Kidnap
-
నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నాప్ కలకలం
-
తునిలో బాలుడి కిడ్నాప్ కలకలం
సాక్షి,కాకినాడజిల్లా:తునిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. స్థానిక భాష్యం స్కూల్లో దాడిశెట్టి పరమేష్(6) అనే బాలుడు ఒకటో తరగతి చదువుతున్నాడు. ఉదయం పరమేష్‌ను తండ్రి సురేష్ స్కూల్లో వదిలిపెట్టాడు. ఉదయం 10:30 గంటలకు పరమేష్‌కు టానిక్ పట్టించాలని చెప్పిన ఆగంతకుడు స్కూల్ నుండి బైక్‌పై తీసుకువెళ్లాడు.మధ్యాహ్నం పేరేంట్స్ పరమేష్‌కు లంచ్ బాక్స్ తేవడంతో అసలు విషయం బయటపడింది. స్కూల్లో బాబు లేకపోవడంతో తల్లిదండ్రులు అవాక్కయ్యారు. వెంటనే బాలుడు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.బాలుడి ఆచూకీ కోసం పోలీసులు, బంధువులు గాలిస్తున్నారు. -
మమ్మల్ని కిడ్నాప్ చేసి ఏం చేశారంటే.. సంచలన విషయాలు బయటపెట్టిన కార్పొరేటర్లు..
-
కిడ్నాప్ చేసిన కౌన్సిలర్లు ను విడిచిపెట్టకపోతే టీడీపీ కుట్రపై కాసు మహేష్ రెడ్డి ఫైర్
-
తిరుపతిలో టీడీపీ గూండాల అరాచకం
-
తిరుపతిలో హైటెన్షన్.. పోలీసుల ముందే వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల కిడ్నాప్
-
5 ఏళ్ల బాలుడి కిడ్నాప్
-
సాక్షి కథనంపై కూటమి కుట్రలు పోలీసులే కిడ్నాపర్లు!
-
భూ వివాదంలో మునీర్ అనే టీచర్ ను కిడ్నాప్ చేసిన పోలీసులు
-
శ్రీకాకుళం జిల్లాలో YSRCP కార్యకర్తల కిడ్నాప్ కలకలం
-
అర్ధరాత్రి వైఎస్సార్సీపీ కార్యకర్తల కిడ్నాప్.. వారిద్దరూ ఎక్కడ?
సాక్షి, శ్రీకాకుళం: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలను కూటమి సర్కార్ టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్తల కిడ్నాప్ కలకలం సృష్టించింది.శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు కిడ్నాప్‌నకు గురయ్యారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అర్థరాత్రి పార్టీ కార్యకర్తలను తీసుకెళ్లారు. పోలీసు యూనిఫామ్‌లో వచ్చిన కొందరు దుండగులు కూర్మపు ధర్మారావు, అంపోలు శ్రీనివాస్‌ను కిడ్నాప్ చేశారు. ఈ ఘటనపై వారి కుటుంబ సభ్యులు కాశీబుగ్గ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఈ కిడ్నాప్ విషయంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు తెలియడంతో ఆయన కార్యకర్తల కుటుంబాల వద్దకు చేరుకున్నారు. అనంతరం, పోలీసు స్టేషన్ ముందు అప్పలరాజు నిరసనకు దిగారు. ఈ సందర్బంగా పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసుల పేరుతో తీసుకెళ్లిన వైఎస్సార్సీపీ కార్యకర్తలను వెంటనే తీసుకు రావాలని డిమాండ్ చేశారు. వారు ఎక్కడున్నారో చెప్పాలన్నారు. ఈ క్రమంలో అప్పలరాజు, పోలీసుల మధ్య వాగ్వాదం జరగడంతో ఆయన అక్కడే కూర్చుని నిరసనలు తెలిపారు. -
ప్రముఖ నటుడి అపహరణ.. రూ. కోటి డిమాండ్!
ప్రముఖ బాలీవుడ్ నటుడు కిడ్నాప్‌కు గురయ్యారు. వెల్ కమ్, స్త్రీ-2 చిత్రాలతో మెప్పించిన ముస్తాక్ ఖాన్‌ను కొంతమంది దుండగులు అపహరించారు. అతన్ని దాదాపు 12 గంటల పాటు చిత్రహింసలకు గురి చేసినట్లు తెలుస్తోంది. విడిచిపెట్టేందుకు రూ. కోటి డిమాండ్ చేసినట్లు సమాచారం. ముస్తాక్ ఖాన్‌ను ఈవెంట్‌కు రమ్మని కిడ్నాప్ చేశారని ఆయన సన్నిహితుడు శివమ్ యాదవ్ తెలిపారు.అయితే ఈవెంట్‌కు హాజరయ్యేందుకు ముస్తాక్‌కు అడ్వాన్స్ ఇచ్చారని.. విమాన టిక్కెట్లు పంపించారని శివమ్ యాదవ్ వెల్లడించారు. కిడ్నాప్ చేసిన దండగులు ముస్తాక్, అతని కుమారుడి ఖాతాల నుంచి రూ.2 లక్షలు కాజేశారని తెలిపారు. కానీ చివరికీ వారి నుంచి తప్పించుకున్న ముస్తాక్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. ఇటీవల కమెడియన్ సునీల్ పాల్‌కు సైతం ఇదే తరహాలో కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముస్తాక్ బాగానే ఉన్నారని.. కొద్ది రోజుల్లోనే మీడియాతో అన్ని విషయాలు వివరిస్తారని కుటుంబ సభ్యలు వెల్లడించారు. ఈవెంట్ పేరుతో సెలబ్రిటీలను కిడ్నాప్ చేయడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
షల్ మీడియా యాక్టివిస్ట్ ల పై కొనసాగుతున్న కక్ష సాధింపు
-
'కళ్లకు గంతలు కట్టి, కారులో తోసి.. రూ.20 లక్షలు డిమాండ్ చేశారు'
ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ సునీల్ పాల్ కిడ్నాప్‌కు గురయ్యాడన్న వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే కిడ్నాప్ అయిన కొద్ది గంటలకే అతడిని విడుదల చేయడంతో క్షేమంగా ఇంటికి చేరుకున్నాడని అతడి భార్య తెలిపింది. ఈ విషయంలో పోలీసులను కూడా సంప్రదించినట్లు పేర్కొంది.నిజంగానే కిడ్నాప్..అయితే ఇది పబ్లిసిటీ స్టంట్ అయి ఉండొచ్చని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై కమెడియన్ సునీల్ పాల్ స్పందించాడు. ఇది ప్రాంకో, పబ్లిసిటీ స్టంటో కాదని, తనను నిజంగానే కిడ్నాప్ చేశారని స్పష్టం చేశాడు. తాజా ఇంటర్వ్యూలో సునీల్ పాల్ మాట్లాడుతూ.. అమిత్ అనే వ్యక్తి హరిద్వార్‌లో బర్త్‌డే పార్టీలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం పంపాడు. ఇందుకోసం కాస్త అడ్వాన్స్ కూడా పంపాడు. దీంతో డిసెంబర్ 2న ఢిల్లీకి వెళ్లాను. బర్త్‌డే పార్టీకి వెళ్తుండగా మార్గమధ్యలో స్నాక్స్ తిందామని ఆగారు. రూ.20 లక్షలు డిమాండ్సరిగ్గా అప్పుడే నా అభిమాని అంటూ ఓ వ్యక్తి వచ్చి మాట్లాడుతూ ఓ కారులోకి తోశాడు. బలవంతంగా నన్ను కారులో తీసుకెళ్లారు. కళ్లకు గంతలు కట్టి ఓ బంగ్లాకు తీసుకెళ్లారు. అక్కడ నన్ను చాలారకాలుగా భయపెట్టారు. రూ.20 లక్షలు కావాలని డబ్బు డిమాండ్ చేశారు, నా ఫోన్ కూడా లాక్కున్నారు. నా దగ్గర ఏటీఎమ్ కార్డు లేదని చెప్పడంతో వారు బేరాలు మొదలుపెట్టారు. నా ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసుకోవచ్చని చెప్పారు.ఖర్చుల కోసం రూ.20 వేలిచ్చారుఅలా రూ.7.5 లక్షలు సమకూర్చాను. దీంతో వాళ్లు మరుసటి రోజు విమాన ప్రయాణ ఖర్చుల కోసం రూ.20 వేలు చేతిలో పెట్టి ఇంటికి పంపించారు. ఈ సంఘటన గురించి ఎవరితోనూ చెప్పకూడదనుకున్నాను. కానీ నా భార్య అప్పటికే పోలీసులను సంప్రదించడంతో నేనూ నోరు విప్పాను. కానీ ఆ కిడ్నాపర్లు నా వ్యక్తిగత విషయాలన్నీ తెలుసుకున్నారు. వణికిపోయా..నా పిల్లలు ఏ స్కూల్లో చదువుతారు? నా తల్లి ఎక్కడ నివసిస్తుంది? ఇలా ప్రతీది అడిగారు. నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలనేది భయంగా ఉంది. ఈ సంఘటనతో నేను వణికిపోయాను. పబ్లిసిటీ కోసం ఇదంతా చేశానంటున్నారు... అదే నిజమైతే మధ్యలో పోలీసులను ఎందుకు లాగుతాను. పైగా నా స్నేహితుల దగ్గర డబ్బు పంపినట్లు సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా నేను ఇంకా బతికే ఉన్నందుకు సంతోషం అని సునీల్ చెప్పుకొచ్చాడు.చదవండి: కమెడియన్ ఆటో రామ్‌ప్రసాద్‌కు యాక్సిడెంట్ -
కిడ్నాప్ కు గురైన నెలరోజుల పసికందు సురక్షితం
-
Manipur: కుకీల అరాచకం!.. ఆరుగురి మృతదేహాలు లభ్యం
ఇంఫాల్: కల్లోల మణిపూర్‌లో పరిస్థితి మళ్లీ అదుపు తప్పుతోంది. జాతుల ఘర్షణతో గతేడాది అట్టుడికిపోయిన ఆ రాష్ట్రంలో మరోసారి హింస పెచ్చరిల్లుతోంది. ఈ క్రమంలో జిరిబామ్‌లో సోమవారం కుకీ ఉగ్రవాదులు మైతీ వర్గానికి ఓ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన విషయం విదితమే. కిడ్నాప్‌కు గురైన ఆరుగురి మృతదేహాలను పోలీసులు తాజాగా గుర్తించారు. వీరిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. బందీలుగా చేసిన అయిదు రోజులకు మృతదేహాలను గుర్తించిన పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం సిల్చార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.ముందుగా శుక్రవారం సాయంత్రం అస్సాం-మణిపూర్ సరిహద్దులోని జిరి నదిలో తేలుతూ ముగ్గురు మహిళల మృతుదేహాలు లభ్యమవ్వగా.. నేడు మరో ముగ్గురి మృతదేహాలు దొరికాయి. మృతదేహాలు కొంత కుళ్లిపోవడంతో ఉబ్బిపోయాయని, అందరూ మైతీ వర్గానికి చెందిన వారుగా పోలీసులు తెలిపారు.కాగా జిరిబామ్ జిల్లాలోని బోకోబెరాలో కుకీ ఉగ్రవాదులు సోమవారం (నవంబర్ 11న) భద్రతా బలగాలపై కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. బోకోబెరా పోలీస్ స్టేషన్, దానికి దగ్గరలోని సిఆర్పిఎఫ్ పోస్ట్‌పై సాయుధ కుకీలు హింసాత్మక దాడికి పాల్పడ్డారు. ఈ ఎన్కౌంటర్లో అనుమానిత కుకీ ఉగ్రవాదుల్లో పది మందిని పోలీసులు కాల్చిచంపారు. ఆ దాడి తర్వాత ఆ ప్రాంతంలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు కనిపించడం లేదు. వీరిని కుకీలు కిడ్నాప్ చేశారు. -
వైఎస్సార్సీపీ నేత కుటుంబం కిడ్నాప్ కలకలం
రామకుప్పం: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలంలో గురువారం అర్ధరాత్రి వైఎస్సార్సీపీ నేత గోవిందప్ప కుటుంబాన్ని కిడ్నాప్ చేయడం కలకలం సృష్టించింది. కిడ్నాపర్ల నుంచి వారిని పోలీసులు రక్షించారు. ఆ సమయంలో కిడ్నాపర్లు పరారయ్యారు. బాధితుల కథనం మేరకు.. మండలంలోని పెద్దకురబలపల్లిలోని వైఎస్సార్సీపీకి చెందిన మాజీ సర్పంచ్ గోవిందప్ప కుటుంబాన్ని గురువారం రాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.మూడు లగ్జరీ కార్లలో వచ్చిన ఆగంతకులు గన్లతో బెదిరించి గోవిందప్ప కుటుంబసభ్యుల్ని కారుల్లో ఎక్కించుకున్నారు. గోవిందప్ప, గంగమ్మ, మాధవమ్మ, సుబ్బక్క, సిద్ధప్ప, సోమశేఖర్, పునీత్‌లను కారుల్లో ఎక్కించుకుని రామకుప్పం వైపు బయలుదేరారు. తాము ఆదాయపన్ను అధికారులమని, మీ దగ్గర ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఫిర్యాదు అందిందని గోవిందప్పకు చెప్పారు. మీవద్ద దాచిన నగదు ఇస్తే పంచుకుని వదిలేస్తామని ఆఫర్ ఇచ్చారు. విజలాపురం సమీపంలో గోవిందప్ప తమ్ముడు జయరఘురాం కోసం వాకబు చేశారు. తన తమ్ముడు ఇంటివద్దే ఉన్నట్లు గోవిందప్ప చెప్పడంతో మళ్లీ పెద్దకురబలపల్లి వెళ్లారు. అక్కడ జయరఘురాం లేకపోవడంతో కార్లను రామకుప్పం వైపు తీసుకెళ్లారు. రామకుప్పంలోని వైఎస్సార్ సర్కిల్లో బీట్ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుళ్లను గమనించిన ఆగంతకులు కుటుంబం మొత్తాన్ని ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు పోలీసులకు చెప్పాలని బాధితులను బెదిరించారు. ముందు రెండు కార్లను ఆపిన పోలీసులకు బాధితులు ఆవిధంగానే చెప్పారు. అయినా అనుమానించిన పోలీసులు అందరినీ కిందికి దించి ప్రశ్నించసాగారు. ఈ నేపథ్యంలో ఆ రెండు కార్లలోని కిడ్నాపర్లు పరారయ్యారు. ఆ సమయంలో వెనుక ఉన్న మూడోకారు వేగంగా ముందుకెళ్లిపోయింది. ఆ కారులో ఉన్న బాధితులు ఇద్దరిని రెండు కిలోమీటర్ల తరువాత కిడ్నాపర్లు వదిలేసి వెళ్లిపోయారు. చేతులు మారిన నగదే కారణమా? ప్రశాంతంగా ఉన్న రామకుప్పం మండలంలో కిడ్నాప్ అంశం ప్రజల్లో తీవ్రచర్చకు దారితీసింది. రైస్‌పుల్లింగ్ పేరిట కోట్లాది రూపాయలు చేతులు మారాయని అందులో భాగంగానే ఈ కిడ్నాప్ జరిగిందన్న చర్చలు సాగుతున్నాయి. దుండగులు కర్ణాటకకు చెందిన వారని తెలిసింది. పోలీసులు మాట్లాడుతుండగానే దుండగులు పరారవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతటివారైనా వదిలిపెట్టం: కుప్పం సీఐ మాజీ సర్పంచ్ గోవిందప్ప కుటుంబం కిడ్నాప్‌ను తీవ్రంగా పరిగణిస్తున్నామని కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ తెలిపారు. అందులో భాగంగా గోవిందప్ప తమ్ముడు జయరఘురాంను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. నగదు లావాదేవీలు, నగదు మార్పిడి కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కుప్పంలో హైడ్రామా !
-
కాకినాడ జిల్లా పెద్దాపురంలో మైనర్ బాలిక కిడ్నాప్
-
బాలకృష్ణ ఇలాకాలో మద్యం షాపు దక్కించుకున్న వ్యక్తి కిడ్నాప్
-
OTT: హాలీవుడ్ మూవీ ‘కిడ్నాప్’ రివ్యూ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘కిడ్నాప్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ప్రపంచంలో తల్లి ప్రేమకు సాటి ఏదీ లేదని అంటారు. తన బిడ్డకు ఆపద వస్తే తన ప్రాణాన్ని పణంగా పెట్టైనా పోరాడే తత్వం తల్లిది అన్న విషయాన్ని సూటిగా చూపించిన ఆంగ్ల చిత్రం ‘కిడ్నాప్’. 2017లో లూయి ప్రీటో దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. హాలీవుడ్ ప్రముఖ కథానాయిక హేలీ బెర్రీ ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (ఇంగ్లిష్), లయన్స్ గేట్ (తెలుగు వెర్షన్) ఓటీటీల్లో స్ట్రీమ్ అవుతోంది. తల్లిగా ఆమె నటన ఈ సినిమా మొత్తానికే హైలైట్. కథాంశానికొస్తే... కార్లా డైసన్ ఓ సింగిల్ మదర్. తన ఆరేళ్ల కొడుకు ఫ్రాంకీని కార్నివాల్‌కు తీసుకువెళ్ళడంతో ‘కిడ్నాప్’ సినిమా మొదలవుతుంది. కార్నివాల్లో అనుకోకుండా పార్కింగ్ లాట్ నుండి తన కొడుకును ఎవరో ఎత్తుకెళ్లడం చూస్తుంది కార్లా. ఇక అక్కడి నుండి ఆ కిడ్నాపర్ల వెంటపడి తన కొడుకును ఎలా కాపాడుకుంటుంది అన్నదే మిగతా కథ. ఈ సినిమా స్క్రీన్‌ప్లే దాదాపు రోడ్డు మార్గానే నడుస్తుంది. అమెరికా రోడ్లలో పరిమితికి మించి వేగంగా కొంతమంది కార్లు నడుపుతూ ఉంటారు. అంతకు మించి వేగంగా ఈ కథ స్క్రీన్‌ప్లే ఉంటుంది. కుర్చీలో కూర్చున్న ప్రేక్షకులు ఈ సినిమా మొదలయ్యాక శుభం కార్డు పడే వరకు లేవరు. సినిమాను అంత ఆసక్తికరంగా దర్శకుడు లూయీ రూపొందించారనడంలో అతిశయోక్తి లేదు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తీశారు. ప్రఖ్యాత సంస్థ అయిన ఎఫ్‌బీఐ ఇచ్చిన అంచనాల మేరకు అమెరికాలో ఏటా 8 లక్షలకు పైబడి ప్రతి 40 సెకన్లకు ఓ బిడ్డ కనిపించకుండాపోతున్న పరిస్థితి ఉంది. మనందరినీ మనకి తెలిసీ తెలియకుండా నిరంతరం కాపాడే అమ్మ ఆ విజయదుర్గ. ఆ తల్లి తత్వంతో తీసిన ఈ సినిమా నిజంగా అద్భుతం. విజయదశమి పండగ సమయంలో థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే వాళ్లకి ఇదో మంచి చాయిస్.– ఇంటూరు హరికృష్ణ -
జేసీ వర్గీయుల దాష్టీకం..లిక్కర్ షాపు కోసం కిడ్నాపులు
సాక్షి,అనంతపురం: ఏపీలో లిక్కర్ షాపుల కోసం టీడీపీ నేతల దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. సిండికేట్లుగా ఏర్పడి మద్యం షాపులను చేజిక్కించుకునేందుకు పచ్చనేతలు అక్రమాలకు తెర తీశారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ సీనియర్‌నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు ఏకంగా కిడ్నాప్‌లు చేసేందుకు తెగబడ్డారు. మద్యం దుకాణానికి దరఖాస్తు చేశాడన్న కోపంతో యాడికిలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ రామ్మోహన్‌ను జేసీ వర్గీయులు కిడ్నాప్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు జేసీ వర్గీయుల చెర నుంచి ఎంపీటీసీ రామ్మోహన్‌ను విడిపించారు. టీడీపీ నేతల దాష్టీకంపై యాడికి వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కాగా, ఏపీలో వైఎస్సార్సీపీ హయాంలో ఉన్న పాత మద్యం పాలసీని రద్దు చేసి కూటమి ప్రభుత్వం ఏపీలో కొత మద్యం పాలసీని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా మద్యంషాపులను ప్రైవేటు వారికి అప్పగించేందుకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ షాపులన్నీ ఎలాగోలా సిండికేట్లుగా మారి దక్కించుకోవాలని టీడీపీ నేతలు శతవిధాలా ప్రయత్నిస్తుండడం గమనార్హం.ఇదీ చదవండి: కమీషన్లు..ముడుపులు.. దారి తప్పిన టీడీపీ -
రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఇద్దరు జవాన్ల కిడ్నాప్, ఒకరు మృతి
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా ఇద్దరు ఆర్మీ జవాన్లను కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. అనంత్‌నాగ్ జిల్లాలో ఇద్దరు ఆర్మీ జవాన్లు కిడ్నాప్‌కు గురయ్యారు. కాకర్‌నాగ్ ప్రాంతం టెరిటోరియల్‌లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు జవాన్లను ఉగ్రవాదులు ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదుల చెర నుంచి ఒక జవాన్ తప్పించుకుని బయటపడగా.. ఇంకో జవాన్ వారి చేతులో చిక్కుకుపోయాడు.ఈ విషయం తెలుసుకున్న భారత సైన్యం.. ఆ ప్రాంతంలో భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. గాయపడిన జవాన్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మిస్ అయిన మరో జవాన్.. కొన్ని గంటలకే కోకెర్నాగ్లోని అటవీ ప్రాంతంలో మృతదేహం లభ్యమైంది. చనిపోయిన సైనికుడి శరీరంలోకి బుల్లెట్ దూసుకెళ్లినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి.మృతుడిని అనంత్‌నాగ్‌లోని ముక్ధంపోరా నౌగామ్‌కు చెందిన హిలాల్ అహ్మద్ భట్‌గా అధికారులు గుర్తించారు. గాయపడిన జవాన్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఆ ప్రాంతం మొత్తాన్ని జల్లెడ పడుతున్నారు. ఇటీవలె జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగా.. ఆ ఫలితాలు వెల్లడైన ఒక రోజు ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం -
కిడ్నాపైన సీఐ తల్లి దారుణహత్య
సాక్షి రాయచోటి/మదనపల్లె: పది రోజుల క్రితం కిడ్నాపైన ధర్మవరం సీఐ నాగేంద్రప్రసాద్ తల్లి స్వర్ణకుమారి దారుణ హత్యకు గురయ్యారు. ఎదురింట్లో ఉంటున్న వెంకటేష్ అనే యువకుడు పూజల పేరుతో ఆమెను బయటకు తీసుకెళ్లి.. తన స్నేహితుడు, అతని తల్లితో కలిసి స్వర్ణకుమారిని అంతమొందించాడు. ఉద్యోగానికి సెలవుపెట్టి మరీ తల్లి ఆచూకీ కోసం «ధర్మవరం సీఐ నాగేంద్రప్రసాద్ వెతికినా ఆయన కష్టం వృథా అయింది. తల్లి క్షేమంగానే ఉంటుందనుకున్న ఆశలు చివరకు అడియాశలయ్యాయి. తల్లి కేసును తానే విచారణ చేపట్టడంతో ఆమె హత్యకు గురైనట్టు నిర్ధారణ అయ్యింది. పోలీసు అధికారి తల్లికే దిక్కులేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మొన్న ముచ్చుమర్రిలో వాసంతి హత్య.. నిన్న పుంగనూరులో ముస్లిం బాలిక అంజుమ్ హత్యోదంతం, ఇప్పుడు సీఐ తల్లి హత్య ఘటనలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయికి దిగజారాయో స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఓ పోలీసు అధికారి తల్లిని దారుణంగా హతమార్చినా దిక్కులేకుండాపోయింది. ప్రత్యర్థులపై కక్షసాధింపు కోసమే అన్నట్లుగా రాష్ట్రంలో సాగుతున్న రెడ్‌బుక్ పాలనలో బాలికలు, మహిళల భద్రతకు కనీస చర్యలు కూడా చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కుమారుడిపైనే ఆశలన్నీ పెట్టుకుని..అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం మేడికుర్తికి చెందిన స్వర్ణకుమారి భర్త శ్రీరాములుతో 30 ఏళ్ల క్రితమే విడిపోయారు. ఒక్కగానొక్క కుమారుడు నాగేంద్రప్రసాద్‌ను చదివించి, ప్రయోజకుడిని చేసేందుకు మదనపల్లెకు వలస వచ్చి దేవళం వీధిలో కాపురం ఉండేవారు. నాగేంద్రప్రసాద్ చదువుతోపాటు హాకీ క్రీడాకారుడిగా ప్రతిభ కనపరిచి స్పోర్ట్స్ కోటాలో పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించారు. కుమారుడు ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉండాల్సి వచ్చినప్పటికీ, తల్లి స్వర్ణకుమారి మదనపల్లెలోనే ఉండేవారు. 2009లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వైఎస్సార్ కాలనీలో ఇల్లు మంజూరు కావడంతో సొంత ఇల్లు నిర్మించుకుని అక్కడకు వెళ్లారు. ఈ క్రమంలో ఎదురింట్లో ఉంటున్న సొంతూరికే చెందిన యల్లమ్మతో ఆమె స్నేహంగా ఉండేవారు. యల్లమ్మ, సురేంద్ర దంపతుల కుమారుడైన నిందితుడు వెంకటేష్ మదనపల్లెలో డిగ్రీ వరకు చదువుకుని, బెంగళూరు వెళ్లి కాల్‌టాక్సీ డ్రైవర్‌గా, జొమాటో బాయ్‌గా పనిచేసేవాడు. నెల రోజుల క్రితం బెంగళూరు నుంచి మదనపల్లె వచ్చిన వెంకటేష్ తల్లిదండ్రులతోనే ఉంటున్నాడు. పూజల పేరుతో.. స్వర్ణకుమారికి భక్తి ఎక్కువ. ఈ విషయం తెలుసుకున్న వెంకటేష్ తన స్నేహితుడి ఇంటికి కాశీ నుంచి స్వామీజీ వస్తున్నారని, ఆయన మంత్రిస్తే మంచి జరుగుతుందని స్వర్ణకుమారిని నమ్మించాడు. స్వామీజీ గురించి గొప్పలు చెబుతూ అక్కడకు వెళదాం రమ్మని ఆహ్వానించాడు. స్వామీజీ వద్దకు వెళితే మంచి జరుగుతుందని నమ్మిన స్వర్ణకుమారి గతనెల 28న నిందితుడు వెంకటేష్‌తో వెళ్లారు. ముందస్తు పథకం ప్రకారం వెంకటేష్ పట్టణంలోని గజ్జెలకుంట సాయిరాం వీధిలో ఉంటున్న స్నేహితుడు అనిల్ ఇంటికి స్వర్ణకుమారిని తీసుకెళ్లాడు. స్వామీజీ అక్కడికే వస్తున్నాడని నమ్మించి.. ఆమెతో పూజా కార్యక్రమాలు చేయించాడు. తీర్థం తీసుకునేందుకు ఆమె తలవంచగానే వెనుక నుంచి సుత్తితో తలపై మోదాడు. వెంటనే స్నేహితుడు అనిల్, అతడి తల్లి రమాదేవితో కలిసి స్వర్ణకుమారి ప్రాణం తీశాడు. అనంతరం స్వర్ణకుమారి వంటిపై నగలు తీసుకుని, మృతదేహాన్ని గోనె సంచిలో దాచారు. మృతదేహానికి అనిల్ తల్లి రమాదేవిని కాపలాగా ఉంచి వెంకటేష్, అనిల్ బయటకు వచ్చారు. నగలను తీసుకెళ్లి ఓ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టి రూ.4 లక్షలు తీసుకున్నారు.శవంపైనే స్వర్ణకుమారి మృతదేహాన్ని పూడ్చి..అదే రోజు రాత్రి కారు అద్దెకు తీసుకుని గోనె సంచిలో ఉంచిన స్వర్ణకుమారి మృతదేహాన్ని పూడ్చేందుకు పోతబోలువైపు వెళ్లారు. అక్కడ ఖననం చేసేందుకు ప్రయత్నించగా.. స్థానికులు చేతబడి పూజలకు ఎవరో వచ్చారని కేకలు పెట్టడంతో అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం అయోధ్య నగర్‌లోని శ్మశానానికి చేరుకున్నారు. ఇటీవల ఓ మృతదేహాన్ని ఖననం చేసిన స్థలాన్ని ఎంచుకుని నాలుగు అడుగుల మేర తవ్వి స్వర్ణకుమారి మృతదేహం ఉన్న గోనె సంచిని పాత శవంపైనే ఉంచి పూడ్చేశారు. నగలు కుదువపెట్టగా వచ్చిన సొమ్ములో సగం అనిల్‌కు ఇచ్చి రూ.లక్షను తన అకౌంట్లో ఉంచి, మరో రూ.లక్షను ఇంట్లో ఉంచాడు. పెన్షన్ తీసుకునేందుకు రాకపోవడంతో..ఇంటినుంచి వెళ్లిన స్వర్ణకుమారి రెండు రోజులైనా ఇంటికి రాకపోవడం, 1వ తేదీన పెన్షన్ తీసుకునేందుకు అందుబాటులో లేకపోవడంతో స్థానికులు ఆమె కుమారుడు సీఐ నాగేంద్రప్రసాద్‌కు సమాచారం అందించారు. ఆయన తల్లి ఫోన్‌కు చేయగా, కాల్ ఫార్వర్డ్ మెసేజ్ రావడంతో అనుమానంతో నాగేంద్రప్రసాద్ మదనపల్లె వచ్చారు. అక్టోబర్ 2న తాలూకా పోలీస్ స్టేషన్లో తన తల్లి కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉండటంతో తల్లి ఆచూకీ కోసం సీఐ నాగేంద్రప్రసాద్ తానే విచారణ చేపట్టారు. స్వర్ణకుమారిని ఇంటినుంచి తీసుకెళ్లిన యువకుడు వెంకటేష్‌ను అనుమానితుడిగా భావించి.. ఇంట్లో తనిఖీలు నిర్వహించగా నగలు కుదువపెట్టిన రసీదులు, బియ్యం డబ్బాలో దాచిన రూ.లక్ష నగదు లభించాయి. నిందితుడు వెంకటేష్ తన ఫోన్ స్విచ్ఆఫ్ చేసి.. ఇంట్లోనే ఉంచేసి రెండు రోజులపాటు హతురాలు స్వర్ణకుమారి ఫోన్ ఉపయోగించాడు. చివరగా ఆ ఫోన్ వినియోగించిన టవర్ లొకేషన్, నిందితుడు వెంకటేష్ ఫోన్లోని కాంటాక్ట్స్ ఆధారంగా అతడి స్నేహితులను విచారిస్తే వెంకటేష్ తరచూ వాడే ఫోన్ నంబర్లు ఇచ్చారు. వాటిపై నిఘా ఉంచగా.. మదనపల్లె, తిరుపతి చివరగా బెంగళూరులో ఒక నంబర్ వినియోగిస్తున్నట్టు గుర్తించారు. ఆ నంబర్‌పై నిఘా పెట్టగా నిందితుడు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేయడంతో దాని ఆధారంగా వెంకటేష్‌ను పట్టుకున్నారు. అతడిని తీసుకొచ్చి తాలూకా పోలీస్ స్టేషన్లో అప్పగించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. హత్య చేసిన వైనాన్ని వివరించాడు. మంగళవారం అధికారుల సమక్షంలో తహసీల్దార్, వైద్యులను తీసుకువచ్చి ఘటనాస్థలంలో పంచనామా నిర్వహించి, మృతదేహానికి పోస్టుమార్టం జరిపించారు. అనంతరం స్వర్ణకుమారి మృతదేహానికి కుటుంబసభ్యులు అదే శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపించారు. స్వర్ణకుమారి కుమారుడు సీఐ కావడం, ఆయనే స్వయంగా దర్యాప్తు చేపట్టడంతో 10 రోజుల అనంతరం ఈ కేసు వెలుగు చూసింది. లేదంటే ఈ కేసులో మిస్టరీ వీడేది కాదు. కాగా.. స్వర్ణకుమారి హత్యకు సహకరించిన రెండో నిందితుడు అనిల్, అతడి తల్లి రమాదేవి ఎక్కడ ఉన్నారో ఇప్పటివరకు పోలీసులు ఆచూకీ కనిపెట్టలేకపోయారు. వారిద్దరూ రేణిగుంట నుంచి విమానంలో రాజస్థాన్ వెళ్లినట్టు తెలిసింది.ఇదీ చదవండి: ఆడ శిశువును విక్రయించిన తల్లి -
AP: ధర్మవరం సీఐ తల్లి కిడ్నాప్
మదనపల్లె/రాయచోటి: ధర్మవరం వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తల్లి స్వర్ణకుమారి(62) మదనపల్లెలో కిడ్నాప్ అయ్యారు. గత నెల 28న ఆమె అదృశ్యమై ంది. 9 రోజులు కావస్తున్నా నేటికీ జాడ కనుక్కోలేని పరిస్థితి చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థమవుతోంది. మదనపల్లె శివారు వైఎస్ జగన్ కాలనీలో సీఐ తల్లి స్వర్ణకుమారి ఒంటరిగా నివసిస్తోంది. సెప్టెంబర్ 28న మధ్యాహ్నం ఆమె స్నేహితురాలు స్వర్ణకుమారికి ఫోన్ చేస్తే కాల్ ఫార్వర్డ్ వాయిస్ వినిపించింది. సాయంత్రమైనా ఆమె ఇంటికి చేరుకోలేదు. ఆమెకు దైవభక్తి అధికం కావడంతో తెలిసిన వారితో కలిసి దూరప్రాంతంలోని గుడికి వెళ్లిందేమోనని స్నేహితురాలు భావించింది.కాగా, అక్టోబర్ 1న పెన్షన్ తీసుకునేందుకు స్వర్ణకుమారి రాకపోవడంతో స్థానికులు ఆ విషయాన్ని కుమారుడైన సీఐ నాగేంద్రప్రసాద్‌కు తెలిపారు. దీంతో ఆయన మదనపల్లెకు చేరుకుని తల్లి ఆచూకీ కోసం విచారించారు. మూడు రోజులైనా ఆచూకీ లభించకపోవడంతో అక్టోబర్ 2న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీఐ కళా వెంకటరమణ అదృశ్యం కేసుగా నమోదుచేసి విచారణ చేపట్టారు. స్వర్ణకుమారి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటం, టవర్ లొకేషన్ ఒక్కో సమయంలో ఒక్కో ప్రాంతాన్ని సూచిస్తుండటంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. స్వర్ణకుమారి అదృశ్యం పట్టణంలో చర్చనీయాంశం కాగా.. ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. వెంకటేశ్ అనే యువకుణ్ణి బెంగళూరులో పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. సీఐ తల్లికే దిక్కులేకపోతే? సీఐ తల్లి అదృశ్యమైతేనే ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని జనం చర్చించుకుంటున్నారు. ముందెన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో చిన్నారులు, మహిళలను కిడ్నాప్ చేసి అంతమొందించడం లాంటి వరుస ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో 9 రోజులైనా సీఐ తల్లి ఆచూకీ తెలియలేదంటే.. ఆమె విషయంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై వరుస అఘాయిత్యాలు భయపెడుతున్నాయి. ఇటీవల కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో వాసంతిని, పుంగనూరులో ముస్లిం బాలిక అంజుమ్‌ను తుదముట్టించిన ఘటనలు శాంతిభద్రతలను ప్రశ్నార్థకంగా మార్చాయి. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం తక్షణమే స్పందించకపోవడంతో బాధితులు శవాలుగా మారిపోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం తనకేమీ పట్టనట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై ప్రజలు మండిపడుతున్నారు. పేపర్లకు ఉన్న విలువ ప్రాణాలకు లేదా?మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో కాగితాలు తగలబడితే చంద్రబాబు రాష్ట్ర డీజీపీని హెలికాప్టర్లో పంపించి దర్యాప్తు చేయించారు. అయితే.. బాలికలు, మహిళలను అపహరించుకుని పోయి అత్యాచారాలు చేస్తున్నా, హత్యలకు తెగబడుతున్నా పట్టించుకోవడంలేదు. -
వారం రోజులూ వదిలేసి హైడ్రామా
సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు జిల్లా పుంగనూరులో చిన్నారి అశ్వియ అంజుమ్ హత్య ఉదంతంపై కూటమి ప్రభుత్వం హైడ్రామాకు తెరతీసింది. అంజుమ్ కిడ్నాప్, ఆపై హత్య ఘటనను వారం రోజులుగా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం... ఆదివారం ఒక్కసారిగా హడావిడి చేసింది. వారంరోజులుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈ కేసులో చిన్న క్లూ కూడా సాధించలేదు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ వస్తున్నారని తెలియడంతో హడావుడిగా ఆదివారం ముగ్గురు మంత్రులు పుంగనూరులో వాలిపోయారు. వస్తూనే.. నిందితులు దొరికినట్లు ప్రకటించేశారు. మదనపల్లి ఆర్డీవో ఆఫీసులో అగ్ని ప్రమాదం జరిగి కొన్ని కాగితాలు తగలబడినట్లు తెలియగానే హుటాహుటిన ప్రత్యేక హెలికాప్టర్లో డీజీపీని, అధికారులను అక్కడికి పంపించి గంట గంటకు సమీక్ష చేసిన∙ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు... పుంగనూరులో చిన్నారి కిడ్నాప్.. ఆపై హత్య ఘటన అంత ప్రాధాన్యత కలిగినదిగా కనిపించలేదు. కనీసం ఈ ఘటన జరిగిన ఎనిమిదో రోజు వరకు∙స్పందించాలని కూడా ఆయనకు అనిపించలేదు. కానీ, మాజీ సీఎం పరామర్శకు వస్తున్నారని తెలియగానే పెద్ద హైడ్రామాకు తెరతీశారు. ఒక్కసారిగా ముగ్గురు మంత్రులను పుంగనూరు పంపారు. బాలిక తండ్రిని ఆయన ఫోన్లో పరామర్శించారు. తమ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటూ నిస్సిగ్గుగా ఈ ఘటనను కూడా తన రాజకీయ స్వార్థానికి ఉపయోగించుకోవాలని ప్రయత్నించారు. బాలిక కిడ్నాప్, హత్య గురించి ప్రశ్నించిన ప్రతిపక్షంపై పుంగనూరులో మంత్రులు అడ్డగోలు ఆరోపణలు చేయడమే ఇందుకు నిదర్శనం.హడావుడిగా ముగ్గురు మంత్రులు ప్రత్యక్షం..నిజానికి.. చిన్నారి అంజుమ్ గత నెల 29న కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు విచారిస్తున్నామని చెప్పినప్పటికీ చిన్నారి ప్రాణాలను కాపాడలేకపోయారు. దీంతో ఈ నెల 2న బాలిక విగతజీవిగా కనిపించింది. ఆమె హత్యకు గురైనట్లు పోలీసులూ ధ్రువీకరించారు. అయితే, హత్యకు గల కారణాలు, నిందితుల గురించి విచారిస్తున్నామని అప్పట్లో వారు చెప్పారు. కానీ, రోజులు గడుస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతోపాటు నిందితుల ఆచూకీని పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో.. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 9న పుంగనూరు రానున్నారని తెలియడంతో ముగ్గురు మంత్రులు ఆదివారం హడావుడిగా పుంగనూరులో ప్రత్యక్షమయ్యారు. కలెక్టర్, ఎస్పీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ తర్వాత ముగ్గురు నిందితులను అరెస్టుచేసినట్లు ప్రకటించారు. దీంతో ఎనిమది రోజులుగా కనిపించని నిందితులు మాజీ సీఎం వస్తున్నారనే సరికి దొరికిపోయారా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.చిన్నారిని ఎందుకు కాపాడలేకపోయారు?ఇక కిడ్నాప్‌కు గురైన ఏడేళ్ల చిన్నారి ఆచూకీని కనిపెట్టలేని ప్రభుత్వం.. ఎనిమిది రోజుల తరువాత నిందితులను పట్టుకున్నట్లు హోంమంత్రి అనిత ప్రకటించడంపై స్థానికులు మండిపడుతున్నారు. బాలిక ఆచూకీ కోసం 12 బృందాలను ఏర్పాటుచేశామని వెల్లడించిన హోంమంత్రి.. అశ్వియను ప్రాణాలతో తల్లిదండ్రులకు ఎందుకు అప్పగించలేకపోయారని సూటిగా ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి.. చిన్నారి కిడ్నాప్ అయిన రోజు నుంచి ప్రభుత్వం, పోలీసులు నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. ఆమె ఆచూకీ కనుగొనలేకపోయారు. పైగా.. హత్యకు ముందు పట్టణ పరిధిలోనే చిన్నారిని దాచి ఉంచారనే ప్రచారం బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో.. పోలీసులు ఆమె ఆచూకీ కనిపెట్టలేకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తున్నా.. సర్కారు వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే ముగ్గురు మంత్రులు అనిత, రాంప్రసాద్‌రెడ్డి, ఫరూక్ పుంగనూరుకు చేరుకుని బాధిత కుటుంబంపై ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలంగా మాట్లాడించుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. నిజంగా ప్రభుత్వం బాగా పనిచేసి ఉంటే.. చిన్నారి ఎందుకు హత్యకు గురైందన్న ప్రశ్నను స్థానికులు లేవనెత్తుతున్నారు. వైఎస్ జగన్ పుంగనూరుకు వస్తే ప్రభుత్వ వైఫల్యం బయటపడుతుందనే సీఎం, మంత్రులు హడావుడి చేస్తూ వైఎస్సార్సీపీపై విమర్శలు చేస్తున్నారని వారంటున్నారు. -
చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరో బాలిక బలి
సాక్షి, అమరావతి/పుంగనూరు: చంద్రబాబు ప్రభుత్వ అసమర్ధతకు రాష్ట్రంలో మరో చిన్నారి బలైపోయింది. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏడేళ్ల ముస్లిం బాలికను కొందరు 4 రోజుల క్రితం అపహరించి హత్య చేశారు. రెండు నెలల క్రితం నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో కొందరు దుండగులు ఐదో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు. బాపట్ల జిల్లాలో ఓ యువతిని అపహరించి అత్యాచారం చేసి హత్య చేసినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. బాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా యువతులు, బాలికలపై అత్యాచారాలకు అంతే లేకుండా పోయింది. తొలి నెల రోజుల్లోనే 20 మంది బాలికలు, యువతులపై అత్యాచారాలు జరిగాయి. వారిలో నలుగురిని హత్య కూడా చేశారు. వేధింపులు తట్టుకోలేక 15 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆధునిక టెక్నాలజీకి తానే ప్రతినిధిని అనేలా ప్రతి చోటా చంద్రబాబు ఆయన గురించి చెప్పుకొంటూ ఉంటారు. సాంకేతికతతో పోలీసు వ్యవస్థ పటిష్టం చేస్తామని కూడా అంటుంటారు. రాష్ట్రంలో ఇన్ని ఘటనలు జరుగుతున్నా, ఒక్క ఘటనలో కూడా నేరస్తులను కనీసం గుర్తించలేకపోవడం గమనార్హం. ముస్లిం చిన్నారిని చిదిమేసిందెవరు? అంజుమ్ కిడ్నాప్‌నకు గురైనా పాప ఆచూకీని పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఆదివారం రాత్రి బాలిక అదృశ్యమైంది. ఆమె తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం.. సోమవారం.. మంగళవారం మూడు రోజులు గడిచినా పోలీసులు అంజుమ్ ఆచూకీ కనిపెట్టలేకపోయారు. రాయచోటి నుంచి వచ్చిన పోలీసు జాగిలాలు బాలిక ఇంటి చెంగలాపురం రోడ్డులోని ముళ్ల పొదల వద్దకు వెళ్లి ఆగిపోయాయి. చివరకు బుధవారం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో అంజూమ్ మృతదేహాన్ని గుర్తించారు. బాలికది హత్యగా పోలీసులు నిర్ధారించారు. మృతదేహం లభ్యమై ఒక రోజు దాటిపోయినా ఇప్పటికీ హంతకులెవరో కూడా పోలీసులు గుర్తించలేకపోవడం ప్రభుత్వ చేతకానితనాన్ని మరోసారి బహిర్గతం చేసింది. అజ్మతుల్లా ఇంటి నుంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ట్యాంకు 30 అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడికి వెళ్లే దారిని సోలార్ ప్రాజెక్టు నిర్వాహకులు సగం వరకు మూసివేశారు. ట్యాంకు కింది భాగంలో వాచ్‌మేన్ ఉంటాడు. అందువల్ల కొత్తవారు ఎవరికీ అక్కడికి ఎలా వెళ్లాలో కూడా తెలియదు. ఎన్ఎస్ పేట ప్రాంతం వారిలో కొందరికి మాత్రమే ట్యాంకుకు వెళ్లే మార్గాలు తెలిసే అవకాశం ఉందని, ఆ ప్రాంతం వారు హత్యకు సహకరించి ఉంటారని పోలీసులు అనుమానిçస్తున్నారు. బాలిక శరీరంపై గాయాలున్నట్లు, రక్తస్రావం అయినట్టు స్థానికులు చెబుతున్నారు. ఆమె శరీరంపై గాయాలు లేవని పోస్టుమార్టం నివేదికలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనను కూడా పోలీసులు పక్కదారి పట్టిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి కడుపు కోత ఏ కుటుంబానికీ రాకూడదు: షమియ, అజ్మతుల్లా పక్కంటిలో ఆడుకుని వస్తానని చెప్పి వెళ్లిన చిన్నారి మరణంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. తాము ఎవరికి కీడు చేయలేదని, అయినా విధి తమ కుటుంబంపై కన్నెర్ర చేసిందని బాలిక తల్లి షమియ, తండ్రి అజ్మతుల్లా కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు ఎవరూ విరోధులు లేరని, ఎందుకు చంపేశారో తెలియదని చెప్పారు. తమ బిడ్డను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. తమ బిడ్డను వెతికేందుకు పట్టణ ప్రజలు కులమతాలకతీతంగా ఐదు రోజులుగా కష్టపడ్డారని చెప్పారు. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అంజుమ్ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి రాష్ట్రంలో బాలికలు, మహిళల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోవడంపట్ల ప్రజా సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అసమర్థతపై ధ్వజమెత్తుతున్నాయి. ముస్లిం బాలిక అంజుమ్‌ను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా వివిధ ముస్లిం సంఘాలతోపాటు ప్రజా సంఘాలు బుధవారం, గురువారం ఆందోళన చేశాయి. హంతకులను వెంటనే పట్టుకొని ఎన్కౌంటర్ చేయాలని, ఉరితీయాలని డిమాండ్ చేశాయి. అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు గురువారం భారీ సంఖ్యలో పుంగనూరులో సమావేశమయ్యారు. బాలికను కాపాడటంలో విఫలమైన ప్రభుత్వ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసన వ్యక్తం చేస్తూ అంజూమ్ ఆత్మకు శాంతి కలగాలని ప్రారి్థస్తూ హిందూ జాగరణ సమితి సభ్యులు పుంగనూరులో గురువారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పుంగనూరు మున్సిపాలిటీ అర్బన్ సమాఖ్య మహిళా సంఘాల సభ్యులు నిరసన ర్యాలీ చేశాయి. అంబేడ్కర్ దళిత రాష్ట్ర సేవా సమితి ధర్నా చేసింది. బాలికలు, మహిళలకు భద్రత కల్పించడంలో టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యంపై వైఎస్సార్సీపీ, సోషల్ డెమొక్రటిక్ పార్టీలతోపాటు పలు ప్రజా సంఘాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. అంజూమ్ హత్యకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని తేల్చిచెప్పాయి. హంతకులను పట్టుకొనేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని ప్రజా సంఘాలు తేల్చిచెప్పాయి.వాసంతి ఉదంతం నుంచి గుణపాఠం నేర్వని బాబు ప్రభుత్వం బాలికలు, మహిళలకు భద్రత కల్పించడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ అసమర్థతను నంద్యాల జిల్లా ముచ్చుమర్రి ఉదంతం చాటిచెప్పింది. ముచ్చుమర్రికి చెందిన వాసంతి అనే అయిదో తరగతి విద్యార్థినిని జూలై 7న కొందరు అపహరించుకుపోయారు. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. తల్లిదండ్రుల ఆందోళనతో ఒక రోజు తరువాత కేసు నమోదు చేసి, తూతూ మంత్రంగా దర్యాప్తు చేపట్టారు. చివరికి వాసంతిపై అత్యాచారం చేసి హత్య చేసి కృష్ణా నదిలో పడేసినట్టు చెప్పి చేతులు దులిపేసుకున్నారు. అంతటి దారుణ ఘటన కూడా చంద్రబాబు ప్రభుత్వాన్ని కదిలించలేపోయింది. కనీసం ఆ బాలిక మృతదేహాన్ని వెతికి ఆమె తల్లిదండ్రులకు అప్పగించాలన్న ధ్యాస కూడా చంద్రబాబు సర్కారుకు లేకుండాపోయింది. వాసంతి విషాదాంతం నుంచి కూడా ప్రభుత్వం గుణపాఠం నేర్వలేదు. ఆ ని్రష్కియాపరత్వానికే పుంగనూరులో ముస్లిం బాలిక బలైపోయింది. -
రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద కిడ్నాప్ కలకలం
-
పల్నాడులో మళ్లీ పేట్రేగిన టీడీపీ మూకలు..
సాక్షి, నరసరావుపేట, వినుకొండ (నూజెండ్ల): అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటినా ఎన్నికల హామీలపై ఏమాత్రం దృష్టిపెట్టని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి సర్కారు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని మాత్రం అనుకున్నది అనుకున్నట్లుగా పక్కాగా అమలుచేస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి వైఎస్సార్సీపీ సానుభూతిపరులను హత్యచేయడం, వారిపై దాడులకు తెగబడడం, ఆస్తులు ధ్వంసం చేసి గ్రామాల నుంచి వెళ్లగొట్టడం పల్నాడులో సర్వసాధారణమయ్యాయి. చివరికి సొంత ఊర్లో ఇళ్లు, పొలాలు వదిలి పొట్టకూటి కోసం వలస వెళ్లి చిన్నచిన్న పనులు చేసుకుంటున్న వారిని సైతం వెంటాడి కిడ్నాప్ చేసి అంతమొందించడానికి తెలుగుదేశం పార్టీ గూండాలు వెనుకాడడంలేదు. తాజాగా.. వినుకొండ రూరల్ మండలం వెంకుపాలెం గ్రామం వద్ద మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం జంగమహేశ్వరపాడుకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త ఒంటేరు నాగరాజు ఆటోలో వెళ్తుండగా టీడీపీ నేతలు దారికాచి దాడిచేశారు. అందులోని అతని కుటుంబ సభ్యుల్ని గాయపరిచి నాగరాజును కిడ్నాప్ చేయడం తీవ్ర అలజడి రేపింది. పోలీసులు కిడ్నాపర్లను పట్టుకుని నాగరాజును పోలీసుస్టేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి నాగరాజు బావమరిది రవి తెలిపిన వివరాలు ఏమిటంటే..వైఎస్సార్సీపీ సానుభూతిపరుడైన నాగరాజు కుటుంబ సభ్యులు టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సొంత గ్రామం జంగమేశ్వరపాడు గ్రామాన్ని విడచిపెట్టి వినుకొండలోని తన బావమరిది రవి వద్దకు వచ్చి ఉంటున్నారు. బతుకుతెరువు కోసం ఆటోలో కూరగాయలు అమ్ముకుంటున్నాడు. ఈ నేపథ్యంలో.. నాగరాజు తన తల్లి వెంకమ్మ, బావమరిది రవితో కలిసి గురువారం ఉ.8.30 ప్రాంతంలో వెల్లటూరు వైపు వెళ్తుండగా వెంకుపాలెం కురవ వద్దకు రాగానే టీడీపీ నేతలు కారుతో ఆటోను అడ్డగించారు. కారులో వచ్చిన సుమారు 8 మంది రవిపై కత్తులతో దాడిచేసి గాయపరిచారు. ఆ తర్వాత నాగరాజు తల్లిపైనా దాడిచేసి నాగరాజును బలవంతంగా కారులో ఎక్కించుకుని వెల్లటూరు వైపు దూసుకెళ్లారు. కిడ్నాప్ చేసింది జంగమేశ్వరపాడుకు చెందిన టీడీపీ నేతలే అని నాగరాజు కుటుంబ సభ్యులు నిర్థారించారు.అందరూ చూస్తుండగానే..పట్టపగలు అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై కత్తులతో స్వైరవిహారం చేస్తూ నాగరాజును కిడ్నాప్ చేయడంతో వినుకొండ ప్రాంతంలో అలజడి రేగింది. అక్కడున్న స్థానికులు దాడిలో గాయపడిన రవి, నాగరాజు తల్లి వెంకాయమ్మలను వినుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న నాగరాజు భార్య, నాగమల్లేశ్వరి, చెల్లెళ్లు భువనేశ్వరి, రజనీలతోపాటు నాగరాజు తండ్రి సాంబయ్య నాగరాజును చంపేస్తారని, కాపాడాలంటూ భోరున విలపించారు. ఆ టీడీపీ నేతలే కిడ్నాప్ చేశారు..నాగరాజు తండ్రి సాంబయ్య మీడియాతో మాట్లాడుతూ.. జంగమేశ్వరపాడుకు చెందిన టంగుటూరి శబరి కుమారుడు మల్లికార్జున, కొండా, ఆరెద్దుల మణి, కంచర్ల బొర్రయ్య కుమారుడు రామాంజి, నానారావు కుమారుడు జల్లయ్యతోపాటు మరో ముగ్గురు తన కుమారుడిని కిడ్నాప్ చేశారని తెలిపారు. మరోవైపు.. ఆస్పత్రి వద్ద నాగరాజు భార్య సొమ్మిసిల్లి పడిపోయింది. ఆస్పత్రి ఆవరణలో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బతుకుతెరువు కోసం, ప్రాణాలు కాపాడుకునేందుకు గ్రామంలో పొలాలు, ఇళ్లు వదలేసి దూరంగా బతుకుతున్నప్పటికీ టీడీపీ నేతలు తమను ఇక్కడ కూడా బతకనివ్వడంలేదని వాపోయారు. సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా నిందితుల పట్టివేత..నాగరాజు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వినుకొండ సీఐ శోభన్‌బాబు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి కిడ్నాపర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సెల్ఫోన్ల సిగ్నల్ ఆధారంగా నిందితులను బొల్లాపల్లి మండలం మర్రిపాలెం వద్ద అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దాడిలో ఏడుగురు పాల్గొనగా ఆరుగురిని పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఒక వ్యక్తి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు.. బాధితుడు నాగరాజును రక్షించిన పోలీసులు బొల్లాపల్లి స్టేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.కత్తులతో దాడిచేసి కిడ్నాప్ చేశారు..కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మా బావ నాగరాజు కుటుంబం టీడీపీ దాడులకు భయపడి వినుకొండలో నా వద్దకు వచ్చి కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నారు. అయినాసరే వదిలిపెట్టకుండా గురువారం ఉదయాన్నే కత్తులతో దాడిచేసి గాయపరిచారు. అడ్డొచ్చిన మహిళలపై కూడా దాడిచేసి నాగరాజును కారులో ఎక్కించుకుని పరారయ్యారు. నా ఫోన్‌ను సైతం లాక్కెళ్లారు. – రవి, దాడిలో గాయపడిన నాగరాజు బావమరిదినాగరాజుకు ఏం జరిగినాబాబుదే బాధ్యతమాజీమంత్రి అంబటి ఫైర్సాక్షి, అమరావతి: పల్నాడులో టీడీపీ గూండాలు కిడ్నాప్ చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్త ఒంటేరు నాగరాజుకు ఎలాంటి హాని జరిగినా చంద్రబాబు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని మాజీమంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. పల్నాడులో నాగరాజు కిడ్నాప్‌పై ఆయన తీవ్రంగా స్పందించారు. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? అంటూ సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనితను ప్ర శ్నించారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. నాగరాజుకు ఏమైనా హాని జరిగితే తీవ్ర పరిణామాలుంటాయి. రాష్ట్రంలో ఎంత దారుణమైన ఘటనలు జరుగుతున్నా యో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవలే వినుకొండలో ఓ వైఎస్సార్సీపీ కార్యకర్తను అతి దారుణంగా నరికి చంపారు. ఈ ఘటనలపై చంద్రబాబు స్పందించాలన్నారు. మాజీమంత్రి మేరుగ నాగార్జున పాల్గొన్నారు.పోలీసులు చేతులేత్తేశారు: కొరముట్లరాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడే అంశంలో పోలీసులు పూర్తిగా చేతులేత్తేశారని, కేవలం రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుచేసేందుకే అన్నట్లుగా వారి ప్రవర్తన ఉందని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు తాడేపల్లిలో మాట్లాడుతూ ఫైర్ అయ్యారు. మొన్న వినుకొండ, నిన్న నంద్యాల, జగ్గయ్యపేట ఘటనలు జ రగ్గా ఈరోజు కిడ్నాప్ జరగడం అత్యంత దారుణమన్నారు. జగన్‌కి ఎక్కువ భద్రత ఉన్నట్లు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. -
టీడీపీ నేతల అరాచకం.. నాగరాజుకు తీవ్ర గాయాలు
పల్నాడు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒంటేరు నాగరాజు కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. కిడ్నాప్ చేసిన టీడీపీ నాయకులు.. నాగరాజును చావబాదడంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. నాగరాజును బొల్లాపల్లి స్టేషన్ తీసుకువచ్చిన పోలీసులు.. ప్రాథమిక వైద్యం అందిస్తున్నారు. కిడ్నాడ్ ఘటనకు సంబంధించ ఎనిమిది మంది కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు కిడ్నాపర్లను విచారిస్తున్నారు. నిందితులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు గోప్యగా ఉంచుతున్నారు. బొల్లాపల్లి మండలం వెంకుపాలెంలో వైఎస్సార్సీపీ కార్యకర్త నాగరాజును కిడ్నాప్ చేశారు. ఆటోలో కూరగాయలు అమ్ముకుంటున్న నాగరాజును బొలెరో వాహనంతో అడ్డుకుని.. బలవంతంగా తీసుకెళ్లిన ప్రత్యర్థులు.. నాగరాజు కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. -
నాగరాజుకు ఏమైనా హానీ జరిగితే తీవ్ర పరిణామాలుంటాయి: అంబటి రాంబాబు
-
పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాగరాజు కిడ్నాప్
-
బాలుడు కిడ్నాప్.. ఆందోళనలో తల్లిదండ్రులు
-
పాప సేఫ్ ... అబిడ్స్ కిడ్నాప్ కథ సుఖాంతం
-
అబిడ్స్ లో చిన్నారి కిడ్నాప్ కలకలం
-
అనకాపల్లిలో 20 ఏళ్ల యువతి కిడ్నాప్, రేప్
-
ప్లాన్ ప్రకారమే ఎత్తుకెళ్లాడు.. తండ్రి రోదన..
-
జీతం ఇవ్వలేదని సీఈఓ కిడ్నాప్.. 8 మంది అరెస్టు
ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని ఐటీ కంపెనీ సీఈవోను అపహరించిన ఎనిమిది మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు జూబ్లీహిల్స్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి.వెంకటగిరి తెలిపారు. నిందితుల నుంచి 84 ల్యాప్‌టాప్‌లు, 18 మొబైల్ ఫోన్లు, ఒక కారు, పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.పోలీసుల కథనం ప్రకారం..హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో రవిచంద్రరెడ్డి గిగ్లీజ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఐటీ కన్సల్టెన్సీ సంస్థను నిర్వహిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతడు వివిధ కన్సల్టెన్సీల ద్వారా రిక్రూట్ అయిన దాదాపు 1,200 మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోయాడు. దాంతో ఉద్యోగులు, కన్సల్టెంట్లు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. కంపెనీ సీఈఓ రవిచంద్రపై ప్రస్తుత ఉద్యోగులు, పలువురు మాజీ ఉద్యోగులు ఇటీవల రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రవి తమకు జీతాలు చెల్లించకుండా మోసం చేశాడని ఆరోపించారు. తాము రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల రూపాయలు వరకు చెల్లించి ఇతర కన్సల్టెన్సీల ద్వారా ఈ కంపెనీలో రిక్రూట్ అయ్యామని పేర్కొన్నారు. తమ జీతాల బకాయిలు అందకుండా తమను అన్యాయంగా ఉద్యోగంలో నుంచి తొలగించారని ఆరోపించారు.ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న బిజినెస్ కన్సల్టెంట్ ఒకరు, ఇద్దరు సాఫ్ట్వేర్లు, మరో ఐదుగురు ఉద్యోగులు కలిసి రవిచంద్రను కిడ్నాప్ చేయాలనుకున్నారు. ముందుగా అనుకున్న విధంగానే జులై 10 అర్ధరాత్రి వీరు రవి నివాసంలోకి ప్రవేశించి కిడ్నాప్ చేశారు.కిడ్నాప్ అయిన వెంటనే రవి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన జరిగే సమయంలో నిందితులు ఆమెపై దాడి చేశారని చెప్పారు. ఇంట్లో ఉన్న 84 ల్యాప్‌టాప్‌లను అపహరించినట్ల పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసు బృందం రవిచంద్రను శ్రీశైలం హైవేలోని ఓ హోటల్లో గుర్తించి రక్షించారు. నిందితులు దొంగలించిన 84 ల్యాప్‌టాప్‌లు, 18 మొబైల్ ఫోన్లు, ఒక కారు, మూడు పాస్పోర్ట్లతోపాటు వారికి చెందిన రెండు కార్లు, ఒక మోటర్‌బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ పి.వెంకటగిరి వివరించారు.ఇదీ చదవండి: ప్లాట్‌ఫామ్ ఫీజు 20 శాతం పెంపు!ఇదిలాఉండగా, ఉద్యోగం కోసం నైపుణ్యాలు పెంచుకుని నేరుగా కంపెనీలను ఆశ్రయించి ఇంటర్వ్యూలకు హాజరుకావాలని నిపుణులు చెబుతున్నారు. అంతేగానీ, దళారుల ద్వారా ఉద్యోగాల్లో చేరితే ఆర్థికంగా, ఉద్యోగపరంగా నష్టపోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. -
అప్పుడే పుట్టిన పసికందు కిడ్నాప్.. నర్సు వేషంలో వచ్చి..
సాక్షి,కృష్ణాజిల్లా : కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో అర్ధరాత్రి కలకలం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన శిశువు కిడ్నాప్‌కు గురైంది. నర్స్ వేషంలో వచ్చిన ఓ మహిళ చిన్నారిని ఎత్తుకెళ్లింది. ఆ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితులు, ఆస్పత్రి సిబ్బంది ఫిర్యాదుతో నాలుగు గంటల్లో పోలీసులు కేసును ఛేదించారు.కిడ్నాప్ చేసిన మహిళ మచిలీ పట్నానికి చెందిన చెరుకురసం అమ్మే మహిళగా గుర్తించారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని బాబును తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. అయితే మహిళ అప్పుడే పుట్టిన చిన్నారిని కిడ్నాప్ చేయడానికి గల కారణాల్ని రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
నర్సు వేషంలో వచ్చి కిడ్నాప్..
-
ఇంటికి 100 మీటర్ల దూరంలో.. 26 ఏళ్ల పాటు చెరలో
అల్జీర్స్: టీనేజీ వయసులో పాఠశాలకు వెళ్తుండగా మార్గమధ్యంలో అపహరణకు గురై ఏకంగా 26 సంవత్సరాలపాటు బందీగా ఉండిపోయిన అల్జీరియన్ వ్యక్తి వేదన ఇది. అల్జీరియా దేశంలోని డిజేఫ్లా రాష్ట్రంలో ఇటీవల కిడ్నాపర్ చెర నుంచి విముక్తుడైన 45 ఏళ్ల ఒమర్ బిన్ ఒమ్రాన్ గాథను స్థానిక అల్జీరియన్ ఎల్ఖబర్ వార్తాసంస్థ వెలుగులోకి తెచి్చంది. గడ్డితో నిండిన సెల్లార్లో ఏళ్ల తరబడి.. ఒమర్‌కు 19 ఏళ్ల వయసు ఉన్నపుడు అంటే 1998 సంవత్సరంలో ఒకరోజు ఉదయం వృత్తివిద్యా పాఠశాలకు ఒమర్ తన ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. కొంతదూరం వెళ్లగానే కిడ్నాప్‌కు గురయ్యాడు. కిడ్నాప్‌చేసిన వ్యక్తి ఒమర్‌ను ఒక గడ్డితో కప్పిన నేలమాళిగలో దాచిపెట్టాడు. ఎందుకు కిడ్నాప్ చేశాడో, ఎందుకు ఇన్ని సంవత్సరాలు అక్కడే ఉంచాడో ఎవరికీ తెలీదు. తోబుట్టువు పోస్ట్‌తో వెలుగులోకి కిడ్నాపర్‌కు ఒక తోబుట్టువు ఉన్నారు. ఆ వ్యక్తి ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో ఒక విషయం రాసుకొచ్చారు. ఊరిలో ఒక‡ కిడ్నాప్ ఉదంతంలో తన పాత్ర కూడా ఉందని ఒక పోస్ట్‌చేశారు. ఈ పోస్ట్‌ను ఒమర్ కుటుంబం గమనించి వెంటనే దర్యాప్తు సంస్థకు సమాచారం ఇచ్చారు. దీంతో నేషనల్ జెండర్మెరీన్( దేశ దర్యాప్తు సంస్థ) పాత కేసును తిరగతోడింది. పోస్ట్ పెట్టిన వ్యక్తిని విచారించి కిడ్నాపర్ ఇంటిని కనిపెట్టారు. అధికారులు ఆదివారం కిడ్నాపర్ ఇంటిపై మెరుపుదాడి చేసి ఇళ్లంతా వెతికారు. చివరకు గడ్డితో ఉన్న రహస్య సెల్లార్లో ఒమర్‌ను కనుగొన్నారు. 61 ఏళ్ల కిడ్నాపర్ పారిపోతుంటే పోలీసులు పట్టుకున్నారు. కిడ్నాపర్ ఇల్లు.. ఒమర్ సొంత ఇంటికి కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. ఈ సెల్లార్ ఒక గొర్రెల కొట్టం కింద ఉన్నట్లు తెలుస్తోంది. కిటికీలోంచి చూసేవాడిని: ఒమర్ ‘‘కిడ్నాప్‌కు గురయ్యాక ఈ సెల్లార్లోనే ఉండిపోయా. నా కుటుంబసభ్యులు అటుగా వెళ్లేటపుడు సెల్లార్ కిటికీ నుంచి చూసేవాడిని. అరిచి పిలుద్దామని వందలసార్లు అనుకున్నా. కానీ పక్కనే కిడ్నాపర్ ఉండేవాడు. భయంతో నోరు మెదపలేదు’’ అని విడుదలయ్యాక ఒమర్ చెప్పారు. -
కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
దేశంలో అంతర్యుద్ధం నడుమ.. అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఆ టైంలోనే తమ బిడ్డ కనిపించకుండా పోయాడు. నెలల తరబడి వెతికినా లాభం లేకుండాపోయింది. చివరకు చనిపోయాడని నిర్ధారించేసుకున్నారు వాళ్లు. సరిగ్గా.. పాతికేళ్ల తర్వాత అదే వీధిలో ఓ ఇంట్లో ప్రత్యక్షం కావడంతో ఆ కుటుంబానికి నోట మాట రాలేదు. 1998లో అల్జీరియాలో అంతర్యుద్ధం జరిగిన టైంలో ఒమర్ బీ అనే వ్యక్తి హఠాత్తుగా కనిపించకుండా పోయాడు. బహుశా ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చని కొన్నాళ్లూ.. ఆ తర్వాత కూడా ఆచూకీ దొరక్కపోవడంతో చంపేసి ఉంటారని అతని కుటుంబం నిర్ధారణకు వచ్చింది.26 ఏళ్లు గడిచాక.. ఒమర్ ఇంటికి రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న ఇంట్లో అతన్ని బంధించినట్లు కుటుంబం తెలుసుకుంది. వెంటనే ఒమర్ సోదరుడు ఆ బంధించిన దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. ఆస్తి పంపకాల తగాదాలు.. ఆ కేసు కోర్టులో నడుస్తుండడంతో దగ్గరి బంధువే ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్లు తేలింది.అల్జీరియా డిజెల్ఫా నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కిడ్నాప్‌కు పాల్పడిన నిందితుడు పారిపోయే యత్నం చేయగా.. ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్‌చేశారు. 45 ఏళ్ల వయసులో ఒమర్‌ను చూడగానే ఆ కుటుంబం భావోద్వేగానికి లోనైంది. ప్రస్తుతం అతనికి మానసిక చికిత్స అందిస్తోంది ఆ కుటుంబం. అయితే.. కిడ్నాప్ చేసి పొరుగింట్లోనే పాతికేళ్లుగా బంధించడం నమ్మశక్యంగా లేదంటున్న పోలీసులు.. సమగ్రంగా దర్యాప్తు చేపట్టాకే కేసు వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. -
నటిని కిడ్నాప్ చేసిన ఫ్రెండ్స్.. తల అడవిలో, మొండెం..
