Dhanush
-
ధనుష్ హానెస్ట్ రాజ్?
హిట్ ఫిల్మ్ ‘సార్’ (2023) (తమిళంలో ‘వాతి’) తర్వాత హీరో ధనుష్( Dhanush )–దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో మరో మూవీ రానుందా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తీసిన వెంకీ అట్లూరి నెక్ట్స్ మూవీ ఎవరితో ఉంటుందనే చర్చ కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో జరుగుతోంది.ఇటీవల సూర్యకు వెంకీ అట్లూరి ఓ కథ వినిపించారనే టాక్ తెరపైకి వచ్చింది. తాజాగా హీరో ధనుష్( Dhanush )కు వెంకీ ఓ కథ వినిపించారట. ఈ కథకు ధనుష్( Dhanush ) అంగీకారం తెలిపారని, ప్రస్తుతం ఈ స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దే పనిలో వెంకీ అట్లూరి ఉన్నారని భోగట్టా. అంతేకాదు... ఈ సినిమాకు ‘హానెస్ట్ రాజ్’ అనే టైటిల్ అనుకుంటున్నారని సమాచారం. మరి... ధనుష్( Dhanush )–వెంకీ అట్లూరిల కాంబినేషన్ రిపీట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
ధనుశ్‌తో మూవీపై ప్రశ్న.. తనకేం తెలియదన్న స్టార్ డైరెక్టర్!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) ఆసక్తికర కామెంట్స్ చేశారు. 2019లో తాను తెరకెక్కించిన చిత్రం గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన చర్చనీయాంశంగా మారాయి. తాజాగా మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న గౌతమ్ ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.గతంలో 2019లో ధనుశ్‌తో(Dhanush) కలిసి ఎనై నోకి పాయుమ్ తోట అనే మూవీని గౌతమ్ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఇందులో మేఘా ఆకాశ్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని తెలుగులో తూటా పేరుతో విడుదల చేశారు. ఎనై నోకి పాయుమ్ తోట పేరు వినగానే గౌతమ్ రియాక్ట్ అయ్యారు. మీరు ఏ సినిమా గురించి మాట్లాడుతున్నారు? ఆ చిత్రాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను. దాని గురించి నాకేమీ గుర్తు లేదు. అది నా సినిమా కాదు. వేరే వాళ్లది అయి ఉంటుందని అన్నారు. అయితే గౌతమ్ మీనన్ అలా రియాక్ట్ కావడంపై నెటిజన్స్ భిన్నంగా చర్చించుకుంటున్నారు. అయితే గతంలో ఈ సినిమా తొలి భాగాన్ని గౌతమ్ ఎంతో ఫోకస్ పెట్టి తెరకెక్కించారు. షూటింగ్ దశలో ఉండగానే రిలీజ్ డేట్ ప్రకటించడంతో త్వరగా పూర్తి చేయాలన్న ఒత్తిడితో రెండో భాగాన్ని స్పీడ్‌గా తెరకెక్కించినట్లు వార్తలొచ్చాయి. దీంతో తాజాగా గౌతమ్ మీనన్ చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. కాగా.. గౌతమ్ మీనన్ ప్రస్తుతం డొమినిక్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఇందులో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
పీరియడ్స్ అన్నా పట్టించుకోరు... అతనొక్కడే...: నిత్యామీనన్
దక్షిణాదిలో చాలా మందికి ఇష్టమైన నటి నిత్యా మీనన్(Nitya Menen ) తెలుగు సినిమాల్లో కూడా హిట్స్ ద్వారా చాలా మందికి సుపరిచితమే. ఆమెకు దక్షిణాది వ్యాప్తంగా అభిమానులున్నారు. ఈ నేపధ్యంలో ప్రస్తుతం తన రాబోయే తమిళ చిత్రం కాదలిక్క నేరమిల్లై ప్రమోషన్ కార్యక్రమంలో నిత్యామీనన్ బిజీ బిజీగా ఉంది. అయితే ఈ సందర్భంగా ఆమె చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ఇటీవల తాను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె చిత్రపరిశ్రమ తీరుతెన్నుల గురించి తూర్పార బట్టడం ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యంగా నటీమణుల ఆరోగ్యం విషయంలో చిత్ర పరిశ్రమ కనీసపు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తుంది అని ఆమె వ్యాఖ్యానించడం విశేషం. అయితే తన స్నేహితుడు, దర్శకుడు–నటుడు మిస్కిన్ ఒక్కడు మాత్రం ఇందుకు మినహాయింపు అంటూ నిత్య చెప్పుకొచ్చారు.నిక్కచ్చిగా మాట్లాడడానికి ప్రసిద్ది చెందిన నిత్య... సినిమా షూటింగ్లో తాను ఎదుర్కున్న అనుభవాల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. చిత్రనిర్మాతలు తమ బృందం అనారోగ్యం విషయంలో. అలాగే నటీమణులు పీరియడ్స్ నొప్పితో ఉన్నామని చెప్పినా పట్టించుకోరని పని మాత్రమే పట్టించుకుంటారని ఆమె వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ ‘‘సినిమా పరిశ్రమలో చాలా చోట్ల అమానవీయత ఉంటుంది. ఎంత జబ్బుపడినా, ఎంత కష్టమైనా ఏదో ఒకటి చేసి షూటింగ్‌కి రావాలని సినిమా నిర్మాత దర్శకులు ఆశిస్తారు. అంతే. మనం దానికి అలవాటు పడ్డాం. ఏది ఎలా జరిగినా మనం కష్టపడాలి తప్పదు ’’ అంటూ చెప్పారు.అయితే ఆమె 2020లో చేసిన చిత్రం సైకో కోసం చిత్రీకరణలో ఉన్నప్పుడు ఆమెకు ఓ వైవిధ్యభరిత అనుభవం ఎదురైంది. మొదటి రోజు షూట్లోనే తనకు పీరియడ్స్ వచ్చిందని, చాలా నొప్పిగా అనిపించిందని ఆమె గుర్తు చేసుకుంది. ఆ సమయంలో దర్శకుడు మిస్కిన్ ఎంతగా తనని అర్థం చేసుకున్నాడో అని ఆశ్చర్యపోయానని కూడా నిత్య తెలిపింది. నాకు పీరియడ్స్ ఉందని మొదటిసారిగా ఒక మగ దర్శకుడికి నోరు విప్పి చెప్పాను. అప్పుడు అది నా మొదటి రోజు కాదా? అని అతను అడిగాడు. అప్పుడే నాకు అతనిలోని సానుభూతి అనిపించింది. నేను ఆశించినట్టే, అనుకున్నట్టే.. ‘‘అయితే మీరు విశ్రాంతి తీసుకోవచ్చు’’ అని అతను అన్నాడు. అంతేకాదు ఏమీ చేయవద్దు. ఆ రోజు నిత్య అసౌకర్యానికి గురవుతున్నట్లు తాను అర్ధం చేసుకున్నానని ఆమె చేయకూడని పనిని చేయడం తనకు ఇష్టం లేదని మిస్కిన్ చెప్పాడట, ఆమె ఇబ్బంది లేకుండా వచ్చినప్పుడు మాత్రమే షాట్ చేయడానికి ఇష్టపడతానని అన్నాడట.ఈ సినిమాతో పాటు ధనుష్ దర్శకత్వం వహించిన ఇడ్లీ కడైలో నిత్యనే ప్రధాన పాత్రలో కూడా కనిపించనున్నారు. ఆమె డియర్ ఎక్సెస్ అనే చిత్రం కోసం అలాగే తదుపరి చిత్రంలో విజయ్ సేతుపతితో కలిసి నటిస్తోంది. -
కేజీఎఫ్ నేపథ్యంలో...
హీరో ధనుష్, దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్ రిపీట్ కానుంది. ఈ కాంబినేషన్లో తొలి చిత్రం ‘΄పొల్లాదవన్’ 2007లో వచ్చింది. ఆ తర్వాత ‘ఆడుకాలం (2011), ‘వడ చెన్నై’ (2018), అసురన్’ (2019) వంటి సక్సెస్ఫుల్ మూవీలు వచ్చాయి. తాజాగా వీరి కాంబినేషన్లో ఐదో సినిమా రానుంది. ఈ చిత్రాన్ని ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ సంస్థ నిర్మించనుంది. విజయ్ సేతుపతి హీరోగా ఈ సంస్థ నిర్మించిన ‘విడుదల 2’ చిత్రం థియేటర్స్‌లో 25 రోజులు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా ఆడియన్స్‌కు ధన్యవాదాలు తెలిపి, తమ నిర్మాణ సంస్థలో ధనుష్–వెట్రిమారన్‌ల కాంబోలో మూవీ ఉంటుందని ‘ఎక్స్’ వేదికగా తెలిపింది ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ సంస్థ. కాగా ధనుష్‌తో వెట్రిమారన్ చేయనున్న మూవీ కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని, ఈ సినిమాలో మరో అగ్ర హీరో కూడా నటిస్తారని కోలీవుడ్ సమాచారం. -
నయనతార, ధనుష్ కేసు విచారణలో ఏం జరిగిందంటే..?
కోలీవుడ్ నటి నయనతారపై నటుడు ధనుష్ చెన్నై హైకోర్టులో వేసిన పిటిషన్‌పై న్యాయస్థానం నుంచి వచ్చే తీర్పుపై ఆసక్తి నెలకొంది. నయనతార తన బయోపిక్‌ను 'నయనతార బిహైండ్ ది ఫెయిరీ టెల్' పేరుతో డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. దీని విడుదల హక్కులను నెట్‌ప్లిక్స్ ఓటిటి సంస్థ పొంది ఇటీవలే విడుదల చేసింది. కాగా ఈ చిత్రంలో నటుడు ధనుష్ తన వండర్ ఫిలిమ్స్ పతాకంపై విజయ్ సేతుపతి, నయనతార జంటగా నిర్మించిన నాను రౌడీదాన్ చిత్రంలోని రెండు మూడు నిమిషాల నిడివి కలిగిన సన్నివేశాలను ఆ డాక్యుమెంటరీ చిత్రంలో వాడుకున్నారు. దీంతో తన అనుమతి లేకుండా తన చిత్రంలోని సన్నివేశాలను వాడుకున్నందుకుగాను నటుడు ధనుష్ నయనతారపై రూ.10 కోట్లు నష్టపరిహారం కోరుతూ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో న్యాయస్థానం అ పిటిషన్ పై వివరణ కోరుతూ గత నెల 8వ తేదీన నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్తోపాటూ నెట్‌ప్లిక్స్ ఓటీటీ సంస్థకు నోటీసులు జారీ చేసింది. కాగా ఈ కేసు తాజాగా మరోసారి కోర్టులో న్యాయమూర్తి అబ్దుల్ ఖుదూస్ సమక్షంలో విచారణకు వచ్చింది. కాగా నెట్ ఫిక్స్ ఓటీటీ సంస్థ వివరణ ఇవ్వడానికి తమకు మరికొంత సమయం కావాలని కోరడంతో, అందుకు అవకాశం ఇచ్చిన న్యాయమూర్తి తదుపరి విచారణ ఈనెల 22వ తేదీకి వాయిదా వేశారు.