ప్రముఖ బాలీవుడ్ నటుడు కిడ్నాప్‌కు గురయ్యారు. వెల్ కమ్, స్త్రీ-2 చిత్రాలతో మెప్పించిన ముస్తాక్ ఖాన్‌ను కొంతమంది దుండగులు అపహరించారు. అతన్ని దాదాపు 12 గంటల పాటు చిత్రహింసలకు గురి చేసినట్లు తెలుస్తోంది. విడిచిపెట్టేందుకు రూ. కోటి డిమాండ్ చేసినట్లు సమాచారం. ముస్తాక్ ఖాన్‌ను ఈవెంట్‌కు రమ్మని కిడ్నాప్ చేశారని ఆయన సన్నిహితుడు శివమ్ యాదవ్ తెలిపారు.
అయితే ఈవెంట్‌కు హాజరయ్యేందుకు ముస్తాక్‌కు అడ్వాన్స్ ఇచ్చారని.. విమాన టిక్కెట్లు పంపించారని శివమ్ యాదవ్ వెల్లడించారు. కిడ్నాప్ చేసిన దండగులు ముస్తాక్, అతని కుమారుడి ఖాతాల నుంచి రూ.2 లక్షలు కాజేశారని తెలిపారు. కానీ చివరికీ వారి నుంచి తప్పించుకున్న ముస్తాక్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. ఇటీవల కమెడియన్ సునీల్ పాల్‌కు సైతం ఇదే తరహాలో కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముస్తాక్ బాగానే ఉన్నారని.. కొద్ది రోజుల్లోనే మీడియాతో అన్ని విషయాలు వివరిస్తారని కుటుంబ సభ్యలు వెల్లడించారు. ఈవెంట్ పేరుతో సెలబ్రిటీలను కిడ్నాప్ చేయడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment