● 27, 28వ తేదీల్లో నిరాహార దీక్షలు ● మూడవ రైల్వే లైన్ నిర్వాసితుల కమిటీ నాయకుడు శ్రీనివాస్ గజపతినగరం: టిట్లాగర్ నుంచి విజయనగరం వరకు సుమారు 4 వేల కోట్ల రూపాయలతో చేపడుతున్న మూడవ రైల్వే లైన్ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు అన్యాయం చేయడం ప్రభుత్వానికి తగదని, సమయం వచ్చినప్పుడు గట్టిగా బుద్ధిచెబుతామని రైల్వే లైన్ నిర్వాసితుల కమిటీ నాయకుడు జి.శ్రీనివాస్ తెలిపారు. గజపతినగరం మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం పెదమానాపురంలో మూడో రైల్వే లైన్ నిర్మాణంలో ముందుగా 14 ఇళ్లకు అరకొర డబ్బులు చెల్లించి వాటిని కూల్చివేశారని, తరువాత మరో 28 కుటుంబాలకు చెందిన వారి ఇళ్లను కూల్చి వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని మండిపడ్డారు. నిర్వాసితులకు నిలువునీడ చూపకుండా ఇళ్లు కూల్చివేయడం దుర్మార్గమన్నారు. ఫిబ్రవరి 9వ తేదీన బాధితులకు న్యాయం చేస్తామంటూ మాట ఇచ్చిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇప్పుడు మాటమార్చారని విమర్శించారు. నిర్వాసితుల పక్షాన కాకుండా ఇళ్లను కూల్చే కాంట్రాక్టర్ తరఫున కొమ్ముకాయడం దారుణమన్నారు. తక్షణమే నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు, పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా మార్చి 27, 28 తేదీల్లో మానాపురం బ్రిడ్జి సమీపంలో రెండు రోజుల పాటు నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు. అప్పటికీ సమస్య పరిష్కరించకుంటే ఏప్రిల్ 2వ తేదీన చలో తహసీల్దార్ ఆఫీస్ కార్యక్రమం చేపడతామన్నారు. కార్యక్రమంలో నిర్వాసితుల కమిటీ నాయకులు చిల్లా గోవింద్, బోర మహేష్, నగిరెడ్ల రాము, తదితరులు పాల్గొన్నారు.