చంద్రముఖితో కూడా అదే వివాదంనయనతార చంద్రముఖి సినిమాతో కూడా వివాదంలో చిక్కుకుంది. తమ అనుమతి లేకుండా చంద్రముఖి సినిమాలోని సన్నివేశాలను తన డాక్యుమెంటరీలో వాడుకున్నందుకు నిర్మాతలు నయనతారకు నోటీసులు పంపించారు. హీరోయిన్, ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ తమకు రూ.5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధనుష్‌పై పదునైన మాటలతో విరుచుకుపడిని నయన్.. చంద్రముఖి చిత్ర యూనిట్‌పై ఎలాంటి కామెంట్ చేయలేదు.ధనుష్‌పై భగ్గుమన్న నయన్ధనుష్ తమపై చాలాకాలంగా ద్వేషాన్ని పెంచుకున్నాడని నయన్ తెలిపింది. తనలోని దాగి ఉన్న పగన ఇలా చూపించడం వల్లే తాము బాధపడాల్సి వస్తోందని ఆమె అన్నారు. 'నేనూ రౌడీనే షూటింగ్ టైంలో మేం మా ఫోన్లో తీసుకున్న వీడియోని ట్రైలర్లో 3 సెకన్లు ఉపయోగించినందుకు నువ్వు రూ.10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేయడం చాలా దారుణం. నువ్వు ఇంతలా దిగజారుతావ్ అనుకోలేదు. దీన్నిబట్టి నీ క్యారెక్టర్ ఏంటో అర్థమవుతోంది. నీ అభిమానుల ముందు, బయట ఎంతలా నటిస్తున్నావో తెలుస్తోంది. మాతో మాత్రం అలా ప్రవర్తించకు. సినిమా సెట్లో ఉన్న వాళ్లందరి జీవితాల్ని శాసించే హక్కు నిర్మాతకు ఉందా..?' అని ఆగ్రహం వ్యక్తం చేసింది. -
జూన్‌లో కుబేర?
జూన్‌లో థియేటర్స్‌లోకి రానున్నారట ‘కుబేర’. ధనుష్, నాగార్జున హీరోలుగా నటిస్తున్న పాన్–ఇండియన్ మూవీ ‘కుబేర’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ బహుభాషా చిత్రంలో బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్‌రావు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ కానుందనే ప్రచారం సాగింది. కానీ జూన్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
ఇడ్లీ కొట్టులో ఏం జరిగింది?
ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తాజా తమిళ చిత్రం ‘ఇడ్లీ కడై’ (తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’ అని అర్థం). ఈ చిత్రంలో నిత్యా మీనన్, షాలినీపాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. బుధవారం (జనవరి 1) న్యూ ఇయర్ సందర్భంగా ‘ఇడ్లీ కడై’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను విడుదల చేశారు. ‘మా సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశాం. మీ మూలాలకు కట్టుబడి ఉండండి’ అంటూ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను ‘ఎక్స్’లో షేర్ చేశారు ధనుష్. ఇక ఈ సినిమాలో ధనుష్ యంగ్ లుక్‌లో కనిపిస్తుండటం ఆయన ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. మరి... ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’లో ఏం జరిగింది? అనేది చూడాలంటే ఈ వేసవి వరకు వెయిట్ చేయాల్సిందే. ధనుష్, ఆకాశ్ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆల్రెడీ ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్. -
రెండోసారి జోడీ?
హీరో ధనుష్, హీరోయిన్ శ్రుతీహాసన్ రెండోసారి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి తమిళ చిత్ర వర్గాలు. ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వం వహించిన ‘3’ (2012) సినిమాలో తొలిసారి జంటగా నటించారు ధనుష్, శ్రుతి. ఆ చిత్రం విడుదలైన 12 ఏళ్లకి మరోసారి ఈ జోడీ రిపీట్ కానుందని టాక్. శివ కార్తికేయన్ నటించిన ‘అమరన్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి తాజాగా ధనుష్‌తో ఓ చిత్రం తెరకెక్కించనున్నారు. వాస్తవ ఘటనల నేపథ్యంలో ఈ మూవీ రూపొందనుందని టాక్. ఈ మూవీలో ధనుష్‌కి జంటగా శ్రుతీహాసన్ నటించనున్నట్లు తెలుస్తోంది. పైగా డైరెక్టర్‌పై ఉన్న నమ్మకంతో తన పాత్ర ఏంటి? అని అడగకుండానే ఓకే చెప్పారట ఆమె. తన కెరీర్లో ఇప్పటి వరకూ చేయని ఓ వైవిధ్యమైన పాత్ర శ్రుతీహాసన్‌ది అని టాక్. ‘3’ మూవీతో హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న ధనుష్–శ్రుతీహాసన్ రెండోసారి జంటగా నటించనుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో క్రేజ్ నెలకొంది. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలీ’ సినిమా షూటింVŠ తో బిజీగా ఉన్నారు శ్రుతి. ఆ మూవీ పూర్తయ్యాక ధనుష్ చిత్రంలో పాల్గొంటారని కోలీవుడ్ టాక్. -
నటుడు చంద్రబాబు బయోపిక్‌లో ధనుష్
ప్రఖ్యాత దివంగత హాస్యనటుడు, గాయకుడు చంద్రబాబు జీవిత చరిత్ర వెండి తెరకెక్కనుంది. తమిళ సినిమా మరిచిపోలేని హాస్య నటుడు చంద్రబాబు. ఈయన నటుడుగా పీక్‌లో ఉన్నప్పుడు కథానాయకుల కంటే అధిక పారితోషకం తీసుకున్న నటుడిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి నటుడి బయోపిక్‌ను తెరకేక్కించేందుకు గోపాల్ వన్ స్టూడియోస్ సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇంతకుముందు రామన్ తేడియ సీతై, చారులత, అలోన్, నటుడు దుల్కర్ సల్మాన్ నటించిన హే సినామికా వంటి పలు విజయవంతమైన చిత్రాలను ఈ సంస్థ నిర్మించింది. కాగా తాజాగా రచయిత దర్శకుడు కె. రాజేశ్వర్ రాసిన జేపీ. ది లెజెండ్ ఆఫ్ చంద్రబాబు నవలను సినిమాగా రూపొందించడానికి హక్కులను, నటుడు చంద్రబాబు సోదరుడు జవహర్ నుంచి అనుమతి తీసుకున్నట్లు ఈ సంస్థ నిర్వాహకులు తెలిపారు. కాగా ఈ నవలను చిత్రంగా మలచడానికి కథకుడు, మాటల రచయిత జయమోహన్ సిద్ధమయ్యారని ఆయనతోపాటు యువ గీత రచయిత మదన్ కార్గీ కూడా స్క్రీన్ ప్లే, మాటలు రాస్తున్నారని చెప్పారు. ఈ చిత్రం చంద్రబాబుకు తాము సమర్పించే మర్చిపోలేని అంజలిగా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. అదేవిధంగా ఈ చిత్రం ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుందన్నారు. అయితే ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను ఇంకా వెల్లడించలేదు. కానీ, ఈ ప్రాజెక్ట్‌లో కోలీవుడ్ టాప్ హీరో ధనుష్ భాగం కానున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు పాత్రకు ఆయన మాత్రమే న్యాయం చేస్తారని అక్కడి ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ధనుష్ ఇప్పటికే ఇళయరాజా బయోపిక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, చంద్రబాబు బయోపిక్‌లో తాను నటిస్తున్నట్లు ఎటువంటి ప్రకటన రాలేదు. వీటికి సంబంధించిన ప్రకటన త్వరలో వెలువడుతుందని భావిస్తున్నారు. -
ధనుశ్ - నయనతార వివాదం.. కోర్టు కీలక ఆదేశాలు!
నయనతార- కోలీవుడ్ హీరో ధనుశ్ మధ్య వివాదం కీలక మలుపు తిరిగింది. ధనుశ్ ఇప్పటికే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తన సినిమాలోని ఓ క్లిప్‌ను అనుమతి లేకుండా వినియోగించారంటూ రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం హీరోయిన్ నయనతారకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8వ తేదీలోగా వివరణ ఇవ్వాలంటూ నయన్‌కు నోటీసులిచ్చింది. ఈ వ్యవహరంలో మీ వైఖరి చెప్పాలంటూ నయన్ దంపతులతోపాటు నెట్‌ఫ్లిక్స్ బృందాన్ని కోర్టు ఆదేశించింది. అసలేంటి వివాదం?ఇటీవల నయనతార తన ప్రేమ పెళ్లిపై రూపొందించిన డాక్యుమెంటరీని విడుదల చేసింది. నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే పేరుతో రిలీజైన డాక్యుమెంటరీలో నానుమ్ రౌడీ దాన్ చిత్రంలోని మూడు సెకన్ల క్లిప్‌ను ఉపయోగించారు. దీంతో తన పర్మిషన్ లేకుండా తన సినిమాలోని క్లిప్‌ను వినియోగించారంటూ ధనుశ్ టీమ్ రూ.10 కోట్లకు దావా వేసింది. ఆ తర్వాత నయనతార ఈ వివాదంపై బహిరంగ లేఖ కూడా విడుదల చేశారు. -
ఏ తప్పు చేయలేదు.. ఎందుకు భయపడాలి: నయనతార
తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదంటోంది నయనతార. ధనుష్ విషయంలో తాను చేసిన పనిని సమర్థించుకుంటుంది. ఆయనతో మాట్లాడానికి చాలా ప్రయత్నించానని..కుదరకపోవడంతో లేఖ రాయాల్సి వచ్చిందని చెప్పింది. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’ డాక్యూమెంటరీ విషయంలో ధనుష్, నయనతార మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. నయనతార జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్‌లో తన పర్మిషన్ తీసుకోకుండా ‘నానుమ్ రౌడీ దాన్’లోని సీన్‌ను వాడుకున్నారంటూ చిత్ర నిర్మాత ధనుష్ లీగల్ నోటీసులు పంపించాడు. మూడు సెకన్ల క్లిప్‌నకు రూ.10 కోట్లు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నయనతార ధనుష్ క్యారెక్టర్ని తప్పుబడుతూ బహిరంగ లేఖను రాసింది. తాజాగా ఈ వివాదంపై నయనతార క్లారిటీ ఇచ్చింది. తాను లేఖను రాయడానికి గల కారణం ఏంటో తెలిపింది. (చదవండి: ఇక్కడితో ఆపేయండి..లేదంటే లీగల్ నోటీసులు పంపిస్తా.. సాయి పల్లవి మాస్ వార్నింగ్)ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ వివాదం గురించి మాట్లాడుతూ.. ‘ధనుష్ క్యారెక్టర్ని బయట ప్రపంచానికి తెలియజేయడానికే ఆ లేఖను రాశాను. ‘న్యాయమని నమ్మిన దాన్ని బయటపెట్టడానికి నేను ఎందుకు భయపడాలి? తప్పు చేస్తే భయపడాలి. పబ్లిసిటీ కోసం ఎదుటి వ్యక్తుల పేరు ప్రతిష్ఠలను దెబ్బతీసే మనిషిని కాదు నేను. నా డ్యాక్యుమెంటరీ ఫిల్మ్ పబ్లిసిటీ కోసమే ఇదంతా చేశారని చాలా మంది మాట్లాడుతుంటున్నారు. అందులో ఏమాత్రం నిజం లేదు. (చదవండి: పుష్పరాజ్ వసూళ్ల సునామీ.. ఆరు రోజుల్లోనే రప్ఫాడించాడు!)వీడియో క్లిప్స్‌కు సంబంధించిన ఎన్వోసీ కోసం ధనుష్‌ని కలిసేందుకు ప్రయత్నించాం. నేను, విఘ్నేష్ ఫోన్ చేశాం. కామన్ ఫ్రెండ్స్‌తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాం. కానీ ధనుష్ స్పందించలేదు. ఆయన మమ్మల్ని ఎందుకు ద్వేషిస్తున్నారో తెలియదు. ముందు నుంచి మేమిద్దరం ఏమీ శత్రువులం కాదు. ఆయన నాకు మంచి స్నేహితుడే. ఈ పదేళ్లలో ఏం జరిగిందో తెలియదు. ఆయనకు మాపై ఎందుకు కోపం వచ్చిందనే విషయం కూడా మాకు అర్థం కావడం లేదు. పక్కవాళ్ల మాటలు విని మమ్మల్ని అపార్థం చేసుకున్నారా? ఇలాంటివి క్లియర్ చేసుకునేందుకు ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించాను. అది కుదరలేదు’ అని నయనతార అన్నారు. -
అలాంటి వారికే నేనేంటో తెలుస్తుంది: ధనుష్
కోలీవుడ్‌లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనుశ్. అంతేకాదు సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. అయితే ధనుశ్కు ఈ స్థాయి అంత సులభంగా వచ్చింది కాదు. తుళ్లువదో ఇళమై చిత్రంతో కథానాయకుడిగా తన తండ్రి కస్తూరి రాజా దర్శకత్వంలో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత విడుదలకు ముందు ఎన్నో అవమానాలను, అవహేళనలను ఎదుర్కొన్నారు. అయితే ధనుష్‌కు తొలి చిత్రం మంచి విజయాన్ని అందించడంతో పలువురు దర్శక నిర్మాతలు ఆయన వెంట పరుగులు తీశారు.కెరీర్ ప్రారంభంలో ధనుశ్ విజయాలలో ఆయన సోదరుడు, దర్శకుడు సెల్వరాఘవన్ భాగమయ్యాడు. అయితే ధనుశ్‌పై విమర్శలు కూడా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా నిర్మాతలకు సరిగా కాల్ షీట్స్ కేటాయించడం లేదనే ఆరోపణలున్నాయి. ఇకపోతే ఇటీవల మరో అగ్రనటి నయనతార కూడా ఆయన వ్యక్తిత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఐశ్వర్య రజనీకాంత్‌తో ఈయన వివాహ బంధానికి కూడా ఎండ్ కార్డ్ వేశాడు. ఇటీవలే వీరిద్దరికి విడాకులు కూడా మంజూరయ్యాయి. యితే ఇవన్నీ ధనుశ్ కెరియర్‌కు ఎలాంటి ఇబ్బంది తీసుకురాలేదనే చెప్పాలి.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ధనుశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనను అర్థం చేసుకోవడం నిజంగానే కొంచెం కష్టమని.. తనతో సన్నిహితంగా ఉండే వారికే తానేంటో తెలుస్తుందన్నారు. అయితే తాను ఎవరికీ అంత సులభంగా దగ్గర అవ్వనని.. అందుకు కొన్ని రోజుల సమయం పడుతుందని అన్నారు. తనతో సుదీర్ఘ పరిచయం ఉన్న వారే తనను అర్థం చేసుకోగలుగుతారని నటుడు ధనుశ్ పేర్కొన్నారు. దీంతో ఈయన ఎవరి గురించి ఇలా మాట్లాడారా అన్న చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. కాగా ధనుష్ ప్రస్తుతం ఇడ్లీ కడై అనే చిత్రంలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ధనుష్ దర్శకత్వం వహించిన మరో చిత్రం నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. -
ధనుష్‌తో వివాదం.. సోషల్ మీడియాలో విఘ్నేశ్ మిస్సింగ్!
తమిళ ఇండస్ట్రీలో ధనుష్-నయనతార మధ్య గత కొన్నిరోజులుగా వివాదం నడుస్తూనే ఉంది. ఈమె లైఫ్, పెళ్లి తదితర అంశాలతో డాక్యుమెంటరీ తీశారు. దాన్ని రీసెంట్గా రిలీజ్ చేశారు. అయితే ఇందులో తను నిర్మించిన 'నానుమ్ రౌడీదానే' మూవీ సీన్స్ ఉపయోగించడంపై ధనుష్ అభ్యంతరం చెప్పాడు. 3 సెకన్ల క్లిప్ వాడినందుకు రూ.10 కోట్ల దావా వేశాడు. దీంతో నయనతార పెద్ద పోస్ట్ పెట్టింది.ధనుష్‌ని చెడ్డవాడు అనేలా చిత్రీకరించడానికి నయనతార గట్టిగానే ట్రై చేసింది. లాజికల్‌గా చూసుకుంటే ఈమె చేసింది తప్పయినా సరే ధనుష్‌నే తప్పుబట్టాలని చూసింది. కొన్నిరోజులు ఊరుకున్న ధనుష్.. ఈ మధ్యే నయనతార-ఆమె భర్త విఘ్నేశ్ శివన్‌కి కోర్టు ద్వారా నోటీసులు జారీ చేయించాడు. పిటిషన్‌పై విచారించిన న్యాయమూర్తి.. దీనిపై వివరణ ఇవ్వాలని నయనతారని ఆదేశించారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: తేజ ఎలిమినేట్.. 8 వారాలకు ఎంత సంపాదించాడు?)గొడవ నయన-ధనుష్ మధ్య జరుగుతున్నప్పటికీ కొన్నిరోజుల క్రితం నయనతార భర్త విఘ్నేశ్.. ధనుష్ వీడియో ఒకటి ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ధనుష్ ఫ్యాన్స్ ట్రోల్ చేసేసరికి దాన్ని డిలీట్ చేశాడు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను హీరో అజిత్ సినిమా 'ఎన్నై అరిందాల్' మూవీ కోసం పాట రాశానని, అదే టైంలో తన తొలి మూవీ 'నానుమ్ రౌడీదానే' చూసి ఆయన మెచ్చుకున్నారని చెప్పాడు.అయితే 'నానుమ్ రౌడీదానే' రిలీజ్ కావడానికి 7 నెలల ముందు అజిత్ మూవీ రిలీజైందని.. అసలు థియేటర్లలోకి రావడానికి ముందు అజిత్ ఎలా సినిమా చూశారని, ఇలా అబద్ధాలు చెప్పడం సరికాదని ధనుష్ అభిమానులు విఘ్నేశ్ని విపరీతంగా ట్రోల్ చేశారు. అలానే ధనుష్ తొలి మూవీ చేసే ఛాన్స్ ఇచ్చారనే కనీస కృతజ్ఞత కూడా విఘ్నేశ్‌కి లేదని అంటున్నారు. దీంతో ఈ గోల భరించలేక విఘ్నేశ్ తన ట్విటర్ ఖాతాని డిలీట్ చేశాడు. (ఇదీ చదవండి: Prithvi: అహంకారంతో విర్రవీగాడు.. ఎలిమినేట్ అయ్యాడు!) -
ఏదో ఒకరోజు వడ్డీతో సహా తిరిగొస్తుంది: నయనతార
కోలీవుడ్‌లో నటి నయనతార, ధనుష్ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఆమెపై తెరకెక్కిన డాక్యుమెంటరీ విషయంలో వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలో నయనతారతో పాటు ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివనన్పై ధనుష్ దావా వేసిన సంగతి తెలిసిందే. కోర్టు కూడా సమాధానం చెప్పాలని నయన్‌ను కోరింది. అయితే, తాజాగా సోషల్‌మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ధనుష్‌ను టార్గెట్ చేసే నయన్ పోస్ట్ చేసింది అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.కోలీవుడ్‌లో నయనతార, ధనుష్ వివాదం ఇప్పట్లో తగ్గేలా లేదు. సుమారు మూడు పేజీలతో ధనుష్‌పై నయన్ సంచలన ఆరోపణలు చేస్తూ ఒక లేఖ విడుదల చేసి కొద్దిరోజులు కాకముందే ఆమె మరోసారి పరోక్షంగా పదునైన వ్యాఖ్యలు చేసింది. ధనుష్‌ను హెచ్చరిస్తూ నయన్ ఇలా పోస్ట్ చేసింది. 'అబద్ధాలతో పక్క వారి జీవితాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించకండి. అది కూడా అప్పుతో సమానమే. ఏదో ఒకరోజు మీకు కూడా అంతకు మించి వడ్డీతో సహా తిరిగి వస్తుంది. ఈ విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోండి.' అంటూ ఒక నోట్‌ను నయన్ పంచుకుంది.సోషల్‌మీడియాలో ఆమె ఎవరి గురించి ఈ పోస్ట్ చేసిందో తెలియదు. కానీ, కోలీవుడ్‌లో మాత్రం ధనుష్‌ను టార్గెట్ చేస్తూనే ఈ పోస్ట్ ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' డాక్యుమెంటరీ విషయంలో వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. ధనుష్ నిర్మాతగా తెరకెక్కించిన ‘నానుమ్ రౌడీ దాన్’కు సంబంధించిన ఫుటేజ్‌ను నయన్ ఉపయోగించారు. అందుకు పరిహారంగా రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ ధనుష్ లీగల్ నోటీసులు పంపించారు. ఈ కారణంతో వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. -
ధనుష్ – ఐశ్వర్య జంటకు విడాకులు మంజూరు
-
జైలర్ 2 సీక్వెల్ లో ధనుష్..?
-
మళ్లీ మొదటికి వచ్చిన ధనుష్.. నయనతారకు షాక్
-
ధనుష్- ఐశ్వర్యకు విడాకుల మంజూరు
తమిళ స్టార్ జంట ధనుష్- ఐశ్వర్య రెండేళ్ల క్రితమే విడిపోతున్నట్లు ప్రకటించారు. మనస్పర్థలు తొలగిపోయి ఎప్పటికైనా కలవకపోతారా? అని అభిమానులు ఆశగా ఎదురుచూశారు, కానీ ఆ దిశగా ప్రయత్నాలు సాగలేదు. ఇద్దరూ విడిపోవడానికే నిర్ణయించుకున్నారు. ఈ మేరకు విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు.తాము కలిసుండాలనుకోవడం లేదని, విడిపోవాలనే నిర్ణయించుకున్నామని కరాఖండిగా చెప్పారు. ఈ క్రమంలో న్యాయస్థానం ధనుష్-ఐశ్వర్య దంపతులకు విడాకులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం తుదితీర్పు వెలువరించింది.కాగా ధనుష్.. సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను 2004లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి యాత్ర, లింగ అనే కుమారులు జన్మించారు. 2022లో ధనుష్- ఐశ్వర్య విడిపోతున్నట్లు ప్రకటించారు. నేడు అధికారికంగా విడాకులు తీసుకున్నారు.చదవండి: సవతికూతురిపై నటి రూ.50 కోట్ల పరువునష్టం దావా! -
నయనతార డాక్యుమెంటరీ.. మరింత ముదిరిన వివాదం..!
కోలీవుడ్‌లో వివాదం మరింత ముదురుతోంది. ఇటీవల లేడీ సూపర్ స్టార్ నయనతార డాక్యుమెంటరీ రిలీజ్ తర్వాత మొదలైన వివాదం సరికొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే రూ.10 కోట్ల పరిహారం కోరుతూ నోటీసులు పంపించిన హీరో ధనుశ్.. తాజాగా కోర్టులో దావా వేశారు. నయనతారతో పాటు ఆమె భర్త విఘ్నేశ్ శివన్‌పై తాజాగా దావా వేశారు. గతంలో నయన్, ధనుశ్ జంటగా నటించిన నానుమ్ రౌడీ దాన్ మూవీలోని మూడు సెకన్ల క్లిప్‌ను అనుమతి లేకుండా వినియోగించారంటూ ధనుశ్ టీమ్ ఆరోపించింది. ఈ విషయంపై ఇప్పటికే నయనతారకు నోటీసులు కూడా పంపారు. అయితే తాజాగా ఆ మూవీ నిర్మాణసంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ పరిశీలించిన న్యాయస్థానం విచారణకు అనుమతించింది. అయితే ఇటీవల ఓ పెళ్లి వేడుకలో కలిసిన వీరిద్దరు ఒకరిని ఒకరు అస్సలు పట్టించుకోలేదు. అసలేం జరిగిందంటే..ఇటీవల విడుదలైన నయనతార నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ బియాండ్ ది ఫెయిరీ టేల్ ఈ వివాదానికి కారణమైంది. ఆ డాక్యుమెంటరీ నానుమ్ రౌడీ ధాన్ మూవీలోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం సరికాదని ధనుష్ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్ నోటీసులు పంపించారు. ఈ వివాదం కాస్తా కోలీవుడ్‌లో మరింత చర్చకు దారితీసింది. కాగా.. నయనతార డాక్యుమెంటరీలో నాగార్జున, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, ఉపేంద్ర, విజయ్ సేతుపతి, అట్లీ, పార్వతి తిరువోతు లాంటి స్టార్స్ కూడా కనిపించారు. -
భారీ అంచనాలతో కుబేర.. విడుదల ఎప్పుడు..?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని అమిగోస్ క్రియేషన్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుంది.ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న కుబేర విడుదల తేదీ ప్రకటించే పనిలో ఉన్నాడు. వాస్తవంగా ఈ మూవీ దీపావళీ కానుకగా రావాల్సి ఉంది. పలు కారణాల వల్ల జాప్యం జరగడంతో ఇప్పుడు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించాయి. హీరో ధనుష్ కుబేరలో సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల కోసం అభిమానులు భారీగానే ఎదురుచూస్తున్నారు. -
మొన్నటి వరకు గొడవలు..! ఇప్పుడు పెళ్లి వేడుకకు హాజరు
-
టాప్ ప్రొడ్యూసర్ పెళ్లిలో హైలైట్‌గా ధనుష్, నయన్, కానీ.. (ఫొటోలు)
-
ధనుశ్- నయనతార వివాదం.. అప్పుడే పెళ్లిలో కలిశారు.. కానీ!
ప్రస్తుతం కోలీవుడ్‌ను కుదిపేస్తోన్న వివాదం ఏదైనా ఉందంటే అది ధనుశ్- నయనతారదే. ఇటీవల నయనతార లైఫ్ స్టోరీగా వచ్చిన డాక్యుమెంటరీ రిలీజైన తర్వాత ఈ వివాదం మొదలైంది. 2015లో ధనుశ్-నయన నటించిన నానుమ్ రౌడీ ధాన్ మూవీలోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం సరికాదని ధనుష్ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్ నోటీసులు పంపించారు. దీంతో ఈ వివాదం కాస్తా కోలీవుడ్‌లో మరింత చర్చకు దారితీసింది.ఈ వివాదం మొదలైన తర్వాత కోలీవుడ్‌లో వీరిద్దరు ఒకరంటే ఒకరికీ అస్సలు పడటం లేదు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఈ కాంట్రవర్సీ కొనసాగుతున్న టైమ్‌లో ఊహించని విధంగా ఇద్దరూ ఓకే వేదికపై మెరిశారు. తమిళ నిర్మాతల్లో ఒకరైన ఆకాశ్ భాస్కరన్ పెళ్లికి హాజరయ్యారు. ఈ వేడుకలో పక్కపక్కనే ఉన్నప్పటికీ ఒకరినొకరు పలకరించుకోలేదు సరికదా.. కనీసం చూసుకోలేదు కూడా. ఈ పెళ్లికి నయన్ భర్త విఘ్నేశ్ శివన్ కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.కాగా.. నయనతార నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీలో నాగార్జున, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, ఉపేంద్ర, విజయ్ సేతుపతి, అట్లీ, పార్వతి తిరువోతు లాంటి స్టార్స్ కూడా కనిపించారు. కేవలం మూడు సెకన్ల ఫుటేజీని ఉపయోగించినందుకు ధనుశ్ లీగల్ నోటీసులు పంపడంతో ఈ వివాదం మరింత ముదిరింది.#Dhanush & #Nayanthara together at the recent wedding of Producer AakashBaskaran pic.twitter.com/ulZDckjak8— AmuthaBharathi (@CinemaWithAB) November 21, 2024 #Dhanush & #Nayanthara today at a Marriage Function pic.twitter.com/xHURf15YJ6— Arun Vijay (@AVinthehousee) November 21, 2024 -
ధనుశ్ - ఐశ్వర్య విడాకులు.. ఇక అదొక్కటే మిగిలి ఉంది!
కోలీవుడ్ స్టార్ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్న జంటల్లో ధనుశ్- ఐశ్వర్య ఒకరు. రెండేళ్ల క్రితమే వీరిద్దరు విడిపోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. ప్రస్తుతం ఈ జంట విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. ఇవాళ కేసు విచారణలో భాగంగా కోర్టుకు ధనుశ్, ఐశ్వర్య కోర్టుకు హాజరయ్యారు. చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో విచారణకు హాజరైన వీరిద్దరు తమ నిర్ణయాన్ని న్యాయమూర్తి వివరించారు. ఇటీవల వీరిద్దరు త్వరలో కలుసుకోబోతున్నారంటూ కోలీవుడ్‌లో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.తాజాాగా కోర్టులో విచారణకు హాజరైన వీరిద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు న్యాయమూర్తికి వివరించారు. విడిపోవడానికి గల కారణాలను కోర్టుకు వివరించినట్లు తెలుస్తోంది. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం త్వరలోనే తీర్పు ఇవ్వనుంది. ఈ కేసు తుది తీర్పును నవంబర్ 27కు వాయిదా వేశారు. దీన్ని బట్టి చూస్తే మరో స్టార్ జంట విడాకులు తీసుకోవడం దాదాపు ఖరారైనట్లే.(ఇది చదవండి: కోర్టు విచారణకు దూరంగా ధనుష్, ఐశ్వర్య... మరోసారి వాయిదా!)అయితే వీరి నిర్ణయంతో కోర్టు విడాకులు మంజూరు చేసే అవకాశముంది. ఇద్దరు కూడా కలిసి ఉండాలనుకోవట్లేదని ఇవాళ కోర్టుకు వివరించారు. దీంతో ఈ జంట తమ వివాహబంధానికి గుడ్ బై చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె అయిన ఐశ్వర్యను ధనుశ్ పెళ్లాడారు. పెద్దల అంగీకారంతో 2004 నవంబర్ 18న వీరి వివాహం జరిగింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత వీరి బంధానికి ఎండ్ కార్డ్ పడనుంది. -
నయన్- ధనుశ్ వివాదం.. ఆ విషయం తెలిసి షాకయ్యా: రాధిక శరత్ కుమార్
ధనుశ్- నయనతార వ్యవహారం కోలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఇటీవల విడుదలైన నయనతార నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ బియాండ్ ది ఫెయిరీ టేల్ ఈ వివాదానికి కారణమైంది. ఆ డాక్యుమెంటరీ నానుమ్ రౌడీ ధాన్ మూవీలోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం సరికాదని ధనుష్ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్ నోటీసు పంపించారు. దీంతో ఈ వివాదం కాస్తా కోలీవుడ్‌లో మరింత చర్చకు దారితీసింది.అయితే తాజాగా ఈ వ్యవహారంపై సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ స్పందించారు. నానుమ్ రౌడీ ధాన్‌లో కీలక పాత్ర పోషించిన రాధిక ధనుశ్ ప్రవర్తనపై మాట్లాడారు. ఈ మూవీ సెట్స్‌లో నయనతార, విఘ్నేష్ శివన్‌ల ప్రేమ వ్యవహారం గురించి తనతో చెప్పాడని తెలిపింది. ఆ మూవీ షూటింగ్ టైమ్‌లో ధనుశ్ నాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడని వివరించింది. ధనుశ్ ఫోన్లో మాట్లాడుతూ అక్కా.. నీకు సిగ్గు లేదా? అని అడిగాడు. అతను ఏమి చెబుతున్నాడో నాకు అర్థం కాలేదు. 'ఏం జరుగుతుందో నీకు తెలియదా?, 'విక్కీ, నయన్‌లు డేటింగ్ చేస్తున్నారని ధనుశ్ నాతో అన్నాడని తాజాగా విడుదలైన డాక్యుమెంటరీలో రాధిక వివరించింది. ఆ తర్వాత వెంటనే 'ఏం మాట్లాడుతున్నావ్.. నాకేమీ తెలీదు' అని షాకింగ్‌కు గురైనట్లు డాక్యుమెంటరీలో చెప్పుకొచ్చింది.కాగా.. నయనతార డాక్యుమెంటరీలో నాగార్జున, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, ఉపేంద్ర, విజయ్ సేతుపతి, అట్లీ, పార్వతి తిరువోతు లాంటి స్టార్స్ కూడా కనిపించారు. కేవలం మూడు సెకన్ల ఫుటేజీని ఉపయోగించినందుకు ధనుశ్ లీగల్ నోటీసులు పంపడంతో ఈ వివాదం మరింత ముదిరింది.