ధనుశ్ డైరెక్షన్‌లో లవ్ స్టోరీ.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ | Dhanush Latest Direction Film Jabilamma Neeku Antha Kopama OTT Release Date Confirmed, Check Streaming Platform Details | Sakshi

Dhanush: 'జాబిలమ్మ నీకు అంతా కోపమా'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Mar 18 2025 9:14 PM | Updated on Mar 19 2025 8:45 AM

Dhanush Latest Direction Film Ott Streaming date locked

పవిష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్  ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'జాబిలమ్మ నీకు అంత కోపమా'(తమిళంలో నిలవుకు ఎన్‌ మెల్‌ ఎన్నాడి కోబం). ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ (Dhanush) దర్శకత్వం వహించారు. ఈ మూవీ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ మూవీ  గతనెల ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌లో రిలీజ్‌ చేశారు.

(ఇది చదవండి: ధనుశ్‌ డైరెక్షన్‌లో లవ్‌ ఎంటర్‌టైనర్‌.. ట్రైలర్‌ చూశారా?)

అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈనెల 21 నుంచి అందుబాటులోకి తీసుకు రానున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో వెంకటేష్ మీనన్, రబియా ఖాటూన్, రమ్య రంగనర్హన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. ఈ సినిమాను వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్‌లో స్తూరి రాజా, విజయలక్ష్మి కస్తూరి రాజా నిర్మించిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement