షణ్ముఖ్ జస్వంత్.. ఈ పేరు సోషల్ మీడియాలో ఒకప్పుడు సెన్సేషన్. పలు వెబ్ సిరీస్‌లతో మిలియన్ల కొద్ది వ్యూస్, అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ క్రేజ్‌తో బిగ్ బాస్‌లో ఎంట్రీ ఇచ్చిన జస్వంత్ విన్నర్ రేసు నుంచి తీవ్రమైన నెగటివిటీ తెచ్చుకున్నాడు. హోస్ నుంచి బయటకు వచ్చాక కూడా వివాదాలు.. కేసులు.. గొడవలతో పాటు అరెస్ట్‌లు వంటి ఘటనలు తన జీవితంలో జరిగాయి. అయితే, షణ్ముఖ్ జస్వంత్ కుంగిపోకుండా తన ప్రయాణం మళ్లీ మొదలుపెట్టాడు. జీవిత పోరాటంలో తాను ఎన్నో నేర్చుకున్నానని తాజాగా తన కొత్త సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో పలు విషయాలు పంచుకున్నాడు.
సాఫ్ట్ వేర్ డెవలపర్, సూర్య వంటి వెబ్ సిరీస్‌లతో యూట్యూబ్‌లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ దక్కించుకున్నాడు జస్వంత్. ఇప్పుడు ఓటీటీ కోసం ' లీల వినోదం' చిత్రంలో ఆయన నటించారు. డిసెంబర్ 19 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన ఘటనలను మీడియాతో పంచుకున్నాడు.
స్టేజీపైనే షణ్ముఖ్ జస్వంత్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా మాట్లాడారు. నా జర్నీ అంతా మొదట వైజాగ్‌లోనే ప్రారంభమైంది. ఆ సమయంలో నా కెరీర్ ఎటు పోతుందో తెలియని అర్థం కాని పరిస్థితిలో నేను ఉన్నాను. అప్పుడు హైదరబాద్‌కు వచ్చి కొన్ని కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లు చేసుకున్నాను. మంచిగానే సక్సెస్ అయ్యాను. కానీ, ఎవరో చేసిన తప్పుకు నన్ను బ్లేమ్ చేస్తూ అనేక ఆరోపణలు చేశారు. ఆ చెడ్డ పేరు నాకు మాత్రమే ఆపాదించకుండా.. ఇందులోకి నా కుటుంబాన్ని కూడా లాగారు. ఫ్యామిలీకి అండగా ఉండాలని ప్రతి కుమారుడు అనుకుంటాడు.
అయితే, నా వల్లే కుటుంబానికి వారికి చెడ్డపేరు వచ్చింది. అమ్మా,నాన్నా నన్ను క్షమించండి. నా వల్లే మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అమవాస్య చూసినోడు తప్పకుండా పౌర్ణమి చూస్తాడు. నా జీవితంలో ఇప్పుడు అదే జరుగుతుంది. చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నా దగ్గరకు ' లీల వినోదం' ప్రాజెక్ట్ వచ్చింది. మనం సక్సెస్‌లో ఉన్నప్పుడు చాలా మంది మన చుట్టూ ఉంటారు. కానీ, ఒక్కసారి కింద పడినప్పుడు మనతో ఎవరుంటారో వాళ్లే నిజమైన మిత్రులు. నా అనుభవంతో ఈ విషయాన్ని తెలుసుకున్నాను.' అని జస్వత్ పేర్కొన్నాడు.
షణ్ముఖ్ జస్వంత్ జీవితంలో వివాదాలు
బిగ్ బాస్‌లో టైటిల్ విన్నర్ అవుతాడని షణ్ముఖ్ జస్వంత్ అభిమానులు అనుకున్నారు. అయితే, హౌజ్‌లో సిరి-షణ్ముఖ్‌ల తీరుపై ఎక్కువ విమర్శలు వచ్చాయి. ఆపై కొద్దిరోజులకే గంజాయి కేసులో అరెస్ట్ కావడం. వెనువెంటనే ఓ అమ్మాయిని మోసం చేసిన కేసులో షణ్ముఖ్ అన్నయ్య సంపత్ పట్టుకోవడానికి అతని ఫ్లాట్‌కి పోలీసులు వెళ్లడం. అక్కడ షణ్ముఖ్ గదిలో గంజాయి దొరికందని పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో షణ్ముఖ్ కెరీర్ క్లోజ్ అయిందని అందరూ అనుకున్నారు. కానీ, ఇప్పుడు పడిలేచిన కెరటంలా లీల వినోదం అనే సినిమాతో ఆయన మరోసారి తెరపైకి వస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment