గూగుల్ టాప్ ట్రెండింగ్ సెర్చెస్–2024
టాప్ టెన్‌లో మూడు తెలుగు సినిమాలు
ప్రతి ఏడాది ప్రేక్షకులను ఆకర్షించే, చర్చించుకునేలా చేసే సినిమాలు కొన్ని ఉంటాయి. అలా ఈ ఏడాది కూడా పలు ఇండియన్ సినిమాలు ప్రేక్షకులను ఆకర్షించాయి.... అలరించాయి. కాగా ఇండియాలో గూగుల్ టాప్ ట్రెండింగ్ సెర్చెస్ ఫర్ మూవీస్ జాబితాలోని మొదటి పది చిత్రాల్లో మూడు తెలుగు చిత్రాలు నిలిచాయి. తొలి స్థానంలో రాజ్‌కుమార్ రావు– శ్రద్ధా కపూర్ నటించిన హిందీ చిత్రం ‘స్త్రీ 2’, ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్ లీడ్ రోల్స్‌లో నటించిన ‘కల్కి 2898 ఏడీ’ రెండో స్థానంలో నిలిచాయి.
అలాగే ప్రభాస్ హీరోగా నటించిన మరో చిత్రం ‘సలార్’కు తొమ్మిదో స్థానం లభించింది. 3, 4, 5, 6, 7, 8 స్థానాల్లో వరుసగా హిందీ చిత్రాలు ‘ట్వల్త్ ఫెయిల్, లాపతా లేడీస్’, తెలుగు చిత్రం ‘హను–మాన్’, తమిళ చిత్రం ‘మహారాజా’, మలయాళ చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్’, తమిళ చిత్రం ‘గోట్: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ చిత్రాలు నిలిచాయి. మలయాళంలో ఫాహద్ ఫాజిల్ చేసిన ‘ఆవేశం’ సినిమా చివరి స్థానంలో నిలిచింది. అలాగే గూగుల్ టాప్ ట్రెండింగ్ సెర్చెస్ షోల జాబితాలో తొలి స్థానంలో ‘హీరామండి’ వెబ్ సిరీస్ నిలిచింది. ‘మిర్జాపూర్, పంచాయత్, కోట ఫ్యాక్టరీ’ వంటి సిరీస్‌లకు చోటు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment