1/10
సినీ ఇండస్ట్రీకి చిన్నవయసులోనే అడుగుపెట్టి.. ఆపై అగ్రతారలుగా రాణించిన వాళ్లు ఉన్నారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా వాళ్లపై ఓ లుక్కేద్దాం..
2/10
పునీత్ రాజ్‌కుమార్ - రాజ్‌కుమార్ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనదైన స్టైల్‌తో పవర్ స్టార్ గుర్తింపు దక్కించుకున్నారు. ఆయన హఠాన్మరణం.. కన్నడ ఆడియెన్స్‌ను మాత్రమే యావత్ సౌత్ ప్రజలను కదిలించింది
3/10
మహేష్ బాబు - నటశేఖరుడు కృష్ణ వారసుడిగా సినిమాల్లోకి వచ్చి.. పోకిరి లాంటి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్‌తో ఆ తండ్రి నుంచే సూపర్‌స్టార్ ట్యాగ్‌ను దక్కించుకున్నారు. సౌత్ నుంచి మోస్ట్ హ్యాండ్‌సమ్ హీరోగా దేశమంతటా గుర్తింపు తెచ్చుకున్నారు. చైల్డ్ ఆర్టిస్టుగా మెప్పించి.. ఆపై తెలుగు సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్నారు.
4/10
శింబు - కోలీవుడ్‌లో అగ్రదర్శక నిర్మాత, నటుడిగా పేరున్న టీ రాజేందర్ తనయుడే ఈ శింబు(శిలంబరసన్ తేసింగు రాజేందర్ STR). చైల్డ్ ఆర్టిస్టుగా డజనుకి పైగా చిత్రాల్లో నటించి.. అవార్డులను సైతం దక్కించుకున్నారు. మల్టీటాలెంట్ పర్సన్‌గా రాణించే క్రమంలో తడబడ్డప్పటికీ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారీయన.
5/10
తేజ సజ్జా - చైల్డ్ ఆర్టిస్టుగా పాతిక చిత్రాల్లో నటించాడు. పసివయసులోనే దాదాపు అందరు అగ్రతారల చిత్రాల్లో నటించిన తేజ.. 14 ఏళ్ల గ్యాప్‌తో సమంత ‘ఓహ్ బేబీ’ తిరిగి ఇండస్ట్రీకి వచ్చి మంచి ఆదరణ దక్కించుకున్నాడు. జాంబీ రెడ్డి, హను-మాన్ చిత్రాలతో పెద్ద హిట్లే అందుకున్నాడు
6/10
తరుణ్ - తొలి చిత్రంతోనే నంది అవార్డు అందుకున్న మాస్టర్ తరుణ్.. 15 చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. వండర్ బాయ్‌గానే కాదు.. చిన్నవయసులోనే హోస్ట్‌గా పిల్లల క్విజ్ షోతోనూ మెప్పించాడు. నువ్వే కావాలి చిత్రంతో హీరోగా డెబ్యూ ఇచ్చి.. లవర్ బాయ్ ట్యాగ్‌తో దశాబ్దంపైగా తెలుగు ఆడియొన్స్‌ను అలరించారు.
7/10
అనిఖా సురేంద్రన్ - మాలీవుడ్, కోలీవుడ్‌లలో 15పైగా చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అలరించిన అనిఖా.. ఇప్పుడు హీరోయిన్‌గా అలరిస్తోంది. అప్పటిదాకా డబ్బింగ్ చిత్రాలతో అలరించిన అనిఖా.. తెలుగులో ఘోస్ట్‌లో నాగ్ మేనకోడలిగా మెప్పించింది
8/10
మీనా - ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. చైల్డ్ ఆర్టిస్టుగా సుమారు 45 చిత్రాల్లో నటించారామె
9/10
హృతిక్ రోషన్ - బాలీవుడ్ అందగాడిగా, నార్త్ ఇండస్ట్రీ నుంచి స్టైలిష్ డ్యాన్సర్‌గా పేరున్న హృతిక్ రోషన్.. కెరీర్ తొలినాళ్లలో రాకేషన్ రోషన్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చింది చైల్డ్ ఆర్టిస్టుగానే. ఆ తర్వాత ‘కరణ్ అర్జున్, కోయ్‌లా’’ లాంటి పలు బ్లాక్ బస్టర్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ వ్యవహరించారు. కహోనా ప్యార్ హై చిత్రంతో హీరోగా డెబ్యూ ఇచ్చి.. ఇప్పుడు సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు
10/10
లియోనార్డో డికాప్రియో - ఈ అమెరికన్ నటుడు జేమ్స్ కామెరూన్ టైటానిక్‌తో మన ప్రేక్షకులకూ సుపరిచితుడే. అయితే డికాప్రియో కెరీర్ మొదలైంది బుల్లితెరపై చైల్డ్ ఆర్టిస్ట్‌గా. టీవీ సిరీస్, సిట్‌కామ్‌లతో అలరించిన తర్వాతే రైటర్‌గా సినీ కెరీర్ మొదలుపెట్టి, ఆ తర్వాత నటుడిగా మారారు. ఆస్కార్ అందుకునే స్థాయికి ఎదిగారు