Parvathipuram manyam District Latest News
-
దాడితల్లికి సహస్ర ఘటాభిషేకం
బొబ్బిలి: పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఉన్న దాడితల్లి అమ్మవారికి శుక్రవారం సహస్రఘటాభిషేకం నిర్వహించారు. అర్చకులు పిండిప్రో లు మణికుమార్ శర్మ ఆధ్వర్యంలో వేదపండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. స్టీల్ ప్లాంట్ భూముల పరిశీలన గుర్ల: మండలంలోని కెల్ల, వల్లాపురం, మన్యపురిపేట గ్రామాల్లో ఏర్పాటుకానున్న స్టీల్ ప్లాంట్ భూములను రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రధాన కార్యదర్శి యువరాజు, జేసీ సేతుమాధవన్, ఆర్డీఓ సుధారాణి శుక్రవారం పరిశీలించారు. స్టీల్ ప్లాంట్‌కు ప్రభుత్వం ఇటీవల 1085 ఎకరాలు కేటాయించిన సంగతి తేలిసిందే. భూముల వివరాలను పూర్తి స్థాయిలో అందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. భూములను పరిశీలించిన వారిలో తహసీల్దార్ ఆదిలక్ష్మి, సర్వేయర్ శివ ఉన్నారు. -
ఉద్యమబాటలో సమగ్రశిక్ష ఉద్యోగులు
విజయనగరం అర్బన్: సమగ్రశిక్ష ఉద్యోగులు ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. సమస్యల పరిష్కారంలో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపేందుకు ఏపీ సమగ్రశిక్ష కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఈ నెల 15న విజయవాడలో వినూత్నరీతిలో నిరసనలు చేపట్టనున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి విద్యాశాఖ మంత్రి లోకేశ్ నివాసం వరకు కుటుంబ సభ్యులతో కలిసి మహా పాదయాత్ర చేపడతామని ఎన్పీఆర్ భవన్లో శుక్రవారం జరిగిన సమావేశంలో జేఏసీ రాష్ట్ర చైర్మన్ బి.కాంతారావు ప్రకటించారు. న్యాయమైన డిమాండ్ల సాధనలో ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. సమగ్ర శిక్షా ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, హెచ్‌ఆర్‌పాలసీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం, వేతనాల పెంపు, ఈపీఎఫ్, ఈఎస్ఈ, గ్రాట్యుటీ వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఉద్యోగ విరమ ణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలన్నా రు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఐక్యంగా పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. అనంతరం మహాపాదయాత్రకు సంబంధించిన పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామకృష్ణ, జిల్లా జేఏసీ వైస్ ప్రెసిడెంట్ తేజేశ్వరి, జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు జయగణేష్, కృష్ణమూర్తి, అశోక్, తదితరులు పాల్గొన్నారు. -
విపత్తులపై అవగాహనే ప్రధానం
డెంకాడ: విపత్తుల సమయాల్లో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహనతో ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చని విపత్తు నిర్వహణ 5వ ఏపీఎస్పీ బెటాలియన్ విపత్తు ప్రతిస్పందన దళం ఇన్స్పెక్టర్ ఎస్.చంద్రశేఖర్ అన్నారు. చింతలవలస ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడుకునే పద్ధతులను చంద్రశేఖర్ వివరించారు. 25 మంది దళం సభ్యులు తుఫాన్, వరదలు వంటి విపత్తు సమయాల్లో ఉపయోగించే వివిధ పరికరాలు, పద్ధతులను ప్రయోగాత్మకంగా వివరించారు. నదులు, సముద్రాల్లో చిక్కుకునేవారిని రక్షించే పద్ధతులను తెలియజేశారు. ఉరుములు, మెరుపులు, అగ్నిప్రమాదాలు, భూకంపాలు, రైలు ప్రమాదాల సమయాల్లో భద్రతా చర్యలను వివరించారు. కార్యక్రమంలో ఆర్ఎస్లు జి.శివప్రసాద్, కె.భాస్కరరావు, ఎన్ఎస్ఎస్ పీఓ ఎన్.షణ్ముఖరావు, జి.ఆంజనేయులు, వలంటీర్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
111
–8లోశనివారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026● ఉత్కంఠ రేపుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లు ● యువతను బెట్టింగ్ ఉచ్చులోకి దించుతున్న బుకీలు ● ‘యాప్’లతో వల ● డబ్బుపోగొట్టుకుని విలవిల్లాడుతున్న బాధితులు ● ఉచ్చులో చిక్కుకోవద్దంటూ హెచ్చరిస్తున్న పోలీసులు తెలుగు తమ్ముళ్లకు దోచిపెట్టేందుకే..!వడ్డించే వాడు మనవాడైతే కడబంతిలో కూర్చున్నా మంచి భోజనం అందుతుందనే సామెత చందాన తయారైంది టీడీపీ సర్కారు తీరు. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం బెట్టింగ్‌లకు పాల్పడినా.. ఇతరులను ప్రోత్సహించినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే నిఘా పెట్టాం. ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ల వలలో చిక్కుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దు. – ఎ.ఆర్.దామోదర్, ఎస్.వి.మాధవ్‌రెడ్డి, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీలువిజయనగరం/పార్వతీపురం రూరల్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ ఇటీవల ఆరంభమైంది. రెండు నెలలపాటు సాగే క్రికెట్ మ్యాచ్‌లు యువతలో ఉత్కంఠ రేపుతున్నాయి. మ్యాచ్‌లను ఆసక్తిగా తిలకిస్తూ.. తమ అభిమాన జట్టు గెలుస్తుందన్న ధీమాతో బెట్టింగ్‌లు కాసేందుకు కొందరు ఉత్సుకత చూపుతున్నారు. దీనినే ఆసరాగా తీసుకుని పలువురు బుకీలు రంగంలోకి దిగారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన యువతకు ఆన్లైన్, ‘యాప్’లతో వల విసురుతున్నారు. టాస్ నుంచి బంతిబంతికీ బెట్టింగ్ కట్టేలా ఉచ్చులోకి దించుతున్నారు. నిలువునా దోచుకుంటున్నారు. బెట్టింగ్ వ్యవహారం ఇప్పుడు పట్టణాల నుంచి మారుమూల పల్లెలకు పాకడం ఆందోళన కలిగిస్తోంది. ఆ మ్యాచ్‌లపైనే అధిక బెట్టింగ్‌లు ఐపీఎల్ 75 మ్యాచ్‌ల టోర్నీలో హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, ముంబయి జట్లపైనే అధికమంది బెట్టింగ్‌లు వేస్తున్నారు. బుకీలు కూడా ఇదే అదునుగా చేసుకుని క్రీడాభిమానులను ఊరిస్తున్నారు. బెట్టింగ్ కాసేవారిని ముంచేస్తున్నారు. కొన్నిసార్లు గెలిచినా డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు. అంతా అన్లైన్ కావడం, బెట్టింగ్ విషయం బయటకు తెలిస్తే ఇబ్బందులు ఎదురవుతాయన్న భావనతో చాలామంది డబ్బులు గెలిచి నష్టపోయిన సమయంలోనూ మిన్నకుండిపోతున్నారు. కొందరు బెట్టింగ్‌లకు ఇళ్లు, వాహనాలను, ఆభరణాలను తాకట్టుపెడుతున్నారు. అంతా గుప్‌చప్‌గా... చైన్సె, బెంగళూరు, విశాఖపట్నం నుంచి బెట్టింగ్ మాఫియా విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు వచ్చి హోటళ్లలో బస చేస్తున్నారు. బెట్టింగ్‌ల కోసం యువతతో పల్లెలు, వార్డుల వారీగా ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటుచేస్తున్నారు. రూ.100కు గెలిస్తూ రూ.1000, రూ.2000 ఇస్తామని ప్రత్యేక టీమ్‌లతో ఊరిస్తున్నారు. వాట్సాప్, వివిధ రకాల యాప్‌లలో బెట్టింగ్ మాఫియాను నడుపుతూ రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. పోలీసులు ప్రత్యేక దృష్టిసారించినా వ్యవహారం గుప్‌చప్‌గా సాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పోలీస్ శాఖ హెచ్చరికలు ఇలా... క్రికెట్ అభిమానులు ఆటను ఆస్వాదించాలే తప్ప బెట్టింగ్‌లకు పోరాదు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లతో జీవితాలను నాశనం చేసుకోవద్దు. బెట్టింగ్‌లు కాస్తున్న వారిలో యువతే అధికంగా ఉంటున్నారు. కొందరు స్వార్థపరులు, చెడు నడత కలిగిన వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్‌లకు తెరలేపే అవకాశం ఉంది. వారి మాటలు వినరాదు. బెట్టింగ్‌లో ఒకసారి ఆదాయం వచ్చినా ఎక్కువసార్లు నష్టపోవడం జరుగుతుంది. ఆ నష్టాలను భర్తీ చేసుకోవడానికి, చేసిన అప్పులను తీర్చడానికి యువత దొంగతనాలకు, ఇతర నేరాలకు పాల్పడుతూ తమ భవిష్యత్తుని అంధకారం చేసుకుంటున్నారన్నారు. బెట్టింగ్ అనేది పెనుభూతం లాంటిది. ఆశ చూపి అథ:పాతాళానికి నెట్టేస్తుంది. కుటుంబాలను రోడ్డుపాలుచేస్తుంది. కొందరి ప్రాణాలను సైతం తీస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను గమనిస్తూ ఉండాలి. బెట్టింగులకు పాల్పడుతుంటే వారికి నచ్చచెప్పి ఆ ఊబిలో నుంచి బయటకు తీసుకురావాలి. బెట్టింగ్ నిర్వాహకులపై సస్పెక్ట్ షీట్లు తెరుస్తాం. జిల్లాలో ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్‌లు జరుగుతున్నట్టు తెలిస్తే డయల్ 112/100 కు (లేదా) సంబంధిత పోలీస్ అధికారులకు కాల్చేసి సమాచారం అందించాలి. సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. అంతా ఫోన్లోనే... క్రికెట్ మ్యాచ్‌లను తిలకిస్తూనే బెట్టింగ్‌లో పాల్గొనేలా బుకీలు సెట్ చేస్తున్నారు. అంతా ఫోన్లోనే ప్రత్యేక కోడ్ భాషతో పందాలు కాయిస్తున్నాయి. ఎస్.. నో.. ఓకే..డన్..రిపీట్ వంటి పదాలు వాడుతున్నారు. యువత, ఉద్యోగులు, క్రికెట్ అభిమానులను ఊరిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. ఏ క్రికెటర్ ఎన్ని పరుగులు చేస్తారు.. ఆ ఓవర్లో ఎన్ని సిక్స్‌లు కొడతారు.. ఎన్ని వికెట్లు తీస్తారు.. ఎన్ని పరుగులకు జట్టు అవుట్ అవుతుందన్న అంచనాలపై బెట్టింగ్‌లు సాగుతున్నాయి. బంతిబంతికీ ఉత్కంఠ రేపుతూ పందెం కాయిస్తున్నారు. వాస్తవంగా టీవీల్లో మ్యాచ్‌లు చూసేవారికి కనీసం 10 నుంచి 30 సెకెన్ల తేడాతో లైవ్ వస్తుంది. ఒక్కో సారి రెండు బంతుల సమయం తేడా ఉంటుంది. అది తెలుసుకోకుండా బెట్టింగ్ కాసేవారి జేబులకు బుకీలు కన్నంవేస్తున్నారు. రూ.100 కడితే రూ.1000 ఇస్తామంటూ నమ్మించి పెద్ద మొత్తంలో సొమ్మును దోచుకుని నిలువునా ముంచేస్తున్నారు. విజయనగరానికి చెందిన ఓ ఆటో డ్రైవర్‌కు క్రికెట్ అంటే పిచ్చి. ఆ విషయాన్ని బెట్టింగ్ మాఫియా నియమించిన ఏజెంట్ గుర్తించాడు. ఆయనలో బెట్టింగ్‌పై ఆసక్తి రేపాడు. రూ.100 కడితే రూ.1000 ఇస్తారని నమ్మించాడు. ఆయన ఏకంగా తన అభిమాన టీమ్ గెలుస్తుందని రూ.1,50,000 బెట్టింగ్ కాశారు. టీమ్ గెలవకపోవడంతో అప్పటికప్పుడు ఆటో విక్రయించి సొమ్ముచెల్లించాడు. పార్వతీపురంలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఓ యువ ఉద్యోగి క్రికెట్ అభిమాని. విషయం తెలుసుకున్న బెట్టింగ్ మాఫియా ప్రత్యేక యాప్‌లో వలవేసింది. బంతిబంతికీ బెట్టింగ్ కట్టేలా ఉచ్చులో దించింది. ఆయన నుంచి రూ.లక్ష వరకు లాగేసింది. పాలకొండకు చెందిన ఓ యువకుడు తన అభిమాన జట్టుపై ఆన్లైన్లో బెట్టింగ్ కాశాడు. తను పందెం కాసిన జట్టు గెలిచింది. రూ.50,000 వస్తుందని ఆశపడ్డాడు. తీరా ఆ యువకుడికి రూపాయి ఇవ్వకుండానే బుకీలు మోసం చేయడంతో తన స్నేహితుల వద్ద గగ్గోలు పెట్టాడు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సాహసించలేకపోయాడు. -
మామిడి చెట్ల నరికివేతపై దర్యాప్తు
సంతకవిటి: మండలంలోని పుల్లిట గ్రామానికి చెందిన పిన్నింటి స్వప్న మామిడితోటలో చెట్ల నరికివేతపై చీపురుపల్లి డీఎస్పీ ఎస్. రాఘవులు శుక్రవారం దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు డీఎస్పీ,తదితరులు తోటను పరిశీలించి, చెట్ల నరికివేతపై ఆరా తీశారు. ఆయనతో పాటు రాజాం టౌన్ సీఐ, ఎస్సై ఆర్.గోపాలరావు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. క్లూస్‌టీమ్ పరిశీలన సీతంపేట: మండల పరిధిలోని వేంకటేశ్వర ఆలయం పక్కన జల్‌జీవన్ మిషన్ పైపులు గురువారం దగ్ధం కావడంతో క్లూస్ టీమ్ సభ్యులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారని ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు. పిచ్చికుక్క స్వైర విహారం ● ముగ్గురికి గాయాలు పార్వతీపురం రూరల్: గరుగుబిల్లి మండలంలోని నాగురు గ్రామంలో శుక్రవారం ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసి ముగ్గురిని గాయపరిచింది. గుడ్‌ఫ్రైడే ప్రార్థనల నేపథ్యంలో తల్లిదండ్రులతో కలిసి స్థానిక చర్చికి వచ్చిన రెండేళ్ల మండంగి లిఖిత అనే చిన్నారి బయట ఆడుకుంటుండగా, కుక్క ఒక్కసారిగా ఆమె తలపై తీవ్రంగా గాయపరిచింది. చిన్నారిని కాపాడే ప్రయత్నంలో చింతల అప్పలనాయుడు, అక్కేన చంద్రశేఖర నాయుడు (చినబాబు) కూడా కుక్క కాటుకు బలయ్యారు. అనంతరం వీధుల్లోకి పరుగు తీసిన ఆ శునకం అక్కేన సింహచలం సహా మరొకరికి చెందిన దూడలను గాయపరిచింది. క్షతగాత్రులు జిల్లా కేంద్రాస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 50 కిలోల గంజాయితో ముగ్గురి అరెస్ట్ లక్కవరపుకోట: అరకు – విశాఖ జాతీయ రహదారిపై రంగరాయపురం జంక్షన్ సమీపంలో కారులో గంజాయి తరలిస్తున్న ముగ్గురిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. స్థానికులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలియజేసిన వివరాల మేరకు.. ఒడిశా ప్రాంతానికి చెందిన ఇద్దరు.. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఒకరు 50 కిలోల గంజాయిని తరలిస్తున్నారు. ఒకరు ద్విచక్ర వాహనంపై ముందు వెళ్తుండగా.. కారులో ఉన్న వారు గంజాయితో వెనుక వెళ్తున్నారు. అయితే టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగరాయపురం జంక్షన్ వద్ద తనిఖీలు చేపట్టి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని.. కారు, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. గంజాయిని ఎక్కడ నుంచి తీసుకువస్తున్నారు.. ఎక్కడకు తరలిస్తున్నారు..అన్న అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మోసగాడి అరెస్ట్ విజయనగరం క్రైమ్: ఆన్లైన్ ద్వారా మోసాలకు పాల్పడే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించినట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విజయనగరం ఉడా కాలనీకి చెందిన దాసరి ఉత్తేజ్ ఆర్సీ 200 మోడల్ ద్విచక్ర వాహనాన్ని ఓఎల్ఎక్స్లో చూసి గుర్తు తెలియని వ్యక్తి ఖాతాలో రూ. 60 వేలు జమ చేసి మోసపోయాడని తెలిపారు. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా గురుగుబిల్లి మండలం రావుపల్లికి చెందిన సాయిరామ్ అనే వ్యక్తి కూడా ఓఎల్ఎక్స్లో పల్సర్ 150 సీసీ వాహనాన్ని చూసి గుర్తు తెలియని వ్యక్తికి రూ. 75 వేలు పంపించి మోసపోయాడని చెప్పారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సాంకేతిక ఆధారాలతో నిందితుడు చల్లా శంకర్‌ను వన్‌టౌన్ సీఐ ఆర్వీఆర్కే చౌదరి అరెస్ట్ చేశారన్నారు. తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం సీవీ కండ్రిగకు చెందిన నిందితుడిపై ఇప్పటికే తిరుపతి జిల్లా వెంకటగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక హత్య.. కృష్ణా జిల్లా పెనములూరు పీఎస్ పరిధిలో ఇంటి దొంగతనం కేసు నమోదైందని తెలిపారు. -
తెలుగు తమ్ముళ్లకు దోచిపెట్టేందుకే..!
విజయనగరం ఫోర్ట్: వడ్డించే వాడు మనవాడైతే కడబంతిలో కూర్చున్నా మంచి భోజనం అందుతుందనే సామెత చందాన తయారైంది టీడీపీ సర్కారు తీరు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి పోస్టుల నియామక విషయంలో టీటీపీ ప్రభుత్వం వ్యవహారించిన తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ అధికారంలోకి వస్తే లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తాం.. పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపడతామంటూ ప్రస్తుత సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు ఉద్యోగాలకు ఎంపికై న వారికే ఎసరు పెట్టేవిధంగా చంద్రబాబు సర్కార్ ప్రయత్నిస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. 2024 డిసెంబర్లో నోటిఫికేషన్.. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిల్లో ఖాళీల భర్తీకి సంబంధించి 2024 డిసెంబర్లో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 17 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 17 జనరల్ డ్యూటీ అటెండెంట్ (జీడీఏ), స్టోర్ అటెండర్ పోస్టులు –2, ఒక ఎలక్ట్రికల్ హెల్పర్ పోస్టుకు నోటిఫికేషన్ ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వ వైద్య కళాశాలలో 12 పోస్టులకు కూడా 2024 డిసెంబర్లో జాయింట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పోస్టులను ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. అయితే కొద్ది రోజుల కిందట ప్రభుత్వ వైద్య కళాశాలలో 12 పోస్టులకు ఎంపికై న అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేశారు. కాని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయినా ఇంతవరకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదు. దీంతో ఆయా అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భర్తీ పక్రియలో తీవ్ర జాప్యం.. సర్వజన ఆస్పత్రిలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన 16 నెలల వరకు భర్తీ పక్రియ చేపట్టలేదు. ఎట్టకేలకు భర్తీ పక్రియ చేపట్టారంటే నియామక ఉత్తర్వులు (అపాయింట్మెంట్ ఆర్డర్స్) ఇవ్వకుండా జాప్యం చేయడం పట్ల ఎంపికై న అభ్యర్థులు మండిపడుతున్నారు. నోటిఫికేషన్ రద్దు చేస్తారనే గుసగుసలు.. సర్వజన ఆస్పత్రిలో పోస్టుల భర్తీకి సంబంధించి 2024లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తారనే గుసగుసలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తే ఎంపికై న అభ్యర్థులకు అన్యాయం జరగనుంది. ఏజెన్సీకి కట్టబెట్టేందుకే.. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి పోస్టులను ఔట్పోర్సింగ్ పద్ధతిలో కాకుండా ఏజెన్సీకి కట్టబెట్టేందకు టీడీపీ సర్కార్ ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణులు వినిపిస్తున్నాయి. అందుకోసమే ఎంపికై న అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ నాయకులు నిర్వహిస్తున్న ఏజెన్సీలకు పోస్టుల భర్తీ పక్రియను అప్పజెప్పేందుకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నట్లు గుసుగుసలు వినిపిస్తున్నాయి. ఇలా ఏజెన్సీల ద్వారా పోస్టులు భర్తీ చేపడితే పోస్టుల కోసం పెద్ద ఎత్తున డబ్బులు దండుకోవచ్చుననే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సర్వజన ఆస్పత్రి పోస్టుల భర్తీ బాధ్యత ఏజెన్సీలకు కట్టబెట్టే యత్నం నియామక పక్రియ పూర్తయినా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వని వైనం నోటిఫికేషన్ రద్దు చేస్తారనే గుసగుసలు ఆందోళనలో ఎంపికై న అభ్యర్థులు వైద్య కళాశాల పోస్టులకు ఎంపికై న వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందజేతఆర్డర్స్ ఇవ్వొద్దనే ఆదేశాలు వచ్చాయి.. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి పోస్టులకు ఎంపికై న వారికి ప్లేస్మెంట్ ఇంటిమేషన్ ఆర్డర్స్ వచ్చేవరకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వొద్దని ఆప్కోస్ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. అందుకే ఆర్డర్లు ఇవ్వలేదు. – డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటిండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
వైభవంగా కాశీ విశ్వేశ్వరాలయ పునఃప్రారంభోత్సవం
సంతకవిటి: మండలంలోని కొత్తూరు రామచంద్రాపురంలో పునర్నిర్మించిన కాశీ విశ్వేశ్వరాలయం పునఃప్రారంభోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా శాంతి హోమాలు, శిఖర ప్రతిష్ఠ, కళావికర్షణ, పునఃకళాకర్షణ, శాంతి కల్యాణం, విగ్రహ ఆవిష్కరణతో పాటు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం స్వామి ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జెడ్పీ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహనరావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. -
రాజధాని పేరుతో డైవర్షన్ రాజకీయం..
బొబ్బిలి: అమరావతిని రాజధానిగా చట్టబద్ధం చేశామని చెబుతున్న కూటమి నాయకులు.. మరి ఇన్నాళ్లూ ప్రజలను మోసం చేశారా అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని బొబ్బిలి, రామభద్రపురం, తెర్లాం, బాడంగి మండలాలకు చెందిన చేసిన సర్పంచ్‌లను శుక్రవారం స్థానిక శ్రీసూర్య రెసిడెన్సీలో ఘనంగా సత్కరించారు. మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో నోటికొచ్చిన హామీలిచ్చి వేటినీ అమలు చేయలేదన్నారు. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో అమరావతికి చట్టబద్ధత అంటూ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండడంతో కూటమి నాయకులు ప్రజలను మభ్యపెట్టడానికి కుట్రలు పన్నుతారన్నారు. రాజధానిలో భవనాలు నిర్మించామన్నారు.. రంగులేశామన్నారు..ఇప్పుడేమో పార్లమెంట్లో చట్టబద్ధత చేశామంటున్నారని ఎద్దేవా చేశారు. రాజధానికి ఇప్పుడు చట్టబద్ధత చేశారంటే..మరి ఇన్నాళ్లూ ప్రజలను మోసం చేసినట్లు కాదా అని ప్రశ్నించారు. రాజధాని పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. మొక్కజొన్న కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. రూ. 2,400 మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం మొక్కజొన్న దిగుబడిని కొనుగోలు చేయకపోవడం అన్యాయమన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మొక్కజొన్నకు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు రైతుల కష్టాలను తీర్చలేని దద్దమ్మలని ఎద్దేవా చేశారు. గ్యాస్ లేక మహిళలు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రం ఎక్కడబడితే అక్కడ గ్యాస్ దొరుకుంతుందని చెప్పడం విచారకరమన్నారు. అలాగే నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని తెలిపారు. ప్రజా సంక్షేమం లేక పల్లెలు డీలా పడ్డాయన్నారు. వీటన్నింటినీ తిప్పికొట్టాలంటే మళ్లీ వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హయాంలోని ప్రభుత్వం రావాలన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. ఇప్పుడు చట్టబద్ధత అంటే.. ఇన్నాళ్లూ ప్రజలను మోసం చేశారా..? ఎన్నికల హామీలు అమలు చేయని కూటమి నాయకులు జిల్లాలోని ఎమ్మెల్యేలు రైతుల కష్టాలు తీర్చలేని దద్దమ్మలు జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావుజగన్ మోహన్‌రెడ్డి ధైర్యశీలి.. : పరిశీలకుడు జగన్నాథంవైఎస్సార్సీపీ బొబ్బిలి పరిశీలకుడు రొంగలి జగన్నాథం మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కరోనాను ధైర్యంగా ఎదుర్కొని సమర్థ పరిపాలన సాగించిన ధైర్యశీలి జగన్ మోహన్‌రెడ్డి అని కొనియాడారు. సచివాలయాలు, వలంటీర్లతో గాంధీ కలలుగన్న సుపరిపాలన తీసుకువచ్చాడన్నారు. అటువంటి వ్యక్తిని మరోసారి సీఎంగా చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని సర్పంచ్‌లను సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్ఈసీ సభ్యుడు ఇంటి గోపాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శంబంగి వేణుగోపాలనాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎస్వీ మురళీ కృష్ణారావు, ఎంపీపీలు చొక్కాపు లక్ష్మణరావు, నర్సుపల్లి ఉమాలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యులు పెద్దింటి రామారావు, శాంతకుమారి, సరస్వతి, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు చోడిగంజి రమేష్‌నాయుడు, బొబ్బిలి, బాడంగి మండల పార్టీ అధ్యక్షులు తమ్మిరెడ్డి దామోదరరావు, యామలి శివప్రసాద్, సీనియర్ నాయకులు మర్రాపు జగన్నాథం, నర్పుపల్లి బాబ్జీ, తెర్లాం మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు తెంటు సత్యం నాయుడు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జి. చంద్రవదన, డబ్ల్యూవీఎల్‌ఎన్ రాయలు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.మీరే మళ్లీ సర్పంచ్‌లు: మాజీ ఎంపీ బెల్లాన మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు) మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపరిపాలనలో భాగస్వామ్యులైన సర్పంచ్‌లందరూ మళ్లీ ఎన్నికల్లో గెలవాలని ఆకాంక్షించారు. పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగాలని మాజీ సర్పంచ్‌లకు సూచించారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఏమైంది..? : మాజీ ఎమ్మెల్యే శంబంగి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు మాట్లాడుతూ.. నలబైభె ఏళ్ల చరిత్ర ఉందని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు.. రేపో మాపో పదవీకాలం పూర్తయ్యే సర్పంచ్‌లకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. కొత్తగా వచ్చిన సర్పంచ్‌లకు ఇవ్వాల్సిన శిక్షణను రెండు నెలల్లో పదవీ విరమణ చేసే వారికి ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. -
అల్యూమినియం యూనిట్ ఏర్పాటుకు స్థల పరిశీలన
పాచిపెంట: మండలంలోని పెద కంచూరు గ్రామ సమీపంలో అల్యూమినియం యూనిట్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ యువరాజ్, జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్‌కుమార్ రెడ్డితో కలిసి శుక్రవారం స్థల పరిశీలన చేపట్టారు. రెవెన్యూ సర్వేయర్, అటవీశాఖ అధికారులతో మాట్లాడి భూమికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అప్రోచ్ రోడ్ల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై గల అవకాశాలపై ఆరా తీశారు. వీరి వెంట పరిశ్రమల అధికారి సీతారామ్, పాచిపెంట మండల తహసీల్దార్ రవి, పరిశ్రమల ప్రోత్సాహక అధికారి బ్రహ్మాజీ, ఏపీఐఐసీ అధికారులు, సర్వేయర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
సుస్థిర ఆర్థికాభివృద్ధే లక్ష్యం
ఐటీడీఏ ఏపీఓ పి.మురళీధర్, డీఆర్డీఏ ఏపీడీ జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. 5న రోడ్లు, భవనాల శాఖామంత్రి పర్యటన రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఈ నెల 5న జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు మంత్రి పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. 5న జగ్జీవన్‌రామ్ జయంతి మాజీ ఉప ప్రధాని, స్వాంత్య్ర సమరయోథుడు డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ 119వ జయంతిని ఈ నెల 5న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్టు కలెక్ట ర్ తెలిపారు. సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పార్వతీపురం మెయిన్ రోడ్డులోని సౌందర్య థియేటర్ వద్ద ఉన్న బాబూ జగ్జీవన్‌రామ్ విగ్ర హానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తామన్నారు. పార్వతీపురం: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, సుస్థిర ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి సూచించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో డీఆర్డీఏ– వెలుగు అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది కాలంలో సాధించిన లక్ష్యాలు, ఎదురైన సవాళ్లు, క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలను విశ్లేషించి తదుపరి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ప్రతీ మండలంలో ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని అక్కడ ఉన్న వ్యాపార అవకాశాలు, ప్రజల నైపుణ్యా లు తదితర అంశాలపై సమగ్ర విశ్లేషణ చేయాలన్నా రు. రుణాల మంజూరు, ఉపాధి కల్పనలో కేవలం మహిళలకే కాకుండా పురుషులకు సైతం అవకాశా లు కల్పిస్తూ సమగ్రమైన డేటాను సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ ఆర్.వైశాలి, -
అయినవారికే ఉపాధి
శుక్రవారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026సాక్షి, పార్వతీపురం మన్యం: గ్రామాల్లో పంచాయతీ సర్పంచ్ల పదవీ కాలం ముగిసిపోయింది. మరోవైపు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పాత ఉపాధిహామీ పథకం స్థానంలో కొత్త చట్టం (వీబీజీ రామ్‌జీ)రానుందని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులు, వాటికి సంబంధించిన బిల్లులు చాలా వరకు పెండింగ్‌లో ఉండిపో యాయి. ఈ నేపథ్యంలో మరోనెల వరకు గడువు పొడిగించారు. పదవీకాలం ముగియడం.. 2025– 26లో చేపట్టిన పనులకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అధిక శాతం పంచాయతీల్లో సర్పంచ్‌లే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తారు. ఇప్పుడు వారిలో ఆందోళన నెలకొంది. ఇదే సమయంలో గోకులం షెడ్లకు బిల్లులు మంజూరయ్యాయి. ఈ షెడ్ల పనులన్నీ దాదాపు టీడీపీకి చెందిన వారే చేయించడం గమనార్హం. ఉపాధి పనులు చేసిన వేతనదారులకు సైతం బకాయిలు రూ.కోట్లలో చెల్లించాల్సి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా పనులు మరోవైపు ఆర్థిక సంవత్సరం ముగుస్తుందని, చట్టంలో మార్పుల వల్ల నిధులు మురిగిపోతాయన్న ఉద్దేశంతో హడావిడిగా ఉపాధిహామీ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో చేపట్టిన పనులపై పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో జరిగిన ఉపాధి పనుల్లో దాదాపు రూ.120 కోట్ల మేర రహదారుల పనులు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయని, ప్రజాధనం దుర్వినియోగమైనా పట్టించుకోవడం లేదని సీపీఎం నాయకులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో మంజూరైన ఉపాధిహామీ నిధులతో బీటీ రోడ్లకు సుమారు రూ.70 కోట్లు, సీసీ రహదారులకు సుమారు రూ.50 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనుల్లో నిబంధనలకు విరుద్ధంగా అధికార యంత్రాంగం పనులు చేయించినట్లు ఆరోపణలున్నాయి. టెండర్ ప్రక్రియ ద్వారా జరిపించాల్సి ఉన్నప్పటికీ.. జిల్లా అంతా నామినేషన్ ద్వారా కూటమి ప్రభుత్వం తన అనుయాయులకు కట్టబెట్టింది. ●మక్కువ మండలం వెంకట భైరిపురం నుంచి తూరుమామిడి వరకు సుమారు రూ.3.60 కోట్లతో బీటీ రోడ్డు మంజూరైతే.. వాటిని ఏడు ముక్కలుగా విడగొట్టి, నామినేషన్ పద్ధతిలో ఇచ్చారు. అర్హత లేని వారికి పనులు అప్పగిస్తుండడంతో పూర్తిస్థాయి లో జరగడం లేదు సరికదా.. నాణ్యత కూడా ఉండడం లేదు. ●జియ్యమ్మవలస మండలంలో టెండర్ ఆధారంగా పనులు జరిపించాలని పట్టుబడితే.. జిల్లా స్థా యి అధికారి ఒకరు కూటమి నాయకులను కూర్చోబెట్టి, పరిష్కారం చేసినట్లు ఆరోపణలొచ్చాయి. మరోవైపు అధికార పార్టీ నాయకులు తమ అనుచరులు ఉన్న గ్రామాలకే కోట్లాది రూపాయల పనులు కేటాయించారు. ●సాలూరు మండలం కూర్మరాజుపేటకు సుమా రు రూ.కోటి వ్యయంతో సీసీ రోడ్డు మంజూరు చేశారు. మక్కువ మండలం కాశీపట్నంకు దాదాపు రూ.1.30 కోట్లు నిధులు మంజూరు చేశారు. పనుల కేటాయింపుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. -
‘సీతం’లో పాలిసెట్ ఉచిత శిక్షణ
విజయనగరం అర్బన్: గాజులరేగ పరిధిలోని సీతం కళాశాలలో పాలిసెట్ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉచిత శిక్షణను ప్రారంభిస్తున్నట్టు సత్య విద్యా సంస్థల కరెస్పాండెంట్, మాజీ ఎంపీ డాక్టర్ బొత్స ఝాన్సీలక్ష్మి అన్నారు. ఈ నెల 4 నుంచి 24వ తేదీ వరకు ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. ఇటీవల 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్ధులకు ఈ కోచింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఉచిత కోచింగ్‌తో పాటు స్టడీ మెటీరియల్స్, బాలురు, బాలికలకు హాస్టల్ సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి రోజూ ప్రాక్టీస్ టెస్ట్‌ల ద్వారా విద్యార్థులకు మెరుగైన సన్నద్దత కల్పించనున్నట్లు చెప్పారు. అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంతో శిక్షణ అందిస్తామని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం పాలిసెట్ కోచింగ్‌కు సంబంధించిన బ్రోచర్‌ను విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం 9533545689, 7989040214 నంబర్లను సంప్రదించాలని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామమూర్తి సూచించారు. -
పుట్టెడు దుఃఖంతో పరీక్షకు..
జామి: తల్లి చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉంటూ పదో తరగతి పరీక్షలకు హాజరు కావాల్సి వచ్చింది ఓ విద్యార్థికి. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని భీమసింగి పంచాయతీ పీతలపాలెం గ్రామానికి చెందిన బొట్ట వెంకటేష్ జామి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం రాత్రి వెంకటేష్ తల్లి దేముడమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. ఏం చేయాలో తెలియని పుట్టెడు దుఃఖంలో కూడా వెంకటేష్ గురువారం జరిగిన ఇంగ్లిష్ పరీక్షకు హాజరయ్యాడు. -
● గ్యాస్ కష్టాలు
పశ్చిమాసియాలో యుద్ధవాతావరణం వల్ల జిల్లాలో గ్యాస్ వినియోగదారులకు కష్టాలు తప్పడం లేదు. సిలిండర్ బుక్ చేసినా సకాలంలో అందడం లేదు. ఫలితం... గ్యాస్ గొడౌన్లు, ఆఫీస్‌ల వద్దకు పరుగులు తీస్తున్నారు. గ్యాస్ లారీ వచ్చిన వెంటనే క్యూ కడుతున్నారు. గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. సిలిండర్ ఇచ్చాక నెత్తిన, బైక్‌లపై అష్టకష్టాలు పడుతూ ఇంటికి చేర్చుతున్నారు. దీనికి విజయనగరంలోని చింతలవలస గ్యాస్ గౌడౌన్ వద్ద గురువారం కనిపించిన ఈ చిత్రాలే నిలువెత్తు సాక్ష్యం. గ్యాస్ కష్టాలు లేవంటూ పాలకులు చెబుతున్న మాటలు ఉత్తుత్తివే అనేందుకు వినియోగదారుల పాట్లే నిదర్శనం. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం తప్పని ఇక్కట్లు భుజాన సిలిండర్‌తో..చిన్నారికీ తప్పని సిలిండర్ కష్టాలు -
122 మందితో.. ప్రత్యేక పాలన
వీరఘట్టం: పంచాయతీ సర్పంచ్ల పాలన గురువారంతో ముగిసింది. 2021 ఏప్రిల్ 3న ప్రారంభమైన సర్పంచ్ల పాలనకు ఐదేళ్లు పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా 451 మంది సర్పంచ్‌లు పదవీ విరమణ పొందారు. దీంతో ఆయా పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ కలెక్టర్ ప్రభాకరరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 15 మండలా ల్లోని 451 పంచాయతీలకు 122 మంది ప్రత్యేకాధికారులను నియమించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొ న్నా రు. అయితే, ఇప్పటికే పనిభారంతో సతమతమవుతుంటే పంచాయతీలకు ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ తమపై అదనపు భారం వేయడం తగదంటూ కొందరు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక పాలనలో ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందోనని భయపడుతున్నారు. అదనపు భారం జిల్లాలో ఉన్న 451 పంచాయతీలకు మండల స్థాయిలోని రెవెన్యూ, విద్య, ఐసీడీఎస్, మండల పరిషత్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, హార్టికల్చరల్, వ్యవసాయశాఖలలో పనిచేస్తు న్న 122 మందిని ప్రత్యేకాధికారులుగా నియమించారు. వీరిలో ఒక్కొక్కరికి కనీసం 2 నుంచి అత్యధికంగా 6 పంచాయతీల బాధ్యతలను అప్పగించారు. తమ సొంత శాఖలలోనే పనుల ను సకాంలో పూర్తిచేయలేక సతమతమవుతుంటే పుండుమీద కారం చల్లినట్లు పంచాయతీలకు తమను ప్రత్యేకాధికారులుగా నియమించడం తగదని, ఈ పాలనలో ఇంకా ఎన్ని ఇబ్బందులు పడాలో తెలియడంలేదంటూ కొందరు అధికారు లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జోరుగా పైరవీలు.... జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుండి ప్రత్యేక పాలన ప్రారంభం కానుండడంతో తమకు అనుకూలంగా ఉన్న అధికారులను తమ పంచాయతీలకు ప్రత్యేకాధికారులుగా నియమించుకునేందుకు జోరుగా రాజ కీయ పైరవీలు జరిగినట్టు సమాచారం. మండల స్థాయి నుంచి వచ్చిన అధికారుల జాబితాలను జిల్లా కార్యాలయంలో పరిశీలించి రాజకీయ నాయకులు సూచించిన వారికి తమకు అనుకూలంగా ఉన్న పంచాయతీల్లో ప్రత్యేకాధికారులుగా నియ మించారనే ఆరోపణలు ఉన్నాయి. -
జల్‌జీవన్ పైపులు దగ్ధం
సీతంపేట: స్థానిక శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం పక్కన పడి ఉన్న జల్‌జీవన్ మిషన్ పైపులు దగ్ధమయ్యాయి. ఇంటింటికి కుళాయి కనెక్షన్లు వేయడానికి సంబంధిత కాంట్రాక్టర్ 37 కిలోమీటర్ల పొడవు గల పైపులు గత కొన్ని సంవత్సరాలుగా టీటీడీ ఆలయానికి కొద్ది దూరంలో ఉంచేశారు. గురువారం అకస్మాతుగా మంటలు వ్యాపించడంతో స్థానికులు అగ్నిమాపక కార్యాలయానికి ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన అగ్నిమాపక శాఖాధికారి జామి సర్వేశ్వరరావు అగ్నిమాపక శకటంతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదంపై ఆరా తీశారు. గవరమ్మపేటలో గజరాజులు జియ్యమ్మవలస: మండలంలోని గవరమ్మపేట, రామినాయుడువలస పంట పొలాల్లో గజరాజులు గురువారం దర్శనమిచ్చాయి. ఉదయం గవరమ్మపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న గజరాజులు మధ్యాహ్నానానికి రామినాయుడువలస, పెదమేరంగి చెరువులోకి చేరుకున్నాయి. రాత్రి సమయంలో గ్రామంలోకి చొచ్చుకువస్తాయని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రబీ వరి పంట పొట్ట దశలో ఉండడంతో పంటలను పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెల్ప్ డెస్క్‌ను ప్రారంభించిన ఎస్పీ గుర్ల: స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నిర్మించిన ఉమెన్ హెల్ప్ డెస్క్, పార్కింగ్ షెడ్, ఫిర్యాదుదారులు వేచి ఉండే గదిని ఎస్పీ దామోదర్ గురువారం ప్రారంభించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులపై దురుసుగా ప్రవర్తించవద్దని సూచించారు. మహిళల కోసం ప్రత్యేకంగా గదిని నిర్మించడంతో సంతోషం వ్యక్తం చేశారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. డీఎస్పీ రాఘవులు, సీఐ శంకరరావు, ఎస్ఐ నారాయణరావు పాల్గొన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం మెంటాడ: మండలంలోని మెంటాడ గ్రామంలో మండలవారి వీధిలో మండల సత్యవతి పెంకుటిల్లు గురువారం దగ్ధమైంది. సత్యవతి ఇంట్లో నుంచి పొగలు రావడం గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడం వలన ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. పెంకుటిల్లు కావడంతో కలపకు మంటలు అంటుకొని భారీగా మంటలు చెలరేగి కాలిపోయింది. ప్రమాదంలో తమ రేషన్ కార్డు, ఆధార్ కార్డులు, బట్టలు, నిత్యావసర సరుకులతో పాటు రూ.76 వేల నగదు, మూడు తులాల బంగారు ఆభరణాలు పూర్తిగా కాలిపోయాయని బాధితురాలు సత్యవతి తెలిపారు. విజయనగరం అర్బన్: డీఎల్ఎడ్ కోర్సులకు సంబంధించిన పరీక్ష ఫీజుల చెల్లింపుల షెడ్యూల్‌ను డీఈఓ యు.మాణిక్యంనాయుడు గురువారం విడుదల చేశారు. 2024 – 26 బ్యాచ్‌తో పాటు ఒకసారి ఫెయిల్ అయిన 2022 – 24, 2023 – 25 బ్యాచ్‌ల విద్యార్థులకు ఈ షెడ్యూల్ వర్తిస్తుంది. పరీక్ష ఫీజులను నిర్ణీత గడువులోపు ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లింపులు వెబ్సైట్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. ఫీజు చెల్లింపునకు రూ.50 అపరాధ రుసుంతో ఈ నెల 5వ తేదీ వరకు విద్యార్థులకు అవకాశం ఉంది. అదే ప్రిన్సిపాల్ ద్వారా చెల్లించవలసిన వారికి మాత్రం ఈ నెల 9వ తేదీ వరకు గడువు ఉంది. విద్యార్థులు ముందుగా ఫీజులను ఆన్లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా చెల్లించి, అనంతరం అవసరమైన వివరాలను సంబంధిత కళాశాలలకు సమర్పించాల్సి ఉంటుంది. పరీక్ష ఫీజులు నాలుగు సబ్జెక్టులకు రూ.250, మూడు సబ్జెక్టులకు రూ.175, రెండు సబ్జెక్టులకు రూ.150, ఒక సబ్జెక్టుకు రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. -
పీహెచ్‌ఛీ..!
● వేపాడ పీహెచ్సీలో ఫిబ్రవరి నెలలో 28 రోజులకు 1400 మందికి సేవలు అందించాల్సి ఉంది. ఇక్కడ 504 మందికి మాత్రమే వైద్యులు ఓపీ సేవలందించారు. లక్ష్యం ఆమడ దూరంలో ఉండిపోయింది. ● కోరపుకొత్తవలస పీహెచ్సీలో ఫిబ్రవరి నెల 28 రోజులకు ఓపీ 1400 నమోదుకావాలి. ఇక్కడ కేవలం 345 ఓపీ నమోదైంది. వైద్యసేవల కోసం ఆస్పత్రికి వచ్చేవారి సంఖ్య అమాంతం పడిపోయింది. ● గంట్యాడ పీహెచ్సీలో 1400 మందికి ఓపీ సేవలు అందించాల్సి ఉండగా కేవలం 668 మందికి మాత్రమే అందించారు. ఇక్కడ కూడా లక్ష్యం నెరవేరని పరిస్థితి. ఆస్పత్రికి వస్తే మెరుగైన వైద్యసేవలు అందుతాయోలేదోనన్న బెంగతో అధికమంది ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నట్టు మండల వాసులు చెబుతున్నారు. 24 గంటలూ సేవలందించాల్సి ఉన్నా... జిల్లాలో 48 పీహెచ్‌సీలు, 18 పట్టణ పీహెచ్‌సీలు ఉన్నాయి. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మినహా మిగిలిన పీహెచ్‌సీల్లో 24 గంటలపాటు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి. సాధారణ సేవలతో పాటు ప్రసవ సేవలు అందించాలి. ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు స్టాఫ్‌నర్సులు, ఎఫ్ఎన్ఓ, ఇతర సిబ్బంది సేవలందిస్తారు. కొన్నిచోట్ల నిపుణులైన వైద్యులు ఉన్నా సౌకర్యాలు లేకపోవడం, మరికొన్ని చోట్ల విధులకు సిబ్బంది డుమ్మా కొట్టడం వంటివి వైద్యసేవలపై ప్రభావం చూపుతున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత కొంతమంది వైద్యులు ఆస్పత్రుల నుంచి వెళ్లి పోతున్నారని రోగులు చెబుతున్నారు. రాత్రివేళల్లో కొన్ని పీహెచ్‌సీల్లో ఎఫ్ఎన్ఓలను ఉంచి వైద్య సిబ్బంది ఇంటికి వెళ్లి పోతున్నారు. దీనివల్ల అత్యవసర వేళ ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య వైద్యకేంద్రాలకు సదుపాయాల కల్పనలో ప్రభుత్వం విఫలం ప్రభుత్వ వైద్యంపై సన్నగిల్లుతోన్న నమ్మకం తగ్గుతున్న ఓపీ నమోదు అధికమంది ప్రైవేటు ఆస్పత్రులనే ఆశ్రయిస్తున్న వైనం -
● గ్యాస్ కోసం పడిగాపులు
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలోని బైపాస్ కాలనీలో భారత్ గ్యాస్ వినియోగదారులు సిలిండర్ల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. స్థానిక భారత్ పెట్రోల్ బంకు వద్ద ఉదయం 11 గంటల నుంచే వినియోగదారులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. సాయంత్రం వరకు వాహనం రాకపోవడంతో ఎండలోనే పడిగాపులు కాశారు. చివరకు సాయంత్రం వేళ సాలూరు నుంచి ఒక బొలెరో, ఆటోలో అరకొరగా సిలిండర్లు చేరుకున్నాయి. వినియోగదారులు ఒక్కసారిగా ఎగబడటంతో పోలీసులు రంగప్రవేశం చేసి పంపిణీని క్రమబద్ధీకరించారు. భారీ క్యూ ఉండటం, స్టాక్ తక్కువగా రావడంతో తమ వరకు గ్యాస్ అందుతుందో లేదోనని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. -
రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని మృతదేహం
విజయనగరం క్రైమ్ : ఎల్.కోట – మళ్లివీడు రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని మృతదేహాన్ని జీఆర్పీ పోలీసులు గురువారం గుర్తించారు. దీనికి సంబంధించి జీఆర్పీ హెచ్‌సీ ప్రసాద్ ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. సుమారు 50 నుంచీ 55ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి మృతదేహాన్ని మళ్లివీడు రైల్వేస్టేషన్ వద్ద గుర్తించామన్నారు. సదరు మృతదేహం సుమారు 5 అడుగుల 6 అంగుళాల పొడవు, చామన ఛాయ రంగుతో ఉందన్నారు. సదరు మృతదేహంపై లేత వైలెట్ రంగు ఫుల్ హాండ్స్ షర్టు, కాఖీ కలర్ ప్యాంటు ధరించి ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ఆచూకీ తెలిస్తే 9247585742, 9440170317 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
ఫలితాలివ్వని పీ–4
విజయనగరం అర్బన్: పేద కుటుంబాల జీవన ప్రమాణాల మెరుగుకు దాతల నుంచి నేరుగా సహకారం అందించి పేదరికాన్ని నిర్మూలిస్తామని ప్రకటించి అమలు చేస్తున్న పీ 4 (జీరో పావర్టీ) కార్యక్రమం ఫలితాలు క్షేత్ర స్థాయిలో భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వం చూపుతున్న దిశ, వాస్తవ ఫలితాలు మధ్య భారీ అంతరం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పీ 4 ద్వారా వచ్చిన దాతల ఆర్థిక సహాయాన్ని వినియోగిస్తూ పథకం లక్ష్యాన్ని దారి మళ్లిస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన పీ 4 వార్షికోత్సవంలో అలాంటి దాతలను ఉత్తమ మార్గదర్శకులుగా మంత్రి వంగలపూడి అనిత ప్రశంసించి సత్కరించడం కనిపించింది. జిల్లా, నియోజకవర్గ స్థాయి అవార్డుల వివరాలు చూస్తే ఈ కార్యక్రమం ప్రధానంగా విరాళాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంపై ఆధారపడుతున్నదన్న విషయం స్పష్టమవుతోంది. స్వచ్ఛంద సంస్థ విరాళాలే అధికం గజపతినగరం నియోజకవర్గంలో రౌండ్ టేబుల్ ఇండియా ఫౌండేషన్ రూ.71.61 లక్షలతో పాఠశాల, ఆస్పత్రికి సదుపాయాలు కల్పించగా, మరో సంస్థ రూ.39.10 లక్షలతో మార్కెట్, పాఠశాలలు, గ్రామాలకు సహాయం చేసింది. ఐడీబీఐ బ్యాంక్ రూ.12.64 లక్షలు, పుష్పగిరి ఫౌండేషన్ రూ.4లక్షలతో సేవలు అందించాయి. ఇవి చూస్తే ప్రభుత్వం బాధ్యతగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు దాతల ఆర్థిక సహాయాన్ని వినియోగించి పేదరిక నిర్మూలన లక్ష్యాన్ని పక్కన పెట్టిందని విశ్లేషకులు ఆక్షేపిస్తున్నారు. లక్ష్యానికి తగ్గ విస్తృతి లేకపోవడం పీ–4 లక్ష్యం రాష్ట్ర వ్యాప్తంగా పేదరిక నిర్మూలనే అయినప్పటికీ అమలు మాత్రం కొన్ని నియోజనవర్గాలు, కొన్ని సంస్థలకే పరిమితమవుతోంది. జిల్లాలో 82,426 బంగారు కుటుంబాలను గుర్తించగా కేవలం 19,410 కుటుంబాలు మాత్రమే దత్తత పొందాయి. అంటే దాదాపు 75 శాతం కుటుంబాలు ఇంకా సహాయానికి దూరంగానే ఉన్నాయి. వీళ్లలో కొంతమంది 27 గ్రామాలను దత్తత తీసుకున్నట్టు ప్రకటించినా వాటి సహాయ కార్యక్రమాలు ఆయా గ్రామాలకు అంతంత మాత్రంగానే ఉన్నాయి. జిల్లాలో లక్షలాది మంది పేదలు ఉన్న నేపథ్యంలో లక్షల్లో విరాళాలు ఇవ్వడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. పైగా 2,897 మార్గదర్శులు మాత్రమే ముందుకు రావడం, కార్యక్రమంపై దాతలకు నమ్మకం లేదనే విషయం స్పష్టమవుతోంది. పీ–4తో బాధ్యతల నుంచి దూరంగా ప్రభుత్వం లక్షల్లో బంగారు కుటుంబాలు.. ప్రకటించింది 82,426 27 గ్రామాలను దత్తత తీసుకున్నా.. కనిపించని సహాయక పనులుప్రభుత్వ పాత్రపై ప్రశ్నలు – ప్రచారం – వాస్తవం పీ–4లో ప్రభుత్వం మార్గదర్శక పాత్రలో మాత్రమే ఉండి అమలు బాధ్యతను స్వచ్ఛంద సంస్థలు, దాతలపై మళ్లిస్తున్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పేదరిక నిర్మూలన వంటి కీలక అంశంలో ప్రభుత్వ ప్రత్యక్ష పెట్టుబడి పర్యవేక్షణ లేకపోవడం మేధావుల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేస్తున్నప్పటికీ అందులో భాగంగా అందిస్తున్న సహాయం పరిమిత స్థాయిలోనే ఉండటమే కాకుండా పేదరిక నిర్మూలనకు వినియోగించడం లేదని విమర్శలు వస్తున్నాయి. చివరకు ఇది ఒక ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోయేలా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
నిప్పుల కొలిమి
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి. నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడం.. వేడి గాల్పులు తోడు కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లాలో గురువారం అత్యధికంగా మక్కువ మండలంలో 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. మిగిలిన మండలాల్లోనూ 38 నుంచి 39.8 డిగ్రీ ల వరకూ నమోదయ్యింది. ఎండ, గాల్పుల తీవ్రత రానున్న రెండు రోజులూ ఉంటుందని విపత్తుల, వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నా యి. జిల్లాలోని 11 మండలాల్లో శుక్రవారం తీవ్రమైన వడగాలులు ఉంటాయని అంచనా. 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చ ని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారు లు కోరారు. కురుపాం: మండలంలోని పూతికవలస గ్రామ సమీపంలో గురువారం సాయంత్రం ఏనుగుల గుంపు సంచరించింది. పామాయిల్, చెరకు, అరటి, కర్బుజా తోటల్లో ఏనుగులు సంచరిస్తుండడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఏనుగులను కవ్వించవద్దని, అవసరమైతే పొలాలకు రైతులు గుంపుగా వెళ్లాలని అటవీశాఖ అధికారులు తెలిపారు. పాలకొండ రూరల్: సనాతన హైందవ ధర్మం ఎంతో గొప్పదని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 8వ తరం కుటుంబీకుడు వీరభద్రస్వామి అన్నారు. గురువారం రాత్రి పాలకొండ వచ్చిన ఆయన తొలుత ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం కోటదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు లక్ష్మీప్రసాద్ శర్మ ఆమ్మవారి చరిత్రను ఆయనకు వివరించారు. అనంతరం కోమటిపేటలో స్వయంభూగా కొలువుదీరిన సనారీ విశ్వేశ్వర అన్నపూర్ణమాంబ స్వామి మఠాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు జరిపారు. వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రబోధించిన కాలజ్ఞాన విశిష్టతను వివరించారు. యేసు క్రీస్తు త్యాగం విశ్వశాంతికి చిహ్నం విజయనగరం: యేసు క్రీస్తు ప్రాణత్యాగం విశ్వశాంతికి చిహ్నమని, సర్వ మానవాళి పాప విమో చనం కోసం తన ప్రాణాల ను బలిదానంగా అర్పించి న కరుణామయుడు యేసు అని ఉమ్మడి విజయనగరం జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పేర్కొన్నారు. క్రీస్తు ఆరాధకుల కు గుడ్‌ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. యేసు క్రీస్తు చూపిన త్యాగం, క్షమాగుణం, సహనం, నిస్వార్థ ప్రేమ ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమ ని కొనియాడారు. శత్రువులను సైతం ప్రేమించాలని, పీడిత ప్రజల పట్ల కరుణ చూపాలనే క్రీస్తు బోధించిన సందేశం, ఆచరించిన జీవితం విశ్వమానవాళికి మార్గదర్శకమని పేర్కొన్నా రు. సమాజంలో కూడా అటువంటి శాంతి, సోదరభావం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. క్రీస్తు చూపిన సేవా మార్గంలోనే ప్రస్తుత ప్రభుత్వాలు కూడా నిరుపేదల సంక్షేమంకోసం కృషిచేయాలన్నారు. ప్రజలందరిపైనా క్రీస్తు దీవెనలు ఉండాలన్నారు. గజపతినగరం: విధుల్లో అలసత్వం వహించిన ఉద్యోగులపై చర్యలు తప్పవని కలెక్టర్ ఎస్. రాంసుందర్‌రెడ్డి హెచ్చరించారు. గజపతినగరం–2 గ్రామ సచివాలయాన్ని, పురిటి పెంట –1 అంగన్వాడీ సెంటర్‌ను ఆయన గురువా రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బందితో మాట్లాడారు. సేవలపై ఆరా తీశా రు. అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్త పి.సత్య వతి విధుల్లో లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనికి బాధ్యులుగా సీడీపీఓ, సూపర్ వైజర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఐసీడీఎస్ పీడీను ఆదేశించారు. అనంతరం చిన్నారులతో ముచ్చటించారు. -
మామిడి చెట్లు నరికివేత
సంతకవిటి: అనుమానమే పెనుభూతమై మామిడి చెట్లు నరికివేతకు దారితీసిన పరిస్థితి మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మామిడిపల్లి గ్రామానికి చెందిన సవలాపురపు జోగులు(65) ఇటీవల కాలిన గాయాలతో మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. జోగులు మృతి విషయంలో ఆయన పొలం పక్కన ఉన్న మామిడి తోట యజమాని.. పుల్లిట గ్రామానికి చెందిన వ్యక్తే కారణమని భావించి మామిడి తోటను మృతుడు కుటుంబీకులు కొందరు నరికేసినట్టు తోట యజమాని భార్య పిన్నింటి స్వప్న బుధవారం రాత్రి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ఆర్.గోపాలరావు తెలిపారు. ఇదిలా ఉండగా పుల్లిటలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. -
సిబ్బంది క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లాలి
● ఉపాధిలో సమయపాలన పాటించేలా చూడాలి ● ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి ● డ్వామా పీడీ రామచంద్రరావుసీతానగరం: ఉపాధి హామీ పనులు చేస్తున్న ప్రాంతాల్లో సాంకేతిక సహాయకులు తరచూ క్షేత్ర స్థాయిలో సందర్శించాలని, వేతనదారులు చేస్తున్న పనులు పరిశీలించి నివేదికలు తయారు చేయాలని డ్వామా పీడీ కె.రామచంద్రరావు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఎంఎల్ఎన్ ప్రసాద్ అధ్యక్షతన ఉపాధి హామీ అధికార సిబ్బందితో ఉపాధి పనుల నిర్వహణపై గురువారం సమీక్షించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఎండలు తీవ్రంగా ఉన్నందున వేతనదారులు వడదెబ్బకు గురికాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. పని ప్రదేశాల వద్ద సదుపాయాల నిమిత్తం సంబంధత ఏఎన్ఎం నుంచి ఓఆర్ఎస్ ప్యాకెట్లు తీసుకుని పని వద్ద ఉంచాలన్నారు. ఎన్ఎంఎంఎస్ పంపించే సమయంలో వచ్చే సమస్యలను పరిష్కరించడానికి ఏపీపీలో ఎప్పటికప్పుడు అప్డేట్ జరుగుతుందన్నారు. ఉపాధి హామీ పథకంలో ఉత్పన్నమైన సమస్యలను దశలవారీగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఏపీఓ ఊణ్ణ బాలకృష్ణ, జేఈ సోమేశ్వరరావు, సాంకేతిక సహాయకులు పాల్గొన్నారు. -
రిజిస్ట్రేషన్లలో పారదర్శకత పాటించాలి : జేసీ
పార్వతీపురం రూరల్: రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వేగంగా సేవలు అందించాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పార్వతీపురం పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని ఇండెక్స్ రిజిస్టర్లు, పెండింగ్‌లో ఉన్న దస్తావేజులను నిశితంగా పరిశీలించి, రికార్డుల నిర్వహణపై సిబ్బందిని ఆరా తీశారు. అనంతరం కార్యాలయానికి వచ్చిన క్రయ విక్రయదారులతో నేరుగా మాట్లాడి, సేవలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్లలో అనవసర జాప్యానికి తావుండకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల వసూలు లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలని సూచించారు. వేసవి దృష్ట్యా కార్యాలయానికి వచ్చే ప్రజల కోసం తాగునీరు, నీడ వంటి కనీస వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. తనిఖీలో సబ్ రిజిస్ట్రార్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
వ్యక్తిపై కేసు నమోదు
వేపాడ: మండలంలోని శింగరాయి గ్రామానికి చెందిన గొల్ల సాయికుమార్‌పై అదే గ్రామానికి చెందిన కొరువాడ లక్ష్మణ్ సెలూన్ షాపులో ఉన్న కత్తితో దాడి చేయడంపై వల్లంపూడి ఎస్ఐ ఎస్.సుదర్శన్ కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి వల్లంపూడి పోలీసులు అందించిన వివరాలు.. శింగరాయి గ్రామానికి చెందిన కొరువాడ లక్ష్మణ వేపాడలో సెలూన్ షాపు నడుపుతున్నాడు. అదే గ్రామానికి చెందిన గొల్ల సాయికుమార్, లక్ష్మణ్ గతంలో అండమాన్‌లో బాగానే ఉండేవారు. లక్ష్మణ్ కాస్త డబ్బులు సంపాదించి సాయికుమార్‌కు చెప్పకుండా శింగరాయి వచ్చేసి వేపాడలో రెండు నెలల కిందట సెలూన్ షాపు పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఏప్రిల్ ఒకటో తేదీ మధ్యాహ్నం వేపాడలో సెలూన్ షాపు నడుపుతున్న లక్ష్మణ్ వద్దకు సాయికుమార్ వచ్చి అండమాన్‌లో ఉన్నప్పుడు లక్ష్మణ్ కోసం ఖర్చు చేసిన సొమ్ము ఇమ్మని అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో లక్ష్మణ్ తన షాపులో ఉన్న షేవింగ్ కత్తితో సాయి మెడపై గాయపర్చినట్టు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. గాయపడిన సాయికుమార్‌ను 108లో ఎస్.కోట తరలించి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరం తరలించారు. దీనిపై విజయనగరం ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ ఎం.వీరాకుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. వీఆర్ఓ కొండమ్మ, సిబ్బంది ఉన్నారు. -
12వ పీఆర్సీ ఏర్పాటు చేయాలి
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయుల ఆర్థిక డిమాండ్ల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) జిల్లా శాఖ బుధవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష శిబిరం నిర్వహించింది. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్‌ను వెంటనే నియమించాలని.. అంతవరకు 29 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న డీఏలను మంజూరు చేయాలని, హెల్త్ కార్డులను అన్ని కార్పొరేట్ ఆస్పత్రులు ఆమోదించేలా అవసరమైన నిధులు విడుదల చేయాలని కోరారు. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు బకాయిలను వెంటనే చెల్లించాలని.. జీఓ 57 అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని కోరారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు, అధ్యక్షుడు సీహెచ్ భాస్కరరావు ఆధ్వర్యంలో జరిగిన దీక్షలో రాష్ట్ర కార్యదర్శి మురళీమోహన్, సీనియర్ నాయకులు కె.విజయగౌరి, డి.రాము, సహాధ్యక్షురాలు జి.పార్వతి, కోశాధికారి సీహెచ్ తిరుపతినాయుడు, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు రమేష్ చంద్రపట్నాయక్, ఈశ్వరరావు, కె..శ్రీదేవి, ఎన్.సత్యనారాయణ, ఎస్.వెంకటరావు, కిల్లాడ అప్పారావు, గంట సుశీల, నిర్మల, శశికళతో పాటు మండల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
పాత్రికేయులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
● కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డివిజయనగరం అర్బన్: జిల్లాలోని పాత్రికేయులంతా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సూచించారు. జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో స్థానిక తిరుమల మెడికవర్ ఆస్పత్రిలో అక్రిడేటెడ్ జర్నలిస్టుల కోసం ఐదు రోజులుగా నిర్వహిస్తున్న ఉచిత వైద్య పరీక్షల శిబిరాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ.. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో సమాచార శాఖ ఎ.డి పి.గోవిందరాజులు, తిరుమల మెడికవర్ ఎం.డి డాక్టర్ తిరుమల ప్రసాద్, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి ఎస్.జీవనరాణి, ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్ సాయిరాం, తిరుమల మెడికల్ సెంటర్ హెడ్ పవన్‌కుమార్, ఐఈయూ ఇన్చార్జ్ డాక్టర్ ఎ.జగదీష్, కార్డియాలజిస్ట్ శ్రీకిరణ్, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు పీఎస్‌ఎస్‌వీ ప్రసాదరావు, బూరాడ శ్రీనివాసరావు, డివిజన్ పీఆర్ఓ ఎస్.జానకమ్మ, పీఆర్ఓ మజ్జి వాసుదేవరావు, తదితరులు పాల్గొన్నారు. -
పైడితల్లిని దర్శించుకున్న ప్రముఖ గాయని జానకమ్మ
విజయనగరం టౌన్: ప్రముఖ నేపథ్యగాయని ఎస్.జానకమ్మ ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లిని బుధవారం దర్శించుకున్నారు. మూ డులాంతర్లు జంక్షన్ వద్దనున్న బాలాలయంలో అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజాధికాలు నిర్వహించిన అనంతరం జానకమ్మకు వేదాశీస్సులు, అమ్మవారి తీర్థ, ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో గురునారాయణ కళాపీఠం వ్యవస్థాపకుడు బీఏ నారాయణ, డాక్టర్ జి.సన్యాసమ్మ, గాయనీ, గాయకులు పాల్గొన్నారు.తల్లిదండ్రుల చెంతకు బాలికవిజయనగరం క్రైమ్: వన్‌టౌన్ స్టేషన్ పరిధి తోటపాలెంలో అదృశ్యమైన బాలిక కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ఎస్సై లీలావతి తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 31న తోటపాలెంనకు చెందిన ఓ బాలిక అదృశ్యమైందంటూ తండ్రి వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ చౌదరి ఆదేశాలతో ఎస్సై లీలావతి పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక ఫోన్ నంబర్‌ను ట్రేస్ చేయగా విశాఖపట్నం వెళ్లినట్లు గుర్తించారు. దీంతో హుటాహుటిన ఎస్సై లీలావతి తన బృందంతో విశాఖ వెళ్లి బాలికను తీసుకొచ్చి కన్నవారికి బుధవారం అప్పగించారు. బాలిక ప్రేమికుడితో వెళ్లినట్లు తేలడంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో హెచ్‌సీ రామారావు, తదితరులు పాల్గొన్నారు. -
బెట్టింగ్‌ల మాయాజాలంలో చిక్కుకోవద్దు..
● ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డిపార్వతీపురం రూరల్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల నేపథ్యంలో యువత ఆన్లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగుల మాయాజాలంలో చిక్కుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే స్వార్థపరుల ఆశల వలలో పడి బంగారు భవితను అంధకారం చేసుకోవద్దన్నారు. వినోదం పంచాల్సిన ఆటలు.. కుటుంబాల్లో విషాదం నింపేలా మారకూడదని హితవు పలికారు. బెట్టింగుల వ్యసనానికి బానిసలై అప్పులపాలవుతున్నారని, ఆ నష్టాలను భర్తీ చేసుకునే క్రమంలో కొందరు దొంగతనాలు, ఇతర నేరాల బాట పడుతుంటే.. మరికొందరు తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకోవాల్సిన వయసులో విద్యార్థులు తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని, తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారిని సన్మార్గంలో పెట్టాలని కోరారు. క్రికెట్ బెట్టింగులకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే డయల్ 112 లేదా 100 నంబర్లకు గానీ, స్థానిక పోలీసులకు గాని ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు. -
కాలుష్య కోరల్లో ఉత్తరాంధ్ర
చికెన్● లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీవిజయనగరం గంటస్తంభం: ఉత్తరాంధ్రలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరుగుతున్నప్పటికీ, అదే స్థాయిలో కాలుష్యం పెరుగుతూ ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం పట్టణాలు క్రమంగా కాలుష్య ప్రభావానికి గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రతీర ప్రాంతాల్లో స్థాపితమైన ఫార్మా కంపెనీలు స్థానికులకు ఉపాధి కల్పించడం కంటే ఎక్కువగా కాలుష్యాన్ని అందిస్తున్నాయని ఆరోపించారు. డబ్బులు కంపెనీలకు జబ్బులు ప్రజలకు అనే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైతే ట్రాఫిక్ రద్దీతో పాటు కాలుష్య సమస్యలు మరింత పెరిగే అవకాశముందని.. ఇప్పటికే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జాతీయ రహదారిపై రద్దీ అధికమైందని తెలిపారు. ట్రాఫిక్, కాలుష్యం సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాయనున్నట్లు చెప్పారు. అనంతరం డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ రచించిన పుస్తకాన్ని విడుదల చేశారు. సమావేశంలో లోక్‌సత్తా నాయకులు మూర్తి, నాగభాస్కరం, తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ సేవల్లో వేగం పెంచండి
● కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాలో అర్హులైన ప్రతిఒక్కరికీ పాస్ పుస్తకాలు అందేలా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్ఓ సీహెచ్ సత్తిబాబు, కేఆర్సీ ఎస్డీసీ ఈ.మురళి పాల్గొన్నారు. మెరుగైన ర్యాంకులు సాధించాలి స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జిల్లాకు చెందిన మున్సిపాలిటీలు మెరుగైన ర్యాంకులు సాధించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి ఆదేశించారు. దేశవ్యాప్తంగా టాప్–100లో స్థానం దక్కేలా ప్రత్యేకంగా విజయనగరం, బొబ్బిలి మున్సిపాలిటీల కృషి చేయాలని దిశానిర్ధేశం చేశారు. ఇతర మున్సిపాలిటీలు కూడా తమ ర్యాంకులను మెరుగుపర్చుకోవాలని సూచించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో స్వచ్ఛ సర్వేక్షణ్, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, అన్న క్యాంటీన్లు, పన్నుల వసూళ్లు, ఎల్ఆర్ఎస్, బీపీఎస్, తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో విజయనగరం, బొబ్బిలి, రాజాం, నెల్లిమర్ల మున్సిపల్ కమిషనర్లు, పబ్లిక్ హెల్త్ ఈఈ, తదితరులు పాల్గొన్నారు.విజయనగరం అర్బన్: జిల్లాలో రెవెన్యూ సంబంధిత సేవలు, భూసర్వే ప్రక్రియ, ప్రజల అర్జీల పరిష్కారంలో అధికారులు మరింత వేగంగా స్పందించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ నుంచి రెవెన్యూ అధికారులతో ఆన్లైన్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన మ్యుటేషన్లలో ఐదు రకాల సవరణలను తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం వాస్తవ స్థితిగతుల ఆధారంగా కరెక్షన్స్ చేయాలని స్పష్టం చేశారు. మార్చి 31 నాటికి జిల్లాలో అందిన 22ఏ దరఖాస్తులపై సమీక్ష నిర్వహించి, పెండింగ్‌లో ఉన్న వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఫారం–8 జారీని రెండు రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. ఐవీఆర్ఎస్ సర్వేపై కూడా సమీక్ష నిర్వహించిన కలెక్టర్, ప్రజలు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందేలా సేవలు అందించాలన్నారు. అన్ని సేవలపైనా 90 శాతం కంటే ఎక్కువ సంతృప్తి స్థాయిని సాధించేలా పనితీరు ఉండాలని చెప్పారు. జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ మాట్లాడుతూ.. వెబ్‌ల్యాండ్ పోర్టింగ్ పనులు గడువులోగా పూర్తి చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. ముఖ్యంగా ఫేజ్–4 పరిధిలోని 126 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూథింగ్ ప్రక్రియ 96,779.71 ఎకరాల వరకు పూర్తయిందని.. మిగిలిన పనులు -
మూడోసారి సమ్మె బాట
● బకాయిలు చెల్లించకపోవడంతో సమ్మె బాట పట్టిన నెట్వర్క్ ఆస్పత్రులు ● ఫలితంగా రోగులకు అందని వైద్య సేవలు ● జిల్లాలో 28 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు ● ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.40 కోట్లు విజయనగరం ఫోర్ట్: జిల్లాలోని ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ) నెట్ వర్క్ ఆస్పత్రులు సమ్మె బాట పట్టాయి. చంద్రబాబు సర్కార్ ఆరోగ్యశ్రీ ఽపథకం ద్వారా రోగులకు చికిత్స అందించిన ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకుండా అలసత్వం వహించడం వల్ల ఈ సేవలు నిలిచిపోయాయి. టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన సుమారు రెండేళ్ల కాలంలో మూడుసార్లు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మె చేపట్టాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న గతంలో కూడా ఇటువంటి నిర్లక్ష్య ధోరణి అవలింబించేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ సర్కార్ నిర్లక్ష్యం ఆరోగ్యశ్రీ రోగుల పాలిట శాపంగా మారిందనే విమర్శలున్నాయి. నెట్వర్క్ ఆస్పత్రుల్లో సేవలు నిలిచిపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. ● గొప్పలు కుప్ప చంద్రబాబు అధికారంలోకి వస్తే ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత సీఎం చంద్రబాబు, ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్పారు. కానీ.. అధికారం చేపట్టిన తర్వాత అందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. ప్రజలకు పునర్జన్మ ప్రసాదించే ఆరోగ్యశ్రీ పథకం పట్ల టీడీపీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ● బకాయిలు సుమారు రూ.40 కోట్లు జిల్లాలో 28 ఆరోగ్యశ్రీ ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రులు ఉన్నాయి. వీటికి సుమారు రూ.40 కోట్లు వరకు చంద్రబాబు ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉంది. బకాయిలు పెరిగిపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మె చేపట్టాయి. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందే ఆరోగ్యశ్రీ పథకం పట్ల చంద్రబాబు ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ● జిల్లాలో ప్రైవేటు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు సాయి పీవీఆర్ ఆస్పత్రి, వెంకటరామ, శ్రీసాయి సూపర్ స్పెషాలటీ, మువ్వ గోపాల ఆస్పత్రి, వెంకట పద్మ, గాయిత్రి, కాశ్వి, కొలపర్తి ఆస్పత్రి, మారుతి ఆస్పత్రి, అభినవ్, స్వామి కంటి ఆస్పత్రి, శ్రీనివాస్ నర్సింగ్ హోమ్, బాబూజీ తదితర ఆస్పత్రులు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు తమకు చెల్లించాల్సిన బకాయిల కోసం వారం రోజుల ముందే సమ్మె నోటీస్ ఇచ్చాయి. అయినప్పటకీ చంద్రబాబు సర్కార్ పట్టించుకోకపోవడంతో సేవలను నిలిపివేశారు. చంద్రబాబు సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటికే రెండు సార్లు సమ్మె చేపట్టాయి. తాజాగా మూడోసారి కూడా సమ్మె చేపట్టారు. రెండోసారి సమ్మె చేపట్టినప్పడు విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నెట్వర్క్ ఆస్పత్రుల యజమానులు ధర్నా చేపట్టారు. ఆరోగ్యశ్రీ పేదల కల్పతరువుగా ఉండేది. పేద, మధ్య తరగతి ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు కార్పొరేట్ ఆస్పత్రులు సైతం పిలిచి మరి ఉచితంగా సేవలు అందించేవారు. గుండె జబ్బులు, కేన్సర్ వంటి పెద్ద వ్యాధులకు కూడా ఉచితంగా వైద్య సేవలు అందించేవారు. -
ప్రకృతి సాగు.. ప్రగతికి బాట
● ఖరీఫ్‌పై యంత్రాంగం కసరత్తు ● పంట మార్పిడితోనే మేలు: కలెక్టర్ పార్వతీపురం రూరల్ : ఖరీఫ్ సాగులో ముందస్తు ప్రణాళికలు, ప్రకృతి వ్యవసాయ విధానాల ద్వారా రైతులకు మేలు చేకూర్చాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక ఎన్జీఓ భవనంలో వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరి శ్రమ, డీఆర్డీఏ, ప్రకృతి వ్యవసాయ విభాగాల సిబ్బందికి నిర్వహిస్తున్న రెండో రోజు శిక్షణ కార్యక్ర మంలో బుధవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎలోనినో ప్రభావం వల్ల సాగులో తలెత్తే ఇబ్బందులను అధిగమించేలా రైతులను సన్నద్ధం చేయాలన్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, దేశీ విత్తనాలు, ప్రకృతి సాగు వైపు మళ్లించాలని సూచించారు. పంట మార్పిడి, మార్కెటింగ్ అంశాలపై క్షేత్ర స్థాయి సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని, రాబోయే ఏడాదికి సంబంధించి పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు. రైతుల నమ్మకాన్ని పొందేలా అధికారులు తమ వృత్తి పట్ల నిబద్ధతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యవసాయ అధికారి జి.సత్యవతి మాట్లాడుతూ వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని సాగు చేపట్టాలన్నారు. ఉద్యాన అధికారి సత్యం నారాయణరెడ్డి శాఖాపరమైన సబ్సిడీల గురించి వివరించారు. ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎం.శ్రావణ్కుమార్నాయుడు మాట్లాడుతూ.. బయోరిసోర్స్ సెంటర్ల వినియోగం, వరి సాగు లో రైజ్డ్ బెడ్స్ పద్ధతి, అంతర పంటల ద్వారా అదనపు ఆదాయం పొందే మార్గాలను వివరించారు. కార్యక్రమంలో ఏడీఏలు, ఎంఏఓలు, హార్టీకల్చర్ అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. మందుల చీటీలు తెలుగులోనే రాయాలి పట్టణ ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు ఇచ్చే మందుల చీటీలను సామాన్యులకు అర్థమయ్యేలా స్పష్టంగా తెలుగులోనే రాయాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి వైద్యులను ఆదేశించారు. చాకల బెలగంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి రికార్డులను పరిశీలించి, రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం సిబ్బంది తో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్యులు, సిబ్బంది సమన్వయంతో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. ఆస్పత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, మొక్కలు నాటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పి ంచాలని సూచించారు. డీఎంహెచ్ఓ భాస్కరరావు, మున్సిపల్ కమిషనర్ డి.పావని, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలు పరిష్కరించాలి : యూటీఎఫ్
పార్వతీపురం రూరల్ : ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) ఆధ్వర్యంలో పార్వతీపురం కలెక్టరేట్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షలు బుధవారం నిర్వ హించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీమోహనరావు, జిల్లా అధ్యక్ష ప్రధా న కార్యదర్శులు కె.కృష్ణారావు, కె.భాస్కరరావు మాట్లాడుతూ.. 12వ పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలని, 29 శాతం మధ్యంతర భృతి చెల్లించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయడంతో పాటు, ఇతర ఆర్థిక బకాయి ల చెల్లింపునకు స్పష్టమైన రోడ్డు మ్యాప్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు, మెమో 57 అమలు, హెల్త్ స్కీమ్ సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో ఈ నెల 28న రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని పేర్కొ న్నారు. జేఏసీ జిల్లా చైర్మన్ జి.వి.ఆర్.కె.కిషోర్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మధరావు దీక్షకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు పి.మధుసూదనరావు, కోశాధికారి కె.మురళి, జిల్లా కార్యదర్శులు ఎం.శ్రీనివాసరావు, ఎం.పైడిరాజు, బి.రామకృష్ణ, కె.సిద్ధేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సమన్వయం చేసుకుంటూ హద్దులు నిర్ణయించండి : జేసీ
పాచిపెంట : రీసర్వేలో రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు సమన్వయంతో పనిచేసి భూ హద్దులు నిర్ణయించాలని పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్ రెడ్డి అన్నా రు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అట వీ, రెవెన్యూ శాఖల అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. కొండమోసూరు, మిలియా కంచూరు ప్రాంతాల్లో మాన్సస్ ట్రస్ట్ భూములకు సంబంధించి భూములు ప్రస్తుతం ఎవరి ఆధీనంలో వున్నాయి, ఎవరు సాగు చేస్తున్నారనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఫారెస్ట్ భూములకు సంబంధించి రికార్డుల ప్రకారం హద్దులు నిర్ణయించాలన్నా రు. సమస్యలు తలెత్తకుండా పక్కాగా రీ సర్వే చేపట్టాలన్నారు. అనంతరం పాంచాలి జిల్లా పరిషత్ పాఠశాలను, గురువు నాయుడుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. పాఠశాలలో ముస్తాబు కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు. రోగులకు అందుతు న్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆయన వెంట డీఆర్ఓ వైశాలి, డీఎఫ్ఓ ప్రసూన, మైన్స్ ఏడీ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. డెంకాడ: నీట్, ఈఏపీసెట్లలో ఉత్తమ ఫలితా ల సాధన కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని డీఈఓ యు.మాణిక్యంనాయుడు అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వంద మంది విద్యార్థినిలను ఎంపిక చేసి నీట్, ఈఏపీసెట్ ఉత్తమ ఫలితాల కోసం అక్కివరం పరిధిలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్లో నెల రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను డీఈఓ మాణిక్యంనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రత్యేక తరగతుల్లో నిష్ణాతులైన అధ్యాపకులచే, పీజీటీలచే తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు వసతి, భోజన సదుపాయం కూడా ఇక్కడే కల్పించామన్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ఉత్తమ ఫలితాల సాధన కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని వివరించారు. ఇది చాలా విలువైన సమయమని, దీనిని విద్యార్థులు పూర్తిగా సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షల్లో ఉన్నత స్థానాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు కంది చంద్రశేఖరరావు, సర్పంచ్ కంది కిరణ్‌కుమార్, ప్రిన్సిపాల్ సీహెచ్ సంధ్య, ఎస్ఎంసీ చైర్మన్ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, సిరుల తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు వనంగుడి నుంచి చదురుగుడికి చేరుకునే బృహత్తర ఘట్టమైన దేవర మహోత్సవం ఈ నెల 27న సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి నిర్వహించనున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారిణి కె.శిరీషా పేర్కొన్నారు. స్థానిక కార్యాలయ ఆవరణలో బుధవారం నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ముందుగా మహోత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు. పసిడికాంతుల పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవానికి సంబంధించి 27న సోమవారం సాయంత్రం వనంగుడి వద్ద అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజాధికాలను నిర్వహించి వనంగుడి నుంచి భారీ ఊరేగింపు, మేళతాళాలు, భాజా భజంత్రీలతో అమ్మవారిని గంటస్తంభం మీదుగా హుకుంపేటకు తీసుకువెళ్తామన్నారు. అదేరోజు రాత్రి 10 గంటలకు హుకుంపేటలో ఉన్న అమ్మవారి చదురు వద్ద ప్రత్యేక పూజలు అనంతరం మరుసటి రోజు మంగళవారం వేకువజామున మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడి బాలాలయానికి అమ్మవారిని తీసుకువస్తామన్నారు. నాటి నుంచి ఉయ్యాల కంబాల మహోత్సవం వరకూ అమ్మవారు చదురుగుడిలోనే భక్తులకు దర్శనమిస్తారన్నారు. -
ప్రజలకు సురక్షిత నీరు
● కలెక్టర్ రాంసుందర్రెడ్డివిజయనగరం ఫోర్ట్: ప్రజలందరికీ సురక్షిత నీరు అందించాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్ఓ ప్లాంట్ లేని పాఠశాలలు, వసతిగృహాల జాబితాను సిద్ధం చేయాలన్నారు. గ్రామాల్లో సరఫరా చేస్తున్న నీరు కలుషితం కాకుండా చూడాలని ఆదేశించారు. ఈ ఏడాది సుధీర్ఘ ఎల్‌నినో ప్రభావం వల్ల ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో నీటి సమస్యల్లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత, డీఎంహెచ్ఓ జీవనరాణి, డీపీఓ మల్లికార్జునరావు, విద్యుత్‌శాఖ ఎస్ఈ లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు. -
పదవుల కోసమే కళా తాపత్రయం
● వ్యక్తిగత దూషణలు చేస్తే ఊరుకోం ● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు రాజాం: గతంలో మంత్రిగా చేసిన చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకటరావుకు ఇప్పుడు ఏ పదవి లేకపోవడంతో ఏమి చేయాలో అర్ధం కావడం లేదని, పదవులు పొందేందుకు ప్రతిపక్ష పార్టీపైన, నాయకులపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. రాజాంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణపై కళా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వ్యక్తిగతంగా దూషించిన వీటిని వెనక్కు తీసుకోకుంటే మేం కూడా కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత దూషణలకు దిగాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎదుటివారిపై దూషణలు చేసేటప్పుడు తమ పరిస్థితి వెనక్కు తిరిగి చూసుకోవాలని హితవు పలికారు. మరోవైపు మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్‌పోర్టులపై కళాకు పూర్తిగా అవగాహన లేదని పేర్కొన్నారు. గతంలో ఎమ్మెల్యేగా చేసిన ఉణుకూరు, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో కళా చేసిన అభివృద్ధి శూన్యమని, ఆయా నియోజకవర్గాలకు వెళ్తే కళా పనితనం తెలిసిపోతుందని ఎద్దేవా చేశారు. ఎయిర్‌పోర్టు నిర్మాణ ఘనత వైఎస్సార్ కుటుంబానికే దక్కుతుందని తెలిపారు. మూలపేట పోర్టు 70 శాతం పనులు పూర్తి చేయించిందని వైఎస్ జగన్మోహన్రెడ్డేనని, ఇది ముమ్మాటికి సత్యమని అన్నారు. తోటపల్లి ప్రాజెక్ట్‌ను మేమే తెచ్చామని చంద్రబాబునాయుడు గొప్పలు చెప్పుకున్నారని, ఆ ప్రాజెక్ట్ వైఎస్సార్సీపీ హయాంలో పూర్తవుతుందని అన్నారు. రాష్ట్ర రాజధాని అక్కడి ప్రభుత్వ ఇష్టమేనని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే ఇప్పు డు అమరావతిని రాజధానిని చేస్తున్నామంటూ కూటమి తీర్మానాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని వెల్లడించారు. అంటే గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడూ అమరావతి తీర్మానాలు చేయలే దా? అని ప్రశ్నించారు. అమరావతి చుట్టుపక్కల ఉన్న రైతులను ఆదుకోవాలని జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేస్తుంటే తప్పుదోవ పట్టించే పని కూట మి చేస్తుందని మండిపడ్డారు. రూ.లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి ప్రజా సంక్షేమం చేయకుండా కూటమి దోచుకుంటుందని ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారన్న సంగతి కూటమి నేతలకు తెలుసని అన్నారు. భవిష్యత్తులో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలిసిన కూటమి ఎమ్మెల్యేలు... టీవీలు ముందు మాట్లాడే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, లేకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు పడా ల్సి ఉంటుందని అన్నారు. పార్టీ రాజాం ఇన్చార్జ్ డాక్టర్ తలే రాజేష్, జెడ్పీ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. -
రామతీర్థంలో పౌర్ణమి పూజలు
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థాన క్షేత్ర పాలకుడిగా విరాజిల్లుతున్న ఉమా సదాశివాలయంలో పౌర్ణమి సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మల్లికార్జునశర్మ ఆధ్వర్యంలో ముందుగా గణపతి పూజ నిర్వహించి శివుడికి ప్రత్యేక అభిషేకాలు చేపట్టారు. అనంతరం కామాక్షి అమ్మవారి సన్నిధిలో హోమం, కుంకుమ పూజలు జరిపించారు. ● గ్యాస్ ఏజెన్సీ ముట్టడి విజయనగరం రూరల్: పట్టణంలోని స్వామి గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాన్ని వినియోగదారులు బుధవారం ముట్టడించారు. గ్యాస్ సరఫరాలో తీవ్ర జాప్యం నెలకొనడంతో వినియోగదారులు మండిపడుతున్నారు. ముఖ్యంగా స్వామి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు కొద్ది రోజులుగా వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇళ్ల వద్ద సిలిండర్లు ఇవ్వాల్సి ఉండగా.. 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొడౌన్ వద్ద సిలిండర్లు తీసుకోవాలని చెబుతుండడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే నిర్వాహాకులు గ్యాస్ కంపెనీకి సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో సిలిండర్ల సరఫరా ఆగిపోయిందని గుర్తించిన తహసీల్దార్, రెవెన్యూ, పౌర సరఫరాల అధికారులు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహాకులతో మాట్లాడి డబ్బులు చెల్లింపజేశారు. దీంతో రెండు, మూడు రోజుల్లో వినియోగదారులకు గ్యాస్ సరఫరా అయ్యేలా చూస్తానని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో వినియోగదారులు వెనుదిరిగారు. -
పల్లెల్లోనూ..ప్రత్యేకమే..
సాక్షి, పార్వతీపురం మన్యం: పంచాయతీల పాలక వర్గం గడువు గురువా రంతో ముగుస్తోంది. రేపటి నుంచి పల్లెలు కూడా ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్తున్నాయి. ఇప్పటికే మున్సిపల్ పాలక వర్గాల గడువు ముగియడంతో పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించిన విషయం విదితమే. ఈ నెల రెండో తేదీతో సర్పంచుల పదవీ కాలం కూడా ముగియనుంది. చట్టబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభు త్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో.. ఎన్నికలకు వెనకడుగు వేస్తున్నారన్న చర్చ నడుస్తోంది. జిల్లాలో 15 మండలాలకు సంబంధించి 451 గ్రామ పంచాయతీలున్నాయి. సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలనను చంద్రబాబు ప్రభుత్వం తీసుకొస్తోంది. ప్రత్యేకాధికారులుగా ఎంపీడీఓలు, తహసీల్దార్లు, డిప్యూటీ ఎంపీడీఓలు, ఎంఈఓలు, అంతే సమాన, అంతకంటే ఎక్కువ హోదా కలిగిన వారిని ప్రత్యేక అధికారులుగా నియమించాలని పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జాబితాకు కలెక్టర్ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. కొత్త పాలకవర్గం ఏర్పడే వరకు అధికారుల పాలన సాగనుంది. 2021 ఫిబ్రవరిలో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. అదే ఏడాది ఏప్రిల్ మూడో తేదీ నుంచి సర్పంచ్‌లు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం నగర పాలక సంస్థ, పురపాలక సంఘాలు, పంచాయతీలన్నీ ప్రత్యేక పాలనపైన ఆధారపడి ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించలేనట్లు సూచనప్రాయంగా తెలుస్తోంది. అదే బాటలో పంచాయతీలు కూడా వెళ్లనున్నాయి. డీపీఓ కార్యాలయం ఈ నెల 15వ తేదీ తర్వాత గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాను విడుదల చేయాల్సి ఉంది. దీనిపై ఇంకా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే రెండుసార్లు జాబితా ప్రచురణను ప్రభుత్వం వాయిదా వేసింది. ఎన్నికల నిర్వహణ ఇష్టం లేకనే ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. జిల్లాలో మరో 17 కొత్త పంచాయతీలకు ప్రతిపాదనలు కూడా వెళ్లాయి. వాటికీ అనుమతులు రావాల్సి ఉంది. ఇప్పటికే నిధులు లేక పంచాయతీలు అభివృద్ధికి దూరమయ్యాయి. కేంద్రం నుంచి 16వ ఆర్థిక సంఘం నిధులు రావాలంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగాల్సిందే. అప్పటి వరకు ఒక్క రూపాయి కూడా పంచాయతీల ఖాతాల్లోకి జమవ్వదు. 2024–25కు సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులు గత డిసెంబర్లో వచ్చాయి. వీటితో టైడ్, అన్ టైడ్ పనులు చేయాల్సి ఉంటుంది. మంచినీరు, పారిశుధ్యం, హరిత రాయబారులకు గౌరవ వేతనం, విద్యుత్తు బిల్లుల చెల్లింపు, అభివృద్ధి పనులు ఈ నిధులపైనే ఆధారపడి ఉంటాయి. జిల్లాలో 15వ ఆర్థిక సంఘం నిధులే ఇంకా రూ.30 కోట్ల వరకూ రావాల్సి ఉంది. ఇంటి పన్నుల వసూళ్ల డిమాండ్ రూ.6.18 కోట్లు కాగా.. ఇప్పటి వరకు రూ.5.36 కోట్లు వసూలు అయ్యింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సిన సెస్ మొత్తం రూ.లక్షల్లో పెండింగు ఉంది. ఈ నిధులన్నీ పూర్తి స్థాయిలో సమకూరితేనే పారిశుధ్యం, వీధి దీపాలు, తాగునీరు, స్టేషనరీ, ఇతర అభివృద్ధి, నిర్వహణ ఖర్చులకు వినియోగించుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. సర్పంచ్ల నుంచి చెక్ పవర్ ప్రత్యేకాధికారులకే వెళ్లనుంది. ఇక ఏ పనులు చేయాలన్నా వారి అనుమతి ఉండాల్సిందే. సర్పంచ్‌లు నిత్యం గ్రామాల్లో, ప్రజల మధ్య ఉంటారు. ప్రత్యేకాధికారులు అందుబాటులో ఉండటం అరుదు. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత చంద్రబాబు ప్రభుత్వం.. వైఎస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్‌లపై కక్ష గట్టింది. అభివృద్ధి పనులకు మోకాలడ్డింది. చేసిన పనులకు సంబంధించి బిల్లులు ఆపేశారు. గ్రామాభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్న విమర్శలు ఉన్నాయి. -
వీబీ జీ రామ్‌జీ మరింత ఆలస్యం..
విజయనగరం ఫోర్ట్: వీబీ జీ రామ్‌జీ (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ – గ్రామీణ ) పథకం అమలు మరింత జాప్యం కానుంది. వాస్తవానికి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే ఈ పథకం (ఉపాధి హామీ పథకం) అమలు కావాల్సి ఉంది. అయితే పథకం నిర్వహణకు సంబంధించిన గైడ్‌లైన్స్ నేటికీ జిల్లాకు చేరకపోవడంతో పథకం నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం కొన్ని నెలల కిందట మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని వీబీ జీ రామ్‌జీ పథకంగా మార్పు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త పేరుతో పథకాన్ని అమలు చేస్తామని జిల్లా నీటియాజమన్య సంస్థ ( డ్వామా) అధికారులు కూడా నిన్న, మొన్నటి వరకు తెలిపారు. కొత్తగా పని దినాలు పెరుగుతాయని.. గ్రామాల్లో అవగాహన సదస్సులు సైతం నిర్వహించారు. 125 రోజుల పనిదినాలు.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో జాబ్‌కార్డు కలిగిన కుటుంబానికి 100 రోజులు పనిదినాలు కల్పించేవారు. కొత్తగా పథకం పేరు మార్చిన తర్వాత పనిదినాల సంఖ్య పెంచారు. ఒక్కో కుటుంబానికి 125 రోజుల పాటు పని కల్పించనున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా ఉన్నప్పుడు కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం వాటా చొప్పున నిధులు కేటాయించేవి. అయితే పథకం పేరు మార్చిన తర్వాత కేంద్రం తన వాటాను 60 శాతానికి తగ్గించుకోవడంతో రాష్ట్రంపై భారం పడనుంది. జిల్లాలో 3.45 లక్షల జాబ్ కార్డులు.. జిల్లాలో ఉపాధిహామి పథకానికి సంబంధించి 3.45 లక్షల జాబ్ కార్డులు ఉండగా.. వేతనదారులు 6.26 లక్షల మంది ఉన్నారు. ఇదిలా ఉంటే 2026 – 27 సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ నెలకు మాత్రమే లక్ష్యాన్ని నిర్ణయించారు. ఏప్రిల్ నెలకు సంబంధించి వేతనదారులకు 44.44 లక్షల పనిదినాలు కల్పించాల్సి ఉంది. ఉపాధి హామీ పథకంలో చెరువులు, గుంతలు, కాలువల్లో పూడికతీతలు, జంగిల్ క్లియరెన్స్, చెరువు గట్టు ఎత్తు పెంచడం, చెరువు లోతు చేయడం వంటి పనులు చేపట్టనున్నారు. వాస్తవానికి ఏప్రిల్ 1న ప్రారంభం కావాల్సి ఉంది కాని నేటికీ రాని గైడ్‌లైన్స్ పనుల కోసం ఎదురుచూస్తున్న వేతనదారులుగైడ్లైన్స్ రాలేదు.. ఏప్రిల్ నెల కూడా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంగానే అమలు కానుంది. ఏప్రిల్ నెలకు పనిదినాల సంఖ్య 44.44 లక్షలుగా నిర్దేశించారు. వీబీజీ రామ్‌జీ పథకానికి సంబంధించిన గైడ్‌లైన్స్ ఇంకా రాలేదు. – ఎస్. శారదా దేవి, పీడీ, డ్వామా -
ఎంఎస్పీ సేవలు వినియోగించుకోండి..
● ఎస్పీ ఏఆర్ దామోదర్ విజయనగరం క్రైమ్: పోలీస్స్టేషన్ల పరిధిలో పని చేస్తున్న మహిళా సంరక్షణ కార్యదర్శుల సేవలను క్షేత్ర స్థాయిలో వినియోగించుకోవాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక పోలీస్ కార్యాలయంలో ఎస్హెచ్ఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సమస్యలను మహిళా సంరక్షణ కార్యదర్శుల సహకారంతో గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. గ్రామ, వార్డు పరిధిలోకి కొత్తగా వచ్చే వ్యక్తులను గుర్తించాలని.. వారు ఏ ప్రాంతం వారు, ఎందుకు, ఎక్కడ నుంచి వచ్చిందీ తెలుసుకోవాలన్నారు. గ్రామల్లో ప్రజలకు సైబర్ మోసాలు, మహిళల రక్షణకు అండగా ఉండే చట్టాలు, రహదారి భద్రత, మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, శక్తి యాప్ పట్ల అవగాహన కల్పించాలని చెప్పారు. వారంలో ఒక రోజు ఎంఎస్పీలతో సంబంధిత ఎస్హెచ్ఓలు సమావేశం నిర్వహించాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా ముందస్తు సమాచారం లభ్యమయ్యే విధంగా సమాచార వ్యవస్థను మెరుగుపరుచుకోవాలన్నారు. గ్రామాలు, వార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. -
బాధ్యతల స్వీకరణ
విజయనగరం లీగల్: విజయనగరం న్యాయవాదుల సంఘ అధ్యక్షుడిగా నళితం రమేష్‌కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక బార్ అసోసియేషన్ హాల్లో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ఉపాధ్యక్షులుగా పి. బ్రహ్మాజీ, ప్రధాన కార్యదర్శిగా గడి మురళి, సంయుక్త కార్యదర్శిగా పి. వరలక్ష్మి, కోశాధికారిగా పి. రామచంద్రరావు, స్పోర్ట్స్ కార్యదర్శిగా జేవీఎస్‌ఎన్ మూర్తి, సీనియర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా చంద్రశేఖర్, వి. రత్నకుమారి, ఎస్. రమేష్, బి.పార్వతి, వి. శ్రీదేవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమానికి రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు బెల్లాన రవి, ఇతర సీనియర్, జూనియర్ న్యాయవాదులు హాజరయ్యారు. డివిజన్లు పెరిగాయ్.. విజయనగరం: నగర పరిధిలో ఉన్న 50 డివిజన్ల సంఖ్యను 62కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కమిషనర్ బాలస్వామి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డివిజన్ల పెంపు నేపథ్యంలో అవసరమైన కసరత్తును తక్షణమే ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. హత్యాయత్నం కేసులో ఇద్దరి అరెస్ట్ బొండపల్లి: ఆస్తి వివాదంలో ఇద్దరు అన్నలపై దాడి చేసిన తమ్ముడు, అతని భార్యను బుధ వారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై యు.మహేష్ తెలిపారు. వివరాల్లోకి వెళి తే.. మండలంలోని కొండకిండాంలో గత నెల 30న జరిగిన ఆస్తి తగాదాలో కలిశెట్టి గౌరునాయుడు తన ఇద్దరు అన్నలైన సత్యనారాయణ, బంగారునాయుడుపై కత్తితో దాడి చేశాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు గౌరునాయుడు, అతనికి సహకరించిన భార్య జయశ్రీలను అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. నెలివాడలో దొంగతనంబొండపల్లి: మండలంలోని నెలివాడలో ఓ ఇంటిలో బుధవారం వేకువజామున దొంగతనం జరిగింది. ఎస్సై యు.మహేష్ తెలియజేసిన వివరాల మేరకు... గ్రామానికి చెందిన షేక్ రసూల్ దొంగలు ప్రవేశించి, పావు తక్కువ రెండు తులాల బంగారు ఆభరణాలతో పాటు ల్యాప్‌ట్యాప్‌ను అపహరించుకుపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం విజయనగరం క్రైమ్: పట్టణంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని టూటౌన్ పోలీసులు బుధవారం గుర్తించారు. మృతుని వయసు సుమారు 50 ఏళ్లు ఉంటాయని ఎస్సై కృష్ణమూర్తి తెలిపారు. నలుపు రంగు ఫ్యాంట్, బిస్కెట్ కలర్ షర్ట్‌తో ధరించి ఉన్నాడని, ఆచూకీ తెలిసిన వారు టూటౌన్ పోలీసులను సంప్రదించాలని కోరారు. వ్యర్థాల నుంచి సంపదనెల్లిమర్ల రూరల్: మండలంలోని కొండగుంపాం ఉన్నత పాఠశాలలో నేషనల్ గ్రీన్ కార్డ్స్ కార్యక్రమంలో భాగంగా వ్యర్థాల నుంచి సంపద సృష్టి అనే అంశంపై బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జీవశాస్త్ర ఉపాధ్యాయుడు సత్యప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భూమిలో కరగని ప్లాస్టిక్ వస్తువులు, సంచులు వంటి వ్యర్థ పదార్థాలను రీసైక్లింగ్ చేసి తిరిగి ఉపయోగించుకునే విధానాలపై అవగాహన కల్పించారు. హెచ్ఎం వేణుగోపాలరావు మాట్లాడుతూ.. ప్రపంచంలో ఏదీ వ్యర్థం కాదని.. సరైన విధంగా వినియోగిస్తే వాటి నుంచి ఉపయోగపడే వస్తువులు తయారు చేయవచ్చన్నారు. పర్యావరణ పరిరక్షణలో రీసైక్లింగ్ ఎంతో ముఖ్యమన్నారు. ఈ సందర్భంగా వ్యర్థాలతో విద్యార్థులు వివిధ రకాల వస్తువులు తయారు చేసి ప్రదర్శించారు. అమరావతిపై అనిశ్చితి తొలిగింది విజయనగరం అర్బన్: అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధం చేసే బిల్లుకు ఆమోదం లభించడం ఆనందంగా ఉందని.. ఇకపై రాజధానిపై ఉన్న అనిశ్చితి తొలిగిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆయన క్యాంప్ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. అమరావతి ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని పార్టీలు కలిసి అమరావతి అభివృద్దికి సహకరించాలని పిలుపునిచ్చారు. -
జాతీయ బాక్సింగ్ పోటీలకు సచిన్
విజయనగరం: జాతీయ స్థాయిలో జరగనున్న బాక్సింగ్ పోటీలకు విజయనగరానికి చెందిన బి.సచిన్ ఎంపికయ్యాడు. ఇటీవల విశాఖలో జరగిన జూనియర్స్ బాక్సింగ్ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన సచిన్ 70–75 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించాడు. అంతేకాకుండా ఏప్రిల్ 4 నుంచి 10వ తేదీ వరకు నాగపూర్‌లో జరగనున్న జాతీయ స్థాయి జూనియర్స్ బాక్సింగ్ పోటీలకు అర్హత సాధించాడు. క్రీడాకారుడు సచిన్‌కు సీనియర్ బాక్సర్, ఎల్ఐసీ డెవెలప్మెంట్ ఆఫీసర్ బి.దివాకర్ రూ.5000 ఆర్థిక సాయం అందజేశారు.కోమటిపల్లిలో అగ్నిప్రమాదం బొబ్బిలి రూరల్: మండలంలోని కోమటిపల్లి జంగాల వీధిలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మొతి గౌరికి చెందిన పూరిల్లు పూర్తిగా కాలిపోగా పక్కనే ఉన్న మొతి సాంబయ్యకు చెందిన పెంకిటిల్లు ముందుభాగాన ఉన్న రేకులు కాలిపోయాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టారు. గౌరి ఇంటి వద్ద కట్టెల వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు అగ్నికీలలు చెలరేగి ప్రమాదం సంభవించిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలియజేశారు. ప్రమాదంలో గౌరికి చెందిన ఇంట్లోని సామాన్లు పూర్తిగా కాలిపోగా సుమారు లక్ష రూపాయిల ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అఽధికారులు అంచనా వేస్తున్నారు. ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ఫిర్యాదుగజపతినగరం: మండలంలోని తుమికాపల్లి గ్రామానికి చెందిన ఆకుల ఏడుకొండలు అధికారుల నిర్లక్ష్యంతోనే సోమవారం మృతి చెందాడని మృతుడి తండ్రి గౌరినాయుడు మంగళవారం ఫిర్యాదు చేసినట్టు ఎస్ఐ కె.కిరణ్‌కుమార్‌నాయుడు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుపడుతూ ఫిర్యాదు అందిందని చెప్పారు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపడతామని తెలిపారు. ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలకు అవకాశం విజయనగరం అర్బన్: పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియకు సంబంధించిన సీనియారిటీ జాబితాను విడుదల చేసినట్టు డీఈఓ యు.మాణిక్యంనాయుడు తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ సమాన పదోన్నతుల కోసం సంబంధిత స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినట్టు వెల్లడించారు. జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉన్న ఉపా ధ్యాయులు సరైన ఆధారాలతో ఈ నెల 1 నుంచి 6వ తేదీ వరకు పనిదినాల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి వ్యక్తిగతంగా సమర్పించాలని సూచించారు. రూ.46 కోట్ల పన్ను వసూలు విజయనగరం: 2025–26 ఆర్థిక సంవత్సరానికిగాను వివిధ పన్నుల రూపేణా రూ.46 కోట్ల 16లక్షల 59,248లు మంగళవారం సాయంత్రానికి నగర పాలక సంస్థకు సమకూరిందని కమిషనల్ బాలస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం పన్నులపై వడ్డీని 50 శాతం వరకు తగ్గించడంతో పన్ను చెల్లింపులు ఈసారి అధికంగా జరిగాయన్నారు. గత సంవత్సరం రూ.40కోట్ల 89లక్షల 97వేల, 281లు వసూలు కాగా ఈ సంవత్సరం ఆరు కోట్లు అదనంగా వసూలైందన్నారు. దీర్ఘకాల బకాయిలు, అధిక మొత్తం పన్నులు రాబట్టేందుకు కృషి చేసిన రెవెన్యూ సిబ్బందిని అభినందించారు. సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు నేతృత్వంలో బృందం పన్ను వసూలను, ప్రచారాన్ని ముమ్మరం చేయడం అభినందనీయమన్నారు. ఈ సంవత్సరం ఆస్తి పన్నులు రూ.37 కోట్ల 23లక్షల 65వేల 479లు ఈ సాయంత్రానికి వసూలు అయ్యాయన్నారు. ఖాళీ పన్నుల రూపేణా రూ.6కోట్ల53లక్షల 65వేల,103లు, నీటి చార్జీలు రూ.2కోట్ల 39లక్షల 28వేల 666లు వసూలు అయ్యాయన్నారు. -
ఏడుకొండలు మృతికి అధికారులదే బాధ్యత
గజపతినగరం: మండలంలోని తుమికాపల్లి గ్రామానికి చెందిన ఆకుల ఏడుకొండలు అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు కోల్పోయాడని జెడ్పీటీసీ గార తవుడు, సర్పంచ్ బెల్లాన త్రినాధరావు ధ్వజమెత్తారు. స్థానికంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఏడుకొండలు జాతీయ రహదారి మెయిన్‌రోడ్డులో ఉన్న డివైడర్‌ను దాటుకుంటూ వెళ్తున్న సమయంలో హైవే పోల్స్, లైటింగ్‌కు సంబంధించిన కంట్రోలింగ్ బాక్స్ తెరిచి ఉండడం వల్లే విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడని ఆరోపించారు. సెట్‌బాక్స్ మూసి ఉంటే విద్యుత్ తీగలు బయటకు వచ్చేవి కాదని, బాక్స్ తెరిచి ఉండడం వల్లే ఏడుకొండలు విద్యుత్ షాక్‌కు గురయ్యాడని, ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యమేనని వారు మండిపడ్డారు. ఏడుకొండలు మృతిపై సంఘటనా స్థలం నుంచే విద్యుత్, పంచాయతీ శాఖలు, నేషనల్ హైవే అధికారులకు సమాచారమివ్వగా తమకు సంబంధం లేదంటే తమకు లేదని ఒకరిపై ఒకరు నెట్టుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. రెక్కాడితేగాని పొట్ట నింపలేని ఏడుకొండలు కుటుంబాన్ని అధికారులు, ప్రభుత్వమే బాధ్యత వహించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
ఆస్పత్రుల భవన నిర్మాణాలు పూర్తి చేయాలి : కలెక్టర్
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఆస్పత్రుల భవనాలను వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ, ఇంజినీరింగ్ అధికారులతో మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న భోగాపురం, ఎస్.కోట, నెల్లిమర్ల, బాడంగి, బొబ్బిలి, రాజాం ఆస్పత్రుల భవనాల పెండింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలన్నారు. మెడికల్ ఎక్విప్మెంట్, అగ్నిమాపక పరికరాలు, ఏసీలు ఏర్పాటు, అంతర్గత రోడ్లు, జనరేటర్లు ఏర్పాటు, పేషేంట్లు వేచి ఉండే గదులు, ఫర్నిచర్, ప్రహరీ, పెయింటింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జేసే సేతుమాధవన్, డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మశ్రీరాణి తదితరులు పాల్గొన్నారు. -
సీతం క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్‌కు గుర్తింపు
● ప్రతిష్టాత్మక కోర్సుకు నలుగురు ఎంపికసుమారు 67 వేల మంది విద్యార్థులు, అధ్యాపకుల నుంచి కేవలం 3 వేల మందిని మాత్రమే ఈ ఉన్నత స్థాయి కోర్సులకు ఎంపిక చేయడం విశేషం. ఎంపికై న సభ్యులు సీతం క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్వాంటం కంప్యూటింగ్ శిక్షణా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై తమ నిబద్దతను చాటుతున్నారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణ మాట్లాడుతూ విద్యార్థి భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉన్న క్వాంటం కంప్యూటింగ్ రంగంలో ముందంజలో నిలవడానికి సంస్థ కట్టుబడి ఉందని అన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామమూర్తి, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డీన్ డాక్టర్ వీజీప్రసూన, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ జి.వేణుమాధవరావు, విద్యార్థులు పాల్గొన్నారు.విజయనగరం అర్బన్: స్థానిక గాజులరేగ పరిధిలోని సీతం కళాశాల క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్‌కు గౌరవం దక్కింది. ఆ కేంద్రానికి చెందిన నలుగురు సభ్యులు వైజర్, క్యూబైటెక్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక క్వాంటం అల్గారిథమ్స్ కోర్సుకు ఎంపికయ్యారు. ఎంపికై న వారిలో మొదటి సంవత్సరం విభాగాధిపతి డాక్టర్ కె.శ్రీలత, గణితశాస్త్ర విభాగం అసొసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.శ్రీచందన్, సీఎస్ఈ చివరి సంవత్సరం విదార్థిని ఎం.త్రివేణి, విద్యార్థి సి.పూర్ణచంద్ర శేఖర్ ఉన్నారు. అంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చొరవతో వైజన్, క్యూబైటెక్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్వాంటం ఫండమెంటల్స్ ఈ నలుగురు విజయవంతంగా పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ పొందిన -
కాలిన గాయాలతో వృద్ధుడి మృతి
● మృతిపై అనుమానాలు ● సంఘటనా స్థలాన్ని పరిశీలించిన క్లూస్ టీం, డీఎస్పీసంతకవిటి: మండలంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన సవలాపురపు జోగులు(65) మంగళవారం కాలిన గాయాలతో పొలంలో శవమై కనిపించాడు. ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపిన వివరాలు.. జోగులు ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆచూకీ కోసం వెతుకుతున్నారు. మంగళవారం పుల్లిట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటికి వచ్చి జోగులు పొలం కాల్చడం వలన తన పొలం కూడా కాలిపోయిందని తెలపడంతో కుటుంబీకులు వెళ్లి వెతకగా అక్కడ కాలిన గాయాలతో జోగులు చనిపోయి కనిపించడంతో కుమారుడు చిన్నారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. దీనికి సంబంధించి క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించి వెళ్లింది. ఇదిలా ఉండగా మృతదేహాన్ని చూసిన కుటుంబీకులు, గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఇది సహజ మరణమా? ఇంకేదైనా కారణం ఉందా.. అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని చీపురుపల్లి డీఎస్పీ రాఘువులు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోస్టుమార్టం అనంతరం మరణానికి గల కారణాలు తెలుస్తాయని చెప్పారు. ఆయన వెంట రాజాం టౌన్ సీఐ, చీపురుపల్లి సీఐ ఉన్నారు. -
అంగన్వాడీల ఆందోళన
విజయనగరం ఫోర్ట్: అంగన్వాడీలకు తక్షణమే వేతనాలు పెంచాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సునీత, ప్రభావతి డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం అర్బన్ ఐసీడీఎఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో సమ్మె చేస్తున్న సమయంలో కూటమి నేతలు వచ్చి తొందరలోనే మన ప్రభుత్వం వస్తుందని, సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పి ఇప్పుడు మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సర్కార్ వచ్చి 20 నెలలైనా వేతనాలు పెంచలేదన్నారు. పదోన్నతుల విషయంలో రాజకీయ జోక్యం సరికాదన్నారు. యూనియన్ నాయకులు బి.పైడిరాజు, చిట్టితల్లి, సత్యవతి, రత్నం, కరుణ, జయ, రమ, పద్మ తదితరులు పాల్గొన్నారు. -
ఇన్నాళ్లు ఏం చేశారు?
సాక్షి, పార్వతీపురం మన్యం: టిడ్కో ఇళ్ల మిగులు పనులను పూర్తి చేసి, లబ్ధిదారులకు అప్పగించడంలో చంద్రబాబు ప్రభుత్వం చొరవ చూపడం లేదు. చాలా వరకూ నిర్మాణాలు పూర్తయ్యాయి. నిర్లక్ష్యంగా వదిలేయడం వల్ల అప్పుడే బీటలు వారుతున్నాయి. దీంతో ఏళ్లుగా సొంతింటి కోసం ఆశగా ఎదురుచూస్తున్న పేదలకు నిరాశా మిగులుతోంది. 2017లో ఈ పథకాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రారంభించింది. నిర్మాణాలు చేయకుండానే వదిలేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ఈ నిర్మాణాలను చాలా వరకూ పూర్తి చేసింది. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది. మిగులు పనులను పూర్తి చేసి, లబ్ధిదారులకు గృహాలు అందజేయాల్సి ఉన్నా.. కాలయాపన చేస్తున్నారు. ● పార్వతీపురంలో 1,104, సాలూరులో 1,440 గృహాలు మంజూరయ్యాయి. వీటికోసం లబ్ధిదారుల వాటాగా వారి నుంచి కొంత మొత్తం డీడీల రూపంలో వసూలు చేశారు. మంజూరుచేసిన ఇళ్లలో కొన్ని రద్దు చేశారు. వారికి ఇప్పటివరకూ డీడీలు చెల్లించలేదు. ● పార్వతీపురంలో టిడ్కో గృహాల నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. డ్రైన్లు, రక్షణ గోడలు, పైప్‌లైన్ నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. ● సాలూరులో గృహాల సముదాయం ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు నిర్మాణాలు పూర్తయ్యాయి. సుమారు వెయ్యికి పైగా ఇళ్లను పూర్తి చేసి, అట్టహాసంగా లబ్ధిదారులతో ప్రారంభోత్సవాలు కూడా చేశారు. మిగిలి ఉన్న నిర్మాణాలు, కొద్దిపాటి మౌలిక సదుపాయాల విషయంలో ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. ఫలితంగా టిడ్కో గృహాల వద్ద వైర్లు, పరికరాలు చోరీకి గురవుతున్నాయి. మున్సిపల్ కార్యాలయం ముట్టడి టిడ్కో ఇళ్ల అప్పగింతలో ప్రభుత్వం, అధికారపక్ష నేతలు చేస్తున్న అలసత్వానికి నిరసనగా సీపీఎం ఆధ్వర్యంలో లబ్ధిదారులు మంగళవారం ఉదయం పార్వతీపురం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్ట డించారు. ఇక్కడ 1,402 మందిని లబ్ధిదారులుగా గుర్తించి, 768 ఇళ్ల నిర్మాణం 90 శాతానికి పైగా పూర్తిచేసినా వాటిని లబ్ధిదారులకు అప్పగించలేకపోతున్నారు. ఇళ్ల నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారుల వద్ద నుంచి వసూలు చేసిన షేర్ కాపిటల్ డబ్బులు కోటి 36 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వా లని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనకు స్పందించిన మున్సిపల్ కమిషనర్.. ధర్నా చేస్తున్న బాదితుల వద్దకు వచ్చి సమస్యలను వి న్నారు. జూన్ నెలాఖరులోగా పార్వతీపురం పట్టణ ప్రజలకు టిడ్కో గృహాలు అప్పగిస్తామని, మిగిలిన వారికి షేర్ క్యాపిటల్‌ను చెల్లించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ధర్నా సమయంలో కొంత మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి వచ్చి, అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ.. లబ్ధిదారులకు సంబంధించిన నగదు రూ. 2.25 కోట్లు పురపాలక సంఘ ఖాతాకు జమయ్యాయని, త్వరలోనే చెల్లింపులు చేస్తామని చెప్పారు. -
ఉద్యోగ సంతోష్ం
● గూగుల్‌కు ఎంపికై న వడమ కుర్రాడు ● రూ.కోటి వార్షిక జీతానికి ఎంపిక ● ఆనందంలో తల్లిదండ్రులు పాలకొండ రూరల్: ఆ కుర్రాడు పట్టుదలతో చదివాడు. ఓ వైపు ఉన్నత విద్య అభ్యసిస్తూనే సాంకేతిక అంశాలపై పట్టుసాధించాడు. గూగుల్‌లో రూ.కోటి వార్షిక వేతనానికి ఎంపికై తల్లిదండ్రుల్లో ‘సంతోష్’ం నింపాడు. చదువుతోనే భవిత అన్నది నిరూపించి యువతకు ఆదర్శంగా నిలిచాడు. వివరాల్లోకి వెళ్తే... పాలకొండ నగర పంచాయతీ వడమ గ్రామానికి చెందిన బొద్దాన కళ్యాణ్ ప్రసాద్ (అప్పన్న), పార్వతిల చిన్న కుమారుడు సంతోష్. తండ్రి గ్యాస్ స్టౌవ్‌లు బాగుచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. తనవలే పిల్లలు కాకూడదని రెక్కల కష్టంతో పిల్లలను చదివించారు. చదువు విలువ తెలిసిన సంతోష్ ఉన్నత లక్ష్యాన్ని ఏర్పర్చుకున్నారు. రాజాం జీఎంఆర్ కాలేజీలో ఇంజినీరింగ్ పూర్తిచేసి క్యాంపస్ ఇంటర్వ్యూలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా బెంగుళూరులో ఉద్యోగప్రస్థానం ఆరంభించారు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో 20కి పైగా సర్టిఫికేషనన్ కోర్సులు పూర్తి చేశారు. తల్లిదండ్రుల కోరికకు అనుగుణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో డిప్యూటీ మేనేజర్ (డేటా సైంటిస్ట్)గా ముంబయిలో ఉద్యోగంలో చేరారు. అనంతరం బాస్కో లో రీసెర్చ్ విభాగంలో చేరి పలు రిసర్చ్ పేపర్ల పేటెంట్స్‌ను సంతోష్ ప్రచురించారు. జర్మనీ, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో తన ప్రాజెక్టులను ప్రజెంట్చేసి ఉత్తమ ప్రాజెక్ట్ అవార్డులను అందుకున్నారు. బాస్కో కంపెనీలో ఉద్యోగం చేస్తూనే బెంగళూరులో ప్రఖ్యాత ఐఐ ఎస్సీ కాలేజీలో డేటా సైంటిస్ట్ కోర్సులో ఎంటెక్ పూర్తి చేశారు. ఈ క్రమంలో గూగుల్‌లో అవకాశం కోసం ఖాళీ సమయంలో కష్టతరమైన డేటా స్ట్రక్చర్స్‌తో కూడిన 500కు పైగా లీడ్ కోడ్ సమస్యలతో కోడింగ్ సాధన చేసి గూగుల్ కొలువుపై దృష్టి పెట్టారు. అనుకున్నట్లుగానే గత ఫిబ్రవరి 25న గూగుల్ నుంచి పిలుపు రాగా ఇటీవల జరిగిన పది రౌండ్ల ఇంటర్వ్యూలో ఉత్తమ ప్రతిభ కనబర్జి ఉద్యోగాన్ని సంపాదించారు. రెండు రోజుల కిందట గూగుల్‌లో చేరినట్టు మంగళవారం రాత్రి మీడి యాకు సంతోష్ తెలిపారు. నేర్చుకోవాలనే తపన, నిరంతరమైన ప్రణాళికతో కూడిన శ్రమ, తల్లిదండ్రులు, స్నేహితుల ప్రోత్సాహమే విజయానికి కారణమని పేర్కొన్నారు. -
ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ పూర్తి
పార్వతీపురం రూరల్: స్థానిక ఏపీ ఎన్జీఓ భవనంలో ప్రకృతి వ్యవసాయంపై మూడు రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమం ముగిసింది. జిల్లా వ్యవసాయ మేనేజర్ జి.సత్యవతి అధ్యక్షతన జరిగిన సదస్సులో జిల్లాలోని 4 డివిజన్ల నుంచి ఏడీఏలు, 15 మండలాల్లో పని చేస్తున్న ఎంఏఓలతో పాటు డీఆర్డీఏ ఏపీడీ జయశ్రీ, డీపీఎంలు, ఏపీఎంలు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన అధికారులు త్వరలో మండల స్థాయిలో వీఏఏ, వీహెచ్ఏ, ఎఫ్.ఎమ్.టిలు, కృషి సఖీలకు ఐదు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో మూడు రోజులు తరగతి గది శిక్షణ, రెండు రోజులు క్షేత్రస్థాయి పరిశీలన ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ.. ప్రాచీన వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా భూసారంతో పాటు మానవ ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. రైతులు నవధాన్యాల సాగుపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. మన్యం జిల్లాలో ఉద్యాన పంటలు ఇప్పటికే ప్రకృతి సిద్ధంగా సాగువుతున్నాయని డీహెచ్ఓ సత్యం నారాయణ రెడ్డి పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ ఆదాయం పొందేలా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక పంటల ప్రణాళికను సిద్ధం చేసినట్లు రీజనల్ థీమాటిక్ లీడ్ ప్రకాష్ తెలిపారు. వర్షపు నీటిని భూమిలో ఇంకింపజేసే ‘ఆఫ్ మూన్ డ్రాట్ ప్రూఫింగ్’ నమూనాను ఆయన వివరించారు. ప్రకృతి వ్యవసాయ మేనేజర్ ఎం.శ్రావణ్ కుమార్‌నాయుడు, రీజనల్ టెక్నికల్ అధికారి హేమసుందర్, ఏడీఏలు శారద, శంకరరావు, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలను గాలికొదిలేసిన చంద్రబాబు సర్కారు
శృంగవరపుకోట: చంద్రబాబు సర్కారు సమస్యలను గాలికొదిలేసింది. డీఆర్సీ సమావేశానికి చట్టబద్ధత ఉందో లేదో తెలియదు. తేదీ నిర్ణయిస్తారు. మళ్లీ కాదంటారు. డీఆర్సీ సమావేశాల్ని మొక్కుబడి తంతుగా మార్చేశారని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు నిప్పులు చెరిగారు. ఎస్.కోటలో మీడియాతో ఆయన మంగళవారం మాట్లాడుతూ రైతు సమస్యలను పట్టించుకునేవారే కరువయ్యారన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరవాలని మొత్తుకున్నా దిక్కులేదని, క్వింటాకు రూ.2,400 మద్దతుధర రైతుకు అందడం లేదని, దళారులకు రూ.1500లకే పంటను విక్రయించుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. నిన్నటిదాకా ఎరువుల కొరత ఉంటే నేడు జిల్లాలో గ్యాస్ కొరత. గ్యాస్ కొనలేక అవస్థ పడుతున్నా ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదని విమర్శించారు. జిల్లా బడ్జెట్ ఒట్టి డొల్ల, సాగునీరు, పరిశ్రమలకు ఒక్కరూపాయి ఇవ్వలేదు, తాగునీరు, సాగునీటికి, ట్రైబల్యూనివర్సిటీలకు ఒక్క రూపాయి కేటాయింపుల్లేక పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. సర్పంచ్ల పదవీకాలం ముగుస్తున్న తరుణంలో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ రూపకల్పన చేస్తున్నట్టు చెప్పారు. -
ఖైదీల పట్ల వివక్ష తగదు
చీపురుపల్లి: సబ్ జైళ్లలో ఉన్న ఖైదీలు పట్ల వివక్ష చూపితే కఠిన చర్యలు తప్పవని నాల్గవ అదనపు జిల్లా న్యాయమూర్తి బి.అప్పలస్వామి అన్నారు. పట్టణంలోని సబ్ జైల్‌ను మంగళవారం బోర్డు ఆఫ్ విజిటర్స్ ఫర్ ప్రిజనర్స్ బృందం పరిశీలనకు వచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మేరకు ప్రభుత్వం బోర్డ్ ఆఫ్ విజిటర్స్ ఫర్ ప్రిజనేర్స్ ఏర్పాటు చేసిందన్నారు. కారాగారంలో ఉన్న ఖైదీలకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఖైదీలకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఖైదీలు నేర ప్రవత్తిని విడిచి మంచి పౌరులుగా తయారు కావాలన్నారు. సబ్జైల్లో కొనసాగుతున్న జైల్ లీగల్ ఎయిడ్ క్లినిక్‌లను తనిఖీ చేశారు. జైలులో అమలవుతున్న సౌకర్యాలు గురించి ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. వంటగది, భోజనశాలను పరిశీలించారు. స్టోర్ రూమ్ సందర్శించి వంట సరుకులను పప్పు దినుసులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్, జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ అన్నపూర్ణమ్మ, చీపురుపల్లి ఆర్డీఓ ఎం.సుధారాణి, డీఎస్పీ ఎస్.రాఘవులు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీల హక్కుల రక్షణకు పటిష్ట చర్యలు : కలెక్టర్
పార్వతీపురం: ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కుల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టనున్నట్టు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ అమలుపై మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలకు ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు వారికి అండగా నిలవడమే జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ప్రధాన ఉద్దేశమన్నారు. శ్మశాన వాటికల అవసరాలను గుర్తించి మంజూరుకు చర్యలు చేపట్టాలన్నారు. కేసులు పెండింగ్‌లో వుంటే తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ శాఖ, సామాజిక సంక్షేమ, ఆదివాసీ సంక్షేమ విభాగాలు పరస్పరం సమన్వయంతో పని చేయాలన్నారు. చట్ట ఉల్లంఘన కలిగించే ఏచర్యనైనా కఠినంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే బి.విజయచంద్ర మాట్లాడుతూ ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ పెదబొండపల్లి సందర్శించిన సందర్భంగా దళిత రైతులు ఆక్రమణలపై ఫిర్యాదు ఇచ్చినప్పటికీ చర్యలు లేవన్నారు. తొలుత జిల్లాలో కేసుల పురోగతిని, విచారణ తీరును, నిందితులకు ఖరారైన శిక్షలు తదితర అంశాలపై సమీక్షించారు. సమావేశంలో ఎస్పీ మాధవరెడ్డి, ఏఎస్పీ మనీషారెడ్డి, పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవర్ స్వప్నల్ జగన్నాధ్, డీఆర్ఓ కె.హేమలత తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ శాఖకు డ్రోన్ వితరణ
విజయనగరం క్రైమ్: సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం అత్యంత అవసరమని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అన్నారు. జిల్లా పోలీసు శాఖ మరింత సమర్థవంతంగా పని చేసేందుకు, సామాజిక బాధ్యతలో భాగంగా బొబ్బిలికి చెందిన హీరా ఎలక్ట్రో స్మెల్టర్స్ లిమిటెడ్ సంస్థ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన డ్రోన్‌ను మంగళవారం డీపీఓలో ఎస్పీ ఎ.ఆర్.దామోదర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ హీరా ఎలక్ట్రో స్మెల్టర్స్ లిమిటెడ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ కుమార్దాస్ను శాలువాతో సత్కరించి, సర్టిఫికెట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్రోన్ సహాయంతో అసాంఘిక కార్యక్రమాల కట్టడి, గుంపుల నియంత్రణ, ట్రాఫిక్ పర్యవేక్షణ, నేరాల నిరోధక చర్యలు, విపత్తుల సమయంలో శోధన, రక్షణ చర్యలు మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని తెలిపారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున జరిగే సభలు, ఉత్సవాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో చిత్రీకరణకు డ్రోన్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. జిల్లా ప్రజలు శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. వితరణ చేసిన డ్రోన్‌ను ఎస్పీ బొబ్బిలి పోలీసుస్టేషన్ సీఐ కె.నారాయణరావుకి అందజేసి నేర నియంత్రణలో విస్తృతంగా వినియోగించాలని ఆదేశాలు జారీ చేశారు. అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఎ.వి.లీలారావు, ఇతర పోలీసు అధికారులు, హీరా ఎలక్ట్రో స్మెల్టర్స్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
పుచ్చ...
ఆరోగ్యానికి భలే రక్షసీజనల్ వ్యాపారం మూడు నెలలు పాటు ఈ పుచ్చకాయల వ్యాపారం ఉంటుంది. ఈ ప్రాంతంతో పాటు ఇతర జిల్లాల నుంచి పుచ్చకాయలను దిగుమతి చేసుకొంటున్నాం. ధర అందరికీ అందుబాటులో ఉంటుంది. ఎండ సమయంలో ఇవి ముక్కలుగా కోసి ఉంచితే అమ్ముడైపోతాయి. – పి.శ్రీనివాసరావు, వ్యాపారి, పార్వతీపురంపార్వతీపురం: ఎండలు మండిపోతున్నాయి. ఉదయం పది దాటితే చాలు వేడి గాలులు. అత్యవసర ప్రయాణాలు చేసే ప్రయాణికులతో పాటు విద్యార్థులు, ఉద్యోగులకు తప్పని పాట్లు. ఈ సమయంలో దారి పొడవునా నేనున్నానంటూ అటు దాహార్తిని, ఇటు ఆకలిని తీర్చేస్తుంది పుచ్చకాయ. సాధారణ వ్యక్తి కూడా కొనుగోలు చేసి తినగలిగే దివ్య ఫలంగా పుచ్చకాయ అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. ప్రధానంగా ఈ వేసవిలో పుచ్చకాయ కనిపిస్తే చాలు తినని మనిషి, రుచి చూడని జిహ్వ ఉండదు. జిల్లాలోని కొమరాడ, జియ్యమ్మవలస, పాలకొండ, సీతంపేట, గరుగుబిల్లి, వీరఘట్టం, భామిని తదితర మండలాలలో సుమారు 300 ఎకరాలలో కర్బూజా పంటను రైతులు సాగు చేస్తున్నారు. గతంలో పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి తదితర జిల్లాలకే పరిమితమైన ఈ పంట ఇప్పుడు అన్ని ప్రాంతాలలో సాగు చేస్తున్నారు. అయితే ఈ పంట సాగు చేసిన రైతులకంటే వ్యాపారులకే లాభసాటిగా ఉంటుందని రైతులంటున్నారు. శుభ కార్యక్రమాలలో.. పుచ్చకాయ అంటే ఇష్టపడని వారుండరు. చిన్నవారి నుంచి వృద్ధుల వరకూ ప్రతీ ఒక్కరు పుచ్చకాయని తింటారు. ఇప్పుడు కొత్తగా వివాహాలు, శుభ కార్యక్రమాలు జరిగిన సందర్భంలోనూ, తమ ఇండ్ల వద్ద నిర్వహించే ఫంక్షన్లలో పుచ్చకాయలను ముక్కలుగా కోసి వచ్చేవారికి ఇస్తున్నారు. ప్రతీ ఒక్కరి ఇళ్లలో ఈ వేసవిలో పుచ్చకాయలు నిల్వ ఉంచుకుంటున్నారు. వేసవిలో దాహార్తి తీర్చే దివ్య ఫలం కిలో రూ.25లు ధరలో లభ్యం దారి పొడవునా విక్రయాలు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతులు -
● డీటీసీ డీఎస్పీ వీరకుమార్ ● పీజీఆర్ఎస్లో 31 ఫిర్యాదుల స్వీకరణ
తక్షణమే చర్యలువిజయనగరం క్రైమ్: అర్జీదారులు తెలియజేసిన సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకుంటామని డీటీసీ డీఎస్పీ వీరకుమార్ అన్నారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి, 31 వినతులు స్వీకరించారు. వీటిలో భూ తగాదాలకు సంబంధించినవి 10, కుటుంబ కలహాలకు సంబంధించినవి 2, మోసాలకు సంబంధించినవి 3, ఇతర అంశాలకు సంబంధించిన 16 ఫిర్యాదులున్నాయి. అనంతరం డీఎస్పీ సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ.. ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, ఏడు రోజుల్లో చర్యలు తీసుకోవాలన్నారు. వాటి వివరాలను నివేదిక రూపంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి పంపాలని సూచించారు. కార్యక్రమంలో కంట్రోల్ రూమ్ సీఐ వైకుంఠరావు, ఎస్సై ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు. తొమ్మిది అర్జీల స్వీకరణ.. పార్వతీపురం రూరల్: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఏఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు తొమ్మిది అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అర్జీదారులతో ఏఎస్పీ నేరుగా మాట్లాడి..సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ..ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వాటి నివేదికలను జిల్లా పోలీస్ కార్యాలయానికి పంపించాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ ఆదాం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
సమస్యలను సకాలంలో పరిష్కరించండి
● కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి ● పీజీఆర్ఎస్లో 111 వినతుల స్వీకరణపార్వతీపురం: పీజీఆర్ఎస్లో అర్జీదారులు తెలియజేసిన సమస్యలకు సంతృప్తికర పరిష్కారం చూపించాలని, అలాగే అర్జీలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో డీఆర్ఓ కె.హేమలత, తదితర అధికారులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 111 అర్జీలు స్వీకరించారు. ఇందులో 25 అర్జీలు రెవెన్యూ శాఖవి కాగా.. 86 ఇతర శాఖలకు సంబంధించినవి. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. పరిష్కరించిన అర్జీల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సంబంధిత అధికారులనుఆదేశించారు. వచ్చిన అర్జీల్లో కొన్ని ఇలా.. ● కురుపాం మండలం దొమ్మిడి గ్రామం నుంచి జలగెడ్డ వరకు రహదారి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ గ్రామస్తులు దరఖాస్తును అందజేశారు. అలాగే కురుపాంలో ఇళ్ల మీదుగా విద్యుత్ తీగలు వెళ్తున్నాయని.. వాటిని సరిచేయాలని కోరుతూ పలువురు వినతిపత్రం అందజేశారు. ● అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదని సీతానగరం మండలం నిడగల్లు గ్రామానికి చెందిన ఆర్. భాస్కరరావు అర్జీ సమర్పించాడు. ● ఆక్రమణకు గురైన భూమిని ఇప్పించాలని కోరుతూ గరుగుబిల్లి మండలం మార్కొండపుట్టి గ్రామానికి చెందిన రౌతు రామినాయుడు అధికారులను కోరుతూ వినతిపత్రం అందజేశారు. -
కాలువలో పడి వ్యక్తి మృతి
బొబ్బిలి రూరల్: మండలంలోని ఎం. బూర్జివలస గ్రామానికి చెందిన పిట్ట అప్పలనాయుడు (36) ప్రమాదవశాత్తూ సాగునీటి కాలువలో పడి మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. అప్పలనాయుడు కుటుంబ సభ్యులతో సహా ఈ నెల 21న దైవ దర్శనానికి తిరుమల వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఈ నెల 24న రాత్రిపూట బొబ్బిలి రైల్వేస్టేషన్‌గా భావించి రాజమండ్రి స్టేషన్లో దిగిపోయాడు. బొబ్బిలి చేరుకున్న కుటుంబ సభ్యులు అప్పలనాయుడు దిగకపోవడంతో వెంటనే ఫోన్ చేయగా.. తాను పొరపాటున రాజమండ్రిలో దిగిపోయానని, ప్రస్తుతం మరికి వద్ద ఉన్నానని చెప్పాడు. వెంటనే మరికి వెళ్లిన కుటుంబ సభ్యులు అతని ఆచూకీ కోసం వెతగ్గా ఫోన్ పనిచేయకపోవడం, ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు తెలిపారు. పోలీసులు అతని ఆచూకీ కోసం గాలించగా వాడపల్లి సమీపంలోని సాగునీటి కాలువలో శవమై కనిపించాడు. అప్పలనాయుడు మృతదేహాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు రావులపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. శవపంచనామాను పూర్తిచేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. రాజమండ్రిలో దిగిన వ్యక్తి వాడపల్లి వైపు ఎందుకు వెళ్లాడో అర్థం కావడం లేదని.. ప్రమాదవశాత్తూ కాలువలో పడి చనిపోయి ఉంటాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అప్పలనాయుడు మృతదేహానికి సోమవారం స్వగ్రామంలో అంత్యక్రియలు చేపట్టారు. మృతుడికి భార్య పోలమ్మ, తొమ్మిదేళ్ల కుమారుడు శివ ఉన్నారు. విద్యుదాఘాతంతో వ్యక్తి ..గజపతినగరం: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలోని భైరిపురం జంక్షన్ వద్ద సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని తుమ్మికాపల్లికి చెందిన ఆకుల ఏడుకొండలు తన సోదరి వివాహం నిమిత్తం వస్తువులు కొనుగోలు చేసేందుకు భైరిపురం జంక్షన్‌కు వచ్చాడు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా.. సెంట్రల్ లైటింగ్ బాక్సుకు సంబంధించిన విద్యుత్ తీగ అతనికి తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తండ్రిని చంపిన కొడుక్కి జీవిత ఖైదు
విజయనగరం క్రైమ్: విజయనగరం టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గతేడాది నమోదైన హత్య కేసులో గాజులరేగకు చెందిన నిందితుడు కర్నపు సాయి(20)కి జీవిత ఖైదుతో పాటు రూ. 2 వేల జరిమాన విఽధిస్తూ విజయనగరం డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి ఎం.బబిత తీర్పు వెలువరించారని ఎస్పీ దామోదర్ తెలిపారు. సోమవారం ఆయన వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. గాజులరేగకు చెందిన సాయి తండ్రి లచ్చన్న వద్ద ఉంటున్నాడు. తండ్రి పేరున ఉన్న ఇంటిని తన పేరుపై రాయాలని కొన్నాళ్లుగా ఒత్తిడి తీసుకువస్తున్నాడు. అందుకు తండ్రి లచ్చన్న నిరాకరించడంతో కక్ష పెంచుకున్న సాయి 2025 ఫిబ్రవరి 13న రాత్రి ఇంటికి తాగి వచ్చి మంచంపై పడుకున్న తండ్రి గుండెలపై బలంగా గుద్ది చంపేశాడు. దీంతో మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి టూటౌన్ ఎస్సై మురలి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనంతరం కేసు దర్యాప్తులో భాగంగా ప్రస్తుత సీఐ శ్రీనివాస్ హత్య కేసుగా నమోదు చేసి నిందితుడు సాయిని అరెస్టు చేసి కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేశారు. సాయిపై నేరారోపణలు రుజువు కావడంతో జడ్జి జీవితఖైదు, జరిమాన విధిస్తూ తీర్ప చెప్పారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం విజయనగరం క్రైమ్: విజయనగరం శివారు సారిపల్లి జంక్షన్ వద్ద సుమారు అరవై ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని టూటౌన్ పోలీసులు సోమవారం గుర్తించారు. కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసరావు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేంద్రాస్పత్రికి తరలించారు. మృతుడు చామన ఛాయ రంగులో ఉన్నాడని, గోధుమ రంగు షర్టు, నలుపు రంగు గళ్ల లుంగీ కట్టుకున్నాడదని సీఐ తెలిపారు. వివరాలు తెలిసిన వారు 91211 09420 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. -
ప్రచార ఆర్భాటమే ఎక్కువ..
విజయనగరం అర్బన్: రాష్ట్రంలో తీవ్రమైన ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ, సంక్షేమ పథకాలకు భారీగా కేటాయింపులు చేశామని పాలకులు చెప్పుకున్నారు. అయితే ప్రజాప్రతినిధుల ప్రకటనల్లో వాస్తవం ఎంతవరకు ఉందన్న టాపిక్‌పై ప్రస్తుతం సర్వత్రా చర్చ నడుస్తోంది. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2026 – 27 బడ్జెట్ అవుట్ రీచ్ పేరుతో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. అయితే రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.వ్యవసాయం – ప్రత్నామ్నాయాల కొరత మాటల్లోనే పారిశ్రామికాభివృద్ధి..? జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని సమావేశంలో పేర్కొన్నప్పటికీ.. ఇప్పటివరకు పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడంలో గణనీయమైన పురోగతి కనిపించలేదు. ‘ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త’ అనే లక్ష్యం ప్రకటించినా వాస్తవానికి స్వయం ఉపాధి అవకాశాలు పరిమితంగానే ఉన్నాయనేది బహిరంగ సత్యం. అంతా ప్రచారమేనా..? బడ్జెట్ అవుట్ రీచ్ లక్ష్యాలు – గతం, ప్రస్తుత పరిస్థితులపై కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అయితే ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను ప్రజలకు తెలియజేయాల్సి ఉన్నప్పటికీ .. అలా కాకుండా ప్రభుత్వ వైఫల్యాలను సమర్థించుకునేలా ఉందన్న విమర్శలు వినిపించాయి. ఆర్థిక పరిమితులున్నా.. నిధులు మంజూరు చేశామని చెప్పుకున్న పాలకులు నిధుల విడుదలలో ఆలస్యం : అధికారులు జిల్లా ఇన్చార్జ్ మంత్రి అనిత, మంత్రి కొండపల్లి సమక్షంలో ‘బడ్జెట్ అవుట్ రీచ్’ -
ఉత్కంఠభరితంగా మహిళా కబడ్డీ పోటీలు
లక్కవరపుకోట: ప్రేక్షకుల కేరింతల మధ్య రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలు మండలంలోని భీమాళి గ్రామంలో సోమవారం ఉత్కంఠభరితంగా సాగాయి. ఈ పోటీలను ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ప్రస్తుత ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు కేవీ ప్రభావతితో కలిసి ప్రారంభించారు. గ్రామదేవత పరదేశమ్మ పండగను పురస్కరించుకుని కమిటీ సభ్యులు ఈ పోటీలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన క్రీడాకారులుపాల్గొన్నారు. విజేతలకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ జిల్లా ఆర్గనేజింగ్ కార్యదర్శి ఎన్.లక్ష్మణరావు, రిఫరీలు మురళి, రామారావు, రవి, తిరుపతిరావు, ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు, సర్పంచ్, ఉప సర్పంచ్‌లు కొయ్యాన కృష్ణ, గణేష్, వైస్ ఎంపీపీ ఎం.శ్రీనురాజు, మాజీ సర్పంచ్ గుల్లిపల్లి రామునాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
కాగితంపై మెరిసిన పీ–4
● ఆశయం ఘనం.. ఆచరణలో శూన్యం.. పార్వతీపురం రూరల్: పేదరికం లేని సమాజమే లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించిన పీ – 4 కార్యక్రమం తొలి ఏడాది పూర్తి చేసుకుంది. దీంతో సోమవారం స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మంటపంలో నిర్వహించిన వార్షికోత్సవంలో వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి , స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పాల్గొని పథక లక్ష్యాలను వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 9.5 లక్షల మంది పీ–4కు నమోదు చేసుకోగా, 5 లక్షల మందికి లబ్ధి చేకూరిందని ప్రజాప్రతినిధులు, అధికారులు వెల్లడించారు. జిల్లాలో 78,464 బంగారు కుటుంబాలను గుర్తించి, వారికి 2,998 మంది మార్గదర్శకులను అనుసంధానం చేసినట్లు అధికారులు తెలిపారు. ఆచరణలో అడ్డంకులు.. ప్రభుత్వ ఆశయాలు కాగితంపై ఆకర్షణీయంగా కనిపిస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం అమలు తీరుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేవలం స్వల్ప సాయంతో నిరుపేద కుటుంబాల తలరాతలు మారుతాయా? అన్న ది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో పారిశ్రామికవేత్తల కొరత ఉండడంతో ఇతర నగరాల నుంచి దాతలను తీసుకురావడం, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ముందుకు రావాలని కోరడం వంటి అంశాలు అధికారులకు సవాలుగా మారింది. వ్యవస్థాగతమైన మార్పుల కంటే వ్యక్తిగత ఉదారతపైనే ఈ పథకం ఎక్కువగా ఆధారపడుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొంత సేవకే ప్రభుత్వ ముద్ర? ఈ వేడుకలో సన్మానాలు పొందిన దాతల్లో అత్యధికులు చాలా కాలంగా తమ సొంత ఖర్చులతో స్వచ్ఛందంగా సేవ చేస్తున్నవారే కావడం గమనార్హం. జిల్లేళ్లమూడి అమ్మ సేవా సమితి, డాక్టర్ అప్పలనాయుడు వంటి వ్యక్తులు, సంస్థలు ఎప్పటి నుంచో చేస్తున్న నిరంతర సేవలను ఇప్పుడు ప్రభుత్వం తన ఖాతాలో పీ – 4 పేరిట వేసుకునే ప్రయత్నం చేస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం కంటే దాతల వ్యక్తిగత సేవే ఇక్కడ ప్రధాన భూమిక పోషిస్తోందని, ఆశించిన స్థాయిలో మార్పు రావాలంటే మరిన్ని పటిష్ట చర్యలు అవసరమని క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. కార్యక్రమంలో జేసీ యశ్వంత్‌కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. దాతలకు సత్కారం.. విజయనగరం అర్బన్: పేదరిక నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పీ – 4 కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకోవడంతో సోమవారం స్థానిక కలెక్టరేట్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు కుటుంబాలకు సహకరించిన దాతలకు అధికారులు, ప్రజాప్రతినిధులు సత్కరించారు. కార్యక్రమంలో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత, కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి, సీపీఓ బాలాజీ, కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ అప్పలనాయుడు పాల్గొన్నారు. గణాంకాలు చెబుతున్న వాస్తవం జిల్లాలో 83,436 బంగారు కుటుంబాలను గుర్తించగా వాటిలో కేవలం 19,410 కుటుంబాలను మాత్రమే తొలి ఏడాది దత్తత తీసుకోవడం జరిగింది. అంటే మెజారిటీ కుటుంబాలు ఇప్పటికీ సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి. మార్గదర్శులు సంఖ్య 2,897 మాత్రమే ఉండడం కూడా కార్యక్రమ విస్తరణలో లోపాలను సూచిస్తోంది. -
ఆస్తి కోసం ఘాతుకం..
● అన్నలపై దాడి చేసిన తమ్ముడు ● ఒకరి పరిస్థితి విషమం ● పరారీలో నిందితుడుబొండపల్లి: ఆస్తి వివాదంలో తోడబుట్టిన అన్నలపై దాడి చేశాడో ప్రబుద్ధుడు. చాకుతో హత్యాయత్నానికి పాల్పడడంతో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మండలంలోని కొండకిండాంలో సోమవారం చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై యు.మహేస్, గ్రామస్తులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కలిశెట్టి రామునాయుడు, చిన్నప్పలమ్మలకు ముగ్గురు కుమారులు సత్యనారాయణ, బంగారునాయుడు, గౌరునాయుడు ఉన్నారు. రామునాయుడు పది సంవత్సరాల కిందట చనిపోగా, చిన్నప్పలమ్మ ఐదు సంవత్సరాల కిందట కన్నుమూసింది. అప్పటి నుంచి తల్లి చిన్నప్పలమ్మకు సంబంధించిన భూమితో పాటు బంగారం విషయమై అన్నదమ్ముల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం కూడా అన్నదమ్ముల మధ్య గొడవ జరుగుతుండగా.. గౌరినాయుడు క్షణికావేశంలో చాకుతో అన్నదమ్ములపై దాడి చేశారు. పెద్ద అన్నయ్య సత్యనారాయణ కడుపులో పొడవంతో పేగులు బయటకు రాగా.. రెండో అన్నయ్య బంగారునాయుడు ఛాతిపై పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. బంగారునాయుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకరి పరిస్థితి విషమం.. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని దాడిలో తీవ్రంగా గాయపడిన సత్యనారాయణ, బంగారునాయుడులను జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సత్యనారాయణ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్లూస్‌టీమ్ సభ్యులు సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. -
ఎంతపని చేశావు కన్నా...
పాలకొండ రూరల్: మీ చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు.. మీ పోషణ బాధ్యత నాపై పడింది.. రెక్కలుముక్కలు చేసుకుని మీరే సర్వస్వంగా బతికాను. కష్టం తెలియకుండా పెంచాను. ఆదుకుంటారనుకున్న సమయంలో ఇలా.. బలవంతంగా ప్రాణం తీసుకుని ఎంత పనిచేశావు కన్నా అంటూ ఆ తల్లిపెట్టిన రోదన అక్కడివారిలో కన్నీరుపెట్టించింది. తల్లి మందలించిందని కుమారుడు గడ్డిమందు తాగి మరణించిన ఘటన రుద్రిపేటలోని ఓ పేదింట విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పాలకొండ మండలంలోని రుద్రిపేట గ్రామానికి చెందిన పారిశిర్లి పాపారావు, విజయ దంపతులకు ఇద్దరు కుమారులు. పిల్లల చిన్నవయస్సులోనే తండ్రి పాపారావు అనారోగ్యంతో మృతిచెందారు. విజయ కూలిపనులు చేస్తూ ఇద్దరు కుమారులను పెంచింది. రెండో కుమారుడు హరికృష్ణ(27)డిగ్రీ వరకూ చదువుకున్నాడు. కుటుంబ పోషణకు తనవంతు సహకరించేందుకు ఇటీవల విజయవాడలో ఓ పెట్రోల్ బంక్‌లో చేరాడు. స్వగ్రామంలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరయ్యే క్రమంలో ఇటీవల ఇంటికి వచ్చాడు. ఆదివారం తన స్నేతులతో కలిసి ఆలస్యంగా ఇంటికి చేరిన కుమారుడిని తల్లి మందలించింది. పెళ్లికావాల్సిన సమయంలో స్నేహితులతో కలిసి చెడుతున్నావని, సరైన మార్గంలో నడవాలని హెచ్చరించింది. తీవ్ర మనస్థాపానికి గురినై హరికృష్ణ రాత్రి సమయంలో గడ్డిమందు సేవించారు. అపస్మారక స్థితికి చేరడంతో కుటుంబ సభ్యులు పాలకొండ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యులు శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. అక్కడ వైద్యసేవలు పొందుతూ అర్ధరాత్రి తర్వాత హరికృష్ణ మరణించాడు. చిన్నకొడుకని అల్లారు ముద్దుచేసి నందుకు ఎంతపని చేశావు కన్నా అంటూ ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. మృతుని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై డోల వెంకన్న తెలిపారు. -
ఎస్‌జీఎస్‌డబ్ల్యూఓగా పూర్ణిమ
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లా స్వర్ణ గ్రా మం–స్వర్ణ వార్డుల అధికారిగా (డీఎస్జీఎస్డబ్ల్యూఓ) ఆర్.పూర్ణిమదేవి నియమితులయ్యా రు. ప్రస్తుతం ఆమె విశాఖపట్నంలోని డ్వామా డీడీఓ/పీడీగా పని చేస్తున్నారు. పీఆర్ అండ్ ఆర్డీ విభాగంలో డీపీఓ, డీడీఓ, డిప్యూటీ సీఈఓ క్యాడర్ అధికారులకు ఉద్యోగోన్నతిపై సీఈఓ క్యాడర్ పోస్టులను కేటాయిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగా జిల్లాకు పూర్ణిమదేవిని కేటాయించారు. బలిజిపేట: విద్యార్థులు తమ భవితకు బంగారుబాట వేసుకునేందుకు కేరీర్ ఫెస్ట్ దోహదప డుతుందని డీఈఓ బ్రహ్మాజీ తెలిపారు. వంత రాం కేజీబీవీ బాలికలకు సోమవారం కెరీర్ ఫెస్ట్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు వివిధ రంగాల్లో స్థిరపడి మంచి ఉద్యోగ అవకాశాలు పొందేందుకు, వారి కెరీర్ ఉన్నతంగా మలుచుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. భవిష్యత్తులో ఎటువంటి విద్యను అభ్యసించాలి, ఏ విద్యను అభ్యసిస్తే ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయనే అంశంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంఈఓ–1 సామల సింహాచలం, కేజీబీవీ ఎస్ఓ మధురవాణి, కెరీర్ గైడెన్స్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ బి.రమేష్, కె.శార ద, ఎస్.కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం రూరల్: ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించి ప్రాణాపా యం నుంచి తమను తాము రక్షించుకోవాలని విశాఖపట్నం రేంజి ఐజీ గోపీనాథ్ జట్టి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో ‘హెల్మెట్ అవగాహన ర్యాలీ’ని సోమవా రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ... రహదారి ప్రమాదాల్లో మరణి స్తున్న వారిలో 50 శాతం మంది హెల్మెట్ ధరించని కారణంగానే ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హెల్మెట్ ధరించడం భారంగా కాకుండా, బాధ్యతగా భావించాలని కోరారు. ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి పర్యవేక్షణ లో పట్టణంలోని చర్చి కూడలి నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్టీసీ కాంప్లెక్స్, నాలుగురోడ్ల కూడలి మీదుగా పాతబస్టాండ్ వరకు సాగింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు ఐజీ హెల్మెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, ఏఎస్పీ మనీషా రెడ్డి, డీఎస్పీలు రాంబాబు, థామస్ రెడ్డి, స్థాని క సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
అయినవారికే కట్టబెట్టి.. ఆశలకు గండికొట్టి!
● ఆశ కార్యకర్తల నియామకాల్లో అవకతవకలు ● ప్రజాప్రతినిధులు చెప్పిన వారికే పోస్టింగులు ● కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్న బాధితులు సాక్షి, పార్వతీపురం మన్యం: ఆశ వర్కర్ల నియామకాల్లో ఇష్టానుసారంగా వ్యవహరించారని.. అర్హతలను పక్కన పెట్టి, అయినవారికి పోస్టులు కట్టబెట్టారని బాధిత మహిళలు గగ్గోలు పెడుతున్నారు. నిబంధనలను పక్కనపెట్టేసి, మెరిట్ ప్రాతిపదికన కాక.. ‘సిఫారసు’ లేఖలకే వైద్యారోగ్య శాఖాధికారులు ప్రాధాన్యమిచ్చార ని వాపోతున్నారు. తమకు జరిగిన అన్యాయంపై డీఎంహెచ్ఓ కార్యాలయం, కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దాదాపు ఎనిమిది నెలల కిందట జిల్లాలోని పలు పీహెచ్‌సీల పరిధిలో సుమారు 34 ఆశ వర్కరు పోస్టుల భర్తీకి వైద్యారోగ్య శాఖాధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. కొన్నాళ్లకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. నెలలు గడిచిన తర్వాత.. ఉద్యోగాల వేడి చల్లారాక, ప్రస్తుతం ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తున్నారు. పూర్తి పారదర్శకంగా భర్తీ చేపడతామని ప్రకటించిన వైద్యారోగ్య శాఖాధికారులు.. ప్రజాప్రతినిధులు పంపిన జాబితాలకే సంతకం పెట్టారు. అర్హతలు, మెరిట్‌ను కాదని.. ఎమ్మెల్యేల మాటకే ఓటేశారు. స్థానికేతరులకు, ఉద్యోగస్తుల భార్యలకు కట్టబెట్టారు. మెరిట్ ఉన్నా.. వితంతువులైనా సరే పక్కనపెట్టేశారు. సాలూరు నియోజకవర్గం తోణాంలో నిరుపేద దళిత కుటుంబానికి చెందిన వితంతు మహిళ సవిరి సుజాత ఈ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆమెను కాదని, అదే ప్రాంతానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి భార్యను నియమించారు. తన దీన స్థితిని వివరిస్తూ.. గతంలో ఆమె స్థానిక మంత్రి సంధ్యారాణి, జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ను కూడా కలిసి విన్నవించుకున్నట్లు తెలు స్తోంది. ఆమె ఆవేదనను ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేల సిఫారసు ఉన్నవారికే పోస్టులు దక్కాయన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నగదు చేతులు మారిందని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. అర్హులకు అన్యాయం చేశారని వాపోతున్నారు. ●ఆశ వర్కర్ నియామకంలో తనకు అన్యాయం చేశారని పత్తిక కళావతి అనే గిరిజన అభ్యర్థిని వాపోయింది. కలెక్టర్ ప్రభాకరరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసింది. కురుపాం మండలం బియ్యాలవల స పంచాయతీ సూర్యనగరం ఆశ కార్యకర్త పోస్టుకు సంబంధించి మెరిట్ ఉన్న వారికి మొండి చేయి చూపారని ఆమె చెబుతోంది. ●కురుపాం మండలం ఉదయపురం ఆశ వర్కరు పోస్టును స్థానికేతర అభ్యర్థికి ఇచ్చారని ఆ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఊలక భూషణరావు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. -
రెండేళ్ల పాలనలో ఏం చేశారు..?
● ఏడాదిలో 70 శాతం పోర్టు పనులు పూర్తి చేసిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిదే ● పోర్టు నిర్మాణంలో వాస్తవాలను ప్రజలకు వివరించడానికే ‘పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమం ● నౌపడ సమీపంలో సభా స్థలం పరిశీలించిన వైఎస్సార్సీపీ నాయకులు ● నేడే పోర్టుకు పోదాం పదండి భారీ బహిరంగ సభ టెక్కలి, సంతబొమ్మాళి: వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపునిచ్చే విధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూలపేట పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు, జిల్లా పరిశీలకుడు ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అన్నారు. సోమవారం సంతబొమ్మాళి మండలం నౌపడ సమీపంలో నిర్వహిస్తున్న ‘పోర్టుకు పోదాం పదండి’ భారీ బహిరంగ సభ స్థలాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు, నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ.. గతంలో ఎంతో మంది నాయకులు ఈ ప్రాంతంలో పోర్టు కడతామని హామీలిచ్చి మరచిపోయారని గుర్తు చేశారు. ఈ జిల్లాను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వైఎస్సార్సీపీ హయాంలో గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మూలపేట పోర్టుకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. సుమారు రూ.4362 కోట్లతో అన్ని రకాల అనుమతులతో పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించారని, ఎన్నికల సమయానికి 70 శాతం పనులు పూర్తి చేశారని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో మాయ మాటలతో కూటమి ప్రభుత్వం అధికారం దక్కించుకుని మిగిలిన 30 శాతం పనులు పూర్తి చేయలేదని ముత్యాలనాయుడు ఆరోపించారు. పోర్టు నిర్మాణంలో వాస్తవ పరిస్థితులను తెలియజేయడానికే పోర్టుకు పోదాం పదండి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అనంతరం జిల్లా పరిశీలకుడు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ.. టెక్కలి నియోజకవర్గం ప్రాంతంలో పోర్టు నిర్మాణం 70 ఏళ్లుగా కలగా మిగిలిపోయిందన్నారు. అలాంటి కలను సాకారం చేసే విధంగా గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మూలపేట పోర్టుకు రూపకల్పన చేశారని గుర్తు చేశారు. అబద్ధపు హామీలతో అధికారం దక్కించుకున్న కూటమి నాయకులు రెండేళ్లు కాలయాపన చేశారని మండిపడ్డారు. 30 శాతం పనులు పూర్తి చేయలేకపోవడమే కాకుండా పోర్టు క్రెడిట్‌ను దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మూలపేట పోర్టు మంజూరు కోసం జిల్లాకు చెందిన ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాసు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయం చేయాలని కోరారు. అనంతరం వైఎస్సార్సీపీ యువ నాయకుడు ధర్మాన కృష్ణచైతన్య మాట్లాడుతూ వైఎస్సార్సీపీ హయాంలో ఏడాది కాలంలో 70 శాతం పోర్టు పనులు పూర్తి చేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టెక్కలి నియోజకవర్గం టీడీపీ ముఖ్య నాయకులతో పాటు నారా లోకేష్ వరకు కమీషన్ల కోసం కక్కుర్తి పడడంతో పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. జిల్లాలో వలసల నివారణ, యువతకు ఉపాధి, జిల్లా అభివృద్ధి కోసం నిర్మాణం తలపెట్టిన పోర్టు పనులు పూర్తి చేసేందుకు నిర్వహిస్తున్న పోర్టుకు పోదాం పదండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వీరితో పాటు జెడ్పీటీసీ పాల వసంత్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బి.మోహన్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు అన్నెపు రామారావు, నాయకులు పి.రవికుమార్‌రెడ్డి, ఎన్.భీమారావు, ఎస్.సత్యం, కె.సతీష్, జి.గురునాధ్యాదవ్, కె.అజయ్, ఎ.మురళి, కె.జీవన్, బి.రాజేష్, వి.శ్రీధర్‌రెడ్డి, బి.కార్తీక్, ఆర్.మురళీరెడ్డి తదితరులు ఉన్నారు. -
ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అప్పలనాయుడు
పార్వతీపురం రూరల్: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యా య ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) పార్వతీపురం మన్యం జిల్లా ప్రధాన కార్యదర్శిగా రావాడ అప్పలనాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం స్థానిక పెన్షనర్స్ భవనంలో మహే ష్ అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర కార్యద ర్శి నల్లా బాలకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంతవరకు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న నల్లా బాలకృష్ణ ఇటీవల రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. దీంతో ఖాళీ అయిన ఆ స్థానంలో అప్పలనాయుడును నియమించారు. ఈ ఎన్నిక ప్రక్రియకు రాష్ట్ర కార్యదర్శి ధవళ సరస్వ తి పరిశీలకురాలిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కా రం కోసం అన్ని మండల శాఖలను సమన్వ యం చేసుకుంటూ పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు. పిచ్చికుక్క దాడిలో ఇద్దరికి గాయాలు కురుపాం: మండల కేంద్రంలో పిచ్చికుక్క స్వైరవిహారం చేయడంతో ఇద్దరు గాయపడిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన గౌడు సాయి కుటుంబ సభ్యులతో కలిసి నూకాలమ్మ గుడికి వెళ్లారు. వారు పూజలో ఉండగా.. ఓ పిచ్చికుక్క వచ్చి చిన్నారి ఉత్తేజ్పై దాడి చేయడగా కంటిపై గాయాలయ్యాయి. వెంటనే చిన్నారిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అలాగే శివ్వన్నపేటకు చెందిన ప్రసాద్ అనే యువకుడిపై కూడా పిచ్చికుక్క దాడి చేసి గాయపరిచింది. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. నిత్యాన్నదానానికి రూ. లక్ష వితరణ పాలకొండ రూరల్: పట్టణంలోని సత్యసాయి సేవా మందిరం ద్వారా కొనసాగుతున్న నిత్యాన్నదాన పథకానికి పట్టణానికి చెందిన విజయదుర్గ హోటల్ యజమాని కొత్తకోట ప్రసాదరావు (బుల్లి), సులోచన దంపతులు ఆ దివారం రూ. లక్ష వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ.. సేవలు మరింత మెరుగ్గా అందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సమితి కన్వీనర్ ఆర్.కిశోర్, సభ్యులు పాల్గొన్నారు. మాజీ సైనికుల సర్వసభ్య సమావేశం శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని పెద్ద రెల్లివీధిలో జిల్లా మాజీ సైనికుల సమాఖ్య సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం నిర్వహించినట్లు జిల్లా అధ్యక్షుడు కటకం పూర్ణచంద్రరావు తెలియజేశారు. సభను కోశాధికారి ఎం.సింహాచలం ఫెడరేషన్ జమా ఖర్చుల వివరాలతో ప్రారంభించారు. జనరల్ సెక్రటరీ పైడి మురళీధరరావు మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు చేపట్టిన పనులను వివరించారు. అనంతరం అధ్యక్షుడు పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఇటీవల కార్గిల్ పార్క్‌ను శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించి జిల్లాలోని సైనికుల్లో స్ఫూర్తిని నింపడంపై నాయకులు, అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ పైడి మురళీధరరావు, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ ఎస్.రామకృష్ణ, కోశాధికారి ఎం.సింహాచలం, గౌరవ ప్రెసిడెంట్లు తమ్మినేని కృష్ణారావు, టి.కృష్ణారావు, ఎస్.ఎల్.రావు, మహిళా సెక్రటరీలు కె.జగ్గమ్మ, డి.భారతి, అడ్వైజర్లు ఎ.వి.జగన్మోహన్రావు, పి.రామారావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు పి.జమున, మెట్ట ఈశ్వరమ్మ, డి.రత్నమాల, బి.రాంబాబు, డి.వాసుదేవరావు, ఎన్.లక్ష్మీ నారాయణ, ఎం.రాములు, పి.శ్రీనివాసరావు, పి.చిన్నారావు, ఎం.నాగభూషణరావు, ఎస్.అప్పలసూరి, కె.రాజశేఖర్, వి.గౌరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం క్రైమ్: మండల పరిధిలోని సుంకరిపేటలో విజయనగరం రూరల్ పోలీస్‌స్టేషన్ సీఐ లక్ష్మణరావు, సిబ్బంది కలిసి ఆదివారం రాత్రి పల్లెనిద్ర చేశారు. మాదకద్రవ్యాల నియంత్రణ, అక్రమ మద్యం, సారా రవాణాను అరికట్టడం, గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణం ఉండేలా చేయడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నామని సీఐ తెలిపారు. అనంతరం అక్కడి ప్రజలతో సమావేశమై మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు–వాటి బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాలలు, మహిళల రక్షణ చట్టాలు వంటివి వివరించారు. -
మౌన విస్ఫోటనం పతంజలి స్వరం
విజయనగరం టౌన్: మౌన విస్ఫోటనం పతంజలి స్వరమని ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ పేర్కొన్నారు. కె.ఎన్.వై.పతంజలి సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో స్థానిక గురజాడ జిల్లా కేంద్ర గ్రంథాలయం ఆవరణలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో పురస్కార స్వీకర్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూమి గుండ్రంగా ఉందా? బల్లపరుపుగా ఉందా? అన్న ప్రశ్న అలమండ గ్రామ కేంద్రంగా తలెత్తినా, అది విశ్వవ్యాపిత చర్చగా నేడు మారడం గమనించదగ్గ విషయమన్నారు. తన కవితలో ఫ్లైఓవర్‌ని ‘ఆకాశ వంతెన’ అని రాసినందుకు పతంజలి ఫోన్ చేసి ప్రశంసించిన విధానం తనలో సమాజం పట్ల మానసిక క్రమశిక్షణకు దోహదపడిందన్నారు. అనంతరం వేదిక ప్రతినిధులు కుప్పిలి పద్మకు పతంజలి సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ మాట్లాడుతూ అనేక రుగ్మతలతో బాధపడుతున్న సమాజానికి తన అక్షరాలతో వైద్యం చేసిన హోమియోపతి పతంజలి అని కొనియాడారు. తెలుగు భాష ఉన్నంతవరకూ ఆయన రచనలు సజీవమన్నారు. ఇప్పటికే పాత్రికేయ రంగంలోనూ, సాహిత్యంలోనూ తమదైన శైలిలో పతంజలిని అనుసరించిన వారిని ఎంపిక చేసి చిరు పురస్కారంతో గౌరవించుకోవడం తమకెంతో గర్వకారణంగా ఉందన్నారు. సాహితీవేత్త ఆల్తి మోహన్ మాట్లాడుతూ రాజ్యాంగానికి గల నాలుగు ప్రధాన అంగాల్లో లోపభూయిష్ట వ్యవహారాల మీద తన అక్షరాలతో దండెత్తారన్నారు. ప్రజాసేవ పేరిట భూవ్యాపారం చేస్తారని ఆనాడే ఊహించిన దార్శనీకుడు పతంజలి అని రచయిత మహమ్మద్ ఖదీర్‌బాబు వివరించారు. ఎన్‌కె.బాబు, విఎంకె.లక్ష్మణరావు, భళ్లమూడి నాగేంద్రప్రసాద్, పతంజలి కుటుంబ సభ్యులు డాక్టర్ ప్రతాప్ వర్మ పాల్గొన్నారు. -
●కష్టాల్లో జీవనం
గ్యాస్ దొరకడం లేదు. నూనె కొనలేం. ప్రతి దుకాణంలో రేట్లు పెరిగాయి. యుద్ధం పేరుతో వ్యాపారులు మోసం చేస్తున్నారు. ఇలా ఉంటే ఎలా బతికేది. – ఎజ్జివరపు సత్యం, గుమ్మడాం వ్యాపారులను ధరల పెరుగుదలపై అడిగితే యుద్ధం ప్రభావం అంటున్నారు. దీంతో జేబులు ఖాళీ అవుతున్నాయి. నియంత్రించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇలాగైతే ఎలా జీవించేది. – బొడ్డు సన్యాసమ్మ, విజయనగరం విజయనగరం ఫోర్ట్/గంటస్తంభం: పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న యుద్ధాన్ని బూచిగా చూపించి వ్యాపారులు మార్కెట్లో నిత్యావసరాల ధరలను అమాంతం పెంచేస్తున్నారు. దీంతో పేద, మధ్యతరగతి ప్రజల జీవనం కష్టంగా మారుతోంది. పప్పుల నుంచి నూనెల వర కు అన్ని రకాల వస్తువుల ధరలు పెంచేయడంతో సామాన్యులు విలవిలలాడిపోతున్నారు. ధరలను అదుపు చేయాల్సిన పాలక ప్రభుత్వం గుడ్లప్పగించి చూస్తుంది. కట్టడి చేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు ధరలను అమాంతం పెంచేస్తూ నిలువునా దోచేస్తున్నారు. యుద్ధాన్ని బూచిగా చూపి.. అమెరికా – ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల నూనెల దిగుమతి తగ్గిపోయిందని చెబుతూ వ్యాపారులు ధరలు పెంచేస్తున్నారు. కొందరు వ్యాపారులైతే సిండికేట్ అయి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని వల్ల నూనె ధర లీటరుకు రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగింది. పామాయిల్ ధర లీటరుకు రూ. 20, రిఫైండ్ ఆయిల్ ధర లీటరుకు రూ.30 వరకు పెరిగింది. వివిధ రకాల పప్పుల ధరలు కూడా కేజీకి రూ.10 నుంచి 20 వరకు పెంచేశారు. ధరల కట్టడిలో విఫలం నిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలో వాటిని కట్ట డి చేయాల్సిన అధికారుల పట్టించుకోవడం లేదనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అసలు వీటిని పర్యవేక్షించాల్సిన అధికారులు అటుగా కనీస చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నా యి. ఎందుకిలా వ్యవహరిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వ్యాపారులతో అధికారులు అంటకాగుతున్నారా? అంటూ పలువురు సందేహాలు వ్య క్తం చేస్తున్నారు. ఓ వైపు పాలకులు యుద్ధ ప్రభా వం ఏమీ లేదని చెబుతుంటే మరోవైపు ఇలా ధరలు పెరగడం చూస్తుంటే అసలు ఏం జరుగుతుందన్న ప్రశ్నలు సామాన్యుడిలో తలెత్తుతున్నాయి. కొనుగోలు చేయలేని దుస్థితి నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలు కొనుగోలు స్థితి పడిపోయింది. ఏ వంట చేయాలన్నా.. నూనె కనీస అవసరం. నూనె లేనిదే ఏ వంట చేయలేని దుస్థితి. ఈ పరిస్థితుల్లో నూనె ధరలు పెరగడం వల్ల వినియోగాన్ని తగ్గించుకుంటున్నారు. కొంత మంది రిఫైండ్ ఆయిల్ వాడిన వారు పామాయిల్‌తో సరిపెట్టుకుంటున్నారు. పప్పు, నూనెల ధరలు బాగా పెంచేశారు. పది పదిహేను రోజుల కాలంలో ధరలు బాగా పెంచేశారు. ఏది కొనాలన్నా ముట్టుకుంటే షాక్ కొట్టే విధంగా ధరలు ఉన్నాయి. దీంతో ఇబ్బంది పడుతున్నాం. – భవాని, గృహిని, లోతుగెడ్డ, మెంటాడ మండలం నిత్యావసర సరుకుల కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటాం. కావాలని ధరలు పెంచిన వ్యాపారులపై చర్యలు తీసుకుంటాం. ధరల కట్టడికి చర్యలు చేపడతాం. – బి.రవికిరణ్, ఏడీ, మార్కెటింగ్ శాఖ -
లుకలుకలే..!
● కలవని మనసులు ● మరోసారి బట్టబయలైన టీడీపీలో వర్గ విభేదాలు పసుపు పండగలోనూ.. సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలోని కూటమి పార్టీల మధ్య ఎటూ కుంపట్లు ఉన్నాయి. పోనీ, అక్కడంటే మనుషులు కలిసినంత సులువుగా మనసులు కలవలేదని సర్ది చెప్పుకోవచ్చు. ఎన్నికల ముందు వరకే ఒక్కటిగా ఉన్నా.. తర్వాత ఎవరి జెండా ‘రంగు‘ వారిదేనని ఇప్పటికే పలు సందర్భాల్లో బహిరంగమైంది. సొంత తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్యనే సఖ్యత లేదని పలు ఉదంతాలు రుజువు చేశాయి. పార్టీ పండగ అయిన టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవంలోనూ మరోసారి ఇదే విషయం తేటతెల్లమైంది. ఎవరికి వారు విడివిడిగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం గమనార్హం. జిల్లా కేంద్రం పార్వతీపురం నియోజకవర్గ టీడీపీలో గ్రూపుల గోల ఎప్పటి నుంచో ఉన్న విషయం విదితమే. పార్టీ వేడుకను సైతం ఎవరికి వారు చేసుకున్నారు. ఎమ్మెల్యే విజయ్ చంద్ర, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, సీతారాం వర్గాలు వేర్వేరుగా నిర్వహించాయి. సాలూరులోనూ పార్టీ సీనియర్ నేత భంజ్‌దేవ్‌ను మరో వర్గం పక్కన పెట్టేసింది. మంత్రి సంధ్యారాణి గ్రూపు, భంజ్‌దేవ్ వర్గం వేర్వేరుగా కార్యక్రమం జరిపారు. పైకే సఖ్యత.. లోపల కత్తులు గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్న గ్రూపులు.. ప్రభుత్వం వచ్చాక కూడా కొనసాగుతున్నాయి. పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ.. ఇలా అన్ని నియోజకవర్గాల్లోనూ రెండు, మూడు వర్గాలు కొట్లాడుకుంటున్నాయి. పైకి ఒకే పార్టీలా కనిపిస్తున్నా.. లోపల ఒకరి మీద మరొకరు కత్తులు నూరుకుంటున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా ఒకరిని ఇంకొకరు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. సాలూరులో సంధ్యారాణి, భంజ్‌దేవ్, తేజోవతి వర్గాలుండగా.. పార్వతీపురంలో ఎమ్మెల్యే విజయ్‌చంద్ర, ద్వారపురెడ్డి జగదీష్‌తో పాటు, మరో రెండు మూడు వర్గాలున్నాయి. కురుపాంలో వీరేష్‌చంద్రదేవ్, విప్ తోయక జగదీశ్వరిలు ఉప్పు–నిప్పులా ఉన్నారు. పాలకొండలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పడాల భూదేవి – జనసేన ఎమ్మెల్యే జయకృష్ణ వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇక.. అరకు పార్లమెంట్ అధ్యక్షులు మోజురు తేజోవతిని జిల్లాలోని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పూర్తిగా పట్టించుకోవడం లేదు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకను జిల్లా కేంద్రంలో కలిసే నిర్వహించినా.. తేజోవతి విషయంలో స్థానిక ఎమ్మెల్యే వర్గీయులు వ్యతిరేకత చూపుతున్నారన్న గుసగుసలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం జిల్లా పార్టీ కార్యాలయం విషయమై తేజోవతి ప్రయత్నించగా.. స్థలం దగ్గరకు వచ్చేసరికి ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకున్నారని సమాచారం. ఈ పంచాయితీ ‘ఉన్నత’ స్థాయి వరకూ వెళ్లింది. పార్టీ పరంగా చేపట్టిన కార్యక్రమాల్లోనూ, వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకూ ఆమెను జిల్లా కేంద్రంలో ఏ ఒక్కరూ ఆహ్వానించడం లేదని తెలిసింది. ప్రోటోకాల్ విషయంలో తనను పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారని సన్నిహితుల వద్ద ఆమె వాపోతున్నట్లు సమాచారం. సాలూరు నియోజకవర్గంలోనూ పార్లమెంట్ అధ్యక్షురాలికి ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఇటీవల జరిగిన వంద పడకల ఆస్పత్రి ప్రారంభోత్సవానికి ఆమెను ఆహ్వానించలేదు. పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు కనీస సమాచారం ఇవ్వడం లేదని తెలుస్తోంది. పార్టీ క్యాడర్ సైతం జిల్లా అధ్యక్షురాలిగా కనీస గౌరవం ఇవ్వడం లేదని సమాచారం. నూతన సంవత్సరం, సంక్రాంతి, శంబర పండగ సందర్భాల్లో మంత్రి వర్గీయులు పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చిన్నాచితక నాయకుల బొమ్మలను కూడా వాటిలో పెట్టినా.. ఎందులోనూ తేజోవతి ఫొటో లేదు. కొద్ది రోజుల క్రితం మక్కువ మండలంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. తేజోవతి ప్రత్యేకంగా ఓ వర్గాన్ని పోషిస్తున్నట్లు మంత్రి వర్గం బహిరంగ ఆరోపణలకు దిగింది. దీంతో పార్టీ క్యాడర్ మధ్యే మాటామాటా పెరిగింది. కురుపాం, పాలకొండ నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ గ్రూపులను ఎవరికి వారు ప్రోత్సహిస్తుండటంతో క్యాడర్లో కూడా చీలిక వచ్చింది. ఎటువైపు వెళ్లాలో తెలియక కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేల వైఖరి నచ్చక పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో అధిక శాతం మంది వైఎస్సార్సీపీ వైపు చూస్తున్నారు. -
లారీ ఢీకొని యువకుడి మృతి
మాకవరపాలెం: అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం తామరం వేంకటేశ్వర ఆలయ సమీపంలో శనివారం అర్ధరాత్రి లారీ ఢీకొని యువకుడి దుర్మరణం చెందాడు. విజయనగరం జిల్లా ఎస్.కోటకు చెందిన చింతాడ లోకేష్(25) కశింకోట మండలం సుందరయ్యపేటలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు తన మోటార్ సైకిల్‌పై మాకవరపాలెం వైపు వస్తున్నాడు. అదే సమయంలో నర్సీపట్నం నుంచి తాళ్లపాలెం వైపు ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో లోకేష్ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై లోకేష్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ దామోదర్‌నాయుడు ఆదివారం తెలిపారు. లారీని పట్టుకున్నామన్నారు. -
పొద్దు తిరుగుడులో.. యాజమాన్య పద్ధతులు తప్పనిసరి
● తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ● వ్యవసాయ పరిశోధనాస్థానం శాస్త్రవేత్త వెంకటరావుసీతంపేట: ప్రస్తుత రబీ సీజన్లో ఎక్కువగా సాగవుతున్న పంటల్లో పొద్దుతిరుగుడు ఒకటి. ఈ సాగులో యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక లాభాలు పొందవచ్చని స్థానిక వ్యవసాయ పరిశోధనాస్థానం శాస్త్రవేత్త పి. వెంకటరావు తెలిపారు. ఈ నేపథ్యంలో సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులపై ఆయన వెల్లడించిన వివరాలు.. సాగు మొదటిలోనే ఆకులు తినే పురుగులు గుంపులుగా చేరి పత్రహరితాన్ని గీకి తింటాయి. దీనివల్ల ఆకులు జల్లెడాకులుగా మారుతాయి. వీటి నివారణకు విషపు ఎరను (పది కిలోల తవుడు, కిలో బెల్లం, ఒక లీటరు మోనోక్రోటోఫాస్ లేదా ఒక కిలో కార్బరిల్ 50 శాతం పొడి మందును తగు నీటితో కలిపి ఉండలుగా తయారు చేసుకుని) మొక్కల మొదళ్ల దగ్గర సాయంత్రం సమయంలో వేసుకోవాలి. లేదా 0.5 ఎం.ఎల్ స్పైనోసాడ్‌ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. బీహారి గొంగళి పురుగు.. తల్లి పురుగు ఆకులపై గుడ్లను గుంపులుగా పెడుతుంది. లార్వాల శరీరం లేత పసుపు రంగుతో ఉండి ముదురు పసుపు రంగు వెంట్రుకలతో కప్పబడి ఉంటుంది. ఈ లార్వాలు ఆకుల్ని తిని తీవ్రనష్టాన్ని కలిగిస్తాయి. పురుగుల ఉధృతంగా ఆశిస్తే మొక్కలు మోడుబారుతాయి. గుడ్లు, తొలిదశ గొంగలి పురుగులు గుంపులుగా ఆకుల మీద ఉన్నపుడు ఏరి పారేయాలి. అలాగే వేప గింజల ద్రావణాన్ని (5 శాతం) పిచికారీ చేయాలి. పెద్ద లార్వాలు ఉన్న ఏడల ఎండోసల్ఫాన్ లేదా క్లోరిఫైరిపాస్ 2 మి.లీ లేదా డైక్లోరావాస్ ఒక ఎం.ఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. శనగపచ్చ పరుగు.. పొద్దు తిరుగుడు పండించే అన్ని ప్రాంతాల్లో ఈ పురుగు ఆశిస్తుంది. లార్వాలు పువ్వులు, గింజల మధ్య చేరి వాటిని తింటూ అధిక నష్టాన్ని కలుగజేస్తాయి. వీటి నివారణకు ఎండోసల్ఫాన్ లేదా క్వినాల్ పాస్, క్లోరిపైరిపాస్ 2 మి.లీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగులు.. దీపపు పరుగులు ఆశించిన ఆకుల చివర్లు పసుపు పచ్చగా మారి క్రమేపీ ఆకంతా ఎర్రబడి ముడుచుకుని దోనెల్లాగా కనిపిస్తాయి. వీటి నివారణకు మోనోక్రోటోపాస్ 1.6 మి.లీ. లేదా డైమిథోయేట్ లీటర్ నీటికి 2 మి.లీ కలిపి ఆకుల అడుగు భాగం తడిచేలా పిచికారీ చేయాలి. తెల్లదోమ ఆకుల అడుగుభాగం నుంచి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పసుపు రంగుకు మారి మొక్కలు కూడా గిడసబారి ఎండిపోతాయి. వీటి నివారణకు ట్రైజోఫాస్ 2.5 మి.లీ లేదా ఎసిఫేట్ ఒక గ్రాము లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగులు ఈ పంటను మొదటి దశ నుంచీ నాశనం చేస్తాయి. వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు, పైరు బెట్టకు గురైనపుడు వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణకు మోనోక్రోటాపాస్ 1.6 మి.లీ. లీటర్ నీటిలో కలపి పిచికారీ చేయాలి. పిండినల్లి గుడ్లు ఆకులు, మొగ్గ కింద భాగాన చేరి రసాన్ని పీలుస్తాయి. తద్వారా మొక్క పసుపు వర్ణంలోకి మారి ఎక్కువగా ఆశించినట్టయితే చనిపోతుంది. దీని నివారణకు గాను పంటలో కలుపు మొక్కలు ముఖ్యంగా వయ్యారిభామ లేకుండా చూసుకోవాలి. అధికంగా ఆశించిన మొక్కను పీకి పారేయడం మంచిది. ఈ పురుగును నివారణకు ప్రొఫినోఫాస్ 50 శాతం ఈసీ 2 మి.లీను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. పక్షుల బెడద.. ఈ పంటకు ముఖ్యంగా రామచిలుకల బెడద ఎక్కువ. వీటి నివారణకు పైరును పెద్ద కమతాలలో వేయాలి. మెరుపు రిబ్బనులను పైరుపైన అడుగు ఎత్తున సూర్యరశ్మి రిబ్బనుపై పడేటట్టు ఉత్తర, దక్షిణ దిశగా కట్టాలి. అలాగే దిష్టిబొమ్మలు ఏర్పాటు చేయడం వల్ల కూడా పక్షుల బెడదను తగ్గించవచ్చు. విత్తనోత్పత్తి.. పొద్దు తిరగుడులో హైబ్రిడ్ విత్తనోత్పత్తి చేపట్టుటకు రబీ కాలం అనువైనది. విత్తనోత్పత్తి చేపట్టేందుకు సుమారు వెయ్యి మీటర్ల వరకు ఎలాంటి పొద్దుతిరుగుడు పంటలేని నీటి సదుపాయం గల సారవంతమైన పొలాన్ని ఎన్నుకోవాలి. హైబ్రిడ్ విత్తనోత్పత్తి చేసేటప్పుడు ఆడ, మగ వరుసలను 3:1 నిష్పత్తిలో నాటుకోవాలి. ఆడ మొక్కలలో పుప్పొడి వెదజల్లే మొక్కలను గుర్తించి తీసివేయాలి. పూత దశలో ఉదయం పూట మగ మొక్కల పువ్వుల నుంచి పుప్పొడిని మొత్తటి గుడ్డతో రుద్ది.. అదే గుడ్డను తర్వాత ఆడ మొక్కల పువ్వులపై రుద్దాలి. దీని ద్వారా ఫలదీకరణం చెంది ఎక్కువ గింజ కట్టడానికి అవకాశం ఉంది. పొలం దగ్గర తేనెటీగలు పెంచడం ద్వారా కూడా గింజ కట్టే శాతాన్ని పెంచవచ్చు. కోత సమయంలో ఆడ,మగ పువ్వులను వేరుచేయాలి. ఆడమొక్కల నుంచి వచ్చిన విత్తనం హైబ్రిడ్ విత్తనం. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
గార: మండలంలోని వత్సవలస రాజమ్మ తల్లి జాతరకు వెళ్తూ ఆర్టీసీ బస్ చక్రాలు కిందపడి మహిళ మృతి చెందింది. జి.సిగడాం మండలం ఎస్పీ రామచంద్రాపురం (అగ్రహారం)కు చెందిన ముగుడ కనక (50) కుమారుడు కవిలేశు స్కూటీపై ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో శ్రీకూర్మం మీదుగా వత్సవలస వెళ్తున్నారు. తండ్యాలపేట గ్రామ సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్ స్కూటీకి తగిలింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న కవిలేశు పక్కకు పడిపోగా, తల్లి కనక రోడ్డుపై పడిపోవడంతో తలపై నుంచి ఆర్టీసీ వెనుక చక్రం వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు కనక భర్త గుజరాత్ రాష్ట్రంలోని ఒక ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తున్నాడు. కవిలేశు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ తెలుగు చంద్రమోహన్ తెలిపారు. -
రక్తదానం..ప్రాణదానం
నెల్లిమర్ల: రక్తదానం..ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకురావాలని సాధన యువజన సంఘం అధ్యక్షుడు పాలుబోతు దుర్గాప్రసాదరావు అన్నారు. మండలంలోని జరజాపుపేటలో దివంగత తాడుతూరి సన్యాసినాయుడు జ్ఞాపకార్థం రక్తదాన శిబిరం ఆదివారం నిర్వహించారు. 22 మంది శిబిరంలో రక్తదానం చేశారు. అనంతరం రక్తదాతలను అభినందించి, సత్కరించారు. రక్తదానం చేస్తే సన్నబడిపోతామన్న అపోహ అందరిలో ఉందని, నిజానికి రక్తం దానం చేస్తే సన్నబడిపోరని ఆరోగ్యవంతులైన వారు ప్రతి మూడు నెలలకోసారి రక్తం దానం చేయవచ్చన్నారు. మనం ఇచ్చే రక్తం ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడడమే కాకుండా వారిపై ఆధారపడి జీవిస్తున్న వారికి గొప్ప మేలు చేసిన వారమవుతామన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఒక్క రక్తదాత ఇచ్చిన రక్తంతో ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చన్నారు. రక్తం దానం చేస్తే మళ్లీ మన శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అవుతుందన్న విషయం తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో గణేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
అంతరాయం లేకుండా..
ప్రస్తుత వేసవిలో ఉష్ణోగ్రతల పెరుగుదలతో పాటు విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపడుతున్నాం. వినియోగదారులకు అంతరాయం లేకుండా అవసరానికి సరిపడేలా సరఫరాను అందించే దిశగా ప్రణాళికలు రూపొందించాం. కొద్ది రోజుల వ్యవధిలోనే 9 ఎంయూ నుంచి 9.5 ఎంయూ మేర విద్యుత్ వినియోగం పెరిగింది. రానున్న రోజుల్లో ఈ పెరుగుల 10 ఎంయూకు దాటే అవకాశం ఉంది. వ్యవసాయ విద్యుత్ సర్వీసుల ట్రాన్స్ఫార్మర్లు పాడైతే తక్షణమే మార్చేందుకు 150 ట్రాన్స్ఫార్మర్లు సిద్ధంగా ఉన్నాయి. ఎల్‌నినో ప్రభావంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసినా తక్షణమే నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు అవసరమైన సామగ్రి సిద్ధంగా ఉంది. – మువ్వల లక్ష్మణరావు, ఎస్ఈ, ఏపీఈపీడీసీఎల్, విజయనగరం ఆపరేషన్ సర్కిల్ -
ఉత్తరాంధ్ర కాదు.. ఉత్తమమైన ఆంధ్ర
● వేడుకగా న.ర.సం. ఉత్తరాంధ్ర మహిళల సదస్సు ● ప్రముఖులకు నవ్యాంధ్ర కీర్తి పురస్కారాలు ● హాజరైన పద్మభూషణ్ యార్లగడ్డ విజయనగరం టౌన్: సాహితీ సౌరభాలకు నిలయమైన విజయనగరంలో అడుగు పెట్టడమే ఓ ఆనందం. ఇది ఉత్తరాంధ్ర కాదు.. ఉత్తమమైన ఆంధ్ర అంటూ పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కొనియాడారు. నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం (న.ర.సం) ఉత్తరాంధ్ర మహిళల సదస్సు, జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక క్షత్రియ కల్యాణ మండపంలో ఆదివారం వేడుకగా నిర్వహించారు. విశిష్ట అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సుమారు 80 మంది విద్యార్థినులు తమ కవితలను చదివి వాటిని కవన కూజితాలు రూపంలో అందించడమనేది చాలా విశేషమన్నారు. భావితరాలకు తెలుగు అందుతుందనే ఆనందాన్ని వ్యక్తం చేశారు. వ్యవహారిక భాషపై మహాకవి గురజాడ, గిడుగు చేసిన కృషిని శ్లాఘించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి మాట్లాడుతూ న.ర.సం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సాహిత్య కృషి ఎనలేనిదన్నారు. కార్యక్రమానికి ముందు నర్తనశాల అకాడమీ డాక్టర్ భేరి రాధికారాణి నేత్రత్వంలో విద్యార్థినులు నృత్య నీరాజనం సమర్పించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు. నవ్యాంధ్ర కీర్తి పురస్కారాలు విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన ప్రముఖులకు నవ్యాంధ్ర కీర్తి పురస్కారాలను అందజేశారు. పురస్కారాలు పొందిన వారిలో విశాఖకు చెందిన డాక్టర్ చిలుకూరి శాంతమ్మ, డాక్టర్ కోలవెన్ను మలయవాసిని, డాక్టర్ దేవులపల్లి పద్మజ, డాక్టర్ అయ్యగారి సీతారత్నం, బాలబాట స్వరాజ్యం (రమణమ్మ), గిడుతూరి రామలక్ష్మి, విజయనగరానికి చెందిన పాకలపాటి రమణమ్మ, మహేంద్రవాడ లక్ష్మీరామదాసు, డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి, కెకె.భాగ్యశ్రీ,, కె.అనురాధ, వి.ఉషారమణి, శ్రీకాకుళానికి సంబంధించి డాక్టర్ పిలకా శాంతమ్మ, తులాల సవరమ్మ, పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి గుడ్ల అమ్మాజీ, రావాడ కృష్ణకుమారి ఉన్నారు. వీరితో పాటూ విజయనగరం పుర ప్రముఖులను ఘనంగా సత్కరించారు. నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం గౌరవాధ్యక్షురాలు తేళ్ల అరుణ సభాధ్యక్ష్యతన నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్, కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జివి.పూర్ణచంద్, న.ర.సం వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ చిన్న లక్ష్మీకళావతి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సింహాద్రి జ్యోతిర్మయి, గౌరవధ్యక్షురాలు తేళ్ల అరుణ, గౌరవ సలహాదారు డాక్టర్ నూనె అంకమ్మ రావు, జిల్లా అధ్యక్షురాలు చివుకుల శ్రీలక్ష్మి, ప్రధాన కార్యదర్శి భోగరాజు సూర్యలక్ష్మి, అధిక సంఖ్యలో కవులు, రచయితలు పాల్గొన్నారు. -
డబ్బు కోసమే వృద్ధురాలి హత్య
● నిందితుడి అరెస్టు : ఎస్పీపార్వతీపురం రూరల్: అప్పుల బాధ నుంచి గట్టెక్కేందుకు ఓ వ్యక్తి తన బంధువైన వృద్ధురాలిని హతమార్చిన ఘటనలో నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. మక్కువ మండలం మేలపువలస గ్రామానికి చెందిన మేలపు సింహాచలం (67) ఈ నెల 20న తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తొలుత దీనిని అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన పోలీసులు, పోస్టుమార్టం నివేదికలో ఆమెను గొంతు నులిమి చంపినట్లు తేలడంతో కేసును హత్యగా మార్చి దర్యాప్తు చేపట్టారు. అదే గ్రామానికి చెందిన చోంగలి ఈశ్వరరావు జూదం, మద్యం వ్యసనాలకు బానిస కావడంతో పాటు సుమారు రూ.1.50 లక్షల అప్పుల్లో ఉన్నాడు. ఒంటరిగా ఉంటున్న మృతురాలు సింహాచలం వద్ద ఉన్న బంగారు ఆభరణాలపై కన్నేసిన నిందితుడు, ఈ నెల 20న రాత్రి వర్షం కురుస్తున్న సమయంలో తలదాచుకుంటాననే నెపంతో ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం ఆమైపె దాడి చేసి, ముక్కు, మెడపై నొక్కి ఊపిరి ఆడకుండా చేసి ప్రాణాలు తీశాడు. బయట అలికిడి కావడంతో భయపడి కేవలం బంగారు గొలుసును మాత్రమే తీసుకుని పారిపోయాడు. శనివారం మధ్యాహ్నం నిందితుడిని పట్టుకున్న పోలీసులు అతని నుంచి 11.700 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై సెక్షన్ 305(ఎ) బీఎన్ఎస్ కింద అదనపు అభియోగాలు నమోదు చేశారు. సమావేశంలో ఏఎస్పీ మనీషా రెడ్డి, సాలూరు సీఐ పి.రామకృష్ణ, మక్కువ ఎస్ఐ వెంకటరమణ పాల్గొన్నారు. -
అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన పీడీ
తెర్లాం: మండలంలోని కూనాయవలస గ్రామంలో మినీ అంగన్వాడీ కేంద్రాన్ని ఐసీడీఎస్ జిల్లా పీడీ బాలామణి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్త, ప్రీ స్కూల్ పిల్లల హాజరు, స్టాక్ వివరాలు, రికార్డులను పరిశీలించారు. అనంతరం పీడీ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలన్నారు. కార్యకర్తలు, హెల్పర్లు సమయపాలన పాటించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన అన్ని రికార్డులను ఆఫ్‌లైన్‌లోను, ఆన్లైన్లోను ఎటువంటి లోపాలు లేకుండా సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ప్రీ స్కూల్ పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్యను నేర్పించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో లోపాలుంటే చర్యలు తీసుకొనేందుకు వెనుకాడేది లేదని పీడీ హెచ్చరించారు. ఆమెతో పాటు పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ కార్యకర్తలు, లబ్ధిదారులు ఉన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
బొండపల్లి: ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని అంబటివలస గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఎస్ఐ యు.మహేష్ తెలిపిన వివరాలు.. అంబటివలస గ్రామానికి చెందిన తాళ్లపూడి అప్పలనాయుడు(35) తాపీమేసీ్త్రగా పని చేస్తూ జీవనం చేస్తున్నాడు. మృతునికి భార్య ధనలక్ష్మితో పాటు మూడేళ్లు, ఆరేళ్లు వయసు కలిగిన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురై గ్రామానికి ఆనుకొని ఉన్న తన బంధువుల మామిడితోటకు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో వెళ్లి మామిడి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిపారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం జిల్లా కేంద్రంలోని కేంద్ర సర్వజన ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించినట్టు చెప్పారు. -
తమ్మనశెట్టి మృతికి ప్రముఖుల సంతాపం
● కోలగట్ల కుటుంబాన్ని పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్విజయనగరం: ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ ఉప సభాపతి, విజయనగరం శాసనసభ నియోజకవర్గ సమన్వయకర్త కోలగట్ల వీరభద్ర స్వామి స్వయాన సోదరుడు, ప్రముఖ న్యాయవాది కోలగట్ల తమ్మనశెట్టి ఆకస్మిక మరణం పట్ల రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, టెక్కలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త పేడాడ తిలక్, వైఎస్సార్సీపీ తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, రాష్ట్ర వైఎస్సార్సీపీ యువజన విభాగ అధ్యక్షుడు స్వరూప్ తదితర నాయకులు కలిసి విజయనగరంలోని వారి నివాసానికి శనివారం వెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు తమ్మనశెట్టి చిత్రపటానికి నివాళులర్పించి, శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, తమ్మనశెట్టి అత్యంత వినయశీలి అని, సేవాభావం కలిగిన వ్యక్తిగా సమాజంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని కొనియాడారు. ఆయన మృతి కోలగట్ల కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజానికే తీరని లోటు అని పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో కోలగట్ల కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని వారు ఆకాంక్షించారు. -
శ్మశానం లేక.. దారిలోనే మృతదేహం ఖననం
జియ్యమ్మవలస రూరల్: శ్మశానవాటిక ఆక్రమణకు గురికావడంతో ఓ దళిత వృద్ధురాలి మృతదేహాన్ని మార్గంమధ్యలో ఖననం చేసిన హృదయ విదారకమైన ఘటన జియ్యమ్మవలస మండలం తురకనాయుడువలసలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన 72 ఏళ్ల అనాథ వృద్ధురాలు అమ్మాజమ్మ ఈ నెల 27న (శుక్రవారం) మరణించారు. ఆమె శవాన్ని స్థానికులు ఊరికి 100 మీటర్లు దూరంలో ఆక్రమణకు గురైన శ్మశానవాటికకు తీసుకెళ్లలేక దారిలోనే పూడ్చిపెట్టారు. దీనిపై అభ్యంతరం తెలుపుతూ అక్కడి రైతులు తహసీల్దార్ ఎన్.అప్పారావుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రెవెన్యూ సిబ్బందితో కలిసి మృతదేహాన్ని ఖననం చేసిన స్థలాన్ని తహసీల్దార్ పరిశీలించారు. శ్మశాన వాటిక సమస్యకు పరిష్కారం చూపుతానన్నారు. ఇదీ పరిస్థితి... తురకనాయుడువలస గ్రామానికి వంద మీటర్లు దూరంలో సుమారు 4 సెంట్లు శ్మశానవాటిక ఉంది. దీనిని అధికార పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు ఆక్రమించుకున్నారు. దీనిపై దళితులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పరిష్కారం లభించలేదు. ఇటీవల పర్యటించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు కూడా సమస్యను వివరించారు. అయినా ఎలాంటి పురోగతి లేకపోవడంతో మృతదేహాలను ఖననం చేసేందుకు చోటుకరువైంది. ఇలాంటి ఘటన ఇటీవల చింతలబలగాం గ్రామంలో చోటుచేసుకుంది. అదే పరిస్థితి నేడు తురకనాయుడువలస గ్రామంలో పునరావృతమైంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి దళితులకు శ్మశానవాటిక కోసం భూమిని కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. దళితుల 4 సెంట్లు శ్మశానవాటిక స్థలాన్ని ఆక్రమించిన అధికారపార్టీ కార్యకర్తలు దారి మధ్యలో వృద్ధురాలి మృతదేహం ఖననం తురకనాయుడువలసలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన -
బాడీ బిల్డింగ్ పోటీల విజేతలకు అభినందన
విజయనగరం: జిల్లా స్థాయిలో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రెడ్డి శంకరరావు, కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు ఆకాంక్షించారు. ఈ మేరకు శనివారం నగరంలోని బాడీ ఫిట్నెస్ జిమ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులను అభినందించారు. జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు త్వరలో శ్రీకాకుళం జిల్లాలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభతో విజేతలుగా నిలిచిన మహరాష్ట్రలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాలని అభిలాషించారు. జాతీయ స్థాయిలో రాణించిన వారికి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇటువంటి సువర్ణావకాశాన్ని అందిపుచ్చుకుని విజయనగరం కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డి.శ్రీనివాసరావు, నమ్మి ప్రసాద్, డి.సన్నిబాబు తదితరులు పాల్గొన్నారు. -
మందుల దుకాణాల్లో వైద్యం..!
● కొన్ని చోట్ల దుకాణాలను క్లినిక్‌లుగా మార్చేస్తున్న వైనం ● ఆపరేషన్లు మినహా మిగిలిన వైద్యసేవలు చేసేస్తున్నారు..విజయనగరం ఫోర్ట్: జిల్లాలోని అనేక చోట్ల మందుల దుకాణాల్లో ఆయా నిర్వాహకులే చిన్నచిన్న రోగాలకు తమకు తెలిసిన మందులు ఇచ్చి వైద్యం చేస్తూ దందా సాగిస్తున్నట్టు తెలుస్తుంది. మెడికల్ షాపుల పేరిట నడుస్తున్న వైద్యం రోజురోజుకు పెరుగుతుంది. మందులు మాత్రమే విక్రయించాల్సిన వారు ఎటువంటి అనుమతులు లేకుండా గుట్టుగా వైద్యం చేసేస్తున్నారు. డాక్టర్ చీటి ప్రకారం మందులు ఇవ్వాల్సిన వారు డాక్టర్ అవతారం ఎత్తుతున్నారు. మెడికల్ షాపులే చిన్న తరహా క్లినిక్‌లు మాదిరి మారిపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలిసీ తెలియని వైద్యం చేయడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ అధికారులు
● రూ.5.20లక్షల విలువైన పనులకు.. రూ.1.30 లక్షల లంచం డిమాండ్ ● లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీరాజ్ ఏఈఈ, టెక్నికల్ అసిస్టెంట్ గజపతినగరం: విజయనగరం జిల్లా మెంటాడ మండలం పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు (ఏఈఈ) పల్లి గౌతమ్ నాయుడు, టెక్నికల్ అసిస్టెంట్ (వర్క్ ఇన్స్పెక్టర్–అవుట్సోర్సింగ్) పెదిరెడ్ల సంతోష్ లంచం తీసుకుంటూ శనివారం ఏసీబీకి చిక్కారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... మెంటాడ పంచాయతీలో రూ.5.20లక్షల విలువైన సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనం పనులను పంచాయతీ జనరల్ ఫండ్, 15వ ఆర్థిక సంఘం నిధులతో పూర్తిచేశారు. పనుల బిల్లుల కోసం మెంటాడ గ్రామ సర్పంచ్ రాంబాబు పంచాయతీరాజ్ అధికారులను సంప్రదించారు. బిల్లులు చెల్లించాలంటూ పలుసార్లు విన్నవించారు. దీనికోసం ఏఈఈ, టెక్నికల్ అసిస్టెంట్ కలిసి రూ.లక్షా30వేలు డిమాండ్ చేశారు. ఆయన రూ.లక్షా20వేలకు భేరం కుదుర్చుకున్నారు. అనంతరం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ డీఎస్పీ ఎన్.రమ్య వలపన్నారు. పథకం ప్రకారం గజపతినగరం ఉపఖజానా కార్యనిర్వాహక ఇంజినీరు కార్యాలయంలో రూ.లక్షా 20వేలును సర్పంచ్ నుంచి ఏఈఈ, టెక్నికల్ అసిస్టెంట్లు తీసుకుంటుండగా అప్పటికే అక్కడ కాపుకాసిన ఏసీబీ డీఎస్పీ ఎన్.రమ్య, సీఐ ఎం.మహేశ్వరరావు, ఎస్సై కె.వాసునారాయణరావు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరినీ అరెస్టుచేశారు. ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. -
ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026
బంగారు కుటుంబాల వేడుకలు రేపు పార్వతీపురం: పార్వతీపురం పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో బంగారు కుటుంబాలకు ఏడాది పూర్తి అయిన సందర్భంగా సోమవారం సంబరాలను నిర్వహించనున్నట్టు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి శనివారం పేర్కొన్నారు. జిల్లాలోని ఎంపీడీఓలతో టెలీ కాన్ఫరెన్సులో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల, నియోజకవర్గ స్థాయిలో సంబరాలలో పాల్గొనేలా ఆహ్వనించాలన్నారు. జిల్లాకు సంబంధించి ముఖ్యమంత్రి వర్చువల్ ద్వారా ముఖాముఖి చర్చించే అవకాశం వుందన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ కె.హేమలత, ఎంపీడీఓలు తదితరులున్నారు. నారాయణాచార్యులకు పోలీసుల నివాళి పార్వతీపురం రూరల్: ప్రముఖ సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతిని జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఆధునిక మహాకావ్యంగా గుర్తింపు పొందిన ‘శివతాండవం’ సృష్టికర్త పుట్టపర్తి అని పేర్కొన్నారు. 14 ఏళ్ల ప్రాయంలోనే ఆయన రచించిన ‘పెనుగొండ లక్ష్మి’ కావ్యం పాఠ్యగ్రంథంగా ఎంపిక కావడం ఆయన ప్రతిభకు నిదర్శనమన్నారు. మహనీయుల స్ఫూర్తితో సిబ్బంది జ్ఞానాన్ని పెంపొందించుకుని, అంకితభావంతో ప్రజాసేవలో పాలుపంచుకోవాలని కోరా రు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, సీఐలు రమణమూర్తి, రమేష్, ఆర్ఐలు రాంబాబు, నాయుడు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మాతా శిశు మరణాల నివారణే లక్ష్యంపార్వతీపురం రూరల్: జిల్లాలో మాతా శిశు మరణాలు సంభవించకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు ఆదేశించారు. జిల్లా ఆరోగ్య కార్యాలయంలో ఆశానోడల్ అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గర్భిణుల నమోదుతో పాటు వంద శాతం ‘అభా’ ఐడీలు సృష్టించాలని స్పష్టం చేశారు. బాల్య వివాహాలు, టీనేజ్ గర్భాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని, నిబంధనలకు విరుద్ధంగా జరిగే వివాహాలపై పోలీస్, ఐసీడీఎస్ శాఖలకు సమాచారం అందించాలని సూచించారు. ఎంసీపీ కార్డుల నమోదు, టీకాల ప్రక్రియలో వెనుకబడిన కేంద్రాల పనితీరుపై ఆరా తీశారు. బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వందశాతం వేయించాలని, వేసవి దృష్ట్యా వడదెబ్బ నివారణకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ వై.విజయమోహన్, జగన్మోహనరావు, సూర్యకౌశిక్, లీలారాణి, తదితరులు పాల్గొన్నారు. సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలోని పలు కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు ఆర్టీఈ(ఉచిత–నిర్బంధ విద్యాహక్కు చట్టం) నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. ఈ చట్టం కింద చేరిన విద్యార్థుల నుంచి అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యాశాఖ నుంచి పర్యవేక్షణ లేకపోవడం వల్ల అసలు చాలా యాజమాన్యాలు ప్రవేశాలకే మొండికేస్తున్నాయి. సెక్షన్12(1)సి ప్రకారం ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఆర్థికంగా వెనుకబడిన, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న వారి పిల్లలకు ఒకటో తరగతిలో ఏటా 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాలి. వీరి నుంచి ఫీజులు వసూలు చేయకూడదు. ఒకసారి ప్రవేశం పొందితే 8వ తరగతి వరకు ఉచిత విద్య కొనసాగుతుంది. దీన్ని చాలా యాజమాన్యాలు ఖాతరు చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్యూషన్ ఫీజు.. ఏకరూప దుస్తులంటూ... కొన్ని పాఠశాలలు ట్యూషన్ ఫీజు, అడ్మిషన్ ఫీజు, ఏకరూప దుస్తులు, పుస్తకాలు తదితర పేర్లతో డబ్బులు వసూలు చేస్తున్నాయి. కాస్త ఆలస్యం చేసినా తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నాయి. ఇవ్వకుంటే పరీక్షలకు హాజరు కానీయబోమని బెదిరిస్తున్నాయి. టీసీలు కూడా ఇవ్వలేమంటూ హెచ్చరిస్తున్నాయి. ఒకటో తరగతికి కూడా రూ.20 వేలకుపైగా వసూలు చేస్తున్నట్లు విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. ఆర్టీఈ ద్వారా లబ్ధి పొందిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం వల్ల విద్యాసంస్థల యాజమాన్యాలను నిబంధనలను తుంగలో తొక్కేస్తున్నాయి. తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల తల్లులకు జమ చేయాల్సిన మొత్తాలను ఆర్టీఈ పిల్లల ఫీజుల కోసం పాఠశాలల ఖాతాలకు మళ్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. చాలా మంది విద్యార్థులకు పథకం అందకపోవడం.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మొదటి ఏడాది పూర్తిగా ఎత్తివేయడంతో కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు ఫీజుల రూపంలో అందినకాడికి వసూలు చేశాయి. చట్టం కింద ఉచిత విద్య కచ్చితంగా అందించాలి. సంబంధిత పాఠశాల యాజమాన్యాలు ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి, అడ్మిషన్లు ఇవ్వాలి. సరైన కారణం లేకుండా అడ్మిషన్లు నిరాకరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – బ్రహ్మాజీరావు, జిల్లా విద్యాశాఖాధికారి ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ఆర్టీఈ కింద జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష అధికారులు ప్రకటనిచ్చారు. తొలివిడత ప్రవేశాలకు లాటరీ తీశారు. జిల్లా వ్యాప్తంగా 796 మంది దరఖాస్తు చేసుకోగా.. 408 మంది అర్హత సాధించినట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. మొదటి విడతగా ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న వారిని ఎంపిక చేశారు. రెండో విడతలో ఐదు కిలోమీటర్ల పరిధిలో వారిని ఎంపిక చేయనున్నారు. అక్రమంగా యాజమాన్యాలు ఫీజులు వసూలు చేస్తుండడంతో ఆ ప్రభావం ప్రవేశాలపై పడుతోంది. ఎవరూ చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం తమకు చెల్లింపులు చేయడం లేదంటూ ప్రైవేట్ పాఠశాలలు అడ్మిషన్లు నిరాకరిస్తున్నాయి. ఈ కారణంగానే ఏటా ఎంపికై న వారిలో సగం మంది కూడా ప్రవేశాలు పొందలేకపోతున్నారు. పార్వతీపురం రూరల్: ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) కింద ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థుల నుంచి అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారని, అటువంటి విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బి.రవికుమార్ డిమాండ్ చేశారు. చట్టం ప్రకారం 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఉచిత విద్య అందించాల్సి ఉన్నప్పటికీ, జిల్లాలోని కొన్ని పాఠశాలలు ట్యూషన్, అడ్మిషన్, యూనిఫాం, పుస్తకాల పేరుతో నగదు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. ఆర్టీఈ నిబంధనలపై తల్లిదండ్రులకు సరైన అవగాహన లేకపోవడాన్ని యాజమాన్యాలు ఆసరాగా చేసుకుంటున్నాయని రవికుమార్ పేర్కొన్నారు. విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాలల్లో విచారణ చేపట్టాలని, అక్రమంగా వసూలు చేసిన ఫీజులను తిరిగి చెల్లింపజేయాలని కోరారు. ప్రతి పాఠశాల నోటీసు బోర్డులో ఆర్టీఈ వివరాలను ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అమరావతి రాజధానిపై అసెంబ్లీ తీర్మానం అంతా డ్రామా అధికారంలోకి రామనే భయంతోనే అత్యవసర తీర్మానాలు రెండేళ్ల కూటమి పాలనలో అవినీతి, మోసం, మాయమాటలే.. అమరావతి పేరిట దోపిడీకి మాత్రమే వైఎస్సార్సీపీ వ్యతిరేకం రాజధాని నిర్మాణానికి జగన్మోహన్రెడ్డి అడ్డు చెప్పలేదు జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు పేద పిల్లలకు అందడం మిథ్యే.. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యాశాఖ పర్యవేక్షణ లేదన్న ఆరోపణలు -
కల్తీ ఆహారంపై అవగాహన
విజయనగరం: నగరంలోని ఫుడ్ సేఫ్టీ కార్యాలయంలో కల్తీ ఆహారాన్ని గుర్తించే విధానాలపై వినియోగదారుల సంఘ సభ్యులు, వలంటీర్ అసోసియేషన్ సభ్యులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. జిల్లా సహాయ ఆహార భద్రత నియంత్రణాధికారి ఎస్.ఈశ్వరి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న జిల్లా ఆహార భద్రత అధికారి పి.వెంకటరమణ మాట్లాడుతూ నిత్య జీవితంలో వినియోగించే పాలలో నీరు, యూరియా, స్టార్చ్, డిటర్జెంట్ వంటి హానిక పదార్ధాలు కలపబడే ప్రమాదాలపై వివరించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి స్వచ్ఛమైన ఆహారం అత్యవసరమన్నారు. ఇంటి వద్దే సులభమైన పరీక్షల ద్వారా పాలలో కల్తీని ఎలా గుర్తించవచ్చో సభ్యులకు వివరించారు. ఆహార పదార్ధాల్లో కల్తీకి పాల్పడితే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చికెన్, మటన్‌కు సంబంధించి ఫుడ్‌పై కలర్ కోటింగ్ వేయడం కూడా ఫుడ్ సేఫ్టీ ప్రకారం నేరమని స్పష్టం చేశారు. ఈ తరహా ఉల్లంఘనలు ఎక్కడైనా గమనిస్తే వెంటనే ఫుడ్ సేఫ్టీ శాఖ ఇన్స్పెక్టర్కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలని, లేదా వాట్సాప్ ద్వారా ఫొటోలు పంపాలని సూచించారు. ఆహార భద్రత అధికారి నాగుల్ మీరా ఆహార భద్రత చట్టాల ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కాప్కో జనరల్ సెక్రటరీ హెచ్.ఎస్.రామకృష్ణ, విజయనగరం జిల్లా వినియోగ సమాచార కేంద్రం ఇన్చార్జ్ చదలవాడ ప్రసాద్, సీడ్ వాలంటీర్ సంస్థ తరఫున విజయనిర్మల, జనార్దనరావు, ఎం.వి.ఆర్.రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆక్రమణదారులకు నోటీసుల గుబులు
● మున్సిపాలిటీల్లో చెరువుల ఆక్రమణపై సంయుక్త ఆపరేషన్ సాక్షి, పార్వతీపురం మన్యం : మున్సిపాలిటీల్లో చెరువు, బంద స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. పలువురికి నోటీసులు జారీ చేస్తున్నారు. ఇందుకోసం మున్సిపాలిటీ, పోలీస్, రెవెన్యూ శాఖలు సంయుక్త ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. దీంతో నిర్మాణదారుల్లో గుబులు మొదలైంది. సర్వే పూర్తి.. పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలు, పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని ప్రధాన చెరువులకు సంబంధించి ఇప్పటికే సర్వే ప్రక్రియ పూర్తి చేశారు. ఈ సర్వేలో గుర్తించిన ఆక్రమణదారులకు మొదటి విడత నోటీసులు జారీ చేశారు. నిబంధనల మేరకు ఆక్రమణదారులకు రెండో నోటీసు జారీ చేయాలని నిర్ణయించారు. నోటీసుల జారీ, సర్వే చేస్తున్నప్పుడు ఫొటో తీసుకుంటున్నారు. చట్టపరమైన ఇబ్బందులు కలగకుండా రిజిస్టర్ పోస్టులోనూ పంపించనున్నారు. క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, వారి మార్గదర్శకత్వంలో కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులకు తగు సూచనలు చేశారు. ఉపేక్షించేది లేదు.. : కలెక్టర్ చెరువులను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ ప్రభాకరరెడ్డి స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లోని జలవనరుల రక్షణ.. ఆక్రమణల గుర్తింపుపై శనివారం పాలకొండ సబ్ కలెక్టర్ స్వప్నిల్ జగన్నాథ్‌తో కలసి సాలూరు, పాలకొండ, పార్వతీపురం కమిషనర్లు, పట్టణ ప్రణాళిక విభాగ అధికారులతో ఆన్లైన్లో ఆయన సమీక్షించారు. మున్సిపాలిటీల పరిధిలోని చెరువుల పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చించారు. సర్వే పూర్తి చేసి, ఆక్రమణల గుర్తింపు ఇప్పటికే పూర్తయిందని అధికారులు వివరించారు. నిర్మాణదారుల్లో గుబులు పార్వతీపురం పట్టణంలో ప్రభుత్వ చెరువు స్థలాలు పెద్ద ఎత్తున ఆక్రమణకు గురయ్యాయి. వీటిపై దర్జాగా నిర్మాణాలు సాగించారు. ఇప్పుడు వారందరిలోనూ గుబులు మొదలైంది. బైపాస్ కాలనీ, నెల్లి చెరువు, ఇతర ప్రాంతాల్లోనూ నిర్మాణదారులకు నోటీసులు అందజేశారు. మరోవైపు రిటర్నింగ్ వాల్ పరిధిలోని ఇళ్లకు సైతం నోటీసులు జారీ చేయడంతో నివాసితులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ పలువురి ప్రముఖుల ఇళ్ల నిర్మాణాలూ ఉన్నాయి. తరతరాలుగా నివాసం ఉంటున్న వారిపై నోటీసుల అస్త్రం ప్రయోగించడంతో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలో రిటర్నింగ్ వాల్ కట్టి సురక్షితం చేసిన నివాసాలకూ నోటీసులు అందిస్తుండటంతో ప్రభుత్వ తీరుపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
చిన్నారికి పెద్ద కష్టం
● అవసరమైన సాయం చేయండి.. ● బోన్ కేన్సర్‌తో బాధపడుతున్న వైష్ణవి ● వైద్యం చేయించేందుకు దాతల కోసం ఎదురుచూపురాజాం సిటీ: తమలా పిల్లలు కష్టపడకూడదని ఆ తల్లిదండ్రులు ఆశ పడ్డారు. వారు కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటున్నారు. ఇద్దరు పిల్లల్లో పెద్దదైన కుమార్తె పదో తరగతి చదువుతుంది. పరీక్షలు దగ్గర పడుతుండడంతో కష్టపడి చదివి మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని అనుకున్న ఆమె ఒక్కసారిగా అనారోగ్యానికి గురైంది. పరీక్షలపై బెంగ అనుకున్న ఆ తల్లిదండ్రులు ఆస్పత్రిలో చూపిస్తే అనుకోని విధంగా రోగమొచ్చిందని కుమిలిపోయారు. నయం అవుతుందేమోనని తమ స్థోమతకు మించిన అప్పులు చేసి విశాఖపట్నం ఆస్పత్రికి తరలించి మరిన్ని పరీక్షలు చేయించారు. అక్కడ చిన్నారికి బోన్‌మారో కేన్సర్ అని తెలియడంతో విలవిలాడిపోయారు. చిన్నారి వైద్యానికి రూ.లక్షల మేర ఖర్చు అవుతుందని వైద్యులు తెలపడంతో ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటు దాతల దాతృత్వం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బొద్దాం గ్రామానికి చెందిన పత్తిరి వైష్ణవి అనే చిన్నారి బోన్‌మారో కేన్సర్ బారిన పడింది. ఇటీవల అనారోగ్యానికి గురవడంతో తల్లిదండ్రులు రాజాంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సనందించి విశాఖపట్నం తరలించారు. అక్కడ క్యూ1 ఆస్పత్రిలో అన్ని పరీక్షలు అనంతరం చిన్నారి వైష్ణవికి బోన్‌మారో కేన్సర్ ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. అక్కడ అస్పత్రిలో రోజువారీ చికిత్స నిమిత్తం చిన్నారిని జాయిన్ చేసి వైద్యం కోసం ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా చిన్నారి తల్లిదండ్రులు పత్తిరి ధనలక్ష్మి, శివ రోజువారీ వ్యవసాయ కూలీలు. ఏదో ఒక పని చేసుకుని జీవనం సాగించే ఈ కుటుంబంలో వైష్ణవి బోన్ కేన్సర్ బారిన పడడం గండంగా మారింది. జీవనోపాధి లేక తల్లడిల్లుతున్న ఆ కుటుంబం తన కుమార్తె ప్రాణాలు కాపాడుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ఈ వైద్య ఖర్చులు నిమిత్తం రూ.20లక్షలు అవసరం ఉండడంతో వైద్యం చేయించలేక దాతల సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. తమ కుమార్తెకు ప్రాణభిక్ష పెట్టాలని దాతలను వేడుకుంటున్నారు. పదో తరగతి పరీక్షలు రాయాల్సి ఉండగా.. చిన్నారి వైష్ణవి బొద్దాం జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదివింది. ప్రస్తుతం జరుగుతున్న పదో తరగతి పరీక్షలు ఆమె రాయాల్సి ఉండగా బోన్‌మారో కేన్సర్ వ్యాధి సోకడంతో పరీక్షలకు దూరమైంది. వైష్ణవిని ఉన్నత చదువులు చదివించి మంచి జీవితాన్ని ఇద్దామని ఆశపడిన తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది. చదువు విషయం పక్కన పెడితే తమ కుమార్తె ప్రాణాలతో ఉంటే చాలని దేవుళ్లను వేడుకుంటున్నారు. దాతలు ముందుకు వచ్చి తమ చిన్నారికి ప్రాణభిక్ష పెట్టాలని, ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు. ఆర్థిక సాయం చేయదలచిన వారు 9618897442 నంబరుకు సాయమందించాలని కోరుతున్నారు. -
పార్వతీపురం సుందరీకరణకు శ్రీకారం
పార్వతీపురం రూరల్ : పర్యావరణ హితమే లక్ష్యంగా పార్వతీపురం నగర సుందరీకరణ పనులకు జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం గెడ్డ వీధి కాలువ వంతెన సమీపంలోని ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం కాలువ వంతెన అంచున (ఎడ్జ్ భాగంలో) కొబ్బరి మొక్కలను నాటారు. సోమవారం నుంచి వంతెన రెండో వైపు కూడా మొక్కలు నాటే పనులు కొనసాగనున్నాయి. పట్టణంలోని ప్రధాన రహదారుల మధ్య గల డివైడర్లలో ఆకర్షణీయమైన ‘బోగన్ విల్లియా’ మొక్కలను ఏర్పాటు చేయనున్నట్టు కలెక్టర్ వెల్లడించారు. కార్యక్రమంలో సబ్–కలెక్టర్ వైశాలి, పార్వతీపురం, పాలకొండ, సాలూరు మున్సిపల్ కమిషనర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
చంద్రబాబువి డైవర్షన్ పాలిట్రిక్స్
విజయనగరం: కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబువన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అని, అమరావతి రాజధానిపై అత్యవసర సమావేశం పెట్టి తీర్మానం చేయడమంతా డ్రామా అంటూ విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. కేంద్రంలో భాగస్వామ్య పార్టీగా చెప్పుకుంటున్నా అభివృద్ధి చేయడంలో అలసత్వం ఎందుకుని ప్రశ్నించారు. విజయనగరం జెడ్పీ కార్యాలయ ప్రాంగణంలో శఽనివారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పాలనపై దుమ్మెత్తిపోశారు. గడిచిన రెండేళ్లలో అమరావతి రాజధాని పేరిట అవినీతికి పాల్పడడం, అక్కడి రైతులను మోసం చేయడం, ఆంధ్రరాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ పబ్బంగడుపుకోవడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే 2028 చివరికి అమరావతి రాజ ధాని నిర్మాణాన్ని పూర్తిచేసి అక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తామని గొప్పలు చెప్పిన చంద్రబాబు నేడు అత్యవసర సమావేశం పెట్టి తీర్మానం చేయడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ అసమర్ధపాలనను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి అత్యవసర తీర్మానాలు చేస్తున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్న చంద్రబాబును ఇప్పుడు ఎవరు అడ్డుకుంటారని, రాజధాని నిర్మాణానికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వికేంద్రీకరణ చేస్తామన్నారే తప్ప రాజధానిగా అమరావతిని వ్యతిరేకించలేదన్న విష యం గుర్తెరగాలన్నారు. కూటమి ప్రభుత్వం తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సా ర్సీపీపై దుష్ఫ్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. అమరావతి పేరిట దోపిడీని వ్యతిరేకిస్తాం.. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలిచే వైఎస్సార్సీపీ అమరావతిగా రాజధాని నిర్ణయానికి వ్యతిరేకం కాదని, కేవలం చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అవినీతి, దోపిడీని మాత్రమే ఎత్తిచూపుతున్నట్టు మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సుమారు ఎకరాకు రూ.2కోట్ల చొప్పున అభివృద్ధికి ఖర్చు అవుతుందని, ఇలా 50వేల ఎకరాల భూమిని అభివృద్ధి చేయాలంటే రూ.లక్ష నుంచి రూ.2లక్షల కోట్ల వరకు ఖర్చు అవుతుందన్నారు. ప్రస్తుతం రోజువారి పాలనకే అప్పులు చేస్తోన్న ప్రభుత్వం, ఇంత ఖర్చు ఎలా భరిస్తోందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం మాయమాటల చెప్పి ప్రజలను మోసం చేసేందుకు ఇటువంటి తీర్మానాలు చేస్తున్నారన్నారు. రెండేళ్ల చంద్రబాబు పాలనలో అమరావతి పేరుచెప్పి రూ.47వేల కోట్ల అప్పులు తెచ్చి అవినీతి కార్యక్రమాలు చేపట్టారే తప్ప అభివృద్ధి చేయలేదని, తాజాగా అమరావతి రాజధాని అంటూ డైవర్షన్ డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణ పనులు చూస్తున్న మంత్రితో ముఖ్యమంత్రి చేసిన సమీక్షలో ఇదే విషయం తేటతెల్లమైందన్నారు. ప్రజలంతా గమనిస్తున్నారని, రెండేళ్లుగా మాటలు తప్ప చేతలు లేవని విమర్శించారు. అమరావతిలో ఒలింపిక్స్ పోటీలు నిర్వహిస్తామని, బుల్లెట్ ట్రైన్లు నడుపుతామని, ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని, మరో 50వేల ఎకరాలు భూసేకరణ చేయాలంటూ మాయమాటలు చెప్పడం తప్ప భూములిచ్చిన రైతులకు ఒక్కఫ్లాట్ ఇవ్వని దుర్భర స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. 2029 సంవత్సరంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరల అధికారంలోకి రాలేమన్న భయంతో చంద్రబాబు ప్రభుత్వం అభద్రతా భావంతో రాజధానిగా అమరావతి తీర్మానం చేసిందని మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజధాని అమరావతిలో ఇప్పటికే సొంత ఇళ్లు కట్టు కుని ఉంటున్నారన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. కేవలం సాధ్యంకాని హామీ లు ఇస్తూ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారన్నారు. కేవలం అవినీతి తప్ప రాష్ట్రంలో అభివృద్ధి లేదన్నారు. వైఎస్సార్సీపీపై నిందలు మోప డం తప్ప ప్రభుత్వం చెప్పిన హైటెక్ మాటలు, సింగపూర్ డిజైన్లు సాధ్యంకానివని చెప్పారు. రెండేళ్ల ప్రభుత్వ అసమర్ధ, అవినీతి పాలనను ప్రజలంతా గమనిస్తున్నారని, ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు తాము చేశామంటూ గొప్పలు చెప్పుకోవడం మినహా కొత్త అభివృద్ధి లేదన్నారు. నిత్యవసరాల ధరలు పెరిగిపోయాయని, గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, చివరికి కర్రల పొయ్యిపై వంటలు చేసుకోవాలన్నా వాటి ఖరీదు ఆకాశన్నంటుతోందన్నారు. రైతాంగం పడుతున్న ఇబ్బందులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభు త్వం తీరుమార్చుకోకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. -
బహుముఖ ప్రజ్ఞాశాలి ‘పుట్టపర్తి’
● జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్విజయనగరం: బహుముఖ ప్రజ్ఞాశాలి పుట్టపర్తి నారాయణాచార్యులు జీవితం నేటి యువతకు ఆదర్శమని, బహుభాషలలో ప్రావీణ్యం సంపాదించిన యువతకు అవకాశాలు మెండుగా ఉంటాయని జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ తెలిపారు. తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు బహుబాషా కోవిదుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతిని కలెక్టరేట్ కార్యాలయ ఆడిటోరియంలో శనివారం నిర్వహించారు. ముందుగా నారాయణాచార్యులు చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణాచార్యులు తెలుగు సాహితీ రంగానికి చేసిన కృషి అమోఘమని తెలిపారు. చిన్న వయసులోనే భారతం, భాగవతం, పురాణాలతో పాటు సంగీతం కూడా నేర్చుకున్నారని, సంగీతం, సాహిత్యం, నాట్య రంగాలలో రాణించటంతో పాటు తుళు, ఫ్రెంచి, పర్షియన్ లాంటి 14 భాషలు నేర్చుకున్నారని, పాలీ (బౌద్ధ, జైన సాహిత్యాలు) భాషలో మంచి ప్రావీణ్యం సాధించినట్టు గుర్తు చేశారు. పలు భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన ఆయన వధీ భాష నుంచి తులసీదాస్ రామాయణం, బ్రజ్ భాష నుంచి సూరదాస్, రసఖాన్ మొదలైన వారి రచనలతో పాటు ఆనేక ప్రసిద్ధ తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, ఉర్దూ, సంస్కృతం కావ్యాలను తెలుగులోనికి అనువదించారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సి.హెచ్.సత్తిబాబు, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి దేవి ప్రసాద్, సెట్విజ్ సీఈఓ వి.విశ్వేశ్వరరావు, సెట్విజ్ మేనేజరు కె.వెంకటరమణ, సూపరింటెండెంట్ కె.అక్కారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
బిల్లుమడ పొలాల్లో సంచరిస్తున్న ఏనుగులు
భామిని: మండలంలోని బిల్లుమడ పంట పొలాల్లో ఏనుగులు గుంపు ప్రవేశించింది. బిల్లుమడ – నేరడి మధ్య మొక్కజొన్న పొలాల్లో ఏనుగులు ప్రవేశించి ధ్వంసం చేశాయి. ఆహారం కోసం పొలాల్లోకి వచ్చి ధ్వంసం చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి పూట సమీపంలోని వంశధార నదిలో దిగి జలకాలాడుతున్నాయి. రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం బొండపల్లి: మండలంలోని గరుడుబిల్లి రైల్వే పట్టాలను దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ప్రమాదానికి సంబంధించి బొబ్బిలి జీఆర్పీ హెచ్‌సీ బి.ఈశ్వరరావు తెలిపిన వివరాలు.. మండలంలోని నెలివాడ గ్రామానికి చెందిన ఈర్లి శ్రీరాములు(55) గరుడుబిల్లి వద్ద రైలు ట్రాకును దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందినట్టు తెలిపారు. ఈ మేరకు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం జిల్లా కేంద్రంలోని సర్వజన ఆస్పత్రికి తరలించగా మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. అండర్– 19 క్రికెట్ జట్టు ఎంపికలు రేపు విజయనగరం: అండర్ – 19 బాలుర జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు ఈ నెల 29న నిర్వహించనున్నట్టు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పి.సీతారామరాజు (రాంబాబు) శుక్రవారం తెలిపారు. జిల్లా కేంద్రం శివారు బాబామెట్ట విజ్జి స్టేడియంలో ఆదివారం ఉదయం 7.30 గంటలకు ఎంపికలు నిర్వహిస్తామని తెలిపారు. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు 2007 సెప్టెంబర్ 1 తర్వాత జన్మించిన వారై ఉండాలని పేర్కొన్నారు. క్రీడాకారులు వారి సొంత క్రికెట్ కిట్టు, ఒరిజినల్ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్స్ తీసుకు రావాలని సూచించారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తెలుపు రంగు దుస్తులు ధరించి రావాలని తెలిపారు. సాలూరు: పట్టణంలోని బైపాస్ రోడ్డు వద్ద గురువారం అర్ధరాత్రి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసా ద్, సీఐ అప్పలనాయుడు తదితరుల ఆధ్వర్యంలో బస్సుల ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి సాలూరు మీదుగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులను పోలీస్, రవాణా, అగ్నిమాపక శాఖ అధికారులు ఉమ్మడి తనిఖీలు నిర్వహించారు. బస్సుల్లో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్నిమాపక యంత్రాల లభ్య త, అత్యవసర ద్వారాల పనితీరును అధికారులు తనిఖీ చేశారు. బస్సుల పర్మిట్లు, ఫిట్నెస్ సర్టిఫికె ట్లు, ఇన్సూరెన్స్ పత్రాలతో పాటు డ్రైవర్ల లైసెన్సుల ను రవాణా శాఖ అధికారులు పరిశీలించారు. బస్సు ల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం, అక్రమంగా సరుకు రవాణా తదితర అంశాలపై పోలీస్‌లు తనిఖీలు చేశారు. నిబంధనలు అతిక్రమించే ట్రావెల్స్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీతానగరం: మండలంలోని లచ్చయ్యపేట గ్రా మ కళ్లాల్లో పశువుల మేత కోసం ఉంచిన వరి గడ్డికుప్పలు శుక్రవారం జరిగిన అగ్ని ప్రమా దంలో దగ్ధమయ్యాయి. డి.కృష్ణంనాయుడు, పి.గోపినాయుడు, ఆర్లి గోపినాయుడుకు చెంది న గడ్డికుప్పలు కాలిపోయాయి. స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని గడ్డికుప్పల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. -
నేటి నుంచి విలేకరులకు ఆరోగ్య పరీక్షలు
విజయనగరం: జిల్లాలోని అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఈ నెల 28 నుంచి ప్రత్యేక ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు పి.గోవిందరాజులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. పరీక్షల వివరాలు ఈ నెల 28వ తేదీ నుంచి విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని తిరుమల మెడికవర్ ఆస్పత్రిలో బ్యాచ్‌ల వారీగా ఈ పరీక్షలు జరుగుతాయి. ఇందులో భాగంగా బీపీ, షుగర్, ఈసీజీ, 2డీ ఎకో (గుండె సంబంధిత), కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ) వంటి కీలక పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైన వారికి జనరల్ ఫిజిషియన్, కార్డియాలజిస్ట్, న్యూరో, ఆర్థో, గ్యాస్ట్రో నిపుణుల ద్వారా తనిఖీలు చేయిస్తారు. వైద్య పరీక్షలకు హాజరు కావాలనుకునే జర్నలిస్టులు తమ పేరు, పని చేస్తున్న పత్రిక, అక్రిడిటేషన్ నంబరుతో పాటు, కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను సమాచార శాఖ కార్యాలయంలో అందజేయాలని కోరారు. ఈ నెల 28వ తేదీలోపు 9553147746 , 9441285176, 9491616264 నంబర్లకు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పేర్లు నమోదు చేసుకున్న వారు, వారికి కేటాయించిన తేదీల్లో మాత్రమే ఆస్పత్రికి హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. మీడియా మిత్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని పి.గోవిందరాజులు విజ్ఞప్తి చేశారు. -
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
రాజాం సిటీ: మండల పరిధి పొగిరి గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు.. శ్రీకాకుళం నుంచి రాజాం వస్తున్న ఆటోను వెనుక నుంచి వస్తున్న బొలెరో వాహనం పొగిరి సమీపంలో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తా పడగా అందులో ప్రయాణిస్తున్న డి.శశిభూషణ్, కె.మంగలతో పాటు మరో ఇద్దరు గాయాల పాలయ్యారు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను రాజాం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి చికిత్సనందించారు. ఈ ఘటనకు సంబంధించి ఇంత వరకు తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి : ఎస్టీయూ
విజయనగరం అర్బన్: సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని అమలు చేయాలని ఎస్టీయూ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. మినిమం టైమ్ స్కేల్ (ఎంటీఎస్) విధానంలో పని చేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలపై విస్తృతంగా చర్చించారు. స్థానిక అమర్ భవన్లో శుక్రవారం ఎస్టీయూ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు వై.అప్పారావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎంటీఎస్ ఉపాధ్యాయులకు తక్షణమే ఆరోగ్య భద్రత కల్పించాలని ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సమావేశం ద్వారా డిమాండ్ చేశారు. అదే విధంగా సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని అమలు చేస్తూ మిగిలిన ఉపాధ్యాయులతో సమానంగా అన్ని సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగంలో చేరిన తేదీ నుంచి సీనియారిటీని గుర్తిస్తూ అగ్నివేర్ పథకం మాదిరిగా రిటైర్మెంట్ ప్రయోజనాలను సింగిల్ సెటిల్మెంట్ రూపంలో అందించాలని పూర్తి స్థాయి ఉద్యోగ భద్రత కల్పిస్తూ 12 నెలల పూర్తి వేతనం చెల్లించాలని సమావేశం కోరింది. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్యామ్, రాష్ట్ర కౌన్సిలర్ వి.గోవిందరావు, జిల్లా ఆర్థిక కార్యదర్శి శ్రీనివాస్‌దొర, ఎంటీఎస్ నాయకులు టి.రామారావు, గోపీనాధ్, శ్రీనివాసరావు, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
ధర్మ చైతన్య శంఖారావం
పార్వతీపురం రూరల్: ఉత్తరాంధ్రలో ఆధ్యాత్మిక చైతన్యం, సామాజిక ఐక్యతే లక్ష్యంగా ‘శ్రీరామ గ్రామ జాగృతి యాత్ర’ శుక్రవారం ప్రారంభమైంది. పార్వతీపురం జిల్లా కేంద్రంలోని శ్రీ విద్యా సర్వమంగళ దేవి పీఠంలో శ్రీరామనవమి వేడుకల అనంతరం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర దంపతులు యాత్ర ప్రచార రథాన్ని ప్రారంభించి, లోగోను ముఖ్య అతిథులు యిండుపూరు గున్నేశ్వరరావు, బెలగాం జయప్రకాష్ నారాయణ తదితరులతో కలసి కాళిదాసు శర్మ యాజీ నేతృత్వంలో ఆవిష్కరించారు. ఈ ఉద్యమంలో భాగంగా ‘రామ స్థూప నిర్మాణ మహాసంకల్పాన్ని’ చేపట్టినట్టు ఆధ్యాత్మిక మార్గదర్శకులు కాళిదాసు శర్మ యాజి తెలిపారు. ‘ఒక గ్రామం – ఒక రాయి’ నినాదంతో రాష్ట్రంలోని వివిధ గ్రామాల నుంచి భక్తుల భాగస్వామ్యంతో శిలలను సేకరించి రామ స్థూపాన్ని నిర్మించనున్నట్టు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ధర్మ ప్రచారం, యువతలో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ప్రజల్లో చైతన్యం నింపాలని మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర ఆకాంక్షించారు. ఈ యాత్రను తొలుత మన్యం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో నిర్వహించి, అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర మాట్లాడుతూ కేవలం సాంప్రదాయాలకు విలువనిస్తూ లోక కల్యానార్ధం రాజకీయాలకు అతీతంగా చేపట్టిన ఈ కార్యక్రమం శ్రీరాముని భక్తుల్లో మరింత ఆత్మ విశ్వాసాన్ని నింపాలని ఆకాంక్షించారు. ఇప్పటికే తమ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని తెలుసుకున్నారని.. ఆయన కూడా కార్యక్రమంలో తన వంతు భాగస్వాములు అవుతారని తెలిపారు. మరికొద్ది రోజుల్లో జగన్మోహన్రెడ్డిని కలసి పూర్తి వివరాలను కాళిదాసు శర్మతో కలసి వివరిస్తున్నట్టు రాజన్నదొర తెలిపారు. రామ రాజ్య గ్రామోద్యమానికి అంకురార్పణ ‘ఒక గ్రామం – ఒక రాయి’ సంకల్పంతో రామ స్థూప నిర్మాణం మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర, కాళిదాసు శర్మ -
రామాలయ నిర్మాణానికి స్థల వితరణ
వేపాడ: సొంతూరు రుణం తీర్చుకోవాలన్న వారి కల రామాలయ నిర్మాణానికి స్థలం వితరణగా అందజేయడం ద్వారా తీర్చుకున్నారు. పలువురికి ఆదర్శంగా నిలిచారు. వేపాడ మండలం సోంపురం గ్రామ సర్పంచ్ మురిపిండి గంగరాజు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన దివంగత తల్లావఝుల రామజోగినరసింహం, పార్వతీ దంపతుల జ్ఞాపకార్ధం వారి కుమారులు వరహానరసింహామూర్తి, రాధాకృష్ణ, పురుషోత్తం, విజయగోపాలం, కుమార్తె లక్ష్మి జన ఐదుగురు తమకు వారసత్వంగా దఖలు పడిన 16 సెంట్లు(రూ.50లక్షల విలువైన) స్థలాన్ని గ్రామంలో రామాలయ ప్రాంగణానికి వినియోగించేలా వితరణగా అందజేశారు. వీరంతా కొల్కత్తా, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో స్థిరపడడంతో జన్మనిచ్చిన ఊరికి రుణం తీర్చుకోవాలన్న ఆశయంతో స్థలాన్ని వితరణంగా అందజేశారని సర్పంచ్ గంగరాజు, ఎంపీటీసీ సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు వితరణ స్థలంలో శిలాఫలకం ఏర్పాటు చేసి శుక్రవారం ఆవిష్కరించారు. -
మోసపోతున్న మొక్కజొన్న రైతులు
● రైతుల గోడు పట్టని చంద్రబాబు ● కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం ● 45,590 హెక్టార్లలో సాగైన మొక్కజొన్న మెరకముడిదాం: ఆరుగాలాలు పాటూ శ్రమించి, చెమటోడ్చి పండించిన పంట చేతికొచ్చింది. ఇక అమ్ముకుందామనేసరికి ధర తగ్గిపోతే ఆ రైతులు ఆవేదన వర్ణానాతీతంగా వుంటుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలో మొక్కజొన్న పంట పెరుగుతూ వస్తుంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న పంట 45,590 హెక్టార్లలో రైతులు సాగు చేశారు. ఇప్పుడు ఈ పంట రైతులు చేతికి వస్తుంది. ఎన్నో అవరోధాలను దాటుకొని పంటను సాగు చేసిన రైతులు తమ పంటకు మంచి ధర పలుకుతుందన్న ఆశలు అడియాశలుగానే మిగిలాయి. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న పంటకు క్వింటాకు రూ.2,400 లను మద్దతు ధరగా ప్రకటించింది. మద్దతు ధర బాగానే వుందని తమ పంటను అమ్మకుందామని ఆశపడ్డ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చుక్కలు చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మొక్కజొన్న కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి వుండగా ఇంతవరకూ జిల్లా వ్యాప్తంగా ఒక్కమొక్కజొన్న కేంద్రాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. దీంతో కేంద్రం ప్రకటించిన మద్దతు ధర తమకు ఇప్పట్లో దక్కేటట్టు లేకపోవడంతో పాటూ వాతావరణంలో మార్పులు రావడంతో ఏ సమయంలో వర్షం కురిస్తే కష్టపడి పండించిన పంట మొత్తం వర్షార్పణం అవుతుందేమోనని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీంతో కొందరు రైతులు దళారులకు క్వింటా 17 వందల నుంచి 18 వందలలోపు అమ్మకాలు జరుపుతున్నారు. దీంతో క్వింటాకు రూ.600ల వరకూ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. హెక్టారుకు సుమారు 44 వేల రూపాయలు వరకూ నష్టపోతున్నామని రైతులు లబోదిబోమంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 3లక్షల 37 వేల మెట్రిక్ టన్నులు మొక్కజొన్న పండుతుందంటే రూ.లక్షల్లో రైతులు నష్టాలను భరించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం మొక్కజొన్న కేంద్రాలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వానికి నివేదించాం.. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. – రామారావు, వ్యవసాయ శాఖ జేడీ, విజయనగరం చిన్నచూపు సరికాదు.. రైతులపై చంద్రబాబు ప్రభుత్వం చిన్నచూపు చూడడం సరికాదు. మొక్కజొన్న కొనుగోలుకు ఒక్క కేంద్రం కూడా ఏర్పాటు చేయకపోవడం ఎంత వరకు సమంజసం. రైతులు ఎలా విక్రయిస్తారు. ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. దిక్కుతోచని పరిస్థితిలో రైతులు క్వింటా మొక్కజొన్నను రూ.1700లకు విక్రయిస్తున్నారు. దీంతో రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి క్వింటా రూ.2400లకు కొనుగోలు చేయాలి. – శిరువూరు సీతారామరాజు, ఎంపీటీసీ, సోమలింగాపురం -
మిట్టల్ ప్లాంట్‌తో లక్ష ఉద్యోగాలు బూటకం
● విశాఖ ఉక్కును బలహీనపరిచే కుట్ర ● ప్రభుత్వం నిధులు కేటాయించి బలోపేతం చేయాలి : సీపీఎం విజయనగరం గంటస్తంభం: నక్కపల్లి వద్ద మిట్టల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్ ద్వారా లక్ష ఉద్యోగాలు వస్తాయనే ప్రచారం పూర్తిగా అసత్యమని సీపీఎం జిల్లా కార్యదర్మి తమ్మినేని సూర్యనారాయణ పేర్కొన్నారు. స్థానిక ఎల్బీజీ భవన్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నక్కపల్లి స్టీల్ ఫ్లాంట్ నిర్మాణం విశాఖ ఉక్కు పరిశ్రమను నిర్వీర్యం చేయడానికి చేస్తున్న చర్యగా కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. 8.3 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న ప్లాంట్ ద్వారా లక్ష ఉద్యోగాలు వస్తాయని కూటమి ఎమ్మెల్యేలు చెప్పడం ఒట్టి బూటకం అని విమర్మించారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమలో 7.2 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతుండగా, సుమారు 15 వేల మంది మాత్రమే పని చేస్తున్నారని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో నక్కపల్లి ప్లాంట్ ద్వారా లక్ష ఉద్యోగాలు వస్తాయని చెప్పడం వాస్తవానికి దూరమన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు అవసరమైన నిధులు, మౌలిక వసతులు కేటాయిస్తే మరిన్ని ఉద్యోగాలు సృష్టించవచ్చని సూచించారు. కానీ ప్రభుత్వాలు కావాలనే నిర్లక్ష్యం చూపుతూ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నాయని విమర్మించారు. అంతేకాకుండా విశాఖ ఉక్కు పరిశ్రమకు వెళ్లాల్సిన నీటిని మిట్టల్ ప్లాంట్‌కు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికే ఐదేళ్లుగా కార్మికులు, ప్రజా సంఘాలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ప్రభుత్వ ఆస్తులను రూ.25వేల కోట్ల విలువతో ప్రైవేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు కూడా అమలు కావడం లేదని తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమను బలోపేతం చేయడానికి తక్షణమే నిధులు కేటాయించాలని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా నాయకులు రెడ్డి శంకరరావు, టి.వి.రమణ పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే అశోక్ వ్యాఖ్యలపై నిరసన
● ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి అశోక్ కురుపాం: ఆదివాసీ గిరిజన నాయకులు, ప్రజలను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన ప్రభుత్వ విప్, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ తక్షణమే తన పదవికి రాజీనామా చేసి గిరిజనులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఏపీ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎ.అశోక్ డిమాండ్ చేశారు. టెకరకండి గ్రామం వద్ద మన్యం జిల్లా ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. నిరసనలో పాల్గొన్న వారు ఎమ్మెల్యే అశోక్ వ్యాఖ్యలను ఖండిస్తూ నినదించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దని వినతిపత్రం ఇవ్వడానికి ఆదివాసీ గిరిజన జేఏసీ ప్రతినిధులు ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లిన సందర్భంగా వారిపై ఎమ్మెల్యే అసభ్య పదజాలంలో మండిపడ్డారని ఇది సరికాదన్నారు. ప్రజల సమస్యలు వినాల్సిన ఎమ్మెల్యే అందుకు విరుద్ధంగా వ్యవహరించడం అత్యంత దురదృష్టకరమన్నారు. ఆయన వ్యాఖ్యలు గిరిజన సమాజాన్ని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తన పదవిలో కొనసాగే హక్కు కోల్పోయారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అశోక్ వెంటనే రాజీనామా చేసి గిరిజన నాయకులు, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై భవిష్యత్‌లో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. నిరసనలో గిరిజన, ప్రజా సంఘాల నాయకులు ఎస్.అప్పారావు, లక్ష్మణరావు, సన్యాసిరావు, ఎం.రమణ, సీతారాం, మండంగి శ్రీను, కె.గంగునాయుడు, ఎన్వై నాయుడు, ఇందిర, పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. -
గ్యాస్ బుకింగ్‌లో ఏజెన్సీ కిరికిరి
పూసపాటిరేగ : మండల కేంద్రమైన పూసపాటిరేగలో హెచ్‌పీ గ్యాస్ బుకింగ్‌లో ఏజెన్సీ అవకతవకలకు పాల్పడుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లిమర్ల గాయిత్రి గ్యాస్ ఏజెన్సీ పేరిట గ్యాస్ బుకింగ్ చేసుకున్న లబ్ధిదారులకు గ్యాస్ బుకింగ్ తేదీతో పాటు ఓటీపీ వచ్చినా గ్యాస్ సరఫరా చేయడం లేదు. వినియోగదారులు నంబరుతో గ్యాస్ బుక్ చేసిన తరువాత ఓటీపీ వచ్చి గ్యాస్ బుక్ అయినట్లు వినియోగదారులకు మేసేజ్ వచ్చినప్పటికీ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పూసపాటిరేగ మండల పరిధిలో వందల సంఖ్యలో వినియోగదారులు గ్యాస్ బుక్ చేసినప్పటికి గ్యాస్ సరఫరా కాకపోవడంతో పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. గ్యాస్ బుకింగ్ చేసిన వినియోగదారులకు సరఫరా ఎగ్గొట్టి గ్యాస్ పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లిమర్ల గాయిత్రి గ్యాస్ ఏజెన్సీ పరిధిలో సుమారు 50 వేల కనెక్షన్లు వున్నాయి. వాటి పరిధిలో పూసపాటిరేగ, డెంకాడ, నెల్లిమర్ల మండలాలు వున్నాయి. జిల్లాలోనే అత్యధికంగా గ్యాస్ కనెక్షన్లు ఇక్కడ వున్నప్పటికి సరఫరా సక్రమంగా జరగడం లేదనే ఆరోపణలు వున్నాయి. పూసపాటిరేగకు చెందిన కోరాడ రమా వినియోగదారుని నంబరు 651205 కు ఈ నెల 24వ తేదీన గ్యాస్ బుక్ చేశారు. బుక్ అయినట్టు ఓటీపీ 6375 అనే నంబరు మెసేజి వచ్చింది. ఇదే మాదిరిగా పూసపాటిరేగ కారిపివాని కల్లాలకు చెందిన కారిపి లక్ష్మినాయుడు వినియోగదారుని నంబరు 627181 అనే నెంబరు ద్వారా ఈ నెల 24న గ్యాస్ బుక్ చేశారు. ఓటీపీ 1584గా వచ్చింది. నక్కానపేటకు చెందిన కోండ్రు రాములమ్మ వినియోగదారుని నంబరు 647878 ద్వారా బుక్ చేయగా ఓటీపీ 9358గా వచ్చింది. అయితే ఇంతవరకు బాగానే వున్నా బుకింగ్ చేసుకున్న గ్యాస్ వినియోగదారుడు గ్యాస్ కార్యాలయానికి వెళ్లగా బుకింగ్ కాలేదని నిర్వాహకులు బదులు ఇవ్వడంతో నిరాశతో వెనుదిరుగుతున్న పరిస్థితి. ఇదే మాదిరి వందల సంఖ్యలో లబ్ధిదారులు గ్యాస్ బుక్ చేసుకున్నా బుక్ కాలేదని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు చెప్పడంతో తప్పని పరిస్థితిలో ఉసురుమంటూ వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. సదరు గ్యాస్ ఏజెన్సీ గ్యాస్ స్టాక్ పూసపాటిరేగలో ఓ ప్రభుత్వ స్థలంలో లారీలు నిలుపుదల చేసి విక్రయాలు చేయడంతో పలు అనుమానాలను వినియోగదారులు వ్యక్తం చేస్తున్నారు. అనుమతి లేని చోట గ్యాస్ వుంచి విక్రయాలు చేయడంతో ఎటువంటి ప్రమాదాలు జరిగినా ఎవరు బాధ్యులు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అసలు గ్యాస్ స్టాక్ పాయింట్ ఎక్కడ అనే విషయమై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. దీనిపై జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మురళినాధ్ వద్ద సాక్షి ప్రస్తావించగా దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం అన్నారు. గ్యాస్ బుక్ అయినట్లయితే గ్యాస్ సరఫరా జరుగుతుందని చెప్పారు. గ్యాస్ బుక్ చేసినా కాలేదని బదులిస్తున్న నిర్వాహకులు నిరాశతో వెనుదిరుగుతున్న వినియోగదారులు గ్యాస్ పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయని నిర్వాహకులు -
సీతారాముల కల్యాణం
శనివారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2026కమనీయం.. గరుగుబిల్లి: మంగళవాయిద్యాలు.. భక్తుల జయజయధ్వానాలు.. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ తోటపల్లి కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం సీతారాముల కల్యాణం కమనీయంగా సాగింది. ఆలయ ప్రాంగణం జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగింది. వేంకటేశ్వరస్వామి, కోదండరామస్వామి వారి దేవస్థానాల్లో ఉదయం సుప్రభాతసేవ, ఆరాధన, మంగళాశాసనం, విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రుత్విక్ వరుణం, మత్సగ్రహణం, అంకురారోపణం, తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఉభయ ఆలయాల్లో స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. ఆలయ అర్చకులు వి.వి.అప్పలాచార్యులు, ఎం.రామకష్ణ శర్మలు అభిజిత్‌లగ్నంలో సీతారామస్వామి కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు. కల్యాణ ఘట్టాన్ని తిలకించిన భక్తులు మురిసిపోయారు. స్వామివార్లకు పూజా సామగ్రి, పట్టువస్త్రాలను దాతలు సమకుర్చారు. భక్తులకు పానకం, వడపప్పు, పులిహోర ప్రసాదాలను పంచిపెట్టారు. అన్నప్రసాదాన్ని వడ్డించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఈఓ బి.శ్రీనివాస్, ఆలయ చైర్మన్ ఎం.పకీరునాయుడు, కమిటీ సభ్యులు సేవలందించారు. సాయంత్రం స్వామివారి పట్టాభిషేకం జరిపించారు. -
అమ్మో.. అతి!
● ఇదేం పద్ధతి ● వాపోతున్న ‘తమ్ముళ్లు’ ● అధికార దర్పంతో టీడీపీ మహిళా నేత దూకుడు ● అధికారులకూ ‘ఆదేశాలు’ సాక్షి, పార్వతీపురం మన్యం: పేరుకు జిల్లా తెలుగుదేశంలో ఓ పదవి.. దానికి తోడు ఉందో, లేదో తెలియనంతగా ఒక చిన్న పోస్టు! ఇది జనంలోనే కాదు.. సొంత పార్టీలోనూ నడుస్తున్న టాక్!! మరి ఆ మాత్రానికే తాను ఓ ‘పెద్ద’లా భావించేసుకుని.. ‘వతి’ని కాస్తా అతిగా మార్చేసి హడావిడి చేస్తున్న టీడీపీకి చెందిన మహిళా నాయకురాలు తీరు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పేరుకు పార్టీలో ఓ పదవి ఉన్నప్పటికీ.. ఆమె వ్యవహార తీరు మాత్రం ‘మంత్రి’ స్థాయికి తగ్గడం లేదని సొంత పార్టీకి చెందిన వారే గుసగుసలాడుతున్నారు. ఇప్పటికే ‘సైరన్’ నాయకురాలిగా పేరున్న ఆమె దూకుడును చూసి ఎమ్మెల్యేలు సైతం తలలు పట్టుకుంటున్నారు. దాదాపు పార్లమెంటు పరిధిలోని నియోజక వర్గాలను చుట్టుముట్టేస్తున్న ఆమె.. అన్ని చోట్లా సొంతంగా తనకంటూ ఒక కోటరీ ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నారు. గతంలో ఓ రెండు నియోజక వర్గాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించి, భంగపాటుకు గురైన అనుభవం.. రానున్న రోజుల్లో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తుకుండా ఉండాలన్న ఉద్దేశంతో ముందుగానే తనకంటూ ప్రత్యేకంగా ఓ వర్గాన్ని సృష్టించుకుంటున్నారని నియోజకవర్గాల నుంచి వినిపిస్తోంది. ఇప్పుటికే ఒక నియోజక వర్గంలో పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఆమె తీరు పట్ల పార్వతీపురం, పాలకొండ నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు రగిలిపోతున్నట్టు సమాచారం. అధికారులకు హుకుం.. ఆమెకంటూ రాజ్యాంగబద్ధంగా ఏ పదవీ లేకపోయినప్పటికీ.. పార్టీ ఇచ్చిన హోదాతోనే అధికార దర్పం చూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల వద్దకు వెళ్లడం, సమస్యలు పరిష్కరించాలని ఆదేశించడం.. ఆస్పత్రులను పరిశీలించడం, అక్కడ అందిస్తున్న వైద్యంపై వైద్యులతో సమీక్ష నిర్వహించి తగు సూచనలు చేయడం సదరు మహిళా నేతకు అలవాటుగా మారిపోయింది. ఏ అధికారం ఉందని ఇలా ఆదేశాలు జారీ చేస్తారని అధికారులు, వైద్యులు తలలు పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అక్కడితో ఆగిపోకుండా, తన సిఫారసుతో ఉద్యోగాలు కూడా ఇవ్వాలని సూచిస్తున్నట్లు సమాచారం. ఇలా ఉద్యోగాల పేరిట ఆమె అనుచరులు వసూళ్లకు సైతం పాల్పడుతున్నారన్న ఆరోపణలు కూటమి వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. తనకంటూ ప్రొటోకాల్ పాటించాలని అధికారులకు సైతం ఆదేశాలు జారీ చేస్తున్నారని ఉద్యోగ వర్గాల నుంచి వినిపిస్తోంది. సాధారణంగా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం భద్రత కల్పిస్తూ.. ఒక గన్ మెన్‌ను ఏర్పాటు చేస్తుంది. క్యాబినెట్ హోదా ఉన్నవారికి ఇద్దరు గన్మెన్లను కల్పిస్తుంది. మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భద్రత దృష్ట్యా ఎమ్మెల్యేలు సైతం ఇద్దరిని కోరవచ్చు. ఇటు ఎమ్మెల్యే కాకపోయినా.. అటు మంత్రి కాకున్నా.. తనకూ గన్‌మెన్ కావాలని ఆ మహిళా నేత అర్జీ పెట్టుకున్నట్లు సమాచారం. అలా అని ఒక్కరు కాకుండా.. తన పర్యటనల దృష్ట్యా ఇద్దరు గన్మెన్లు ఉండాలని కోరినట్లు తెలుస్తోంది. దీనిని పోలీసు అధికారులు సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. రాజ్యాంగబద్ధ పదవి లేకపోయినప్పటికీ, అధికారం చెలాయిస్తున్న ఆమెకు... భవిష్యత్తులో ఏదైనా పదవి వస్తే ఇంకెలా ఉంటుందోనని కూటమి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే చర్చించుకుంటున్నారు. -
రెండు పశువుల శాలలు దగ్ధం
తెర్లాం: మండలంలోని నందబలగ పంచాయతీ పరిధిలోని జనార్థనవలస(చిన నందబలగ) గ్రామంలో గురువారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు పశువుల శాలలతో పాటు, పశువుల శాలలో ఉన్న మోటార్ సైకిల్, నీరు తోడుకొనే ఆయిల్ ఇంజన్ పూర్తిగా దగ్ధం కాగా, ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించి తహసీల్దార్ జి.హేమంత్‌కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జనార్థనవలసలో గురువారం సాయంత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా గ్రామానికి చెందిన యామలాపల్లి రాము, గేదెల శ్రీరాములుకు చెందిన రెండు పశువుల శాలలు పూర్తిగా కాలిపోయాయి. బాడంగి మండలం జీకేఆర్ పురం నుంచి జనార్థవలస గ్రామానికి తాపీ పని చేసేందుకు వచ్చిన మేసీ్త్ర తన మోటార్ సైకిల్‌ను పశువుల శాలలో ఉంచాడు. అగ్ని ప్రమాదంలో పశువుల శాలలో ఉన్న ఒక మోటార్ సైకిల్‌తో పాటు, నీరు తోడుకొనే ఆయిల్ ఇంజన్ ఈ ప్రమాదంలో దగ్ధమయ్యాయి. పశువుల శాలలో ఉన్న మోటార్ సైకిల్ కాలిపోతుండడంతో దానిని తీయడానికి వెళ్లిన కె.ప్రభాకరరావు అనే వ్యక్తి చేతులు కాలిపోయి గాయాలయ్యాయి. అతన్ని బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వీఆర్ఓ ఆమిటి శ్రీనివాసరావు వెంటనే గ్రామానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. అగ్ని ప్రమాదంలో సుమారు లక్ష రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేశారు. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న బొబ్బిలి అగ్నిమాపక సిబ్బంది శకటంతో వచ్చి మంటలు అదుపు చేశారు. -
ముందు ఇచ్చేద్దాం.. లెక్క తర్వాత చూద్దాం!
● ‘వెలుగు’లో ఇష్టానుసారం చెల్లింపులు ● సరైన బిల్లులు, ఓచర్లు లేకుండానే నిధులు డ్రా సాక్షి, పార్వతీపురం మన్యం: దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. తిన్నోళ్లకు తిన్నంత! ఒక లెక్కాపత్రం ఉండదు.. అడిగే వారు అసలే ఉండరు!! పేరుకే ‘వెలుగు’.. తవ్వేకొద్దీ అక్రమాల చీకట్లే. గత ఏపీడీ, ఇన్చార్జి పీడీగా పని చేసిన సత్యంనాయుడు హయాంలో శాఖలో జరిగిన అవినీతికి ‘లెక్కే’ లేదు. యంత్రాల కొనుగోలు, ఉపాధి శిక్షణలు, బిల్లుల చెల్లింపులు.. ఇలా ఒక్కటేమిటి? సర్వం ‘స్వాహా’గానే కొన్నేళ్లుగా డీఆర్డీఏ పనితీరు ఉంది. వెలుగులో జరిగిన అవినీతిపై ఫిర్యాదులు వెళ్లగా.. దీనిపై ఉన్నతాధికారుల ఆదేశాలతో విచారణ చేపట్టారు. ఇందులో అనేక చీకటి కోణాలు ‘వెలుగులోకి వస్తున్నాయి. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన లక్ష్యంగా చేపట్టిన ఉన్నతి కార్యక్రమం అమల్లో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కార్యక్రమం కింద రూ.105.5 కోట్ల రుణాలను పంపిణీ చేసినప్పటికీ.. వసూళ్లలో పురోగతి కనిపించలేదు. కేవలం రూ.14.474 కోట్లు మాత్రమే వసూలైనట్లు గుర్తించారు. సర్వీసు సెంటర్ల కోసం ఉద్దేశించిన ల్యాప్‌టాప్‌లను.. అధికారుల కుటుంబ సభ్యులకు పంపిణీ చేశారు. సరఫరా చేసిన 40 లాప్ట్యాప్ల్లో తొమ్మిదే పని చేస్తున్నట్లు గుర్తించారు. 27 పని చేయడం లేదు. 2024–25 కాలానికి కుట్టు యంత్రాలు, టెంట్లు, పిండి మిల్లుల కొనుగోలులో భారీగా అవకతవకలు జరిగనట్లు ఆరోపణలు వచ్చాయి. పారదర్శకతను పక్కన పెట్టి, కొనుగోలు జరిపినట్లు విచారణలో తేలిందని సమాచారం. శిక్షణలు అలా కలిసొచ్చాయి.. 2023లో ఓ శిక్షణ నిమిత్తం రూ.2,75,000 నగదు రూపంలో తీసుకున్నారు. సంబంధిత చెల్లింపులన్నీ నగదు రూపంలోనే జరిగాయి. ఇందులో అల్పాహారం, భోజనం కోసం 2023 ఏప్రిల్‌లో ఐటీడీఏ క్యాంటీన్‌కు రూ.67.800 నగదు రూపంలో చెల్లించారు. దీనికి సంబంధించిన చెక్కు శాంతికుమారి పేరిట జారీ చేశారు. బిల్లుల తేదీలు.. చెక్కు జారీ చేసిన తేదీ కంటే ముందుగా ఉండటం గమనార్హం. – ఆర్థిక సమ్మిళిత శిక్షణ నిమిత్తం సరైన వివరాలు ఇవ్వకుండానే ఆహార ఖర్చుల కింద రూ.11,200 మొత్తాన్ని క్లెయిమ్ చేశారు. ఉన్నతి శిక్షణ కోసం ఓ ఏపీఎం ఇంకొంత మొత్తం బిల్లు సమర్పించారు. అదే ఏడాది అరుణోదయ ప్రింట్ హౌస్ పేరిట రూ.13,45,886 మొత్తానికి చెక్కు చెల్లించారు. దీనికి సంబంధించి అనుబంధ బిల్లులు, ఆమోదాలు, పంపిణీ రసీదులు అందుబాటులో లేవు. కొనుగోలు విధానాలు కూడా పాటించలేదని గుర్తించారు. అదే పోస్టుకు రావాలనీ.. కొద్దిరోజుల కిందటి వరకూ డీఆర్డీఏ పీడీగా సుధారాణి పనిచేసేవారు. ఆమె బదిలీపై విజయనగరం జిల్లాకు వెళ్లిపోవడంతో ప్రస్తుతం ఇన్చార్జి పీడీగా సబ్ కలెక్టర్ వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఈ పోస్టులోకి వచ్చేందుకు కొందరు పోటీ పడుతున్నట్లు సమాచారం. ఇందులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు సైతం ఉన్నారని తెలుస్తోంది. మండల సమాఖ్యలకు సరైన పత్రాలు లేకుండానే రూ.లక్షలు మళ్లించారు. బ్యాంకరు లేఖ గానీ, ఎస్ఈఆర్పీ సర్క్యులర్ గానీ లేకుండా సీతానగరం, గరుగుబిల్లి, పాలకొండలకు రూ.26 లక్షలు బదిలీ చేశారు. 13 మండలాలకు ఒక్కొక్కదానికి రూ.24 వేలు చొప్పున బదిలీ చేశారు. 2024 ఏప్రిల్ 1 నుంచి అదే ఏడాది జూన్ 11వ తేదీ వరకు జరిగిన లావాదేవీలకు బిల్లులు, ఓచర్లు అందుబాటులో లేవు. జూన్‌లో నిర్వహించిన రెండు సమావేశాల కోసం బిల్లులు, ఓచర్లు, సంతకాలు లేకుండా రూ.2,31,000 నగదు విత్‌డ్రా చేశారు. రికార్డులో ఎటువంటి టీఏ, డీఏ క్లెయిమ్ ఫారాలు లేకుండానే జిల్లా సమాఖ్య ఓబీ సభ్యులకు టీఏ, డీఏ మొత్తం బదిలీ చేశారు. ఎటువంటి ఉత్తర్వులు, ఆదేశాలు రికార్డుల్లో లేకుండా పలువురికి జీతాల బిల్లులు రూ.లక్షల్లో చెల్లించారు. 2025లో ఫిబ్రవరిలో ఓ శిక్షణ నిమిత్తం 15 మండలాలకు రూ.17,50,000 చెల్లించారు. ప్రాజెక్టు డైరెక్టర్ స్థాయిలో గానీ, జిల్లా గిరిజన మహిళా సమాఖ్య స్థాయిలో గానీ ఎటువంటి నోట్‌ఫైళ్లు, కార్యనిర్వహణ ఉత్తర్వులు, ఓచర్లు అందుబాటులో లేకపోవడం విశేషం. మండల సమాఖ్యలకు నిధులు బదిలీ చేసేటప్పుడు బ్యాంకర్ల లేఖలు, సెర్ప్ సర్క్యులర్లు సమర్పించకపోవడాన్ని విచారణలో గుర్తించారు. ఈ విధంగా రూ.కోట్లలో మొత్తం చెల్లించారు. 2025 మార్చి 19న ఇలా సుమారు రూ.45 లక్షలు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి శాఖలో కార్యకలాపాలకు సంబంధించిన ఆడిట్ నిర్వహించారు. ఆర్థిక అవకతకవలేవీ ఆడిట్ సమయంలో గుర్తించకపోవడం గమనార్హం. ఆడిట్ కేవలం నామమాత్రంగానే సాగిందనడానికి ఈ ఉదంతాలే ఉదాహరణలు. చింతపల్లి మండలం ఎఫ్‌పీఓ నుంచి పార్వతీపురం వరకు పసుపు రవాణా నిమిత్తం అడ్వాన్సుగా రూ.20 వేలు మంజూరు చేశారు. మరో ట్రేడర్స్‌కు 30 వేలు మంజూరు చేశారు. సరైన మార్గదర్శకాలు లేకుండానే అడ్వాన్సులు ఇవ్వడం.. వాటి సర్దుబాటులో జాప్యం, రికార్డుల మధ్య వ్యత్యాసం కనిపించింది. అంచనా పత్రాలు లేకుండా స్వాతంత్య్ర దినోత్సవ అలంకరణ, శకట ఖర్చు, జిల్లా సమాఖ్య నిర్వహణ కోసం, బోరుబావుల మరమ్మతుల నిమిత్తం అడ్వాన్సు పేరిట రూ.లక్షలు మళ్లించారు. 2024లో ఒకఏపీఎంకు చేయూత కార్యక్రమ అడ్వాన్సు నిమిత్తం సహాయక బిల్లులు లేకుండానే రూ.2,30,000 చెల్లించినట్లు గుర్తించారు. జిల్లా గిరిజన మహిళా సమాఖ్య నుంచి సిబ్బందికి ముందస్తు చెల్లింపులు చేశారు. వాస్తవానికి చెక్కుల ద్వారా చెల్లించాల్సిన పెద్ద మొత్తాలను కూడా అడ్వాన్సులుగా తీసుకుని, నిబంధనలకు విరుద్ధంగా నగదు రూపంలో పంపిణీ చేశారు. ఇవన్నీ మచ్చుకు కొన్ని మాత్రమే. -
మళ్లీ తెరపైకి స్మార్ట్ కిచెన్లు..!
రామభద్రపురం: ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోయినా.. కనీసం వేతనం లేకపోయినా అప్పులు చేసి అన్నం తయారు చేస్తున్నారు. విద్యార్థుల కడుపు నింపి ఆకలి తీర్చుతున్నారు. అలాంటి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పొట్ట కొట్టేందుకు స్మార్ట్ కిచెన్ల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందని విమర్శఽలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మధ్యాహ్న భోజనం పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టారు. దీని ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందించాల్సింది పోయి తమ అనుయాయులకు మేలు జరిపేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్ధమవుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయోగాత్మకంగా అమలు చేసిన వైఎస్సార్ కడప జిల్లాలో విజయవంతమైందంటూ స్మార్ట్ కిచెన్ ఏర్పాటుకు నివేదికలు పంపాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లా అధికారులు కూడా ఆఘమేఘాల మీద సౌకర్యవంతంగా ఉన్న మండలానికి రెండు పాఠశాలల్లో ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేయగా వారు నివేదికలు పంపిస్తున్నారు. పదిలోపు విద్యార్థులున్న పాఠశాలలు తప్ప విద్యార్థులు ఎక్కువ మంది ఉన్న పాఠశాలలకు స్మార్ట్ కిచెన్ల ద్వారా మధ్యాహ్న భోజనం సరఫరా చేయనున్నారు. ఒక చోట భోజనం తయారు చేసి 1 నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలల విద్యార్థులకు అందించాలన్నది ప్రభుత్వ ఆలోచన. విద్యార్థులకు ఇక చల్లని కూడే.. ఎక్కడో దూరంలో ఉన్న విద్యార్థులకు ఒక చోట భోజనం వండి వాహనాల్లో తీసుకెళ్లి ఇవ్వడం అన్నది వ్యయప్రయాసలతో కూడుకున్నది. దీని వల్ల విద్యార్థులకు వేడి పదార్ధాలు తినే భాగ్యం లేనట్టేనని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు పాఠశాల ఆవరణలోనే మధ్యాహ్న భోజనం వండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కాంట్రాక్టర్ల చేతుల్లోకి పోతుంది. ఎవరిని సంతృప్తి పరచడానికి స్మార్ట్ కిచెన్లు తీసుకొస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి విద్యార్థులకు వండిపెడుతున్న కార్మికుల కడుపులు కొట్టి సొంత పార్టీ నాయకుల బొజ్జలు నింపేందుకే స్మార్ట్ కిచెన్ల రూపకల్పన జరిగినట్టు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. స్మార్ట్ కిచెన్లకు స్వస్తి పలకాలని కోరుతున్నాయి. వంట కార్మికుల ఆందోళన.. మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్న ఏజెన్సీలను తొలగించి స్మార్ట్ కిచెన్ల పేరుతో మధ్యాహ్న భోజనం నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయన్న సమాచారంతో గ్రామీణ ప్రాంతాల్లో గత 20 ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలలో వంటలు నిర్వహిస్తున్న మహిళలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే భోజన పథకం నిర్వాహకులను ఆదుకుంటాం అంటూ ప్రకటనలు చేసిన చంద్రబాబు తమ పొట్టకొట్టేందుకే ఈ పథకాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఫలితంగా 20 ఏళ్ల నుంచి పని చేస్తున్న తమను రోడ్డున పడేస్తే ఎలా? అని.. ఇన్నేళ్లుగా కష్టపడి పని చేసిన దానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రతిఫలం ఇదేనా.. అంటూ భోజన నిరాహకులు మండిపడుతున్నారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా మరో దోపిడీకి రంగం సిద్ధం చేస్తున్న బాబు సర్కారు తమ అనుయాయుల జేబులు నింపేందుకు కుట్ర మండలానికి రెండు చొప్పున్న ఏర్పాటుకు చర్యలు ఎండీఎం పథకం మహిళల ఆందోళనమధ్యాహ్న భోజన నిర్వాహకులు : 2920 మంది -
వీరికి సఖ్యత లేక.. వారికి తీరిక కుదరక!
సాక్షి, పార్వతీపురం మన్యం: రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జి రెడ్డి గురువారం పార్వతీపురంలో పర్యటించారు. ఐటీడీఏ గిరిమిత్ర హాల్లో గ్రీవెన్స్‌సెల్ నిర్వహించారు. జిల్లాలో గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతులు స్వీకరిస్తారని అంతా భావించారు. సమస్యలను చెప్పుకొనేందుకు పలువురు తరలివచ్చారు. ఒక ప్రణాళిక లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించిన ఐటీడీఏ.. విమర్శలపాలైంది. గిరిజన సంఘాల మధ్య ఉన్న సమన్వయలోపం గందరగోళానికి గురి చేసింది. సమస్యలను ప్రస్తావించాల్సిందిపోయి.. ఎవరికి వారు తామే కమిషన్ దృష్టిలో పడాలన్న తపన పలువురిలో కనిపించింది. కొంతమంది సమస్యను చెబుదామని లేవడం.. ఇంకొన్ని సంఘాల ప్రతినిధులు అడ్డు తగలడం.. వినతులిచ్చేందుకు పోటీ పడడంతో మొత్తంగా కార్యక్రమం గందరగోళమైంది. చేసేదిలేక, అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. చివరికి ‘వినతులిచ్చేయండి.. ఇబ్బందులేవైనా ఉంటే కలెక్టరేట్లో జరిగే సమీక్షలో మాట్లాడుకుందాం’ అంటూ చైర్మన్ ముగించేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు. అంతా బాగుందంట.. కలెక్టరేట్లో అధికారులతో ఎస్టీ కమిషన్ చైర్మన్ నిర్వహించిన సమీక్షలోనూ అంతా ‘ప్రశంసాపూర్వకంగా’నే సాగడం విశేషం. గిరిజనులకు గానీ, గిరిజన విద్యార్థులకు గానీ సమస్యలేవీ లేవని అధికారులు చెప్పుకొన్నారు. ప్రధానంగా గిరిజన విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై లోతైన చర్చ జరగలేదు. పలువురు ఆదివాసీ సంఘం నేతలు మాట్లాడుతూ.. గిరిజనులకు రాజ్యాంగపరమైన హక్కులు దక్కేలా చూడాలని, బోగస్ సర్టిఫికెట్లపై విచారణ జరపాలని కోరారు. ఆదివాసీ గ్రామాల్లో రహదారుల నిర్మాణాలకు సంబంధించి అటవీ శాఖ అభ్యంతరం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల కాలంలో మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారాన్ని చెల్లించే దిశగా చర్యలు తీసుకోవాలని కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. వినతుల స్వీకరణలో గందరగోళం ఎస్టీ కమిషన్ ఎదుటే గిరిజన సంఘాల మధ్య సమన్వయలోపం ప్రణాళిక లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించిన ఐటీడీఏ -
ప్రత్యేక ఆకర్షణగా గోటి తలంబ్రాలు, మండపేట బొండాలు
రామతీర్థంలో ఏటా జరుగుతున్న స్వామివారి కల్యాణోత్సవంలో పవిత్రంగా గోటితో సిద్ధం చేసిన కోటి తలంబ్రాలను వినియోగించడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ప్రత్యేకంగా సేద్యంచేసిన వరిని గోటితో ఒలిచి తలంబ్రాలుగా సిద్ధంచేసి రామతీర్థానికి పంపించారు. మరికొంత మంది భక్తులు బియ్యపు గింజలపై జై శ్రీరామ్ అనే అక్షరాలు రాసి తలంబ్రాలుగా సిద్ధం చేశారు. ఎప్పటిలాగే మండపేట నుంచి కొబ్బరి బొండాలు రామతీర్థానికి చేరుకున్నాయి. మేలైన కొబ్బరి బొండాలపై సీతాసమేత రామలక్ష్మణ స్వామివారి అక్షరాలను సుందరంగా తీర్చిదిద్ది స్వామికి సమర్పించారు. -
సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా...
కల్యాణాన్ని వీక్షించేందుకు వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఏర్పాట్లు పూర్తి చేశాం. దేవస్థానం తరఫున సుమారు 10వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేపడుతున్నాం. భక్తులకు మంచినీరు, మజ్జిక, చిన్నపిల్లలకు పాలు, తలంబ్రాల పంపిణీకి ప్రత్యేక క్యూల ఏర్పాటు, ఉచిత ప్రసాదాల పంపిణీ తదితర సౌకర్యాలను కల్పించాం. కల్యాణం సజావుగా సాగేందుకు భక్తులు సహకరించాలి. – వై.శ్రీనివాసరావు, ఈఓ, రామతీర్థం దేవస్థానం ● రామతీర్థంలో నేడే సీతారాముల కల్యాణం ● ఏర్పాట్లు పూర్తిచేసిన అధికార యంత్రాంగం నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి వారి కల్యాణోత్సవానికి ముస్తాబయింది. రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో శుక్రవారం జరగనున్న శ్రీరామనవమి వేడుకలకు సర్వం సిద్ధమైంది. ప్రముఖుల రాక నేపథ్యంలో గడిచిన నాలుగు రోజులుగా వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లలో నిమఘ్నమయ్యారు. స్వామివారి కల్యాణాన్ని కనులారా వీక్షించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కల్యాణ వేదిక చుట్టూ టెంట్లు, భక్తులకు సరఫరా చేసేందుకు మజ్జిగ, మంచినీరు ప్యాకెట్లను సిద్ధం చేశారు. కల్యాణం పూర్తికాగానే స్వామివారి ముత్యాల తలంబ్రాల పంపిణీకి ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేశారు. నవమి వేడుకల్లో భాగంగా ప్రధాన ఆలయాన్ని వివిధ రకాల పుష్ఫాలతో సుందరంగా అలంకరించారు. భారీ అన్నసమరాధన కార్యక్రమానికి దేవస్థాన అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. స్వామి కల్యాణానికి ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నేడు జరగనున్న కార్యక్రమాలు ఇవే... వేకువజామున 3 గంటలకు స్వామివారికి ఆరాధన, బాలభోగం, తీర్థ గోష్ఠి, ఉదయం 6.30 గంటలకు శ్రీరామచంద్రస్వామివారి అవతార సర్గవిన్న పం, 7.30 గంటలకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, వివిధ రకాల ఫలరసాలు, సముద్ర నదీ జలాలతో అష్టకలశ స్నపన మహోత్సవం జరగనుంది. స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పల్లకిలో ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు తీసుకువెళ్లి కల్యాణ ఘట్టాన్ని ప్రారంభిస్తారు. ప్రత్యేక పూజలనంతరం సరిగ్గా 12 గంటలకు అభిజిత్ లగ్నంలో మాంగళ్యధారణ జరగనుంది. అనంతరం స్వామివారి తలంబ్రాల సేవను వేద పండితులు జరిపించనున్నారు. ఇప్పటికే తిరుముల తిరుపతి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు రామతీర్థం దివ్య క్షేత్రానికి చేరుకున్నాయి. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ దంపతులు కల్యాణ ఘట్టానికి హాజరై పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను శాస్త్రోక్తంగా స్వామివారికి సమర్పిస్తారు. సింహాచలం శ్రీ అప్పన్నస్వామి దేవస్థానం నుంచి తెచ్చిన పట్టువస్త్రాలను ప్రభుత్వం తరఫున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమర్పించనున్నారు. 170 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు స్వామివారి కల్యాణానికి రామతీర్థంలో గట్టిబందో బస్తును ఏర్పాటు చేస్తున్నాం. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటాం. 170 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో బందోబస్తు కొనసాగుతుంది. డీఎస్పీ స్థాయి అధికారి, ఏడుగురు ఎస్ఐలు, ముగ్గురు సీఐలు తమ విధులను నిర్వర్తించనున్నారు. కల్యాణాన్ని తిలకించేందుకు సుమారు 15 వేల మంది భక్తులు వస్తారని అంచనా వేశాం. – గణేష్, ఎస్ఐ, నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ -
పైడితల్లి ఆలయ హుండీల ఆదాయం లెక్కింపు
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ హుండీల ఆదాయం లెక్కింపు స్థానిక శివాలయం వీధిలో ఉన్న పైడితల్లి అమ్మవారి కల్యాణ మండపం ఆవరణలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ కె.శిరీషా మాట్లాడుతూ వనంగుడి హుండీల ద్వారా 20 రోజులకుగానూ రూ. 2 లక్షల 28 వేల 327లు వచ్చినట్టు తెలిపారు. దేవదాయ శాఖ తనిఖీదారు జి.శ్యామ్ ప్రసాద్, ధర్మకర్తల మండలి సభ్యులు, సేవకులు పాల్గొన్నారు. సారా స్వాధీనం సాలూరు: పట్టణంలోని ఎరుకుల వీధిలో నాటుసారా స్వాధీనం చేసుకున్నట్టు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ దాసు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ, ఏఈఎస్ సంతోష్, బీఎంపీపీ సీఐ నరసింహమూర్తి తదితరులతో కలిసి నిర్వహించిన తనిఖీల్లో, ఎరుకుల వీధిలో ఇద్దరు మహిళల నుంచి 12 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎడ్లు పరుగు ప్రదర్శనలో కె.ఎల్.బి.పురం ఫస్ట్ వేపాడ: మండలంలోని బోజంకివానిపాలెం గ్రామంలో గురువారం నిర్వహించిన ఎడ్లు పరుగు ప్రదర్శనలో కె.ఎల్.బి.పురానికి చెందిన ఎడ్లు ప్రధమ స్థానంలో నిలిచాయి. గ్రామదేవత రావాలమ్మ తీర్థ మహోత్సవం సందర్భంగా నిర్వహించిన ఎడ్లు పరుగు ప్రదర్శనలో 15 ఎడ్లు జతలు పాల్గొన్నాయి. మొదటి స్థానంలో నిలిచిన కెఎల్‌బి.పురానికి శిరికి దుర్గాప్రసాద్ ఎడ్లుకు రూ.పన్నెండు వేలు, రెండో స్థానంలో నిలిచిన నర్సయ్యపేటకు చెందిన ముమ్మన రామకృష్ణ ఎడ్లుకు రూ.పది వేలు, మూడో స్థానంలో నిలిచిన ఏడువాక సత్తిబాబు ఎడ్లుకు రూ.ఎనిమిది వేలు చొప్పున నగదు బహుమతులు గ్రామ పెద్దలు,కమిటీ సభ్యులు అందజేశారు. మహిళలు ప్రదర్శంచిన కోలాటం పలువురిని ఆకట్టుకుంది. నేరడి గ్రామంలోకి ఏనుగులు భామిని: మండలంలోని నేరడి బీ గ్రామంలోకి ఏనుగుల గుంపు గురువారం ప్రవేశించింది. స్థానిక ఎంపీయూపీ పాఠశాల వెనుక భాగంలోకి ఏనుగులు తిరుగాడుతూ వచ్చాయి. గ్రామ సమీపంలోని మొక్కజొన్న పంటను ధ్వంసం చేశాయి. కళ్లాల్లో నిల్వ ఉంచిన పశువుల దాణ, తవుడు బస్తాలను ధ్వంసం చేశాయి. గ్రామంలోని మూగజీవాలు ఏనుగుల గుంపు ప్రవేశంతో పరుగులు తీశాయి. గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పాము కాటుకు గురైన మహిళ సీతానగరం: మండలంలోని సుమిత్రాపురంలో బుధవారం రాత్రి ఇంటి వద్ద ఆరుబయట ఉన్న మహిళ పాము కాటుకు గురైంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. సుమిత్రాపురం గ్రామానికి చెందిన అజ్జాడ సత్యవతి బుధవారం రాత్రి ఇంటి వద్ద ఆరుబయట కూర్చుని ఉండగా పాము కాటు వేసింది. గుర్తించిన సత్యవతి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో చికిత్స నిమిత్తం పార్వతీపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సత్యవతి ఆరోగ్యం నిలకడగా ఉంది. -
మహిళా వేషంలో వచ్చి చైన్ స్నాచింగ్
● ఇల్లు అద్దెకు తీసుకుని రెక్కీ నిర్వహించి మరీ స్నాచింగ్బొబ్బిలి: మున్సిపాలిటీ పరిధి మల్లంపేటలో ఈ నెల 3న జరిగిన చైన్ స్నాచింగ్ వివరాలను సీఐ కె.నారాయణ రావు విలేకర్లకు గురువారం వివరించారు. మల్లంపేటకు చెందిన కోడి బంగారమ్మ(80) అనే మహిళ ఇంటికి మధ్యాహ్న సమయంలో ఓ వ్యక్తి ఆడ వేషంలో వచ్చి మీ కోడలు పంపిందని మాయమాటలు చెప్పి మెడలో గొలుసు తెంపుకు పోయినట్టు తెలిపారు. చైన్ విలువ 23 గ్రాములుంటుందన్నారు. ఆమె కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు చెప్పారు. దర్యాప్తులో భాగంగా అన్ని కోణాల్లో విచారించి నిందితుడ్ని పట్టుకున్నామన్నారు. ఈ కేసులో గొడ్డు వాసు అనే తారకరామా కాలనీ వాసి నిందితుడని గుర్తించి పట్టుకున్నారు. ఇతనిపై చెక్ బౌన్స్ కేసుందన్నారు. అలాగే బెట్టింగ్‌లకు పాల్పడుతున్నాడన్నారు. చివరికి ఇంటిని కూడా అమ్మేశాడన్నారు. అమ్మగా వచ్చిన ఇతని వాటా రూ.3లక్షలతో బెట్టింగ్ ఆడేశాడన్నారు. చివరగా చెక్‌బౌన్స్ కేసు, మరో పక్క అప్పులు వెంటాడుతుండటంతో దొంగతనానికి పాల్పడ్డాడన్నారు. మల్లంపేటలో వృద్ధురాలి ఇంటి పక్కనే ఓ ఇల్లు అద్దెకు తీసుకుని రెక్కీ నిర్వహించాడన్నారు. వృద్ధురాలు ఒక్కరే ఉంటారని తెలుసుకుని మహిళ వేషంలో వెళ్లి చైన్ దొంగతనం చేశాడన్నారు. తిరిగి వెనక్కు వచ్చి మహిళ దుస్తులు విప్పేసి విశాఖ వెళ్లిపోయాడన్నారు. అక్కడ తెలిసిన వారి సాయంతో ముత్తూట్ కంపెనీలో కుదువ పెట్టాడన్నారు. ఆ తరువాత మళ్లీ ఆ వస్తువును విడిపించి హైద్రాబాద్ వెళ్లిపోయేందుకు రైల్వేస్టేషన్‌కు వెళ్లి తచ్చాడుతుండగా తమ సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారన్నారు. కేసులో పురోగతి సాధించిన సిబ్బందిని సీఐ కె.నారాయణ రావు అభినందించారు. ఎస్సై ఆర్.రమేష్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
చిన్నారి ధన్షిక ప్రతిభ
● 22 నెలల్లో మూడు అంతర్జాతీయ సంస్థల గుర్తింపుబొబ్బిలి రూరల్: మండలంలోని కొత్తపెంట గ్రామానికి చెందిన సిరికి లక్ష్మునాయుడు, హారికల కుమార్తె ధన్షిక పుట్టిన 22 నెలల్లో అరుదైన అంతర్జాతీయ ఘనత సాధించింది. 5 నెలల ప్రాయంలో 120 ఫ్లాష్ గుర్తించడంతో గతంలో నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకోగా, ప్రస్తుతం 22నెలల వయస్సులో మరో రెండు అవార్డులను సాధించింది. ఆల్ఫాబెట్స్, వాటికి సంబంధించిన పదాలు, అంకెలు, వారాల పేర్లు, నెలల పేర్లు, శరీర భాగాలు, జాతీయ చిహ్నాలు, శ్లోకాలతో పాటు తెలుగు–ఇంగ్లిష్ రైమ్స్ స్పష్టంగా పలుకుతూ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ చిన్నారి అద్భుతమైన జ్ఞాపకశక్తిని గుర్తించిన ప్రతి ష్టాత్మక ఇండియా బుక్ ఆఫ్ రికార్డు, ఇన్స్ఫ్ల్యూన్స్ర్ వరల్డ్ రికార్డులను వరించాయి. చిన్నారి ధన్షిక ప్రతిభను వీడియోల రూపంలో సంబంధిత సంస్థల నిర్వాహకులు పంపగా బుధవారం ప్రశంసాపత్రాలు, మెడల్స్‌ను పంపి అభినందించారు. రెండేళ్లు కూడా నిండని అతి పిన్న వయసులోనే మూడు రికార్డుల్లో చోటు దక్కించుకోవడం పట్ల చిచ్చర పిడుగు ధన్షికను కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు. -
బస్టాండ్లు బాగుండాలి.. సేవలు మెరుగుపడాలి!
పార్వతీపురం రూరల్ : జిల్లాలోని ఆర్టీసీ బస్ స్టేషన్లు ప్రయాణికులకు ఆహ్లాదాన్ని ఇచ్చేలా, అన్ని రకాల మౌలిక వసతులతో ఉండాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. పార్వతీపురం ఆర్టీసీ బస్టాండ్‌ను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన.. ప్లాట్‌ఫారమ్‌లు, తాగునీటి వసతి, విక్రయ దుకాణాలు, మరుగుదొడ్లు, పారిశుధ్య పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ప్రయాణికులతో నేరుగా ముచ్చటించి ఆర్టీసీ సేవలపై వారి సంతృప్తిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బస్టాండ్ ఆవరణలో ఎక్కడా నీరు నిల్వ ఉండకూడదని, చెత్తాచెదారం లేకుండా ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని సూచించారు. వేసవి దృష్ట్యా తాగునీటి లభ్యతతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలని, మరుగుదొడ్ల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా లైట్లు, ఫ్యాన్లు పనిచేసేలా చూడాలని, బస్సుల రాకపోకలపై సిబ్బంది మర్యాదపూర్వకంగా కచ్చితమైన సమాచారం అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. బస్ స్టేషన్ అనేది ప్రజలకు ఒక దేవాలయం వంటిదని, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. దుకాణాల్లో గడువు ముగిసిన వస్తువులను విక్రయించినా, అధిక ధరలకు అమ్మినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్వహించే ప్రజా స్పందనలో ప్రయాణికులు శత శాతం సంతృప్తి చెందేలా సేవలు ఉండాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, జిల్లా ప్రజా రవాణా అధికారి కె.శ్రీనివాస రావు, డీఎం ఎస్.లక్ష్మణరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీ ప్రాంగణంలో కలెక్టర్ తనిఖీ -
రేపటితో ముగియనున్న చెరకు క్రషింగ్
రేగిడి: మండల పరిధిలోని సంకిలి వద్ద ఉన్న ఈఐడీ ప్యారీ ఇండియా లిమిటెడ్ చక్కెర కర్మాగారంలో ఈ నెల 28న చెరకు క్రషింగ్ ముగియనున్నదని యాజమాన్యం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది 2.25 లక్షల మెట్రిక్ టన్నులు చెరకు గానుగ ఆడడం జరిగిందని యాజమాన్యం వెల్లడించింది. 2025–26 సంవత్సరానికి సంబంధించి చెరకు క్రషింగ్ సీజన్ ముగియనున్న దృష్ట్యా రైతులు త్వరపడి చెరకును కటింగ్ చేసి కర్మాగారానికి తరలించాలని కోరింది. పొలాల్లో ఉన్న మిగులు చెరకు మొత్తాన్ని సరఫరా చేస్తే క్రషింగ్ చేయడం జరుగుతుందని వెల్లడించింది. అందుకు అవసరమైన కటింగ్ ఆర్డర్లను సంబంధిత సిబ్బందికి చెప్పినట్టు పేర్కొంది. క్రషింగ్‌ను సమయానికి పూర్తి చేయడంలో సహకరించిన రైతులు, సిబ్బంది, వాహన డ్రైవర్లకు కృతజ్ఞతలు తెలిపింది. -
తమ్మన్నశెట్టి మృతి బాధాకరం
సాలూరు: శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సోదరుడు, సీనియర్ అడ్వకేట్ కోలగట్ల తమ్మన్నశెట్టి మృతి బాధాకరమని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. గురువారం విజయనగరం వెళ్లి తమ్మన్నశెట్టి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాజన్నదొర వెంట కోట ఈశ్వరరావు, కోలగట్ల గోపి, బలభద్రుని శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. 60 రకాల వంటకాలతో రాములోరి సారె వేపాడ: మండల కేంద్రంలో సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా మహిళలు తయారు చేసిన 60 రకాల వంటకాల సారెను గురువారం రాత్రి ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. శుక్రవారం జరగనున్న సీతారాముల కల్యాణోత్సవానికి ముందుగా సారెను ఆలయానికి తీసుకువెళ్లినట్టు మహిళా భక్తులు తెలిపారు. శుక్రవారం కల్యాణోత్సవంతో పాటు అన్న సమారాధన నిర్వహించనున్నట్టు సభ్యులు తెలిపారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొని యువకుడి దుర్మరణం
మక్కువ: విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఓ యువకుడు మృతి చెరందిన ఘటన మక్కువ – దుగ్గేరు రహదారి మధ్యలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని పనసభద్ర పంచాయతీ దిగువమెండంగి గ్రామానికి చెందిన సీదరపు శంభు(20) గురువారం పని నిమిత్తం మండల కేంద్రానికి వచ్చాడు. పనుల ముగించుకుని మక్కువ నుంచి ద్విచక్ర వాహనంపై తన స్వగ్రామానికి తిరుగు పయనమయ్యాడు. కొండ బుచ్చింపేట గ్రామ సమీపంలో వాహనం అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని మక్కువ పీహెచ్‌సీకి తరలించారు. తీవ్రంగా గాయపడిన శంభుకు వైద్యులు ప్రథమ చికిత్స అందించినా.. అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సాలూరు సీహెచ్‌సీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
జేఎన్టీయూ–జీవీలో క్రీడా వార్షికోత్సవం
విజయనగరం రూరల్: స్థానిక జేఎన్టీయూ–జీవీలో క్రీడా వార్షికోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపకులపతి వీవీ సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధి పట్ల సంస్థ కళాశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చిందన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, క్రీడా విజయాలు వారి భాగస్వామ్యం కార్యక్రమంలో ప్రతిబింబించాయన్నారు. ప్రత్యేక అతిథిగా హాజరైన ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐ.వెంకటేశ్వరరావు, టీసీఎస్ సంస్థ ప్రతినిధి జె.వి.కృష్ణప్రసాద్ మాట్లాడుతూ క్రమశిక్షణ, పట్టుదల లక్ష్యసాధన ప్రాముఖ్యతను వివరించారు. రిజిస్ట్రార్ జి.జయసుమ మాట్లాడుతూ విద్యతో పాటు విలువల సాధనకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. విద్య, క్రీడలు మానసిక, శారీరక ఆరోగ్యానికి దోహదపడతాయన్నారు. అనంతరం కళాశాల మ్యాగజైన్‌ను వీసీ సుబ్బారావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. అతిథుల సన్మానం, ప్రతిభావంతులైన విద్యార్థులకు అకడమిక్ అవార్డులు, బహుమతుల ప్రదానోత్సవం నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కోట చంద్రభూషణరావు, ఏవీ పాపారావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
31న మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా
● టిడ్కో ఇళ్ల పంపిణీకి సీపీఎం డిమాండ్ పార్వతీపురం రూరల్: పట్టణంలోని నిరుపేదలకు 2017లో మంజూరైన టిడ్కో ఇళ్లను తక్షణమే పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31న పార్వతీపురం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు సీపీఎం నాయకులు వెల్లడించారు. టిడ్కో ఇళ్ల సాధనకై పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార యాత్ర గురువారం రెండో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా పట్టణంలోని మూడవ వార్డు పరిధిలోని పలు వీధుల్లో నాయకులు పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. పార్టీ పట్టణ నాయకులు గొర్లి వెంకటరమణ, బి.వి.రమణ, బి.సూరిబాబు మాట్లాడుతూ.. నిర్మాణం పూర్తయిన 768 ఇళ్లకు మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు వెంటనే అప్పగించాలని కోరారు. పార్వతీపురం జిల్లా కేంద్రమైన తర్వాత ఇంటి అద్దెలు పెరగడంతో పేదలపై ఆర్థిక భారం అధికమైందని పేర్కొన్నారు. లబ్ధిదారుల జాబితా లో ఉండి ఇళ్లు కేటాయించని వారికి, వారు చెల్లించిన షేర్ క్యాపిటల్ మొత్తాన్ని వడ్డీతో సహా వెనక్కి ఇవ్వాలని లేదా ప్రత్యామ్నాయ గృహాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. 31న జరిగే ధర్నాలో లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి బి.లక్ష్మి, డీవైఎఫ్ఐ నాయకులు పి.రాజశేఖర్, స్థానిక నాయకులు చంద్రరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆ శిలాఫలకం ఎక్కడ?
సాలూరు: సాలూరు పట్టణంలో వందపడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి, ప్రస్తుత శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఆ శిలాఫలకాన్ని కనుమరుగు చేయడం సరికాదని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజ్ననదొర అన్నారు. సాలూరులోని తన నివాసంలో విలేకరులతో గురువారం మాట్లాడారు. గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో కోవిడ్ ఉద్ధృతంగా ఉన్న సమయంలో కూడా బొత్స వచ్చి ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. ప్రారంభోత్సవ శిలాఫలకంలో ఆయన పేరును వేయకపోవడం విచారకరమన్నారు. శిలాఫలకంలో పేర్లు ఉన్నవారు ప్రొటోకాల్ పరిధిలోకి వస్తారా అని అధికారులను ప్రశ్నించారు. శిలాఫలకం కనుమరుగు చేసినంత మాత్రాన గత ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పాలనను దాచలేరన్నారు. ● ఏదైనా పార్లమెంట్ పరిధిలో ప్రభుత్వ పనులు, భవనాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టినా సుమారు నాలుగు నుంచి వారం రోజులు ముందుగా ఎంపీకి తెలియజేయాల్సిన బాధ్యత సంబంధిత ప్రొటోకాల్ అధికారి, ఇతర అధికారులపై ఉంటుందని రాజన్నదొర స్పష్టంచేశారు. అలాకాకుండా వందపడకల ఆస్పత్రి ప్రారంభోత్సవానికి ముందురోజు ఫోన్‌చేసి అప్పటికప్పుడు రావాలని ఎంపీను ఆహ్వానించడం అవమానించడమే అవుతుందన్నారు. దీనికి సంబంధిత అధికారులు మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. గిరిజనులు, గిరిజన నాయకులు, గిరిజన ఎంపీలంటే చులకన భావమా? అంటూ ప్రశ్నించారు. ● అరకు ఎంపీ గుమ్మా తనూజారాణి డిస్ట్రిక్ డెవలప్మెంట్ కో ఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్పర్సన్ అని రాజన్నదొర గుర్తుచేశారు. ఒత్తిడులకు తలొగ్గి, ప్రొటోకాల్‌ను విస్మరించడం తగదన్నారు. సాలూరులో వందపడకల ఆస్పత్రి భవనానికి కరోనా సమయంలో శంకుస్థాపన చేసిన బొత్స సత్యనారాయణ ఆ శిలాఫలకం కనుమరుగుచేయడం సరికాదు ఆస్పత్రి ప్రారంభోతవ్సంలో గిరిజన ఎంపీని ఆహ్వానించడంలో అవమానించారు మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర -
టీనేజ్ గర్భాలతో భవిష్యత్ అంధకారం
పార్వతీపురం రూరల్: టీనేజ్ గర్భాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన అవసరమని జిల్లా బాలల సంరక్షణ అధికారి అల్లు సత్యనారాయణ పేర్కొన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక గాయత్రి, ఎస్.ఎస్.ఎస్. డిగ్రీ కళాశాలల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 ఏళ్ల లోపు గర్భం దాల్చడం వల్ల బాలికల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా విద్య, భవిష్యత్తుకు ఆటంకం కలుగుతుందన్నారు. ప్రతి అమ్మాయి కనీసం డిగ్రీ పూర్తి చేయాలని, బాల్య వివాహాల నివారణలో సమాజం బాధ్యత వహించాలని సూచించారు. లీగల్ ఆఫీసర్ పి.శ్రీధర్ మాట్లాడుతూ.. పోక్సో చట్టం–2012, గృహహింస, వరకట్న వేధింపులు, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టాలపై వివరించారు. చైల్డ్ లైన్ నంబరు 1098 ప్రాధాన్యతను, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్– 2006 నిబంధనలను పీఓలు ఎం.ఎ.నాయుడు, ప్రసాదరావు వివరించారు. పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో హెచ్ఎం రామారావు, కౌన్సిలర్ తవిటినాయుడు, కళాశాల ప్రిన్సిపాళ్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
పోలమాంబ హుండీల ఆదాయం రూ.9.90లక్షలు
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబరపోలమాంబ అమ్మవారి ఆలయ హుండీల ఆదాయాన్ని ఈఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం లెక్కించారు. ఈ ఏడాది 7, 8, 9వ జాతరకు వచ్చిన భక్తులు చదురుగుడి, వనంగుడిలోని హుండీలలో వేసిన కానుకల రూపంలో రూ.9,90,256 ఆదాయం వచ్చింది. బంగారం 4 గ్రాములు, వెండి 13 గ్రాములు సమకూరినట్లు ఈఓ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా దేవదాయశాఖ అధికారి ఎస్.రాజారావు, ఆలయ చైర్మన్ నైదాన చినతిరుపతి, సర్పంచ్ వి.సింహాచలమమ్మ, ఉప సర్పంచ్ అల్లు వెంకటరమణ, కమిటీ సభ్యులు, మాజీ చైర్మన్లు, శ్రీవారి సేవకులు, గ్రామపెద్దలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. వైద్యసేవల బలోపేతానికి ప్రాధాన్యం ● కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి పార్వతీపురం రూరల్: జిల్లాలోని గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో మాతా శిశు ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్) కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సమకూర్చిన ఆధునిక వైద్య పరికరాలను గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయ ప్రాంగణంలో ఆయన ప్రారంభించారు. మాతా శిశుమరణాల నివారణలో భాగంగా సుమారు 15 రేడియంట్ వార్మర్లు, 15 హైడ్రాలిక్ లేబర్ రూమ్ టేబుల్స్ (బెడ్లతో సహా) జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు (పీహెచ్సీ) పంపిణీ చేయాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. ప్రసవ సమయంలో గర్భిణులు, నవజాత శిశువులకు అత్యవసర ప్రాణ రక్షణ కల్పించడంలో ఈ ఆధునిక సాంకేతిక పరికరాలు కీలకమని పేర్కొన్నారు. పీహెచ్సీ సిబ్బందికి వీటి వినియోగంపై అవగాహన కల్పించి, గిరిజన ప్రజలకు సేవలు అందేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు, హెచ్ఎస్ఎల్ ప్రతినిధులు డి.శ్రీనివాసరావు, ఐ.బేగ్, వి.ప్రశాంత్, వైద్యాధికారులు విజయపార్వతి, విజయమోహన్, జగన్ మోహనరావు, తదితరులు పాల్గొన్నారు. 408 మందికి ఉచిత ప్రవేశాలు పార్వతీపురం రూరల్: విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) 12(1)సి ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలకు సంబంధించి తొలివిడత లాటరీ ఫలితాలు విడుదలయ్యాయి. 2026–27 విద్యా సంవత్సరానికి జిల్లా వ్యాప్తంగా 796 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, కిలోమీటరు పరిధిలో ఉన్న 408 మందిని మొదటి విడతలో ఎంపిక చేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి, అదనపు పథక సంచాలకులు తెలిపారు. ఎంపికై న విద్యార్థుల వివరాలను వారి తల్లిదండ్రుల మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ రూపంలో పంపించామని, హెచ్‌టీటీపీఎస్://సీఎస్సీ.ఏపీ.జీఓవీ.ఇన్/ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. సీట్లు కేటాయించిన విద్యార్థులు ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 7వ తేదీలోపు సంబంధిత పాఠశాలల్లో చేరాల్సి ఉందన్నారు. విద్యార్థి, తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డు, ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డు, పుట్టిన తేదీ పత్రం, స్టడీ సర్టిఫికెట్లను పాఠశాలల్లో సమర్పించి ప్రవేశాలను నిర్ధారించుకోవాలన్నారు. సందేహాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 18004258599ను సంప్రదించాలని కోరారు. ఐదు కిలోమీటర్ల పరిధిలోని విద్యార్థుల కోసం రెండో విడత లాటరీ ఫలితాలను ఏప్రిల్ 12న విడుదల చేస్తామన్నారు. అర్హత ఉన్న విద్యార్థులకు ప్రవేశాల కల్పనలో ప్రైవే టు పాఠశాల యాజమాన్యాలు నిరాకరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఈఓ హెచ్చరించారు. అడ్మిషన్ల ప్రక్రియను జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు (ఏపీసీలు) పర్యవేక్షిస్తారని, ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత మండల విద్యాశాఖాధికారులను (ఎంఈఓ) సంప్రదించాలని సూచించారు. -
డిప్యూటీ సీఎం కార్యక్రమానికి.. టీడీపీ నేతల ఝలక్
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో గిరిప్రదక్షిణ రోడ్డును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు. దీనికి నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ నేతలు గైర్హాజరయ్యారు. ఈ ఘటనతో టీడీపీ–జనసేన మధ్య ఆదిపత్య పోరు, టీడీపీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. కార్యక్రమానికి విజయనగరం జిల్లా ఇన్చార్జి మంత్రి వంగలపూడి అనిత, జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వర్చువల్‌గా హాజరైనప్పటికీ నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మార్క్‌ఫెడ్ చైర్మెన్ కర్రోతు బంగార్రాజుతో సహా టీడీపీ కీలక నేతలు ఎవరూ హాజరుకాకపోవడం చర్చకు దారితీసింది. సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన టీడీపీ రాష్ట్ర పరిశీలకుడు సువ్వాడ రవిశేఖర్, పార్టీ నెల్లిమర్ల మండలాధ్యక్షుడు కడగల ఆనంద్, అధికార ప్రతినిధి గేదెల రాజారావు, తదితర కీలక నేతలు సైతం రామతీర్థం వరకు వచ్చి వెనుదిరగడం చర్చకు కారణమైంది. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులకు ఆహ్వానాలు పంపినప్పటికీ సీనియర్ నాయకులు హజరుకాకపోవడం గమనార్హం. డెంకాడ టీడీపీలో అంతర్గత పోరు బహిర్గతం... డెంకాడ జెడ్పీటీసీ మాజీ సభ్యుడు, టీడీపీ సీనియర్ నేత అప్పలనారాయణకు కార్యక్రమానికి ఆహ్వానం లేకపోవడమే అసంతృప్తికి దారితీసిందని ఆ పార్టీ కేడర్‌లో చర్చసాగుతోంది. అదే సమయంలో డెంకాడ మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖరరావుకు మాత్రమే ఆహ్వానం అందడం, ఆయనొక్కడే నియోజకవర్గ టీడీపీ తరఫున హాజరుకావడం మరింత రాజకీయ వేడికి దారితీసింది. ఈ పరిణామం కాస్తా టీడీపీ ఇన్చార్జి బంగార్రాజుకు చేరడంతో ఆయన చివరి నిముషంలో కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అదేబాటలో మిగిలిన నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని బహిష్కరించారు. తొలి నుంచి అంటీముట్టనట్లు.. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాల్గొనే ప్రభుత్వ కార్యక్రమాలకు టీడీపీ కీలక నాయకులు దూరంగా ఉంటూ వస్తున్నారు. కేవలం టీడీపీ మంత్రులు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొనే కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతున్నారు. సాక్షాత్తు శ్రీరాముడి సాక్షిగా రామతీర్థం గిరిప్రదక్షిణ రోడ్డు ప్రారంభ కార్యక్రమాన్ని కూడా బహిష్కరించడం మరోసారి కూటమిలో విభేదాలు బహిర్గతమ య్యాయి. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే నెల్లిమర్ల నడిబొడ్డున ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా టీడీపీ నాయకులు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే తీరును ఖండిస్తూ అధిష్టానానికి బలమైన సంకేతాన్ని పంపించారు. అనంతరం అధిష్టానం ఇరుపక్షాలను కేంద్ర కార్యాలయానికి పిలిపించి బుజ్జగించినా క్షేత్ర స్థాయిలో సమసిపోలేదని తెలుస్తోంది. రామతీర్థం గిరిప్రదక్షిణ రోడ్డు ప్రారంభంలో రాజకీయ వేడి టీడీపీ–జనసేన మధ్య ఆదిపత్య పోరు టీడీపీలో అంతర్గత విభేదాలు బహిర్గతం బాయ్‌కాట్ చేసిన నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ కీలక నేతలు సమావేశానికి వచ్చి రామతీర్థం కల్యాణవేదిక వద్ద ఉండిపోయిన టీడీపీ రాష్ట్ర పరిశీలకులు సువ్వాడ రవిశేఖర్, తదితరులు సభలో పాల్గొన్న మహిళా సంఘాల సభ్యులు, ఉపాధి హామీ వేతనదారులుజనసమీకరణకు అష్టకష్టాలు... నియోజకవర్గ టీడీపీ కీలక నేతల సహకారం లేకపోవడంతో సమావేశానికి జనసమీకరణకు జనసేన నాయకులు ఇబ్బందులు పడ్డారు. వెలుగు, ఉపాధి హామీ శాఖలపై బాధ్యతలు వేయడంతో వారు గ్రామాల నుంచి మహిళ సంఘాల సభ్యులు, ఉపాధి హామీ వేతనదారులను తరలించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సమీప ప్రాంతాల నుంచి ఉపాధిహామీ పనులు చేస్తున్న మహిళ వేతనదారులను ఆటోల్లో తరలించడం వల్ల వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
రబీ పంటలకు సాగునీరు
పార్వతీపురం: జిల్లాలో ఖరీఫ్ మాదిరిగానే రబీ లో సాగుచేసిన పంటలకు సాగునీరు అందించేందుకు ఆలోచన చేస్తున్నట్టు కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల ఆధునికీకరణ, కాలువల బలోపేతం, నీటి వినియోగ సామర్థ్యంపై అధికారులతో కలెక్టర్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు పాతపద్ధతుల్లో కాకుండా కొత్త ఆలోచనలతో ప్రాజెక్టుల నిర్వహణ చేపట్టాలన్నారు. కమాండ్ ఏరియా డెవలప్మెంట్ కింద కాలువలను బలోపేతం చేయాలన్నారు. సాగునీటి వనరులను మెరుగుపరచడం ద్వారా జిల్లాలోని రైతులకు మరింత ప్రయోజనం చేకూరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ చెరువుల దగ్గర ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు ఇంజినీరింగ్ అధికారులకు పూర్తి అధికారాలున్నాయన్నారు. రికార్డుల్లో ఇరిగేషన్ అని ఉంటే ఆ భూమిని పరిరక్షించాల్సిన బాధ్యత ఇరిగేషన్ అధికారులదేనన్నారు. రాను న్న ఖరీఫ్‌లోగా చెరువుల ఆక్రమణలను పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. శత శాతం పన్ను వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ విజయనగరం: 2025–26 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో నగరంలో ప్రముఖ విద్యా, వ్యాపార సంస్థలు పన్ను బకాయిలను పెద్ద మొత్తంలో చెల్లిస్తున్నారు. అందరి సమిష్టి కృషితో శతశాతం పన్ను వసూళ్లే లక్ష్యంగా కమిషనర్ బాలస్వామి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు పన్ను వసూళ్ల ప్రక్రియను చేపడుతున్నారు. రెవెన్యూ సిబ్బంది, కార్యదర్శులతో టీములుగా ఏర్పడి నగర వ్యాప్తంగా బకాయి ఉన్న పన్నులు రాబడుతున్నారు. కొన్ని సంస్థలు లక్షల రూపాయల బకాయిలు ఉండటంతో వాటిని తక్షణమే చెల్లించాలని రెవెన్యూ అధికారులు పట్టుబడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ 50 శాతం ప్రకటించడంతో ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు. -
కోటదుర్గమ్మ హుండీల ఆదాయం రూ.9.56లక్షలు
పాలకొండ: కోటదుర్గమ్మ హుండీల ఆదాయాన్ని బుధవారం ఉదయం దేవదాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో లెక్కించారు. జనవరి 21 నుంచి ఈ నెల 24 వరకు 62 రోజులకు ఆలయంలోని ఎనిమిది హుండీల నుంచి రూ 9,56,439ల ఆదాయం సమకూరిందని ఆలయ కార్యనిర్వహణాధికారి వి.వి.సూర్యనారాయణ తెలిపారు. లెక్కింపులో దేవదాయ శాఖ తనిఖీదారు ఎస్.రామారావు, ఆలయ అర్చకులు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ, పోలీస్ సిబ్బంది, ఏపీజీవీబీ సిబ్బంది పాల్గొన్నారు. వేంకటేశ్వరుని హుండీల ఆదాయం రూ.6.92లక్షలు గరుగుబిల్లి: తోటపల్లి వేంకటేశ్వరస్వామి, కోదండరాముని ఆలయాల హుండీల ఆదాయం రూ.6,92,880 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి బి.శ్రీనివాస్ తెలిపారు. దేవదాయశాఖ బొబ్బిలి డివిజన్ సీఐ ఎన్.రాజకుమారి పర్యవేక్షణలో గతేడాది డిసెంబర్ 31 నుంచి ఈ ఏడాది మార్చి 25 వరకు హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఎం.పకీరునాయుడు, అర్చకులు వి.వి.అప్పలాచార్యులు, టీటీడీఎస్టీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
పరీక్షకు హాజరైన కుమార్తె
ఇంటివద్ద తండ్రి మృతదేహం.. వీరఘట్టం: మండలంలోని నీలానగరం గ్రామంలో గ్రీన్ అంబాసిడర్‌గా పనిచేస్తున్న కురమాన సూర్యనారాయణ అనారోగ్యంతో మంగళవారం రాత్రి శ్రీకాకుళం రిమ్స్‌లో చనిపోయారు. తండ్రి మరణవార్త విని పదోతరగతి పరీక్షలు రాస్తున్న కుమార్తె ఇందుమతి కన్నీరుపెట్టింది. తండ్రి మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి బుధవారం ఉదయం ఇంటికి తీసుకొచ్చారు. తనను అల్లారుముద్దుగా పెంచిన తండ్రి ఇకలేరని తెలిసి గుండెలవిసేలా రోదించింది. ఉదయం 9.30 గంటలకు టెన్త్ ఫిజికల్సైన్స్ పరీక్ష రాయాల్సి ఉంది. తండ్రి శవం ఇంటి వద్ద ఉంచుకుని పరీక్షక్షకు ఎలా వెళ్లేదంటూ విలపించింది. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటే అందరికంటే ముందు మీ నాన్నే సంతోషిస్తారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలంటే పరీక్ష రాయాలి తల్లీ అంటూ బంధువులు బాలికకు నచ్చజెప్పి పరీక్షకు పంపించారు. పుట్టెడు దుఃఖంలో ఇందుమతి పరీక్షకు హాజరుకాగా, తండ్రి మృతదేహాన్ని బంధువులు ఖననం చేశారు. -
జనగణన నిబంధనలపై అవగాహన అవసరం
● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి విజయనగరం: జనగణన నిబంధనలపై అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి సూచించారు. జనగణన ప్రక్రియ రెండుదశల్లో జరుగుతుందని, మొదటి దశలో బ్లాకుల వారీగా గృహాల లెక్కింపు, రెండో దశలో జనగణన జరుగుతుందన్నారు. కలెక్టరేట్ ఎన్నికల కంట్రోల్‌రూమ్‌లో ముఖ్య ప్రణాళిక అధికారి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి శిక్షకులకు రెండురోజుల పాటు నిర్వహించిన శిక్షణ బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సారి జనగణన ఎలక్ట్రానిక్ విధానంలో జరుగుతుందన్నారు. సంబంధిత యాప్‌లో వివరాలు సక్రమంగా నమోదుచేయాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, డిగ్రీ కళాశాల లెక్చరర్, టీఓటీ డాక్టర్ వి.రాఘవస్వామి, మున్సిపల్, మండల స్థాయి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
విజయనగర అర్బన్: ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని స్వర్ణభారతి స్టేడియంలో ఈ నెల 23, 24 తేదీల్లో నిర్వహించిన 7వ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో స్థానిక నేషనల్ స్కూల్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. జూనియర్ బాలుర విభాగంలో 70–75 కిలోల కేటగిరీలో బి.సచిన్ బంగారు పతకం సాధించగా, 54–57 కిలోల కేటగిరీలో డి.కార్తీక్ రజత పతకం గెలుచుకున్నారు. బి.సచిన్ ఏప్రిల్ మొదటి వారంలో నాగపూర్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్రం తరఫున పాల్గొననున్నారు. విద్యార్థుల విజయాలను పురస్కరించుకుని నేషనల్ స్కూల్ కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ బి.రామారావు, డైరెక్టర్ డా. ఎం.ఎ.ఎన్. వెంకటరావు, ఉపాధ్యాయ సిబ్బంది అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. విజేతలను పీఈటీ మహేష్, శ్రీనివాస్ సేవలను వారు ప్రత్యేకంగా కొనియాడారు. -
హుండీల ఆదాయం లెక్కింపు
విజయనగరం టౌన్: పైడితల్లి అమ్మవారి దత్తాలయాలైన శివాలయం వీధిలో ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వరస్వామి ఆలయ హుండీల ద్వారా 97 రోజులుకుగానూ లక్షా రూ. 69వేల 563 నగదు లభించిందని ఆలయ ఈఓ కె.శిరీషా బుధవారం తెలిపారు. అదే విధంగా మూడు కోవెళ్లుగా ప్రసిద్ధిగాంచిన శ్రీ వీరరాజేశ్వరస్వామి దేవాలయ హుండీలకు సంబంధించి 11 నెలలకుగానూ రూ. 76 వేల 553ల నగదు లభించిందన్నారు. భార్యను హత్య చేసిన భర్తకు జీవితఖైదు విజయనగరం క్రైమ్ : అనుమానంతో భార్యను హత్య చేసిన భర్తకు విజయనగరం 5వ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఎన్.పద్మావతి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించినట్టు ఎస్పీ ఏఆర్ దామోదర్ బుధవారం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని పెదమానాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చుక్కపేటకు చెందిన యాకల సత్యనారాయణ అలియాస్ సత్యం తన భార్య గౌరమ్మకు వేరొకరితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో తరచూ గొడవలు పడేవారు. ఆ అనుమానంతోనే 2025 ఫిబ్రవరి ఆరో తేదీన ఓ పామాయిల్ తోట వద్ద గౌరమ్మను హత్య చేశాడు. ఈ విషయమై మృతురాలి కుమారుడు వై.గణేష్ ఫిర్యాదు మేరకు పెదమానాపురం ఎస్ఐ ఆర్.జయంతి కేసు నమోదు చేశారు. గజపతినగరం సీఐ జీఏవీ రమణ దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు విచారణలో నిందితుడు యాకల సత్యనారాయణపై నేరారోపణలు రుజువు కావడంతో జడ్జి పై విధంగా తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ తెలిపారు. పోలీసు వారి తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వై.రేవతి వాదనలు వినిపించారు. శ్రీశైల క్షేత్రంలో తమ్మిన సిస్టర్స్ సంగీత కచేరీ విజయనగరం టౌన్: శ్రీశైల క్షేత్రంలో విజయనగరానికి చెందిన సప్తస్వరాలయ విద్యార్థులు తమ్మిన సిస్టర్స్ శాసీ్త్రయ సంగీత కచేరీ, భరతనాట్య ప్రదర్శన బుధవారం రాత్రి నిర్వహించారు. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా శ్రీశైల దేవస్ధానం నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శన ఆద్యంతం ఆహుతుల మన్ననలు పొందింది. అనంతరం ఆలయ నిర్వహకులు వారిని ఘనంగా సత్కరించారు. విద్యుదాఘాతంతో గృహిణి మృతి పార్వతీపురం రూరల్: వర్షపు నీటిని బయటకు పంపేందుకు చేసిన ప్రయత్నం ఓ గృహిణి ప్రాణం తీసింది. బుధవారం సాయంత్రం పార్వతీపురంలో కురిసిన భారీ వర్షానికి రామాపురం కాలనీకి చెందిన ముక్కు పార్వతి (55) ఇంటి మొదటి అంతస్తుపై నీరు నిలిచిపోయిందని, డ్రైనేజీ పైపులో అడ్డంకిని తొలగించేందుకు ఇనుప గజంతో ప్రయత్నించింది. ఈ క్రమంలో ఇంటి ముందు ఉన్న ఎల్టీ విద్యుత్ తీగలకు గజం తగిలింది. దీంతో విద్యుదాఘాతానికి గురైన ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పార్వతి మృతి చెందింది. ఎన్నికల రోల్స్, మ్యాపింగ్, ఫారంలు పక్కా పరిశీలన పార్వతీపురం: ఎన్నికల రోల్స్, మ్యాపింగ్, ఫారాలు పక్కాగా పరిశీలిస్తున్నట్టు జిల్లా రెవెన్యూ అధికారిణి కె.హేమలత పేర్కొన్నారు. ఆమె తన చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, సమర్దవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలతో సమన్వయం అత్యంత కీలకమన్నారు. జిల్లాలో 68 శాతం మ్యాపింగ్ పూర్తి చేసి రాష్ట్రంలో మూడవ స్థానంలో ఉన్నామన్నారు. ఇంతవరకు 4 వేల మంది ఓటర్లను నమోదు చేయడం జరిగిందన్నారు. ఓటు ఉన్న ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా స్థానికతను నిర్ధారిస్తూ డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. ఎన్నికల రోల్స్ సవరణ ప్రక్రియలో లోపాలున్నట్లు గుర్తిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయుకులు పాల్గొన్నారు. -
పెన్షన్ బిల్లులపై విశ్రాంత ఉద్యోగుల నిరసన
పార్వతీపురం రూరల్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పెన్షన్ బిల్లులకు వ్యతిరేకంగా పార్వతీపురం జిల్లాలో విశ్రాంత ఉద్యోగులు నిరసన గళం వినిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు బుధవారం జిల్లా వ్యాప్తంగా పెన్షనర్లు నల్ల బాడ్జీలు ధరించి తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా నాయకులు ప్రసాద్ మాట్లాడుతూ.. కేంద్రం ప్రతిపాదించిన కొత్త పెన్షన్ విధానాలు విశ్రాంత ఉద్యోగుల ఆర్థిక భద్రతపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. జీవిత చరమాంకంలో ఆసరాగా ఉండాల్సిన పెన్షన్ విషయంలో ఉద్యోగుల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా చూడాలని కోరారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్‌కు విన్నవించినట్టుఆయన వివరించారు. -
హోంగార్డు కుటుంబానికి సిబ్బంది చేయూత
విజయనగరం క్రైమ్ : మహిళ హోంగార్డు ఎం.రోహిణికుమారి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆమె కుటుంబ సభ్యులకు ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాలకు అదనపు ఎస్పీ పి.సౌమ్యలత తన చాంబర్లో రూ.3,15,240ల చెక్కును బుధవారం అందజేశారు. రోహిణికుమారి కుమారుడు ఎం.హేమంత్బాబుకు సహోద్యోగులు సేకరించిన నగదును చెక్‌తో పాటు కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఫ్యూనరల్ ఖర్చులుగా ఇచ్చిన రూ.5వేలు అందజేశారు. తోటి సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక్క రోజు వేతనాన్ని అందజేయడం అభినందనీయమని అదనపు ఎస్పీ పేర్కొన్నారు. ఇటువంటి సాయం విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఐక్యతతో పాటు వారి కుటుంబాలకు అండగా ఉన్నామన్న భరోసా ఇస్తాయన్నారు. కార్యక్రమంలో రిజర్వు ఇన్స్పెక్టర్ ఆర్.రమేష్‌కుమార్, కార్యాలయ సూపరింటెండెంట వి.లలిత, కోపరేటివ్ కార్యదర్శి సుశీల, కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
104లో ల్యాబ్ టెక్నీషియన్ సేవలు లేనట్టేనా..!
విజయనగరం ఫోర్ట్: 104 వాహనాల్లో ప్రస్తుతం అందిస్తున్న సేవలతో పాటు ల్యాబ్ టెక్నీషియన్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చంద్రబాబు సర్కార్ చెప్పింది. అందుకోసం 104 వాహనాల బాధ్యతను చూస్తున్న అరబిందో సంస్థను తప్పించి టీడీపీ నేతకు చెందిన సంస్థకు ఆ బాధ్యతను అప్పగించింది. ఆ సంస్థ బాధ్యతలు చేపట్టి పది నెలలు అవుతున్నా ఇంతవరకు 104 వాహనాల్లో ల్యాబ్ టెక్నీషియన్లను నియమించిన దాఖలాలు లేవు. ఇప్పటికీ ఆ సేవలు గ్రామీణ ప్రాంత ప్రజలకు అందని పరిస్థితి. దీంతో చంద్రబాబు సర్కార్ చెప్పిన మాటలకు చేతలకు పొంతన ఉండడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వాహనాలు గ్రామాలకు వెళ్లి బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ వంటి ప్రాధమిక స్థాయి వైద్య పరీక్షలు చేసేందుకు తీసుకొచ్చారు. అదే సమయంలో ఉచితంగా పరీక్షల చేయడంతో పాటు గర్భిణులు, చిన్న పిల్లల ఆరోగ్య పరిశీలన, ఆరోగ్య అవగాహన కార్యక్రమాల నిర్వహణ వంటి సేవలు కూడా చేయాల్సి ఉంది. నియామకం మరిచిన వైనం 104 వాహనాల నిర్వాహణను అరబిందో సంస్థను తప్పించి తర్వాత భవ్య సంస్థకు ఆ బాధ్యతను చంద్రబాబు సర్కార్ అప్పగించింది. జిల్లాలో 104 వాహనాలు 46 ఉన్నాయి. ఈ మేరకు 46 మంది ల్యాబ్ టెక్నీషియన్లను, బఫర్ కింద మరో నలుగురిని మొత్తంగా 50 మంది ల్యాబ్ టెక్నీషియన్లను నియమించాల్సి ఉంది. అయితే 104 వాహనాలను నిర్వహిస్తున్న సంస్థ బాధ్యతలు తీసుకుని పది నెలలు అవుతున్నా ఇంతవరకు నియామకాలు చేపట్టింది లేదు. అరకొరగా వైద్య పరీక్షలు 104 వాహనాల్లో అరకొరగా వైద్య పరీక్షలతోనే సరిపెడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ల్యాబ్ టెక్నీషియన్లకు బదులు రోగులకు ఏఎన్ఎంలు, డ్రైవర్లు కూడా వైద్య పరీక్షలు చేస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. బీపీ, షుగర్, యురిన్ అల్బమిన్, ఈసీజీ, హెచ్‌బీ సాధారణ రక్త పరీక్షలతో సరిపెడుతున్నారు. తాజా కాంట్రాక్టులో 21 పరీక్షలు నిర్వహిస్తామని చెప్పినప్పటకీ ఆ విధంగా జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. వైద్యులు డుమ్మా.. 104 వాహనాల ద్వారా ప్రతీ రోజు వాహనం వెళ్లే గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యుడుతో పాటు సిబ్బంది అందరూ పూర్తి స్థాయిలో రోగులకు అందుబాటులో ఉండాలి. కానీ చాలా చోట్ల వైద్యులు ఇలా వచ్చి.. అలా వెళ్లిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి కొన్నిచోట్ల మధ్యాహ్నం ఒంటి గంటకే వెళ్లిపోతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మంచానికే పరిమితం అయిన రోగుల ఇంటికి వెళ్లి వారికి వైద్య సేవలు అందించాలి. కానీ అది చాలా చోట్ల జరగడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి అక్కడ పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించి వారిని పౌష్టికాహార పునరావాస కేంద్రం (ఎన్ఆర్సీ)కి పంపించాలి. ఈ కార్యక్రమం కూడా సక్రమంగా జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. మందులు పూర్తి స్థాయిలో లేని పరిస్థితి 104 వాహనాల వద్దకు వచ్చేది పేద రోగులే. వారికి పూర్తి స్థాయిలో మందులు ఇవ్వడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. గాయాలకు ఉపయోగించే పెరిమిథ్రాన్, ముప్రోసిన్ ఆయింట్ మెంట్లు, బీపీకి ఉపయోగించే ఎమ్లాడోఫిన్, టెల్మస్టారన్ మాత్రలు, కడుపులో నొప్పికి ఉపయోగించే మెట్రోనిడజోల్ మాత్రలు, సిరప్లు, దగ్గుకు ఉపయోగించే అంబ్రాక్సోల్ సిరప్లు కొరత ఉన్నట్టు తెలిసింది. 104లో సేవలు ప్రారంభిస్తామని చెప్పిన చంద్రబాబు సర్కార్ టీడీపీ అధికారం చేపట్టి రెండేళ్లు అవుతున్నా ప్రారంభించని వైనం జిల్లాలో 104 వాహనాలు 46 ఫ్యామిలీ డాక్టర్ శిబిరాలకు వైద్యులు డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలుల్యాబ్ టెక్నీషియన్లు లేరు.. 104 వాహనాల్లో ల్యాబ్ టెక్నీషియన్ల ప్రస్తుతం లేరు. మందులు కొరత ఉన్నట్టు నా దృష్టికి రాలేదు. మందులు కొరత ఉన్నట్టయితే మా సిబ్బంది చెబుతారు. ఎక్కడైనా మందులు కొరత ఉంటే సమీపంలో ఉన్న పీహెచ్సీ, విలేజ్ క్లినిక్ దగ్గర తీసుకువస్తాం. – కె.శ్రీకాంత్, 104 జిల్లా మేనేజర్ -
మాతృ, శిశు మరణాల పట్ల అలసత్వం వద్దు : కలెక్టర్
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో మాతృ, శిశు మరణాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మరణాలకు జవాబుదారీతనం ఉండాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బుధవారం అక్టోబర్ నుంచి ఫిబ్రవరి నెల వరకు జరిగిన మాతృ, శిశు మరణాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మరణాలు సంభవించకుండా ప్రజల ప్రాణాల రక్షణ కోసం వైద్యాధికారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. ఒక్కొక్క మృతికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని మరణాల విషయంలో అంబులెన్సు ఆలస్యం కావడం, నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం, ప్రిస్కప్షన్ లేకుండా మందులు అమ్మడం ఇలాంటి కారణాలు గుర్తించి ఆయా మరణాలపై సమగ్ర నివేదికను ఇవ్వాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి, డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మశ్రీ రాణి, ఘోషాస్పత్రి గైనికాలజీ హెచ్ఓడీ డాక్టర్ అరుణ శుభశ్రీ , డీఐఓ డాక్టర్ రెడ్డి అచ్చుతకుమారి, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కె.రాణి, ఐసీడీఎస్ పీడీ బాలామణి తదితరులు పాల్గొన్నారు. మ్యుటేషన్ తిరష్కరణలు తగ్గాలి విజయనగరం: జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. పట్టాదారు పాసుపుస్తకాలు, రీసర్వే, 22 ఏ భూములు తదితర రెవెన్యూ అంశాలపై దిశానిర్దేశం చేశారు. వీటిపై జేసీ సేతు మాధవన్‌తో కలిసి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం, రీసర్వే వేగవంతం చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఒక్క తప్పుకూడా లేకుండా పాసుపుస్తకాలను రూపొందించాలని, రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని స్పష్టం చేశారు. అదేవిధంగా మ్యుటేషన్లను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని దీనిలో జిల్లా వెనుకబడి ఉందని దానిని మెరుగుపరచాలని కోరారు. జిల్లాలో గ్యాస్ కొరత లేదు జేసీ సేతుమాధవన్ మాట్లాడుతూ జిల్లాలో ఎల్పీజీ కొరత లేదని అయినా పత్రికలలో కొరత ఉన్నట్టు విరుద్ధ వార్తలు వస్తున్నాయని వాటిని పరిశీలించాలని సూచించారు. ఇళ్లకు సప్లై చేసే సిలిండర్లు కొరత లేకుండా, పాఠశాలలు సాంఘిక సంక్షేమ, బీసీ వెల్ఫేర్, వసతిగృహాలు తదితర వాటికి కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. ఐ.వి.ఆర్.ఎస్, ఇంటర్ డిపార్టుమెంటల్ అంశాలపై జిల్లా అధికారులతో జేసీ సమీక్షించారు. సమావేశంలో డీఆర్ఓ సత్తిబాబు, ఎస్డీసీఈ మురళి , ఆర్డీఓలు పాల్గొన్నారు. వర్చువల్‌గా తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. -
జీహెచ్‌వీ సంస్థకు వంశీ ఆర్ట్ థియేటర్స్ పురస్కారం
విజయనగరం టౌన్: వంశీ ఆర్ట్ థియేటర్స్ (హైదరాబాద్) ప్రతీ ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారాలలో భాగంగా ఈ ఏడాది పరాభవనామ సంవత్సర ఉగాదికి వివిధ రాష్ట్రాలలో తెలుగు సాంస్కృతిక సేవా సంస్థల విభాగంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ది గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం (జీహెచ్‌వీ) సంస్థకు అపూర్వ గౌరవం దక్కింది. సంస్థ ప్రధాన కార్యదర్శి భోగరాజు సూర్యలక్ష్మి పురస్కారాన్ని వంశీరామరాజు చేతుల మీదుగా అందుకున్నారు. ఈ మేరకు బుధవారం ఆమె మాట్లాడుతూ వంశీఆర్ట్ థియేటర్స్ అందించిన ఉగాది పురస్కారం స్వీకరించడంతో పాటూ అంతర్జాతీయ కవి సమ్మేళనంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ మేరకు జిల్లాకు చెందిన పలువురు హర్షం వ్యక్తం చేశారు. -
రాములోరి సేవలో హైకోర్టు జడ్జి
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానాన్ని హైకోర్టు జడ్జి జస్టిస్ టీసీడీ శేఖర్ బుధవారం సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఆహ్వానం పలికారు. అనంతరం స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేసి క్షేత్ర మహాత్యాన్ని వివరించారు. ప్రముఖ న్యాయవాది కోలగట్ల ఇకలేరు.. విజయనగరం క్రైమ్ : ప్రముఖ న్యాయవాది, ఏపీ రాష్ట్ర బార్ కౌన్సిల్ నేత కోలగట్ల తమ్మన్నశెట్టి(67) బుధవారం మృతి చెందారు. నగరంలో ఎస్వీఎన్ నగర్ సమీపంలోని మహాలక్ష్మినగర్‌లో తన స్వగృహంలో తమ్మన్నశెట్టి ఆత్మహత్య చేసుకున్నట్టు విజయనగరం టూ టౌన్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఆయన సోదరుడు స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు చెప్పారు. తమ్మన్నశెట్టికి ఇద్దరు కుమార్తెలు. వీరిద్దరూ ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. తమ్మన్నశెట్టి మృతి వార్త తెలుసుకున్న మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య సంతాపం తెలిపారు. పార్వతీపురం రూరల్ : చదువులో ఒత్తిడి, ఇంటికి దూరంగా ఉండలేక ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు యత్నించాడు. బలిజిపేట మండలంలోని పలగర గ్రామానికి చెందిన కెల్లా దిలీప్ ఏలూరులోని ఒక ప్రైవేటు కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ప్రథమ సంవత్సరంలో కొన్ని సబ్జెక్టులు ఉత్తీర్ణత సాధించలేకపోవడం, తోడుగా సొంత ప్రాంతానికి దూరంగా ఉండి చదువుకోవడం ఇష్టం లేక దిలీప్ కొంతకాలంగా మనస్తాపంతో ఉన్నాడు. ఇటీవల సెలవులకు గ్రామానికి వచ్చిన ఆయన, బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను పార్వతీపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. -
గ్రానైట్ క్వారీపై దర్యాప్తు
వంగర: మండల పరిధి మడ్డువలస గ్రానైట్ కంపెనీకి సంబంధించి మైనింగ్ అధికారులు బుధవారం దర్యాప్తు చేశారు. గ్రామానికి చెందిన వైస్సార్సీపీ నేత బూరాడ వెంకటరావు మడ్డువలసలో అక్రమ గ్రానైట్ తవ్వకాలు జరుగుతున్నాయని ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు టెక్నికల్ అసిస్టెంట్లు ప్రశాంత్ కుమార్, శ్రీనివాసరావు గ్రానైట్ తవ్వకాలు చేసే ప్రదేశాన్ని పరిశీలించారు. గ్రానైట్ క్వారీ వద్ద తవ్వకాలకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై ఆరా తీశారు. అక్కడ ఉన్న సిబ్బంది గ్రానైట్ వారి అనుమతులకు సంబంధించి ఎటువంటి పేపర్లు అందజేయకపోవడంతో మైనింగ్ అధికారులు పూర్తి స్థాయి వివరాలు సేకరించి జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తామని వెల్లడించారు. ఫిర్యాదుదారుడు బూరాడ వెంకటరావు మాట్లాడుతూ గతంలో ఇదే గ్రానైట్ క్వారీని మైనింగ్ అధికారులు సీజ్ చేసి రూ.47 కోట్లు ప్రభుత్వానికి కట్టాలని ఆదేశాన్నాయని తెలిపారు. ప్రస్తుతం కూడా ఎక్కడ క్వారీకి ఎటువంటి అనుమతులు లేవని వెంకటరావు విలేకరులు ఎదుట వెల్లడించారు. -
బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయాలి : కలెక్టర్
పార్వతీపురం: ఎక్కడైనా బాల్య వివాహాలు చేస్తే వారిపట్ల కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి హెచ్చరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బాల్య వివాహాల నిర్మూలనపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అవగాహన కల్పించేందుకు జాగృతులను చేయాలని, ప్రత్యేక అవగాహన సదస్సులను నిర్వహించాలన్నారు. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు ఎవరికై నా తెలిస్తే 1098, 181 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. డ్రగ్స్, గంజాయి వినియోగంపై ఉక్కుపాదం మాదక ద్రవ్యాలు, మత్తు పదార్ధాల వినియోగంపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి పోలీసు శాఖను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటి సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల రవాణా నివారణకు పోలీస్, ఫారెస్టు, ఎకై ్సజ్ శాఖలతో జాయింట్ ఆపరేషన్ నిర్వహించాలన్నారు. గంజాయి వినియోగించిన, విక్రయించినా బైండోవర్ కేసులు నమోదు చేయాలన్నారు. సమావేశంలో ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి, సబ్‌కలెక్టర్ ఆర్.వైశాలి, ఎడిషనల్ ఎస్పీ వి.మనీషారెడ్డి, జిల్లా రవాణాధికారి టి.దుర్గా ప్రసాద్, జిల్లా ప్రజారావాణాధికారి శ్రీనివాసరావు, తదితరులున్నారు. సీఎస్సీ పనులు పూర్తి కావాలి జిల్లాలోని కమ్యూనిటీ శానిటరీ కాంప్టెక్ (సీఎస్సీ) పనులు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ప్రభాకరరెడ్డి అధికారులకు ఆదేశించారు. బుధవారం ఆర్డబ్ల్యూఎస్, ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. రోజువారీ ప్రగతి నివేదికలను వివరించాలన్నారు. ఇంతవరకు పూర్తి చేసిన పనులకు సంబంఽధించి బిల్లులను ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
జాతీయ బాక్సింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: జాతీయ స్థాయిలో జరగనున్న బాక్సింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ నెల 21, 22 తేదీల్లో విశాఖలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి జూనియర్స్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు తమ సత్తా చాటారు. 70–75 కేజీల విభాగంలో తలపడిన క్రీడాకారుడు బి.సచిన్ బంగారు పతకం దక్కించుకోగా... మరో క్రీడాకారుడు డి.కార్తీక్ వెండి పతకం కై వసం చేసుకున్నాడు. ఇరువురు క్రీడాకారులు త్వరలో నాగపూర్‌లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచటంతో పాటు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఎస్.వెంకటేశ్వరరావు, బాక్సింగ్ కోచ్ బి.ఈశ్వరరావు అభినందించారు. -
29న ‘నరసం’ ఉత్తరాంధ్ర మహిళల సదస్సు
విజయనగరం టౌన్: నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర మహిళల సదస్సును ఈ నెల 29న ఆదివారం క్షత్రియ కల్యాణ మండపంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు చివుకుల శ్రీలక్ష్మి, భోగరాజు సూర్యలక్ష్మి తెలిపారు. ఈ మేరకు గురజాడ స్వగృహంలో సదస్సుకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరవుతారన్నారు. ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. విశిష్ట అతిథులుగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, సంస్కృత, తెలుగు అకాడమీ చైర్మన్ ఆర్డి.విల్సన్, శరత్ చంద్ర, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ తదితరులు హాజరవుతారని తెలిపారు. సంఘం గౌరవ అధ్యక్షురాలు తేళ్ల అరుణ సభాధ్యక్షతన నిర్వహించే కార్యక్రమంలో ప్రముఖ సాహతీవేత్తలు రచించిన పుస్తకావిష్కరణలు, నవ్యాంధ్ర కీర్తి పురస్కారాలు, జిల్లా ప్రముఖులకు సత్కారాలు ఉంటాయన్నారు. సాహితీవేత్తలందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు కె.అనూరాధ, సహాయ కార్యదర్శి దాసరి పద్మ, గురజాడ ఇందిర తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల హామీలు నెరవేర్చాలి : సీపీఐ
పార్వతీపురం రూరల్ : ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహించిన ఆందోళనలో జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావు పాల్గొని మాట్లాడారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇవ్వాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇంటి నిర్మాణ ఆర్థిక సాయాన్ని రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న టిడ్కో ఇళ్లను తక్షణమే లబ్ధిదారులకు స్వాధీనం చేయాలని, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లను మంజూరు చేయాలని, 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్న్ హామీని అమలు చేయాలని, పెన్షన్ల తొలగింపు ప్రక్రియను ఆపాలని కోరారు. దళిత, గిరిజన వాడల్లో శ్మశాన వాటికలకు స్థలాలు కేటాయించి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా నాయకులు ఆర్వీఎస్ కుమార్, ఈవీ నాయుడు, గోపి నాయుడు, పువ్వల ప్రసాద్, ఎం.గోపాల్, సింహాద్రి దుర్గారావు, రవికుమార్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద ధర్నా -
క్షయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి
● ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దేవీమాధవి విజయనగరం ఫోర్ట్: క్షయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దేవీమాధవి అన్నారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో మంగళవారం నిర్వహించిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు ఉంటే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలన్నారు. క్షయ వ్యాధిని త్వరగా గుర్తించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని తగ్గించవచ్చునని తెలిపారు. మందులు క్రమం తప్పకుండా వాడాలన్నారు. అనంతరం సర్వజన ఆస్పత్రి పలమనాలజిస్టు డాక్టర్ సంతోష్‌కుమార్‌ను సన్మానించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ, డీటీసీఓ డాక్టర్ రాణి, ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లోక్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులను ఆదుకుంటాం..
● 33 శాతం కంటే ఎక్కువ నష్టం జరిగితే పరిహారం ● జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవతివీరఘట్టం: పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని జిల్లా వ్యవసాయ శాఖాధికారిణి జి.సత్యవతి అన్నారు. మండలంలో ఇటీవల వీచిన ఈదురుగాలులకు నేలమట్టమైన మొక్కజొన్న, అరటి పంటలను మంగళవారం ఆమె తమ బృందంతో కలిసి పరిశీలించారు. కిమ్మి, చిట్టపులివలస, నడిమికెల్ల తదితర గ్రామాల్లో పంటలను పరిశీలించారు. 33 శాతం కంటే ఎక్కువ నష్టం జరిగితే పరిహారం వస్తుందని, అటువంటి రైతుల పేర్లు నమోదు చేస్తామని సూచించారు. అలాగే పిందె దళలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు చేపట్టాల్సిన చర్యలను రైతులకు వివరించారు. ఆమెతో పాటు ఏడీఏ రత్నకుమారి, వీరఘట్టం ఏఓ జె.సౌజన్య తదితరులున్నారు. -
రైలులోనే గర్భిణి ప్రసవం
● తల్లీబిడ్డ క్షేమం పార్వతీపురం రూరల్: రైలులో ప్రయాణిస్తూ ఓ గర్భిణి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఒడిశాలోని రూర్కెలా నుంచి తమిళనాడులోని జోలార్పైట్టె జంక్షన్‌కు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో సప్నకుమారి అనే మహిళ భర్తతో కలిసి మంగళవారం ప్రయాణిస్తోది. ఏడు నెలల గర్భిణి అయిన ఆమెకు రాయగడ దాటిన తర్వాత ఒక్కసారిగా పురిటినొప్పులు మొదలయ్యాయి. రైలు పార్వతీపురం బెలగాం స్టేషన్ సమీపించేసరికి పురినొప్పులు ఎక్కువ కావడంతో తోటి ప్రయాణికులు ఆమెవద్దకు చేరుకుని ప్రసవానికి సహకరించారు. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీస్ (జీఆర్పీ) సిబ్బంది, హెచ్‌సీ రత్నకుమార్ రైల్వే స్టేషనన్‌కు చేరుకుని తల్లీబిడ్డను పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. -
ఉద్యానరంగ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్
● చదువుతో పాటు కళలకు ప్రాధాన్యమివ్వాలి ● కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి గరుగుబిల్లి: ప్రస్తుత సమాజంలో కృత్రిమ మేథ(ఏఐ), కంప్యూటర్లు, సాఫ్ట్వేర్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చినా ఉద్యాన రంగానికి ఉన్న ప్రాముఖ్యత, ఆవశ్యకత ఎప్పటికీ తగ్గదని, ఉద్యాన రంగ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉద్యాన కళాశాలలో మంగళవారం నిర్వహించిన 12వ అంతర్ కళాశాల సాంస్కృతిక, సాహిత్య సమ్మేళన ప్రారంభోత్సవంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌లో వైద్యరంగంలో కూడా రోగ నిర్ధారణ నుంచి శస్త్ర చికిత్సల వరకు కంప్యూటర్లే చేసేరోజులు వస్తాయన్నారు. కానీ మొక్కల పెంపకం, ఉద్యాన రంగం వంటి అంశాల్లో మానవ ప్రమేయం, విద్యార్థుల నైపుణ్యం ఎంతో కీలకమన్నారు. ఉద్యాన రంగంలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, విద్యార్థులు తమ ప్రతిభను చాటుకోవాలన్నారు. ఉద్యాన వన విద్య ప్రకృతికి అత్యంత సమీపంలో ఉందని, ఈ రంగంలో మానసిక ప్రశాంతతను పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా తమలోని దాగివున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు కళలు, క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. మన్యం జిల్లాలో విద్యార్థుల కోసం ‘మన్యం డాన్స్’, ‘ఆనందలహరి’ వంటి కార్యక్రమాలను రూపొందించామని, ప్రతీ వారం విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించుకునేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ ధనుంజయరావు మాట్లాడుతూ ఏఐ వచ్చినా ప్రకృతి రంగానికి డిమాండ్ ఎప్పుడూ తగ్గదన్నారు. మొక్కల పెంపకంలో అధునాతన సాంకేతికతను వినియోగించుకునేందుకు ఉద్యానరంగం ఎంతో దోహదపడుతుందన్నారు. కళాశాలలో విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు మనస్సుకు దగ్గరగా చేరువయ్యాయన్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు తమ కళా ప్రదర్శనలతో అందరినీ ఆకర్షించారు. ఇందులో ఉత్తమ ప్రదర్శనలు చేసిన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్‌లో మరిన్ని ప్రదర్శనలు ఇవ్వాలని ఆయన ప్రోత్సహించారు. కార్యక్రమంలో జేసీ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి, సబ్‌కలెక్టర్ ఆర్.వైశాలి, డీఈఓ పి.బ్రహ్మాజీరావు, తదితరులు పాల్గొన్నారు. -
రైలు ఢీకొని యువకుడి దుర్మరణం
పార్వతీపురం రూరల్: పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన పార్వతీపురం మండలం నర్సిపురం సమీపంలో చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాలు.. నర్సిపురం గ్రామానికి చెందిన నాగిరెడ్డి వెంకటేశ్వర్లు (31) మంగళవారం ఉదయం బహిర్భూమికి వెళ్లే క్రమంలో రైలు పట్టాలను దాటుతున్నాడు. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న రైలును గమనించకపోవడంతో అది బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వెంకటేశ్వర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రైల్వే హెచ్‌సీ రత్నకుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంత నిర్లక్ష్యమా..!
విజయనగరం ఫోర్ట్: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందాన తయారైంది జిల్లా క్షయ నివారణ శాఖ అధికారుల పరిస్థితి. పోస్టులు భర్తీ చేయాలని ఉన్నత అధికారులు చెప్పినప్పటకీ ఇంతవరకు చేపట్టకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంతో మంది నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. టీడీపీ సర్కార్ వచ్చిన తర్వాత వైద్య రంగంలో పోస్టులు కొత్తగా భర్తీ చేసిన దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. జీరో వేకేన్సీ పాలసీ ద్వారా వైద్య శాఖల్లో పోస్టులు ఖాళీ అయిన వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేశారు. ఇలా విజయనగరం జిల్లాలో రెండు వేలకు పైగా పోస్టులు వైద్య రంగంలో భర్తీ చేశారు. ఐదు పోస్టుల భర్తీకి ఆదేశాలు క్షయ నివారణ శాఖలో ఐదు పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు రెండు నెలలు క్రితం ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇంతవరకు పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. దీంతో పోస్టులు భర్తీ చేస్తారో.. లేదోనని నిరుద్యోగ అభ్యర్థుల్లో సందేహం నెలకొంది. పబ్లిక్, ప్రైవేటు పార్టనర్షిప్ కో ఆర్డినేటర్ (పీపీసీ) పోస్టు–1, సీనియర్ టీబీ సూపర్వైజర్ పోస్టు–1. ట్యూబర్క్యూలొసిస్ ల్యాబ్ సూపర్వైజర్ (ఎస్టీఎల్ఎస్) పోస్టులు–2, అకౌంటెంట్ పోస్టు ఒకటి భర్తీ చేయాల్సి ఉంది. వేలాది మంది ఎదురుచూపులు వైద్య రంగంలో వివిధ కోర్సులు చదివిన వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారు. కొంతమంది బీ ఫార్మసీ, డీ ఫార్మసీ, ఎంఎల్టీ, డీఎంఎల్టీ, డీఎంఐటీ, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, థియేటర్ అసిస్టెంట్, ఆడియోమెట్రిషిన్, ఫిజియోథెరపిస్టు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ఆఫ్తామాలజీ టెక్నీషియన్ వంటి కోర్సులు చదివిన అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు. వీరంతా పోస్టుల భర్తీకి ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తుందా... అని ఆశగా ఎదురు చూస్తున్నారు. క్షయ రోగుల పర్యవేక్షణ కోసం.. క్షయ వ్యాధి బారిన పడ్డ వారు సకాలంలో మందులు వాడుతున్నారా.. లేదా.. మందులు మధ్యలో ఏమైనా మానివేస్తున్నారా.. అని సూపర్వైజర్లు పర్యవేక్షిస్తారు. కఫం పరీక్ష కోసం వచ్చిన వారికి సకాలంలో పరీక్ష చేస్తున్నారా.. లేదా, ఆశ వర్కర్లు ద్వారా వారికి సకాలంలో మందులు అందుతున్నాయా.. లేదా, నెలకు అందించే రూ.1000 ప్రోత్సహకం వారికి అందుతుందా.. లేదా అని పర్యవేక్షిస్తారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే రోగుల్లో క్షయ లక్షణాలు ఉన్న వారిని ప్రభుత్వ ఆస్పత్రులకు పంపిస్తున్నారా.. లేదా అని పీపీసీ పర్యవేక్షిస్తారు.ఆదేశాలొచ్చాయి.. క్షయ నివారణ శాఖలో ఐదు పోస్టులు భర్తీ చేయమని ఆదేశాలు వచ్చాయి. త్వరలోనే పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేస్తాం. – డాక్టర్ కె.రాణి, జిల్లా క్షయ నివారణ అధికారిణి క్షయ నివారణ శాఖ పోస్టుల నియామకంలో జాప్యం భర్తీకి ఆదేశాలొచ్చినా పట్టించుకోని వైనం నోటిఫికేషన్ విడుదల చేయని ఉన్నతాధికారులు -
ఉద్యోగాల వల.. చిక్కారంటే విలవిల
● నిత్యం వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు ● బాధితులకు కలగని న్యాయం ● ఎల్.ప్రభావతి అనే గిరిజన మహిళకు గుమ్మలక్ష్మీపురం మండలం మండ గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో అటెండర్ ఉద్యోగం కల్పిస్తామని ఓ సంస్థ చెప్పింది. విద్యాధరి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ పేరిట నియామక ఉత్తర్వుల లేఖ కూడా ఇచ్చారు. జీతం రూ.15 వేలు.. గతేడాది డిసెంబరులో ఇది జరగగా.. అంతకుముందు, అదే ఏడాది ఆగస్టు నెలలో ఆమెకే కురుపాంలోని ఆశ్రమ పాఠశాలలో వాలంటీరు(అటెండర్)గా నియమిస్తూ జేకే రూరల్–అర్బన్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సొసైటీ పేరిట నియామక లేఖ వచ్చింది. ఈ ఉద్యోగం కోసం ప్రభావతి భర్త చెల్లించిన మొత్తం రూ.1.70 లక్షలు. కొద్దిరోజులు పోయాక గానీ.. ఆ భార్యాభర్తలకు తెలియలేదు. తాము మోసపోయామని! నాటి నుంచి న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ● స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్రలో ఉద్యోగాల పేరిట మోసపోయిన సుమారు 70 మంది బాధితులు నేటికీ అధికారులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఎక్కడా వీరికి న్యాయం జరగడం లేదు. దాదాపు రూ.2 కోట్లకుపైగా నిరుద్యోగ అభ్యర్థుల నుంచి ఓ సంస్థ పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. మూడు నెలలు వీరితో విధులు చేయించినా, అందుకు సంబంధించిన జీతాలు కూడా లేవు. పైగా, పనుల సమయంలో పరికరాలు, ఇతర అవసరాల కోసం సొంత డబ్బులు పెట్టుకున్నామని బాధితులు చెబుతున్నారు. కురుపాం నియోజకవర్గంలో ఒక మహిళా ప్రజాప్రతినిధి ద్వారా ఈ ఉద్యోగాల కోసం తమకు తెలిసిందని పలువురు తెలిపారు. సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో ఉద్యోగాల పేరిట నిరుద్యోగ యువత మోసపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగమని ఆశ చూపి కొంతమంది వివిధ సంస్థల పేరుతో నియామక పత్రాలు సృష్టిస్తున్నారు. పాఠశాలలు, ఆస్పత్రులు, పంచాయతీలు, ఇతర శాఖల్లో పోస్టులంటూ బురిడీ కొట్టిస్తున్నారు. ప్రధానంగా నేరుగా ప్రభుత్వ శాఖలని చెప్పకుండా.. ఓ సంస్థ ద్వారా స్వచ్ఛందంగా సహాయకారులుగా పనిచేస్తారని చూపుతున్నారు. స్వచ్ఛంద సర్వీసు అనుకుని.. ఆయా శాఖల అధికారులు, ప్రధానోపాధ్యాయులు సైతం పని చేసేందుకు అనుమతిస్తున్నారు. నెలలు గడిచి, జీతాల వద్దకు వస్తేనే గానీ అసలు విషయం వెలుగులోకి రావడం లేదు. ఇలా మోసపోయిన వారిలో గిరిజన యువతే అధికంగా ఉంటున్నారు. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన గిరిజన నిరుద్యోగులు సులువుగా వీరి ఉచ్చులో పడుతున్నారు. స్థానికంగా ఉన్న కొంతమంది ప్రజాప్రతినిధులు, చోటామోటా నాయకుల పాత్ర ఇందులో ఉంటోందన్న ఆరోపణలు బాధితుల మాటల ద్వారా తెలుస్తోంది. -
విద్యుత్ కార్యాలయంలో అల్యూమినియం వైర్లు చోరీ
రామభద్రపురం: స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ కార్యాలయంలో అల్యూమినియం విద్యుత్ వైర్లు సోమవారం రాత్రి చోరీకి గురయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ కార్యాలయానికి వేసిన తాళం విరగ్గొట్టి అందుల్లో ఉన్న విద్యుత్ వైర్లు దొంగలు చోరీ చేశారు. మంగళవారం ఉదయం కార్యాలయం శుభ్రపరిచేందుకు వెళ్లిన సిబ్బంది తాళం విరిగ్గొట్టి ఉండడం చూసి పక్కనే ఉన్న సబ్‌స్టేషన్ షిప్ట్ ఆపరేటర్‌కు చెప్పారు. వెంటనే షిప్ట్ ఆపరేటర్ విద్యుత్ శాఖ ఏఈ సత్యనారాయణకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలిసిన వెంటనే ఏఈ కార్యాలయానికి చేరుకుని పరిశీలించిన అనంతరం సుమారు 3.2 కిలోమీటర్లు సరిపడా ఉన్న అల్యూమినియం వైరు చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు విద్యుత్ కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం ఏఈ ఫిర్యాదు మేరకు ఎస్ఐ వి.ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వక్ఫ్‌బోర్డ్ మాజీ అధ్యక్షుడు కరీమ్ మృతికి సంతాపం విజయనగరం టౌన్: వక్ఫ్‌బోర్డ్ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది అబ్దుల్ కరీమ్ (59) సోమవారం రాత్రి మృతి చెందారు. ముస్లింల అభ్యున్నతికి విశేషంగా కృషి చేయడమే కాకుండా సమాజ సేవకులుగా, న్యాయవాద వృత్తిలో రాణిస్తూ అందరి మన్ననలు పొందిన అబ్దుల్ కరీమ్ అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందడం పట్ల ముస్లిం పెద్దలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాడ సానుభూతి తెలిపారు. -
తెరపైకి.. పునర్విభజన!
సాక్షి, పార్వతీపురం మన్యం: ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న నియోజకవర్గాల పునర్విభజన అంశం ఎట్టకేలకు తెరపైకి వచ్చింది. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం నుంచి స్పష్టమైన సంకేతాలు రావడం.. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే దీనిపై బిల్లు పెట్టనుండడంతో జిల్లా రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ మొదలైంది. విభజన పూర్తయిన తర్వాత తమకు అనుకూల రిజర్వేషన్ వస్తుందని కొందరు, నియోజకవర్గాల పెంపుతో తమకూ సీటు పక్కా అని మరికొందరు ఆశ పడుతుంటే... మరోవైపు ఇన్నాళ్లూ ఇప్పుడున్న నియోజకవర్గ సీటుపైనే రుమాలు వేసుకుని, ఎదురుచూస్తున్న ఇంకొందరు నాయకులు నిరాశకు లోనవుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల విభజన తర్వాత పార్వతీపురం (ఎస్సీ), సాలూరు, కురుపాం, పాలకొండ (ఎస్టీ) నియోజకవర్గాలుగా పార్వతీపురం మన్యం ప్రత్యేకంగా ఏర్పడింది. గిరిజన ప్రాంతాల ప్రాతిపదికన ఏర్పడిన జిల్లా కావడంతో అరకు పార్లమెంట్ నియోజకవర్గంలోనే పార్వతీపురం మన్యం కూడా కలిసింది. ప్రస్తుతం ఉన్న అరకు పార్లమెంట్ స్థానం రెండు జిల్లాలు, ఏడు అసెంబ్లీ స్థానాలతో ఉంది. భౌగోళికంగా అరకు సుదూర ప్రాంతంలో ఉండడం వల్ల కొన్ని వర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. పార్వతీపురం పేరుతో మన్యం జిల్లా యూనిట్‌గా ఒక పార్లమెంట్ స్థానం ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. పార్వతీపురం, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాలను కలిపి ఒక ఎంపీ స్థానాన్ని ఎస్టీలకు కేటాయించాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి. పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లా చొప్పున పరిగణనలోకి తీసుకుంటే.. పార్వతీపురానికి ప్రత్యేకంగా ఒక ఎంపీ స్థానం ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో రిజర్వేషన్ ప్రాతిపదికన ఎస్టీకి ఇస్తారా, జనరల్ చేస్తారా? అన్న సందేహాలు నెలకొంటున్నాయి. అరకు, పోలవరం ఎస్టీలకు కేటాయిస్తే.. ఇక్కడ జనరల్ అవుతుందని కొంతమంది భావిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా జనాభా సుమారు 9.25 లక్షల మంది. 2 లక్షల జనాభాకు ఒక నియోజకవర్గం కనీసం ఉండాలి. పునర్విభజన జరిగి, అసెంబ్లీ స్థానాలు పెరిగితే.. ప్రస్తుతం ఉన్న నాలుగు నియోజకవర్గాలు ఆరు అయ్యే అవకాశాలున్నాయి. జిల్లా కేంద్రమైన పార్వతీపురం నియోజకవర్గం(ఎస్సీ).. జనరల్ స్థానం కావచ్చని ఎప్పటి నుంచో రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక్కడ కొప్పల వెలమ సామాజిక వర్గం అధికం. అన్ని వర్గాల వారూ నివసిస్తున్నారు. పునర్విభజన తర్వాత జనరల్ అయితే, తమకు లాభిస్తుందని కొంతమంది ఆశలు పెట్టుకున్నారు. పార్వతీపురం అర్బన్, మండలంతో కలిపి గరుగుబిల్లి మండలం/కొమరాడలో కొంతభాగం కలిపి ఒక నియోజకవర్గంగా ఏర్పడనుందన్న చర్చ నడుస్తోంది. సీతానగరం, బలిజిపేట, మక్కువ/బాడంగి (ప్రస్తుతం విజయనగరం జిల్లా) కలిపి ఎస్సీ నియోజకవర్గంగా ఏర్పడే అవకాశాలూ ఉన్నాయి. గతంలో బలిజిపేట, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, వీరఘట్టం మండలాలతో ఒక నియోజకవర్గం చేయాలన్న ప్రతిపాదన వెళ్లింది. కురుపాం, సాలూరు ఎస్టీ అసెంబ్లీ స్థానాలుగా ఉండగా.. పాలకొండ నియోజకవర్గం ఎస్సీలకు.. సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, భామిని, కురుపాం కలిపి ఒక నియోజకవర్గం ఎస్టీలకు రిజర్వ్ చేయవచ్చన్న వాదన రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ఎవరి ‘అదృష్టం’ మారనుందో? డీ లిమిటేషన్‌తో మారనున్న జిల్లా రాజకీయ ముఖచిత్రం ఆశావహులకు ఆశ.. నిరాశ


