తెలుగు నటిని అడగకూడని ప్రశ్న అడిగాడు!
తనను అడగకూడని ప్రశ్న అడిగిన ఓ వ్యక్తికి తెలుగు నటి శ్రావ్యారెడ్డి ఘాటుగా సమాధానం ఇచ్చింది. శ్రావ్యారెడ్డి ఇటీవల పెద్దనోట్ల రద్దుపై ఫేస్‌బుక్ లైవ్‌లో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా అభిమానులు, నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.
అయితే ఓ వ్యక్తి ఆమెను అడగకూడని ప్రశ్న అడిగాడు. ఆమె బాడీపై కామెంట్ చేశాడు. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి లోనైంది. అతనిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ‘నేను ఎంతో కీలకమైన విషయం గురించి మాట్లాడుతుంటే మీరు ఎందుకు నా శరీరం గురించి అడుగుతారు. మీలాంటి వాళ్ల వల్లే దేశం వెనుకబడిపోతున్నది. నేను నా శరీరాన్ని చూపించడం లేదు... మీ అమ్మకు ఇలాంటి శరీరం లేదా?..’ అంటూ వికృత స్వభావం కలిగిన ఆ వ్యక్తిని చీల్చిచెండాడింది.