
యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించి ఓవైపు రియాలిటీ షోలు.. మరోవైపు సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న సోనియా సింగ్ (Soniya Singh) ఇప్పుడు ఖరీదైన బెంజ్ కారు కొనేసింది. తాజాగా హైదరాబాద్ లో తన ప్రియుడితో కలిసి కొత్త కారులో షికారు వేసింది. ఇంతకీ కారు మోడల్ ఏంటి? ఖరీదెంత?
(ఇదీ చదవండి: వీడియో: దుబాయిలోని హిందూ దేవాలయంలో అల్లు అర్జున్)
యూట్యూబర్ గా పవన్ సిద్ధు అనే కుర్రాడితో ఎక్కువగా వీడియోలు చేసి గుర్తింపు తెచ్చుకున్న సోనియా సింగ్.. 2023లో వచ్చిన 'విరూపాక్ష' (Virupaksha Movie) మూవీతో సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. నితిన్ 'ఎక్స్ ట్రా' మూవీలోనూ కామెడీ రోల్ చేసింది. ప్రస్తుతం ఢీ షోలో యాంకర్ గా చేస్తోంది.
ప్రియుడితో కలిసి రెండు చేతులా సంపాదిస్తున్న సోనియా.. మెర్సిడెజ్ బెంగ్ సీ క్లాస్ కారుని కొనుగోలు చేసింది. దీని ఖరీదు మార్కెట్ లో రూ.60-80 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: లేడీ కమెడియన్ కొడుక్కి పేరు పెట్టిన కమల్ హాసన్)
Comments
Please login to add a commentAdd a comment