తేజ సజ్జ హీరోగా నటించిన హను-మాన్ చిత్రం టాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. సూపర్ హీరో కాన్సెప్ట్ కి ఇండియన్ మైథాలజీని లింక్ చేసి తెరకెక్కించిన ఈ అద్భుతానికి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద రూ. 350 కోట్లకుపైగా వసూళ్లను సాధించి, సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. అయితే ఈ విక్టరీ క్రెడిట్ దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జకే ఎక్కువగా వెళ్లింది.
కానీ వీరిద్దరితో పాటు మరో వ్యక్తికి ఈ విజయానికి కీలకంగా నిలిచాడు. ఆయనే నిర్మాత కె. నిరంజన్ రెడ్డి. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించాడు. రూ.15 కోట్ల బడ్జెట్ అనుకొని ఈ సినిమాను ప్రారంభించారు. కానీ చివరికి రూ.65 కోట్ల వరకు ఖర్చు అయింది. అయితే సినిమాపై నమ్మకంతో నిరంజన్ రెడ్డి ధైర్యం చేశాడు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్ గ్లోబల్ లెవల్ క్వాలిటీతో ఉండేలా జాగ్రత్త పడ్డాడు. కథ ఎంపిక స్వయంగా పర్యవేక్షించి అమలు చేశారు.
పెద్ద హీరోలు సంక్రాంతి బరిలో ఉన్నారు.. రిస్క్ చేయడమే.. అని అందరు అంటున్న కూడా.. పక్కా ప్లాన్ తో థియేటర్స్‌లో రిలీజ్ చేసారు. ఇంకేముంది ఓ యజ్ఞంలా నిర్మించిన సినిమా మహద్భుతం క్రియేట్ చేసింది. ఈ రోజుల్లో వంద రోజుల పాటు థియేటర్‌లలో నడిచిన సినిమాగా రికార్డు సృష్టించడమే కాకుండా కలెక్షన్‌లలోనూ సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది. దీనికి కారణమైన తెరవెనుక అసలు హీరో.. నిర్మాత కె. నిరంజన్ రెడ్డి అంటూ సినీ విశ్లేషకులు కొనియాడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment