Teja Sajja
-
తేజసజ్జాకు ప్రతిష్ఠాత్మక అవార్డ్.. అంతా 'హనుమాన్' వల్లే!
-
Sakshi Excellence Awards 2025: మిరాయ్ సినిమా పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన తేజ సజ్జ
-
పాన్ ఇండియా మూవీస్ పైనే హనుమాన్ హీరో గురి..!
-
'మిరాయ్' ది సూపర్ యోధ విడుదలపై ప్రకటన
గత ఏడాదిలో విడుదలైన 'హనుమాన్' సినిమాతో హీరో తేజ సజ్జా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన తర్వాతి సినిమా 'మిరాయ్' పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ ప్రేక్షకులను మెప్పించాయి. దీంతో ఈ సినిమా విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు మేకర్స్ గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ క్రమంలో మిరాయ్ విడుదల తేదీని వారు ప్రకటించారు.'మిరాయ్' ది సూపర్ యోధ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తేజ సజ్జా యోధుడిగా కనిపించనున్నారు. కార్తిక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్ణు నిర్మిస్తోంది. తెలుగుతోపాటు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో 2025 ఆగష్టు 1న 2D, 3D ఫార్మెట్లో ఈ మూవీని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రక్షా బంధన్, ఇండిపెండెన్స్ డేను టార్గెట్ చేస్తూ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.ఇందులో రితిక నాయక్ హీరోయిన్గా నటిస్తుండగా.. మంచు మనోజ్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండనుంది. మిరాయ్ అనేది అశోకుని కాలంలో రహస్యమైన ఓ శాసనం అని గతంలో డైరెక్టర్ కార్తిక్ చెప్పారు. దీని గురించి సినిమా విడుదల తర్వాత పూర్తిగా అందరికీ అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు. -
ఇది అన్ని టాక్ షోలలా ఉండదు
ప్రస్తుత జెనరేషన్‌కు మార్పు అన్నది ఆక్సిజన్ లాంటిది. ప్రతిక్షణం నిత్య నూతనంగానే కాదు వినూత్నంగా చూడాలని కోరుకుంటుంది నేటి తరం. మామూలుగా ఇంటర్వ్యూ, టాక్ షోలంటే ఇద్దరు ఎదురెదురుగా పద్ధతిగా కూర్చోవడం నుండి నడుస్తూ మాట్లాడడం వరకు చూశాం. నాటి దూరదర్శన్ టాక్ షోల నుండి నేటి ఓటీటీ టాక్ షోల వరకు ఇంచుమించుగా ఇదే పద్ధతి అవలంబిస్తున్నారు. కానీ వాటన్నిటికీ విభిన్నంగా నేటి తరం నేటివిటీకి దగ్గరగా ‘ది రానా దగ్గుబాటి షో’ ఉంది. దీనికి హోస్ట్‌గా పేరుకు తగ్గట్టే నేటి ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి వ్యవహరించడం విశేషం. ఈ కార్యక్రమం స్ట్రీమ్ అయ్యేకన్నా ముందు ప్రముఖ యాంకర్ సుమతో ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రమోషనల్ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు.ఆప్రోమోలోనే ఈ షోకి సంబంధించిన కాన్సెప్ట్ రిలీజ్ చేశారు. ప్రోమోలో సుమ స్టూడియోకి వచ్చి రానాను కలుస్తుంది. ‘టాక్ షో అన్నావు కదా... గెస్టులు ఎవరు? దానికి సంబంధించిన అధికారిక అనౌన్సమెంట్ ఇలా ఉండాలి’ అని రానాకి సూచిస్తుంటే, ‘నేను టాక్ షో అన్నాను కానీ అనౌన్స్మెంట్, ఇంట్రో అని చెప్పలేదు కదా... చాలా షోస్ ఇలానే రొటీన్‌గా చేస్తున్నావు కదా.. మా టాక్ షో వాటన్నిటికీ విభిన్నం’ అని రానా చెబుతారు. రానా అన్నట్టే ఇప్పటిదాకా తెలుగులో వచ్చిన టాక్ షోస్ సంప్రదాయాన్ని ‘ది రానా దగ్గుబాటి షో’ బ్రేక్ చేసిందనే చెప్పాలి.ముఖ్యంగా ఈ షోలో రానా హోస్ట్ అనే కంటే వచ్చిన గెస్ట్‌లతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ క్యాజువల్‌గా షో నడపడం చాలా బాగుంది. ఈ షో మొదటి ఎపిసోడ్లో భాగంగా ప్రముఖ తెలుగు హీరో నాని, ‘హను– మాన్’ ఫేమ్ తేజ సజ్జా, నటి ప్రియాంకా మోహన్ అతిథులుగా వచ్చారు. వారిని షోలకి పిలవడం దగ్గర నుండి వాళ్ళతో మాట్లాడడం, ఆటలాడడం అంతా సరికొత్తగా అనిపిస్తుంది. ఎదుటివారి అభిరుచిని కనిపెట్టడం మీడియాలో దర్శకులకు తెలిసినంత మరెవరికీ తెలిసుండదు. అలా వాళ్లు ప్రేక్షకుల నాడిని పడతారు కాబట్టే వారి కాన్సెప్ట్స్ ప్రేక్షకాదరణ పొందుతాయి. దానికి నిలువెత్తు నిదర్శనమే ఈ ‘ది రానా దగ్గుబాటి షో’. ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఈ షో వర్తబుల్... వాచిట్. – హరికృష్ణ ఇంటూరు -
ఇఫీలో హను–మాన్ భాగం కావడం ఆనందం: తేజ సజ్జా
‘‘కథా కథనాల పట్ల ప్రేక్షకులకు ఉన్న అభిరుచి మన సినిమా అభివృద్ధికి దోహదపడుతుంది’’ అన్నారు హీరో తేజ సజ్జా. ‘‘హను–మాన్’ కేవలం సినిమా కాదు.. మన సాంస్కృతిక మూలాలు, సంప్రదాయాలకు కట్టిన పట్టం’’ అని కూడా అన్నారు. గోవాలో జరుగుతున్న 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో ఇండియన్ పనోరమా విభాగంలో ‘హను–మాన్’ని ప్రదర్శించారు.ఈ సందర్భంగా తేజ సజ్జా మాట్లాడుతూ... ‘‘కల్పిత గ్రామమైన అంజనాద్రి నేపథ్యంలో దైవిక శక్తులను పొందిన ఓ చిన్న దొంగ... మహా శక్తిమంతుడైన హనుమంతుని దాకా సాగించే ప్రయాణాన్ని ఈ చిత్రం చూపించిందని, భారతీయ పురాణాల విశిష్టతను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ఈ చిత్రం ద్వారా నిర్వర్తించామనీ అన్నారు. ఈ చిత్రం మన పౌరాణిక మూలాలను చాటి చెబుతూ భారతీయ సినిమాను ప్రపంచ వేదికపై నిలిపిందన్నారు.‘హను–మాన్ ’ సీక్వెల్ రూపకల్పన కోసం పని చేస్తున్నట్టు ధృవీకరించారు. తెలుగు పరిశ్రమ వినూత్న కథనాలతో అంతర్జాతీయంగా గొప్ప గుర్తింపు సాధిస్తోందన్నారు. ‘హను–మాన్’ సాంస్కృతిక వారసత్వం, ఆధునిక కథల శక్తిమంతమైన సమ్మేళనమని, భారతీయ పనోరమాలో భాగం కావడం ఈ చిత్ర కళాత్మక సాంస్కృతిక విశిష్టతకు నిదర్శనం’’ అంటూ తన ఆనంద వ్యక్తం చేశారు తేజ సజ్జా. – గోవా నుంచి సాక్షి ప్రతినిధి -
టాలీవుడ్ యంగ్ హీరో కాళ్లు మొక్కిన సీనియర్ సిటిజెన్.. వీడియో వైరల్!
ఈ ఏడాది సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రం హనుమాన్. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమా పొంగల్ పోటీలో సూపర్ హిట్‌గా నిలిచింది. గుంటూరు కారం, నా సామిరంగ, సైంధవ్ చిత్రాలతో పోటీపడి రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించారు. అయితే ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఐఎఫ్ఎఫ్ఐ వేడుకల్లో తేజ సజ్జా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో హనుమాన్ మూవీని ప్రదర్శించారు. ఈ సందర్భంగా తేజ సజ్జా వేదికపై సందడి చేశారు. ఆ సమయంలోనే ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ సీనియర్ సిటిజెన్ తేజ సజ్జా కాళ్లకు నమస్కరించాడు. అయితే వెంటనే తేజ ఆయనను అలా చేయవద్దని కోరాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కాగా.. తేజ ప్రస్తుతం మరో మూవీలో హీరోగా నటిస్తున్నారు. Super Hero @tejasajja123 received a memorable felicitation at @IFFIGoa after the screening of the Historic Blockbuster #HanuMan !#TejaSajja #IFFI2024 pic.twitter.com/QBHFwiVD3j— Rajesh Manne (@rajeshmanne1) November 23, 2024 -
ప్రేమలో భిన్న కోణం
‘‘నిర్మాత బెక్కం వేణుగోపాల్‌గారు ఇప్పటివరకు తీసిన 14 సినిమాల ద్వారా ఎందరో దర్శకులను, రచయితలను, నటీనటులను పరిచయం చేశారు. ‘రోటి కపడా రొమాన్స్’’ చిత్రంతోనూ చాలా మంది కొత్త నటీనటులను పరిచయం చేస్తున్నారు. ఆయన్ని చూస్తే ఎంతో స్ఫూర్తిగా ఉంటుంది. ఈ చిత్రం యూనిట్‌కి బ్రేక్ ఇవ్వాలి’’ అని హీరో తేజ సజ్జా అన్నారు. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘ లేఖ, ఖుష్బూ చౌదరి ముఖ్య తారలుగా విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’.బెక్కం వేణుగోపాల్, సృజన్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కినుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా తేజ సజ్జా, అతిథులుగా దర్శకులు యదు వంశీ, పవన్ సాధినేని, హర్ష, రచయిత కోన వెంకట్, నిర్మాతలు కేఎల్ దామోదర్ ప్రసాద్, చదలవాడ శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. ‘‘నేటి తరం యువతకి, ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు విక్రమ్ రెడ్డి. ‘‘ప్రేమకథలో ఓ భిన్నమైన కోణాన్ని దర్శకుడు ఈ చిత్రంలో ఆవిష్కరించాడు’’ అన్నారు బెక్కం వేణుగోపాల్, సృజన్ కుమార్. -
ఐఫా కాంట్రవర్సీ.. నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు: తేజ సజ్జా
‘ఐఫా’ అవార్డుల వేడుకలో రానా-తేజ సజ్జ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆ వేడుకకు వ్యాఖ్యాతలుగా చేసిన రానా-తేజ స్టార్ హీరోల సినిమాలపై జోకులు వేశారు. అయితే ఫ్యాన్స్ దానికి సంబంధించిన క్లిప్పులను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..రానా-తేజలను ట్రోల్ చేస్తున్నారు. తాజాగా దీనిపై తేజ సజ్జ క్లారిటీ ఇచ్చారు. ఐఫా వేడుకలో తాము సరదా కోసమే అలా మాట్లాడామని, ఫుల్ వీడియో చూస్తే ఆ విషయం అందరికి అర్థమవుతుందని చెప్పారు. ‘ఐఫా అవార్డులు అనేది ఒక జాతీయ స్థాయి వేడుకు. దాని కోసం చాలా మంది స్క్రిప్ట్ రైటర్స్ పని చేస్తుంటారు. అన్ని విధాల చెక్ చేసుకున్న తర్వాతే మాకు స్క్రిప్టులు అందిస్తారు. మేము అదే ఫాలో అవుతాం. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో క్లిప్పులన్నీ కట్ చేసినవి మాత్రమే. ఫుల్ వీడియో చూస్తే మీకు అసలు విషయం అర్థమవుతుంది. రానా నాపై జోకులు వేశాడు. నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. అందరి హీరోలతో కలిసి పని చేశాను. స్టార్ హీరోలందరితోనూ నాకు మంచి అనుబంధం ఉంది. వారిని తక్కువ చేసి మాట్లాడే ఉద్దేశం నాకు లేదు. మా వ్యాఖ్యలు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లే ఇలా కాంట్రవర్సీ చేస్తున్నారు’అని తేజ సజ్జ అన్నారు. కాగా, ఈ ఏడాది ఐఫా అవార్డుల వేడుక అబుదాబిలో నిర్వహించారు. సెప్టెంబర్‌లో జరిగిన ఈ వేడుకలో రానా-తేజ సజ్జ హోస్ట్‌గా వ్యవహరించారు. పలువురు టాలీవుడు స్టార్ హీరోహీరోయిన్లు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
'రోటి కపడా రొమాన్స్' మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ (ఫొటోలు)
-
చైల్డ్ ఆర్టిస్టులుగానే అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్.. ఈ తారల గురించి తెలుసా? (ఫొటోలు)
-
రానా, తేజ సజ్జా సారీ చెప్పాల్సిందే.. మహేశ్ బాబు ఫ్యాన్స్ డిమాండ్!
టాలీవుడ్లో సంక్రాంతి పండుగకు ఉన్న క్రేజే వేరు. అగ్రహీరోల సినిమాలన్నీ ఆ రోజు కోసమే ఎదురు చూస్తుంటాయి. పొంగల్ బాక్సాఫీస్ పోటీకి థియేటర్లు దొరకడం అంతా ఆషామాషీ కాదు. అందుకే పెద్ద హీరోలంతా ముందుగానే కర్చీఫ్ వేసేస్తారు. ఇప్పటికే వచ్చే ఏడాది సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేశ్ చిత్రం రెడీ అయిపోయాయి. త్వరలోనే మరిన్నీ చిత్రాలు పొంగల్ బాక్సాఫీస్ పోటీకి సై అంటున్నాయి.అయితే ఈ ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమాలే సందడి చేశాయి. మహేశ్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగ, వెంకటేశ్ సైంధవ్‌తో పాటు ప్రశాంత్ వర్మ హనుమాన్ పోటీలో నిలిచాయి. తేజ సజ్జా నటించిన ఈ చిత్రం ఊహించని విధంగా సంక్రాంతి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. చిన్న సినిమా అయినప్పటికీ పెద్ద సినిమాలకు గట్టి పోటీనిచ్చింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సీక్వెల్ తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారు.అయితే ఇటీవల జరిగిన ఐఫా వేడుకల్లో తేజ సజ్జా కూడా పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి హోస్ట్‌గా వ్యవహరించారు. వేదికపై వీరిద్దరి మధ్య సరదా సంభాషణ కొనసాగింది. తేజను రానా పొగుడుతూ మాట్లాడారు. అయితే ఆ తర్వాత వెంటనే నేను మహేశ్ బాబు గురించి మాట్లాడనంటూ రానా ఫన్నీగా చెప్పారు. ఇదేంటి ఇది నాకు కూడా సింక్ అయిందేంటని తేజ సజ్జా అన్నారు. ఆ తర్వాత రానా అతను సూపర్ స్టార్, మీరు ఒక సూపర్ హీరో మీరిద్దరూ సంక్రాంతికి వచ్చారు. సంక్రాంతి మ్యాటర్ ఇప్పుడు మాట్లాడవద్దంటూ తేజ సరదాగా అనడంతో.. దానికి ఎందుకు.. అదంతా సెన్సిటివ్ టాపిక్ హా' అని రానా బదులిచ్చాడు.అయితే ఇది చూసిన మహేశ్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి సంభాషణ మహేశ్ బాబును కించపరిచేలా ఉందంటూ నెట్టింట మండిపడుతున్నారు. తమ అభిమాన హీరో మహేశ్ బాబును ఎగతాళి చేశారని తేజ సజ్జా, రానాపై ట్విటర్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. 25 ఏళ్లుగా సినిమాల్లో ఉన్న మహేష్ మీద సెటైర్ వేయడం కరెక్ట్ కాదంటున్నారు ఫ్యాన్స్. మహేష్ సినిమాను కించపరిచినందుకు క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ ఓ అభిమాని పోస్ట్ చేశాడు. గుంటూరు కారం సినిమాపై మాట్లాడినందుకు సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు రానా, తేజ సజ్జా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. Context 😤pic.twitter.com/PBTuhvgD3W— Cinderella🦋 (@GlamGirl_Geetha) November 6, 2024 U had one success man, one! Daniki 25 yrs ga ace filmography unna Mahesh meedha satireUnless you come up with a sequel for Hanuman, aa collections thechkolev and yk why @tejasajja123 Inka Rana gurinchi enduku, shelved project adhi— Jimhalpert (@satvikdhfm) November 5, 2024 Dear @tejasajja123 ,Need apology to superstar @urstrulyMahesh garu and his fans You and rana degrade comments about 2024 sankranthi films , in this sankranthi one of my beloved superstar film also there you know also,Please try to understand this situation.Thanks and…— Sagar MB (@dhfmbabu4005) November 5, 2024 -
నెవర్ బిఫోర్ అనేలా 'హను-మాన్' మేకింగ్ వీడియో
తేజ సజ్జ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ‘హను-మాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం..ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. మహేశ్ బాబు, నాగార్జున, వెంకటేశ్ లాంటి బడా హీరోల సినిమాలు బరిలో ఉన్నా..వాటన్నింటిని తట్టుకొని సంక్రాంతి హిట్ సినిమాగా నిలిచింది. టాలీవుడ్లోనే కాకుండా..బాలీవుడ్, కోలీవుడ్‌లో కూడా హను-మాన్ భారీ వసూళ్లను రాబట్టింది. స్టార్ హీరోలు లేని ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 350 కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ పంచుకుంది. వీడియోతో పాటు హనుమాన్ చాలీసాను యాడ్ చేశారు. ఆ వీడియో నిడివి 2:43 నిమిషాలు ఉంది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న హనుమాన్ మేకింగ్ వీడియోను మీరూ చూసేయండి. -
హనుమాన్ హీరో యాక్షన్ అడ్వెంచర్.. రిలీజ్ డేట్ ఇదే!
హనుమాన్ మూవీతో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న హీరో తేజ సజ్జా. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలతో పోటీపడి బాక్సాఫీస్ వద్ద రాణించింది. అయితే తేజ సజ్జా ప్రస్తుతం మరో యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో నటిస్తున్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం మిరాయి. ఇవాళ తేజ బర్త్ డే కావడంతో మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అంతేకాకుండా మూవీ విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ పాన్ ఇండియా చిత్రానికి ఘట్టంనేని కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే మిరాయి గ్లింప్స్ రిలీజ్ చేయగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. కాగా.. ఈ మూవీని ఎనిమిది భాషల్లో ఏప్రిల్ 18, 2025న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. ఈ చిత్రానికి గౌరహరి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో మంచు మనోజ్, రితికా నాయక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. Strap in for an adrenaline ride 😎The #SuperYodha is born 🥷⚡Team #MIRAI ⚔️ wishes the SUPER HERO, @tejasajja123 a very splendid birthday ❤️🔥Get ready to experience the Action-Adventure in cinemas on 18th APRIL 2025 ~ 2D & 3D🔥#HBDTejaSajja @HeroManoj1 @Karthik_gatta… pic.twitter.com/DXvScUy0DP— People Media Factory (@peoplemediafcy) August 23, 2024 -
జపాన్‌లో ‘హను-మాన్’.. రిలీజ్ ఎప్పుడంటే..?
తేజ సజ్జ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ‘హను-మాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం..ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. మహేశ్ బాబు, నాగార్జున, వెంకటేశ్ లాంటి బడా హీరోల సినిమాలు బరిలో ఉన్నా..వాటన్నింటిని తట్టుకొని సంక్రాంతి హిట్ సినిమాగా నిలిచింది. టాలీవుడ్లోనే కాకుండా..బాలీవుడ్, కోలీవుడ్‌లో కూడా హను-మాన్ భారీ వసూళ్లను రాబట్టింది. స్టార్ హీరోలు లేని ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 350 కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ఓటీటీలోనూ ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభించింది. (చదవండి: 'కన్నప్ప' పేరుతో యూట్యూబర్స్‌కి మెయిల్స్.. నిజమేంటి?)ఇలా పాన్ ఇండియా స్థాయిలో అలరించిన ఈ చిత్రం..ఇప్పుడు జపాన్‌లోనూ సందడి చేయనుంది. అక్టోబర్ 4న ఈ చిత్రం జపాన్‌లో విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎక్స్ వేదికగా తెలియజేస్తూ.. ‘విడుదలైన అన్ని చోట్ల సెస్సేషన్ క్రియేట్ చేసిన ‘హను-మాన్’..ఇప్పుడు జపాన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 4న జపనీస్ సబ్‌టైటిల్ వెర్షన్ విడుదల కానుంది’ అని పేర్కొన్నాడు. After creating a sensation all over❤️🔥#HanuMan is now all set to amaze the audience in Japan 💥The Japanese subtitled version is all set to hit the screens on October 4th 🤩#HanuManInJapan 🔥🌟ing @tejasajja123@Actor_Amritha @Niran_Reddy @varusarath5 @VinayRai1809… https://t.co/ccprtfKEs3— Prasanth Varma (@PrasanthVarma) July 27, 2024 -
శిల్పకళావేదికలో మాదక ద్రవ్యా ల వ్యతిరేక దినోత్సవం కార్యక్రమం (ఫొటోలు)
-
‘మిరాయ్’ ది సూపర్ యోధ మూవీ ప్రెస్ మీట్ (ఫోటోలు)
-
యోధుడిగా మంచు మనోజ్.. 'మిరాయ్' గ్లింప్స్ విడుదల
తేజ సజ్జా యోధుడిగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్' ది సూపర్ యోధ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ మూవీ తెరకెక్కుతుంది. కార్తిక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి 'ది బ్లాక్ స్వాడ్' గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుంది.పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి మంచు మనోజ్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. బాలీవుడ్ హీరోకు ఏమాత్రం తగ్గకుండా ఇందులో ఆయన కనిపిస్తున్నారు. అసలుసిసలైన యోధుడిగా కత్తితో చేస్తున్న పోరాట సన్నివేశాన్ని చూపించారు. తెలుగుతోపాటు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో 2025 ఏప్రిల్ 18న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.మిరాయ్ అనేది అశోకుని కాలంలో రహస్యమైన ఓ శాసనం అని గతంలో డైరెక్టర్ కార్తిక్ చెప్పారు. దీని గురించి సినిమా విడుదల తర్వాత పూర్తిగా అందరికీ అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు. -
బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలు
రూ.100 కోట్ల కలెక్షన్స్.. ఒకప్పుడు టాలీవుడ్‌కి ఇది రికార్డు కలెక్షన్స్. స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చేవి. మాములు హీరోల సినిమాలకు రూ.20 కోట్లు వస్తేనే అది సూపర్ హిట్. కానీ ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి మారింది. కుర్రహీరోలు సైతం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. రికార్డు స్థాయి కలెక్షన్స్‌ని రాబడుతున్నారు. ఇంకా చెప్పాలంటే స్టార్ హీరోలకు సైతం సాధ్యం కానీ కలెక్షన్స్‌ని యంగ్ హీరోస్ రాబడుతున్నారు. మన టాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న యంగ్ హీరోలపై ఓ లుక్కేయండి -
గట్స్ ఉన్నవాళ్లకే హిట్స్ వస్తాయి: తేజ సజ్జ
‘‘సత్యం’ థియేటర్లో వందరోజులు ఆడిన సినిమాలు చూశాను. అలాంటి ప్లేస్‌లో మా ‘హను–మాన్’ వంద రోజుల పండగ జరుపుకోవడం హ్యాపీగా ఉంది. ప్రేక్షకులు మాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది’’ అని తేజ సజ్జా అన్నారు. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హను–మాన్’. చైతన్య సమర్పణలో కె. నిరంజన్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది జనవరి 12న విడుదలైంది. దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం 25 కేంద్రాల్లో వంద రోజుల ప్రదర్శనను పూర్తి చేసుకుందని చిత్ర యూనిట్ పేర్కొంది.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ‘హను–మాన్’ హిస్టారిక్ 100 డేస్ సెలబ్రేషన్స్‌లో తేజ సజ్జా మాట్లాడుతూ– ‘‘దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్రెడ్డిగారిలోని ధైర్యాన్ని ఈ తరం స్ఫూర్తిగా తీసుకోవాలి. గట్స్ ఉన్నవాళ్లకే హిట్స్ వస్తాయి’’ అన్నారు. ‘‘ఇంద్ర, నువ్వు నాకు నచ్చావ్, పోకిరి’ వంటివి.. నాకు బాగా గుర్తున్న వంద రోజుల వేడుకలు జరుపుకున్న సినిమాలు. అయితే ఇప్పుడు సినిమా అంటే ఓ వీకెండ్ అయిపోయింది. ఇలాంటి తరంలో వందో రోజు కూడా థియేటర్స్‌కు వచ్చి ఆడియన్స్ మా సినిమా చూస్తున్నారంటే అది మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయు)లో రాబోయే సినిమాల్లో అన్ని పరిశ్రమల నుంచి పెద్ద నటీనటులు కనిపిస్తారు’’ అన్నారు ప్రశాంత్ వర్మ.‘‘నా కాలేజీ రోజుల్లో సినిమాల వంద రోజుల ఫంక్షన్స్ చూసేవాడిని. అలాంటిది నేను నిర్మించిన సినిమా వంద రోజులు జరుపుకోవడం హ్యాపీగా ఉంది’’ అన్నారు నిరంజన్ రెడ్డి. ‘‘హను–మాన్’ వంద రోజుల వేడుక చేసుకోవడం హ్యాపీగా ఉంది’’అన్నారు చైతన్య. ఐమాక్స్ త్రీడీలో జై హనుమాన్... ‘హను–మాన్’కు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ రానుంది. మంగళవారం (ఏప్రిల్ 23) హనుమాన్ జయంతి సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసి, భారీ వీఎఫ్ఎక్స్తో రూపొందించనున్న ఈ సినిమాను ఐమాక్స్ 3డీ వెర్షన్లో విడుదల చేయనున్నట్లు యూనిట్ పేర్కొంది. -
Hanu-Man: రిస్క్ చేశాడు... హిట్ కొట్టాడు
తేజ సజ్జ హీరోగా నటించిన హను-మాన్ చిత్రం టాలీవుడ్లో సంచలనం సృష్టించింది. సూపర్ హీరో కాన్సెప్ట్ కి ఇండియన్ మైథాలజీని లింక్ చేసి తెరకెక్కించిన ఈ అద్భుతానికి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద రూ. 350 కోట్లకుపైగా వసూళ్లను సాధించి, సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. అయితే ఈ విక్టరీ క్రెడిట్ దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జకే ఎక్కువగా వెళ్లింది. కానీ వీరిద్దరితో పాటు మరో వ్యక్తికి ఈ విజయానికి కీలకంగా నిలిచాడు. ఆయనే నిర్మాత కె. నిరంజన్ రెడ్డి. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించాడు. రూ.15 కోట్ల బడ్జెట్ అనుకొని ఈ సినిమాను ప్రారంభించారు. కానీ చివరికి రూ.65 కోట్ల వరకు ఖర్చు అయింది. అయితే సినిమాపై నమ్మకంతో నిరంజన్ రెడ్డి ధైర్యం చేశాడు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్ గ్లోబల్ లెవల్ క్వాలిటీతో ఉండేలా జాగ్రత్త పడ్డాడు. కథ ఎంపిక స్వయంగా పర్యవేక్షించి అమలు చేశారు. పెద్ద హీరోలు సంక్రాంతి బరిలో ఉన్నారు.. రిస్క్ చేయడమే.. అని అందరు అంటున్న కూడా.. పక్కా ప్లాన్ తో థియేటర్స్‌లో రిలీజ్ చేసారు. ఇంకేముంది ఓ యజ్ఞంలా నిర్మించిన సినిమా మహద్భుతం క్రియేట్ చేసింది. ఈ రోజుల్లో వంద రోజుల పాటు థియేటర్లలో నడిచిన సినిమాగా రికార్డు సృష్టించడమే కాకుండా కలెక్షన్లలోనూ సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది. దీనికి కారణమైన తెరవెనుక అసలు హీరో.. నిర్మాత కె. నిరంజన్ రెడ్డి అంటూ సినీ విశ్లేషకులు కొనియాడుతున్నారు. -
హనుమాన్ హీరో కొత్త మూవీ.. గ్లింప్స్ చూస్తే గూస్‌బంప్సే!
హనుమాన్ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన యంగ్ హీరో తేజ సజ్జా. ఈ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ దక్కించుకున్నారు. తేజ మరో హిస్టారికల్ మూవీ చేసేందుకు రెడీ అయిపోయారు. తేజ సజ్జాకు జంటగా రితికా నాయక్ నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆయన రవితేజతో ఈగల్ మూవీని తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ టైటిల్‌తో పాటు గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. హైదరాబాగ్లోని రామానాయుడు స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో టైటిల్ రివీల్ చేశారు. తేజ సజ్జా తాజా చిత్రానికి మిరాయి అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో తేజ సూపర్‌యోధ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్లో తేజ సజ్జ సూపర్ యోధా లుక్‌లో కనిపించారు. బద్దలయ్యే అగ్నిపర్వతం పైన నిలబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అశోకుని కాలంలో జరిగిన కళింగ యుద్ధం ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు గ్లింప్ల్ చూస్తే అర్థమవుతోంది. మిరాయి సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీతో పాటు చైనీస్ భాషల్లోనూ వచ్చే ఏడాది ఏప్రిల్ 18న విడుదల చేయనున్నారు. From the hush of ancient narratives📜 Comes a thrilling adventurous saga of a #SuperYodha 🥷⚔️#PMF36 x #TejaSajja6 Titled as #𝐌𝐈𝐑𝐀𝐈 ⚔️#MIRAITitleGlimpse out now💥 -- https://t.co/k4tycunRkA In Cinemas on 18th APRIL 2025 ~ 2D & 3D🔥 SuperHero @tejasajja123… pic.twitter.com/WN2MB2EPlE — People Media Factory (@peoplemediafcy) April 18, 2024 -
Teja Sajja: ‘సూపర్ యోధ’గా ‘హను-మాన్’ హీరో
‘హను–మాన్’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు హీరో తేజ సజ్జా. తాజాగా ఆయన కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ‘ఈగల్’ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రకటించి, పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్. ‘హను–మాన్’ చిత్రంలో సాంప్రదాయ దుస్తుల్లో కనిపించిన తేజ.. కొత్త పోస్టర్లో స్టైలిష్ మేకోవర్‌లో కనిపించారు. ‘‘సూపర్ యోధ సాహసోపేతమైన కథతో పాన్ ఇండియా మూవీగా ఇది తెరకెక్కనుంది. ‘ఈగల్’ తర్వాత కార్తీక్ ఘట్టమనేనితో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న రెండో చిత్రం ఇది. ఈ సినిమా పూర్తి వివరాలను ఈ నెల 18న ప్రకటిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, క్రియేటివ్డ్యూసర్: కృతీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి. Wishing my Super Hero @TejaSajja123 Super talented @Karthik_gatta & Super passionate @vishwaprasadtg garu all the best for #PMF36 🤗 Title Announcement Glimpse on 𝗔𝗣𝗥𝗜𝗟 𝟭𝟴𝘁𝗵 #SuperYodha 🥷 pic.twitter.com/aOqpz1z08E — Prasanth Varma (@PrasanthVarma) April 15, 2024 -
తేజ సజ్జపై చిరంజీవి కామెంట్స్ వైరల్
-
నేను అనుకున్న కలని అతడు నిజం చేశాడు: చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పగానే 150కి పైగా సినిమాలు, ఎన్నో అద్భుతమైన పాత్రలు గుర్తొస్తాయి. ప్రస్తుతం 'విశ్వంభర' అనే మూవీ చేస్తున్న చిరు.. యంగ్ హీరోలపై ఎప్పటికప్పడు తన అమితమైన ప్రేమని చూపిస్తుంటారు. ఇప్పుడు అలానే సౌత్ ఇండియా ఫెస్టివల్-2024లో మాట్లాడుతూ 'హనుమాన్' ఫేమ్ తేజ సజ్జాని ఆకాశానికెత్తేశారు. (ఇదీ చదవండి: సాయిపల్లవికి రికార్డ్ రెమ్యునరేషన్.. 'రామాయణ' కోసం అన్ని కోట్లా?) 'ఆ కుర్రాడిని చూశారా? (తేజ సజ్జాని యాంకర్ కి చూపిస్తూ..) అతడు 'హనుమాన్' సినిమా చేశాడు. కానీ 25 ఏళ్ల క్రితం బాలనటుడిగా కెరీర్ మొదలుపెట్టాడు. నాతో మూవీస్ చేశాడు. ఇంద్ర చిత్రంలో నటించాడు. ఆ తర్వాత ఎంతో ఎదిగాడు. అతడికి ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. నన్ను అభిమానిస్తూ, నా చిత్రాల్ని స్ఫూర్తిగా తీసుకుని హీరో అయ్యాడు. 'హనుమాన్'తో తనని తాను నిరూపించుకున్నాడు' 'నేను కూడా హనుమాన్ పై సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. కానీ చేయలేకపోయాను. నా ప్రయత్నానికి ముందే అతడు చేసేశాడు. కానీ ఈ విషయంలో నేను పూర్తిగా సంతృప్తి చెందాను. ఎందుకంటే అతడు కూడా నా ప్రయాణంలో భాగమే. నటుడిగా నిరూపించాడు. ఇండస్ట్రీలో అందరి ప్రశంసలు అందుకున్నాడు' అని చిరు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: గుండె బద్దలైంది.. బయటపడటానికి చాలా టైమ్ పట్టింది: మృణాల్) Padma Vibhushan, Mega 🌟 @KChiruTweets lauds @tejasajja123 for his impressive journey in cinema at #SIFF pic.twitter.com/3d6DtdDFAC — Vamsi Kaka (@vamsikaka) April 12, 2024 -
అంజనాద్రి 2.0.. 'జై హనుమాన్' వీడియో పోస్ట్ చేసిన ప్రశాంత్ వర్మ
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా వండర్స్ క్రియేట్ చేసింది. తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా వచ్చిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. దీనికి కొనసాగింపుగా 'జై హనుమాన్' రానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో సీక్వెల్ అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ వర్మ తాజాగా స్పెషల్ మ్యూజిక్ థీమ్‌ను షేర్ చేశారు. ప్రశాంత్ వర్మ షేర్ చేసిన వీడియోలో అందమైన కొండల మధ్యలో పెద్ద నది ఉంది. పార్ట్ -1 మాదిరి ఈ వీడియోలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూపించిన ప్రశాంత్.. 'వెల్కమ్ టు అంజనాద్రి 2.0' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఆపై టైటిల్ నేమ్ అయిన #Jai Hanuman హ్యాష్ట్యాను కూడా దానికి జత చేశారు. ఫైనల్‌గా ఈ వీడియోకు 'హనుమాన్' నుంచి 'రఘునందన' పాటను అటాచ్ చేయడం విశేషం. హనుమాన్ సినిమా ముగింపులోనే పార్ట్2 ఉంటుందని చెప్పేశాడు దర్శకుడు. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేమిటి..? అనే ప్రశ్నకు సమాధానంగా 'జై హనుమాన్' తెరకెక్కుతుంది. ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి ఏదైనా పోస్టర్ విడుదల కావచ్చు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయ్యాయి. వచ్చే ఏడాది సంక్రాంతికే జై హనుమాన్ విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. ఇందులో ఆంజనేయ స్వామి పాత్రను ఒక స్టార్ హీరో చేస్తారని చెప్పిన ప్రశాంత్ వర్మ.. మరీ ఆ స్టార్ హీరో ఎవరో ఇంకా ఫైనల్ చేయలేదు. ఇకపోతే హనుమాన్ సినిమా జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. View this post on Instagram A post shared by Prasanth Varma (@prasanthvarmaofficial) -
ఏకంగా మూడు ఓటీటీల్లోకి హనుమాన్.. క్రేజ్ మామూలుగా లేదుగా!
ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. సంక్రాంతి సినిమాలతో పోటీపడి సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ప్రస్తుతం హనుమాన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి వచ్చిన హనుమాన్ పలు రికార్డులు కొల్లగొట్టింది. స్ట్రీమింగ్ అయిన కొద్ది గంటల్లోనే అత్యధిక వ్యూయర్షిప్ సాధించింది. ప్రస్తుతం జీ5లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుండగా.. హిందీ వర్షన్ జియో సినిమాలో అందుబాటులో ఉంది. అయితే దక్షిణాది భాషల్లోనూ హనుమాన్ చిత్రాన్ని తీసుకురావాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ వర్మ అప్డేట్ ఇచ్చారు. తమిళ, కన్నడ, మలయాళంలోనూ హనుమాన్ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ మూడు భాషల్లోని సినీ ప్రియులకు ఏప్రిల్ 5 నుంచి అందుబాటులోకి రానుందని ట్వీట్ చేశారు. అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుందని వెల్లడించారు. ఈ లెక్కన హనుమాన్ ఏకంగా మూడు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది అన్నమాట. Tamil, Malayalam and Kannada versions of #HanuMan premieres April 5th on @DisneyPlusHS 😃#HanuManOnHotstar pic.twitter.com/PQvJWoTvZb — Prasanth Varma (@PrasanthVarma) March 26, 2024 -
హనుమాన్ ఖాతాలో తొలి అవార్డు.. ప్రశాంత్ వర్మ ట్వీట్
ఈ ఏడాదిలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. తాజాగా ఈ చిత్రం ఖాతాలో మొదటి అవార్డు వచ్చి చేరింది. సంక్రాంతి విజేతగా నిలిచిన ఈ మూవీలో తేజ సజ్జా హీరోగా నటించగా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశాడు. బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలతో పోటీని తట్టుకుని రూ. 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం జీ5 ద్వారా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం రూ. 40 కోట్లతో హనుమాన్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ.. ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో వచ్చిన మొదటి సూపర్ హీరో సినిమాగా రికార్డ్ క్రియేట్ చేయడమే కాకుండా .. హనుమాన్ కథకు ఇండియన్ మైథాలజీని లింక్ చేసి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశంలో ప్రశాంత్ వర్మ కష్టం కనిపిస్తుంది. హనుమాన్ విజువల్స్ చూసిన చిన్న పిల్లల.పెద్దలు ఫిదా అయ్యారు. అందుకే వారందరినీ మరోసారి సినిమా చూసేలా చేశాయి. థియేటర్స్‌లో రికార్డ్స్ క్రియేట్ చేసిన హనుమాన్.. ఓటీటీలో కూడా సత్త చాటుంది. కొద్దిరోజుల క్రితమే హనుమాన్ కలెక్షన్స్ వర్షం ఆగింది.. ఇప్పుడు అవార్డుల వర్షం మొదలైంది. ఈ క్రమంలో రేడియో సిటీ తెలుగు నిర్వహించిన ఐకాన్ అవార్డ్స్‌లో హనుమాన్ సినిమాకు గాను బెస్ట్ డైరెక్టర్ అవార్డును ప్రశాంత్ వర్మ అందుకున్నాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. ఇది ఆరంభం మాత్రమే అంటూ ఆయనకు ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. First award for #HanuMan 🙂 Thank you @radiocityindia 🤗#IconAwards #BestDirector pic.twitter.com/xCqgCHkoro — Prasanth Varma (@PrasanthVarma) March 21, 2024 -
బాక్సాఫీస్ సంచలనం.. ఓటీటీలో కేవలం 11 గంటల్లోనే!
బాక్సాఫీస్ సంచలనం హనుమాన్ మూవీ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. ఈనెల 17న సడన్‌గా స్ట్రీమింగ్కు వచ్చేసిన ఈ చిత్రం ఓటీటీ దూసుకెళ్తోంది. స్ట్రీమింగ్కు వచ్చేసిన 11 గంటల్లోనే 102 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ సాధించింది. జీ5 ఓటీటీ చరిత్రలో తొలి రోజున ఉన్న రికార్డులను తిరగరాసింది. 2024లో జీ 5ను ప్రపంచ వ్యాప్తంగా హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలబెట్టింది. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన హనుమాన్ ఓటీటీలోనూ రికార్డులు కొల్లగొడుతోంది. వ్యూస్‌తో గ్లోబల్‌గా జీ5లో నంబర్‌వన్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని జీ5 తన ట్విటర్ ద్వారా వెల్లడించింది. విజువల్స్, భక్తి పారవశ్యంలో మునిగిపోయే సన్నివేశాలు, రోమాలు నిక్కబొడిచే యాక్షన్‌తో పాటు పాటలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంలో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. హనుమాన్ కథేంటంటే... అంజనాద్రి ప్రాంతంలో ఉండే హనుమంతు (తేజ సజ్జ) అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. తల్లిదండ్రి లేని హనుమంతుని అక్క అంజనమ్మ (వరలక్ష్మి శరత్ కుమార్) అన్నీ తానై హనుమంతుని పెంచి పెద్దచేస్తుంది. ఆ ప్రాంతంలో అన్యాయం చేస్తోన్న గజపతిని ఓ సందర్భంలో హనుమంతు ఆ ఊళ్లో వైద్యం చేయటానికి వచ్చిన డాక్టర్ మీనాక్షి కారణంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. మీనాక్షిని హనుమంతు చిన్నప్పటి నుంచి ఇష్టపడుతుంటాడు. గజపతి కారణంగా హనుమంతు ప్రమాదంలో చిక్కుకుంటే అతని ఆంజనేయ స్వామికి సంబంధించిన ఓ అపూర్వశక్తి దొరుకుతుంది. దాంతో అతను ప్రజలకు మంచి చేస్తుంటాడు. చివరకు విషయం విలన్ వరకు చేరుతుంది. అపూర్వ దైవశక్తిని సంపాదించుకోవటానికి ప్రతినాయకుడు ఏం చేశాడు?.. అతన్ని మన హీరో ఎలా ఎదుర్కొన్నాడు.. చివరకు ఆంజనేయస్వామి భక్తుడి కోసం ఏం చేశాడనే కథే హనుమాన్. RECORDS BROKEN AND HEARTS WON! HanuMan now streaming on ZEE5 in Telugu with English subtitles. https://t.co/TfUtuuoNTx @tejasajja123 @PrasanthVarma @Niran_Reddy @Actor_Amritha @varusarath5 @VinayRai1809 @Chaitanyaniran @GowrahariK @AsrinReddy @Primeshowtweets @tipsofficial pic.twitter.com/8EymDJjKbU — ZEE5 Telugu (@ZEE5Telugu) March 18, 2024 -
ఓటీటీలో హనుమాన్.. కన్నీళ్లు పెట్టుకున్న చిన్నారి...!
టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ కొత్త ఏడాదిలో రిలీజై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ కొట్టింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన హనుమాన్ ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమాకు చిన్నపిల్లలు బాగా కనెక్ట్ అయ్యారు. హనుమాన్ విజువల్స్.. తేజ సజ్జా ఫర్మామెన్స్‌కు పిల్లలు ఫిదా అయిపోయారు. తాజాగా ఈ మూవీని వీక్షించిన ఓ చిన్నారి.. కన్నీళ్లు పెట్టుకుంది. హనుమాన్ చిత్రంలో కుస్తీ ఫైట్ సీన్‌ను చూసిన చిన్నారి బోరున ఏడ్చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఆ పాప తండ్రి ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియోకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రిప్లై కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Awww 🥹🤗 https://t.co/HlczCf7Ewx — Prasanth Varma (@PrasanthVarma) March 18, 2024 -
ఓటీటీకి హనుమాన్.. ఇంతలోనే సడన్‌గా ఏమైంది?
టాలీవుడ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న హనుమాన్ ఎట్టకేలకు ఓటీటీకి వచ్చేసింది. మొదట హిందీ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించిన మేకర్స్.. తెలుగులో ఓటీటీ రిలీజ్‌పై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. మొదట్లో శివరాత్రి సందర్భంగా ఓటీటీకి వస్తుందని భావించినప్పటికీ అలా జరగలేదు. ఆ తర్వాతనైనా మార్చి 16న హిందీ వర్షన్‌తో పాటే సర్ప్రైజ్ ఉంటుందేమోనని ఫ్యాన్స్ భావించారు. దీంతో హనుమాన్ ఓటీటీ రిలీజ్‌పై అప్డేట్స్ వెయిట్ చేసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. కానీ ఎవరూ ఉహించని విధంగా హిందీ వర్షన్ స్ట్రీమింగ్ అయిన కొద్దిగంటల్లోనే చెప్పా పెట్టకుండా తెలుగులోనూ స్ట్రీమింగ్ చేశారు. అసలు హనుమాన్ ఓటీటీకి వచ్చిందన్న విషయం జీ5లో చూస్తే కానీ అభిమానులకు తెలియరాలేదు. కానీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్న సినిమాను సడన్‌గా స్ట్రీమింగ్ ఎందుకు చేశారు? ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన టాలీవుడ్ ఫ్యాన్స్ కోసం తేదీని ప్రకటించకుండా స్ట్రీమింగ్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఈ విషయంలో నెటిజన్స్ మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఓటీటీ రిలీజ్ ఆలస్యం కావడంతో ఆడియన్స్‌కు ఉన్న ఇంట్రెస్ట్ కాస్తా పోతుందనే సడన్ స్ట్రీమింగ్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు హనుమాన్ ఓటీటీ రిలీజ్ తర్వాత నెటిజన్స్ కామెంట్స్‌తో విరుచుకుపడుతున్నారు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్పై నెగెటివ్ పోస్టులు పెడుతున్నారు. థియేటర్లలో అలరించిన హనుమాన్కు.. డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌కు వచ్చేసరికి నెగెటివిటీ స్ప్రెడ్ కావడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరికొందరేమో కావాలనే ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారని మండిపడుతున్నారు. ఈ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన మూవీ అని ప్రశంసిస్తున్నారు. ఏదేమైనా థియేటర్లలో మెప్పించిన ఈ సినిమాకు ఓటీటీలో ఇలాంటి టాక్ రావడం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. All of Sudden Negativity on #HanuMan What is the reason? pic.twitter.com/7lTcGKec1P — Telugu Bit (@telugubit) March 17, 2024 Why, suddenly people are spreading negativity on #HanuMan cinema, after releasing it in OTT What is making them cry 🤔 pic.twitter.com/Aa90IxjIq6 — 🚩అజ్ఞాతవాసి Ãgnathavasì 🕉️ (@myselfBharath__) March 17, 2024 -
రెండు ఓటీటీల్లో హనుమాన్..
-
రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన హనుమాన్.. ఎక్కడంటే?
ఒకప్పుడు థియేటర్లో కొత్త సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎదురుచూసేవారు. ఇప్పుడు థియేటర్‌తో పాటు అటు ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా? ఏ ఓటీటీలోకి వస్తుందా? అని ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. గత కొన్నాళ్లుగా హనుమాన్ ఓటీటీ రిలీజ్ కోసం వెబ్ వీక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు తెర దించుతూ జియో సినిమాలో హనుమాన్ హిందీ వర్షన్ రిలీజ్ చేశారు. జియోలో స్ట్రీమింగ్ నిన్న (మార్చి 16) రాత్రి 8 గంటల నుంచే జియో సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో నార్త్ ఇండియన్స్ వీకెండ్లో సినిమా చూస్తూ తమ సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ సీన్ అదుర్స్, ఆ సీన్ సూపర్బ్ అంటూ కొన్ని సన్నివేశాల క్లిప్పింగ్స్ నెట్టింట షేర్ చేస్తున్నారు. అయితే సడన్‌గా మరో ఓటీటీలోనూ హనుమాన్ను తీసుకొచ్చేశారు. జీ5లో హనుమాన్ మూవీని అందుబాటులోకి తెచ్చారు. ఈ మేరకు ఓ ప్రోమో కూడా వదిలారు. జీ5లోకి వచ్చేసిన హనుమాన్ అంతా ఓకే కానీ చివర్లో దీన్ని ఫ్రీగా ఇవ్వట్లేదని కొనుక్కోమని చెప్పారు. ఇది చూసిన అభిమానుల ఫ్యూజులెగిరిపోయాయి. సబ్‌స్క్రైబర్స్‌కు ఫ్రీగా ఇవ్వాలి కానీ మళ్లీ ఇలా ప్రత్యేకంగా డబ్బులు పెట్టి కొనుక్కోమని తిరకాసులేంటో అని తిట్టిపోశారు. కానీ కాసేపటికే రెంట్ పద్ధతి తీసేసి ఫ్రీగా చూడొచ్చని చెప్పారు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్‌లో తేజ సజ్జ హీరోగా నటించాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.350 కోట్ల మేర రాబట్టింది. HanuMan is now streaming on @ZEE5Telugu 😊@tejasajja123 @Niran_Reddy @Actor_Amritha @varusarath5 @VinayRai1809 @Chaitanyaniran @AsrinReddy @Primeshowtweets @tipsofficial @tipsmusicsouth @ThePVCU @RKDStudios #HanuMan #HanuManOnZEE5 pic.twitter.com/PLf0lF3Lfw — Prasanth Varma (@PrasanthVarma) March 17, 2024 చదవండి: త్వరలో ఎలక్షన్స్.. మన్సూర్‌కు కోలుకోలేని దెబ్బ.. అధ్యక్ష పదవి ఊస్ట్ -
'హనుమాన్' ఓటీటీ రిలీజ్‌పై డైరెక్టర్ ట్వీట్.. ఫైర్ అవుతున్న నెటిజన్లు
ఈ ఏడాది సంక్రాంతి సమయంలో పెద్ద సినిమాలతో పాటు ఎలాంటి అంచనాలు లేకుండా 'హనుమాన్' సినిమా విడుదలైంది. యంగ్ హీరో తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో దుమ్మురేపింది. సంక్రాంతికి వచ్చిన సినిమాలు అన్నీ ఇప్పటికే పలు ఓటీటీలలో వచ్చేశాయి. కానీ ‘హనుమాన్’ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూసే వారికి మరోసారి నిరాశ ఎదురైంది. ఇప్పట్లో ఓటీటీలోకి హనుమాన్ వచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది. హనుమాన్ ఓటీటీ విడుదలపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తాజాగా ఇలా చెప్పుకొచ్చారు. 'హనుమాన్ ఓటీటీ విడుదల ఆలస్యం అనేది ఉద్దేశపూర్వకంగా చేస్తోంది కాదు. వీలైనంత త్వరగా ఓటీటీలోకి తీసుకురావడానికి మా యూనిట్ విరామం లేకుండా పనిచేస్తోంది. మీకు ఉత్తమమైనది అందిచాలన్నదే మా ప్రధాన ఉద్దేశం. ఆలస్యం విషయంలో దయచేసి అర్థం చేసుకోవడానికి అందరూ ప్రయత్నించండి. ఇప్పటి వరకు మా చిత్ర యూనిట్‌కు సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు.' అని తెలిపారు. తాజాగా ప్రశాంత్ వర్మ చేసిన పోస్ట్‌పై నెటిజన్ తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. విడుదలైన సినిమాకు కొత్తగా మీరు యాడ్ చేసేది ఏంటి..? ఆలస్యానికి కారణాలు ఏంటి..? కనీసం ఎప్పుడు వస్తుందో అంచనా తేదీనైనా ప్రకటించలేనంత స్థితిలో ఉన్నారా..? మీరు చేస్తున్న అతికి సినిమాపై ఉన్న ఆసక్తి కూడా పోతుంది అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మొదట హనుమాన్ సినిమా మార్చి 2 నుంచి 'జీ5'లో స్ట్రీమింగ్ అవుతుందని టాక్ వినిపించింది. అప్పుడు జరగలేదు. ఆ తర్వాత శివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదల అన్నారు. అప్పుడూ లేదు. తాజాగా మార్చి 15 నుంచి స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదీ లేదు.. ఇప్పుడు ప్రశాంత్ వర్మ పోస్ట్‌తో ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో కూడా తెలయని పరిస్థితి అని అభిమానులు తీవ్రమైన నిరాశకు గురయ్యారు. భారీ సినిమాల మధ్య రిలీజ్ అయిన సినిమాకు తాము ఎంతగానో సోషల్‌మీడియాలో ప్రమోట్ చేస్తే ఇప్పుడు ఇలా గేమ్స్ అడుతున్నారా అంటూ డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై ఫైర్ అవుతున్నారు. ఇప్పటికి అయితే హనుమాన్ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో అనే విషయంపై ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇవ్వలేదు. #HanuMan OTT streaming delay was not intentional! We have been working tirelessly round the clock to sort things and bring the film to you asap! Our intention is always to give you nothing but the best! Please try to understand and continue supporting us! Thank you! 🤗… — Prasanth Varma (@PrasanthVarma) March 15, 2024 -
అమిత్ షాను కలిసిన టాలీవుడ్ డైరెక్టర్..!
హనుమాన్ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కొచ్చిన ప్రశాంత్ వర్మ తాజాగా కేంద్ర హోమంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. హనుమాన్ హీరో తేజ సజ్జాతో కలిసి ఆయనకు ఆంజనేయస్వామి విగ్రహాన్ని బహుకరించారు. హనుమాన్ సినిమాకు ప్రోత్సాహం అందించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. కాగా.. ఇవాళ సికింద్రాబాద్‌లో జరిగిన భాజపా సోషల్ వారియర్స్ సమావేశానికి అమిత్ షా హాజరయ్యారు. సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసిన హనుమాన్ సూపర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. త్వరలోనే ఈ మూవీ ఓటీటీలోనూ సందడి చేయనుంది. థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించారు. View this post on Instagram A post shared by Prasanth Varma (@prasanthvarmaofficial) -
ఓటీటీకి హనుమాన్.. ప్రశాంత్ వర్మ లేటేస్ట్ అప్డేట్.. నెటిజన్స్ కామెంట్స్ వైరల్!!
టాలీవుడ్ మూవీ హనుమాన్ సంక్రాంతికి రిలీజైన బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. పెద్ద సినిమాలతో పోటీపడి రికార్డ్ స్థాయి వసూళ్లతో అదరగొట్టింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే హిందీ వర్షన్ తేదీ ఖరారు చేశారు. ఈనెల 16 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. అయితే తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో ఓటీటీ హక్కులను జీ5 దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే స్ట్రీమింగ్ డేట్‌పై ఇప్పటి వరకు అధికారిక ప్రకటనైతే రాలేదు. మరో వైపు గతంలోనే మహా శివరాత్రికి స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలొచ్చాయి. కానీ అలా జరగలేదు. ఈ నేపథ్యంలో హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఓటీటీ రిలీజ్ డేట్‌పై హింట్ ఇచ్చాడు. త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించనున్నట్లు ట్వీట్ చేశారు. హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్రకటన రానుందని పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో వెయిటింగ్ అన్న అంటూ కామెంట్స్ పెడుతుండగా.. మరికొందరేమో ఉన్న ఇంట్రెస్ట్ కాస్తా కూడా పోయిందని పోస్ట్ చేస్తున్నారు. మరీ హిందీ స్ట్రీమింగ్‌తో పాటే ఈ నెల 16 నుంచైనా ఓటీటీకి వస్తుందేమో వేచి చూద్దాం. #HanuMan OTT streaming date announcement is coming! 😊👍🏼 — Prasanth Varma (@PrasanthVarma) March 11, 2024 -
ఫ్యాన్స్‌కు హనుమాన్ టీం సర్ప్రైజ్.. ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ హనుమాన్. తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం థియేటర్లలో ఇంకా రన్ అవుతూనే ఉంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఓటీటీకి వస్తుందని భావించినప్పటికీ అలా జరగలేదు. తాజాగా ఓటీటీ రిలీజ్‌పై మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. హనుమాన్ మూవీ ఈనెల 16 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్కు వస్తుందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. ఈ సినిమాను జియో సినిమాలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా కలర్స్ సినీఫ్లెక్స్ ఛానెల్లో మార్చి 16 రాత్రి ఎనిమిది గంటలకు ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. దీంతో బాలీవుడ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే సౌత్ భాషల్లో స్ట్రీమింగ్ ఎప్పుడనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. తెలుగు ఆడియన్స్‌తో పాటు సౌత్ ఫ్యాన్స్ హనుమాన్ ఓటీటీ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. Brahmaand ka sabse pehla SUPERHERO ab aayega aapke TV screens par! 🔥📺 16 March raat 8 baje, dekhiye #HanuMan ka World Television Premiere, Hindi mein pehli baar, Colors Cineplex aur JioCinema par.@tejasajja123 @Actor_Amritha @Primeshowtweets @RKDStudios @Colors_Cineplex… pic.twitter.com/0Uq7qg6Efh — Prasanth Varma (@PrasanthVarma) March 8, 2024 -
టాలీవుడ్ గామా అవార్డ్స్.. హనుమాన్ హీరోకు అవార్డ్..!
తెలుగు సినిమా అవార్డ్స్ వేడుక ఘనంగా నిర్వహించారు. గామా పేరిట అందిస్తున్న అవార్డుల నాలుగో ఎడిషన్ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. దుబాయ్ వేదికగా జరిగిన వేడుకల్లో టాలీవుడ్ సినీ తారలు హాజరై సందడి చేశారు. 2021, 2022, 2023 సంవత్సరాలకు సంబంధించి వివిధ కేటగిరిల్లో ఈ అవార్డులను అందింటారు. ఈ వేడుకల్లో గామా అవార్డ్స్ ఛైర్మన్ కేసరి త్రిమూర్తులుతో పాటు మరికొందరు ముఖ్య అతిథులు విన్నర్స్‌కు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు నేహాశెట్టి, ఫరియా అబ్దుల్లా, డింపుల్ హయాతి, దక్షా నగార్కర్, ఆషికా రంగనాథ్ తమ డ్యాన్స్‌లతో ప్రేక్షకులను అలరించారు. 2021 గామా అవార్డ్ విజేతలు ఉత్తమ నటుడు - అల్లు అర్జున్ (పుష్ప) ఉత్తమ నటి - ఫరియా అబ్దుల్లా (జాతి రత్నాలు) ఉత్తమ దర్శకుడు- సుకుమార్ (పుష్ప) బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ - దక్షా నగర్కర్ (జాంబి రెడ్డి) ఉత్తమ సంగీత దర్శకుడు - దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప) అత్యంత ప్రజాదరణ పొందిన పాట- నీలి నీలి ఆకాశం (అనూప్ రూబెన్స్) ఉత్తమ గాయకుడు- ధనుంజయ్ (నా మది నీదే) ఉత్తమ గాయని - ఎంఎల్ శృతి (అడిగా అడిగా) గామా బెస్ట్ పాపులర్ సాంగ్ - మౌనిక యాదవ్ (సామి నా సామి - పుష్ప) మూవీ ఆఫ్ ది ఇయర్ - పుష్ప (మైత్రి మూవీ మేకర్స్ - యలమంచిలి రవి, నవీన్ యెర్నేని) 2022 గామా అవార్డ్ విజేతలు ఉత్తమ నటుడు - నిఖిల్ (కార్తికేయ 2) ఉత్తమ నటి - మృణాల్ ఠాకూర్ (సీతా రామం) బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్- డింపుల్ హయతి (ఖిలాడి) మూవీ ఆఫ్ ది ఇయర్ - సీతా రామం (వైజయంతి మూవీస్) ఉత్తమ దర్శకుడు - హను రాఘవపూడి (సీతా రామం) గామా జ్యూరీ ఉత్తమ నటుడు - విశ్వక్ సేన్ (అశోక వనంలో అర్జున కళ్యాణం) ఉత్తమ సంగీత దర్శకుడు - ఎస్ఎస్ తమన్ (భీమ్లా నాయక్) ఉత్తమ ఆల్బమ్ - సీతారామం (విశాల్ చంద్రశేఖర్) ఉత్తమ గాయకుడు- అనురాగ్ కులకర్ణి (సిరివెన్నెల... శ్యామ్ సింగరాయ్) ఉత్తమ గాయని - హారిక నారాయణ (లాహే లాహే... ఆచార్య) 2023 గామా అవార్డుల విజేతలు ఉత్తమ నటుడు - ఆనంద్ దేవరకొండ (బేబీ) ఉత్తమ నటి - సంయుక్త (విరూపాక్ష) బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ - ఆషికా రంగనాథ్ (అమిగోస్, నా సామి రంగ) బెస్ట్ ట్రెండింగ్ యాక్టర్ - తేజ సజ్జా (హను-మాన్) మూవీ ఆఫ్ ది ఇయర్- బ్రో (పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ - టీజీ విశ్వప్రసాద్) ఉత్తమ దర్శకుడు - బాబీ (వాల్తేరు వీరయ్య) గామా జ్యూరీ ఉత్తమ నటుడు - సందీప్ కిషన్ (మైఖేల్) ఉత్తమ విలక్షణ నటుడు - మురళీ శర్మ పలు కేటగిరీల్లో అవార్డులు గామా లెజెండ్రీ సంగీత దర్శకుడు - డాక్టర్ కోటి సాలూరి (40 ఇయర్స్ ఆఫ్ మ్యూజికల్ జర్నీ) గామా స్పెషల్ జ్యూరీ అవార్డు - ఎంఎం శ్రీలేఖ (25 ఇయర్స్ ఆఫ్ మ్యూజికల్ జర్నీ) గామా గౌరవ్ సత్కర్ - చంద్రబోస్ (ఆస్కార్ విన్నింగ్ ఇండియన్ లిరిసిస్ట్) ఉత్తమ సంగీత దర్శకుడు - హేషమ్ అబ్దుల్ వాహాబ్ (ఖుషి) ఉత్తమ గేయ రచయిత - కాసర్ల శ్యామ్ (చంకీలా అంగీ లేసి... దసరా సినిమా) అత్యంత ప్రజాదరణ పొందిన పాట - పూనకాలు లోడింగ్ (దేవి శ్రీ ప్రసాద్) గామా మూవీ ఆఫ్ ది డెకేడ్ - ఆర్ఆర్ఆర్ (డీవీవీ దానయ్య నిర్మాణం) గామా మోస్ట్ ట్రెండింగ్ సాంగ్ - నక్కిలీసు గొలుసు (రఘు కుంచె) ఉత్తమ గాయకుడు- రాహుల్ సిప్లిగంజ్ (ధూమ్ దాం - దసరా) ఉత్తమ గాయని - చిన్మయి (ఆరాధ్య - ఖుషి) గామా గద్దర్ మెమోరియల్ అవార్డు - జానపద గాయకుడు ‘నల్లగొండ గద్దర్’ నరసన్న -
ఇది అయ్యే పని కాదు.. ఇప్పట్లో హనుమాన్ లేనట్లేనా?!
సంక్రాంతికి రిలీజైన అన్ని సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి.. ఒక్కటి తప్ప! అవును హనుమాన్ ఒక్కటే ఇంకా ఏ ఓటీటీలోనూ అందుబాటులోకి రాలేదు. గుంటూరు కారం.. నెట్‌ఫ్లిక్స్‌లో, సైంధవ్.. అమెజాన్ ప్రైమ్‌లో, నా సామిరంగ.. హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్నాయి. కానీ హనుమాన్ మాత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వేట కొనసాగిస్తూ ఓటీటీని లైట్ తీసుకుంది. దాదాపు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ మూవీ త్వరలో ఓటీటీలోకి రానుందని కొంతకాలంగా తెగ ప్రచారం జరుగుతోంది. అదిగో రిలీజ్.. ఇదిగో రిలీజ్.. అంటూ ఊరిస్తున్నారే తప్ప నిజంగా ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియని పరిస్థితి! దీంతో ఓ నెటిజన్.. హనుమాన్ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పండి అని ఎక్స్(ట్విటర్)లో మొర పెట్టుకున్నాడు. ఇది చూసిన జీ5.. సదరు ట్వీట్‌కు స్పందించింది. 'హనుమాన్ రిలీజ్ విషయంలో మాకే ఇంతవరకు ఎటువంటి అప్డేట్ లేదు' అని రిప్లై ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కే క్లారిటీ లేనప్పుడు ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారో? ఏంటో? అని నిరాశ చెందుతున్నారు. రేపు రిలీజ్ చేస్తే సినిమా చూస్తూ అర్ధరాత్రి జాగారం చేసేవాళ్లంగా అని కామెంట్లు చేస్తున్నారు. Hi! We have not received any update in this regard. Please keep an eye on our website and social handles for more updates! — ZEE5 (@ZEE5India) March 7, 2024 -
శివరాత్రికి ఓటీటీలో హనుమాన్??
సంక్రాంతి బ్లాక్‌బస్టర్ 'హనుమాన్' ఓటీటీ రిలీజ్ ఫిక్స్ అయిందా? అంటే అవుననే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ ఏడాది పండక్కి థియేటర్లలో విడుదలైన వాటిలో ఈ చిత్రంపై పెద్దగా ఎవరికీ అంచనాల్లేవు. అయితేనేం బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేసిందీ చిత్రం. దాదాపు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు ఈ సినిమానే ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా) తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన సినిమా 'హనుమాన్'. ఓ సాధారణ మనిషికి హనుమంతుడికి ఉండే సూపర్ పవర్స్ వస్తే.. వాటిని ఎలాంటి పనులకు ఉపయోగించాడు. చివరకు ఏమైంది? అనే సింపుల్ కాన్సెప్ట్‌తో సినిమా తీశారు. కానీ హనుమంతుడికి సంబంధించిన సీన్స్, పాటలు.. పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు భలే నచ్చేశాయి. ఈ క్రమంలోనే సూపర్ సక్సెస్ అందుకుంది. ఇకపోతే 'హనుమాన్' డిజిటల్ హక్కుల్ని దక్కించుకున్న జీ5.. తొలుత ఈ సినిమా మూడు నాలుగు వారాల్లోనే ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుంది. కానీ థియేటర్లలో వస్తున్న రెస్పాన్స్ చూసి వాయిదా వేసుకున్నారు. మార్చి 2న ఓటీటీ రిలీజ్ అనుకున్నారు. కానీ అది కూడా మారిపోయింది. శివరాత్రి కానుకగా మార్చి 8 నుంచి స్ట్రీమింగ్ చేయాలని ఫిక్సయ్యారు. రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చేస్తుంది. సంక్రాంతికి థియేటర్లలో 'హనుమాన్' నామస్మరణతో ఊగిపోయాయి. ఇప్పుడు శివరాత్రికి మళ్లీ అదే సీన్ రిపీట్ కానుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఊరు పేరు భైరవకోన'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) Hanuman To premier on @zee5India from March 8th.#Hanuman #Prasanthvarma #tejasajja #varalaxmisarathkumar #amrithaaiyer@PrasanthVarma @tejasajja123 @varusarath5 @Actor_Amritha pic.twitter.com/5WeWlKRFCV — the.cineholic (@the_cine_holic) March 1, 2024 -
హనుమాన్ ఎఫెక్ట్.. రెమ్యునరేషన్ పెంచేసిన తేజ సజ్జ!
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలతో అలరించిన తేజా సజ్జా..ఇప్పుడు హీరోగానూ రాణిస్తున్నాడు. జాంబిరెడ్డి సినిమాతో హీరోగా అందుకున్నాడు తేజ. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని జాంబిరెడ్డి డైరెక్టర్ ప్రశాంత్ వర్మతోనే ‘హను-మాన్’ చేశాడు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలను సైతం వెనక్కి నెట్టి బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. తెలుగులోనే కాదు.. తమిళ్, హిందీ, మలయాళ భాషల్లోనూ ‘హను-మాన్’ మంచి వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.. రికార్డు సృష్టించింది. ఇక హను-మాన్ మూవీ ఊహించిదాని కంటే ఎక్కువ విజయం సాధించడంతో అటు ప్రశాంత్ వర్మ.. ఇటు తేజ సజ్జ ఫుల్ జోష్‌లో ఉన్నారు. పలువురు బడా నిర్మాతలు ప్రశాంత్ వర్మకు అడ్వాన్స్‌లు ఇచ్చేస్తున్నారు. పారితోషికం కూడా భారీగా ఇస్తామని చెబుతున్నారు. మరోవైపు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్లుగా తేజ సజ్జ కూడా తన రెమ్యునరేషన్‌ని పెంచేశాడట. పారితోషికం అమాంతం పెంచేసిన తేజ సాధారణంగా హిట్ రాగానే హీరోలు తమ పారితోషికాన్ని కొంచెం కొంచెం పెంచేస్తారు. ఇక హను-మాన్ లాంటి భారీ హిట్ వస్తే మాత్రం దాన్ని డబుల్ చేస్తారు. ఇప్పుడు తేజ సజ్జ అదే చేశాడట. హను-మాన్ రిలీజ్ తర్వాత తేజతో సినిమా చేయడానికి పలువురు బడా నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కొంతమంది అడ్వాన్స్‌లు కూడా ఇచ్చారట. హిందీ నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయట. దీంతో తేజ తన పారితోషికాన్ని అమాంతం పెంచేశాడట. హను-మాన్ కోసం రూ. కోటి రెమ్యునరేషన్‌గా తీసుకున్న తేజ.. ఇప్పుడు రూ. 5 కోట్ల డిమాండ్ చేస్తున్నాడట. మరో హిట్ వస్తేనే.. హను-మాన్‌తో తేజ సజ్జ స్థాయి పెరిగింది.అందులో అనుమానమే లేదు. అయితే ఈ చిత్రం ద్వారా తేజ కంటే ఎక్కువగా ప్రశాంత్ వర్మకు పేరొచ్చింది. అతని పని తీరు పట్ల విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. కథను అద్భుతంగా తీర్చి దిద్దాడని మెచ్చుకున్నారు. ఈ చిత్రం అతని కెరీర్‌కు బాగా ప్లస్ అయింది. తేజ సజ్జని ఈ మూవీ పాన్ ఇండియా స్టార్‌గా మార్చింది. ఈ ఎఫెక్ట్ కచ్చితంగా తన తదుపరి సినిమాలపై ఉంటుంది. అతని నుంచి వచ్చే సినిమాలో ఏదో వైవిధ్యం ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. వారి అంచనాలకు తగ్గట్లుగా తేజ సజ్జ కథలను ఎంచుకోకపోతే కెరీర్‌కే ముప్పు వస్తుంది. రాబోయే సినిమా హిట్ అయితే తేజ సజ్జ కెరీర్‌కు కొన్నాళ్ల పాటు ఢోకా ఉండదు. ప్రస్తుతం తేజ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పై కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత బెజవాడ ప్రసన్న-నక్కిన త్రినాధరావు కాంబినేషన్లో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. -
ఓటీటీలోకి 'హనుమాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఈసారి సంక్రాంతికి తెలుగులో నాలుగు సినిమాలు రిలీజైతే 'హనుమాన్' మాత్రమే బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే పలు థియేటర్లలో ఇంకా ఈ మూవీ రన్ అవుతూనే ఉంది. జనాలు చూడటానికి వెళ్తూనే ఉన్నారు. తాజాగా టికెట్ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీన్నిబట్టి చూస్తే థియేట్రికల్ రన్ చివరకొచ్చేసినట్లు తెలుస్తోంది. సరిగ్గా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ బయటకొచ్చింది. (ఇదీ చదవండి: హనుమాన్ మూవీ.. భారీ ఆఫర్ ప్రకటించిన మేకర్స్!) తేజ సజ్జా హీరోగా నటించిన 'హనుమాన్' సినిమా ఎప్పుడో థియేటర్లలోకి రావాల్సింది. కానీ గ్రాఫిక్స్ పనుల వల్ల ఆలస్యమవుతూ ఈ సంక్రాంతికి రిలీజైంది. అయితే మహేశ్, వెంకటేశ్, నాగార్జున సినిమాలు ఇదే టైంకి విడుదలకు రెడీ అయ్యాయని.. 'హనుమాన్'ని వాయిదా వేసుకోవాలని బెదిరించారు. కానీ తగ్గకుండా బరిలో నిలిబడ్డారు. పండగ విజేతగా నిలిచారు. (ఇదీ చదవండి: Hanu Man Movie Review: ‘హను-మాన్’ మూవీ రివ్యూ) 'హనుమాన్' చిత్ర డిజిటల్ హక్కుల్ని దక్కించుకున్న జీ5 సంస్థ.. తొలుత 3-4 వారాల గ్యాప్‌లోనే ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణ దృష్ట్యా డిజిటల్ స్ట్రీమింగ్‌ని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు థియేట్రికల్ రన్ చివరకొచ్చేయడంతో ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మార్చి 2 నుంచి అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. త్వరలో దీనిపై క్లారిటీ రానుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అవార్డు విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
హనుమాన్ మూవీ.. భారీ ఆఫర్ ప్రకటించిన మేకర్స్!
ఈ ఏడాది సంక్రాంతికి సందడి చేసిన సినిమాల్లో హనుమాన్ ఒకటి. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తేజ సజ్జా కీలక పాత్రలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం నెల రోజుల పూర్తయ్యాక కూడా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా ఆడియన్స్‌కు మరింత మందికి అందుబాటులోకి తెచ్చేందుకు టికెట్స్ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. నైజాంలోని థియేటర్స్‌లో హను-మాన్ టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో టికెట్ ధర రూ.175లుగా ఉంది. ఈ టికెట్స్ ఇకపై రూ.100 కే లభించనున్నాయి. అలాగే మల్టీప్లెక్స్‌లలో రూ.295గా ఉన్న టికెట్ ధరను ఏకంగా రూ.150 కి తగ్గించారు. అయితే ఈ ధరలు ఫిబ్రవరి 16 నుంచి 23 వరకు అందుబాటులో ఉంటాయని మేకర్స్ తెలిపారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కోసమే ఈ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. The #HanuManRAMpage is not over yet❤️🔥 Celebrate the #HanuMania at the most affordable & Lowest prices in the Nizam Area since the release💥 Book your tickets now! - https://t.co/nM6rXb7n54#HanuMan 🔥 Nizam Release by @MythriOfficial A @PrasanthVarma film 🌟ing @tejasajja123… pic.twitter.com/wV0cWFvAA6 — Prasanth Varma (@PrasanthVarma) February 16, 2024 -
బిగ్గెస్ట్ మార్క్‌కు చేరుకున్న 'హనుమాన్' కలెక్షన్స్
తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, అమృతా అయ్యర్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. విడుదలైన తొలి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది హనుమాన్ మూవీ. కేవలం రూ. 50 కోట్ల బడ్జెట్‌తో అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. హనుమాన్ మూవీకి బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ఎప్పుడో సాధించేసింది. తాజాగా ఇప్పటి వరకు హనుమాన్ చిత్రానికి వచ్చిన కలెక్షన్స్ వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.. కేవలం 25 రోజుల్లో రూ. 300 కోట్లు రాబట్టి ఇండియన్ సినిమా హిస్టరీలోనే రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికి హనుమాన్ సినిమా కలెక్షన్లు భారీగానే కొనసాగుతున్నాయి. ఈ స్పీడ్ చూస్తుంటే మరో రూ. 50 కోట్లు రాబట్టవచ్చని సినీ ట్రేడర్స్ అంచనా వేస్తున్నారు. మరోవైపు సంక్రాంతి సమయంలో విడుదలైన చిత్రాల్లో ఇప్పటి వరకు అత్యధికంగా కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా హనుమాన్ రికార్డులకెక్కింది. 92ఏళ్ళ సినీ చరిత్రలో.. ఎన్నో బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ సంక్రాంతికి వచ్చాయి. ఆ చిత్రాలు అన్నిటిని హనుమాన్ బీట్ చేసింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'జై హనుమాన్' రానుంది. కొన్ని రోజుల క్రితమే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయినట్లు ప్రశాంత్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని ప్రధాన పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోను తీసుకునే ఆలోచనలో ఉన్నారు దర్శకుడు. 'ఆన్‌స్క్రీన్‌తో పాటు, ఆఫ్ స్క్రీన్‌లోనూ వారి ఇమేజ్ సరిపోవాలి. చూడగానే భక్తితో నమస్కారం చేయాలన్న భావన కలగాలి. ఆ జాబితాలో చిరంజీవి సర్ కూడా ఉండొచ్చు.' అని ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ చెప్పారు. రాముడిగా మహేశ్‌బాబు అయితే సరిపోతారని ఆయన అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో ఆయన్ను రాముడిగా క్రియేట్ చేసిన ఫొటోలను చూశానని, తమ ఆఫీస్‌లో కూడా రాముడి పాత్రను మహేశ్ ముఖంతో రీక్రియేట్ చేసి చూసినట్లు ఆయన తెలిపారు. పార్ట్ 1లో నటించిన తేజ కూడా పార్ట్ 2లో కనిపిస్తారని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Prasanth Varma (@prasanthvarmaofficial) -
'హనుమాన్' కోసం 70-75 సినిమాలు రిజెక్ట్ చేశా: హీరో తేజ
సంక్రాంతికి థియేటర్లలో రిలీజైన సినిమాల్లో 'హనుమాన్' అల్టిమేట్ విన్నర్‌గా నిలిచింది. ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తూ కలెక్షన్స్ సాధిస్తూ ఆకట్టుకుంటోంది. ఈ మూవీ చేయడానికి ముందు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి గానీ హీరో తేజ సజ్జా గురించి తెలుగులోనే పెద్దగా తెలియదు. అలాంటిది ఈ చిత్రం.. పాన్ ఇండియా రేంజులో సక్సెస్ కావడంతో వీళ్లకు ఊహించనంత ఫేమ్ వచ్చింది. ఈ క్రమంలోనే హీరో తేజ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టాడు. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన తేజ.. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ తదితర హీరోల చిత్రాల్లో చిన్నప్పటి పాత్రలు చేశాడు. అలా పెరిగి పెద్దయిన తర్వాత 'ఓ బేబీ', 'జాంబీ రెడ్డి', 'అద్భుతం' లాంటి చిత్రాలతో హీరోగా చేశాడు. అయితే హీరోగా ప్రయత్నించినప్పటికీ పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. కానీ 'హనుమాన్' దెబ్బకు దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు. అయితే ఈ సినిమా చేస్తున్న క్రమంలోనే దాదాపు 70-75కి పైగా ప్రాజెక్టుల్ని రిజెక్ట్ చేశానని తేజ చెప్పుకొచ్చాడు. ''హనుమాన్' మూవీ చేస్తున్న సమయంలోనే దాదాపు 70-75 సినిమాల్ని రిజెక్ట్ చేశారు. వీటిలో దాదాపు 15 స్టోరీల్ని సినిమాలుగా చేయొచ్చు. కానీ హనుమాన్'కి పూర్తిస్థాయిలో కమిట్మెంట్ ఇవ్వాల్సి రావడంతో వాటిని వదులుకోవాల్సి వచ్చింది' అని తేజ సజ్జా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తేజ ఓ మల్టీస్టారర్‌లో నటించినట్లు సమాచారం. కానీ దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే లేదు. -
హనుమాన్ దెబ్బకు రికార్డులన్నీ ఉఫ్..
-
తేజ సజ్జతో రవితేజ స్పెషల్ ఇంటర్వ్యూ
-
రవితేజ వల్ల మాలాంటి వారికి ఇబ్బందులు: తేజ సజ్జా కామెంట్స్ వైరల్!
ఈ ఏడాది సంక్రాంతికి హనుమాన్తో సూపర్ కొట్టిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. పెద్ద సినిమాలతో పోటీపడి మరీ సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది ఈ చిత్రం. ఈ సినిమాలో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించారు. జనవరి 12న థియేటర్లలో రిలీజైన బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. మహేశ్‌బాబు- గుంటూరు కారం, వెంకటేష్- సైంధవ్, నాగార్జున- నా సామిరంగా చిత్రాలతో పోటీపడి నిలిచింది. అయితే ప్రస్తుతం ఈగల్ సినిమాతో ప్రేక్షకులను పలరించేందుకు వస్తోన్న మాస్ మహారాజా రవితేజ.. తేజ సజ్జాతో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా హనుమాన్ హీరో తేజ సజ్జా ఆయనకు పలు ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించారు. వీరిద్దరి మధ్య జరిగిన ఓ ఫన్నీ సమస్యను గురించి ప్రస్తావించారు. రవితేజ వల్ల ఇండస్ట్రీలోకి వస్తున్న కొత్త హీరోలు చాలా ఇబ్బందులు పడుతున్నారంటూ చెప్పి షాకిచ్చాడు తేజ సజ్జా. (ఇది చదవండి: దేవర భామకు బిగ్ ఛాన్స్.. ఏకంగా రూ.500 కోట్ల సినిమాలో!) మీరు చేసే ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఎందుకు ఉంటున్నారు? అంటూ రవితేజను తేజ సజ్జా ప్రశ్నించారు. టైగర్, రావణాసుర సినిమాల్లో అలాగే ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. అందువల్ల మాలాంటి యంగ్ హీరోలకు చాలా ప్రాబ్లమ్ అవుతోంది. మీరు చేసే సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉంటున్నారు. మీరు ఏడాదికి మూడు చిత్రాలు చేస్తున్నారు. దాదాపు 12మందిని ఆడిషన్స్ చేస్తారు. దీంతో ఎవరినీ అడిగినా.. మేం రవితేజతో సినిమా చేస్తున్నాం. ఆ తర్వాతనే చేస్తామని చెబుతున్నారు. మీరు ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్‌ను తీసుకోవడం వల్ల మాలాంటి యువ హీరోలు ఇబ్బందులు పడుతున్నారు' అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు తేజ సజ్జా. కాగా.. రవితేజ నటించిన ఈగల్ కావ్య తాపర్, అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉండగా.. పోటీ పెరగడంతో పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఫిబ్రవరి 9న విడుదలవుతోన్న ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. -
వాళ్ళ వల్లే ఈ సినిమా హిట్ అయ్యింది..పాదాభివందనం
-
హనుమాన్ నా బాధ్యత పెంచింది
‘‘హనుమాన్’ సినిమా విజయానికి కారణమైన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీ అందరి రుణం ‘జై హనుమాన్’ సినిమాతో తీర్చుకోబోతున్నాను. ‘హనుమాన్’కి వంద రెట్లు ఎక్కువగా ‘జై హనుమాన్’ ఉంటుంది’’ అని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అన్నారు. తేజ సజ్జా, అమృతా అయ్యర్ జంటగా వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకుడు. చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా జనవరి 12న విడుదలైంది. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ–‘‘హనుమాన్’కి వచ్చిన స్పందన చూసిన తర్వాత నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇది నాపై ఇంకా బాధ్యత పెంచింది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్‌కి వచ్చే చిత్రాలను బాధ్యతగా తీస్తాను’’ అన్నారు. ‘‘మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు పాదాభివందనం’’ అన్నారు తేజ. ‘‘హనుమాన్’ని హిట్ చేసిన ఆడియన్స్‌కి థ్యాంక్స్’’ అన్నారు నిరంజన్ రెడ్డి. -
కలిసొచ్చిన రిపబ్లిక్ డే.. రికార్డు సాధించిన హనుమాన్
అటు అయోధ్య రామమందిర ప్రారంభం ఎంత ఘనంగా జరిగిందో ఇటు హనుమాన్ కలెక్షన్స్ అంత భారీగా రాబడుతోంది. అక్కడ రాముడు పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ హనుమాన్ కోట్లాది రూపాయల వసూళ్లు రాబడుతున్నాడు. మొత్తానికి ఈ సినిమా సంక్రాంతి విజేతగా నిలిచింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ కళాఖండంలో తేజ సజ్జ హీరోగా నటించాడు. హనుమాన్ ప్రభంజనం.. ఇప్పటికే రెండు వందల కోట్ల క్లబ్బులో చేరి ఈ మూవీ అందరినీ ఆశ్చర్యపరిచింది. నిన్న గణతంత్ర దినోత్సవం కావడంతో వసూళ్ల సంఖ్య మరింత పెరిగింది. తాజాగా ఈ చిత్రం మరో రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లు కొల్లగొట్టింది. ఈ మేరకు చిత్రయూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ కేవలం 15 రోజుల్లోనే ఈ అరుదైన ఘనత సాధించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ చేతిలో 12 కథలు ఇక హనుమాన్ సినిమాకు సీక్వెల్‌గా జై హనుమాన్ ఉంటుందని దర్శకుడు ప్రకటించిన విషయం తెలిసిందే! ఇది భారీ బడ్జెట్‌తో పెద్ద ఎత్తున ఉండబోతుందని తెలిపాడు. సౌత్, బాలీవుడ్ హీరోలు కూడా ఇందులో ఉంటారని చెప్పాడు. ఈ ఒక్కటే కాదు తన దగ్గర మొత్తం 12 కథలు ఉన్నాయన్నాడు. మరి ఆ సినిమాలతో ప్రశాంత్ వర్మ ఇంకా ఎన్ని అద్భుతాలు చేస్తాడో చూడాలి! చదవండి: వచ్చే జన్మలో పూర్ణ కడుపున పుడతానన్న దర్శకుడు.. నటి ఎమోషనల్ -
చిరు భాయ్‌కి హృదయపూర్వక అభినందనలు: మెగాస్టార్ ట్వీట్ వైరల్
టాలీవుడ్ మెగాస్టార్‌ను దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం వరించింది. గణతంత్రం దినోత్సవం సందర్భంగా కేంద్ర చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించి సత్కరించింది. ఈ ఘనత దక్కడం పట్ల మెగాస్టార్ ఎమోషనలయ్యారు. ఈ ఘనత దక్కడానికి కారణం మీరేనంటూ అభిమానులను ఉద్దేశించి వీడియో రిలీజ్ చేశారు. మెగాస్టార్‌కు అత్యున్నత గౌరవం దక్కడం పట్ల పలువురు సినీ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. ట్విటర్ వేదికగా సినీ ప్రముఖులు మెగాస్టార్‌ను అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి చిరంజీవికి కంగ్రాట్స్ చెప్పారు. పద్మవిభూషణ్‌కు ఎంపికైనందుకు ప్రియమైన చిరు భాయ్‌కి హృదయపూర్వక అభినందనలు అంటూ పోస్ట్ చేశారు. అంతే కాకుండా టాలీవుడ్ హీరోలు నాని, కిరణ్ అబ్బవరం, తేజా సజ్జా, నటుడు సత్యదేవ్, అడివి శేష్, బింబిసార డైరెక్టర్ వశిష్ఠ, నటి ఖుష్బు సుందర్, రాధిక శరత్‌కుమార్ ట్విటర్ ద్వారా మెగాస్టార్‌కు కంగ్రాట్స్ తెలియజేశారు. Congratulations to #Megastar @KChiruTweets on being honoured with the #PadmaVibhushan , a great honour bringing great pride to #TeluguCinema and to his people who love him. Hard work never fails🙏 pic.twitter.com/2l4SEPFIII — Radikaa Sarathkumar (@realradikaa) January 25, 2024 Hearty congratulations, Dear Chiru Bhai, for being conferred with the Padma Vibhushan.@KChiruTweets — Mammootty (@mammukka) January 25, 2024 Congratulations sir ❤️❤️ You are always an Inspiration 😊#PadmaVibhushanChiranjeevi #Megastar https://t.co/41qCnAkw2K — Kiran Abbavaram (@Kiran_Abbavaram) January 25, 2024 Many congratulations to you, Sir @KChiruTweets Gaaru, on the honor bestowed upon you. You rightly deserve it. Your contribution to cinema, the world of art, your philanthropic lifestyle, your good work for the public and the blessings of your elders brings you this. As a friend,… https://t.co/DXKj4RgZw7 — KhushbuSundar (@khushsundar) January 26, 2024 Good morning Padma Vibhushan Chiranjeevi gaaru :) ♥️@KChiruTweets 🙏🏼 — Hi Nani (@NameisNani) January 26, 2024 Telugu vadi Garva Karanam Mega 🌟 Padma Vibhushan@KChiruTweets garu #MegastarChiranjeevi Garu — Teja Sajja (@tejasajja123) January 25, 2024 Congratulations Annaya @KChiruTweets on being recipient to the second highest civilian award #PadmaVibhushan Much Deserving Honour for your inspiring legacy & contribution. Thank you for holding cinema high at every instance. ❤️ pic.twitter.com/SvqDpnCBfI — Satya Dev (@ActorSatyaDev) January 25, 2024 My favorite picture I have of us sir @KChiruTweets ❤️ Thank you for always being kind and warm to me. Thank you for the amazing films. Thank you for the brilliant performances. Thank you for being our MEGASTAR. You are now a #PadmaVibhushan Sir. A proud moment for us, for TFI… pic.twitter.com/Wa7Q9x6V4P — Adivi Sesh (@AdiviSesh) January 26, 2024 Congratulations to our BOSS @KChiruTweets Garu on being felicitated with the honorary award #PadmaVibhushan ❤️ Thank you for making us all proud yet again and again. pic.twitter.com/pW5LEbVtuo — Vassishta (@DirVassishta) January 25, 2024 -
హను–మాన్లో అదే పెద్ద సవాల్
ఆంజనేయుడు భూమి నుంచి ఆకాశానికి ఎదిగే సీన్ ‘హను–మాన్’లో మేజర్ హైలైట్. క్లైమాక్స్‌లో వచ్చే ఈ సీన్ ప్రేక్షకుల ఒళ్లు పులకరించేలా చేస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్‌తో మేజిక్ చేసిన ఇలాంటి సన్నివేశాలు ఈ చిత్రంలో చాలానే ఉన్నాయి. అయితే క్లైమాక్స్‌లో భూమ్యాకాశాలకు విస్తరించే హనుమాన్కు జీవం పోయడం ఈ చిత్రం పరంగా తాను ఫేస్ చేసిన పెద్ద సవాల్ అంటున్నారు వీఎఫ్ఎక్స్ నిపుణుడు ఉదయ్ కృష్ణ. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో శ్రీమతి చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘హను–మాన్’. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ఇప్పటికి రూ. 200 కోట్ల గ్రాస్‌ని రాబట్టింది. ఈ చిత్రానికి వీఎఫ్ఎక్స్ చేసిన ఉదయ్ కృష్ణ మాట్లాడుతూ – ‘‘విజువల్ ఎఫెక్ట్స్‌లో దాదాపు 25 ఏళ్ల అనుభవం ఉన్న నాకు ‘హను–మాన్’ చిత్రం చేసే చాన్స్ రావడం పూర్వజన్మ సుకృతం. వీఎఫ్ఎక్స్ని అద్భుతంగా వినియోగించుకునే ప్రతిభ ప్రశాంత్ వర్మలో ఉంది. ఎన్నో ప్రతికూలతలు, పరిమిత వనరులతో ఈ సినిమా చేశాం. ఈ సినిమా విజయం మా కష్టం మరచిపోయేలా చేసింది. వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌లో ఓ సంస్థను నెలకొల్పాలన్న నా కలను ‘బీస్ట్ బెల్స్’తో నెరవేర్చుకుంటున్నాను’’ అన్నారు. ‘బాహుబలి’కి సంబంధించిన కొంత వీఎఫ్ఎక్స్ వర్క్ చేశానని, హిందీలో ‘జోథా అక్బర్’, ‘పద్మావత్’ వంటి చిత్రాలు, త్రీడీ యానిమేషన్ ఫిల్మ్ ‘అర్జున్: ది వారియర్ ప్రిన్స్’, పూర్తి స్థాయి వీఎఫ్ఎక్స్ మూవీ ‘అల్లాదీన్’ వంటివి చేశానని ఉదయ్‌కృష్ణ తెలిపారు. -
హనుమాన్ సీక్వెల్లో ఆంజనేయుడిగా స్టార్ హీరో: ప్రశాంత్ వర్మ
హనుమాన్ సినిమా హిట్‌తో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు ట్రెండింగ్‌లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకుపైగా కలెక్షన్లతో దూసుకెళ్తోంది ఈ చిత్రం. హనుమాన్ విజయంతో దానికి సీక్వెల్‌గా జై హనుమాన్ చిత్రం ఉంటుందని ఇప్పటికే ఆయన ప్రకటించాడు. జై హనుమాన్ చిత్రాన్ని ఉద్దేశించి తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. సీక్వెల్లో తేజ హీరో కాదని ఆయన తేల్చి చెప్పారు. సూపర్ హీరో కథలకు ఇతిహాసాలలోని దేవుళ్లకు ముడిపెట్టి తెరకెక్కించేందుకు తన వద్ద 12 కథలు ఉన్నాయని ప్రశాంత్ వర్మ చెప్పిన విషయం తెలసిందేజ ఈ క్రమంలో వచ్చిన చిత్రమే 'హను-మాన్'. దీనికి రానున్న సీక్వెల్ హను-మాన్ కంటే వందరెట్లు భారీ స్థాయిలో 'జై హనుమాన్' ఉంటుందని ఆయన తెలిపారు. కానీ సీక్వెల్లో తేజ సజ్జా హీరో కాదు.. కానీ, అందులో హనుమంతు పాత్రలో మాత్రమే కనిపిస్తాడని చెప్పాడు. సీక్వెల్లో హీరో ఆంజనేయ స్వామి అని ఆ పాత్రలో ఒక స్టార్ హీరో కనిపిస్తారని ఆయన పేర్కొన్నాడు. జై హనుమాన్ చిత్రం 2025లో కచ్చితంగా విడుదల చేస్తామని ప్రశాంత్ తెలిపాడు. ఈలోపు తను డైరెక్ట్ చేసిన అధీర,మహాకాళీ విడుదల అవుతాయని క్లారిటీ ఇచ్చాడు. హనుమాన్ సీక్వెల్లో రామ్ చరణ్ నటించనున్నాడని ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి. మరికొన్ని రోజుల్లో ఆ స్టార్ హీరో ఎవరో క్లారిటీ రానుంది. -
హనుమాన్ చిత్రానికి జీవం పోసిన ఉదయ్ కృష్ణ
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా వండర్స్ క్రియేట్ చేస్తోంది. తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా వచ్చిన ఈ సినిమా తాజాగా రూ. 200 కోట్ల క్లబ్లో చేరిపోయింది. హనుమాన్‌లో హాలీవుడ్ రేంజ్ వీఎఫ్ఎక్స్, గ్రాండ్ స్క్రీన్ వర్క్స్ విజువల్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా హనుమాన్ భారీ విగ్రహాన్ని చూసిన ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అందులోని విజువల్స్ అన్నీ అబ్బురపరిచేలా ఉన్నాయి. హనుమాన్ అద్భుతాల వెనుక గ్రాఫిక్స్ మాంత్రికుడు ఉదయ్ కృష్ణ శ్రమ గురించి ఎంత చెప్పినా తక్కువే.. విజువల్ ఎఫెక్ట్స్ రంగంతో రెండున్నర దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం కలిగి ఉన్న ఆయన హనుమాన్ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడుగా పనిచేసే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఆయన ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. భారత చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే "హనుమాన్" చిత్రానికి పని చేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఉదయ్ చెబుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా వినియోగించుకోవడంలో విజనరీగా పేరొందిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సరసన సగర్వంగా నిలిచేంత సత్తా ప్రశాంత్ వర్మలో ఉందని ఆయన పేర్కొన్నారు. తేజ సజ్జా టైటిల్ పాత్రలో ప్రైమ్ షో ఎంటర్త్సైన్మెంట్ పతాకంపై కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన "హనుమాన్" జనవరి 12న విడుదలై విజయ దుందుభి మ్రోగిస్తోంది. సినిమా విడుదలకు ముందే టీజర్ విజువల్స్ చూసిన ప్రేక్షకుల్లో హనుమాన్ చిత్రంపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ప్రశాంత్ వర్మ స్వయంగా సమకూర్చిన కథ - కథనాలకు ఉదయ్ కృష్ణ సారధ్యంలో అద్దిన గ్రాఫిక్స్ జత కలవడంతో "హనుమాన్" చిత్రం అత్యద్భుతంగా రూపొందింది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇప్పటికే విడుదల చేయగా... మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ లాంగ్వేజిస్లోనూ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రెండేళ్లుగా తన జీవితంలో అంతర్భాగంగా మారిపోయిన "హనుమాన్" సాధిస్తున్న సంచలన విజయం... ఈ చిత్రం కోసం తాను పడిన కష్టమంతా మరిచిపోయేలా చేస్తోందని ఉదయ్ అంటున్నారు. ప్రతికూలతలు, పరిమిత వనరుల నడుమ ప్రతిభను చాటడంలో పేరెన్నికగన్న ఉదయ్ ప్రస్తుతం "బీస్ట్ బెల్స్" పేరుతో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన విజువల్ ఎఫెక్ట్స్ సంస్థను హైదరాబాద్‌లోనే నెలకొలిపే సన్నాహాల్లో ఉన్నారు. సినిమా ముగింపులో భూమ్యాకాశాలకు విస్తరించే హనుమాన్కు ఆయన జీవం పోయడం ఈ చిత్రం కోసం తాను ఫేస్ చేసిన అతి పెద్ద ఛాలెంజస్లలో ముఖ్యమైనదని చెబుతున్న ఉదయ్... మన తెలుగు దర్శకులు కలలుగనే ఎంత గొప్ప విజువల్ అయినా... సునాయాసంగా సాకారం చేసే సామర్ధ్యం తనుకుందని సవినయంగా చెబుతున్నారు. -
'హనుమాన్' కలెక్షన్స్.. తొలి భారతీయ సినిమాగా రికార్డు
శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సం, బాలరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇదే సమయంలో టాలీవుడ్లో విడుదలైన హనుమాన్ చిత్రం ఖాతాలో భారీ రికార్డ్ చేరింది. చిన్న సినిమాగా విడుదల అయిన ఈ చిత్రం నేడు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తుంది. సంక్రాంతి కానుకగా కేవలం రూ. 50 కోట్లతో తెరకెక్కిన హనుమాన్ చిత్రం ఎవరూ ఊహించని వసూళ్లు సాధిస్తోంది. 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు చిత్ర మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2024లో రూ.200 కోట్ల మార్క్ అందుకున్న తొలి భారతీయ సినిమాగా హను- మాన్ రికార్డు కొట్టింది. ముఖ్యంగా ఈ సినిమా బాలీవుడ్లో దుమ్మురేపింది. నార్త్ ఇండియాలో ఎక్కడ చూసినా కూడా అయోధ్య రాముడు, హనుమాన్ ఈ రెండే పేర్లు మారుమ్రోగుతున్నాయి. ఒక టికెట్ కొంటే ఇంకొకటి ఉచితం నేడు (జనవరి 22) అయోధ్యలో రామ మందింరం ప్రారంభోత్సవం సందర్భంగా యూఎస్ఏలో (USA) పలు ప్రాంతాల్లో ఎంపిక చేసిన స్క్రీన్స్‌లలో సగం ధరకే టికెట్ విక్రయిస్తున్నట్లు మూవీ టీమ్ తెలిపింది. అంతే కాకుండా ఇండియాలో కూడా మిరాజ్ సినిమాస్ యాజమాన్యం బంపర్ ఆఫర్ ప్రకటించింది. నేడు ఒక్కరోజు హనుమాన్ సినిమాకు 'బై వన్ గెట్ వన్'(ఒకటి కొంటే ఇంకొకటి ఉచితం) ఆఫర్ ఇస్తున్నట్లు ప్రకటించింది. బుక్ మైషోలో 'MIRAJBOGO' అనే కోడ్ ఉపయోగించి ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చని తెలిపింది. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన హనుమాన్ చిత్రంలో తేజ సజ్జా హీరోగా, అమృత అయ్యార్ హీరోయిన్గా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్‌తో పాటు సముద్రఖని, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ వంటి తదితురులు కీలక పాత్ర పోషించారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. నైజాం ఏరియాలో మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని పంపిణీ చేశారు. जय श्री राम 🙏 With the divine blessings of Lord Shree Ram, #HanuManRAMpage continues to soar higher at the Box-office ❤️🔥 2️⃣0️⃣0️⃣ CRORE WORLDWIDE collections for #HANUMAN in just 10 Days 🔥💥 Nizam Release by @MythriOfficial ❤️🔥 A @PrasanthVarma film 🌟ing @tejasajja123… pic.twitter.com/S1gjf0RKYr — Mythri Movie Makers (@MythriOfficial) January 22, 2024 -
ఆర్సి పురం పటాన్చెరులో ఆసియా వైష్ణవి మల్టీప్లెక్స్ లాంచ్ చేసిన హీరో
-
అయోధ్య రామ మందిరానికి 'హనుమాన్' టీమ్ భారీ విరాళం
శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సం, బాలరాముని ప్రాణప్రతిష్టకు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. నేడు ఆ మధుర క్షణాలు ఆస్వాధించేందుకు భారత్ మొత్తం ఎదురుచూస్తుంది. ఇదే సమయంలో టాలీవుడ్లో విడుదలైన హనుమాన్ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. చిన్న సినిమాగా విడుదల అయిన ఈ చిత్రం నేడు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తుంది. రామమందిర ప్రారంభోత్సవ వేళ 'హను-మాన్' టీమ్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. ఈ సినిమా ప్రతి టికెట్‌పై రూ.5 అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇవ్వనుందని ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా టైటిల్ రోల్లో ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. మేకర్స్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో పేర్కొన్నట్లుగా, వారు అయోధ్య రామమందిరానికి ఒక్కో టికెట్ నుంచి రూ. 5 రామమందిరానికి కేటాయించారు. సినిమా ప్రీమియర్ షోల నుంచి విక్రయించిన 2,97,162 టిక్కెట్లకు గాను రూ.14,85,810 చెక్కును ఇప్పటికే అందించారు. ఆ తర్వాత నేటి వరకు విక్రయించిన 53,28,211 టిక్కెట్ల నుంచి రూ.2,66,41,055 అందిస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ రూ. 150 కోట్ల మార్కును క్రాస్ చేసి రూ. 200 కోట్ల వైపు దూసుకుపోతుంది. గూస్బంప్స్ వచ్చాయి: నాగా చైతన్య హనుమాన్ చిత్రం విడుదలకు ముందే మెగాస్టార్ చిరంజీవి మెచ్చుకున్నారు. ఆపై బాలకృష్ణ కూడా అభినందించారు. సమంత కూడా సినిమా బాగుందంటూ ఆ చిత్ర మేకర్స్‌ను మెచ్చుకున్నారు. తాజాగా హీరో నాగచైతన్య మనుమాన్ చిత్రాన్ని చూశారు. చిత్ర యూనిట్‌ను అభినందిస్తూ తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ పెట్టారు. హనుమాన్ కథతో పాటు తెరపైకి తీసుకువచ్చిన తీరు చాలా అద్భుతం అని డైరెక్టర్ ప్రశాంత్ వర్మను అభినందించారు. హనుమంతుగా తేజ సజ్జా అదరగొట్టేశారు. సినిమా చూస్తున్నంతసేపు గూస్బంప్స్ వచ్చాయని నాగ చైతన్య తెలుపుతూ టీమ్ మొత్తానికి అభినందనలు తెలిపారు. View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
ప్రభాస్, చరణ్ రికార్డు బద్దలు..కొట్టిన తేజ..
-
సినిమాకు అదే ప్రాణం.. హనుమాన్‌పై సమంత రివ్యూ..
సంక్రాంతి కానుకగా రిలీజైన హను-మాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలిచింది. పాన్ ఇండియా మూవీగా రిలీజైన ఈ చిత్రం తెలుగు, హిందీలో అద్భుతమైన వసూళ్లు రాబడుతోంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జాకు లెక్కలేనన్ని ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా స్టార్ హీరోయిన్ సమంత హనుమాన్‌పై రివ్యూ ఇచ్చింది. 'మనల్ని మళ్లీ బాల్యంలోకి తీసుకెళ్లగలిగే చిత్రాలు ఎంతో ఉత్తమమైనవి. హనుమాన్‌లో విజువల్స్, కామెడీ, మ్యాజిక్, మ్యూజిక్.. అన్నీ ఎంతో బాగున్నాయి. థాంక్యూ ప్రశాంత్ వర్మ.. నీ యూనివర్స్ నుంచి రాబోయే నెక్స్ట్ సినిమాల కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. తేజ సజ్జా.. నీ యాక్టింగ్‌తో నన్ను ఆశ్చర్యపోయేలా చేశావు. నీ కామిక్ టైమింగ్, నీ అమాయకత్వం, నీ నటన.. హనుమంతుగా నువ్వు చేసిన అద్భుతమైన నటన సినిమాకు ఆయువుపట్టుగా నిలిచింది. సంగీతం, వీఎఫ్ఎక్స్ ఈ సినిమాను మరింత అందంగా మలిచాయి. సినిమా చూసేకొద్దీ చూడాలనిపించేలా చేశాయి. ఇందులో నటించి హిట్ అందుకున్న వరలక్ష్మీ శరత్‌కుమార్, వినయ్రాయ్లకు శుభాకాంక్షలు' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. చదవండి: ఓటీటీలో మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ.. తెలుగులోనూ చూడొచ్చు! -
Teja Sajja Rare Unseen Photos: వంద కోట్ల సినిమా హనుమాన్ హీరో తేజ సజ్జ.. రేర్ ఫొటోలు
-
రూ.100 కోట్ల వసూళ్లు దాటేసిన 'హనుమాన్'.. ఆ విషయమైతే చాలా స్పెషల్
చిన్న సినిమా అన్నారు. అలానే న్యాయం జరుగుతుందని చెప్పారు. దీనికి తోడు సరిపడా థియేటర్లు దొరకలేదు. అయితేనేం 'హనుమాన్' చిత్రబృందం అనుకున్నది సాధించింది. ఎవరూ ఊహించని విధింగా కలెక్షన్స్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. తాజాగా సినిమా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసినట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే సినిమా పలు రికార్డులు క్రియేట్ చేయడం విశేషం. తేజసజ్జా-ప్రశాంత్ వర్మ కాంబోలో తీసిన 'హనుమాన్'.. సూపర్ హీరో కాన్సెప్ట్‌తో తీశారు. అయితే సంక్రాంతి బరిలో గుంటూరు కారం, సైంధవ్, నా సామి రంగ లాంటి స్టార్ హీరోల సినిమాలు ఉండటంతో తొలుత తప్పుకోమని సలహాలు ఇచ్చారు. కానీ కంటెంట్ మీద నమ్మకంతో బలంగా నిలబడ్డారు. థియేటర్లు సరిపడా ఇవ్వకపోయినా సరే హిట్ కొట్టి తీరతామని నమ్మారు. ఇప్పుడు దానికి తగ్గ ప్రతిఫలం దక్కిందని చెప్పొచ్చు. (ఇదీ చదవండి: సంక్రాంతి సినిమాల సందడి.. ఏది హిట్? కలెక్షన్స్ ఎంత?) కేవలం రూ.55 కోట్లతో తీసిన 'హనుమాన్' సినిమాకు.. జస్ట్ నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. బెన్ఫిట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి దక్షిణాదిలో ఓ మాదిరి వసూళ్లు వచ్చినప్పటికీ నార్త్, ఓవర్సీస్లో అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. బాక్సాఫీస్ దగ్గర నిలకడగా సరాసరి రూ.25 కోట్ల వరకు సాధిస్తూ వెళ్తున్న ఈ చిత్రం.. రూ.100 కోట్ల మార్క్ దాటేయడం మామూలు విషయం కాదు. అలానే నార్త్ అమెరికాలోనూ 3 మిలియన్ డాలర్లు సాధించి... ఓవర్సీస్లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-10 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇది మాత్రం 'హనుమాన్' టీమ్‌కి చాలా అంటే చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఇక నాలుగు రోజుల్లో ఈ రేంజు వసూళ్లు వచ్చాయంటే.. లాంగ్ రన్లో రూ.300-400 కోట్లు వచ్చినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ సాయిపల్లవి చెల్లి.. కుర్రాడు ఎవరంటే?) small film - BIG JUSTICE from the audience ❤️ The Humongous Roar of #HANUMAN Resounded at the Box-Office 💪 1️⃣0️⃣0️⃣ 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐖𝐎𝐑𝐋𝐃𝐖𝐈𝐃𝐄 in just 4 days ᴡɪᴛʜ ʟɪᴍɪᴛᴇᴅ ꜱᴄʀᴇᴇɴꜱ & ᴍɪɴɪᴍᴀʟ ᴛɪᴄᴋᴇᴛ ᴘʀɪᴄᴇꜱ 💥#HanuManCreatesHistory -… pic.twitter.com/4LNGkhYz8f — Mythri Movie Makers (@MythriOfficial) January 16, 2024 -
హనుమాన్ దెబ్బ అదుర్స్.. కేజీఎఫ్, కాంతార రికార్డులు బద్ధలు..
కథలో దమ్ముంటే చాలు జనాలు ఇట్టే కనెక్ట్ అవుతారు. అది హనుమాన్తో నిరూపితమైంది. ఇప్పటివరకు హాలీవుడ్ సూపర్ హీరోలనే ఇష్టపడిన జనాలు హనుమాన్ చూసి యూటర్న్ తీసుకుంటున్నారు. హనుమాన్ను అందరికంటే బెస్ట్ సూపర్ హీరోగా కొనియాడుతున్నారు. పాజిటివ్ టాక్, సెలవుల కారణంగా రోజురోజుకీ వసూళ్లు పెంచుకుంటూ పోతోందీ చిత్రం. పుష్పతో సమానంగా.. తాజాగా ఈ విషయాన్ని ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. '2024లో బోణీ కొట్టిన తొలి సినిమా హనుమాన్. మొదటి మూడు రోజుల ఓపెనింగ్స్.. కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్, కాంతార హిందీ డబ్బింగ్ వర్షన్స్ వసూళ్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. పుష్ప హిందీ వర్షన్‌తో సమానంగా వసూళ్లు రాబడుతోంది. కేవలం హిందీ వర్షన్ తొలి రోజు రూ.2.15 కోట్లు రాబట్టగా రెండో రోజు రూ.4.05 కోట్లు, మూడో రోజు ఏకంగా రూ.6.06 కోట్లు వచ్చాయి. జనవరి 25వరకు పెద్ద సినిమాలేమీ లేకపోవడంతో హనుమాన్ కలెక్షన్స్ మరింత పుంజుకునే ఛాన్స్ ఉంది' అని ఎక్స్(ట్విటర్)లో రాసుకొచ్చాడు. హాఫ్ సెంచరీకి చేరువలో మరోవైపు హనుమాన్కు మౌత్ టాక్ ద్వారా పబ్లిసిటీ జరుగుతోంది. ఈ కారణంగా రోజురోజుకీ కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి., ఇప్పటివరకు ఈ మూవీ కలెక్షన్స్ రూ.40 కోట్ల పైనే వసూళ్లు రాబట్టి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే చిత్రయూనిట్ బాక్సాఫీస్ లెక్కలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. హీరో రానా తన చెప్పులు ఓ మూలన విడిచేసి హనుమాన్ పోస్టర్, గద ముందు ఫోటోలు దిగాడు. ఇది చూసిన జనాలు రానాను మెచ్చుకుంటున్నారు. మొదటి విరాళం ఎన్ని లక్షలంటే? ఇదిలా ఉంటే ఈ సినిమా ఆడినన్ని రోజులు ప్రతి టికెట్‌పై వచ్చే డబ్బులో ఐదు రూపాయలు అయోధ్యలోని రామమందిరానికి విరాళంగా ఇస్తామని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ మేరకు తొలిరోజు కలెక్షన్స్ ఆధారంగా రూ.14 లక్షలను అయోధ్య రామాలయానికి విరాళంగా ఇచ్చారు. బాక్సాఫీస్ దగ్గర దూకుడు చూస్తుంటే రానున్న రోజుల్లో దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి.. కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చేట్లు కనిపిస్తున్నారు. Here’s the BIGGG SURPRISE… #HanuMan first *3-day* [opening weekend] total is HIGHER than #KGF [first part] and #Kantara, at par with #Pushpa [note: all #Hindi dubbed versions]… Yes, you read it right!#HanuMan emerges FIRST HIT OF 2024… Packs an impressive total in its… pic.twitter.com/OkzYxnmkmc — taran adarsh (@taran_adarsh) January 15, 2024 South Indian actor #RanaDaggubati removing shoes before standing next to the poster of #HanumanMovie and Gada (mace). pic.twitter.com/568GOfGWc3 — Smriti Sharma (@SmritiSharma_) January 15, 2024 చదవండి: ఆఫీసుల చుట్టూ తిరిగా.. అవమానించారు.. భరించలేక వెళ్లిపోదామనుకున్నా! -
' వాటిని భోగి మంటల్లో వేయడం మరిచిపోయా'.. వారికి ప్రశాంత్ వర్మ కౌంటర్!
ఈ ఏడాది సంక్రాంతికి అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన హనుమాన్ సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. పొంగల్ కానుకగా ఈనెల 12న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించారు. తక్కువ బడ్జెట్లోనే అద్భుతమైన సినిమాను తీశారంటూ పలువురు సినీ ప్రమఖులు ప్రశంసలు కురిపించారు. అయితే తాజాగా ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. కొందరు నకిలీ ప్రొఫైల్స్‌తో సోషల్ మీడియాలో మా టీమ్ పట్ల కొందరు పనిగట్టుకుని ప్రచారం చేశారు. కానీ నిన్న జరిగిన భోగి వేడుకల్లో వాటిలో మంటల్లో విసిరివేయడం మరిచిపోయా అంటూ.. అలాంటి వారిని ఉద్దేశించి ప్రశాంత్ వర్మ చురలకంటించారు. ప్రశాంత్ వర్మ తన ట్వీట్లో రాస్తూ.. 'కొందరు నకిలీ ప్రొఫైల్స్‌తో మాపై విపరీతంగా ప్రచారం చేశారు. సోషల్ మీడియాలో మా టీంను ట్రోల్ చేశారు. ఇంకా అలాంటి చెత్తను నిన్న భోగి మంటల్లో వేయడం మరిచిపోయా. ఏది ఏమైనా 'ధర్మం కోసం నిలబడేవాడు ఎప్పటికీ గెలుస్తాడు' అనే విషయం మరోసారి రుజువైంది. తమ తిరుగులేని మద్దతును అందించిన సినీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తమపై వచ్చిన నెగెటివిటీని తొక్కేసి.. ఈ సంక్రాంతికి హనుమాన్ అనే గాలిపటం మరింత ఎత్తుకు ఎగరడానికి సిద్ధంగా ఉంది. ' అంటూ పోస్ట్ చేశారు. అయితే హనుమాన్ రిలీజ్‌కు ముందే పెద్దఎత్తున వివాదం నడిచింది. ఎప్పటిలాగే సంక్రాంతి బరిలో సినిమాలకు తీవ్రమైన పోటీ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే హనుమాన్ విడుదలపై సందిగ్ధత నెలకొంది. కానీ ప్రశాంత్ వర్మ చెప్పిన తేదీకే సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. పొంగల్ పోటీ తీవ్రం కావడంతో రవితేజ మూవీ ఈ పోటీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. బహుశా సినిమా రిలీజ్‌కు ముందు జరిగిన వివాదాన్ని ఉద్దేశించి ప్రశాంత్ వర్మ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రంలో అమృత అయ్యర్, వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్,సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. దాదాపు 12 భాషల్లో విడుదల హనుమాన్ చిత్రాన్ని రిలీజ్ చేశారు. I've encountered a significant amount of propaganda surrounding our team, along with the proliferation of fake profiles across social media. It seems like some of this digital debris has been forgotten to be thrown in yesterday's Bhogi fire. However, I express my sincere… — Prasanth Varma (@PrasanthVarma) January 15, 2024 -
హనుమాన్ పార్ట్-2 కాదు.. ఏకంగా సినిమానే: ప్రశాంత్ వర్మ తండ్రి
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన చిత్రం హనుమాన్. తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈనెల 12న థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే పాజిటివ్ వచ్చింది. మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాతో బాక్సాఫీస్ వద్ద పోటీపడిన ఈ సినిమాకు అభిమానుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. తక్కువ బడ్జెట్లో అద్భుతమైన సినిమా తీశారంటూ నెటిజన్స్, సినీ ప్రముఖులు సైతం హనుమాన్ మేకర్స్‌ను అభినందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన ప్రశాంత వర్మ తండ్రి తన కుమారుడిపై ప్రశంసలు కురిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. (ఇది చదవండి: మెగా హీరో బర్త్‌డే.. సందడి చేసిన రామ్ చరణ్ దంపతులు!) ఆయన మాట్లాడుతూ.. 'హనుమాన్ తీసినోడు మా అబ్బాయే. నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఇలాంటి అనుభవం. సినిమా చాలా అద్భుతంగా ఉంది. హనుమాన్ పార్ట్-2 కాదు. హనుమాన్‌పై ఏకంగా సినిమానే వస్తది.' అంటూ దర్శకుడి తండ్రి ఆనందం వ్యక్తం చేశారు. కాగా.. ఈ సినిమా సక్సెస్ సాధించడంతో అభినందించేందుకు చాలా మంది ఫోన్ చేస్తున్నట్లు ప్రశాంత్ వర్మ చెప్పారు. అయితే తాను జ్వరంతో బాధపడుతున్నాననీ.. ఆరోగ్యం కుదుటపడగానే అందరినీ కలుస్తానంటూ ట్విటర్లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటించగా.. వరలక్ష్మీ శరత్‌కుమార్, వినయ్ రాయ్ కీలక పాత్రలు పోషించారు. Proud Moment for Prasanth Varma Family #HanuMan 👏👏 Bro @PrasanthVarma, you achieved your dream. You made your father proudly say he is my son 🥹@tejasajja123 #HanuManRAMpage @NirvanaCinemas pic.twitter.com/JjHeyfqdcy — EPIC (@Koduri_526) January 13, 2024 -
ఐదు రోజులు గాల్లోనే ఉన్నాను
‘‘ప్రతి యాక్టర్ కెరీర్లో ఓ బెంచ్ మార్క్ ఫిల్మ్ ఉంటుందంటుంటారు. నా కెరీర్లో ‘హను–మాన్’ని నా బెంచ్ మార్క్ ఫిల్మ్‌గా ఫీలవుతున్నాను. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. క్లైమాక్స్‌లో ఓ సన్నివేశం కోసం రోప్ సాయంతో ఐదు రోజులు గాల్లోనే ఉన్నాను. రెండున్నరేళ్లు ఏ సినిమా ఒప్పుకోలేదు. యాక్టర్‌గా నా కెరీర్ పరంగా, నా వయసు పరంగా ఈ రెండున్నరేళ్ల కాలం చాలా కీలకమైనది. ‘హను–మాన్’ సక్సెస్ కావడం సంతోషంగా ఉంది’’ అని తేజ సజ్జా అన్నారు. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘హను–మాన్’. కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలైంది. ‘హను–మాన్’కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని చెబుతూ, శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో తేజ సజ్జా పంచుకున్న విశేషాలు. ∙తెలుగుతో పాటు హిందీ, కన్నడ వంటి భాషల్లో కూడా ‘హను–మాన్’ బాగా ఆడుతున్నందుకు సంతోషంగా ఉంది. గత ఏడాది నుంచి ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకీ రానంత స్పందన ఈ సినిమాకు హిందీలో వస్తోందని చెబుతున్నారు. మా సినిమాకు కాస్త సింపతీ వర్కౌట్ అయ్యిందని అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మా సినిమా ట్రైలర్, టీజర్ చూసి హిందీ, కన్నడవారు మమ్మల్ని అడిగి సినిమా తీసుకున్నారు. ఏం జరి గినా అంతిమంగా సినిమానే మాట్లాడుతుంది. సినిమానే నిలబడుతుంది. నిర్మాత నిరంజన్‌రెడ్డిగారు, ప్రశాంత్‌వర్మ ‘హను–మాన్’ సినిమాను బాగా చేశారు. ‘హను–మాన్’ సినిమా సమయంలో నేను ఇతర సినిమాలు ఒప్పుకోకపోవడానికి కారణం ఆ సినిమాల ఇంపాక్ట్ ‘హను–మాన్’ పై పడకూడదని. ఈ సినిమా సక్సెస్ మా అందరిదీ. ఈ సినిమా యూనిట్ సభ్యులు వారి వారి డిపార్ట్మెంట్స్లోనే కాక, ఇతర క్రాఫ్ట్స్‌లో కూడా కలుగజేసుకుని బాధ్యతగా చేశారు. ఉదాహరణకు నా లుక్ లోని కొన్ని కాస్ట్యూమ్స్‌కు మా సినిమా ఆర్ట్ డైరెక్టర్ వర్క్ చేశారు. ఈ సినిమా విషయంలో మొదట్నుంచి ఏదో ఆధ్యాత్మిక శక్తి మమ్మల్ని ముందుకు నడిపిందని నా నమ్మకం. ‘హను–మాన్’ సినిమాను మేం చేయలేదు. ‘హను–మాన్’ సినిమా మా చేత చేయబడింది. ఈ సినిమాకు లాంగ్ రన్ ఉంటుందని మేం అనుకుంటున్నాం. ‘హను–మాన్’ సినిమాలోని హనుమంతుని విగ్రహం సినిమాకు ఆకర్షణగా నిలిచింది. గ్రాఫిక్స్ అలా చేయడానికి ఆరు నెలల సమయం పట్టింది. క్లైమాక్స్ చిత్రీకరణకు 60 రోజులకు పైగా సమయం పట్టింది. ‘హను–మాన్’ప్రాజెక్ట్ గురించి చిరంజీవిగారికి తెలుసు. ఈ సినిమాలోని హనుమంతుని పాత్ర గురించి ఆయనకు తెలుసు. మా ఇంటెన్షన్ హనుమంతుని పాత్రలో చిరంజీవిగారు అనే. ఆ సంగతి అలా ఉంచితే చిరంజీవిగారు ఇంకా ‘హను–మాన్’ సినిమా చూడలేదు. అయితే రిలీజైన రోజున శుభాకాంక్షలు చెబుతూ మెసేజ్ పంపారు. -
'హను-మాన్'ను వెంటాడుతున్న సమస్య.. నిర్మాతలకు నష్టం!
సంక్రాంతి బరిలో సినిమాల రిలీజ్‌పై మొన్నటివరకు పెద్ద చర్చే జరిగింది. ఓవైపు పెద్ద హీరో సినిమా గుంటూరు కారం, మరోవైపు చిన్న హీరో చిత్రం హను-మాన్ జనవరి 12వ తేదీకే గురి పెట్టాయి. హనుమాన్ రెండు రోజులు ఆలస్యంగా రిలీజ్ చేయొచ్చుగా అని సలహా ఇచ్చాడు దిల్ రాజు. కానీ హను-మాన్ నిర్మాతలు మాత్రం.. ఒక్క రోజు కూడా ముందుకూ వెనక్కూ జరిగేది లేదని తేల్చి చెప్పేసింది. చివరకు అన్నట్లుగానే గుంటూరు కారం చిత్రానికి పోటీగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తమకు సరిపడా థియేటర్లు ఇవ్వలేదని మొదటి నుంచీ మొత్తుకున్నారు హనుమాన్ మేకర్స్. ఆ గొడవ అలా సాగుతుండగానే రిలీజ్ కూడా అయిపోయింది. అగ్రిమెంట్ బేఖాతరు తాజాగా మరో కొత్త తలనొప్పి వచ్చిపడింది. ఇప్పటికే పెద్దగా థియేటర్లు లేవంటే హను-మాన్ కోసం అగ్రిమెంట్లు కుదుర్చుకున్న థియేటర్లు సైతం సదరు చిత్రాన్ని ప్రదర్శించడం లేదట! ఈ విషయంపై మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూర్లు, నిర్మాత నిరంజన్ రెడ్డి.. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. థియేటర్ల యజమానులు ఇలా నిబంధనలు అతిక్రమించడాన్ని నిర్మాతల మండలి తీవ్రంగా ఖండించింది. 'జనవరి 12 నుంచి హనుమాన్ ప్రదర్శించేందుకు మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ తెలంగాణలో కొన్ని థియేటర్లతో అగ్రిమెంట్ చేసుకుంది. కానీ వాళ్లు ఈ అగ్రిమెంట్‌ను బేఖాతరు చేస్తూ నైజాం ఏరియా థియేటర్లలో సినిమా ప్రదర్శించడం లేదు. ఇప్పటివరకు జరిగిన నష్టాన్ని భరించాలి దీనివల్ల డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు అపార నష్టం కలిగింది. కాబట్టి ఈ థియేటర్లు వెంటనే హను-మాన్ సినిమాను ప్రదర్శించడంతో పాటు ఇప్పటివరకు జరిగిన నష్టాన్ని భరించాలి. థియేటర్ల యజమానులు ఇలా ఇష్టారీతిన వ్యవహరించడం తెలుగు సినీ పరిశ్రమ మనుగడకే ప్రమాదం. ఇప్పటికైనా పూర్వ ఒప్పందాన్ని గౌరవిస్తూ సినిమాకు సత్వర న్యాయం చేయండి' అంటూ తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఓ లేఖ విడుదల చేసింది. చదవండి: హను-మాన్ తొలి రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే? -
తొలిసారి అలాంటి అనుభూతి దక్కింది : అమృత అయ్యర్
‘‘హను–మాన్’ సినిమా ప్రేక్షకులకు నచ్చాలనే లక్ష్యంతోనే యూనిట్ అంతా పని చేశాం. ఆడియన్స్‌తో కలిసి ఈ సినిమా చూశాను. వారి స్పందన చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి. నా కెరీర్లో తొలిసారి అలాంటి అనుభూతి దక్కింది’’ అని హీరోయిన్ అమృతా అయ్యర్ అన్నారు. తేజ సజ్జా, అమృతా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘హను–మాన్’. శ్రీమతి చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం రిలీజైంది. (చదవండి: ‘హను-మాన్’ మూవీ రివ్యూ) ఈ సందర్భంగా అమృతా అయ్యర్ మాట్లాడుతూ– ‘‘ప్రశాంత్ వర్మగారు ‘హను–మాన్’ని అద్భుతంగా తీశారు. ఈ మూవీలో మీనాక్షి పాత్రని చక్కగా చేశావని ప్రేక్షకులు చెబుతుంటే హ్యాపీగా ఉంది. ఈ మూవీ జర్నీలో సహనంగా ఉండటం నేర్చుకున్నాను.. నటీనటులకు సహనం చాలా ముఖ్యం. ‘హను–మాన్ 2’ ఉంటుందని నాకూ తెలియదు. స్క్రీన్‌పై చూసి, సర్ప్రైజ్ అయ్యాను. ప్రస్తుతం తెలుగులో ‘అల్లరి’ నరేశ్‌కి జోడీగా ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. -
ప్రశాంత్ వర్మ హను-మాన్.. తొలి రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన తాజా చిత్రం హను-మాన్. సంక్రాంతి కానుకగా థియేటర్లలో వచ్చిన ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అభిమానుల భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మహేశ్‌బాబుతో చిత్రంతో పోటీలో నిలిచింది. ఈ చిత్రంలో తేజ సజ్జా హీరోగా నటించారు. చిన్న సినిమాగా విడుదలై హనుమాన్ చిత్రానికి సినీ ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మొదటి రోజే దాదాపు రూ.21 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సినీ వర్గాలు అంచనా వేశాయి. ప్రస్తుతం గుంటూరు కారం కంటే హనుమాన్కు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ సినిమాకు నార్త్ ఆడియన్స్ నుంచి సైతం విపరీతమైన స్పందన వస్తోంది. కాగా.. ఈ చిత్రాన్ని దాదాపు రూ.55 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. -
HanuMan Movie Stills: బాక్సాఫీస్ ట్రెండింగ్‌లో ప్రశాంత్ వర్మ హనుమాన్.. ఈ స్టిల్స్ చూశారా? (ఫొటోలు)
-
టాప్ లేపుతున్న 'హను-మాన్'.. రెమ్యునరేషన్ ఎవరికి ఎక్కువో తెలుసా?
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సినిమాల హడావుడి మొదలైపోయింది. 'హను-మాన్', 'గుంటూరు కారం' చిత్రాలు థియేటర్లలోకి వచ్చేశాయి. రెండింటిని పోల్చి చూసుకుంటే చాలామంది 'హను-మాన్' వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో రెమ్యునరేషన్ టాపిక్ మరోసారి హాట్ టాపిక్ అయిపోయింది. ఇంతకీ 'హను-మాన్' టీంలో ఎవరికెంత ఇచ్చారు? 'హను-మాన్' టాక్ ఏంటి? ఈసారి సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు నిలిచాయి. వీటిలో చాలామంది మహేశ్ 'గుంటూరు కారం' హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ దీనికంటే బెటర్ రివ్యూస్ ఇప్పుడు 'హను-మాన్' మూవీకి వస్తోంది. సూపర్ హీరో కాన్సెప్ట్, ఆంజనేయుడి సెంటిమెంట్‌తోపాటు కంటెంట్ కూడా భలే క్లిక్ అయింది. గురువారం సాయంత్రం ప్రీమియర్స్ పూర్తవగానే.. అందరూ 'జై హనుమాన్' నామజపం చేస్తున్నారు. (ఇదీ చదవండి: Hanu Man Movie Review: ‘హను-మాన్’ మూవీ రివ్యూ) అదే టైంలో దర్శకుడు ప్రశాంత్ వర్మని మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే కేవలం రూ.55 కోట్ల బడ్జెట్‌తో ఈ రేంజు సినిమా తీశాడంటే.. మరికాస్త బడ్జెట్ ఇచ్చుంటే వేరే లెవల్ మూవీ తీసేవాడని అనుకుంటున్నారు. సరే ఇది పక్కనబెడితే ఈ మూవీకి నటీనటులకు ఇచ్చిన రెమ్యునరేషన్.. రూ.10 కోట్లు కూడా దాటలేదనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. 'హను-మాన్' సినిమాలో హీరోగా నటించిన తేజ సజ్జా.. సెటిల్డ్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రానికి గానూ ఇతడికి రూ.2 కోట్లు ఇచ్చారట. దర్శకుడు ప్రశాంత్ వర్మ.. రూ.70 లక్షల నుంచి రూ.కోటి మధ్య పారితోషికం అందుకున్నాడట. మిగతా నటీనటుల్లో హీరోయిన్ అమృత అయ్యర్-రూ 1.5 కోట్లు, వరలక్ష్మీ శరత్ కుమార్ రూ. కోటి, వినయ్ రాయ్ రూ.65 లక్షలు, వెన్నెల కిశోర్ రూ.55 లక్షలు, గెటప్ శీను రూ.35 లక్షలు అనే టాక్ వినిపిస్తుంది. మిగతా నటీనటులకు కాస్తోకూస్తే ఇచ్చారు. మొత్తంగా చూసుకుంటే రూ.10 కోట్ల లోపే రెమ్యునరేషన్ తేల్చేశారనమాట. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు మూవీ) -
Hanuman OTT Rights: భారీ ధరకు 'హనుమాన్' ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
సంక్రాంతి రేసులో చిన్న సినిమాగా నేడు (జనవరి 12న) విడుదలైన హనుమాన్ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. ఒకరోజు ముందే అంటే నిన్ననే భారీగా ప్రీమియర్ షోలు పడిపోయాయి. సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ పాజిటివ్‌గానే రియాక్ట్ అవుతున్నారు. తెలుగులో 'సూపర్‌మ్యాన్' జోనర్ చిత్రాలు రావడం చాలా అరుదు. ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ చిత్రంతో ఆ లోటు తీర్చడమే కాదు.. ఏకంగా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ఇందులో కథానాయకుడు తేజ సజ్జా రోల్ చాలా చక్కగా ఉంటుంది. తనలోని ఉన్న టాలెంట్ మొత్తాన్ని ఈ సినిమా కోసం ఉపయోగించాడు. అందుకే అతను తెరపై కనిపించినప్పుడు విజిల్స్ పడుతున్నాయి. ముఖ్యంగా చాలా తక్కువ బడ్జెట్‌తో అద్భుతమైన సినిమాను ప్రశాంత్ వర్మ తీశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ 5 దక్కించుకుంది. పాన్ ఇండియా రేంజ్‌కు తగ్గట్లు సినిమా ఉండటంతో ఓటీటీ రైట్స్ భారీ ధరకే అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. సినిమాకు హిట్ టాక్ రావడంతో ఓటీటీలోకి వచ్చేందుకు కాస్త ఎక్కువ సమయమే పడవచ్చని సమాచారం. (ఇదీ చదవండి: Hanu Man Review : ‘హను-మాన్’ మూవీ రివ్యూ) ఏదేమైనా మార్చి నెలలో హనుమాన్ ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉన్నట్లు సినిమా ఎండ్ కార్డ్‌లో ఉంటుంది. 2025లో జై హనుమాన్ పేరుతో పార్ట్-2 వస్తుందని దర్శకుడు ప్రకటించాడు. తేజ సజ్జ, అమృత అయ్యర్, వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్,సముద్రఖని వంటి నటీనటులు హనుమాన్‌లో నటించారు. చిన్న సినిమాగా మొదలైనప్పటికీ క్రమంగా స్కేల్‌ని పెంచుకొని 12 భాషల్లో విడుదల అయ్యేలా ప్రాజెక్ట్‌ను సిద్ధం చేశారు. పెద్ద సినిమాలకు దీటుగా సంక్రాంతి బరిలో హనుమాన్ నిలిచి హిట్ టాక్‌తో దూసుకుపోతున్నాడు. ఓటీటీ రైట్స్ ఎన్ని కోట్లంటే.. హనుమాన్ సినిమాపై విడుదల ముందు నుంచే భారీ క్రేజ్ ఏర్పడింది. ఓటీటీ హీందీ వర్షన్ రూ. 5కోట్లు, తెలుగు వర్షన్ రూ. 11 కోట్లకు హనుమాన్కు సంబంధించిన హక్కులు అమ్ముడుపోయాయి. ప్రముఖ ఎంటర్టైనింగ్ సంస్థ 'జీ5' ఈ హక్కుల్ని దక్కించుకుంది. ఓ యువ హీరో నాలుగో సినిమానే ఇంత భారీ ధర పలకటం విశేషమని అప్పట్లో సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాకు నిరంజన్ రెడ్డి నిర్మాతగా ఉన్నారు. -
రాజమౌళిగారు చేస్తానన్నారని నేను డ్రాప్ అయ్యాను
‘‘ఒక ఫిల్మ్ మేకర్‌గా క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వడంపైనే నా ఏకాగ్రత ఉంటుంది. సినిమా విడుదల, థియేటర్ల కేటాయింపులు వంటివి నిర్మాతలకు చెందినవి. ఈ సినిమా సక్సెస్ అయితే రాబోయే పదేళ్లల్లో తెలుగు ప్రేక్షకులు గర్వపడే సినిమాలు చేసేలా మేం కొన్ని ప్లాన్ చేసి ఉన్నాం. కానీ ఇప్పుడు ఇదంతా (థియేటర్స్ గురించిన వివాదం గురించి పరోక్షంగా స్పందిస్తూ..) జరుగుతోంది. తప్పు జరుగుతున్నప్పుడు మాట్లాడకపోవడం అనేది ఇంకా పెద్ద తప్పు అన్నట్లుగా ఓ సామెత ఉంది. అందుకే కొన్ని విషయాలపై స్పంది స్తున్నాను’’ అన్నారు ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హను–మాన్’. కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో ప్రశాంత్ వర్మ చెప్పిన విశేషాలు. ∙‘హను–మాన్’ సినిమా కోసం తేజ సజ్జా కొత్తగా మేకోవర్ అయ్యాడు. ఇక యాక్టింగ్ గురించి నేను అతనికి నేర్పించాల్సింది ఏమీ లేదు. పైగా సెట్స్‌లో ఫలానా సన్నివేశంలో ఇలా యాక్ట్ చెయ్ అని నటించి, చూపించడం నాకు రాదు. ‘హను–మాన్’పై నా కన్నా ఎక్కువగా తేజ ఆశలు పెట్టుకున్నట్లు ఉన్నాడు. ఈ సినిమా కోసం చాలా సమయం కేటాయించాడు. కొత్త సినిమాలేవీ చేయలేదు. రీసెంట్గా ఓ సినిమా ఒప్పుకున్నాడు. సినిమా మొదలైన ఇరవై నిమిషాలు హీరో క్యారెక్టర్ సింపుల్‌గా ఉంటుంది. ఎప్పుడైతే హీరో పాత్రకు సూపర్ పవర్స్ వస్తాయో అప్పట్నుంచి కథ మరింత ఆసక్తిగా ముందుకు వెళ్తుంది. ∙పురాణాలు, ఇతిహాసాల కథలు, హనుమంతునిపై వచ్చిన కొన్ని ఆర్టికల్స్, ప్రచారంలో ఉన్న కొన్ని అంశాల ఆధారంగా ఈ సినిమా కథ రెడీ చేసుకున్నాను. తెలుగు సినిమా స్టైల్‌ని పోలి ఉండే సూపర్ హీరో సినిమా ‘హను–మాన్’. ‘బ్యాట్‌మేన్’ సినిమాను రాజమౌళిగారు తీస్తే ఎలా ఉంటుందో అలా ‘హను–మాన్’ ఉంటుంది. ‘కేజీఎఫ్’లో యశ్‌ను ఎలివేట్ చేసినట్లుగా ‘హను–మాన్’ సినిమా ఉంటుంది. నిర్మాత నిరంజన్ రెడ్డిగారు నాకన్నా పాజిటివ్ పర్సన్. మేం సినిమా కోసం ఓ ఆలోచన చెబితే, దానికి ఎక్స్టెన్షన్ లెవల్లో ఆయన ఆలోచించేవారు. దాశరథి శివేంద్రగారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ∙మేం అనుకున్నదాని కన్నా ‘హను–మాన్’ బడ్జెట్ మూడింతలు పెరిగింది. కానీ పదింతల క్వాలిటీ సినిమాను ఆడియన్స్ చూస్తారు. ఇక ఈ సినిమాను త్రీడీలో రిలీజ్ చేయాలంటే మరికొంత బడ్జెట్ కావాలి. అందుకే త్రీడీలో విడుదల చేయడం లేదు. అయితే రిలీజ్ తర్వాత మంచి స్పందన వస్తే, భవిష్యత్‌లో రీ–రిలీజ్లో త్రీడీలో కూడా రిలీజ్ చేస్తాం. ఓ నెల గ్యాప్ తర్వాత విదేశీ భాషల్లో ‘హను–మాన్’ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాం. ∙పురాణాలు, ఇతిహాసాల ఆధారంగా సినిమాలు చేయాలనే ఆసక్తి ఉంది. మహాభారతంపై ఓ సినిమా చేయాలనుకున్నాను. కానీ రాజమౌళిగారు చేయాలను టున్నారని తెలిసి డ్రాప్ అయ్యాను. -
Hanu Man Movie Review: ‘హను-మాన్’ మూవీ రివ్యూ
టైటిల్: హను-మాన్ నటీనటులు: తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను తదితరులు నిర్మాణ సంస్థ: ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మాత: కె.నిరంజన్ రెడ్డి దర్శకత్వం: ప్రశాంత్ వర్మ సంగీతం: గౌరహరి,అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సినిమాటోగ్రఫీ: శివేంద్ర ఎడిటర్: ఎస్.బి. రాజు తలారి విడుదల తేది: జనవరి 12, 2024 ఈ సంక్రాంతి బరిలో మూడు బడా హీరోల సినిమాలు ఉన్నాయి. వాటికి పోటీగా అన్నట్లు ‘హను-మాన్’ దిగాడు. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ చిత్రంపై మొదట్లో పెద్దగా అంచనాలు లేవు. కానీ ప్రచార చిత్రాలు విడుదలయ్యాక ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించి చర్చించుకున్నారు. ఇక ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో ‘హను-మాన్’పై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు( జనవరి 12) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఈ సినిమా కథంతా అంజనాద్రి అనే ఫిక్షనల్ విలేజ్ చుట్టూ తిరుగుతుంది. అడవి ప్రాంతంలో ఉండే ఆ ఊర్లో అంజనమ్మ(వరలక్ష్మీ శరత్ కుమార్), తన సోదరుడు హనుమంతు(తేజ సజ్జ)తో కలిసి నివాసం ఉంటుంది. హనుమంతు ఓ చిల్లర దొంగ.ఊర్లో చిన్న చిన్న వస్తువులను దొంగలిస్తూ చిల్లరగా తిరుగుతుంటారు. ఆ ఊరి బడి పంతులు మనవరాలు మీనాక్షి(అమృత అయ్యర్) అంటే హనుమంతుకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఓ రోజు బందిపోట్లు మీనాక్షిపై దాడి చేసేందుకు యత్నించగా.. హనుమంతు ఆమెను రక్షించబోయి జలపాతంలో పడిపోతాడు. అక్కడ హనుమంతుడి రక్త ధారతో ఏర్పడి రుధిర మణి హనుమంతుని చేతికి చిక్కుతుంది. అప్పటి నుంచి అతనికి సూపర్ పవర్స్ వస్తాయి. ఇదిలా ఉంటే.. చిన్నప్పటి నుంచి సూపర్ హీరో కావాలని కలలు కంటున్న మైఖేల్(వినయ్ రాయ్)..ఆ శక్తుల కోసం సొంత తల్లిదండ్రులను చంపేస్తాడు. ప్రపంచంలో తనకు మాత్రమే సూపర్ పవర్స్ ఉండాలని, ఆ దిశగా ప్రయోగాలు సైతం చేయిస్తుంటాడు. ఈ క్రమంలో హనుమంతుకి వచ్చిన శక్తుల గురించి తెలుస్తుంది. దీంతో మైఖేల్ తన అనుచరులతో అంజనాద్రి గ్రామానికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? హనుమంతుకి ఉన్న శక్తులను సొంతం చేసుకునేందుకు మైఖేల్ పన్నిన పన్నాగం ఏంటి? అసలు ఆ శక్తులు హనుమంతుకు మాత్రమే ఎందుకు వచ్చాయి? హనుమంతుకి ఆపద వచ్చినప్పుడలా రక్షిస్తున్న స్వామిజీ(సముద్రఖని) ఎవరు? ఎందుకు రక్షిస్తున్నాడు? హనుమంతుకి ఉన్న శక్తులు ఉదయం పూట మాత్రమే ఎందుకు పని చేస్తాయి? అంజనాద్రిని కాపాడుకోవడం కోసం హనుమంతు ఏం చేశాడు? అసలు మీనాక్షి-హనుమంతుల ప్రేమ సంగతి ఏమైంది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. హీరోకి సూపర్ పవర్స్ రావడం.. ఆ శక్తిని మంచి కోసం ఉపయోగించడం.. విలన్ దాన్ని వశం చేసుకోవడానికి ప్రయత్నించడం.. హీరో అతని ప్రయత్నాన్ని తిప్పికొట్టి, ఆ శక్తిని లోక కల్యాణం కోసం వాడడం.. ఈ తరహా కాన్సెప్ట్‌తో హాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయి. సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, స్పైడర్ లాంటి సూపర్ హీరోలు అందరికి పరిచయమే. అయితే ఈ కథలన్నింటికి మూలం మన పురాణాలే. మన ఇండియాకు ఆంజనేయ స్వామిజీనే ఓ సూపర్ మ్యాన్ అని పురాణాలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ హను-మాన్ చిత్రాన్ని తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. కథగా చూస్తే ఇందులో కొత్తదనం ఏది లేదు. ఈ తరహా కాన్సెప్ట్‌తో తెలుగులోనూ సినిమాలు వచ్చాయి కానీ.. నేటివిటీ కామెడీని టచ్ చేస్తూ.. తనదైన స్క్రీన్‌ప్లేతో మాయ చేశాడు ప్రశాంత్ వర్మ. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ తెలుగు నేటివిటీ మిస్ అవ్వకుండా కామెడీతో పాటు క్యూరియాసిటీని చివరి వరకు కంటిన్యూ చేశాడు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా కథను తీర్చి దిద్దాడు. కేవలం సూపర్ పవర్స్ కాన్సెప్ట్నే కాకుండా సిస్టర్ సెంటిమెంట్, ప్రేమ కథను కూడా ఇందులో జోడించాడు. అయితే అంతగా ఆకట్టుకోలేదు. అలా అని అనవసరంగా జోడించినట్లు కూడా లేవు. కథ రొటీన్‌గా సాగుతుందనే ఫీలింగ్ కలిగేలోపు ఆంజనేయ స్వామి తాలుకు కథను తీసుకురావడం..గూస్బంప్స్ తెప్పించే సీన్స్ పెట్టడంతో చూస్తుండగానే సినిమా అయిందనే భావన కలుగుతుంది. హను-మాన్ కథ ప్రారంభమే ఆసక్తికరంగా ఉంటుంది. విలన్ ఎందుకు సూపర్ పవర్స్ కావాలనుకునేది ప్రారంభ సన్నివేశాల్లోనే చూపించాడు. ఆ తర్వాత కథంతా అంజనాద్రి చుట్టూ తిరుగుతుంది. కోతికి రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వడం..హీరో గురించి ఆ కోతి చెప్పే మాటలు నవ్వులు పూయిస్తాయి. హీరో హీరోయిన్ల లవ్‌స్టోరీ రొటీన్‌గా ఉంటుంది. హీరోకి ఎప్పుడైన సూపర్ పవర్స్ వస్తాయో అప్పటి నుంచి కథనం ఆసక్తిరంగా సాగుతుంది. రాకేష్ మాస్టర్ గ్యాంగ్‌తో హీరో చేసే ఫైట్ సీన్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మరోవైపు సత్య, గెటప్ శ్రీను కామెడీ సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్‌లో కథ సింపుల్‌గా, ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలోనే అసలు కథంతా ఉంటుంది. సూపర్ పవర్స్ కోసం విలన్ ప్రయత్నించడం.. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు అదిరిపోతాయి. హీరోకి ఇచ్చే ఎలివేషన్ సీన్స్ కూడా విజుల్స్ వేయిస్తాయి. ఓ సందర్భంలో పెద్ద బండరాయిని కూడా ఎత్తేస్తాడు. అయినా కూడా అది అతిగా అనిపించడు. మరో యాక్షన్ సీన్లో చెట్టు వేర్లతో హెలికాప్టర్ని ఆపేస్తాడు..అయినా కన్విన్సింగ్‌గానే అనిపిస్తుంది. ఇక చివరి 15 నిమిషాలు అయితే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. విఎఫెక్స్ అద్భుతంగా ఉన్నాయి. చిన్న చిన్న లోపాలు ఉన్నా ఇంత తక్కువ బడ్జెట్(రూ. 25 కోట్లు అని సమాచారం)లో ఇలాంటి సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మను నిజంగా అభినందించాల్సిందే. రాముడికి ఆంజనేయ స్వామి ఇచ్చిన మాట ఏంటి ? అనే ఆసక్తికర ప్రశ్నతో సీక్వెల్‌ని ప్రకటించాడు. మరి ఆంజనేయ స్వామి ఇచ్చిన హామీ ఏంటి అనేది 2025లొ విడుదలయ్యే ‘జై హను-మాన్’లో చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. తేజ సజ్జకు నటన కొత్తేమి కాదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించి, తనదైన నటనతో మెప్పించాడు. హీరోగాను మంచి మార్కులే సాధించాడు. ఇక హనుమాన్ కోసం మరింత కష్టపడినట్లు తెలుస్తోంది. కథ మొత్తం తన భుజాన వేసుకొని నడిపించాడు. కామెడీ, ఎమోషన్‌తో పాటు యాక్షన్ సీన్స్‌ని కూడా ఇరగదీశాడు. కావాల్సిన చోట మాత్రమే హీరోయిజాన్ని చూపించాడు. సాధారణ మనిషిగా.. సూపర్ పవర్స్ ఉన్న హను-మాన్‌గా రెండు విభిన్న పాత్రల్లో కనిపించిన తేజ.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్్ చూపించి ఆకట్టుకున్నాడు. హీరో సోదరి అంజనమ్మగా వరలక్ష్మీ శరత్ కుమార్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్రకు కూడా ఇందులో ఓ యాక్షన్స్ సీన్ ఉంది. అమృత అయ్యర్ తన పాత్ర పరిధిమేర నటించింది. సముద్రఖని పోషించిన పాత్రలోని సస్పెన్స్‌ని తెరపై చూడాల్సిందే. వినయ్ రాయ్ స్టైలీష్ విలన్‌గా మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీనుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది. తనదైన బీజీఎంతో గౌరహరి సినిమా స్థాయిని పెంచేశాడు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని చాలా రిచ్‌గా తెరకెక్కించాడు. వీఎఫెక్స్ వర్క్ అబ్బురపరిచేలా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘హను-మాన్’ గురించి ఈ విషయాలు తెలుసా?
యంగ్ హీరో తేజ సజ్జా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘హను-మాన్’. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ఇది. ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా హను-మాన్ గురించి ఆసక్తికర విషయాలు మీ కోసం... ♦ ‘జాంబి రెడ్డి’ తర్వాత ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ సినిమా కోసం అంజనాద్రి అనే కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. ఆ ఊరి చుట్టే కథ తిరుగుతంది. ♦ హను-మాన్ షూటింగ్ 2021 జూన్ 5న ప్రారంభమైంది. వట్టినాగుపల్లిలో ఓ స్థలాన్ని లీజుకు తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. తొలుత ఈ చిత్రాన్ని టాలీవుడ్ స్థాయిలోనే తెరకెక్కించాలనుకున్నారు. కానీ నిర్మాత ప్రొత్సాహంతోనే పాన్ ఇండియా స్థాయిలో తీర్చిదిద్దారు. మొత్తం 11 భాషల్లో విడుదల కాబోతుంది. ♦ ఈ సినిమా కోసం ముగ్గురు సంగీత దర్శకులు పని చేశారు. సంగీత దర్శకులు అనుధీప్ దేవ్, కృష్ణ సౌరభ్ చెరో పాటను కంపోజ్ చేశారు. ఇక మిగిలిన పాటలను, నేపథ్య సంగీతాన్ని గౌర హరి అందించాడు ♦ ఈ చిత్రం మొత్తం ఫుటేజీ నిడివి 2.45 గంటలు. సెన్సార్ తర్వాత ఇది 2.38 గంటలు అయింది. సినిమాకు ఏది అవసరమో దాన్నే షూట్ చేశామని, కేవలం ఐదారు నిమిషాలు ఫుటేజ్ మాత్రమే వృధా అయిందని దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పారు. ♦ ఈ సినిమాను గతేడాది మే 12న విడుదల చేయాల్సింది. కానీ వీఎఫెక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో పలుమార్లు వాయిదా వేస్తూ.. చివరకు సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నారు. ♦ ఈ చిత్రంలో మొత్తం 1600 వీఎఫెక్స్ ఫాట్స్ ఉన్నాయట. వానరం, ఎలుకలు, చిరుత, పులి ఇవన్నీ వీఎఫెక్స్ సాధ్యమైయ్యాయని దర్శకుడు చెప్పాడు. బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకొని కొత్తతరం వీఎఫెక్స్ టీమ్‌తో పని చేశారట. ఔట్‌ఫుట్ మాత్రం అద్భుతంగా ఉంది. ♦ ఓ సారి అడవిలో షూటింగ్ చేస్తున్న సమయంలో తేజ సజ్జకు తృటిలో ప్రమాదం తప్పిందట. చెట్టుకింద ఓ సన్నివేశాన్ని షూట్ చేస్తుంటే.. ఓ పాము తేజ సజ్జదగ్గరకు వచ్చిందంట. డైరెక్టర్ మానిటర్లో చూస్తే అది పాములా కనిపించలేదట. పక్కనే ఉన్న వ్యక్తి చెప్పబోతుంటే డైరెక్టర్ పట్టించుకోలేదట. షాట్ పూర్తయిన తర్వాత అక్కడ పాము ఉందని చెప్పడంతో అంతా భయంతో పరుగులు తీశారట. ♦ ఈ చిత్రంలో 'వాన' హీరో వినయ్ రాయ్ విలన్ రోల్లో కనిపించనుండగా, అషికా రంగనాథ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఇక హనుమంతుడిగా చిరంజీవి కనిపించబోతున్నట్లు టాక్. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఈ విషయాన్ని ఎక్కడ అధికారికంగా చెప్పలేదు. -
చిరంజీవి గారు లేకపోతె నేను లేను
-
హనుమాన్ దేవుడు చిరంజీవి గారితో వచ్చారు..!
-
హనుమాన్, గుంటూరు కారం కాంట్రవర్సీపై చిరంజీవి కామెంట్స్
సంక్రాంతి అంటేనే సినిమాలకు చాలా మంచి సీజన్. చిన్న సినిమా అయినా సరే కథ బాగుంటే హిట్ అవుతుంది. కంటెంట్‌లో సత్తా ఉంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరించి, విజయం అందిస్తారు. ఈ సంక్రాంతికి వస్తున్న ‘గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ’ సినిమాలతో పాటు ‘హను–మాన్’ కూడా విడుదల అవుతుంది. కానీ హనుమాన్ సినిమాను చిన్న ప్రాజెక్ట్ అని మరో తేదీలో విడుదల చేసుకోవచ్చు కదా అంటూ చిత్ర పరిశ్రమ నుంచి కొందరు ఒత్తిడి తీసుకొస్తున్నారని గతంలో నిర్మాత నిరంజన్ రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే.. ఇదే అంశంపై చిరంజీవి వ్యాఖ్యానించారు. 👉: ‘హను–మాన్’ ప్రీ రిలీజ్ వేడుక ముఖ్యఅతిథిగా చిరంజీవి (ఫొటోలు) జనవరి 12న గుంటూరు కారం, హను-మాన్ రెండు చిత్రాలు ఒకే రోజు విడుదల కానున్నాయి. తాజాగా జరిగిన హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన మెగస్టార్ చిరంజీవి గుంటూరు కారం కాంట్రవర్సీపై పరోక్షంగా కామెంట్లు చేశారు. హనుమాన్ చిత్రంలో హీరోగా నటించిన తేజ సజ్జ చాలా కష్టపడ్డాడు. ఈ సంక్రాంతి సీజన్‌కు ఎన్ని సినిమాలు వచ్చినా సరే.. కంటెంట్‌లో సత్తా ఉండి.. దేవుడి ఆశీస్సులు ఉన్నాయంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరించి, విజయం అందిస్తారని చిరంజీవి అన్నారు. ఇందులో ఎలాంటి సందేహం అక్కరలేదని ఆయన తెలిపారు. అయితే ఇదీ కాస్త పరీక్షా కాలం అనుకోవచ్చు.. అందరూ అనుకున్నట్లుగా హనుమాన్ చిత్రానికి థియేటర్లు దొరకకపోవచ్చు.. సినిమాలో కంటెంట్ ఉంటే సెకండ్ షో చూస్తారు.. అదీ లేకపోతే మరో వారం తర్వాత అయినా చూస్తారు. ఈ సంక్రాంతికి వస్తున్న గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ సినిమాలతో పాటు హను–మాన్ కూడా బాగా ఆడాలి.. ఆడుతుందని చిరంజీవి అన్నారు. చిత్ర పరిశ్రమ ఎప్పుడూ పచ్చగా ఉండాలని ఆయన కోరారు. '2017 సంక్రాంతి సమయంలో కూడా ఇలాంటి సందర్భమే వచ్చింది. అన్నీ పెద్ద సినిమాలు ఉన్నాయి.. అప్పుడు రేసులోకి శతమానం భవతి చిన్న సినిమాను నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. ఆ సమయంలో నేను రిస్క్ ఎందుకని దిల్ రాజుకు చెప్పాను.. అందుకు ఆయన ఒకటే మాట అన్నాడు సినిమా బాగుంది.. అందరికీ నచ్చుతుందని విడుదల చేశాడు.. అనుకున్నట్లే ఆ సమయంలో శతమానం భవతి సూపర్ హిట్ అయింది. ఈ ఏడాది కూడా చిన్న సినిమాగా వస్తున్న హనుమాన్ కూడా సూపర్ హిట్ అవుతుంది.' అని చిరంజీవి అభిప్రాయపడ్డారు. -
‘హను–మాన్’ ప్రీ రిలీజ్ వేడుక ముఖ్యఅతిథిగా చిరంజీవి (ఫొటోలు)
-
హను–మాన్: ప్రతి టిక్కెట్‌పై ఐదు రూపాయలు అయోధ్య రామమందిరానికి విరాళం
‘‘సంక్రాంతి అన్నది సినిమాలకు చాలా మంచి సీజన్. ఎన్ని చిత్రాలు వచ్చినా సరే కథ బాగుండి.. కంటెంట్‌లో సత్తా ఉండి.. దేవుడి ఆశీస్సులు ఉన్నాయంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరించి, విజయం అందిస్తారు. చిత్ర పరిశ్రమ ఎప్పుడూ పచ్చగా ఉండాలి. ఈ సంక్రాంతికి వస్తున్న ‘గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ’ సినిమాలతో పాటు ‘హను–మాన్’ కూడా బాగా ఆడాలి.. ఆడుతుంది’’ అని హీరో చిరంజీవి అన్నారు. తేజ సజ్జా, అమృతా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘హను–మాన్’. శ్రీమతి చైతన్య సమర్పణలో కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్యఅతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ–‘‘హను–మాన్’ టీజర్, ట్రైలర్ చూడగానే అద్భుతంగా అనిపించడంతో డైరెక్టర్ ఎవరని అడిగి, ప్రశాంత్ వర్మ గురించి తెలుసుకున్నాను. ‘మీ సూపర్ హీరో ఎవరు?’ అని ఓ ఇంటర్వ్యూలో సమంత అడిగినప్పుడు.. ‘హను–మాన్’ అని టక్కున చెప్పేశాను. అదే ఈ సినిమాకి టైటిల్‌గా పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రశాంత్ వర్మ ఆలోచన, తేజ కష్టం వృథా కావు. అనుకున్న స్థాయిలో థియేటర్లు దొరక్కపోవచ్చు. కానీ, సినిమాని విడుదల రోజు.. లేకుంటే మరుసటి రోజు.. ఫస్ట్ షో.. లేదంటే సెకండ్ షో చూస్తారు. సినిమా బాగుంటే ఎన్ని రోజులైనా చూస్తారు. ‘హను–మాన్’లాంటి మంచి సినిమా తీసిన నిరంజన్ రెడ్డిగారికి థ్యాంక్స్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఈ చిత్రం ఆడినన్ని రోజులు ప్రతి టిక్కెట్‌పై వచ్చే డబ్బులో ఐదు రూపాయలు అయోధ్యలోని రామమందిరానికి విరాళంగా ఇస్తామని యూనిట్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది. రామమందిరంప్రారంభోత్సవానికి నాకు ఆహ్వానం అందింది.. కుటుంబ సమేతంగా వెళతాను’’ అన్నారు. కె.నిరంజన్ మాట్లాడుతూ– ‘‘నేను ఏదైతే నమ్మానో దాన్ని అలాగే తెరపైకి తీసుకొచ్చిన ప్రశాంత్‌కి థ్యాంక్స్. మా విజన్‌తో నిర్మించిన ‘హను–మాన్’ని ప్రేక్షకులు బిగ్స్క్రీన్స్లో చూసి ఆశీర్వదించాలి’’ అన్నారు. ‘‘నా జీవితంలో నా తల్లిదండ్రుల తర్వాత నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే అది చిరంజీవిగారికే. ఆయన స్ఫూర్తితో ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు చేస్తున్నా. రామ్‌చరణ్‌గారికి రాజమౌళిగారు, రవితేజగారికి పూరి జగన్నాథ్‌గారు, నాకు.. ప్రశాంత్ వర్మగారు అని సగర్వంగా చెబుతున్నా’’ అన్నారు తేజ సజ్జా. ‘‘నన్ను నమ్మి ‘హను–మాన్’ తీయమని సపోర్ట్ చేసిన నిరంజన్ రెడ్డి సర్కి థ్యాంక్స్. కలలో కూడా సినిమా గురించే ఆలోచిస్తాడు తేజ.. తనకి సినిమా అంటే అంత ప్రేమ. ఈ సంక్రాంతికి పిల్లలు, పెద్దలందరూ థియేటర్స్‌కి వచ్చి ఎంజాయ్ చేసేలా ‘హను–మాన్’ ఉంటుంది అన్నారు ప్రశాంత్ వర్మ. ఈ వేడుకలో అమృతా అయ్యర్, వరలక్ష్మీ శరత్‌కుమార్, నటుడు వినయ్ రాయ్, కెమెరామేన్ దాశరథి శివేంద్ర, డైరెక్టర్ కేవీ అనుదీప్, రచయిత–డైరెక్టర్ బీవీఎస్ రవి, సంగీత దర్శకులు అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్, గౌర హరి తదితరులు పాల్గొన్నారు. -
'హనుమాన్'.. ఊహించనంత బ్రహ్మాండంగా వచ్చింది: వరలక్ష్మి
చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలకి వచ్చిన పలు సినిమాల్లో నటించిన తేజా సజ్జా.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. 'హనుమాన్' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె.నిరంజన్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ.. కథ, దర్శకత్వం వహించారు. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా 12 భాషల్లో రిలీజ్ కానుంది. (ఇదీ చదవండి: పుట్టిన బిడ్డని కోల్పోయిన 'జబర్దస్త్' కమెడియన్ అవినాష్) ఈ క్రమంలోనే చెన్నైలో శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ వేదికపై మాట్లాడుతూ చిత్రబృందం ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమిళ వెర్షన్ నిర్మాత చైతన్య మాట్లాడుతూ.. 'హనుమాన్' కోసం అందరూ ఎంతగానో శ్రమించారు. చిత్రం చాలా బాగా వచ్చింది. చిన్న ప్రయత్నంగా ప్రారంభించిన ఈ చిత్రం ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా అయింది. హనుమాన్ చిత్రాన్ని తమిళనాట విడుదల చేస్తున్న శక్తిఫిలింస్ అధినేత శక్తివేల్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చెప్పారు. వరలక్ష్మీ శరత్‌కుమార్ మాట్లాడుతూ.. ఎవరూ ఊహించనంత బ్రహ్మాండంగా 'హనుమాన్' వచ్చిందని చెప్పారు. ఇందులో తనతో పాటు సముద్రఖని, అమృతా అయ్యర్ ఇలా చాలామంది తమిళ ఇండస్ట్రీకి చెందిన యాక్టర్స్ చేసినట్లు చెప్పుకొచ్చారు. హనుమాన్ చిత్రం వెనుక చాలా శ్రమ ఉందని హీరో తేజా పేర్కొన్నాడు. ఇది తెలుగు చిత్రంగా కాకుండా డైరెక్ట్ తమిళ చిత్రంగా ఉంటుందన్నారు. అందుకోసం చాలా శ్రమించామని చెప్పారు. (ఇదీ చదవండి: రిలీజ్ గందరగోళం.. ఇప్పుడేమో సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మూవీ) -
హనుమాన్ హిట్ అవ్వాలంటూ హీరోకు నిర్మాత గిఫ్ట్!
చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా, అక్కడి నుంచి హీరోగా ఎదిగాడు తేజ సజ్జ. ప్రస్తుతం అతడు నటించిన హనుమాన్ చిత్రం సంక్రాంతికి విడుదలవుతోంది. అసలే సంక్రాంతికి మరో మూడు పెద్ద సినిమాలు రిలీజవుతున్నాయి. అందులో గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ సినిమాలున్నాయి. పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నా హనుమాన్ వెనక్కు తగ్గలేదు. వాటితో పాటు ఈ సినిమా కూడా సంక్రాంతికే రిలీజవుతుందని నిర్మాతలు నొక్కి చెప్తున్నారు. దీంతో ఈసారి సంక్రాంతి పోటీ రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో పాన్ ఇండియా నిర్మాత అభిషేక్ అగర్వాల్ హీరో తేజ సజ్జాకు ఓ బహుమతినిచ్చాడు. హీరోను కలిసి ఓ మహిమాన్విత బంగారు ఉంగరాన్ని గిఫ్ట్‌గా ఇచ్చాడట! ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా ఏదైనా సినిమా హిట్టయ్యాక సదరు నిర్మాత హీరోకు బహుమతి ఇస్తుంటాడు. ఇక్కడ సినిమా రిలీజవకముందే వేరే నిర్మాత వచ్చి హీరోను అభినందిస్తూ గిఫ్ట్ ఇవ్వడం విశేషం. హనుమాన్ సినిమా విషయానికి వస్తే దీనికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఈ మూవీ పొంగల్ కానుకగా జనవరి 12న విడుదల కానుంది. View this post on Instagram A post shared by PrimeShow Entertainment (@primeshowentertainment) చదవండి: సంక్రాంతి పోటీని తట్టుకునేందుకు 'హనుమాన్' ప్లాన్ అదుర్స్ హీరో కూతురి పెళ్లి.. 8 కి.మీ. జాగింగ్ చేసుకుంటూ వెళ్లిన వరుడు -
సంక్రాంతి పోటీని తట్టుకునేందుకు 'హనుమాన్' ప్లాన్ అదుర్స్
ఈ సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ కానున్నాయి. విడుదల తేదీలు దగ్గరపడుతుండటంతో ప్రీ రిలీజ్ కార్యక్రమాలకు చిత్ర యూనిట్స్ రెడీ అవుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు 'గుంటూరు కారం' ఈవెంట్ కోసం జనవరి 6వ తేదీని లాక్ చేసుకుంది. హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో పెద్ద ఎత్తున ఈ వేడుక జరగనుంది. తాజాగా హనుమాన్ చిత్రం కూడా 7న ఎన్ కన్వెన్షన్ లో సెలబ్రేషన్‌కు రెడీ అవుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి పాల్గొననున్నారు. ఇదే విషయాన్ని హీరో తేజ సజ్జ తెలిపాడు. హనుమాన్ కోసం గాడ్‌ఫాదర్ ఉన్నాడు అంటూ ఆయన తన ఎక్స్ పేజీలో పోస్ట్ చేశాడు. సంక్రాంతికి పోటీ ఎక్కువ ఉండటంతో సినిమాకు మరింత బజ్ క్రియేటే చేసేందుకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవిని బరిలోకి దింపినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా హనుమాన్ చిత్రంలో చిరంజీవి కూడా నటించారని వార్తలు వచ్చాయి. ట్రైలర్ లో హనుమంతుడి కళ్ళు అచ్చం చిరుని పోలి ఉన్నాయని కామెంట్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ చిత్రం ఈవెంట్ కోసం స్వయంగా ఆయనే రావడం చూస్తే ఏదో లింక్ ఉందని అభిమానులు భావిస్తున్నారు. మెగాస్టార్‌కు హనుమంతుడు అంటే ఎనలేని భక్తి కాబట్టి ఇలాంటి చిత్రంలో ఆయన కొంతసేపు కనిపించడమో లేదా గొంతు వినిపించడమో ఉంటుందని భావిస్తున్నారు. హనుమాన్ ప్లాన్ అదుర్స్ తేజ సజ్జ చైల్డ్ యాక్టర్ నుంచి హీరోగా ఎదిగాడు. ఇప్పటికే ఆయన పలు సినిమాలతో తనలో సత్తా ఉందని నిరూపించుకున్నాడు. అందుకు ఆయన నటన మీద నమ్మకంతో హనుమాన్ చిత్రాన్ని భారీ డడ్జెట్తో తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా గురించి పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై భారీగా బజ్ క్రియేట్ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. ఇలాంటి సమయంలో సంక్రాంతి సినిమాల తాకిడిని ఈ ఫాంటసీ మూవీ ఎలా తట్టుకుంటుందాని. దాని కోసమే ఒక మంచి వ్యూహం సిద్ధం చేసినట్టు వినిపిస్తోంది. గుంటూరు కారం, హనుమాన్ రెండు చిత్రాలు జనవరి 12న విడుదల కానున్నాయి. ఇప్పటికే గుంటూరు కారం చిత్రానికి భారీగా థియేటర్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో హనుమాన్ సినిమాకు ఎర్లీ ప్రీమియర్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అంటే జనవరి 11న రాత్రే భారీగా షోలు ఉండేలా ప్లాన్ చేస్తుందట. ఇప్పటికే యూఎస్‌లో జనవరి 11 నుంచి ప్రీమియర్స్ ఉన్నట్లు ప్రకటించింది. దీంతో కొంత వరకు కలెక్షన్స్ పెంచుకోవచ్చని హనుమాన్ ప్లాన్ చేస్తున్నాడు. సినిమాకు హిట్ టాక్ వస్తే మరుసటి రోజు నుంచి కలెక్షన్స్ పెంచుకోవచ్చని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట. My #GodFather for our #HanuMan ❤️@PrasanthVarma @Primeshowtweets pic.twitter.com/9dyebsLNs5 — Teja Sajja (@tejasajja123) January 4, 2024 -
గుంటూరు కారంతో పోటీ.. హనుమాన్ హీరో ట్వీట్ వైరల్
ఈ సంక్రాంతికి సినిమా అభిమానులకు పెద్ద పండుగ ప్రతి ఏడాది మాదిరే ఈసారి కూడా భారీగానే సినిమాలు ఉన్నాయి. ఎన్ని సినిమాలు రేసులో ఉన్నా.. మహేశ్ బాబు 'గుంటూరు కారం' చిత్రంపైనే ప్రేక్షకుల గురి ఎక్కువగా ఉంది. మహేశ్ బాబు- శ్రీలీల, మీనాక్షి చౌదరి కాంబినేషన్లో త్రవిక్రమ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మహేశ్- త్రివిక్రమ్‌లకు ఇది హ్యాట్రిక్ కాంబినేషన్ కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 12న గుంటూరు కారం విడుదల కానుంది. అదే రోజున తేజ సజ్జ నటించిన 'హనుమాన్' కూడా విడుదల కానుంది. జనవరి 12న ఏకంగా రెండు సినిమాలు ఉండటంతో ఈ పోటీ నుంచి ఎవరైనా ఒకరు తప్పుకొని మరోతేదికి వస్తారనుకుంటే ఎవరూ తగ్గలేదు. ఫైనల్‌గా గుంటూరు కారం,హనుమాన్ రెండు చిత్రాలు ఒకేరోజు విడుదల అవుతున్నాయి. దీంతో పలు వెబ్సైట్లు మహేష్‌కు పోటీగా తేజ సజ్జ దిగుతున్నాడు అంటూ కొన్ని పోస్టులు పెట్టాయి. వాస్తవానికి మహేష్ లాంటి సూపర్ స్టార్‌కు తేజ సజ్జ ఎలా పోటీ అవుతాడు..? మహేష్‌కు మాస్,ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన నుంచి ఇంత వరకు పాన్ ఇండియా సినిమా ఒక్కటి కూడా రాలేదు.. అయినా పాన్ ఇండియా హీరోల్లో మహేష్ టాప్-10 లో ఉండటం విశేషం. అయితే తేజ సజ్జ ఒక ట్వీట్ చేశాడు. 'సూపర్‌స్టార్‌తో పోటీ ఏంటి సర్.. ఆయనతో పోటీగా కాదు, ఆయనతో పాటుగా' అని ఒక స్క్రీన్ షాట్‌కు రిప్లై ఇచ్చాడు. వాస్తవానికి 2000 సంవత్సరంలో మహేష్ బాబుతో 'యువరాజు' అనే సినిమాలో నటించాడు తేజ సజ్జ.. అందులో మహేష్‌కు కుమారుడిగా ఆయన నటించిన విషయం తెలిసిందే. సుమారు 24 ఏళ్ల తర్వాత ఇలా ఇద్దరీ సినిమాలు ఒకేరోజు విడుదల కావడం మరింత విశేషం. #SuperStar tho poti enti sir 🤦♂️🙏 అయన తో పోటీగ కాదు సర్ అయన తో పాటుగ https://t.co/EaSpkdjkp8 — Teja Sajja (@tejasajja123) January 2, 2024 -
'హనుమాన్'కు అడ్డంకులు.. ప్రభాస్ సాయం కోరుతున్న చిత్ర యూనిట్
హనుమాన్ చిత్రం కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ లీడ్ రోల్లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 11 భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే సంక్రాంతి రేసులో చాలా సినిమాలే ఉన్నాయి. గుంటూరు కారం, నా సామి రంగ, సైంధవ్ చిత్రాలతో పాటు తమిళ్ డబ్ సినిమాలు అయిన ధనుష్ 'కెప్టెన్ మిల్లర్', శివకార్తికేయన్ 'అయాలన్' చిత్రాలు లైన్లో ఉన్నాయి. దీంతో ఈసారి సంక్రాంతి సినిమాలకు థియేటర్లు దొరకడం అంత ఈజీ కాదని చెప్పవచ్చు. కొద్దిరోజుల క్రితం విడుదలైన హనుమాన్ చిత్రం ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో సినిమాపై భారీగా బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు కూడా ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా తమ సినిమాకు ఎవరో తెలియని వ్యక్తులు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి. 2024 సంక్రాంతి బరిలో హాట్ ఫేవరెట్‌గా గుంటూరు కారం ఉంది. మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో ఈ చిత్రం తెరకెక్కడంతో సాధారణంగా ఎక్కువ థియేటర్లు ఈ చిత్రం వైపే మొగ్గు చూపుతాయి. దీంతో 'హనుమాన్'ను వాయిదా వేసుకోవాలంటూ ఇప్పటికే పలువురు తమ మూవీ టీమ్‌ను సంప్రదించారంటూ ఆయన తెలిపారు. హనుమాన్ సినిమాను ఎవరో తెలియని వ్యక్తులు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన చెప్పారు. సెన్సార్ విషయంలోనూ కూడా కొందరు ఇబ్బంది పెట్టారని ప్రశాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఎన్ని జరిగినా తాము ముందుగా అనుకున్నట్లే 'హనుమాన్' చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తామని ఆయన చెప్పారు. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 38 నిముషాలు ఉండనుంది. హనుమాన్ కోసం ప్రభాస్ జనవరి 12న హనుమాన్ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుంది. పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలో బాలీవుడ్ విభాగంలో సుమారు 1500 థియేటర్లలో హనుమాన్ విడుదల కానుందని సమాచారం. కానీ అక్కడ సినిమాకు బజ్క్రియేట్ కావాలంటే ఒక డైనోసార్‌ను దింపాలి. అదే పని ఇప్పుడు మేకర్స్ చేస్తున్నారు. హనుమాన్ ప్రమోషన్స్‌లో భాగంగా త్వరలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభాస్‌ను తీసుకొచ్చేందుకు తనతో పాటు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోందంటూ ప్రశాంత్ తెలిపారు. -
నీ రాక అనివార్యం హనుమా..విజువల్ వండర్లా ‘హను-మాన్’ ట్రైలర్
తేజా సజ్జ హీరోగా నటించిన తాజా చిత్రం ‘హను-మాన్’. ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ఇది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్,మూడు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. పవర్ఫుల్ డైలాగ్స్.. అద్భుతమైన విజువల్స్‌తో ట్రైలర్ అదిరిపోయింది. క్వాలిటీ విషయంలో ప్రశాంత్ వర్మ ఎక్కడా రాజీ పడనట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ‘యతో ధర్మ స్తతో హనుమ..యతో హనుమ..స్తతో జయ’అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. పల్లెటూరిలో ఉండే హీరోకి ఒక స్పెషల్ పవర్ ఉండడం.. విలన్(వినయ్ రాయ్) ఆ పవర్ కోసం ప్రయోగాలు చేయడం.. హీరో గురించి తెలిసి అతన్ని చంపేందుకు ప్రయత్నిస్తే హనుమంతుడు ఎలా కాపాడాడు? అసలు హీరోకి ఉన్న స్పెషల్ పవర్ ఏంటి? మామూలు వ్యక్తికి ఆ పవర్స్ ఎలా వచ్చాయి? రాక్షససంహారం చేయడానికి హనుమంతుడు ఏం చేశాడు? అనేది ఈ సినిమా కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ‘పోలేరమ్మ మీద ఒట్టు..నా తమ్ముడి మీద చేతులు పడితే ఒక్కొక్కరికి టెంకాయలు పగిలిపోతాయి’ అని వరలక్ష్మీ శరత్ కుమార్ చేసే ఫైట్ సీన్ ట్రైలర్‌కి స్పెషల్ అట్రాక్షన్. ‘నీకు కనబడుతుంది ఒకడి ఉన్మాదం మాత్రమే కానీ దాని వెనుక ఒక ఉపద్రవం దాగిఉంది’, ‘కలియుగంలో ధర్మంకోసం పోరాటే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు.. నీ వెంటా ఉన్నాడు..మానవాళి మనుగడను కాపాడుకోవడం కోసం నీ రాక అనివార్యం హనుమా’ లాంటి డైగాల్స్తో ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. -
ఇప్పుడు ఇండియన్ సూపర్ హీరోగా వస్తున్నా: తేజ సజ్జ
-
సంక్రాంతికి సై
సంక్రాంతి పండగ అంటే సినిమాల పండగ కూడా. పండగ వసూళ్లను దండుకోవడానికి సంక్రాంతి మంచి సమయం. అందుకే ‘సంక్రాంతికి సై’ అంటూ తమ సినిమాలను విడుదల చేస్తుంటారు. 2024 సంక్రాంతి పండగకి మరో నెలకు పైగా సమయం ఉన్నా అప్పుడే ఇండస్ట్రీలో సంక్రాంతి జోష్ కనిపిస్తోంది. ఈసారి పండగకి దాదాపు అరడజను స్ట్రయిట్ తెలుగు, దాదాపు ఐదు డబ్బింగ్ చిత్రాలతో సినిమాల జోరు బాగానే కనిపించనుంది. సినీ లవర్స్‌కి పండగకి దాదాపు పది చిత్రాలు రానున్నాయి. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. ► ‘సోగ్గాడే చిన్నినాయనా’ (2016), ‘బంగార్రాజు’ (2022) వంటి చిత్రాలతో సంక్రాంతి రేసులో నిలిచి, విజయం అందుకున్నారు నాగార్జున. ‘నా సామి రంగ’ చిత్రంతో ఈసారి మళ్లీ సంక్రాంతి బరిలో నిలుస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఇందులో నాగార్జున ఫుల్ మాస్ లుక్‌లో కనిపిస్తారు. ఆయన మాట తీరు, యాక్షన్ సీక్వెన్సులు అన్నీ కొత్తగా, స్టైలిష్‌గా ఉంటాయి. నాగార్జున పుట్టిన రోజు (ఆగస్ట్ 29) సందర్భంగా విడుదల చేసిన నాగార్జున లుక్, గ్లింప్స్ ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ‘ఈ పండక్కి నా సామి రంగ’ అంటూ గ్లింప్స్ చివర్లో నాగార్జున చెప్పిన డైలాగ్ వైరల్ అవుతోంది. ఆయన కెరీర్లో 99వ సినిమాగా ‘నా సామి రంగ’ రూపొందుతోంది. శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించలేదు కానీ, సంక్రాంతికి రిలీజ్ పక్కా అని డుదలైన గ్లింప్స్ స్పష్టం చేస్తోంది. ► ‘సైంధవ్’ సినిమాతో వెంకటేశ్ సంక్రాంతి బరిలో దిగుతున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సైంధవ్’. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. వెంకటేశ్ కెరీర్లో ‘సైంధవ్’ 75వ చిత్రం కావడంతో అటు ఇండస్ట్రీ వర్గాల్లో ఇటు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. పైగా ఆయన నటిస్తున్న తొలి పాన్ ఇండియన్ సినిమా ఇదే కావడం విశేషం. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది. ‘సైంధవ్’ చిత్రాన్ని ఈ డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నట్లు తొలుత మేకర్స్ ప్రకటించారు. అయితే ప్రభాస్ ‘సలార్’ చిత్రాన్ని అదే రోజు రిలీజ్ చేయనున్నట్లు ఆ చిత్రబృందం ప్రకటించడంతో సంక్రాంతి బరిలో దిగారు వెంకటేశ్. ► గ్యాప్ ఇవ్వకుండా వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు రవితేజ. ఈ దసరాకి ‘టైగర్ నాగేశ్వరరావు’గా వెండితెరపై కనిపించారు. సంక్రాంతికి ‘ఈగల్’ చిత్రంతో బరిలో దిగడానికి రెడీ అయ్యారు. రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ఇందులో కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. అయితే ఆ తేదీకి విడుదలవుతుందా? వాయిదా పడుతుందా అనే చర్చ వినిపిస్తోంది. కానీ చెప్పిన తేదీకి పక్కా వస్తామంటూ రిలీజ్ కౌంట్‌డౌన్ మొదలు పెట్టారు మేకర్స్. రవితేజ కెరీర్లోనే ‘ఈగల్’ వినూత్నమైన యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోందని, ఇందులో రవితేజ శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తారని చిత్రయూనిట్ పేర్కొంది. ► ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు గుంటూరు కారం ఘాటు చూపించ డానికి ‘గుంటూరు కారం’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు హీరో మహేశ్‌బాబు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. ఈ చిత్రంలో మహేశ్‌బాబు పక్కా మాస్ లుక్‌లో కనిపించ నున్నారని ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, గ్లింప్స్ చెబుతున్నాయి. ► ‘ఖుషి’ వంటి హిట్ సినిమా తర్వాత విజయ్ దేవర కొండ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. ‘గీత గోవిందం’ (2018) వంటి హిట్ మూవీ తర్వాత విజయ్–పరశురామ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఫ్యామిలీ స్టార్’. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి పోటీలో నిలవనుంది. అయితే ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావడం లేదనే చర్చ తాజాగా ఫిల్మ్‌నగర్ వర్గాల్లో జరుగుతోంది. ఒకవేళ సంక్రాంతికి విడుదల కాకపోతే మార్చిలో రిలీజ్ కానుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అక్కడి షెడ్యూల్ పూర్తయ్యాక తర్వాతి షెడ్యూల్ చిత్రీకరణకు అమెరికాకు బయలుదేరనుంది యూనిట్. దాదాపు నెలరోజులకు పైగా అక్కడి లొకేషన్స్‌లో షూటింగ్ జరపనున్నారట. సంక్రాంతికి ఇంకా నెలన్నరే ఉంది. కానీ ‘ఫ్యామిలీ స్టార్’ షూటింగ్‌కి దాదాపు అంతే సమయం పడుతుందట. అందుకే ఈ చిత్రం సంక్రాంతి బరిలో నిలుస్తుందా? లేదా అనే చర్చ జరుగుతోంది. ► ఈ సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు దిగుతుంటే నేనూ వస్తున్నానంటున్నాడు యువ హీరో తేజ సజ్జా. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘హను–మాన్’. ‘జాంబీ రెడ్డి’ వంటి హిట్ మూవీ తర్వాత తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ఇది. అమృతా అయ్యర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడి, చివరికి సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ కానుంది. డబ్బింగ్ కూడా.. పండగకి స్ట్రయిట్ చిత్రాలతో పాటు అనువాద చిత్రాలు కూడా వస్తుంటాయి. ఈసారి రజనీకాంత్ సినిమాతో పాటు జోరుగా బరిలో నిలవనున్న అనువాద చిత్రాలేవో తెలుసుకుందాం. ‘జైలర్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న రజనీకాంత్ ‘లాల్ సలాం’తో పొంగల్ (సంక్రాంతి) బరిలో దిగుతున్నారు. ఆయన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ హీరోలుగా నటిస్తున్నారు. ఇందులో స్టార్ క్రికెటర్ కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ధనుష్, ప్రియాంకా అరుళ్ మోహనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని జి.శరవణన్, సాయి సిద్ధార్థ్ నిర్మిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. శివ కార్తికేయన్ హీరోగా రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘అయలాన్’. ఆర్. రవికుమార్ దర్శకత్వంలో ఆర్డీ రాజా నిర్మిస్తున్న ఈ సినిమా కూడా సంక్రాంతికి రిలీజవుతోంది. తమన్నా, రాశీ ఖన్నా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘అరణ్మనై 4’. స్వీయ దర్శకత్వంలో ‘అరణ్మనై’ ఫ్రాంచైజీలో భాగంగా సుందర్ .సి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం పొంగల్‌కి రిలీజ్ కానుంది. -
సంక్రాంతి థియేటర్స్ లో హనుమాన్ తో పండగ చేసుకుందాం
-
ఈ చిన్నారులిద్దరూ ఇప్పుడు హీరోహీరోయిన్స్.. గుర్తుపట్టారా?
నేటి బాలలే రేపటి పౌరులు.. అన్న విధంగా ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులే ఇప్పుడు హీరోహీరోయిన్లుగా రాణిస్తున్నారు. బాలనటులుగా నటించిన ఎందరో ఇప్పుడు అగ్రతారలుగా చలామణీ అవుతున్నారు. మరికొందరేమో స్టార్ హీరోలతో పోటీపడుతూ సినిమాలు చేస్తున్నారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ పిల్లలిద్దరూ టాలీవుడ్లో సినిమాలు చేశారు. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా? ఒకరేమో హీరో తేజ సజ్జ.. మరొకరేమో హీరోయిన్ శ్రీదివ్య. చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోగా ఈ స్టిల్ యువరాజు సినిమాలోనిది. తేజ టాలీవుడ్లో బిజీ అయిపోతుంటే శ్రీదివ్య కోలీవుడ్‌లో వరుసపెట్టి సినిమాలు చేస్తోంది. తేజ సజ్జ.. అనేక సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, మహేశ్‌బాబు, శ్రీకాంత్.. ఇలా ఎందరో స్టార్ హీరోల సినిమాల్లో బుడ్డోడిగా నటించి మెప్పించాడు. చిన్నతనంలోనే నటనలో ఆరితేరిన తేజ.. జాంబి రెడ్డి సినిమాతో హీరోగా మారాడు. ఇష్క్, అద్భుతం చిత్రాల్లో కథానాయకుడిగా నటించాడు. ప్రస్తుతం హనుమాన్ సినిమా చేస్తున్నాడు. బిజీ అయిపోయిన శ్రీదివ్య శ్రీదివ్య.. హనుమాన్ జంక్షన్, యువరాజ్, వీడే, భారతి సినిమాల్లో బాలనటిగా మెప్పించింది. మనసారా సినిమాతో హీరోయిన్గా మారింది. బస్ స్టాప్, కేరింత చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగింటి అమ్మాయైన శ్రీదివ్య తమిళంలో బాగా బిజీ అయింది. మలయాళంలోనూ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ఇటీవలే రైడ్ మూవీతో తమిళ ప్రేక్షకులను పలకరించింది. View this post on Instagram A post shared by Sri Divya (@sd_sridivya) చదవండి: పాపం.. సెల్ఫీ అడిగినందుకు అభిమానిని కొట్టి మెడ పట్టి తోశారు.. మరీ ఇంత ఘోరమా? -
సంక్రాంతి రేసులోకి 'హనుమాన్'.. వర్కౌట్ అవుతుందా?
టాలీవుడ్లో ఫాంటసీ కథలతో వచ్చిన సినిమాలు చాలా తక్కువ అనే చెప్పాలి. గ్రాఫిక్స్ ప్రధానంగా తీసే చిత్రాల్లో రాజమౌళి ఫెర్ఫెక్ట్. మిగతా దర్శకులు అలాంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడుతున్నారు. ప్రేక్షకులతో తిట్లు తింటున్నారు. అయితే ఇప్పుడు అలాంటి వాళ్లందరూ ఓ సినిమా కోసం కాస్తంత ఎక్కువగానే ఎదురుచూస్తున్నారు. అదే ప్రశాంత్ వర్మ 'హనుమాన్'. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. సంక్రాంతి రేసులో హాలీవుడ్ లో వచ్చే సూపర్ హీరోల సినిమాలు చూసి మనం ఆహో ఓహో అంటుంటాం. వాళ్లందరికీ గురువు లాంటివాడు ఆంజనేయుడు. ఆయన కథతో ప్రశాంత్ వర్మ 'హనుమాన్' అనే చిత్రాన్ని తీస్తున్నాడు. గ్రాఫిక్స్ ప్రధానం కావడం వల్ల గత రెండేళ్ల నుంచి ఈ సినిమా సెట్స్ పైనే ఉంది. ఏదో తొందరపడి విడుదల చేయాలని కాకుండా నిదానంగా ఒక్కో పనిచేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అవన్నీ ఓ కొలిక్కి వచ్చినట్లు ఉన్నాయి. మరో ఆరు నెలల్లో అంటే వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్ని థియేటర్లలో తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. (ఇదీ చదవండి: SPY Review In Telugu: 'స్పై' సినిమా రివ్యూ) ఏకంగా అన్ని సినిమాలు? వచ్చే సంక్రాంతి బరిలో ఒకటి తర్వాత ఒకటి అన్నట్లు బోలెడన్ని సినిమాలు వచ్చి చేరుతున్నాయి. ప్రభాస్ 'ప్రాజెక్ట్ K'ని జనవరి 12న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. మహేశ్ 'గుంటూరు కారం', రవితేజ 'ఈగిల్' ముగ్గుల పండక్కే వచ్చేందుకు సిద్ధమైపోయాయి. వీటితోపాటు విజయ్ దేవరకొండ-పరశురామ్ మూవీ, పవన్ కల్యాణ్ 'ఓజీ', చిరంజీవి-కల్యాణ్ కృష్ణ కాంబోలోని సినిమాను కూడా సంక్రాంతికే తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. 'హనుమాన్' స్పెషల్ ప్రశాంత్ వర్మ తీస్తున్న 'హనుమాన్' సినిమాని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్.. ఇలా 11 భాషల్లో విడుదల చేయబోతున్న తెలుగు సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఇందులో హీరోగా తేజ సజ్జా నటిస్తున్నాడు. అమృత అయ్యర్ హీరోయిన్. వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్ర చేస్తోంది. ఇలా సమ్‌థింగ్ స్పెషల్ అనిపిస్తున్న ఈ చిత్రం.. సంక్రాంతికి మిగతా సినిమాలతో కలిసి బరిలోకి దిగుతుందా? లేదా ప్లాన్ ఏమైనా మార్చుకుంటుందా అనేది చూడాలి. pic.twitter.com/LjAYhaDO9V — Prasanth Varma (@PrasanthVarma) July 1, 2023 (ఇదీ చదవండి: ‘సామజవరగమన’ మూవీ రివ్యూ) -
హనుమంతుణ్ణి నమ్మాం, ఆయన వల్లే ఇది.. : డైరెక్టర్
‘‘హను–మాన్’ చిత్రాన్ని చిన్నదిగా స్టార్ట్ చేశాం. అయితే మా మూవీ హనుమంతుని వలే భారీ ప్రాజెక్టు అయ్యింది. మేము హనుమంతుణ్ణి, కథని నమ్మాం. అద్భుతమైన విజువల్ ట్రీట్‌గా రూపొందిన ‘హను–మాన్’ అందరి అంచనాలు అందుకుంటుంది’’ అని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అన్నారు. తేజ సజ్జ హీరోగా నటించిన చిత్రం ‘హను–మాన్’. చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్టైన్ మెంట్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. నేడు ప్రశాంత్ వర్మ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ–‘‘తెలుగులో గొప్పదర్శకులు చాలా అద్భుతమైన చిత్రాలు తీశారు. వాళ్ల కంటే నేను బెటర్‌గా తీయలేను. నాకంటూ ఒక యూనిక్ జోనర్ క్రియేట్ చేయాలనే ఆలోచనలో భాగంగా కొత్త జోనర్స్‌పై దృష్టి పెట్టాను. ఆ క్రమంలో ‘అ, కల్కి, జాంబి రెడ్డి’ సినిమాలు చేశాను. తర్వాత నాకు ఇష్టమైన సూపర్ హీరో కథతో ‘హను–మాన్’ తీశా. హనుమంతుని కథలో జరిగిన ఒక కీలక ఘటనని తీసుకొని ఈ మూవీ చేశాం. ‘హను–మాన్’ టీజర్ విడుదలైన తర్వాత రాజమౌళిగారిని కలిశాను. ఆయన ఇచ్చిన సూచనలతో మాకు చాలా సమయం కలిసొచ్చింది. జూలై ఫస్ట్ వీక్‌లో సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తాం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌ని(పీవీసీయూ) నా బర్త్ డే కానుకగా నేడు అనౌన్స్ చేస్తాను. ప్రస్తుతం నా దర్శకత్వంలో ‘అధీర’ ఫిల్మ్ రూపొందుతోంది. బాలకృష్ణగారితోనూ ఓ సినిమా ఉంటుంది’’ అన్నారు. -
అంజనాద్రి కోసం సాహసాలు
అంజనాద్రి కోసం అహార్నిశలు కష్టపడ్డారు తేజ సజ్జా. అంజనాద్రి రక్షణకు ఈ యువ హీరో ఎలాంటి సాహసాలు చేశాడు అనేది ‘హను–మాన్’ సినిమాలో చూడాలి. తేజ సజ్జా, అమృతా అయ్యర్ హీరో హీరోయిన్లుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హను–మాన్’. చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 12న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. ‘అంజనాద్రి’ అనే ఊహాత్మక ప్రదేశం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘హను–మాన్’. హనుమంతుని శక్తులను పొంది అంజనాద్రి కోసం కథానాయకుడు ఎలా పోరాడాడనేది చిత్రకథాంశం. ‘‘హను–మాన్’ టీజర్‌పై ప్రేక్షకులు చూపించిన ప్రేమ మా బాధ్యతను బాగా పెంచింది. గ్రాఫిక్స్ వర్క్స్ పెండింగ్ ఉండటం వల్ల ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నాం. త్వరలో కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళ, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్తో సహా పలు భారతీయ భాషలలో పాన్ వరల్డ్‌గా హను–మాన్ చిత్రం రిలీజ్ కానుంది. వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్, కెమెరా: శివేంద్ర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అస్రిన్ రెడ్డి. -
వెనక్కి తగ్గిన ప్రశాంత్ వర్మ.. హనుమాన్ వాయిదా
తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా హనుమాన్. జాంబిరెడ్డి లాంటి హిట్ మూవీ తర్వాత వీరిద్దరూ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. ఫస్ట్ పాన్ ఇండియన్ సూపర్ హీరో మూవీ కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్గా విడుదలైన టీజర్‌తో ఈ మూవీపై మరింత హైప్ నెలకొంది. దీంతో రిలీజ్ డేట్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేవలం నాలుగు నెలల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను ఈనెల 12న విడుదల చేయనున్నట్లు తొలుత ప్రకటించారు. కానీ గ్రాఫిక్ పనులు, ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ కాకపోవడంతో రిలీజ్ డేట్‌ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామని తెలిపారు. కాగా ఈ సినిమాలో తేజ సజ్జాకు జోడీగా అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తుండగా, వరలక్ష్మీ శరత్‌కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. View this post on Instagram A post shared by Prasanth Varma (@prasanthvarmaofficial) -
Hanuman Movie Stills: హనుమాన్ మూవీ స్టిల్స్ ఫోటో గ్యాలరీ
Teja Sajja: హనుమాన్ మూవీ స్టిల్స్ ఫోటో గ్యాలరీ -
Hanu-Man: అంజనాద్రి కోసం పోరాటం
తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘హను–మాన్’. అమృతా అయ్యర్ కథానాయిక. శ్రీమతి చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ సోమవారంతో పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘హనుమంతుని శక్తులను పొందిన హీరో అంజనాద్రి కోసం ఎలా పోరాటం చేశాడు? అనేది చిత్ర కథాంశం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళ, కన్నడ, మలయాళ, ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్‌గా ఈ చిత్రం విడుదల కానుంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తాం’’ అన్నారు. -
హనుమాన్ పాన్ వరల్డ్ రిలీజ్ డేట్ వచ్చేసింది
తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం హనుమాన్. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో అమృతా అయ్యర్ కథానాయిక. చైతన్య సమర్పణలో కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వదిలారు మేకర్స్. ఈ సినిమా మే 12న తెలుగు, హిందీ, మరాఠి, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల కానున్నట్లు ప్రకటించారు. భారత్‌తో పాటు అమెరికా, చైనా, జపాన్, యూకే, ఆస్ట్రేలియా, స్పెయిన్, ఆస్ట్రేలియా, జెర్మనీ, శ్రీలంక, మలేషియా దేశాల్లో రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశారు. హనుమంతుడి అనుగ్రహంతో ఓ కుర్రాడికి సూపర్ పవర్ వస్తే ఏం చేస్తాడనేదే సినిమా కథ. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇదివరకే రిలీజైన హనుమాన్ టీజర్లో వీఎఫ్ఎక్స్ హాలీవుడ్ స్టాండర్స్‌ను తలదన్నేలా ఉండటంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. #HanuManFromMay12th pic.twitter.com/SIDCSD6wns — Teja Sajja (@tejasajja123) January 9, 2023 చదవండి: -
'హనుమాన్'కి గ్రాఫిక్స్ హాలీవుడ్ కాదు.. మన హైదరాబాద్‌లోనే
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజసజ్జా హీరోగా తెరకెక్కుతున్న సినిమా హనుమాన్. సూపర్ హీరో కాన్సెప్టుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. అమృత అయ్యర్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంజనాద్రి (Anjanadri) అనే ఒక ఊహాలోకంలో జరిగే సూపర్ హీరో థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇటీవలె ఈ సినిమా టీజర్ విడుదలై జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనూ విశేషంగా ఆకట్టుకుంది. దీనికి మరో ప్రధాన కారణం "వి.ఎఫ్.ఎక్స్". హాలీవుడ్ స్టాండర్డ్స్ ను తలదన్నేలా కనిపిస్తున్న ఈ గ్రాఫిక్స్ అద్దింది హైదరాబాద్ కు చెందిన "హేలో హ్యూస్ స్టూడియోస్" సంస్థ. దీంతో ఈ గ్రాఫిక్స్ కంపెనీ గురించి పలువురు టాలీవుడ్ దర్శకులు చర్చించుకుంటున్నారు. -
అదే హనుమాన్ కథ, ఇది పాన్ వరల్డ్ చిత్రం: ప్రశాంత్ వర్మ
ఇది పాన్ వరల్డ్ చిత్రం ‘‘మన తెలుగు సినిమాలు ‘ఆర్ఆర్ఆర్, కార్తికేయ 2’ పాన్ వరల్డ్ వెళుతున్నాయి. మా ‘హనుమాన్’ కూడా పాన్ వరల్డ్ ఫిల్మ్. తమిళ, హిందీ, మలయాళం, కన్నడ ప్రేక్షకులు కూడా ఇది తమ సినిమా అని భావించేలా ఉంటుంది’’ అని ప్రశాంత్ వర్మ అన్నారు. తేజ సజ్జా, అమృతా అయ్యర్ జంటగా నటించిన చిత్రం ‘హనుమాన్’. చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. చదవండి: అదిరిపోయిన 'హనుమాన్' టీజర్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ ఈ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమంలో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. ‘‘నాకు చిన్నప్పటి నుండి ఇష్టమైన హనుమాన్ పేరుతో ఇంత పెద్ద సినిమా చేయడం హ్యాపీగా ఉంది. అనుకున్న బడ్జెట్ కంటే ఆరింతలు ఎక్కువ అయినా నిరంజన్ రెడ్డిగారు రాజీపడలేదు. పౌరాణిక పాత్ర అయిన హనుమాన్‌పై తొలిసారి పూర్తి స్థాయి సినిమా చేయడం హ్యాపీ’’ అన్నారు. తేజ సజ్జా మాట్లాడుతూ.. ‘‘స్పైడర్ మాన్, సూపర్ మాన్ ఫిక్షనల్ హీరోలు. కానీ, హనుమాన్ మన చరిత్ర. అలాంటి గొప్ప దేవుడు హనుమంతుడి అనుగ్రహంతో ఒక కుర్రాడికి సూపర్ పవర్ వస్తే ఏం చేస్తాడు? అనేది ఈ సినిమా’’ అన్నారు. ‘‘హనుమాన్’తో త్వరలోనే థియేటర్లో కలుద్దాం’’ అన్నారు అమృత. చదవండి: జబర్దస్త్ ‘పంచ్’ ప్రసాద్ ఆరోగ్యంపై డాక్టర్లు ఏమన్నారంటే? -
అదిరిపోయిన 'హనుమాన్' టీజర్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజసజ్జా హీరోగా తెరకెక్కుతున్న సినిమా హనుమాన్. సూపర్ హీరో కాన్సెప్టుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. అమృత అయ్యర్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుండగా వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించింది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. కొండలు, లోయలు, జలపాతాల నడుమ విజువల్ వండర్‌గా టీజర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు. The Ancients Shall Rise Again✊ Taking you all into a whole new surreal world of #HanuMan 💪#HanuManTeaser OUT NOW❤️🔥 - https://t.co/euGU07T7Ha 🌟ing @tejasajja123 @Actor_Amritha @Niran_Reddy @Chaitanyaniran @Primeshowtweets #PVCU#SuperHeroHanuMan pic.twitter.com/QCcSNvx1Nu — Prasanth Varma (@PrasanthVarma) November 21, 2022 -
'హనుమాన్' టీజర్.. కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ప్రశాంత్ వర్మ
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న తాజాచిత్రం హనుమాన్. తేజసజ్జా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తోంది. ఫిక్షన్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇదివరకే రిలీజ్ కావాల్సి ఉండగా సూపర్ స్టార్ కృష్ణ మృతితో వాయిదా పడింది. తాజాగా హనుమాన్ టీజర్‌పై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అప్డేట్ ఇచ్చారు. ఈనెల 21న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ను వదిలారు. కాగా ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది. త్వరలోనే సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. #HanuManTeaser on NOV 21st @ 12:33PM💥 🌟ing @tejasajja123#SuperHeroHanuMan ❤️🔥@Actor_Amritha @varusarath5 @VinayRai1809 @Niran_Reddy @Chaitanyaniran @AsrinReddy @Primeshowtweets @tipsmusicsouth pic.twitter.com/Ecnoo1hHji — Prasanth Varma (@PrasanthVarma) November 19, 2022 -
'హనుమాన్' టీజర్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ
అ!’, ‘కల్కి’, ‘జాంబిరెడ్డి’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆయన దర్శకత్వంలో తేజసజ్జా నటిస్తున్న తాజా చిత్రం హనుమాన్. ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ఆసక్తి కలిగిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం మరో కీలక అప్డేట్ను వదిలారు. ఈ సినిమా టీజర్‌ను ఈనెల 7న రిలీజ్ చేయనున్నట్లు తెలిపాడు ప్రశాంత్ వర్మ. కాగా ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌరా, జై క్రిష్, కృష్ణ సౌరభ్ లు సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో అంజమ్మ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించారు. -
'హనుమాన్'పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హీరో తేజ సజ్జా నటిస్తున్న చిత్రం హనుమాన్. ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ఆసక్తి కలిగిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం మరో అప్డేట్ వచ్చింది. నేడు(మంగళవారం) హీరో తేజ సజ్జా పుట్టినరోజు కావడంతో ఆయనకి విషెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్ని రిలీజ్ చేశారు.ఈ సినిమా నుంచి అసలైన గిఫ్ట్ ఈ దసరాకి అందిస్తానని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెలిపారు. కాగా ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌరా, జై క్రిష్, కృష్ణ సౌరభ్ లు సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో అంజమ్మ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు. Happy birthday my Super Hero @tejasajja123 🤗 Gift #Dussehra ki yisthaa! 😉#HanuMan #HappyBirthdayTejaSajja 🥳#SuperHeroHanuMan🔶@Actor_Amritha @varusarath5 @VinayRai1809 @Niran_Reddy @Chaitanyaniran @Primeshowtweets @tipsofficial pic.twitter.com/qMBLw6TdCH — Prasanth Varma (@PrasanthVarma) August 23, 2022 -
పవర్ఫుల్ విలన్ పాత్రలో ఆ హీరో.. అదరగొడుతున్న పోస్టర్
యంగ్ హీరో తేజ సజ్జ, హీరోయిన్ అమృత అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'హనుమాన్'. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ఆసక్తి కలిగించాయి. తాజాగా విడుదలైన మరో పోస్టర్ మరింత ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ మైఖెల్ పాత్రలో హీరో వినయ్ రాయ్ నటిస్తున్నాడు. తాజాగా ఆయన పోస్టర్‌ను రానా దగ్గుబాటి ఆవిష్కరించాడు. పోస్టర్ చూస్తుంటే ఇందులో వినయ్ రాయ్ అత్యంత బాడాస్ ఈవిల్ మ్యాన్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. బ్లాక్ లాంగ్ సూట్లో చుట్టూ డ్రోన్స్‌తో ఉన్న వినయ్ రాయ్ పోస్టర్ థ్రిల్లింగ్‌గా ఉంది. వినయ్ రాయ్ ఇంతకుముందు నీవల్లే నీవల్లే, వాన సినిమాలో హీరోగా అలరించాడు. కాగా ఈ మూవీలో ఓ కీరోల్లో వరలక్ష్మీ శరత్ కుమార్ నటించనున్న విషయం తెలిసిందే. చదవండి: చిరంజీవి బయోపిక్ గురించి నేను అలా అనలేదు: సీనియర్ నటుడు -
Hanuman: నో డూప్, ఎనిమిది గంటల పాటు తాడు పైనే!
Hero Teja Sajja Hanuman Movie: తేజ సజ్జ, అమృతా అయ్యర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘హను మాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ 100వ రోజు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘మొదటి పాన్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం ‘హను మాన్’ చిత్రీకరణ పూర్తి కావొస్తోంది. చదవండి: మాజీ భార్య ఐశ్యర్యపై ధనుష్ ట్వీట్, అంత మాట అనేశాడేంటి! సూపర్ హీరో సినిమాల్లో అధికంగా యాక్షన్ సన్నివేశాలుంటాయి. ఈ సినిమాలోనూ అలాంటివి ఉన్నాయి. అయినా హీరోకి ఎలాంటి డూప్‌లు లేకుండా షూట్ చేస్తున్నాం. తేజ సజ్జ చాలా రోజులుగా వరుసగా 8 గంటల పాటు రోప్‌పై ఉండాల్సి వస్తోంది’’ అన్నారు. కాగా ఈ మూవీలో వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. -
100 రోజులు పూర్తి.. సెలబ్రేట్ చేసుకున్న ‘హను-మాన్’ టీమ్
వినూత్న కథలతో సినిమాని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆయన తాజాగా దర్శకత్వం వహిస్తున్న సినిమా హానుమాన్. తేజ సజ్జ హీరోగా చేస్తున్న ఈ సినిమాని ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి అప్డేట్ వచ్చింది. ఈ మూవీ 100 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుందని ఓ వీడియో ద్వారా మేకర్స్ ప్రకటించారు. చాలా మంది ఈ చిత్రం కోసం కష్టపడుతున్నట్లు తెలిపారు. భారీ వీఎఫ్ఎక్స్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌరా, జై క్రిష్, కృష్ణ సౌరభ్ లు సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో అంజమ్మ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ ఈ చిత్రం విడుదల కానుంది. Thank you my cast & crew for bearing with me these 100 DAYS! ♥️ I promise to make this film worth all your efforts & handwork! 🙏🏼 HANU🔶MAN@tejasajja123 @Actor_Amritha @varusarath5 @Niran_Reddy @Chaitanyaniran @AsrinReddy @Primeshowtweets#HanuManTheOrigin pic.twitter.com/8cXNqOrubY — Prasanth Varma (@PrasanthVarma) March 17, 2022 -
మంచి కాన్సెప్ట్ లేకపోతే సినిమా తీయను
‘‘పంపిణీ రంగం నుంచి నిర్మాతగా మారినందుకు హ్యాపీగా ఉంది. ఓవర్సీస్లో సినిమాలను విడుదల చేయడంవల్ల కొన్నిసార్లు నిర్మాతలకంటే మాకే ఎక్కువ డబ్బులు వచ్చేవి. నాకు కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలంటే ఇష్టం. మంచి కాన్సెప్ట్ లేకపోతే సినిమా తీయను’’ అన్నారు నిర్మాత సృజన్ యరబోలు. తేజ సజ్జా, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన ‘అద్భుతం’ చిత్రం ఇటీవల ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన సృజన్ మాట్లాడుతూ– ‘‘నేనుయూఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ని. జాబ్ చేస్తూనే సినిమాలు నిర్మిస్తున్నాను. ‘‘కంచె’ చిత్రాన్ని ఓవర్సీస్లో డిస్ట్రిబ్యూట్ చేయడంతో నా జర్నీ మొదలైంది. ఆ తర్వాత ‘అర్జున్‌రెడ్డి’, ‘మహానటి’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’.. ఇలా దాదాపు ముప్ఫై సినిమాలను ఓవర్సీస్లో డిస్ట్రిబ్యూట్ చేశాను. ఆ తర్వాత నిర్వాణ బ్యానర్లో భాగమై తీసిన ‘మను’, ‘సూర్య కాంతం’ ఆడలేదు. ఇప్పుడు ఎస్ ఒరిజినల్స్ బ్యానర్ స్టార్ట్ చేశాను. మా బ్యానర్లో ప్రస్తుతం ఎనిమిది ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘పంచతంత్రం’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. బ్రహ్మానందంగారి తనయుడు గౌతమ్‌తో సినిమా చేస్తున్నాం. సంతోష్ శోభన్‌తో సినిమా ఉంది. ‘గతం’ దర్శకుడు కిరణ్‌తో ఆల్రెడీ ఓ సినిమా తీశాం’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం ‘స్కైలాబ్’ చిత్రాన్ని ఓవర్ సీస్లో పంపిణీ చేస్తున్నాం. కరోనా బారి నుంచి ఇప్పుడిప్పుడే ఓవర్ సీస్ మార్కెట్ కోలుకుంటోంది. పెద్ద చిత్రాలు రిలీజైతే మరింత మెరుగుపడుతుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. -
జీవితా రాజశేఖర్ కూతురి సినిమాపై చిరంజీవి కామెంట్
Megastar Chiranjeevi Review On Adbutham Movie: తేజ సజ్జా, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన చిత్రం అద్భుతం. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 19న నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో రిలీజ్ అయ్యింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రంపై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇద్దరు వ్యక్తులకు ఒకే ఫోన్ నంబర్ ఇస్తే ఏం జరుగుతుంది? వారి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? అన్న నేపథ్యంలో సాగిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిత్రం గురించి మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. 'నిన్న రాత్రే హాట్‌స్టార్‌లో అద్భుతం మూవీ చూశాను. ఇది ఒక న్యూ ఎంగేజింగ్ నోవెల్ సినిమా. తేజ సజ్జా, శివానీల నటన చాలా ఇంప్రెసివ్‌గా ఉంది' అంటూ చిరు ట్వీట్లో పేర్కొన్నారు. మూవీ సక్సెస్‌పై చిత్ర యూనిట్‌కి కంగ్రాట్స్ చెప్పారు. Watched #AdbhutamOnHotStar last night.A new age film with engaging novel concept.Very Impressive performances by young team @tejasajja123 @Rshivani_1 They surely hv bright futures ahead! Congratulating & wishing entire team Great Success! @MallikRam99 @MahatejaC @PrasanthVarma — Chiranjeevi Konidela (@KChiruTweets) November 23, 2021 -
రాజశేఖర్ పెద్ద కూతురితో జాంబిరెడ్డి హీరో 'అద్భుతం'
బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించిన తేజ సజ్జా 'జాంబరెడ్డి' చిత్రంతో హీరోగా మారాడు. తొలి సినిమాతోనే ప్రయోగం చేసి హిట్ అందుకున్నాడు తేజ. కానీ తర్వాత చేసిన 'ఇష్క్: ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ'తో అపజయాన్ని మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం అతడు 'అద్భుతం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో హీరో రాజశేఖర్ పెద్ద కూతురు శివానీ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ఇద్దరు వ్యక్తులకు ఒకే ఫోన్ నంబర్ ఇస్తే ఏం జరుగుతుంది? వారి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? అన్నదే కథ. ఈ ట్రైలర్ సినీప్రియులను ఆకట్టుకుంటోంది. అద్భుతం సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో ఈ నెల 19న విడుదలవుతోంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. మరి ఈ సినిమాతో తేజ హిట్ అందుకుంటాడేమో చూడాలి! -
హను-మాన్: తేజ సజ్జా లుక్ అదిరిందిగా!
మొదటి సినిమానే ‘అ!’ వంటి వినూత్న కథతో తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆ తర్వాత కూడా కల్కి, జాంబీరెడ్డి వంటి డిఫరెంట్ జోనర్లనే కథ వస్తువుగా తీసుకున్నాడు. కాగా ఆయన మరోసారి ‘హను-మాన్’ వంటి వినూత్న కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని మాలయాళ స్టార్ హీరో, మహానటి ఫేం దుల్కర్ సల్మాన్ శనివారం (సెప్టెంబర్ 18న) విడుదల చేశాడు. తేజ సజ్జ హీరోగా చేస్తున్న ఈ సినిమాని శ్రీమతి చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఫస్ట్ గ్లింప్స్ విషయానికి వస్తే ప్రశాంత్ వర్మ హను-మాన్ చిత్రం కోసం అంజనాద్రి అనే కొత్త, ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించినట్లు తెలుస్తోంది. వీడియోలో తేజ సజ్జా అడవిలో పరిగెత్తడం, జారడం, దూకడం, స్లింగ్‌షాట్‌ను షూట్ చేయడం కనిపిస్తుంది. సూపర్ హీరో గట్టిగా భూమిని తాకినప్పుడు..అతని పంచింగ్ పవర్ ఏంటో చూపించారు. సౌండ్ డిజైన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. కాగా ఇంతకుముందు రిలీజ్ చేసిన `హను-మాన్` టైటిల్ టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో జాంబీ రెడ్డి కాంబీనేషన్ మ్యాజిక్ రిపిట్ చేస్తుందని చిత్రబృందం ఆశిస్తోంది ఈ సినిమాని తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ విడుదల చేయనున్నట్లు మూవీ టీం తెలిపింది. అత్యాధునిక వీఎఫ్ఎక్స్తో వస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే జరుగుతోంది. అయితే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. -
తేజ సజ్జ ‘ఇష్క్’ మూవీ రివ్యూ
టైటిల్ : ఇష్క్.. నాట్ ఎ లవ్‌స్టోరి జానర్ : రొమాంటిక్ థ్రిల్లర్ నటీనటులు : తేజ సజ్జ, ప్రియా ప్రకాశ్ వారియర్ నిర్మాణ సంస్థ : మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మాతలు : ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ దర్శకత్వం : యస్.యస్. రాజు సంగీతం : మహతి స్వరసాగర్ సినిమాటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు ఎడిటర్ : ఎ. వరప్రసాద్ విడుదల తేది : జూలై 30, 2021 చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో చిత్రాల్లో కనిపించి అలరించిన తేజ సజ్జా‘జాంబి రెడ్డి’తో హీరోగా మారిన సంగతి తెలిసిందే. డిఫరెంట్ జానర్‌తో తొలిసారే ప్రయోగం చేసి, తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ తరువాత వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నటించిన తాజా చిత్రం ‘ఇష్క్. కన్నుగీటుతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాలో హీరోయిన్. క్రేజీ కాంబినేషన్ లవ్ స్టోరీ ఊహిస్తే.. నాట్ ఏ లవ్ స్టోరీ అంటూ క్యాప్షన్ ఇచ్చి ఇష్క్ సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ దగ్గర నుంచి అందరిలో ఆసక్తి పెంచుతూ వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం (జూలై 30)న థియేటర్లలో విడుదలైంది. ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ‘ఇష్క్’ ఏ మేరకు అందుకుంది? ఈ సినిమాతో తేజ సజ్జా మరో హిట్‌ని ఖాతాలో వేసుకున్నాడా లేదా? రివ్యూలో చూద్దాం. కథ వైజాగ్‌కు చెందిన సిద్దార్థ్ అలియాస్ సిద్దు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. అనసూయ అలియాస్ అను(ప్రియా ప్రకాశ్ వారియర్)తో ప్రేమలో ఉంటాడు. అను బర్త్‌డే సందర్భంగా ఆమెతో లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేస్తాడు సిద్దు. కారులో అనును తీసుకొని వైజాగ్ బీచ్ రోడ్‌కి వెళ్తాడు. ఇద్దరు కలిసి డే మొత్తాని ఎంజాయ్ చేస్తారు. సాయంత్రం సమయంలో అనుని ఓ ముద్దు ఇవ్వమని కోరతాడు సిద్దు. దాని వల్ల వీరికి ఓ పెద్ద సమస్య వచ్చిపడుతుంది. అను, సిద్దు సన్నిహితంగా ఉన్న పోటోలు, వీడియోలు తీసిన మాధవ్(రవీందర్), పోలీసు ఆఫీసర్ని అని చెప్పి వారికి బ్లాక్ మెయిల్ చేస్తాడు. రాత్రంతా కారులోనే వారితో ప్రయాణం చేసి, అనుతో అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు. పోలీసు ఆఫీసర్ అనే భయంతో మాధవ్‌ని సిద్దు ఏం చేయలేకపోతాడు. కట్ చేస్తే.. మరుసటి ఉదయం సిద్ధుకి మాధవ్ గురించి ఓ నిజం తెలుస్తుంది. ఇంతకి సిద్ధుకి తెలిసిన నిజం ఏంటి? మాధవ్ నిజంగా పోలీసు ఆఫీసరా? కాదా? తన ప్రియురాలితో అసభ్యకరంగా ప్రవర్తించిన మాధవ్‌కు సిద్ధు ఏ విధంగా బుద్ది చెప్పాడు? చివరకు అను, సిద్ధుల ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేదే మిగతా కథ. నటీ నటులు సిద్దు పాత్రలో తేజ సజ్జ బాగానే నటించాడు. ఫస్టాఫ్‌లో రొమాంటిక్ యాంగిల్లో కనిపించిన సిద్దు.. సెకండాఫ్‌లో రివేంజ్ తీర్చుకునే ప్రేమికుడిగా అద్భుతంగా నటనను కనబరిచాడు. భయపడుతూనే.. తమ జంటను హింసించిన విలన్‌పై ప్రతీకారం తీర్చుకుంటాడు. అను పాత్రలో ప్రియా ప్రకాశ్ వారియర్ మెప్పించింది. సినిమాలో ఆమె పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. ఉన్నంతలో బాగానే చేసింది. ఇక శాడిస్ట్ పాత్రలో రవీంద్ర విజయ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. మిగతా నటీ, నటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. విశ్లేషణ మలయాళం ఇష్క్ సినిమాకి రీమేకే.. ఇష్క్.. నాట్ ఏ లవ్ స్టోరీ. ఆ సినిమాలో కొన్ని మార్పులు, చేర్పులు చేసిన దర్శకుడు యస్ యస్ రాజు తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ఫస్టాఫ్ అయితే ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టినట్లుగా ఉంటుంది. ముఖ్యంగా హీరో, హీరోయిన్లను విలన్ వేధించిన తీరు మరీ లెంతీగా చూపించడం సినిమాకు ప్రతికూల అంశమే. అలాగే సెకండాఫ్‌లో కూడా హీరో రివేంజ్ తీర్చుకునే సన్నివేశాలు కూడా సాగదీతగా, బోరింగ్‌గా ఉంటాయి. ఒకే పాయింట్‌ని పట్టుకొని సాగదీయడం సినిమాకి పెద్ద మైనస్. జంటలపై దాడుల, వేధింపులు అనే పాయింట్ కొత్తగానే ఉన్నా... తెరపై ఆకట్టుకునేలా చూపించలేకపోయారు. అయితే ఎండింగ్లో సిద్ధు, అనుల మధ్య వచ్చిన ట్విస్ట్ కూడా ఆకట్టుకుట్టుంది. ఇక సినిమాకి ఉన్నంతలో ప్లస్ పాయింట్ ఏంటంటే మహతి స్వరసాగర్ సంగీతం. ఒక్క పాట మినహా మిగతా పాటలు ఆకట్టుకోలేకపోయినా.. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ ఎ. వరప్రసాద్ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి. మొత్తంగా ఇష్క్ సినిమా చూడడం కాస్త రిస్కే. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఏపీ దిశ యాప్‌కి కనెక్ట్ అయ్యే సినిమా ఇది
‘‘భారతదేశంలో సినిమా షూటింగ్‌లకు సింగిల్ విండో విధానంలో అనుమతి ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే ఏపీలోని ఏ ప్రాంతంలోనైనా షూటింగ్ చేసుకునే అనుమతులు వచ్చే అవకాశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారు కల్పించారు. మా ఎగ్జిబిటర్స్ సమస్యని ఆయన దృష్టికి తీసుకెళితే తప్పకుండా పరిష్కరిస్తారనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత ఎన్వీ ప్రసాద్ అన్నారు. తేజా సజ్జ, ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా యస్.యస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇష్క్’. ఆర్బీ చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఎన్వీ ప్రసాద్ చెప్పిన విశేషాలు. థియేటర్లో సినిమా చూస్తే వచ్చే థ్రిల్ ఓటీటీలో రాదు. లాక్డౌన్ వల్ల థియేటర్ల వ్యవస్థ బాగా దెబ్బతింది. థియేటర్స్ మూత పడ్డా కూడా జీతాలు చెల్లించాలి. కరెంటు అనేది ప్రతి థియేటర్‌కి మినిమం లక్ష రూపాయలు చెల్లించాల్సిందే. మా అగ్రిమెంట్ ప్రకారమే చెల్లిస్తున్నాం. ఒకప్పుడు సినిమా వాళ్లకి ఐడీబీఎల్ లోన్లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఎవరూ లోన్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కేంద్ర ప్రభుత్వానికి ఎంతో ఆదాయం ఇస్తున్న సినిమా ఇండస్ట్రీని నాన్ ప్రియారిటీ సెక్షన్లో పెట్టడం ఎంత వరకు సమంజసం? థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఇష్క్’. ప్రేమకథలోనే థ్రిల్లింగ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ’ యాప్‌కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ‘ఇష్క్’ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు సినిమాలు డబ్ అవుతుండటం సంతోషం. థియేటర్లు ప్రారంభం అవుతున్నాయి కాబట్టే ఓటీటీ వాళ్లు ఇప్పుడు మరింత డబ్బు ఇచ్చి, సినిమాలు కొనేందుకు వస్తారు.. నిర్మాతలు జాగ్రత్తపడాలి. చిరంజీవిగారితో మేము నిర్మించనున్న సినిమా ఆగస్టు 13న ప్రారంభం అవుతుంది. -
ఆమె కన్ను కొట్టింది, నేను తొడ కొట్టాను: యంగ్ హీరో
Teja Sajja, Priya Prakash Varrier: సినిమా ట్రైలర్లో హీరోయిన్ను ముద్దిస్తావా? అని అంత ఈజీగా అడిగేసిన తేజ సజ్జ రియల్ లైఫ్‌లో మాత్రం ఎవరినీ ఆ ప్రశ్న అడగలేదట. సినిమా ఇస్తావా? అని చాలామంది దర్శకనిర్మాతలను అడిగానే తప్ప ఇలా ముద్దు కోసం అమ్మాయిల వెంట పడలేదని తెలిపాడు. అంతేకాదు తనకు రొమాన్స్ సీన్లలో నటించడమన్నా కూడా చాలా భయమని చెప్తున్నాడు. తేజ సజ్జ, ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా నటించిన చిత్రం 'ఇష్క్'. ఈ సినిమా జూలై 30న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరోహీరోయిన్లు సాక్షితో ముచ్చటించారు. ఈ సందర్భంగా తేజ మాట్లాడుతూ.. 'ఇష్క్' సినిమాలో హీరోగా తన నటనకు 8 మార్కుల వరకు వేసుకోవచ్చన్నాడు. ఇక ఫస్ట్‌డే ఫస్ట్ షాటే ముద్దు సీన్ అవడంతో కొంత ఇబ్బందిగా అనిపించిందన్నాడు. ఫేమస్ హీరోయిన్‌తో నటించడం ఎలా ఉందన్న ప్రశ్నకు ఆమె కన్ను కొట్టింది, తాను తొడ కొట్టాను అంటూ చిలిపిగా బదులిచ్చాడు. మరి ఈ ఇద్దరు హీరోయిన్లు ఇంకా ఏమేం ముచ్చటించారో కింద వీడియోలో చూసేయండి. -
ఆఫర్లు రానందుకు నాకేం బాధగా లేదు : హీరోయిన్
‘‘వింక్ సెన్సేషన్ అంటూ నా వీడియో వైరల్ అయిన టైమ్‌లో చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ ఆ టైమ్‌లో చదువు ముఖ్యమనుకున్నాను. గత ఏడాదే బీ.కామ్ పూర్తి చేశాను. అప్పట్లో వచ్చినన్ని ఆఫర్లు ఇప్పుడు రానందుకు నాకేం బాధగా లేదు. ఎందుకంటే బాధపడుతూ ఉంటే జీవితంలో ముందుకు వెళ్లలేం’’ అన్నారు ప్రియా ప్రకాశ్ వారియర్. తేజా సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్ జంటగా ఎస్.ఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇష్క్’. ఆర్.బి చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30 విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రియా ప్రకాశ్ వారియర్ మాట్లాడుతూ – ‘‘మలయాళ ‘ఇష్క్’ చిత్రాన్ని చూసి తెలుగు రీమేక్ ‘ఇష్క్’ ఒప్పుకున్నాను. ఇది రోటీన్ లవ్‌స్టోరీలా ఉండదు. మలయాళ స్టోరీ సోల్‌ను తీసుకుని, ఇక్కడి ప్రేక్షకులకు తగ్గట్లు మార్పులు చేశారు దర్శకులు రాజుగారు. తెలుగు భాష అర్థం చేసుకోగలను. త్వరలో తెలుగులో మాట్లాడతాను. ప్రస్తుతం తెలుగులో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న సినిమాలో కీ రోల్ చేస్తున్నాను’’ అన్నారు. ప్రస్తుతం సుమంత్ ‘అనగనగా ఒక రౌడీ’ చిత్రంలో నటిస్తున్నారు. -
ట్రైలర్: హీరోయిన్ బర్త్‌డే ప్లాన్, అంతలో ఏమైంది?
Ishq Movie Trailer: తేజా సజ్జ, ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా నటించిన చిత్రం ఇష్క్. నాట్ ఎ లవ్‌స్టోరీ అనేది ట్యాగ్‌లైన్. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ప్రియాతో ప్రేమలో పడిన తేజ ఆమె బర్త్‌డేను స్పెషల్‌గా ప్లాన్ చేద్దామని ఆలోచిస్తాడు. కానీ ఇంతలో అనుకోని ప్రమాదం ఎదురై అంతా తలకిందులు అయినట్లు తెలుస్తోంది. అయితే ఇట్స్ నాట్ ఎ లవ్‌స్టోరీ అన్న క్యాప్షన్ చూస్తుంటే హీరో నిజంగానే హీరోయిన్ను ప్రేమించాడా? లేదా అన్న అనుమానం రాక మానదు. ట్రైలర్ మాత్రం సినిమాపై అంచనాలు పెంచేసిదిగా ఉంది. యస్.యస్. రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్బీ చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ నిర్మించారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. ఈ సినిమా ఈ నెల 30న థియేటర్లలో విడుదలవుతోంది. -
ఆ నిర్మాతలను అనుసరించాను : దిల్ రాజు
‘‘రామానాయుడుగారు, ఆర్బీ చౌదరిగారు.. ఇలా కథల మీద మంచి పట్టు ఉన్న ప్రొడ్యూసర్స్‌ని స్టడీ చేసి, నా ప్రతి సినిమాకు దాన్ని అడాప్ట్ చేసుకున్నాను. అలాంటి సూపర్ గుడ్ ఫిలింస్‌లో వస్తోన్న ‘ఇష్క్’ని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. తేజా సజ్జ, ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా యస్.యస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇష్క్’. ఆర్బీ చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ‘దిల్’రాజు మాట్లాడుతూ– ‘‘కరోనా ప్రభావం ఫిలిం ఇండస్ట్రీ మీద ఎక్కువగా పడింది. థియేటర్లలో ప్రేక్షకులు మాస్కులు వేసుకునే సినిమా చూడాలి’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది.. అందరూ ఆదరించాలి’’ అన్నారు వాకాడ అప్పారావు. ‘‘కొత్త కథతో సాగే ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది’’ అన్నారు ఎస్ఎస్ రాజు. తేజా సజ్జ, ప్రియా ప్రకాశ్ పాల్గొన్నారు. -
'ఇష్క్' రెగ్యులర్ లవ్ స్టోరీ కాదు: తేజ సజ్జ
తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఇష్క్’. ఈనెల 30న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా తేజ చిత్ర మాట్లాడుతూ..అందరూ అనుకున్నట్లుగా ఇది రెగ్యులర్ లవ్‌స్టోరీ కాదు. యూత్‌ను దృష్టిలో పెట్టుకొని సినిమా తెరకెక్కించినప్పటికీ కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. స్టోరీ చాలా కొత్తగా, ఆకట్టుకునేలా ఉంటుంది. పాత్రలు ఎక్కడా కూడా పరధి దాటి వెళ్లవు. ఎక్కడా బోర్ అనిపించదు. సినిమా మొదటి నుంచి ముగిసే వరకు ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. థ్రిల్ ఫీలయ్యే సందర్బాలు ఈ చిత్రంలో చాలానే ఉన్నాయి. మహతి స్వరసాగర్ అందించిన పాటలు అందరికీ కనెక్ట్ అవుతాయి. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది అని పేర్కొన్నాడు. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం తేజ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో హనుమాన్ అనే మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
ఇష్క్: సిద్ శ్రీరామ్ మెలోడీ సాంగ్ వచ్చేసింది
తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఇష్క్’. నాట్ ఎ లవ్‌స్టోరీ అనేది ట్యాగ్‌లైన్. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ జూలై 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంగా తాజాగా ఈ సినిమా నుంచి ఓ వీడియో సాంగ్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ‘ఆనందమా.. ఆనందమదికే’అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్‌కి శ్రీమణి లిరిక్స్ అందించగా, సిద్ శ్రీరామ్ ఆలపించాడు. -
థియేటర్స్‌లోనే 'ఇష్క్' అంటున్న తేజ-ప్రియా ప్రకాశ్
తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఇష్క్’. నాట్ ఎ లవ్‌స్టోరీ అనేది ట్యాగ్‌లైన్. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఏప్రిల్ 23నే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా, కరోనా కారణంగా రిలీజ్‌కు బ్రేక్ పడింది. తాజాగా థియేటర్లు తెరుచుకున్న కారణంగా ఈ నెల 30న థియేటర్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం అనౌన్స్ చేసింది. కాగా చెల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన తేజ సజ్జా జాంబిరెడ్డి సినిమాతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. జాంబిరెడ్డితో హిట్ ఇచ్చిన క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతోనే మరో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి హనుమాన్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇక ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. -
యంగ్ హీరో తేజా సజ్జ షాకింగ్ రెమ్యునరేషన్!
చెల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన తేజ సజ్జా ప్రస్తుతం హీరోగానూ రాణిస్తున్నాడు. ఓ బేబి సినిమాతో చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తేజ జాంబిరెడ్డి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఢిపరెంట్ జానర్‌తో తొలిసారే ప్రయోగం చేసిన తేజ ఇప్పుడు జోరు మీదున్నాడు. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం హను-మాన్ అనే చిత్రంలో తేజ నటిస్తున్నాడు. జాంబిరెడ్డితో హిట్ ఇచ్చిన క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతోనే మరోసారి సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. తెలుగులో తొలి సూపర్ హీరో సిరీస్‌గా ఫిక్షనల్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా కోసం తేజ సజ్జ తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ టాలెంటెడ్ హీరో ఇప్పుడు కోటి రూపాయల పారితోషికం తీసుకుంటున్న హీరోల జాబితాలో చేరిపోయాడు. హను-మాన్ చిత్రం కోసం ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేశాడట. ఇటీవలె జాంబిరెడ్డి సినిమాతో ఆకట్టుకున్న తేజ ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకొని కోటి రూపాయల రెమ్యునరేషన్‌ను తీసుకుంటున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. -
టైటిల్‌కి తగ్గట్టే ‘అద్భుతం’ గా శివాని, తేజ సజ్జల ఫస్ట్ లుక్
హీరో రాజశేఖర్, నటి జీవితల కుమార్తె శివాని హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ‘అద్భుతం’. తేజ సజ్జ హీరో. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని చంద్రశేఖర్ మొగుళ్ల నిర్మిస్తున్నారు. గురువారం (జూలై 1న) శివాని పుట్టినరోజు సందర్భంగా ‘అద్భుతం’ మూవీ ఫస్ట్ లుక్‌ని హీరో నాని సోషల్ మీడియా ద్వారా విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘అ, కల్కి, జాంబిరెడ్డి’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు కథ అందించడం విశేషం.‘‘అద్భుతం’ టైటిల్‌కి తగ్గట్లుగానే ఈ ఫస్ట్ లుక్‌ని వినూత్నంగా సిద్ధం చేశారు మల్లిక్ రామ్’’ అన్నారు చంద్రశేఖర్ మొగుళ్ల. ఈ చిత్రానికి సహనిర్మాత: సృజన్ యార్లభోలు, సంగీతం: రాదన్, కెమెరా: చింతా విద్యాసాగర్. -
ప్రశాంత్ వర్మ ‘హను-మాన్’ చిత్రంలో హీరో ఎవరంటే!
వైవిధ్యమైన కథలతో సినిమాలను అందించడంలో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ప్రత్యేక గుర్తింపు ఉంది. డిఫరెంట్ జానర్లో ఆయన దర్శకత్వంలో వచ్చిన అ!, కల్కి, జాంబీరెడ్డి చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ప్రస్తుతం ప్రశాంత్ వర్మ హను-మాన్ అనే మూవీ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించి ఫస్ట్‌లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరో ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. తెలుగులో తొలి సూపర్ హీరో సిరీస్‌గా ఫిక్షనల్ నేపథ్యంలో సాగే ఈ మూవీలో హీరోగా తేజ సజ్జా నటిస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. శనివారం హైదరాబాద్‌లో ఈ మూవీ పూజా కార్యక్రమాలను జరపుకుంది. నిర్మాత సి కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయై తేజకు క్లాప్ కొట్టారు. రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంపై వచ్చే నెలలో ప్రకటన వెలువడనున్నట్లు ఈ సందర్భంగా మూవీ యూనిట్ వెల్లడించింది. ఇక ప్రశాంత్ వర్మ సైతం సజ్జాతో దేవుడి ముందు దండం పెట్టుకుంటున్న ఫొటోను షేర్ చేస్తూ ‘మేమిద్దరం’ మరోసారి అంటూ ట్వీట్ చేశాడు. ప్రైంషో ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో కే నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలోని మిగతా నటీనటుల వివరాలను కూడా త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ స్పషం చేశారు. అయితే ఇప్పటికే తేజ సజ్జాతో ప్రశాంత్ వర్మ‘జాంబీరెడ్డి’ మూవీని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. జాంబీల నేపథ్యంలో తెలుగులో తొలిసారిగా వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను అందుకుని సూపర్ హిట్‌గా నిలిచింది. మేమిద్దరం.. మరోసారి! 💪🏼#HanuManTheOrigin pic.twitter.com/aek2JVaXHv — Prasanth Varma (@PrasanthVarma) June 25, 2021 -
ప్రశాంత్ వర్మ హనుమాన్ : కీలక పాత్రలో 'జయమ్మ'
చెల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన తేజ సజ్జా ప్రస్తుతం హీరోగానూ రాణిస్తున్నాడు. ఇటీవలె క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ జాంబిరెడ్డి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. జాంబీస్ లాంటి కొత్త జోనర్‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో మరోసారి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ వర్మ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి ‘హనుమాన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పురాణ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోగా తేజ దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీకి సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. ఇక మరో ఇంటట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే..ఈ మూవీలో ఓ కీలకపాత్ర కోసం వరలక్ష్మి శరత్‌కుమార్‌ను సంప్రదించారట. ఇటీవలె తెలుగులో ఆమె నటించిన క్రాక్, నాంది సినిమాలకు మంచి ఆధరణ లభించింది. ముఖ్యంగా వరలక్ష్మి పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ‘హనుమాన్’ చిత్రంతో మరోసారి అలరించేందుకు సిద్ధం అవుతుందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. చదవండి : వైరల్ : షూటింగులో హీరో విశాల్‌కు తప్పిన పెద్ద ప్రమాదం సమంత నుంచి చాలా విషయాలను నేర్చుకున్నా: నటుడు -
బడా నిర్మాణ సంస్థతో ఒప్పందం చేసుకున్న 'జాంబిరెడ్డి' హీరో
‘జాంబీ రెడ్డి’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు తేజ సజ్జా. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్లో నటించిన తేజ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఓ బేబీతో మళ్లీ తెరపైకి వచ్చాడు. ఆ తర్వాత తొలి సినిమా ‘జాంబీరెడ్డి’తో హీరోగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. హాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన జాంబీస్ లాంటి కొత్త జోనర్‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ మూవీకి పాజిటివ టాక్ రావడంతో తేజకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఇప్పటికే మలయాళీ కుట్టి, కన్ను గీటు భామ్మ ప్రియా ప్రకాశ్ వారియర్‌తో చెక్ సినిమాలో నటించాడు. అదేవిధంగా.. శివానీ రాజశేఖర్ తో కలిసి ‘వెన్నెల’ అనే సినిమాలోనూ నటిస్తున్నాడు. కాగా ఇప్పుడు ఓ బడా బ్యానర్లో తేజ సినిమా చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన వైజయంతీ మూవీస్‌తో తేజ ఓ చిత్రానికి సైన్ చేసినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. చదవండి : మెగా హీరోతో గరుడవేగ డైరెక్టర్ తర్వాతి సినిమా? ఐదెకరాల పొలంతో పాటు ఓ స్కూటర్ ఉంది..నన్ను పెళ్లిచేసుకుంటావా? -
మళ్లీ భయపెట్టడానికి జాంబీలు వస్తున్నాయి!
Zombie Reddy: తెలుగు ప్రేక్షకులకు తొలిసారి జాంబీలను పరిచయం చేసిన సినిమా జాంబీ రెడ్డి. హాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన ఇలాంటి కొత్త జోనర్‌ను దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. బాల నటుడిగా ఎన్నో సినిమాలు చేసిన తేజ సజ్జా ఈ మూవీతో హీరోగా మారాడు. ఈ ఏడాది ఫిబ్రవరి లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపించింది. అయితే ఈ మధ్యే ఓటీటీ‘ఆహా’లో విడుదలై 9.7 టీఆర్పీ రేటును సాధించింది. వెండితెరపై కంటే బుల్లితెరపైనే సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమా సీక్వెల్ త్వరలోనే రానుందట. తాజాగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రశాంత్ వర్మ జాంబీరెడ్డికి సీక్వెల్ తెరకెక్కించే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ ఇప్పటికే ఈ సీక్వెల్ పనులు మొదలు పెట్టాడని, దీనిపై హీరో తేజతో చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. . ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ‘ఒక గన్ను 6 బులెట్లు’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ అనంతరం జాంబీరెడ్డి 2 ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించబోతున్నాడట. మరి జాంబీ రెడ్డి సీక్వెల్‌పై వస్తోన్నవార్తలపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. చదవండి: ఆ డైరెక్టర్‌కు బేబమ్మ నో చెప్పడమేంటి? బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రెండు భాగాలుగా ‘పుష్ప’ -
'ఇష్క్' హీరో తేజ వెరీ డెడికేటెడ్ ఫెలో..
యంగ్ హీరో తేజ సజ్జ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "ఇష్క్". యస్.యస్. రాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 23న గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ పార్క్‌హయాత్ హోటల్లో 'ఇష్క్' గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో ఇష్క్ మూవీ బిగ్ టికెట్‌ని వేణు శ్రీరామ్, నారా రోహిత్, సందీప్ కిషన్, నందినీ రెడ్డి, శ్రీ విష్ణు, ప్రశాంత్ వర్మ సంయుక్తంగా ఆవిష్కరించారు. దర్శకురాలు నందినీ రెడ్డి మాట్లాడుతూ.. 'సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ సూపర్ గుడ్ ఫిలింస్. ఈ బ్యానర్లో వర్క్ చేయడం తేజకి నిజంగా ప్రౌడ్ మూమెంట్. సాగర్‌కి ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రియా చాలా అందంగా ఉంది. ఈ సినిమాతో మరిన్న అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను. తేజలో ఉన్న మంచి క్వాలిటీ ఏంటంటే ఎంత సేపు మాట్లాడినా సినిమా గురించే మాట్లాడుతాడు. వెరీ డెడికేటెట్ ఫెలో. ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ప్రతి సినిమాని చాలా జాగ్రత్తగా సెలక్ట్ చేస్తున్నాడు. తేజకు ఇది హ్యాట్రిక్ మూవీ అవ్వాలని కోరుకుంటున్నాను' అన్నారు. మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ అధినేత ఆర్ బి చౌదరి మాట్లాడుతూ.. 'ఇది మా బేనర్లో తెరకెక్కుతోన్న 94వ చిత్రం. మా బేనర్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులని, టెక్నీషియన్స్‌ని పరిచయం చేశాం. ఇప్పుడు మరో టాలెంటెడ్ డైరెక్టర్ యస్.యస్. రాజుని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. ఇష్క్ సినిమా ఏప్రిల్ 23న థియేటర్లలో రిలీజవుతుంది. 23 తర్వాత ఈ మూవీ సక్సెస్ మీట్లో మళ్లీ కలుద్దాం' అన్నారు. నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. 'మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లో `సుస్వాగతం` లాంటి యూత్ కి సంబంధించిన మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. ఖచ్చితంగా మిమ్మల్నందరినీ అలరిస్తుంది. తేజ జూనియర్ ఆర్టిస్టుగా మనకు ఎప్పటినుంచో పరిచయం, అయితే ఓబేబి, జాంబీరెడ్డి వంటి స్క్రిప్ట్‌లను ఎంచుకుంటున్నాడు. ఈ సినిమాలో కూడా ఒక సీనియర్ యాక్టర్‌లాగా మంచి పెర్ఫామెన్స్ చేశాడు. ప్రస్తుతం యువ హీరోలు ప్రమోషన్స్ అనేవి ఒక బాధ్యతాయుతంగా భావించి వాటిలో భాగం అవడం చాలా హ్యాపీ' అన్నారు. చిత్ర దర్శకుడు యస్.యస్. రాజు మాట్లాడుతూ - 'నేను డైరెక్టర్ అవడానికి కారణం అయిన మా గురువు గారు సమీర్ రెడ్డి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్, వాకాడ అంజన్ కుమార్, జైన్ గారు, వాకాడా అప్పారావు గారికి థ్యాంక్స్. ఈ సినిమాను 29 డేస్‌లో ఇంత క్వాలిటీగా చేయడానికి కారణం శ్యామ్‌కేనాయుడు గారు. తేజ, ప్రియా, రవీందర్ ఇలా అందరు బాగా చేశారు. మహతి స్వరసాగర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నా టీమ్‌లో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ వారికి నా జీవితాంతం రుణపడి ఉంటాను. టీమ్ అందరికీ థ్యాంక్స్' అన్నారు. హీరోలు నారా రోహిత్, శ్రీ విష్ణు, సందీప్ కిషన్ ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకున్నారు. చదవండి: ఒక ముద్దిస్తావా?: ధైర్యం చేసి అడిగేసిన హీరో 'ఇష్క్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు -
'ఇష్క్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
‘ఇష్క్’పై ప్రియా ప్రకాశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
`ఓరు ఆధార్ లవ్` అనే మలయాళ మూవీతో హీరోయిన్ గా పరిచయమైన ప్రియా ప్రకాశ్ వారియర్... ఒకే ఒక్క కన్ను గీటుతో 'వింక్‌గాళ్'గా దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్‌ని సంపాదించుకుంది. ప్రస్తుతం ప్రియా ప్రకాశ్ వారియర్ ఇటీవల ‘జాంబీ రెడ్డి’ మూవీతో సూపర్ హిట్ సాధించిన యంగ్ హీరో తేజ సజ్జాతో కలిసి ‘ఇష్క్` చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ఎన్నో విజయవంతమైన సినిమాలను తెరకెక్కించిన మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ కొంత కాలం విరామం తర్వాత తెలుగులో నిర్మిస్తోన్న చిత్రమిది. ఈ చిత్రానికి యస్.యస్. రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్.బి. చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ఏప్రిల్ 23న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రియా ప్రకాశ్ వారియర్ మీడియాతో ముచ్చటించింది. ఆ విశేషాలు.. ‘నితిన్ ‘చెక్’ మూవీ తర్వాత నేను చేసిన సెకండ్ స్ట్రయిట్ ఫిల్మ్ ‘ఇష్క్`. నాట్ ఏ లవ్‌స్టోరీ అనేది ట్యాగ్‌లైన్. ఒక కొత్త సబ్జెక్ట్‌తో రూపొందిన సినిమా ఇది. టీమ్ అందరం కలిసి ఓ మంచి ప్రయత్నం చేశాం. ఈ కథకు తప్పకుండా ప్రతి ఆడియన్ రిలేట్ అవుతారు. సినిమాలో ప్రతి సీన్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నెక్ట్స్ సీన్లో ఏం జరుగుతుందా? అనే ఎగ్జైట్ మెంట్ సినిమా సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకుల మైండ్‌లో కొనసాగుతూనే ఉంటుంది. ఈ సినిమా చూసి ఆడియన్స్ తప్పకుండా థ్రిల్ ఫీలవుతారు. ఈ చిత్రంలో నేను అనసూయ అనే విలేజ్ అమ్మాయి పాత్రలో నటించాను. తను సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న కాలేజ్ గాళ్. తన క్యారెక్టర్ డిఫరెంట్‌గా ఉంటుంది. ‘చెక్’ సినిమాలో నా స్క్రీన్ ప్రజెన్స్ టైమ్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఫుల్ లెంగ్త్ ఉంటుంది. తేజ సజ్జా మంచి కో స్టార్. ఇంకా చెప్పాలంటే నా ఏజ్‌గ్రూప్‌తో సరిపోయే యాక్టర్. సో సెట్స్‌లో చాలా ఫన్ ఉండేది. తెలుగు డైలాగ్స్ చెప్పడంలో నేను కాస్త ఇబ్బందిపడ్డప్పుడు తేజ నాకు బాగా హెల్ప్ చేశాడు. దర్శకుడిగా ఎస్ఎస్ రాజుకి ఇది సినిమా తొలి ప్రాజెక్ట్. అయినా చాలా కాన్సన్ట్రేటెడ్గా చేశారు. సెట్లో చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉన్నారు. క్యారెక్టర్ సోల్‌ను మైండ్‌లో పెట్టుకుని నా స్టైల్ ఆఫ్ యాక్టింగ్ చేయమని చెప్పి దర్శకుడు నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ సినిమా కోసం మేజర్‌గా నైట్ షూట్స్ చేయాల్సి వచ్చింది. కొంతగ్యాప్ తర్వాత మెగాసూపర్‌గుడ్ ఫిలింస్ చేసిన తెలుగు సినిమా ఇది. ఈ ఆఫర్ నాకు సడన్‌గా వచ్చింది. పెద్దగా ప్లాన్ కూడా చేసుకోలేదు. మెగాసూపర్ గుడ్ ఫిలింస్ వంటి మంచి బ్యానర్లో సినిమా చేయడం నా కెరీర్‌కు ఫ్లస్ అవుతుందని వెంటనే `ఇష్క్` సెట్స్‌లో జాయినైపోయాను. ఇక ఇష్క్ ఓ మలయాళ సినిమాకు తెలుగు రీమేక్. ఆ సినిమా బేస్ లైన్ నాకు బాగా నచ్చింది. కథ బాగా కుదరిందని అనిపించింది. తెలుగు ఆడియన్స్‌కు తగ్గట్లు దర్శకుడు కథలో కొన్ని మార్పులు చేశారు. తెలుగు డైలాగ్స్‌లో పలకడం నేర్చుకుంటున్నాను. ఇష్క్ సినిమా చేసేప్పుడు టీమ్ నాకు హెల్ప్ చేశారు. ముందురోజే డైలాగ్స్ తీసుకుని నేను ప్రాక్టీస్ చేసి సెట్స్‌కు వచ్చేదాన్ని. అదీ నాకు కొంత హెల్ప్ అయ్యింది. మలయాళంలో నేను నటించిన తొలి సినిమా ‘ఓరు ఆడార్ లవ్’ తెలుగులో ‘లవర్స్ డే’గా విడుదలై రెండేళ్లు అవుతుంది. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఈ ఏడాది నా రెండు సినిమాలతో (ఇష్క్, చెక్) తెలుగు ప్రేక్షకులను పలరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కరోనా లేకపోతే చెక్ సినిమా గత ఏడాదే విడుదలయ్యేది. ఇష్క్ ఈ ఏడాది వచ్చేది. ఇలా ఏడాదికో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. మనం నటించిన అన్ని సినిమాలు ఆడవు. కొన్నింటికి మాత్రమే ప్రేక్షకాదరణ లభిస్తుంది. కానీ ఫెయిల్యూర్స్ నుంచే మనం ఎక్కువ నేర్చుకోగలం. ఇప్పటివరకు నేను చేసిన రోల్స్ అన్ని నాకు డిఫరెంట్‌గానే అనిపించాయి. ఇష్క్‌లో నేను చేసిన అనసూయ పాత్ర మోర్ ఇంటెన్స్ అండ్ డ్రమటిక్‌గా ఉంటుంది. సందీప్‌కిషన్ నెక్ట్స్ మూవీలో నేను ఓ కీలక పాత్ర చేస్తున్నాను. ఆ మూవీ షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ డిస్కర్షన్ స్టేజ్‌లో ఉన్నాయి. వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాను.’ అని తెలిపింది. -
ఇదో కొత్త అనుభూతిని ఇస్తుంది
తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లుగా యస్.యస్. రాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘ఇష్క్’. ఆర్బీ చౌదరి సమర్పణలో మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సమష్టిగా నిర్మించిన ‘ఇష్క్’ సినిమా ట్రై లర్‌ను సోషల్ మీడియాలో హీరో సాయితేజ్ విడుదల చేశారు. ఈ సినిమాను ఈ నెల 23న థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో హీరో తేజ సజ్జా మాట్లాడుతూ – ‘‘జాంబీరెడ్డి’ వంటి డిఫరెంట్ సినిమా తర్వాత నేను చేసిన సినిమా ‘ఇష్క్’. ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రోత్సహించే మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ సంస్థవారు కొంత గ్యాప్ తర్వాత తెలుగులో చేసిన ఈ సినిమాలో నేను హీరోగా నటించడం సంతోషంగా ఉంది’’ అని అన్నారు. ‘‘యూనిట్లో అందరి సహకారంతో తక్కువ రోజుల్లో మంచి క్వాలిటీతో ఈ సినిమాను పూర్తి చేశాను. హీరోహీరోయిన్లు తేజ, ప్రియలతో పాటు ఆర్టిస్టు రవీందర్ కూడా బాగా నటించారు’’ అన్నారు యస్.యస్. రాజు. ‘‘సూపర్‌గుడ్ ఫిలింస్, మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ రెండూ ఒక్కటే. మా బ్యానర్ నుంచి వచ్చిన ఎన్నో మంచి సినిమాలను ప్రేక్షకులు సూపర్‌హిట్ చేశారు. అనివార్య కారణాల వల్ల ఆరేడేళ్ల నుంచి తెలుగులో సినిమాలు చేయలేకపోయాం. ఇప్పుడు ‘ఇష్క్’ చేశాం. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు వాకాడ అప్పారావు. ఈ కార్యక్రమంలో చిత్ర సంగీతదర్శకుడు మహతి స్వరసాగర్, నిర్మాతలు బెక్కం వేణుగోపాల్, పి. కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఒక ముద్దిస్తావా?: ధైర్యం చేసి అడిగేసిన హీరో
పలు సినిమాల్లో బాలనటుడిగా కనిపించిన తేజ సజ్జ 'జాంబీరెడ్డి'తో హీరోగా మారాడు. ఈ చిత్రం అతనికి హీరోగా మంచి పేరును తెచ్చిపెట్టింది. ప్రస్తుతం అతడు డర్టీహరి డైరెక్టర్ ఎంఎస్ రాజుతో దర్శకత్వంలో 'ఇష్క్' అనే సినిమా చేస్తున్నాడు. నాట్ ఎ లవ్‌స్టోరీ అనేది ట్యాగ్‌లైన్. ఇందులో ప్రియా ప్రకాశ్ వారియర్ తేజతో జోడీ కట్టింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మెగా హీరో సాయిధరమ్ తేజ్ రిలీజ్ చేశాడు. ఇందులో "అనూ, రేపు నైట్ నీ బర్త్‌డే ప్లాన్ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు, నేను కారులో, ఆ కారు బీచ్ రోడ్డులో.." అంటూ ఊహల్లో తేలుతున్నాడు హీరో. తీరా అనుకున్నట్లుగానే ప్రియా వారియర్‌ను కారులో ఎక్కించుకుని చక్కర్లు కొడుతున్న హీరో ధైర్యం చేసి 'ఒక ముద్దిస్తావా?' అంటూ మనసులో మాట అడిగేశాడు. అందుకు ఆ భామ సై అందా? లేదా? ఇంతలో వీళ్లిద్దరికీ ఏమైనా జరిగిందా? అన్నది సినిమాలో చూడాల్సిందే. అసలు వీరి కారు ప్రయాణంలో ఏం జరిగింది? వీరిపై ఎవరు, ఎందుకు దాడి చేశారు? అన్న అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇష్క్ నాటే సింగిల్ లవ్‌స్టోరీ అనేట్లుగా ఉందీ ట్రైలర్. ఈ చిత్రాన్ని మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ నిర్మించనుంది. ఆర్.బి చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, వాకాడ అంజన్‌కుమార్, పరాస్ జైన్ నిర్మించనున్నారు. శ్యామ్ కె నాయుడు కెమెరామెన్‌గా పని చేస్తున్నాడు. చదవండి: శ్రీకారం చుట్టుకుంది కొత్త చిత్రాలు 'జాంబీ రెడ్డి' సినిమా ఎలా ఉందంటే? -
తేజ సజ్జతో జతకట్టిన ప్రియా ప్రకాశ్ వారియర్
మలయాళీ కుట్టి, కన్ను గీటు భామ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ తెలుగులో తొలిసారిగా నటించిన చిత్రం ‘చెక్’. హీరో నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్‌లు లీడ్ రోల్లో నటించిన ఈ మూవీ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికి ప్రియా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వెంటనే మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థలో నటించే చాన్స్ కోట్టేసింది ప్రియా. దర్శకుడు ఎస్ఎస్ రాజు తెరకెక్కిస్తున్న ఈ మూవీకి ‘ఇష్క్’ అనే టైటిల్‌ను ఖారారు చేశారు. తాజాగా ఈ మూవీకి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ప్రియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘మీరు లవ్‌స్టోరీ సినిమాలు చూసి విసిగిపోయారా.. అయితే మీ కోసం ఇష్క్ మూవీని తీసుకురాబోతున్నాం. అయితే ఇది లవ్‌స్టోరీ కాదు’ అటూ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది ప్రియా. ఇందులో ఆమె ‘జాంబీ రెడ్డి’ సినిమాతో హీరోగా పరిచయం అయిన తేజ సజ్జ సరసన హీరోయిన్గా నటిస్తోంది. ‘ఇష్క్.. నాట్ ఏ లవ్ స్టోరీ’ అనే టైటిట్‌తో ఉన్న ఈ పోస్టర్లో తేజ సీరియస్ లుక్‌లో కనిపిస్తుంటే, ప్రియా ప్రకాశ్ నవ్వుతూ కనిపిస్తుంది. వారి ముందు పగిలిన అద్దాల ముక్కలు గాల్లో ఎగురుతున్నట్లు ఉన్నాయి. ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్, వకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వరా సాగర్ సంగీతం అందిస్తున్నాడు. View this post on Instagram A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) -
'జాంబీ రెడ్డి' సినిమా రివ్యూ
టైటిల్ : జాంబీ రెడ్డి జానర్ : జాంబీ నటీనటులు : తేజ సజ్జ, ఆనంది, దక్ష నగార్కర్, పృథ్వీ రాజ్, గెటప్ శ్రీను, అన్నపూర్ణమ్మ, కిరీటి, హరితేజ, రఘుబాబు దర్శకుడు : ప్రశాంత్ వర్మ నిర్మాత : రాజశేఖర్ వర్మ సంగీతం : మార్క్ కె. రాబిన్ సినిమాటోగ్రఫి: అనిత్ విడుదల తేది : 5 ఫిబ్రవరి 2021 మెగాస్టార్ చిరంజీవి 'ఇంద్ర' సహా ఎన్నో సినిమాల్లో బాల నటుడిగా కనిపించాడు తేజ సజ్జ. సమంత 'ఓ బేబీ'లో ఓ పాత్ర చేసిన అతడు 'జాంబీ రెడ్డి' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. జాంబీ జానర్లో కథ ఎంచుకుని తొలి సినిమాతోనే ప్రయోగానికి సిద్ధమయ్యాడంటే ఆయన గుండె ధైర్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందే. అ, కల్కి వంటి ప్రయోగాత్మక సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ జాంబీలకు కమర్షియల్ టచ్ ఇస్తూ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. మరి జాంబీలు జనాలను భయపెట్టాయా? ఈ ప్రయోగం విజయవంతం అయిందా? ఈ కాన్సెప్ట్ తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందా? లేదా? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే. కథ: ప్రధాని నరేంద్ర మోదీ లాక్డౌన్ ప్రకటించిన సన్నివేశంతో కథ మొదలవుతుంది. అయితే లాక్‌డౌన్‌ను పెద్దగా ఖాతరు చేయని గేమ్ డిజైనర్, హీరో తేజ సజ్జ తన గ్యాంగ్.. దక్ష నగార్కర్, కిరీటితో కలిసి రాయలసీమలో స్నేహితుడు ఆర్జే హేమంత్ పెళ్లికి వెళ్తారు. ఈ ప్రయాణంలో వారికి అనుకోని సంఘటన ఎదురవుతుంది. కానీ ఇది వారి జీవితాలనే కాదు, వాళ్లని కూడా మార్చేస్తుందనేది హీరో గ్యాంగ్‌కు అప్పుడు అర్థం కాదు. కానీ తీరా పెళ్లికి వెళ్లాక గ్యాంగ్‌లోని కిరీటి జాంబీగా మారిపోతాడు. అతడు ఒక్కడే కాదు ఆ ఊర్లోని వాళ్లంతా జాంబీలుగా మారుతుంటారు. తేజ, ఆనంది, దక్షా, గెటప్ శ్రీను, ఆర్జే హేమంత్ తప్ప! మరి ఈ ఐదుగురు ఊర్లో వాళ్లను తిరిగి మామూలు మనుషులను చేయగలిగారా? లేదంటే వీళ్లు కూడా జాంబీలుగా మారిపోయారా? కనీసం ప్రాణాలతో అక్కడ నుంచి బయటపడ్డారా? అన్నది థియేటర్లలో చూసి తెలుసుకోవాల్సిందే! విశ్లేషణ: తెలుగులో ఇంతవరకు ఏ దర్శకనిర్మాత టచ్ చేయని జానర్ జాంబీ. దీంతో ఆ కాన్సెప్ట్‌తో వస్తున్న తొలి సినిమా కావడంతో ప్రేక్షకులు దీన్ని ఎలా స్వీకరిస్తారు? వారికి ఎంతమేరకు ఎక్కుతుంది? అనేది మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉంది. కానీ ఇక్కడే దర్శకుడు ఈ హారర్ సినిమాకు కమర్షియల్ టచ్ ఇస్తూ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్చేసి ప్రేక్షకులను సీటుకు కట్టిపడేసే ప్రయత్నం చేశాడు. పైగా వల్గర్ కామెడీ జోలికి పోకుండా కరోనా జోకులను వాడుకోవడం విశేషం. ఇక సినిమా స్టార్ట్ అవగానే జాంబీలు కనిపించరు. కరోనా అంటూ, దాని మీద పాట కడుతూ కొంత భాగం సాగదీస్తూ ఏదో మమ అనిపించారు. తర్వాత నెమ్మదిగా జాంబీలను పరిచయం చేస్తాడు ప్రశాంత్ వర్మ. ఇంటర్వెల్లో మాంచి కిక్ ఇచ్చే ట్విస్ట్ ఇవ్వడంతో నెక్స్ట్ ఏంటి? అన్న ఆతృత ప్రేక్షకుడిలో కనిపించక మానదు. సెకండాఫ్ ప్రారంభంలో గెటప్ శ్రీను కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. అతడికి, అన్నపూర్ణమ్మకి మధ్య ఉండే కామెడీ సన్నివేశాలు బాగా పండాయి. ఆ తర్వాత ముగింపు వరకు ట్విస్టుల మీద ట్విస్టులతో ప్రేక్షకులకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ జనాలను సినిమాలో లీనం చేశాడు డైరెక్టర్. కానీ క్లైమాక్స్ లాజిక్ అందరికీ నచ్చకపోవచ్చు. (చదవండి: అల్లుడు అదుర్స్ మూవీ రివ్యూ) ఎలా ఉందంటే.. మొత్తానికి ప్రశాంత్ వర్మ తన విలక్షణతకు పదును పెడుతూ వెండితెరపై జాంబీలను భయంకరంగా చూపించాడు. జాంబీల మేకప్, నడిచే తీరు, దాడి చేసే విధానం అన్నీ హాలీవుడ్ రేంజ్లో ఉంటాయి. జాంబీలతో పోరాడే యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకే హెలైట్. విజువల్స్, మేకింగ్ అన్నీ సరిగ్గా సరిపోయాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరో లెవల్లో ఉంది. పాటల విషయానికొస్తే కొన్ని బాగున్నాయి, మరికొన్ని పర్వాలేదనిపించాయి. కానీ జాంబీలు చేసే పైశాచిక విన్యాసాలు కొంత రోత పుట్టిస్తున్నాయి. సినిమా పూర్తయ్యాక అందరూ సెకండాఫ్ గురించే మాట్లాడుకుంటారు. ఫస్టాఫ్‌ను కూడా అదే రేంజ్లో తీయాల్సింది. కానీ దర్శకుడు ఫస్టాఫ్‌ను పెద్దగా ఖాతరు చేసినట్లు కనిపించలేదు. అలా మొదటి పార్ట్‌ను కాస్త గాలికొదిలేయకుండా ఏవైనా రెండు, మూడు కీలక సన్నివేశాలను రాసుకొని ఉండుంటే మరింత పస ఉండేది. ఎడిటింగ్ విషయానికి వస్తే సాయిబాబుకు బోలెడంత పని ఇంకా మిగిలే ఉంది. కథనంపై ఇంకాస్త దృష్టి పెట్టుంటే జాంబీ రెడ్డి విజృంభించేంది. సాగదీతతో ఫస్టాఫ్ తేలిపోయినప్పటికీ సెకండాఫ్ ఇచ్చిన బూస్ట్‌తో సినిమా పర్వాలేనిపించింది. (చదవండి: హీరోగా నాకిది సరైన లాంచ్) నటన: ఇక ఈ సినిమా తన కెరీర్‌ను మారుస్తుందన్న తేజ మాట అక్షరాలా నిజమయ్యే అవకాశం ఉంది. జాంబి రెడ్డిలో అద్భుతంగా నటించిన అతడికి ప్రశంసలు దక్కడం ఖాయం. అతడి సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా బాగా నటించి పాత్రలకు తమ వంతు న్యాయం చేశారు. ఆన్ స్క్రీన్ మీద ఉన్న నటీనటులు ఎలా బెస్ట్ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారో అలాగే టెక్నికల్ టీమ్ కూడా ది బెస్ట్ ఇచ్చి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఓవరాల్‌గా ప్రేక్షకులు కొత్త ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. కానీ మితిమీరిన హింసతో చెలరేగిపోయిన ఈ జాంబీరెడ్డి సినిమాను ఫ్యామిలీతో చూడటం కొంత కష్టమే. (చదవండి: మిస్టర్... టార్గెట్ మిస్!) -
'జాంబీ రెడ్డి'కి బెదిరింపులు: దర్శకుడు
‘‘లాక్ డౌన్ తర్వాత ఆరంభించిన ఫస్ట్ చిత్రం మా ‘జాంబిరెడ్డి’. మొదట్లో ఇద్దరు ముగ్గురుతో ఉన్న సీన్స్ చేశాం.. ఒక్కో వారం గ్యాప్ తీసుకొని చేయడం వల్లే సినిమా ఇంత ఆలస్యం అయ్యింది.. లేదంటే మా సినిమా ఎప్పుడో విడుదలవ్వాల్సింది’’ అన్నారు ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా హీరోగా, ఆనంది, దక్షా నగార్కర్ హీరోయిన్లుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబిరెడ్డి’. రాజ్‌శేఖర్ వర్మ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం మన సినిమాల్లో లవ్ జానర్ ఎలానో జాంబీ కూడా ఒక జానర్. మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథ అల్లుకుని ఈ సినిమా తీశా. హాలీవుడ్లో ఇప్పటికే జాంబీ సినిమాలు తీసినవాళ్లకి కూడా ఇది కొత్తగా అనిపిస్తుంది. ఎనిమిదేళ్ల క్రితమే ఈ సినిమా అనుకున్నాను. కుదరలేదు.. ఇప్పుడు కుదిరింది. ఒక తెలియని విషయాన్ని మనకు తెలిసిన విషయానికి కనెక్ట్ చేసి చెప్తే సులభంగా అర్థమవుతుంది. త్రివిక్రమ్‌గారు ఈ విధంగా చేస్తుంటారు. మహాభారతం, భాగవతంతో కలిపి తన సినిమాల్లో చెబుతుంటారాయన. అలా నేను కూడా ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేద్దామనుకొని జాంబీ కాన్సెప్ట్‌కి ఫ్యాక్షన్ యాడ్ చేశాను. ‘జాంబిరెడ్డి’ టైటిల్ పెట్టినప్పుడు చాలానే బెదిరింపులు వచ్చాయి. రాయలసీమ బ్యాక్‌డ్రాప్ కాబట్టి ఆ టైటిల్ పెట్టాం. ఇండస్ట్రీలో భిన్నమైన స్వరాలు వినిపించాయి. ‘ఇలాంటి జానర్ మేం చేద్దాం అనుకున్నాం.. కానీ ప్రేక్షకులకు అర్థం కాదేమో అని వదిలేశాం’ అని కొందరు.. ‘మంచి ఐడియా’ అని మరికొందరు అన్నారు. అయితే ట్రైలర్ విడుదలయ్యాక ‘నువ్వు సాధించావ్’ అన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ఈ చిత్రంలో పెద్ద హీరో అయితే మార్కెట్ పరిధి బాగుండేది. కానీ సినిమా తీయడానికి రెండేళ్లు పట్టేదేమో? త్వరగా సినిమా చెయ్యాలనుకున్నాను.. తేజ సరిపోతాడనిపించి తీశాను. మా చిత్రం టీజర్ రిలీజ్ అయ్యాక హిందీ రీమేక్‌కి అవకాశాలొచ్చాయి. సమంతగారికి చెప్పింది ‘జాంబిరెడ్డి’ కథ కాదు.. వేరేది. మేమిద్దరం ఆ స్క్రిప్ట్‌ని నమ్మాం.. కానీ నిర్మాత దొరకలేదు. నా దగ్గర ప్యాన్ ఇండియా కథలు కూడా ఉన్నాయ్. ‘జాంబిరెడ్డి’ విజయం సాధించి మంచి పేరు వస్తే, సీక్వెల్‌ని ప్యాన్ ఇండియా స్థాయిలో తీస్తాం’’ అన్నారు. -
తేజ మా మెగాఫ్యామిలీ మెంబర్
‘‘తేజ చిన్నప్పుడే ఎన్నో సినిమాల్లో నటించాడు. వాడు మా ఫ్యామిలీలో ఒక మెంబర్. చిరంజీవిగారి ఆశీస్సులు తనకి ఎప్పుడూ ఉంటాయి. ‘ఓ బేబీ’ సినిమాలో తనని చూసి సర్ప్రై జ్ అయ్యాను. ప్రశాంత్ వర్మ గుడ్ విజన్ ఉన్న డైరెక్టర్. తెలుగులో ఫస్ట్ టైమ్ జాంబీ జానర్లో వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అని హీరో వరుణ్ తేజ్ అన్నారు. తేజ సజ్జా హీరోగా, ఆనంది, దక్షా నగార్కర్ హీరోయిన్లుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబిరెడ్డి’. రాజ్‌శేఖర్ వర్మ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘జాంబిరెడ్డి’ ప్రీ–రిలీజ్ వేడుకలో నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ– ‘‘ ‘శివ’ సినిమా టైమ్‌లో ఆర్జీవీని చూసి గొప్ప డైరెక్టర్ అవుతాడనుకున్నాను. ఇప్పుడు ప్రశాంత్ వర్మను చూసినప్పుడు అదే ఫీలింగ్ కలిగింది’’ అన్నారు. రాజ్‌శేఖర్ వర్మ మాట్లాడుతూ– ‘‘సినిమా తీయాలనే నా కల. ‘జాంబిరెడ్డి’తో నిజమైనందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘మా నిర్మాత రాజశేఖర్ వర్మగారు కరోనా సమయంలో ఎంతోమందికి సహాయం చేసి, హెల్త్ ఇన్సూరెన్స్ చేయించారు. తేజ నాకు మంచి ఫ్రెండ్. ‘అ!’ సినిమా కన్నా ముందే తనతో ఓ చిత్రం చేయాలి... కుదరలేదు’’ అన్నారు ప్రశాంత్ వర్మ. ఈ వేడుకలో సంగీత దర్శకుడు మార్క్ కె. రాబిన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఆనంద్ పెనుమత్స, ప్రభ చింతలపాటి, లైన్ ప్రొడ్యూసర్ వెంకట్ కుమార్ జెట్టి తదితరులు పాల్గొన్నారు. -
‘జాంబీ రెడ్డి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు..
-
హీరోగా నాకిది సరైన లాంచ్
‘‘బాలనటుడిగా చాలా సినిమాలు చేశాను. అవి మినహాయిస్తే ‘ఓ బేబీ’ నా తొలి చిత్రం. ఆ ప్రాజెక్ట్‌లో నాకన్నా పెద్ద స్టార్స్ ఉన్నారు. హీరోగా ‘జాంబీ రెడ్డి’ సినిమా నాకు సరైన లాంచ్. ఈ సినిమా విడుదల కోసం ఎగ్జయిటింగ్‌గా ఎదురు చూస్తున్నా’’ అని తేజ సజ్జ అన్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ, దక్షా నగార్కర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘జాంబీ రెడ్డి’. రాజ్‌శేఖర్ వర్మ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా తేజ సజ్జ మాట్లాడుతూ– ‘‘ప్రశాంత్ వర్మ నాకు చాలా సన్నిహితుడు. నా బలాలు ఏంటో తనకు బాగా తెలుసు. నన్ను హీరోగా ఎలివేట్ చేయడానికి ప్రశాంత్ బాగా కష్టపడ్డాడు. కోవిడ్ సమయంలో మా సినిమా చిత్రీకరణ ప్రారంభించాం. లాక్డౌన్లో చాలా విషయాలు మారిపోయాయి. దాంతో ప్రేక్షకులను మరింతగా నవ్వించడానికి వ్యంగ్యంతో కూడిన ఉల్లాసమైన కామెడీని జత చేశాం. ఈ చిత్రంలో యాక్షన్ పార్ట్ చాలా బాగుంది. మా సినిమా టీజర్, ట్రైలర్స్‌కి మంచి స్పందన వచ్చింది. సినిమాని కూడా ప్రేక్షకులు అదే స్థాయిలో ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఈ చిత్రవిజయం నా కెరీర్‌ను మార్చుతుందనే బలమైన నమ్మకం ఉంది. అన్ని రకాల పాత్రలు చేసి, ప్రేక్షకుల్ని అలరించాలనుకుంటున్నాను. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు. -
మూడోసారి మిస్ కాదల్చుకోలేదు!
‘‘తెలుగులో నా మొదటి చిత్రం ‘హోరా హోరీ’(2016). బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు తేజాగారి దర్శకత్వంలో ఆ సినిమా చేసే అవకాశం వచ్చింది. చదువు కోసం రెండేళ్లు గ్యాప్ తీసుకుని, ఆ తర్వాత ‘హుషారు’ చిత్రంలో నటించాను’’ అన్నారు దక్షా నగార్కర్. తేజ సజ్జ, దక్షా నగార్కర్ ప్రధాన పాత్రల్లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబీ రెడ్డి’. రాజ్‌శేఖర్ వర్మ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. దక్షా నగార్కర్ మాట్లాడుతూ– ‘‘ప్రశాంత్ వర్మ తీసిన ‘అ’ చిత్రంలో నిత్యామీనన్ పాత్రలో నేను నటించాల్సింది. అప్పటికి నాకంత మెచ్యూరిటీ లేదు. ఇప్పుడైతే ఆ పాత్రని ఒప్పుకునేదాన్ని. ‘కల్కి’కి కూడా సంప్రదించారు ప్రశాంత్ వర్మ.. కానీ కుదరలేదు. మూడోసారి మిస్ కాకూడదని ‘జాంబీ రెడ్డి’ చేశా. ఇందులో మ్యాగీ అనే గేమర్ పాత్రలో నటించాను. ప్రస్తుతం బెల్లంకొండ గణేశ్‌తో ఓ సినిమా చేస్తున్నాను. రెండు పెద్ద నిర్మాణ సంస్థల్లో రెండు సినిమాలు, హిందీలో ఓ వెబ్ ఫిల్మ్ కమిట్ అయ్యాను’’ అన్నారు. -
ప్రేమకథ కాదు
‘డర్టీహరి’ హిట్‌తో డైరెక్టర్‌గా మంచి మార్కులు వేయించుకున్నారు నిర్మాత యం.యస్. రాజు. ఆయన దర్శకత్వంలో ‘ఇష్క్’ అనే చిత్రం రూపొందనుంది. నాట్ ఎ లవ్‌స్టోరీ అనేది టాగ్లైన్. తేజ సజ్జా, ప్రియాప్రకాశ్ వారియర్లు జంటగా నటించనున్న ఈ చిత్రాన్ని మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ నిర్మించనుంది. ఆర్.బి చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, వాకాడ అంజన్‌కుమార్, పరాస్ జైన్ నిర్మించనున్నారు. 2021లో ఈ చిత్రం ద్వారా తెలుగులోకి మళ్లీ ఎంట్రీ ఇస్తున్నారు సూపర్‌గుడ్ ఫిలింస్ నిర్మాతలు. ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ స్వరాలు సమకూరుస్తుండగా శ్యామ్.కె.నాయుడు కెమెరామేన్‌గా వ్యవహరిస్తున్నారు. ‘‘మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను: సమంత
‘‘జాంబిరెడ్డి’ సినిమా టీజర్ అదిరిపోయింది. నా ఊహను మించిపోయింది. ఈ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను. నాకు సినిమాలంటే ప్రాణం’’ అన్నారు సమంత. తేజ సజ్జా, ఆనంది, దక్షా నగార్కర్ హీరో హీరోయిన్లుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజ్ శేఖర్ వర్మ నిర్మించిన చిత్రం ‘జాంబిరెడ్డి’. ఈ సినిమా టీజర్‌ను శనివారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో సమంత విడుదల చేశారు. పోస్టర్‌ను విడుదల చేసిన ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘టైటిల్ డిఫరెంట్‌గా ఉంది. టీజర్‌తో ప్రశాంత్ వర్మ భయపెడుతున్నాడు. ‘ఇంద్ర’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన తేజ సజ్జా హీరోగా పరిచయం అవుతుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘లాక్‌డౌన్‌కు ముందు ఈ సినిమా షూటింగ్‌ను సగం పూర్తి చేశాం. మిగిలిన భాగాన్ని లాక్డౌన్ తర్వాత పూర్తి చేశాం. నేనేదో తెలివైనవాడిని అని చెప్పుకోవడానికి ఈ సినిమా తీయలేదు. ఎంటర్టైన్ చేయడం కోసం తీశాను. ఈ సినిమా హిట్ సాధిస్తే ‘జాంబిరెడ్డి’ లెవల్ 2 స్క్రిప్ట్ ఉంది. నన్ను నమ్మిన నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాకు ముందు సమంతగారితో ఓ సినిమా అనుకున్నాను’’ అన్నారు ప్రశాంత్ వర్మ. ‘‘ప్రేక్షకులు ఓ కొత్త సినిమాను చూస్తారు’’ అన్నారు తేజ సజ్జా. ఈ కార్యక్రమంలో ఆనంది, దక్షా నగార్కర్, నటుడు, దర్శకుడు తనికెళ్ళ భరణి, దర్శకురాలు నందినీ రెడ్డి, నిర్మాతలు పి. కిరణ్, బెక్కం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
కరోనా నేపథ్యంలో జాంబీ రెడ్డి
‘అ!, కల్కి’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘జాంబీ రెడ్డి’. బాలనటునిగా అలరించడంతో పాటు ‘ఓ బేబీ’ చిత్రంలో కీలక పాత్రలో ఆకట్టుకున్న తేజ సజ్జా హీరోగా, ఆనంది, దక్ష హీరోయిన్లుగా నటించారు. రాజ్‌శేఖర్ వర్మ నిర్మాత. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా బుధవారం ఈ చిత్రానికి సంబంధించి డబ్బింగ్ వర్క్ మొదలైంది. తేజ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు. ఈ సందర్భంగా రాజ్‌శేఖర్ వర్మ మాట్లాడుతూ– ‘‘కరోనా మహమ్మారి నేపథ్యంలో వస్తున్న తొలి చిత్రం ‘జాంబీ రెడ్డి’. లాక్డౌన్ సడలించాక ప్రభుత్వ నిబంధనల మేరకు తెలుగు పరిశ్రమలో ముందు షూటింగ్ మొదలు పెట్టి, పూర్తి చేసిన తొలి చిత్రం మాదే. త్వరలో టీజర్ రిలీజ్ చేస్తాం. మా సినిమాతో జాంబీ కాన్సెప్ట్‌ను తెలుగుకి పరిచయం చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె. రాబిన్, కెమెరా: అనిత్, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఆనంద్ పెనుమత్స, ప్రభ చింతలపాటి. -
‘జాంబీ రెడ్డి’ ఫస్ట్ లుక్ రిలీజ్
సాక్షి, హైదరాబాద్: ‘అ, కల్కి’ వంటి చిత్రాల తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబీ రెడ్డి’. యాపిల్ ట్రీ స్టూడియోస్ పతాకంపై రాజ్‌శేఖర్ వర్మ నిర్మించారు. ఈ సినిమాలో హీరోగా ఎవరు నటించారనే సస్పెన్స్‌కు తెరదించుతూ ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్లను చిత్రబృందం విడుదల చేసింది. బాల నటుడిగా అందరి ప్రశంసలు పొంది, సమంత లీడ్ రోల్ చేసిన ‘ఓ బేబీ’లో ఓ కీలక పాత్రలో ఆకట్టుకున్న తేజ సజ్జా ‘జాంబీ రెడ్డి’తో హీరోగా పరిచయమవుతున్నాడు. నేడు తన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో తేజ గద పట్టుకొని ఉండగా, జాంబీలు అతనిపై దాడి చేయబోతున్నట్లు కనిపిస్తోంది. ఇక మోషన్ పోస్టర్ విషయానికి వస్తే.. తన వెనకవైపు చిరంజీవి బొమ్మ ఉన్న షర్ట్ ధరించి స్టైల్‌గా ఇంట్రడ్యూస్ అయ్యాడు తేజ. ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె. రాబిన్ , కెమెరా: అనిత్, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఆనంద్ పెనుమత్స, ప్రభ చింతలపాటì . -
తేజ సజ్జతో శివానీ రాజశేఖర్ మూవీ..
‘ఓ బేబి’ ఫేం తేజ సజ్జ, హీరో రాజశేఖర్ పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్‌తో హీరో, హీరోయిన్లులా ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫాంటసీ లవ్ స్టోరీ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మహతేజ క్రియేషన్స్ బ్యానర్ పై చంద్ర శేఖర్ మొగుల్ల ఎస్.ఒరిజినల్స్ సృజన్ యరబోలు కలిసి నిర్మిస్తున్నఈ మూవీ నుంచి హీరో తేజ లుక్ రిలీజైంది. ఆదివారం తేజ పుట్టిన రోజు సందర్భంగా సినిమా నుంచి అతని లుక్ ను రివీల్ చేసారు.(చదవండి : సాయిధరమ్ తేజ్ పెళ్లి ప్రకటన!) ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ..‘మా మహతేజ క్రియేషన్స్ బ్యానర్ మీద ‘‘ఎస్ ఒరిజనల్స్’’ తో కలిసి ప్రొడక్షన్ నెంబర్ 1 గా ఈ సినిమా నిర్మిస్తున్నాం. ఫాంటసీ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ కథ అంతా జరుగుతుంది. డైరెక్టర్ మల్లిక్ రామ్ చెప్పిన కథకు అందరం కనెక్ట్ అయ్యాం..ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాం. మూవీ చాలా బాగా వచ్చింది. తేజ,శివానీ రాజశేఖర్ ఇందులో లీడ్ రోల్స్ చేశారు..షూటింగ్ అంతా కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చక్కబడిన తర్వాత మూవీని రిలీజ్ చేస్తాం’’అన్నారు. లక్ష్మీ భూపాల సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో తులసి, శివాజీ రాజా, సత్య,మిర్చి కిరణ్,దేవీ ప్రసాద్ తదితరులు నటిస్తున్నారు. -
చిన్నారి ‘ఇంద్ర’ హీరోగా..!
బాల నటుడిగా ఎన్నో సినిమాల్లో ఆకట్టుకున్న నటుడు తేజ సజ్జ. ముఖ్యంగా మెగాస్టార్ హీరోగా తెరకెక్కిన ఇంద్ర, చూడాలని ఉంది లాంటి సినిమాలు తేజకు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. యువరాజు, వసంతం, శ్రీరామదాసు లాంటి సినిమాలతో ఆకట్టుకన్న తేజ తరువాత వెండితెరకు దూరమయ్యాడు. హీరోగా రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హీరోగా పరిచయం అవుతున్నాడన్న వార్తలు వినిపించాయి. తాజాగా తేజకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ లో వినిపిస్తోంది. చిన్నారి ఇంద్రగా ఆకట్టకున్న తేజ ఓ క్యూట్ లవ్ స్టోరితో ప్రేక్షకుల ముందుకు రానున్నాడట. మిణుగురులు సినిమాతో ఆకట్టుకున్న అయోధ్య కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో తేజ హీరోగా నటించనున్నాడు. ఈ సినిమాలో టాలీవుడ్ కుమారి హెబ్బా పటేల్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. -
హీరోగా బాల నటుడు
మరో బాలనటుడు హీరోగా మారుతున్నాడు. కొన్నేళ్ళ క్రితం వచ్చిన ‘చూడాలని ఉంది’, ‘బాచి’, ‘ఇంద్ర’, ‘గంగోత్రి’ తదితర చిత్రాల్లో బాలనటునిగా అలరించిన తేజ సజ్జా హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. ‘పంజా’, ‘అలియాస్ జానకి’ చిత్రాల నిర్మాత నీలిమ తిరుమలశెట్టి సంఘమిత్ర ఆర్ట్స్ పతాకంపై ప్రశాంత్వర్మను దర్శకునిగా పరిచయం చేస్తూ ఈ సినిమా నిర్మించనున్నారు. ప్రాచీథాకర్ నాయిక. నీలిమ మాట్లాడుతూ,‘‘పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమిది. అక్టోబర్‌లో చిత్రీకరణ మొదలుపెట్టి జనవరిలో విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: శ్రీకాంత్, కెమెరా: విష్ణు.