
బాహుబలి 2 సినిమా చూశారా? అందులో కుంతల రాజ్యానికి అనుష్క అలియాస్ దేవసేన యువరాణిగా ఉంటుంది. ఆమెకు వదినగా చేసిన నటి కూడా మీకు గుర్తుండే ఉంటుంది. ఆమెనే ఆశ్రిత వేమగంటి. చూస్తే వయసు మళ్లినట్లు కనిపిస్తుంది కానీ ఈ మూవీ చేసేటప్పటికీ ఆమెకు 27 ఏళ్లే. స్వయానా ఆమెనే ఈ విషయాన్ని బయటపెట్టింది. ఇంతకీ ఏం చెప్పిందంటే?
'బాహుబలి సినిమా చేసేటప్పటికి నా వయసు 27 ఏళ్లే. కానీ కాస్త పెద్దదానిలా చూపించారు. దీంతో ఇప్పటికీ ఎవరైనా నన్ను కలిస్తే మీరు బయట చాలా యంగ్ గా ఉన్నారని అంటుంటారు. అవును ఇదే నేను అని వాళ్లతో చెబుతుంటాను. చాలామంది నన్ను స్క్రీన్ పై చూసి నాది పెద్ద వయసు అనుకున్నారు. ఎవరికి తోచినట్లు వాళ్లు మాట్లాడేసుకుంటున్నారు'
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు)
'ఇలా కాస్త ప్లస్ సైజులో ఉండటం వల్ల నాకు నచ్చిన పాత్రలు దాదాపు నేను చేయలేను. ఎందుకంటే ప్లస్ సైజులో ఉంటే గౌరవప్రదమైన రోల్స్ కోసం మాత్రమే తీసుకుంటారు. సదరు దర్శకులకు నా నిజమైన వయసు గురించి చెప్తే.. పాత్రకు వయసు ఎక్కువున్నా సరే చాలా పవర్ ఫుల్ అదీ ఇదీ అని చెప్పి నన్ను కన్విన్స్ చేసేందుకు ప్రయత్నిస్తారు' అని ఆశ్రిత చెప్పుకొచ్చింది.
స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్ అయిన ఈమె.. బాహుబలి 2 సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది. తర్వాత మహర్షి, MCA, క్రాక్, డియర్ కామ్రేడ్, యాత్ర, యానిమల్ తదితర చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర'లో కీలక పాత్ర చేస్తోంది.
(ఇదీ చదవండి: సమంత పెట్ డాగ్ తో శోభిత.. చైతూ పోస్ట్ వైరల్)