'యుగానికి ఒక్కడు' సీక్వెల్‌ ధనుష్‌తోనే.. కార్తీపై దర్శకుడి కామెంట్స్‌ | Director Selvaraghavan Comments On Yuganiki Okkadu 2 Team | Sakshi

'యుగానికి ఒక్కడు' సీక్వెల్‌ ధనుష్‌తోనే.. కార్తీపై దర్శకుడి కామెంట్స్‌

Apr 7 2025 7:51 AM | Updated on Apr 7 2025 8:47 AM

Director Selvaraghavan Comments On Yuganiki Okkadu 2 Team

నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన చిత్రం ఆయిరత్తిల్‌ ఒరువన్‌ (యుగానికి ఒక్కడు). నటి రీమాసేన్, ఆండ్రియా కథానాయకిలుగా నటించిన ఇందులో పార్థిబన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. సెల్వ రాఘవన్‌( Selvaraghavan) దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2010లో విడుదలై అందరికీ మంచి పేరు తెచ్చి పెట్టింది. కాగా ఈ చిత్రానికి సీక్వెల్‌ ఉంటుందని దర్శకుడు సెల్వరాఘవన్‌ అప్పుడే ప్రకటించారు. అయితే, అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. కాగా 2021లో ధనుష్‌ కథానాయకుడిగా యుగానికి ఒక్కడు చిత్రానికి సీక్వెల్‌ చేస్తానని దర్శకుడు పేర్కొన్నారు. అది జరగలేదు. తాజాగా దర్శకుడు సెల్వరాఘవన్‌ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ.. యుగానికి ఒక్కడు సీక్వెల్‌ చేయాలని తనకు బలంగా ఉందని మరోసారి అన్నారు. 

అయితే ఆ చిత్రాన్ని చేయాలంటే భారీగా బడ్జెట్‌ అవసరం ఉందన్నారు. పెద్ద నిర్మాణ సంస్థ ముందుకు వస్తేనే సాధ్యం అవుతుందని తెలిపారు. అలా రూపొందే చిత్రంలో ధనుష్‌ (Dhanush) ప్రధాన పాత్రను పోషిస్తారని ఆయన క్లారిటీ ఇచ్చారు. కానీ, మీరో కార్తీ(Karthi) లేకుండా మాత్రం ఈ సినిమా ఊహించుకోలేమన్నారు. ఆయన ఉంటేనే ఈ చిత్రానికి రెండవ భాగం రూపొందుతుందని సెల్వరాఘవన్‌ పేర్కొన్నారు. ఈ ఇద్దరు హీరోలు ఏడాది పాటు ఈ చిత్రానికి కాల్‌షీట్స్‌ కేటాయించాల్సి ఉంటుందన్నారు. అయితే ప్రస్తుతం కార్తీ, ధనుష్‌ ఉన్న పరిస్థితుల్లో ఇది సాధ్యమేనా అనే అనుమానం ప్రేక్షకులకు కచ్చితంగా కలుగుతుంది.

7/జీ బృందావన కాలని సీక్వెల్‌పై కామెంట్స్‌
కాగా ప్రస్తుతం దర్శకుడు సెల్వరాఘవన్‌ తాను ఇంతకుముందు తెరకెక్కించిన 7/జీ బృందావన కాలని 2 చిత్రానికి సీక్వెల్‌ చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ ఇప్పటికీ 50 శాతం పూర్తి చేసుకుందని సమాచారం. 'రవికృష్ణ హీరోగా పార్ట్‌ 1 క్లైమాక్స్‌లో కదీర్‌ (హీరో పాత్ర పేరు)కు జాబ్‌ రావడం ఆపై అతను ఒంటరిగా మిగిలిపోవడం వరకు మాత్రమే చూపించాం. ఆ తర్వాత పదేళ్లలో అతని జీవితం ఎలా సాగిందనే అంశాలతో సీక్వెల్‌ ఉంటుంది. సీక్వెల్‌ కథ ఎలా ఉంటుందో పార్ట్‌ 1లో క్లూ ఇచ్చాం. అఇయతే, ప్రస్తుత  రోజుల్లో దీనిని చిన్న చిత్రంగా విడుదల చేయలేం' అని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement