
అటవీ శాఖ పనులపై విజిలెన్స్ తనిఖీలు
● పరిశీలించిన శ్రీకాకుళం విజిలెన్స్
ఎస్పీ బర్ల ప్రసాదరావు
వీరఘట్టం: పాలకొండ అటవీశాఖ రేంజ్ పరిధి లో పదేళ్ల క్రితం అటవీ ప్రాంతాల్లో జరిగిన పనులను శ్రీకాకుళం విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాదరావు తన బృందంతో కలిసి గురువారం పరి శీలించారు. ఈ మేరకు వీరఘట్టం మండలంలోని అచ్చెపువలస, చిన్నగోర వద్ద తవ్విన ట్రెంచ్‌లు, రామాపురం వద్ద మొక్కలు పెంచుతున్న సర్సరీని పరిశీలించారు. అప్పట్లో పాలకొండ రేంజ్‌లో 20 పనులను సుమారు రూ.1 కోటి నిధులతో చేపట్టారు.ప్రస్తుతం ఆ పనులు ఏవిధంగా ఉన్నయో తనిఖీ చేశారు. తవ్విన ట్రెంచ్‌లకు కొలతలు వేశారు. అలాగే వన నర్సరీల్లో మొక్కల సంఖ్య సరిగ్గా ఉందో? లేదోనని పరిశీలించారు. ఈ తనిఖీల నివేదికను ప్రభుత్వానికి నివేదిస్తామని ఎస్పీ చెప్పారు. తనిఖీ ల్లో విజిలెన్స్ డీఈ సత్యనారాయణ, ఏఈ గణేష్, పాలకొండ అటవీశాఖ రేంజ్ అధికారులు పాల్గొన్నారు.
పలువురు సీఐలకు బదిలీ
విజయనగరం క్రైమ్: విశాఖపట్నం పోలీస్ రేంజ్ పరిధిలో తొమ్మిది మంది సీఐలకు స్థానచలనం కల్పిస్తూ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి పార్వతీపురం మన్యం జిల్లా డీఎస్‌బీ–11 సీఐగా పనిచేస్తున్న ఊయక రమేషన్‌ను శ్రీకాకుళం జిల్లా బారువ సీపీఎస్‌కు, అక్కడ పనిచేస్తున్న రమేష్‌కుమార్‌ను ఇక్కడకు బదిలీ చేశారు. విశాఖపట్నం రేంజ్‌లో వీఆర్‌లో ఉన్న బొడ్డేపల్లి సుధాకర్‌ను విజయనగరం డీసీఆర్‌బీ సీఐగా, కె.దుర్గాప్రసాద్‌ను భోగాపురం సీఐగా బదిలీ చేశారు.
మే 10న జాతీయ లోక్‌అదాలత్
విజయనగరం లీగల్: జిల్లాలో వచ్చేనెల 10వ తేదీన జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించనున్నట్టు విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు బబిత పేర్కొన్నారు. కేసు రాజీ వల్ల కక్షిదారులకు వ్యయప్రయాసలు తప్పుతాయన్నారు. మోటార్ వాహన ప్రమాద కేసులు అధిక సంఖ్యలో రాజీ చేయడంలో భాగంగా మోటార్ వాహన సంస్థ ప్రతినిధులు, ఆ సంస్థ స్టాండింగ్ న్యాయవాదులతో గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజీ పడదగిన కేసులన్నింటినీ పరిష్కరించేందుకు ఇన్సూరెన్స్ ప్రతినిధులు చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి బీహెచ్‌వీ లక్ష్మీకుమారి, ఇన్సూరెన్స్ స్టాండింగ్ కౌన్సిల్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రాథమిక రంగంలోనే
అభివృద్ధి అవకాశాలు
బొబ్బిలి: ప్రాథమిక రంగంలోనే అభివృద్ధి అవకాశాలు ఎక్కువని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నా రు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో విజన్ ప్లాన్‌పై అవగాహన, నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించారు. జిల్లాలో తలసరి ఆదాయాన్ని 15 శాతం పెంచేలా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. కేవ లం ప్రణాళిక రూపకల్పనే కాకుండా వాటిని అమలు చేసేందుకు కార్యాచరణ, లక్ష్య సాధన ఉండాలన్నారు. వ్యవసాయ యోగ్యమైన భూమి 3 లక్షల ఎకరాల వరకు ఉండగా, సాగు మాత్రం కేవలం లక్ష ఎకరాల్లోనే ఉందన్నారు. మిగిలిన భూమిని దశల వారీగా సాగులోకి తీసుకురావాల ని సూచించారు. ఉద్యాన, వాణిజ్య పంటలను సాగు చేయాలని చెప్పారు. గుడ్లు, పాలు, మాంసం ఉత్పత్తిని పెంచడంతో పాటు అందుబాటులో ఉన్న చెరువుల్లో చేపలు పెంచాలన్నారు. సేవారంగం విస్తరణకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయ ని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం ఏర్పాటైతే ఈ రంగాల్లో అభివృద్ధి మరింత కనిపిస్తుందని చెప్పారు. గ్రామస్థాయి అధికారులంతా తమ సొంత ప్రాంతంగా భావించి ఆ స్థాయిలోనే ప్రణా ళికలు రూపొందించాలన్నారు. దీనికోసం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సీపీఓ పి.బాలాజీ, పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్ వై.వి. రమణ, ఉద్యానవన శాఖ డీడీ ఏవీఎస్‌వీ జమదగ్ని, ఏపీఎంఐపీ పీ డీ లక్ష్మీనారాయణ, మత్స్యశాఖ ఇన్‌చార్జి డీడీ విజయకృష్ణ, బొబ్బిలి ప్రత్యేకాధికారి నూకరాజు, ఆర్డీ ఓ జేవీవీఎస్ రామమోహనరావు పాల్గొన్నారు.

అటవీ శాఖ పనులపై విజిలెన్స్ తనిఖీలు