తమిళ నటి వరలక్ష‍్మి శరత్ కుమార్.. ఈ ఏడాది జూలైలో పెళ్లి చేసుకుంది. నికోలయ్ సచ్‌దేవ్ అనే వ్యక్తితో కొత్త జీవితం ప్రారంభించింది. పెళ్లికి ముందు గానీ తర్వాత గానీ భర్త గురించి పెద్దగా మాట్లాడని వరలక్ష‍్మి.. ఇప్పుడు అతడి పుట్టినరోజు సందర్భంగా ప్రేమనంతా ఒలకబోసింది. ఓ వీడియో షేర్ చేసి బోలెడన్ని సంగతులు చెప్పింది.
(ఇదీ చదవండి: క్షమించాలని కన్నీళ్లు పెట్టుకున్న షణ్ముఖ్ జస్వంత్)
'ఈ ఏడాది చాలా వేగంగా చాలా విషయాలు జరిగాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే అన్నీ మధుర జ్ఞాపకాలే. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడం చాలా కష్టం. నీ కంటే నన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నావ్. మగాడు ఎలా ఉండాలనే దానికి నువ్వు ఉదాహరణ. నువ్వు నన్ను భద్రంగా కాపాడుకుంటున్నావ్. ఎంతలా అంటే ఒక్క క్షణం కూడా నన్ను విడిచిపెట్టి ఉండట్లేదు. ఇంకా చాలా చెప్పాలని ఉంది. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే నీ లాంటి భర్త దొరకడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం. ఇంతకు మించి నిన్నేం అడగనులే. హ్యాపీ బర్త్ డే టూ వరల్డ్స్ బెస్ట్ హస్బెండ్' అని వరలక్ష‍్మి తన భర్త గురించి చెప్పుకొచ్చింది.
ఈ పోస్ట్‌తో పాటు షేర్ చేసిన వీడియోలో వరలక్ష‍్మి.. బోలెడన్ని ఫొటోలని షేర్ చేసింది. పెళ్లి, టూర్స్ వెళ్లినప్పుడు ఫొటోలు చాలానే ఉన్నాయి. సరే ఇదంతా పక్కనబెడితే ఈ ఏడాది 'హనుమాన్', 'శబరి' సినిమాలు చేసింది. పెళ్లి తర్వాత కొత్త సినిమాలేం చేయట్లేదు. భర్తతో కలిసి ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది.
(ఇదీ చదవండి: మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు.. పోలీసులకు లేఖ రాసిన తల్లి నిర్మల)
Comments
Please login to add a commentAdd a comment