Anikha Surendran
-
అప్పుడే 20 ఏళ్లా.. నిన్నగాక మొన్న చూసినట్టుంది! (ఫోటోలు)
-
చైల్డ్ ఆర్టిస్టులుగానే అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్.. ఈ తారల గురించి తెలుసా? (ఫొటోలు)
-
‘బుట్టబొమ్మ’ అనిఖా సురేంద్రన్ ఓనం లుక్‌లో ఎంత క్యూట్‌గా ఉందో! (ఫొటోలు)
-
నేనూ మనిషినే.. అలా అంటే తట్టుకోవడం కష్టం: యువ హీరోయిన్
సోషల్ మీడియా వల్ల ఎంత మంచి ఉందో అంతే చెడు కూడా ఉంది. ఈ విషయం అందరికీ తెలుసు. చాలామంది నెటిజన్లు.. హీరోయిన్లని ఇష్టమొచ్చినట్లు కామెంట్ చేసేస్తుంటారు. దీని వల్ల అవతలి వ్యక్తులు ఏమనుకుంటారో అనేది మాత్రం అస్సలు ఆలోచించరు. తాజాగా తన ఫొటోలపై చాలా అసభ్యంగా కామెంట్స్ చేస్తున్నారని యువ హీరోయిన్ అనికా సురేంద్రన్ ఆవేదన వ్యక్తం చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఫ్రీడమ్ ఫైటర్ బయోపిక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)'ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఇలాంటి విమర్శలు ఎదుర్కొంటున్నారు. గ్లామర్ కనిపించేలా డ్రస్ వేసుకోవడం నా వ్యక్తిగతం. ఎవరెన్ని అనుకున్నా సరే నా ఇష్టాన్ని పక్కన పెట్టలేను. ఈ విమర్శలు వస్తుంటాయి, పోతుంటాయి. అవన్నీ జీవితంలో ఓ భాగం మాత్రమే. కామెంట్ చేయాలనే ఉద్దేశం ఉన్నోడు.. చీర కట్టినా సరే అలానే అంటాడు. అయితే నా డ్రస్సింగ్ గురించి కొందరు చేసే కామెంట్స్ మాత్రం నన్ను చాలా ప్రభావితం చేస్తున్నాయి. నేను కూడా మనిషినే. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తట్టుకోవడం నాకు కష్టంగా ఉంటుంది. దయచేసి కామెంట్స్ చూసుకుని పెట్టండి. పర్సనల్ విషయాలు వద్దు' అని అనికా తన బాధని చెప్పుకొచ్చింది.చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన అనికా.. 'విశ్వాసం'లో అజిత్ కూతురిగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో 'బుట్టబొమ్మ' మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తమిళ, మలయాళంలో నటిస్తున్న ఈమె.. అప్పడప్పుడు గ్లామరస్ ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు దీనికి వచ్చిన కామెంట్స్ తట్టుకోలేక తన బాధని బయటపెట్టింది.(ఇదీ చదవండి: నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!) -
Anikha Surendran: ‘ఓహ్ మై డార్లింగ్’ హీరోయిన్ అనిఖా సురేంద్రన్ అందమైన లుక్స్ (ఫోటోలు)
-
తెలుగులో ఎంట్రీ.. ఛాన్సుల కోసం దాన్నే నమ్ముకున్న బ్యూటీ!
సినిమాల్లో తన గ్లామర్ పవర్ చూపిస్తోన్న నటి అనికా సురేందర్. బాలా నటిగా రంగప్రవేశం చేసిన ఈ మలయాళ కుట్టి, ఆ తరువాత కోలీవుడ్, టాలీవుడ్ అంటూ తన స్థాయిని విస్తరించుకుంది. తమిళంలో అజిత్ హీరోగా నటించిన ఎనై అరిందాల్(తెలుగులో ఎంతవాడు కానీ) చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత నానుమ్ రౌడీదాన్ చిత్రంలో చిన్న నయనతారగా నటించింది. దీంతో అందరూ అనికా సురందర్ను చిన్న నయనతార అని కూడా పిలుస్తుంటారు. అదే విధంగా ఆ అరువాత అజిత్, నయనతార హీరోహీరోయిన్లుగా నటించిన విశ్వాసం చిత్రంలో వారి కూతురిగా నటించింది. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. చాలా మంది బాల తారల మాదిరిగానే ఈ అమ్మడు హీరోయిన్గా నటించే అవకాశాన్ని తెలుగు చిత్రం బుట్టబొమ్మతో అందుకుంది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో తదుపరి అవకాశం కోసం అనికా సురేంద్రన్ శక్తికి మంచి ప్రయత్నిస్తూనే ఉందని చెప్పవచ్చు. అందుకు ఈ చిన్నది గ్లామర్‌పైనే ఆధారపడుతోంది. అలా ఎంత వరకూ చేరుకుందంటే ఇప్పుడు మరో సిల్క్ స్మిత అనిపించుకునే వరకూ. అవును ఆ రేంజ్‌కు అనికా సురేందర్ గ్లామరస్ ఫొటోలను ప్రత్యేకంగా తీయించుకుని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తోంది. కాగా తాజాగా నటుడు ధనుష్ కథానాయకుడిగా నటించి స్వీయ దర్శకత్వం వహించిన ఆయన 50వ చిత్రంలో అనికా సురేందర్ ఒక ముఖ్య భూమికను పోషించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం ఈమె కెరీర్‌కు ఉపయోగపడుతుందనే ఆశతో ఉంది. అయితే తన గ్లామరస్ ఫొటోలను విడుదల చేయడంలో మాత్రం తగ్గేదే లేదంటోందీ మలయాళ కుట్టి. View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) -
ఓ మై డార్లింగ్ మూవీ ట్రైలర్
-
నాడు అజిత్ కూతురిగా మెప్పించి.. నేడు గ్లామర్ ఫోటోలతో ఛాన్స్‌లు
కోలీవుడ్‌లో నటి అనికా సురేందర్ గురించి తెలియని సినీ ప్రియులు ఉండరు. టాలీవుడ్లో కూడా ఆమెకు గుర్తింపు ఉంది. ఆమె ఎక్కువ చిత్రాల్లోనూ నటించలేదు. కథానాయకిగా సక్సెస్‌లు అందుకోలేదు. మరి ఈ అమ్మడి పాపులారిటీకి కారణం ఏమిటంటారా? ఓన్లీ గ్లామర్. అవును తన గ్లామరస్ ఫొటోలను తరచూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు కిర్రెక్కిస్తుంటారు నటి అనికా సురేందర్. బాల నటిగా పరిచయమైన ఈ మలయాళీ కుట్టి కోలీవుడ్‌లో గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన అజిత్ సినిమా 'ఎన్నై అరిందాల్' తెలుగులో (ఎంత వాడు కానీ) చిత్రంలో త్రిషకు కూతురిగా నటించి గుర్తింపు పొందింది. ఆ తరువాత విశ్వాసం చిత్రంలో అజిత్, నయనతారల కూతురిగా నటించి ఇంకా ప్రాచుర్యం పొందింది. అలా మొదటిసారిగా తెలుగులో బుట్టబొమ్మ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైంది. ఆ చిత్రం నిరాశ పరిచింది. అయినా మాతృభాషలో ఓ మై డార్లింగ్ చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం ట్రైలర్ విడుదలై చాలా ఇంట్రెస్టింగ్‌ను క్రియేట్ చేసింది. దానికి కారణం గ్లామర్‌నే. ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. ఇప్పుడు తమిళంలో కథానాయకిగా నటించే అవకాశం వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం నటి అనికా సురేందర్ తమిళంలో ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తన 50వ చిత్రంలో ముఖ్య భూమికను పోషిస్తోంది. ధనుష్ మరో చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆయన అక్క కొడుకును కథానాయకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ చితంలో నటి అనికా సురేందర్‌ను హీరోయిన్గా నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంతోనైనా నటి అనికా సురేందర్ సక్సెస్‌ను అందుకుంటుందా అన్న ఆసక్తి నెలకొంది. -
జైలర్ నటుడితో జత కట్టనున్న ఇద్దరు హీరోయిన్స్!
సినిమాల్లో కేవలం హీరోయిన్ల కోసం వచ్చే ప్రేక్షకులూ ఉంటారన్నది వాస్తవం. కొన్నిసార్లు ఈ కారణంగానే దర్శక నిర్మాతలు యువ హీరోల సరసన ఇద్దరు హీరోయిన్లను తీసుకుంటున్నారు. తాజాగా హీరో వసంత రవి సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. తరమణి చిత్రంతో కథానాయకుడిగా తానేమిటో నిరూపించుకున్నాడు వసంత రవి. ఆ తర్వాత రాఖి చిత్రంతో యాక్షన్ హీరోగా విజయాన్ని అందుకున్నారు. ఇటీవల అశ్విన్స్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా జైలర్ చిత్రంలో రజనీకాంత్ కొడుకుగా విభిన్న పాత్రను పోషించి శభాష్ అనిపించుకున్నారు. కాగా వసంత రవి ఇప్పుడు కథానాయకుడిగా తన ఏడవ చిత్రానికి సిద్ధమయ్యారు. జేఎస్ఎం పిక్చర్స్, ఎంపీరర్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శబరీష్ నందా దర్శకత్వం వహిస్తున్నారు. కాగా వసంత రవికి జంటగా పటాస్, నోటా చిత్రాల ఫేమ్ మెహ్రీన్, హీరోయిన్ అనికా సురేంద్రన్ నటిస్తున్నారు. అజ్మల్ దాసిన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ చిత్రం కథ, కథనాలు కొత్తగా ఉంటాయని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆలరిస్తుందని దర్శకుడు పేర్కొన్నాడు. టైటిల్ సహా మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నాడు. చదవండి: Varun Dhawan: కొత్త సినిమా.. గాయపడ్డ హీరో వరుణ్! -
'బుట్టబొమ్మ' బ్యూటీకి సూపర్ ఛాన్స్.. పాన్ ఇండియా హీరోతో
అజిత్ హీరోగా నటించిన ‘ఎంతవాడు కానీ’, ‘విశ్వాసం’ వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది అనికా సురేంద్రన్. ఆ తర్వాత కథానాయకిగా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలెట్టింది. అందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా మార్చుకుంది. అలా శృతిమించిన అందాలను ఆరబోస్తూ ప్రత్యేకంగా తీర్చుకున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసి సినీ పెద్దల దృష్టిలో పడే ప్రయత్నం చేసింది. అలా తెలుగులో వచ్చిన నాగార్జున ‘ది ఘోస్ట్’, ‘బుట్టబొమ్మ’ వంటి చిత్రాల్లో ఓ లీడ్ యాక్ట్రస్‌గా నటించింది. తెలుగులోనే కాకుండా మలయాళంలోనూ కథానాయికగా నటించడం మొదలెట్టింది. అయితే తెలుగులో ఆ అమ్మడు నటించిన బుట్ట బొమ్మ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో మళ్లీ ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఎట్టకేలకు తమిళంలో ఒక అవకాశాన్ని అందుకుంది. నటుడు ధనుష్ తన 50వ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఇందులో నటుడు ఎస్జే సూర్య, సందీప్ కిషన్, కాళిదాసు, జయరాం నటి దసరా విజయం అపర్ణ బాలమురళి ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం కోసం చైన్నె, ఈసీఆర్ రోడ్ లో 500 ఇళ్లతో భారీసెట్ ను వేస్తున్నారు. జైలర్ చిత్రం విడుదల తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ను వెల్లడించే అవకాశం ఉంది. ఈ భారీ చిత్రంలో నటి అనికా సురేంద్రన్ ముఖ్య పాత్రలో నటించనున్నట్లు తాజా సమాచారం. మొత్తం మీద కొంచెం ఆలస్యమైనా మంచి చిత్రంలో నటించే అవకాశాన్ని ఈ చిన్నది కొట్టేసిందన్న మాట. -
'విశ్వాసం’ సినిమా అజిత్ కూతురితో మెహరీన్
‘ఎఫ్ 3’ (2022) తర్వాత మెహరీన్ తెలుగులో సినిమాలు కమిట్ కాలేదు. తాజాగా తమిళంలో ఓ కొత్త చిత్రంలో హీరోయిన్గా నటించడానికి అంగీకరించారు. శబరీష్ నంద దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో వసంత్ రవి హీరో. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు చెన్నైలో జరిగాయి. ఇందులో సునీల్ ఓ కీలక పాత్ర చేయనున్నారు. ‘విశ్వాసం’లో హీరో అజిత్ కూతురి పాత్రలో కనిపించిన అనిఖా సురేంద్రన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేయనుంది. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది. -
హీరో అజిత్ రీల్ కూతురు చనిపోయినట్లు పోస్టర్ కలకలం
బుట్టబొమ్మ హీరోయిన్ అనికా సురేంద్రన్ చనిపోయినట్లు ఓ పోస్టర్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో ఆమెకు ఏమైంది? అనికా చనిపోయిందా అంటూ ఫ్యాన్స్ షాకవుతున్నారు. కోలీవుడ్ స్టార్హీరో అజిత్ నటించిన విశ్వాసం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయమయ్యింది అనికా సురేందర్. 2019లో విడుదలైన ఈ సినిమాలో అనికా అజిత్‌కు కూతురి పాత్రలో నటించింది. చదవండి: బాయ్‌ఫ్రెండ్‌తో రొమాంటిక్ వీడియోను షేర్ చేసిన హీరోయిన్ తొలి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న అనికాను అప్పట్నుంచి అజిత్ రీల్ కూతురిగా పిలిచేవారు. ఈ సినిమా సక్సెస్ తర్వాత పలు తమిళం, మలయాళ సినిమాలు చేసిన అనికా బుట్టబొమ్మ సినిమాతో హీరోయిన్గా మారింది. కొత్త డైరెక్టర్ చంద్రశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమాతో అనికా తెలుగులో హీరోయిన్గా పరిచయం అయ్యింది. ఈ చిత్రం మిశ్రమ ఫలితాన్ని సాధించినా అనికా నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత మలయాళంలో మరో సినిమాలో హీరోయిన్గా నటించింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనికా తరచూ తన ఫోటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా ఆమె చనిపోయినట్లు ఓ పోస్టర్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. అయితే ఇందులో నిజం లేదని, ఓ సినిమా కోసం చేసిన రీల్ పోస్టర్ అని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: నయనతార అందగత్తె, స్వీట్ పర్సన్ : షారుక్ ఖాన్ -
బుట్ట బొమ్మ హీరోయిన్ అనిఖా సురేంద్రన్ అందమైన ఫోటోలు
-
అప్పుడే ఓటీటీకి వచ్చేస్తోన్న ‘బుట్టబొమ్మ’! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో అవార్డులు అందుకున్న నటి అనిఖా సురేంద్రన్ తెలుగులో హీరోయిన్గా నటించిన చిత్రం బుట్టబొమ్మ. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్.. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో అర్జున్ దాస్, సూర్య వశిష్టలు ప్రధాన పాత్రలు పోషించారు. మలయాళంలో సూపర్ హిట్ చిత్రం కప్పేలాకు ఇది రీమేక్. శౌరీ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 4న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చదవండి: పెళ్లయిన కొంతకాలానికే భర్త చనిపోయాడు, జీవితం తలకిందులైంది: సీనియర్ నటి మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ వేదికపై సందడి చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ తాజా బజ్ ప్రకారం బుట్టబొమ్మ త్వరలోనే ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుందట. కాగా మార్చి 4 నుండి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం భాషలలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుంది. -
‘బుట్టబొమ్మ’ మూవీ రివ్యూ
టైటిల్ : బుట్టబొమ్మ నటీనటులు : అనిఖా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ, ప్రేమ్ సాగర్, నవ్యా స్వామి తదితరులు నిర్మాణ సంస్థ: సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు: ఎస్ నాగవంశీ, సాయి సౌజన్య స్క్రీన్ ప్లే, మాటలు : గణేష్ కుమార్ రావూరి దర్శకత్వం: శౌరి చంద్రశేఖర్ రమేష్ సంగీతం: గోపీసుందర్, స్వీకర్ అగస్తి సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు ఎడిటర్: నవీన్ నూలి కథేంటంటే.. అరకులోని దూది కొండ గ్రామం నేపథ్యంలో సాగే కథ ఇది. సత్య(అనికా సురేంద్రన్)ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి. తల్లి టైలరింగ్ చేస్తే.. తండ్రి రైసు మిల్లులో పని చేస్తుంటాడు. సత్య స్నేహితురాలు లక్ష్మి ప్రతి రోజు ఫోన్లో తన లవర్‌తో మాట్లాడడం చూసి..తనకు కూడా ఒకడు ఉంటే బాగుండు అనుకుంటుంది. దాని కంటే ముందు ఒక కెమెరా ఫోన్ కొని రీల్స్ చేసి ఫేమస్ అయిపోవాలనుకుంటుంది. అలాంటి సమయంలో తనకు ఒక రాంగ్ కాల్ ద్వారా ఆటో డ్రైవర్ మురళి(సూర్య వశిష్ట) పరిచయం అవుతాడు. ఒకరినొకరు చూసుకోకుండానే ప్రేమలో పడతారు. అదే సమయంలో సత్యను ఇష్టపడే జమిందారు చిన్ని..ఇంట్లో వాళ్లతో మాట్లాడి పెళ్లికి ఒప్పిస్తాడు. ఇంట్లో పెళ్లి సంబంధం ఖాయంతో చేయడంతో మురళిని చూడటం కోసం సత్య విశాఖ వెళుతుంది. ఆ తర్వాత ఏమైంది. తనను తను మురళీగా పరిచయం చేసుకున్న ఆర్కే(అర్జున్ దాస్) తర్వాత ఏం చేశాడు? మురళీకి ఆర్కేకి ఎందుకు గొడవైంది? చివరకు సత్య జీవితం ఏమైంది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. మలయాళ సూపర్ హిట్ ‘కప్పేలా’ తెలుగు రీమేకే ‘బుట్టబొమ్మ’. ఇదొక సింపుల్ కథ. కేవలం రెండు ట్విస్టులను బేస్ చేసుకొని సినిమాను తెరకెక్కించారు. అయితే కప్పేలా సినిమా చూసిన వారికి ఆ ట్విస్టులు కూడా తెలిసిపోతాయి కాబట్టి.. బుట్టబొమ్మపై ఆసక్తి ఉండదు. కానీ కప్పేలా చూడని వారికి మాత్రం ట్విస్టులు ఆకట్టుకుంటాయి. అలాగే తెలుగులో కొన్ని చిన్న చిన్న మార్పులు చేశారు. సత్య కుటుంబ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ.. కథను ప్రారంభించాడు దర్శకుడు. స్నేహితురాలిని చూసి తనకు కూడా ఒక బాయ్‌ఫ్రెండ్ ఉండాలనుకోవడం.. ఫోన్లో పరిచయం అయిన వ్యక్తితో చాటింగ్.. ఆ తర్వాత అతన్ని కలిసేందుకు విశాఖ వెళ్లడం..ఇలా ఫస్టాఫ్ అంతా ఓ పల్లెటూరి ప్రేమకథగా సాగుతుంది. కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత కథ యూటర్న్ తీసుకొని థ్రిల్లర్‌గా కొనసాగుతుంది. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌తో ఇది లవ్‌స్టోరీ కాదు.. వేరే కథ అని అర్థమవుతుంది. ప్రస్తుసం సమాజంలో జరుగుతున్న ఓ మోసాన్ని చూపిస్తూ.. యువతకు మంచి సందేశాన్ని అందించారు. అయితే కేవలం రెండు ట్విస్టుల కోసం అదికూడా ఇంటర్వెల్ ముందు.. క్లైమాక్స్‌లో వచ్చేవి తప్పా.. మిగత కథనం అంతా రొటీన్‌గా.. సింపుల్‌గా సాగుతుంది. మురళీ, సత్యల ప్రేమాయణం కూడా ఆసక్తికరంగా సాగలేదు. కప్పేలా చూడని వారికి ఈ సినిమాలోని ట్విస్టులు నచ్చుతాయి. ఎవరెలా చేశారంటే.. బాలనటిగా పలు చిత్రాల్లో నటించిన అనిఖా సురేంద్రన్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటించింది. సత్య పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఈ సినిమా కథంతా ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది.తొలి సినిమాతోనే హీరోయిన్గా తనదైన నటనతో మెప్పించింది. ఇక ఆటోడ్రైవర్ మురళీ పాత్రకుసూర్య వశిష్ట న్యాయం చేశాడు. ఆర్కేగా అర్జున్ దాస్ అదరగొట్టేశాడు. అతని వాయిస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నవ్యస్వామి, ప్రేమ్ సాగర్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. గోపీసుందర్, స్వీకర్ అగస్తి సంగీతం జస్ట్ ఒకే. సినిమాటోగ్రఫీ బాగుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
Butta Bomma: రీమేకే అయినా భారీ మార్పులు చేశాం
లాక్ డౌన్ సమయంలో మలయాళ కప్పేల చిత్రాన్ని చూశాను. కథలో ఉన్న బలం, కథనం నన్ను బాగా ఆకట్టుకుంది. అందుకే ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశాను. మెయిన్ పాయింట్ ని తీసుకొని మన తెలుగు నేటివిటీకి తగ్గట్లు చాలా మార్పులు చేసి ‘బుట్ట బొమ్మ’ తెరకెక్కించామని దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్ అన్నారు. సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్, అనికా సురేంద్రన్ ప్రధాన పాత్రల్లో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బుట్టబొమ్మ’. ఎస్.నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► మాది గుంటూరు. కానీ పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్ లోనే. మాది సినిమా నేపథ్యమున్న కుటుంబం కాదు. కానీ నాకు ముందు నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. కుటుంబ సభ్యుల సూచన మేరకు ముందు పీజీ పూర్తి చేసి ఆ తరువాత సినిమాల్లోకి వచ్చాను. ► ముందుగా రామ్ గోపాల్ వర్మ గారికి చెందిన వర్మ కార్పొరేషన్ లో పనిచేశాను. ఆయన నిర్మించిన శూల్ అనే హిందీ ఫిల్మ్ చేశాను. ఆ చిత్రానికి ఈశ్వర్ నివాస్ దర్శకుడు. ఆయన దగ్గరే వరుసగా నాలుగు హిందీ సినిమాలకు వర్క్ చేశాను. ఆ తరువాత మా నాన్నగారు మరణించడంతో హైదరాబాద్ వచ్చేశాను. కొంతకాలానికి ఒక స్నేహితుడి ద్వారా సుకుమార్ గారు పరిచయమయ్యారు. ఆయన దగ్గర జగడం నుంచి పుష్ప సినిమా వరకు పని చేశాను. ► కొన్ని చిత్రాలను రీమేక్ చేయగలం, కొన్ని చిత్రాలు చేయలేం. బుట్ట బొమ్మ పూర్తిగా స్క్రిప్ట్ మీద ఆధారపడిన సినిమా. దీనిని మన అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేసి, రీమేక్ చేస్తే బాగుంటుందనే నమ్మకం కలిగింది. అప్పటికే ఈ మూవీ రీమేక్ హక్కులను సితార సంస్థ తీసుకుందని తెలిసి.. నేనే వారిని సంప్రదించాను. కొన్ని చర్చల తర్వాత నేను చేయగలనని నమ్మి, వారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. ► మెయిన్ పాయింట్ ని తీసుకొని మన తెలుగు నేటివిటీకి తగ్గట్లు చాలా మార్పులు చేశాం. ముఖ్యంగా ఫస్టాఫ్ లో కీలక మార్పులు చేయడం జరిగింది. కామెడీ, ఎమోషన్స్ మన అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేశాం. ఫస్టాఫ్ లో కథనం పరంగా ఒక పెద్ద మార్పు కూడా చేశాం. ► బుట్టబొమ్మ సినిమాలో ఒక కాన్సెప్ట్ రన్ అవుతుంది. అది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. అది అనుకున్నప్పుడు అప్పటికే 'బుట్టబొమ్మ' సాంగ్ బాగా పాపులర్ కావడంతో అదే టైటిల్ పెడితే బాగుంటుందని వంశీ గారు సూచించారు. అలా ఈ టైటిల్ ఖరారైంది. ► ఈ సినిమాలో సంగీతానికి చాలా ప్రాధాన్యముంది. పాటలు, నేపథ్య సంగీతం అద్భుతంగా వచ్చాయి. గోపీసుందర్ గారు ఒక పాట, నేపథ్య సంగీతం అందించారు. స్వీకర్ అగస్తి రెండు పాటలు స్వరపరిచారు. ఇప్పటికే విడుదల చేసిన పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ► త్రివిక్రమ్, చినబాబు ఈ చిత్రాన్ని చూసి నన్ను ఎంతో మెచ్చుకున్నారు. వారిచ్చిన ప్రశంసలు మాటల్లో చెప్పలేను. ► తదుపరి సినిమా యాక్షన్ జోనర్ లో చేయాలని ఉంది. కొన్ని కథలు సిద్ధంగా ఉన్నాయి. త్వరలోనే కొత్త సినిమా అప్డేట్స్ ఇస్తాను. -
కథానాయికగా మొదటి సారి చేస్తున్న అనిఖా సురేంద్రన్ (ఫొటోలు)
-
'బుట్ట బొమ్మ' ఒప్పుకోవడానికి కారణం ఇదే : అనిక సురేంద్రన్
ఎన్నో ఏళ్లుగా బాల నటిగా పలు సినిమాల్లో నటించాను. కానీ హీరోయిన్గా నాకిదే(బుట్ట బొమ్మ) తొలి సినిమా. హీరోయిన్గా నటించేటప్పుడు ఎంతో కొంత ఒత్తిడి ఉండడం సహజం. పైగా ఈ సినిమాలో నాది ప్రధాన పాత్ర. అయితే మా మూవీ టీమ్ మద్దతుతో ఎలాంటి ఒత్తిడి లేకుండా సినిమాను పూర్తి చేశాం’ అని హీరోయిన్ అనిక సురేంద్రన్ అన్నారు. సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్, అనికా సురేంద్రన్ ప్రధాన పాత్రల్లో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బుట్టబొమ్మ’. ఎస్.నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అనిక సురేంద్రన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ►మలయాళ మూవీ కప్పేల తెలుగు రీమేకే బుట్టబొమ్మ. మూల కథ అలాగే ఉంటుంది. కానీ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశారు. ఒరిజినల్ ఫిల్మ్ కంటే కూడా ఇది ఇంకా కలర్ ఫుల్ గా ఆకట్టుకునేలా ఉంటుంది. ►కప్పేల మూవీని చూశాను. నాకు బాగా నచ్చింది. అలాంటి మంచి సినిమా రీమేక్ లో హీరోయిన్ గా నటించే అవకాశం రావడం, పైగా సితార వంటి ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడంతో.. ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే అంగీకరించాను. ►తెలుగులో నాకు సంభాషణలకు అర్థం తెలీదు. కానీ సన్నివేశాలను అర్థం చేసుకొని నటించాను. దర్శకుడు రమేష్ ఆ సన్నివేశాల తాలూకు ఎమోషన్స్ ని వివరించి నటన రాబట్టుకున్నారు. ►నేను ఇప్పటిదాకా పని చేసిన ఉత్తమ నిర్మాణ సంస్థల్లో సితార ఒకటి. వంశీ గారు నన్ను ఈ చిత్రం కోసం ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. సితార లాంటి పెద్ద సంస్థలో హీరోయిన్ గా మొదటి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా విడుదలకు ముందే తెలుగులో అవకాశాలు వస్తున్నాయి. ►ప్రస్తుతం మలయాళంలో 'ఓ మై డార్లింగ్' అనే మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నాను. తమిళ్ లో ఒక మూవీ చేస్తున్నాను. అలాగే కొన్ని తెలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.