Stree 2 Movie
-
బాలీవుడ్లో కనిపించని ఖాన్ త్రయం.. టాప్ లేపిన 'పుష్ప' రాజ్
ఈ బాలీవుడ్‌కి ఏమైంది... దాదాపు రెండు మూడేళ్లుగా బాలీవుడ్ బాక్సాఫీస్ వసూళ్లు అంత ఆశాజనకంగా లేవు. అసలు ఈ ఏడాది ఖాన్ త్రయం (సల్మాన్, ఆమిర్, షారుక్) వెండితెరపై కనిపించనే లేదు. విడుదలైన చిత్రాల్లో మీడియమ్ స్టార్స్ చిత్రాలు ఫర్వాలేదనిపించుకున్నాయి. అయితే బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది మాత్రం హిందీలోకి అనువాదమైన తెలుగు చిత్రాలు ‘కల్కి 2898 ఏడీ, పుష్ప: ది రూల్’ కావడం విశేషం. ఇక ఈ ఏడాది బాలీవుడ్ బాక్సాఫీస్ ఎలా సాగిందో తెలుసుకుందాం.హిందీ చిత్ర పరిశ్రమకు ఈ ఏడాది అంత అచ్చొచ్చినట్లుగా లేదు. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించే హిందీ సినిమాల సంఖ్య తక్కువైపోయింది. కాస్తో కూస్తో ఈ ఏడాది బాలీవుడ్ బాక్సాఫీస్‌ను కాపాడింది హారర్ చిత్రాలనే చెప్పుకోవచ్చు. ఈ ఏడాది విడుదలైన హిందీ చిత్రాల్లో హారర్ ‘స్త్రీ 2’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావ్ లీడ్ రోల్లో నటించిన ‘స్త్రీ’ 2018లో విడుదలై, రూ. వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి, అప్పట్లోనే సంచలనాలు సృష్టించింది. ఓ ఉమెన్ సెంట్రిక్ హారర్ ఫిల్మ్ వందకోట్ల రూపాయల గ్రాస్‌ను సాధించడం బాలీవుడ్లో అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారింది.దీంతో ‘స్త్రీ 2’ వస్తుందనగానే ఈ సినిమాపై బాలీవుడ్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను వమ్ము చేయకుండా ‘స్త్రీ 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావ్ లీడ్ రోల్స్‌లో అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్ గెస్ట్ రోల్స్‌లో నటించిన ‘స్త్రీ 2’ సినిమా ఈ ఏడాది ఆగస్టులో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ. 850 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. రూ.650 గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి, ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచి, రికార్డు సృష్టించింది.హిందీ ఆడియన్స్ ‘స్త్రీ 2’ హారర్ హ్యాంగోవర్లో ఉన్నారేమో కానీ ఆ వెంటనే వచ్చిన మరో హారర్ హిందీ చిత్రం ‘భూల్ భూలయ్యా 3’ సినిమానూ విశేషంగా ఆదరించారు. కార్తీక్ ఆర్యన్, త్రిప్తీ దిమ్రీ హీరోయిన్లుగా నటించిన ఈ హారర్ మూవీకి అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మాధురీ దీక్షిత్, విద్యాబాలన్ ఇతర రోల్స్ చేశారు. ఈ ఏడాది నవంబరు 1న విడుదలైన ఈ మూవీ దాదాపు రూ.300 కోట్ల వసూళ్లను రాబట్టి, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక ఇదే కోవలో అంటే... హారర్ నేపథ్యంలోనే వచ్చిన ‘సైతాన్’ చిత్రం హిందీ ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రాబట్టుకోగలిగింది.వికాస్ బాల్ డైరెక్షన్‌లోని ఈ మూవీలో అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక లీడ్ రోల్స్‌లో నటించారు. ‘సైతాన్’ సినిమాలో విలన్‌గా మాధవన్, మరో లీడ్ రోల్లో నటించిన మరాఠీ నటి జాంకీలు ఈ సినిమాలో మేజర్ హైలైట్‌గా నిలిచారు. ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను రాబట్టి, సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక సినిమాలో కంటెంట్ ఉంటే అదీ చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అని ఆడియన్స్ పట్టించుకోరని ఇప్పటికే చాలాసార్లు నిరూపితమైంది. ఈ ఏడాది మరోసారి ప్రూవ్ అయింది. హిందీ ఆడియన్స్‌ను మెప్పించిన హారర్ మూవీ ‘ముంజ్య’.యువ తారలు అభయ్ వర్మ, శర్వారీ హీరో హీరోయిన్లుగా, సత్యరాజ్, మోనాసింగ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించిన ఈ హారర్ ఫిల్మ్‌కు ఆదిత్య సర్ఫోత్థార్ దర్శకత్వం వహించారు. అంచనాలు లేకుండా జూన్‌లో విడుదలైన ఈ మూవీ రూ. 120 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి, బాలీవుడ్ ఆడియన్స్‌లో హారర్ జానర పట్ల ఉన్న మక్కువను మరోసారి నిరూపించింది. అలాగే 2018లో విడుదలైన హారర్ మూవీ ‘తుంబాడ్’ ఈ ఏడాది సెప్టెంబరులో రీ–రిలీజై హిట్ మూవీగా నిలిచింది. కథానాయికల జోరు హారర్ తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్స్‌గా నిలిచిన చిత్రాలు హీరోయిన్స్ మెయిన్ లీడ్ రోల్స్‌లో నటించినవి కావడం ఈ ఏడాది విశేషం. ముందుగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ‘లాపతా లేడీస్’ సినిమా గురించి ప్రస్తావించుకోవాలి. కొంత గ్యాప్ తర్వాత కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 1న థియేటర్స్‌లో రిలీజైంది. ఎలాంటి అంచనాలు లేని ఈ చిత్రానికి విడుదల తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో ఆడియన్స్ నుంచి సూపర్ డూపర్ రెస్పాన్స్ లభించింది. ప్రతిభ రంతా, నితాన్షి గోయెల్, స్పర్శ్ శ్రీవాత్సవ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీలో రవికిషన్, ఛాయా కందమ్ కీలక పాత్రల్లో నటించారు.ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలవడమే కాకుండా, విమర్శకుల ప్రసంసలను దక్కించుకుంది. అంతేకాదు... 2025 మార్చిలో జరగనున్న 97వ ఆస్కార్ అవార్డ్స్లోని ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ‘లాపతా లేడీస్’ సినిమాను, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు అఫీషియల్ ఇండియన్ ఎంట్రీ మూవీగా పంపారు. ఇలా ‘లాపతా లేడీస్’ చిత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కానీ 97వ ఆస్కార్ షార్ట్‌లిస్ట్ జాబితాలో ఈ సినిమాకు చోటు దక్కకపోవడం ఇండియన్ ఆడియన్స్‌కు కాస్త బాధ కలిగే అంశమనే చెప్పాలి. ఇదే నెలలో అంటే... ఫిబ్రవరి 23న విడుదలైన ΄÷లిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఆర్టికల్ 370’. యామీ గౌతమ్, ప్రియమణి లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమాకు విశేష ప్రేక్షకాదరణ దక్కింది.ఆదిత్యా సుహాస్ డైరెక్షన్‌లోని ఈ మూవీ రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో హిట్‌గా నిలిచింది. అలాగే టబు, కరీనా కపూర్, కృతీ సనన్ నటించిన ఉమెన్ మల్టీ స్టారర్ మూవీ ‘క్రూ’ కూడా ప్రేక్షకుల మెప్పు పొంది, ఈ ఏడాది సూపర్‌హిట్ మూవీస్‌లో చోటు దక్కించుకోగలిగింది. రాజేశ్ ఏ క్రిష్ణన్ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లింగ్ డ్రామా రూ.150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. ఇక ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాయలల్ కపాడియా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ ఏడాది జరిగిన 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ ప్రీ అవార్డును సైతం గెలుచుకుంది.అంతేనా... మరికొన్ని అంతర్జాతీయ అవార్డులను కూడా ఈ చిత్రం గెలుచుకుంది. కనికా కస్రూతి, దివ్య ప్రభ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ఛాయా కందమ్ మరో లీడ్ రోల్లో నటించారు. ఈ చిత్రం హిందీ భాషలో (మలయాళ, మరాఠీ భాషల్లో కూడా విడుదలైంది) సెప్టెంబరులో ఇండియాలో విడులైంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్త ప్రేక్షకుల అటెన్షన్‌ను గ్రాబ్ చేసింది. హిట్ యాక్షన్ బాలీవుడ్లో బడా మల్టీస్టారర్ మూవీగా రూపొందిన చిత్రం ‘సింగమ్ ఎగైన్’. దర్శకుడు రోహిత్ శెట్టి ‘సింగమ్’ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ఈ చిత్రంలో అజయ్ దేవగన్, కరీనా కపూర్ హీరో హీరోయిన్లుగా నటించగా, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్, దీపికా పదుకోన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. ఇంతటి భారీ క్యాస్టింగ్‌తో, భారీ అంచనాల మధ్య విడుదలైన ‘సింగమ్ ఎగైన్’ ఓ మోస్తరు హిట్‌ను మాత్రమే సొంతం చేసుకోగలిగింది. బాలీవుడ్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.అయితే ‘సింగమ్ ఎగైన్’ రిలీజైన రోజునే... అంటే... నవంబరు 1నే, ‘భూల్ భూలయ్యా 3’ చిత్రం కూడా థియేటర్స్‌లోకి వచ్చింది. ‘సింగమ్ ఎగైన్’ సినిమా వసూళ్లపై కొంత ఎఫెక్ట్ పడటానికి ఈ సినిమా ఓ కారణం అని బాలీవుడ్ ట్రేడ్ వర్గీయులు చెప్పుకున్నారు. ఇక హృతిక్ రోషన్ ‘ఫైటర్’ సినిమా కూడా సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలోని ఈ మూవీలో తొలి సారిగా హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ కలిసి నటించారు. జనవరి 25న విడులైన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇంకా షాహిద్ కపూర్ రోబో లవ్‌స్టోరీ ‘తేరీ బోతో మే ఐసా ఉల్జా జియా’, విక్కీ కౌశల్ కామెడీ డ్రామా ‘బ్యాడ్ న్యూజ్’ వంటి చిత్రాలకు ప్రేక్షకులు హిట్ స్టేటస్ ఇచ్చారు. – ముసిమి శివాంజనేయులుటాప్ లేపిన పుష్ప రాజ్ఈ ఏడాది హిందీ బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపిన చిత్రం ‘పుష్ప: ది రూల్’. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో రూ పొందిన ‘పుష్ప: ది రూల్’ సినిమా హిందీ వెర్షన్ రూ.700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి, హిందీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ ఏడాది బాలీవుడ్ స్ట్రయిట్ హిందీ బ్లాక్‌బస్టర్ హిట్ ఫిల్మ్ ‘స్త్రీ 2’ కలెక్షన్స్‌ను సైతం అధిగమించి, ‘పుష్ప: ది రూల్’ సినిమా రికార్డు సృష్టించింది. ఇలా ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా ‘పుష్ప ది రూల్’ నిలిచింది. ఈ సినిమా ఇంకా ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే. అలాగే ప్రపంచవ్యాప్తంగా ‘పుష్ప: ది రూల్’ సినిమా ఇప్పటికే రూ.1700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించినట్లుగా, మేకర్స్ వెల్లడించారు.‘పుష్ప: ది రూల్’ మూవీ ఈ ఏడాది డిసెంబరు 5న థియేటర్స్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది ప్రభాస్ చేసిన మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం బాలీవుడ్ ఆడియన్స్‌తో హిట్ ఫిల్మ్ అనిపించుకుంది. ప్రభాస్ హీరోగా, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. జూన్ 27న థియేటర్స్‌లోకి వచ్చిన ‘కల్కి 2898ఏడీ’ మూవీ హిందీలో దాదాపు రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది.ఇలా ఈ ఏడాది హిందీ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ ఫైవ్‌లో చోటు దక్కించుకుంది. అలాగే ఈ ఏడాది సెప్టెంబరులో విడుదలైన ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం కూడా హిందీ ఆడియన్స్‌ను మెప్పించింది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు.కనిపించని ఖాన్ త్రయం‘సింగమ్ ఎగైన్, బేబీ జాన్’ చిత్రాల్లో సల్మాన్ ఖాన్ గెస్ట్‌గా కనిపించారు. కానీ ఆయన హీరోగా నటించిన సినిమా ఏదీ ఈ ఏడాది థియేటర్స్‌లోకి రాలేదు. అలాగే అమిర్ ఖాన్, షారుక్ ఖాన్ హీరోలుగా నటించిన చిత్రాలు కూడా థియేటర్స్‌లోకి రాలేదు. ఇంకా రణ్‌బీర్ కపూర్, రణ్వీర్ సింగ్ (సింగమ్ ఎగైన్ మూవీలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించలేదు)... ఇలా బాలీవుడ్ అగ్రశ్రేణి హీరోల సినిమాలు థియేటర్స్‌లోకి రాకపోవడం కూడా హిందీ బాక్సాఫీస్‌కి ఓ మైనస్ అని చెప్పాలి. -
బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్.. తెలుగులోనూ సాంగ్ వచ్చేసింది!
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ స్త్రీ-2(Stree 2 Movie). గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రానికి స్త్రీ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.అయితే ఈ మూవీ మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah Bhatia) ప్రత్యేక గీతంలో మెరిసింది. ఆజ్ కీ రాత్ అంటూ అభిమానులను అలరించింది. ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తాజాగా ఈ మూవీ తెలుగు వర్షన్ ఫుల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా.. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. -
తొలి స్థానంలో స్త్రీ2... రెండో స్థానంలో కల్కి 2898 ఏడీ
ప్రతి ఏడాది ప్రేక్షకులను ఆకర్షించే, చర్చించుకునేలా చేసే సినిమాలు కొన్ని ఉంటాయి. అలా ఈ ఏడాది కూడా పలు ఇండియన్ సినిమాలు ప్రేక్షకులను ఆకర్షించాయి.... అలరించాయి. కాగా ఇండియాలో గూగుల్ టాప్ ట్రెండింగ్ సెర్చెస్ ఫర్ మూవీస్ జాబితాలోని మొదటి పది చిత్రాల్లో మూడు తెలుగు చిత్రాలు నిలిచాయి. తొలి స్థానంలో రాజ్‌కుమార్ రావు– శ్రద్ధా కపూర్ నటించిన హిందీ చిత్రం ‘స్త్రీ 2’, ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్ లీడ్ రోల్స్‌లో నటించిన ‘కల్కి 2898 ఏడీ’ రెండో స్థానంలో నిలిచాయి. అలాగే ప్రభాస్ హీరోగా నటించిన మరో చిత్రం ‘సలార్’కు తొమ్మిదో స్థానం లభించింది. 3, 4, 5, 6, 7, 8 స్థానాల్లో వరుసగా హిందీ చిత్రాలు ‘ట్వల్త్ ఫెయిల్, లాపతా లేడీస్’, తెలుగు చిత్రం ‘హను–మాన్’, తమిళ చిత్రం ‘మహారాజా’, మలయాళ చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్’, తమిళ చిత్రం ‘గోట్: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ చిత్రాలు నిలిచాయి. మలయాళంలో ఫాహద్ ఫాజిల్ చేసిన ‘ఆవేశం’ సినిమా చివరి స్థానంలో నిలిచింది. అలాగే గూగుల్ టాప్ ట్రెండింగ్ సెర్చెస్ షోల జాబితాలో తొలి స్థానంలో ‘హీరామండి’ వెబ్ సిరీస్ నిలిచింది. ‘మిర్జాపూర్, పంచాయత్, కోట ఫ్యాక్టరీ’ వంటి సిరీస్‌లకు చోటు దక్కింది. -
ప్రముఖ నటుడి అపహరణ.. రూ. కోటి డిమాండ్!
ప్రముఖ బాలీవుడ్ నటుడు కిడ్నాప్‌కు గురయ్యారు. వెల్ కమ్, స్త్రీ-2 చిత్రాలతో మెప్పించిన ముస్తాక్ ఖాన్‌ను కొంతమంది దుండగులు అపహరించారు. అతన్ని దాదాపు 12 గంటల పాటు చిత్రహింసలకు గురి చేసినట్లు తెలుస్తోంది. విడిచిపెట్టేందుకు రూ. కోటి డిమాండ్ చేసినట్లు సమాచారం. ముస్తాక్ ఖాన్‌ను ఈవెంట్‌కు రమ్మని కిడ్నాప్ చేశారని ఆయన సన్నిహితుడు శివమ్ యాదవ్ తెలిపారు.అయితే ఈవెంట్‌కు హాజరయ్యేందుకు ముస్తాక్‌కు అడ్వాన్స్ ఇచ్చారని.. విమాన టిక్కెట్లు పంపించారని శివమ్ యాదవ్ వెల్లడించారు. కిడ్నాప్ చేసిన దండగులు ముస్తాక్, అతని కుమారుడి ఖాతాల నుంచి రూ.2 లక్షలు కాజేశారని తెలిపారు. కానీ చివరికీ వారి నుంచి తప్పించుకున్న ముస్తాక్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. ఇటీవల కమెడియన్ సునీల్ పాల్‌కు సైతం ఇదే తరహాలో కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముస్తాక్ బాగానే ఉన్నారని.. కొద్ది రోజుల్లోనే మీడియాతో అన్ని విషయాలు వివరిస్తారని కుటుంబ సభ్యలు వెల్లడించారు. ఈవెంట్ పేరుతో సెలబ్రిటీలను కిడ్నాప్ చేయడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
'జైలర్' పాట విషయంలో ఇప్పటికీ ఆ బాధ ఉంది: తమన్నా
బహుభాషా కథానాయకి తమన్నా భాటియా. అయితే ఐటమ్ సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్ అంటే ఈ బ్యూటీనే అని చెప్పవచ్చు. చిత్రానికి అవసరం అయితే ఎంత గ్లామరస్గానైనా నటించడానికి ఆమె సై అంటారు. కాగా తమన్న ప్రత్యేక పాటలో నటించిన చిత్రాలన్నీ దాదాపు హిట్టే. అలా తమన్న నటించిన చిత్రాల విజయంలో ఆమె భాగం చాలానే ఉంటుంది. అందుకు నటుడు రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన జైలర్ చిత్రం ఒక ఉదాహరణ. అందులో 'నువ్వు కావాలయ్యా..' అనే పాట కుర్రకారును ఉర్రూతలూరించిందనడం అతిశయోక్తి కాదు. ఇంకా చెప్పాలంటే అనిరుద్ సంగీతాన్ని అందించిన ఆ పాటలో నటుడు రజనీకాంత్ కూడా ఒక సహాయ నటుడిగా కనిపించారు. మరో విషయం ఏమిటంటే ఆ పాటలో నటి తమన్న డ్రస్, ఆమె స్టెప్స్‌కు కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కూడా. అలాంటి పాటలో తన నటన గురించి తమన్న ఇటీవల తన సోషల్ మీడియాలో పేర్కొంటూ జైలర్ చిత్రంలోని పాటలో తాను పూర్తిగా ఎఫర్ట్ పెట్టలేకపోయాననే బాధ ఇప్పటికీ ఉందన్నారు. ఇంకా కొంచెం బాగా చేయవచ్చుననే ఫీల్ అయ్యానని చెప్పారు. అయితే తాను కొన్ని నెలల క్రితం నటించిన హిందీ చిత్రం స్త్రీ 2 చిత్రంలో 'ఆజ్ కీ రాత్' అనే పాటలో నటించాననీ, ఆ పాటలో నటన సంతృప్తి కలిగించిందని చెప్పారు. ఆ పాటలో నటన గురించి ఆ చిత్ర దర్శకుడు అమర్ కౌశిక్ స్పందిస్తూ ఆజ్ కీ రాత్ పాటకు నటి తమన్నా ఆ పాత్రగానే మారారని చెప్పడమే చాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం తెలుగు,తమిళం భాషల్లో అవకాశాలు లేకపోయినా హిందీలో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కాగా నటుడు రజనీకాంత్ త్వరలో జైలర్– 2 చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. అందులోనూ తమన్నాకు ఐటమ్ సాంగ్ ఉంటుందేమో చూడాలి. -
రెమ్యునరేషన్ పెంపు.. అంత పిచ్చోడిని కాదన్న హీరో!
సినిమా హిట్టయిందంటే చాలు చాలామంది రెమ్యునరేషన్ పెంచేస్తుంటారు. అలాంటిది బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావు రూ.50 కోట్లు పెట్టి తీసిన స్త్రీ 2 సినిమాతో రూ.700 కోట్లు సాధించాడు. ఇంతటి ఘన విజయం తర్వాత ఆ హీరో కూడా రేటు పెంచేశాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అందుకుంటున్న పారితోషికానికి అదనంగా మరో రూ.5 కోట్లు అడుగుతున్నాడట! అంత తెలివితక్కువవాడిని కాదుఈ పుకార్లపై రాజ్‌కుమార్ స్పందించాడు. నా నిర్మాతలను కాల్చుకుతినేంత తెలివితక్కువవాడిని కాదు. బ్లాక్‌బస్టర్ సినిమా చేసినంతమాత్రాన నేనేమీ మారిపోను. డబ్బు కన్నా నాకు ప్యాషనే ముఖ్యం. ఛాలెంజ్, సర్ప్రైజింగ్ రోల్స్ చేస్తూ మిమ్మల్ని అలరిస్తూనే ఉంటా అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే స్త్రీ 2 సినిమాకుగానూ రాజ్‌కుమార్ రూ.6 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.సినిమా..స్త్రీ 2 విషయానికి వస్తే.. రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2018లో వచ్చిన హిట్ మూవీ స్త్రీకి ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ చిత్రం ఆగస్టు 15న విడుదలవగా.. ప్రపంచవ్యాప్తంగా వందలకోట్లు వసూలు చేసింది. స్త్రీ 2 అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. చదవండి: వైల్డ్‌కార్డ్ విన్నరేంటి? ఇది అధర్మం కాదా?: అభయ్ నవీన్ -
నేను చూసిన మంచి సినిమా ఇదే!: బాలీవుడ్ నటుడు
కల్కి సినిమాలో ప్రభాస్ లుక్ జోకర్లా ఉందని కామెంట్స్ చేసి డార్లింగ్ ఫ్యాన్స్ ఆగ్రహావేశాలకు గురయ్యాడు బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ. తనపై విపరతీమైన ట్రోలింగ్ జరగడంతో ప్రభాస్ అద్భుత నటుడని, కేవలం అతడు కల్కి మూవీలో పోషించిన పాత్ర గురించే తాను అలా కామెంట్స్ చేశానని వివరణ ఇచ్చాడు.చాలా నచ్చిందితాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో.. ఈ మధ్యకాలంలో చూసినవాటిలో బెస్ట్ మూవీ ఇదేనంటూ ఓ హారర్ చిత్రానికి కితాబిచ్చాడు. అర్షద్ మాట్లాడుతూ.. స్త్రీ 2 మూవీ చూశాను. చాలా నచ్చింది. ఎంతో అద్భుతంగా ఉంది. రాజ్ కుమార్ రావు అదరగొట్టేశాడు. ఎంతో ఎంజాయ్ చేశాను. సినిమా కోసం ఎంత ఖర్చుపెట్టారో కానీ జనాలు అంతకంటే ఎక్కువ ఆదరించారు.గుణపాఠం నేర్చుకున్న నటుడుఇకమీదట నేను చూడబోయే ప్రతి సినిమాను ప్రేమించాలనుకుంటున్నాను. అందుకోసం నా మెదడును సిద్ధం చేసుకున్నాను. ప్రతి కథ, హీరో, దర్శకుడు అందరూ బాగానే చేస్తున్నారని నాకు నేనే చెప్పుకుంటున్నాను అంటున్నాడు. కల్కి ఎఫెక్ట్ వల్ల అతడు గుణపాఠం నేర్చుకున్నట్లు తెలుస్తోంది. అందుకే అన్ని సినిమాలను ప్రేమించాలని డిసైడ్ అయ్యాడని పలువురూ అభిప్రాయడుతున్నారు.చదవండి: Yash Toxic Movie: షూటింగ్ కోసం ఆ వేలాది చెట్లు పడగొట్టారా? -
తమన్నా ఐటమ్ సాంగ్.. ఫుల్ వర్షన్ వచ్చేసింది!
టాలీవుడ్లో మిల్కీ బ్యూటీగా అభిమానులను అలరించిన ముద్దుగుమ్మ తమన్నా. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. అంతేకాకుండా పలు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్‌తోనూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. జైలర్ మూవీలో తనదైన గ్లామర్, డ్యాన్స్‌తో ఐటమ్ సాంగ్‌లో అదరగొట్టింది. ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన స్త్రీ-2 చిత్రంలోనూ మెరిసింది. అజ్ కీ రాత్ అంటూ కుర్రకారును ఊర్రూతలూగించింది. శ్రద్దాకపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.తాజాగా ఈ సాంగ్ ఫుల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. గతంలో ఈ పాట విడుదల చేయగా.. రెండు నెలల్లోనే 500 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ప్రస్తుతం కట్ చేసిన సీన్స్‌ను కలిపి తాజాగా ఈ పాటను రీ రిలీజ్ చేశారు. అజ్ కీ రాత్ ఫుల్ సాంగ్ అక్టోబర్ 24న యూట్యూబ్‌లో అందుబాటులోకి వచ్చింది.కాగా.. 2018లో వచ్చిన స్త్రీ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని తీసుకొచ్చారు. హారర్ కామెడీ చిత్రంగా తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్శక్తి ఖురానా కీలక పాత్రలు పోషించారు. -
ఓటీటీలోనూ తగ్గేదేలే.. దూసుకెళ్తోన్న హారర్ థ్రిల్లర్
శ్రద్ధాకపూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటించిన చిత్రం స్త్రీ-2. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఏకంగా రూ.870 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ హారర్ కామెడీ మూవీ బాలీవుడ్లో పలు రికార్డులను బద్దలుకొట్టింది. ఇటీవలే ఓటీటీకి వచ్చిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఓటీటీలోనూ అదే రేంజ్లో దూసుకెళుతోంది.టాప్‌లో ట్రెండింగ్ఈ చిత్రం అక్టోబర్ 10వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్కు అడుగుపెట్టింది. హిందీలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఓటీటీలో ఈ సినిమాకు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఏకంగా ప్రైమ్ వీడియో నేషనల్ వైడ్ గా టాప్‌లో ట్రెండ్ అవుతోంది. సెప్టెంబర్ చివర్లోనే రెంటల్ విధానంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. అయితే అక్టోబర్ 10 నుంచి ఉచితంగా అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతం టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. -
ఓటీటీలో రూ.700 కోట్ల సినిమా.. ఉచితంగా చూసేయండి
ఇటీవల థియేటర్లలో రిలీజై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఆగస్టు 15న రిలీజై ఈ ఏడాదిలోనే అత్యధిక వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా యానిమల్, పఠాన్, బాహుబలి లాంటి పెద్ద సినిమాల రికార్డులను అధిగమించింది. రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన మూవీ స్త్రీ- 2. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ హారర్ కామెడీ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పటికే అద్దె ప్రాతిపదికన ప్రైమ్‌లో అందుబాటులో ఉన్న ఈ సినిమా.. నేటి నుంచి ఉచితంగా అందుబాటులోకి వచ్చేసింది. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్శక్తి ఖురానా కీలక పాత్రలు పోషించారు.స్త్రీ 2 కథేంటంటే..2018 లో రిలీజై భారీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన హారర్ థ్రిల్లర్ స్త్రీ చిత్రానికి సీక్వెల్ ఇది. పార్ట్ 1లో స్త్రీ పీడా విరిగిపోయిందని చండేరీ ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. అయితే అప్పుడే సర్ ఖటా అనే విచిత్రమైన దెయ్యం ఒకటి ఊర్లోని అమ్మాయిలను మాయం చేయడం ప్రారంభిస్తుంది. అలా ఓ సారి విక్కీ (రాజ్ కుమార్ రావు) స్నేహితుడి ప్రియురాలిని సర్ ఖటా మాయం చేస్తుంది. దీంతో నలుగురు స్నేహితులు(రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్ శక్తి ఖురానా) కలిసి స్త్రీ(శ్రద్ధా కపూర్) సహాయం కోరతారు. విచిత్రమైన దెయ్యం సర్ ఖటా నుంచి చండేరీ ప్రజలను ‘స్త్రీ’ గ్యాంగ్ ఎలా రక్షించింది అనేది ఈ సినిమా స్టోరీ. -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఐదు డోంట్ మిస్
వీకెండ్ వచ్చిందంటే చాలు మూవీ లవర్స్ అలెర్ట్ అయిపోతారు. ఈసారి దసరా కాబట్టి కాస్త హడావుడి గట్టిగానే ఉంటుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ హడావుడిగా ఉంది. థియేటర్లలో 'వేట్టయన్', 'విశ్వం', 'మా నాన్న సూపర్ హీరో', 'జనక అయితే గనక', 'జిగ్రా' సినిమాలు వస్తున్నాయి. ఓటీటీలో అయితే జాతరే అని చెప్పాలి.(ఇదీ చదవండి: రజినీకాంత్ 'వేట్టయన్' ట్విటర్ రివ్యూ)వీకెండ్ మొత్తంగా 29 సినిమాలు వస్తుండగా.. శుక్రవారం ఒక్కరోజే 14 చిత్రాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో 'మత్తు వదలరా 2', 'గొర్రె పురాణం', 'స్త్రీ 2', 'శబరి', 'వాళై' చూడాలనే ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. వీటిలో స్త్రీ 2 తప్పితే మిగిలిన మూవీస్ అన్నీ తెలుగులోనే ఉన్నాయి. అలానే జై మహేంద్రన్ అనే తెలుగు డబ్బింగ్ సిరీస్, సర్ఫిరా అనే హిందీ సినిమా కూడా ఉన్నంతలో చూడాలనే ఆసక్తి రేపుతున్నాయి.ఈ వీకెండ్ ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (అక్టోబరు 11)నెట్ఫ్లిక్స్మత్తు వదలరా 2 - తెలుగు సినిమాఇన్ హెర్ ప్లేస్ - స్పానిష్ మూవీలోన్లీ ప్లానెట్ - ఇంగ్లీష్ సినిమాఅప్ రైజింగ్ - ఇంగ్లీష్ సినిమాఏ వర్చువస్ బిజినెస్ - కొరియన్ సిరీస్ (అక్టోబరు 12)లవ్ ఈజ్ బ్లైండ్: హబిబి - అరబిక్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)ఔటర్ బ్యాంక్ సీజన్ 4 పార్ట్ 1 - ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)టాంబ్ రైడర్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)ద లైఫ్ అండ్ మూవీస్ ఆఫ్ ఎర్సన్ కునేరి సీజన్ 2 - టర్కిష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)దట్ కైండ్ ఆఫ్ లవ్ - తగలాగ్ మూవీ (స్ట్రీమింగ్)తెమురన్ - ఇండోనేసియన్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)మాన్స్టర్ హై 2 - ఇంగ్లీష్ మూవీ (స్ట్రీమింగ్)ద మేరియా సోల్డాడ్ కేసు - స్పానిష్ సినిమా (స్ట్రీమింగ్)జీ5వేద - తెలుగు డబ్బింగ్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)ఆహాలాంధర్ - తమిళ సినిమాగొర్రె పురాణం - తెలుగు మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)సన్ నెక్స్ట్శబరి - తెలుగు డబ్బింగ్ సినిమాఅమెజాన్ ప్రైమ్గుటర్ గూ సీజన్ 2 - హిందీ సిరీస్స్త్రీ 2 - హిందీ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)సిటాడెల్: డయానా - ఇటాలియన్ సిరీస్ (స్ట్రీమింగ్)హాట్స్టార్రిటర్న్ టూ లస్ సబనాస్ - స్పానిష్ సిరీస్సర్ఫిరా - హిందీ సినిమావాళై- తెలుగు డబ్బింగ్ మూవీ (అక్టోబరు 12)జియో సినిమాటీ కప్- ఇంగ్లీష్ సిరీస్సోనీ లివ్జై మహేంద్రన్ - తెలుగు డబ్బింగ్ సిరీస్రాత్ జవానీ హై - హిందీ సిరీస్జిందగీనామా - హిందీ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)ఆపిల్ ప్లస్ టీవీడిస్క్లెయిమర్ - ఇంగ్లీష్ సిరీస్ద లాస్ట్ ఆఫ్ ద సీ ఉమెన్ - ఇంగ్లీష్ మూవీ(ఇదీ చదవండి: ఓటీటీకి రాని తంగలాన్.. అసలు సమస్య ఇదేనా?) -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారం 21 చిత్రాలు స్ట్రీమింగ్!
