ఈ ఏడాది సంక్రాంతికి సందడి చేసిన సినిమాల్లో హనుమాన్ ఒకటి. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తేజ సజ్జా కీలక పాత్రలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం నెల రోజుల పూర్తయ్యాక కూడా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ సినిమా ఆడియన్స్‌కు మరింత మందికి అందుబాటులోకి తెచ్చేందుకు టికెట్స్ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. నైజాంలోని థియేటర్స్‌లో హను-మాన్ టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో టికెట్ ధర రూ.175లుగా ఉంది. ఈ టికెట్స్ ఇకపై రూ.100 కే లభించనున్నాయి. అలాగే మల్టీప్లెక్స్‌లలో రూ.295గా ఉన్న టికెట్ ధరను ఏకంగా రూ.150 కి తగ్గించారు. అయితే ఈ ధరలు ఫిబ్రవరి 16 నుంచి 23 వరకు అందుబాటులో ఉంటాయని మేకర్స్ తెలిపారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కోసమే ఈ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
The #HanuManRAMpage is not over yet❤️🔥
Celebrate the #HanuMania at the most affordable & Lowest prices in the Nizam Area since the release💥
Book your tickets now!
- https://t.co/nM6rXb7n54#HanuMan 🔥
Nizam Release by @MythriOfficial
A @PrasanthVarma film
🌟ing @tejasajja123… pic.twitter.com/wV0cWFvAA6— Prasanth Varma (@PrasanthVarma) February 16, 2024
Comments
Please login to add a commentAdd a comment