
సినిమా ప్రభావమో..దుష్ట వ్యక్తులతో సాంగత్యమో కానీ యువత మ
● జిల్లా మీదుగా యథేచ్ఛగా గంజాయి తరలింపు ● సరిహద్దులు దాటి తరలివస్తున్న మత్తు పదార్థాలు ● వృథా అయిపోతున్న అధికారుల నిఘా.. నవోదయం కార్యక్రమాలు
నమోదైన కేసులు..
గంజాయి రవాణాకు సంబంధించి 2023లో 14 కేసులు నమోదు కాగా 205 కేజీలను స్వాధీనం చేసుకుని, 28 మందిని అరెస్టు చేశారు. ఐదు వాహనాలను సీజ్ చేశారు.
●2024లో 39 కేసులు నమోదయ్యాయి. 736 కేజీల గంజాయి లభ్యమైంది. పది వాహనాలను సీజ్ చేశారు.
●అక్రమ మద్యానికి సంబంధించి 2023లో 684 కేసులు నమోదు కాగా.. 794 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 895.56 లీటర్ల మద్యం, 16,268 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. 2024లో 1,043 కేసుల్లో 1,030 మందిని అరెస్టు చేసి 3,399 లీటర్ల మద్యం, 17,603.5 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు.
సాక్షి, పార్వతీపురం మన్యం:
ఓ వైపు గంజాయి..మరోవైపు సారాకు జిల్లా సరిహద్దు ప్రాంతం స్థావరంగా మారింది. ఒడిశా నుంచి గంజాయి పెద్ద ఎత్తున అక్రమంగా జిల్లాలోకి ప్రవేశిస్తోంది. ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా నవోదయం పేరిట ఎకై ్సజ్ అధికారులు ఏజెన్సీ ప్రాంతంలో.. ముఖ్యంగా ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో విస్తృతంగా దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్దఎత్తున సారాను, బెల్లం ఊటను ధ్వంసం చేస్తున్నారు.
అక్రమ రవాణాకు ‘రాచమార్గం’
ఒడిశా నుంచి పెద్ద ఎత్తున గంజాయి జిల్లా మీదుగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్తోంది. ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్ రహదారి తరలింపునకు సులువైన మార్గంగా మారింది. పాచిపెంట మండలం పి.కోనవలస చెక్‌పోస్టు వద్ద కళ్లుగప్పి, విశాఖ–రాయిపూర్ నూతన హైవే మీదుగా జోరుగా రవాణా చేస్తున్నారు. సాలూరు మీదుగా విశాఖ వరకు అక్రమ రవాణా సాగుతోంది. గంజాయి అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు పోలీసు యంత్రాంగం పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తూ యువతను చైతన్యవంతులను చేసేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. అయినప్పటికీ పెద్దగా మార్పు కనిపించడం లేదు. రవాణా, వినియోగం కేసుల్లో ఎక్కువగా యువతే పట్టుబడుతుండడం గమనార్హం. సాలూరు, పార్వతీపురం పట్టణాల్లో విచ్చలవిడిగా గంజాయి లభ్యమవుతోంది. ఒడిశా, అరకు, అనంతగిరి తదితర ప్రాంతాల నుంచి గంజాయి అక్రమంగా తరలివస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల పరిధిలో 42 కేసులు నమోదు కాగా.. 422 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో ఒక్క పాచిపెంట మండలంలోనే జనవరిలో 670 కిలోలు, ఫిబ్రవరిలో 157 కిలోలు, మార్చిలో 288 కిలోలను స్వాధీనం చేసుకోవడం గమనార్హం. 11 మందిని అరెస్టు చేసి ఆరు వాహనాలను సీజ్ చేశారు.
యథేచ్ఛగా సారా తయారీ
మరోవైపు సరిహద్దుల్లో సారా విరివిగా తయారవుతోంది. అక్కడి నుంచి ప్యాకెట్ల ద్వారా తరలిపోతోంది. ఇటీవల ఎకై ్సజ్ అధికారులు ఒడిశా సరిహద్దు గ్రామాలైన సందుబడి, తుంబాలిరాయ్, పనుసత్ర గ్రామాల్లో విస్తృత దాడులు చేసి 7,700 లీటర్ల బెల్లం ఊట, 360 లీటర్ల సారాను గుర్తించి ధ్వంసం చేశారు. 3 వేల కిలోల విప్పపువ్వు, 2,400 కేజీల నల్లబెల్లం, 3,900 కేజీల అమోనియాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో డ్రోన్ కెమెరాలను ఉపయోగించి, ఎకై ్సజ్ అధికారులు సారా తయారీ కేంద్రాలపై దాడులు పెంచారు.
మరింత నిఘా అవసరం..
గంజాయి రవాణా కట్టడికి జిల్లాలో చెక్‌పోస్టులను పెంచి, నిఘాను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది. జిల్లాలోని పాచిపెంట మండలంలో పి.కోనవలస, కొమరాడ మండలం కూనేరు, భామిని మండలం బత్తిలి, గుమ్మలక్ష్మీపురంలలో చెక్‌పోస్టులు ఉన్నాయి. రవాణా అవుతున్న మార్గాల్లో వాటి సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది.

సినిమా ప్రభావమో..దుష్ట వ్యక్తులతో సాంగత్యమో కానీ యువత మ

సినిమా ప్రభావమో..దుష్ట వ్యక్తులతో సాంగత్యమో కానీ యువత మ