ఈ వారం దసరా సందడి మొదలైపోయింది. దేవి నవరాత్రుల ఉత్సవాలతో అంతా బిజీగా ఉన్నారు. ఇక సినీ ప్రియులను అలరించేందుకు చిత్రాలు రెడీగా ఉన్నాయి. ఈ పండుగకు థియేటర్లలో సందడి చేసేందుకు రజినీకాంత్ వెట్టైయాన్, సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో, సుహాస్ జనక అయితే గనక, గోపిచంద్ విశ్వం లాంటి సినిమాలు ఈ దసరాకు సినీ ప్రేక్షకులను అలరించనున్నాయి.ఇక అంతా పండుగ మూడ్‌లో కుటుంబ సభ్యులతో కలిసి సినిమాలు ఇంట్లోనే చూడాలనుకుంటారు. అలాంటి వారికోసం ఓటీటీల్లోనూ అలరించేందుకు చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. పెద్ద పెద్ద సినిమాలు లేకపోయినా.. కాస్తా చూడాలనిపించేవైతే ఉన్నాయి. వాటిలో ఇటీవల హిట్‌గా నిలిచిన శ్రద్ధాకపూర్ స్త్రీ-2, అక్షయ్‌కుమార్ సర్ఫీరా, సుహాస్ గొర్రెపురాణం, అమలాపాల్ లెవెల్ క్రాస్ లాంటి చిత్రాలు కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో చూసేయండి.నెట్‌ఫ్లిక్స్‌ది మెహండెజ్ బ్రదర్స్(క్రైమ్ డాక్యుమెంటరీ)- అక్టోబర్ 07యంగ్ షెల్డన్ (ఇంగ్లీష్) అక్టోబరు 8ఖేల్ ఖేల్ మే(హిందీ సినిమా)- అక్టోబర్ 09స్టార్టింగ్ 5(వెబ్ సిరీస్)- అక్టోబర్ 09గర్ల్ హాంట్స్ బాయ్- అక్టోబర్ 10మాన్స్టర్ హై 2 (ఇంగ్లీష్) అక్టోబరు 10ఔటర్ బ్యాంక్స్ సీజన్-4 పార్ట్-1(వెబ్ సిరీస్)- అక్టోబర్ 10టాంబ్ రైడర్: ది లెజెండ్ ఆఫ్ లారా క్రాఫ్ట్(యానిమేటేడ్ సిరీస్)- అక్టోబర్ 10లోన్‌లి ప్లానెట్- అక్టోబర్ 11అప్ రైజింగ్ (కొరియన్ సిరీస్) -అక్టోబర్ 11ది గ్రేట్ ఇండియన్ కపిల్ (టాక్ షో) -అక్టోబర్ 12 సోనీ లివ్జై మహేంద్రన్ (మలయాళం)-అక్టోబర్ 11రాత్ జవాన్ హై- (హిందీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 11 డిస్నీ ప్లస్ హాట్స్టార్సర్ఫీరా(బాలీవుడ్ సినిమా)- అక్టోబర్ 11వారై (తమిళ సినిమా)- అక్టోబర్ 11 అమెజాన్ ప్రైమ్ వీడియోసిటాడెల్: డయానా- అక్టోబర్ 10 జియో సినిమాగుటర్ గూ (హిందీ)- అక్టోబర్ 11టీకప్ (హాలీవుడ్)- అక్టోబర్ 11 యాపిల్ టీవీ ప్లస్డిస్క్లైమర్- అక్టోబర్ 11 ఆహాలెవెల్ క్రాస్- (మలయాళ సినిమా)- అక్టోబర్ 11(రూమర్ డేట్)గొర్రె పురాణం-(తెలుగు సినిమా)- అక్టోబర్ 11(రూమర్ డేట్) -
మమ్ముట్టి బ్లాక్ అండ్ వైట్ సినిమా.. ఆ లిస్ట్‌లో ఏకంగా రెండో స్థానం!
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ 'భ్రమయుగం'. ఈ ఏడాది ప్రారంభంలో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. రాహుల్ సదాశివన్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా మొత్తం బ్లాక్ అండ్వైట్లోనే రూపొందించడం మరో విశేషం. తాజాగా ఈ మూవీ అరుదైన ఘనతను దక్కించుకుంది.ఈ ఏడాది విడుదలైన బెస్ట్ హారర్ ఫిల్మ్స్‌లో ఈ మూవీకి చోటు దక్కింది. ప్రముఖ మూవీ రివ్యూ రేటింగ్స్ ఇచ్చే లెటర్ బాక్స్ డీ సంస్థ తాజాగా జాబితాను రిలీజ్ చేసింది. 2024లో వచ్చిన బెస్ట్ 25 హారర్ ఫిల్మ్స్ లిస్ట్‌ను వెల్లడించింది. ఈ లిస్ట్‌లో మొదటిస్థానంలో ది సబ్‌స్టాన్స్ నిలవగా.. జపనీస్ మూవీ చిమే మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా డెడ్ టాలెంట్స్ సొసైటీ, యువర్ మాన్స్టర్, ఏలియన్ రొమ్యూలస్, ది గర్ల్ విత్ ది నీడిల్, స్ట్రేంజ్ డార్లింగ్, ఎక్స్హ్యుమా, ఐ సా ది టీవీ గ్లో చిత్రాలు టాప్-10లో నిలిచాయి. ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన శ్రద్ధాకపూర్ హారర్ కామెడీ చిత్రం స్త్రీ-2 23వ స్థానం దక్కించుకుంది. (ఇది చదవండి: Bramayugam Review: ‘భ్రమయుగం’ మూవీ రివ్యూ)‘భ్రమయుగం’ కథేంటంటే..తక్కువ కులానికి చెందిన దేవన్(అర్జున్ అశోకన్) మంచి గాయకుడు. తన స్నేహితుడితో కలిసి అడవిలో ప్రయాణిస్తూ తప్పిపోతాడు. గ్రామానికి వెళ్లే దారి తెలియక అడవిలో తిరిరి తిరిగి ఓ పాడుబడ్డ భవనంలోకి వెళ్తాడు. అందులో ఇద్దరు మాత్రమే ఉంటారు. ఒకరు వంటవాడు (సిద్ధార్థ్ భరతన్), మరొకరు యజవానమి కుడుమన్ పొట్టి(మమ్ముట్టి). దేవన్‌కి కుడిమన్ పొట్టి సాదరంగా ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. తక్కువ కులం వాడు అని తెలిసినా కూడా ఇంటికి వచ్చిన అతిథి అని తనతో సమానంగా చూడాలని వంట మనిషికి ఆదేశిస్తాడు.అయితే అక్కడ జరిగిన కొన్ని పరిణామాల కారణంగా దేవన్ ఆ భవనం నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అతని ప్రయత్నాలన్నీ విఫలం అవుతాయి. అసలు కుడిమన్ పొట్టి ఎవరు? పాడుబడ్డ భవనంలో ఎందుకు ఉంటున్నాడు. అతని గురించి అన్నీ తెలిసినా వంటమనిషి ఆ ఇంట్లోనే ఎందుకు ఉన్నాడు? దేవన్ని బంధీగా ఎందుకు మార్చారు? చివరకు ఆ ఇంటి నుంచి దేవన్ తప్పించుకున్నాడా లేదా? అనేది తెలియాలంటే భ్రమయుగం చూడాల్సిందే. ప్రస్తుతం భ్రమయుగం సోనిలీవ్‌లో అందుబాటులో ఉంది.Letterboxd’s Top 10 Horror Films of 2024 (so far) 👻See the full list of The Official Top 25 Horror Films of 2024 here: https://t.co/x95L2cdqNZ pic.twitter.com/uL0wziJIMB— Letterboxd (@letterboxd) October 1, 2024 -
ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 20 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. థియేటర్లలో 'దేవర' రిలీజ్ అయింది. టాక్ అదిరిపోయిందని అంటున్నారు. మరోవైపు ఓటీటీలోనూ ఏకంగా 20 వరకు సినిమాలు-వెబ్ సిరీసులు ఒకేరోజు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. వీటిలో తెలుగు సినిమాలు కూడా బాగానే ఉన్నాయి. ఒకవేళ మీకు 'దేవర' చూడటం కుదరకపోతే ఓటీటీలో ఈ మూవీస్ చూసేయండి.(ఇదీ చదవండి: ‘దేవర’ మూవీ రివ్యూ)ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చిన మూవీస్ విషయానికొస్తే డీమోంటీ కాలనీ 2, ప్రతినిధి 2 అనే తెలుగు సినిమాలు ఉండగా ఉలాఝ్, లవ్ సితార అనే హిందీ చిత్రాలు కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవి కాదన్నట్లు ఇప్పటికే సరిపోదా శనివారం, స్త్రీ 2 స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏయే సినిమాలు తాజాగా రిలీజ్ అయ్యాయనేది చూద్దాం.