ఆ నాలుగు సినిమాల్లో ‘డార్లింగ్‌’ ఉంటుంది: ప్రియదర్శి | Priyadarshi Pulikonda Talk About Darling Movie | Sakshi
Sakshi News home page

ఆ నాలుగు సినిమాల్లో ‘డార్లింగ్‌’ ఉంటుంది: ప్రియదర్శి

Published Wed, Jul 17 2024 5:44 PM | Last Updated on Wed, Jul 17 2024 5:55 PM

Priyadarshi Pulikonda Talk About Darling Movie

ఏడాదికి వందకు పైగా కామెడీ సినిమాలు వస్తే.. థియేటర్స్‌లో చూసి గుర్తు పెట్టుకునే సినిమాలు నాలుగైదు మించి ఉండవు. వాటిలో ఈ ఏడాది ‘డార్లింగ్‌’ కూడా ఉంటుంది. ఇందులో కావాల్సినంత కామెడీ ఉంది. మంచి మ్యూజిక్‌ ఉంది. ఆడియన్స్‌కి మంచి ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది’ అన్నారు హీరో ప్రియదర్శి . ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘డార్లింగ్‌’. నభా నటేష్‌ హీరోయిన్‌. ఆశ్విన్‌ రామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో ప్రియదర్శి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది.  కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరిస్తున్నారు. కొత్త కథలు, వినూత్నమైన ఆలోచనలని ఇష్టపడుతున్నారు. మల్లేశం, బలగం, సేవ్ ది టైగర్స్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే... ఫ్యామిలీ డ్రామాకి ఎప్పుడూ స్పేస్ ఉందని నిరూపించాయి. ఫ్యామిలీ డ్రామాలు ఇండియన్ సొసైటీలో ఎవర్ గ్రీన్. నటుడిగా నేర్చుకోవడానికి ఎంతో అవకాశం దొరుకుతుంది. రిలేట్ చేసుకునే కథలు చెప్పడంలో మజా వేరుగా ఉంటుంది.

→ డార్లింగ్ సినిమాలో విమన్ క్యారెక్టర్‌కి స్ప్లిట్ పర్షనాలిటీ అనే స్పెషల్ కండీషన్ ఉంటుంది. దిన్ని ప్రజెంట్ చేసిన తీరు చాలా వైవిధ్యంగా ఉంటుంది. రెండు క్యారెక్టర్ లు సీరియస్ గా బాధపడుతుంటే ప్రేక్షకుడికి నవ్వొస్తుంది. డార్క్ కామెడీలో వున్న మ్యాజిక్ ఇది. డార్లింగ్ లో అది చాలా అద్భుతంగా ఎక్స్ ఫ్లోర్ చేశాం.

→ నభా లాంటి యాక్టర్ తో నేనెప్పుడూ పని చేయలేదు. నాలాంటి యాక్టర్ తో తనూ ఎప్పుడూ వర్క్ చేయలేదు. మా ఇద్దరి పెయిరింగ్ చాలా ఫ్రెష్ గా ఉందని చాలా మంది అన్నారు. ఆనంద్ సామి అనే యాక్టింగ్ ట్రైనర్ తో ఒక వర్క్ షాప్ చేశాం.15 రోజుల పాటు ప్రతిరోజు స్కూల్ కి వెళ్లి నేర్చుకున్నట్లుగా మంచి ఎక్స్ పీరియన్స్ అది. ఇందులో నా క్యారెక్టర్, నభా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి.

→ డైరెక్టర్ అశ్విన్ రామ్‌ని సందీప్ కిషన్ 'ఏ వన్ ఎక్స్ ప్రెస్' షూటింగ్ సమయంలో ఫస్ట్ టైం కలిశాను. తను ఈ కథ చెప్పినపుడు చాలా నచ్చింది. అశ్విన్ మంచి లీడర్ షిప్ క్యాలిటీస్ , కమ్యునికేషన్ స్కిల్, క్లియర్ విజన్  ఉన్న దర్శకుడు. రానున్న రోజుల్లో పెద్ద డైరెక్టర్ అవుతాడు.

→ డార్లింగ్ లో డ్యాన్సులు కూడా చేశాను. నేను కూడా డాన్స​్‌ చేస్తానాని నాకే తెలియదు(నవ్వుతూ).ఈ క్రెడిట్ అంతా వివేక్ సాగర్, విజయ్ పోలాకి మాస్టర్, సెట్ డిజైన్ చేసిన గాంధీ కి దక్కుతుంది.  

→ ఆగస్ట్ 15న నేను నటించిన 35 ‘చిన్న కథ కాదు’ సినిమా రిలీజ్‌ అవుతుంది. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారితో ఓ సినిమా చేస్తున్నా. వైజయంతి మూవీస్ లో రోషన్ తో ఓ సినిమా ఉంది. సేవ్ టైగర్స్ సీజన్ 3 కూడా చేయాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement