దాన్ని కాపీ కొట్టిన స్త్రీ 2.. దర్శకుడి రియాక్షన్‌ ఇదే! | Stree 2 Director Amar Kaushik Responds To Poster Similarities With Stranger Things | Sakshi
Sakshi News home page

రూ.650 కోట్లు కొల్లగొట్టిన స్త్రీ 2.. దాన్ని కాపీ కొట్టడం అవసరమా? డైరెక్టర్‌ ఏమన్నారంటే?

Published Sat, Sep 7 2024 5:08 PM | Last Updated on Sat, Sep 7 2024 8:06 PM

Stree 2 Director Amar Kaushik Responds To Poster Similarities With Stranger Things

ఇటీవలికాలంలో బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించిన మూవీ స్త్రీ 2. రాజ్‌కుమార్‌ రావు, శ్రద్ధా కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ కేవలం నాలుగున్నర కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. సెప్టెంబర్‌ 13న విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.621 కోట్లకు పైగా రాబట్టింది. 

హాలీవుడ్‌ సిరీస్‌తో పోలిక
థియేటర్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతున్న ఈ సినిమా దూకుడు చూస్తుంటే రూ.750 కోట్లను సైతం అవలీలగా అందుకునేట్లు కనిపిస్తోంది. ఇకపోతే ఎప్పటికప్పుడు ఈ మూవీ కొత్త పోస్టర్లను సోషల్‌ మీడియాలో వదులుతున్నారు. ఈ క్రమంలో ఓ పోస్టర్‌ స్ట్రేంజర్‌ థింగ్స్‌ అనే హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ పోస్టర్‌ను పోలి ఉంది. 

కాపీ పోస్టర్లు అవసరమా‌​?
బాగా హిట్టయిన సినిమాకు ఇలాంటి కాపీ పోస్టర్లు అవసరమా‌​? అని పలువురూ అభిప్రాయపడ్డారు. ఈ వివాదంపై దర్శకుడు అమర్‌ కౌశిక్‌ స్పందించాడు. మా సినిమా పోస్టర్‌ స్ట్రేంజర్‌ థింగ్స్‌ను గుర్తు చేస్తుందని అనుకోలేదు. డిజైనర్‌ తయారు చేసిన పోస్టర్‌ చూశాం, నచ్చిందని రిలీజ్‌ చేశాం. 

ప్రేక్షకులు తెలివైనవారు
ఆ తర్వాత అది స్ట్రేంజర్‌ థింగ్స్‌ పోస్టర్‌కు దగ్గరగగా ఉందని గుర్తించాం. మా కంటే ప్రేక్షకులు బాగా తెలివైనవారని తెలుసు.​ ఇలాంటివి వాళ్లే ఈజీగా క్యాచ్‌ చేస్తారు. కానీ మేము కాపీ కొట్టాలన్న ఉద్దేశంతో ఆ పని చేయలేదు. అది అనుకోకుండా జరిగిపోయింది. ముందే తెలిసుంటే ఇది జరగకుండా జాగ్రత్తపడేవాళ్లం అని చెప్పుకొచ్చాడు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement