Hanu Man Movie
-
2024లో అత్యధిక లాభాలొచ్చిన తెలుగు సినిమా ఏదంటే?
2024 చివరకొచ్చేసింది. ఈ ఏడాది తెలుగు సినిమా రేంజ్ చాలా ఎత్తుకు ఎదిగింది. జనవరిలో 'హనుమాన్' దగ్గర నుంచి డిసెంబర్లో రిలీజైన 'పుష్ప 2' వరకు తగ్గేదే లే అన్నట్లు దూసుకుపోయింది. మధ్యలో 'కల్కి', 'దేవర' లాంటి మూవీస్ పాన్ ఇండియా లెవల్లో తమదైన వసూళ్లు సాధించాయి. మిగతా భాషలతో పోలిస్తే తెలుగు చిత్రాలకు ఈసారి లాభాలు బాగానే వచ్చాయని చెప్పొచ్చు. మరి ఈ ఏడాది అత్యధికంగా లాభపడిన మూవీ ఏంటి? ఎంతొచ్చాయి?తెలుగులో ఈ ఏడాది థియేటర్లలో రిలీజై మంచి వసూళ్లు సాధించిన సినిమాల అంటే.. హనుమాన్, కల్కి, దేవర, పుష్ప 2, టిల్లు స్క్వేర్, లక్కీ భాస్కర్, సరిపోదా శనివారం, గుంటూరు కారం ఉంటాయి. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న 'పుష్ప 2' దేశవ్యాప్తంగా ఇప్పటికే రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. హిందీలోనూ రూ.645 కోట్ల నెట్ కలెక్షన్స్ అందుకుని.. వందేళ్ల బాలీవుడ్ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.(ఇదీ చదవండి: భార్యని పరిచయం చేసిన హీరో శ్రీసింహా)లాభాల పరంగా చూసుకుంటే 'పుష్ప 2' సినిమా అగ్రస్థానంలో ఉంటుందా అంటే లేదని చెప్పొచ్చు. ఎందుకంటే 'పుష్ప 2'కి అటుఇటుగా రూ.500 కోట్లకు పైనే బడ్జెట్ పెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే 150-200 శాతం మధ్యలోనే ఉంది. కల్కి, దేవర చిత్రాల్ని తీసుకున్నా సరే పెట్టిన బడ్జెట్‌కి కొంతమేర లాభాలు వచ్చాయి తప్పితే మరీ ఎక్కువ అయితే రాలేదు.కానీ జనవరిలో రిలీజైన 'హనుమాన్' మూవీకి మాత్రం రూ.40 కోట్లు బడ్జెట్ పెడితే.. రూ.300-350 కోట్ల వరకు వచ్చాయి. దాదాపు 600 శాతానికి పైగా వసూళ్లు వచ్చినట్లే. బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్‌కి లాభాల్లో షేర్ ఇచ్చినా సరే నిర్మాత ఈ సినిమాతో బాగానే లాభపడినట్లే! దీనిబట్టి చూస్తే 2024లో 'హనుమాన్' మోస్ట్ ప్రాఫిటబుల్ తెలుగు సినిమా అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. 'పుష్ప 2' మూవీ ఇంకా థియేటర్లలో ఉంది కాబట్టి.. రన్ పూర్తయ్యేసరికి లాభాల్లో పర్సంటేజ్ ఏమైనా మారుతుందేమో చూడాలి?(ఇదీ చదవండి: నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు: అల్లు అర్జున్) -
పెళ్లెప్పుడో చెప్పిన 'హనుమాన్' హీరోయిన్
'హనుమాన్' సినిమాతో ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా లాంటి వాళ్లకు బాగానే పేరొచ్చింది గానీ హీరోయిన్ అమృత అయ్యర్‌కి అంత గుర్తింపు రాలేదనే చెప్పాలి. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఈమెకు ఎందుకో సరైన బ్రేక్ దొరకట్లేదు. ఇప్పుడు 'బచ్చలమల్లి' మూవీపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. అల్లరి నరేశ్ హీరోగా నటించిన ఈ సినిమా.. ఈ శుక్రవారం (డిసెంబర్ 20)న థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: 'వరుడు' హీరోయిన్ భానుశ్రీ ఇంట్లో విషాదం)'బచ్చలమల్లి' ప్రమోషన్స్‌లో భాగంగా అమృత అయ్యర్‌కి పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. ఎందుకంటే ఈ ఏడాది తక్కువలో తక్కువ 40 మందికి పైగా సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నారు. రకుల్, నాగచైతన్య, కీర్తి సురేశ్.. ఇలా టాప్ హీరోహీరోయిన్లు చాలామంది పెళ్లి బంధంలో అడుగుపెట్టారు. ఇప్పుడు అమృత కూడా వివాహ చేసుకునేందుకు సిద్ధమే. ఆ విషయాన్నే ఇప్పుడు చెప్పింది.'2025లో కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని మాత్రం అస్సలు చేసుకోను. ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తినే చేసుకుంటా. ఇద్దరిదీ ఒకే ఫీల్డ్ అయితే పెళ్లి తర్వాత సమస్యలు వస్తాయని నా అభిప్రాయం. ఇండస్ట్రీ కాకుండా వేరే ఫీల్డ్ అయితే మాట్లాడుకోవడానికి బోలెడన్ని విషయాలు ఉంటాయి' అని అమృత అయ్యర్ చెప్పింది.(ఇదీ చదవండి: మళ్లీ గాయపడిన స్టార్ హీరో ప్రభాస్) -
తొలి స్థానంలో స్త్రీ2... రెండో స్థానంలో కల్కి 2898 ఏడీ
ప్రతి ఏడాది ప్రేక్షకులను ఆకర్షించే, చర్చించుకునేలా చేసే సినిమాలు కొన్ని ఉంటాయి. అలా ఈ ఏడాది కూడా పలు ఇండియన్ సినిమాలు ప్రేక్షకులను ఆకర్షించాయి.... అలరించాయి. కాగా ఇండియాలో గూగుల్ టాప్ ట్రెండింగ్ సెర్చెస్ ఫర్ మూవీస్ జాబితాలోని మొదటి పది చిత్రాల్లో మూడు తెలుగు చిత్రాలు నిలిచాయి. తొలి స్థానంలో రాజ్‌కుమార్ రావు– శ్రద్ధా కపూర్ నటించిన హిందీ చిత్రం ‘స్త్రీ 2’, ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్ లీడ్ రోల్స్‌లో నటించిన ‘కల్కి 2898 ఏడీ’ రెండో స్థానంలో నిలిచాయి. అలాగే ప్రభాస్ హీరోగా నటించిన మరో చిత్రం ‘సలార్’కు తొమ్మిదో స్థానం లభించింది. 3, 4, 5, 6, 7, 8 స్థానాల్లో వరుసగా హిందీ చిత్రాలు ‘ట్వల్త్ ఫెయిల్, లాపతా లేడీస్’, తెలుగు చిత్రం ‘హను–మాన్’, తమిళ చిత్రం ‘మహారాజా’, మలయాళ చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్’, తమిళ చిత్రం ‘గోట్: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ చిత్రాలు నిలిచాయి. మలయాళంలో ఫాహద్ ఫాజిల్ చేసిన ‘ఆవేశం’ సినిమా చివరి స్థానంలో నిలిచింది. అలాగే గూగుల్ టాప్ ట్రెండింగ్ సెర్చెస్ షోల జాబితాలో తొలి స్థానంలో ‘హీరామండి’ వెబ్ సిరీస్ నిలిచింది. ‘మిర్జాపూర్, పంచాయత్, కోట ఫ్యాక్టరీ’ వంటి సిరీస్‌లకు చోటు దక్కింది. -
టాలీవుడ్ యంగ్ హీరో కాళ్లు మొక్కిన సీనియర్ సిటిజెన్.. వీడియో వైరల్!
ఈ ఏడాది సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రం హనుమాన్. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమా పొంగల్ పోటీలో సూపర్ హిట్‌గా నిలిచింది. గుంటూరు కారం, నా సామిరంగ, సైంధవ్ చిత్రాలతో పోటీపడి రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించారు. అయితే ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఐఎఫ్ఎఫ్ఐ వేడుకల్లో తేజ సజ్జా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో హనుమాన్ మూవీని ప్రదర్శించారు. ఈ సందర్భంగా తేజ సజ్జా వేదికపై సందడి చేశారు. ఆ సమయంలోనే ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ సీనియర్ సిటిజెన్ తేజ సజ్జా కాళ్లకు నమస్కరించాడు. అయితే వెంటనే తేజ ఆయనను అలా చేయవద్దని కోరాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కాగా.. తేజ ప్రస్తుతం మరో మూవీలో హీరోగా నటిస్తున్నారు. Super Hero @tejasajja123 received a memorable felicitation at @IFFIGoa after the screening of the Historic Blockbuster #HanuMan !#TejaSajja #IFFI2024 pic.twitter.com/QBHFwiVD3j— Rajesh Manne (@rajeshmanne1) November 23, 2024 -
రానా, తేజ సజ్జా సారీ చెప్పాల్సిందే.. మహేశ్ బాబు ఫ్యాన్స్ డిమాండ్!
టాలీవుడ్లో సంక్రాంతి పండుగకు ఉన్న క్రేజే వేరు. అగ్రహీరోల సినిమాలన్నీ ఆ రోజు కోసమే ఎదురు చూస్తుంటాయి. పొంగల్ బాక్సాఫీస్ పోటీకి థియేటర్లు దొరకడం అంతా ఆషామాషీ కాదు. అందుకే పెద్ద హీరోలంతా ముందుగానే కర్చీఫ్ వేసేస్తారు. ఇప్పటికే వచ్చే ఏడాది సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేశ్ చిత్రం రెడీ అయిపోయాయి. త్వరలోనే మరిన్నీ చిత్రాలు పొంగల్ బాక్సాఫీస్ పోటీకి సై అంటున్నాయి.అయితే ఈ ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమాలే సందడి చేశాయి. మహేశ్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగ, వెంకటేశ్ సైంధవ్‌తో పాటు ప్రశాంత్ వర్మ హనుమాన్ పోటీలో నిలిచాయి. తేజ సజ్జా నటించిన ఈ చిత్రం ఊహించని విధంగా సంక్రాంతి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. చిన్న సినిమా అయినప్పటికీ పెద్ద సినిమాలకు గట్టి పోటీనిచ్చింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సీక్వెల్ తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారు.అయితే ఇటీవల జరిగిన ఐఫా వేడుకల్లో తేజ సజ్జా కూడా పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి హోస్ట్‌గా వ్యవహరించారు. వేదికపై వీరిద్దరి మధ్య సరదా సంభాషణ కొనసాగింది. తేజను రానా పొగుడుతూ మాట్లాడారు. అయితే ఆ తర్వాత వెంటనే నేను మహేశ్ బాబు గురించి మాట్లాడనంటూ రానా ఫన్నీగా చెప్పారు. ఇదేంటి ఇది నాకు కూడా సింక్ అయిందేంటని తేజ సజ్జా అన్నారు. ఆ తర్వాత రానా అతను సూపర్ స్టార్, మీరు ఒక సూపర్ హీరో మీరిద్దరూ సంక్రాంతికి వచ్చారు. సంక్రాంతి మ్యాటర్ ఇప్పుడు మాట్లాడవద్దంటూ తేజ సరదాగా అనడంతో.. దానికి ఎందుకు.. అదంతా సెన్సిటివ్ టాపిక్ హా' అని రానా బదులిచ్చాడు.అయితే ఇది చూసిన మహేశ్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి సంభాషణ మహేశ్ బాబును కించపరిచేలా ఉందంటూ నెట్టింట మండిపడుతున్నారు. తమ అభిమాన హీరో మహేశ్ బాబును ఎగతాళి చేశారని తేజ సజ్జా, రానాపై ట్విటర్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. 25 ఏళ్లుగా సినిమాల్లో ఉన్న మహేష్ మీద సెటైర్ వేయడం కరెక్ట్ కాదంటున్నారు ఫ్యాన్స్. మహేష్ సినిమాను కించపరిచినందుకు క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ ఓ అభిమాని పోస్ట్ చేశాడు. గుంటూరు కారం సినిమాపై మాట్లాడినందుకు సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు రానా, తేజ సజ్జా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. Context 😤pic.twitter.com/PBTuhvgD3W— Cinderella🦋 (@GlamGirl_Geetha) November 6, 2024 U had one success man, one! Daniki 25 yrs ga ace filmography unna Mahesh meedha satireUnless you come up with a sequel for Hanuman, aa collections thechkolev and yk why @tejasajja123 Inka Rana gurinchi enduku, shelved project adhi— Jimhalpert (@satvikdhfm) November 5, 2024 Dear @tejasajja123 ,Need apology to superstar @urstrulyMahesh garu and his fans You and rana degrade comments about 2024 sankranthi films , in this sankranthi one of my beloved superstar film also there you know also,Please try to understand this situation.Thanks and…— Sagar MB (@dhfmbabu4005) November 5, 2024 -
జై హనుమాన్‌లో ‘కాంతార’ హీరో!
‘జై హనుమాన్’ సినిమాలో రిషబ్ శెట్టి నటించే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘హనుమాన్’. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలాగే ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ రానున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ‘జై హనుమాన్’ సినిమాలో ఎవరు హీరోగా నటిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. (చదవండి: నటి గౌతమిని మోసం చేసిన సినీ ఫైనాన్సియర్)చిరంజీవి, రామ్‌చరణ్ వంటి స్టార్స్‌ను పరిశీలిస్తున్నట్లుగా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన చైతన్య చెప్పారు. అయితే తాజాగా ఈ సినిమాలో కన్నడ హీరో ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి నటిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, చైతన్య ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం ‘కాంతార’ సినిమా ప్రీక్వెల్తో బిజీగా ఉన్నారు రిషబ్ శెట్టి. మరి... ‘జై హనుమాన్’ సినిమాలో రిషబ్ శెట్టి నటించనున్నారనే వార్త నిజమేనా? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. -
భారత్ నుంచి ఆస్కార్ కోసం నామినేట్ అయిన చిత్రాలు ఇవే
ఆస్కార్ అవార్డుల రేస్‌లో ఈ ఏడాది సౌత్ ఇండియా నుంచి భారీగానే సినిమాలు పోటీ పడుతున్నాయి. తెలుగు,తమిళ్, మలయాళం నుంచి పలు సినిమాలు ఎంట్రీ కోసం ఊరిస్తున్నాయి. 2024వ ఏడాదికి గానూ మన భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి మొత్తం 29 చిత్రాలను గుర్తించి వాటిని ఆస్కార్ అవార్డులకు నామినేట్ చేసింది. ఈమేరకు ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ కార్యవర్గం అధికారికంగా ప్రకటించింది. 2025 ఆస్కార్‌కు మన దేశం నుంచి 'లాపతా లేడీస్' ఎంపికైనట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. భారత్ నుంచి పలు భాషలకు చెందిన 29 చిత్రాల్లో లా పతా లేడీస్‌ను మాత్రమే ఎంపిక చేశారు.అస్కార్ కోసం ఈసారి ఎక్కువగా సౌత్ ఇండియా సినిమాలే పోటీ పడ్డాయి. 29 చిత్రాల్లో టాలీవుడ్ నుంచి మూడు సినిమాలు 'కల్కి 2898 ఏడీ,హనుమాన్,మంగళవారం' ఉన్నాయి. అయితే, ఈ ఏడాదిలో 6 తమిళ చిత్రాలు నామినేట్ లిస్ట్‌లో చోటు సంపాదించుకోవడం విశేషం. వాటిలో నటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన మహారాజా, విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్, సూరి ప్రధాన పాత్రను పోషించిన కొట్టుక్కాళి, రాఘవలారెన్స్, ఎస్జే.సూర్య కలిసి నటించిన జిగర్తండా డబుల్ఎక్స్, మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన వాళై, పారి ఎలవళగన్ కథానాయకుడిగా నటించి,దర్శకత్వం వహించిన జమ చిత్రాలు చోటు చేసుకున్నాయి. మలయాళం నుంచి ఆట్టం, ఆడుజీవితం (ది గోట్ లైఫ్),ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, ఉళ్ళోజుక్కు వంటి చిత్రాలు ఉన్నాయి. ఇలా మొత్తంగా సౌత్ ఇండియా నుంచి 13 సినిమాలు ఆస్కార్ కోసం నామినేట్ అయ్యాయి. అయితే, భారతీయ చిత్ర పరిశ్రమ పంపిన 29 సినిమాల్లో ప్రస్తుతానికి లపతా లేడిస్ మాత్రమే అస్కార్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. త్వరలో మిగిలిన సినిమాల గురించి అధికారికంగా ప్రకటన వస్తుంది. 🤞🏼 pic.twitter.com/YgdeaTsTNi— Prasanth Varma (@PrasanthVarma) September 23, 2024 -
నెవర్ బిఫోర్ అనేలా 'హను-మాన్' మేకింగ్ వీడియో
తేజ సజ్జ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ‘హను-మాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం..ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. మహేశ్ బాబు, నాగార్జున, వెంకటేశ్ లాంటి బడా హీరోల సినిమాలు బరిలో ఉన్నా..వాటన్నింటిని తట్టుకొని సంక్రాంతి హిట్ సినిమాగా నిలిచింది. టాలీవుడ్లోనే కాకుండా..బాలీవుడ్, కోలీవుడ్‌లో కూడా హను-మాన్ భారీ వసూళ్లను రాబట్టింది. స్టార్ హీరోలు లేని ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 350 కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ పంచుకుంది. వీడియోతో పాటు హనుమాన్ చాలీసాను యాడ్ చేశారు. ఆ వీడియో నిడివి 2:43 నిమిషాలు ఉంది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న హనుమాన్ మేకింగ్ వీడియోను మీరూ చూసేయండి. -
జపాన్‌లో ‘హను-మాన్’.. రిలీజ్ ఎప్పుడంటే..?
తేజ సజ్జ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ‘హను-మాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం..ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. మహేశ్ బాబు, నాగార్జున, వెంకటేశ్ లాంటి బడా హీరోల సినిమాలు బరిలో ఉన్నా..వాటన్నింటిని తట్టుకొని సంక్రాంతి హిట్ సినిమాగా నిలిచింది. టాలీవుడ్లోనే కాకుండా..బాలీవుడ్, కోలీవుడ్‌లో కూడా హను-మాన్ భారీ వసూళ్లను రాబట్టింది. స్టార్ హీరోలు లేని ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 350 కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ఓటీటీలోనూ ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభించింది. (చదవండి: 'కన్నప్ప' పేరుతో యూట్యూబర్స్‌కి మెయిల్స్.. నిజమేంటి?)ఇలా పాన్ ఇండియా స్థాయిలో అలరించిన ఈ చిత్రం..ఇప్పుడు జపాన్‌లోనూ సందడి చేయనుంది. అక్టోబర్ 4న ఈ చిత్రం జపాన్‌లో విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎక్స్ వేదికగా తెలియజేస్తూ.. ‘విడుదలైన అన్ని చోట్ల సెస్సేషన్ క్రియేట్ చేసిన ‘హను-మాన్’..ఇప్పుడు జపాన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 4న జపనీస్ సబ్‌టైటిల్ వెర్షన్ విడుదల కానుంది’ అని పేర్కొన్నాడు. After creating a sensation all over❤️🔥#HanuMan is now all set to amaze the audience in Japan 💥The Japanese subtitled version is all set to hit the screens on October 4th 🤩#HanuManInJapan 🔥🌟ing @tejasajja123@Actor_Amritha @Niran_Reddy @varusarath5 @VinayRai1809… https://t.co/ccprtfKEs3— Prasanth Varma (@PrasanthVarma) July 27, 2024 -
ప్రభాస్ కల్కి మరో ఘనత.. ఆ లిస్ట్‌లో టాప్ ప్లేస్!
ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీ మరో ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు కొల్లగొట్టిన ఈ చిత్రం ఐఎండీబీ ప్రకటించిన లిస్ట్‌లో టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఈ ఏడాదిలో ఇండియావ్యాప్తంగా ఇప్పటివరకు మోస్ట్ పాపులర్ సినిమాల జాబితాలో కల్కి మొదటిస్థానంలో నిలిచింది. దీంతో చిత్రయూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ జాబితాలో కల్కి తర్వాత మలయాళ బ్లాక్ బస్టర్ మంజుమ్మెల్ బాయ్స్, ఫైటర్, హనుమాన్, సైతాన్ తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత వరుసగా.. లపత్తా లేడీస్, ఆర్టికల్ 370, ప్రేమలు, ఆవేశం, ముంజ్యా సినిమాలు ఉన్నాయి. ఈ లిస్ట్‌లో మలయాళ చిత్రాలు సత్తా చాటగా.. టాలీవుడ్ నుంచి కల్కి, హనుమాన్ మాత్రమే చోటు దక్కించుకున్నాయి. కాగా.. కల్కి చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ నాలుగో స్థానం నిలిచి సత్తా చాటింది. ‘Tis the season of lists, and we’re back with the ultimate one! 🌟Halfway through 2024, we're excited to share the Most Popular Indian Movies of the year (so far!) 🎬✨Which one's your top pick? 🤔1. Kalki 2898-AD pic.twitter.com/9eCnBR7zYM— IMDb India (@IMDb_in) July 23, 2024 -
కాసుల వర్షం కురిపిస్తున్న ‘దేవుళ్లు’
ఒకప్పుడు మన పురాణాలు, ఇతీహాసాలపై టాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో చాలా వరకు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి.అయితే రాను రాను వెండితెరపై మైథాలజీ కథలు తగ్గిపోతూ వచ్చాయి. యాక్షన్, క్రైమ్, సస్పెన్స్, రొమాంటిక్ జానర్ సినిమాలే ఎక్కువగా సందడి చేశాయి. మధ్య మధ్యలో ఒకటి రెండు మైథాలజీ జానర్ సినిమాలు వచ్చినా..అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా.. మళ్లీ మన ప్రేక్షకులు ‘దేవుళ్ల’ కథలను ఆదరిస్తున్నారు. సోషియో పాంటసీ సినిమాలను బ్లాక్ బస్టర్ హిట్ చేస్తున్నారు. పురాణాలు, ఇతిహాసాలు, దైవిక అంశాలతో కూడిన సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు నిదర్శనం ‘కల్కి 2898 ఏడీ’ సినిమానే. పురాణాల్లోని పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్ జోడించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మహాభారతంలోని కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామ పాత్రలన్నింటిని వెండితెరపై చూపిస్తూ..ఓ కొత్త కథను చెప్పాడు. ఆ కథకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టి చరిత్ర సృష్టించింది.అంతకు ముందు వచ్చిన ‘కార్తికేయ 2’ చిత్రాన్ని కూడా ‘దేవుడే’ హిట్ చేశాడు. ఆ సినిమాలో కృష్ణుడుకి సంబంధించిన సన్నివేశాలకు నార్త్‌తో పాటు సౌత్ ప్రేక్షకులు కూడా పడిపోయారు. సినిమా విజయంలో ఆ సీన్స్ కీలక పాత్ర పోషించాయి. ఇక ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన మరో మైథాలజీ ఫిల్మ్ ‘హను-మాను’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా దాదాపు రూ. 350 కోట్ల వసూళ్లను రాబట్టింది.‘అరి’తో పాటు మరిన్ని చిత్రాలు..టాలీవుడ్లో మైథాలజీ చిత్రాలకు గిరాకీ పెరిగింది. దీంతో పలువురు దర్శకనిర్మాతలు ఆ జోనర్ చిత్రాలనే తెరకెక్కించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఆఖండ 2ను లైన్లో పెట్టాడు దర్శకుడు బోయపాటి శ్రీను. ‘కల్కి’ సినిమాకు సీక్వెల్ కూడా రెడీ అవుతోంది. అలాగే హను-మాన్‌కి సీక్వెల్‌గా ‘జై హను-మాన్’ రాబోతుంది. 2025లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. చిరంజీవి ‘విశ్వంభర’, నిఖిల్ ‘స్వయంభు’ కూడా సోషియో ఫాంటసీ చిత్రాలే.ఇక ఇదే జోనర్లో ‘పేపర్ బాయ్’ ఫేం జయశంకర్ ‘అరి’అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, శుభలేఖ సుధాకర్, ఆమని, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కృష్ణుడిది ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. ఇంత వరకి ఎవరు టచ్ చేయని అరిషడ్వర్గాలనే కాన్సెప్ట్ మీద అరి మూవీని తెరకెక్కించాడు జయశంకర్. మనిషి అంతర్గత శత్రువులుగా భావించే అరిషడ్వర్గాలైన కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యాలని శ్రీకృష్ణుడు ఎలా నియంత్రించాడు? వాటితో ఆయనకున్న సంబంధం ఎలాంటిదనే విషయాల్ని వర్తమాన అంశాలతో ముడిపెడుతూ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సినిమా క్లైమాక్స్‌లో కృష్ణుడికి సంబంధించిన సీన్స్..గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయట. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. అసలే ఇప్పుడు మైథాలజీ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ‘అరి’లో కృష్ణుడి సీన్స్ పేలితే..బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
'హనుమాన్' దర్శకుడికి చేదు అనుభవం.. ఏం జరిగిందంటే?
'హనుమాన్'తో ఓవర్ నైట్ సెన్సేషన్ క్రియేట్ చేసిన వ్యక్తి ప్రశాంత్ వర్మ. అప్పటివరకు తెలుగులో పలు సినిమాలు తీసినప్పటికీ ఓ మాదిరి గుర్తింపు వచ్చింది. ఎప్పుడైతే 'హనుమాన్' థియేటర్లలోకి వచ్చి హిట్ టాక్ తెచ్చుకుందో ప్రశాంత్ వర్మ పేరు మార్మోగిపోయింది. సర్వత్రా ప్రశంసలు దక్కాయి. తర్వాత చేయబోయే ప్రాజెక్టుల్లో ఇతడు బిజీగా ఉన్నాడు. అలాంటిది ఇప్పుడు ప్రశాంత్ వర్మకు చేదు అనుభవం ఎదురైంది.(ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు.. ఆవేదనతో మంచు విష్ణుకు నటి హేమ లేఖ)'హనుమాన్' తర్వాత దీనికి సీక్వెల్‌గా 'జై హనుమాన్' ఉందని ప్రకటించారు. త్వరగా ఈ మూవీ వస్తే బ్రేక్ ఇద్దామని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రశాంత్ వర్మ మాత్రం వేరే ప్రాజెక్టులు చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నాడు. అలా బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్‌తో 'రాక్షసుడు' అనే మూవీ ఓకే అయిందని కొన్నిరోజుల క్రితం రూమర్స్ వచ్చాయి. అనంతరం కొన్నాళ్లకు ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని టాక్ వినిపించింది.ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు ప్రశాంత్ వర్మ షాకింగ్ ట్వీట్ పెట్టాడు. 'ప్రతి తిరస్కరణ ఏదో ఒకరోజు తిరిగి ఆశీర్వాదం అవుతుంది' అని రాసుకొచ్చాడు. దీంతో ఎవరికీ తోచింది వాళ్లు అనేసుకుంటున్నారు. హీరో రణ్వీర్ సింగ్ రిజెక్ట్ చేయడమే ఈ ట్వీట్‌కి కారణమని మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంత? అసలేం జరిగిందనేది ప్రశాంత్ వర్మ చెప్తే తప్ప క్లారిటీ రాదు!(ఇదీ చదవండి: ఈవారం ఓటీటీలో 23 సినిమాలు/సిరీస్‌లు.. ఎక్కువగా ఆ రోజే!)One day you realise every rejection was a blessing in disguise! :)— Prasanth Varma (@PrasanthVarma) July 8, 2024 -
హనుమాన్ టు కల్కి.. టాలీవుడ్ ఫస్టాప్ ఎలా ఉందంటే..
టాలీవుడ్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్‌గా మారింది. ఇక్కడి సినిమాలను ప్రపంచం మొత్తం ఆదరిస్తోంది. వందల కోట్ల కలెక్షన్స్ రాబడుతూ రికార్డులను సృష్టిస్తోంది. అయితే ఇక్కడ సక్సెస్ ఎంత శాతం ఉందో ఫెయిల్యూర్ అంతే ఉంది. కొన్ని సినిమాలు ఊహించని రీతిలో కలెక్షన్స్ రాబడితే.. మరికొన్ని దారుణమైన అపజయాన్ని మూటగట్టుకున్నాయి. ఈ ఆరు నెలల్లో టాలీవుడ్ రిపోర్ట్ ఎలా ఉందో చూసేద్దాం.ఓపెనింగ్ అదిరింది!టాలీవుడ్‌కి సంక్రాంతి పండగ చాలా పెద్దది. ప్రతి సంక్రాంతికి ఒకటి రెండు పెద్ద సినిమాలు వస్తుంటాయి. కానీ ఈ ఏడాది మాత్రం ఏకంగా నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘గుంటూరు కారం’, వెంకటేశ్ ‘సైంధవ్’, నాగార్జున ‘నా సామిరంగ’తో పాటు కుర్రహీరో తేజ సజ్జ ‘హనుమాన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే వీటిల్లో హనుమాన్ భారీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. స్టార్ హీరోల సినిమాలు బరిలో ఉన్నప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులు ‘హనుమాన్’కే ఓటేశారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 300 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టింది. గుంటూరుకారం, నా సామిరంగ చిత్రాలకి మిశ్రమ టాక్ వచ్చినా.. మంచి వసూళ్లనే రాబట్టాయి. సైంధవ్ మాత్రం దారుణంగా బోల్తాపడింది. అంతకు ముందు జనవరి 1న వచ్చిన సర్కారు నౌకరి, రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజైన ‘ర్యాపిడ్ యాక్షన్ మిషన్’, ‘బిఫోర్ మ్యారేజ్’ సినిమాలు ప్లాప్ టాక్‌నే మూటగట్టుకున్నాయి.బ్యాండ్ మోగింది..ఇక ఫిబ్రవరి తొలివారంలో సుహాస్ హీరోగా నటించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్’ విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మంచి విజయమే సాధించింది. అదేవారంలో వచ్చిన ‘కిస్మత్’, ‘హ్యాపీ ఎండింగ్’, ‘బూట్‌కట్ బాలరాజు’, ‘గేమ్ ఆన్’ చిత్రాలు మాత్రం సందడి చేయలేకపోయాయి. ఇక రెండో వారంలో వచ్చిన రవితేజ ఈగల్, మమ్ముట్టి, జీవా ల‘యాత్ర 2’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపంచాయి. మూడోవారంలో వచ్చిన ‘ఊరు పేరు భైరవకోన’ప్రేక్షకలను కొంతమేర భయపెట్టేసింది. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక చివరివారంలో వచ్చిన ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’, ‘రాజధాని ఫైల్స్’, ‘సిద్ధార్థ్ రాయ్’, ‘సుందరం మాస్టర్’ చిత్రాలేవి ప్రేక్షకులను అలరించలేకపోయాయి. అయితే ఫిబ్రవరిలో ఈగల్, యాత్ర 2 తప్పితే మిగతావన్నీ అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిన్న చిత్రాలే రిలీజ్ కావడం గమనార్హం.అలరించని సమ్మర్సంక్రాంతి తర్వాత సమ్మర్ సీజన్ టాలీవుడ్‌కి చాలా ముఖ్యమైనది. దాదాపు మూడు నాలుగు పెద్ద సినిమాలైనా వేసవిలో విడుదలయ్యేవి. కానీ ఈ ఏడాది సమ్మర్లో ఒక్క స్టార్ హీరో సినిమా కూడా రిలీజ్ కాలేదు. మార్చి తొలివారం వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అదేవారం భూతద్దం భాస్కర్ నారాయణ’, ‘చారి 111’, ‘ఇంటి నెంబర్ 13’లాంటి చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ.. ఏ ఒక్కటి అలరించలేదు. (చదవండి: బాక్సాఫీస్ వద్ద కల్కి నయా రికార్డ్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లో తెలుసా?)రెండోవారం గోపిచంద్ ‘భీమా’తో విశ్వక్ సేన్ ‘గామి’తో వచ్చాడు. వీటిల్లో భీమాకి ప్లాప్ టాక్ రాగా.. ‘గామి’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద రెండు సినిమాలో బోల్తా పడ్డాయి. ఇక మూడో వారంలో రజాకార్, లంబసింగి, షరతులు వర్తిసాయి’తో పాటు అరడజనుకు పైగా చిన్న సినిమాలు రిలీజ్ అయినా..ఒక్కటి కూడా హిట్ కాలేదు. మూడో వారంలో రిలీజైన శ్రీవిష్ణు ‘ఓం భీమ్ బుష్’ థియేటర్లలో నవ్వులు పూయించింది. ఇక చివరి వారంలో వచ్చిన ‘టిల్లు స్వ్కేర్’ సూపర్ హిట్ కొట్టేసింది. బాక్సాపీస్ వద్ద దాదాపు రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ‘టిల్లుగాడు’ సత్తా చాటాడు.ఏప్రిల్‌లో భారీ అంచనాలతో వచ్చిన విజయదేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అదేవారంలో రిలీజైన భరతనాట్యం’, ‘బహుముఖం’ చిత్రాలు ప్లాప్ టాక్ని సంపాదించుకున్నాయి. రెండోవారంలో రిజీలైన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రం యావరేజ్ టాక్ని సంపాదించుకుంది. ఇక చివరి రెండు వారాల్లో ‘శ్రీరంగనీతులు’ ‘పారిజాతపర్వం’, ‘మార్కెట్ మహాలక్ష్మీ, తెప్ప సముద్రం చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాగా..ఏ ఒక్కటి ఆకట్టుకోలేదు.(చదవండి: పాన్ ఇండియాపై ‘మెగా’ ఆశలు)మేలో తొలివారం ‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటూ అల్లరి నరేశ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చాలా కాలం తర్వాత నరేశ్ నటించిన కామెడీ చిత్రమిది. మంచి అంచనాలతో రిలీజైన ఈ చిత్రం ఫ్లాప్ టాక్‌నే సంపాదించుకుంది. ఈ మూవీతో పాటు రిలీజైన సుహాస్ ‘ప్రసన్నవదనం’ చిత్రానికి మంచి టాక్ వచ్చినా.. వసూళ్లను మాత్రం రాబట్టలేకపోయింది. ఒక సెకండ్ వీక్‌లో సత్యదేవ్ ‘కృష్ణమ్మ’తో పాటు ‘ఆరంభం’ అనే చిన్న చిత్రం విడుదలైన..తొలిరోజే నెగెటివ్ టాక్ని సంపాదించుకున్నాయి. ఇక నారా రోహిత్ హీరోగా నటించిన ‘ప్రతినిధి 2’ థియేటర్స్‌కి వచ్చిన విషయమే తెలియదు. ఆ తర్వాత వారంలో ‘నట రత్నాలు’, ‘బిగ్ బ్రదర్’, ‘సీడీ’ ‘సిల్క్ శారీ’, ‘డర్టీ ఫెలో’, ‘బ్రహ్మచారి’తో పాటు మొత్తం అరడజను చిత్రాలు విడుదలైన ప్లాప్ టాక్ని మూటగట్టుకున్నాయి. గెటప్ శ్రీను తొలిసారి హీరోగా నటించిన ‘రాజు యాదవ్’ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక చివరివారం భజేవాయు వేగం, గం..గం..గణేశా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలు రిలీజ్ కాగా.. వీటిల్లో ‘భజే వాయు వేగం’ హిట్ టాక్‌కి సంపాదించుకుంది. ఇక జూన్ తొలివారం ‘సత్యభామ’ అంటూ కాజల్.. ‘మనమే’ అంటూ శర్వానంద్ ప్రేక్షకుల ముందుకు రాగా.. రెండు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేపోయాయి. అదేవారంలో లవ్ మౌళితో పాటు మరో రెండు చిత్రాలు రిలీజ్ అయ్యాయి కానీ.. ఏది హిట్ కాలేదు. రెండో వారంలో సుధీర్ బాబు ‘హరోం హర’తో పాటు ‘మ్యూజిక్ షాప్ మూర్తి, నీ దారే నీ కథ, యేవమ్ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. వీటిల్లో మ్యూజిక్ షాప్ మూర్తి విమర్శకులు ప్రశంసలు అందుకుంది. మూడోవారంలో నింద, ‘ఓ మంచి ఘోస్ట్’, ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’, ‘అంతిమ తీర్పు’ లాంటి పలు చిన్న సినిమాలు విడుదలైనా..ఏ ఒక్కటి అలరించలేదు. ఇక చివరి వారం మాత్రం టాలీవుడ్‌కి గుర్తిండిపోయే విజయాన్ని అందించింది. ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ జూన్ 27న విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. కేవలం మూడు రోజుల్లోనే 415 కోట్లను వసూళ్లు చేసి రికార్డ్ సృష్టిస్తోంది. మొత్తంగా ఈ ఆరు నెలల్లో హిట్ల కంటే ఎక్కువగా ఫ్లాపులే ఉన్నాయి. అయితే హనుమాన్, కల్కి 2898 చిత్రాలు మాత్రం చారిత్రాత్మక విజయాలను అందుకున్నాయి. -
'హనుమాన్' నటి పెళ్లి డేట్ ఫిక్సయిందా? ఎప్పుడంటే?
హీరోయిన్ల పెళ్లి అంటే మినిమం హడావుడి గ్యారంటీ. అలా కాకుండా ఎవరైనా చేసుకున్నారా అంటే చాలా తక్కువ మందే ఉంటారు. ఇకపోతే హీరోయిన్లలో చాలామంది ఏజ్ బార్ అయిన తర్వాతే ఏడడుగులు వేస్తుంటారు. ఈ లిస్టులోకి ఇప్పుడు 'హనుమాన్' వరలక్ష్మి శరత్ కుమార్ చేరబోతుంది. ఇదివరకే నిశ్చితార్థం చేసుకోగా, ఇప్పుడు పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టైల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసిందట.(ఇదీ చదవండి: పెళ్లి గురించి హింట్ ఇచ్చేసిన హీరోయిన్ అంజలి.. త్వరలో శుభవార్త)తమిళ నటుడు శరత్ కుమార్ వారసురాలు వరలక్ష్మీ. 2012లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాలు చేసింది. కానీ పెద్దగా కలిసి రాలేదు. దీంతో రూట్ మార్చి క్యారెక్టర్ ఆర్టిస్టు అయింది. అప్పటి నుంచి ఈమె దశ తిరిగిపోయింది. తెలుగు, తమిళంలో వరస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. రీసెంట్గా 'హనుమాన్' మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.39 ఏళ్లు వచ్చేసినా సరే పెళ్లికి దూరంగా ఉంటూ వచ్చింది. కానీ ఈ ఏడాది మార్చిలో నికోలాయ్ సచ్దేవ్ అనే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాకిచ్చింది. పెళ్లి ఎప్పుడనేది మాత్రం చెప్పలేదు. ఇప్పుడు ఆ డేట్ ఫిక్స్ అయిందని, జూలై 2న థాయ్‌ల్యాండ్‌లో వివాహ వేడుక జరనుందని తెలుస్తోంది. ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టేశారని టాక్. అది అయిన తర్వాత చెన్నైలో రిసెప్షన్ ఉండనుందని సమాచారం.(ఇదీ చదవండి: పెళ్లయిన మూడు నెలలకే విడిపోతున్నారా? అసలు విషయం ఇది) -
గట్స్ ఉన్నవాళ్లకే హిట్స్ వస్తాయి: తేజ సజ్జ
‘‘సత్యం’ థియేటర్లో వందరోజులు ఆడిన సినిమాలు చూశాను. అలాంటి ప్లేస్‌లో మా ‘హను–మాన్’ వంద రోజుల పండగ జరుపుకోవడం హ్యాపీగా ఉంది. ప్రేక్షకులు మాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది’’ అని తేజ సజ్జా అన్నారు. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హను–మాన్’. చైతన్య సమర్పణలో కె. నిరంజన్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది జనవరి 12న విడుదలైంది. దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం 25 కేంద్రాల్లో వంద రోజుల ప్రదర్శనను పూర్తి చేసుకుందని చిత్ర యూనిట్ పేర్కొంది.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ‘హను–మాన్’ హిస్టారిక్ 100 డేస్ సెలబ్రేషన్స్‌లో తేజ సజ్జా మాట్లాడుతూ– ‘‘దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్రెడ్డిగారిలోని ధైర్యాన్ని ఈ తరం స్ఫూర్తిగా తీసుకోవాలి. గట్స్ ఉన్నవాళ్లకే హిట్స్ వస్తాయి’’ అన్నారు. ‘‘ఇంద్ర, నువ్వు నాకు నచ్చావ్, పోకిరి’ వంటివి.. నాకు బాగా గుర్తున్న వంద రోజుల వేడుకలు జరుపుకున్న సినిమాలు. అయితే ఇప్పుడు సినిమా అంటే ఓ వీకెండ్ అయిపోయింది. ఇలాంటి తరంలో వందో రోజు కూడా థియేటర్స్‌కు వచ్చి ఆడియన్స్ మా సినిమా చూస్తున్నారంటే అది మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయు)లో రాబోయే సినిమాల్లో అన్ని పరిశ్రమల నుంచి పెద్ద నటీనటులు కనిపిస్తారు’’ అన్నారు ప్రశాంత్ వర్మ.‘‘నా కాలేజీ రోజుల్లో సినిమాల వంద రోజుల ఫంక్షన్స్ చూసేవాడిని. అలాంటిది నేను నిర్మించిన సినిమా వంద రోజులు జరుపుకోవడం హ్యాపీగా ఉంది’’ అన్నారు నిరంజన్ రెడ్డి. ‘‘హను–మాన్’ వంద రోజుల వేడుక చేసుకోవడం హ్యాపీగా ఉంది’’అన్నారు చైతన్య. ఐమాక్స్ త్రీడీలో జై హనుమాన్... ‘హను–మాన్’కు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ రానుంది. మంగళవారం (ఏప్రిల్ 23) హనుమాన్ జయంతి సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసి, భారీ వీఎఫ్ఎక్స్తో రూపొందించనున్న ఈ సినిమాను ఐమాక్స్ 3డీ వెర్షన్లో విడుదల చేయనున్నట్లు యూనిట్ పేర్కొంది. -
Hanu-Man: రిస్క్ చేశాడు... హిట్ కొట్టాడు
తేజ సజ్జ హీరోగా నటించిన హను-మాన్ చిత్రం టాలీవుడ్లో సంచలనం సృష్టించింది. సూపర్ హీరో కాన్సెప్ట్ కి ఇండియన్ మైథాలజీని లింక్ చేసి తెరకెక్కించిన ఈ అద్భుతానికి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద రూ. 350 కోట్లకుపైగా వసూళ్లను సాధించి, సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. అయితే ఈ విక్టరీ క్రెడిట్ దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జకే ఎక్కువగా వెళ్లింది. కానీ వీరిద్దరితో పాటు మరో వ్యక్తికి ఈ విజయానికి కీలకంగా నిలిచాడు. ఆయనే నిర్మాత కె. నిరంజన్ రెడ్డి. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించాడు. రూ.15 కోట్ల బడ్జెట్ అనుకొని ఈ సినిమాను ప్రారంభించారు. కానీ చివరికి రూ.65 కోట్ల వరకు ఖర్చు అయింది. అయితే సినిమాపై నమ్మకంతో నిరంజన్ రెడ్డి ధైర్యం చేశాడు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్ గ్లోబల్ లెవల్ క్వాలిటీతో ఉండేలా జాగ్రత్త పడ్డాడు. కథ ఎంపిక స్వయంగా పర్యవేక్షించి అమలు చేశారు. పెద్ద హీరోలు సంక్రాంతి బరిలో ఉన్నారు.. రిస్క్ చేయడమే.. అని అందరు అంటున్న కూడా.. పక్కా ప్లాన్ తో థియేటర్స్‌లో రిలీజ్ చేసారు. ఇంకేముంది ఓ యజ్ఞంలా నిర్మించిన సినిమా మహద్భుతం క్రియేట్ చేసింది. ఈ రోజుల్లో వంద రోజుల పాటు థియేటర్లలో నడిచిన సినిమాగా రికార్డు సృష్టించడమే కాకుండా కలెక్షన్లలోనూ సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది. దీనికి కారణమైన తెరవెనుక అసలు హీరో.. నిర్మాత కె. నిరంజన్ రెడ్డి అంటూ సినీ విశ్లేషకులు కొనియాడుతున్నారు. -
హనుమాన్ హీరో కొత్త మూవీ.. గ్లింప్స్ చూస్తే గూస్‌బంప్సే!
హనుమాన్ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన యంగ్ హీరో తేజ సజ్జా. ఈ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ దక్కించుకున్నారు. తేజ మరో హిస్టారికల్ మూవీ చేసేందుకు రెడీ అయిపోయారు. తేజ సజ్జాకు జంటగా రితికా నాయక్ నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆయన రవితేజతో ఈగల్ మూవీని తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ టైటిల్‌తో పాటు గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. హైదరాబాగ్లోని రామానాయుడు స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో టైటిల్ రివీల్ చేశారు. తేజ సజ్జా తాజా చిత్రానికి మిరాయి అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో తేజ సూపర్‌యోధ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్లో తేజ సజ్జ సూపర్ యోధా లుక్‌లో కనిపించారు. బద్దలయ్యే అగ్నిపర్వతం పైన నిలబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అశోకుని కాలంలో జరిగిన కళింగ యుద్ధం ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు గ్లింప్ల్ చూస్తే అర్థమవుతోంది. మిరాయి సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీతో పాటు చైనీస్ భాషల్లోనూ వచ్చే ఏడాది ఏప్రిల్ 18న విడుదల చేయనున్నారు. From the hush of ancient narratives📜 Comes a thrilling adventurous saga of a #SuperYodha 🥷⚔️#PMF36 x #TejaSajja6 Titled as #𝐌𝐈𝐑𝐀𝐈 ⚔️#MIRAITitleGlimpse out now💥 -- https://t.co/k4tycunRkA In Cinemas on 18th APRIL 2025 ~ 2D & 3D🔥 SuperHero @tejasajja123… pic.twitter.com/WN2MB2EPlE — People Media Factory (@peoplemediafcy) April 18, 2024 -
'మాటిస్తున్నా.. అంతకుమించి'.. హనుమాన్ డైరెక్టర్ ట్వీట్!
ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన చిత్రం హనుమాన్. తేజ సజ్జా ప్రధాన పాత్రలో తెరెకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల వర్షం కురిపించింది. సంక్రాంతి రిలీజై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. పెద్ద సినిమాలతో పోటీ పడి రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. హనుమాన్ సూపర్ హిట్ కావడంతో ఈ చిత్రాని సీక్వెల్ కూడా ఉంటుందని ఇప్పటికే ప్రశాంత్ వర్మ ప్రకటించారు. ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉన్నారు. ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు ప్రశాంత్. సీక్వెల్‌గా వస్తోన్న జై హనుమాన్ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. హనుమాన్ కంటే అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలిపారు. ఈ పవిత్రమైన శ్రీరామనవమి సందర్భంగా మీకు మాటిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. కాగా.. జై హనుమాన్ చిత్ర పనులు ఏడాది కిందటే మొదలు పెట్టామని ప్రశాంత్ వర్మ ఇటీవల తెలిపారు. కథ సిద్ధంగా ఉందని.. ఎలా తీయాలో అన్న విషయంపై ఇంకా వర్క్ జరుగుతోంది. వీఎఫ్ఎక్స్తో పాటు మిగిలిన వాటిపై ఓ క్లారిటీ రాగానే షూటింగ్ మొదలవుతుందన్నారు. రాబోయే సినిమాల నాణ్యత విషయంలో అస్సలు రాజీపడది లేదని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు. "वचनं धर्मस्य रक्षणं" 🙏 Wishing everyone a very Happy & Blessed #RamNavami ❤️ On this sacred occasion and with the divine blessings of Lord Rama, this is my promise to all the audience across the globe to give you an experience like never before & a film to celebrate for a… pic.twitter.com/gFNWsN9F06 — Prasanth Varma (@PrasanthVarma) April 17, 2024 -
Teja Sajja: ‘సూపర్ యోధ’గా ‘హను-మాన్’ హీరో
‘హను–మాన్’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు హీరో తేజ సజ్జా. తాజాగా ఆయన కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ‘ఈగల్’ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రకటించి, పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్. ‘హను–మాన్’ చిత్రంలో సాంప్రదాయ దుస్తుల్లో కనిపించిన తేజ.. కొత్త పోస్టర్లో స్టైలిష్ మేకోవర్‌లో కనిపించారు. ‘‘సూపర్ యోధ సాహసోపేతమైన కథతో పాన్ ఇండియా మూవీగా ఇది తెరకెక్కనుంది. ‘ఈగల్’ తర్వాత కార్తీక్ ఘట్టమనేనితో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న రెండో చిత్రం ఇది. ఈ సినిమా పూర్తి వివరాలను ఈ నెల 18న ప్రకటిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, క్రియేటివ్డ్యూసర్: కృతీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి. Wishing my Super Hero @TejaSajja123 Super talented @Karthik_gatta & Super passionate @vishwaprasadtg garu all the best for #PMF36 🤗 Title Announcement Glimpse on 𝗔𝗣𝗥𝗜𝗟 𝟭𝟴𝘁𝗵 #SuperYodha 🥷 pic.twitter.com/aOqpz1z08E — Prasanth Varma (@PrasanthVarma) April 15, 2024 -
నేను అనుకున్న కలని అతడు నిజం చేశాడు: చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పగానే 150కి పైగా సినిమాలు, ఎన్నో అద్భుతమైన పాత్రలు గుర్తొస్తాయి. ప్రస్తుతం 'విశ్వంభర' అనే మూవీ చేస్తున్న చిరు.. యంగ్ హీరోలపై ఎప్పటికప్పడు తన అమితమైన ప్రేమని చూపిస్తుంటారు. ఇప్పుడు అలానే సౌత్ ఇండియా ఫెస్టివల్-2024లో మాట్లాడుతూ 'హనుమాన్' ఫేమ్ తేజ సజ్జాని ఆకాశానికెత్తేశారు. (ఇదీ చదవండి: సాయిపల్లవికి రికార్డ్ రెమ్యునరేషన్.. 'రామాయణ' కోసం అన్ని కోట్లా?) 'ఆ కుర్రాడిని చూశారా? (తేజ సజ్జాని యాంకర్ కి చూపిస్తూ..) అతడు 'హనుమాన్' సినిమా చేశాడు. కానీ 25 ఏళ్ల క్రితం బాలనటుడిగా కెరీర్ మొదలుపెట్టాడు. నాతో మూవీస్ చేశాడు. ఇంద్ర చిత్రంలో నటించాడు. ఆ తర్వాత ఎంతో ఎదిగాడు. అతడికి ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. నన్ను అభిమానిస్తూ, నా చిత్రాల్ని స్ఫూర్తిగా తీసుకుని హీరో అయ్యాడు. 'హనుమాన్'తో తనని తాను నిరూపించుకున్నాడు' 'నేను కూడా హనుమాన్ పై సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. కానీ చేయలేకపోయాను. నా ప్రయత్నానికి ముందే అతడు చేసేశాడు. కానీ ఈ విషయంలో నేను పూర్తిగా సంతృప్తి చెందాను. ఎందుకంటే అతడు కూడా నా ప్రయాణంలో భాగమే. నటుడిగా నిరూపించాడు. ఇండస్ట్రీలో అందరి ప్రశంసలు అందుకున్నాడు' అని చిరు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: గుండె బద్దలైంది.. బయటపడటానికి చాలా టైమ్ పట్టింది: మృణాల్) Padma Vibhushan, Mega 🌟 @KChiruTweets lauds @tejasajja123 for his impressive journey in cinema at #SIFF pic.twitter.com/3d6DtdDFAC — Vamsi Kaka (@vamsikaka) April 12, 2024 -
హనుమాన్ నటి థ్రిల్లర్ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?
హనుమాన్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'శబరి'. ఈ చిత్రాన్ని మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. ఈ సినిమాతో అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో రూపొందించిన ఈ చిత్రం మే 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ.. 'సరికొత్త కథాంశంతో తీసిన సినిమా 'శబరి'. కథ, కథనాలు ఇన్నోవేటివ్‌గా ఉంటాయి. ఇది స్ట్రాంగ్ ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రం. వరలక్ష్మీ శరత్ కుమార్‌తో సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు ఆమె నటించిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా ఆమె నటన సూపర్‌గా ఉంటుంది. సినిమా మాకు చాలా నచ్చింది. 'వరల్డ్ ఆఫ్ శబరి' పేరుతో విడుదల చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మే 3న పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నాం. అన్ని భాషలు, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రమిది' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, రషిక బాలి, వైవా రాఘవ, ప్రభు, భద్రం, కృష్ణతేజ, బిందు పగిడిమర్రి, ఆశ్రిత వేముగంటి, హర్షిని కోడూరు, అర్చన అనంత్, ప్రమోదిని బేబీ నివేక్ష, బేబీ కృతిక ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతమందించారు. -
అంజనాద్రి 2.0.. 'జై హనుమాన్' వీడియో పోస్ట్ చేసిన ప్రశాంత్ వర్మ
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా వండర్స్ క్రియేట్ చేసింది. తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా వచ్చిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. దీనికి కొనసాగింపుగా 'జై హనుమాన్' రానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో సీక్వెల్ అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ వర్మ తాజాగా స్పెషల్ మ్యూజిక్ థీమ్‌ను షేర్ చేశారు. ప్రశాంత్ వర్మ షేర్ చేసిన వీడియోలో అందమైన కొండల మధ్యలో పెద్ద నది ఉంది. పార్ట్ -1 మాదిరి ఈ వీడియోలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూపించిన ప్రశాంత్.. 'వెల్కమ్ టు అంజనాద్రి 2.0' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఆపై టైటిల్ నేమ్ అయిన #Jai Hanuman హ్యాష్ట్యాను కూడా దానికి జత చేశారు. ఫైనల్‌గా ఈ వీడియోకు 'హనుమాన్' నుంచి 'రఘునందన' పాటను అటాచ్ చేయడం విశేషం. హనుమాన్ సినిమా ముగింపులోనే పార్ట్2 ఉంటుందని చెప్పేశాడు దర్శకుడు. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేమిటి..? అనే ప్రశ్నకు సమాధానంగా 'జై హనుమాన్' తెరకెక్కుతుంది. ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి ఏదైనా పోస్టర్ విడుదల కావచ్చు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయ్యాయి. వచ్చే ఏడాది సంక్రాంతికే జై హనుమాన్ విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. ఇందులో ఆంజనేయ స్వామి పాత్రను ఒక స్టార్ హీరో చేస్తారని చెప్పిన ప్రశాంత్ వర్మ.. మరీ ఆ స్టార్ హీరో ఎవరో ఇంకా ఫైనల్ చేయలేదు. ఇకపోతే హనుమాన్ సినిమా జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. View this post on Instagram A post shared by Prasanth Varma (@prasanthvarmaofficial) -
ఏకంగా మూడు ఓటీటీల్లోకి హనుమాన్.. క్రేజ్ మామూలుగా లేదుగా!
ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. సంక్రాంతి సినిమాలతో పోటీపడి సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ప్రస్తుతం హనుమాన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి వచ్చిన హనుమాన్ పలు రికార్డులు కొల్లగొట్టింది. స్ట్రీమింగ్ అయిన కొద్ది గంటల్లోనే అత్యధిక వ్యూయర్షిప్ సాధించింది. ప్రస్తుతం జీ5లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుండగా.. హిందీ వర్షన్ జియో సినిమాలో అందుబాటులో ఉంది. అయితే దక్షిణాది భాషల్లోనూ హనుమాన్ చిత్రాన్ని తీసుకురావాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ వర్మ అప్డేట్ ఇచ్చారు. తమిళ, కన్నడ, మలయాళంలోనూ హనుమాన్ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ మూడు భాషల్లోని సినీ ప్రియులకు ఏప్రిల్ 5 నుంచి అందుబాటులోకి రానుందని ట్వీట్ చేశారు. అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుందని వెల్లడించారు. ఈ లెక్కన హనుమాన్ ఏకంగా మూడు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది అన్నమాట. Tamil, Malayalam and Kannada versions of #HanuMan premieres April 5th on @DisneyPlusHS 😃#HanuManOnHotstar pic.twitter.com/PQvJWoTvZb — Prasanth Varma (@PrasanthVarma) March 26, 2024 -
హనుమాన్ ఖాతాలో తొలి అవార్డు.. ప్రశాంత్ వర్మ ట్వీట్
ఈ ఏడాదిలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. తాజాగా ఈ చిత్రం ఖాతాలో మొదటి అవార్డు వచ్చి చేరింది. సంక్రాంతి విజేతగా నిలిచిన ఈ మూవీలో తేజ సజ్జా హీరోగా నటించగా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశాడు. బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలతో పోటీని తట్టుకుని రూ. 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం జీ5 ద్వారా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం రూ. 40 కోట్లతో హనుమాన్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ.. ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో వచ్చిన మొదటి సూపర్ హీరో సినిమాగా రికార్డ్ క్రియేట్ చేయడమే కాకుండా .. హనుమాన్ కథకు ఇండియన్ మైథాలజీని లింక్ చేసి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశంలో ప్రశాంత్ వర్మ కష్టం కనిపిస్తుంది. హనుమాన్ విజువల్స్ చూసిన చిన్న పిల్లల.పెద్దలు ఫిదా అయ్యారు. అందుకే వారందరినీ మరోసారి సినిమా చూసేలా చేశాయి. థియేటర్స్‌లో రికార్డ్స్ క్రియేట్ చేసిన హనుమాన్.. ఓటీటీలో కూడా సత్త చాటుంది. కొద్దిరోజుల క్రితమే హనుమాన్ కలెక్షన్స్ వర్షం ఆగింది.. ఇప్పుడు అవార్డుల వర్షం మొదలైంది. ఈ క్రమంలో రేడియో సిటీ తెలుగు నిర్వహించిన ఐకాన్ అవార్డ్స్‌లో హనుమాన్ సినిమాకు గాను బెస్ట్ డైరెక్టర్ అవార్డును ప్రశాంత్ వర్మ అందుకున్నాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. ఇది ఆరంభం మాత్రమే అంటూ ఆయనకు ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. First award for #HanuMan 🙂 Thank you @radiocityindia 🤗#IconAwards #BestDirector pic.twitter.com/xCqgCHkoro — Prasanth Varma (@PrasanthVarma) March 21, 2024 -
బాక్సాఫీస్ సంచలనం.. ఓటీటీలో కేవలం 11 గంటల్లోనే!
బాక్సాఫీస్ సంచలనం హనుమాన్ మూవీ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. ఈనెల 17న సడన్‌గా స్ట్రీమింగ్కు వచ్చేసిన ఈ చిత్రం ఓటీటీ దూసుకెళ్తోంది. స్ట్రీమింగ్కు వచ్చేసిన 11 గంటల్లోనే 102 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ సాధించింది. జీ5 ఓటీటీ చరిత్రలో తొలి రోజున ఉన్న రికార్డులను తిరగరాసింది. 2024లో జీ 5ను ప్రపంచ వ్యాప్తంగా హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలబెట్టింది. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన హనుమాన్ ఓటీటీలోనూ రికార్డులు కొల్లగొడుతోంది. వ్యూస్‌తో గ్లోబల్‌గా జీ5లో నంబర్‌వన్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని జీ5 తన ట్విటర్ ద్వారా వెల్లడించింది. విజువల్స్, భక్తి పారవశ్యంలో మునిగిపోయే సన్నివేశాలు, రోమాలు నిక్కబొడిచే యాక్షన్‌తో పాటు పాటలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంలో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. హనుమాన్ కథేంటంటే... అంజనాద్రి ప్రాంతంలో ఉండే హనుమంతు (తేజ సజ్జ) అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. తల్లిదండ్రి లేని హనుమంతుని అక్క అంజనమ్మ (వరలక్ష్మి శరత్ కుమార్) అన్నీ తానై హనుమంతుని పెంచి పెద్దచేస్తుంది. ఆ ప్రాంతంలో అన్యాయం చేస్తోన్న గజపతిని ఓ సందర్భంలో హనుమంతు ఆ ఊళ్లో వైద్యం చేయటానికి వచ్చిన డాక్టర్ మీనాక్షి కారణంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. మీనాక్షిని హనుమంతు చిన్నప్పటి నుంచి ఇష్టపడుతుంటాడు. గజపతి కారణంగా హనుమంతు ప్రమాదంలో చిక్కుకుంటే అతని ఆంజనేయ స్వామికి సంబంధించిన ఓ అపూర్వశక్తి దొరుకుతుంది. దాంతో అతను ప్రజలకు మంచి చేస్తుంటాడు. చివరకు విషయం విలన్ వరకు చేరుతుంది. అపూర్వ దైవశక్తిని సంపాదించుకోవటానికి ప్రతినాయకుడు ఏం చేశాడు?.. అతన్ని మన హీరో ఎలా ఎదుర్కొన్నాడు.. చివరకు ఆంజనేయస్వామి భక్తుడి కోసం ఏం చేశాడనే కథే హనుమాన్. RECORDS BROKEN AND HEARTS WON! HanuMan now streaming on ZEE5 in Telugu with English subtitles. https://t.co/TfUtuuoNTx @tejasajja123 @PrasanthVarma @Niran_Reddy @Actor_Amritha @varusarath5 @VinayRai1809 @Chaitanyaniran @GowrahariK @AsrinReddy @Primeshowtweets @tipsofficial pic.twitter.com/8EymDJjKbU — ZEE5 Telugu (@ZEE5Telugu) March 18, 2024 -
ఓటీటీలో హనుమాన్.. కన్నీళ్లు పెట్టుకున్న చిన్నారి...!
టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ కొత్త ఏడాదిలో రిలీజై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ కొట్టింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన హనుమాన్ ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమాకు చిన్నపిల్లలు బాగా కనెక్ట్ అయ్యారు. హనుమాన్ విజువల్స్.. తేజ సజ్జా ఫర్మామెన్స్‌కు పిల్లలు ఫిదా అయిపోయారు. తాజాగా ఈ మూవీని వీక్షించిన ఓ చిన్నారి.. కన్నీళ్లు పెట్టుకుంది. హనుమాన్ చిత్రంలో కుస్తీ ఫైట్ సీన్‌ను చూసిన చిన్నారి బోరున ఏడ్చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఆ పాప తండ్రి ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియోకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రిప్లై కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Awww 🥹🤗 https://t.co/HlczCf7Ewx — Prasanth Varma (@PrasanthVarma) March 18, 2024 -
ఓటీటీకి హనుమాన్.. ఇంతలోనే సడన్‌గా ఏమైంది?
టాలీవుడ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న హనుమాన్ ఎట్టకేలకు ఓటీటీకి వచ్చేసింది. మొదట హిందీ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించిన మేకర్స్.. తెలుగులో ఓటీటీ రిలీజ్‌పై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. మొదట్లో శివరాత్రి సందర్భంగా ఓటీటీకి వస్తుందని భావించినప్పటికీ అలా జరగలేదు. ఆ తర్వాతనైనా మార్చి 16న హిందీ వర్షన్‌తో పాటే సర్ప్రైజ్ ఉంటుందేమోనని ఫ్యాన్స్ భావించారు. దీంతో హనుమాన్ ఓటీటీ రిలీజ్‌పై అప్డేట్స్ వెయిట్ చేసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. కానీ ఎవరూ ఉహించని విధంగా హిందీ వర్షన్ స్ట్రీమింగ్ అయిన కొద్దిగంటల్లోనే చెప్పా పెట్టకుండా తెలుగులోనూ స్ట్రీమింగ్ చేశారు. అసలు హనుమాన్ ఓటీటీకి వచ్చిందన్న విషయం జీ5లో చూస్తే కానీ అభిమానులకు తెలియరాలేదు. కానీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్న సినిమాను సడన్‌గా స్ట్రీమింగ్ ఎందుకు చేశారు? ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన టాలీవుడ్ ఫ్యాన్స్ కోసం తేదీని ప్రకటించకుండా స్ట్రీమింగ్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఈ విషయంలో నెటిజన్స్ మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఓటీటీ రిలీజ్ ఆలస్యం కావడంతో ఆడియన్స్‌కు ఉన్న ఇంట్రెస్ట్ కాస్తా పోతుందనే సడన్ స్ట్రీమింగ్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు హనుమాన్ ఓటీటీ రిలీజ్ తర్వాత నెటిజన్స్ కామెంట్స్‌తో విరుచుకుపడుతున్నారు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్పై నెగెటివ్ పోస్టులు పెడుతున్నారు. థియేటర్లలో అలరించిన హనుమాన్కు.. డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌కు వచ్చేసరికి నెగెటివిటీ స్ప్రెడ్ కావడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరికొందరేమో కావాలనే ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారని మండిపడుతున్నారు. ఈ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన మూవీ అని ప్రశంసిస్తున్నారు. ఏదేమైనా థియేటర్లలో మెప్పించిన ఈ సినిమాకు ఓటీటీలో ఇలాంటి టాక్ రావడం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. All of Sudden Negativity on #HanuMan What is the reason? pic.twitter.com/7lTcGKec1P — Telugu Bit (@telugubit) March 17, 2024 Why, suddenly people are spreading negativity on #HanuMan cinema, after releasing it in OTT What is making them cry 🤔 pic.twitter.com/Aa90IxjIq6 — 🚩అజ్ఞాతవాసి Ãgnathavasì 🕉️ (@myselfBharath__) March 17, 2024 -
రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన హనుమాన్.. ఎక్కడంటే?
ఒకప్పుడు థియేటర్లో కొత్త సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎదురుచూసేవారు. ఇప్పుడు థియేటర్‌తో పాటు అటు ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా? ఏ ఓటీటీలోకి వస్తుందా? అని ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. గత కొన్నాళ్లుగా హనుమాన్ ఓటీటీ రిలీజ్ కోసం వెబ్ వీక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు తెర దించుతూ జియో సినిమాలో హనుమాన్ హిందీ వర్షన్ రిలీజ్ చేశారు. జియోలో స్ట్రీమింగ్ నిన్న (మార్చి 16) రాత్రి 8 గంటల నుంచే జియో సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో నార్త్ ఇండియన్స్ వీకెండ్లో సినిమా చూస్తూ తమ సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ సీన్ అదుర్స్, ఆ సీన్ సూపర్బ్ అంటూ కొన్ని సన్నివేశాల క్లిప్పింగ్స్ నెట్టింట షేర్ చేస్తున్నారు. అయితే సడన్‌గా మరో ఓటీటీలోనూ హనుమాన్ను తీసుకొచ్చేశారు. జీ5లో హనుమాన్ మూవీని అందుబాటులోకి తెచ్చారు. ఈ మేరకు ఓ ప్రోమో కూడా వదిలారు. జీ5లోకి వచ్చేసిన హనుమాన్ అంతా ఓకే కానీ చివర్లో దీన్ని ఫ్రీగా ఇవ్వట్లేదని కొనుక్కోమని చెప్పారు. ఇది చూసిన అభిమానుల ఫ్యూజులెగిరిపోయాయి. సబ్‌స్క్రైబర్స్‌కు ఫ్రీగా ఇవ్వాలి కానీ మళ్లీ ఇలా ప్రత్యేకంగా డబ్బులు పెట్టి కొనుక్కోమని తిరకాసులేంటో అని తిట్టిపోశారు. కానీ కాసేపటికే రెంట్ పద్ధతి తీసేసి ఫ్రీగా చూడొచ్చని చెప్పారు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్‌లో తేజ సజ్జ హీరోగా నటించాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.350 కోట్ల మేర రాబట్టింది. HanuMan is now streaming on @ZEE5Telugu 😊@tejasajja123 @Niran_Reddy @Actor_Amritha @varusarath5 @VinayRai1809 @Chaitanyaniran @AsrinReddy @Primeshowtweets @tipsofficial @tipsmusicsouth @ThePVCU @RKDStudios #HanuMan #HanuManOnZEE5 pic.twitter.com/PLf0lF3Lfw — Prasanth Varma (@PrasanthVarma) March 17, 2024 చదవండి: త్వరలో ఎలక్షన్స్.. మన్సూర్‌కు కోలుకోలేని దెబ్బ.. అధ్యక్ష పదవి ఊస్ట్ -
మరికొన్ని గంటల్లో ఓటీటీకి హనుమాన్.. ప్రశాంత్ వర్మ స్పెషల్ పోస్ట్!
ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. పెద్ద సినిమాలతో పోటీపడి రికార్డ్ స్థాయి వసూళ్లతో అదరగొట్టింది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటనైతే రాలేదు. దీంతో కొందరు ఫ్యాన్స్ సైతం ఉన్న ఇంట్రస్ట్ కాస్తా పోయిందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే హనుమాన్ హిందీ వర్షన్ ఓటీటీ హక్కులను జియో సినిమా దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల నుంచే స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఈ వారంలో ఫుల్ బజ్ ఉన్న సినిమాల్లో హనుమాన్ నంబర్‌వన్ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత యానిమల్, డంకీ చిత్రాలు ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. ప్రముఖ ఆర్మాక్స్ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫోటోను ప్రశాంత్ వర్మ అభిమానులతో పంచుకున్నారు. కాగా.. అయితే తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో ఓటీటీ హక్కులను జీ5 దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఓటీటీ రిలీజ్ డేట్‌పై హింట్ ఇచ్చాడు. త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించనున్నట్లు ట్వీట్ చేశారు. హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్రకటన రానుందని పోస్ట్ చేశారు. 😊 https://t.co/BFBLAnWM5p — Prasanth Varma (@PrasanthVarma) March 16, 2024 -
'హనుమాన్' ఓటీటీ రిలీజ్‌పై డైరెక్టర్ ట్వీట్.. ఫైర్ అవుతున్న నెటిజన్లు
ఈ ఏడాది సంక్రాంతి సమయంలో పెద్ద సినిమాలతో పాటు ఎలాంటి అంచనాలు లేకుండా 'హనుమాన్' సినిమా విడుదలైంది. యంగ్ హీరో తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో దుమ్మురేపింది. సంక్రాంతికి వచ్చిన సినిమాలు అన్నీ ఇప్పటికే పలు ఓటీటీలలో వచ్చేశాయి. కానీ ‘హనుమాన్’ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూసే వారికి మరోసారి నిరాశ ఎదురైంది. ఇప్పట్లో ఓటీటీలోకి హనుమాన్ వచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది. హనుమాన్ ఓటీటీ విడుదలపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తాజాగా ఇలా చెప్పుకొచ్చారు. 'హనుమాన్ ఓటీటీ విడుదల ఆలస్యం అనేది ఉద్దేశపూర్వకంగా చేస్తోంది కాదు. వీలైనంత త్వరగా ఓటీటీలోకి తీసుకురావడానికి మా యూనిట్ విరామం లేకుండా పనిచేస్తోంది. మీకు ఉత్తమమైనది అందిచాలన్నదే మా ప్రధాన ఉద్దేశం. ఆలస్యం విషయంలో దయచేసి అర్థం చేసుకోవడానికి అందరూ ప్రయత్నించండి. ఇప్పటి వరకు మా చిత్ర యూనిట్‌కు సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు.' అని తెలిపారు. తాజాగా ప్రశాంత్ వర్మ చేసిన పోస్ట్‌పై నెటిజన్ తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. విడుదలైన సినిమాకు కొత్తగా మీరు యాడ్ చేసేది ఏంటి..? ఆలస్యానికి కారణాలు ఏంటి..? కనీసం ఎప్పుడు వస్తుందో అంచనా తేదీనైనా ప్రకటించలేనంత స్థితిలో ఉన్నారా..? మీరు చేస్తున్న అతికి సినిమాపై ఉన్న ఆసక్తి కూడా పోతుంది అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మొదట హనుమాన్ సినిమా మార్చి 2 నుంచి 'జీ5'లో స్ట్రీమింగ్ అవుతుందని టాక్ వినిపించింది. అప్పుడు జరగలేదు. ఆ తర్వాత శివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదల అన్నారు. అప్పుడూ లేదు. తాజాగా మార్చి 15 నుంచి స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదీ లేదు.. ఇప్పుడు ప్రశాంత్ వర్మ పోస్ట్‌తో ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో కూడా తెలయని పరిస్థితి అని అభిమానులు తీవ్రమైన నిరాశకు గురయ్యారు. భారీ సినిమాల మధ్య రిలీజ్ అయిన సినిమాకు తాము ఎంతగానో సోషల్‌మీడియాలో ప్రమోట్ చేస్తే ఇప్పుడు ఇలా గేమ్స్ అడుతున్నారా అంటూ డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై ఫైర్ అవుతున్నారు. ఇప్పటికి అయితే హనుమాన్ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో అనే విషయంపై ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇవ్వలేదు. #HanuMan OTT streaming delay was not intentional! We have been working tirelessly round the clock to sort things and bring the film to you asap! Our intention is always to give you nothing but the best! Please try to understand and continue supporting us! Thank you! 🤗… — Prasanth Varma (@PrasanthVarma) March 15, 2024 -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 12 చిత్రాలు స్ట్రీమింగ్!
మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఎప్పటిలాగే శుక్రవారం వస్తోందంటే సినిమాలు రిలీజ్‌కు సిద్ధమైపోతాయి. ఈ వారంలో థియేటర్లలో చిన్న సినిమాలే ఉన్నాయి. వీటిలో వెయ్ దరువెయ్, రజాకార్, లంబసింగి, తంత్ర, యోధ అనే డబ్బింగ్ మూవీ కూడా ఉంది. దీంతో సినీ ప్రియులు ఓటీటీ వైపు చూస్తున్నారు. మరి ఈ వీకెండ్లో సందడి చేసేందుకు క్రేజీ చిత్రాలు రెడీ ఉన్నాయి. ఈ వారం ఓటీటీలో హనుమాన్ వచ్చే అవకాశముంది. కానీ ఇప్పటికే హిందీ వర్షన్ అధికారికంగా ప్రకటించగా.. దక్షిణాది భాషల్లో ఎప్పుడనేది క్లారిటీ లేదు. మరోవైపు మమ్ముట్టి 'భ్రమయుగం', 'సేవ్ ద టైగర్స్ 2' సిరీస్‌తో పాటు 'మర్డర్ ముబారక్', 'మెయిన్ అటల్ హునా' అనే హిందీ చిత్రాలు వస్తున్నాయి. వీటితో పాటు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా ఓటీటీల్లోకి రాబోతున్నాయి. నెట్‌ఫ్లిక్స్ 24 హవర్స్ విత్ గాస్పర్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 14 గర్ల్స్ 5 ఎవా: సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 14 చికెన్ నగ్గెట్ (కొరియన్ సిరీస్) - మార్చి 15 ఐరిష్ విష్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 15 ఐరన్ రియన్ (స్పానిష్ సిరీస్) - మార్చి 15 మర్డర్ ముబారక్ (హిందీ సినిమా) - మార్చి 15 అమెజాన్ ప్రైమ్ బిగ్ గర్ల్స్ డోంట్ క్రై (హిందీ సిరీస్) - మార్చి 14 ఇన్విన్సబుల్ సీజన్ 2 పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 14 ఫ్రిడా (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 15 హాట్‌స్టార్ గ్రేస్ అనాటమీ: సీజన్ 20 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 15 సేవ్ ద టైగర్స్ సీజన్ 2 (తెలుగు సిరీస్) - మార్చి 15 టేలర్ స్విఫ్ట్: ద ఎరాస్ టూర్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 15 జీ5 మెయిన్ అటల్ హూ (హిందీ సినిమా) - మార్చి 14 సోనీ లివ్ భ్రమయుగం (తెలుగు డబ్బింగ్ మూవీ) - మార్చి 15 ఆపిల్ ప్లస్ టీవీ మ్యాన్ హంట్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 15 లయన్స్ గేట్ ప్లే నో వే అప్ (ఇంగ్లీష్ చిత్రం) - మార్చి 15 బుక్ మై షో ద డెవిల్ కాన్స్పరసీ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 15 జియో సినిమా హనుమాన్ (హిందీ వెర్షన్ మూవీ) - మార్చి 16 ట్రాల్స్ బ్యాండ్ టుగెదర్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 17 -
అమిత్ షాను కలిసిన టాలీవుడ్ డైరెక్టర్..!
హనుమాన్ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కొచ్చిన ప్రశాంత్ వర్మ తాజాగా కేంద్ర హోమంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. హనుమాన్ హీరో తేజ సజ్జాతో కలిసి ఆయనకు ఆంజనేయస్వామి విగ్రహాన్ని బహుకరించారు. హనుమాన్ సినిమాకు ప్రోత్సాహం అందించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. కాగా.. ఇవాళ సికింద్రాబాద్‌లో జరిగిన భాజపా సోషల్ వారియర్స్ సమావేశానికి అమిత్ షా హాజరయ్యారు. సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసిన హనుమాన్ సూపర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. త్వరలోనే ఈ మూవీ ఓటీటీలోనూ సందడి చేయనుంది. థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించారు. View this post on Instagram A post shared by Prasanth Varma (@prasanthvarmaofficial) -
ఓటీటీకి హనుమాన్.. ప్రశాంత్ వర్మ లేటేస్ట్ అప్డేట్.. నెటిజన్స్ కామెంట్స్ వైరల్!!
టాలీవుడ్ మూవీ హనుమాన్ సంక్రాంతికి రిలీజైన బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. పెద్ద సినిమాలతో పోటీపడి రికార్డ్ స్థాయి వసూళ్లతో అదరగొట్టింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే హిందీ వర్షన్ తేదీ ఖరారు చేశారు. ఈనెల 16 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. అయితే తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో ఓటీటీ హక్కులను జీ5 దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే స్ట్రీమింగ్ డేట్‌పై ఇప్పటి వరకు అధికారిక ప్రకటనైతే రాలేదు. మరో వైపు గతంలోనే మహా శివరాత్రికి స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలొచ్చాయి. కానీ అలా జరగలేదు. ఈ నేపథ్యంలో హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఓటీటీ రిలీజ్ డేట్‌పై హింట్ ఇచ్చాడు. త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించనున్నట్లు ట్వీట్ చేశారు. హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్రకటన రానుందని పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో వెయిటింగ్ అన్న అంటూ కామెంట్స్ పెడుతుండగా.. మరికొందరేమో ఉన్న ఇంట్రెస్ట్ కాస్తా కూడా పోయిందని పోస్ట్ చేస్తున్నారు. మరీ హిందీ స్ట్రీమింగ్‌తో పాటే ఈ నెల 16 నుంచైనా ఓటీటీకి వస్తుందేమో వేచి చూద్దాం. #HanuMan OTT streaming date announcement is coming! 😊👍🏼 — Prasanth Varma (@PrasanthVarma) March 11, 2024 -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
ఎప్పటిలానే మరోవారం వచ్చేసింది. కాకపోతే ఈసారి థియేటర్లలోకి వచ్చే చిత్రాల్లో దాదాపు అన్ని చిన్న సినిమాలే ఉన్నాయి. వీటిలో 'వెయ్ దరువెయ్', 'రజాకర్', 'తంత్ర'తో పాటు 'యోధ' అనే డబ్బింగ్ మూవీ కూడా ఉంది. మరోవైపు ఓటీటీలో మాత్రం మంచి క్రేజీ తెలుగు చిత్రాలు-సిరీసులు స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. (ఇదీ చదవండి: ఆస్కార్-2024 విన్నింగ్ సినిమాలు.. ఏయే ఓటీటీలో ఉన్నాయంటే?) ఈ వారం ఓటీటీలో 'హనుమాన్' హిందీ వెర్షన్ రిలీజ్ కానుంది. తెలుగు వెర్షన్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. మమ్మట్టి 'భ్రమయుగం', 'సేవ్ ద టైగర్స్ 2' సిరీస్‌తో పాటు 'మర్డర్ ముబారక్', 'మెయిన్ అటల్ హునా' అనే హిందీ చిత్రాలు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. వీటితో పాటు పలు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు-సిరీసులు కూడా ఓటీటీల్లోకి రాబోతున్నాయి. ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మార్చి 11-17th వరకు) నెట్‌ఫ్లిక్స్ యంగ్ రాయల్స్ సీజన్ 3 (స్వీడిష్ సిరీస్) - మార్చి 11 జీసస్ రివల్యూషన్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 12 టర్నింగ్ పాయింట్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 12 బండిడోష్ (స్పానిష్ సిరీస్) - మార్చి 13 24 హవర్స్ విత్ గాస్పర్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 14 గర్ల్స్ 5 ఎవా: సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 14 చికెన్ నగ్గెట్ (కొరియన్ సిరీస్) - మార్చి 15 ఐరిష్ విష్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 15 ఐరన్ రియన్ (స్పానిష్ సిరీస్) - మార్చి 15 మర్డర్ ముబారక్ (హిందీ సినిమా) - మార్చి 15 అమెజాన్ ప్రైమ్ లవ్ అదురా (హిందీ సిరీస్) - మార్చి 13 బిగ్ గర్ల్స్ డోంట్ క్రై (హిందీ సిరీస్) - మార్చి 14 ఇన్విన్సబుల్ సీజన్ 2 పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 14 ఫ్రిడా (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 15 హాట్‌స్టార్ గ్రేస్ అనాటమీ: సీజన్ 20 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 15 సేవ్ ద టైగర్స్ సీజన్ 2 (తెలుగు సిరీస్) - మార్చి 15 టేలర్ స్విఫ్ట్: ద ఎరాస్ టూర్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 15 జీ5 మెయిన్ అటల్ హూ (హిందీ సినిమా) - మార్చి 14 సోనీ లివ్ భ్రమయుగం (తెలుగు డబ్బింగ్ మూవీ) - మార్చి 15 ఆపిల్ ప్లస్ టీవీ మ్యాన్ హంట్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 15 లయన్స్ గేట్ ప్లే నో వే అప్ (ఇంగ్లీష్ చిత్రం) - మార్చి 15 బుక్ మై షో ద డెవిల్ కాన్స్పరసీ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 15 జియో సినిమా హనుమాన్ (హిందీ వెర్షన్ మూవీ) - మార్చి 16 ట్రాల్స్ బ్యాండ్ టుగెదర్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 17 (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
ఫ్యాన్స్‌కు హనుమాన్ టీం సర్ప్రైజ్.. ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ హనుమాన్. తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం థియేటర్లలో ఇంకా రన్ అవుతూనే ఉంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఓటీటీకి వస్తుందని భావించినప్పటికీ అలా జరగలేదు. తాజాగా ఓటీటీ రిలీజ్‌పై మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. హనుమాన్ మూవీ ఈనెల 16 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్కు వస్తుందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. ఈ సినిమాను జియో సినిమాలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా కలర్స్ సినీఫ్లెక్స్ ఛానెల్లో మార్చి 16 రాత్రి ఎనిమిది గంటలకు ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. దీంతో బాలీవుడ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే సౌత్ భాషల్లో స్ట్రీమింగ్ ఎప్పుడనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. తెలుగు ఆడియన్స్‌తో పాటు సౌత్ ఫ్యాన్స్ హనుమాన్ ఓటీటీ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. Brahmaand ka sabse pehla SUPERHERO ab aayega aapke TV screens par! 🔥📺 16 March raat 8 baje, dekhiye #HanuMan ka World Television Premiere, Hindi mein pehli baar, Colors Cineplex aur JioCinema par.@tejasajja123 @Actor_Amritha @Primeshowtweets @RKDStudios @Colors_Cineplex… pic.twitter.com/0Uq7qg6Efh — Prasanth Varma (@PrasanthVarma) March 8, 2024 -
శివరాత్రికి ఓటీటీల్లో సినిమాల జాతర.. ఒక్క రోజే 9 చిత్రాలు స్ట్రీమింగ్!
ఈ సారి ఏకంగా వీకెండ్ సెలవులు వచ్చేస్తున్నాయి. అంతే కాకుండా మహాశివరాత్రికి కూడా సెలవు రావడంతో మూడు రోజులు ఇక పండగే. ఈ నేపథ్యంలో వీకెండ్ ప్లాన్ ఇప్పటికే వేసుకుని ఉంటారు. ఏయే సినిమాలు చూడాలి? ఓటీటీల్లో ఎలాంటి సినిమాలు వస్తున్నాయి? థియేటర్లకు రానున్న చిత్రాలేంటి? అనే తెగ వెతికేస్తుంటారు. మీరు ఆశించినట్టే ఈ సెలవుల్లో ఫుల్ ఎంటర్టైన్ చేసేందుకు చిత్రాలు రెడీ అయిపోయాయి. టాలీవుడ్లో భీమా, గామి లాంటి పెద్ద చిత్రాలు థియేటర్లలో రిలీజ్ అవుతుండగా.. మరో రెండు, మూడు చిన్న సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి. మలయాళ సూపర్ హిట్ మూవీ ప్రేమలు తెలుగులోనూ రిలీజ్ అవుతోంది. మరీ ఓటీటీల సంగతేంటీ అనుకుంటున్నారా? థియేటర్ల మాదిరే సినీ ప్రియులను అలరించేందుకు ఓటీటీల్లో సందడి చేసేందుకు స్పెషల్ సినిమాలు వచ్చేస్తున్నాయి. ఈ వారం విజయ్ సేతుపతి మేరీ క్రిస్మస్, మలయాళ హిట్ మూవీ అన్వేషిప్పిన్ కండేతుమ్ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. కానీ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హనుమాన్ ఈనెల 8 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని భావించినప్పటికీ.. ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. మరీ సడన్‌గా స్ట్రీమింగ్ చేసి సర్ప్రైజ్ ఇస్తారేమో వేచి చూడాల్సిందే. లేదంటే నెక్ట్స్ వీకెండ్ దాకా ఆగాల్సిందే. వీటితో రజినీకాంత్ లాల్ సలామ్, సందీప్ కిషన్ మూవీ ఊరు పేరు భైరవకోన కూడా స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది. నెట్‌ఫ్లిక్స్ మేరీ క్రిస్మస్(హిందీ సినిమా)- మార్చి 08 లోన్ అవే(వెబ్ సిరీస్)- సీజన్ 4- మార్చి 08 డామ్ సెల్ (యాక్షన్ థ్రిల్లర్)- మార్చి 08 అన్వేషిప్పిన్ కండేతుమ్(మలయాళ డబ్బింగ్ మూవీ)- మార్చి 08 లాల్ సలామ్(తమిళ సినిమా)- మార్చి 08 ది క్వీన్ ఆఫ్ టియర్స్(కొరియన్ సిరీస్)- మార్చి 09 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ట్రూ లవర్(తమిళ సినిమా)- మార్చి 08 షోటైమ్ (హిందీ సినిమా)- మార్చి 08 అమెజాన్ ప్రైమ్ ఊరుపేరు భైరవకోన(తెలుగు సినిమా)- మార్చి 08 జీ5 హనుమాన్(తెలుగు సినిమా)- మార్చి 08 (రూమర్ డేట్) -
ఇది అయ్యే పని కాదు.. ఇప్పట్లో హనుమాన్ లేనట్లేనా?!
సంక్రాంతికి రిలీజైన అన్ని సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి.. ఒక్కటి తప్ప! అవును హనుమాన్ ఒక్కటే ఇంకా ఏ ఓటీటీలోనూ అందుబాటులోకి రాలేదు. గుంటూరు కారం.. నెట్‌ఫ్లిక్స్‌లో, సైంధవ్.. అమెజాన్ ప్రైమ్‌లో, నా సామిరంగ.. హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్నాయి. కానీ హనుమాన్ మాత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వేట కొనసాగిస్తూ ఓటీటీని లైట్ తీసుకుంది. దాదాపు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ మూవీ త్వరలో ఓటీటీలోకి రానుందని కొంతకాలంగా తెగ ప్రచారం జరుగుతోంది. అదిగో రిలీజ్.. ఇదిగో రిలీజ్.. అంటూ ఊరిస్తున్నారే తప్ప నిజంగా ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియని పరిస్థితి! దీంతో ఓ నెటిజన్.. హనుమాన్ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పండి అని ఎక్స్(ట్విటర్)లో మొర పెట్టుకున్నాడు. ఇది చూసిన జీ5.. సదరు ట్వీట్‌కు స్పందించింది. 'హనుమాన్ రిలీజ్ విషయంలో మాకే ఇంతవరకు ఎటువంటి అప్డేట్ లేదు' అని రిప్లై ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కే క్లారిటీ లేనప్పుడు ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారో? ఏంటో? అని నిరాశ చెందుతున్నారు. రేపు రిలీజ్ చేస్తే సినిమా చూస్తూ అర్ధరాత్రి జాగారం చేసేవాళ్లంగా అని కామెంట్లు చేస్తున్నారు. Hi! We have not received any update in this regard. Please keep an eye on our website and social handles for more updates! — ZEE5 (@ZEE5India) March 7, 2024 -
ఈ వారం ఓటీటీ ప్రియులకు పండగే.. ఏకంగా 14 సినిమాలు స్ట్రీమింగ్!
చూస్తుండగానే మరో వచ్చేసింది. గతవారంలో బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేశాయి. అలాగే ఈ సారి థియేటర్లలో అలరించేందుకు గోపిచంద్ భీమా, విశ్వక్ సేన్ గామి లాంటి పెద్ద చిత్రాలు వచ్చేస్తున్నాయి. అంతే కాకుండా వీటితో మలయాళ డబ్బింగ్ సినిమా ప్రేమలు కూడా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అలాగే ఓటీటీ ప్రియులు కోసం ఈ వారంలో అలరించేందుకు సినిమాలు, వెబ్ సిరీసులు సిద్ధమైపోయాయి. అయితే టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ హనుమాన్ స్ట్రీమింగ్ రానుంది. మహా శివరాత్రి సందర్భంగా జీ5లో సందడి చేయనుంది. దీంతో పాటు మలయాళ డబ్బింగ్ సినిమా అన్వేషిప్పిన్ కండేతుమ్, కన్నడ డబ్బింగ్ సినిమా 'బ్యాచిలర్ పార్టీ' కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో పాటు ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా వచ్చేస్తున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్.. హాట్ వీల్స్ లెట్స్ రేస్(ఇంగ్లీష్)- మార్చి 04 హన్నా గాడ్స్‌బీస్ జెండర్ అజెండా- మార్చి 05 ఫుల్ స్వింగ్(నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ -సీజన్ 2- మార్చి 06 ప్రోగ్రామ్: కాన్స్, కల్ట్స్ అండ్ కిడ్నాపింగ్- మార్చి 06 సూపర్ సెక్స్- మార్చి 06 ది జెంటిల్మెన్- మార్చి 07 పోకెమాన్ హారిజన్స్-(వెబ్ సిరీస్)- మార్చి 07 ది సిగ్నల్- మార్చి 07 బ్లోన్ అవే(వెబ్ సిరీస్)- సీజన్ 4- మార్చి 08 డామ్ సెల్- (యాక్షన్ థ్రిల్లర్)- మార్చి 08 ది క్వీన్ ఆఫ్ టియర్స్(కొరియన్ సిరీస్)- మార్చి 09 అన్వేషిప్పిన్ కండేతుమ్(మలయాళ డబ్బింగ్ మూవీ)- మార్చి 8 అమెజాన్ ప్రైమ్ 'బ్యాచిలర్ పార్టీ'(కన్నడ డబ్బింగ్ సినిమా)- మార్చి 04 జీ5 హనుమాన్(తెలుగు సినిమా)- మార్చి 8 -
శివరాత్రికి ఓటీటీలో హనుమాన్??
సంక్రాంతి బ్లాక్‌బస్టర్ 'హనుమాన్' ఓటీటీ రిలీజ్ ఫిక్స్ అయిందా? అంటే అవుననే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ ఏడాది పండక్కి థియేటర్లలో విడుదలైన వాటిలో ఈ చిత్రంపై పెద్దగా ఎవరికీ అంచనాల్లేవు. అయితేనేం బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేసిందీ చిత్రం. దాదాపు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు ఈ సినిమానే ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా) తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన సినిమా 'హనుమాన్'. ఓ సాధారణ మనిషికి హనుమంతుడికి ఉండే సూపర్ పవర్స్ వస్తే.. వాటిని ఎలాంటి పనులకు ఉపయోగించాడు. చివరకు ఏమైంది? అనే సింపుల్ కాన్సెప్ట్‌తో సినిమా తీశారు. కానీ హనుమంతుడికి సంబంధించిన సీన్స్, పాటలు.. పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు భలే నచ్చేశాయి. ఈ క్రమంలోనే సూపర్ సక్సెస్ అందుకుంది. ఇకపోతే 'హనుమాన్' డిజిటల్ హక్కుల్ని దక్కించుకున్న జీ5.. తొలుత ఈ సినిమా మూడు నాలుగు వారాల్లోనే ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుంది. కానీ థియేటర్లలో వస్తున్న రెస్పాన్స్ చూసి వాయిదా వేసుకున్నారు. మార్చి 2న ఓటీటీ రిలీజ్ అనుకున్నారు. కానీ అది కూడా మారిపోయింది. శివరాత్రి కానుకగా మార్చి 8 నుంచి స్ట్రీమింగ్ చేయాలని ఫిక్సయ్యారు. రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చేస్తుంది. సంక్రాంతికి థియేటర్లలో 'హనుమాన్' నామస్మరణతో ఊగిపోయాయి. ఇప్పుడు శివరాత్రికి మళ్లీ అదే సీన్ రిపీట్ కానుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఊరు పేరు భైరవకోన'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) Hanuman To premier on @zee5India from March 8th.#Hanuman #Prasanthvarma #tejasajja #varalaxmisarathkumar #amrithaaiyer@PrasanthVarma @tejasajja123 @varusarath5 @Actor_Amritha pic.twitter.com/5WeWlKRFCV — the.cineholic (@the_cine_holic) March 1, 2024 -
హనుమాన్ ఎఫెక్ట్.. రెమ్యునరేషన్ పెంచేసిన తేజ సజ్జ!
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలతో అలరించిన తేజా సజ్జా..ఇప్పుడు హీరోగానూ రాణిస్తున్నాడు. జాంబిరెడ్డి సినిమాతో హీరోగా అందుకున్నాడు తేజ. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని జాంబిరెడ్డి డైరెక్టర్ ప్రశాంత్ వర్మతోనే ‘హను-మాన్’ చేశాడు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలను సైతం వెనక్కి నెట్టి బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. తెలుగులోనే కాదు.. తమిళ్, హిందీ, మలయాళ భాషల్లోనూ ‘హను-మాన్’ మంచి వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.. రికార్డు సృష్టించింది. ఇక హను-మాన్ మూవీ ఊహించిదాని కంటే ఎక్కువ విజయం సాధించడంతో అటు ప్రశాంత్ వర్మ.. ఇటు తేజ సజ్జ ఫుల్ జోష్‌లో ఉన్నారు. పలువురు బడా నిర్మాతలు ప్రశాంత్ వర్మకు అడ్వాన్స్‌లు ఇచ్చేస్తున్నారు. పారితోషికం కూడా భారీగా ఇస్తామని చెబుతున్నారు. మరోవైపు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్లుగా తేజ సజ్జ కూడా తన రెమ్యునరేషన్‌ని పెంచేశాడట. పారితోషికం అమాంతం పెంచేసిన తేజ సాధారణంగా హిట్ రాగానే హీరోలు తమ పారితోషికాన్ని కొంచెం కొంచెం పెంచేస్తారు. ఇక హను-మాన్ లాంటి భారీ హిట్ వస్తే మాత్రం దాన్ని డబుల్ చేస్తారు. ఇప్పుడు తేజ సజ్జ అదే చేశాడట. హను-మాన్ రిలీజ్ తర్వాత తేజతో సినిమా చేయడానికి పలువురు బడా నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కొంతమంది అడ్వాన్స్‌లు కూడా ఇచ్చారట. హిందీ నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయట. దీంతో తేజ తన పారితోషికాన్ని అమాంతం పెంచేశాడట. హను-మాన్ కోసం రూ. కోటి రెమ్యునరేషన్‌గా తీసుకున్న తేజ.. ఇప్పుడు రూ. 5 కోట్ల డిమాండ్ చేస్తున్నాడట. మరో హిట్ వస్తేనే.. హను-మాన్‌తో తేజ సజ్జ స్థాయి పెరిగింది.అందులో అనుమానమే లేదు. అయితే ఈ చిత్రం ద్వారా తేజ కంటే ఎక్కువగా ప్రశాంత్ వర్మకు పేరొచ్చింది. అతని పని తీరు పట్ల విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. కథను అద్భుతంగా తీర్చి దిద్దాడని మెచ్చుకున్నారు. ఈ చిత్రం అతని కెరీర్‌కు బాగా ప్లస్ అయింది. తేజ సజ్జని ఈ మూవీ పాన్ ఇండియా స్టార్‌గా మార్చింది. ఈ ఎఫెక్ట్ కచ్చితంగా తన తదుపరి సినిమాలపై ఉంటుంది. అతని నుంచి వచ్చే సినిమాలో ఏదో వైవిధ్యం ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. వారి అంచనాలకు తగ్గట్లుగా తేజ సజ్జ కథలను ఎంచుకోకపోతే కెరీర్‌కే ముప్పు వస్తుంది. రాబోయే సినిమా హిట్ అయితే తేజ సజ్జ కెరీర్‌కు కొన్నాళ్ల పాటు ఢోకా ఉండదు. ప్రస్తుతం తేజ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పై కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత బెజవాడ ప్రసన్న-నక్కిన త్రినాధరావు కాంబినేషన్లో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. -
ఓటీటీలోకి 'హనుమాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఈసారి సంక్రాంతికి తెలుగులో నాలుగు సినిమాలు రిలీజైతే 'హనుమాన్' మాత్రమే బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే పలు థియేటర్లలో ఇంకా ఈ మూవీ రన్ అవుతూనే ఉంది. జనాలు చూడటానికి వెళ్తూనే ఉన్నారు. తాజాగా టికెట్ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీన్నిబట్టి చూస్తే థియేట్రికల్ రన్ చివరకొచ్చేసినట్లు తెలుస్తోంది. సరిగ్గా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ బయటకొచ్చింది. (ఇదీ చదవండి: హనుమాన్ మూవీ.. భారీ ఆఫర్ ప్రకటించిన మేకర్స్!) తేజ సజ్జా హీరోగా నటించిన 'హనుమాన్' సినిమా ఎప్పుడో థియేటర్లలోకి రావాల్సింది. కానీ గ్రాఫిక్స్ పనుల వల్ల ఆలస్యమవుతూ ఈ సంక్రాంతికి రిలీజైంది. అయితే మహేశ్, వెంకటేశ్, నాగార్జున సినిమాలు ఇదే టైంకి విడుదలకు రెడీ అయ్యాయని.. 'హనుమాన్'ని వాయిదా వేసుకోవాలని బెదిరించారు. కానీ తగ్గకుండా బరిలో నిలిబడ్డారు. పండగ విజేతగా నిలిచారు. (ఇదీ చదవండి: Hanu Man Movie Review: ‘హను-మాన్’ మూవీ రివ్యూ) 'హనుమాన్' చిత్ర డిజిటల్ హక్కుల్ని దక్కించుకున్న జీ5 సంస్థ.. తొలుత 3-4 వారాల గ్యాప్‌లోనే ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణ దృష్ట్యా డిజిటల్ స్ట్రీమింగ్‌ని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు థియేట్రికల్ రన్ చివరకొచ్చేయడంతో ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మార్చి 2 నుంచి అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. త్వరలో దీనిపై క్లారిటీ రానుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అవార్డు విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
హనుమాన్ మూవీ.. భారీ ఆఫర్ ప్రకటించిన మేకర్స్!
ఈ ఏడాది సంక్రాంతికి సందడి చేసిన సినిమాల్లో హనుమాన్ ఒకటి. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తేజ సజ్జా కీలక పాత్రలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం నెల రోజుల పూర్తయ్యాక కూడా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా ఆడియన్స్‌కు మరింత మందికి అందుబాటులోకి తెచ్చేందుకు టికెట్స్ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. నైజాంలోని థియేటర్స్‌లో హను-మాన్ టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో టికెట్ ధర రూ.175లుగా ఉంది. ఈ టికెట్స్ ఇకపై రూ.100 కే లభించనున్నాయి. అలాగే మల్టీప్లెక్స్‌లలో రూ.295గా ఉన్న టికెట్ ధరను ఏకంగా రూ.150 కి తగ్గించారు. అయితే ఈ ధరలు ఫిబ్రవరి 16 నుంచి 23 వరకు అందుబాటులో ఉంటాయని మేకర్స్ తెలిపారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కోసమే ఈ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. The #HanuManRAMpage is not over yet❤️🔥 Celebrate the #HanuMania at the most affordable & Lowest prices in the Nizam Area since the release💥 Book your tickets now! - https://t.co/nM6rXb7n54#HanuMan 🔥 Nizam Release by @MythriOfficial A @PrasanthVarma film 🌟ing @tejasajja123… pic.twitter.com/wV0cWFvAA6 — Prasanth Varma (@PrasanthVarma) February 16, 2024 -
హనుమాన్ కంటే 'శ్రీ ఆంజనేయం' బెటర్.. కృష్ణ వంశీ రియాక్షన్ వైరల్
ఈ సంవత్సరం సంక్రాంతి హిట్‌గా 'హనుమాన్' చిత్రం నిలిచింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలై రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఇప్పటికీ విజయవంతంగా రన్ అవుతుంది. తాజాగా ఈ సినిమా 300 సెంటర్లలో 30రోజులు పూర్తి చేసుకుంది. తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన చిత్రంగా హనుమాన్ ఉండటం విశేషం. హనుమాన్ చిత్రం గురించి సోషల్ మీడియా ఒక చర్చ జరుగుతుంది. గతంలో కృష్ణ వంశీ తెరకెక్కించిన శ్రీ ఆంజనేయం చిత్రం గురించి ఇప్పుడు మళ్లీ పలువురు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.నితిన్, ఛార్మి నటించిన ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలింది. సినిమా కథ బాగున్నప్పటికీ కొన్ని పాయింట్స్‌కు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదని చెప్పవచ్చు. కానీ ఇందులో కూడా గ్రాఫిక్స్ పనితీరును మెచ్చుకోవాల్సిందే. తాజాగా నెటిజన్లు కొందరు హను మాన్ కంటే శ్రీ ఆంజనేయం సినిమానే గొప్ప సినిమా అంటూ కృష్ణ వంశీ ఎక్స్ పేజీలో పలు కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఆ సినిమా ప్రేక్షకులకు ఎందుకు నచ్చలేదో అంటూ తిడుతూ ఒక పోస్ట్ పెట్టాడు. దానికి డైరెక్టర్ కృష్ణ వంశీ రియాక్ట్ అయ్యారు. ప్లీజ్ ప్రేక్షకులను మాత్రం తిట్టకండి వాళ్ల నిర్ణయం ఎప్పటికీ తప్పు కాదు.. శ్రీ ఆంజనేయం సినిమా విషయంలో ఎక్కడో తప్పు జరిగింది. ఈ చిత్రంలోని కొన్ని అంశాలు వాళ్లకు నచ్చలేదు. కానీ మీ వ్యాఖ్యలకు కృతజ్ఞతలు అని కృష్ణ వంశీ రిప్లై ఇచ్చారు. ఇంతలో మరో నెటిజన్ శ్రీ ఆంజనేయం సినిమాలో ఛార్మి క్యారెక్టర్ చాలా చిరాకు పుట్టించేలా ఉందని చెప్పాడు. ఈ కారణంతోనే సినిమా ప్లాప్ అయిందని తెలిపాడు. అందుకు కృష్ణ వంశీ మాత్రం గాడ్ బ్లెస్ యు అని రిప్లై ఇచ్చారు. వాస్తవంగా అప్పట్లో ఆ సినిమా ప్లాప్‌కు కారణం ఛార్మి పాత్రే అని ఎక్కువగా కామెంట్లు చేశారు. ఆమెలో మంచి నటి ఉన్నప్పటికీ కథలో ఛార్మి పాత్రను క్రియేట్ చేసిన విధానం బాగలేదని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఇలాంటి చిత్రంలో మితిమీరిన ఎక్స్ ఫోజింగ్ సాంగ్ ఉండటం ఎవరికీ నచ్చలేదు. నితిన్ పాత్రను కూడా మరీ అమాయకంగా చూపించడం పెద్దగా వర్కౌట్ కాలేదని చెప్పవచ్చు. Audience r never wrong .. they didn't like it means there was a mistake r problem of reachability .. so dnt blame audience sir .. may b I was wrong AT some portions .. THQ 🙏♥️ God bless https://t.co/RBumH9z4nm — Krishna Vamsi (@director_kv) February 11, 2024 GOD bless you 🙏 https://t.co/1AcCs3Q2vq — Krishna Vamsi (@director_kv) February 11, 2024 -
'హనుమాన్' రెమ్యునరేషన్ విషయంలో గొడవలు.. ప్రశాంత్ వర్మ పోస్ట్ వైరల్
ఈ సంవత్సరం సంక్రాంతి హిట్‌గా 'హనుమాన్' చిత్రం నిలిచింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలై రూ.300 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. తక్కువ బడ్జెట్లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అద్భుతంగా తెరకెక్కించారు. హనుమాన్ విజువల్స్ చూస్తే అందుకు అయిన ఖర్చు రూ. 100 కోట్లు ఉంటుందేమో అని ఎవరైనా చెప్తారు. కానీ కేవలం రూ. 50 కోట్లతో ఈ సినిమాను క్రియేట్ చేశారు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా కోసం నిర్మాత నిరంజన్ రెడ్డి కూడా తన వంతుగా ఎంత చేయాలో అంత చేశారని గతంలో ప్రశాంత్ కూడా తెలిపారు. కొద్దిరోజుల నుంచి ఈ సినిమాకు సంబంధించి ఒక విషయం చక్కర్లు కొడుతోంది. సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టడంతో నిర్మాత, దర్శకుడి మధ్య గొడవలు వచ్చాయని వార్తలు వచ్చాయి. హనుమాన్కు వచ్చిన లాభాల్లో వాటా కావాలని నిర్మాతతో ప్రశాంత్ గొడవ పడ్డారని పలు వెబ్‌సైట్స్‌లలో ప్రచారం జరిగింది. రూ.30 కోట్లు తనకు షేర్‌గా ఇవ్వాలని నిర్మాతపై ఆయన ఒత్తిడి తెస్తున్నారంటూ పుకార్లు వచ్చాయి. (ఇదీ చదవండి : సినిమా ఛాన్సులు లేవు.. కానీ భారీగా సంపాదిస్తున్న హీరోయిన్) అంతే కాకుండా ఈ చిత్రానికి సీక్వెల్‌గా రానున్న 'జై హనుమాన్'కు సంబంధించి కొంత అడ్వాన్స్‌తో పాటుగా లాభాల్లో వాటా కావాలని ముందే ఆయన అడిగినట్లుగా వైరల్ అయింది. తన షరతులను ఒప్పుకోకపోతే సీక్వెల్ కోసం పనిచేయనని ప్రశాంత్ వర్మ చెప్పినట్లు పలు రకాలుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ చేశారు. నిర్మాత నిరంజన్ రెడ్డితో ప్రశాంత్ కలిసి దిగిన ఒక ఫోటోను షేర్ చేశారు. ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్‌లో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఫోన్ చూసుకుంటూ సరదాగా ఉన్నారు. తమపై వస్తున్న నెగెటివిటీని తీసిపడేస్తూ నవ్వుకుంటున్నట్లు అందులో రాసుకొచ్చారు. తాము హనుమాన్ స్పిరిట్‌ను కొనసాగిస్తున్నామని ప్రశాంత్ వర్మ తెలిపారు. ఒక్క పోస్ట్‌తో తమ మధ్య గొడవలు ఉన్నాయని వస్తున్న పుకార్లకు ఆయన చెక్ పెట్టేశారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇంత చక్కగా ఉన్న వీరిద్దరి మధ్య ఇలాంటి వార్తలో చిచ్చు పెట్టాలని ఎవరు ప్రయత్నం చేశారో తెలియాల్సి ఉంది. Browsing off the negativity with a smile and the unbreakable spirit of #HanuMan ✨@Niran_Reddy pic.twitter.com/2O5J6BqwPH — Prasanth Varma (@PrasanthVarma) February 8, 2024 -
బిగ్గెస్ట్ మార్క్‌కు చేరుకున్న 'హనుమాన్' కలెక్షన్స్
తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, అమృతా అయ్యర్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. విడుదలైన తొలి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది హనుమాన్ మూవీ. కేవలం రూ. 50 కోట్ల బడ్జెట్‌తో అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. హనుమాన్ మూవీకి బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ఎప్పుడో సాధించేసింది. తాజాగా ఇప్పటి వరకు హనుమాన్ చిత్రానికి వచ్చిన కలెక్షన్స్ వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.. కేవలం 25 రోజుల్లో రూ. 300 కోట్లు రాబట్టి ఇండియన్ సినిమా హిస్టరీలోనే రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికి హనుమాన్ సినిమా కలెక్షన్లు భారీగానే కొనసాగుతున్నాయి. ఈ స్పీడ్ చూస్తుంటే మరో రూ. 50 కోట్లు రాబట్టవచ్చని సినీ ట్రేడర్స్ అంచనా వేస్తున్నారు. మరోవైపు సంక్రాంతి సమయంలో విడుదలైన చిత్రాల్లో ఇప్పటి వరకు అత్యధికంగా కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా హనుమాన్ రికార్డులకెక్కింది. 92ఏళ్ళ సినీ చరిత్రలో.. ఎన్నో బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ సంక్రాంతికి వచ్చాయి. ఆ చిత్రాలు అన్నిటిని హనుమాన్ బీట్ చేసింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'జై హనుమాన్' రానుంది. కొన్ని రోజుల క్రితమే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయినట్లు ప్రశాంత్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని ప్రధాన పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోను తీసుకునే ఆలోచనలో ఉన్నారు దర్శకుడు. 'ఆన్‌స్క్రీన్‌తో పాటు, ఆఫ్ స్క్రీన్‌లోనూ వారి ఇమేజ్ సరిపోవాలి. చూడగానే భక్తితో నమస్కారం చేయాలన్న భావన కలగాలి. ఆ జాబితాలో చిరంజీవి సర్ కూడా ఉండొచ్చు.' అని ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ చెప్పారు. రాముడిగా మహేశ్‌బాబు అయితే సరిపోతారని ఆయన అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో ఆయన్ను రాముడిగా క్రియేట్ చేసిన ఫొటోలను చూశానని, తమ ఆఫీస్‌లో కూడా రాముడి పాత్రను మహేశ్ ముఖంతో రీక్రియేట్ చేసి చూసినట్లు ఆయన తెలిపారు. పార్ట్ 1లో నటించిన తేజ కూడా పార్ట్ 2లో కనిపిస్తారని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Prasanth Varma (@prasanthvarmaofficial) -
'హనుమాన్' కోసం 70-75 సినిమాలు రిజెక్ట్ చేశా: హీరో తేజ
సంక్రాంతికి థియేటర్లలో రిలీజైన సినిమాల్లో 'హనుమాన్' అల్టిమేట్ విన్నర్‌గా నిలిచింది. ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తూ కలెక్షన్స్ సాధిస్తూ ఆకట్టుకుంటోంది. ఈ మూవీ చేయడానికి ముందు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి గానీ హీరో తేజ సజ్జా గురించి తెలుగులోనే పెద్దగా తెలియదు. అలాంటిది ఈ చిత్రం.. పాన్ ఇండియా రేంజులో సక్సెస్ కావడంతో వీళ్లకు ఊహించనంత ఫేమ్ వచ్చింది. ఈ క్రమంలోనే హీరో తేజ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టాడు. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన తేజ.. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ తదితర హీరోల చిత్రాల్లో చిన్నప్పటి పాత్రలు చేశాడు. అలా పెరిగి పెద్దయిన తర్వాత 'ఓ బేబీ', 'జాంబీ రెడ్డి', 'అద్భుతం' లాంటి చిత్రాలతో హీరోగా చేశాడు. అయితే హీరోగా ప్రయత్నించినప్పటికీ పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. కానీ 'హనుమాన్' దెబ్బకు దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు. అయితే ఈ సినిమా చేస్తున్న క్రమంలోనే దాదాపు 70-75కి పైగా ప్రాజెక్టుల్ని రిజెక్ట్ చేశానని తేజ చెప్పుకొచ్చాడు. ''హనుమాన్' మూవీ చేస్తున్న సమయంలోనే దాదాపు 70-75 సినిమాల్ని రిజెక్ట్ చేశారు. వీటిలో దాదాపు 15 స్టోరీల్ని సినిమాలుగా చేయొచ్చు. కానీ హనుమాన్'కి పూర్తిస్థాయిలో కమిట్మెంట్ ఇవ్వాల్సి రావడంతో వాటిని వదులుకోవాల్సి వచ్చింది' అని తేజ సజ్జా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తేజ ఓ మల్టీస్టారర్‌లో నటించినట్లు సమాచారం. కానీ దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే లేదు. -
హనుమాన్ రికార్డ్ కలెక్షన్స్
-
అల వైకుంఠపురములో రికార్డ్ ను బద్దలు కొట్టిన హనుమాన్
-
హనుమాన్ మూవీ ఎఫెక్ట్.. పూనకంతో ఊగిపోయిన మహిళ
-
హను-మాన్ ఎఫెక్ట్.. రూ. 1000 కోట్ల ఆఫర్?
-
హను-మాన్ ఎఫెక్ట్.. ప్రశాంత్ వర్మకు రూ.1000 కోట్ల ఆఫర్?
సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు అద్భుతాలు జరుగుతుంటాయి. కొన్ని సినిమాలు ఊహించని రీతిలో విజయాలు సాధిస్తాయి. చిన్న సినిమాలే అయినా వందల కోట్ల వసూళ్లను సాధించి, మేకర్స్ తలరాతనే మార్చేస్తాయి. తాజాగా ‘హను-మాన్’ టీమ్ ఆ అద్భుతాన్ని సృష్టించింది. సంక్రాంతి బరిలో అతి చిన్న చిత్రంగా వచ్చిన ‘హను-మాన్’.. బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించింది. ఊహించని కలెక్షన్స్‌తో చరిత్ర సృష్టించింది. ఇప్పటికే రూ. 275 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం.. త్వరలోనే రూ.300 కోట్ల క్లబ్లో చేరబోతుంది. ఈ ఒక్క చిత్రం దర్శకుడు ప్రశాంత్ వర్మ తలరాతనే మార్చేసింది. ఇప్పటివరకు టాలీవుడ్లో చిన్న దర్శకుల లిస్ట్‌లో ఉన్న ప్రశాంత్..ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. అంతేకాదు పలు ప్రముఖ నిర్మాణ సంస్థలన్నీ ప్రశాంత్‌కు అడ్వాన్స్ ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. తన సినిమాకు వందల కోట్ల బడ్జెట్ మాత్రమే కాదు..ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్ పెట్టడానికి కూడా రెడీగా ఉన్నారట. ఈ విషయాన్ని స్వయంగా ప్రశాంత్ వర్మనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘హను-మాన్’ తర్వాత నాకు రూ.100, 200 కోట్ల బడ్జెట్‌తో సినిమా చేసే ఆఫర్లు కూడా వచ్చాయి. అంతేకాదు రూ. 1000 కోట్ల ఆఫర్ కూడా వచ్చింది. హను-మాన్ మూవీ చూసిన ఓ ఎన్నారై నాకు ఈ ఆఫర్ ఇచ్చాడు. మన ఇతిహాసాలతో ఇలాంటి సినిమా చేస్తానంటే రూ.1000 కోట్లు పెట్టడానికి కూడా నేను రెడీ అన్నారు. అయితే ఇక్కడ బడ్జెట్ ముఖ్యం కాదు. పెట్టిన డబ్బుకు మించిన క్వాలిటీ చూపించామా లేదా అనేది ముఖ్యం. చెప్పిన బడ్జెట్లో సినిమా తీసే డైరెక్టర్ని కాదు నేను. ఈ విషయం మొదట్లోనే నిర్మాతలకు చెప్తాను. నేను ఒక 10 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీస్తే..దాన్ని 50 కోట్ల సినిమాలా చూపిస్తాను. 40 కోట్లతో తీస్తే..దాన్ని రూ.150 కోట్ల సినిమాలా తీస్తాను. మార్కెట్‌ను అంచనా వేసుకొని సినిమాను తెరకెక్కిస్తాను’అని ప్రశాంత్ వర్మ అన్నారు. రూ.1000 కోట్ల ఆఫర్ ఇప్పటి వరకు రాజమౌళికి కూడా రాలేదు. కానీ ఒక్క సినిమాతో ప్రశాంత్ వర్మకు అంత పెద్ద ఆఫర్ రావడం గొప్ప విషయమే. ఒకవేళ ప్రశాంత్ వర్మ అంత పెద్ద బడ్జెట్‌తో సినిమా తీస్తే..అది కచ్చితంగా రూ.2000 కోట్లను వసూలు చేస్తుందని నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు. -
హనుమాన్ సూపర్ హిట్.. డైరెక్టర్‌కు కళ్లు చెదిరే గిఫ్ట్!
హనుమాన్ సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు ప్రశాంత్ వర్మ. సంక్రాంతి కానుకగా రిలీజైన హనుమాన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. చిన్న సినిమాగా వచ్చి దాదాపు రూ.250 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం ఊహించని విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ప్రశాంత్ వర్మ మరో సినిమా తీసేందుకు రెడీ అయ్యారు. జై హనుమాన్ పేరుతో సినిమాను తెరకెక్కించనున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరలవుతోంది. ఈ మూవీ ఘన విజయం సాధించండంతో హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి బిగ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ఖరీదైన గిఫ్ట్ ఇవ్వనున్నారని లేటేస్ట్ టాక్. అంతే కాదు దాదాపు రూ.6 కోట్ల విలువైన కారును బహుమతిగా ఇవ్వనున్నారట. ఇప్పటికే కారును కూడా బుక్ చేసినట్లు సమాచారం. సాధారణంగా సినిమాలు సూపర్ హిట్ అయితే ఖరీదైన కార్లు బహుమతిగా ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంది. గతంలోనూ పలువురు నిర్మాతలు డైరెక్టర్లకు కార్లు బహుమతులుగా అందించారు. బేబీ డైరెక్టర్‌కు ఇలాగే నిర్మాత కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. అంతే కాకుండా విశాల్ మార్క్ ఆంటోనీ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్‌కు కారు బహుమతిగా ఇచ్చి నిర్మాత సర్ప్రైజ్ ఇచ్చారు. రజినీకాంత్, నెల్సన్‌కు కాస్ట్ లీ కార్లను గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హనుమాన్తో సూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మకు సైతం ఖరీదైన కారు ఇవ్వనుండడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
హనుమాన్ మూవీ చూస్తూ వింతగా ప్రవర్తించిన మహిళ
పెద్ద సినిమాల మధ్య చిన్న మూవీ విడుదలైంది. ఆ భారీ బడ్జెట్ చిత్రాల కలెక్షన్ల తుపానులో అది కొట్టుకుపోతుందనుకున్నారంతా! కానీ ఇక్కడ సీన్ రివర్సయింది. ఈ చిన్న సినిమా ముందు పెద్ద సినిమాలు వెలవెలబోయాయి. ఏ మూవీ గురించే చెప్తున్నామో ఈపాటికే అర్థమైపోయుంటుంది. రూ.50 కోట్లతో తెరకెక్కిన హనుమాన్ ఐదు రెట్ల కన్నా ఎక్కువ లాభాలు సంపాదించింది. ఇంకా వసూళ్లు రాబడుతూనే ఉంది. పూనకంతో ఊగిపోయిన మహిళ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించాడు. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ పలుచోట్ల విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ క్రమంలో ఓ చోట ఆసక్తికర సంఘటన జరిగింది. థియేటర్లో హనుమాన్ సినిమా చూస్తున్న ఓ మహిళ హనుమాన్ చాలీసా మొదలవగానే పూనకమొచ్చినట్లుగా ఊగిపోయింది. గట్టిగా కేకలు వేస్తూ మెలికలు తిరిగింది. పక్కన ఉన్నవాళ్లు ఆమెను పట్టుకుని సాధారణ స్థితికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆమె సీటులో కూర్చోలేక అరుస్తూ వింతగా ప్రవర్తించింది. వీడియో వైరల్ ఈ ఘటన ఉప్పల్‌లోని ఏషియన్ మాల్లో జరిగినట్లు తెలుస్తోంది. ఈ మహిళ వింత ప్రవర్తనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు ఆమెకు హనుమాన్ పూనాడని అంటుండగా, మరికొందరు ఆమెలో దుష్ట శక్తి ఏదో ఉన్నట్లుంది, అందుకే చాలీసా రాగానే అలా ప్రవర్తించిందని కామెంట్లు చేస్తున్నారు. కొద్దిమంది మాత్రం 'అదంతా ఏం కాదు.. తనకు ఫిట్స్ వచ్చినట్లుంది, లేదంటే ఏదో అనారోగ్య సమస్య ఉన్నట్లుంది' అని అభిప్రాయపడుతున్నారు. What you have cooked @PrasanthVarma You should see this 🙇🙇#HanuMan pic.twitter.com/Ry9KyIA0jA — AA Cult 🐉🪓 (@1_bunnyfreak) January 29, 2024 చదవండి: బర్రెలక్కకు రైతుబిడ్డతో పెళ్లా..? ఆ ఫోటోలు ఏంటి? -
సంక్రాంతి మూవీస్.. ఓటీటీల్లో రిలీజయ్యేది ఎప్పుడంటే?
సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన సినిమాల్లో 'హనుమాన్' తప్పితే మిగతావన్నీ సైలెంట్ అయిపోయాయి. ఈ శుక్రవారం దాదాపు 8-10 వరకు తెలుగు చిన్న మూవీస్ అన్నీ ఒకేసారి థియేటర్లలోకి రాబోతున్నాయి. అలానే రాబోయే రెండు మూడు నెలల్లో పెద్ద చిత్రాలేం లేవు. దీంతో మూవీ లవర్స్ దృష్టి ఆటోమేటిక్‌గా ఓటీటీలపై పడుతుంది. కొత్తగా ఏమున్నాయి? సంక్రాంతి మూవీస్.. ఓటీటీల్లోకి ఎప్పుడొస్తాయని తెగ సెర్చ్ చేస్తున్నారు. 'గుంటూరు కారం' విషయానికొస్తే.. మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన సినిమాకు రిలీజ్‌కి ముందు మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ రొటీన్, రొట్టకొట్టుడు కంటెంట్ వల్ల ప్రేక్షకులు మరీ అంత కాకపోయినా సరే లైట్ తీసుకున్నారు. మహేశ్ యాక్టింగ్ తప్పితే ఇందులో చెప్పుకోదగ్గ విశేషం ఏం లేదని చెప్పొచ్చు. ఈ మూవీ డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. నాలుగు వారాల అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అంటే ఫిబ్రవరి 9న స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?) 'హనుమాన్' విషయానికొస్తే.. మహేశ్ మూవీతో పాటు జనవరి 12న రిలీజైన ఈ చిత్రంపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. కానీ ప్రీమియర్ షోల నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. థియేటర్ల సమస్య వల్ల తొలివారం పర్లేదు గానీ ఆ తర్వాత కలెక్షన్స్ దుమ్మురేపాయి. ఇప్పటికే రూ.250 కోట్ల వసూళ్లు సాధించి దూసుకెళ్తోంది. లెక్క ప్రకారం థియేటర్లలోకి వచ్చిన మూడు-నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేలా డీల్ మాట్లాడుకున్నారు. కానీ టాక్-రెస్పాన్స్ చూసి ప్లాన్ మారింది. మార్చి 2 లేదా 3వ వారం ఓటటీలోకి రావొచ్చని టాక్. జనవరి 13న థియేటర్లలో విడుదలైన వెంకటేశ్ 'సైంధవ్'.. ఊహించని విధంగా ఫ్లాప్ అయింది. కంటెంట్, స్క్రీన్ ప్లే పరంగా ప్రేక్షకుల్ని ఇది అలరించలేకపోయింది. దీంతో ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో ఫిబ్రవరి 3 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటింంచేశారు. నాగార్జున 'నా సామి రంగ' పెద్దగా అంచనాల్లేకుండా సంక్రాంతి బరిలో దిగి పాసైపోయింది. దీన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఫిబ్రవరి 15 నుంచి అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇవన్నీ రూమర్ డేట్స్ అయినప్పటికీ త్వరలో క్లారిటీ వచ్చేస్తుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. మీరు చూశారా?) -
ఆ పాత్రలకు టాలీవుడ్ స్టార్ హీరోలు.. ప్రశాంత్ వర్మ ఆసక్తికర కామెంట్స్!
హనుమాన్ మూవీతో బ్లాక్బాస్టర్ను తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన హనుమాన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఈ చిత్రం రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇదే జోరులో మరో చిత్రానికి రెడీ అవుతున్నారు ప్రశాంత్ వర్మ. త్వరలోనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ జై హనుమాన్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో హనుమంతుడు, రాముడి పాత్రలకు ఎవరు చేస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన ప్రశాంత్ వర్మ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పాత్రలకు స్టార్ హీరోలు నటించే అవకాశముందని తెలిపారు. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ..'జై హనుమాన్ మూవీ స్కేల్ చాలా పెద్దది. ఈ చిత్రంలో పెద్ద స్టార్స్ నటించే అవకాశం ఉంది. హనుమంతుడి పాత్ర ఎవరు చేసినా హావభావాల విషయంలో ఎలాంటి ఇబ్బంది కనిపించదు. ఆ పాత్ర మనం బయట చూసే హనుమాన్‌లా ఉండదు. ఆయన ఏ రూపంలోనైనా కనిపిస్తారు. హనుమాన్ పాత్ర కోసం బాలీవుడ్ నటులు రెడీగా ఉన్నారు. అయితే చూడగానే భక్తితో నమస్కారం చేయాలన్న భావన కలగాలి. ఆ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉండొచ్చు. మెగాస్టార్‌కు పద్మవిభూషణ్ వచ్చిన తర్వాత నేను కలవలేదు. అన్నీ కుదిరితే చిరంజీవి ఆ పాత్ర చేసే అవకాశం ఉంది. ఈ విషయంలో ముందు ఏం జరగబోతోందో ఇప్పుడే చెప్పలేం. రాముడిగా నా మనసులో ఉన్న నటుడైతే మహేశ్‌బాబు. ఎందుకంటే సోషల్‌మీడియాలో రాముడిగా క్రియేట్ చేసిన మహేశ్ బాబు ఫొటోలను చూశా. మా ఆఫీస్‌లో కూడా ఆయన ముఖంతో రీక్రియేట్ చేసి చూశాం' అని అన్నారు. అంతే కాకుండా జై హనుమాన్ చిత్ర పనులు ఏడాది కిందటే మొదలు పెట్టామని ప్రశాంత్ వర్మ తెలిపారు. కథ సిద్ధంగా ఉందని.. ఎలా తీయాలో అన్న విషయంపై ఇంకా వర్క్ జరుగుతోంది. వీఎఫ్ఎక్స్తో పాటు మిగిలిన వాటిపై ఓ క్లారిటీ రాగానే షూటింగ్ మొదలవుతుందన్నారు. రాబోయే సినిమాల నాణ్యత విషయంలో అస్సలు రాజీపడది లేదని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు. -
స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న 'హనుమాన్' నటి?
'హనుమాన్' సినిమా చూశారా? మీలో చాలామంది చూసే ఉంటారు. ఇందులో నటించిన ప్రతిఒక్కరూ అద్భుతంగా చేశారు. అలానే హీరో అక్కగా నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఉన్నంతలో అదరగొట్టేసింది. ఈ మధ్య తెలుగు చిత్రాల్లో మంచి మంచి రోల్స్ చేస్తూ హిట్స్ కొడుతున్న ఈ నటి.. 40 ఏళ్లకు దగ్గరపడుతున్నా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె వివాహంపై రూమర్స్ వచ్చాయి. ఏకంగా ఓ స్టార్ హీరోతో ఏడడుగులు వేయనుందని మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న 'ఎవడు' సినిమా హీరోయిన్) అసలేం జరిగింది? వరలక్ష్మి.. ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ కూతురు. తండ్రిలానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె తొలుత హీరోయిన్గా అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో కొన్నాళ్ల తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది. అప్పటి నుంచి ఈమె దశ తిరిగిపోయిందని చెప్పొచ్చు. తమిళంతో పాటు తెలుగులోనూ ప్రత్యేక పాత్రలు చేస్తూ చాలా గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈమె గతంలో విశాల్‌తో ప్రేమలో ఉన్నట్లు, పెళ్లి కూడా చేసుకుంటారని రూమర్స్ వచ్చాయి. అందులో నిజం పక్కనబెడితే ఇప్పటికీ వీళ్లిద్దరూ సింగిల్‌గానే ఉండిపోయారు. నిజమెంత? ఇకపోతే వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. కొన్నాళ్ల క్రితం ధనుష్‌తో పెళ్లి ఉండొచ్చని అన్నారు. ఇప్పుడేమో తమిళ స్టార్ హీరో శింబుతో ఏడడుగులు వేయనుందని మాట్లాడుకుంటున్నారు. వరలక్ష్మిలానే శింబు కూడా సింగిల్‌గా ఉండటంతో ఈ వదంతులు వచ్చాయి. కానీ వీటిలో ఎలాంటి నిజం లేదని ఇరువురి సన్నిహితులు క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: సీరియల్ హీరోయిన్ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్) -
ప్రశాంత్ వర్మ బయోగ్రఫీ..!
-
మీ వల్లే హీరోయిన్లతో ఇబ్బందులు రవితేజపై సజ్జా కామెంట్స్
-
ఓటీటీలోకి 'హనుమాన్'.. ప్లాన్‌లో మార్పు.. వచ్చేది అప్పుడేనా?
'హనుమాన్' సినిమా రచ్చ బాక్సాఫీస్ దగ్గర ఇంకా కొనసాగుతూనే ఉంది. సంక్రాంతికి పెద్దగా అంచనాల్లేకుండా రిలీజైన ఈ చిత్రం.. సెన్సేషన్ సృష్టించింది. ఇప్పటికే రూ.250 కోట్ల మేర కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా.. మూడోవారంలోనూ థియేటర్లలో ఫుల్‌గా ఎంటర్టైన్ చేస్తోంది. తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు. అదలా ఉండగా ఇప్పుడు 'హనుమాన్' ఓటీటీ రిలీజ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకొచ్చాయి. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?) చైల్డ్ ఆర్టిస్టుగా చాలా ఫేమ్ తెచ్చుకున్న హీరోగా మారిన తేజ సజ్జా.. 'హనుమాన్' మూవీలో ప్రధాన పాత్ర పోషించారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. పాన్ ఇండియా ప్రేక్షకుల్ని టార్గెట్ చేసుకున్న ఈ చిత్రం.. అన్నిచోట్ల హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రారంభంలో థియేటర్ల సమస్య వచ్చింది గానీ ఇప్పుడు మాత్రం దాదాపు అన్ని చోట్ల సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ క్రమంలోనే ఓటీటీ రిలీజ్ విషయంలో ప్లాన్ మారినట్లు తెలుస్తోంది. 'హనుమాన్' చిత్ర డిజిటల్ హక్కుల్ని జీ5 సంస్థ దక్కించుకుంది. ప్లాన్ ప్రకారం 5-6 వారాల్లోపే ఓటీటీ రిలీజ్ అనుకున్నారు. కానీ సినిమా హిట్ తెచ్చుకోవడంతో పాటు వసూళ్లు ఇంకా వస్తుండటంతో ఓటీటీ స్ట్రీమింగ్‌ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న సమాచారం ప్రకారం మార్చి తొలి రెండు వారాల్లో రావొచ్చని అంటున్నారు. దీనిపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: 'హనుమాన్' డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు పెళ్లయిపోయిందా? భార్య ఎవరంటే?) -
'హనుమాన్' డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు పెళ్లయిపోయిందా? భార్య ఎవరంటే?
సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో 'హనుమాన్'.. పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. థియేటర్లలోకి వచ్చి మూడు వారాలైనా సరే ఇంకా ఊపు తగ్గట్లేదు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో చిత్రబృందంలోని ప్రతి ఒక్కరూ చాలా ఆనందంతో కనిపించారు. అయితే ఇదే వేడుకలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన భార్య గురించి చెప్పి అందరూ అవాక్కయ్యేలా చేశాడు. ప్రశాంత్ వర్మ సినిమాల్లోకి రాకముందు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేశాడు. పలు షార్ట్ ఫిల్మ్స్‌తో నిరూపించుకున్న ఇతడు.. హీరో నాని నిర్మించిన 'అ!' మూవీతో దర్శకుడిగా మారాడు. తొలి చిత్రంతోనే విషయమున్నుడని ప్రూవ్ చేసుకున్నాడు. దీని తర్వాత 'కల్కి', 'జాంబీరెడ్డి' లాంటి చిత్రాలతో మనోడిలో విషముందని అందరూ అనుకునేలా చేశాడు. ఇక 'హనుమాన్'తో పాన్ ఇండియా ప్రేక్షకుల్ని షేక్ చేసి పడేస్తున్నాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?) ప్రశాంత్ వర్మని చూస్తే యంగ్‌గా కనిపిస్తున్నాడు. దీంతో అతడు ఇంకా సింగిల్ ఏమోనని అనుకున్నారు. కానీ నాలుగేళ్ల క్రితమే సుకన్య అనే అమ్మాయిని ఇతడు పెళ్లి చేసుకున్నాడు. అంటే లాక్డౌన్ టైంలో పెళ్లి అయిపోవడం, అప్పటికి ఇతడు చిన్న డైరెక్టర్ కావడంతో ఎవరికీ తెలీదు. తాజాగా 'హనుమాన్' సక్సెస్ ఈవెంట్లో స్పీచ్ మొదలుపెట్టడమే.. తనకు అండగా నిలిచిన భార్యకు థ్యాంక్స్ చెప్పడంతో షురూ చేశాడు. అలా ప్రశాంత వర్మకు పెళ్లయిపోయిందని, అందమైన భార్య ఉందని అందరికీ తెలిసింది. పాలకొల్లుకు చెందిన ప్రశాంత్ వర్మ.. పెద్దల కుదిర్చిన సంబంధంతోనే సుకన్యని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకు తప్పితే ఈమె గురించి పెద్దగా విషయాలేం బయటకు రాలేదు. (ఇదీ చదవండి: సీరియల్ హీరోయిన్ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్) -
సెకండ్ వీక్ కూడా హౌస్ ఫుల్.. బాహుబలి తరువాత హనుమాన్
-
రాజమౌళిపై కోపం వచ్చింది.. ఎందుకంటే: హనుమాన్ డైరెక్టర్
ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రం హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తక్కువ బడ్జెట్లో అద్భుతమైన సినిమాను తీశారంటూ ప్రశాంత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబడుతోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ప్రశాంత్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి అంటే తనకెంతో ఇష్టమని తెలిపారు. జక్కన్న టీమ్‌లోకి ప్రవేశించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశానని తెలిపారు. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ..'ఆయన మేకింగ్ విధానం చాలా ఇష్టం. ఆయన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసేందుకు ఎంతో ప్రయత్నించా. ఇంజినీరింగ్‌లో ఉండగానే ఆయనకు చాలాసార్లు మెయిల్స్ పంపించా. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. టాలెంట్ ఉన్నా నన్నెందుకు తీసుకోవడం లేదనే కారణంతో ఆయనపై కోపం వచ్చింది. అదే సమయంలో నాకు ఏకలవ్యుడు గుర్తుకువచ్చారు. రాజమౌళి సినిమాలు, మేకింగ్ వీడియోలు చూసి చాలా నేర్చుకున్నా' అని అన్నారు. అంతే కాకుండా పెద్ద హీరోలతో సినిమాలు చేసేందుకు తాను వ్యతిరేకం కాదని తెలిపారు. వారితో సినిమాకు ఎక్కువ సమయం పడుతుందని వెల్లడించారు. అలాంటి వారికోసం ఎదురుచూసి నా సమయాన్ని వృథా చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఆ తర్వాత డెడ్‌లైన్ పెట్టుకుని మరీ వర్క్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక వేళ టామ్ క్రూయిజ్ వచ్చినా.. నా వద్ద ఉన్న వాళ్లతోనే సినిమా చేస్తానని ప్రశాంత్ వర్మ అన్నారు. -
ఆదిపురుష్..కొన్ని సీన్స్ నచ్చలేదు: ప్రశాంత్ వర్మ
ఆదిపురుష్ సినిమాలో కొన్ని సన్నివేశాలు బాగా నచ్చాయి. మరికొన్ని అంతగా ఆకట్టుకోలేదని, తానైనే వాటిని మరింత అద్భుతంగా తీర్చిదిద్దేవాడినని ‘హనుమాన్’దర్శకుడు ప్రశాంత్ వర్మ అన్నాడు. తాజాగా ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆదిపురుష్‌లో కొన్ని సీన్స్‌ని చూసి ఆశ్చర్యపోయాను. అద్భుతంగా తెరకెక్కించారు. అయితే..కొన్ని సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. నేనే గనుక ఆ సినిమా తీసి ఉంటే.. ఆ సన్నివేశాలను బాగా చేసేవాడిని కదా అనిపించింది. నాకే కాదు.. ఏ ఫిల్మ్ మేకర్‌కి అయినా అలాంటి భావన కలుగుతుంది. ఆ సినిమా ఫలితం నాపై ఎలాంటి ప్రభావం చూపించలేదు. నా టీమ్ సపోర్ట్‌ని ‘హను-మాన్’ని అనుకున్న విధంగా తీర్చిదిద్దగలిగాం’అని ప్రశాంత్ వర్మ అన్నారు. (ఇదీ చదవండి: స్టార్ హీరో కొత్త సినిమా.. తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానుందా?) హను-మాన్’విషయాకొస్తే.. తేజా సజ్జా, అమృతా అయ్యర్ జంటగా నటించిన చిత్రమిది. వరలక్ష్మీ శరత్‌కుమార్, వినయ్‌రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదలైన ఈ చిత్రం.. తొలి రోజు నుంచే హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 250 కోట్ల వరకు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇక వచ్చే ఏడాది ఈ సినిమాకు సీక్వెల్ ‘జై హనుమాన్’ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ప్రశాంత్ వర్మ ఆ సినిమా పనులను ప్రారంభించారు. ఓ స్టార్ హీరో ఇందులో నటించబోతున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఆ హీరోయిన్ నన్ను కావాలనే కొట్టింది.. బాడీపై 30 చోట్ల గాయాలు: శ్రద్ధా దాస్) -
కలిసొచ్చిన రిపబ్లిక్ డే.. రికార్డు సాధించిన హనుమాన్
అటు అయోధ్య రామమందిర ప్రారంభం ఎంత ఘనంగా జరిగిందో ఇటు హనుమాన్ కలెక్షన్స్ అంత భారీగా రాబడుతోంది. అక్కడ రాముడు పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ హనుమాన్ కోట్లాది రూపాయల వసూళ్లు రాబడుతున్నాడు. మొత్తానికి ఈ సినిమా సంక్రాంతి విజేతగా నిలిచింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ కళాఖండంలో తేజ సజ్జ హీరోగా నటించాడు. హనుమాన్ ప్రభంజనం.. ఇప్పటికే రెండు వందల కోట్ల క్లబ్బులో చేరి ఈ మూవీ అందరినీ ఆశ్చర్యపరిచింది. నిన్న గణతంత్ర దినోత్సవం కావడంతో వసూళ్ల సంఖ్య మరింత పెరిగింది. తాజాగా ఈ చిత్రం మరో రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లు కొల్లగొట్టింది. ఈ మేరకు చిత్రయూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ కేవలం 15 రోజుల్లోనే ఈ అరుదైన ఘనత సాధించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ చేతిలో 12 కథలు ఇక హనుమాన్ సినిమాకు సీక్వెల్‌గా జై హనుమాన్ ఉంటుందని దర్శకుడు ప్రకటించిన విషయం తెలిసిందే! ఇది భారీ బడ్జెట్‌తో పెద్ద ఎత్తున ఉండబోతుందని తెలిపాడు. సౌత్, బాలీవుడ్ హీరోలు కూడా ఇందులో ఉంటారని చెప్పాడు. ఈ ఒక్కటే కాదు తన దగ్గర మొత్తం 12 కథలు ఉన్నాయన్నాడు. మరి ఆ సినిమాలతో ప్రశాంత్ వర్మ ఇంకా ఎన్ని అద్భుతాలు చేస్తాడో చూడాలి! చదవండి: వచ్చే జన్మలో పూర్ణ కడుపున పుడతానన్న దర్శకుడు.. నటి ఎమోషనల్ -
జై హనుమాన్ లో రామ్ చరణ్ రోల్ ఏంటంటే..!
-
200 కోట్లు దాటిన హనుమాన్ కలెక్షన్స్
-
హనుమాన్ సీక్వెల్లో ఆంజనేయుడిగా స్టార్ హీరో: ప్రశాంత్ వర్మ
హనుమాన్ సినిమా హిట్‌తో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు ట్రెండింగ్‌లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకుపైగా కలెక్షన్లతో దూసుకెళ్తోంది ఈ చిత్రం. హనుమాన్ విజయంతో దానికి సీక్వెల్‌గా జై హనుమాన్ చిత్రం ఉంటుందని ఇప్పటికే ఆయన ప్రకటించాడు. జై హనుమాన్ చిత్రాన్ని ఉద్దేశించి తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. సీక్వెల్లో తేజ హీరో కాదని ఆయన తేల్చి చెప్పారు. సూపర్ హీరో కథలకు ఇతిహాసాలలోని దేవుళ్లకు ముడిపెట్టి తెరకెక్కించేందుకు తన వద్ద 12 కథలు ఉన్నాయని ప్రశాంత్ వర్మ చెప్పిన విషయం తెలసిందేజ ఈ క్రమంలో వచ్చిన చిత్రమే 'హను-మాన్'. దీనికి రానున్న సీక్వెల్ హను-మాన్ కంటే వందరెట్లు భారీ స్థాయిలో 'జై హనుమాన్' ఉంటుందని ఆయన తెలిపారు. కానీ సీక్వెల్లో తేజ సజ్జా హీరో కాదు.. కానీ, అందులో హనుమంతు పాత్రలో మాత్రమే కనిపిస్తాడని చెప్పాడు. సీక్వెల్లో హీరో ఆంజనేయ స్వామి అని ఆ పాత్రలో ఒక స్టార్ హీరో కనిపిస్తారని ఆయన పేర్కొన్నాడు. జై హనుమాన్ చిత్రం 2025లో కచ్చితంగా విడుదల చేస్తామని ప్రశాంత్ తెలిపాడు. ఈలోపు తను డైరెక్ట్ చేసిన అధీర,మహాకాళీ విడుదల అవుతాయని క్లారిటీ ఇచ్చాడు. హనుమాన్ సీక్వెల్లో రామ్ చరణ్ నటించనున్నాడని ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి. మరికొన్ని రోజుల్లో ఆ స్టార్ హీరో ఎవరో క్లారిటీ రానుంది. -
హనుమాన్ చిత్రానికి జీవం పోసిన ఉదయ్ కృష్ణ
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా వండర్స్ క్రియేట్ చేస్తోంది. తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా వచ్చిన ఈ సినిమా తాజాగా రూ. 200 కోట్ల క్లబ్లో చేరిపోయింది. హనుమాన్‌లో హాలీవుడ్ రేంజ్ వీఎఫ్ఎక్స్, గ్రాండ్ స్క్రీన్ వర్క్స్ విజువల్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా హనుమాన్ భారీ విగ్రహాన్ని చూసిన ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అందులోని విజువల్స్ అన్నీ అబ్బురపరిచేలా ఉన్నాయి. హనుమాన్ అద్భుతాల వెనుక గ్రాఫిక్స్ మాంత్రికుడు ఉదయ్ కృష్ణ శ్రమ గురించి ఎంత చెప్పినా తక్కువే.. విజువల్ ఎఫెక్ట్స్ రంగంతో రెండున్నర దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం కలిగి ఉన్న ఆయన హనుమాన్ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడుగా పనిచేసే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఆయన ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. భారత చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే "హనుమాన్" చిత్రానికి పని చేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఉదయ్ చెబుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా వినియోగించుకోవడంలో విజనరీగా పేరొందిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సరసన సగర్వంగా నిలిచేంత సత్తా ప్రశాంత్ వర్మలో ఉందని ఆయన పేర్కొన్నారు. తేజ సజ్జా టైటిల్ పాత్రలో ప్రైమ్ షో ఎంటర్త్సైన్మెంట్ పతాకంపై కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన "హనుమాన్" జనవరి 12న విడుదలై విజయ దుందుభి మ్రోగిస్తోంది. సినిమా విడుదలకు ముందే టీజర్ విజువల్స్ చూసిన ప్రేక్షకుల్లో హనుమాన్ చిత్రంపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ప్రశాంత్ వర్మ స్వయంగా సమకూర్చిన కథ - కథనాలకు ఉదయ్ కృష్ణ సారధ్యంలో అద్దిన గ్రాఫిక్స్ జత కలవడంతో "హనుమాన్" చిత్రం అత్యద్భుతంగా రూపొందింది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇప్పటికే విడుదల చేయగా... మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ లాంగ్వేజిస్లోనూ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రెండేళ్లుగా తన జీవితంలో అంతర్భాగంగా మారిపోయిన "హనుమాన్" సాధిస్తున్న సంచలన విజయం... ఈ చిత్రం కోసం తాను పడిన కష్టమంతా మరిచిపోయేలా చేస్తోందని ఉదయ్ అంటున్నారు. ప్రతికూలతలు, పరిమిత వనరుల నడుమ ప్రతిభను చాటడంలో పేరెన్నికగన్న ఉదయ్ ప్రస్తుతం "బీస్ట్ బెల్స్" పేరుతో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన విజువల్ ఎఫెక్ట్స్ సంస్థను హైదరాబాద్‌లోనే నెలకొలిపే సన్నాహాల్లో ఉన్నారు. సినిమా ముగింపులో భూమ్యాకాశాలకు విస్తరించే హనుమాన్కు ఆయన జీవం పోయడం ఈ చిత్రం కోసం తాను ఫేస్ చేసిన అతి పెద్ద ఛాలెంజస్లలో ముఖ్యమైనదని చెబుతున్న ఉదయ్... మన తెలుగు దర్శకులు కలలుగనే ఎంత గొప్ప విజువల్ అయినా... సునాయాసంగా సాకారం చేసే సామర్ధ్యం తనుకుందని సవినయంగా చెబుతున్నారు. -
'హనుమాన్' కలెక్షన్స్.. తొలి భారతీయ సినిమాగా రికార్డు
శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సం, బాలరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇదే సమయంలో టాలీవుడ్లో విడుదలైన హనుమాన్ చిత్రం ఖాతాలో భారీ రికార్డ్ చేరింది. చిన్న సినిమాగా విడుదల అయిన ఈ చిత్రం నేడు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తుంది. సంక్రాంతి కానుకగా కేవలం రూ. 50 కోట్లతో తెరకెక్కిన హనుమాన్ చిత్రం ఎవరూ ఊహించని వసూళ్లు సాధిస్తోంది. 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు చిత్ర మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2024లో రూ.200 కోట్ల మార్క్ అందుకున్న తొలి భారతీయ సినిమాగా హను- మాన్ రికార్డు కొట్టింది. ముఖ్యంగా ఈ సినిమా బాలీవుడ్లో దుమ్మురేపింది. నార్త్ ఇండియాలో ఎక్కడ చూసినా కూడా అయోధ్య రాముడు, హనుమాన్ ఈ రెండే పేర్లు మారుమ్రోగుతున్నాయి. ఒక టికెట్ కొంటే ఇంకొకటి ఉచితం నేడు (జనవరి 22) అయోధ్యలో రామ మందింరం ప్రారంభోత్సవం సందర్భంగా యూఎస్ఏలో (USA) పలు ప్రాంతాల్లో ఎంపిక చేసిన స్క్రీన్స్‌లలో సగం ధరకే టికెట్ విక్రయిస్తున్నట్లు మూవీ టీమ్ తెలిపింది. అంతే కాకుండా ఇండియాలో కూడా మిరాజ్ సినిమాస్ యాజమాన్యం బంపర్ ఆఫర్ ప్రకటించింది. నేడు ఒక్కరోజు హనుమాన్ సినిమాకు 'బై వన్ గెట్ వన్'(ఒకటి కొంటే ఇంకొకటి ఉచితం) ఆఫర్ ఇస్తున్నట్లు ప్రకటించింది. బుక్ మైషోలో 'MIRAJBOGO' అనే కోడ్ ఉపయోగించి ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చని తెలిపింది. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన హనుమాన్ చిత్రంలో తేజ సజ్జా హీరోగా, అమృత అయ్యార్ హీరోయిన్గా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్‌తో పాటు సముద్రఖని, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ వంటి తదితురులు కీలక పాత్ర పోషించారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. నైజాం ఏరియాలో మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని పంపిణీ చేశారు. जय श्री राम 🙏 With the divine blessings of Lord Shree Ram, #HanuManRAMpage continues to soar higher at the Box-office ❤️🔥 2️⃣0️⃣0️⃣ CRORE WORLDWIDE collections for #HANUMAN in just 10 Days 🔥💥 Nizam Release by @MythriOfficial ❤️🔥 A @PrasanthVarma film 🌟ing @tejasajja123… pic.twitter.com/S1gjf0RKYr — Mythri Movie Makers (@MythriOfficial) January 22, 2024 -
హనుమాన్ 250 కోట్ల క్లబ్ లోకి వెళ్తుందా..?
-
అయోధ్య రామ మందిరానికి 'హనుమాన్' టీమ్ భారీ విరాళం
శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సం, బాలరాముని ప్రాణప్రతిష్టకు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. నేడు ఆ మధుర క్షణాలు ఆస్వాధించేందుకు భారత్ మొత్తం ఎదురుచూస్తుంది. ఇదే సమయంలో టాలీవుడ్లో విడుదలైన హనుమాన్ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. చిన్న సినిమాగా విడుదల అయిన ఈ చిత్రం నేడు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తుంది. రామమందిర ప్రారంభోత్సవ వేళ 'హను-మాన్' టీమ్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. ఈ సినిమా ప్రతి టికెట్‌పై రూ.5 అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇవ్వనుందని ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా టైటిల్ రోల్లో ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. మేకర్స్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో పేర్కొన్నట్లుగా, వారు అయోధ్య రామమందిరానికి ఒక్కో టికెట్ నుంచి రూ. 5 రామమందిరానికి కేటాయించారు. సినిమా ప్రీమియర్ షోల నుంచి విక్రయించిన 2,97,162 టిక్కెట్లకు గాను రూ.14,85,810 చెక్కును ఇప్పటికే అందించారు. ఆ తర్వాత నేటి వరకు విక్రయించిన 53,28,211 టిక్కెట్ల నుంచి రూ.2,66,41,055 అందిస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ రూ. 150 కోట్ల మార్కును క్రాస్ చేసి రూ. 200 కోట్ల వైపు దూసుకుపోతుంది. గూస్బంప్స్ వచ్చాయి: నాగా చైతన్య హనుమాన్ చిత్రం విడుదలకు ముందే మెగాస్టార్ చిరంజీవి మెచ్చుకున్నారు. ఆపై బాలకృష్ణ కూడా అభినందించారు. సమంత కూడా సినిమా బాగుందంటూ ఆ చిత్ర మేకర్స్‌ను మెచ్చుకున్నారు. తాజాగా హీరో నాగచైతన్య మనుమాన్ చిత్రాన్ని చూశారు. చిత్ర యూనిట్‌ను అభినందిస్తూ తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ పెట్టారు. హనుమాన్ కథతో పాటు తెరపైకి తీసుకువచ్చిన తీరు చాలా అద్భుతం అని డైరెక్టర్ ప్రశాంత్ వర్మను అభినందించారు. హనుమంతుగా తేజ సజ్జా అదరగొట్టేశారు. సినిమా చూస్తున్నంతసేపు గూస్బంప్స్ వచ్చాయని నాగ చైతన్య తెలుపుతూ టీమ్ మొత్తానికి అభినందనలు తెలిపారు. View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
సంక్రాంతి సినిమాల పంచాయతీ సెటిలైందా? చివరకు అలా!
ఈసారి సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ దడదడలాడింది. రిలీజైన సినిమాల కంటే నిర్మాత దిల్ రాజు ఎక్కువగా హైలైట్ అయ్యారు. థియేటర్ల విషయంలో 'హనుమాన్' చిత్రానికి అన్యాయం జరగడానికి ఈయనే కారణమని అన్నారు. ఈ క్రమంలోనే ప్రెస్ మీట్ పెట్టి దిల్ రాజు వార్నింగ్ ఇవ్వడం కాస్త చర్చనీయాంశమైంది కూడా. ఇప్పుడు సంక్రాంతి సినిమాల పంచాయతీ విషయం కాస్త సెటిలైనట్లు కనిపిస్తోంది. (ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?) ఈసారి పండక్కి నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో 'గుంటూరు కారం', 'హనుమాన్' చిత్రాలు జనవరి 12న రిలీజయ్యాయి. వీటిలో మహేశ్ మూవీని నైజాంలో దిల్ రాజుకి చెందిన ఎస్వీసీ డిస్ట్రిబ్యూట్ చేసింది. 'హనుమాన్'ని మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది. అయితే హైదరాబాద్‌లోని సింగిల్ స్క్రీన్స్ అన్నీ 'గుంటూరు కారం'కి కేటాయించి.. కేవలం మూడు మాత్రమే 'హనుమాన్' చిత్రానికి ఇచ్చారనే విషయం బయటకు రావడంతో ఇది చర్చనీయాంశంగా మారిపోయింది. చివరికొచ్చేసరికి ఆ మూడు కూడా తీసేసుకున్నారని వినిపించింది. అయితే థియేటర్ల తీసుకున్నారనే విషయమై తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో కేసు నమోదు చేయడంతో మొత్తం రచ్చ రచ్చ అయింది. అయితే ఇప్పుడు దిల్ రాజుకు చెందిన ఎస్వీసీ, అలానే 'హనుమాన్'ని డిస్ట్రిబ్యూట్ చేసి మైత్రీ మూవీ మేకర్స్ పెద్దలు ఓ అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపై గొడవలు పడకూడదని, కలిసి ఓ ప్లానింగ్‌తో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలోనే ఎస్వీసీ తమకు చెందిన పలు థియేటర్లలో సినిమాలు తీసేసి, 'హనుమాన్'కి కేటాయించినట్లు తెలుస్తోంది. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. (ఇదీ చదవండి: రష్మికతో ఎంగేజ్మెంట్పై క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ) -
సినిమాకు అదే ప్రాణం.. హనుమాన్‌పై సమంత రివ్యూ..
సంక్రాంతి కానుకగా రిలీజైన హను-మాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలిచింది. పాన్ ఇండియా మూవీగా రిలీజైన ఈ చిత్రం తెలుగు, హిందీలో అద్భుతమైన వసూళ్లు రాబడుతోంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జాకు లెక్కలేనన్ని ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా స్టార్ హీరోయిన్ సమంత హనుమాన్‌పై రివ్యూ ఇచ్చింది. 'మనల్ని మళ్లీ బాల్యంలోకి తీసుకెళ్లగలిగే చిత్రాలు ఎంతో ఉత్తమమైనవి. హనుమాన్‌లో విజువల్స్, కామెడీ, మ్యాజిక్, మ్యూజిక్.. అన్నీ ఎంతో బాగున్నాయి. థాంక్యూ ప్రశాంత్ వర్మ.. నీ యూనివర్స్ నుంచి రాబోయే నెక్స్ట్ సినిమాల కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. తేజ సజ్జా.. నీ యాక్టింగ్‌తో నన్ను ఆశ్చర్యపోయేలా చేశావు. నీ కామిక్ టైమింగ్, నీ అమాయకత్వం, నీ నటన.. హనుమంతుగా నువ్వు చేసిన అద్భుతమైన నటన సినిమాకు ఆయువుపట్టుగా నిలిచింది. సంగీతం, వీఎఫ్ఎక్స్ ఈ సినిమాను మరింత అందంగా మలిచాయి. సినిమా చూసేకొద్దీ చూడాలనిపించేలా చేశాయి. ఇందులో నటించి హిట్ అందుకున్న వరలక్ష్మీ శరత్‌కుమార్, వినయ్రాయ్లకు శుభాకాంక్షలు' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. చదవండి: ఓటీటీలో మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ.. తెలుగులోనూ చూడొచ్చు! -
'హనుమాన్' తెచ్చిన జోష్.. రాముడి పాత్రలో మెగాహీరో రామ్ చరణ్?
ఓ వారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా 'హనుమాన్' నామజపమే వినిపిస్తోంది. స్టార్ హీరో గానీ డైరెక్టర్ గానీ లేకుండా తీసిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.100 కోట్ల కలెక్షన్ మార్క్ దాటేసిన ఈ చిత్రం.. లాంగ్ రన్లో ఇక్కడ, ఓవర్సీస్లో సరికొత్త రికార్డులు సృష్టించడం గ్యారంటీ అనిపిస్తుంది. సరిగ్గా ఇలాంటి టైంలో ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'హనుమాన్' సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. దీన్ని రిలీజ్ చేయడానికి ముందే సినిమాటిక్ యూనివర్స్ ఉంటుందని ప్రకటించాడు. అంటే 'హనుమాన్'లానే మరిన్ని సూపర్ హీరో చిత్రాల్ని ఓ ఫ్రాంచైజీలో భాగంగా రిలీజ్ చేస్తారు. తాజాగా వచ్చిన మూవీలో హనుమంతుడి రిఫరెన్స్ ఉన్నట్లు రాబోయే చిత్రాల్లో మన దేవుళ్ల రిఫరెన్సులు ఉండటం పక్కా. (ఇదీ చదవండి: Prasanth Varma: 'హనుమాన్' మూవీతో హిట్ కొట్టాడు.. ఇంతలోనే దర్శకుడికి షాక్!) అలానే 'హనుమాన్' చిత్ర క్లైమాక్స్‌లో 'జై హనుమాన్' అనే మరో సినిమా 2025లో రిలీజ్ కానుందని ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. ఈ క్రమంలోనే రాముడి పాత్రపై ఇప్పుడు సరికొత్త రూమర్స్ వచ్చాయి. మెగాహీరో రామ్ చరణ్.. ఆ పాత్రలో నటించే అవకాశాలు గట్టిగా ఉన్నాయని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. 'ఆర్ఆర్ఆర్'లోని సెకండాఫ్‌లో చరణ్ గెటప్ గుర్తుచేస్తూ ఈ విషయాన్ని మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతమున్న హీరోల్లో రాముడి పాత్రలు ఎవరికి సూట్ అవుతుందా అంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఒకవేళ చరణ్ గనుక ప్రశాంత్ వర్మ తీసే సినిమాలో రాముడి పాత్ర వేస్తే మాత్రం అది వేరే లెవల్ మూవీ కావొచ్చనమాట. అయితే ప్రస్తుతానికైతే ఇది రూమర్‌లానే కనిపిస్తుంది. ఒకవేళ నిజమైతే మాత్రం ఫ్యాన్స్‌కి అంతకు మించిన పండగ మరొకటి ఉండదేమో? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 45 సినిమాలు) -
Prasanth Varma: 'హనుమాన్' మూవీతో హిట్ కొట్టాడు.. ఇంతలోనే దర్శకుడికి షాక్!
సంక్రాంతి తెలుగులో ఏకంగా నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో అల్టిమేట్‌గా 'హను-మాన్' చిత్రం విజేతగా నిలిచింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి రోజురోజుకీ కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి. దీంతో మూవీ టీమ్ అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో దర్శకుడు ప్రశాంత్ వర్మకు చిన్న షాక్ తగిలింది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. 'హనుమాన్' సినిమా విషయంలో హీరో తేజకి ప్రశంసలు దక్కుతున్నప్పటికీ.. ఓవరాల్‌గా మాత్రం దర్శకుడు ప్రశాంత్ వర్మ బాగా హైలైట్ అయ్యాడు. ఎందుకంటే రిలీజ్ విషయంలో ఎన్ని అడ్డంకులు ఎదురైన బలంగా నిలబడి హిట్ కొట్టాడు. అక్కడే అందరి మనసులు గెలిచేసుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా గదతో ఉన్న ఓ ఫొటోని సోషల్ మీడియా ఖాతాల్లో ప్రొఫైల్ పిక్‌గా మార్చాడు. దీంతో చిన్న సమస్య వచ్చింది. (ఇదీ చదవండి: టాప్ లేపుతున్న 'హను-మాన్'.. రెమ్యునరేషన్ ఎవరికి ఎక్కువో తెలుసా?) ట్విట్టర్ ప్రస్తుతం 'ఎక్స్'గా మారిపోయింది. ఇప్పుడు ప్రొఫైల్ పిక్ లేదంటే పేరు మార్చిన సరే బ్లూ టిక్ పోతోంది. అలా ఇప్పుడు ప్రశాంత్ వర్మ టిక్ కూడా పోయింది. ఈ క్రమంలోనే అతడి చేస్తున్న పోస్టులు ఒరిజినల్ అకౌంట్ నుంచి చేస్తున్నాడా? ఫేక్ అకౌంట్ నుంచే చేస్తున్నాడా అనేది అభిమానులకు అర్థం కావట్లేదు. అందుకే త్వరగా బ్లూ టిక్ మళ్లీ తెచ్చుకో అని కామెంట్స్ పెడుతున్నారు. ఎందుకంటే రీసెంట్గా కొందరు నెటిజన్స్.. కావాలనే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా పేర్లతో నకిలీ అకౌంట్స్ క్రియేట్ చేసి పిచ్చిపిచ్చి ట్వీట్స్ చేశారు. తద్వారా వీరిద్దరినీ బ్యాడ్ చేయాలనేది వాళ్ల ఉద్దేశం. ఇప్పుడు ప్రశాంత్ వర్మ ట్విట్టర్ అకౌంట్ బ్లూ టిక్ పోవడంతో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశముందని నెటిజన్స్ అనుకుంటున్నారు. (ఇదీ చదవండి: కన్నడలో సూపర్ హిట్.. ఓటీటీలో తెలుగు వెర్షన్.. రిలీజ్ అప్పుడేనా?) #NewProfilePic pic.twitter.com/ONa2TNCv3s — Prasanth Varma (@PrasanthVarma) January 17, 2024 -
Teja Sajja Rare Unseen Photos: వంద కోట్ల సినిమా హనుమాన్ హీరో తేజ సజ్జ.. రేర్ ఫొటోలు
-
రూ.100 కోట్ల వసూళ్లు దాటేసిన 'హనుమాన్'.. ఆ విషయమైతే చాలా స్పెషల్
చిన్న సినిమా అన్నారు. అలానే న్యాయం జరుగుతుందని చెప్పారు. దీనికి తోడు సరిపడా థియేటర్లు దొరకలేదు. అయితేనేం 'హనుమాన్' చిత్రబృందం అనుకున్నది సాధించింది. ఎవరూ ఊహించని విధింగా కలెక్షన్స్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. తాజాగా సినిమా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసినట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే సినిమా పలు రికార్డులు క్రియేట్ చేయడం విశేషం. తేజసజ్జా-ప్రశాంత్ వర్మ కాంబోలో తీసిన 'హనుమాన్'.. సూపర్ హీరో కాన్సెప్ట్‌తో తీశారు. అయితే సంక్రాంతి బరిలో గుంటూరు కారం, సైంధవ్, నా సామి రంగ లాంటి స్టార్ హీరోల సినిమాలు ఉండటంతో తొలుత తప్పుకోమని సలహాలు ఇచ్చారు. కానీ కంటెంట్ మీద నమ్మకంతో బలంగా నిలబడ్డారు. థియేటర్లు సరిపడా ఇవ్వకపోయినా సరే హిట్ కొట్టి తీరతామని నమ్మారు. ఇప్పుడు దానికి తగ్గ ప్రతిఫలం దక్కిందని చెప్పొచ్చు. (ఇదీ చదవండి: సంక్రాంతి సినిమాల సందడి.. ఏది హిట్? కలెక్షన్స్ ఎంత?) కేవలం రూ.55 కోట్లతో తీసిన 'హనుమాన్' సినిమాకు.. జస్ట్ నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. బెన్ఫిట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి దక్షిణాదిలో ఓ మాదిరి వసూళ్లు వచ్చినప్పటికీ నార్త్, ఓవర్సీస్లో అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. బాక్సాఫీస్ దగ్గర నిలకడగా సరాసరి రూ.25 కోట్ల వరకు సాధిస్తూ వెళ్తున్న ఈ చిత్రం.. రూ.100 కోట్ల మార్క్ దాటేయడం మామూలు విషయం కాదు. అలానే నార్త్ అమెరికాలోనూ 3 మిలియన్ డాలర్లు సాధించి... ఓవర్సీస్లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-10 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇది మాత్రం 'హనుమాన్' టీమ్‌కి చాలా అంటే చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఇక నాలుగు రోజుల్లో ఈ రేంజు వసూళ్లు వచ్చాయంటే.. లాంగ్ రన్లో రూ.300-400 కోట్లు వచ్చినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ సాయిపల్లవి చెల్లి.. కుర్రాడు ఎవరంటే?) small film - BIG JUSTICE from the audience ❤️ The Humongous Roar of #HANUMAN Resounded at the Box-Office 💪 1️⃣0️⃣0️⃣ 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐖𝐎𝐑𝐋𝐃𝐖𝐈𝐃𝐄 in just 4 days ᴡɪᴛʜ ʟɪᴍɪᴛᴇᴅ ꜱᴄʀᴇᴇɴꜱ & ᴍɪɴɪᴍᴀʟ ᴛɪᴄᴋᴇᴛ ᴘʀɪᴄᴇꜱ 💥#HanuManCreatesHistory -… pic.twitter.com/4LNGkhYz8f — Mythri Movie Makers (@MythriOfficial) January 16, 2024 -
సంక్రాంతి సినిమాల సందడి.. ఏది హిట్? కలెక్షన్స్ ఎంత?
ఈసారి నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. రిలీజ్ ముందు వరకు చూసుకుంటే ఎప్పుడు లేనంత రచ్చ ఈసారి జరిగింది. చిన్నా పెద్దా అనే అంతరాలు చేసి మాట్లాడటం, థియేటర్ల కేటాయింపు దగ్గర వివాదం.. ఇలా ఊహించని మలుపులతో ప్లాన్ చేసుకున్న నాలుగు మూవీస్ కూడా థియేటర్లలోకి వచ్చేశాయి. మరి వీటిలో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నవి ఏవి? ప్రస్తుతం ఎంతెంత కలెక్షన్స్ సాధించాయి? (ఇదీ చదవండి: పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ సాయిపల్లవి చెల్లి.. కుర్రాడు ఎవరంటే?) 'గుంటూరు కారం'.. అలా అలా ఈసారి వచ్చిన వాటిలో భారీ అంచనాలతో రిలీజైన సినిమా 'గుంటూరు కారం'. మహేశ్-త్రివిక్రమ్ కాంబోనే దీనికి కారణం. మాస్ ఎలిమెంట్స్ గట్టిగా ఉంటాయని చెప్పడంతో అభిమానులు అంచనాలు పెంచేసుకున్నారు. తీరా చూస్తే.. మహేశ్ తన వరకు బాగా న్యాయం చేశాడు. స్వాగ్, డ్యాన్సులు రెచ్చిపోయి మరీ చేశాడు. కానీ కథ, డైలాగ్స్, దర్శకత్వం విషయంలో త్రివిక్రమ్ పెద్దగా కొత్తదనం చూపించలేకపోయాడు. దీంతో బెన్ఫిట్ షో అయిపోగానే మిక్స్డ్ టాక్ వచ్చింది. మూడు రోజుల్లోనే రూ.164 కోట్లు వచ్చిన ప్రకటించుకున్నారు. వసూళ్లు అయితే రావొచ్చేమో గానీ మిగతా విషయాల్లో ఈ సినిమా సక్సెస్ కాలేకపోయిందనేది చాలామంది మాట! హనుమాన్.. ఊహించని సక్సెస్ రిలీజ్‌కి ముందే చిన్న సినిమా అని తక్కువ చేసి చూడటం, థియేటర్లు ఇవ్వకపోవడం లాంటి వాటివల్ల 'హను-మాన్' సినిమాపై సింపతీ పెరిగింది. ఇక స్టోరీ పరంగా కాస్త ల్యాగ్ అనిపించినప్పటికీ.. హై ఇచ్చే ఎలిమెంట్స్, దేవుడి సెంటిమెంట్ లాంటివి జనాలకు బాగా కనెక్ట్ అయిపోయాయి. సినిమాకు ఏకగ్రీవంగా పాజిటివ్ టాక్ వచ్చేసింది. తెలుగులో థియేటర్ల తక్కువ కావడం వల్ల కలెక్షన్స్ తక్కువ వచ్చుండొచ్చు కానీ లాంగ్ రన్లో మిగతా మూడు సినిమాల కంటే దీనికే ఎక్కువ వస్తాయి. (ఇదీ చదవండి: సంక్రాంతి అంటే సినిమా ఉండాల్సిందేనా? అసలు ఈ కల్చర్ ఎప్పుడు మొదలైంది?) సైంధవ్.. అంతంత మాత్రమే విక్టరీ వెంకటేశ్ 'సైంధవ్' సినిమాతో ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే టేకింగ్, యాక్టింగ్ పరంగా పెద్దగా వంకపెట్టడానికి ఏం లేదు గానీ స్క్రీన్ ప్లే కాస్త సాగదీత, స్టోరీలో చిన్నచిన్ పారపొట్లు ఈ చిత్రానికి కాస్త మైనస్ అయ్యాయని చెప్పొచ్చు. అలానే దీనికంటే ముందు 'గుంటూరు కారం', 'హనుమాన్' రావడంతో ఇక అందరి దృష్టి వాటిపైనే ఉండిపోయింది. దీంతో వెంకీమామని పట్టించుకునేవాళ్లు తక్కువైపోయారు. అయితే ఈ సినిమాకు తొలిరోజు రూ.6 కోట్లు వచ్చినట్లు సమాచారం. లాంగ్ రన్లో బ్రేక్ ఈవెన్ కావడం కూడా కష్టమేనని ట్రేడ్ పండితులు అంటున్నారు. నా సామిరంగ.. స్లో పాయిజన్ నాగార్జున విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీసిన సినిమా 'నా సామి రంగ'. విడుదలయ్యేంత వరకు దీనిపై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. బడ్జెట్ కూడా తక్కువే. అలా తాజాగా సంక్రాంతికి రిలీజైన ఈ మూవీకి హిట్ టాక్ వచ్చిందని అంటున్నారు. ఓవరాల్‌గా చూసుకుంటే యావరేజ్ అంటున్నారు. పండగ హడావుడిలో పెట్టిన బడ్జెట్లో ఈ మూవీ సేఫ్ అయిపోవచ్చు.ఈ చిత్రానికి కూడా తొలిరోజు రూ.6 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు చెబుతున్నారు. ఇక నాలుగు సినిమాల పరంగా చూసుకుంటే మాత్రం ఈసారి ఎలా చూసుకున్నాసరే 'హను-మన్' సంక్రాంతి విన్నర్! (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 45 సినిమాలు) -
హనుమాన్ దెబ్బ అదుర్స్.. కేజీఎఫ్, కాంతార రికార్డులు బద్ధలు..
కథలో దమ్ముంటే చాలు జనాలు ఇట్టే కనెక్ట్ అవుతారు. అది హనుమాన్తో నిరూపితమైంది. ఇప్పటివరకు హాలీవుడ్ సూపర్ హీరోలనే ఇష్టపడిన జనాలు హనుమాన్ చూసి యూటర్న్ తీసుకుంటున్నారు. హనుమాన్ను అందరికంటే బెస్ట్ సూపర్ హీరోగా కొనియాడుతున్నారు. పాజిటివ్ టాక్, సెలవుల కారణంగా రోజురోజుకీ వసూళ్లు పెంచుకుంటూ పోతోందీ చిత్రం. పుష్పతో సమానంగా.. తాజాగా ఈ విషయాన్ని ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. '2024లో బోణీ కొట్టిన తొలి సినిమా హనుమాన్. మొదటి మూడు రోజుల ఓపెనింగ్స్.. కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్, కాంతార హిందీ డబ్బింగ్ వర్షన్స్ వసూళ్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. పుష్ప హిందీ వర్షన్‌తో సమానంగా వసూళ్లు రాబడుతోంది. కేవలం హిందీ వర్షన్ తొలి రోజు రూ.2.15 కోట్లు రాబట్టగా రెండో రోజు రూ.4.05 కోట్లు, మూడో రోజు ఏకంగా రూ.6.06 కోట్లు వచ్చాయి. జనవరి 25వరకు పెద్ద సినిమాలేమీ లేకపోవడంతో హనుమాన్ కలెక్షన్స్ మరింత పుంజుకునే ఛాన్స్ ఉంది' అని ఎక్స్(ట్విటర్)లో రాసుకొచ్చాడు. హాఫ్ సెంచరీకి చేరువలో మరోవైపు హనుమాన్కు మౌత్ టాక్ ద్వారా పబ్లిసిటీ జరుగుతోంది. ఈ కారణంగా రోజురోజుకీ కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి., ఇప్పటివరకు ఈ మూవీ కలెక్షన్స్ రూ.40 కోట్ల పైనే వసూళ్లు రాబట్టి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే చిత్రయూనిట్ బాక్సాఫీస్ లెక్కలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. హీరో రానా తన చెప్పులు ఓ మూలన విడిచేసి హనుమాన్ పోస్టర్, గద ముందు ఫోటోలు దిగాడు. ఇది చూసిన జనాలు రానాను మెచ్చుకుంటున్నారు. మొదటి విరాళం ఎన్ని లక్షలంటే? ఇదిలా ఉంటే ఈ సినిమా ఆడినన్ని రోజులు ప్రతి టికెట్‌పై వచ్చే డబ్బులో ఐదు రూపాయలు అయోధ్యలోని రామమందిరానికి విరాళంగా ఇస్తామని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ మేరకు తొలిరోజు కలెక్షన్స్ ఆధారంగా రూ.14 లక్షలను అయోధ్య రామాలయానికి విరాళంగా ఇచ్చారు. బాక్సాఫీస్ దగ్గర దూకుడు చూస్తుంటే రానున్న రోజుల్లో దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి.. కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చేట్లు కనిపిస్తున్నారు. Here’s the BIGGG SURPRISE… #HanuMan first *3-day* [opening weekend] total is HIGHER than #KGF [first part] and #Kantara, at par with #Pushpa [note: all #Hindi dubbed versions]… Yes, you read it right!#HanuMan emerges FIRST HIT OF 2024… Packs an impressive total in its… pic.twitter.com/OkzYxnmkmc — taran adarsh (@taran_adarsh) January 15, 2024 South Indian actor #RanaDaggubati removing shoes before standing next to the poster of #HanumanMovie and Gada (mace). pic.twitter.com/568GOfGWc3 — Smriti Sharma (@SmritiSharma_) January 15, 2024 చదవండి: ఆఫీసుల చుట్టూ తిరిగా.. అవమానించారు.. భరించలేక వెళ్లిపోదామనుకున్నా! -
' వాటిని భోగి మంటల్లో వేయడం మరిచిపోయా'.. వారికి ప్రశాంత్ వర్మ కౌంటర్!
ఈ ఏడాది సంక్రాంతికి అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన హనుమాన్ సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. పొంగల్ కానుకగా ఈనెల 12న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించారు. తక్కువ బడ్జెట్లోనే అద్భుతమైన సినిమాను తీశారంటూ పలువురు సినీ ప్రమఖులు ప్రశంసలు కురిపించారు. అయితే తాజాగా ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. కొందరు నకిలీ ప్రొఫైల్స్‌తో సోషల్ మీడియాలో మా టీమ్ పట్ల కొందరు పనిగట్టుకుని ప్రచారం చేశారు. కానీ నిన్న జరిగిన భోగి వేడుకల్లో వాటిలో మంటల్లో విసిరివేయడం మరిచిపోయా అంటూ.. అలాంటి వారిని ఉద్దేశించి ప్రశాంత్ వర్మ చురలకంటించారు. ప్రశాంత్ వర్మ తన ట్వీట్లో రాస్తూ.. 'కొందరు నకిలీ ప్రొఫైల్స్‌తో మాపై విపరీతంగా ప్రచారం చేశారు. సోషల్ మీడియాలో మా టీంను ట్రోల్ చేశారు. ఇంకా అలాంటి చెత్తను నిన్న భోగి మంటల్లో వేయడం మరిచిపోయా. ఏది ఏమైనా 'ధర్మం కోసం నిలబడేవాడు ఎప్పటికీ గెలుస్తాడు' అనే విషయం మరోసారి రుజువైంది. తమ తిరుగులేని మద్దతును అందించిన సినీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తమపై వచ్చిన నెగెటివిటీని తొక్కేసి.. ఈ సంక్రాంతికి హనుమాన్ అనే గాలిపటం మరింత ఎత్తుకు ఎగరడానికి సిద్ధంగా ఉంది. ' అంటూ పోస్ట్ చేశారు. అయితే హనుమాన్ రిలీజ్‌కు ముందే పెద్దఎత్తున వివాదం నడిచింది. ఎప్పటిలాగే సంక్రాంతి బరిలో సినిమాలకు తీవ్రమైన పోటీ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే హనుమాన్ విడుదలపై సందిగ్ధత నెలకొంది. కానీ ప్రశాంత్ వర్మ చెప్పిన తేదీకే సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. పొంగల్ పోటీ తీవ్రం కావడంతో రవితేజ మూవీ ఈ పోటీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. బహుశా సినిమా రిలీజ్‌కు ముందు జరిగిన వివాదాన్ని ఉద్దేశించి ప్రశాంత్ వర్మ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రంలో అమృత అయ్యర్, వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్,సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. దాదాపు 12 భాషల్లో విడుదల హనుమాన్ చిత్రాన్ని రిలీజ్ చేశారు. I've encountered a significant amount of propaganda surrounding our team, along with the proliferation of fake profiles across social media. It seems like some of this digital debris has been forgotten to be thrown in yesterday's Bhogi fire. However, I express my sincere… — Prasanth Varma (@PrasanthVarma) January 15, 2024