ఇటీవల డార్లింగ్ అనే పదంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. టాలీవుడ్ నటుడు ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేశ్ మధ్య ట్వీట్ వార్ కొనసాగిన సంగతి తెలిసిందే. పరిచయం లేని మహిళలను డార్లింగ్ అని పిలిస్తే వేధింపులకు కిందకు వస్తుందని నభా పోస్ట్ చేసింది. ప్రియదర్శి సైతం లైట్ తీస్కో డార్లింగ్ అంటూ రిప్లై కూడా ఇచ్చారు. తాజాగా వీరిద్దర మధ్య జరిగిన ఇంటరాక్షన్‌లో మరో హీరోయిన్ ఎంటరైంది. అదేంటో ఓ లుక్కేద్దాం. ప్రియదర్శి, నటి నభానటేశ్ గొడవలోకి నటి రీతూవర్మ ఎంట్రీ ఇచ్చింది. నా కామెంట్స్ సెక్షన్‌లో మీ పంచాయతీ ఏంటి? అని ఆమె ఇద్దరిని ప్రశ్నించింది.
అసలేం జరిగిందంటే..
ఇటీవల కొద్ది రోజుల క్రితం హీరోయిన్ రీతూవర్మ ఓ ఫొటోషూట్‌కు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆ పోటోలు చూసిన ప్రియదర్శి స్పందించారు. 'వావ్ రీతూ డార్లింగ్.. ఎంత అందంగా ఉన్నావో. నీ అందానికి ముగ్ధుడనయ్యా. మాటలు రావడం లేదు' అని కామెంట్ చేశారు.
అయితే ఇది చూసిన నభా నటేశ్ మళ్లీ స్పందించింది. ఇతను మళ్లీ మొదలుపెట్టాడు.. ఆడవాళ్ల కామెంట్ సెక్షన్‌పై ఉన్నట్టుండి ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రతి ఒక్కరనీ డార్లింగ్ అని పిలవడమేంటని అసహనం వ్యక్తం చేసింది. నేను ఎవరినైనా డార్లింగ్ అని పిలిస్తే నీకేంటని ప్రియదర్శి బదులిచ్చారు. తాజా సంభాషణపై రీతూవర్మ కూడా రియాక్ట్ కావాల్సి వచ్చింది. నా కామెంట్ సెక్షన్‌లో మీ ఇద్దరి గొడవ ఏంటని నిలదీసింది. ప్రస్తుతం వీరి గొడవ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి నెటిజన్స్‌కు ఫుల్ ఎంటర్‌టైనింగ్ ఉన్నప్పటికీ ఇందతా సినిమా ప్రమోషన్స్ కోసమేనని చర్చించుకుంటున్నారు.
Ahaa! Do not cross the line! Chuskundham.. https://t.co/8mwOpLC0di
— Nabha Natesh (@NabhaNatesh) April 17, 2024
Comments
Please login to add a commentAdd a comment