Priyadarshi Pulikonda
-
ఓటీటీలో తెలుగు సినిమా.. తిరుమల సీన్స్‌పై వివాదం!
ఇటీవల తిరుమల కొండపై వివాదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే బిగ్ బాస్ ప్రియాంక మెట్లమార్గంలో ప్రాంక్ వీడియో చేయగా.. మరో యువతి పుష్ప సాంగ్ రీల్ చేసి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత వీరిద్దరు క్షమాపణలు కోరుతూ వీడియో రిలీజ్ చేశారు. తాజాగా తిరుమలలో మరో వివాదం చోటు చేసుకుంది.నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 35 చిన్నకథకాదు. ఈ మూవీ అంతా దాదాపుగా తిరుపతిలోనే తెరకెక్కించారు. అయితే కొన్ని సీన్స్ తిరుమలలో కూడా రూపొందించారు. శ్రీవారి ఆలయం ఎదురుగా అఖిలాండం వద్ద హీరో కూర్చొని ఉన్నట్లు దర్శకుడు చూపించారు. అంతేకాకుండా తిరుమల ఘాట్ రోడ్ సీన్లు కూడా తెరపై కనిపించాయి. కానీ తిరుమల కొండపై షూటింగ్‌లపై ఎప్పటి నుంచో ఆంక్షలు ఉన్నాయి. ఎవరు కూడా తిరుమల పరిసర ప్రాంతాలతో పాటు నడకదారి, ఘాట్ రోడ్లలో కూడా షూటింగ్స్ చేయడానికి అనుమతులు కూడా లేవు. దీంతో ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు కనిపించడంతో అది మరో వివాదానికి దారితీసింది.ఓటీటీలో స్ట్రీమింగ్..అయితే ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో అందుబాటులో ఉంది. తన కుమారుడి చదవు కోసం ఓ తల్లి పడే తపన నేపథ్యంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రానికి నందకిశోర్ ఇమాని దర్శకత్వం వహించారు. -
9 నెలల తర్వాత ఓటీటీకి టాలీవుడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇప్పుడు తాజా ట్రెండ్ ప్రకారం థియేటర్లలో సినిమాలన్నీ అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. పెద్ద సినిమాలైతే కనీసం వారం రోజులైనా బాక్సాఫీస్ వద్ద నిలబడుతున్నాయి. కంటెంట్‌తో మరికొన్ని సినిమాలు రెండు, మూడు వారాలపాటు కొనసాగుతున్నాయి. ఆ తర్వాత నెల రోజుల్లోపే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఈ ఏడాది కూడా తెలుగులోనూ అలా వచ్చి ఇలా వెళ్లిన సినిమాలు చాలానే ఉన్నాయి.అలా ఈ ఏడాది ప్రారంభంలో తెలుగులో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 'తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి'. అసలు ఈ మూవీ ఎప్పుడు వచ్చిందో చాలామందికి తెలియదు. ప్రియదర్శి, శ్రీద, మణికందన్ లాంటి టాలీవుడ్ స్టార్స్ నటించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలో దర్శనమిచ్చింది. ఈ రోజు నుంచే ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 23న తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ మూవీ టాలీవుడ్లో పెద్దగా ఎక్కడా టాక్ వినిపించలేదు. రిలీజైన తొమ్మిది నెలల తర్వాత ఓటీటీకి రావడంతో ఇదేప్పుడు తీశారంటూ ఫ్యాన్స్ తెగ ఆరా తీస్తున్నారు. అయితే పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడంతో మూవీ రిలీజైనట్లు ఎవరికీ తెలియలేదు. కాగా.. ఓ బ్యాంకు దోపిడీ చుట్టూ తిరిగే కథాంశంగా నారాయణ చెన్న దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమాకు వివేక్ రామస్వామి సంగీతమందించారు. -
'సారంగపాణి జాతకం'లో ఫుల్ కామెడీ (టీజర్)
ప్రియదర్శి, రూపా కొడువాయూర్ జంటగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. పూర్తిగా నవ్వులు పూయించేలా టీజర్ ఉంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 20న విడుదల కానుంది. మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా? లేదా చేసే చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు జవాబుగా ఓ పరిపూర్ణ హాస్యభరిత చిత్రంగా ‘సారంగపాణి జాతకం’ తెరకెక్కింది. తాజాగా విడుదలైన టీజర్ అందరినీ మెప్పించేలా ఉంది. -
భవిష్యత్తు చేతి రేఖల్లో ఉంటుందా?
ప్రియదర్శి, రూపా కొడువాయూర్ జంటగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 20న విడుదల కానుంది.ఈ సందర్భంగా శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా? లేదా చేసే చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు జవాబుగా ఓ పరిపూర్ణ హాస్యభరిత చిత్రంగా ‘సారంగపాణి జాతకం’ ఉంటుంది. ఈ నెల 21న టీజర్‌ను రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. -
‘35: చిన్న కథ కాదు’ చిత్రానికి పిల్లలే హీరోలు: నిర్మాత
‘‘కన్నడలో ‘కాంతార’, మలయాళంలో ‘మంజుమ్మల్ బాయ్స్, తమిళంలో ‘మహారాజా’ తరహాలో తెలుగులో ‘35: చిన్న కథ కాదు’ సినిమా కూడా విజయం సాధిస్తుంది. బాపు, కె. విశ్వనాథ్, బాలచందర్గార్ల సినిమాలను గుర్తు చేస్తుంది’’ అన్నారు నిర్మాత సృజన్ యరబోలు. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘35: చిన్న కథ కాదు’. నంద కిశోర్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో సృజన్ మాట్లాడుతూ– ‘‘ఓ స్కూల్ పిల్లవాడికి లెక్కలు రాకపోతే ప్రత్యామ్నాయంగా ఏం చేయొచ్చని ఓ తండ్రి ఏం ఆలోచించాడు? అన్నదే కథ. ఈ చిత్రకథ తిరుపతి నేపథ్యంలో జరుగుతుంది. చెప్పాలంటే... కథలో తిరుపతి అనే ప్లేస్ కూడా ఓ క్యారెక్టర్లా ఆడియన్స్‌కు అనిపిస్తుంది. సినిమాలో మంచి మదర్ సెంటిమెంట్ ఉంది. మదర్ సెంటిమెంట్‌ను మించిన కమర్షియల్ అంశం ఏం ఉంటుంది? ఇంకా తండ్రీకొడుకులు, అన్నాచెల్లెళ్లు... ఇలా చాలా రిలేషన్స్ సినిమాలో ఉన్నాయి. స్కూల్ ఎపిసోడ్స్ బాగుంటాయి. ఓ విధంగా పిల్లలే ఈ సినిమాకు హీరోలనుకోవచ్చు. ప్రస్తుతం ‘గతం 2’, తరుణ్ భాస్కర్–ఈషా రెబ్బా కాంబినేషన్లోని సినిమాలు ఉన్నాయి. ‘మహారాజా’ తరహాలో ఓ థ్రిలర్ మూవీ కూడా ఉంది. రమ్యకృష్ణగారిని అనుకుంటున్నాం’’ అని అన్నారు. -
'ఇది చిన్న కథ కాదు'.. రిలీజ్ ఎప్పుడంటే?
నివేదా థామస్, ప్రియదర్శి పులికొండ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం '35-చిన్న కథ కాదు'. నంద కిషోర్ ఈమని దర్శకత్వం వహించిన ఈ మూవీని రానా దగ్గుబాటి సమర్పణలో సురేశ్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ విషయాన్ని టాలీవుడ్ హీరో రానా ట్విటర్ ద్వారా షేర్ చేశారు.ఈ చిత్రం సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదల కానున్నట్లు వెల్లడించారు. ప్రియదర్శి బర్త్ డే కావడంతో రిలీజ్ తేదీతో పాటు స్పెషల్ పోస్టర్‌ను పంచుకున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ చూస్తే ఈ సినిమాను ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమెషన్స్ కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు. ఈ మూవీలో విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. Get ready to experience the heartwarming Story of every household ❤️ ✨️ "Chinna Katha Kaadu"#35Movie in Theatres on SEPTEMBER 6th!#35CKK @i_nivethathomas @imvishwadev @PriyadarshiPN @gautamitads #NandaKishore @nikethbommi #VivekSagar @siddharthr87 @srujanyarabolu1… pic.twitter.com/aanB0IcZq5— Rana Daggubati (@RanaDaggubati) August 25, 2024 -
జాతకాలు చెబుతానంటోన్న టాలీవుడ్ హీరో..!
ఇటీవలే డార్లింగ్ మూవీతో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో ప్రియదర్శి పులికొండ. నభా నటేశ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా మరో కొత్త సినిమాకు రెడీ అయిపోయాడు. టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'సారంగపాణి జాతకం'. ఈ మూవీని ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు.ఇవాళ ప్రియదర్శి బర్త్‌డే కావడంతో సారంగపాణి జాతకం ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్ రివీల్ చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పోస్టర్ చూస్తుంటే థియేటర్లలో నవ్వులు పూయిచండం ఖాయంగా కనిపిస్తోంది.ఈ సందర్భంగా దర్శకుడు ఇంద్రగంటి మాట్లాడుతూ… 'నమ్మకం మనిషికి బలాన్ని ఇస్తుంది. కానీ మూఢ నమ్మకం బుద్ధిమంతుడిని కూడా బలహీనుడిని చేసి నవ్వుల పాలు చేస్తుంది. అలా నవ్వుల పాలైన ఓ మధ్య తరగతి మంచి అబ్బాయి కథే సారంగపాణి జాతకం. తన నమ్మకం, తను ఇష్టపడిన అమ్మాయి ప్రేమ మధ్య కొట్టుమిట్టాడిపోయాడా? లేదా బయట పడ్డాడా? అనే కథాంశంతో ఉత్కంఠభరితంగా పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే హాస్య చిత్రమని' అన్నారు.ఇప్పుడే మొదలైంది, త్వరలో మీకే తెలుస్తుంది 🤩😉Taking you on a jam-packed comedy ride with our #SarangapaniJathakam 🖐🏻🔍@krishnasivalenk #MohanKrishnaIndraganti @PriyadarshiPN @RoopaKoduvayur @ItsActorNaresh @TanikellaBharni #Vennelakishore #AvasaralaSrinivas @harshachemudu… https://t.co/80Zwnf84Fv— Priyadarshi Pulikonda (@PriyadarshiPN) August 25, 2024 -
డార్లింగ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..
ఈ మధ్య యాక్షన్ సినిమాలు ఎక్కువైపోయాయి అనుకున్న తరుణంలో డార్లింగ్ సినిమా వచ్చింది. లవ్, కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీలో ప్రియదర్శి హీరోగా నటించగా నభా నటేష్ హీరోయిన్గా యాక్ట్ చేసింది. అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషించిన ఈ మూవీకి అశ్విన్ రామ్ దర్శకత్వం వహించాడు. కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ జూలై 19న విడుదలైంది.ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ నెల 13 నుంచి హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఇది చూసిన ప్రియదర్శి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.డార్లింగ్ కథేంటంటే?రాఘవ్ (ప్రియదర్శి).. పెళ్లి చేసుకుని భార్యను హనీమూన్‌కు పారిస్ తీసుకోవాలని కలలు కంటూనే పెరిగి పెద్దవుతాడు. తల్లిదండ్రులు చూపించిన అమ్మాయి(అనన్య నాగళ్ల)ని పెళ్లి చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. కానీ ఇంతలో ఆమె ప్రేమించినవాడితో పారిపోతుంది. తన పెళ్లి పెటాకులైందన్న బాధతో రాఘవ్ చనిపోవాలనుకుంటాడు. సరిగ్గా అప్పుడే ఆనంది (నభా నటేష్) పరిచయమవుతుంది. తనతోనే ఇతడి పెళ్లి జరుగుతుంది. అసలు ఆనంది ఎవరు? అపరిచితురాలిగా ఒక్కో సమయంలో ఒక్కోలా ఎందుకు ప్రవర్తిస్తుంది? తర్వాత ఏం జరిగింది? అనేది తెలియాలంటే ఓటీటీలో డార్లింగ్ చూడాల్సిందే! Gear up for a MADMAX Marriage Entertainer 🔥💯#DarlingonHotstar Streaming from 13th August only on #DisneyPlusHotstar@PriyadarshiPN @NabhaNatesh @dir_aswin @Niran_Reddy @Chaitanyaniran @Primeshowtweets #VivekSagar @GNadikudikar @NareshRamadurai @PradeepERagav @seethu77in… pic.twitter.com/mYSJYVlH7Q— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) August 2, 2024 చదవండి: నా బిడ్డ ఎంత నరకం అనుభవించిందో.. బోరున విలపించిన గీతూరాయల్ -
చాణక్య మాస్టారు
పిల్లలకు లెక్కలు చెప్పడానికి నీట్‌గా రెడీ అయి స్కూల్‌కి వెళ్లారు లెక్కల మాస్టారు చాణక్య వర్మ. ఒక విద్యార్థి హాయిగా నిద్రపోతుంటే గుర్రున చూశారు మాస్టారు. మరో ఇద్దరు బాలురు నేచురల్ కాల్ అంటూ చిటికెన వేలు చూపిస్తారు. ఇలా చదువు పట్ల నిర్లక్ష్యంగా ఉన్న ఈ విద్యార్థుల లెక్కలు ఎలా తేల్చాలా అన్నట్లు ముఖం పెడతారు మాస్టారు.చాణక్య వర్మగా ప్రియదర్శి నటించిన చిత్రం ‘35–చిన్న కథ కాదు’. గురువారం విడుదల చేసిన ఈ పాత్ర తాలూకు వీడియో గ్లింప్స్‌లో పైన చెప్పిన దృశ్యాలు కనిపించాయి. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో రూపొందిన చిత్రం ‘35–చిన్న కథ కాదు’. నంద కిశోర్ ఈమాని దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. -
'డార్లింగ్' సినిమా రివ్యూ
కమెడియన్‌గా ఇండస్ట్రీలోకి వచ్చి 'మల్లేశం', 'బలగం' సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి. ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'డార్లింగ్'. గత కొన్నిరోజులుగా ప్రమోషన్స్ గట్టిగానే చేసిన ఈ మూవీ ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఇది ఎలా ఉంది? హిట్ కొట్టిందా లేదా అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.కథేంటి?రాఘవ్ (ప్రియదర్శి).. పెళ్లి చేసుకుని భార్యని హనీమూన్‌కి పారిస్ తీసుకెళ్లాలనే ధ్యేయంతో పెరిగి పెద్దవుతాడు. తల్లిదండ్రులు చూపించిన నందిని(అనన్య నాగళ్ల)తో పెళ్లికి రెడీ అవుతాడు. కానీ ఈమె, ప్రేమించిన వాడితో వెళ్లిపోతుంది. పెళ్లి పెటాకులైందని రాఘవ్ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. సరిగ్గా అక్కడ ఆనంది (నభా నటేష్) కలుస్తుంది. పరిచయమైన ఆరు గంటల్లోనే రాఘవ్ ఈమెని పెళ్లి చేసుకుంటాడు. ఇంతకీ ఆనంది ఎవరు? ఆమె ఒక్కో టైంలో ఒక్కోలా ఎందుకు ప్రవర్తిస్తుంది అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఒకే మనిషి ఒక్కో సమయంలో ఒక్కోలా ప్రవర్తించడం.. దీన్నే ఇంగ్లీష్‌లో స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు. గతంలో 'అపరిచితుడు' మూవీని ఇదే కాన్సెప్ట్‌తో తీశారు. కాకపోతే అది పూర్తిగా ఎమోషనల్ వేలో సాగుతుంది. ఒకవేళ ఇలాంటి స్ప్లిట్ పర్సనాలిటీ అమ్మాయికి ఉందని తెలిస్తే ఏమైందనేదే 'డార్లింగ్' సినిమా.ట్రైలర్, ప్రచార చిత్రాలు చూస్తే ఈ మూవీ కథేంటనేది తెలిసిపోతుంది. ఇందులో పెద్దగా దాపరికాలు లేవు. ఫస్టాప్ అంతా హీరో... పెళ్లి ధ్యేయమన్నట్లు పెరిగి పెద్దవడం, పెళ్లి నిశ్చయమైన తర్వాత అమ్మాయి మరో వ్యక్తితో లేచిపోవడం, సూసైడ్ చేసుకోవాలనుకోవడం, ఊహించని పరిస్థితుల్లో ఊరు పేరు తెలియని ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం.. మధ్యమధ్యలో కామెడీ.. ఇలా సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్‌కి పర్వాలేదనిపించే ట్విస్ట్.సెకండాఫ్‌లో భార్యకు ఎందుకు స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని తెలుసుకోవడానికి భర్త చేసే ప్రయత్నాలు, మొదట్లో కామెడీ కామెడీగా ఉండే సినిమా.. చివర్లో ఎమోషనల్‌గా ఎందుకు ఎండ్ కావాల్సి వచ్చిందనేది మూవీ చూసి తెలుసుకోవాలి. స్టోరీ పరంగా ఇది మంచి లైనే. కానీ డైరెక్టర్ చాలాసార్లు తడబడ్డాడు. స్ప్లిట్ పర్సనాలిటీ అని ఫస్టాప్ అంతా నవ్వించాడు. ఇంటర్వెల్‌కే కథని ముగించిన ఫీలింగ్ తెప్పించాడు.అక్కడే చిన్న ట్విస్ట్ ఇచ్చి హీరోయిన్‌కి మల్టీపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని చెప్పి, మరోసారి ఇదే కాన్సెప్ట్‌పై నవ్వించాలనుకున్నాడు. కానీ సెకండాఫ్‌లో ఇది సరిగా వర్కౌట్ కాలేదు. స్టోరీ అంతా ఒకే పాయింట్ దగ్గర తిరిగిన ఫీలింగ్ వస్తుంది. కానీ క్లైమాక్స్‌కి వచ్చేసరికి కొన్ని ఎమోషనల్ సీన్లు పడటంతో మరీ సూపర్ కాకపోయినా పర్లేదు అనిపించే సినిమా చూశాంలే అనే అభిప్రాయంతో థియేటర్ బయటకు వస్తాం.హీరోయిన్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. కానీ అవన్నీ ప్రేక్షకుడికి ఎక్కవు, నచ్చవు. ఆమె కంటే ప్రియదర్శి కామెడీ, ఎమోషన్ అంతో ఇంతో కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడన్నది వదిలేస్తే.. సీన్లు సీన్లుగా చూస్తే మాత్రం కొన్ని చోట్ల బాగానే పేలాయి. ఎవరెలా చేశారు?'డార్లింగ్' స్టోరీని హీరోయిన్ బేస్డ్గా రాసుకున్నారు. కానీ నభా నటేష్‌ని ఆ పాత్ర కోసం తీసుకుని పొరపాటు చేశారు! ఎందుకంటే ఈమె పాత్రతో ప్రేక్షకులు అస్సలు కనెక్ట్ కాలేకపోతారు. కొన్ని సీన్లలో పర్లేదనిపిస్తుంది కానీ కొన్నిచోట్ల విసిగిస్తుంది. హీరోగా చేసిన ప్రియదర్శి.. తనకు అలవాటైన కామెడీ ప్లస్ ఎమోషనల్ సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. ఓ పాటలో డ్యాన్స్ కూడా చేశాడు. హీరో తండ్రిగా చేసిన మురళీధర్ గౌడ్, మామగా చేసిన రఘబాబు, పిన్నిగా చేసిన నటి బాగా నటించారు. బ్రహ్మానందం, సుహాస్, నిహారిక లాంటి స్టార్స్ అతిథి పాత్రలు చేశారు. కాకపోతే పెద్దగా వర్కౌట్ కాలేదు.టెక్నికల్ టీమ్ 'డార్లింగ్' కోసం బాగానే కష్టపడ్డారు. పాటలు పెద్దగా గుర్తుండవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ బాగుంది. సినిమాటోగ్రఫీ గుడ్. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. కొత్త డైరెక్టర్ అశ్విన్ రామ్.. స్క్రిప్ట్‌ని ఇంకాస్త బెటర్‌గా రాసుకుని ఉండాల్సింది. అలానే 2 గంటల 41 నిమిషాల నిడివి ఎక్కువైపోయింది. 15-20 నిమిషాలు తగ్గించి, సెకాండాఫ్ కాస్త ట్రిమ్ చేసుంటే సినిమా ఎంటర్ టైనింగ్‌గా ఉండేది. జస్ట్ ఫన్ కోసమే థియేటర్‌కి వెళ్లాలనుకునే ప్రేక్షకులకు 'డార్లింగ్' మంచి ఆప్షన్.రేటింగ్: 2.75-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
ఆ నాలుగు సినిమాల్లో ‘డార్లింగ్’ ఉంటుంది: ప్రియదర్శి
ఏడాదికి వందకు పైగా కామెడీ సినిమాలు వస్తే.. థియేటర్స్‌లో చూసి గుర్తు పెట్టుకునే సినిమాలు నాలుగైదు మించి ఉండవు. వాటిలో ఈ ఏడాది ‘డార్లింగ్’ కూడా ఉంటుంది. ఇందులో కావాల్సినంత కామెడీ ఉంది. మంచి మ్యూజిక్ ఉంది. ఆడియన్స్‌కి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది’ అన్నారు హీరో ప్రియదర్శి . ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘డార్లింగ్’. నభా నటేష్ హీరోయిన్. ఆశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో ప్రియదర్శి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరిస్తున్నారు. కొత్త కథలు, వినూత్నమైన ఆలోచనలని ఇష్టపడుతున్నారు. మల్లేశం, బలగం, సేవ్ ది టైగర్స్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే... ఫ్యామిలీ డ్రామాకి ఎప్పుడూ స్పేస్ ఉందని నిరూపించాయి. ఫ్యామిలీ డ్రామాలు ఇండియన్ సొసైటీలో ఎవర్ గ్రీన్. నటుడిగా నేర్చుకోవడానికి ఎంతో అవకాశం దొరుకుతుంది. రిలేట్ చేసుకునే కథలు చెప్పడంలో మజా వేరుగా ఉంటుంది.→ డార్లింగ్ సినిమాలో విమన్ క్యారెక్టర్‌కి స్ప్లిట్ పర్షనాలిటీ అనే స్పెషల్ కండీషన్ ఉంటుంది. దిన్ని ప్రజెంట్ చేసిన తీరు చాలా వైవిధ్యంగా ఉంటుంది. రెండు క్యారెక్టర్ లు సీరియస్ గా బాధపడుతుంటే ప్రేక్షకుడికి నవ్వొస్తుంది. డార్క్ కామెడీలో వున్న మ్యాజిక్ ఇది. డార్లింగ్ లో అది చాలా అద్భుతంగా ఎక్స్ ఫ్లోర్ చేశాం.→ నభా లాంటి యాక్టర్ తో నేనెప్పుడూ పని చేయలేదు. నాలాంటి యాక్టర్ తో తనూ ఎప్పుడూ వర్క్ చేయలేదు. మా ఇద్దరి పెయిరింగ్ చాలా ఫ్రెష్ గా ఉందని చాలా మంది అన్నారు. ఆనంద్ సామి అనే యాక్టింగ్ ట్రైనర్ తో ఒక వర్క్ షాప్ చేశాం.15 రోజుల పాటు ప్రతిరోజు స్కూల్ కి వెళ్లి నేర్చుకున్నట్లుగా మంచి ఎక్స్ పీరియన్స్ అది. ఇందులో నా క్యారెక్టర్, నభా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి.→ డైరెక్టర్ అశ్విన్ రామ్‌ని సందీప్ కిషన్ 'ఏ వన్ ఎక్స్ ప్రెస్' షూటింగ్ సమయంలో ఫస్ట్ టైం కలిశాను. తను ఈ కథ చెప్పినపుడు చాలా నచ్చింది. అశ్విన్ మంచి లీడర్ షిప్ క్యాలిటీస్ , కమ్యునికేషన్ స్కిల్, క్లియర్ విజన్ ఉన్న దర్శకుడు. రానున్న రోజుల్లో పెద్ద డైరెక్టర్ అవుతాడు.→ డార్లింగ్ లో డ్యాన్సులు కూడా చేశాను. నేను కూడా డాన్స్ చేస్తానాని నాకే తెలియదు(నవ్వుతూ).ఈ క్రెడిట్ అంతా వివేక్ సాగర్, విజయ్ పోలాకి మాస్టర్, సెట్ డిజైన్ చేసిన గాంధీ కి దక్కుతుంది. → ఆగస్ట్ 15న నేను నటించిన 35 ‘చిన్న కథ కాదు’ సినిమా రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారితో ఓ సినిమా చేస్తున్నా. వైజయంతి మూవీస్ లో రోషన్ తో ఓ సినిమా ఉంది. సేవ్ టైగర్స్ సీజన్ 3 కూడా చేయాలి. -
ఈ దశాబ్దంలో నా ఫేవరేట్ మూవీ అదే: హీరో నాని కామెంట్స్
టాలీవుడ్ హీరో నాని గతేడాది హాయ్ నాన్నతో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన సరిపోదా శనివారం అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. కోలీవుడ్ నటుడు ఎస్జే సూర్య, సాయికుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లలోకి రానుంది.అయితే తాజాగా హైదరాబాద్‌లో జరిగిన డార్లింగ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో ప్రియదర్శిపై ప్రశంసలు కురిపించారు. ఈ దశాబ్దంలోనే తనకిష్టమైన సినిమా బలగం అని నాని అన్నారు. బలగం హీరో ఫ్యాన్‌గా ఈవెంట్‌కు వచ్చానని ఆసక్తికర కామెంట్స్ చేశారు. డార్లింగ్ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని.. నీ కెరీర్లో ఒక మైల్‌స్టోన్‌గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.అనంతరం ప్రియదర్శి సైతం నాని గురించి మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీలో నాలాంటి వారికి నాని అన్ననే ఆదర్శమని అన్నారు. ఎలాంటి బ్యాగ్‌గ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలో నిలబడిన వ్యక్తి అని కొనియాడారు. ఇప్పుడున్న యంగ్ హీరోలందరూ మిమ్మల్నే స్ఫూర్తిగా తీసుకుంటారని అన్నారు. సినిమాల్లో నువ్వు కృష్ణుడు అయితే.. నేను అర్జునుడిని అంటూ నానిపై ప్రశంసలు కురిపించారు. కాగా.. ప్రియదర్శి, నభా నటేశ్ జంటగా నటించిన డార్లింగ్ మూవీ ఈనెల 19న థియేటర్లలో సందడి చేయనుంది. Grandfather time lo #SrNTR Inspiration,Nanna time lo #Chiranjeevi Inspiration,Aa tarwtha #RaviTeja Inspiration.Ma generation ki @NameisNani Inspiration.#Nani Anna, A Genuine Person❤️.Can’t wait for #SaripodhaaSanivaaram @DVVMovies #VivekAthreya pic.twitter.com/PPf7HhxjEP— Saikumar Devendla (@saidevendla) July 16, 2024#Nani About #Balagam and #Darling Film 💥💥💥💥pic.twitter.com/fH1HSAhYrG— GetsCinema (@GetsCinema) July 15, 2024 -
Darling Movie Pre Release Event: ప్రియదర్శి ‘డార్లింగ్’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
ప్రేక్షకులకి బోర్ కొట్టిస్తున్నాం: నాని
‘‘ఈ మధ్య సినిమాల్లో యాక్షన్ ఎక్కువైపోయి ప్రేమకథలు, వినోదం చాలా మిస్ అవుతున్నాం. చిన్నప్పుడు అన్నిరకాల జానర్స్ మూవీస్ వచ్చేవి.. అన్నింటినీ ఎంజాయ్ చేసేవాళ్లం. థియేటర్స్‌కి వెళ్లడానికి ఎక్కువ కారణాలుండేవి. కానీ, ఇప్పుడు మనకు తెలియకుండానే ఒకే జానర్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులకి బోర్ కొట్టిస్తున్నాం. అందరం కామెడీ, లవ్‌స్టోరీ, ఎమోషనల్, యాక్షన్.. ఇలా అన్ని జానర్స్ టచ్ చేయాలి. ప్రియదర్శిలాంటి ప్రతిభ ఉన్న నటుడు వైవిధ్యమైన జానర్స్ ఎంచుకోవడం గర్వంగా ఉంది’’ అని హీరో నాని అన్నారు.ప్రియదర్శి, నభా నటేష్ జోడీగా నటించిన చిత్రం ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అనన్య నాగళ్ల కీలక పాత్ర చేశారు. కె.నిరంజన్ రెడ్డి, చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాని మాట్లాడుతూ–‘‘డార్లింగ్’ మూవీ టీజర్, ట్రైలర్ చాలా వినోదాత్మకంగా ఉంది. సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్ కావాలి. ‘హను–మాన్’ మూవీ స్థాయిలో ‘డార్లింగ్’ విజయం సాధించాలి.వివేక్ సాగర్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ఈ మూవీ టీజర్, ట్రైలర్ చూస్తే అశ్విన్ రామ్ ఎంత ప్రతిభ ఉన్న డైరెక్టరో తెలుస్తోంది. నభా నటేశ్.. ప్రమాదం తర్వాత నీ కొత్త అధ్యాయం ‘డార్లింగ్’ తో ప్రారంభమైంది. దర్శి అంటే నాకు చాలా ఇష్టం. తన నటన, చేసే పాత్రలు ఇష్టం. అందుకుని ‘డార్లింగ్’ ఈవెంట్‌కి రాలేదు. నాకు ఇష్టమైన ‘బలగం’ మూవీ హీరో అని, ‘బలగం’ మూవీ అభిమానిగా వచ్చా. ‘బలగం’ స్థాయిలో ‘డార్లింగ్’ విజయం సాధించాలి.ఈ మూవీ తన కెరీర్లో ఓ మైలురాయిగా నిలవాలి. నా వాల్‌పోస్టర్ ప్రొడక్షన్లో నేను నిర్మించనున్న తర్వాతి సినిమాలో ప్రియదర్శి హీరోగా నటిస్తాడు. జగదీశ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తాడు’’ అన్నారు. ఈ వేడుకలో కెమెరామేన్ నరేశ్ రామదురై, సంగీత దర్శకుడు వివేక్ సాగర్, నిర్మాతలు శివలెంక కృష్ణప్రసాద్, వివేక్ కూచిభొట్ల, అనన్య నాగళ్ల, డైరెక్టర్స్ వీఐ ఆనంద్, వేణు యెల్దండి పాల్గొన్నారు. -
తెలుగు సినిమాలపై నాది వన్ సైడ్ లవ్ : డైరెక్టర్ అశ్విన్ రామ్
‘‘చిన్నప్పట్నుంచీ తెలుగు సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తున్నాను. తమిళ దర్శకుడు అట్లీ తీసిన ‘రాజా రాణి’కి దర్శకత్వ విభాగంలో చేశాను. దర్శకుడు మురుగదాస్ ప్రొడక్షన్లోని మూడు సినిమాల్లో భాగమయ్యాను. ధనుష్‌గారి సినిమాలకూ వర్క్ చేశాను. తమిళంలో ఓ సినిమాకు దర్శకత్వం వహించాను. తెలుగు సినిమాలపై నాది వన్ సైడ్ లవ్ (నవ్వుతూ). ఇప్పుడు తెలుగులో ‘డార్లింగ్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు అశ్విన్ రామ్. ప్రియదర్శి, నభా నటేశ్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘డార్లింగ్’. కె. నిరంజన్‌రెడ్డి, చైతన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా అశ్విన్ రామ్ మాట్లాడుతూ– ‘‘భార్యాభర్తల అనుబంధం నేపథ్యంలో సాగే సినిమా ‘డార్లింగ్’. ఈ అనుబంధం నేపథ్యంలో కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ మా ‘డార్లింగ్’ కొత్తగా ఉంటుంది. ఇప్పటివరకూ మా సినిమాను చూసిన నలభైమంది ఈ కొత్తదనాన్నే ఫీలయ్యారు. ఈ సినిమా ట్రైలర్ చూసి నభా ΄ాత్రలో స్లి్పట్ పర్సనాలిటీ ఉంది కాబట్టి కొందరు ‘అపరిచితుడు’తో ΄ోల్చుతున్నారు. ‘డార్లింగ్’, ‘అపరిచితుడు’ సినిమాల మధ్య ఉన్న కామన్ ΄ాయింట్ స్లి్పట్ పర్సనాలిటీ మాత్రమే’’ అన్నారు. -
డార్లింగ్ విజయం సాధిస్తుంది: విశ్వక్ సేన్
‘‘డార్లింగ్’ మూవీ ట్రైలర్ చాలా బాగుంది. డైరెక్టర్ రామ్ అద్భుతంగా తీశారు. ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది. యూనిట్‌కి ఆల్ ది బెస్ట్’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. ప్రియదర్శి, నభా నటేష్ జోడీగా అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘డార్లింగ్’. ప్రైమ్‌షో ఎంటర్టైన్ మెంట్‌పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను విశ్వక్ సేన్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా సమయంలో నన్ను వేదికపైకి ఆహ్వానించి సైకో వివేక్‌గా పరిచయం చేశాడు ప్రియదర్శి. ‘మల్లేశం, బలగం’ లాంటి సినిమాలు అందరికీ పడవు.. రాసి పెట్టి ఉండాలి. ఇప్పుడు తను ‘డార్లింగ్’ తో రావడం చాలా ఆనందంగా ఉంది. దర్శి గెలిస్తే నేను గెలిచినట్లు అనిపిస్తుంది’’ అన్నారు. ‘‘డార్లింగ్ అనగానే ప్రభాస్అన్న పేరు గుర్తొస్తుంది. అలాంటి టైటిల్ పెట్టుకోవాలంటే భయంగా ఉండేది. అయితే కథని నమ్మి ‘డార్లింగ్’ టైటిల్ పెట్టుకున్నాం’’ అన్నారు ప్రియదర్శి. ‘‘నేను ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత ఎలాంటి సినిమా చేయాలి? అని ఆలోచిస్తున్నపుడు ‘డార్లింగ్’ అవకాశం వచ్చింది’’ అన్నారు నభా నటేష్. ‘‘మూడేళ్ల ప్రయాణం ‘డార్లింగ్’. వినోదాత్మకంగా రూపొందిన ఈ సినిమా ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది’’ అన్నారు అశ్విన్ రామ్. ‘‘కథని నమ్మి తీసిన ఈ మూవీకి ప్రేక్షకుల ్రపోత్సాహం కావాలి’’ అన్నారు చైతన్య. -
యాక్సిడెంట్‌తో ఓ రకమైన మైండ్‌సెట్‌లోకి వెళ్లా: నభా నటేష్
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది నభా నటేష్. అంతకు ముందు పలు సినిమాల్లో నటించిన అంతగా గుర్తింపు రాలేదు కానీ.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్‌తో నభా కెరీర్ మలుపు తిరిగింది. ఆ సినిమా తర్వాత వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో యాక్సిడెంట్ అయింది. ఈ ప్రమాదం నభా భుజానికి తీవ్ర గాయం అయింది. దీంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. తాజాగా ‘డార్లింగ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రియదర్శి హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నభా మీడియాతో మాట్లాడుతూ..యాక్సిడెంట్ జరిగినప్పుడు తన మానసిన పరిస్థితి ఎలా ఉందో వివరించింది. (చదవండి: అందరినీ మెప్పించేలా 'డార్లింగ్'.. ఆసక్తిగా ట్రైలర్)‘నా సినీ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది. ఓ రకమైన మైండ్‌సెట్‌లోకి వెళ్లిపోయాను. ఆపరేషన్ అయిన పది రోజులకే షూటింగ్లో పాల్గొన్నాను. దీంతో నా హెల్త్ మళ్లీ ఎఫెక్ట్ అయింది. తర్వాత ఇంకో సర్జరీ జరిగింది. నా శరీరానికి కచ్చితంగా రెస్ట్ ఇవ్వాలనిపించింది. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలమని ఫిక్స్ అయ్యాను. చాలా కేర్ తీసుకొని 6 నెలల పాటు నా ఆరోగ్యంపై దృష్టి పెట్టాను. ఫిజికల్‌గా ఫిట్ లేకుంటే సినిమాలు చేయలేం. అందుకే సమయం తీసుకున్నాను. ఫిజికల్‌గా, మెంటల్‌గా స్ట్రాంగ్ అయ్యాకే మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టాను. చాలా గ్యాప్ తార్వత ‘డార్లింగ్’తో మీ ముందుకు వస్తున్నాను. ఇస్మార్ట్ శంకర్ లాంటి కమర్షియల్ సినిమా తర్వాత ‘డార్లింగ్’ లాంటి సినిమా ఎందుకు చేస్తున్నావని చాలా మంది అడిగారు. బట్ ఆడియన్స్‌కి తెలుసు..ఇప్పుడు కంటెంట్ అనేది న్యూ కమర్షియల్ అని. డైరెక్టర్ అశ్విన్ చెప్పిన కథ నచ్చి ఈ సినిమాకి ఒప్పుకున్నాను. నా పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అందరికి ఈ సినిమా నచ్చుతుందనే నమ్మకం ఉంది’అని నభా చెప్పుకొచ్చింది. -
అందరినీ మెప్పించేలా 'డార్లింగ్'.. ఆసక్తిగా ట్రైలర్
ప్రియదర్శి, నభా నటేశ్ లీడ్ రోల్స్‌లో నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వంలో కె. నిరంజన్ రెడ్డి, చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను విశ్వక్ సేన్ విడుదల చేశారు. హనుమాన్ సినిమా తర్వాత ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై డార్లింగ్ చిత్రాన్ని కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య విడుదల చేస్తున్నారు.ప్రియదర్శి, నభా నటేష్ జంటగా అశ్విన్ రామ్ దర్శకత్వంలో ప్రేమ కథతో 'డార్లింగ్' చిత్రాన్ని తెరకెక్కించినట్లు శ్రీమతి చైతన్య తెలిపారు. విభిన్నమైన క్యారెక్టరైజేషన్స్ ఉన్న యువ జంట కథతో వస్తున్నందున ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని భావించారు.పెళ్లి చేసుకున్న తర్వాత హనీమూన్ కోసం పారిస్‌కు వెళ్లాలని ఏకైక లక్ష్యంతో హీరో ఉంటాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్యకు స్ల్పిట్ పర్సనాలిటీ అనే జబ్బు ఉందని తేలుతుంది. దీంతో ఆమె ఆపరిచితుడులోని విక్రమ్ మాదిరి పలు రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. దీని గురించి అసలు విషయం తెలియక ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారనేదే డార్లింగ్ చిత్రంలో చూపించనున్నారు. నభా నటేశ్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుంది. జులై 19న ఈ చిత్రం విడుదల కానుంది. -
హను–మాన్ మాకు ఓ వరం: నిర్మాత చైతన్య
‘‘మా ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ సంస్థలో నిర్మించే సినిమాలకు కథే హీరో. ‘డార్లింగ్’ సినిమాకూ అంతే. ఈ చిత్రంలో ప్రియదర్శి, నభా నటేశ్ అద్భుతంగా నటించారు. ఈ సినిమా ప్రేక్షకులకు తప్పక కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత చైతన్య. ప్రియదర్శి, నభా నటేశ్ లీడ్ రోల్స్‌లో నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వంలో కె. నిరంజన్ రెడ్డి, చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలవుతోంది.ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో చెతన్య మాట్లాడుతూ– ‘‘డార్లింగ్ కథను నిరంజన్రెడ్డిగారే ఓకే చేశారు. మాది ప్రేమ వివాహం. దర్శకుడు రామ్ అశ్విన్‌ది కూడా ప్రేమ వివాహం. సో.. ప్రేమ నేపథ్యంలో రామ్ చెప్పిన ‘డార్లింగ్’ సినిమా పాయింట్‌కు నిరంజన్ కనెక్ట్ అయ్యారు. సింపుల్‌గా ఉండే అబ్బాయి పాత్రలో ప్రియదర్శి, కొంచెం హైపర్ యాక్టివ్‌గా ఉంటూ స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయి పాత్రలో నభా కనిపిస్తారు.ఇక ‘హను–మాన్’ సినిమా మాకు ఓ వరంలా లభించింది. సంక్రాంతి సమయంలో విడుదల కావడం, అంత పెద్ద హిట్ కావడం అనేది ఆ హనుమంతుడి దయ వల్లే జరిగిందని భావిస్తున్నాం. ‘హను–మాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’ ప్రీప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. నావరకైతే ‘జై హనుమాన్’లో చిరంజీవి, రామ్‌చరణ్‌గార్లు అయితే బాగుంటుందని అనుకుంటున్నా. సాయితేజ్‌గారితో ఓ సినిమా ప్రకటించాం. ఇంకో పది సినిమాలుప్రోడక్షన్లో ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో మా బేనర్ నుంచి పది సినిమాలు రిలీజ్ అవుతాయి’’ అని చెప్పుకొచ్చారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘రెండు మాస్టర్స్ డిగ్రీలు చేశాను. టెక్నికల్ సపోర్ట్ ఉంది. సో.. బిజినెస్‌ను నేను బాగా హ్యాండిల్ చేయగలుగుతున్నాను. ఇందుకు మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది’’ అన్నారు. -
‘35’ (చిన్న కథ కాదు) మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'35 చిన్న కథ కాదు'.. ఆసక్తి పెంచుతోన్న టీజర్!
నివేదా థామస్, విశ్వదేవ్ ఆర్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం '35 చిన్న కథ కాదు'. ఈ సినిమాకు నందకిశోర్ ఇమాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.కాగా.. తిరుపతి నేపథ్యంలో జరిగే ఈ కథలో నివేదా థామస్ తల్లి పాత్ర పోషించారు. పరీక్షల్లో పాస్ మార్కులు కూడా రానందుకు తండ్రి మందలించగా.. కొడుకు ఇంటి నుంచి వెళ్లిపోతాడు. కుమారుడి కోసం తల్లి ఆరాటపడటం లాంటి సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీని తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. -
Darling Movie: ఆకట్టుకుంటున్న నభా నటేశ్ ‘రాహి రే’ సాంగ్
ప్రియదర్శి, నభా నటేశ్ జంటగా నటించిన చిత్రం ‘డార్లింగ్’. ‘వై దిస్ కొలవెరి’ అన్నది ట్యాగ్‌లైన్. అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ‘హను–మాన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తీసిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘రాహి రే...’ అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు మేకర్స్. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను కపిల్ కపిలన్ ఆలపించారు. ‘‘యునిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘డార్లింగ్’. ‘రాహి రే...’ పాట మెలోడియస్గా సాగుతుంది. నభా నటేశ్ పై సాగే ఈ పాటను సినిమాటోగ్రాఫర్ నరేష్ రామదురై అందంగా చిత్రీకరించారు’’ అన్నారు మేకర్స్. -
చిన్న కథ కాదు!
నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘35– చిన్న కథ కాదు’. ఈ చిత్రానికి నంద కిశోర్ ఈమాని దర్శకత్వం వహించారు. సురేష్ ప్రోడక్షన్స్ ఎస్. ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రోడక్షన్స్ పై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రానికి ‘35– చిన్న కథ కాదు’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేసి, ఫస్ట్ లుక్ విడుదల చేశారు.ఆగస్ట్ 15న సినిమాని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు కూడా అధికారికంగా ప్రకటించారు. ‘‘క్లీన్ ఎంటర్టైనర్గా రూపొందిన న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా ‘35–చిన్న కథ కాదు’. స్కూల్ ఎపిసోడ్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా చక్కని వినోదంతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు ఈ సినిమా సిద్ధమైంది. తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, కెమెరా నికేత్ బొమ్మి. -
'ఆ ఒక్క పదం తెచ్చిన తంటా'.. వాళ్లిద్దరిపై మండిపడ్డ హీరోయిన్!
ఇటీవల డార్లింగ్ అనే పదంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. టాలీవుడ్ నటుడు ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేశ్ మధ్య ట్వీట్ వార్ కొనసాగిన సంగతి తెలిసిందే. పరిచయం లేని మహిళలను డార్లింగ్ అని పిలిస్తే వేధింపులకు కిందకు వస్తుందని నభా పోస్ట్ చేసింది. ప్రియదర్శి సైతం లైట్ తీస్కో డార్లింగ్ అంటూ రిప్లై కూడా ఇచ్చారు. తాజాగా వీరిద్దర మధ్య జరిగిన ఇంటరాక్షన్‌లో మరో హీరోయిన్ ఎంటరైంది. అదేంటో ఓ లుక్కేద్దాం. ప్రియదర్శి, నటి నభానటేశ్ గొడవలోకి నటి రీతూవర్మ ఎంట్రీ ఇచ్చింది. నా కామెంట్స్ సెక్షన్లో మీ పంచాయతీ ఏంటి? అని ఆమె ఇద్దరిని ప్రశ్నించింది. అసలేం జరిగిందంటే.. ఇటీవల కొద్ది రోజుల క్రితం హీరోయిన్ రీతూవర్మ ఓ ఫొటోషూట్‌కు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆ పోటోలు చూసిన ప్రియదర్శి స్పందించారు. 'వావ్ రీతూ డార్లింగ్.. ఎంత అందంగా ఉన్నావో. నీ అందానికి ముగ్ధుడనయ్యా. మాటలు రావడం లేదు' అని కామెంట్ చేశారు. అయితే ఇది చూసిన నభా నటేశ్ మళ్లీ స్పందించింది. ఇతను మళ్లీ మొదలుపెట్టాడు.. ఆడవాళ్ల కామెంట్ సెక్షన్‌పై ఉన్నట్టుండి ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రతి ఒక్కరనీ డార్లింగ్ అని పిలవడమేంటని అసహనం వ్యక్తం చేసింది. నేను ఎవరినైనా డార్లింగ్ అని పిలిస్తే నీకేంటని ప్రియదర్శి బదులిచ్చారు. తాజా సంభాషణపై రీతూవర్మ కూడా రియాక్ట్ కావాల్సి వచ్చింది. నా కామెంట్ సెక్షన్లో మీ ఇద్దరి గొడవ ఏంటని నిలదీసింది. ప్రస్తుతం వీరి గొడవ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి నెటిజన్స్‌కు ఫుల్ ఎంటర్టైనింగ్ ఉన్నప్పటికీ ఇందతా సినిమా ప్రమోషన్స్ కోసమేనని చర్చించుకుంటున్నారు. View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) Ahaa! Do not cross the line! Chuskundham.. https://t.co/8mwOpLC0di — Nabha Natesh (@NabhaNatesh) April 17, 2024 -
‘మై డియర్ దొంగ’ సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)