శుక్రవారం ఓటీటీలో రిలీజైన మూవీస్ (సెప్టెంబరు 27)నెట్ఫ్లిక్స్డూ యూ సీ వాట్ ఏ సీ - ఇండోనేసియన్ మూవీగ్యాంగ్ సీయాంగ్ క్రియేచర్ సీజన్ 2 - కొరియన్ సిరీస్రెజ్ బాల్ - ఇంగ్లీష్ సినిమావిల్ & హార్పర్ - ఇంగ్లీష్ మూవీఉలాఝ్ - హిందీ సినిమాసరిపోదా శనివారం - తెలుగు మూవీహాట్స్టార్డాక్టర్ ఒడిస్సీ - ఇంగ్లీష్ సిరీస్గ్రేస్ అనాటమీ సీజన్ 21 - ఇంగ్లీష్ సిరీస్9-1-1 లోన్ స్టార్ సీజన్ 5 - ఇంగ్లీష్ సిరీస్అయిలా & ద మిర్రర్స్ - స్పానిష్ సిరీస్తాజా ఖబర్ సీజన్ 2 - హిందీ సిరీస్జీ5డీమోంటీ కాలనీ 2 - తెలుగు సినిమాలవ్ సితార - హిందీ మూవీజియో సినిమాహానీమూన్ ఫొటోగ్రాఫర్ - హిందీ సిరీస్అమెజాన్ ప్రైమ్ఔరోన్ మైన్ దమ్ థా - హిందీ సినిమాకొట్టుక్కళి - తమిళ మూవీఓటీ 2023 ద అవర్ - స్పానిష్ చిత్రంప్రీవియస్లీ సేవ్డ్ వెర్షన్ - జపనీస్ మూవీస్త్రీ 2 - హిందీ సినిమామనోరమభరతనాట్యం - మలయాళ మూవీఆహాప్రతినిధి 2 - తెలుగు సినిమాఆపిల్ ప్లస్ టీవీఊల్ఫ్స్ - ఇంగ్లీష్ మూవీ(ఇదీ చదవండి: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు అరెస్ట్) -
సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'స్త్రీ 2' సినిమా
శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన స్త్రీ2 చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఆగష్టు 15న విడుదలైన ఈ సినిమా బాలీవుడ్లో హిట్ టాక్ తెచ్చుకుంది. కేవలం రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు రూ. 700 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.2018లో విడుదలైన స్త్రీ సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీ వచ్చింది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఎలాంటి ప్రకటన లేకుండానే ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన (రూ.349) చూసే అవకాశం మాత్రమే ఉంది.స్త్రీ 2 కథేంటంటే..2018 లో రిలీజై భారీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన హారర్ థ్రిల్లర్ స్త్రీ చిత్రానికి సీక్వెల్ ఇది. పార్ట్ 1లో స్త్రీ పీడా విరిగిపోయిందని చండేరీ ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. అయితే అప్పుడే సర్ ఖటా అనే విచిత్రమైన దెయ్యం ఒకటి ఊర్లోని అమ్మాయిలను మాయం చేయడం ప్రారంభిస్తుంది. అలా ఓ సారి విక్కీ (రాజ్ కుమార్ రావు) స్నేహితుడి ప్రియురాలిని సర్ ఖటా మాయం చేస్తుంది. దీంతో నలుగురు స్నేహితులు(రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్ శక్తి ఖురానా) కలిసి స్త్రీ(శ్రద్ధా కపూర్) సహాయం కోరతారు. విచిత్రమైన దెయ్యం సర్ ఖటా నుంచి చండేరీ ప్రజలను ‘స్త్రీ’ గ్యాంగ్ ఎలా రక్షించింది అనేది ఈ సినిమా స్టోరీ.దర్శకుడు అమర్ కౌశిక్ వైవిధ్యమైన స్క్రీన్‌ప్లేతో ఎక్కడా బోర్ కొట్టకుండా కథనాన్ని నడిపించాడు. సినిమా ఒకవైపు భయపెడుతూనే మరోవైపు నవ్వులు పంచుతోంది. కామెడీ, హారర్ రెండింటిని బ్యాలన్స్ చేస్తూ ఆసక్తికరంగా కథనాన్ని సాగించాడు. ఇక ప్రత్యేక పాటలో తమన్నా స్టెప్పులేయడం.. అక్షయ్ కుమార్ అతిథి పాత్ర లో కనిపించడం సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్. -
ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ నాలుగు డోంట్ మిస్
ఈ వారం థియేటర్లలోకి 'దేవర' రాబోతున్నాడు. అందుకు తగ్గట్లే సోషల్ మీడియాలో ఈ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. దీనితో పాటు 'హిట్లర్' సినిమా, తర్వాతి రోజు 'సత్యం సుందరం' అనే డబ్బింగ్ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ బోలెడన్ని క్రేజీ మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్కి రెడీ అయిపోయాయి. వీటిలో ఓ నాలుగు మాత్రం ఆసక్తి రేపుతున్నాయి.(ఇదీ చదవండి: అమెరికా వెళ్లిపోయిన ఎన్టీఆర్.. ఇక అది కష్టమే)ఓటీటీల్లో వచ్చే సినిమాల విషయానికొస్తే 'సరిపోదా శనివారం', 'స్త్రీ 2', 'డీమోంటీ కాలనీ 2', 'లవ్ సితార' కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. అలానే పలు ఇంగ్లీష్-హిందీ మూవీస్ కూడా పర్లేదనిపించేలా ఉన్నాయి. ఇంతకీ ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు/సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (సెప్టెంబరు 23-29 వరకు)నెట్ఫ్లిక్స్పెనెలోప్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 24బ్యాంకాక్ బ్రేకింగ్ (థాయ్ సినిమా) - సెప్టెంబరు 26నోబడీ వాంట్స్ దిస్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 26సరిపోదా శనివారం (తెలుగు మూవీ) - సెప్టెంబరు 26గ్యాంగ్ సీయాంగ్ క్రియేచర్ సీజన్ 2 (కొరియన్ సిరీస్) - సెప్టెంబరు 27రెజ్ బాల్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 27విల్ & హార్పర్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 27అమెజాన్ ప్రైమ్స్కూల్ ఫ్రెండ్స్ సీజన్ 2 (హిందీ సిరీస్) - సెప్టెంబరు 25స్త్రీ 2 (హిందీ మూవీ) - సెప్టెంబరు 27 (రూమర్ డేట్)హాట్స్టార్వాళా (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 239-1-1: లోన్ స్టార్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 24ఇన్ సైడ్ ఔట్ 2 (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 25గ్రోటస్క్వైరీ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 26అయిలా వై లాస్ మిర్రర్ (స్పానిష్ సిరీస్) - సెప్టెంబరు 27తాజా ఖబర్ సీజన్ 2 (హిందీ సిరీస్) - సెప్టెంబరు 27ఆహాబ్లింక్ (తమిళ డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 25జీ5డీమోంటీ కాలనీ 2 (తెలుగు సినిమా) - సెప్టెంబరు 27లవ్ సితార (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 27ఆపిల్ ప్లస్ టీవీమిడ్ నైట్ ఫ్యామిలీ (స్పానిష్ సిరీస్) - సెప్టెంబరు 25జియో సినిమాహానీమూన్ ఫొటోగ్రాఫర్ (హిందీ సిరీస్) - సెప్టెంబరు 27(ఇదీ చదవండి: వాళ్లకు ఇచ్చారు.. మాకు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు: ఎన్టీఆర్ ఫ్యాన్స్) -
బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న చిన్న సినిమా.. ఏకంగా షారూక్ మూవీ రికార్డ్ బ్రేక్!
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావు నటించిన చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైన హారర్ కామెడీ చిత్రం స్త్రీ 2 తాజాగా మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్లోనే దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మొదటిస్థానంలో ఉన్న షారూఖ్ ఖాన్ జవాన్ మూవీని అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించింది.షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం జీవితకాల కలెక్షన్లను స్త్రీ-2 అధిగమించింది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి జవాన్ రూ.640.25 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా.. హిందీలో మాత్రమే రూ.582.31 కోట్లు రాబట్టింది. ఈ ఏడాదిలో స్త్రీ-2 ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేవలం హిందీలోనే రూ.586 కోట్ల వసూళ్లు సాధించినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఈ విషయాన్ని స్ట్రీ 2 నిర్మాణ సంస్థ మడాక్ ఫిల్మ్స్ భారతదేశంలోనే 'ఆల్ టైమ్ నంబర్ వన్ హిందీ చిత్రం' అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.కాగా.. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన స్త్రీ 2లో వరుణ్ ధావన్, అక్షయ్ కుమార్ కూడా అతిథి పాత్రలు పోషించారు. గతంలో స్త్రీ (2018) చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా.. గతేడాది షారూక్- అట్లీ డైరెక్షన్లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ జవాన్ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టింది. -
శ్రద్ధాకపూర్ మూవీ రికార్డ్.. ఏకంగా యానిమల్‌ను దాటేసింది!
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన హారర్ కామెడీ చిత్రం స్త్రీ-2. ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టిన ఈ మూవీ.. తాజాగా మరో మైలురాయిని అధిగమించింది. బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో రెండోస్థానంలో నిలిచింది. అంతేకాకుండా గతంలోనే టాలీవుడ్ మూవీ బాహుబలి ది బిగినింగ్ వసూళ్లను దాటిన స్త్రీ-2.. సందీప్ రెడ్డి వంగా చిత్రం యానిమల్ దేశవ్యాప్తంగా రాబట్టిన కలెక్షన్స్‌ను సైతం దాటేసింది.కాగా.. రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన యానిమల్ గతేడాది విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. కేవలం ఇండియా వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.553 కోట్లు వసూళ్లు సాధించింది. తాజాగా స్త్రీ-2 రూ.583 కోట్ల వసూళ్లతో యానిమల్ చిత్రాన్ని దాటేసింది. అంతేకాకుండా బాలీవుడ్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల్లో షారూఖ్ ఖాన్ జవాన్ (రూ.640 కోట్లు) తర్వాత రెండోస్థానంలో నిలిచింది. (ఇది చదవండి: బాహుబలిని దాటేసిన చిన్న సినిమా.. జవాన్‌పై గురి!)అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కేవలం కంటెంట్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆగస్టు 15న విడుదలైన ఈ హారర్ కామెడీ సినిమా.. బాలీవుడ్లో స్టార్ హీరోల చిత్రాలకు గట్టి పోటీ ఇచ్చింది. శ్రద్ధాకపూర్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. -
దాన్ని కాపీ కొట్టిన స్త్రీ 2.. దర్శకుడి రియాక్షన్ ఇదే!
ఇటీవలికాలంలో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన మూవీ స్త్రీ 2. రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ కేవలం నాలుగున్నర కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. సెప్టెంబర్ 13న విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.621 కోట్లకు పైగా రాబట్టింది. హాలీవుడ్ సిరీస్‌తో పోలికథియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ఈ సినిమా దూకుడు చూస్తుంటే రూ.750 కోట్లను సైతం అవలీలగా అందుకునేట్లు కనిపిస్తోంది. ఇకపోతే ఎప్పటికప్పుడు ఈ మూవీ కొత్త పోస్టర్లను సోషల్ మీడియాలో వదులుతున్నారు. ఈ క్రమంలో ఓ పోస్టర్ స్ట్రేంజర్ థింగ్స్ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ పోస్టర్‌ను పోలి ఉంది. కాపీ పోస్టర్లు అవసరమా?బాగా హిట్టయిన సినిమాకు ఇలాంటి కాపీ పోస్టర్లు అవసరమా? అని పలువురూ అభిప్రాయపడ్డారు. ఈ వివాదంపై దర్శకుడు అమర్ కౌశిక్ స్పందించాడు. మా సినిమా పోస్టర్ స్ట్రేంజర్ థింగ్స్‌ను గుర్తు చేస్తుందని అనుకోలేదు. డిజైనర్ తయారు చేసిన పోస్టర్ చూశాం, నచ్చిందని రిలీజ్ చేశాం. ప్రేక్షకులు తెలివైనవారుఆ తర్వాత అది స్ట్రేంజర్ థింగ్స్ పోస్టర్‌కు దగ్గరగగా ఉందని గుర్తించాం. మా కంటే ప్రేక్షకులు బాగా తెలివైనవారని తెలుసు. ఇలాంటివి వాళ్లే ఈజీగా క్యాచ్ చేస్తారు. కానీ మేము కాపీ కొట్టాలన్న ఉద్దేశంతో ఆ పని చేయలేదు. అది అనుకోకుండా జరిగిపోయింది. ముందే తెలిసుంటే ఇది జరగకుండా జాగ్రత్తపడేవాళ్లం అని చెప్పుకొచ్చాడు. -
సినిమాపై ఎఫెక్ట్ పడుతుందని ‘ఆజ్ కీ రాత్’కి నో చెప్పా: తమన్నా
హీరోయిన్ తమన్నా కెరీర్లో స్పెషల్సాంగ్స్కు ప్రత్యేకమైన పాత్ర ఉంది. ఈ బ్యూటీ ఇప్పటివరకు దాదాపు పదికిపైగా స్పెషల్‌సాంగ్స్‌లో నర్తించారు. ఆడియన్స్ నుంచి కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇటీవల ‘స్త్రీ 2’ సినిమాలో తమన్నా చేసిన ‘ఆజ్ కీ రాత్’ స్పెషల్‌సాంగ్‌కు మంచి ఆదరణ దక్కింది. యూట్యూబ్‌లో 200 మిలియన్స్ వ్యూస్ ఈ పాటకు వచ్చాయి. అయితే ఈ స్పెషల్ సాంగ్‌కు తమన్నా మొదట నో చెప్పారు. ఈ విషయంపై తమన్నా ఇటీవల ఓ సందర్భంగా మాట్లాడుతూ– ‘‘రజనీకాంత్‌గారి ‘జైలర్’లో నేను చేసిన ‘వా నువ్వు కావాలయ్యా పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆ సమయంలో నాకు ‘ఆజ్ కీ రాత్ ’ చాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సాంగ్ చేస్తే అందరూ ‘వా నువ్వు కావాలయ్యా’ పాటతో పోలికలు పెడతారు. సాంగ్ కాస్త అటు ఇటు అయినా సినిమాపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. దీంతో ఇప్పుడు ఈ సాంగ్ ఎందుకులే? అనుకున్నాను. దీంతో ‘ఆజ్ కీ రాత్’కు మొదట నో చెప్పాను. కానీ ‘స్త్రీ 2’ దర్శకుడు ఆమర్కౌశిక్ పట్టుబట్టి ఈ పాటను నాతో చేయించుకున్నారు’’ అని మాట్లాడారు తమన్నా. ఇక ‘ఆజ్ కీ రాత్’ సాంగ్ ‘స్త్రీ 2’లో సూపర్‌హిట్‌గా నిలవడమే కాకుండా, ఈ సినిమాకు ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ ఇతర లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘స్త్రీ 2’. అమర్ కౌశిక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆల్రెడీ ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్ల రూ΄ాయల వసూళ్లను రాబట్టిందని బాలీవుడ్ సమాచారం. -
Stree 2: రూ.50 కోట్ల బడ్జెట్.. రూ. 500 కోట్ల కలెక్షన్స్!
కంటెంట్ ఈజ్ కింగ్.. ఇప్పుడు ఇండియన్ చిత్ర పరిశ్రమలో వినిపిస్తున్న మాట ఇది. ఒకప్పుడు హీరోహీరోయిన్లను చూసి ప్రేక్షకులు సినిమా థియేటర్‌కి వెళ్లేవారు..కానీ ఇప్పుడు కథను నమ్మి వెళ్తున్నారు. కథ నచ్చితే హీరోహీరోయిన్లు ఎవరనేది పట్టించుకోకుండా సినిమాను హిట్ చేస్తున్నారు. స్త్రీ 2 చిత్రం ఆ కోవలోకి చెందినదే. బడా హీరోలెవరు ఈ చిత్రంలో లేరు. కానీ ఆ హీరోల సినిమాలకు మించిన కలెక్షన్స్‌ని రాబడుతోంది. కేవలం రూ.50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. రూ. 500 కోట్లకు పైగా వసూళ్లను సాధించి హిస్టరీ క్రియేట్ చేస్తోంది.ఊహించని విజయంశ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన స్త్రీ 2 చిత్రం ఆగస్ట్ 15న విడుదలైంది. రిలీజ్‌కి ముందు వరకు ఈ సినిమాపై పెద్దగా అంచనాల్లేవు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ..ఈ స్థాయి విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. తొలి రోజు ఈచిత్రానికి రూ. 51 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఓ చిన్న చిత్రానికి ఈ మధ్యకాలంలో ఈ స్థాయి ఓపెనింగ్స్ రాలేదు. రిలీజ్ రోజే హిట్ టాక్ రావడంతో సినిమా కలెక్షన్స్ అమాంతం పెరిగిపోయాయి. మూడో వారంలోనూ ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించింది. మొత్తంగా ఇప్పటి వరకు రూ. 509 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది.స్త్రీ 2 కథేంటంటే..2018 లో రిలీజై భారీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన హారర్ థ్రిల్లర్ స్త్రీ చిత్రానికి సీక్వెల్ ఇది. పార్ట్ 1లో స్త్రీ పీడా విరిగిపోయిందని చండేరీ ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. అయితే అప్పుడే సర్ ఖటా అనే విచిత్రమైన దెయ్యం ఒకటి ఊర్లోని అమ్మాయిలను మాయం చేయడం ప్రారంభిస్తుంది. అలా ఓ సారి విక్కీ (రాజ్ కుమార్ రావు) స్నేహితుడి ప్రియురాలిని సర్ ఖటా మాయం చేస్తుంది. దీంతో నలుగురు స్నేహితులు(రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్ శక్తి ఖురానా) కలిసి స్త్రీ(శ్రద్ధా కపూర్) సహాయం కోరతారు. విచిత్రమైన దెయ్యం సర్ ఖటా నుంచి చండేరీ ప్రజలను ‘స్త్రీ’ గ్యాంగ్ ఎలా రక్షించింది అనేది ఈ సినిమా స్టోరీ.#Stree2 is rock-steady at the #BO, firmly holding its ground on a working day [third Mon]... Mass circuits - particularly non-national chains + single screens at Tier-2 and Tier-3 centres - are driving its biz... Expected to enjoy a smooth, uninterrupted run right till #Dussehra.… pic.twitter.com/AdUGp3v4Ff— taran adarsh (@taran_adarsh) September 3, 2024 -
పుష్ప 2లో మిల్కీ ఎంట్రీ ...
-
బాహుబలిని దాటేసిన చిన్న సినిమా.. జవాన్‌పై గురి!
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన హారర్ కామెడీ చిత్రం స్త్రీ-2. ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టిన ఈ మూవీ మరో మైలురాయిని దాటేసింది. బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. అంతే కాకుండా టాలీవుడ్ మూవీ బాహుబలి ది బిగినింగ్ దేశవ్యాప్తంగా సాధించిన నెట్ వసూళ్లను అధిగమించింది.'స్త్రీ 2' రిలీజైన రెండువారాల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ.424 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. గతంలో రాజమౌళి చిత్రం 'బాహుబలి: ది బిగినింగ్' దేశీయంగా రూ. 421 కోట్లు నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కేవలం కంటెంట్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ని మళ్లీ థియేటర్లకు రప్పించడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.ఇదే జోరు కొనసాగితే మరిన్ని రికార్డులు బద్దలు కొట్టేలా కనిపిస్తోంది స్త్రీ-2. బాలీవుడ్లో 'గదర్ 2' (రూ. 525.7 కోట్లు), 'పఠాన్' (రూ. 543.09 కోట్లు), 'యానిమల్' (రూ. 553.87 కోట్లు) లైఫ్ టైమ్ వసూళ్లను అధిగమించే లక్ష్యంతో దూసుకెళ్తోంది. మూడో వారాంతం నాటికి ఇండియాలో రూ. 500 కోట్ల నికర స్థాయిని అధిగమిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. అయితే షారూఖ్ ఖాన్ చిత్రం జవాన్ సాధించిన రూ.640 కోట్ల నికర వసూళ్లను అధిగమించడం స్త్రీ-2 చిత్రానికి సవాల్‌గా మారనుంది. బాక్సాఫీస్ వద్ద ప్రస్తుత జోరు చూస్తుంటే స్త్రీ 2'కి ఏదైనా సాధ్యమే అనిపిస్తోంది. -
బాక్సాఫీస్ వద్ద అదే జోరు.. కేజీఎఫ్-2 రికార్డ్ బద్దలయ్యే ఛాన్స్!
శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రల్లో వచ్చిన హారర్ కామెడీ చిత్రం స్త్రీ-2. ఆగస్టు 15న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ సినిమా రిలీజై 12 రోజులైనప్పటికీ కలెక్షన్స్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.589 కోట్ల గ్రాస్ వసూళ్ల సాధించింది. కేవలం ఇండియాలోనే రూ.498 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. రూ.422 కోట్ల నెట్ వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఏకంగా రూ.20.2 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.విడుదలైన రెండోవారం మొదలైన స్త్రీ-2 చిత్రానికి థియేటర్లలో ఆదరణ దక్కించుకుంటోంది. హిందీ బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్-2 సాధించిన వసూళ్ల కంటే కేవలం 12 కోట్లు మాత్రమే వెనుకబడి ఉంది. ఇదే జోరు కొనసాగితే కొద్ది రోజుల్లోనే ఆ రికార్డ్‌ను బద్దలు కొట్టనుంది. ఈ చిత్రం త్వరలోనే అత్యధిక వసూళ్లు చేసిన ఆరో భారతీయ చిత్రంగా నిలవనుంది. మూడో వారాంతం నాటికి రూ.500 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబడుతుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో అపర్శక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలు పోషించారు. ఈ వారంలోనూ బాలీవుడ్లో పెద్ద సినిమాల రిలీజ్ లేకపోవడంతో స్త్రీ-2 ప్రభంజనం కొనసాగించే అవకాశముంది. ఆగస్ట్ 30న శుక్రవారం బీటౌన్‌లో బిగ్ స్టార్స్ చిత్రాలు ఏవీ రావడం లేదు. ఇది కూడా ఈ చిత్రానికి వసూళ్లుపరంగా కలిసి రానుంది. View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) -
తగ్గేదేలే.. దంగల్, అవతార్-2ను వెనక్కినెట్టిన స్త్రీ-2!
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటించిన చిత్రం స్త్రీ-2. ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ మూవీ విడుదలైన 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.560 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ దెబ్బతో బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమా రికార్డులను బద్దలు కొట్టింది. దేశవ్యాప్తంగా రూ.474 గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. రూ.402 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది.అమర్ కౌశిక్ దర్శకత్వంలో హారర్ కామెడీగా వచ్చిన స్త్రీ-2 రెండో వారాంతంలో అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఇండియావ్యాప్తంగా 'ఎవెంజర్స్: ఎండ్‌గేమ్' (రూ. 373.05 కోట్లు), 'జైలర్' (రూ. 348.55 కోట్లు), 'సంజు' (రూ. 342.57 కోట్లు), 'దంగల్' (రూ. 387.38 కోట్లు), 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' (రూ. 391.4 కోట్లు) చిత్రాలను అధిగమించింది.ఇదే జోరు కొనసాగితే త్వరలోనే సలార్ పార్ట్-1(రూ. 406.45 కోట్లు), 'బాహుబలి: ది బిగినింగ్' (రూ. 421 కోట్లు), '2.0' (రూ. 407.05 కోట్లు) వసూళ్లను దాటేయనుంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 'గదర్ 2' (రూ. 525.7 కోట్లు), 'పఠాన్' (రూ. 543.09 కోట్లు), 'యానిమల్' (రూ. 553.87 కోట్లు) చిత్రాల నెట్ కలెక్షన్స్‌ను అధిగమించే అవకాశముంది. కాగా.. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అపరశక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ, వరుణ్ ధావన్ కీలక పాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor)