
సంగీత సాహిత్య సమలంకృతే..!
● 106 ఏళ్ల పండగకు సర్వం సిద ్ధం
● సంగీత కళాశాల తొలి అధ్యక్షుడిగా ఆదిభట్ల
● ఉత్సవానికి తరలిరావాలని ప్రిన్సిపాల్ పిలుపు
● నేడు మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్యకళాశాల 106వ వార్షికోత్సవం
సంగీతాభిమానులందరూ తరలిరండి
కళాశాల 106వ వార్షికోత్సవం నిర్వహించుకోవడం ఎంతో ఆనందదాయకం. కళాశాల అభివృద్ధికి ప్రయత్నం చేస్తున్న వారందరికీ అభినందనలు. ఎందరో మహానుభావులు నడయాడిన ప్రాంతమిది. కళాశాలలో పరికరాల మరమ్మతులకు రూ.2.50 లక్షలు ఎమ్మెల్యే అందజేశారు. – కేవీఎల్‌ఎన్.శాస్త్రి,
ప్రిన్సిపాల్, ఎఫ్‌ఏసీ, మహారాజా సంగీత,
నృత్యకళాశాల, విజయనగరం
1953లో ప్రభుత్వ ఆధీనంలోకి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1953లో కళాశాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంది. నాటి నుంచి మహారాజా ప్రభుత్వ సంగీత, నత్యకళాశాలగా రూపాంతరం చెందింది. అప్పుడు కేవలం ఐదు విభాగాలు గాత్రం, వీణ, వయోలిన్, మదంగం, భరతనాట్యం విభాగాలతో ప్రారంభమైంది. తర్వాత స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో కొంతకాలం కొనసాగి, ప్రస్తుతం 1980 నుంచి కల్చరల్ ఎఫైర్స్ డిపార్ట్‌మెంట్‌లో కొనసాగుతోంది.
విజయనగరం టౌన్: సంగీత సరస్వతి 106వ వార్షికోత్సవ వేడుకలకు సిద్ధమవుతోంది. సంగీతానికి అధిక ప్రాధాన్యం కల్పించాలనే ఉద్దేశ్యంతో విజయనగర రాజులు 1919 ఫిబ్రవరి 5న సంగీత కళాశాలకు అంకురార్పణ చేశారు. ఎందరో మేధావులు, మహానుభావులు కళాశాలలో విద్యనేర్చుకుని ప్రపంచ దేశాల్లో వారి ప్రతిభను ప్రదర్శించి జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేశారు. కళామతల్లి ఒడిలో స్వరాలు నేర్చుకున్న ఎందరో గానగంధర్వులు కలియదిరిగిన సంగీత సరస్వతికి వైఎస్‌ఆర్ లైఫ్‌టైమ్ అబీవ్‌మెంట్ అవార్డు 2023లోనే వరించింది. 106వ వార్షికోత్సవాన్ని బుధవారం నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు.

సంగీత సాహిత్య సమలంకృతే..!

సంగీత సాహిత్య సమలంకృతే..!