
టాలీవుడ్ హీరో ప్రియదర్శి సరికొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కోర్ట్ మూవీతో బ్లాక్ బస్టర్ హింట్ అందుకున్న ప్రియదర్శి.. సారంగపాణి జాతకం అంటూ మరోసారి అభిమానలను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాకు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించగా.. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలో మిస్టర్ ప్రెగ్నెంట్ హీరోయిన్ రూప కొదువాయూర్ కనిపించనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
అయితే ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్‌తో కలిసి ప్రియదర్శి ఓ వీడియోను చేశారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం ఆధారంగా సారంగపాణి జాతకం ప్రమోషన్ వీడియో చేశారు. దీనిపై హీరో ప్రియదర్శి ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో మాట్లాడారు.
ప్రియదర్శి మాట్లాడుతూ..' సోషల్ మీడియాలో మేజర్ ట్రెండ్‌ను చూసే మేము అలా చేద్దామని అనుకున్నాం. దాని ద్వారా ముందుకు తీసుకెళ్దామని అనుకున్నాం. రీల్ చూసి మేము అలా చేద్దామని అనుకున్నాం. అంతే కానీ ఎక్కడా కానీ మేము అలేఖ్య పచ్చళ్ల గురించి మాట్లాడలేదు. నా వ్యక్తిగత సినిమా కోసం వారి కామెంట్స్‌ను వాడుకోను. ఎక్కడా కూడా వాళ్లను కించపరిచేలా చేయలేదు.' అని క్లారిటీ ఇచ్చారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 25న థియేటర్లలో సందడి చేయనుంది.