telugu actress
-
ఆహా అనిపించేలా అదితి శంకర్ క్యూట్ లుక్స్...
-
Abhinaya: మూగ హీరోయిన్.. కానీ హావభావాలు పలికించడంలో దిట్ట (ఫోటోలు)
-
బాక్ల్ శారీలో బిగ్ బాస్ శ్రీ సత్య క్యూట్ లుక్స్ (ఫొటోలు)
-
ఒక్క క్షణం కూడా వదలట్లేదు.. భర్త గురించి వరలక్ష్మి
తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. ఈ ఏడాది జూలైలో పెళ్లి చేసుకుంది. నికోలయ్ సచ్దేవ్ అనే వ్యక్తితో కొత్త జీవితం ప్రారంభించింది. పెళ్లికి ముందు గానీ తర్వాత గానీ భర్త గురించి పెద్దగా మాట్లాడని వరలక్ష్మి.. ఇప్పుడు అతడి పుట్టినరోజు సందర్భంగా ప్రేమనంతా ఒలకబోసింది. ఓ వీడియో షేర్ చేసి బోలెడన్ని సంగతులు చెప్పింది.(ఇదీ చదవండి: క్షమించాలని కన్నీళ్లు పెట్టుకున్న షణ్ముఖ్ జస్వంత్)'ఈ ఏడాది చాలా వేగంగా చాలా విషయాలు జరిగాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే అన్నీ మధుర జ్ఞాపకాలే. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడం చాలా కష్టం. నీ కంటే నన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నావ్. మగాడు ఎలా ఉండాలనే దానికి నువ్వు ఉదాహరణ. నువ్వు నన్ను భద్రంగా కాపాడుకుంటున్నావ్. ఎంతలా అంటే ఒక్క క్షణం కూడా నన్ను విడిచిపెట్టి ఉండట్లేదు. ఇంకా చాలా చెప్పాలని ఉంది. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే నీ లాంటి భర్త దొరకడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం. ఇంతకు మించి నిన్నేం అడగనులే. హ్యాపీ బర్త్ డే టూ వరల్డ్స్ బెస్ట్ హస్బెండ్' అని వరలక్ష్మి తన భర్త గురించి చెప్పుకొచ్చింది.ఈ పోస్ట్‌తో పాటు షేర్ చేసిన వీడియోలో వరలక్ష్మి.. బోలెడన్ని ఫొటోలని షేర్ చేసింది. పెళ్లి, టూర్స్ వెళ్లినప్పుడు ఫొటోలు చాలానే ఉన్నాయి. సరే ఇదంతా పక్కనబెడితే ఈ ఏడాది 'హనుమాన్', 'శబరి' సినిమాలు చేసింది. పెళ్లి తర్వాత కొత్త సినిమాలేం చేయట్లేదు. భర్తతో కలిసి ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది.(ఇదీ చదవండి: మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు.. పోలీసులకు లేఖ రాసిన తల్లి నిర్మల) View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) -
బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ బ్యూటీ
తెలుగులో పలు సినిమాల్లో నటించిన అక్షర గౌడ తల్లయింది. తనకు బిడ్డ పుట్టిన విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కొన్నాళ్ల క్రితం ఈమెకు ఆకాశ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది అక్టోబరులో తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. ఇప్పుడు బిడ్డ పుట్టినట్లు పోస్ట్ పెట్టింది. దీంతో తోటి నటీనటులు ఈమెకు విషెస్ చెబుతున్నారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8లో చివరి ఎలిమినేషన్.. ఆమెపై వేటు!)బెంగళూరులో పుట్టి పెరిగిన అక్షర గౌడ.. 2011 నుంచి ఇండస్ట్రీలో ఉంది. తొలుత హిందీ, తమిళంలో సినిమాలు చేసింది. 2018లో మాతృభాషలో కన్నడలో నటించింది. ఆ తర్వాత తెలుగులోనూ మన్మథుడు 2, ద వారియర్, దాస్ క దమ్కీ, హరోంహర, 'నేనే నా' తదితర చిత్రాల్లో సహాయ పాత్రల్లో నటించింది. ఇప్పుడు బిడ్డ పుట్టిన విషయాన్ని ప్రకటించిన అక్షర గౌడ.. తాను బేబీ బంప్‌తో ఉన్న ఫొటోల్ని కూడా పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ పెళ్లి టాపిక్.. తండ్రి ఏమన్నారంటే?) View this post on Instagram A post shared by Akshara Gowda Bikki (@iaksharagowda) -
రేణు దేశాయ్ తల్లి కన్నుమూత
సినీ నటి రేణు దేశాయ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని రేణు దేశాయ్ గురువారం నాడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అమ్మ ఆత్మకు శాంతి చేకూరాలి, ఓం శాంతి అంటూ తల్లి పాత ఫోటోను షేర్ చేసిన రేణు దేశాయ్ కింది శ్లోకాన్ని కూడా పోస్టు కింద జత చేసింది.పునరపి జననం పునరపి మరణంపునరపి జననీ జఠరే శయనం|ఇహ సంసారే బహుదుస్తారేకృపయాపారే పాహి మురారే||మళ్లీ మళ్లీ పుడుతుంటారు.. మళ్లీ మళ్లీ చనిపోతుంటారు. మళ్లీ ఓ తల్లి గర్భంలో జన్మించక తప్పదంటూ ఆది శంకరాచార్యుల మాటల్ని సైతం ఆ పోస్టులో పొందుపరిచింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) చదవండి: ఒక కూతురి తండ్రిగా ఆ బాధేంటో నాకు తెలుసు: అభిషేక్ -
కాంబోడియాలోని అతిపెద్ద దేవాలయంలో నటి హిమజ (ఫొటోలు)
-
ఈ టాలీవుడ్ హీరోయిన్ని గుర్తుపట్టారా.. ఇలా తయారైందేంటి?
ఈమె తెలుగులో చాలా సినిమాలు చేసిన హీరోయిన్. పలు చిత్రాలతో హిట్ కొట్టినా సరే ఈమెకు ఎందుకో లక్ కలిసి రాలేదు. లేదంటే మరేదైనా కారణముందో తెలియదు గానీ ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయింది. పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిలైపోయింది. అలాంటి ఈమెని ఇప్పుడు ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇంతలా చెప్పాం కదా ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ పార్వతి మెల్టన్. అరె.. ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే అనిపిస్తుందా? అవును మీరు ఊహించింది కరెక్టే. 'జల్సా'లో ఓ హీరోయిన్గా చేసింది ఈమెనే. అమెరికాలోని కాలిఫోర్నియాలో పుట్టి పెరిగిన ఈమె తండ్రిది జర్మనీ, తల్లి ఇండియాలోని పంజాబ్. చిన్నప్పుడే భరతనాట్యం లాంటివి నేర్చుకుంది. చదువుతూనే మోడలింగ్ చేసింది. అలా పలు పోటీల్లో విజయం సాధించింది.(ఇదీ చదవండి: నటి సురేఖావాణితో వైరల్ స్టార్.. ఇతడెవరో గుర్తుపట్టారా?)ఇక 'వెన్నెల' సినిమాతో హీరోయిన్ అయిపోయింది. అది హిట్ కావడంతో తెలుగులో పార్వతి మెల్టన్‌కి అవకాశాలు వచ్చాయి. అలా గేమ్, మధుమాసం, అల్లరే అల్లరి తదితర సినిమాలు చేసింది. కానీ పెద్దగా పేరు రాలేదు. ఎప్పుడైతే 'జల్సా' చేసిందో ఈమె నలుగురి కంట్లో పడింది. దీంతో ఈమెకి ఛాన్సులు క్యూ కడతాయని అనుకున్నారు. కానీ అలాంటిదేం జరగలేదు. 'దూకుడు'లో ఐటమ్ సాంగ్ చేసింది. ఆ తర్వాత కూడా తెలుగు దర్శకనిర్మాతలు ఈమెని పెద్దగా పట్టించుకోలేదు.చివరగా 2012లో 'యమహో యమ' అనే సినిమా చేసి తిరిగి యూఎస్ వెళ్లిపోయింది. అదే ఏడాది సమ్ష లలానీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయింది. అప్పటి నుంచి యూఎస్‌లోనే ఉంటున్న అక్కడి వాతావరణానికి తగ్గట్లు మారిపోయింది. రీసెంట్గా ఈమె ఫొటోలు చూస్తున్న కొందరు నెటిజన్స్.. సడన్‌గా పార్వతిని గుర్తుపట్టలేకపోయారు. కాసేపటి తర్వాత ఈమె 'జల్సా' హీరోయిన్ కదా అని అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: పెళ్లి వాయిదా వేసుకున్న మరగుజ్జు సింగర్.. కారణం అదే) View this post on Instagram A post shared by Parvati Melton (@parvatim) -
Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)
-
రహస్యంగా పెళ్లి చేసుకున్న 'టెంపర్' నటి
మరో నటి పెళ్లి చేసుకుంది. రహస్యంగా ప్రియుడితో ఏడడుగులు వేసింది. అయితే ఈ వేడుకకు ఒకే ఒక్క తెలుగు హీరోయిన్ మాత్రమే హాజరైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: నా పెళ్లి వల్ల తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడ్డారు: ప్రియమణి) 'టెంపర్' సినిమాలో కీలక పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి అపూర్వ శ్రీనివాసన్.. జ్యోతిలక్ష్మి, ఎక్కడికి పోతావు చిన్నవాడా, తొలిప్రేమ, ప్రేమకథా చిత్రమ్ 2 తదితర చిత్రాల్లో పలు పాత్రలు చేసింది. ఈమె చివరగా 2022లో 'నీతో' మూవీ చేసింది. తర్వాత సైలెంట్ అయిపోయింది. తాజాగా శ్రేయస్ శివకుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టి షాకిచ్చింది. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. హీరోయిన్ సిమ్రాన్ చౌదరి కూడా ఈ పెళ్లికి వెళ్లింది. (ఇదీ చదవండి: డైరెక్టర్ శంకర్ కూతురికి రెండో పెళ్లి.. కుర్రాడు ఎవరంటే?) View this post on Instagram A post shared by Apoorva Bin Srinivasan (@apoorva_srinivasan) -
అప్పట్లో తెలుగు హిట్ సినిమాల్లో.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా!
ఈమె ప్రముఖ నటి. తెలుగులో దాదాపు 16 ఏళ్లుగా బోలెడన్ని సినిమాలు చేసింది. దక్షిణాదిలో మిగతా భాషల్లో కూడా పలు సినిమాలు చేసింది. అయితే ఈమె పేరు చెబితే సరిగా గుర్తురాకపోవచ్చు. కానీ కొన్ని స్పెషల్ సాంగ్స్ పెడితే మాత్రం ఈమె ఎవరనేది టక్కున గుర్తుపట్టేస్తారు. అంతా బాగానే ఉందనుకునే టైంలో సడన్‌గా సినిమాలు బంద్ చేసి, ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయింది. ఇంతలా చెప్పాం కదా ఈ నటి ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న నటి పేరు ముంతాజ్. ముంబయికి చెందిన ఈమె.. టీనేజ్లోనే ఉండగానే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేసింది. 1999లోనే తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. చాలా బాగుంది, అమ్మో ఒకటో తారీఖు, ఖుషి, జెమినీ, కూలీ, కొండవీటి సింహాసనం, అత్తారింటికి దారేది, ఆగడు తదితర చిత్రాల్లో అతిథి పాత్రలు, స్పెషల్ సాంగ్స్ చేసింది. చివరగా 2015లో 'టామీ' అనే తెలుగు సినిమాలో కనిపించింది. 'ఖుషీ', 'అత్తారింటికి దారేది' చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో మాస్ స్టెప్పులేసింది ఈమెనే. (ఇదీ చదవండి: నా భర్త మొదటి విడాకులు.. కారణం నేను కాదు: స్టార్ హీరో మాజీ భార్య) నటిగా కెరీర్ ఓ మాదిరిగా ఉండగానే పూర్తిగా ఇండస్ట్రీని వదిలేసింది. హిజాబ్ ధరించింది. అయితే ఇలా పూర్తిగా నటనని పక్కనబెట్టేయడానికి గల కారణాన్ని కూడా ఒకానొక సందర్భంలో వెల్లడించింది. 'నేను ముస్లిం కుటుంబంలో పుట్టాను. నాకు ఖురాన్ బాగా తెలుసు. మొదట్లో ఖురాన్లో పేర్కొన్న విషయాలకు అర్థం తెలియదు . ఒకానొక దశలో దాని అంతరార్థం నాకు అర్థమై నాలో మార్పు వచ్చింది. అందుకే ఇకపై సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాను. అలాగే ఇప్పుడు హిజాబ్ ధరిస్తున్నాను' అని మాజీ నటి ముంతాజ్ చెప్పుకొచ్చింది. సినిమాలు చేయనప్పటిక.. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఫొటోలు పోస్ట్ చేస్తూ నెటిజన్స్‌తో టచ్‌లోనే ఉంటోంది. అయితే అప్పట్లో ఈమెని చూసి, ఇప్పుడు హిజాబ్‌లో చూసి చాలామంది గుర్తుపట్టలేకపోయారు. కాసేపటి తర్వాత ముంతాజ్ ఎవరో తెలుసుకుని అవాక్కయ్యారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) View this post on Instagram A post shared by Mumtaz (@mumtaz_mumo) View this post on Instagram A post shared by Mumtaz (@mumtaz_mumo) -
ఎంగేజ్మెంట్ చేసుకున్న తెలుగు యువ నటి.. ఫొటో వైరల్
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. స్టార్ హీరోల దగ్గర నుంచి సామాన్యుల వరకు చాలామంది వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు. రీసెంట్గా డైరెక్టర్ శంకర్ కూతురు నిశ్చితార్థం, సీనియర్ నటుడు విజయ్ కుమార్ మనవరాలి పెళ్లి లాంటివి జరుగుతున్నాయి. తాజాగా టాలీవుడ్ యువ నటి కూడా ఎంగేజ్మెంట్ చేసుకుంది. (ఇదీ చదవండి: ఇంటర్వ్యూలో భర్తతో బిగ్‌బాస్ బ్యూటీ ముద్దులాట.. దారుణమైన ట్రోల్స్!) 'రాజావారు రాణిగారు' సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన దివ్య.. ఆ తర్వాత హిట్ 2, ఆర్ఎక్స్ 100, బెదురులంక, 'అద్భుతం' తదితర చిత్రాల్లో సహాయ పాత్రలు చేసింది. ఓవైపు మూవీస్ చేస్తూనే మరోవైపు బుల్లితెరపై డ్యాన్స్ షోల్లోనూ యాంకరింగ్ చేస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈమెకు నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. దీంతో ఈమెకు తోటీ నటీనటులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. (ఇదీ చదవండి: నెలకు రూ.35 లక్షలు వచ్చే పనిమానేశా: '12th ఫెయిల్' హీరో) -
ఇంటికి నేనే దరిద్రం.. నా వల్లే మా నాన్న ఐసీయూలో..: శివానీ ఎమోషనల్
టాలీవుడ్ స్టార్ జంట జీవిత- రాజశేఖర్ల కూతుర్లిద్దరూ వెండితెరపై హీరోయిన్లుగా రాణిస్తున్నారు. కొత్త కొత్త కాన్సెప్టులను ఎంచుకుంటూ ఆచితూచి ముందడుగు వేస్తున్నారు. శివానీ రాజశేఖర్ ఈ మధ్యే కోటబొమ్మాళి పీఎస్ సినిమాతో హిట్ అందుకుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తండ్రి గురించి చెప్తూ ఎమోషనల్ అయింది. 'www సినిమా షూటింగ్లో నాకు కరోనా సోకింది. అంతలోనే ఇంట్లో అందరికీ వ్యాపించింది. నేను త్వరగానే కోలుకున్నాను. అమ్మ, చెల్లికి కూడా కొద్ది రోజుల్లోనే తగ్గిపోయింది. నా వల్ల కుటుంబానికి గండం! కానీ నాన్నకు మాత్రం సీరియస్ అయింది. వెంటిలేటర్ వరకు వెళ్లి వచ్చాడు. నాన్నకు నా వల్ల కరోనా రావడంతో నా జాతకం బాలేదని, నా వల్ల కుటుంబానికి గండం ఉందని చాలామంది ఏవేవో మాటలు చెప్పారు. మొదట నేను పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే నాన్న వెంటిలేటర్‌పైకి వెళ్లాడో అప్పుడు చాలా బాధపడ్డాను. నా వల్లే ఇదంతా జరుగుతుందేమో.. ఇంటికి నేనే దరిద్రం ఏమో.. నా జాతకంలో ఏదైనా దోషం ఉందేమో, నా వల్ల మా నాన్నకు ఏమవుతుందోనని భయపోడిపోయాను. నాకు అనారోగ్య సమస్య అప్పుడు నాకు ఓ అనారోగ్య సమస్య ఉండేది. దానివల్ల ఉన్నట్లుండి గుండెదడ ఎక్కువయ్యేది. గుండెచప్పుడు సడన్‌గా 170-200 వరకు వెళ్లేది. నాన్న డాక్టర్ కాబట్టి గుండె దడ మొదలవగానే మందులు ఇచ్చేవాడు. అది నెలకోసారి వచ్చిపోతూ ఉండేది. నాన్నకు కరోనా వచ్చినప్పటి నుంచి ప్రతిరోజూ రెండుమూడుసార్లు గుండెదడ వచ్చేది. నాన్న పక్కనే ఐసీయూ బెడ్లో నిద్రపోయేదాన్ని. ఒకరోజు అతడి పరిస్థితి మరీ సీరియస్ అయింది. ప్రార్థనలే బతికించాయి అందరూ ప్రార్థించండి, ఇక అదే మిగిలింది అని పేపర్ మీద రాశాడు. నీకేమైనా అయితే నేను కూడా చనిపోతాను.. నువ్వు పోరాడు అని చెప్పాను. ఆయన్ని అభిమానుల ప్రార్థనలే బతికించాయి' అని చెప్పుకొచ్చింది. ఉప్పెన సినిమాను చేజార్చుకోవడంపై స్పందిస్తూ.. 'ఉప్పెన సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. కానీ ముద్దు సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో చేయనని చెప్పాను. కానీ నాకు చెప్పిన కథకు, సినిమా ఫైనల్ అవుట్‌పుట్‌కు చాలా తేడా ఉంది' అని తెలిపింది శివానీ రాజశేఖర్. చదవండి: తెలుగులో హీరోయిన్గా, పనిమనిషిగా నటించిన బ్యూటీ.. కొట్టి మరీ ఏడిపించారు.. గుర్తుపట్టారా? -
ఈమె తెలుగు హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం?
సినిమా ఇండస్ట్రీలో హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా హీరోయిన్ల కెరీర్ సాగుతూ ఉంటుంది. అలాంటిది నటిగా మంచి స్థితిలో ఉన్నప్పుడే ఈమె పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేసింది. ఆ వెంటనే పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. ప్రస్తుతం కొడుకుతో జీవితాన్ని ఆస్వాదిస్తోంది. ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న ఆమె పేరు సనా ఖాన్. అవును మీరు ఊహించింది కరెక్టే. కల్యాణ్ రామ 'కత్తి', నాగ్ 'గగనం', 'మిస్టర్ నూకయ్య' తదితర చిత్రాల్లో హీరోయిన్గా నటించింది ఈమెనే. తండ్రి మలయాళీ, తల్లిది ముంబయి. అలా ముంబయిలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. 2005లో బాలీవుడ్లో నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. (ఇదీ చదవండి: శ్రీదేవి మృతిపై అసలు నిజాలు బయటపెట్టిన బోనీ కపూర్!) హిందీ తర్వాత తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో నటించింది. దాదాపు 14 ఏళ్లపాటు నటించింది. ఇక 2019లో కొరియోగ్రాఫర్ మెల్విన్ లూయిస్‌తో రిలేషన్ మొదలుపెట్టింది. ఏడాది తిరగకుండానే విడిపోయింది. ఇది జరిగిన కొద్దిరోజులకు యాక్టింగ్ వదిలేస్తున్నట్లు ప్రకటించి షాకిచ్చింది. కట్ చేస్తే 2020 నవంబరులో ఇస్లామిక్ స్కాలర్ మఫ్టీ అనాస్ సయ్యద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీళ్ల బంధానికి గుర్తుగా ఈ ఏడాది జులైలో అబ్బాయి పుట్టాడు. రీసెంట్గా భర్త, కొడుకుతో కలిసి మక్కా వెళ్లిన సనాఖాన్ అందుకు సంబంధించిన ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈమెని తొలుత గుర్తుపట్టలేకపోయిన నెటిజన్స్.. గుర్తొచ్చిన తర్వాత ఈమెనా అని కామెంట్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' ఎలిమినేషన్ తర్వాత రతిక ఫస్ట్ రియాక్షన్) View this post on Instagram A post shared by Saiyad Sana Khan (@sanakhaan21) -
ఈ వినాయక చవితి చాలా ప్రత్యేకం
‘‘నాకు చాలా చాలా ఇష్టమైన పండగ వినాయక చవితి. వినాయక విగ్రహాన్ని ఇంటివద్దకు తీసుకొచ్చేటప్పుడు, నిమజ్జనానికి తీసుకెళ్లేటప్పుడు బ్యాండ్‌కి తగ్గట్టు ఫుల్‌గా డ్యాన్స్ చేసి అలిసిపోయేదాన్ని. ‘బేబీ’ చిత్రంలో ఓ పాటలో వినాయకుడి విగ్రహం ముందు డ్యాన్స్ చేస్తున్నప్పుడు నాకు చిన్నతనం గుర్తొచ్చింది. ఇప్పటికి కూడా వినాయకుడి వద్ద ఉండే బ్యాండ్ సౌండ్‌కి డ్యాన్స్ చేయకుండా ఆగలేను’’ అని హీరోయిన్ వైష్ణవీ చైతన్య అన్నారు. ‘బేబీ’ సినిమాతో సూపర్‌హిట్ అందుకున్నారు తెలుగమ్మాయి వైష్ణవీ చైతన్య. నేడు వినాయక చవితి సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారామె.. ఆ విశేషాలు... ► ఈ ఏడాది వినాయక చవితిని ఎలా ప్లాన్ చేస్తున్నారు? గతంలో ప్రతిసారి నేను, తమ్ముడు ప్లాన్ చేసేవాళ్లం. కానీ, ఈ సారి మా అమ్మ, నాన్న ప్లాన్ చేస్తున్నారు. ప్రతి ఏడాది తొమ్మిది రోజులు వినాయకుణ్ణి ఇంట్లో పెట్టి పూజ చేసేవాళ్లం.. కాలనీ వాళ్లని పిలిచి అన్నదానం చేసేవాళ్లం. ప్రతిరోజూ సాయంత్రం భజనలు చేసేవాళ్లం. కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ఫుల్ హంగామా చేస్తూ ట్యాంక్‌బండ్‌కి తీసుకెళ్లి నిమజ్జనం చేసేవాళ్లం. ఈ సారి అలాగే చేయాలనుకుంటున్నాం. ► గత ఏడాదికీ, ఈ ఏడాదికీ మీ స్థాయిలో మార్పు వచ్చింది. గతంలో వైష్ణవీ చైతన్య అంటే ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, ఇప్పుడు ‘బేబీ’ హీరోయిన్ అని తెలుసు.. దాన్ని ఎలా చూస్తారు? ప్రతి ఏడాది కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. అయితే ఈ ఏడాది ఇంకా ఎక్కువ ప్రత్యేకం. ఎందుకంటే ‘బేబీ’ సినిమా చేశాం.. చాలా పెద్ద హిట్ అయింది. ఎంతో మంది నుంచి యూనిట్‌కి అభినందనలు వచ్చాయి. దాంతో మేము చాలా మోటివేషన్ (ప్రేరణ) జోన్లో ఉన్నాం. ఇంకా అదే సంతోషంలోనే ఉన్నాం.. కాబట్టి ఈ ఏడాది ఇంకా ప్రత్యేకం అని చెప్పాలి. ► వినాయక చవితి అంటే అమ్మాయిలు ప్రత్యేకించి లెహంగా వంటి బట్టలు కుట్టించుకోవడం చేస్తుంటారు. ఈసారి కూడా అలాంటివి ఏమైనా కుట్టించుకున్నారా? నా చిన్నప్పటి నుంచి నా బట్టలన్నీ మా అమ్మే కుట్టేది.. ఈసారి కూడా అమ్మే కుడుతుంది. తొమ్మిది రోజులు వినాయకుడికి ఇంట్లో పూజలు చేస్తాం కాబట్టి తొమ్మిది జతల బట్టలు కుడుతుంది. నవరాత్రులకు కూడా అలాగే చేస్తాం. నా కోసం తొమ్మిది హాఫ్ శారీస్ రెడీ చేసి పెడుతుంది మా అమ్మ. ► హాఫ్ శారీస్ కట్టుకోవడం మీకు ఇష్టమేనా? చాలా ఇష్టం. ఇంట్లో ఖాళీగా కూర్చుని ఉన్నా సంప్రదాయంగా హాఫ్ శారీస్, చీరలు కట్టుకుంటాను. అవి అంటే నాకు అంత పిచ్చి. నేను జీన్స్ వేసుకోవడం చాలా తక్కువ. ఎప్పుడైనా వేసుకున్నా బొట్టు మాత్రం కచ్చితంగా పెట్టుకుంటా. మన సంప్రదాయం, బొట్టు అనేవి నాకు మంచి ప్రేరణ, నమ్మకాన్ని ఇస్తాయి. ► చవితికి పిండి వంటలు చేయడం మీకు వచ్చా? నేను చేస్తాను.. నాకు బాగా వస్తాయి. పిండి వంటలు, ఉండ్రాళ్లు, పులిహోర నేను చేస్తాను. స్వీట్స్ మాత్రం అమ్మ చేస్తుంది. స్వీట్స్ అంటే నాకు ఎక్కువ ఇష్టం లేదు కాబట్టి నేను చేయను. వంటలన్నీ బాగా వండుతాను. ► మీ అమ్మ మన సంప్రదాయాల గురించి చెబుతూ మిమ్మల్ని పెంచారా? మన ఇంట్లో వాళ్లు ఎలా ఉంటే మనం కూడా అలా ఉంటాం కదా! మా అమ్మ ఎప్పుడూ పూజలు, వంటలు చేస్తూ పాజిటివ్ వైబ్స్‌తో ఉండేది. ఆమెను చూస్తూ నేను కూడా నేర్చుకున్నా. నన్ను అయితే నేర్చుకో అంటూ ఎప్పుడూ ఒత్తిడి చేయదు. ► ఇప్పుడు హీరోయిన్గా బిజీగా ఉన్నారు కాబట్టి వంట గదిలోకి వెళ్లే సమయం ఉండదేమో? అవును. ‘బేబీ’ తర్వాత ఆశిష్‌కి జోడీగా ఓ సినిమా, సిద్ధు జొన్నలగడ్డకి జతగా ఓ చిత్రం చేస్తున్నా. ► ఖైరతాబాద్ వినాయకుడు అంటే బాగా ఫేమస్.. అక్కడికి వెళుతుంటారా? ప్రతి ఏడాది వెళు తుంటాం. గత ఏడాది కూడా వెళ్లాను. ఈ ఏడాది కూడా వెళ్లాల్సిందే. ‘బేబీ’ సినిమా తర్వాత నేను ఎక్కడికి వెళ్లినా గుర్తు పడుతున్నారు. నన్నే కాదు.. మా కుటుంబ సభ్యులను కూడా గుర్తు పట్టి మాట్లాడటం సంతోషంగా ఉంది. ► చిన్నప్పుటి నుంచి హీరోయిన్ కావాలనే లక్ష్యం ఉండేదా? లేకుంటే వేరే ఏదైనా..? నాకు పదిహేనేళ్ల నుంచి సినిమా అంటే ఇష్టం ప్రారంభమైంది. సినిమా అంటే ఏంటో తెలియని వయసులో ప్రారంభమైన ఇష్టం ఇప్పుడు సినిమానే నా జీవితం అయింది. ► మీకు సినిమా నేపథ్యం లేదు. చిత్ర పరిశ్రమలో ఎలా రాణించగలుగుతామనిపించిందా? పైగా తెలుగమ్మాయి అంటే అవకాశాలు తక్కువగా ఉంటాయి కదా... తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరనే మాట ఎలా వచ్చిందో నాకు తెలియదు. కానీ, నేనయితే సినిమాలపై ఇష్టం, ప్రేమతో ప్రయత్నాలు చేయడం ప్రారంభించా.. ఆడిషన్స్‌కి వెళ్లేదాన్ని. నమ్మకం కోల్పోకుండా అలా ప్రయత్నించగా అవకాశాలు వచ్చాయి. దేనికైనా సమయం పడుతుంది. అది నటనే కాదు.. వేరే ఏ కెరీర్ అయినా కూడా. మనం కోరుకున్నది వచ్చే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. ► నటన ఒక్కటేనా? లేకుంటే డైరెక్షన్, ఇతర ఆలోచనలేమైనా ఉన్నాయా? నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం. కూచిపూడి, వెస్ట్రన్ డ్యాన్స్ నేర్చుకున్నాను. ► మీ జీవితంలో మరచిపోలేని వినాయక చవితి ఏది? స్కూల్లో చదువుతున్న సమయంలో అందరూ నిద్రపోయాక కాలనీలోని వినాయక మండపం వద్ద ఉన్న లడ్డును దొంగతనం చేయాలనుకునేవాళ్లం. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో మండపం వద్దకు వెళ్లి లడ్డు దొంగతనం చేసి అందరికీ పంచేవాళ్లం (నవ్వుతూ). -
అందుకే ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు: తెలుగు నటి
సినిమ ఇండస్ట్రీలో హీరోల సంగతేమో గానీ హీరోయిన్లు మాత్రం చాలావరకు లేటుగా పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఇంకొందరైతే స్వీటీ అనుష్కలా పూర్తిగా పెళ్లి చేసుకోకుండా ఉండిపోతారు. అలా అని హీరోయిన్లకే ఇది వర్తిస్తుందనుకుంటే మీరు పొరబడినట్లే. బ్యూటీఫుల్‌గా ఉండే పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా చాలామంది ఇప్పటికే సింగిల్‌గానే ఉంటున్నారు. అలా తెలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఓ నటి.. పెళ్లి చేసుకోకపోవడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తెలుగులో హీరోయిన్గా బెంగళూరులో పుట్టి పెరిగిన కౌసల్య.. 'ఏప్రిల్ 19' అనే మలయాళ సినిమాతో నటిగా మారింది. తెలుగు, తమిళ, మలయళ సినిమాల్లో నటించింది. అల్లుడుగారు వచ్చారు, పంచదార చిలక చిత్రాల్లో హీరోయిన్గా చేసింది. కానీ పెద్దగా కలిసి రాలేదు, దీంతో సహాయ నటిగా మారిపోయింది. గౌరి, రారండోయ్ వేడుక చూద్దాం, హీరో తదితర చిత్రాలతో అలరించింది. (ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. కొత్త విషయం బయటపడింది!) పెళ్లంటే భయపడ్డా 'పెళ్లిపై నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. సరైన వ్యక్తి.. జీవితంలోకి అడుగుపెడితే మ్యారేజ్ అనేది చాలా అందంగా ఉంటుంది. పెళ్లి గురించి నేను ఎన్నో ఆలోచించాను. అది నాకు సెట్ కాదేమో అని మొదట్లో అనుకునేవాడిని. నాకు తగ్గ వ్యక్తి దొరకడేమో అని భయపడ్డాను కూడా. కానీ ఎందుకో రిలేషన్ నాకు సెట్ కాలేదు. దీంతో పేరెంట్స్‌తో ఉండాలని ఫిక్సయ్యాను' పెళ్లికి దూరంగా 'తల్లిదండ్రులతో ఉన్నప్పుడూ పెళ్లి గురించి ఆలోచన వచ్చింది. ఒకవేళ పెళ్లి చేసుకుంటే అత్తమామలతో ఎలా ఉంటానో అని కంగారుపడ్డాను. ఇలా ఆలోచనలు ఎక్కువయ్యేసరికి కొన్నాళ్లు మ్యారేజ్ అనే దానికి దూరంగా ఉన్నాను. అప్పట్లో నేను అనారోగ్యం బారినపడ్డాను. బరువు పెరిగాను. యాక్ట్ చేసిన సినిమాలు సంతృప్తి ఇవ్వలేదు. దీంతో అన్ని విషయాల నుంచి బ్రేక్ తీసుకున్నాను' అని నటి కౌసల్య చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: 'నూడిల్స్' మూవీ: అనుకోకుండా హీరో ఓ మనిషిని చంపేస్తే?) -
11 ఏళ్లకే బాలనటిగా ఎంట్రీ.. సీరియల్స్ నుంచి సినిమాలవైపు..
బాలనటిగా మెప్పించి నటిగా మారిన మరో తెలుగు టాలెంట్.. ప్రణవి మానుకొండ. ఇన్స్టాగ్రామ్ రీల్స్‌తో మొదలైన ఆమె జర్నీ.. సీరియల్స్‌తో సాగి సినిమాకు చేరుకుంది. ఆ వివరాలు.. ► హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన ప్రణవి.. పదకొండేళ్ల వయసులో బాలనటిగా వెండితెర ఎంట్రీ ఇచ్చింది. ► ‘రొటీన్ లవ్‌స్టోరీ’, ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాల్లో చిన్నప్పటి హీరోయిన్గా కనిపించి బాగా ఫేమస్ అయింది. ► చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇటు సినిమాల్లోనూ, అటు సీరియల్స్‌లోనూ బిజీగా ఉండేది. ‘పసుపు కుంకుమ’, ‘సూర్యవంశం’, ‘ఎవరే నువ్వు మోహినీ’, ‘గంగ మంగ’ లాంటి సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ► సోషల్ మీడియాలోనూ టిక్ టాక్ వీడియోలు, రీల్స్ చేస్తూ ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుంది. ► ఆమధ్య సింగర్ నోయల్‌తో కలసి ‘హస్లర్ (Hustler)’ అనే వీడియో సాంగ్‌లో నటించింది. ఆడవాళ్లపై జరుగుతున్న అఘాయిత్యాల మీద చేసిన వీడియో సాంగ్ ఇది. బాగా వైరలై సోషల్ మీడియాలో ప్రణవి క్రేజ్ మరింత పెరిగింది. ► ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ప్రణవి. సీరియల్స్ షెడ్యూల్స్ వల్ల సినిమాలు చేయలేదు. ఇక నుంచి మాత్రం నా దృష్టి అంతా వెండితెర మీదే! – ప్రణవి మానుకొండ View this post on Instagram A post shared by Pranavi Manukonda (@pranavi_manukonda) చదవండి: అన్నింటిలో టాప్.. కానీ కుటుంబం వల్ల ఆత్మహత్యకు యత్నించిన హీరోయిన్ -
కోతితో సామ్ సెల్ఫీ, ఫ్యామిలీతో నమ్రత డిన్నర్
► ఫ్యామిలీతో వెకేషన్లో అనసూయ భరద్వాజ్ ► వైట్ టాప్‌లో రచ్చ లేపుతున్న తమన్నా ► బీచ్‌లో ప్రియాంక వారియర్ పోజులు ► కొత్త హెయిర్ కలర్‌తో లవ్‌లో ఉన్నానన్న నమత్ర శిరోద్కర్ ► కోతితో సమంత సెల్ఫీ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Esha Gupta (@egupta) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Anchor Neha (@chowdaryneha) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by J P Palak (@palak.purswani) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
66 ఏళ్ల వయసులో భార్య చనిపోయిన వ్యక్తిని పెళ్లాడిన నటి.. నెల రోజులకే..
ఇష్టానికి వయసుతో పనేంటి? నటన మీద ఆమెకున్న మక్కువ 71 ఏళ్ల వయసులో తనను ఇండస్ట్రీ వైపు అడుగులు వేయించేలా చేసింది. డాక్టర్, రచయిత్రి, కవయిత్రి, క్లాసికల్ డ్యాన్సర్, లాయర్.. ఇలా భిన్న రంగాల్లో ఆరితేరిన ఆమె రిటైర్మెంట్ తీసుకునే సమయంలో నటనా రంగంలో ఎంట్రీ ఇచ్చింది. షార్ట్ ఫిలింస్‌తో గుర్తింపు తెచ్చుకున్న బామ్మ తర్వాత ఏకంగా పెద్ద హీరోలతో నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఈ బామ్మ పేరు విజయలక్ష్మి. కానీ తన జీవిత ప్రయాణాన్ని చూస్తే ఆమెను ధైర్యలక్ష్మి అని మెచ్చుకుని తీరాల్సిందే! సలార్, పుష్ప 2లో బామ్మ తాజాగా ఈ నటి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. నటి విజయలక్ష్మి మాట్లాడుతూ.. 'నేను మొదట షార్ట్ ఫిలింలో నటించాను. అది బాగా క్లిక్ అయింది. అలా మరికొన్ని షార్ట్ ఫిలింస్ చేశాను. వెండితెరపై తొలిసారిగా రాజరాజ చోళ చిత్రం చేశాను. విరూపాక్ష, ఆచార్య, పొన్నియన్ సెల్వన్ 2.. ఇలా చాలా సినిమాలు చేశాను. సలార్, పుష్ప 2 కూడా చేస్తున్నాను. ఈ ఏడాది 12 సీరియల్స్ చేశాను. ఇంకా చాలా అవకాశాలు వస్తున్నాయి. సంతోషంగా ఉంది. 11 ఏళ్లకే తండ్రి కన్నుమూత నా కుటుంబ విషయానికి వస్తే.. నాకు ఇద్దరు తమ్ముళ్లు, ఒక చెల్లెలు. అందులో ఒకరైన నా మిలటరీ తమ్ముడు(60) ఈ మధ్యే చనిపోయాడు. తనంటే నాకెంతో ఇష్టం. తను చనిపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. నా తోబుట్టువలను చిన్నప్పటి నుంచి నేనే పెంచి పెద్దవాళ్లను చేశాను. నా 11 ఏళ్ల వయసులో నాన్న చనిపోయారు. మేనమామలు అప్పుడే నాకు పెళ్లి చేస్తా అంటే ఒప్పుకోలేదు. ముందు నా తమ్ముళ్లను బాగా చదివించి గొప్ప స్థానానికి తీసుకెళ్లాలనుకుంటున్నానని చెప్పాను. వారిని మంచి స్థానంలో చూడాలనుకున్నాను. అలా నా పెద్ద తమ్ముడు మిలటరీకి వెళ్లాడు. రెండో తమ్ముడు బ్యాంక్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. చెల్లె గృహిణిగా ఉంది. భార్య చనిపోయిన వ్యక్తితో పెళ్లి బాధ్యతలు అన్నీ తీరిపోయాక 32 ఏళ్ల వయసులో నా కోరిక తీర్చుకుందామని ఆంధ్ర నాట్యం నేర్చుకున్నాను. తర్వాత ఓ ప్రోగ్రామ్‌లో కింద పడటంతో కాలుకు దెబ్బ తగిలి డ్యాన్స్‌కు దూరమయ్యాను. 66 ఏళ్ల వయసులో నాకంటూ ఓ తోడుండాలని మామయ్య నాతో పెళ్లివైపు అడుగులు వేయించారు. భార్య చనిపోయిన ఓ రైల్వే ఉద్యోగిని నాకిచ్చి పెళ్లి చేశారు. అప్పటికే ఆయనకు ఇద్దరు పిల్లలు, కోట్ల ఆస్తి ఉంది. ఆస్తి కోసం అతడిని పెళ్లి చేసుకున్నానన్న బద్నాం నాకు వద్దని అతడి ఆస్తినంతా తన కుమారుల పేరిట రాసిచ్చాకే వివాహానికి ఒప్పుకుంటానన్నాను. ఆస్తిని రాసిచ్చేశానని ఆయన అబద్ధం చెప్పాడు. అది అబద్ధమని తర్వాత తెలిసింది. మాపెళ్లి జరిగాక అసలు కష్టాలు మొదలయ్యాయి. నా భర్త బతికున్నాడో లేదో కూడా తెలియదు నన్ను ఇంట్లోవాళ్లే బెదిరించారు, రాచిరంపాన పెట్టారు. ఆయన మనవళ్లు నన్ను ఇంట్లో నుంచి వెళ్లిపోతావా? లేదా? తనతో ఎలాగైనా ఆస్తి రాయించమని కొడుతుంటే కూడా నా భర్త మౌనంగా ఉండేవాడు. ఆయన ఆస్తి రాయడు, వీళ్లు హింసలు పెట్టడం మానరు. పెళ్లయ్యాక నెల రోజులు మాత్రమే అక్కడున్నాను. వాళ్ల చిత్రహింసలు తట్టుకోలేక ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. 2016 నుంచి ఇప్పటివరకు ఆయన ఎలా ఉన్నాడో కూడా తెలియదు. అసలు బతికున్నాడో లేదో కూడా తెలియదు. నా శవాన్ని అక్కడివ్వండి నేను ఎవరికీ భారం కాను. కాళ్లూచేతులు బాగున్నన్నాళ్లు పని చేస్తాను. తర్వాత అనాధాశ్రమానికి వెళ్లిపోతాను. నేను చనిపోయాక నా శవాన్ని కర్నూలులోని జనరల్ ఆస్పత్రిలో అప్పగించమని కోరుతున్నాను. ఎందుకంటే ఈమేరకు నేను నా శరీరాన్ని మెడికల్ స్టూడెంట్స్‌కు దానం చేసేందుకు ఒప్పుకున్నాను. వీలైతే నా జీవిత కథను పది అధ్యాయాలుగా పుస్తకంగా తేవాలన్నదే నా ఆశయం' అంటూ తన కన్నీటి కష్టాలను చెప్పుకొచ్చింది విజయలక్ష్మి. చదవండి: పెళ్లై 8 ఏళ్లయినా పిల్లలు లేకపోవడంతో ఐవీఎఫ్.. నాలుగోసారికి సక్సెస్.. కానీ రౌడీ హీరో షర్ట్ వేసుకున్న రష్మిక మందన్నా, మళ్లీ దొరికిపోయిందిగా -
బలగం లచ్చవ్వ తో సరదా ముచ్చట్లు
-
అమెరికాలో లయ ఏం జాబ్ చేస్తుందో తెలుసా?
హీరోయిన్ లయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. స్వయంవరం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మనోహరం, ప్రేమించు చిత్రాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఈ చిత్రాలకు గానూ వరుసగా మూడు నంది అవార్డులు అందుకున్న ఏకైన నటిగా లయ గుర్తింపు సంపాదించుకుంది. దాదాపు 13 ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్గా రాణించిన ఆమె కెరీర్ పీక్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని నటనకు దూరమైంది. చదవండి: బర్త్‌డే రోజున చరణ్ ధరించిన ఈ షర్ట్ ధరెంతో తెలుసా? ప్రస్తుతం భర్త, పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్న ఆమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ రీల్స్ చేస్తూ నెట్టింట సందడి చేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ఇండియా వచ్చిన లయ వరుసగా ఇంటర్య్వూలు ఇస్తోంది. ఈ సందర్భంగా అమెరికాలో తను చేసే జాబ్, శాలరీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కాగా తాను 2006లో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిన లయ.. 2011 నుంచి ఐటీ సెక్టార్లో జాబ్ చేసినట్లు చెప్పింది. నాలుగేళ్లు ఫుల్ టైం వర్క్ చేశానని, ఇండియాలోని ప్రముఖ ఐటీ సంస్థకు చేసినట్లు తెలిపింది. చదవండి: అలీ రేజాతో రొమాంటిక్ సీన్‌పై ప్రశ్న.. నటి సనా షాకింగ్ రియాక్షన్ ఆ సమయంలో తన శాలరీ అన్ని ట్యాక్స్‌లు పోనూ 12000 డాలర్స్ అని చెప్పింది. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు నెలకు రూ. 960, 000. నాలుగేళ్లు ఐటీ సెక్టార్ చేసిన తాను 2017లో జాబ్ వదిలేసినంది. ఆ తర్వాత డాన్స్ స్కూల్ పెట్టానని, కోవిడ్ కారణంగా అది మానేసి సోషల్ మీడియాలో రీల్స్ చేయడం స్టార్ట్ చేశానంటూ చెప్పుకొచ్చింది. ఇక చాలా ఏళ్ల తర్వాత ఇండియా వచ్చిన లయ హైదరాబాద్ చాలా మారిందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. న్యూయార్క్ సిటీ కంటే హైదరాబాదే చాలా బాగుందని వ్యాఖ్యానించింది. -
అప్పట్లోనే సొంతంగా హెలికాప్టర్ కొన్న ఏకైక హీరోయిన్ కేఆర్ విజయ.. ఇప్పుడెలా ఉందంటే!
సీనియర్ నటి కేఆర్ విజయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో స్టార్ హీరోయిన్గా రాణించిన ఆమె దేవత పాత్రలతో ఎక్కువగా గుర్తింపు పొందారు. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించిన ఆమె దివంగత నటుడు సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరావు లెజెండ్స్‌తో పాటు సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు వంటి అగ్ర నటుల సరసన నటించి మెప్పించారు. స్టార్ నటిగా కొనసాగుతున్న క్రమంలోనే ఓ బడా వ్యాపావేత్తనుపెళ్లి చేసుకున్న ఆమె బాగా సెటిలైపోయారు. చదవండి: అప్పుడు విష్ణుకు సన్నిహితంగా.. ఇప్పుడు మనోజ్ అనుచరుడిగా.. అసలు ఎవరీ సారథి? భర్త చనిపోవడంతో కూతురితో కలిసి చెన్నైలో నివసిస్తున్న కేఆర్ విజయ గతంలో ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించింది. తాజాగా ఆమె పాత వీడియో మరోసారి వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా తన గురించిన పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. కాగా పెళ్లి అనంతరం ఓ మహారాణిలా లైఫ్ లీడ్ చేసిన ఆమె వేల కోట్ల ఆస్తులు కూడబెట్టారట. అప్పట్లోనే ఆమెకు సొంతంగా హెలికాప్టర్ ఉండేదని, దానిని ఆమె భర్తే నడిపేవారని చెప్పారు. కేరళ, హైదరాబాద్, తమిళనాడు ఇలా ఎక్కడ సినిమా షూటింగ్స్ ఉన్నా సొంత హెలికాప్టర్లోనే ప్రయాణించేవారట. చదవండి: స్టార్ హీరో అజిత్ ఇంట తీవ్ర విషాదం అప్పట్లో ఏ హీరో కూడా సొంత హెలికాప్టర్ లేకపోవడం గమనార్హం. ఆమె భర్తకు వివిధ రకాలు బిజినెస్ ఉండేవని, ఈ క్రమంలో మద్రాస్ సమీపంలో ఏకంగా 67 ఎకరాలు తోట కోనుగోలు చేసినట్లు చెప్పారు. అంతేకాదు ఆమె రాజభవనం లాంటి లగ్జరీ ఇంటిని నిర్మించుకున్నారట. దీనిపై హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేదని అప్పట్లో విజయ రాజా వైభోగం గురించి ఇండస్ట్రీలో అంతా చర్చించుకునేవారట. ఇంటిలో స్విమ్మింగ్ పూల్తో పాటు.. అన్ని రకాల వసతులు ఉండేవట. ఆమె ఇంటిలోని లగ్జరీ వసతులు చూసి అప్పట్లోని స్టార్ హీరోలు సైతం ఆశ్చర్యపోయేవారట. ఇక తన భర్త మరణాంతరం బిజినెస్ వ్యవహారాలను కొంతకాలం పాటు ఆమె చూసుకున్నారట. ప్రస్తుతం వ్యాపారాలను తన కూతురు చూసుకుంటున్నట్లు కేఆర్ విజయ తెలిపారు. -
‘స్వయంవరం’ ప్లాప్ అనుకున్నా.. ఎగ్జామ్ బంక్ కొట్టి మూవీకి వెళ్లా!: నటి లయ
హీరోయిన్ లయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. స్వయంవరం చిత్రంలో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాకు గానూ నంది అవార్డు అందుకుంది. ఆ తర్వాత నటించిన మనోహరం, ప్రేమించు చిత్రాలకుగానూ ఆమెకు నంది అవార్డులు వరించాయి. అలా వరుసగా ఆమె మూడుసార్లు నంది అవార్డులు అందుకున్న ఏకైక నటిగా లయ గుర్తింపు పొందింది. దాదాపు 13 ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్గా రాణించిన ఆమె కెరీర్ పీక్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని నటనకు దూరమైంది. చదవండి: ప్రియుడి చేతిలో చావు దెబ్బలు తిన్న నటి, శరీరమంతా కమిలిపోయి.. ప్రస్తుతం భర్త, పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్న ఆమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన లేటెస్ట్ ఫొటోలతో పాటు రీల్స్ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఇండియాకు వచ్చిన ఆమె ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించింది. ఈ సందర్బంగా తనకు సంబంధించిన పలు ఆసక్తిర విషయాలను పంచుకుంది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. స్వయంవరం మూవీ విశేషాలను పంచుకున్నారు. ‘ఆ మూవీ టైంలో నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న. మూవీ అయిపోయింది ఎగ్జామ్స్ వచ్చాయి. స్వయంవరం రిలీజ్ రోజు ఫిజిక్స్ ఎగ్జామ్. ఒకరోజు గ్యాప్ తర్వాత కెమిస్ట్రీ ఎగ్జామ్. నా ఫ్రెండ్ మూవీకి వెళ్దాం అంది. ఎగ్జామ్ పెట్టుకుని ఎలా వెళ్తాం.. చదవాలి కదా అన్నాను. దీంతో ఆమె ఈ సినిమా ఆడక వెళ్లిపోతే ఎలా? అంది. అవును కదా.. అందరు కొత్తవాళ్లే.. ఈ మూవీ ప్లాప్ అయితే సినిమాను తీసేస్తారు కదా అనుకున్నాం. ఎగ్జామ్ పోతే మళ్లీ రాసుకోవచ్చులే అని చదవకుండ మూవీకి వెళ్లిపోయాం’ అంటూ చెప్పుకొచ్చింది. చదవండి: కొత్త జంట మనోజ్-మౌనికలపై మంచు లక్ష్మి ఎమోషనల్ పోస్ట్ ఆ తర్వాత చూస్తే ఈ మూవీ హిట్ అయ్యిందని, అసలు ఊహించలేదని చెప్పారు. అనంతరం మాట్లాడుతూ ప్రేమించు సినిమా తనకు ప్లస్ అయ్యిందన్నారు. మొదట అందరు తనని ఈ సినిమా చేయొద్దన్నారని, కానీ ఇందులో అంధురాలిగా తన పాత్రకు మంచి పేరు వచ్చిందన్నారు. ఇక తన కెరియర్లో ఈ సినిమా చేసి ఉండకపోతే బావుందని అనుకునే చిత్రం ఏదైన ఉందా? అంటే అది 'మా బాలాజీ' సినిమానే అన్నారు. ఎలాంటి సినిమాలను .. పాత్రలను ఒప్పుకోవాలనే విషయం తెలియకపోవడం వలన ఆ పొరపాటు జరిగిందన్నారు లయ. -
HYD: కేబీఆర్ పార్క్‌లో నటికి చేదు అనుభవం, ఆమెను వెంబడిస్తూ..
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్‌లో సినీ నటికి చేదు అనుభవం ఎదురైంది. సాయంత్రం పూట వాకింగ్‌కి వచ్చిన ఆమెను ఓ వ్యక్తి వెంబడించి చుక్కలు చూపించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అరెస్ట్ చేశారు. పోలీసులు సమాచారం ప్రకారం వివరాలు.. కొండాపూర్ బొటానికల్ గార్డెన్స్ సమీపంలో నివసించే ఈ యువ నటి బుధవారం రాత్రి కేబీఆర్ పార్క్‌కు నడక కోసం వచ్చింది. చదవండి: 47 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ తల్లి రాత్రి ఏడు గంటల సమయంలో ఆమె పార్క్‌లో నడుస్తుండగా గుర్తు తెలియని యువకుడు ఆమెను ఫాలో అయ్యాడు. తను ఎక్కడ ఆగితే అక్కడ ఆగుతున్నాడు. నడిస్తే నడుస్తున్నాడని ఆమె గమనించింది. ఇలా దాదాపు ఐదు సార్లు పరిక్షించిన ఆమె వెంటనే అప్రమత్తమైంది. అక్కడ ఉన్న స్థానికులకు, పార్క్ సిబ్బందికి ఈ విషయం తెలియజేసింది. దీంతో అందరు కలిసి ఆ వ్యక్తిని పట్టుకుని కొండాపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక పార్క్ సిబ్బంది ఆరా తీయగా పొందన లేని సమాధానాలు చెప్పాడు. చదవండి: కృష్ణవంశీకి పిచ్చా, ఈమె హీరోయిన్ ఏంటీ? అని హేళన చేశారు: నటి సంగీత దీంతో బంజారాహిల్స్ పోలీసులు వచ్చి అతడిని ప్రశ్నించగా.. తన పేరు శేఖర్ అని చెప్పుకొచ్చాడు. అయితే ఇదే నటికి గతంలోనూ కేబీఆర్ పార్క్‌లో ఇలాంటి అనుభవమే ఎదురైంది. 2021 ఏడాదిలో ఓ రోజు సాయంత్రం వాక్ వచ్చిన ఆమెను ఓ అగంతకుడు వెంటాడి, లైంగిక దాడికి యత్నించాడు. అది కుదరకపోవడంతో బండరాయితో దాడి చేసి సెల్ ఫోన్, పర్స్ లాక్కెళ్లాడు. ఇప్పుడు తాజాగా అదే నటిని ఆగంతకుడు వెంటాడటం పలు అనుమానాలనున రేకెత్తిస్తోంది. అయితే ఆ నటి పేరు షాలూ చౌరాసియా అని తెలుస్తోంది. -
అనారోగ్యంతో బాధపడుతున్న కస్తూరి, స్వయంగా వెల్లడించిన నటి
నటి కస్తూరి శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఆమె స్టార్ మాలో ప్రసారమయ్యే ఇంటింటి గృహాలక్ష్మి సీరియల్లో తులసిగా బుల్లితెరపై అలరిస్తోంది. ఓ గృహిని పడే కష్టాలు, భర్త నుంచి విడిపోయిన అనంతరం సమాజం నుంచి ఎదురయ్యే సవాళ్లు ఎలా ఉంటాయనేది తెరపై చూపిస్తోంది. దీంతో తులసిగా కస్తూరి బుల్లితెరపై ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇదిలా ఉంటే కస్తూరి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. సమాజంలో జరిగే ప్రతి అంశంపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంది. అలాగే తన వ్యక్తిగత విషయాలను తరచూ అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా తాను అనారోగ్యం బారిన పడ్డానంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. తన వ్యాధి గురించి చెబుతూ కస్తూరి వాపోయింది. అలాగే ఆ వ్యాధి తనపై ఎంతగా ప్రభావం చూపిందో పేర్కొంటూ ఫొటోలను షేర్ చేసింది. ‘ప్రస్తుతం చికెన్ పాక్స్‌తో(అమ్మావారు) బాధపడుతున్నా. ఈ వ్యాధి సోకడంతో నా శరీరమంతా వికృతంగా మారింది. నా ముఖం, శరీరంపై ఈ చికెన్ పాక్స్ మచ్చలు చూడండి ఎలా ఉన్నాయో. అదృష్టవశాత్తు నా కళ్లపై వాటి ప్రభావం చూపలేదు. ఇందుకు చికెన్ పాక్స్‌కి కృతజ్ఞురాలిని. ఎప్పటి లాగే నా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ(అభిమానులు) ప్రేమ, మద్దతు నాకు ఉంటుందని ఆశిస్తున్నా. ఎంతోకాలంగా సంరక్షించుకుంటున్నా నా మృదువైన చర్మం ఇప్పుడు మచ్చలు, మొటిమలతో ఇబ్బందిగా మారింది’ అంటూ ఆమె రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Kasthuri Shankar (@actresskasthuri) -
తల్లి కాబోతున్న యాంకర్ అశ్వినీ శర్మ, సీమంతం ఫొటోలు వైరల్
నటి, యాంకర్ అశ్వినీ శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అప్పట్లో బుల్లితెరపై, వెండితెరపై సందడి చేసిన ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. పలు టీవీ షోలు చేస్తూ మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ వంటి అగ్ర నటులను ఇంటర్య్వూ చేసి యాంకర్‌గా గుర్తింపు పొందింది ఆమె. ఆ తర్వాత ఛత్రపతి, కొడుకు, పల్లకిలో పెళ్లికూతురు, ధైర్యం, హీరో వంటి చిత్రాల్లో సహనటి పాత్రలు పోషించి మెప్పించింది. ప్రస్తుతం అశ్వినీ శర్మ నటనకు దూరమైన సంగతి తెలిసిందే. నటిగా మంచి క్రేజ్ ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని నటనకు గుడ్‌బై చెప్పింది. చదవండి: ఆ హీరోయిన్ అంటే క్రష్.. తను నన్ను బాగా ఆకట్టుకుంది: రామ్ చరణ్ ప్రతీక్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని పెళ్లాడి అమెరికాలో సెటిలైపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తన అభిమానులతో గుడ్‌న్యూస్ పంచుకుంది. తాను త్వరలోనే తల్లిని కాబోతున్నానంటూ తన సీమంతం వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ‘త్వరలోనే శుభవార్త చెప్పేందుకు రెడీగా ఉన్నాం. మా ఫస్ట్ లిటిల్ బేబీ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’ అంటూ బేబీ షవర్ ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం అశ్వినీ బేబీ బంప్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో అశ్వినీకి పలువురు నటీనటులు, సినీ సెలబ్రిటీ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ నటుడి భార్య View this post on Instagram A post shared by ✨Ashwini sharma✨🧿 (@ashwinisharma_official) -
పెళ్లి పీటలు ఎక్కిన ‘నేనింతే’ హీరోయిన్, వరుడు ఎవరంటే!
మాస్ మహారాజ రవితేజ ‘నేనింతే’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ముంబై బ్యూటీ శియా గౌతమ్ అలియాస్ అదితి గౌతమ్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు పొందింది. ఈ చిత్రంలో ఆమె అందం, అభినయానికి మంచి మార్కులే పడ్డాయి. అయితే హీరోయిన్గా మాత్రం ఎక్కువ కాలం రాణించలేకపోయింది. నేనింతే తర్వాత పలు చిత్రాల్లో నటించి ఆమెకు ఆ తర్వాత అవకాశాలు కరువయ్యాయి. చదవండి: ఓర్వలేక నా బిజినెస్‌పై కుట్ర చేస్తున్నారు.. ఇది పెయిడ్ బ్యాచ్ పనే: కిరాక్ ఆర్పీ వేదం చిత్రంలో మనోజ్ భాజ్‌పాయి భార్యగా నటించిన ఆమె ఆ తర్వాత తెలుగులో కనిపించనే లేదు. ఆ తర్వాత కన్నడ మూవీ డబుల్ డెక్కర్‌లో నటించిన ఆమె హిందీలో రణ్‌బీర కపూర్ సంజూ సినిమాతో అదృష్టం పరీక్షించుకుంది. అయినా అక్కడ కూడా ఆమెకు చేదు అనుభవమే ఎదురైంది. సంజూ మూవీ మంచి హిట్ అయినప్పటికీ శియాకు మాత్రం అవకాశాలు రాలేదు. దీంతో నటనకు కాస్తా బ్రేక్ ఇచ్చిన ఆమె ఇటీవల వచ్చిన గోపిచంద్ పక్కా కమర్షియల్ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. చదవండి: వచ్చే వారం ప్రభాస్-కృతి సనన్ నిశ్చితార్థం? ట్వీట్ వైరల్ అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తున్న శియ తాజాగా పెళ్లి పీటలు ఎక్కింది. తన హల్దీ, సింగీత్, పెళ్లి వేడుకులకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో ఆమెకు సినీ సెలబ్రెటీలు, ఫాలోవర్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. శియ భర్త పేరు నిఖిల్ పాల్కేవాలా. ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త అని తెలుస్తోంది. ఇక శియా పెళ్లి వేడుకలో నటి ప్రియమణి తన భర్తతో కలిసి హాజరైంది. ప్రియమణితో పాటు పలువురు సినీ సెలబ్రెటీలు శియా పెళ్లిలో సందడి చేశారు. View this post on Instagram A post shared by Karan Sampat (@karansampat87) -
Movie News: మాలీ కాలింగ్
తెలుగులో తెలుగు అమ్మాయిలు తప్ప ఇతర భాషల బ్యూటీలు ఎక్కువగా సినిమాలు చేస్తుంటారు. ముఖ్యంగా అటు ముంబై ఇటు కేరళ భామల హవా ఎక్కువగా ఉంటుంది. అయితే తెలుగులో బాగా పాపులార్టీ తెచ్చుకున్న నాయికలు ఇప్పుడు మలయాళంకి వెళుతున్నారు. ఇద్దరు సీనియర్ హీరోయిన్లకు, ఒక యువ హీరోయిన్‌కు మాలీవుడ్ నుంచి కాల్ వెళ్లింది. మలయాళంలో ఈ ముగ్గురి తొలి చిత్రం గురించి తెలుసుకుందాం. ఇండస్ట్రీకి వచ్చి పదిహేను సంవత్సరాలు దాటినా ఇంకా అగ్రకథానాయికల్లో ఒకరిగా కొనసాగుతున్నారు తమన్నా. ముఖ్యంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసిన తమన్నా వీలైనప్పుడు కన్నడ తెరపైనా మెరిశారు. అయితే మలయాళ వెండితెరపై మాత్రం కనిపించలేదు. ఇండస్ట్రీకి వచ్చిన 17 ఏళ్ల తర్వాత తమన్నా ఫస్ట్ టైమ్ ఓ మాలీవుడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దిలీప్ హీరోగా అరుణ్ గోపీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బాంద్రా’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారామె. ఈ సినిమాలో తమన్నా మహారాణి పాత్రలో కనిపించనున్నారట. సో.. మాలీవుడ్‌కి రాణిలా ఎంటర్ అవుతున్నారన్న మాట. ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. కాగా దిలీప్ హీరోగా నటిస్తున్న మరో సినిమాతో టాలీవుడ్ బాపు బొమ్మగా ప్రేక్షకులు చెప్పుకునే కన్నడ భామ ప్రణీత కూడా మాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ సినిమాకు రతీష్ రఘునందన్ దర్శకుడు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. అయితే ఇప్పటివరకు ఎక్కువగా క్లాస్ పాత్రల్లోనే కనిపించిన ప్రణీత ఈ సినిమాలో మాత్రం కాస్త మాస్‌గా కనిపించనున్నారట. క్యారెక్టర్ దృష్ట్యా ప్రణీత పాత్రకు కాస్త అహంకారం ఉంటుందట. సో.. ప్రణీత మాలీవుడ్ ఎంట్రీ మమమ్మాస్ అన్నమాట. ఈ సినిమాను కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇక ఓ బిడ్డకు (కుమార్తె ఆర్నా) జన్మనిచ్చిన తర్వాత ప్రణీత ఒప్పుకున్న తొలి సినిమా ఇదే. మరోవైపు టాలీవుడ్ బేబమ్మ (‘ఉప్పెన’లో కృతీ శెట్టి పేరు), యంగ్ బ్యూటీ కృతీ శెట్టికి కూడా మాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. మలయాళ యంగ్ హీరో టోవినో థామస్ నటిస్తున్న తాజా పాన్ ఇండియా మూవీ ‘అజయంటే రందం మోషణం’లో కృతీ శెట్టి ఓ హీరోయిన్గా నటిస్తుండగా, ఐశ్వర్యా రాజేష్, సురభి లక్ష్మీ కూడా హీరోయిన్లుగా చేస్తున్నారు. మూడు యుగాల కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. -
అర్జున్ రెడ్డితో గుర్తింపు.. వరుస సినిమాలు చేస్తున్న తెలుగందం
అదితి మ్యాకాల్ పుట్టింది కామారెడ్డి. తండ్రి సదాశివపేట గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్‌గా పనిచేసేవారు. చిన్న వయసులోనే కూచిపూడి నేర్చుకొని, పలు ప్రదర్శనలు ఇచ్చి శభాష్ అనిపించుకుంది. హైదరాబాద్ నిఫ్ట్ కాలేజీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసి, డిజైనర్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఫ్యాషన్‌పై ఉన్న మక్కువతో తన డిజైన్స్‌ను తానే ధరిస్తూ కొన్ని ఫ్యాషన్ షోలలో పాల్గొంది. డిజైనర్‌గా కంటే మోడల్‌గా గుర్తింపు రావడంతో మోడలింగ్ వైపు అడుగులు వేసింది. తర్వాత ఆమె నటనారంగం వైపు నడిచింది. వాణిజ్య ప్రకటనల్లో మోడలింగ్ చేస్తూ.. యూట్యూబ్ వెబ్‌సిరీస్‌లు, షార్ట్ ఫిలిమ్స్‌లో నటించేది. తను నటించిన ‘పాప పి సుశీల’, ‘ముద్దపప్పు ఆవకాయ్’, ‘పాష్ పోరీస్’ వెబ్ సిరీస్‌లు అదితికి సినిమా ఛాన్స్‌లను తెచ్చి పెట్టాయి. బ్లాక్బాస్టర్ ఫిల్మ్ ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో అదితి వెనుతిరిగి చూడలేదు. అందులో చేసింది చిన్న పాత్ర అయినప్పటికీ మంచి గుర్తింపునే ఇచ్చింది. వరుసగా ‘అమీ తుమీ’,‘రాధ’, ‘మిఠాయ్’, ‘దెబ్బకు ఠా.. దొంగల ముఠా’, ‘నేనులేని నా ప్రేమకథ’ సినిమాల్లో నటించింది. అమెజాన్ ప్రైమ్‌లో ప్రస్తుతం స్ట్రీమింగ్‌లో ఉన్న ‘ఏకమ్’ సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. బిజీగా ఉండటం నాకిష్టం. ఎంతలా అంటే ఐదేళ్లలో ఇరవై సినిమాల్లో నటించేంతలా! బాలీవుడ్‌లోనూ నటించాలని ఉంది – అదితి మ్యాకాల్ View this post on Instagram A post shared by Aditi Myakal (@aditi.myakal) View this post on Instagram A post shared by Aditi Myakal (@aditi.myakal) చదవండి: రాఖీ సావంత్ ఇంట్లో తీవ్ర విషాదం -
ఇటివల కొత్త ఇంట్లోకి ప్రవేశం.. తాజాగా లగ్జరీ కారు కొన్న నటి శ్రీవాణి
బుల్లితెరపై లేడీ విలన్‌గా విలనీజం చూపించిన నటి శ్రీవాణి. ప్రస్తుతం సీరియల్స్, షోలు మానేసి ఇంటికే పరిమితమైన ఆమె సోషల్ మీడియాలో అలరిస్తోన్న సంగతి తెలిసిందే. సొంతంగా యూట్యూబ్ చానల్ పెట్టి దాని ద్వారా తరచూ తన వ్యక్తిగత విషయాలను, ఇంట్లో జరిగే శుభకార్యలకు సంబంధించిన వ్లాగ్స్ చేసి వీడియోలు షేర్ చేస్తుంది. తన భర్త విక్రమ్ ఆదిత్య, కూతురు నందినిలతో కలిసి ఈ యూట్యూబ్ చానల్‌ను రన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటివలె కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన ఆమె తాజాగా లగ్జరీ కారు కొనుగోలు చేసింది. మారుతి గ్రాండ్ విటారా కొన్న ఆమె కారు ఫొటోలు, వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అంతేకాదు షో రూంలో కారు కొన్న అనంతరం నుంచి కారుకు పూజ చేయించి.. తన సహానటీనటులకు, సన్నిహితులకు పార్టీ ఇచ్చిన ఫుల్ వీడియోను తన యూట్యూబ్ చానల్లో అప్లోడ్ చేసింది. ఇక ఈ కారు ధర విషయానికి వస్తే రూ. 13 లక్షలపై ఉంటుందని తెలుస్తోంది. కాగా యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీవాణి, ఆ తర్వాత పలు టీవీ సీరియల్స్‌లో నటించింది. ‘కలవారి కోడలు’, ‘మనసు మమత’, ‘కాంచన గంగ’, ‘చంద్రముఖి’ లాంటి సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు పొందింది. చదవండి: ఎన్టీఆర్ వర్థంతి నాడు నాగ్ అలా.. ఏఎన్ఆర్ వర్ధంతి నాడు బాలయ్య ఇలా.. విజయ్ ఆంటోని కోమాలోకి వెళ్లాడా? ఆస్పత్రి బెడ్‌పై హీరో.. ఫొటో రిలీజ్! View this post on Instagram A post shared by Strikers (@strikersinsta) -
అందరూ నన్ను వ్యభిచారిణిలా చూస్తున్నారు: కరాటే కల్యాణి ఆవేదన
సినీ నటి కరాటే కల్యాణి గురించి ప్రత్యకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాల్లో ఆమె బోల్డ్ పాత్రల ద్వారా గుర్తింపు పొందిన కరాటే కల్యాణ్ బిగ్‌బాస్ 4 ద్వారా మరింత ఫేంను సంపాదించుకుంది. ముక్కుసూటిగా మాట్లాడే కల్యాణి పైకి గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ మనసులో ఎంతో బాధ ఉందని చెబుతూ ఎమోషనల్ అయ్యింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు జరిగిన అవమానాలు, చేదు సంఘటనల్ని గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతరమైంది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘బతుకుదెరువు కోసమే తాను సినిమాల్లో నటిస్తున్నానని చెప్పింది. చాలామంది నాలో బాబీనే చూశారు. కానీ నాలో మరో కోణం కూడా ఉంది. నేను సంపాదించిన దాంట్లో కొంత భాగం సేవ కార్యక్రమాలకు వినియోగిస్తాను. పిల్లలను దత్తత తీసుకున్నాను. ఎంతోమందికి సాయం చేశాను. కానీ జనాలు అవేవి చూడటం లేదు. తెరపై నేను పోషించిన పాత్రలను బట్టి నిజ జీవితంలో కూడా నన్ను అలాగే ట్రీట్ చేస్తున్నారు. చెప్పాలంటే నన్ను ఓ వ్యభిచారిగా చూస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి కామెంట్స్ నన్ను చాలా బాధిస్తున్నాయి. అవి విన్నప్పుడు నాకు చాలా పెయిన్‌గా ఉంటుంది. నేను తెరపై నటించానంతే, నిజంగా చేయలేదు. బతుకు దెరువు కోసం అలాంటి రోల్స్ చేశాను. నాలోని మంచిని గుర్తించకుండా నాపై అసహ్యమైన కామెంట్స్ చేస్తుంటారు’ అంటూ కల్యాణి ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే తాను అలాంటి దాన్ని కాదని, ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయలేదంటూ ఆమె కన్నీరు పెట్టుకుంది. చదవండి: బాలయ్య ‘అన్‌స్టాపబుల్ షో’పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు! రొమాంటిక్ సీన్స్‌లో హీరోలు అలా ప్రవర్తిస్తారు: తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు -
ఘనంగా సీరియల్ నటి శ్రీవాణి కొత్త ఇంటి గృహప్రవేశం, ఫొటోలు వైరల్
బుల్లితెరపై ఎన్నో సీరియల్స్‌లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నటి శ్రీవాణి. ఎక్కువగా విలన్ పాత్రల్లో నటించి మెప్పించింది. ఓ వైపు నటిగా బిజీగా ఉంటూనే మరోవైపు నెట్టింట అలరిస్తోంది. రీసెంట్గా ఆమె తన సొంత యూట్యూబ్ చానల్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను, ఇంట్లో జరిగే శుభకార్యలకు సంబంధించిన వీడియోలను తన యూట్యూబ్ చానల్లో షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఇటీవల ఆమె ఓ కొత్త ప్లాట్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆ మధ్య తన కొత్త ప్లాట్‌లో జరుగుతున్న వర్క్‌కు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది. ఇక తాజాగా ఆమె తన కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. కొత్త ఇంటి గృహప్రవేశ వేడుకు ఆమె చాలా ఘనంగా నిర్వహించారు. చాలామంది బుల్లితెర నటీనటులు ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బిగ్‌బాస్ బ్యూటీ హిమజ, ప్రముఖ సీరియల్ నటి సుష్మా, నవీన, అంజలితో పాటు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు శ్రీవాణికి శుభాకాంక్షలు తెలుపుతూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీవాణి గృహప్రవేశం వేడుకకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sushma Kiron🧿 (@sushmakiron) View this post on Instagram A post shared by CelebrityNews (@industrycelebritynews) చదవండి: థియేటర్ల ఇష్యూపై నిర్మాత సి కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు షూటింగ్లో హీరోయిన్‌కి కారు ప్రమాదం.. ఆలస్యంగా వెలుగులోకి! -
పెళ్లైన మొదటి రోజే నటి పూర్ణకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన భర్త
సీమటపాకాయ్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ పూర్ణ. రవిబాబు డైరెక్షన్లో వచ్చిన అవును సినిమాతో మంచి క్రేజ్‌ను దక్కించుకున్న పూర్ణ ఆ తర్వాత అఖండ, దృశ్యం-2 వంటి చిత్రాల్లో నటించింది. అయితే హీరోయిన్గా కంటే బుల్లితెరపైనే ఎక్కువగా పాపులర్ అయిన పూర్ణ ఇటీవలె దుబాయ్‌కు చెందిన షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూనే,కెరీర్లోనూ దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా పూర్ణకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. పూర్ణకు ఆమె భర్త షానిద్ కపూర్ పెళ్లైన తొలిరాత్రే సర్ప్రైజ్ చేశాడట. కాస్ట్లీ అండ్ రేర్ డైమండ్ రింగును ఆమెకు బహుమతిగా ఇచ్చాడట. అంతేకాదు ఆ రింగ్ నార్మల్‌గా చూస్తే పూర్ణ పేరు ఉండేలా రివర్స్‌లో చూస్తే షానిద్ పేరు కనిపించేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారట. ఇక ఈ గిఫ్ట్ చూసిన పూర్ణ ఆనందానికి అవధులు లేకుండా పోయాయట. ఇప్పటికే పూర్ణకు ఆమె భర్త దాదాపు 170 తులాల బంగారంతో పాటు ఓ లగ్జరీ విల్లాను కూడా ఆమె పేరు మీద గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తుంది. వీటన్నింటి ఖరీదు సుమారు రూ. 30కోట్ల వరకు ఉంటుందని సమాచారం. -
మీరు మోసపోతే , దానికి నా భర్త కారణం కాదు : నటి వార్నింగ్
హీరోయిన్ పూర్ణ ఇటీవలె దుబాయ్‌కు చెందిన షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తని పెళ్లాడిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గానే తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను బయటపెట్టిన పూర్ణ ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంది. అటు పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌నూ బ్యాలెన్స్ చేస్తున్న పూర్ణ ప్రస్తుతం రియాలిటీ షోలతో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు సెలబ్రిటీలను కూడా వదలడం లేదు. వాళ్ల ప్రొఫైల్‌తో సామాన్యుల దగ్గర్నుంచి డబ్బులు గుంజాలని చూస్తున్నారు. తాజాగా ఇదే పరిస్థితి నటి పూర్ణకు సైతం ఎదురైంది. తన భర్త షానిద్ ఆసిఫ్ ఫోటోను వాట్సాప్ డీపీగా క్రియేట్ చేసి ఓ నంబర్ నుంచి కొందరు లావాదేవీలు జరుపుతున్నారని పూర్ణ దృష్టికి వచ్చింది. ఈ విషయంపై స్పందించిన పూర్ణ.. అది తన భర్త నెంబర్ కాదని, ఒకవేళ ఎవరైనా మోసపోతే అందుకు తన భర్త కారణం కాదంటూ ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. -
టాలీవుడ్ దరిద్రం.. వాళ్లసలు హీరోయిన్సే కాదు: నటి
టాలీవుడ్లో తెలుగు హీరోయిన్స్‌కు గుర్తింపు, ఛాన్సులు రెండూ తక్కువేనన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. తెలుగమ్మాయిలు తమ టాలెంట్‌ను ప్రూవ్ చేసుకున్నా సరే వారికి అవకాశాలు ఇచ్చేందుకు దర్శకనిర్మాతలు ముందుకు రారన్న వాదన ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఇదే విషయాన్ని కుండ బద్ధలు కొట్టి చెప్పిందో తెలుగు నటి. 'దామిని విల్లా', 'రంగీలా', 'స్వాతి చినుకులు సంధ్య వేళలో' సినిమాల్లో నటించిన రేఖా బోజ్ సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'కేజీఎఫ్‌లో శ్రీనిధి శెట్టి, కాంతారలో సప్తమి గౌడ హీరోయిన్స్. కన్నడ వాళ్లు కన్నడ అమ్మాయిలనే పెట్టుకుని బ్లాక్‌బస్టర్స్ ఇచ్చారు. ఇది చూసైనా మన దర్శకులు కాస్త మారాలి(బుద్ధి తెచ్చుకోవాలి). ఇవే కాకుండా రంగితరంగ, ముంగారుమలై, దునియా, కిరాక్ పార్టీ ఇలా చాలా సినిమాలున్నాయి. కార్తికేయ 2లో ఆ మలయాళీ కాకుండా ఒక తెలుగు అమ్మాయి ఉన్నా కూడా ఆ మూవీ అలానే ఆడుతుంది. మన సబ్జెక్ట్‌లో, మన గుండెల్లో దమ్ము ఉండాలే కానీ, ఆ నార్త్, మలయాళీ, కన్నడ అమ్మాయిలు వచ్చి ఇక్కడ చేసేది ఏం ఉండదు. డైలాగ్స్ చెప్పమంటే జీరో ఎక్స్‌ప్రెషన్స్‌తో అప్పడాలు, వొడియాలు నమిలినా కూడా మనవాళ్ళకి వాళ్ళే కావాలి. మన తెలుగు సినిమాల దరిద్రం ఏంటంటే, చివరి రెండు వరుసల హీరోలు అయిన రాజ్ తరుణ్, కార్తికేయ, విశ్వక్ సేన్ లాంటి వాళ్లు.. ఇంకా లాస్ట్ హీరోలు కిరణ్ అబ్బవరం, శ్రీ సింహ, సంతోష్ శోభన్, కళ్యాణ్ దేవ్ లాంటి వాళ్ల పక్కన కూడా మన తెలుగు అమ్మాయిలు లేరు. అక్కడ సూపర్ హిట్ అయిన సినిమాలో వాళ్లు ఆ నేటివిటీకి తగినట్లు అదే లాంగ్వేజ్ అమ్మాయిలను తీసుకుంటారు. కానీ అదే సినిమాను మనవాళ్ళు రీమేక్ చేసినప్పుడు మాత్రం మన నేటివిటీకి తెలుగు అమ్మాయిలను కాకుండా వేరే వాళ్ళను పెడతారు. అక్కడ సైడ్ యాక్టర్స్ అయిన నారప్ప, మాస్టర్ మూవీల అమ్మాయిలను మనవాళ్ళు హీరోయిన్లుగా చేసేశారు. వాళ్లసలు వాళ్ళ ఇండస్ట్రీలోనే హీరోయిన్స్ కాదు!చివరికి అందరూ అసలు సినిమాల కిందే లెక్కచేయని మా వైజాగ్ ఫిలింస్‌లో కూడా తెలుగు అమ్మాయిలకు స్థానం లేదు. ఇది మన తెలుగు సినిమాకి పట్టిన కర్మ, దరిద్రం' అని ఆగ్రహం వ్యక్తం చేసింది రేఖా బోజ్. చదవండి: సంపాదన విషయంలో సుమకు, రాజీవ్‌కు గొడవలు? 62 దేశాలు, 18 నెలల.. హీరో షాకింగ్ నిర్ణయం -
కొత్త ఫ్లాట్ కొన్న బుల్లితెర నటి శ్రీవాణి
బుల్లితెరపై ఎన్నో సీరియల్స్‌లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నటి శ్రీవాణి. ఎక్కువగా ప్రతికూల పాత్రల్లో కనిపిస్తూ విలనిజం పండించిన ఆమె ఆ మధ్య అరుదైన వ్యాధితో బాధపడిన విషయం తెలిసిందే! దీని వల్ల ఆమె గొంతు మూగబోయింది. మంచి చికిత్స తీసుకోవడం వల్ల నెల రోజుల తర్వాత ఆమె తిరిగి ఎప్పటిలా గలగలా మాట్లాడగలిగింది. తనకు సంబంధించిన ఏ విషయాన్నైనా అభిమానులతో పంచుకునేందుకు ఎప్పుడూ ముందుంటుంది శ్రీవాణి. గత కొంతకాలంగా సర్ప్రైజ్ అంటూ ఊరిస్తూ వచ్చిన ఆమె అదేంటో బయటపెట్టేసింది. ఓ కొత్త ఫ్లాట్ కొన్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందని పేర్కొంది. అంతేకాదు, ఎంప్టీ హౌస్ పేరిట యూట్యూబ్‌లో వీడియో రిలీజ్ చేసి అందులో ఆ ఇంటినంతా ఓసారి తిప్పి చూపించింది. తూర్పు ఫేసింగ్ ఉన్న ఆ ఫ్లాట్‌లో ఒక హాల్, ఓపెన్ కిచెన్, డైనింగ్ ఏరియా, పూజగది, మూడు బెడ్రూమ్స్, బాల్కనీ, యుటిలిటీ ఏరియా ఉన్నాయి. ఇంటీరియర్ డిజైన్ చేయించాక ఈ ఇంటికి షిఫ్ట్ అవుతామంది. తమ కొత్తింటిని చూపిస్తూ తెగ మురిసిపోయింది శ్రీవాణి. ఆమె సొంతింటి కల నెరవేరడంతో శుభాకాంక్షలు చెప్తున్నారు శ్రీవాణి ఫ్యాన్స్. చదవండి: యాంకర్ సుమ సంపాదనే ఎక్కువా?: రాజీవ్ ఏమన్నాడంటే? దీపావళికి థియేటర్స్‌లో సందడి చేసే సినిమాలివే! -
తన ఫేస్బుక్లో అశ్లీల ఫొటోలు, స్పందించిన విష్ణుప్రియ
-
విష్ణుప్రియ ఫేస్బుక్లో అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు!
నటిగా, యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది విష్ణుప్రియ. ఆ మధ్య పలు షోలు చేస్తూ బుల్లితెరపై సందడి చేసిన ఆమె తర్వాత సినిమాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టింది. ఇటీవలే బిగ్‌బాస్ కంటెస్టెంట్ మానస్‌తో కలిసి చేజారుతున్నవ్రో అనే ప్రైవేట్ సాంగ్ చేయగా దానికి అద్భుతమైన స్పందన లభించింది. ఇక ఎప్పుడూ ఫొటోషూట్స్‌తో బిజీగా ఉండే విష్ణుప్రియ దానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటుంది. తాజాగా విష్ణుప్రియ ఫేస్బుక్ అకౌంట్ స్టోరీలో మహిళల నగ్న ఫొటోలు ప్రత్యక్షమయ్యాయి. అంతేకాదు ఫొటోలతో పాటు కొన్ని అశ్లీల వీడియోలు కూడా ఉన్నాయి. ఇది చూసిన ఆమె అభిమానులు ఒక్కసారిగా కంగు తిన్నారు. విష్ణుప్రియ ఇలాంటివి పోస్ట్ చేసిందేంటని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై విష్ణుప్రియ స్పందించింది. 'అసలేం జరిగింది అంటూ పొద్దున్నుంచి చాలా మెసేజ్‌లు వస్తున్నాయి. నా ఫేస్బుక్ పేజీ హ్యాక్ అయింది. రెండు, మూడు నెలల నుంచి ప్రయత్నిస్తున్నా ఇంకా నా అకౌంట్ నా చేతికి రాలేదు. ఇప్పటికే ఇలా రెండుసార్లు జరిగింది. ఆ పేజీని రిపోర్ట్ చేయండి. అన్‌ఫాలో చేయండి. నా పేజీలో అశ్లీల కంటెంట్ రావడంతో మీరు చాలా ఇబ్బందిపడ్డారు. అందుకు మనస్ఫూర్తిగా క్షమించమని కోరుతున్నా. నా అకౌంట్ హ్యాక్ అయిన విషయాన్ని దయచేసి అందరికీ తెలియజేయండి' అని కోరింది. చదవండి: మోకాళ్లపై తిరుపతి మెట్లెక్కిన హీరోయిన్ కంటెస్టెంట్లను పస్తులుంచిన బిగ్‌బాస్ నటి ఆత్మహత్య కేసు, దంపతులను పట్టిస్తే రివార్డ్ -
మూగబోయిన బుల్లితెర నటి గొంతు తిరిగొచ్చేసింది..
తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్‌లో నటించింది నటి శ్రీవాణి. గత నెలలో ఆమె అరుదైన వ్యాధి బారిన పడింది. దీని కారణంగా ఆమె గొంతు తాత్కాలికంగా మూగబోయింది. కొంచెం గట్టిగా మాట్లాడినా ఆమె గొంతు ఎప్పటికీ పోతుందని వైద్యులు హెచ్చరించడంతో నెల రోజుల నుంచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. తాజాగా ఆమె తీసుకున్న చికిత్స విజయవంతమైంది. దీంతో ఆమె మళ్లీ ఎప్పటిలా మాట్లాడగలుగుతోంది. ఈ సంతోషకర విషయాన్ని తెలియజేస్తూ ఆమె యూట్యూబ్‌లో వీడియో వదిలింది. డాక్టర్ సూచన మేరకు జూలై 19 నుంచి ఆగస్టు 19 వరకు అస్సలు మాట్లాడలేదు. కేవలం ఎక్స్‌ప్రెషన్స్‌తోనే మాట్లాడేశా. ఈ సమయంలో నాకోసం ఎంతోమంది ప్రార్థించారు. వారందరికీ చాలా థ్యాంక్స్ అని చెప్పుకొచ్చింది. చదవండి: బెడ్రూమ్లో దొంగాపోలీసు ఆటలు ఆడలేదా? ఇబ్బంది పడ్డ హీరోయిన్ భార్యతో విడాకులు, కూతుర్ని కలవనీయట్లేదు: నటుడు -
ఆమె గొంతు పూర్తిగా పడిపోయింది: నటి శ్రీవాణి భర్త
నటి శ్రీవాణి.. బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలు. సినిమాలు, సీరియల్స్ ద్వారా అలరించే ఆమె తన యూట్యూబ్ ఛానల్లోనూ వీడియోలు చేస్తూ అభిమానులకు వినోదాన్ని పంచుతోంది. తాజాగా ఆమె యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఇందులో శ్రీవాణి భర్త మాట్లాడుతూ.. గలగలా మాట్లాడే శ్రీవాణి వారం రోజుల నుంచి మాట్లాడలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. కొంచెం గట్టిగా మాట్లాడినా.. ఆమె గొంతు ఎప్పటికీ పోతుందని తెలిపాడు. 'గత కొన్ని వీడియోల్లో శ్రీవాణి గొంతు సరిగా రాకపోతే జలుబు వల్లేమో అనుకున్నాం. కానీ వారం రోజుల నుంచి ఆమె గొంతు పూర్తిగా పోయింది. అసలేమీ మాట్లాడటానికి రావట్లేదు. డాక్టర్ దగ్గరకు వెళ్తే.. నెల రోజుల వరకు ఆమె అస్సలు మాట్లాడకూడదని చెప్పాడు. కొన్ని మందులిచ్చాడు. నెల తర్వాత ఆమె మళ్లీ నార్మల్ అవుతుందన్న నమ్మకం ఉంది' అని చెప్పుకొచ్చాడు శ్రీవాణి భర్త. చదవండి: ఈ వారం అలరించనున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే.. -
యాంకర్ సుమ గురించి ఆసక్తికర విషయం చెప్పిన నటి
బుల్లితెరపై యాంకర్ సుమ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె షో అంటే కంటెస్టెంట్స్‌కే కాదు ప్రేక్షకుల్లో సైతం జోష్ వస్తుంది. తనదైన పంచ్‌లు, వాక్చాతుర్యంతో అందరిని అబ్బురపరుస్తుంది సుమ. మైక్ పట్టుకుంటే చాలు గలగల మాట్లాడుతూనే ఉంటుంది. అందుకే టీవీ షోలే కాదు స్టార్ హీరోల మూవీ ఈవెంట్స్, ప్రీ-రిలీజ్, ప్రమోషన్స్ అంటే సుమ లేకుండ అవి ఉండవు. ఇలా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సుమ పలు సేవ కార్యక్రమాలు చేపడుతూ గొప్ప మనసు చాటుకుంటోంది. చదవండి: సుమ వల్లే నేను ఇలా ఉన్నాను: నటి ఎమోషనల్ ఇందుకు తాజా సంఘటనే ఉదాహరణ. ఆమె హోస్ట్ చేస్తున్న ఓ షోలో సీనియర్ నటి సుభాషిని అతిథిగా పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమ లేకపోతే తాను ఇప్పుడు ఇలా మీ ముందు ఉండేదానిని కాదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ‘నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే సుమనే కారణం. ఎంతో కాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపుడుతున్న. వైద్యంగా కోసం సుమ ఆర్థికంగా సహాయం చేస్తుంది. నాకు ఆరు నెలలకు ఒకసారి మెడిసిన్స్ పంపిస్తుంది సుమ. చదవండి: ఆస్పత్రి నుంచి హీరో విక్రమ్ డిశ్చార్జి.. పాత వీడియో వైరల్ చేస్తున్న ఫ్యాన్స్ మళ్లీ నాకు మానవ జన్మ ఉంటే నువ్వు నా కడుపున పాపగా పుట్టాలి. బంగారు తల్లివమ్మా నువ్వు’ అని అనడంతో సుమ కూడా ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైంది. వెంటనే నటి సుభాషిని దగ్గరకు వెళ్లి ఆమెను హత్తుకుంది. ఇలా ఇద్దరు కన్నీళ్లు పెట్టుకోవడం స్టేజ్‌పై ఒక్కసారిగా సైలెంట్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ‘సుమ తన మాటలతో అందరిని మన్ననలు పొందడమే కాదు.. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తూ గొప్ప వ్యక్తిగా ప్రూవ్ చేసుకున్నారు’ అంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. -
దయచేసి నాకు, నరేశ్‌కు సపోర్టు ఇవ్వండి..
సీనియర్ హీరో, నటుడు నరేశ్ పెళ్లి వార్తలు ప్రస్తుతం మీడియాలో, సోషల్ మీడియాలో చర్చనీయాం అవుతున్నాయి. నటి పవిత్రా లోకేశ్‌ను ఆయన వివాహం చేసుకున్నాడంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నరేశ్ మూడో భార్య తెరపైకి వచ్చి నరేశ్‌కు తనకు ఇంకా విడాకులు కాలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇది తీవ్ర చర్చకు దారి తీసింది. నరేశ్ నిజంగానే పవిత్ర లోకేశ్‌ను పెళ్లి చేసుకున్నాడని, అందుకే తనకు విడాకుల నోటీసులు ఇచ్చాడని ఆమె మీడియాతో చెప్పింది. చదవండి: పొన్నియిన్ సెల్వన్: చోళులు వచ్చేస్తున్నారు ఈ క్రమంలో నరేశ్ పెళ్లి అంశం, రమ్య ఆరోపణలపై నటి పవిత్ర స్పందించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నరేశ్ మంచి వ్యక్తి అంటూ చెప్పుకొచ్చింది. ‘నేను తెలుగు ఇండస్ట్రీకి కొత్తేమి కాదు. చాల సంవత్సరాల నుంచి తెలుగు సినిమాల్లో నటిస్తున్నాను. కన్నడ నుంచి వచ్చిన తెలుగు ప్రేక్షకులకు నేను దగ్గరయ్యాను. ఇప్పుడు నా ప్రాబ్లమ్ మీతో పంచుకోవాలనే ఇలా మీ ముందుకు వచ్చాను. నరేశ్ ఎవరనేది నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. ఆయన గురించి ఆయన ఫ్యామిలీ గురించి కూడా ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన మూడో భార్య రమ్య ఇక్కడ బెంగళూరు మీడియాతో నా గురించి, నరేశ్ గురించి ఎన్నో ఆరోపణలు చేశారు. ఆయన గురించి, నా గురించి చాలా ఆసభ్యంగా మాట్లాడుతన్నారు. మేం రిలేషన్లో ఉన్నామని, పెళ్లి చేసుకున్నామంటూ తప్పుడు ఆరోపణలు చేశారు. ఇదంత నాకు చాలా బాధగా ఉంది. ఇక్కడ నన్ను ఒక దోషిగా చిత్రీకరించారు ఆమె’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఆమె. ‘అయితే ఇప్పటికే నరేశ్ గారు కూడా బెంగళూరు వచ్చి మీడియాతో మాట్లాడారు. మా మధ్య ఏం లేదని కూడా ఆయన చెప్పారు. ఇప్పుడు నేను కూడా ఈ వార్తలపై మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. మా మధ్య ఏం లేదు. చదవండి: Ram Charan-RC15: భిన్నమైన లుక్‌లో రామ్ చరణ్, వీడియో వైరల్ ఏదైనా ఫ్యామిలీ మ్యాటర్ ఉంటే.. నాకు భర్త కావాలి అనుకుంటే హైదరాబాద్ వచ్చి మాట్లాడుకోవాలి. కానీ ఇలా బయటకు వచ్చి రచ్చ చేయడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. నరేశ్ గారు తెలుగులో మంచి పేరున్న నటుడు. ఆయన ఆమె భర్త అయితే ఏదైన ఉంటే హైదరాబాద్‌లో కదా ఆమె మాట్లాడిల్సింది. పెద్ద వాళ్లు ఉన్నారు. ఫ్యామిలీ ఉంది. వారందరిని పిలిచి ఇలాంటిది జరుగుతుందంటూ వారితో చర్చించి సమస్య పరిష్కరించుకోవాలి. కానీ బెంగళూరు వచ్చి నన్ను చాలా చెడ్డగా చూపిస్తున్నారు. ఇది అసలు కరెక్ట్ కాదు. ఇప్పటికైన మీరందరు నాకు, నరేశ్‌కు సపోర్టు చేయాలని మీ అందరిని విజ్ఞప్తి చేస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. Actress #Pavitralokesh gives clarity on recent Allegations. #PavithraLokesh #naresh #tollywoodactress #Tollywood pic.twitter.com/1VyKpLG3LE — Medi Samrat (@Journo_Samrat) July 1, 2022 -
బెంజ్ కారు కొన్న బిగ్‌బాస్ బ్యూటీ, ధరెంతో తెలుసా?
బిగ్‌బాస్ బ్యూటీ, నటి నిక్కి తంభోలి కొత్త కారు కొనుగోలు చేసింది. మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కారు కొన్నట్లు తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడిచింది. ఈ మేరకు ఆమె కారుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. ఈ సందర్భంగా తన తండ్రితో కలిసి ఈ స్పెషల్ డేను సెలబ్రెట్ చేసుకున్న ఫొటోలను కూడాఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. వీటికి ‘ఎప్పుడు నా ఎదుగుదలలో తోడుగా ఉన్నారు. పడిపోకుండ సపోర్టు ఇచ్చారు. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. ఎప్పటికి నేను మీ లిటిల్ గర్ల్నే’ అంటూ తండ్రితో దిగిన కారు ఫొటోలను షేర్ చేసింది. చదవండి: అది చెత్త సినిమా.. దానివల్ల ఏడాది పాటు ఆఫర్స్ రాలేదు: పూజా హెగ్డే కాగా నిక్కీ కొనుగోలు చేసిన మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ కారు ధర దాదాపు రూ. 85.80 లక్షల నుంచి ఒక కోటి 25 లక్షల రూపాయల మధ్యలో ఉండోచ్చని అంచనా. ఇక నిక్కీ కొత్త కారు కొన్న విషయం తెలిసి ఆమె సహా నటీనటులు, బిగ్‌బాస్ సహా కంటెస్టెంట్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా నిక్కీ తంబోలి ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ అనే తెలుగు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ఆమె ‘తిప్పర మీసం’, తమిళంలో కాంచన 3 వంటి చిత్రాలతో నటించి గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో నిక్కీ హిందీ బిగ్‌బాస్ 14వ సీజన్ షో కంటెస్టెంట్‌గా ఆఫర్ అందుకుంది. ఆ తర్వాత ప్రముఖ రియాలిటీ గేమ్ షో కంత్రోన్ కే ఖిలాడీ షోలో సైతం నిక్కీ సత్తా చాటుకుంది. View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) -
తూనీగా తూనీగా.. అంటూ ఆడిపాడిన నటి నిశ్చితార్థం!
మనసంతా నువ్వే సినిమాలో 'తూనీగా తూనీగా.. ఎందాక పరిగెడతావే రావే నా వంకా..' అంటూ ఆడిపాడిన చిన్నారి గుర్తుంది కదా! ఈమె పేరు సుహాని కలిత. చైల్డ్ ఆర్టిస్ట్‌గానే కాకుండా నటిగా, హీరోయిన్‌గానూ మెప్పించిన ఆమె తాజాగా పెళ్లిపీటలెక్కబోతోంది. సంగీతకారుడు, మోటివేషనల్ స్పీకర్ విభర్ హసీజాను పెళ్లాడబోతోంది. ఈ మేరకు ఇటీవలే అతడితో నిశ్చితార్థం సైతం జరుపుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా బాల రామాయణం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయయం అయింది సుహాని. గణేష్, ప్రేమంటే ఇదేరా, మనసంతా నువ్వే, ఎలా చెప్పను వంటి పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అలరించింది. అదే సమయంలోనే తెలుగు సహా తమిళం, హిందీ, బెంగాలీ భాషల్లో వరుస అవకాశాలు రావడంతో అక్కడ కూడా సినిమాలు చేసింది. ఆ తర్వాత పలు కంపెనీల యాడ్స్‌లోనూ తళుక్కున మెరిసింది. 2008లో సవాల్ సినిమాతో హీరోయిన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ కథానాయికగా తనకు పెద్ద గుర్తింపు రాలేదు. ఆమె తెలు చివరగా 2010లో స్నేహగీతం సినిమాలో కనిపించింది. చదవండి: లవ్ బ్రేకప్, దత్తత ద్వారా తల్లయిన నటి నా సినిమాలు మీరే కాదు నేను కూడా చూసుకోలేదు -
శ్రీదేవి నుంచి సమంత దాకా ఎవరెవరు సర్జరీ చేసుకున్నారంటే?
‘అందం’ అనే భావన గతంలో ఒకలా ఉండేది. ఇప్పుడు మరోలా ఉంది. ఏవో కొన్ని కొలతల్లో ఇమిడితేనే అందం అంటున్నారు. ఆ కొలతల కోసం ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. గతంలో తెలుగు నటి ఆర్తి అగర్వాల్ అమెరికాలో ఈ కారణం చేతనే మరణించింది. ఇప్పుడు మరో కన్నడ నటి. ఈ భావజాలానికి విరుగుడు కనిపెట్టాలి. దక్షిణాదిలో మొదటగా కాస్మెటిక్ సర్జరీని శ్రీదేవి పరిచయం చేసింది. ఆమె తన ముక్కును ‘సరి చేసుకోవడం’ ద్వారా సగటు గృహిణులకు కూడా అటువంటి సర్జరీలు ఉంటాయని తెలియచేసింది. అంతవరకూ దక్షణాదిలో ‘బొద్దు’గా ఉండటం లేదా సహజ రూపంలో సౌందర్యాత్మకంగా ఉండటం సినీ పరిశ్రమలో సమ్మతంగా ఉండేది. ప్రేక్షకులు అటువంటి హీరోయిన్లు ఆదరించారు. అంజలీదేవి, సావిత్రి, కె.ఆర్.విజయ, బి.సరోజా దేవి, రాజశ్రీ, జయలలిత, దేవిక... వీరందరూ పూల తీవల్లాగా సుకుమారంగా తెర మీద కనిపించేవారు కాదు. ఆరోగ్యంగా, నిండుగా ఉండేవారు. దక్షిణాది స్త్రీలు తమను వారిలో పోల్చుకునేవారు. అయితే శ్రీదేవి ఉత్తరాదికి వెళ్లి నటించాలనుకున్నప్పటి నుంచి, ఉత్తరాదిలో కొత్తతరం వచ్చి ‘కాస్ట్యూమ్స్’ అధునాతనంగా మారి, ఫ్యాషన్ డిజైనర్స్ వచ్చి కొలతలను నిర్థారించడం మొదలెట్టినప్పటి నుంచి ఈ కాస్మెటిక్ సర్జరీల ధోరణి పెరిగింది. నేటికి అది శ్రుతి మించి ప్రాణాలకు ప్రమాదం తెచ్చే స్థాయికి చేరింది. లబ్ధి పొందినవారు ఉన్నారు కాస్మెటిక్ సర్జరీల వల్ల లబ్ధి పొందిన వారు ఉన్నారు. తమను తాము కొత్తగా మార్చుకున్నవారు ఉన్నారు. దానివల్ల కెరీర్లో ఎక్కువ రోజులు ఉండగలిగారు. అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఇలాంటి సర్జరీలను ఎంతవరకు ఉపయోగించాలో తెలుసుకున్నవారు సఫలం అయ్యారు. మీనాక్షి శేషాద్రి ముక్కును సరి చేసుకుని కొత్త రూపు పొందింది. హేమమాలిని ‘బ్లెఫరోప్లాస్టీ’ (కంటి ముడుతలు, సంచులు తొలగించే సర్జరీ), బొటాక్స్ల ద్వారా వృద్ధాప్య ఛాయలు కనపడకుండా చేసుకోగలిగిందనే వార్తలు ఉన్నాయి. ఇక అమితాబ్ తన తల వెంట్రుకలను, దవడలను ‘కరెక్ట్’ చేసుకుని ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’తో కొత్తరూపులో వచ్చాడు. గతంలో రజనీకాంత్‌కు పెదాల మీద మచ్చలు ఉండేవి. ఆయన కాస్మెటిక్ సర్జరీ ద్వారానే వాటిని పోగొట్టుకున్నాడు. ప్రియాంక చోప్రా నుంచి అనుష్కా శర్మ వరకు ఎందరో ఈ సర్జరీల దారిలో నేటికీ ఉన్నారు. తెలుగులో సమంత మునుపటి రూపానికి ఇప్పటి రూపానికి తేడా చూస్తే ఆమెలో కాస్మటిక్ మార్పులను గమనించవచ్చు. షారూక్ ఖాన్ భార్య గౌరి ఖాన్ కూడా తన రూపం కోసం ఈ ట్రీట్మెంట్ తీసుకుంది. వికటించిన వైనాలు కాని ప్రకృతి సిద్ధంగా వచ్చిన రూపాన్ని ఒకసారి కత్తిగాటు కిందకు తీసుకువచ్చాక అద్దంలో చూసుకున్న ప్రతిసారి ఇంకా మారుద్దాం ఇంకా మారుద్దాం అని అనిపించే మానసిక స్థితి వచ్చి శరీరానికి పెనువిపత్తు, రూపానికి విఘాతం కలిగే అవకాశం ఉంది. మైకేల్ జాక్సన్ తన రూపాన్ని మార్చుకుంటూ మార్చుకుంటూ వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. శ్రీదేవి లెక్కకు మించిన సర్జరీలతో ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ సమయానికి ఎంతో బలహీనంగా తెర మీద కనిపించడం అభిమానులు చూశారు. రాఖీ సావంత్ వంటి వారు ఈ సర్జరీలతో గత రూపం ఏమిటో తెలియనంతగా మారిపోయారు. జూహీ చావ్లా చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీ ఆమె సహజ రూపాన్ని పూర్తిగా దెబ్బ తీసింది. కత్రీనా కైఫ్, వాణి కపూర్లకు ఈ సర్జరీలు అంతగా లాభించలేదు. ఆయేషా టకియాకు ఈ సర్జరీలు బాగా నష్టం చేశాయి. ఊహించని మరణాలు తెర మీద సన్నగా కనిపించడానికి లైపోసక్షన్ చేయించుకున్న పంజాబీ నటుడు వివేక్ షౌక్ 2011లో మరణించాడు. ఇండస్ట్రీలో మరోసారి అదృష్టం పరీక్షించుకోవడానికి అమెరికాలో ఇలాంటి సర్జరీలోనే 2015లో ఆర్తి అగర్వాల్ మరణించింది. తాజా 21 ఏళ్ల కన్నడ నటి చేతనా రాజ్ ఫాట్లాస్ సర్జరీతోనే ప్రాణం కోల్పోయింది. అనుభవం ఉన్న డాక్టర్లు చేయకపోవడం వల్ల కొంత, శరీరాలకు తట్టుకునే శక్తి లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు సంభవిస్తూ ఉన్నాయి. అలాంటి వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ప్రచారం లేదు. నా రూపమే నా సౌందర్యం తెర మీద నటించాలంటే మొదట నటన కావాలి... తర్వాత రూపం అవసరమవుతుంది అనే భావన చాలా ఏళ్లకు గాని రాలేదు. సీమా బిస్వాస్ వంటి నటీమణులు, నవాజుద్దీన్ సిద్ధఖీ వంటి నటులు నటనను ముందుకు తెచ్చి రూపాన్ని వెనక్కు తీసుకెళ్లారు. ముఖాన మొటిమలు ఉన్నా సాయి పల్లవి తన నటనతో కోట్లాది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒకప్పుడు వాణిశ్రీ– హీరోయిన్లు బంగారు వర్ణంలో ఉండాలన్న రూలును బద్దలు కొట్టింది. సుజాత, జయసుధ లాంటి వాళ్లు మోడ్రన్ దుస్తులు, విగ్గులు లేకపోయినా సుదీర్ఘ కెరీర్ సాధించవచ్చు అని నిరూపించారు. ఒకవైపు ఈ కాలపు అమ్మాయిలు బాడీ షేమింగ్లతో, ఫ్యాషన్ ఇండస్ట్రీ తెచ్చే కొత్త కొత్త కొలతలతో, కాస్మటిక్ ఇండస్ట్రీ విసిరే కొత్త కొత్త వలలతో సతమతమవుతుంటే తెర మీద కనిపించే నటీమణులు తమ రూపాలు మార్చుకుంటూ ‘ఇలా ఉండటమే కరెక్టేమో’ అనే సందేశాలు ఇవ్వడం మెల్లగా తగ్గాలి. సహజ రూపమే సౌందర్యాత్మకమైనది అనే భావనకు ప్రచారం రావాలి. అత్యంత అవసరమైన, సురక్షితమైన చిన్న చిన్న అవసరాలకు తప్ప ఈ కృత్రిమ రూపాలకు దూరంగా ఉండాలనే చైతన్యం కలగాలి. అప్పుడే ప్రతిభ ముందుకు వచ్చి రూపానికి రెండవ స్థానం లభించగలదు. అందుకు అందరూ ప్రయత్నించాలి. సహజమే... సౌందర్యం... నిజానికి బ్యూటీ కాంటెస్ట్‌లలో కూడా ‘ఇలా కనపడాలి... అలా కనపడాలి’ అంటూ ఏమీ నిబంధనలు ఉండవు. అయినా అమ్మాయిలు ఓవర్ కాన్షియస్ అయిపోయి ఏవేవో లోపాలు వెతుక్కుంటున్నారు. మంచి ఆహారపు అలవాట్లు, వర్కవుట్స్ తోనే గ్లో తెచ్చుకుని అందంగా కనిపించవచ్చు. ఏదైనా సరే సహజమైన పద్ధతులే తప్ప లేజర్ సర్జరీలు, ప్లాస్టిక్ సర్జరీలు వంటివి తప్పనిసరి పరిస్థితుల్లో ఆరోగ్యం కోసం అయితే ఓకే కానీ అందం కోసం చేయించుకోవడం సరైంది కాదు. – అభిమానిక తవి, ఫిట్నెస్ ట్రైనర్, బ్యూటీ పేజెంట్ గ్రూమింగ్ పోల్చుకోవడమే పెద్ద సమస్య... అందంగా కనిపించాలని ముందు మేకప్ చేసుకోవడం నుంచి మొదలుపెడతారు. తర్వాత బ్యూటీషియన్స్‌ని సంప్రదిస్తుంటారు. కాస్మెటిక్స్ ను విపరీతంగా వాడతారు. తర్వాత ప్లాస్టిక్ సర్జరీకి వెళతారు. ఇది బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్. వీరిలో సోషల్ యాంగ్జైటీ ఎక్కువ. నలుగురిలో తామే అందంగా కనిపించాలి. లేదంటే కామెంట్ చేస్తారేమో అని భయపడుతుంటారు కూడా. వేరే ఆలోచన ఉండదు. రోజులో ఎక్కువ మొత్తం ‘అందం’పైనే శ్రద్ధ పెడతారు. ఉన్నదున్నట్టుగా అంగీకరించడం వంటివి నేర్చుకునేలా కుటుంబంలోని వారంతా శ్రద్ధ చూపాలి. అందం ఉండటం కంటే ధైర్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఆహ్లాదంగా ఉండాలి అనే విషయంలో గైడెన్స్ ఇవ్వాలి. లేదంటే అందం కోసం సర్జరీల వరకు వెళ్లడం అనే ఆలోచన ఒక వైరస్‌లా అంటుకుపోతుంది. సూసైడల్ టెండెన్సీ, ఇంటి నుంచి వెళ్లిపోవడం, ఇతరుల మాటలకు ప్రభావితులు అవడం వంటివి జరుగుతాయి. – గీతా చల్ల, సైకాలజిస్ట్ చదవండి: సీరియల్ నటి వివాహం.. నెట్టింట వీడియో వైరల్ -
సినీ నటి ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి.. సోషల్ మీడియాలో..
సాక్షి, హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఓ నటిని వాట్సాప్ ద్వారా వేధిస్తున్న పోకిరీకి అరదండాలు పడ్డాయి. స్టార్ మేకర్స్ యాప్ ద్వారా నటి ఫోన్ నంబరు తీసుకున్న ఆకతాయి నటి ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించాడు. పలుమార్లు అసభ్యకరంగా దూషించాడు. దీంతో భయపడిపోయిన నటి షూటింగ్‌లకు కూడా వెళ్లలేదు. ఆఖరికి సైబరాబాద్ షీ టీమ్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసింది. దీంతో మాదాపూర్ షీ టీమ్ రంగంలోకి దిగి నిందితుడిని పట్టుకొని రాయదుర్గం పీఎస్‌లో కేసు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. చదవండి: (Hyderabad: స్పా ముసుగులో వ్యభిచారం.. పరారీలో ఇషిక) -
దర్శకుడు మోసం చేశాడు, ఆ ఫొటోలు నా జీవితానికి మచ్చ తెచ్చాయి: నటి
‘విక్రమార్కుడు’ మూవీ ఫేం, ప్రముఖ నటి జయవాణి ఓ దర్శకుడిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె పలు ఆసక్తికర సంఘటనలతో పాటు తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. ‘కెరీర్ ప్రారంభంలో.. నేను నల్లగా ఉన్నానని, నటిగా పనికి రాను అంటూ తీవ్రంగా అవమానించారు. చదవండి: బాబోయ్ ఇలియాన సాహసం, అలాంటి ఫొటో షేర్ చేసిందేంటి! అదే సమయంలో ఓ డైరెక్టర్ సినిమాలో చాన్స్ ఉంది చేస్తావా? అని అడిగారు. వెంటనే నేరు ఒకే చెప్పాను. ఆ తర్వాత నన్ను ఫొటోషూట్‌కు రమ్మని చెప్పాడు. ఫొటోషూట్ తర్వాత ఆయన నుంచి నాకు ఎలాంటి పిలుపు రాలేదు. కనీసం ఫోన్‌కాల్ కూడా లేదు. అలా ఆ దర్శకుడు నన్ను మోసం చేశాడు’ అంటూ తనకు ఎదురైన చేదు అనభవాన్ని గుర్తు చేసింది. అయితే అప్పుడు తను ఇచ్చిన ఫొటోషూట్ ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో లీక్ చేశారని, అవి చూసి అందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. వాటి వల్ల బంధువులు, సన్నిహితులు నాతో మాట్లాడటం మానేశారని తెలిపింది. చదవండి: అల్లు అర్జున్‌పై ట్రోల్స్, నెటిజన్ల మండిపాటు అలా ఆ ఫొటోలు తన కెరీర్‌కే ఓ మచ్చగా నిలిచిపోయాయంటూ జయవాణి వాపోయింది. అయితే వాటిని వెబ్సైట్లో ఎవరూ పెట్టారనేది ఇప్పటికి తనకు తెలియదని పేర్కొంది. కాగా విజయవాడలో జన్మించిన జయవాణి బి.ఏ. వరకు చదివింది. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి ఉండడంతో ఈ రంగంలోకి అడుపెట్టింది. మొదట ‘రండి లక్షాధికారి కండి’ అనే టీవీ సీరియల్‌తో పరిచమైంది. ఆ తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ అర్టిస్ట్‌గా గుర్తింపు చెచ్చుకుంది. అయితే ఇన్ని సినిమాల్లో నటించిన అనుకున్నంత ఫేం రాకపోవడానికి కారణం సరైన ప్లానింగ్ లేకపోవడమేనని జయవాణి చెప్పింది. -
చంపి కాల్చేస్తానన్నాడు.. మోచేతితో కొట్టి.. రెయిలింగ్ పైనుంచి దూకి..
గచ్చిబౌలి: దోపిడీ చేసి దాడికి పాల్పడిన దుండగుడు కాల్చి చంపేస్తానని బెదించినట్లు సినీనటి షాలూ చౌరాసియా అన్నారు. బుధవారం కొండాపూర్‌లో మీడియాతో కేబీఆర్ పార్కు ఘటనను వివరించారు. కేబీఆర్ పార్కు సీవీఆర్ గేట్ సమీపంలో కారు పార్కు చేసి సాయంత్రం 6 గంటలకు వాకింగ్‌కు వెళ్లానని పేర్కొన్నారు. మెయిన్ గేట్ వద్దకు వెళ్లి రాత్రి 8.15 గంటలకు తిరిగి వస్తుండగా వెనక నుంచి వచ్చిన ఆగంతుకుడు నోట్లో బట్ట కుక్కి కుడివైపు పొదలవైపు లాగడంతో షాక్‌కు గురైనట్లు తెలిపారు. తెలుగులో మాట్లాడుతూ డబ్బులు ఇస్తానని చెప్పడంతో ఒక చేయి వదిలాడని.. ఫోన్ పే చేస్తానని డయల్ 100కు రెండుసార్లు ఫోన్ చేశాని చెప్పారు. గమనించిన దుండగుడు తన సెల్‌ఫోన్‌ను లాగేసుకున్నాడని పేర్కొన్నారు. హెల్ప్ అంటూ అరుస్తుండగా అదే పనిగా చేతులు, ముఖంపై దాడి చేశాడని వివరించారు. బండరాయిపైకి తోసివేయడంతో స్పృహ తప్పానని, కొద్ది సేపటికి తేరుకున్నానని చెప్పారు. బండరాయితో ముఖంపై కొట్టేందుకు ప్రయత్నించగా మోచేతితో ప్రైవేట్ పార్ట్‌పై కొట్టి ప్రధాన రహదారి వైపు ఉన్న ఫెన్సింగ్ వద్దకు చేరుకున్నానని తెలిపారు. ఫెన్సింగ్‌పై నుంచి కిందకు దూకి హెల్ప్ అని అరవడంతో కాఫీ షాపులో పని చేసేవారు వచ్చారని చెప్పారు. తనకు శత్రువులెవరూ లేరని, ఎవరిపై అనుమానం లేదన్నారు. కేబీఆర్ పార్క్‌లో లైటింగ్ అమర్చాలని ఎఫ్డీసీ అధికారులకు సూచించారు. పోలీసులు బాగా స్పందించారని ఆమె పేర్కొన్నారు. తన చేతికి ఉన్న డైమండ్ రింగ్, సెల్‌ఫోన్‌ను గుర్తించాలని పోలీసులకు ఆమె విజ్ఞప్తి చేశారు. -
నటిపై దాడి: ఆపై నాలుగు గంటలు అక్కడే ఎందుకు ఉన్నట్లు?
Actress Shalu Chourasiya Attacked at KBR Park: సినీనటి షాలూ చౌరాసియాపై దాడికి పాల్పడిన ఆగంతుకుడు.. ఆ తర్వాత నాలుగు గంటల పాటు ఆ పరిసరాల్లోనే సంచరించినట్లు టవర్ లొకేషన్లో సిగ్నళ్లు స్పష్టం చేస్తుండటం కీలకంగా మారింది. సుమారు 4 గంటల పాటు అదే ప్రాంతంలో దుండగుడు తచ్చాడటం అంతు చిక్కని మిస్టరీగా మారింది. కాగా.. ఈ కేసు మిస్టరీని ఛేదించేందుకు పలు కీలక ఆధారాలు పోలీసులకు లభ్యమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.. కాచుకుని.. వెనక నుంచి వచ్చి.. ► అది కేబీఆర్ పార్కు. ఆదివారం సాయంత్రం 6.30 గంటలు. సినీనటి షాలూ చౌరాసియా జీహెచ్ఎంసీ వాక్‌వేలో వాకింగ్‌కు వచ్చింది. 8.44 గంటలకు ఆమె స్టార్‌బక్స్ హోటల్ ముందు వాక్‌వేలో వాకింగ్ చేస్తోంది. అప్పటికే అక్కడ కాచుకొని ఉన్న దుండగుడు వెనకాల నుంచి వచ్చి ఆమెను కిందకు తోసేసి దాడికి పాల్పడ్డాడు. పది నిమిషాల పాటు పెనుగులాడిన ఆమె డయల్ 100కు ఫోన్ చేసింది. పోలీసులకు సమాచారం ఇస్తున్న సమయంలోనే దుండగుడు ఆమె చేతుల్లో నుంచి ఫోన్ లాక్కున్నాడు. అదే సమయంలో ఆమె బయటికి పరుగులు తీసింది. ► 9.14 గంటల ప్రాంతంలో సమాచారం అందుకున్న పోలీసులు స్టార్‌బక్స్ హోటల్ వద్దకు చేరుకున్నారు. కొద్దిసేపట్లోనే బాధితురాలికి స్నేహితుడు, తల్లి అక్కడికి చేరుకొని ఆస్పత్రికి తరలించారు. దాడి అనంతరం ఫోన్ లాక్కున్న దుండగుడు అక్కడి నుంచి నేరుగా వాక్‌వేలో నడుచుకుంటూనే సీవీఆర్ న్యూస్, జర్నలిస్టు కాలనీ, బాలకృష్ణ నివాసం వరకు వెళ్లాడు. ► బాలకృష్ణ ఇంటి వద్ద గేటులో నుంచి బయటికి వచ్చి ఫుట్‌పాత్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, కేబీఆర్ పార్కు వైపు నడక సాగించాడు. నెక్సా షోరూం ఎదురుగా ఉన్న కేబీఆర్ పార్కు జీహెచ్ఎంసీ వాక్‌వే పార్కింగ్‌స్థలంలో చిచ్చాస్ హోటల్ వద్దకు ఒంటిగంటకు చేరుకున్నాడు ఆ హోటల్ వద్ద అర్ధరాత్రి ఒంటిగంటకు ఫోన్ స్విచ్చాఫ్ చేసినట్లుగా టవర్ సిగ్నల్ ద్వారా పోలీసులు గుర్తించారు. బాధితురాలి ఫోన్ డేటా పరిశీలన.. ► రాత్రి 9 గంటలకు నటిపై దాడి చేసిన అనంతరం నిందితుడు నాలుగు గంటల పాటు ఆ పరిసర ప్రాంతాల్లానే తచ్చాడినట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసు బృందాలు పార్కు చుట్టూ రోడ్లపై గాలింపు చేపట్టి ఉంటే నిందితుడు జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి కేబీఆర్ పార్కు వైపు ఫుట్‌పాత్‌పై నుంచి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడే గుర్తించి ఉండేవారు. ► పార్కు చుట్టూ పోలీసు బృందాలు అదే రాత్రి జల్లెడ పట్టి అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతున్న వ్యక్తులను ప్రశ్నించి ఉంటే దుండగుడి ఆచూకీ తెలిసి ఉండేదన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. పలు అనుమానాలకు తావిస్తున్న ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. బాధితురాలి ఫోన్ కాల్ డేటా పరిశీలించగా 9 గంటల ప్రాంతంలో ఆమె డయల్ 100కు ఫోన్ చేసినట్లు గుర్తించారు. సమీపంలో ఉన్న మైలాన్ ల్యాబ్ సెల్‌టవర్ ఈ సిగ్నల్‌ను బహిర్గతం చేసింది. నిందితుడు నాలుగు గంటల పాటు అదే ప్రాంతంలో ఎలా తిరిగాడదన్నది అంతుచిక్కని విషయంగా మారింది. ఇంటర్సెప్టార్ జాడే లేదు.. ప్రతిరోజూ రాత్రి 9 గంటలకు ఇంటర్సెప్టార్ ఫుట్ పెట్రోలింగ్ పోలీసులు విధులు ముగిస్తారు. ఆదివారం రాత్రి నటి చౌరాసియాపై 8.44 గంటలకు దాడి జరగగా 9 గంటలకు ఆమె ఫెన్సింగ్ దూకి బయటికి వచ్చింది. ఆ సమయంలో ఫుట్‌పెట్రోలింగ్ పోలీసుల జాడే లేకపోవడం గమనార్హం. షాక్ నుంచి తేరుకోని చౌరాసియా.. దుండగుడి చేతిలో గాయాలపాలైన షాలూ చౌరాసియా ప్రస్తుతం వణికిపోతోంది. ‘నేను వదలను.. చంపేస్తాను’ అనే ఆగంతుకుడి బెదిరింపులు గుర్తుకొచ్చి గజగజలాడుతోంది. దాడి ఘటన అనంతరం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొంది కొండాపూర్‌లోని తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటోంది. దుండగుడికి సంబంధించిన వివరాలపై ఆమెతో మాట్లాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నామమాత్రపు నిఘా నేత్రాలు రాజకీయ ప్రముఖులు, సినీనటులు, పారిశ్రామికవేత్తలతో పాటు వీవీఐపీలు వాకింగ్ చేసే బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నామమాత్రంగానే పని చేస్తున్నాయి. మంగళవారం పార్కులోని కెమెరాలు ఎంత వరకు పని చేస్తున్నాయన్నదానిపై పరిశీలన చేపట్టారు. 42 సీసీ కెమెరాల్లో 25 మాత్రమే పని చేస్తున్నట్లుగా తేలింది. కేబీఆర్ పార్కులో పోలీసుల నిఘా వెంకటేశ్వరకాలనీ: గత ఆదివారం రాత్రి సినీ నటి షాలూ చౌరాసియాపై కేబీఆర్ పార్కు జీహెచ్ఎంసీ వాక్‌వేలో ఆగంతుకుడు దాడి చేసిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మంగళవారం కేబీఆర్ పార్కులోనూ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాకర్లకు మరింత ధైర్యాన్నిస్తూ పలు ప్రాంతాల్లో నిఘాలో పెట్టారు. మరోవైపు పార్కు బయట జీహెచ్ఎంసీ వాక్‌వేలో సైతం పోలీసు బలగాలను మోహరించారు. వాకర్లకు, సందర్శకులకు తామున్నామని భరోసా కల్పిస్తూ సాయుధ బలగాలు పహారా కాశాయి. -
కేబీఆర్ పార్కులో నటిపై దాడి..దర్యాప్తు ముమ్మరం
-
కేబీఆర్ పార్కులో నటిపై దాడి..దర్యాప్తు ముమ్మరం
Actress Shalu Chaurasia Attack: బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో నటి చౌరసియాపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నాలగు పోలీసు బృందాలతో దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు కేబీఆర్ పార్క్ చుట్టుపక్కలా సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. వీఐపీ జోన్లోనే దారి దోపిడీ జరగడంపై నగర సీపీ అంజనీ కుమార్ సీరియస్ అయినట్లు తెలుస్తుంది. కాగా ఆదివారం సాయంత్రం వాకింగ్‌కు వెళ్లిన నటి చౌరాసియాపై గుర్తుతెలియని వ్యక్తి దాడిచేసిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ రోడ్ నెం 92లోని స్టార్‌బక్స్ ఎదురుగా నిర్మానుష్య ప్రాంతం వద్ద దాడి చేసి ఆమె సెల్‌ఫోన్‌ను లాక్కుని పరారయ్యాడు. నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేవలం ఆభరణాలు, సెల్‌ఫోన్ కోసమే దాడికి పాల్పడ్డాడా..లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. -
సినీ నటి చౌరాసియా ఫోటోలు
-
కేబీఆర్ పార్క్ వద్ద నటిపై దాడి.. ముఖంపై పిడిగుద్దులు, హత్యాయత్నం
బంజారాహిల్స్ (హైదరాబాద్): నగరంలోని కేబీఆర్ పార్కులో సినీ నటిపై ఒక ఆగంతకుడు దాడిచేసి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెను తీవ్రంగా గాయపరిచి సెల్‌ఫోన్ తస్కరించి పరారయ్యాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొండాపూర్‌లో నివసించే నటి షాలూ చౌరాసియా (24) (సైకో, కాలింగ్ సహస్ర ఫేమ్) ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు కేబీఆర్ పార్కుకు వాకింగ్‌కు వచ్చారు. పార్కు చుట్టూ ఉన్న వాక్‌వేలో నడుస్తుండగా 8.45 గంటల సమయంలో వెనకాల అనుసరిస్తున్న దుండగుడు ఆమెను అడ్డగించి గట్టిగా పట్టుకొని కిందికి తోసేశాడు. ఒక్కసారిగా షాక్‌కు గురైన ఆమె తేరుకొని అరవడానికి ప్రయత్నిస్తుండగా నోట్లో గుడ్డలు కుక్కాడు. రెండు చేతులూ వెనక్కి విరిచి బండరాయి పెట్టాడు. కాళ్లు కదపకుండా దుండగుడు తన కాలును గట్టిగా ఒత్తిపెట్టాడు. మరో కాలును ఆమె మెడపై నొక్కి పెట్టి ఓ రాయితో కొట్టాడు. పది నిమిషాలపాటు పెనుగులాడుతూ దుండగుడి నుంచి తప్పించుకునేందుకు యత్నించినా విడిచిపెట్టలేదు. అరిస్తే చంపేస్తానంటూ ఓ బండరాయిని ఎత్తి బెదిరించాడు. దాడిలో నటి కాళ్లు, చేతులు, ముఖంపైన గాయాలయ్యాయి. ఆమె సెల్‌ఫోన్ తీసి ఫోన్ చేసే క్రమంలో దాన్ని లాక్కొని జేబులో పెట్టుకున్నాడు. ఒక్కసారిగా శక్తిని కూడదీసుకున్న ఆమె ఒక్క ఉదుటన లేచి కేకలు వేస్తూ పరుగులు తీశారు. పార్కు వాక్‌వేను ఆనుకొని ఉన్న ఫెన్సింగ్ పైనుంచి రోడ్డువైపు ఫుట్‌పాత్‌పైకి దూకారు. నటి అరుపులు విని ఎదురుగా ఉన్న స్టార్‌బక్స్ హోటల్ వ్యాలెట్ పార్కింగ్ డ్రైవర్లు పరిగెత్తుకొచ్చారు. దీంతో దుండగుడు పరారయ్యాడు. చౌరాసియా డ్రైవర్ల ఫోన్ తీసుకొని తల్లికి సమాచారం ఇచ్చింది. ఆమె వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. చౌరాసియాను చికిత్స నిమిత్తం స్టార్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం రాత్రి 11 గంటల ప్రాంతంలో నటి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగలు, నగదు ఇవ్వాలని దుండగుడు అడిగాడని, మూడుసార్లు రాళ్లతో దాడి చేశాడని అందులో పేర్కొన్నారు. బండరాయితో మోది చంపేస్తానని బెదిరించాడన్నారు. 4 బృందాలతో గాలింపు నటి షాలూ చౌరాసియాపై ఆగంతకుడి దాడి వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణం నిందితుడిని పట్టుకోవాలని గట్టిగా ఆదేశాలు జారీ అయిన నేపథ్యంలో ఒకవైపు బంజారా హిల్స్ లా అండ్ ఆర్డర్, క్రైం పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలిస్తుండగా.. ఇంకోవైపు టాస్క్‌ఫోర్స్ పోలీసులూ జల్లెడ పడుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే గాలింపు ముమ్మరం చేశారు. వాకింగ్ వచ్చిన వారి కదలికలపైనా ఆరా తీస్తున్నారు. పార్కు చుట్టూ వాణిజ్య సంస్థలు ఏర్పాటు చేసుకున్న 73 సీసీ కెమెరాలను పరిశీలించారు. అయితే ఎక్కడా స్పష్టత లేకపోవడంతో పార్కు చుట్టూ రోడ్లపై ఎల్ అండ్ టీ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. గతంలో నేరాలకు పాల్పడ్డ వారి వివరాలను ఆరా తీస్తూ వారి కదలికలను గమనిస్తున్నారు. ఇంకోవైపు బాధిత నటి సెల్‌ఫోన్ కాల్‌డేటాను పరిశీలిస్తున్నారు. నిందితుడు ఫోన్ చోరీ చేసిన కొద్దిసేపట్లోనే స్విచ్చాఫ్ చేశాడు. ఎక్కడ స్విచ్చాఫ్ చేశాడో ఆ ప్రాంతాన్ని గుర్తించారు. అటువైపు చుట్టుపక్కల సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. ఆ సెల్ఫోన్లో మరో సిమ్‌కార్డు వేసుకుంటే సెల్‌టవర్ ఆధారంగా గుర్తించేందుకు అవకాశం ఉండటంతో సాంకేతిక ఆధారాలపై దృష్టి పెట్టారు. -
చీర కట్టులో మెరిసిపోతున్న అను ఇమాన్యుయేల్.. ధరెంతో తెలుసా!
‘కళ్లు మూసి తెరిచేలోపే, గుండెలోకే చేరావే..’ అంటూ అభిమానుల మనసు దోచుకొని మజ్నూలుగా మార్చేసిన నటి.. అమెరికా అమ్మాయి.. అను ఇమాన్యుయేల్. ఆమె మదిలో స్థానం సంపాదించుకున్న ఫ్యాషన్ బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. మెరో జ్యూయెలరీ రాజస్థాన్‌లో ‘మెరో’ అంటే ‘గని’ అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే ఇదొక ఆభరణాల ఖని. అంతరించిపోతున్న గిరిజన, సంప్రదాయ ఆభరణాల డిజైన్స్‌ను శోధించి, సాధిస్తుంది ఈ బ్రాండ్. ఎక్కువగా హస్తకళ, శిల్పకళల సంప్రదాయ వారసత్వం నుంచి ప్రేరణ పొందిన డిజైన్స్ ఇక్కడ లభిస్తాయి. బంగారు ఆభరణాలు కూడా దొరుకుతాయి. కానీ, వెండితో తయారు చేసిన వాటికే గిరాకీ ఎక్కువ. ఆభరణాల నాణ్యతతో సంబంధం ఉండదు. డిజైన్‌ను బట్టే ధర ఉంటుంది. ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ నగరాల్లో ఈ బ్రాండ్‌కి స్టోర్స్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ మెరో జ్యూయెలరీని కొనుగోలు చేయొచ్చు. జ్యూయెలరీ బ్రాండ్: మెరో జ్యూయెలరీ ధర: రూ. 8,000 సాక్షం అండ్ నీహారిక సాక్షం, నీహారిక బిజినెస్ పార్ట్‌నర్సే కాదు.. మంచి స్నేహితులు కూడా. ఫ్యాషన్‌పై వారికి ఉన్న అభిరుచులు, ఆలోచనలు ఒక్కటే కావడంతో కలసి కెరీర్‌ను స్టార్ట్ చేశారు. న్యూఢిల్లీలోని ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసి, 2017లో ఇద్దరి పేరుతో ఓ ఫ్యాషన్ హౌస్ ప్రారంభించారు. ఎక్కువగా చేనేత కళాకారులు నేసిన ఫ్యాబ్రిక్‌నే ఉపయోగిస్తారు. సూరత్, జైపూర్ కళాకారులతో కుట్లు, అల్లికలు, రంగు అద్దకాల డిజైన్స్ వేయిస్తుంటారు. ఇక సున్నితమైన సంప్రదాయ డిజైన్స్‌లో వీరికి పెట్టింది పేరు. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ ఈ డిజైనర్ వేర్ అందుబాటులో ఉంటుంది. చీర బ్రాండ్: సాక్షం అండ్ నీహారిక ధర: రూ. 36,990 - దీపిక కొండి చదవండి: ఈ పుట్టగొడుగు పొడిని మహిళలు ప్రసవసమయంలో తింటే.. -
తగ్గేదే లే అంటూ తుపాకీ పట్టారు..
నాలుగు పాటలు.. కొన్ని కబుర్లు... ఎప్పుడూ ఇవేనా? ఇంకేదో చేయాలి. కానీ చాన్స్ రావాలి కదా! ఆ భలే చాన్స్ వస్తే.. సత్తా చూపిస్తాం అంటారు కథానాయికలు. ఇప్పుడు కొందరు తారలు గ్లామర్‌ని పక్కన పెట్టారు. అందంగా మాత్రమే కాదు.. పవర్‌ఫుల్‌గా కనిపించడానికి రెడీ అయ్యారు. తుపాకీ పట్టారు. ప్రేక్షకుల మనసులను గెలుచు కోవడానికి గురి పెట్టారు. ఇప్పటివరకూ యాభైకి పైగా సినిమాలు చేశారు హీరోయిన్ కాజల్ అగర్వాల్. గ్లామర్ సెక్షన్లో ఉన్న అన్ని రకాల పాత్రలు పోషించారు. అయితే కాజల్ ఇప్పుడు రూట్ మార్చారు. సీరియస్ పాత్రలపై సీరియస్‌గా ఫోకస్ పెట్టారు. తన తాజా చిత్రంలో కాజల్ అగర్వాల్ ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) ఏజెంట్‌గా నటించనున్నారు. నాగార్జున హీరోగా నటించనున్న ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రం కోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు కాజల్. ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ చేయనున్నట్లు ఓ సందర్భంలో కాజల్ వెల్లడించారు. అలాగే తమిళ చిత్రం ‘ఘోస్టీ’లో కాజల్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 2014లో తమిళంలో వచ్చిన విజయ్ ‘జిల్లా’లో కాజల్ పోలీసాఫీసర్‌గా కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక ‘విరాటపర్వం’ కోసం ఉద్యమకారులుగా అక్రమాలపై తుపాకీతో గురి పెట్టారు ప్రియమణి, నందితా దాస్. ఈ చిత్రంలో కామ్రేడ్ భారతక్క పాత్రలో కనిపించనున్నారు ప్రియమణి. నందితా దాస్ కూడా ఓ ప్రధాన పాత్ర చేస్తున్నారు. ఈ ఇద్దరూ అడవుల్లో తుపాకీ పట్టుకుని తాము నమ్మిన సిద్ధాంతాల కోసం వెండితెర ‘విరాటపర్వం’లో పోరాటం చేస్తారు‡. అలాగే ఈ సినిమాలోని పాత్రలకు తగ్గట్లుగా డీ గ్లామరస్‌గా కనిపిస్తారు ప్రియమణి, నందితా దాస్. వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రానా, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటించారు. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో గ్లామరస్ హీరోయిన్గా ప్రేక్షకుల్లో పాయల్ రాజ్‌పుత్‌కు మంచి పేరు వచ్చింది. అయితే తాను గ్లామరస్ పాత్రలు మాత్రమే కాదు.. పవర్ఫుల్ రోల్స్ కూడా చేయగలనని అంటున్నారు పాయల్. అందుకు నిదర్శనంగా పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం చేస్తున్న ‘5 డబ్ల్యూస్ (హూ, వాట్, వెన్, వేర్, వై) చిత్రాన్ని చెప్పుకోవచ్చు. ఇందులో వపర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు పాయల్. ఈ పాత్ర కోసం తాను ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు పాయల్ చెబుతున్నారు. అలాగే కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్‌ను పాయల్ డూప్ లేకుండా చేశారట. ప్రాణదీప్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘బ్లఫ్‌మాస్టర్’, ‘కల్కి’ వంటి సినిమాల్లో గ్లామరస్ అండ్ గాళ్ నెక్ట్స్ డోర్ వంటి పాత్రలకే పరిమితమైన హీరోయిన్ నందితా శ్వేత తన తాజా చిత్రం ‘ఐపీసీ 376’ కోసం లాఠీ పట్టారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. ఫస్ట్ టైమ్ ఓ పవర్ఫుల్ పాత్రలో నటించనుండటంతో నందితా శ్వేత బాగా ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ చిత్రాన్ని రామ్‌కుమార్ సుబ్బరామన్ డైరెక్ట్ చేస్తున్నారు. కెరీర్లో యాభైకి పైగా సినిమాలు చేసినప్పటికీ రాయ్‌లక్ష్మీ పేరు చెప్పగానే గ్లామరస్ హీరోయిన్ అనేస్తారు చాలామంది. కానీ రాయ్‌లక్ష్మీ ఇప్పుడు గేర్ మార్చారు. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో పాటు యాక్షన్ మూవీస్‌కు కూడా పచ్చజెండా ఊపుతున్నారు. కన్నడ ‘ఝాన్సీ ఐపీఎస్’ చిత్రంలో రాయ్‌లక్ష్మీ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. కన్నడతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. ఎప్పుడూ గ్లామరస్‌గా కనిపించే కథానాయికలకు ఇలాంటి పాత్రలు ఓ సవాల్. తగ్గేదే లే అంటూ తుపాకీ పట్టారు. ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
ఓ పార్టీలో చేదు అనుభవం, భయమేసి ఇంటికెళ్లి ఏడ్చాను: నటి
టీవీ నటి నవ్య స్వామి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. నా పేరు మీనాక్షి సీరియల్‌తో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఆ తర్వాత పలు సీరియళ్లలో ఆఫర్లు దక్కించుకొని ఫుల్ బిజీ ఆయిపోయింది. ఇక ఆమె కథ సీరియల్లో సహానటుడు రవి కృష్ణతో ప్రేమ వ్యవహరంపై వస్తున్న రూమర్లతో ఆమె మరింతగా పాపులర్ అయ్యింది. టీవీ షోల్లో, ఈవెంట్లల్లో జంటగా పాల్గొని వీరిద్దరి లవ్ ట్రాక్‌ని మరింత ఆసక్తిగా మలుస్తున్నారు. ఇటీవల కాలంలో బుల్లితెరపై ఏ షో చూసిన ఈ జంటే దర్శనమిస్తుంది. దీంతో ఇప్పుడు వీరి లవ్ ట్రాక్ సోషల్ మీడియాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే ఓ కార్యక్రమానికి అతిథిగా హాజరైన నవ్య స్వామి ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘మీరు ఓ పార్టీలో ఈవెంట్ మేనేజర్‌ను బాగా కొట్టారని తెలిసింది, ఎందుకని హోస్ట్ అడగ్గా దానిపై ఆమె వివరణ ఇచ్చింది. ‘ఒకసారి ఫ్రెండ్స్ అందరితో కలిసి పార్టీకి వెళ్లాను. అక్కడ మేమంతా డ్యాన్సులు వేస్తూ పార్టీ చేసుకుంటున్నాం. అలా గుంపుగా ఉండి రచ్చ రచ్చ చేస్తున్నాం. ఈ క్రమంలో మధ్యలో ఆ ఈవెంట్ మేనేజర్ వచ్చి నన్ను అసభ్యకరంగా తాకాడు. దీంతో వెంటనే వెనక్కి తిరిగి వాడిని తోసేసి చితక్కొట్టాను. ఆ తర్వాత కాళ్లతో తన్నుతూ.. చేతులతో కొట్టేశాను. బతికాడో, చచ్చాడో కూడా తెలియదు. కానీ నేను కొట్టిన కొట్టుడుకు నా చేతి వేళ్లు వాచిపోయాయి. ఇక ఆ ఘటనతో నాకు ఎంతో భయం వేసింది. ఇంటికి వెళ్లి ఏడ్చేశాను. తెలియని వారు మనల్ని అలా తాకితే ఎలా ఉంటుంది’ అంటునవ్యస్వామి అసలు విషయం చెప్పుకొచ్చింది. అయితే సినిమాల్లో కనిపించాలన్నది తన కోరిక అని, ఇప్పుడు అయితే సీరియళ్లతోనే బిజీగా ఉన్నానని చెప్పింది. ప్రస్తుతం సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయని, కానీ దానికి ఇంకా సమయం ఉందని ఆమె పేర్కొంది. -
అందాల తార జయప్రద గురించి ఈ విషయాలు తెలుసా..?
ఆమె ఆరేసుకుంటే ప్రేక్షకుడు మనసు పారేసుకున్నాడు. ఈమెతోనే రజనీకాంత్ ‘ఇంక ఊరేల.. సొంత ఇల్లేల ఓ చెల్లెలా’ అన్నది. కమలహాసన్ కళ మద్యపు మురుక్కాలవలో పారుతుంటే ఈమె కదూ దానిని ‘సాగర సంగమం’ చేయించింది. ‘భారతీయ వెండితెర మీద అంత అందమైన ముఖం మరొకటి లేదు’ అని సత్యజిత్ రే పొగిడిన ఏకైక తెలుగు అందం జయప్రదది. ఆమె రాజకీయ ప్రస్థానం ఒకదారి. ఆమె నటనదే ప్రేక్షకుల గుండెదారి. జయప్రద... జయసుధ.. శ్రీదేవి తెలుగు సినీ జగత్తును ఏలిన ఈ ముగ్గురు హీరోయిన్లు ఒకటి రెండు సంవత్సరాల తేడాతో స్టార్లు అయ్యారు. తెలుగు మాట, తెలుగు ఆట, తెలుగు సౌందర్యం తెర మీద చూపారు. శ్రీదేవి గ్లామర్‌లో బెస్ట్. జయసుధ యాక్టింగ్‌లో బెస్ట్. జయప్రద ఇటు గ్లామర్, అటు యాక్టింగ్ రెంటిలోనూ బెస్ట్ అనిపించుకున్నారు. రాజమండ్రికి చెందిన లలిత రాణి ‘భూమి కోసం’ (1974)లో మొదటిసారి తెర మీద రెండు మూడు నిమిషాల సేపు కనిపించారు. ఒక పాట మధ్యలో ఒక వితంతువు తనను చెరబట్టే కామందును హతమారుస్తుంది. ఆ వితంతువు జయప్రద. మొట్టమొదటి వేషం అలాంటిది ఎవరూ వేయరు. కాని జయప్రద చేశారు. ఆ సినిమాలోనే పేరు మార్చుకుని అప్పట్లో ‘జయ’ ట్రెండ్ నడుస్తున్నందున జయప్రదగా మారారు. ఆమె పెదవి మీద పుట్టుమచ్చ ఉంటుంది. వెండితెర మీద ఒక అందమైన పుట్టుమచ్చగా ఆమె ప్రేక్షకులకు నచ్చింది. తరం మారుతున్నప్పుడు కొత్త తరం వస్తుంది. వాణిశ్రీ, లక్ష్మి, మంజుల, లత... వీరు సీనియర్లు అవుతున్న కొద్దీ కొత్తవాళ్లు కావాల్సి వచ్చారు. జయప్రద ఆ సమయంలోనే మద్రాసులో అడుగుపెట్టారు. ఏకంగా కె.బాలచందర్ దృష్టిలో పడ్డారు. ఆమె తమిళంలో తీసిన ‘అవల్ ఒరు తోడర్ కథై’లో సుజాత చేసిన పాత్రను జయప్రదకు ఆఫర్ చేశారాయన. సుజాతకు అప్పటికి తెలుగు రాదు. అచ్చతెలుగు అమ్మాయి ఉంటేనే బాగుంటుందని బాలచందర్ ఆలోచన. అందుకు జయప్రద సరైనది అని ఆయన భావించారు. ఒక మధ్యతరగతి గంపెడు సంసారాన్ని తన భుజాల మీద మోసే, తన కలలను చిదిమేసుకుని కుటుంబం కోసం బతికే ఒక సగటు ఆడపిల్ల కథ అది. దాని బరువు ఎక్కువ. జయప్రదది ఆ సమయానికి చిన్న వయసు. కాని ఆమె ఆ పాత్రను అర్థం చేసుకొని పోషించడంతో... ఒక్క కేరెక్టర్లోనే ప్రేమ, కోపం, ఆర్తి, అసహనం చూపడంతో జయప్రద స్టార్ అయ్యారు. ఆ సినిమాయే తెలుగులో రజనీకాంత్‌కు కూడా తొలి సినిమా. ఆ సినిమాలో ‘దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి పాట’... ఏసుదాస్‌కు, జయప్రదకు, రజనీకాంత్‌కు నేటికీ మిగిలిపోయింది. కె.బాలచందర్ దర్శకత్వంలో ఆమె ‘47 రోజులు’, ‘అందమైన అనుభవం’ చేశారు. కేన్సర్ పేషెంట్‌గా చేయడానికి ఎవరు ఒప్పుకుంటారు? జయప్రద తప్ప. ‘అడవి రాముడు’తో కె.రాఘవేంద్రరావు జయప్రదను కమర్షియల్ హీరోయిన్ను చేశారు. అప్పటికే జయప్రద కుటుంబం ఎన్.టి.ఆర్కు పరిచయం ఉంది. కొన్నాళ్ల క్రితం సెలవుల్లో వచ్చి ఆయన దగ్గర కూచుని కబుర్లు చెప్పిన స్కూల్ గర్ల్ ఇప్పుడు ఆయన పక్కనే హీరోయిన్ అయ్యింది. వేటూరి రాయగా కె.వి.మహదేవన్ స్వరపర్చగా బాలూ, సుశీల పాడిన ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ పాట జయప్రదను సకల ప్రేక్షకులకు పరిచయం చేసేసింది. జయప్రద అంటే ఒక సుందరమైన సౌందర్యవంతమైన రూపం. ప్రేక్షకులు అలానే కోరుకున్నారు. ఆమె నేటికీ అలానే ఉన్నారు. ఇప్పుడు ఆమె ఒక తెలుగు సినిమా లో నటిస్తున్నారు. మరోసారి జయప్రద జయప్రదంగా మన ముందుకు రావాలని కోరుకుందాం. – సాక్షి ఫ్యామిలీ -
బిగ్‌బాస్ హౌస్‌లో 'ఓ బేబీ' నటి?
లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూసివేయడంతో కొద్ది నెలలుగా అభిమాన హీరోల నుంచి కొత్త సినిమాలు లేవు, మరోవైపు షూటింగ్‌లు ఆగిపోవడంతో సీరియళ్లు కూడా మొన్నటివరకు అరిగిన టేపు రికార్డుల్లా పాత ఎపిసోడ్లనే తిరిగి ప్రసారం చేశాయి. దీంతో వినోదాన్ని కోరుకునే సగటు ప్రేక్షకుడు ఉసూరుమన్నాడు. లాక్డౌన్ పుణ్యమాని ఎప్పుడూ టైం లేదని సాకులు చెప్పేవారికి కూడా బోలెడంత సమయం చిక్కింది. కానీ దాన్ని ఎంజాయ్ చేసేందుకు సినిమాలు లేవు షికార్లు లేవు. ఈ క్రమంలో బిగ్‌బాస్ కూడా ఉంటుందో, ఉండదో అనే అనుకున్నారు చాలామంది. ఈ నేపథ్యంలో అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ స్టార్ మా యాజమాన్యం బిగ్‌బాస్ 4 ప్రోమోను విడుదల చేసింది. (బిగ్‌బాస్-4 ఎంట్రీపై తరుణ్ క్లారిటీ) అప్పటి నుంచి బిగ్‌బాస్ హౌస్‌లో పాల్గొనేవారు వీళ్లు, కాదు కాదు వాళ్లు అంటూ సోషల్ మీడియాలో ఎన్నో పేర్లు బయటకు వచ్చాయి. తాజాగా అడపాదడపా సినిమాల్లో కనిపించిన నటి సునయన కూడా ఈ షోలో పాల్గొనబోతుందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. పైగా ఒక్క ఎపిసోడ్‌కు లక్ష రూపాయలు డిమాండ్ చేసిందని ఊదరగొట్టారు. అయితే ఇవన్నీ గాలివార్తలేనని సునయన కుండబద్ధలు కొట్టి చెప్పారు. ఈ పుకార్లన్నీ ఎక్కడి నుంచి వస్తాయో అర్థం కావట్లేదన్నారు. తనను షో కోసం ఎవరూ సంప్రదించలేరని, ప్రస్తుతం షోలో పాల్గొనాలన్న ఆలోచన కూడా లేదని స్పష్టం చేశారు. తనకు మూడున్నరేళ్ల కొడుకు ఉన్నాడని, వాడికి ఆరు, ఏడు సంవత్సరాలు వచ్చేవరకు వేరే ఆలోచన చేయలేనని చెప్పుకొచ్చారు. కాగా సునయన కొన్ని టీవీ షోలతో పాటు, పలు సినిమాలోనూ నటించారు. అయితే "ఓ బేబీ" చిత్రం ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టింది. మరోవైపు బిగ్‌బాస్ యాజమాన్యం షోను ఆగస్టు చివరి వారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది (బిగ్‌బాస్ కంటెస్టెంట్ తండ్రిపై అత్యాచారం కేసు) -
‘ఉప్పెన’ మూవీ హీరోయిన్ కృతి శెట్టి
-
హీరోయిన్ అవికా గోర్ ఫోటోలు
-
బుల్లితెర యాంకర్ వర్షిణి గ్లామర్ ఫోటోలు
-
హీరోయిన్ నందిత రాజ్ ఫోటోలు
-
హీరోయిన్ శ్రుతీహాసన్ ఫోటోలు
-
హీరోయిన్ తేజస్విని ఫోటోలు
-
హీరోయిన్ ఇలియానా ఫోటోలు
-
ఆర్ ఎక్స్100 గ్లామర్ భామ ‘ పాయల్ రాజ్‌పుత్ ’ ఫోటోలు
-
హీరోయిన్ అంజలి ఫోటోలు
-
హీరోయిన్ లావణ్యా త్రిపాఠి ఫోటోలు
-
వైభవంగా నటి అర్చన వివాహం
బిగ్‌బాస్ నటి అర్చన, ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ ఉపాధ్యక్షుడు, వ్యాపారవేత్త జగదీశ్ భక్తవత్సలంల వివాహం గురువారం ఘనంగా జరిగింది. మూడు ముళ్లతో వైవాహిక బంధానికి వారు స్వాగతం పలికారు. ఈ వివాహానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. కాగా కుటుంబసభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో వీరి నిశ్చితార్థం అక్టోబర్ 3న జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మంగళవారం రాత్రి సంగీత్‌తో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. బుధవారం రాత్రి ప్రముఖ ఫంక్షన్హాల్లో పెళ్లి రిసెప్షన్ నిర్వహించారు. హైదరాబాద్‌లో గురువారం తెల్లవారుజామున 1.30 గంటలకు అర్చన(వేద), జగదీశ్ వివాహబంధంతో ఒక్కటయ్యారు. అర్చన క్లాసికల్ డ్యాన్సర్. అంతేకాకుండా పలు సినిమాల్లోనూ నటించి వెండితెరపై మెరిసింది. అయితే సరైన హిట్ లేకపోవటంతో అడపాదడపా చిత్రాలకు మాత్రమే పరిమితమైపోయింది. ఇక బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ 1లో కంటెస్టెంట్‌గా పాల్గొని అందరికీ సుపరిచితురాలయ్యింది. ఈ షోతో తగిన గుర్తింపు తెచ్చుకున్న అర్చన పలు షోలకు జడ్జిగా వ్యవహరించింది. తాజాగా వజ్రకవచధర గోవిందా అనే చిత్రంలో ఓ పవర్ఫుల్ పాత్రను పోషించింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హీరోయిన్ పెళ్లి; అదరగొట్టిన సంగీత్
సాక్షి, హైదరాబాద్: హీరోయిన్ అర్చన(వేద) పెళ్లి వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి సంగీత్ కార్యక్రమం నిర్వహించారు. బంధు మిత్రులతో పాటు వధువు, వరుడు హుషారుగా నృత్యాలు చేశారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. వీటిని చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వధూవరులకు మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తున్నారు. ఓ ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ ఉపాధ్యక్షుడు, వ్యాపారవేత్త జగదీశ్ భక్తవత్సలంతో 14 తేదీ తెల్లవారుజామున 1.30 గంటలకు హైదరాబాద్‌లో అర్చన వివాహం జరగనుంది. 13వ తేదీ సాయంత్రం వివాహ రిసెప్షన్ ఉంటుంది. ఈ వివాహానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. నేను సినిమాతో 2004లో తెరంగేట్రం చేసిన అర్చన.. తెలుగుతో పాటు కన్నడ, తమిళ సినిమాల్లోనూ నటించింది. సరైన విజయం దక్కపోవడంతో హీరోయిన్గా నిలదొక్కుకోలేకపోయింది. ప్రముఖ రియాల్టీ షో తెలుగు బిగ్‌బాస్ సీజన్-1 కంటెస్టెంట్‌గా పాల్గొని ప్రతిభ చాటుకుంది. టీవీల్లో పలు డ్యాన్స్‌షోలకు అర్చన న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. -
షికాగోలో సెక్స్ రాకెట్
సాక్షి, హైదరాబాద్ : ఆమె ఓ చిన్నస్థాయి సినీ నటి.. ఇటీవలే తాత్కాలిక వీసాపై అమెరికాలోని షికాగో విమానాశ్రయానికి చేరింది.. అక్కడి కస్టమ్స్ అధికారులు ప్రశ్నించగా.. ఓ భారత అసోసియేషన్ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనేందుకు తన మేనేజర్ సాయంతో వచ్చానని, రెండు వారాలు ఉండి వెళ్లిపో తానని చెప్పింది.. కానీ ఆమెను రప్పించింది వ్యభి చారం చేయించడానికి.. ఏదో కార్యక్రమంలో పాల్గొనడానికంటూ టాలీవుడ్ నుంచి చిన్నస్థాయి సినీతారలను అమెరికాకు రప్పించి, భారీగా డబ్బు ఎరగా చూపి వ్యభిచారం చేయిస్తున్న కిషన్ మోదుగుమూడి, చంద్ర అనే భారతీయ దంపతులను అక్కడి షికాగో ఫెడరల్ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. క్రిమినల్ కేసు నమోదు చేసి, అక్కడి జిల్లా కోర్టుకు 42 పేజీలతో కూడిన దర్యాప్తు నివేదికను సమర్పించారు. కిషన్ మోదుగుమూడి పలు తెలుగు చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. ఈ వ్యవహారంపై అక్కడి ‘షికాగో ట్రిబ్యూన్’ మీడియా సంస్థ పూర్తి వివరాలతో కథనం ప్రచురించడం సంచలనం సృష్టిస్తోంది. షికాగో ట్రిబ్యూన్ కథనం ప్రకారం.. తాత్కాలిక వీసాలపై రప్పించి.. భారతీయ అసోసియేషన్ల కార్యక్రమాల్లో పాల్గొనడానికంటూ కిషన్ దంపతులు కొందరు చిన్నస్థాయి సినీ తారలను అమెరికాకు రప్పించి, వ్యభిచార రాకెట్‌ను నిర్వహిస్తున్నారు. అవకాశాలు పెద్దగా లేని, ద్వితీయస్థాయి నటీమణులకు భారీగా డబ్బు ఎరగా చూపి ఈ రొంపిలోకి దింపుతున్నారు. హీరోయిన్లు అనగానే అమెరికాలో ఉన్న భారతీయులకు ఉండే ‘మక్కువ’ను సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాగే ఇటీవల ఓ నటిని అమెరికాకు రప్పించినప్పుడు సందేహం వచ్చిన ఫెడరల్ పోలీసులు కూపీ లాగారు. దీంతో షికాగో నగరంలో వెస్ట్బెల్డెన్ అవెన్యూ ప్రాంతంలోని 5700 నంబర్ అపార్ట్మెంట్లో కిషన్ దంపతులు నిర్వహిస్తున్న వ్యభిచార రాకెట్ గుట్టు రట్టయింది. దీనిపై దర్యాప్తు చేసిన ఫెడరల్ పోలీసులు.. వారిని అరెస్టు చేశారు. నటీమణులకు డబ్బులు ఎరవేసి ఆ అపార్ట్మెంట్లో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారని.. ఈ వ్యవహారంలో బాలికలు, మహిళల అక్రమ రవాణా అంశాలూ ఇమిడి ఉన్నాయంటూ కోర్టులో అభియోగాలు దాఖలు చేశారు. చంపుతామని బెదిరించి.. అవకాశాలు రాని చిన్న నటీమణులు, హీరోయిన్లకు కిషన్ దంపతులు డబ్బు ఎరవేసి వ్యభిచారంలోకి దింపుతున్నారని... తర్వాత వారిని బెదిరిస్తున్నారని ఫెడరల్ పోలీసులు కోర్టుకిచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ఈ విధంగా ఓ నటిని లోబర్చుకున్నారని, తమ గురించి బయటపెడితే కీడు తలపెడతామంటూ హెచ్చరించారని తెలిపారు. కిషన్ భార్య చంద్ర ఈ వ్యభిచార కార్యకలాపాల వివరాలను, ఎవరెవరితో ‘వ్యాపారం’చేశారు, ఎంత సొమ్ము వచ్చింది.. వంటివాటిని రాసిపెట్టుకుందని వెల్లడించారు. కిషన్ అపార్ట్మెంట్లో జరిపిన సోదాల్లో జిప్‌లాక్ కవర్లలో ఉంచిన 70కి పైగా కండోమ్‌లు లభించాయని వివరించారు. ఈ–మెయిళ్లు.. ఫోన్లలో బేరాలు కిషన్ దంపతులు అటు బాధితులు, ఇటు విటులతో ఈ–మెయిళ్లలో, ఫోన్లలో సంప్రదింపులు జరిపారని.. కిషన్ భార్య చంద్ర నేరుగా విటులతో ఫోన్లో మాట్లాడేదని ఫెడరల్ పోలీసులు పేర్కొన్నారు. ఆమె ఫోన్‌ను పరిశీలించిన విచారణ అధికారులు.. ఆమె విటులతో జరిపిన ఎస్సెమ్మెస్ సంప్రదింపులను గుర్తించారు. ‘ఏ నటి అందుబాటులో ఉంది, ఎంత చెల్లించాల్సి ఉంటుంది’వంటి వివరాలతోపాటు వ్యభిచారానికి సిద్ధంగా ఉన్న నటి ఫోటోలను కూడా పంపింది. ‘ఓ నటి ఫోటోను ఒక క్లయింట్‌కు పంపగా.. అతను నా కోసమేనా? అంటూ సంతోషం వ్యక్తం చేసినట్టు’గా 2016 డిసెంబర్లో పంపిన మెసేజ్‌లో ఉంది. ఇక ‘తాను ఇప్పుడే ఓ క్లయింట్‌తో వ్యభిచరించానని, అతను చాలా సంతృప్తిగా ఉన్నాడ’ని ఓ బాధితురాలు చంద్రకు పంపిన మెసేజీలు కూడా లభించాయని ఫెడరల్ పోలీసులు పేర్కొన్నారు. కిషన్ దంపతులు అమెరికాలోని భారతీయ సంఘాల సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాల వద్దకు వెళ్లి ఇలాంటి వ్యవహారాలపై ఆసక్తి ఉన్న వారి వివరాలను తెలుసుకునేవారని.. వ్యభిచారం కోసం ఒక్కో విటుడి నుంచి 3 వేల డాలర్ల వరకు వసూలు చేశారని తేలిందని నివేదికలో వెల్లడించారు. ‘ప్లీజ్.. నన్ను ఆ కూపంలోకి లాగొద్దు’ కిషన్ ఈ–మెయిళ్లను పరిశీలించిన షికాగో పోలీసులకు ఓ బాధిత మహిళ పంపిన ఈ–మెయిళ్లు లభించాయి. తనను బెదిరించవద్దని, వ్యభిచారం చేయాలని వేధించవద్దని ఆమె కిషన్‌కు మెయిళ్లు పంపింది. ‘నాకు ఇలాంటివి చేయాలనిపించడం లేదు. ఇప్పుడుగానీ, భవిష్యత్తులోగానీ నీతో కలసి నేను అలాంటి పనులు చేయలేను. ఇంకోసారి నాతో మాట్లాడాలని ప్రయత్నిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తా..’’అని ఆమె ఆ మెయిళ్లలో హెచ్చరించింది. భార్యాభర్తలు అరెస్ట్.. రిమాండ్ డబ్బు ఎరవేసి వ్యభిచారం చేయించిన అంశంపై కిషన్ దంపతులను అమెరికా ఫెడరల్ పోలీసులు ఏప్రిల్ చివరి వారంలోనే అరెస్టు చేశారు. కోర్టు వారిని రిమాండ్‌కు పంపింది. అప్పటి నుంచి వారు జైల్లోనే ఉన్నారు. వారి ఇద్దరు పిల్లలను వర్జీనియాలోని శిశు సంక్షేమ అధికారుల సంరక్షణలో ఉంచారు. కిషన్ దంపతులకు బెయిల్ ఇచ్చేందుకు అమెరికా కోర్టు తిరస్కరించింది. వాస్తవానికి అమెరికాలో వ్యభిచారం చట్టవిరుద్ధమేమీ కాదని.. అయితే ఈ వ్యవహారంలో పిల్లలు ఉన్నా, మహిళల అక్రమ రవాణా వంటివి ఉన్నా సీరియస్‌గా పరిగణిస్తారని నిపుణులు చెబుతున్నారు. షికాగో పోలీసులు కిషన్ దంపతులపై తీవ్రమైన అభియోగాలే నమోదు చేశారని వెల్లడిస్తున్నారు. విచారణకు సహకరించని బాధితులు ఈ కేసు విచారణకు బాధితులు సహకరించడం లేదని అమెరికన్ పోలీసులు చెబుతున్నారు. ఓ బాధితురాలిని విచారించగా.. తాను వ్యభిచారం చేయలేదని, కొంతసేపు వారితో సరదాగా మాట్లాడానని, వారు తన ‘సాయం’కోరారని చెప్పింది. ఇక ఓ విటుడు తాను కిషన్ భార్య చంద్రతో మాట్లాడానని.. నటీమణులతో వ్యభిచరించేందుకు ఎంత ఖర్చవుతుందని మాత్రమే అడిగానని, అంతకుమించి ఏమీ లేదని పోలీసులకు వెల్లడించాడు. కానీ అతను షికాగో విమానాశ్రయంలోని ఓ సూట్లో చంద్రను కలసి, ఓ నటితో వ్యభిచరించేందుకు 1,110 డాలర్లు చెల్లించినట్టుగా తేలిందని ఫెడరల్ పోలీసులు కోర్టుకు ఇచ్చిన దర్యాప్తు నివేదికలో వెల్లడించారు. -
షేడ్స్ ఆఫ్ తమన్నా
మూతి 36 వంకరలు తిరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. ఎవరైనా అమ్మాయి ముఖాన్ని అదోలా పెడితే... ‘మూతిని 36 వంకరలు తిప్పుతుందండీ బాబూ!’ అంటుంటారు. మరి, ఎప్పుడు ఏ వంకర పెడితే బాగుంటుంది? తమన్నా టిప్స్ ఇచ్చారండోయ్! 36 వంకరలు కాదు గానీ... జస్ట్, ఓ ఐదు వంకరలు తిప్పారు. పాతకాలం సామెత తమన్నాకు తెలుసో? లేదో? కానీ... కొత్తకాలంలో ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా యువత (అనుకోవాలేమో!) తమకు ఎదురయ్యే సందర్భాల్లో ఏయే వంకరలు తిప్పితే బాగుంటుందనేది చూపించారు. తమన్నాలో షేడ్స్‌ని అందరూ చూడండి!! జనాలు స్పీడుగా, ఏదో పిచ్చి పట్టినట్టు పరుగుల మీద వెళ్లినా సరే... సేమ్ రెడ్ లైట్ (సిగ్నల్) దగ్గర మనతో పాటు ఆగాల్సిందే! అటువంటి సంఘటన ఎదురైనప్పుడు తమన్నా ఇటువంటి లుక్ ఇస్తారట! లాంగ్ వీకెండ్ వస్తుందని మీరు ఊహించినప్పుడు... ఒక్కసారి మీరు వేసుకున్న బట్టలు చూసుకోండి! అప్పుడు పెదాలు ఇలా విచ్చుకుంటాయట! మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీకు తెలుస్తుంది. అప్పుడు... ‘జస్ట్ పౌట్’ అంటున్నారు తమన్నా! (పౌట్ అంటే... మూతిని సున్నాలా చుట్టడమే! సెల్ఫీలు తీసుకునేటప్పుడు పౌట్ చేయడమంటే అమ్మాయిలకు ఎంతో ఇష్టమని పలు సర్వేలు స్పష్టం చేశాయి). రేపు సోమవారం అని అర్థమైనప్పుడు? చిరునవ్వు మాయం!! ఆదివారం బిర్యానీ ఉంటుందని (ఇంట్లో!) ఊహించారు. కానీ, పప్పన్నం ఉందని తెలిస్తే... అప్పుడు తమన్నా ఎక్స్ప్రెషన్ ఇదిగో ఇలా ఉంటుందట! -
తెలుగు నటిని అడగకూడని ప్రశ్న అడిగాడు!
తనను అడగకూడని ప్రశ్న అడిగిన ఓ వ్యక్తికి తెలుగు నటి శ్రావ్యారెడ్డి ఘాటుగా సమాధానం ఇచ్చింది. శ్రావ్యారెడ్డి ఇటీవల పెద్దనోట్ల రద్దుపై ఫేస్బుక్ లైవ్‌లో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా అభిమానులు, నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అయితే ఓ వ్యక్తి ఆమెను అడగకూడని ప్రశ్న అడిగాడు. ఆమె బాడీపై కామెంట్ చేశాడు. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి లోనైంది. అతనిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ‘నేను ఎంతో కీలకమైన విషయం గురించి మాట్లాడుతుంటే మీరు ఎందుకు నా శరీరం గురించి అడుగుతారు. మీలాంటి వాళ్ల వల్లే దేశం వెనుకబడిపోతున్నది. నేను నా శరీరాన్ని చూపించడం లేదు... మీ అమ్మకు ఇలాంటి శరీరం లేదా?..’ అంటూ వికృత స్వభావం కలిగిన ఆ వ్యక్తిని చీల్చిచెండాడింది. -
డాటరాఫ్ రాశి
ఈ ఫొటోలో రాశితో ఉన్న పాప ఎవరో ఈపాటికి ఊహించే ఉంటారు. అవును.. రాశి కూతురే. పేరు... ‘రిథిమ’. ముద్దులొలికే ఈ బుజ్జి పాపాయి వయసు తొమ్మిది నెలలు. ముద్దుల తనయతో రాశి ఇటీవల కొన్ని ఫొటోలు దిగారు. వాటిలో చిరునవ్వులు చిందిస్తూ దిగిన ఈ ఫొటో చూడముచ్చటగా ఉంది కదూ. అన్నట్లు.. రాశి మళ్లీ సినిమాల్లో నటించనున్నారు. ఇప్పటికే మూడు చిత్రాలు అంగీకరించారట. త్వరలో వాటి వివరాలు తెలియజేయనున్నారు. -
పోలీసు పోలీసు... నో పోలీసు
హైదరాబాద్ నగర పోలీసులు అంతర్జాతీయ ఖ్యాతీ నార్జించాలి.... హైదరాబాద్ సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ కావాలి ... తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ ఏర్పడాలి... మూడు నెలల్లో అన్ని ప్రాంతాలలో అత్యాధునిక సీసీ కెమెరాలు.... గ్రేటర్ హైదరాబాద్ మహానగరాన్ని సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ కార్యక్రమం (ఆగస్టు 14)లో భాగంగా మొదటి విడతలో 100 ఇన్నోవాలు, 300 బైక్‌లను పోలీసు శాఖకు అందజేస్తు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నమాటలివి. 100 ఇన్నోవాలు, 300 బైకులపై పోలీసులు నిరంతరం గస్తీతో తమకిక గుండెలమీద చేయి వేసుకుని పడుకోవచ్చనుకున్నారు నగరవాసులు. అయితే ప్రజల నమ్మకాన్ని ఖాకీలు మరోసారి వమ్ము చేశారు. సీనియర్ నటి శ్రీలక్ష్మి గొలుసు చోరీ ఉదంతమే పోలీసుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం. అంత పోలీసుల గస్తీలోను, కెమెరాల పహారాలోను ఆమె మెడలోని బంగారపు గొలుసును దుండగులు తెంపుకుని పోయారు. ఆ ఘటన నుంచి తేరుకునే లోపే దుండగులు పరారైయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించిన అప్పటికే వారు మామమైయ్యారు. శ్రీలక్ష్మి షాక్ నుంచి తెరుకుని పోలీస్, పోలీస్ అని పిలిచినా పలికే నాధుడే లేడు. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల కోసం 100 డయల్ చేసినా అటువైపు నుంచి స్పందన శూన్యం. చేసేదీలేక ఆమె ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ దాకా వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇంత అట్టహాసంగా పెట్రోలింగ్ కోసం అంటూ వందల ఇన్నోవా... వందల బైకులు తీసుకువచ్చినా పోలీసులు స్పందనలో మార్పులేకపోవడం శోచనీయం.అదికాక ఇన్నోవా డ్రైవర్లు, నిర్వహణదారులకు ఏపీ పోలీసు అకాడమితోపాటు అడ్మినిష్ట్రేన్ స్టాఫ్ కాలేజీలో శిక్షణ ఇప్పించారు. అంతేకాకుండా ఆ వాహనాల్లో ఏసీ, జీపీఎస్ సిస్టమ్, ట్యాబెట్లు పీసీలు, కెమెరాలు, వీహెచ్ఎఫ్ సెట్స్ వంటి అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. ఇన్ని చేసినా స్పందనారాహిత్యంతో పోలీసు వ్యవస్థ అభాసుపాలవుతోంది.హైదరాబాద్ మహానగరంలో గొలుసు చోరీలు అత్యధికంగా జరుగుతున్నాయి. దీంతో బాధితులంతా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామంటూన్నారు. కానీ ఆ కేసుల్లో మాత్రం పురోగతి ఎండమావిని తలపిస్తోంది. రక్షక భటులు ఇకనైనా మేల్కోపోతే సామాన్యులకు తిప్పలు తప్పవు. -
ఎర్రమంజిల్ కోర్టుకు శ్వేతాబసు ప్రసాద్
హైదరాబాద్ : వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడిన వర్థమాన నటి శ్వతాబసు ప్రసాద్‌ను పోలీసులు సోమవారం ఎర్రమంజిల్ కోర్టులో ప్రవేశపెట్టారు. నగరంలోని ఓ స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తూ ఆదివారం ఆమె పోలీసులకు పట్టబడిన విషయం తెలిసిందే. కాగా బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా చేసిన దాడిలో శ్వేతాబసు ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి బాలు అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దర్ని పోలీసులు ఈరోజు ఉదయం కోర్టులో హాజరు పరిచారు. కాగా నటి శ్వేతబసు ప్రసాద్‌ను ప్రభుత్వ పునరావాస కేంద్రానికి తరలించాలని కోర్టు పంజాగుట్ట పోలీసులను ఆదేశించింది. అలాగే బాలును చర్లపల్లి జైలుకు తరలించారు. పోలీసులు బాలును కస్టడీలోకి తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అతడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు వారు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ శ్వేతాబసు!
-
వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ శ్వేతాబసు ప్రసాద్!
హైదరాబాద్: వర్ధమాన నటి శ్వేతాబసు ప్రసాద్ వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి నగరంలోని ఒక స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం. బంజారాహిల్స్ లోని పార్క్ హయాత్ హోటల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా చేసిన దాడిలో శ్వేతాబసు ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారని ప్రాథమిక సమాచారం. ఇందులో బాలు అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఓ స్టార్ హోటల్లో ఆమె వ్యభిచారం నిర్వహిస్తున్నారనే వార్తలు కూడా ఊపందుకున్నాయి. కొన్నేళ్ళ క్రితం ‘కొత్త బంగారు లోకం’ చిత్రంలో హీరో వరుణ్ సందేశ్ సరసన మెరిసిన కథానాయిక శ్వేతాబసు ప్రసాద్.. తొలి చిత్రంతోనే అనూహ్యమైన గుర్తింపు సాధించినా తరువాత అనూహ్యంగా వెనుకబడ్డారు. -
ఓవర్ నైట్ స్టార్‌గా మారిన సీతమ్మ