
మొబైల్ ట్రాకింగ్ సేవలు సులభతరం
విజయనగరం క్రైమ్: గడిచిన ఆరునెలల్లో పోయిన మొబైల్ ఫోన్‌లను ఫిర్యాదుదారులకు ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం పోలీస్‌కాన్ఫరెన్స్ హాలులో అందజేశారు. జిల్లా వ్యాప్తంగా రూ.ఆరుకోట్ల విలువైన 3,300 సెల్ ఫోన్‌లను రికవరీ చేసినట్లు ఎస్పీ వకుల్ జిందల్ ఈ సందర్భంగా చెప్పారు. ఈ మేరకు డీపీఓలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ పోయిన మొబైల్ ఫోన్ కోసం ఫిర్యాదుకు ప్రత్యేకించి జిల్లా కేంద్రానికి రావనసరం లేదన్నారు. సైబర్‌సెల్ పోలీస్‌స్టేషన్‌కు కూడా వచ్చి ఫిర్యాదు చేయనవసరం లేదన్నారు. పోయిన సెల్‌ఫోన్‌లపై 8977945606 వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని, ముందుగా హాయ్ అని మెసేజ్ చేస్తే మా శాఖే ఓ యూఆర్‌ఎల్‌ను పంపుతుందని అందులో ఫిర్యాదు దారు వివరాలు, ఫోన్ నంబర్ ఐఎంఈఐ నంబర్‌ను ఎంటర్ చేస్తే మొబైల్ ట్రాకింగ్ సిస్టం ద్వారా ఫోన్ ట్రేస్ అవుట్ చేస్తామని ఎస్పీ చెప్పారు. ఈ సందర్భంగా 264 ఫోన్‌లను మొబైల్‌ట్రాకింగ్ విధానం ద్వారా ట్రేసవుట్ చేశామని తెలిపారు. ఫిర్యాదుదారులు సైబర్‌సెల్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఐఎంఐఈ నంబర్ చెప్పి ఫోన్ పొందవచ్చని చెప్పారు. సమావేశంలో ఏఎస్పీ సౌమ్యలత, నగర డీఎస్పీ శ్రీనివాస్, సైబర్ సెల్ సీఐ శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ లీలారావు, సైబర్ సెల్ ఎస్సై నజీమాబేగం, సైబర్ సెల్ సిబ్బంది వాసుదేవ్, తిరుపతి నాయుడు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రానికి రాకుండా ఫిర్యాదు
ప్రత్యేకించి వాట్సాప్ నంబర్ విడుదల