కరీనా కపూర్ హీరోయిన్గా 2012లో హీరోయిన్ మూవీ రిలీజైంది. ఇప్పుడు ప్రస్తావన సినిమా గురించి కాదు! ఇందులో యాక్ట్ చేసిన నటి మీనాక్షి థాపర్ గురించి! ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమెకు ఇదే చివరి సినిమా! చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన మీనాక్షి గురించే నేటి ప్రత్యేక కథనం..సినిమా ఛాన్స్‌కు ముందు1984 అక్టోబర్ 4న మీనాక్షి థాపర్ జన్మించింది. డెహ్రాడూన్‌లో తన విద్యాభ్యాసం జరిగింది. సినిమాల మీద ఆసక్తితో ముంబైలో అడుగుపెట్టింది. సినిమా ఛాన్సులు రావడానికి ముందు డ్యాన్స్ క్లాసులు నేర్పించింది. ఎన్నో ప్రయత్నాల తర్వాత 2011లో 404 అనే హారర్ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ అవలేదు.సెట్స్‌లో అదృశ్యంతర్వాత మధుర్ భండార్కర్ సినిమా 'హీరోయిన్'లో ఛాన్స్ వచ్చింది. కరీనా కపూర్‌తో యాక్ట్ చేసే అవకాశం వచ్చిందని సంబరపడిపోయింది. త్వరలోనే నటిగా గొప్ప స్థాయికి చేరుకోవచ్చని భావించింది. అంతలోనే ఆమె సంతోషాన్ని తుంచేశారు. హీరోయిన్ సినిమా కోసం సెట్స్‌కి రాగా అక్కడే ఆమె అదృశ్యమైంది. ఆమె ఎక్కడికి వెళ్లిందో ఎవరికీ అర్థం కాలేదు. 2012 మార్చి 13న నటి తల్లికి ఫోన్ కాల్ వచ్చింది. రూ.15 లక్షలు డిమాండ్అందులో మీనాక్షి మాట్లాడుతూ.. తన ఫ్రెండ్స్ అమిత్ కుమార్ జైస్వాల్, ప్రీతి సురిన్‌తో కలిసి అలహాబాద్‌కు వెళ్తున్నట్లు వెల్లడించింది. మూడు రోజుల తర్వాత ముగ్గురి ఫోన్లు స్విచ్చాఫ్ అయ్యాయి. మార్చి 17న మీనాక్షి తల్లికి ఒక మెసేజ్ వచ్చింది. మీ కూతురు క్షేమంగా ఉండాలంటే రూ.15 లక్షలు పంపండి.. మూడు రోజులు మాత్రమే గడువు అని వార్నింగ్ ఇచ్చారు. పోలీసులకు చెప్తే తను దుస్తులు లేకుండా ఉన్న వీడియోలు ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తామని బెదిరించారు. రోజులు గడుస్తున్నాఈ బెదిరింపులకు నటి తల్లి లొంగలేదు. ఆర్మీలో పని చేస్తున్న తన కుమారుడితో కలిసి పోలీసులను ఆశ్రయించింది. జరిగిందంతా పూస గుచ్చినట్లు చెప్పింది. రోజులు గడుస్తున్నా మీనాక్షి ఆచూకీ దొరకలేదు. ఒకరోజు అమిత్, ప్రీతి(వీరిద్దరూ ప్రేమించుకున్నారు) బాంద్రాలోని యాక్సిక్ బ్యాంక్ ఏటీఎమ్‌కు చేరుకున్నారు. పోలీసులు వారిని పట్టుకుని విచారించగా అన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. మీనాక్షిని హత్య చేసినట్లు అంగీకరించాడు.శరీరాన్ని ముక్కలుగాఏప్రిల్ 16న పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. మీనాక్షిని కిడ్నాప్ చేసిన తర్వా ఆమె తల, మొండెం వేరు చేశారు. అలహాబాద్‌లో ప్రీతి ఇంటికి దగ్గర్లో ఓ సెప్టిక్ ట్యాంక్‌లో తన శరీరాన్ని ముక్కలుగా కోసి పడేశారు. తలను అలహాబాద్ నుంచి లక్నోకు వెళ్తుండగా మార్గ మధ్యలో బస్సులో నుంచి అడవిలో విసిరేశారు. 2018లో న్యాయస్థానంలో నిందితులిద్దరికీ జీవిత ఖైదు విధించింది.స్నేహితుల అత్యాశ వల్ల 27 ఏళ్ల వయసుకే నటి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఒక తల్లికి తీరని కడుపుకోత మిగిలింది.చదవండి: సింగర్‌పై బాటిల్ విసిరిన ఆకతాయి.. అయినా సహనం కోల్పోకుండా.. -
అమెరికాలో కిడ్నాపైన నాచారం విద్యార్థి అర్ఫాత్ మృతి
మల్లాపూర్ (హైదరాబాద్): అమెరికాలో కిడ్నాప్ అయిన హైదరాబాద్‌లోని నాచారానికి చెందిన విద్యార్థి మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్(25) ఓహాయోలోని క్లీవ్‌ల్యాండ్‌లో మృతి చెందాడు. అక్కడి సరస్సులో లభ్యమైన మృతదేహం నడుము చుట్టూ పాస్‌పోర్ట్, మొబైల్‌ఫోన్, కొన్ని పత్రాలు కట్టి ఉన్నాయి. వాటిని పరిశీలించిన పోలీసులు అర్ఫాత్‌గా గుర్తించారు. ఈ విషయాన్ని న్యూయార్క్‌లోని భారత దౌత్య కార్యాలయం మంగళవారం ‘ఎక్స్’లో వెల్లడించింది. అర్ఫాత్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసేందుకు పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ప్రకటించింది. అర్ఫాత్ మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పింది. మార్చి 7న కిడ్నాప్: నాచారానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్ గత మార్చి 7న అదృశ్యమయ్యాడు, ఉన్నత చదువులకు అమెరికా వెళ్లిన అర్ఫాత్ క్లీవ్‌ల్యాండ్ విశ్వవిద్యాలయంలో ఐటీ మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. అయి తే కిడ్నాప్‌నకు కొద్ది రోజుల ముందు తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్‌కాల్ వచ్చిందని అర్ఫాత్ తన తండ్రి మహమ్మద్ సలీంకు ఫోన్ చేసి చెప్పాడు, దీంతో వారు ఆందోళన చెందారు. ఇది జరిగిన కొద్దిరోజులకే అర్ఫాత్ కిడ్నాప్ అయ్యాడు. 1200 డాలర్లు ఇస్తేనే విడిచి పెడతామని బెదిరించారని, లేకుంటే అర్ఫాత్ కిడ్నీలు విక్రయిస్తామని కిడ్నాప్ చేసినవారు సలీంను ఫోన్లో బెదిరించారు. అయితే అర్ఫాత్‌ను రక్షించుకునేందుకు తండ్రి సలీం అంగీకరించి,...అర్ఫాత్ మీ దగ్గర ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయా అని అడిగాడు. దీంతో కిడ్నాపర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫోన్ పెట్టేశారని, వారి నుంచి మళ్లీ కాల్ రాలేదని సలీం తెలిపారు. కిడ్నాపర్ మాట్లాడటానికి ముందు ఫోన్లో ఎవరిదో ఏడుపు వినిపించిందని..అదే చివరి గొంతు అన్నారు. కిడ్నాపర్ల ఫోన్‌నంబరు అమెరికాలోని తమ బంధువులకు పంపి క్లీవ్‌ల్యాండ్ పోలీసులకు అందజేయాలని సలీం చెప్పారు. అర్ఫాత్ అదృశ్యంపై అతడి బంధువులు మార్చి 8న క్లీవ్‌ల్యాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో లుకౌట్ నోటీసు జారీ చేశారు. ఇది జరిగిన దాదాపు నెలరోజుల తర్వాత విషాదవార్త వినాల్సి వచ్చిందని కుటుంబసభ్యులు రోదిస్తూ చెప్పారు. -
HYD: కిడ్నాప్‌నకు గురైన పాప సేఫ్..
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ మాదన్నపేటలో కిడ్నాప్‌నకు గురైన తొమ్మిది నెలల పాప సురక్షితమని పోలీసులు తెలిపారు. కిడ్నాప్ చేసిన మహిళ ఎంజీబీఎస్‌లో జహీరాబాద్‌లో బస్సు ఎక్కినట్టు గుర్తించారు. దీంతో, వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. అక్కడ బస్సు దిగిన వెంటనే మహిళను అదుపులోకి తీసుకుని పాపను రక్షించారు. వివరాల ప్రకారం.. పాతబస్తీలోని మాదన్నపేటలో పాపను కిడ్నాప్ చేశారు. ఓ మహిళ పాపను కిడ్నాప్ చేసి చంచల్ గూడ నుండి ఎంజీబీఎస్‌వైపు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. అనంతరం.. జహీరాబాద్ వెళ్లే బస్సు ఎక్కినట్టు పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు. అయితే, కిడ్నాప్ చేసిన మహిళను సహనాజ్‌ఖాన్‌గా గుర్తించారు. బాధితుల ఇంట్లో ఆమె రెండు నెలల క్రితమే పని మనిషిగా చేరినట్టు తెలుస్తోంది. జహీరాబాద్ పోలీసులను మాదన్నపేట్ పోలీసులు అప్రమత్తం చేశారు. కిడ్నాపర్ మహిళ జహీరాబాద్‌లో బస్సు దిగిన వెంటనే ఆమెను అదుపులోకి తీసుకొని చిన్నారిని క్షేమంగా కాపాడారు. కొద్దిసేపటి క్రితమే జహీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు చిన్నారి కుటుంబ సభ్యులు, మాదన్నపేట్ పోలీసులు చేరుకున్నారు. అనంతరం పాపను పేరెంట్స్‌కు అప్పగించారు. -
పాతబస్తీలో 9నెలల చిన్నారి కిడ్నాప్ కలకలం
-
ఎయిర్ పోర్ట్ నుండి నన్ను కిడ్నాప్ చేసి చంపాలని చూశారు
-
ఇల్లందు మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లందు మున్సిపల్ కార్యాలయం ముందు ఉద్రిక్తత కొనసాగుతోంది. మూడో వార్డు కౌన్సిలర్ కొక్కు నాగేశ్వరరావును ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఆయన అనుచరులు కిడ్నాప్ చేశారని మున్సిపల్ కార్యాలయం ముందు నాగేశ్వరరావు భార్య, కూతురు ఆందోళన చేస్తున్నారు. బలవంతంగా తన భర్తను కాంగ్రెస్ వాళ్లు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లందుల్లో నేడు జరగనున్న అవిశ్వాసానికి ముందు ఈ వ్యవహారంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలపడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు. పోలీసులు సరైన భద్రత కల్పించకపోవడం వల్లే తమ భర్తను కాంగ్రెస్ వాళ్ళు బలవంతంగా కారులో ఎక్కించుకొని వెళ్లారని నాగేశ్వరావు భార్య ఆరోపిస్తోంది. ఇల్లందు మున్సిపల్‌కి సంబంధించి మొత్తం 24 మంది కౌన్సిలర్లలో 19 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ,ముగ్గురు ఇండిపెండెంట్ లు ,ఒకరు సీపీఐ, ఒకటి న్యూ డెమోక్రసీ చెందిన కౌన్సిలర్ ఉన్నారు. అవిశ్వాసం నెగ్గాలంటే బీఆర్ఎస్ పార్టీకి 17 మంది కౌన్సిలర్లు అవసరం. ఇదీ చదవండి: కాంగ్రెస్ మాటల ప్రభుత్వం -
జడ్చర్లలో అమానుషం.. కన్న బిడ్డలను అమ్మకానికి పెట్టిన కసాయి తండ్రి
సాక్షి, మహబూబ్‌నగర్: మానవ సంబంధాలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఆస్తుల కోసం తోడబుట్టిన వారిపైనే దాడులు చేసుకుంటూ హతమార్చుకుంటున్నారు. డబ్బు మోజులో పడి పేగు బంధాలను తెంచేసుకుంటున్నారు. తాజాగా కాసుల కోసం కక్కుర్తిపడి కన్నబిడ్డలను కిడ్నాప్ చేసి బేరానికి పెట్టాడో తండ్రి. భార్య ఫిర్యాదు, పోలీసుల అప్రమత్తతో అడ్డంగా బుక్కయ్యాడు. ఆ అమానుష ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో వెలుగుచూసింది. పట్టణంలోని గౌరీ శంకర్ కాలనీలో నివాసం ఉండే రఫీ తన ముగ్గురు కూతుళ్లను మాయ మాటలు చెప్పి కారులో హైదరాబాద్ తీసుకెళ్లాడు. ఆ తర్వాత భార్యకు ఫోన్ చేసి పిల్లలను కిడ్నాప్ చేశానని తనకు డబ్బు కావాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఆమె వెంటనే జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు వెంటనే స్పందించి రఫీ ఫోన్‌ను ట్రాక్ చేశారు. హైదరాబాదులోని యాకత్‌పురాలో అతని లోకేషన్ కనిపించగా.. వెంటనే పోలీసుల బృందం అక్కడికి చేరుకుంది. ఓ కారులో నిర్బంధించి ఉన్న పిల్లలను.. పోలీసులు రక్షించారు. అయితే రూ. 9 లక్షలకు పిల్లల్ని బేరం కుదుర్చుకున్నాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా పోలీసుల అప్రమత్తతో కథ సుఖాంతం అయ్యింది. పిల్లలను విక్రయించాలనుకున్న తండ్రికి బంధువులు కాలనీవాసులు దేహ శుద్ధి చేశారు. -
కథ..స్క్రీన్ ప్లే..డైరెక్షన్..అంత చెల్లె
-
సాఫ్ట్ వేర్ ఉద్యోగి కిడ్నాప్.. నలుగురు అరెస్ట్
-
టీచర్‌ను కిడ్నాప్.. తలపై తుపాకీతో బెదిరించి కూతురితో పెళ్లి
బిహార్‌లో వింత పెళ్లి జరిగింది. ఓ టీచర్‌ను కిడ్నాప్ చేసి తలపై తుపాకీ పెట్టి బెదిరించి తన కుతురితో వివాహం జరిపించాడు కిడ్నాపర్. బీహార్‌లోని వైశాలి జిల్లాలో ఈ ఉదాంతం వెలుగుచూసింది. వివరాలు.. గౌతమ్ కుమార్ ఇటీవలే బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి పటేపూర్‌లోని రేపురాలోని పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వర్తిస్తునాడు. . బుధవారం అతను పాఠశాలలో ఉండగా.. ముగ్గురు నలుగురు వ్యక్తులు వచ్చి కిడ్నాప్ చేశారు. 24 గంటల్లోనే తుపాకీతో బెదిరించి కిడ్నాపర్లలో ఒకరి కుమార్తెతో బలవంతంగా వివాహం చేశారు. వివాహానికి నిరాకరించింనందుకు బాధితుడిపై దాడి కూడా చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు తప్పిపోయిన ఉపాధ్యాయుడిని గాలించే పనిలో పడ్డారు. గౌతమ్ కుమార్ కుటుంబ సభ్యులు రాజేష్ రాయ్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేశారు. తమ కుమారుడిని బలవంతంగా తీసుకెళ్లి రాయ్ కుమార్తె చాందినితో వివాహం చేసి ఉంటారని ఆరోపించారు. కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా బిహార్‌లో పకడ్వా వివాహం(ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోవడం) ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. గతేడాది అనారోగ్యానికి గురైన జంతువుకు వైద్యం చేసేందుకు వచ్చిన పశువైద్యుడిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి బెగుసరాయ్‌లో బలవంతంగా వివాహం జరిపించారు. కొన్నేళ్ల క్రితం బీహార్‌లో ఓ ఇంజనీర్‌కు సంబంధించిన ఇలాంటి ఘటనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బొకారో స్టీల్ ప్లాంట్‌లో జూనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్న 29 ఏళ్ల వినోద్ కుమార్ పాట్నాలోని పండరక్ ప్రాంతంలో ఓ మహిళను కొట్టి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. -
కోటీశ్వరుడిగా నకిలీ ప్రొఫైల్, డేటింగ్ వల: అదే కొంపముంచింది!
సోషల్ మీడియాలో ముక్కూ మోహం తెలియని వారితో పరిచయాలు, ప్రేమ, ఆన్లైన్ డేటింగ్ ఎంత ప్రమాదకరమో తెలిపే ఘటన ఇది. పాపులర్ డేటింగ్ టిండర్‌లో డేటింగ్ చేసిన మహిళ యువకుడిని కిడ్నాప్ చేసి మరీ కిరాతకంగా హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. 2018లో జైపూర్‌లో షాకింగ్ సంఘటన జరిగింది. ఈ హత్య కేసులో ముగ్గురు నిందితులకు జైపూర్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుష్యంత శర్మ(28)కు 27 ఏళ్ల ప్రియా సేథ్తో టిండర్ యాప్ ద్వారా పరిచయమైంది. దుష్యంత్ తను అసలు పేరు కాకుండా వివాన్ కోహ్లీ అనే పేరుతో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. అంతేకాదు నెల కోటిరూపాయలు సంపాదిస్తానని, ఢిల్లీకి చెందిన గొప్ప బిజినెస్‌మేన్ అని గొప్పలు చెప్పుకున్నాడు. కోహ్లి ప్రొఫైల్ చూసిన ప్రియా పథకం ప్రకారమే మెల్లిగా అతనితో స్నేహం నటించింది. దీంతో దుష్యంత్ గాల్లో తేలిపోయాడు. ఇలా 3 నెలల పాటు కొనసాగింది. చివరికి కలవాలని ప్రతిపాదించింది. దీంతో ఎగిరి గంతేశాడు. కానీ అదే అతని ప్రాణాలు తీస్తుందని అసలు ఊహించలేదు. ఇక్కడే అతడిని కిడ్నాప్ చేసిన పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయాలన్న తన ప్లాన్‌ను ప్రియా అమలుకు పూనుకుంది.. అప్పటికే తనతో లివిన్ రిలేషన్ షిప్లో ఉన్న దీక్షంత్ కమ్రా,లక్ష్య వాలియా ప్రియ కలిసి అతడిని కిడ్నాప్ చే చేసి జైపూర్‌లోని అద్దె ఫ్లాట్‌కు తీసుకెళ్లారు. మాటల్లో అతనుతాము అనుకున్నంత ధనవంతుడి కాదని తెలిసిపోయింది. అయినా తమ ప్లాన్‌ను అమలు చేశారు. దుష్యంత్ తండ్రికి ఫోన్ చేసిన 10 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దుష్యంత్ దగ్గరనున్న ఏటీఎం కార్డునుంచి రూ.20వేలు లాగేసుకున్నారు. ఇంకా డబ్బులు కావాలని ఒత్తిడి చేశారు.లేదంటే అత్యాచార కేసు పెడతామని బెదిరించారు. దీంతో తన దగ్గర అంత డబ్బు లేదని కానీ కొంత ఎరేంజ్ చేస్తానని బతిమాలుకున్నాడు. దీంతో అతని ఫోన్ ద్వారా తండ్రికి ఫోన్ చేసి డబ్బులు అడిగారు. కొడుకు ప్రాణాలు రక్షించుకోవాలనే ఆశతో ఆయన రూ. 3 లక్షలు జమ చేశారు. అయినా కూడా తమ నేరం వెలుగులోకి వస్తుందనే భయంతో ముగ్గురు నిందితులు దుష్యంత్‌ను హత్య చేశారు. గొంతుకోసి, ముక్కలు, ముక్కలుగా నరికి సూట్ కేసులో కుక్కి ఉన్న దుష్యంత్ మృతదేహాన్ని పోలీసులు అదే ఏడాది మే 4న గుర్తించారు. ఈ కేసులో తుది విచారణ తరువాత కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. తన కొడుకును హత్య చేసిన వారికి మరణ శిక్ష విధించి ఉంటే అతని ఆత్మ శాంతించేదని దుష్యంత్ శర్మ తండ్రి కన్నీంటి పర్యంతమయ్యారు. అంతేకాదు గతంలో డేటింగ్ ద్వారా ఇలా చాలామంది మోసం చేసిన ఆరోపణల కింద జైలుకెళ్లిందట ప్రియ. -
గుంటూరు జీజీహెచ్ లో శిశువు కిడ్నాప్
-
12 గంటల్లోనే తల్లిదండ్రుల చెంతకు..
తిరుపతి క్రైం: తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న ఓ బాలుడు తెల్లవారుజామున కిడ్నాప్ కాగా... 12 గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించి తిరిగి ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసు వివరాలను మంగళవారం తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి మీడియాకు వివరించారు. చెన్నైకి చెందిన చంద్రశేఖర్, మీనా దంపతులు తమ ఇద్దరు కుమారులతో కలిసి సోమవారం అర్ధరాత్రి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లోని చెన్నై ప్లాట్‌ఫాం వద్ద నిద్రపోయారు. తెల్లవారుజామున మెలకువ వచ్చి చూడగా, రెండో కుమారుడు అరుల్ మురుగన్(2) కనిపించలేదు. దీంతో వెంటనే తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి డీఎస్పీ సురేందర్‌రెడ్డి, క్రైం డీఎస్పీ రవికుమార్, సీఐ మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో నాలుగు ప్రత్యేక బృందాలు వెంటనే బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. సీపీ ఫుటేజ్ ఆధారంగా బాలుడిని తెల్లవారుజామున 2.12 గంటలకు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ చేసిన వ్యక్తిని అవిలాల సుధాకర్‌గా నిర్ధారించుకుని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీంతో అవిలాల సుధాకర్ కిడ్నాప్ చేసిన బాలుడిని ఏర్పేడు మండలంలోని మాల గ్రామంలో తన అక్క నెల్లూరి ధనమ్మ వద్దకు తీసుకెళ్లి వదిలిపెట్టినట్టుగా సమాచారం అందింది. మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో పోలీసులు వెళ్లి బాలుడిని తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడు సుధాకర్‌తోపాటు ధనమ్మ, మరికొందరిని ఈస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకుని సమగ్రంగా విచారణ చేపడుతున్నారు. -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కిడ్నాప్ అయిన బాలుడు సేఫ్
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కిడ్నాప్ అయిన బాలుడిని పోలీసులు రక్షించారు. మాదాపూర్ బ్రిడ్జి కింద బాలుడిని గుర్తించారు. బ్రిడ్జి కింద చిన్నారిని పడుకోబెట్టి బిక్షాటన చేసిన కిడ్నాపర్.. పోలీసులను చూసి పొదల్లోకి వదిలి పారిపోయాడు. ఆరు గంటలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి బాలుడి ఆచూకీ కనుగొన్నారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. బెగ్గింగ్ కోసమే కిడ్నాపన్ చేసినట్లు తేలింది. అసలేం జరిగిందంటే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో యిదేళ్ల బాలుడు కిడ్నప్‌కు గురైన విషయం తెలిసిందే. కిడ్నాప్ చేసిన వారిని బెగ్గింగ్ మాఫియా ముఠాగా అనుమానిస్తున్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయాలపురానికి చెందిన దుర్గేశ్, తన 5 ఏళ్ల కుమారుడి శివ సాయితో కలిసి తిరుమల వెళ్ళాడు. ఈనెల 28న తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు. ఆ రోజు ఉదయం 5.30కు సికింద్రాబాద్ స్టేషన్లో దిగిన దుర్గేశ్.. అలిసిపోయి ఉండటంతో స్టేషన్లోనే పడుకున్నాడు. అనంతరం సాయంత్రం 4.30కు దుర్గేశ్.. తన కుమారుడిని బ్యాగులతో పాటు ప్లాట్ ఫామ్ నెంబర్ 1 వద్ద ఉంచి వాష్‌రూం వెళ్లాడు. వచ్చి చూసేలోపు బాబు కనిపించలేదు. దీంతో స్టేషన్లో ఉన్న జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా గుర్తు తెలియని దంపతులు బాబును కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నట్లు గుర్తించారు. ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. అయితే తప్పిపోయిన బాలుడు.. మూగ, చెవిటి అని తండ్రి దుర్గేశ్ చెబుతున్నారు. చదవండి: బీజేపీకి సోమారపు రాజీనామా! -
నిలోఫర్ కిడ్నాప్ ఉదంతం సుఖాంతం
హైదరాబాద్: నగరంలోని నిలోఫర్ ఆసుపత్రిలో బాలుడి కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది. తీవ్రంగా శ్రమించి ఈ కేసును టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించారు. నిజామాబాద్‌లో కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బాలుడ్ని సురక్షితంగా తీసుకొచ్చారు.సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు ప్రెస్ మీట్ ద్వారా ఈ వివరాలను వెల్లడించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన మమతకు మమతకు ఇదివరకే ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు. దీంతో ఓ బిడ్డను ఎత్తుకెళ్లైనా పెంచుకోవాలని మమత, ఆమె భర్త నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే.. తమ కుమారుడి ఆరోగ్యం బాలేదంటూ నిలోఫర్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ ఎవరైనా బిడ్డను అదను చూసి ఎత్తుకెళ్లాలని పథకం వేశారు. ఆస్పత్రిలో చేరిన వాళ్లతో పరిచయం పెంచుకుంటూ.. ఫైసల్‌ఖాన్ అనే చిన్నారి మీద కన్నేశారు. నాలుగు రోజుల కిందట.. ఫైసల్ తల్లి భోజనం తేవడానికి వెళ్లిన సమయంలో బిడ్డను తీసుకుని పరారయ్యారు. ఈ వ్యవహారంలో మరో ఇద్దరు ఈ జంటకు సహకరించారు. బిడ్డ కనిపించకపోయే సరికి తల్లి విషయాన్ని ఆస్పత్రి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లింది. ఆపై పోలీసులను ఆశ్రయించారు. ఆస్పత్రిలో సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో కిడ్నాపర్లను పట్టుకోవడం కష్టతరంగా మారింది పోలీసులకు. చివరకి.. ఆస్పత్రి సమీపంలోనే సీసీ ఫుటేజీల ద్వారా కేసు చేధించగలిగారు. జేబీఎస్ అక్కడి నుంచి నిజామాబాద్, కామారెడ్డి ఇలా సాగింది కిడ్నాపర్ల ప్రయాణం. చివరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ జంటను పట్టుకుని.. బాలుడ్ని సురక్షితంగా తల్లిదండ్రుల దగ్గరికి చేర్చారు. వింత వ్యాధి.. నవ్వాడనే ఉద్దేశంతోనే.. ! ఈ నెల 14తేదీన నిలోఫర్ లో కిడ్నాప్ గురైన ఆరు నెలల బాబు కిడ్నాప్ కేసును ఛేదించాం. చికిత్స కోసం ఫారీదా బేగం తన కొడుకు ఫైసల్‌ఖాన్‌ను తీసుకొని వచ్చింది. భోజనం కోసం బయటకి తల్లి వెళ్ళింది. బాలుడు తల్లి భోజనం కోసం వెళ్లగా, వెంటనే బాలుడి ని కిడ్నాప్ చేశారు. శ్రీను , మమత అనే ఇద్దరు కిడ్నాప్ చేశారు. గత కాలంగా వీళ్లిద్దరికీ పిల్లలు పుట్టి చనిపోతున్నారు. 15 రోజులు క్రితం కూడా దంపతులకు బాలుడు పుట్టారు. అనారోగ్యంతో నిలోఫర్లొనే చికిత్స పొందుతూ ఉన్నాడు. ఆ జంట.. అధిక రక్త స్నిగ్థత వ్యాధితో బాధపడుతోందని తెలుస్తోంది. దీని ప్రకారం.. మగ పిల్లలు పుడితే వెంటనే చనిపోతారు. కేవలం ఆడ పిల్ల పుడితేనే బతుకుతారు. ఇప్పటికే ఇద్దరు మగ పిల్లలు మృతి చెందారు, మూడో పిల్లోడు కూడా చనిపోతాడని భావించారు. అందుకే నిలోఫర్‌లో ఓ పక్క కొడుకు చికిత్స తీసుకుంటుండగానే.. ప్లాన్ ప్రకారం ఫైసల్‌ను ఎత్తుకెళ్లారు. ఈ జంట బాన్సువాడ టౌన్లో కిరాయికి ఇల్లు తీసుకుని ఆ ఎత్తుకొచ్చిన బిడ్డతో ఉన్నారు. నిలోఫర్ ఆస్పత్రి నుండి జూబ్లీ బస్ స్టాండ్ వరకు పోలీసులు 100 కెమెరాలు జల్లెడ పట్టి కేసును చేధించారు. ఆ బిడ్డ నన్ను చూసి నవ్వాడు. అందుకే పెంచుకుందామని ఎత్తుకెళ్లాం అని ఫైసల్ కిడ్నాప్గురించి మమత చెబుతోంది. బాలుడుకి రెండు రోజులు నిందితురాలు మమతనే పాలు ఇచ్చింది అని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. -
కొత్తగూడెంలో సినీ ఫక్కీలో వివాహిత కిడ్నాప్
సాక్షి, భద్రాద్రి: కొత్తగూడెంలో సినీ ఫక్కీలో వివాహిత కిడ్నాప్‌కు గురైంది. భర్తపై దాడి చేసి భార్యను ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని దుండగులు. వివరాలు.. ఖమ్మంకు చెందిన సన్నీ, కొత్తగూడెంకు చెందిన మాధవి ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో గురువారం ఆటోలో వెళ్తున్న దంపతులను కారులో ఛేజ్ చేసిన దుండగులు..భర్తపై దాడి చేసి, యువతిని బలవంతంగా కారులో ఎత్తుకెళ్లారు. భార్యను ప్రాజెక్ట్ వర్క్ నిమిత్తం ఖమ్మం నుంచి కొత్తగూడెం కళాశాలకు తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లి కారణాలతోనే తనపై దాడి చేసి, భార్యను కిడ్నాప్ చేశారని భర్త సన్నీ చుంచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కులాంతర వివాహం చేసుకున్న తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
కాశ్మీర్లో సెలవుపై వచ్చిన భారత జవాను అదృశ్యం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంటుకి చెందిన జవాను జావేద్ అహ్మద్ కొద్దిరోజుల క్రితమే సెలవులపై ఇంటికి తిరిగొచ్చాడు. మార్కెట్ కు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుండి బయటకు వచ్చిన అతడు తర్వాత అదృశ్యమైనట్లు తెలిపారు కుటుంబ సభ్యులు. దక్షిణ కాశ్మీర్ లో నివాసముండే భారత జవాను జావేద్ అహ్మద్(25) జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంటులో విధులు నిర్వర్తిస్తున్నాడు. సెలవుపై ఇంటికి వచ్చిన జావేద్ శనివారం సాయంత్రం 6.30 గంటలకు మార్కెట్ కు వెళ్లి వస్తానని చెప్పి ఆల్టో కారులో బయటకు వెళ్ళాడు. రాత్రి 9.00 అయినా అతను తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు అతడి కోసం గాలించడం మొదలుపెట్టారు. మార్కెట్ కు కొంత దూరంలో రక్తపు మరకలు అంటుకున్న కారు కనిపించింది కానీ అందులో జావేద్ లేడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కాశ్మీర్ పోలీసులు కేసును నమోదు చేసి ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. రక్షణ దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. గతంలో కూడా కొంతమంది సైనికులు సెలవుపై ఇంటికి వచ్చాక ఇలాగే అపహరణకు గురైన వారిని తీవ్రవాదులు దారుణంగా కడతేర్చారు. దీంతో ఇది కూడా ఉగ్రవాద చర్యగా భావించి జావేద్ తల్లి.. దయచేసి మమ్మల్ని క్షమించండి.. నా కుమారుడిని విడుదల చేయండి, నా జావేద్ ను విడుదల చేయండి.. వాడిని సైన్యంలో పనిచేయకుండా ఆపుతాను.. కానీ వాడిని విరిచిపెట్టండి.. అంటూ జవాను తల్లి ఒక వీడియో సందేశాన్ని కూడా సిద్ధం చేశారు. ఇది కూడా చదవండి: మణిపూర్ అల్లర్లకు వారే కారణమా..? -
కిడ్నాపైన బాలిక సమయస్ఫూర్తి.. తెలివిగా సమాచారం అందించి..
వాషింగ్టన్: అపాయంలో ఉండగా ఉపాయం తట్టాలే కానీ ఎంతటి అగాధాన్నైనా జయించవచ్చని నిరూపించింది అమెరికాలోని ఓ మైనర్ బాలిక. కాలిఫోర్నియాలో కిడ్నాప్‌కు గురైన ఒక మైనర్ బాలిక అగంతకుడు లేని సమయం చూసి బాలిక చాకచక్యంగా వ్యవహరించి చుట్టుపక్కల వారికి తాను ప్రమాదంలో ఉన్న విషయం తెలిసేలా సందేశాన్నిచ్చి కిడ్నాపర్ చెర నుంచి బయటపడింది. కిడ్నాప్ జరిగిందిలా.. టెక్సాస్‌కు చెందిన స్టీవెన్ రాబర్ట్ సబలాన్(61) జులై 6న సాన్ ఆంటోనియోలో తన ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తోన్న 13 ఏళ్ల బాలికను గన్ చూపించి బెదిరించి కార్ ఎక్కించుకున్నాడు. అక్కడి నుండి 1400 మైళ్ళు ప్రయాణించి కాలిఫోర్నియా వరకు తీసుకుని వెళ్ళాడు. మార్గమధ్యలో బాలికపై లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డాడు. కిడ్నాపర్ దొరికిందిలా.. లాంగ్ బీచ్ చేరిన తర్వాత అక్కడ బాలికలను బట్టలు విప్పి ఇవ్వమని అడిగి వాటిని తీసుకుని ఒక లాండ్రీ షాపులోకి వెళ్ళాడు సబలాన్. అదే సమయంలో పార్కింగ్ స్థలంలో ఉన్నవారికి తాను ప్రమాదంలో ఉన్నానని చెబుతూ ఒక కాగితం మీద "హెల్ప్ మీ" అని రాసి చూపించింది. అది గమనించిన అక్కడి వారు వెంటనే పోలీసులకు సమాచారమందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని బాలికను రక్షించారు. కటకటాల పాలు.. లాంగ్ బీచ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాన్ ఆంటోనియోకి చెందిన మైనర్ బాలిక తన ఇంట్లో వారికి చెప్పకుండా తన స్నేహితురాలిని కలుసుకునేందుకు బయటకు వచ్చిందని అదే సమయంలో సబలాన్ తుపాకీ చూపించి ఆమెను కిడ్నాప్ చేశాడని తెలిపారు. కారు నెంబరు ప్లేటు ఆధారంగా చూస్తే సబలాన్ మీద అప్పటికే టెక్సాస్‌లో దొంగతనం అభియోయోగం మోపబడిందని అన్నారు. తాజాగా అతడిపై కిడ్నాప్, మైనర్ బాలికపై వేధింపులు రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు లాంగ్ బీచ్ పోలీసులు. ఇది కూడా చదవండి: భార్యను హత్య చేశాడు.. కానీ కోర్టు నిర్దోషని తెలిపింది -
పవన్ చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలే.. ఇదిగో సాక్ష్యం
అమరావతి: చేతికి మైకు దొరికింది కదాని రెచ్చిపోయి ఊగిపోవాడం తప్ప పవన్ కళ్యాణ్ మాటల్లో వాస్తవం లేదని సాక్ష్యాధారాలతో సహా మరోసారి నిరూపితమైంది. నిజానిజాలు తెలుసుకోకుండా చేతిలో ఉన్న స్క్రిప్టుని యధాతధంగా చదివి నిరాధార ఆరోపణలు చేసి తన రాజకీయ అజ్ఞానాన్ని బట్టబయలు చేసుకున్నారు. కేంద్ర హోంశాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలో ఐపీసీ 363, 369 (కిడ్నాప్, అపహరణ)సెక్షన్ల కింద నమోదైన మొత్తం కేసుల సంఖ్య కేవలం 867గా ఉంది. శాంతిభద్రతల్లో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్ర రాష్ట్రం చాలా మెరుగ్గా ఉంది. దేశవ్యాప్తంగా కిడ్నాప్ లేదా అపహరణకు గురవుతున్న వారు లక్షకు 7.4 శాతంగా ఉంటే ఆంధ్రాలో కేవలం 1.6 గా ఉంది. రెండేళ్లలో నమోదైన కేసుల సంఖ్య ఆధారంగా చూస్తే, దేశవ్యాప్తంగా కిడ్నాప్ అపహరణ కేసుల్లో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం అత్యధికంగా 14714 కేసులతో మొదటి స్థానంలో నిలిచింది. 10680 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలోనూ 10252 కేసులతో బీహార్ మూడో స్థానంలోనూ ఉండగా ఆంధ్ర ప్రదేశ్ ఎక్కడో అట్టడుగున 18వ స్థానంలో ఉంది. మహిళలకు రక్షణ కల్పించడంలో ఆంధ్ర ప్రదేశ్ చాలా ముందుందని చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం. సరైన అవగాహన లేకుండా పవన్ తప్పుడు లెక్కలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఎవరైనా తెలివిగల్లోళ్లు పవన్ పక్కన ఉంటే నివేదికను చక్కగా వివరించే అవకాశమైనా ఉండేది. విషయ సంగ్రాహక శక్తి తక్కువగా ఉన్నందునో, వాస్తవాలు తెలుసుకోవాలన్న ఆసక్తి కొరవడినందునో.. ప్రతి విషయాన్ని వక్రీకరించి అసత్యాలను ప్రచారం చేస్తూ పవన్ ఎప్పటికప్పుడు జనం ముందు నవ్వులపాలవుతున్నారు. -
ఘట్ కేసర్ లో కిడ్నాపైన నాలుగేళ్ల చిన్నారి సురక్షితం
-
GST అధికారుల కిడ్నాప్ కేసులో కీలక విషయాలు
-
మేడ్చల్ జిల్లాలో నాలుగేళ్ల కృష్ణవేణి కిడ్నాప్
-
హైదరాబాద్ లో GST ఆఫీసర్ల కిడ్నాప్ కేసులో టీడీపీ నేత ముజీబ్
-
జీఎస్టీ అధికారుల కిడ్నాప్ ఉదంతంపై కేంద్రం సీరియస్
సాక్షి, హైదరాబాద్: సరూర్ నగర్ పరిధిలో జీఎస్టీ అధికారుల కిడ్నాప్.. పోలీసులు ఆ కేసును చేధించిన ఘటనను కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ నిర్మలా సీతారామన్.. అధికారుల కిడ్నాప్ ఘటనపై తెలంగాణ పోలీసులను ఆరా తీశారు. అధికారుల కిడ్నాప్ ఉదంతాన్ని తీవ్రంగా ఖండించిన ఆమె.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్, పోలీస్ కమిషనర్లను ఫోన్లో కోరారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జీఎస్టీ అధికారులను కిడ్నాప్ చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. జీఎస్టీ కట్టని షాప్‌ను సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి ఆఫీసర్ మణిశర్మ, మరో అధికారి ఆనంద్‌లను.. దుకాణదారు, మరో ముగ్గురితో కలిసి కిడ్నాప్ చేశాడు. అయితే ఆగమేఘాలపై స్పందించిన పోలీసులు కిడ్నాపర్లను వెంటాడి అధికారులను రక్షించారు. కిడ్నాప్‌కు పాల్పడిన నిందితులు ఫిరోజ్, ముజీఫ్, ముషీర్, ఇంతియాజ్‌లను అరెస్ట్ చేశారు. వీరిని పోలీసులు మీడియా ముందు హాజరుపరిచారు. ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకృష్ణా నగర్లో ఫేక్ జీఎస్టీ నంబర్‌తో gst కట్టని ఒక స్క్రాప్ గోదాంను సీజ్ చేసేందుకు..GST ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ మణి శర్మ , ఆనంద్ లు వెళ్లారు. ఆ సమయంలో షాప్ నిర్వాహకుడు , మరో ముగ్గురు కలిసి... ఫార్చ్యూనర్ కార్ లో కిడ్నాప్ చేశారు. GST అధికారుల ఐడీ కార్డు లు చింపి..వారి పై దాడి చేశారు. మాకు సమాచారం అందగానే... దిల్సుఖ్ నగర్ రాజీవ్ చౌక్ వద్ద కిడ్నాపర్స్ ను అదుపులోకి తీసుకున్నాము. ఒక నిందితుడు ఖాయూం పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నాం అని డీసీపీ వెల్లడించారు. ఇదీ చదవండి: జీఎస్టీ అధికారి కిడ్నాప్.. నిందితులు టీడీపీ నేత అనుచరులు? -
హయత్ నగర్ లో బాలిక కిడ్నాప్, అత్యాచార యత్నం
-
వధువు మెడపై కత్తి పెట్టి కిడ్నాప్.. నిశ్చేష్టుడైన వరుడు! చూస్తుండగానే
అక్కడ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. వధువును వరునికి అప్పగించే సమయం రానే వచ్చింది. అయితే ఇంతలో ఊహించని ఘటన ఎదురయ్యింది. వరునితో పాటు అతని బంధువర్గం ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో చిక్కుకుంది. రాజస్థాన్‌లోని భీల్వాడాలో ఒక యువకుడు కొత్త పెళ్లికూతురును ఆమె కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలోనే కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిపోయాడు. అప్పగింతల అనంతరం నూతన వధూవరులు దేవుని దర్శనం కోసం ఆలయానికి వెళ్లారు.ఇంతలో ఒక యువకుడు తన స్నేహితులతో పాటు అక్కడికి వచ్చి మారణాయుధాలతో అందరినీ బెదిరించి, వధువు మెడపై కత్తిపెట్టి, ఆమెను అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయాడు. వధువు తరపువారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ యువకునిపై కేసు నమోదు చేశారు. పోలీసులు వధువుతో పాటు ఆ యువకుడి కోసం గాలింపు చేపట్టారు. భీల్వాడా పరిధిలోని బిజోలియాకు చెందిన రవి నాయక్‌కు లాఛుడాకు చెందిన కవిత(మార్చిన పేరు)తో వివాహం జరిగింది. అనంతరం వధూవరులు, వారి బంధువులతో పాటు ఒక ఆలయానికి వెళ్లారు. ఇంతలో అక్కడకు ముగ్గురు యువకులు స్కూటర్ మీద వచ్చారు. వారు కత్తులు చూపించి, పెళ్లివారిని బెదిరించడంతోపాటు వధువు మెడపై కత్తి పెట్టి ఆమెను తీసుకువెళ్లిపోయారు. అయితే పెళ్లివారు ఆ యువకులను కొంత దూరం వరకూ వెంబడించారు. అయినా ఆ యువకులను పట్టుకోలేకపోయారు. తరువాత వారు ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ‘ప్రేమికుడే ఈ పని చేశాడు’ ఈ సందర్భంగా వరుడు మాట్లాడుతూ పెళ్లి అనంతరం అప్పగింతల కార్యక్రమం పూర్తయ్యాక తాము భగవంతుని ఆశీర్వాదం కోసం ఆలయానికి వెళ్లామన్నారు. అదే సమయంలో వధువును కిడ్నాప్ చేశారని తెలిపారు. ఆ సమయంలో తన భార్య తన చేయి పట్టుకునే ఉందని, తన చేతికి కూడా గాయం అయ్యిందన్నారు. అయితే తన భార్య ప్రేమికుడే ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. కాగా ఈ ఉదంతంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇది కూడా చదవండి: ఇక్కడ భాగస్వామికి ఒక్కసారైనా కిస్ పెట్టాల్సిందే! -
హైదరాబాద్- ఘట్కేసర్ లో కిడ్నాప్ కలకలం
-
కిడ్నాప్ అనుమానంతో డ్రైవర్‌పై కాల్పులు
టెక్సాస్: ఉబర్ డ్రైవర్ తనను కిడ్నాప్ చేస్తున్నాడన్న అనుమానంతో అమెరికాకు చెందిన ఒక మహిళ దారుణానికి దిగింది. మెక్సికోకు తనను తీసుకువెళుతున్నాడని భయపడి డ్రైవర్‌పై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ఆస్పత్రిలో మృతిచెందాడు. టెక్సాస్‌కు చెంది ఫోబె కోపాస్ (48) తన ప్రియుడి దగ్గరికెళ్లేందుకు ఉబర్ క్యాబ్ బుక్ చేసుకుంది. కారు ఎక్కాక ఫోన్లో ఏదో మాటల్లో పడిపోయిన ఆమె ఆ తర్వాత హఠాత్తుగా పరిసరాలను చూసి తనను మెక్సికోకి తీసుకువెళుతున్నారని అనుమానపడింది. వెంటనే తన బ్యాగ్‌లో ఉన్న తుపాకీతో డ్రైవర్ డేనియల్ పియేడ్రాపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో మెడకు తీవ్ర గాయాలైన అతను రక్తపు మడుగులో పడిపోయాడు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా పోలీసులకు సమాచారం ఇచి్చంది. పోలీసుల విచారణలో ఆ డ్రైవర్ కిడ్నాప్ చేయడానికి ప్రయతి్నంచినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అందుకే ఆమెపై హత్య కేసు నమోదు చేశారు. ఉబర్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఇలాంటి హింసను సహించలేమంటూ ఫోబె మళ్లీ ఉబర్ సేవలు వినియోగించుకోకుండా నిషేధం విధించింది. -
విశాఖ కిడ్నాప్ కేసు.. ఎంపీ ఎంవివి దగ్గర డబ్బు గుంజడానికి ప్లాన్ చేశారా?
-
కొడుకు కిడ్నాప్‌పై స్పందించిన ఎంపీ
-
విశాఖ కిడ్నాప్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు
-
ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట.. దారిలో షాకిచ్చిన వధువు ఫ్యామిలీ
సాక్షి, హుజురాబాద్: ప్రేమపెళ్లి చేసుకున్న ఓ నవ వధువు సినీఫక్కీలో కిడ్నాప్‌కు గురైంది. హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. కొండగట్టులో ప్రేమ పెళ్లి చేసుకుని హన్మకొండ వైపుగా కొత్త జంట వెళుతోంది. కారును అడ్డగించిన 15 మంది.. వరుడిపై దాడి చేసి, వధువును తీసుకెళ్లారు. వధూవరులిద్దరు హన్మకొండకు చెందినవారు. కొంతకాలంగా ప్రేమించుకున్న వీరు పెళ్లితో ఒక్కటయ్యారు. ప్రేమ పెళ్లి ఇష్టం లేకపోవడంతో పెళ్లికూతురు బంధువులు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. తమ అమ్మాయి కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేయడంతో రెండు రోజుల క్రితం మిస్సింగ్ కేసు నమోదైంది. పోలీసుల సమక్షంలోకి వధువును తీసుకురానున్నట్లు సమాచారం. -
మార్కులు తగ్గాయని ఇంట్లో నుంచి వెళ్లి.. రూ.కోటి ఇవ్వాలంటూ తండ్రికి మెసేజ్!
కోల్‌కతా: పరీక్షల్లో మార్కులు తగ్గితే కొందరు విద్యార్థులు మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ 16 ఏళ్ల బాలిక పరీక్షల్లో మార్కులు తగ్గడంతో తల్లిదండ్రులు తిడతారని భయంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అంతటితో ఆగకుండా తనని కిడ్నాప్ చేశారని నాటకమాడి తన తండ్రి నుంచి కోటి వసూలు చేయాలని ప్రయత్నించింది. ఈ షాకింగ్ ఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. పరీక్షల ఫలితాలు విడుదల కావడంతో తన మార్కులను తెలుసుకునేందుకు సైబర్ కేఫ్‌కి తన 6 ఏళ్ల సోదరితో కలిసి తన ఇంటి నుంచి బయలుదేరింది. ఎంతసేపటికి ఆమె తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు బాలికకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. వాళ్లు కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. దీంతో పోలీసులు అక్కాచెల్లెళ్ల కోసం గాలింపు మొదలుపెట్టారు. అదే సమయంలో, బాలిక తండ్రికి గుర్తుతెలియని నంబరు నుంచి ఓ మెసేజ్ వచ్చింది. తన కుమార్తెలిద్దర్నీ కిడ్నాప్ చేశామని, రూ.కోటి ఇస్తేనే విడిచిపెడతామని అందులో ఉంది. దీంతో పోలీసులు ఆ ఫోన్ నంబరు ఆధారంగా చివరకు నదియా జిల్లాలోని ఓ నర్సింగ్ హోం ఎదుట వారు ఉన్నట్లు గుర్తించి కాపాడారు. అయితే విచారణలో వారు కిడ్నాప్ కాలేదని ఇది డ్రామా అని తెలిసి అవాక్కయ్యారు. తల్లిదండ్రులకు భయపడి తానే ఈ నాటకమాడినట్లు బాలిక కూడా అంగీకరించింది. చదవండి: ‘మోసం చేసింది.. నా లవర్ బర్త్‌డే రోజునే చనిపోతున్నా’.. సెల్ఫీ వీడియో తీసుకుని.. -
Vizag: ఇద్దరు పిల్లలను కిడ్నాప్ చేసిన ఆటోడ్రైవర్.. 24 గంటల్లోనే
కోవెలకుంట్ల(నంద్యాల)/తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర) : ఇద్దరు పిల్లలను ఆటోడ్రైవర్ కిడ్నాప్ చేసి తీసుకెళుతుండగా పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. బుధవారం కోవెలకుంట్ల సీఐ నారాయణరెడ్డి అందించిన సమాచారం మేరకు.. పట్టణంలోని నాగులకట్ట సమీపంలో నివాసముంటున్న షేక్ మహమ్మద్, షమీవున్ దంపతులకు షేక్ రిజ్వానా, షేక్ ఆసియా సంతానం. పెద్ద కుమార్తె స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి, చిన్న కుమార్తె ఇదే పట్టణంలోని గాంధీ సెంటర్ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నారు. పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో పిల్లలు పట్టణంలోని సెయింట్ జోసఫ్స్ పాఠశాలలో కబడ్డీ నేర్చుకునేందుకు వెళుతున్నారు. కోవెలకుంట్లకు చెందిన ఇమాంఉసేన్ పిల్లలను ఆటోలో ఎక్కించుకుని రోజూ పాఠశాల వద్ద వదిలేవాడు. మంగళవారం ఉదయం పిల్లలను ఆటోలో పంపించి తల్లిదండ్రులు పనుల నిమిత్తం వెళ్లిపోయారు. అయితే అతను పిల్లలను స్కూల్ వద్ద దించకుండా మాయమాటలు చెప్పి ఆటోను నంద్యాల వైపు మళ్లించాడు. నంద్యాలలో దిగి పిల్లలతో సహా గుంటూరు రైలెక్కాడు. రాత్రి అయినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది పట్టణంలోని పలు ప్రాంతాల్లో గాలించారు. ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆటో డ్రైవర్ సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా వైజాగ్ రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని చిన్నారులను రక్షించారు. కోవెలకుంట్ల ఎస్ఐ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బృందాలు అక్కడకు చేరుకోగా రైల్వేపోలీసులు పిల్లలను వారికి అప్పగించారు. ఆటో డ్రైవర్ చిన్నారులను ఎత్తుకెళ్లి విక్రయించేందుకు ఒడిగట్టినట్లు తెలుస్తోంది. చిన్నారుల కిడ్నాప్ మిస్టరీని పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. -
‘అయేషా వస్తేనే నీ కొడుకు క్షేమంగా ఉంటాడు.. లేదంటే!’
ముంబై: వివాహేతర సంబంధం కోసం మహిళ కొడుకును అపహరించిన సంఘటన థానే జిల్లాలోని శాంతినగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారం.. పట్టణంలోని మహ్మద్ అలీ ఫకీర్, అయేషా బీబీ దంపతులు టెమ్‌ఘర్ మురికివాడలో ఉంటున్నారు. రిపోన్ వ్యాపారి అనే వ్యక్తితో అయేషాకు వివాహేతర సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. తనతోపాటు వచ్చేయాలని అయేషాపై ఒత్తిడి పెంచాడు. ఆమె అందుకు అంగీకరించకపోవడంతో ఏప్రిల్ 3న సాయంత్రం ఇంటిముందు ఆడుకుంటున్న ఆమె కుమారుడు ఆషిక్ (4)ను కిడ్నాప్ చేశాడు. ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లాడు కనిపించకపోవడంతో చుట్టుపక్కల గాలించిన అలీ, అయేషా స్థానిక శాంతినగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తిరిగి ఇంటికి వచిన వారికి రిపోన్ వ్యాపారి ఫోన్ చేసి ‘మీ కుమారుడు నావద్దనే ఉన్నాడు. అయేషా వస్తేనే సురక్షితంగా ఉంటాడు. లేదంటే హతమారుస్తాను’ అని బెదిరించాడు. ఈ విషయాన్ని వెంటనే శాంతినగర్ పోలీసులకు తెలిపారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా నాసిక్ రైల్వే స్టేషన్లో ఉన్నట్లు గ్రహించిన సీనియర్ ఇన్స్పెక్టర్ శంకర్ తన బృందంతో 24 గంటల్లో నిందితుని పట్టుకొన్నారు. బాబును తల్లిదండ్రులకు అప్పగించారు. -
పక్కా ప్లాన్ వేసి కిడ్నాప్.. చిన్నారి దెబ్బకు దిమ్మతిరిగింది కదా!
చిన్న పిల్లల కిడ్నాప్‌లు ఇటీవల పెరిగిపోతున్నాయి. అందుకు కిడ్నాపర్లు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు. కిడ్నాప్ చేసే ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి అందరి ముందే పిల్లాడిని కిడ్నాప్ చేసేందుకు ప్లాన్ వేశాడు. అనుకున్నదే తడవుగా అమలు కూడా చేశాడు. అయితే ఆ చిన్నారి చిచ్చర పిడుగులా ప్రవర్తించే సరికి చివరిక అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. ఇంతకీ ఆ బాలుడు ఏం చేశాడు..? వివరాల్లోకి వెళితే.. చిక్కమగళూరు నగరంలోని ఎంజీ రోడ్డులో ఫుట్‌పాత్‌పై ఆడుకుంటున్న చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు ఓ అజ్ఞాత వ్యక్తి ప్రయత్నించాడు. అది కూడా అందరూ చూస్తుండగానే ఈ ప్లాన్ వేశాడు. ఇంకేముంది సైలెంట్‌గా అపహరించి, భుజాలపై ఎత్తుకుని, అక్కడి నుంచి జారుకునేందుకే సిద్ధమయ్యాడు. అయితే అదే సమయంలో అప్రమత్తమైన బాలుడు కిడ్నాపర్ భుజం నుంచి సినిమాటిక్‌గా తప్పించుకున్నాడు. దీంతో ఖంగుతిన్న ఆ కిడ్నాపర్ వెంటనే పారిపోయాడు. కిడ్నాపర్ బారి నుంచి తప్పించుకుని ఆ చిన్నారి చూపిన ధైర్యానికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ కాగా ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. -
కుక్క పిల్లను కిడ్నాప్ చేసిన కోతి.. వీడియో వైరల్
-
ఐఫోనా మజాకా? మైనర్ కిడ్నాప్ డ్రామా...కట్‌చేస్తే..!
ఖరీదైన ఐఫోన్ కోసం 9వ తరగతి కిడ్నాప్ డ్రామా ఆడిన ఘటన వెలుగులోకి వచ్చింది. చిరు వ్యాపారి అయిన తండ్రి ఐఫోన్ కొనివ్వలేకపోవడంతో ఎలాగైనా తన పంతం నెరవేర్చుకోవాలనుకున్నాడు. తనను తానే కిడ్నాప్ చేసుకున్నాడు చివరికి పోలీసుల చేతికి గతుక్కుమన్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థి తానే కిడ్నాప్ అయినట్టుగా డ్రామా ఆడాడు. ఆ తరువాత తన స్నేహితుడి ఫోన్ ద్వారా తండ్రికి ఫోన్ చేసి రూ. 5 లక్షలు డిమాండ్ చేశాడు. ఈ విషయంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, లొకేషన్‌ను ఆధారంగా వారిని పట్టుకున్నారు. సీతాపూర్ కొత్వాలి పోలీసు అధికారి చెప్పిన వివరాల ప్రకారం నిందితుడు మైనర్‌కు ఏడాది వయసున్నప్పుడే తల్లి చనిపోయింది. దీంతో గారాబంగా పెరిగాడు. రెండు రోజుల క్రితం పాఠశాల ముగిసిన తర్వాత విద్యార్థి ఇంటికి తిరిగి రాకపోవడంతో, అతని తండ్రి, ఇతర బంధువులు కంగారుపడి వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో 5 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ వాట్సాప్ కాల్ వచ్చింది. ఆ మొత్తాన్ని ఖైరాబాద్లో(యూపీ) మసీదు సమీపంలో డెలివరీ చేయాలని కూడా చెప్పాడు. దీంతో తండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన జిల్లా పోలీసులు, సైబర్, ఎస్ఓజీ బృందాలు వివరాలు ఆరాతీశారు. ఫోన్ ఫుట్‌వేర్ షాప్ యజమానిదిగా గుర్తించి విచారించగా ఆఫోన్‌ను వాళ్లబ్బాయి వాడుతున్నట్టు తేలింది. ఎట్టకేలకు ఇద్దరినీ కనుగొన్న పోలీసులు కౌన్సెలింగ్ అనంతరం వారిని కుటుంబాలకు అప్పగించారు. -
యూపీలో ఆవు దొంగతనం.. అర్థరాత్రి కారులో వచ్చి.. వైరలవుతున్న వీడియో
-
కాల్‌గర్ల్‌ను బుక్ చేసుకున్నారు.. చివర్లో ఊహించని ట్విస్ట్, ఏమైందో తెలుసా?
బనశంకరి(బెంగళూరు): బెంగళూరు నగరంలో కాల్‌గర్ల్ పేరుతో డబ్బులు దండుకుంటున్న ముఠాను పోలీసులు పట్టుకుని కటకటాల వెనుక నెట్టారు. కేసుకు సంబంధించి యువతితో పాటు మొత్తం ఏడుగురిని బేగూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 17న అర్ధరాత్రి బన్నేరుఘట్ట రోడ్డు దేవర చిక్కనహళ్లి వద్ద యువతితో మంజునాథ్, రజనీకాంత్ నిలబడ్డారు. ఈ సమయంలో అక్కడికి నాలుగు బైకుల్లో వచ్చిన గ్యాంగ్ కారును డీకొట్టారని మంజునాథ్, రజనీకాంత్‌తో గొడవకు దిగారు. అనంతరం కొద్దిక్షణాల్లో వచ్చిన మరికొందరు వీరి కారులోనే కిడ్నాప్ చేశారు. కోళిఫారం గేట్ వద్ద మంజునాథ్ కిడ్నాపర్ల నుంచి తప్పించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. కిడ్నాప్ విషయం అలర్ట్ అయిన పోలీసులు సమాచారం ఆధారంగా అపహరణకు గురైన రజనీకాంత్‌ను కాపాడారు. ప్రముఖ ఆరోపి తిరుమలేశ్‌తో పాటు నవీన్, కెంపరాజు, ముఖేశ్, మంజునాథ్, దలి్వర్సావుద్, యువతిని అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో యువతి కాల్‌గర్ల్ అనే విషయం తెలిసింది. కిడ్నాపర్లకు సమాచారం ఇచ్చిన ముఠా యువతి: మంజునాథ్, రజనీకాంత్ యువతిని బుక్ చేశారు. అర్దరాత్రి ఇంటికి వెళుతున్న సమయంలో కిడ్నాప్‌నకు గురయ్యారు. యువతి ముందే వీరు ఉన్న స్థలం గురించి కిడ్నాపర్లకు సమాచారం అందించింది. ముగ్గురు కలిసి నిర్జీన ప్రాంతంలో ఉండగా వచ్చిన ముఠా ఇద్దరిని అపహరించారు. మంజునాథ్, రజనీకాంత్ ముందు యువతి కూడా అపహరణకు గురైనట్లు నటించింది. అన్ని అనుకున్న ప్రకారం యువతి, ఆమె గ్యాంగ్ ఇద్దరిని అపహరించారు. కానీ కారు కోళీఫారం గేట్ వద్దకు వెళ్లగానే మంజునాథ్ తప్పించుకుని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి కిడ్నాప్ విషయం తెలిపాడు. అపహరించిన కిడ్నాపర్లు మండ్య, మైసూరు ద్వారా నంజనగూడుకు వెళ్లారు. రజనీకాంత్ విడుదలకు రూ.5 లక్షలు రూపాయలు డిమాండ్ చేశారు. ప్రస్తుతం కిడ్నాపర్లు అందరిని బేగూరు పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి భర్తకు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన భార్య.. అసలేం జరిగింది? -
విచారణకు తీసుకువెళ్తే..కిడ్నాప్ అంటూ ఎల్లోమీడియా తప్పుడూ కథనాలు
సాక్షి, పుట్టపర్తి టౌన్: కేసు విచారణ నిమిత్తం ఓ నిందితు డిని పోలీసులు తీసుకెళ్తే ఆ విషయంలో తన అనుచరుల హస్తం ఉందని, ఆ వ్యక్తిని కిడ్నాప్ చేశారని ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పచ్చ పత్రికలతో కలిసి కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు. శనివారం పుట్టపర్తిలోని వైఎస్సార్ సీపీ కార్యాయలంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లమాడ మండలానికి చెందిన చెరువు నరేంద్రరెడ్డి అనే వ్యక్తిని గుప్త నిధుల తవ్వకాల కేసులో పోలీసుల ప్రత్యేక బృందం విచారణ నిమిత్తం తీసుకెళ్లిందన్నారు. అయితే, సదరు వ్యక్తిని తన అనుచరులు కిడ్నాప్ చేశారని, ఎమ్మెల్యే హస్తం ఉందని ఓ పచ్చ పత్రికలో వచ్చిందన్నారు. తనపై అవాస్తవాలు ప్రచారం చేసిన పత్రికపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమంతో పాటు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా తాము ముందుకు సాగుతుండడాన్ని చూసి మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఓర్వలేకపోతున్నారన్నారు. రూ. 6 వేల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, 193 చెరువులు నింపేందుకు చర్యలు తీసుకున్నామని, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే లాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆయన వివరించారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు. టీడీపీ హయాంలో మండలానికి 200 ఇళ్లు మంజూరు చేస్తే, తాము అధికారంలోకి వచ్చాక నిరుపేదల కోసం 25 వేల ఇళ్లు మంజూరు చేశామన్నారు. అడ్డదారుల్లో రాజకీయం చేయడం, వ్యక్తిగత దూషణలకు పాల్పడడం పల్లె రఘునాథరెడ్డికే చెల్లిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయాలకు అనుగణంగా పనిచేస్తూ, సత్యసాయి బాబా కలలు కన్న బంగారు పుట్టపర్తిని తీర్చిదిద్దుతున్న తమపై అభాండాలు వేయడం హేయమన్నారు. ప్రజలకన్నీ తెలుసని, వారే మళ్లీ టీడీపీ నేతలకు బుద్ధి చెబుతారని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో నెడ్‌క్యాప్ డైరెక్టర్ మాధవరెడ్డి, జిల్లా అగ్రీ అడ్వైజరీ బోర్డు చైర్మన్ రమణారెడ్డి, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి కేశప్ప, మున్సిపల్ చైర్మన్ తుంగ ఓబుళపతి, వైస్ చైర్మన్ తిప్పన్న, పట్టణ కన్వీనర్ రంగారెడ్డి, కౌన్సిలర్ చెరువుభాస్కర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ నారాయణరెడ్డి, నాయకులు సాయి, కడపరాజా తదితరులు పాల్గొన్నారు. కిడ్నాప్ వార్త వదంతే నల్లమాడ: మండలంలోని చెరువువాండ్లపల్లికి చెందిన నరేంద్రరెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు వచ్చిన వార్తలన్నీ వదంతులేనని సీఐ నిరంజన్‌రెడ్డి శనివారం తెలిపారు. నరేంద్రరెడ్డితో పాటు గుప్త నిధుల తవ్వకంలో ప్రమేయం ఉందన్న అనుమానంతో అదే గ్రామానికి చెందిన శివశంకర్‌రెడ్డిని కూడా అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
Hyderabad: పెంపుడు పిల్లిని ఎత్తుకెళ్లాడు.. సీసీటీవీలో రికార్డు.. కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: అరుదైన జాతికి చెందిన ఓ పెంపుడు పిల్లిని గుర్తుతెలియని వ్యక్తి అపహరించారు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... చింతలకుంట జహంగీర్‌కాలనీలో ఎస్.కె.గజాన మహ్మద్(22) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. థాయిలాండ్‌లోని కాహో మనీ బ్రీడ్‌కు చెందిన పిల్లిని రూ. 50 వేలకు కొనుగోలు చేశారు. 18 నెలల వయసు ఉన్న ఆ పిల్లికి నోమనీ అని పేరు కూడా పెట్టుకున్నాడు. ఈ పిల్లి కండ్లు ఒకటి గ్రీన్ కలర్లో, మరొకటి బ్లూ కలర్లో ఉంది. ఇదే ఈ పిల్లి ప్రత్యేకత. అయితే ఆదివారం రాత్రి పిల్లి ఇంట్లో నుంచి బయటకు వెళ్లడంతో స్కూటీపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి దానిని ఎత్తుకెళ్లాడు. దీంతో బాధితుడు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. -
కవాడిగూడలో మిస్సైన తేజశ్రీ కోసం గాలింపు ముమ్మరం
-
నిజామాబాద్ పాలిటెక్నిక్ గ్రౌండ్ లో కిడ్నాప్ కలకలం
-
ముంబైలో దారుణం..అందరూ చూస్తుండగా కత్తితో దాడి చేసి..
ముంబై: ముంబైలో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఒక సముహం ఒక వ్యక్తి కారుని ఢీ కొట్టి, అతనిపై కత్తితో దాడి చేశారు. దీంతో ఆప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన ఘటన మొత్తం సమీపంలోని సీసీఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. ఆ వీడియోలో ఒక పిక్ అప్ వ్యాన్ మరో వాహనాన్ని ఢీ కొట్టినట్లు కనిపించింది. ఆ తర్వాత ఒక గుంపు వాహనంలోని ఓ వ్యక్తిని బయటకు లాగి కత్తితో పదేపదే దాడి చేసి గాల్లో కత్తిని ఊపుతూ.. అక్కడ ఉన్న వారందర్నీ భయబ్రాంతులకు గురి చేశారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. గాయపడిన వ్యక్తిని ఎవరూ కాపడే ప్రయత్నం చేయనీయకుండా ఆ దుండగులు గాల్లో కాల్పులు జరిపినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం దాడికి గురైన వ్యక్తిని హర్జిత్‌సింగ్‌గా గుర్తించారు పోలీసులు. నిందితులు దాడి అనంతరం ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కత్తిని, ఆ కారుని స్వాధీనం చేసుకున్నారు. ఈ వివాదం పంది మాంస వ్యాపారంతో ముడిపడి ఉండవచ్చని అన్నారు. వారంతా పందిమాంస వ్యాపారులని చెప్పారు. ఐతే అదే వాహనంలోని ఇతర వ్యక్తులపై దుండగు దాడి జరగనట్లు సీసీటీవీ విజ్యువల్స్ చూపిస్తున్నాయని చెప్పారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: షాకింగ్ వీడియో: ఆడుకుంటూ బావిలో పడ్డ బాలుడు.. మూడు నిమిషాల్లోనే!) -
ఎంగేజ్మెంట్ అయిన మరునాడే యువతి కిడ్నాప్ కలకలం..
రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని చందుర్తి మండలం మూడపల్లిలో యువతి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో తండ్రి చంద్రయ్య తో కలిసి శాలిని(18) అనే యువతి హనుమాన్ దేవాలయంలో పూజ చేసి బయటకు వస్తుండగా నలుగురు యువకులు ఆమెను లాక్కెళ్లారు. గుడి ముందు కాపుకాసి యువతి తండ్రిని కొట్టి ఆమెను ఎత్తుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. శాలినికి సోమవారమే ఎంగేజ్మెంట్ అయినట్లు తెలుస్తోంది. మరునాడే ఆమెను యువకుడు కిడ్నాప్ చేయడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే యువతి మైనర్‌గా ఉన్నప్పుడు గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆమెను ప్రేమ పేరుతో వేధించాడు. దీంతో పోక్సో కేసులో అరెస్టయ్యి జైలుకు వెళ్లొచ్చాడు. అతడే తమ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఉంటాడని చంద్రయ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు రెండు బృందాలుగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. కిడ్నాప్ చేసిన యువకుడ్ని జానేశ్వర్ అలియాస్ జానుగా గుర్తించారు. చదవండి: వివాహేతర సంబంధాలకు కారణాలివే.. సర్వేలో షాకింగ్ విషయాలు -
కిడ్నాప్ చేసిన సందర్భంలో ఘోరంగా ట్రీట్ చేశారు
-
ఆదిభట్ల పీఎస్ పరిధిలో యువతి కిడ్నాప్ కలకలం
-
పసిప్రాయంలో కిడ్నాప్.. 51 ఏళ్ల తర్వాత..
వాషింగ్టన్: ఊహ కూడా తెలియని పసిప్రాయంలోనే ఆ బాలిక కిడ్నాపైంది. తల్లిదండ్రుల ప్రేమకు నోచుకుకుండా పరాయి ఇంట్లోనే పెరిగింది. అయితే విధి ఆమెను మళ్లీ కుటుంబంతో కలిసేలా చేసింది. 51 ఏళ్ల తర్వాత ఆ మహిళ తన ఇంటికి చేరుకుంది. అమెరికా టెక్సాస్‌లోని ఫోర్ట్ వర్త్‌లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అల్టా అపంటెంకో అనే మహిళకు ఓ పాప ఉండేది. ఉద్యోగం వల్ల తీరక లేకపోవడంతో చిన్నారి ఆలనా పాలనా చూసుకునేందుకు ఓ ఆయాను నియమించాలనుకుంది. ఆమె రూమ్ మేట్ ఓ మహిళ ఉందని చెప్పడంతో వివరాలేవి తెలుసుకోకుండానే పనిలో పెట్టుకుంది. అయితే వచ్చిన ఆయా ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పాపను కిడ్నాప్ చేసింది. 1971 ఆగస్టు 23న ఈ ఘటన జరిగింది. చిన్నారి కన్పించకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ వారు ఎంత వెతికినా పాప ఆచూకీ లభించలేదు. తల్లిమాత్రం తన బిడ్డ కోసం అప్పటినుంచి వెతుకుతూనే ఉంది. చివరకు ఈ ఏడాది సెప్టెంబర్‌లో తమ బిడ్డ ఫోర్ట్ వర్త్‌కు 1100 మైళ్ల దూరంలో ఉందనే విషయం బంధువుల ద్వారా అల్టాకు తెలిసింది. వెంటనే వాళ్లు అధికారులను సంప్రదించి డీఎన్ఏ టెస్టు నిర్వహించాలని చెప్పారు. పాప పుట్టిన తేదీ, పుట్టుమచ్చలు, డీఎన్ఏ ఫలితాల ఆధారంగా 51 ఏళ్ల క్రితం కిడ్నాపైంది ఈమే అని అధికారులు నిర్ధరించారు. దీంతో బాల్యంలో తప్పిపోయిన మెలిస్సా హై స్మిత్ ఐదు దశాబ్దాల తర్వాత కుటుంబం చెంతకు చేరింది. తన వాళ్లతో కలిసి చర్చిలో నిర్వహించిన వేడుకలో పాల్గొంది. ఇన్నేళ్ల తర్వాత తమబిడ్డను చూసి తల్లిదండ్రులు, తోబుట్టువులు ఆనంద పరవశంలో మునిగిపోయారు. బిడ్డను చంపిందనే అపవాదు.. అయితే దర్యాప్తు అధికారులు ఈ కేసును చాలా సార్ల తప్పుదోవ పట్టించారని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. గైనకాలజిస్ట్ సాయంతోనే తమబిడ్డ దక్కినట్లు పేర్కొంది. పాప కిడ్నాపై చాలా సంవత్సరాలు కన్పించకపోవడంతో తల్లే ఆమెను హత్య చేసి ఉంటుందనే ప్రచారం కూడా జరిగింది. ఎట్టకేలకు ఆ దుష్ప్రచారానికి తెరపడింది. చదవండి: మంకీపాక్స్ పేరు మార్చిన డబ్ల్యూహెచ్ఓ.. ఇకపై ఇలానే పిలవాలి..! -
ఆప్ అభ్యర్థి కిడ్నాప్!...అంతా చేస్తోంది బీజేపీనే: సిసోడియా
న్యూఢిల్లీ: బీజేపీపై ఆప్ నేత ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. గుజరాత్ ఎన్నికల్లో ఓడిపోతానన్న భయంతో బీజేపీ గుజరాత్‌లోని తమ ఆప్ అభ్యర్థిని కిడ్నాప్ చేసిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు గుజరాత్‌లోని సూరత్ నుంచి పోటీ చేస్తున్న కంచన్ జరీవాలా అనే ఆప్ అభ్యర్థిని బీజేపి కిడ్నాప్ చేసిందంటూ ఆరోపణలు గుప్పించారు. కంచన్, అతని కుటుంబం నిన్నటి నుంచి కనబడకుండ పోయిందని అన్నారు. నామినేషన్ వెరిఫికేషన్ ముగించుకుని బయటకు వచ్చిన మరుక్షణం అయన్ని బీజేపీ గుండాలు కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారంటూ విరుచుకుపడ్డారు. ఆయన ఇప్పుడూ ఎక్కడ ఉన్నారో తెలియడం లేదంటూ సిసోడియా ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పలువురు ఆప్నేతలు ఇది ప్రమాదకరం అని, ప్రజాస్వామ్యాన్ని అపహరించడమేనని బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ ట్వీట్లు చేశారు. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా...తొలుత కాంచన్ నామినేషన్‌ని తిరస్కరించారు. ఆ తర్వాత కంచన్ నామినేషన్‌కి ఆమోదం లభించిన వెంటనే ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశారు. అందువల్లే అతన్ని కిడ్నాప్ చేశారా? అని బీజేపీని కేజ్రీవాల్ ప్రశ్నించారు. Our candidate from Surat (East), Kanchan Jariwala, and his family missing since yesterday. First, BJP tried to get his nomination rejected. But his nomination was accepted. Later, he was being pressurised to withdraw his nomination. Has he been kidnapped? — Arvind Kejriwal (@ArvindKejriwal) November 16, 2022 Murder of democracy! Our candidate Kanchan Jariwala from Surat East seat has been kidnapped by BJP. First BJP unsuccessfully tried to get his nomination papers rejected, then coerced him to withdraw his candidature and now kidnapped him. He is missing since last afternoon. pic.twitter.com/SWpOEjSG59 — Raghav Chadha (@raghav_chadha) November 16, 2022 (చదవండి: కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది.. శశిథరూర్‌కు ఘోర అవమానం!) -
ప్రేమ పెళ్లి చేసుకుందని.. కూతురుని కిడ్నాప్ చేసి గుండుకొట్టించిన తల్లిదండ్రులు
సాక్షి, జగిత్యాల: కన్న కూతురు అని కూడా చూడకుండా తల్లిదండ్రులు హద్దు మీరారు. కోడలూ అనే విషయం మరచి మేన మామ మరింత కఠినంగా ప్రవర్తించారు.. ప్రేమ పెళ్లి చేసుకున్న ఏడు నెలల తరబడి అక్కసు బయట పడింది.. తమ ఇష్టాన్ని కాదని వేరే యువకుడిని పెళ్లి చేసుకుందని కుమార్తె పట్ల ఆమె తల్లిదండ్రులు కర్కశంగా ప్రవర్తించారు. కన్నబిడ్డ అనే మమకారాన్ని కూడా మరచి ఆమెను అత్తింటి నుంచి కిడ్నాప్ చేశారు.. తీవ్రంగా కొట్టి కారులో తీసుకెళ్తూ శిరోముండనం చేశారు. రాత్రంగా ఆమె మనుసు మార్చేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో చివరకు వదిలిపెట్టారు. కన్నోళ్లు ఎన్ని హింసలు పెట్టినా కడకు కట్టుకున్నోడే కావాలంటూ ఆ యువతి పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కింది జగిత్యాలలో కలకలం సృష్టించిన ఈ ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. జగిత్యాల జిల్లా రూరల్ మండలం బాలపల్లికి చెందిన జక్కుల మధు(23), రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన జువ్వాజి అక్షిత(20) ప్రేమించుకున్నారు. యువతి తల్లిదండ్రులు నిరాకరించడంతో రహస్యంగా వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం అక్షిత అత్తవారి ఇంట్లో ఉండగా రెండు కార్లలో వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు మధు కుటుంబంపై దాడిచేసి కిడ్నాప్ చేశారు.. కారులో బలవంతంగా తీసుకెళ్తూ వారు యువతిని తీవ్రంగా కొట్టారు. ఆమె కేకలు వేస్తున్నా వదలకుండా శిరోముండనం చేశారు. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషషన్‌కు చేరుకున్న యువతి జరిగిన ఘాతుకాన్ని పోలీసులకు వివరించింది.ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎస్సై అనిల్ న్యాయం చేస్తామని బాధితురాలికి హామీ ఇచ్చారు. యువతిని ఇప్పటికే ఆమె భర్తకు అప్పగించామని, ఆమె తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.. -
పెళ్లైన విషయం దాచి.. ఒకేసారి ఇద్దరు విద్యార్థినిలతో సహజీవనం
సాక్షి, చెన్నై: తనకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్న సంగతిని దాచడమే కాకుండా.. ఒకే సమయంలో ఇద్దరు పాఠశాల విద్యార్థులను కిడ్నాప్ చేసి, ఓ ఇంట్లో ఉంచి సహజీవనం చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కన్యాకుమారి జిల్లా కాట్టాతురై సమీపంలో కుట్టకులి కాలనీకి చెందిన విను (22) ఫ్లంబర్‌గా పని చే స్తున్నాడు. ఇతనికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉ న్నారు. ఈ క్రమంలో విను మార్దాండం కాపుకాడు ప్రాంతానికి చెందిన ఓ ప్లస్–2 విద్యార్థిని ప్రేమించాడు. అలాగే ఆమె స్నేహితురాలైన తిరువిట్టా కేసవపురానికి చెందిన మరో ప్లస్–2 విద్యార్థినికి కూడా మాయమాటలు చెప్పి ఇద్దరిని కిడ్నాప్ చేశాడు. విద్యార్థినుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యా దు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఈ ముగ్గురు చెన్నై తిరువణ్ణామలైలోని ఓ ఇంట్లో అద్దెకు తీసుకుని కాపురం చేస్తున్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు విద్యార్థినులను విడిపించి, నిందితుడు వినును అరెస్టు చేశారు. చదవండి: జూనియర్ ఆర్టిస్ట్‌ల ప్రేమాయణం.. నాలుగేళ్లు ఒకరితో.. నాలుగు నెలలు మరొకరితో.. -
అన్నదమ్ములిద్దరూ ఇద్దరే!...వాంటెడ్ క్రిమినల్స్
ఎక్కడైన అన్నదమ్ములు అనగానే ఒకరు ఒకలా మరోకరు డిఫరెంట్‌గా ఉంటారు. ఇది సర్వసాధారణం. మరికొన్ని చోట్ల ఒకరుకొకరు ఆదర్శవంతంగా ఐక్యమత్యంగా ఉంటారు. ఇక్కడ మాత్రం పూర్తి విరుద్ధం ఈ అన్నదమ్ములిద్దరూ. పైగా ఒకరుకి మించి మరొకొకరు వాంటెడ్ క్రిమినల్స్ వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...ఉత్తరప్రదేశ్‌లోని గౌతమబుద్ధ నగర్లో నివశిస్తున్న27 ఏళ్ల వ్యక్తి అతని సోదరుడు ఇద్దరు వేర్వేరు కేసుల్లో వాంటెడ్ క్రిమనల్స్. 27 ఏళ్ల ఆశిష్ చౌహన్ ఆగస్టు 29, 2017న తన సహచరులతో కలసి ఒక వ్యక్తి కిడ్నాప్ చేసి దాదాపు రూ. 3 కోట్లు డిమాండ్ చేశాడు. సమాచారం అందుకున్న అప్పటి పోలీసులు ఆశిష్‌ని ట్రేస్ చేసి పట్టుకుంటున్న సమయంలో బహిరంగంగా పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో పోలీసులు ఎన్కౌంటర్ దాడులు జరపడంతో ఆశిష్ అతను సహచరుడు తీవ్రంగా గాయపడి పట్టుబడ్డారు. ఈ మేరకు అలీపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఆశిష్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఐతే ఆశిష్‌కి నవంబర్3, 2020న బెయిల్ మంజూరయ్యింది. కానీ కోర్టు నిబంధనలను ఉల్లంఘించడంతో నాన్ బెయిల్ వారెంట్ జారీ చేసి మళ్లీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అలాగే అతని సోదరుడు కాల్సెంటర్లో పనిచేస్తున్న 23 ఏళ్ల దీపక్ తన సహచర ఉద్యోగినే అత్యాచారం చేసి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఎట్టకేలకు పోలీసుల జరిపిన దర్యాప్తులో ఆశిష్ సోదరుడు దీపక్‌గా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. (చదవండి: ఉసురు తీసిన అతివేగం...ఆటోను ఢీ కొట్టిన ట్రక్కు) -
ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు.. కిడ్నాప్ డ్రామాతో జైలుపాలు
ముంబై: ఇద్దరు భార్యలున్నా తనను పట్టించుకోవట్లేదని సూపర్ ప్లాన్ వేశాడు ఓ భర్త. తాను కన్పించకపోతే వాళ్లే వెతుక్కుంటూ వస్తారని భావించాడు. ముగ్గురు స్నేహితులతో కలిసి పక్కా స్కెచ్‌తో కిడ్నాప్ డ్రామా ఆడాడు. అంతా పథకం ప్రకారమే జరిగినప్పటికీ పోలీసులు రంగంలోకి దిగడంతో దొరికిపోయాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. మహారాష్ట్ర ఠాణెలోని కల్యాణ్‌లో ఈ ఘటన జరిగింది. వివారాల్లోకి వెళ్తే.. కిడ్నాప్ డ్రామా ఆడిన వ్యక్తి పేరు సందీప్ గైక్వాడ్. మొదటి పెళ్లి విషయం దాచి సునీత గైక్వాడ్‌ను గుడిలో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఇద్దరు భార్యలు ఇతడ్ని సరిగ్గా పట్టించుకోవడం లేదు. మొదటి భార్య దూరంగా ఉంటోంది. అయితే అక్టోబర్ 14న సునీతతో కలిసి దిలీప్ ఓ రోడ్డుపై స్కూటీని పార్కు చేస్తుండగా.. ముగ్గురు వ్యక్తులు ఆటోలో వచ్చి అతడ్ని కొట్టి తీసుకెళ్లారు. దీంతో వెంటనే సునీత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. నాలుగు రోజుల తర్వాత ఆ ఆటో ఎక్కడుందో ట్రేస్ చేశారు. దిలీప్‌ను, అతనిపాటు ఉన్న మరో ముగ్గురిని అరెస్టు చేశారు. అయితే విచారణలో సునీత తల్లే.. దిలీప్‌ను కిడ్నాప్ చేయమని చెప్పిందని, అతడ్ని తన బిడ్డ నుంచి దూరం చేయాలనే ఇందంతా చేసిందని ముగ్గురూ చెప్పారు. కానీ పోలీసులకు అనుమానం వచ్చి కచ్చితమైన వివరాలతో మరోసారి విచారించగా అప్పుడు అసలు నిజాన్ని ఒప్పుకున్నారు నిందితులు. తామంతా స్నేహితులమని, దీలిప్ తన భార్యల సింపతీ కోసమే ఈ కిడ్నాప్ డ్రామా ఆడినట్లు చెప్పారు. దీంతో పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. చదవండి: రూల్ అంటే రూలే.. సాక్షాత్తు పోలీస్ అయినా తప్పదు జరిమానా! -
లిటిల్ ఏంజెల్ దారుణ హత్య.. ఇప్పటికీ మిస్టరీగానే!
ఒక ముగింపు అస్పష్టమైనప్పుడు.. దాని చుట్టూ అల్లే అల్లికలు అనంతాలై.. దట్టంగా అలముకుంటాయి. ఆధారాలు లేక.. ఉన్నా సరిపోలక.. ఎంతో అప్రతిష్ఠను మూటగట్టుకుంటాయి. 26 ఏళ్ల కిందట అమెరికా మీడియాను ఓ ఊపు ఊపిన కథ ఇది. ప్యాట్రీషియా రామ్సే(పాట్సీ), జాన్ బెనే రామ్సే దంపతుల అందాల కూతురు జాన్ బెనే ప్యాట్రీషియా రామ్సే కథ ఇది. తను 1990 ఆగస్ట్ 6న జన్మించింది. ముద్దుగా ఆమెను జూనియర్ పాట్సీ అని కూడా పిలిచేవారు. తన అన్న బుర్కే రామ్సే.. ఆమె కంటే మూడేళ్లు పెద్దవాడు. ఈ కుటుంబం అమెరికా, కొలరాడోలోని బౌల్డర్‌లో నివాసం ఉండేవారు. ప్యాట్రీషియా మాజీ మిస్ వెస్ట్ వర్జీనియాగా అప్పటికే ప్రపంచానికి సుపరిచితం. ఆమె భర్త జాన్ బెనే పెద్ద వ్యాపారవేత్త, రచయిత కూడా. అతను 1978లో మొదటి భార్య లుసిండాకి విడాకులు ఇచ్చి.. ప్యాట్రీషియాను పెళ్లి చేసుకున్నాడు. జూ. పాట్సీ కూడా ఎన్నో వెల్ బేబీ షో పోటీల్లో విజేతగా నిలిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే అదో సెలెబ్రిటీ ఫ్యామిలీ. ఏమైందో ఏమో.. 1996 డిసెంబర్ 26న జూ. పాట్సీ తన ఇంట్లోనే శవమై కనిపించింది. అసలేం జరిగింది? డిసెంబర్ 26, తెల్లవారు జామున రామ్సే దంపతులు.. తమ కూతురు పాట్సీ అంతకు ముందు రోజు కి డ్నాప్ అయిందని పోలీసులను ఆశ్రయించారు. ముందురోజు వారు అందుకున్న కిడ్నాపర్స్ లేఖను కూడా చూపించారు. ‘మిస్టర్ రామ్సే (జాన్ బెనే).. శ్రద్ధగా వినండి! మాదొక విదేశీ సంఘం. మేము మీ కూతురును కిడ్నాప్ చేశాం. ఆమె 1997ను చూడాలనుకుంటే, మీరు మా సూచనలను తప్పనిసరిగా పాటించాలి. మాకు 1,18,000 డాలర్లను చెల్లించి మీ అమ్మాయిని తిరిగి తీసుకెళ్లొచ్చు. మిగిలిన వివరాలు రేపు ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య కాల్ చేసి చెబుతాం. ఈలోపు మీరు బ్యాంక్ అధికారులను కానీ పోలీసులను కానీ అప్రమత్తం చేస్తే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’ అనేది ఆ లేఖ సారాంశం. విషయం మీడియాకి చేరడంతో రిపోర్టర్స్, స్నేహితులు, చుట్టు పక్కల ప్రజలు ఇలా చాలామంది రామ్సే ఇంటికి చేరుకున్నారు. ఆరాలు, విచారణ, కిడ్నాపర్స్ నుంచి తదుపరి ఆదేశాలు.. ఇలా ఓ పక్క హంగామా నడుస్తూనే ఉంది. మరో వైపు జాన్ బెనే కిడ్నాపర్స్ కోరినట్లు డబ్బు సిద్ధం చేసే పనిలోపడ్డాడు. మధ్యాహ్నం కావస్తున్నా.. పాప ఆచూకీ తెలియకపోవడంతో డిటెక్టివ్ అర్ట్.. జాన్ బెనే స్నేహితుడు ఫ్లిట్ వైట్‌తో.. ‘ఎందుకైనా మంచిది ఒకసారి ఇల్లంతా వెతుకు’ అని చెప్పడంతో.. ఫ్లిట్ వెతకడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలోనే తాళం వేసి ఉన్న బేస్మెంట్ రూమ్‌ని బలవంతంగా తెరచి చూశాడు. ఆ గదిలో శవమై కనిపించింది జూ. పాట్సీ. పాప నోటికి డస్ట్ టేప్ చుట్టి ఉంది. విరిగిన పెయింట్ బ్రష్‌తో ముడివేసిన నైలాన్ తాడు చేతికి, మెడకు బలంగా బిగించి ఉంది. బాడీ అంతా తెల్లటి దుప్పటితో కప్పి ఉంది. వెంటనే మృతదేహాన్ని పట్టుకుని బయటికి వచ్చాడు ఫ్లిట్. అనుమానాస్పద ప్రాంతం నుంచి మృతదేహాన్ని తీసుకుని రావడం.. ఈలోపే అందరూ పాపను పట్టుకోవడంతో వేలి ముద్రలు, కీలక ఆధారాలు అన్నీ నాశనమైపోయాయి. జూ. పాట్సీ తలపై బలమైన గాయం ఉందని.. ఊపిరాడకుండా చేíసి చంపేశారని, లైంగికదాడి జరగలేదు కానీ.. ప్రయత్నించినట్లు ఆధారాలు ఉన్నాయని రిపోర్ట్స్ తేల్చాయి. దాంతో కేసు వివాదం రామ్సే ఫ్యామిలీనే చుట్టుముట్టింది. దానికి కొన్ని బలమైన కారణాలున్నాయి. జూ. పాట్సీ మృతదేహం దగ్గర లభించిన పెయింట్ బ్రష్‌కి సంబంధించిన మరో ముక్క.. తల్లి మేకప్ కిట్‌లో దొరకడంతో కేసు బిగుసుకుంది. మరోవైపు ఎన్నో పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో బుర్కేతో సహా ప్యాట్రీషియా, జాన్ బెనేలు చెప్పిన విషయాలకు, జరిగిన సంఘటనలకు పొంతన కుదరలేదు. చనిపోయే ముందు జూ. పాట్సీ పైనాపిల్ తిన్నదని వైద్యపరీక్షల్లో తేలింది. పైగా పైనాపిల్ ముక్కలతో మిగిలి ఉన్న బౌల్‌పై బుర్కే వేలి ముద్రలు ఉన్నాయి. అయితే ఆ రోజు పైనాపిల్ తిన్నట్లు గుర్తులేదని చెప్పారు ముగ్గురూ. పాపను వెతికే సమయంలో బుర్కే అసలు బయటికే రాలేదు. ఎందుకు రాలేదు? అంటే నిద్రపోయాడని చెప్పారు తల్లిదండ్రులు. బుర్కేది అదే మాట. నిజానికి ఇంట్లో అంత అలజడి రేగుతుంటే.. అంతా చెల్లెల్ని వెతుకుంటే తొమ్మిదేళ్ల బాలుడికి మెలకవరాకపోవడమేంటీ? అనేది చర్చనీయాంశంగా మారింది. దాంతో ఆ కిడ్నాపర్స్ లేఖను తల్లి సీనియర్ పాట్సీనే రాసుంటుందనే అనుమానాలు బలపడ్డాయి. మరి పాపను ఎవరు చంపి ఉంటారు అనేదానికి చాలా వాదనలు రాద్ధాంతాలుగా మారాయి. ‘పాపపై తండ్రి జాన్ బెనే లైంగిక దాడికి యత్నించాడని కొందరు.. బుర్కే అనుకోకుండా బలమైన వస్తువుతో చెల్లెలు జూ. పాట్సీని కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడిందని.. కొడుకుని కాపాడుకునే క్రమంలోనే పాపను చంపేసి తల్లిదండ్రులు డ్రామా ఆడారని మరికొందరు తమ ఊహాగానాలను మొదలుపెట్టారు. ఆ దిశగానే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కూడా విచారణ జరిపింది. ఆ రోజు రాత్రి ఎవరో ఆగంతకుడు బేస్మెంట్ గది కిటికీని పగలగొట్టుకుని లోపలికి వచ్చి ఉంటాడని.. వాడే పాపని కిడ్నాప్ చేసి చంపేసి ఉంటాడని మరో వాదన పుట్టుకొచ్చింది. అయితే కిటికీ పరిసరప్రాంతాల్లో చాలాకాలంగా ఉన్న సాలిగూడు చెక్కుచెదరలేదంటూ ఆ కథను కొట్టిపారేశారు విశ్లేషకులు. ఇక్కడే మరో అంశాన్ని లేవనెత్తారు అధికారులు. జూ. పాట్సీ చిన్నప్పటి నుంచి ఉన్న హెల్త్ రిపోర్ట్‌ని బయటికి తీశారు. 1994లో అంటే పాపకు నాలుగేళ్ల వయసున్నప్పుడు బుర్కే ఆమె ముఖం మీద బలంగా కొట్టాడని హెల్త్ రికార్డ్‌లో ఉంది. 1995, మేలో పాప ముక్కు పగిలిందని, అదే ఏడాది నవంబర్‌లో ఎడమ కన్నుకు గాయమైందని.. 1996లో ఎడమ చేతివేలు దెబ్బ తిన్నదని.. ఇలాంటివన్నీ బుర్కే నేరస్థుడనేందుకు ఆధారాలుగా మారి నమ్మకాన్ని బలపరిచాయి. మరోవైపు1996 ఆగష్టు 27న పాప పునరుత్పత్తి సామర్థ్యాన్ని గురించి తల్లి ప్యాట్రీషియా.. డాక్టర్‌ను ఆరా తీసినట్లు కూడా ఆధారాలు సంపాధించారు అధికారులు. అయితే 2003లో పాప బట్టల మీద దొరికిన మరో డీఎన్ఏ.. కుటుంబసభ్యులది కాకపోవడంతో కథ అడ్డం తిరిగింది. డిఏ(డిస్ట్రిక్ట్ అటార్నీ) 2008లో పాప హత్యతో ఆ కుటుంబానికి సంబంధం లేదంటూ రామ్సే ఫ్యామిలీకి క్షమాపణ పత్రాన్ని కూడా పంపించింది. అయితే కొందరు అధికారులు.. దీన్ని తప్పుబట్టారు. కేసు దారి తప్పిందని విమర్శించారు. మరోవైపు దర్యాప్తు సమయంలోనే.. జాన్ బెనే ఇంట్లో పనిమనిషి ఆత్మహత్య కూడా అప్పట్లో వివాదంగానే నిలిచింది. 2006లో అలెక్సిస్ వాలోరన్ రీచ్ అనే ట్రాన్స్‌జెండర్.. జూ. పాట్సీ కథలోకి ఊహించని ఎంట్రీ ఇచ్చింది. తను మగవాడిగా ఉన్నరోజుల్లో తనే పాపకి మత్తుమందు ఇచ్చి.. లైంగిక దాడిలో పొరపాటున చంపేశానంటూ లొంగిపోయింది. అయితే శవ పరీక్షలో పాపకు మత్తుమందు ఇచ్చిన ఆనవాళ్లు లేకపోవడంతో రీచ్ చెప్పేదాన్ని తోసిపుచ్చారు నిపుణులు. అదే ఏడాది ప్యాట్రీషియా అండాశయ క్యాన్సర్‌తో తన 49 ఏళ్ల వయసులో కన్నుమూసింది. తండ్రి జాన్ బెనే.. ఇంకా ఈ కేసుపై దర్యాప్తు గురించి పోలీసుల్ని ఆరా తీస్తూనే ఉన్నాడు. బొర్కే ఇన్వెస్టిగేషన్ బ్యూరోపై 750 మిలియన్ డాలర్లు పరువు నష్టం దావా వేశాడు. ఏదిఏమైనా.. బుల్లి అందాల రాణిగా మెరిసిన జూ. పాట్సీ మరణం.. ఆ కుటుంబానికి తలవంపులను మిగిల్చింది. పాప మృతికి ఆ కుటుంబమే కారణమా? లేక నిజంగానే కిడ్నాపర్స్ చంపేశారా? మరింకేదైనా కుట్ర ఉందా? అనేది నేటికీ తేలలేదు. ∙సంహిత నిమ్మన -
ఉక్రెయిన్ అణు విద్యుత్ కేంద్రం డిప్యూటీ చీఫ్‌ను కిడ్నాప్ చేసిన రష్యా!
కీవ్: జపోరిజజియా అణు విద్యుత్ కేంద్రం డిప్యూటీ చీఫ్ వలెరియ్ మార్టిన్‌యుక్‌ను రష్యా కిడ్నాప్ చేసిందని ఉక్రెయిన్ తెలిపింది. ఆయనను ఎక్కడ నిర్బంధించి ఉంచారో తెలియడం లేదని పేర్కొంది. ట్రేస్ చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయిందని వాపోయింది. ఈమేరకు ఉక్రెయిన్ అణు విద్యుత్ నిర్వహణ సంస్థ ఎనర్జోఆటం మీడియాకు వెల్లడించించి. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ చీఫ్ రఫేల్ గ్రాస్‌ను ఈ విషయంపై సంప్రదిస్తున్నట్లు ఉక్రెయిన్ తెలిపింది. అయితే ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని పేర్కొంది. మరోవైపు రష్యా రక్షణమంత్రి కూడా ఈ విషయంపై ఇప్పటివరకు స్పందించలేదు. అయితే ఐరోపాలోనే అతిపెద్దదైన ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని రష్యా కొద్ది రోజుల క్రితమే ఆక్రమించుకుంది. ఆ తర్వాత దీని చీఫ్‌ను అక్టోబర్ 1 నిర్భంధించింది. అనంతరం అక్టోబర్ 3న విడుదల చేసింది. కానీ ఆ తర్వాత రోజు నుంచి అతడు విధులకు హాజరుకావడం లేదు. అణువిద్యుత్ కేంద్రం రష్యా గుప్పిట్లోనే ఉన్నప్పటికీ దీన్ని ఉక్రెయిన్ సిబ్బందే నిర్వహిస్తున్నారు. చదవండి: ఉక్రెయిన్ కోసం కాదు.. అందుకైతే పుతిన్‌ను కలుస్తా -
పాకిస్తాన్లో దారుణం.. సీనియర్ మంత్రిని కిడ్నాప్ చేసి..
దాయాది దేశం పాకిస్తాన్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాక్ సీనియర్ మంత్రి అబైదుల్లా బైగ్‌ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అనంతరం జైల్లో ఉన్న తమ గ్రూప్ సభ్యులను విడిచిపెట్టాలని ఉగ్రవాదులు డిమాండ్ చేశారు. దీంతో, ఉగ్రవాదుల షరతులకు అంగీకారం తెలిపిన పాక్ మీడియా పేర్కొంది. వివరాల ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి పాకిస్తాన్‌కు చెందిన సీనియర్ మంత్రి, మరో ఇద్దరిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. కాగా, ఈ విషయాన్ని అధికారులు బయటకు చెప్పకుండా సీక్రెట్‌గా ఉంచారు. అయితే, ఉగ్రవాదులు తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఓ వీడియోను విడుదల చేశారు. నంగా పర్బత్, దియామేర్ ప్రాంతాల్లో విదేశీయులను ఊచకోత కోసిన ఉగ్రవాదులు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. దీంతో, వారిని విడుదల చేయాలని హెహ్రీక్-ఇ-తాలిబన్ కమాండర్, మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న హబీబుర్ రహమాన్ డిమాండ్ చేస్తున్న ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అనంతరం, ఉగ్రవాదుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించడంతో ఆ ముగ్గురిని ఉగ్రవాదులు శనివారం విడుదల చేసినట్లు అక్కడి మీడియా పేర్కొంది. కాగా, అబైదుల్లా.. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మంత్రిగా కొనసాగుతున్నారు. దేశంలో సీనియర్ నేత కావడంతో ఉగ్రవాదుల డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. -
యూఎస్‌లో ఎనిమిదేళ్ల చిన్నారితో సహ భారత సంతతి కుటుంబం కిడ్నాప్
కాలిఫోర్నియా: ఎనిమిది నెలల చిన్నారితో సహా భారత సంతతి కుటుంబం కిడ్నాప్‌కి గురయ్యింది. ఈ ఘటన కాలిఫోర్నియాలోని మెర్సిడ్ కౌంటీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....సోమవారం 36 ఏళ్ల జస్దీప్ సింగ్, 27 ఏళ్ల జస్లీన్ కౌర్ వారి ఎనిమిదేళ్ల పాప అరూహి ధేరి తోపాటు 39 ఏళ్ల అమన్‌దీప్ సింగ్ కిడ్నాప్ అయినట్లు మెర్సిడ్ కౌంటీ షెరీఫ్స్ కార్యాలయ(పోలీస్ కార్యాలయం) పేర్కొంది. అలాగే నిందితుడు ఆయుధాలు కలిగి ఉన్నాడని చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని చెప్పారు. అంతేగాదు పోలీసులు ప్రజలను అనుమానితుడు లేదా బాధితులు గానీ కనిపిస్తే వారి వద్దకు వెళ్లవద్దని తమకు సమాచారం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. గతంలో ఇలానే 2019లో యూఎస్‌లోని కాలిఫోర్నియాలో భారత సంతతి టెక్కీ, డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ యజమాని తుషార్ అత్రే తన ఇంటి నుంచి కిడ్నాప్ అయినా కొద్ది నిమిషాల్లోనే తన గర్లఫ్రెండ్ కార్లో శవమై కనిపించాడు. (చదవండి: ఇంట్లోనే ఐపీఎస్ అధికారి దారుణ హత్య.. పనిమనిషి పరార్) -
చిలకలూరిపేటలో కిడ్నప్ అయిన బాలుడు క్షేమం
-
Russia-Ukraine War: అణు ప్లాంట్ చీఫ్ కిడ్నాప్
కీవ్: ఉక్రెయిన్‌లోని జపొరిఝియా అణు విద్యుత్ ప్లాంట్ డైరెక్టర్ జనరల్ ఇహోర్ మురసోవ్ కిడ్నాప్‌నకు గురయ్యారు. శుక్రవారం కారులో వెళ్తున్న ఆయన్ను రష్యా సైనికులు అడ్డగించి, కళ్లకు గంతలు కట్టి గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లినట్లు ఉక్రెయిన్ అణు విద్యుత్ సంస్థ ఎర్గోఆటం ఆరోపించింది. ఉక్రెయిన్‌లో ఆక్రమించిన నాలుగు ప్రాంతాలను కలిపేసుకుంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతకం చేసిన కొద్ది సేపటికే యూరప్‌లోనే అతిపెద్ద అణు ప్లాంట్ చీఫ్ కిడ్నాప్ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. కాగా, లేమాన్ నగరం నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు రష్యా ప్రకటించింది. -
Russia Ukraine War: ‘విలీనం’ రోజే రష్యా మొదలెట్టేసిందిగా..!
కీవ్: ఉక్రెయిన్‌లోని నాలుగు కీలక ప్రాంతాలను విలీనం చేసుకున్నట్లు ప్రకటించింది రష్యా. ఆ రోజు నుంచే తమ ఆధీనంలోని ప్రాంతాల్లో ఉక్రెయిన్ మద్దతుదారులను అణచివేసే దుశ్చర్యలు మొదలు పెట్టింది. ఉక్రెయిన్ జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రస్తుతం రష్యా సేనల ఆధీనంలో ఉంది. ఈ క్రమంలో న్యూక్లియర్ ప్లాంట్ డైరెక్టర్ జనరల్ ఇహోర్ మురాషోవ్‌ను రష్యా కిడ్నాప్ చేసినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఎనెర్హోడార్కు వెళ్తున్న క్రమంలో మురాషోవ్ కారును అడ్డగించిన రష్యా సేనలు.. ఆయన కళ్లకు గంతలు కట్టి రహస్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు కీవ్ ప్రభుత్వ న్యూక్లియర్ ఏజెన్సీ ‘ఎనర్జోఆటమ్’ వెల్లడించింది. మురాషోవ్ కిడ్నాప్.. జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ భద్రతను ప్రమాదంలో పడేసిందని ఎనర్జోఆటమ్ ప్రెసిడింగ్ పెట్రో కొటిన్ ఆందోళన వ్యక్తం చేశారు. మురాషోవ్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. మురాషోవ్ కిడ్నాప్‌పై రష్యా, అంతర్జాతీయ అణు విద్యుత్ ఏజెన్సీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇదీ చదవండి: Russia Ukraine War: ఉక్రెయిన్ నగరాలపై రష్యా దాడులు -
బాలుడిని ఎత్తుకెళ్లిన గంట వ్యవధిలోనే కేసును చేధించిన పోలీసులు
-
మొదటి భర్త హత్యకు రెండో భర్త ప్లాన్
సాక్షి, బెంగళూరు(యశవంతపుర): భార్య మొదటి భర్తను రెండో భర్త కిడ్నాప్ చేసి తీసుకెళ్తుండగా కారు పంచరై ప్లాన్ బెడిసింది. ఈ ఘటన చిక్కమగళూరు జిల్లా కడూరులో జరిగింది. రాజస్థాన్‌కి చెందిన మంజుల, మోహన్‌రామ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కడూరుకు తీసుకొచ్చి చిన్న వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. రెండు నెలల క్రితం రాజస్థాన్‌కు వెళ్లిన భార్య మంజులను మోహన్ రామ్ తీసుకురావడానికి వెళ్లగా ఆమె రాలేదు. హర్యానాకు చెందిన ఓం ప్రకాశ్‌ను మంజుల పెళ్లి చేసుకుని బెంగళూరులో కాపురం పెట్టింది. మరోవైపు ఇదేమీ తెలియని మోహన్‌రామ్ భార్యకు పదేపదే వాట్సప్ మెసేజ్‌లు పంపి తన వద్దకు వచ్చేయాలని కోరేవాడు. దీంతో రెండో భర్త ఓం ప్రకాశ్ అతన్ని అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. ఈ నెల 28న రాత్రి బెంగళూరు నుంచి అనుచరులతో కడూరుకు వెళ్లి మోహన్‌రామ్‌ను మాట్లాడాలని ఊరిబయటకు తీసుకెళ్లి కాళ్లు చేతులు కట్టేసి కారులో తీసుకెళ్లాడు. ఇది చూసిన కొందరు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వెంబడించగా, నిందితుల కారు కడూరు తాలూకా మతిఘట్ట వద్ద కారు పంచరైంది. వెంటనే పోలీసులు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చదవండి: (పెళ్లయి ఇద్దరు పిల్లలు.. ఇంజనీరింగ్ విద్యార్థితో జంప్) -
నలుగురు దొంగలు.. రూ.12 కోట్ల ఫోన్లు కొట్టేశారు!
సాగర్ (మధ్యప్రదేశ్): కోట్లు విలువచేసే స్మార్ట్ఫోన్లను రవాణా చేస్తున్న కంటైనర్‌ను నలుగురు దొంగలు లూటీ చేశారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా మహరాజ్‌పూర్ సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం రాత్రి ఈ చోరీ జరిగింది. అయితే ఆ ఫోన్లన్నింటినీ 24 గంటల్లోపే పోలీసులు సినీ ఫక్కీలో స్వాధీనం చేసుకున్నారు. దొంగలు మాత్రం పారిపోయారు. దాదాపు రూ.12 కోట్ల విలువైన ఈ మొబైల్ ఫోన్లను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మీదుగా హరియాణాలోని గురుగ్రామ్‌కు తీసుకెళ్తున్నారు. ట్రక్కును గురువారం రాత్రి నలుగురు దుండగులు అడ్డుకుని డ్రైవర్‌ను కిడ్నాప్ చేశారు. నరసింగాపూర్ వద్ద అతన్ని దింపేసి ఫోన్లను కంటైనర్ నుంచి తమ ట్రక్కులోకి మార్చుకుని పారిపోయారు. శుక్రవారం రాత్రి ఘటనాస్థలికి 400 కిలోమీటర్ల దూరంలో మధ్యప్రదేశ్ పోలీసులు అడ్డగించడంతో ట్రక్కును వదిలేసి పారిపోయారు. మొత్తం ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సాగర్ ఎస్పీ తరుణ్ నాయక్ చెప్పారు. -
మనవడ్ని కిడ్నాప్ చేయించిన తాత
బనశంకరి: రెండు రోజుల క్రితం ఉత్తరకన్నడ జిల్లా భట్కళ నుంచి అపహరణకు గురైన బాలుడు గోవాలో ప్రత్యక్షమయ్యాడు. బ్రెడ్ తీసుకురావడానికి వెళ్లిన అలీ ఇస్లాందాదా (8) అనే బాలుడు రెండురోజుల క్రితం అదృశ్యమయ్యాడు. కుటుంబసభ్యులు భట్కళనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాప్‌నకు గురైన ప్రాంతం చుట్టుపక్కల ఉన్న సీసీ టీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి ఒక కారులో అతన్ని ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. గోవాలో దుండగులను పట్టుకుని బాలున్ని సజీవంగా తల్లిదండ్రులకు అప్పగించారు. సౌదీ నుంచి తాత పన్నాగం.. అయితే బంధువులే బాలుడిని కిడ్నాప్ చేశారని తేలింది. సౌదీఅరేబియాలో ఉన్న బాలుని తాత ఇనయతుల్లా ఇందుకు కుట్ర పన్నాడు. ఇతనికి బాలుని తండ్రి (అల్లుడు) డబ్బు ఇవ్వాల్సి ఉంది. ఇవ్వకపోడంతో గతంలో పలుమార్లు గొడవలు జరిగాయి. దీంతో పలువురితో కలిసి కిడ్నాప్ చేయించి డబ్బు కోసం ఒత్తిడి చేశాడు. ఈ కేసుకు సంబంధించి భట్కళవాసి అనీశ్పాషాను పోలీసులు అరెస్టు చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. (చదవండి: నాన్‌వెజ్ రాజకీయం.. మాంసం తిని గుడికి వెళ్తారా?) -
కర్నూలులో లారీ డ్రైవర్ కిడ్నప్ కలకలం
-
‘పూజా మిస్సింగ్’ అని సెర్చ్ చేసి.. కన్నవాళ్ల చెంతకు చేరింది!
ఇటీవల కాలంలో ఎన్నో మిస్సింగ్ కేసులు గురించి వింటున్నాం. ఆయా కేసుల్లో కిడ్నాప్‌కి గురైన ఒకరో, ఇద్దరో తిరిగి తమ కుటుంబాన్ని కలుసుకోగలుగుతున్నారు. చాలావరకు మిస్సింగ్ కేసుల్లో పిల్లలను చంపడం లేదా అవయవాలు తీసి అడుక్కునే వాళ్లుగా మార్చడం వంటి దారుణాలు జరుగుతున్నాయి. మరి కొందరిని బాల కార్మికలుగా మార్చుతున్నవారు లేకపోలేదు. అచ్చం అలానే అమ్మాయి ఏడేళ్ల వయసులో తప్పిపోయింది. టీనేజ్ వయసులో తన కుటుంబాన్ని కలుసుకోగలిగింది. అదెలా సాధ్యమైందంటే... వివరాల్లోకెళ్తే.... జనవరి 22, 2013న ముంబైలో పూజా అనే ఏడేళ్ల చిన్నారి కిడ్నాప్‌కి గురైంది. పూజాకి ఒక సోదరుడు కూడా ఉన్నాడు. హెన్రీ జోసెఫ్ అనే వ్యక్తి తనకు పిల్లలు కలగకపోవడంతో పూజా అనే ఏడేళ్ల చిన్నారిని ఐస్‌క్రీం కొనిస్తానంటూ మాయమాటలు చెప్పి అపహరించాడు. ఎవరికి అనుమానం రాకూడదని ఆ చిన్నారిని కొద్ది రోజుల పాటు కర్ణాటకలోని ఒక హాస్టల్లో ఉంచాడు. పైగా ఆ చిన్నారి పూజా పేరుని అన్నీ డిసౌజాగా పేరు మార్చాడు. కొద్ది రోజుల తర్వాత జోసెఫ్ భార్యకి పిల్లలు కలగడంతో తాను కిడ్నాప్ చేసిన అమ్మాయిని హాస్టల్ నుంచి తీసుకువచ్చేశాడు. అప్పటి నుంచి ఆ అమ్మాయిని పని అమ్మాయిగా ఇంట్లో చాకిరి చేయించడం మొదలుపెట్టాడు. ఐతే జోసెఫ్ ఒకరోజు తాగిన మత్తులో అసలు విషయం బయటపెట్టాడు.. దీంతో ఆ అమ్మాయి తన వాళ్ల ఆచూకి కోసం ప్రయత్నిచడం ప్రారంభించింది. ఆమెకు కూడా తన కుటుంబం గురించి పెద్దగా గుర్తులేదు. అయినప్పటికీ తన గతం తాలుకా ఆధారాల కోసం గాలించడం మొదలు పెట్టింది. పూజా మిస్సింగ్ అని తన స్నేహితురాలితో కలిసి ఇంటర్నెట్లో సర్చ్ చేయడం మొదలుపెట్టింది. చివరికి 2013వ ఏడాదికి సంబంధించి ఒక డిజిటల్ మిస్సింగ్ పోస్టర్ని కనుగొన్నారు. అందులో ఐదు ఫోన్ నెంబర్లు ఉన్నాయి. కానీ వాటిలో నాలుగు నెంబర్లు పనిచేయడం లేదు. అదృష్టవశాత్తు ఒక్క నెంబర్ పనిచేస్తుంది. అది పూజా కుటుంబం పొరుగున ఉండే రఫీ అనే వ్యక్తిది. ఐతే ఆ అమ్మాయి జరిగిన విషయం అంతా అతనికి చెబుతుంది. దీంతో అతను పూజా వాళ్ల కుటుంబానికి ఈ విషయం చెప్పి పూజా వాళ్ల అమ్మ చేత కూడా మాట్లాడించడం తోపాటు పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి జోసెఫ్ని, అతని భార్యను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఐతే సదరు నిందితుడు అప్పట్లో తన భార్యకు పిల్లలు కలగక పోవడంతోనే కిడ్నాప్ చేసినట్లు పేర్కొన్నాడు. అంతేకాదు పోలీసుల సదరు అమ్మాయిని తన కుటుంబం చెంతకు చేరుస్తారు. 16 ఏళ్ల తర్వాత తప్పిపోయిన తన కూతురు తిరిగి తమ వద్దకు చేరడంతో పూజా తల్లి ఆనందానికి అవధులే లేకుండా పోయింది. ఐతే ఈ సుదీర్ఘ విరామంలో పూజా తన తండ్రిని కోల్పోవడం బాధాకరం. (చదవండి: చంపడం ఎలా? అని సర్చ్ చేసి మరీ ....) -
భార్యతో ఎఫైర్ పెట్టుకున్నాడని కానిస్టేబుల్ ముక్కు, చెవులు కోసిన భర్త!
ఇస్లామాబాద్: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఓ పోలీసు కానిస్టేబుల్ చెవులు, ముక్కు, పెదాలు కోసేశాడు ఆమె భర్త. ఈ సంఘటన పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రం ఝాంగ్ జిల్లాలో ఆదివారం జరిగింది. తన భార్యను బ్లాక్మెయిల్ చేస్తూ అతనితో అక్రమ సంబంధాలు కొనసాగించాలని వేధిస్తున్నాడనే కారణంతో నిందితుడు ముహమ్మద్ లిఫ్తీకర్ తన స్నేహితులతో కలిసి పోలీస్ కానిస్టేబుల్ కాసిమ్ హయత్పై ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. ‘తన భార్యతో సంబంధం పెట్టుకున్నాడని కానిస్టేబుల్ కాసిమ్ హతయ్పై లిఫ్తీకర్ అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న బాధితుడిని 12 మందితో కలిసి అపహరించాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తీవ్రంగా హింసించారు. ఆ తర్వాత పదునైన ఆయుధంతో చెవులు, ముక్కు, పెదాలు కోసేశారు.’ అని పంజాబ్ పోలీసులు వెల్లడించారు. బాధిత కానిస్టేబుల్‌ను ఝాంగ్ జిల్లా ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం అతడి ఆరోగ్యం విషమంగా ఉందన్నారు. గతనెల పోలీస్ కానిస్టేబుల్ హయత్పై పీపీసీలోని 354(మహిళపై దాడి), 384(దోపిడి), 292(అక్రమ సంబంధం)వంటి సెక్షన్ల కింద కేసు పెట్టాడు ఇఫ్తీకర్. తన కుమారుడిని చంపేస్తానని బెదిరించాడని, అతడి వద్దకు వెళ్లిన తన భార్యపై బలవంతంగా అత్యాచారం చేసి వీడియో తీశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ వీడియోల ద్వారా వేధింపులకు గురి చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం పోలీస్ కానిస్టేబుల్ హయత్పై దాడి కేసులో ఇఫ్తీకర్తో పాటు అతడి అనుచరులను పట్టుకునే పనిలో పడ్డారు పంజాబ్ పోలీసులు. ఇదీ చదవండి: Nancy Pelosi Taiwan Tour: ‘తైవాన్‌లో అడుగుపెడితే మా సైన్యం చూస్తూ ఊరుకోదు’ -
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుంకర ప్రసాద్ నాయుడు అరెస్ట్
అనంతపురం: హైదరాబాద్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుంకర ప్రసాద్ నాయుడును అరెస్ట్ చేశారు పోలీసులు. గుంతకల్లుకు చెందిన ఆకుల వ్యాపారి వెంకటేష్ కిడ్నాప్ కేసులో సుంకర ప్రసాద్ నాయుడుని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితుడి నుంచి ఓ తుపాకీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రసాద్ నాయుడితో పాటు మరో 15మందిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు పోలీసులు. వారికి చెందిన రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో హత్యలు, కిడ్నాప్‌లకు పాల్పడినట్లు సుంకర ప్రసాద్ నాయుడు గ్యాంగ్‌పై కేసులు ఉన్నాయి. ఇటీవలే ఆకుల వ్యాపారి వెంకటేష్‌ను కిడ్నాప్ చేసి రూ.50 లక్షలు డిమాండ్ చేశారు ప్రసాద్ గ్యాంగ్. ఈ క్రిమినల్ గ్యాంగ్‌ను స్వయంగా విచారించారు అనంతపురం ఎస్పీ ఫకీరప్ప. ఇదీ చదవండి: డామిట్.. కథ అడ్డం తిరిగింది -
Hyderabad: అజయ్‌తో పరిచయం.. సహజీవనం ముసుగులో చిన్నారుల కిడ్నాప్
సాక్షి, హైదరాబాద్: మహిళతో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి ఆమె ఇద్దరు పిల్లలను ఎత్తుకెళ్లిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై కె.మధుసూదన్ కథనం ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన లీలం యాదవ్ భర్త జితేందర్ యాదవ్ ఏడాది క్రితం మృతి చెందగా ముగ్గురు పిల్లలతో కలిసి హైదరాబాద్‌లో కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఏడు నెలల క్రితం బిహార్‌కే చెందిన అజయ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి సహజీవనం చేయసాగారు. రెండు నెలల క్రితం వీరు జల్పల్లి శ్రీరాం కాలనీలోకి మకాం మార్చగా.. లీలం యాదవ్ స్థానికంగా ఉన్న ఓ కంపెనీలో పని చేస్తోంది. ఆదివారం సాయంత్రం ఆమె ఇంట్లో పని చేస్తుండగా ఆమె కుమార్తె ప్రీతి (2.5 సంవత్సరాలు), కుమారుడు రితేష్ (16 నెలలు) ఇంటి ముందు ఆడుకుంటున్నారు. ఆ సమయంలో తాగిన మైకంలో ఇంటికి వచ్చిన అజయ్ లీలంతో గొడవపడి చేయిచేసుకున్నాడు. అనంతరం ఇద్దరు పిల్లలను తీసుకొని వెళ్లిపోయాడు. కొద్ది సేపటి అనంతరం గమనించిన ఆమె స్థానికంగా వెతికినా లాభం లేకపోవడంతో సోమవారం పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చదవండి: కుల పంచాయితీలో మహిళపై దాడి.. నిండు ప్రాణం తీసిన వాట్సాప్ ప్రచారం -
తప్పు మీద తప్పు.. ప్రియురాలి చెంత చేరి.. పోలీసులకు చిక్కి..
సాక్షి, విశాఖటపట్నం, పీఎం పాలెం(భీమిలి): టీడీపీ నేత, రియల్టర్ పాసి రామకృష్ణను ఇటీవల కిడ్నాప్ చేసిన ముఠాను పీఎం పాలెం పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు కోలా వెంకట హేమంత్‌తో పాటు ఓ మహిళ, మరో నలుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు ఈ కేసు వివరాలను నగర డీసీపీ సునీల్ సుమిత్ గరుడ పీఎంపాలెం పోలీస్ స్టేషన్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. భీమిలి మండలం గొల్లల తాళ్లవలసకు చెందిన కోలా వెంకట హేమంత్ రౌడీషీటర్‌గా పోలీస్ స్టేషన్లో రికార్డులకెక్కాడు. మాజీ కార్పొరేటర్ విజయారెడ్డి హత్యలో ప్రధాన నిందితుడు కూడా. దొంగతనం, కొట్లాట వంటి ఐదారు నేరాలపై ఈయనపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. జైలులో శిక్ష అనుభవించి ప్రస్తుతం బెయిల్‌పై బయట తిరుగుతున్నాడు. ఈయనకు విశాలాక్షినగర్‌లో ఉంటున్న సుబ్బలక్ష్మి(48) అనే ప్రియురాలు ఉంది. హేమంత్‌కు ఆమె అన్ని విధాలా సహకరిస్తుంటుంది. కిడ్నాప్‌కు ఉపయోగించిన కారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు బయటకు చెప్పుకుంటారు. సుమారు రూ.35 లక్షల వరకు అప్పులు ఉన్నాయి. ఆ అప్పుల నుంచి బయట పడాలంటే పెద్ద మొత్తంలో డబ్బు రాబట్టడానికి కిడ్నాప్ ఒకటే మార్గమని హేమంత్ పథకం రచించాడు. ఇందు కోసం భీమిలి మండలం జేవీ అగ్రహారానికి చెందిన రియల్టర్, టీడీపీ నేత పాసి రామకృష్ణను పావుగా ఎంచుకున్నాడు. తాను కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటానని ఆయనను పరిచయం చేసుకుని సుమారు 20 రోజుల పాటు చాలా నమ్మకంగా వ్యవహరించాడు. చదవండి: (Chandrababu: ఒప్పందాలంటూ అమెరికన్లతో ఫొటోలు.. 20 సంస్థల్లో ఒక్కటొస్తే ఒట్టు) ఈ క్రమంలో ఓ స్థలం డెవలప్మెంట్కు సంబంధించి డీల్ కుదుర్చుకోవడానికి ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం రుషికొండ ఏరియాలోని ఎంబీకే గెస్ట్‌హౌస్‌కు రప్పించాడు. అప్పటికే పీఎం పాలెం ఆర్‌హెచ్ కాలనీకి చెందిన రౌడీషీటర్ మున్నా(27)తో పాటు మరో ఇద్దరు రౌడీషీటర్లు పెంటకోట కిరణ్(19), అంబటి మధుసూదన్‌రావు(31), కొలగాని రాజ్‌కుమార్‌లను తనకు సహాయంగా గెస్ట్‌హౌస్‌లో అందుబాటులో ఉంచాడు. హేమంత్ మాటలు నమ్మి వచ్చిన పాసి రామకృష్ణను తాళ్లతో బంధించి నోటికి ప్లాస్టర్ అంటించారు. వారంతా కలిసి ఆయనను అప్పటికే అద్దెకు తీసుకున్న కారులోకి బలవంతంగా ఎక్కించారు. కోటి రూపాయలు ఇస్తేనే విడిచి పెడతామని కత్తులతో బెదిరించి విజయనగరం వైపు తీసుకుపోయారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు, కత్తులు సీసీ కెమెరాతో అడ్డం తిరిగిన కథ ఈ కిడ్నాప్ తతంగం అంతా సీసీ కెమోరాలలో కనిపించడంతో గెస్ట్‌హౌస్ సిబ్బంది పీఎం పాలెం పోలీసులకు సమాచారం అందించారు. సీసీ ఫుటేజీలో కారు నంబర్‌ను గుర్తించారు. కారు యజమానికి ఫోన్ చేసి, డ్రైవర్ ఫోన్ నంబరు సంపాదించారు. ఆ నంబర్‌కు ఫోన్ చేయడంతో.. కిడ్నాప్ విషయం పోలీసులకు తెలిసిపోయిందని గ్రహించి కారులో ఉన్నవారందరూ తలో దిక్కుకూ పారిపోయారు. అదే సమయంలో కట్లు విడిపించుకుని బాధితుడు రామకృష్ణ కారులోంచి దూకి తప్పించుకున్నాడు. ఏదోలా భీమిలి చేరుకుని పీఎం పాలెం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు. చదవండి: (ఆపసోపాలు.. పడరాని పాట్లు.. నవ్వులపాలైన టీడీపీ) తప్పు మీద తప్పు చేసిన కిడ్నాపర్ కిడ్నాప్ పథకం బెడిసికొట్టడంతో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కిడ్నాపర్ వెంకటహేమంత్ తప్పుల మీద తప్పులు చేశాడు. పోలీసులు వెంటాడుతూనే ఉన్నారు. గంట్యాడ పోలీసులను అప్రమత్తం చేయగా కారుకు అడ్డంగా స్టాపర్లు పెట్టగా వాటిని గుద్దుకుంటా ఉడాయించాడు. ఎస్.కోట పోలీసులు అడ్డుకోగా వారి నుంచి కూడా దౌర్జన్యంగా తప్పించుకున్నాడు. ఈ రెండు స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ప్రియురాలి చెంత చేరి.. పోలీసులకు చిక్కి.. పోలీసుల నుంచి తప్పించుకున్న వెంకట హేమంత్ తన నిత్య స్థావరమైన విశాలాక్షినగర్‌లో నివసిస్తున్న సిరంగి సుబ్బలక్ష్మి ఇంట్లో తల దాచుకున్నాడు. గతంలో పలుమార్లు నేరాలకు పాల్పడినప్పుడు ఇలాగే చేసేవాడు. పోలీసులు ఈ కేసు ఛేదనలో నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించి, ఆమెతో పాటు హేమంత్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. మిగతా నలుగురు నిందితులను మధురవాడ ఐటీ సెజ్ సమీపంలో అరెస్ట్ చేశారు. ఈ కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన సీఐ రవికుమార్, సిబ్బందిని డీసీపీ ఈ సందర్భంగా అభినందించారు. -
లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్‌లో కరణ్ జోహార్..
పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య బాలీవుడ్లో కలకలం రేపింది. ఈ మర్డర్‌ను గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా పనే అని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో అనేక మందిని అరెస్ట్ చేశారు. వీరిలో లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడు సిద్ధేష్ కాంబ్లే కూడా ఉన్నాడు. అయితే సిద్ధేష్ను విచారించిన పోలీసులకు పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. హిందీ చిత్రపరిశ్రమలోని ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్‌ను కిడ్నాప్ చేయాలని ఈ ముఠా అనుకుందట. కరణ్ జోహార్‌ను అపహరించి ఆయన నుంచి రూ. 5 కోట్లకుపైగా డబ్బు రాబట్టాలని ప్లాన్ వేశారట. ప్రస్తుతం ఈ అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో సల్మాన్‌కు పోలీసులు భద్రత కూడా పెంచారు. ఇంతకుముందు కూడా 2018లో కృష్ణజింకను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్‌కు చంపేస్తామన్నా బెదిరింపులు వచ్చాయి. ఇదంతా చూస్తుంటే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాలీవుడ్‌ను టార్గెట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. చదవండి: 👇 రానున్న 'కాఫీ విత్ కరణ్' షో 7వ సీజన్.. టీజర్ రిలీజ్ మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ ! సినిమా సెట్లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ -
'పాయింట్ బ్లాక్‌లో గన్.. నగ్నంగా నిలబెట్టి దారుణంగా కొట్టారు'
ఆసీస్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ మెక్ గిల్ కిడ్నాప్ వ్యవహారం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. గతేడాది మార్చిలో దుండగులు సిడ్నీలోని తన నివాసంలోనే మెక్‌గిల్‌ను కిడ్నాప్ చేశారు. ఇది జరిగిన 15 నెలల తర్వాత మెక్‌గిల్ కిడ్నాప్ వ్యవహారంపై ఎట్టకేలకు నోరు విప్పాడు. ‘ఆ ఘటనను తలుచుకుంటేనే చాలా భయమేస్తోంది. మనం అసహ్యించుకునే శత్రువులకు కూడా అలా జరుగకూడదరని కోరుకుంటున్నా. కొందరు దుండగులు సిడ్నీలోని నా ఇంటికి వచ్చి నన్ను కిడ్నాప్ చేశారు. వాళ్లు నన్నెక్కడికి తీసుకెళ్లారో నాకు తెలియదు. నా కళ్లకు గంతలు కట్టి కార్ లో పడేశారు. నేను కార్లోకి ఎక్కనంటే ఆయుధాలతో బెదిరించారు. సుమారు గంటన్నర పాటు కార్లో ప్రయాణం చేశాం. అయితే వాళ్లు నన్ను ఎక్కడికి తీసుకెళ్లారనే దానిపై స్పష్టత లేదు. ఒక చోటుకు తీసుకెళ్లిన తర్వాత పాయింట్ బ్లాక్‌లో గన్ పెట్టి నా బట్టలన్నీ విప్పేసి నగ్నంగా నిల్చోబెట్టి దారుణంగా కొట్టారు. ఆ తర్వాత ఒక చోట నన్ను విడిచి వెళ్లిపోయారు. ఎక్కడున్నానో అర్థం కాక మూడు గంటల పాటు అలాగే నిల్చుండిపోయా. మళ్లీ వచ్చిన దుండగులు కార్లో తీసుకెళ్లి బెల్మోర్ సిటీలో విడిచిపెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. అక్కడి స్థానికుల సహాయంతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని సిడ్నీలోనే ఒక హోటళ్లో రెండు-మూడు వారాల పాటు గడిపాను. ఆ తర్వాత తెలిసిన స్నేహితుడిని ద్వారా ఫ్రేజర్ ఐలాండ్‌లోని నా గెస్ట్ హౌస్‌లో మరికొన్ని వారాలు గడిపాను. నన్ను కిడ్నాప్ చేసిన దుండగులు అరెస్ట్ అయ్యారని తెలుసుకొని తిరిగి ఇంటికి చేరుకొన్నా.. కానీ ఆ మూడు నెలలు మాత్రం చాలా నరకం అనుభవించా’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే మొదట్లో మెక్ గిల్‌ను డబ్బుల కోసం కిడ్నాప్ చేశారని చాలా మంది భావించారు. కానీ ఈ కేసులో మెక్ గిల్ భార్య తమ్ముడి హస్తం ఉందని తేలింది. మత్తు పదార్థాల సరఫరా విషయంలో మెక్ గిల్ ఇన్వాల్వ్ అయ్యాడని.. అందుకే దుండగులతో కిడ్నాప్ చేయించి వార్నింగ్ ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక 1998-2008 మధ్య ఆసీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మెక్ గిల్.. టెస్టు, వన్డే ఫార్మాట్లలో ఆడాడు. 44 టెస్టులాడిన మెక్‌గిల్ 208 వికెట్లు.. మూడు వన్డేలాడి 6 వికెట్లు తీశాడు. చదవండి: 'ఒక శకం ముగిసింది'.. టెస్టులకు ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ గుడ్‌బై ENG vs NED: నెదర్లాండ్స్ ఆటగాళ్ల గోస .. బంతి కోసం చెట్లు, పుట్టల్లోకి -
యువకుడితో సహజీవనం.. పెళ్లికి నో చెప్పిందని వివాహిత కుమారుడిని
సాక్షి, బంజారాహిల్స్: పెళ్లి చేసుకోవడానికి అంగీకరించడం లేదని ఓ వివాహిత కుమారుడిని కిడ్నాప్ చేసిన యువకుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి చిన్నారి కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు తెలిపిన మేరకు.. బబ్బుగూడలో నివసించే షేక్ తబస్సుమ్(24) భర్తతో విడిపోయి ఈవెంట్ ఆర్గనైజర్‌గా రహ్మత్‌నగర్‌లో పని చేస్తోంది. ఈమెకు ఇద్దరు కుమారులు. తన ఇంటి సమీపంలోనే నివసించే శంకర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త గత మూడు నెలలుగా సహజీవనానికి దారి తీసింది. ఇద్దరూ బబ్బుగూడలో సహజీవనం చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీన పెళ్లి చేసుకోవాలంటూ శంకర్ ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఇందుకు ఆమె అంగీకరించలేదు. దొంగతనాలు చేస్తూ పోలీసులకు కూడా పట్టుబడ్డట్లు శంకర్‌పై అభియోగాలు ఉండటంతో పెళ్లికి నిరాకరించింది. కక్ష పెంచుకున్న శంకర్ బాధితురాలు రహ్మత్‌నగర్‌లో ఓ కార్యక్రమంలో ఉండగా తనతో పాటు వచ్చిన రెండేళ్ల కుమారుడిని ఎత్తికెళ్లినట్లు ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు శంకర్‌పై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. నాందేడ్‌లో ఉన్నట్లుగా ఫోన్ కాల్‌డేటా ఆధారంగా గుర్తించారు. నాందేడ్‌కు ఒక పోలీస్ బృందం గురువారం వెళ్లింది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Hyderabad: వైద్యుల నిర్లక్ష్యం.. నిండు గర్భిణి మృతి -
చిన్నారి కిడ్నాప్.. అంతా కన్నతల్లి నాటకం!
హుబ్లీ(బెంగళూరు): కన్నబిడ్డ లోపాలతో పుట్టిందని స్వయాన కన్నతల్లి ఆ చిన్నారిని పై నుంచి కిందపడేసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్లారని నాటకమాడింది. పోలీసులు కూపీ లాగడంతో కిడ్నాప్ వెనుకున్న అసలు విషయం వెల్లడైంది. జిల్లాలోని కుందగోళ నెహ్రూనగర్‌కు చెందిన సల్మాషేక్ ఇటీవల 40 రోజుల పసిబిడ్డను ఆస్పత్రికి తీసుకువచ్చింది. బిడ్డను వదిలించుకోవడానికి పైనుంచి కిందపడేసి ఎవరో లాక్కెళ్లారని నాటకం ఆడింది. బిడ్డ గడ్డిపై పడటంతో ఏమీ గాయాలు కాలేదు. పోలీసులు సల్మాషేక్ను విచారించి అసలు విషయం వెల్లడించారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ విమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. మరో ఘటనలో.. బైక్, లారీ ఢీ, యువకుడి మృతి బళ్లారి రూరల్: బళ్లారి జిల్లా కుడితిని బైపాస్‌లో బైక్‌ను లారీ ఢీ కొనడంతో యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం ఉదయం జరిగింది. కుడితిని పోలీసుల వివరాలు... ఆంధ్రప్రదేశ్ కర్నూలుకు చెందిన లేపాక్షిరెడ్డి జిందాల్లో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. కుడితినిలో రూము తీసుకొని ఉంటున్నాడు. గురువారం ఉదయం తన బైక్‌పై కుడితిని బైపాస్‌లో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. తీవ్ర గాయాలతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి.. -
పాపం డాక్టర్ బాబు.. ట్రీట్మెంట్ కోసం ఇంటికి పిలిచి..
అమ్మాయిలను ఎత్తుకెళ్లి, బలవంతంగా పెళ్లి చేసుకోవడం ఘటనలు గురించి వినే ఉంటారు. కానీ అబ్బాయిలను కిడ్నాన్ చేసి పెళ్లిచేకోవడం అరుదనే చెప్పాలి. ఇక్కడా ఓ బ్యాచిలర్‌కి అలాంటి ‘చేదు’ అనుభవమే ఎదురైంది. ట్రీట్మెంట్ పేరిట ఇంటికి పిల్చి మరీ.. ఓ వెటర్నరీ డాక్టర్‌కు బలవంతంగా పెళ్లి చేశారు. బిహార్ బెగుసురాయ్‌లో ఓ కుటుంబం.. పశువుకి వైద్యం చేసే నిమిత్తం ఇంటికి రావాలంటూ ఓ వైద్యుడికి బతిమాలింది. అత్యవసరం అనుకుని హుటాహుటినా సదరు గ్రామానికి వెళ్లాడు ఆ డాక్టర్. అయితే.. మార్గంమధ్యలోనే డాక్టర్‌ను ఎత్తుకెళ్లి.. బలవంతంగా వాళ్ల ఇంట్లో అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసేశారు. ఈ విషయంలో ఆ డాక్టర్ ఇంట్లో తెలిసి.. షాక్ తిన్నారు. ఈ మేరకు ఆ వెటర్నరీ డాక్టర్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాదు తన కొడుకు కనిపించడం లేదంటూ మిస్సింగ్ కేసు నమోదు చేయించారాయన. ఇదిలా ఉంటే.. బెగుసురాయ్ ఎస్పీ యోగేంద్ర కుమార్ ఈ ఘటనపై సాదాసీదాగా స్పందించారు. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో.. తమ ఇంటి బిడ్డల కోసం పెళ్లి కాని అబ్బాయిలను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేస్తారట. అక్కడ ఇది చాలా సర్వసాధారణమని వ్యవహారమని చెప్పారాయన. దీన్ని అక్కడ వరుడి కిడ్నాప్ లేదా పకడ్వా వివాహం అని పిలుస్తారని వెల్లడించారు. అయితే ఇలాంటి ఘటనల్లో బాధితులు గనుక పోలీసులను ఆశ్రయిస్తే మాత్రం చర్యలు తీసుకుంటారట. ఇదిలా ఉండగా.. ప్రస్తుత ఘటనపై సత్వరమే విచారణ జరపడమే కాకుండా నిందితుల పై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. (చదవండి: పాపం పెద్దాయన.. అది నేరమా? మండిపడుతున్న నెటిజన్లు) -
Hyderabad: మరో దారుణం.. మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన క్యాబ్ డ్రైవర్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలిక అత్యాచార ఘటన మరవక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. నగరంలో ఇంకో మైనర్ బాలిక కిడ్నాప్‌కు గురైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది మొగల్ పురాలో మైనర్ బాలిక(13)ను ఓ క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేశాడు. బాలిక తన తల్లిని చూసేందుకు పహడిషరీఫ్‌కు వెళ్తుండగా లుక్మాన్ అనే క్యాబ్ డ్రైవర్ ఆమెను మభ్యపెట్టి రహస్య ప్రాంతానికి తీసుకెళ్లాడు, అక్కడ మరో ఇద్దరితో కలిసి అత్యాచారయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాలికను ఓ రాత్రంతా వేరే చోట ఉంచి తిరిగి విడిచి పెట్టాడు. తిరిగి ఇంటికి చేరుకున్న బాలిక జరిగిందంతా తల్లిదండ్రులకు వివరించింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్యాబ్ డ్రైవర్ లుక్మాన్ అహ్మద్‌తోపాటు అతనికి ఆశ్రయం ఇచ్చి మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కాగా నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన బయటికి రాకుండా పోలుసులు గోప్యతపాటిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం బాలిక ఇంటి నుంచి అదృశ్యమైంది. బాలిక కోసం గాలించిన కుటుంబ సభ్యులు అదే రోజు రాత్రి మొగల్ పురా పపీఎస్లో ఫిర్యాదు చేశారు. లుక్మాన్ అనే క్యాబ్ డ్రైవర్ తనను రంగారెడ్డి జిల్లాలోని ఏదో ఊరికి తీసుకెళ్లాడని బాలిక పోలీసులకు చెప్పింది. దీంతో మిస్సింగ్ కేసును కిడ్నాప్ కేసుగా పోలీసులు మార్చారు. బాలికను రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ గ్రామానికి తీసుకెళ్ళి, అక్కడ తెలిసిన వ్యక్తులు ఆశ్రయం ఇచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. లుక్మాన్‌కు ఆశ్రయమిచ్చిన వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసుకున్న మొఘల్ పురా పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు. -
అదృశ్యమైన బాలికను నాలుగు నెలలు గదిలో బంధించి..
సాక్షి, హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన మూగ, చెవిటి బాలికను నాలుగు నెలల పాటు గదిలో బంధించి లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడితోపాటు సహకరించిన మహిళను బంజారాహిల్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల సమాచారం మేరకు... బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎన్బీటీ నగర్లో నివసించే బాలిక(16) గతేడాది అక్టోబర్ 2వ తేదీన అదృశ్యమైంది. ఆ మేరకు తల్లిదండ్రులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన బాలిక ఆచూకీ లభించగా ఆమెను పునరావాస కేంద్రంలో చేర్చారు. ఏం జరిగిందని ఆరా తీయగా తనను గాజుల రామారం సమీపంలోని దేవేంద్రనగరంలో కోళ్ల రజిని అనే మహిళ చేరదీసి ఇంట్లో పనిమనిషిగా చేర్చుకుందని ఆ పక్కనే నివసిస్తున్న సజ్జపురపు యాదిరెడ్డి(19) తనపై బలవంతంగా లైంగికదాడికి పాల్పడ్డాడని తెలిపింది. రోజూ గంజాయి తాగి వచ్చి తనను కొడుతూ సిగరెట్ పీకలతో కాలుస్తూ చిత్రహింసలకు గురి చేస్తూ కోరికలు తీర్చుకునేవాడంది. బయట పడేందుకు యత్నిస్తుంటే రజిని అడ్డుకునేదని గదిలో బంధించేదని ఆరోపించింది. దీంతో పోలీసులు రజినితోపాటు యాదిరెడ్డిపై ఐపీసీ సెక్షన్ 363 కింద కేసు నమోదు చేశారు. చదవండి: సచిన్.. నాకు బతకాలని లేదు: కృతి సంభ్యాల్ -
అత్యాచారయత్నం కేసు.. గాయత్రి భర్త చెప్పిన షాకింగ్ విషయాలు..
సాక్షి, హైదరాబాద్: కొండాపూర్‌లో యువతిపై అత్యాచారయత్నం కేసులో పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన నిందితురాలు గాయత్రి భర్త శ్రీకాంత్ పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై గాయత్రి భర్త ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తన అత్త చేసే ఆరోపణలు అసత్యమని తెలిపారు. గాయత్రి తండ్రి మరణం అనంతరం వాళ్లు గాయత్రి మీద కక్ష కట్టారన్నారు. చదవండి: ఎంత పనిచేశావ్ నాన్నా! పుట్టింటికి నవ వధువు.. ప్రాణాలు తీసిన కన్నతండ్రి ఆస్తి పంపకాల్లో గాయత్రిని ఆమె తల్లి, సోదరే వేధించారన్నారు. గాయత్రి స్థలంలో తన తమ్ముడు ప్రదీప్ ఇళ్లు కట్టాలని చూశాడని.. దాన్ని గాయత్రి అడ్డుకుందని తెలిపారు. గాయత్రి కుటుంబంలో పరస్పరం అందరూ కేసులు వేసుకున్నారన్నారు. గాయత్రికి తాను సపోర్ట్‌గా ఉన్నందుకు తనపై కక్ష కట్టారని శ్రీకాంత్ తెలిపారు. గాయత్రి అరాచకాలపై తనకేమి తెలియదన్నారు. మీడియాలో వస్తున్న కథనాలపై తనకు సమాచారం లేదని శ్రీకాంత్ అన్నారు. కాగా, సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతిపట్ల అమానుషంగా ప్రవర్తించిన గాయత్రి ఇల్లును కబ్జా చేయడానికి ఆమె కుటుంబీకులు యత్నించారు. ఆమె భర్త శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు తల్లి కృష్ణవేణి, సోదరి సౌజన్యసహా మరికొందరిపై ఆదివారం కేసు నమోదు చేశారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తులకు సంబంధించి గాయత్రికి, ఆమె తల్లి కృష్ణవేణి, సోదరి సౌజన్య మధ్య కొన్నేళ్లుగా వివాదాలు నడుస్తున్నాయి. -
సినిమా స్టోరీని తలపిస్తున్న గచ్చిబౌలి గాయత్రి కేసు.. ట్విస్టులే ట్విస్టులు
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి శ్రీరామ్‌నగర్‌లో యువతిపై నలుగురిచేత అత్యాచారయత్నం చేయించిన నిందితురాలు గాయత్రి బాగోతం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తోంది. సినిమా స్టోరీని తలపిస్తోన్న ఈ కథలో గాయత్రితో పాటు ఆమె భర్తగా చెబుతున్న శ్రీకాంత్ ప్రమేయం కూడా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితురాలు సివిల్స్‌కు ప్రిపేర్ అవుతోందని చెప్పి.. శ్రీకాంత్ ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు. ఆ క్రమంలోనే వారిమధ్య సన్నిహిత సంబంధం ఉందని అనుమానించి.. వారిద్దరిపై గాయత్రి కేసు పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే, కేసు విత్ డ్రా పేరుతో బాధితురాలిని ఇంటికి పిలిపించి.. నలుగురు యువకుల చేత గాయత్రి అత్యాచారయత్నం చేయించినట్లు గచ్చిబౌలి సీఐ సురేష్ తెలిపారు. చదవండి: భర్తపై అనుమానం .. యువతిపై కిరాతకం! మరోవైపు గాయత్రి కేసులో గచ్చిబౌలి సీఐ సురేష్‌పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. సీఐ సురేష్ ప్రోద్బలంతోనే గాయత్రి తమపై అక్రమ కేసులు పెట్టిందని గాయత్రి తల్లి, సోదరి ఆరోపిస్తున్నారు. తాము ఫిర్యాదు చేస్తే సీఐ పట్టించుకోలేదన్నారు. మా ఇంట్లో మమ్మల్నే ఉండొద్దంటూ సీఐ వేధిస్తున్నారని గాయత్రి సోదరి ఆరోపించారు. చాలా కాలంగా గాయత్రికి సీఐ సురేష్ అండగా ఉంటున్నారని ఆరోపించారు. -
గాయత్రి కేసులో గచ్చిబౌలి సీఐ సురేష్‌పై ఆరోపణలు
-
స్థలం చూసోద్దామని చెప్పి...కిడ్నాప్ చేసి రూ.10 లక్షల వసూలు
కెలమంగలం: ఫైనాన్సియర్‌ను కిడ్నాప్ చేసి రూ. 10 లక్షలు లాక్కొన్న ముగ్గురిని అంచెట్టి పోలీసులు అరెస్ట్ చేశారు. తాలూకా కేంద్రం అంచెట్టి మరాఠీ వీధికి చెందిన వెంగోపరావ్ (44) ఫైనాన్సియర్. 9వ తేదీ కొందరు వెంగోపరావ్ ఇంటికెళ్లి విక్రయానికి ఉంచిన స్థలాన్ని చూద్దామని కారులో తీసుకెళ్లారు. దుండగులు బెంగళూరు సమీపంలోని అడవీ ప్రాంతానికి తీసుకెళ్లి రూ. 10 లక్షలు ఇస్తే వదిలేస్తామని, ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించడంతో భయపడిన అతను మిత్రునికి ఫోన్ చేసి రూ. 10 లక్షలు తెప్పించి వారికి అందజేశాడు. దీంతో అతన్ని వదిలేశారు. వెంగోపరావ్ గత రెండు రోజుల క్రితం అంచెట్టి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ జరిపి మిలిదిక్కి గ్రామానికి చెందిన గణేష్ (35), ఏరికొడి గ్రామానికి చెందిన శక్తివేల్ (30), పాండురంగన్కొటాయ్కు చెందిన శక్తి (28)లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. (చదవండి: ప్రేక్షకులకు ఏమైంది?) -
కొండాపూర్‌లో దారుణం.. యువతిని బంధించి, అత్యాచారయత్నం
-
భర్తపై అనుమానం .. యువతిపై కిరాతకం!
గచ్చిబౌలి (హైదరాబాద్): తన భర్తతో సంబంధం ఉందని అనుమానించింది. కోపంతో రగిలిపోతూ విచక్షణ కోల్పోయింది. తోటి యువతి అనే ఆలోచన ఏమాత్రం లేకుండా పాశవికంగా వ్యవహరించింది. పిన్నీ అని పిలిచే ఆ యువతిని పథకం ప్రకారం ఇంటికి పిలిపించి ఆమెపై లైంగిక దాడి చేయించేందుకు ప్రయత్నించింది. దాన్ని వీడియో కూడా చిత్రీకరించింది. దాదాపు 45 నిమిషాల పాటు ఈ ఘోరం చోటు చేసుకుంది. సంచలనం సృష్టించిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు.. ప్రధాన నిందితురాలు సహా ఆరుగురిపై ‘అత్యాచారం’ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం ఈ అమానుష ఘటన వివరాలిలా ఉన్నాయి. సంబంధం లేదని తేల్చిన పోలీసులు శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన యువతి (26) అశోక్‌నగర్‌లోని హాస్టల్లో ఉంటూ ఓ ఇన్స్టిట్యూట్లో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటోంది. కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీ బీ–బ్లాక్‌లో నివసించే శ్రీకాంత్ ఈమె సహ అభ్యర్థి. గతేడాది జరిగిన ఆన్లైన్ క్లాసుల నేపథ్యంలో వీరికి పరిచయమైంది. ఇతడు తొమ్మిదేళ్ల క్రితం గాయత్రిని (36) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గాయత్రి, శ్రీకాంత్‌లను పిన్ని, బాబాయ్ అని పిలిచే బాధిత యువతి గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు వారి ఇంట్లోనే ఉంది. అప్పట్లో గాయత్రి ఆమెతో బాగానే ఉండేది. షాపింగ్‌లకూ తీసుకెళ్లేది. కానీ తర్వాత అనుమానం పెంచుకుంది. ఈ నేపథ్యంలో ఆ యువతి వారి ఇంట్లో నుంచి బయటకొచ్చేసింది. అనుమానం వీడని గాయత్రి ఏప్రిల్ 22న ఆ మేరకు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గాయత్రితో పాటు శ్రీకాంత్‌ను, ఆ యువతిని పిలిచి కౌన్సెలింగ్ చేశారు. శ్రీకాంత్, ఆ యువతి మధ్య ఎలాంటి సన్నిహిత సంబంధం లేదని తేల్చి పంపారు. భార్య అనుమానాల నేపథ్యంలో శ్రీకాంత్ ఆమెనే మరోసారి రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. అయినా ఆమెలో అనుమానం పోలేదు. సమస్య పరిష్కరించుకుందామని పిలిపించి .. సదరు యువతిని భయభ్రాంతులకు గురి చేయాలని, దారుణంగా హింసించాలని గాయత్రి పథకం వేసింది. దీనికోసం గతంలో తన వద్ద డ్రైవర్లుగా పని చేసి ప్రస్తుతం మసీద్‌బండలోని పాన్‌షాపులో పని చేసే మస్తాన్(25), ముజాహిద్‌లతో (25) పాటు వీరి స్నేహితులైన అయ్యప్ప సొసైటీకి చెందిన విష్ణు (22) మనోజ్ (22), కడపకు చెందిన మౌలాలిలతో కలిసి రంగంలోకి దిగింది. గత గురువారం బాధిత యువతికి ఫోన్ చేసి కొండాపూర్‌కు వస్తే మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుందామంది. దీంతో ఆమె తన తల్లిదండ్రులు, ఇద్దరు న్యాయవాదులతో మధ్యాహ్నం 3 గంటలకు గాయత్రి ఇంటి వద్దకు వెళ్లింది. ఒంటరిగా ఇంటికి తీసుకెళ్లి .. గాయత్రి ఇండిపెండెంట్ హౌస్‌కు సమీపంలో ఉన్న ఓ హోటల్ వద్దకు వెళ్లిన వీళ్లు ఆ విషయం ఆమెకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో బయటకు వచ్చిన గాయత్రి మిగిలిన వారిని హోటల్ వద్దనే ఉంచి యువతిని తనతో తీసుకువెళ్లింది. అప్పటికే ఇంట్లో ఉన్న ఐదుగురు యువకులతో కలిసి యువతి నోట్లో గుడ్డలు కుక్కింది. వివస్త్రను చేసింది. సామూహిక లైంగిక దాడి చేయించేందుకు ప్రయత్నించింది. ఓ యువకుడు యువతి జననాంగంపై దాడి చేసి దారుణంగా హింసించాడు. దీంతో బాధితురాలికి తీవ్ర రక్తస్రావమైంది. ఈ ఘోరాన్ని గాయత్రి తన సెల్ఫోన్లో రికార్డు చేసింది. అంతసేపూ బయటే వేచి చూస్తున్న యువతి తల్లిదండ్రులు, న్యాయవాదులు ఆమె రాకపోవడంతో ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ప్రధాన గేటు దాటి, నాలుగు పెంపుడు శునకాలను తప్పించుకుని లోనికి వెళ్లడానికి దాదాపు 20 నిమిషాలు పట్టింది. అప్పటికి గాయత్రి సహా ఆరుగురూ ఇంటి వెనుక ఉన్న నిచ్చెన సాయంతో గోడ దూకి పారిపోయారు. అది కూడా అత్యాచారమే.. ఈ దారుణాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు అదేరోజు గచ్చిబౌలి పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లి ఫిర్యాదు చేయించారు. అయితే మహిళ జననాంగంపై దాడి చేయడం కూడా అత్యాచారమే అని చట్టం చెబుతోందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆరుగురిపైనా అత్యాచారం, నిర్భంధం, మహిళ ఆత్మ గౌరవానికి భంగం కలిగించడం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. గాయత్రి సహా పరారీలో ఉన్న నిందితులను శనివారం అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. నా కూతురికి ఏ శిక్ష వేసినా ఆనందమే ఓ ఆడపిల్లపై పాశవికంగా దాడి చేసిన నా కూతురుకు ఏ శిక్ష వేసినా ఆనందమే. ఆమె ఏ తప్పు చేసినా శ్రీకాంత్ గుడ్డిగా ప్రోత్సహిస్తుంటాడు. అతని ప్రోద్బలంతోనే గాయత్రి ఆ యువతిపై ఆ విధంగా దాడి చేసి ఉండవచ్చు. శ్రీకాంత్‌ను కూడా అరెస్టు చేయాల్సిన అవసరం ఉంది. – కృష్ణవేణి, గాయత్రి తల్లి చదవండి: వివాహేతర సంబంధం: అన్న మెడకు టవల్ చుట్టి.. -
కరాటే కల్యాణి మిస్సింగ్.. ఏమైపోయింది? ఎక్కడుంది?
కరాటే కల్యాణి ఆచూకిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. నిన్న(ఆదివారం)నుంచి కనపించకుండా పోయిన కరాటే కల్యాణి ఇంకా అఙ్ఞాతం వీడలేదు. ఆమె ఫోన్ కూడా ఇంకా స్విచ్ ఆఫ్‌లోనే ఉంది. దీంతో తన కూతురు ఏమైపోయిందో అని కరాటే కల్యాణి తల్లి విజయలక్ష్మీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. శ్రీకాంత్ రెడ్డి తన కూతుర్ని కిడ్నాప్ చేసి ఉంటాడని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సాక్షి మీడియాతో ఆమె మాట్లాడుతూ.. 'కరాటే కల్యాణి ఫేమ్ చూసి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆమెపై చేస్తున్న ఆరోపణలన్ని అవాస్తవం. పాప విషయం గురించి నాకేమీ తెలియదు. దత్తత తెచ్చుకుందని తెలుసు. కళ్యాణి మిస్సింగ్‌పై పోలీసులకు పిర్యాదు చేస్తాను తను ఎక్కడున్నా బయటికి రావాలని టీవీ ఛానెల్స్ ద్వారా కోరుతున్నాను' అని పేర్కొంది. కాగా ప్రభుత్వ అనుమతి లేకుండా చిన్నారులను విక్రయిస్తుందని ఫిర్యాదులు రావడంతో ఆమె ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పాపతో కలెక్టరేట్‌కి రమ్మని చెప్పారు. అయితే సోదాల సమయంలో కరాటే కల్యాణి ఇంట్లో లేదు. అంతేకాకుండా అప్పటి నుంచి ఆమె అజ్ఞాతంలోనే ఉండిపోయింది. దీంతో ఆమె ఎక్కడ ఉందన్నదానిపై అధికారులు విచారిస్తున్నారు. -
అజ్ఞాతంలో కరాటే కల్యాణి
-
1996 నాటి ఘటన.. కలెక్టర్ నిర్బంధం ఉదంతం.. సందర్శకుల్లా వచ్చి
సాక్షి, హైదరాబాద్: 1996 అక్టోబర్ 4 ఉదయం 10.45.. కేరళలోని పాలక్కడ్ కలెక్టర్ కార్యాలయం.. ట్రైబల్ ల్యాండ్ ఎలియెనేషన్ యాక్ట్‌కు వ్యతిరేకంగా నలుగురు సాయుధులు అప్పటి కలెక్టర్ ఉదారు రామ్ పుల్లారెడ్డిని (డబ్ల్యూఆర్ రెడ్డి) నిర్బంధించారు. 9 గంటల ఉత్కంఠ తర్వాత ఆయన్ను విడిచి పెట్టారు. నష్ట నివారణ కోసం కేరళ సర్కారు కూడా కలెక్టర్‌నే టార్గెట్ చేసింది. అయినా ఆయన అధైర్యపడలేదు. సీన్ కట్ చేస్తే.. పదవీ విరమణ చేసిన డబ్ల్యూఆర్ రెడ్డి ప్రస్తుతం నార్సింగిలో ఉంటున్నారు. ఆ ఘటన జరిగిన పాతికేళ్ల తర్వాత తాజాగా మలయాళ సినిమా ‘పడ’గా తెరకెక్కింది. ఈ నేపథ్యంలోనే నాటి అనుభవాలను డబ్ల్యూఆర్ రెడ్డి, ఆయన భార్య డబ్ల్యూ మాలతిరెడ్డి ‘సాక్షి’తో పంచుకున్నారు. గిరిజనుల భూమి కోసం.. గిరిజనులకు సంబంధించిన భూములను ఎవరైనా ఖరీదు చేస్తే.. వాళ్లు దరఖాస్తు చేసుకుంటే తిరిగి ఇచ్చేయాలనే చట్టం దేశవ్యాప్తంగా అమలులో ఉంది. దీనికి భిన్నంగా కేరళ ప్రభుత్వం ట్రైబల్ ల్యాండ్ ఎలియెనేషన్ యాక్ట్‌ను తీసుకొచ్చింది. గిరిజనుల భూములు ఎవరైనా డబ్బు చెల్లించి ఖరీదు చేస్తే తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదన్నది దాని సారాంశం. దీంతో ప్రభుత్వం, మీడియా దృష్టిని ఆకర్షించి గిరిజనుల భూముల్ని రక్షించడానికి గాను సీపీఐ (ఎంఎల్) అధీనంలోని అయ్యంకాళి పడ ఉద్యమకారులు ఓ పథకం వేశారు. అందులో భాగంగానే 1996లో పాలక్కడ్ కలెక్టర్ నిర్భంధం జరిగింది. సందర్శకుల్లా కలెక్టరేట్‌లోకి వచ్చి.. నలుగురు అయ్యంకాళి పడ ఉద్యమకారులు ఆ రోజు ఉదయం చేతి సంచులతో సందర్శకుల్లా కలెక్టరేట్‌లోకి వచ్చారు. నేరుగా డబ్ల్యూఆర్ రెడ్డి వద్దకు వెళ్లి ఆయన తలకు తుపాకీ గురిపెట్టారు. చేతులు వెనుక్కు విరిచికట్టి మెడకు తాడు బలంగా బిగించారు. ఆయన చాంబర్లోనే ఓ చిన్న బాంబు పేల్చి తక్షణం ప్రభుత్వం ట్రైబల్ ల్యాండ్ ఎలియెనేషన్ యాక్ట్‌ను వెనక్కు తీసుకోవాలని, లేదంటే కలెక్టర్ ప్రాణాలు తీస్తామని బెదిరించారు. దాదాపు 9 గంటల ఉత్కంఠ తర్వాత యాక్ట్ ఉపసంహరణకు కేరళ సర్కారు హామీ ఇవ్వడంతో కలెక్టర్‌ను విడిచిపెట్టారు. కలెక్టర్‌నే అనుమానించిన ప్రభుత్వం కలెక్టర్ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన ఉద్యమకారులు తెలివిగా వ్యవహరించారు. తమ వద్ద మారణాయుధాలు, బాంబులు లేవని.. బొమ్మ తుపాకులు, ఉత్తుత్తి బాంబులకే సర్కారు భయపడిందని మీడియాకు చెప్పారు. విషయం సరిచూసుకోకుండా, డబ్ల్యూఆర్ రెడ్డిని సంప్రదించకుండా మీడియా కూడా ఇదే ప్రచారం చేసింది. అది ఎన్నికల ఏడాది కావడంతో కేరళ ప్రభుత్వం నష్ట నివారణ చర్యల్లో భాగంగా డబ్ల్యూఆర్ రెడ్డినే టార్గెట్ చేసింది. ఈయన స్వస్థలం కర్నూలు అయినా వరంగల్‌గా ప్రచారం చేస్తూ మావోయి స్టులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. మావోయిస్టుల సహకారంతోనే పడ ఉద్యమకారులకు కలెక్టర్, ఎస్పీ, జిల్లా జడ్జి సహకరించారని సంజాయిషీ నోటీసు ఇచ్చింది. పాలక్కడ్ నుంచి కొల్లాం బదిలీ చేసింది. అయినా డబ్ల్యూఆర్ రెడ్డి మొక్కవోని దీక్షతో విధులు నిర్వర్తించారు. -
ప్రేమపేరుతో అత్త కూతుర్ని మహారాష్ట్ర తీసుకెళ్లి.. గది అద్దెకు తీసుకుని..
సాక్షి, హైదరాబాద్: ప్రేమ పేరుతో ఓ బాలికను మహరాష్ట్రకు తీసుకెళ్లిన యువకుడిని నారాయణగూడ పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై నరేష్ కథనం మేరకు. వివరాలిలా ఉన్నాయి. నేపాల్‌కు చెందిన లక్ష్మణ్ దమాయ కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి స్థిరపడ్డారు. అతని కుమారుడు కరణ్ పరియార్ హిమాయత్‌నగర్‌లోని మెమోస్‌లో పనిచేస్తున్నాడు. స్థానికంగా 9వ తరగతి చదువుతున్న తన అత్త కుమార్తెను అతను ప్రేమిస్తున్నాడు. అదను చూసుకుని కరణ్ పరియార్ సదరు బాలికను మహారాష్ట్రలోని కళ్యాణ్ నగరానికి తీసికెళ్లాడు. ఓ గది అద్దెకు తీసుకుని వారం రోజుల పాటు అక్కడే ఉన్నారు. తమ కుమార్తె కనిపించడం లేదని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో పోలీసులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. కరణ్ పరియార్ అన్న రాము పరియార్ ఫేస్బుక్లో తండ్రిపై, అన్నపై కేసు నమోదు అయ్యిందని, ఏ క్షణానైనా అరెస్ట్ చేయవచ్చునని పోస్ట్ చేశారు. ఫేస్బుక్ పోస్ట్ వైరల్ కావడంతో కరణ్ పరియార్ తన సోదరుడు రాముకు ఫోన్ చేసి తాము కళ్యాణ్‌లో ఉన్నట్లు తెలిపాడు. ఎస్సై నరేష్ సూచన మేరకు సమీపంలోని ఉల్లాస్‌నగర్ పీఎస్‌లో లొంగిపోయాడు. అప్పటికే ఎస్సై అక్కడి పోలీసులకు సమాచారం అందించడంతో వారు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం కరణ్ పరియార్ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: (Hyderabad: అపార్ట్ మెంట్లో వ్యభిచార దందా.. ముగ్గురు యువతులను..) -
అపహరణకు గురైనవాడే నేరస్తుడు, ఫిర్యాదుదారుడే నిందితుడు
న్యూఢిల్లీ: మనం ఎన్నో విచిత్రమైన కేసులు గురించి విన్నాం. కానీ ఈ కేసు అత్యంత విచిత్రమైంది. పోలీసులకు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నప్పుడూ అత్యంత ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో అత్యంత విస్తుపోయే విషయమేమిటంటే..అపహరణకు గురైనవాడిపై గతంలో చీటింగ్ కేసు నమోదైంది. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే నిందితులే బాధితులుగా మారడం. ఈ ఘటన నోయిడాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....గ్రేటర్ నోయిడాలోని కస్నా ప్రాంతంలో వ్యాపారవేత్త అమిత్ కుమార్ కిడ్నాప్‌కి గురయ్యారు. వ్యాపారవేత్త కారుని ఒక రౌండ్అబౌట్ వద్ద ఆపి, అతనిని, అతని డ్రైవర్ కుందన్‌ను కొట్టి హెచ్చరిక కాల్పులు జరిపారు. అనంతరం కుమార్‌తో కలిసి వేగంగా వెళ్లిపోయారు. అయితే వ్యాపారవేత్త డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమెదు చేసుకుని విచారించడం మొదలు పెట్టారు. ఈ మేరకు ఈ ఘటనలోని ప్రధాన నిందితుడుగా పర్వీందర్ తెవటియాని గుర్తించి అరెస్టు చేయడమే కాకుండా నేరానికి ఉపయోగించిన కారు, పిస్టల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు ఈ కేసు తాలుకా షాకింగ్ విషయాలు విని ఆశ్చర్యపోయారు. అపహరణకు గురైన వ్యాపారవేత్త పై సుమారు రెండున్నర కోట్ల చీటింగ్ కేసు నమైదైందని గుర్తించారు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఆ వ్యాపారవేత్త మీద ఫిర్యాదు చేసినవాడే అపహరించాడని పోలీసులు తెలుసుకున్నారు. దీంతో పోలీసులు మరింత లోతుగా విచారించగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం.. "వ్యాపారవేత్త అమిత్ కుమార్ తనకు మంత్రిత్వ శాఖలో పరిచయాలు ఉన్నాయని చెప్పి నిందితుడు తెవతియాకి భూమికి సంబంధించిన సమస్యలో సాయం చేశాడు. ఆ తర్వాత తనకు హోమంత్రితో ఉన్న పరిచయాలతో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇప్పించగలనని చెప్పాడు. దీంతో తెవతియా అతని కూతురు, పలువురు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సుమారు రెండున్నర కోట్లు ఈ వ్యాపారవేత్తకు ఇచ్చారు. ఏడాది గడుస్తున్న ఉద్యోగాలు రాకపోడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తేవటియా కుమార్ కారుకు జీపీఎస్ సిస్టమ్‌ను అమర్చి, అతడిని అనుసరించి మరీ అపహరించాడు" అని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఇద్దరూ జైల్లోనే ఉన్నారు. (చదవండి: ఇరు కుటుంబాల మధ్య పాతకక్షలు...హంతకుడిగా మారిన పెళ్లి కొడుకు) -
పసికందు కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
-
పిల్లల కోసం అడ్డదారులు..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పిల్లలు కలగలేదని కుమిలిపోవాల్సిన అవసరం లేదు. వారికోసం అడ్డదారులు తొక్కనవసరం లేదు. సన్మార్గంలోనే పిల్లలను దత్తత తీసుకోవచ్చు. చట్టబద్ధంగా అన్ని హక్కులు పొందవచ్చు. అయినా కొందరు మాత్రం పక్కదారి పడుతున్నారు. చట్టం, సమాజం దృష్టిలో నేరస్తులవుతున్నారు. తాజాగా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో అపహరించిన పసికందుతో పట్టుబడిన దంపతుల దుస్థితి ఇదే. గ్రామస్తులను నమ్మబలికి.. స్థానికుల కథనం ప్రకారం కవిటి మండలం కొత్తవరకకు చెందిన రైతు కుటుంబం మాదిన రాజేష్, లక్ష్మీప్రసన్నకు పిల్లలు కలగలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో అడ్డదారి తొక్కారు. ఈ క్రమంలో స్థానికులను నమ్మబలికించారు. గుజరాత్, తదితర రాష్ట్రాల్లో పిల్లల కోసం మంచి వైద్యం అందిస్తున్నారని స్థానికులకు చెప్పి కొన్ని నెలల క్రితం ఊరు విడిచి వెళ్లారు. అక్కడ చేసిన వైద్యంతో గర్భం దాల్చి, బిడ్డను కన్నారని చెప్పుకుని సొంతూరికి వస్తున్నామంటూ గ్రామస్తులకు సమాచారమిచ్చారు. ఈ లోపు మార్గమధ్యలో కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో పోలీసుల జరిపిన తనిఖీల్లో పసికందుతో పట్టుబడ్డారు. వారి కన్న బిడ్డతో వెళ్తే పోలీసులు పట్టుకోవడమేంటని సందేహం రావచ్చు. కానీ వారి చేతిలో ఉన్న పసికందు వారిది కాదు. విశాఖపట్నం కేజీహెచ్‌లో వేరొక తల్లికి జన్మించిన బిడ్డను మధ్యవర్తుల ద్వారా అపహరించి తీసుకొచ్చిన పసికందు అది. ఇంకేముంది పోలీసులకు చిక్కారు. ఇప్పుడు క్రిమినల్ కేసులు ఎదుర్కొని, జైలు పాలు కావల్సిన పరిస్థితి. పసికందును అపహరించి తీసుకొచ్చిన లక్ష్మీ ప్రసన్న గతేడాది జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. దత్తత విధానమే మేలు.. సంతానం కలగని దంపతులు జిల్లాలో ఉన్న శిశు గృహ(ప్రత్యేక దత్తత సంస్థ)ను సంప్రదించి పిల్లలను దత్తత తీసుకోవచ్చు. అవాంఛిత గర్భం, రోడ్డు పక్కన దొరికిన పిల్లలు.. తదితర శిశువులను చేరదీసి శిశుగృహలో అలనాపాలనా చూస్తున్న విషయం తెలిసిందే. ఇటువంటి పిల్లల్ని దత్తత తీసుకుందామనుకుంటే ఠీఠీఠీ.ఛ్చిట్చ.nజీఛి.జీn వెబ్సైట్లో దరఖాస్తు చేస్తే చాలు సీరియల్ పద్ధతిలో జిల్లాలోనూ, రాష్ట్రంలోనూ, ఇతర రాష్ట్రాల్లోనూ శిశు గృహల్లో ఉన్న పిల్లల్ని దత్తత తీసుకునే అవకాశం ఉంది. అంతా చట్టబద్ధంగా జరుగుతుంది. మన జిల్లాలోని శిశుగృహలో ప్రస్తుతం నలుగురు పిల్లలు ఉన్నారు. పిల్లలు లేని వారు మధ్యవర్తులను నమ్మి మోసపోవడం కంటే శిశు గృహను సంప్రదిస్తే మంచిదని జిల్లా పిల్లల సంరక్షణ అధికారి కె.వి.రమణ విజ్ఞప్తి చేస్తున్నారు. -
విశాఖ KGH ఆస్పత్రిలో కిడ్నాప్ కలకలం
-
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్య కుట్ర: ‘కిడ్నాప్’ల వ్యవహారంలో సంచలన మలుపు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు పట్టణానికి చెందిన పలువురి కిడ్నాప్, అదృశ్యం, అరెస్టుల వ్యవహారం సంచలన మలుపు తీసు కుంది. వారం రోజులుగా మహబూబ్‌నగర్, హైదరాబాద్‌తోపాటు ఢిల్లీలో చోటు చేసుకున్న వరుస అపహరణ ఘటనల వెనుక కొత్త కోణం వెలుగుచూసింది. మహబూబ్‌నగర్‌కు చెందిన సదరు వ్యక్తులు.. ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను హత్య చేసేందుకు కుట్రపన్నారని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రకటించడంతో కలకలం మొద లైంది. ఈ కుట్రలో బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, డీకే అరుణ అనుచరుల హస్తమున్నట్టు ఆరోపణలు వస్తున్నాయని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని సీపీ వెల్లడించడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. అయితే పోలీసులు అరెస్టు చేసిన నిందితులకు మంత్రిని హత్య చేసేంత ధైర్య ముందా? అన్న సందేహాలను జిల్లాలోని విపక్ష నేతలు, నిందితుల బంధువులు వ్యక్తం చేస్తున్నారు. నిందితుల్లో నలుగురు అన్నదమ్ములే.. మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేందర్రాజుతో పాటు మహబూబ్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అమరేందర్‌రాజు, మధుసూదన్‌రాజు, నాగరాజు, భండేకర్ విశ్వనాథరావు, తెలంగాణ ఉద్యమ కారుడు మున్నూరు రవి, వరద యాదయ్య కలిసి మంత్రి హత్యకు కుట్రపన్నారని పోలీసులు ప్రకటిం చారు. వీరిలో అమరేందర్‌రాజు, మధుసూదన్ రా జు, నాగరాజు, రాఘవేందర్‌రాజు నలుగురూ అన్న దమ్ములే. ఇందులో సుపారీ గ్యాంగ్‌కు డబ్బులు ఇచ్చేందుకు మధుసూదన్‌రాజు, అమరేం దర్రాజు ముందుకొచ్చారని పోలీసులు చెప్తున్నారు. మొదటి నుంచీ విభేదాలతో..: మంత్రి హత్య కేసులో నిందితులుగా చేర్చిన నలుగురు అన్నదమ్ములకు, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు మొదటి నుంచీ విభేదాలు ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన అమరేందర్‌రాజు.. ప్రస్తుతం మహబూబ్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన భార్య రాధ గతంలో మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. అయితే టీఆర్ఎస్లో చేరిన కొన్నిరోజుల తర్వాత అమరేందర్‌రాజు కుటుంబం.. శ్రీనివాస్‌గౌడ్‌తో అంటీముట్టనట్టుగానే ఉన్నట్టు ప్రచారంలో ఉంది. 2018 ఎన్నికల్లో శ్రీనివాస్‌గౌడ్ తప్పుడు అఫిడవిట్ వేశారని, తర్వాత స్థానిక ఎన్నికల అధికారులతో కుమ్మక్కై ఈసీ వెబ్‌సైట్‌ను ట్యాంపర్ చేసి వివరాలు మార్చారని రాఘవేందర్‌రాజు ఫిర్యాదు చేశారు. 2019 జనవరి 24న కోర్టులో కేసు కూడా వేశారు. శ్రీనివాస్‌గౌడ్‌ను డిస్క్వాలిఫై చేసి, ఉప ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఆ కేసు 2020 మార్చి 24న విచారణకు వచ్చినా.. కరోనా నేపథ్యంలో వాయిదాపడింది. ఈ క్రమంలో రాఘవేందర్రావు.. 2021 ఆగస్టు 2న కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ)కు ఈ–మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. దానిపై స్పందించిన సీఈసీ.. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి నుంచి నివేదిక తెప్పించుకున్నట్టు సమాచారం. ఇటీవల సీఈవో శశాంక్ గోయల్ కేంద్ర సర్వీసులోకి వెళ్లిన క్రమంలో.. ఈసీ వెబ్సైట్ ట్యాంపరింగ్‌పై నిజానిజాలు తేల్చాలని సాంకేతిక బృందానికి సీఈసీ ఆదేశించినట్టు తెలిసింది. కాగా.. నెల క్రితం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్ నగ ర్లో మీడియాతో మాట్లాడుతూ.. తీవ్ర ఆరోపణలు చేశారు. తాను రాజకీయంగా ఎదుగుతున్నందున కక్ష గట్టి అసత్య ప్రచారం చేస్తున్నారని.. దుష్ప్రచారం వెనుక ఓ మాజీ మంత్రి, మాజీ ఎంపీ హస్తం ఉందని మండిపడ్డారు. అనుమానాలున్నాయి: బంధువులు నాగరాజు, భండేకర్ విశ్వనాథరావు, యాదయ్యను కొందరు వ్యక్తులు ఎత్తుకెళ్లారని 23, 24వ తేదీల్లో వారి భార్యలు మహబూబ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ వారు 25వ తేదీన ఫరూక్, హైదర్ అలీలను హత్య చేసేందుకు ప్రయత్నించారని, 26న అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించడంపై అనుమానాలు ఉన్నాయని నిందితులు బంధువులు, కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తమ వారిని చర్లపల్లి జైలుకు పంపిన తర్వాతే పోలీసులు సమాచారం ఇచ్చారని.. తీరా జైలు వద్దకు వెళ్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు జాప్యం చేసి ములాఖత్ ఇచ్చారని నాగరాజు, యాదయ్య కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానికంగా జరుగుతున్న కొన్ని తప్పులను ప్రశ్నిస్తున్నందుకే తమ వారిపై ఇలా పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించారని ఆరోపించారు. ఇక ఈ వ్యవహారంలో బీజేపీ నేతల హస్తంపై ఆరోపణలు వస్తుండటంతో.. రాజకీయ రచ్చకు తెరతీసినట్లేనని జిల్లాలో చర్చ జరుగుతోంది. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలాగంటే.. మహబూబ్‌నగర్ పట్టణంలోని బీకేరెడ్డి కాలనీకి చెందిన చలువగాలి నాగరాజును గత నెల 23న రాజేంద్రనగర్‌లోని ఓ బేకరీ సమీపంలో కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్లారని.. అప్పటి నుంచి తన భర్త ఆచూకీ లేదని నాగరాజు భార్య గీత అదేరోజు సాయంత్రం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మరుసటి రోజు మిస్సింగ్‌గా కేసు నమోదు చేశారు. 24న మహబూబ్‌నగర్‌కు చెందిన మైత్రి ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకుడు వరద యాదయ్యను ఇద్దరు వ్యక్తులు షాప్ వద్దకు వచ్చి ప్రింటింగ్ ఆర్డర్ ఇస్తామంటూ బయటికి పిలిచి ఎత్తుకెళ్లినట్లు ఆయన భార్య సంధ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. 24వ తేదీనే పట్టణానికి చెందిన మరో వ్యక్తి భండేకర్ విశ్వనాథరావును గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ ఆయన భార్య పుష్పలత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ముగ్గురినీ మంత్రిపై హత్యాయత్నం కేసులో అరెస్టు చేసినట్టు పేట్‌బషీరాబాద్ పోలీసులు 26వ తేదీన ప్రకటించారు. 28న ఢిల్లీలోని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి నివాసంలో.. మహబూబ్‌నగర్‌కు చెందిన తెలంగాణ ఉద్యమ కారుడు మున్నూరు రవి, జితేందర్‌రెడ్డి డ్రైవర్ థాపాతోపాటు రాఘవేందర్‌రాజు, మధుసూదన్‌రాజులను అదుపులోకి తీసుకుని బుధవారం అరెస్టు చూపించారు. ఇమేజ్ కోసం అల్లిన కథ ఇది శ్రీనివాస్‌గౌడ్ తన ఇమేజ్ను పెంచుకునేందుకు అల్లిన కథ. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణలపై ఆరోపణలు చేసి ఇమేజ్ పెంచుకోవాలని కుట్రలు చేయడం తగదు. ఎన్నికల అఫిడవిట్‌ను మార్చిన విషయంలో తనకు వచ్చిన ఇబ్బందులను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి హత్యకు కుట్ర కథనాన్ని తెరపైకి తీసుకొచ్చారు. సుపారీ ఇచ్చేంత డబ్బులు విశ్వనాథ్ భండేకర్, మున్నూర్ రవి, యాదయ్యలకు ఎక్కడివి? – వీరబ్రహ్మచారి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నా భర్తను ఇరికించారు నా భర్త మైత్రి యాదయ్యను కుట్ర పూరి తంగా కేసులో ఇరికించారు. ఆయనకు ఏ పాపం తెలియదు. హత్యలు చేసేంత క్రూరుడు కాదు. మంత్రికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో కక్ష పెంచుకుని కేసులో ఇరికించారు. – నాగమణి, మైత్రి యాదయ్య భార్య మా అక్క షాక్‌లో ఉంది... మా అక్క షాక్‌లో ఉంది. చక్కర వచ్చి పడిపోయి ప్రస్తుతం ఏమీ మాట్లాడే పరిస్థితిలో లేదు. మూడు రోజులుగా ఏమీ తినలేదు. మాకు ఏమీ అర్థం అవ్వడం లేదు. ఏం జరుగుతుందో తెలియడం లేదు. – అనిల్ (విశ్వనాథ్ భండేకర్ బావమరిది) మంత్రి హత్యకు కుట్ర దారుణం తెలంగాణలో హత్యా రాజకీయాలకు చోటు లేదు. జిల్లాకు చెందిన మంత్రి శ్రీనివాస్ హత్యకు కుట్ర చేయడం దారుణం. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా చట్టపరంగా కఠినంగా శిక్షించాలి. – డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే, జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు -
వెలుగులోకి ‘వెబ్ సిరీస్ సూరి’ మరో వ్యవహారం.. శ్వేత ద్వారా ఎర వేసి!
సాక్షి, హైదరాబాద్: ‘వెబ్ సిరీస్’ కిడ్నాపర్ గంజపోగు సురేష్ అలియాస్ సూరి వ్యవహారాలకు సంబంధించి ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇతగాడు తన గ్యాంగ్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గండికోట రవి అనే యువకుడిని రెండుసార్లు కిడ్నాప్ చేశాడని బయటపడింది. ఏడాది వ్యవధిలో జరిగిన ఈ అపహరణల్లో అతడి కుటుంబం నుంచి నగదు వసూలు చేశాడు. ఇక్కడి అధికారుల విచారణ ముగిసిన తర్వాత సూరిని పీటీ వారెంట్‌పై తీసుకువెళ్లడానికి తెనాలి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. బీచ్‌కు పోదామంటూ తొలిసారి... తెనాలి మండలం అంగలకోడూరు గ్రామానికి చెందిన గండికోట రవి వివాహితుడు. అయితే అనివార్య కారణాల నేపథ్యంలో మూడేళ్లుగా భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఇతడికి ఏడాది క్రితం ఫేస్బుక్ ద్వారా సూర్య పేరుతో సూరి పరిచయమయ్యాడు. ఇద్దరూ స్నేహితులుగా మారడంతో పాటు ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకుని కొన్నాళ్లు చాటింగ్స్ చేసుకున్నారు. సూరి ఓ రోజు తాను బాపట్ల బీచ్ చూడాలని అనుకుంటున్నానంటూ రవితో చెప్పాడు. దీంతో అంగలకోడూరు వరకు రావాలని, ఇద్దరం కలిసి వెళ్లి బీచ్ చూద్దామంటూ అతడు కోరాడు. పథకం ప్రకారం తన అనుచరులతో కారులో అంగలకోడూరు వరకు వెళ్లిన సూరి అందులోనే రవిని కిడ్నాప్ చేసి సిటీకి తీసుకువచ్చాడు. చదవండి: హైదరాబాద్: మార్చి నాటికి మరో నాలుగు ప్రాజెక్టులు శ్వేత ద్వారా ఎర వేసి... రవిని ఓ గదిలో బంధించి ఉంచిన సూరి తీవ్ర స్థాయిలో బెదిరించాడు. ఆపై అతడి తల్లికి ఫోన్ చేసి డబ్బు చెల్లించాలని లేదంటే రవిని చంపేస్తామంటూ హెచ్చరించాడు. ఇలా ఆమె నుంచి ఫోన్ పే ద్వారా రూ.50 వేలు వసూలు చేసి రవిని విడిచిపెట్టాడు. అప్పటికే తీవ్రభయాందోళనల్లో ఉన్న రవి ఈ విషయాన్ని పోలీసులకూ ఫిర్యాదు చేయలేదు. ఇటీవల మరోసారి అతడిని టార్గెట్ చేసిన సూరి తన ‘ఉద్యోగిని’ శ్వేత చారిని రంగంలోకి దింపాడు. ఫేస్బుక్ ద్వారా రక్షిత పేరుతో రవికి పరిచయమైన ఈమె అతడి ఫోన్ నెంబర్ తీసుకుంది. కొన్నాళ్లు మాట్లాడిన తర్వాత గత నెల 5న అసలు కథ మొదలెట్టింది. తాను సూర్యాపేటలో ఉంటానని, వస్తే కలుద్దామంటూ ఎర వేసింది. దీంతో 16న రవి ద్విచక్ర వాహనంపై సూర్యాపేట వచ్చాడు. గదిలో బంధించి డబ్బు వసూలు... అప్పటికే అక్కడ కాసుకుని ఉన్న సూర్య అండ్ గ్యాంగ్ తమ కారులో రవిని కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకువచ్చింది. మరోసారి అతడి తల్లికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగడంతో పాటు రూ.5 లక్షలు డిమాండ్ చేసింది. బేరసారాల తర్వాత ఫోన్ పే ద్వారా రూ.55 వేలు వసూలు చేసి అతడిని వదిలిపెట్టింది. తన స్వస్థలానికి తిరిగి వెళ్లిన రవి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకాడాడు. రెండుసార్లు తమ వల్లోపడిన రవి నుంచి మరికొంత మొత్తం వసూలు చేయాలని భావించిన సూరి మళ్లీ ఫోన్లు చేయడం మొదలెట్టాడు. తనకు డబ్బు కావాలంటూ బెదిరిస్తుండటంతో ఈ నెల 13న ర వి తెనాలి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. -
మియాపూర్: డబ్బుల కోసం అమ్మమ్మ కర్కశత్వం.. కూతురి పిల్లలనే కనికరం లేకుండా..
సాక్షి, మియాపూర్: సొంత అమ్మమ్మ మానవత్వం మరిచి రూ.30 లక్షలు డబ్బులిస్తేనే మనవళ్లను పంపుతానని కూతురును బెదిరించడంతో ఆమె మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ లింగానాయక్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మియాపూర్ మదీనాగూడలో నివాసముంటున్న రుహీ వైద్యురాలు. పదేళ్ల క్రితం ముదాసర్ అలీ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఎనిమిది సంవత్సరాల అర్ఫాన్, ఐదేళ్ల అర్హాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త అలీ ఏడాదిన్నర క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. ఈ క్రమంలో తల్లి ముంతాజ్, అక్క రోషనాతో కలిసి మదీనాగూడలో ఉంటున్నారు. ఈ క్రమంలో ఆస్తి మీద కన్నేసిన తల్లి, అక్క జనవరిలో ఇద్దరు పిల్లలను తీసుకొని వారి సొంత ఊరు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి తీసుకెళ్లిపోయారు. చదవండి: స్నేహను ప్రేమిస్తున్నానని చెప్పి.. తర్వాత మరో అమ్మాయితో పెళ్లన్నాడు.. చివరికి! అప్పటి నుండి పిల్లలను తల్లి రుహీకి కనిపించకుండా చేశారు. దీంతో రుహీ పిల్లల కోసం సత్తుపల్లి వెళ్లగా అక్కడ బంధువులందరూ ఆమె పై దాడి చేసి కారును సైతం లాక్కొని పంపించేశారు. దీంతో తల్లి, మిగతా కుటుంబ సభ్యులపైన రుహీ బుధవారం రాత్రి మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కిడ్నాప్ కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా గురువారం మియాపూర్ పోలీసులు రుహీ దగ్గర బంధువైన సలీమ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. బాధితురాలు రుహీ మానసిక పరిస్థితి సరిగా లేదని, పిల్లలను పట్టించుకోవడం లేదని వారి భవిష్యత్ దృష్యా తాము తీసుకెళ్లామని రుహీ తల్లి ముంతాజ్ తెలిపారు. పిల్లల అమ్మమ్మగా తమకు సర్వ హక్కులు కల్పించాలని మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు రుహీ తల్లి ముంతాజ్ తెలిపింది. చదవండి: Hyderabad: సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ ఫ్రమ్ హోం.. కూతురి గోల్డ్ చైన్ విషయమై భర్తతో గొడవ... దాంతో.. -
ఛత్తీస్ గఢ్ లో భర్త కోసం అడవి బాట పట్టిన భార్య
-
అడవిబాట పట్టిన భార్య.. మావోయిస్టుల చెరలో ఇంజనీర్
-
కారు ఆగిపోయిందంటూ హైడ్రామా.. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను కారులో ఎక్కించి..
సాక్షి, శృంగవరపుకోట రూరల్(శ్రీకాకుళం): ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరు అయిన యువకుడిని కిడ్నాప్చేశారన్న వార్త ఎస్.కోట, తెర్లాం మండలాల్లో కలకలం రేపింది. ఉదయం మార్నింగ్‌వాక్‌కు వెళ్లిన యువకుడిని నలుగురు వ్యక్తులు సినీఫక్కీలో కిడ్నాప్ చేసేందుకు కారులో ఎక్కించారు. తలపై దాడి చేశారు. రూ.50 లక్షలు డిమాండ్ చేశారు. ఓ రహస్య ప్రదేశంలో బంధించే ప్రయత్నంలో యువకుడు కేకలు వేయడంతో స్థానికులు స్పందించారు. కిడ్నాపర్లను వెంబడించడంతో ఇద్దరు పరార్కాగా, మరో ఇద్దరు పట్టుబడ్డారు. స్థానికులు, ఎస్.కోట పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తెర్లాం మండలంలోని కూనాయవలస గ్రామానికి చెందిన తెర్లి అప్పలనాయుడు కుమారుడు ఈశ్వరరావు హైదరాబాద్‌లో వీఎల్ఎస్ఐ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. కోవిడ్‌తో రెండేళ్లుగా ఇంటివద్ద ఉంటూనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఎప్పటిలాగే మార్నింగ్ వాకింగ్‌కు రాజాం–రామభద్రపురం ప్రధానరోడ్డుకు శుక్రవారం తెల్లవారుజామున వెళ్లారు. కూనాయవలస పెట్రోల్ బంక్ దాటిన తరువాత రోడ్డుపక్కన ఆగి ఉన్న కారు నుంచి ఓ వ్యక్తి దిగాడు. కారు ఆగిపోయింది.. కొంచెం తోయాలని ఈశ్వరరావు సాయం కోరాడు. కారు నెట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కారులో నుంచి మరోవ్యక్తి దిగి ఈశ్వరరావు తలపై బలంగా కొట్టాడు. మరో ఇద్దరు కలిసి కాళ్లుచేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి కారులో ఎక్కించి తీసుకెళ్లిపోయారు. కారులో చిత్రహింసలు పెట్టారు. ఇంటికి ఫోన్ చేసి రూ.50 లక్షలు తెమ్మని బెదిరించారు. లేదంటే పెద్దసార్కి అప్పగిస్తామని, ఆయన నీ కళ్లు, కిడ్నీలు, ఇతర శరీర అవయవాలు అమ్మేస్తాడని భయపెట్టారు. ఎస్.కోట సీహెచ్‌సీలో కిడ్నాప్‌నకు గురయిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ తెర్లి ఈశ్వరరావుని విచారిస్తున్న పోలీసులు డబ్బులు ఇవ్వకపోతే మీ నాన్నను చంపేస్తామంటూ కారు ఎక్కించిన ప్రాంతం నుంచి దించిన ధర్మవరం గ్రామం వరకు భయపెడుతూనే ఉన్నారు. ధర్మవరం వద్ద ఉన్న ఓ రహస్య ప్రదేశంలో బంధించేందుకు కారు నుంచి కిందకు దించారు. ఆ సమయంలో ఈశ్వరరావు గట్టిగా కేకలు వేశారు. అటువైపుగా వెళ్లే ధర్మవరం గ్రామస్తులు కొందరు స్పందించారు. వెంటనే దుండగులను పట్టుకునేందుకు వెంటపడ్డారు. ఇద్దరిని పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. ఎస్.కోట పోలీసులకు సమాచారం ఇచ్చి ఇద్దరు కిడ్నాపర్లను అప్పగించారు. కిడ్నాపర్ల చేతిలో తీవ్రంగా గాయపడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను ఎస్.కోట సీహెచ్‌సీకి పోలీసులు తరలించారు. ఆయన తలకు తొమ్మిది కుట్లు పడినట్టు వైద్యులు తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ తారకేశ్వరరావు కేసు నమోదు చేశారు. కిడ్నాప్ చేసిన ప్రాంతం తెర్లాం మండల పరిధిలోదని, ఉన్నతాధికారుల సూచన మేరకు కేసును అక్కడకు బదిలీ చేస్తామని చెప్పారు. విచారణలో ఉన్నందున కిడ్నాపర్ల పేర్లు చెప్పలేమన్నారు. కిడ్నాపర్లను బంధించి పోలీసులకు సమాచారమిచ్చిన ధర్మవరం గ్రామస్తులను ఎస్ఐ అభినందించారు. కిడ్నాప్ ఎందుకు చేశారు.. ఎవరు చేయించారన్న వివరాలు తెలియాల్సి ఉంది. కిడ్నాపర్లలో ముగ్గురు ఎస్.కోట మండలం వారే.. కిడ్నాపర్లు నలుగురిలో ముగ్గురు ఎస్.కోట మండలంవారే. రేవళ్లపాలెం గ్రామానికి చెందిన యువకులు ఇద్దరు కాగా, మరొకరు ఎస్.కోట పట్టణానికి చెందిన వ్యక్తి. ఈ ముగ్గురు యువకులూ రేవళ్లపాలెం గ్రామానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి ధర్మవరం గ్రామంలో నడుపుతున్న వాటర్‌ప్లాంట్‌లో పని చేస్తున్నారు. వీరందరూ ప్రతిరోజు మద్యం సేవించి ప్లాంట్‌లోనే రాత్రుళ్లు ఉంటారని ధర్మవరం గ్రామస్తులు చెబుతున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను కిడ్నాప్ చేసిన కారు నంబర్ కూడా నకిలీదై ఉంటుందని, కారులో నాలుగైదు నంబర్ ప్లేట్లు, ఇనుప రాడ్లు ఉన్నాయని ఎస్ఐ తెలిపారు. సుఫారీ దందాలో భాగంగానే ఈ కిడ్నాప్ తతంగం జరిగిందని, కూనాయవలస గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్రోద్బలంతో జరిగినట్టు సమాచారం. కారు డ్రైవర్, కిడ్నాప్‌నకు పూనుకున్న వ్యక్తి ఇద్దరూ పరారీలో ఉన్నారు. బాధితుడి కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ తెర్లాం మండలంలోని కూనాయవలస గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెర్లి ఈశ్వరరావు కిడ్నాప్‌కు గురైనట్టు తెలుసుకున్న బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు శుక్రవారం ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈశ్వరరావును కిడ్నాప్ చేయడానికి కారణాలు ఏమై ఉంటాయని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కిడ్నాప్‌కు గురైన వ్యక్తి ఎస్.కోట పోలీస్‌స్టేషన్‌లో ఉన్నాడని, కిడ్నాప్‌కు పాల్పడిన కొందరిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కూనాయవలస ఎంపీటీసీ బొమ్మి శ్రీనివాసరావు ఎమ్మెల్యేకు తెలియజేశారు. -
ఉద్యోగం తీసేశాడని.. కడుపుకోత మిగిల్చారు!
పగ.. ప్రతీకార వాంఛ.. కృతజ్ఞతను సైతం పక్కన పడేస్తుంది. మనిషిని మృగంగా మార్చేసి విపరీతాలను దారి తీస్తుంది. అలాంటిదే ఈ ఘటన. ఎప్పుడో రెండేళ్ల క్రితం తండ్రి చేసిన పనిని మనసులో పెట్టుకుని.. ఆ పగని అభం శుభం తెలియని పసివాడి మీద చూపించారు ఇద్దరు వ్యక్తులు. యూపీలో జరిగిన మైనర్ కిడ్నాప్-హత్య ఉదంతం ఇప్పుడు వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. లక్నో: యూపీ బులంద్‌షెహర్‌లో బాధిత తండ్రి డాక్టర్‌గా పని చేస్తున్నాడు. ఆవారాగా తిరుగుతున్న ఇద్దరు కుర్రాళ్లను.. వాళ్ల తల్లిదండ్రుల ముఖం చూసి తన దగ్గర కాంపౌండర్లుగా చేర్చుకున్నాడు. అయితే డాక్టర్‌కు తెలియకుండా వాళ్లను డ్యూటీలో తప్పులు చేస్తూ వచ్చారు. దీంతో రెండేళ్ల కిందట నిజమ్, షాహిద్‌లను ఉద్యోగంలోంచి తీసేశాడు. అప్పటి నుంచి ఆ డాక్టర్ మీద కోపంతో రగిలపోతూ.. అదను కోసం చూస్తూ వచ్చారు వాళ్లిద్దరూ. శుక్రవారం(28, జనవరి)న ఆ డాక్టర్‌కి ఉన్న ఎనిమిదేళ్ల కొడుకును కిడ్నాప్ చేసి.. దాచిపెట్టారు. కొడుకు కనిపించకపోయేసరికి కంగారుపడ్డ ఆ తండ్రి.. ఛట్టారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు రంగంలోకి దిగేసరికి భయంతో అదే రాత్రి ఆ చిన్నారిని చంపేశారు. పోలీసుల దర్యాప్తులో.. మాజీ ఉద్యోగులుగా, పైగా డాక్టర్ ఇంటి దగ్గర్లోనే ఉంటుండడంతో ఆ ఇద్దరిని ప్రశ్నించారు పోలీసులు. వాళ్లు తడబడడంతో తమ శైలిలో ప్రశ్నించగా.. నిజం ఒప్పేసుకున్నారు. దీంతో ఆ పిల్లవాడి మృతదేహాన్ని రికవరీ చేసుకుని.. నిందితులను అరెస్ట్ చేశారు. తన మీద కోపంతో తన కొడుకును కడతేర్చడంపై ఆ తండ్రి, ఆ తల్లి కుమిలి కుమిలి రోదిస్తున్నారు. -
గాడిదలను అపహరించి సొమ్ము చేసుకుంటున్నారు!
తాడేపల్లిరూరల్: తమ ఇంటి మహాలక్ష్మిగా పెంచుకుంటున్న గాడిదలను కొందరు అపహరించి అమ్ముకోవడంపై వాటి యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరికి అమ్ముకున్న వారు నష్టపరిహారం చెల్లించడంతో వారు మొత్తబడ్డారు. కర్నూల్ పట్టణ పరిధిలో దోబీ పనిచేసి జీవనం సాగించే కొంతమంది దుస్తులు మోసేందుకు గాడిదలను పెంచుతూ వాటిని ఎంతో ఆప్యాయంగా చూస్తుంటారు. అయితే బబ్లూ, శ్రీనివాసరావు, దుర్గారావులకు చెందిన గాడిదలను బాపట్లకు చెందిన రజనీకాంత్ అనే వ్యక్తి అపహరించి వాటిని తాడేపల్లిలో అమ్మాడు. దీంతో బబ్లూ, శ్రీనివాసరావులు తమ స్నేహితులతో కలసి రాష్ట్రంలో గాడిదలను ఎక్కడెక్కడ వధించి మాంసాన్ని విక్రయిస్తారో గూగుల్‌లో సెర్చ్ చేసి తాడేపల్లి చేరుకున్నారు. ఒక ఇంట్లో కట్టేసి ఉన్న తమ గాడిదను బబ్లూ, శ్రీనివాసరావులు గుర్తించి తాడేపల్లి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు విచారించగా.. కర్నూలు నుంచి అపహరించిన మూడు గాడిదల్లో రెండింటిని మాంసం కోసం విక్రయించినట్టు తెలిపారు. మిగిలిన ఆ గాడిదను బబ్లూకు అప్పగించారు. అమ్మిన రెండు గాడిదలకు వెల కట్టి రూ.1.60 లక్షలను కర్నూలు యువకులకు అందించారు. -
వివాహేతర సంబంధం: సుపారీ ఇచ్చి ప్రియుడి కిడ్నాప్, పెళ్లి.. సినీ ఫక్కీలో ఘటన
సాక్షి, వరంగల్: మూడ్రోజుల క్రితం నర్సంపేట పట్టణంలోని కమలాపురంకు చెందిన ఫైనాన్స్ వ్యాపారి శ్రీనివాస్ కిడ్నాప్ అయిన విషయం పాఠకులకు విదితమే. ఈ కేసును నర్సంపేట పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకున్నారు. విచారణను మమ్మురం చేశారు. సినీ ఫక్కీలో జరిగిన కిడ్నాప్‌ను శుక్రవారం పోలీసులు ఓ కొలిక్కి తీసుకువచ్చారు. నర్సంపేట మున్సిపాలిటి పరిధి 2వ వార్డు కమలాపురం గ్రామానికి చెందిన ముత్యం శ్రీనివాస్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. దీంతో పాటు మద్యం షాపు నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ వివాహితకు పైనాన్స్ (రోజువారీ చిట్టి) ఇచ్చాడు. రోజూ ఆమె ఇంటికి వెళ్తూ చిట్టీ డబ్బులు వసూలు చేస్తున్నాడు. చదవండి: వాట్సప్ చివరి స్టేటస్.. ఊరి నుంచి తెచ్చుకున్న అమ్మ చీరతోనే ఉరేసుకుని.. ఈ క్రమంలో వారిద్దరూ వివాహేతర సంబంధం ఏర్పర్చుకున్నారు. కొద్ది రోజులకు ఈ విషయం బయటకు పొక్కడంతో గతేడాది పెద్దమనుషులు పంచాయితీ నిర్వహించారు. ఇచ్చిన అప్పు పోను కొంత నగదు ఆమెకు చెల్లించాలని తీర్మానం చేశారు. నాలుగు నెలల క్రితం ఈ విషయం బయటకు రావడంతో భార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో ఆమెను భర్త వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆ మహిళా శ్రీనివాస్‌ను పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకుంది. వెంటనే సుపారీ గ్యాంగ్‌ను కలిసి కొంత నగదును అడ్వాన్స్‌గా అప్పగించింది. చదవండి: పెగాసస్‌పై న్యూయార్క్ సంచలన నివేదిక.. మరోసారి దుమారం దీంతో సుపారీ గ్యాంగ్ ఈనెల 26న శ్రీనివాస్‌ను కిడ్నాప్ చేసింది. శ్రీనివాస్‌ను కొట్టి ఆమెతో దండలు మార్పించినట్లు సమాచారం. శ్రీనివాస్ కుమారుడు భరత్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మొబైల్ ట్రాక్ చేసి నర్సంపేట సీఐ పులి రమేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూసిన సుపారి గ్యాంగ్ పరారయ్యింది. పోలీసులు శ్రీనివాస్ ను, మహిళను అదుపులోకి తీసుకుని విచారణ ముమ్మరం చేశారు. దీనిపై స్థానిక సీఐ పులి రమేశ్‌ను వివరణ కోరగా.. ముత్యం శ్రీనివాస్ కొడుకు భరత్ ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులు దొరికిన వెంటనే అరెస్టు చూపిస్తామని తెలిపారు. చదవండి: సీఎం దృష్టికి వెళ్లకుండా చూస్తాం.. రూ.25లక్షలు ఇవ్వు.. డీఎంకే ఎమ్మెల్యేలకు బెదిరింపులు -
బాలుడి కిడ్నాప్.. సోషల్‌మీడియా సాయంతో కథ సుఖాంతమైంది!
కొరాపుట్(భువనేశ్వర్): ట్రక్ డైవర్ కిడ్నాప్ చేసిన బాలుడు సోషల్ మీడియా సాయంతో ఇంటికి చేరిన ఘటన అందరినీ ఆనందంలో ముంచెత్తింది. నవరంగపూర్ జిల్లా ఎస్పీ పురుషోత్తం దాస్ దీనికి సంబంధించిన వివరాలను శుక్రవారం ప్రకటించారు. 2021 అక్టోబర్ 22న నవంరంగ్‌పూర్ జిల్లా చందాహండి పోలీస్ స్టేషన్ పరిధి ఖపరాది గ్రామంలో ఓ ట్రక్ డ్రైవర్ ప్రదీప్ అనే బాలుడిని అపహరించి, ఎత్తకుపోయాడు. (చదవండి: గతేడాది వివాహం.. అత్తవారింటికి వెళ్లి ఎవరూ లేని సమయం చూసి.. ) దీనిపై అదేరోజు చందాహండి పోలీస్ స్టేషన్లోకేసు నమెదయ్యింది. బాలుడిని ట్రక్ డ్రైవర్ హర్యనాలోని రేవాడి జిల్లా గొడిబాల్ని జంక్షన్ వద్ద జాతీయ రహదారి–6పై డిసెంబర్ 21న రాత్రి వదలి వెళ్లిపోయాడు. పక్కనే ఉన్న హరున్ధావన్ దాబాకు చేరిన ప్రదీప్ ఉదంతాన్ని దాబా యజమాని వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది కాస్త వైరల్‌గా మారి, నవంరంగ్‌పూర్ జిల్లాకు చేరింది. దీనిపై ఎస్పీ జోక్యం చేసుకొని, హర్యానాలోని బాలసదన్‌కు సమాచారం అందించి, సంరక్షించారు. అనంతరం ప్రదీప్ సోదరుడు భుజభల్ని జిల్లా పోలీసుల బృందంతో అక్కడకు పంపించి, నవరంగపూర్ లోని కుంటుంబ సభ్యులకు అప్పగించారు. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా, పోలీసులు చేసిన సాయాన్ని మరువలేమని కన్నీటి పర్యంతమవుతున్నారు. -
తల్లే పిల్లల్ని కిడ్నాప్ చేసింది.. ఎందుకో తెలుసా?
ఇంతవరకు మనం రకరకాల కిడ్నాప్‌లు గురించి విని ఉంటాం. అవన్నీ ఆస్తి కోసం లేక వ్వక్తిగత కక్ష్యల నేపథ్యంలోనో కిడ్నాప్‌లు చేయడం గురించి విని ఉంటాం. కానీ ఎక్కడైన వ్యాక్సిన్ కోసం కిడ్నాప్ చేయడం గురించి మాత్రం ఇప్పుడే వింటున్నాం. అది కూడా తల్లే కిడ్నాప్ చేయడం. చాలా ఆశ్యర్యంగానూ వింతగానూ ఉంది. (చదవండి: అధ్యాపక వృత్తిలో ఉండి అదేం పని!) అసలు విషయంలోకెళ్లితే...స్పెయిన్‌లోని సెవిల్లె సమీపంలో నివశిస్తున్న ఒక తండ్రి తన కొడుకులని తల్లే స్వయంగా కిడ్నాప్ చేసిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాదు పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్లు వేయించడానికి వీల్లేదంటూ కిడ్నాప్ చేసిందని ఆమె మాజీ భర్త ఆరోపించాడు. ఇటీవలే తన పిల్లలకు కోవిడ్ వేయించాలా వద్ద అనే నిర్ణయం తీసుకునే హక్కు తనకు ఉందని కోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని కూడా ప్రస్తావించాడు. అయితే ఆమె కోర్టు తీర్పు ఇచ్చిన కొద్దిరోజుల్లోనే పిల్లలను స్కూల్‌కి పంపిచడం మానిపించేయాలనుకుంటున్నట్లు అతని మాజీ భార్య నుంచి ఒక ఉత్తరం కూడా వచ్చిందని తెలిపాడు. పైగా తన అనుమతి లేకుండానే పిల్లలను తీసుకువెళ్లిపోయిందని, నవంబర్ 4 నుంచి తన పిల్లలను చూడలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ క్రమంలో అతని మాజీ భార్య 12, 14 ఏళ్ల తన పిల్లలను తీసుకుని కోర్టుకు వెళ్లి అధికారులను ఆశ్రయించింది. అయితే కోర్టు పెండింగ్‌లో ఉన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెను రిమాండ్‌లో ఉంచాలని ఆదేశించింది. అంతేకాదు ఆ పిల్లలిద్దర్నీ తండ్రికి అప్పగించినట్లు స్పెయిన్ గార్డియా సివిల్ పోలీస్ ఫోర్స్ ప్రతినిధి తెలిపారు. (చదవండి: మూడంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం... 13 మంది మృతి) -
మాజీ సర్పంచ్ కురసం రమేష్ ఆడియో విడుదల చేసిన మావోలు
-
మాజీ సర్పంచ్‌ను కిడ్నాప్ చేసిన మావోలు..ఏజెన్సీలో ఉత్కంఠ
ఏటూరునాగారం/వెంకటాపురం (కె): మాజీ సర్పంచ్, ప్రస్తుతం డ్రైవర్ వృత్తి చేసుకుంటున్న కురుసం రమేశ్‌ను మావోయిస్టులు సోమవారం రాత్రి ములుగు జిల్లా వెంకటాపురం (కె) మండలం సూరువీడు పంచాయతీ కె కొండాపురం వద్ద కిడ్నాప్ చేసినట్లు స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపారు. సూరువీడు ప్రాంతానికి చెందిన రమేశ్ 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్‌గా గెలిచారు. ఆ తర్వాత రమేశ్ భార్య రజితకు ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రిలో ఏఎన్ఎం ఉద్యోగం రావడంతో ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏ క్వార్టర్స్ సమీపంలో నివాసం ఉంటున్నారు. రమేశ్ వృత్తిరీత్యా డ్రైవర్ కావడంతో ఖాళీ సమయంలో ఎవరికైనా యాక్టింగ్ డ్రైవర్‌గా వెళ్లేవాడు. ఇదే క్రమంలో సోమవారం ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లకు పోయే పని ఉందని ఇంట్లో చెప్పి వెళ్లాడు. ఆ తర్వాత 24 గంటలు దాటినా రమేశ్ ఇంటికి రాకపోవడంతో ఆరా తీయగా, కొందరు ముఖానికి ముసుగులు కట్టుకొని రమేశ్‌ను వేరే వాహనంలో తీసుకెళ్లినట్లు అక్కడి స్థానికులు తెలిపారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీంతో ఏజెన్సీలో ఉత్కంఠ నెలకొంది. మావోయిస్టులు కిడ్నాప్ చేయడంతో ఆయన పరిస్థితి ఎలా ఉందోనని కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటు పోలీసులు ఏజెన్సీ ప్రాంతంలో అలర్ట్ చేసి.. రమేశ్ ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. భర్తను విడిచిపెట్టాలని వేడుకుంటున్న రమేశ్ భార్య రజిత, పిల్లలు అన్నలూ.. నా భర్తను విడిచి పెట్టండి.. రమేశ్ భార్య రజిత మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని, మా కుటుంబానికి అన్యాయం చేయొద్దని మావోయిస్టులను కోరారు. ‘ఏదైనా తప్పుచేస్తే నాలుగు దెబ్బలు కొట్టి ఇంటికి పంపించండి. మాకు ఇద్దరు పిల్లలు, నేను ఆగమైపోతా. మీ తోడబుట్టిన దానిని అనుకొని నా భర్తను విడిచి పెట్టండి. నా కుటుంబానికి నా భర్తే పెద్ద దిక్కు. అన్నలూ.. దండం పెడుతున్నా.. ఆయనకు ఏదైనా హాని తలపెడితే మేం బతకం’అంటూ మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. అలాగే రమేశ్ తల్లి మంగమ్మ కూడా కొడుకును విడుదల చేయాలని కోరారు. -
రూ.5.5 కోట్ల కిడ్నాప్ కేసు.. ప్రత్యక్ష సాక్షిగా అంధుడు
లక్నో: ఉత్తరప్రదేశ్ పోలీసుల పని తీరుపై జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు. మీలాంటి అధికారులుంటే.. మా జీవితాలు బాగుపడ్డట్లే అని విమర్శిస్తున్నారు. పోలీసులపై ఇంత భారీ ఎత్తున ఆగ్రహం వ్యక్తం కావడానికి కారణం ఏంటంటే ఓ కిడ్నాప్ కేసులో పోలీసులు అంధుడిని ప్రత్యక్ష సాక్షిగా పేర్కొన్నారు. దీనిపై జనాలతో పాటు.. విపక్షాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆ వివరాలు... (చదవండి: రు. కోటి పెట్టి నిర్మించిన రోడ్డు.. కొబ్బరికాయ దెబ్బకు బీటలు) కొన్ని రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. శ్యామ్నగర్కు చెందిన మాంసం వ్యాపారి హాజీ ఆస్ మహ్మద్ అనే వ్యక్తిని అతడి బంధువులు హాజీ అన్సార్, అన్వర్లు మోసం చేశారు. మాంసం వ్యాపారం సాకుతో అతడి వద్ద నుంచి ఐదున్నర కోట్ల రూపాయలు తీసుకున్నారు. డబ్బు తీసుకున్నారు కానీ పని చేయలేదు. ఈ క్రమంలో తన డబ్బులు తిరిగి ఇచ్చేయాల్సిందిగా హాజీ నిందితులను కోరాడు. వారు అంగీకరించకపోగా.. అతడిపై దాడి చేసి.. కిడ్నాప్ చేస్తామని బెదిరించారు. దాంతో హాజీ ఆస్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుల మీద దాడి, కిడ్నాప్ కేసు నమోదు చేశారు పోలీసులు. (చదవండి: ఒమిక్రాన్ అందరిని చంపేస్తుందంటూ హత్యలు చేసిన డాక్టర్!) మొదటి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పోలీసులు ఈ కేసులో ఓ అంధుడిని ప్రత్యక్ష సాక్షిగా పేర్కొన్నారు. అతడి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఈ విషయం కాస్త బయటకు రావడంతో పోలీసు శాఖపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. ఎలా.. అంధుడిని ప్రత్యక్ష సాక్షిగా పేర్కొని.. తమకు కళ్లు లేవని పోలీసులు నిరూపించుకున్నారు అని దుయ్యబట్టారు. వివాదం కాస్త పెద్దది కావడంతో ఉన్నతాధికారులు దీనిపై స్పందించారు. విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశించారు. చదవండి: 6 నెలల క్రితమే వివాహం.. భార్య పుట్టింటికి వెళ్లిందని.. -
నకిలీ సీబీఐ అధికారుల అరెస్టు
కడప అర్బన్: సీబీఐ అధికారులమని బెదిరించి.. ఓ కాంట్రాక్ట్ అధ్యాపకుడిని కిడ్నాప్ చేసి అతని వద్దనుంచి కారు, రూ.1,14,000 కాజేసిన నలుగురు ఘరానా మోసగాళ్లను వైఎస్సార్ జిల్లా పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కడప డీఎస్పీ బి.వెంకటశివారెడ్డి తన కార్యాలయంలో తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. నవంబర్ 23వ తేదీ రాత్రి సుమారు 7:19 గంటల సమయంలో చెన్నూరు పీఎస్ పరిధిలోని ఇర్ఖాన్ సర్కిల్ వద్ద ఖాజీపేట మండలం పత్తూరు గ్రామానికి చెందిన కాంట్రాక్ట్ అధ్యాపకుడు బేరి ఉదయ్‌కుమార్(37)ను నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు తాము సీబీఐ అధికారులమని, విచారణ చేయాలని కారులో ఎక్కించుకున్నారు. అక్కడక్కడా తిప్పుతూ అతడిని కొట్టి, బెదిరించి రూ.1,14,000ను ఫోన్‌పే ద్వారా వారి అకౌంట్లలోకి జమ చేసుకున్నారు. రెండ్రోజుల అనంతరం 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఉదయ్‌కుమార్‌ను రోడ్డుపై వదిలి పరారయ్యారు. దీనిపై బాధితుడు నవంబర్ 27న చెన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించిన కడప అర్బన్ సీఐ ఎస్ఎం అలీ, చెన్నూరు ఎస్ఐ శ్రీనివాసులరెడ్డి తమ సిబ్బందితో కలిసి శనివారం ఉదయం కొక్కరాయపల్లి క్రాస్‌రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో మైదుకూరు నుంచి చెన్నూరువైపు వస్తున్న ఓ కారులో ఉన్న నలుగురు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి వారిని అరెస్టు చేశారు. నిందితుల్లో అనంతపురం జిల్లా ఖాజానగర్‌కు చెందిన మాగంటి నగేష్ అలియాస్ నగేశ్‌నాయుడు, అతని బంధువైన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం, నాగరాజుపాడు గ్రామానికి చెందిన పావుకూరి సుందర రామయ్య అలియాస్ సుందర్‌నాయుడు, కడప నగరం రామాంజనేయపురానికి చెందిన వాసం నవీన్‌రాజు, బుక్కే ప్రభాకర్ నాయక్ ఉన్నారు. వీరి వద్ద నుంచి ఓ కారు, రూ.84,000, సీఆర్పీఎఫ్ పేరుతో ఉన్న ఓ నకిలీ గుర్తింపుకార్డును సీజ్ చేశారు. కాగా.. నగేష్, సుందరరామయ్యలకు కారు ఉంది. దానిని బాడుగకు తీసుకున్నవారు కిరాయి కానీ, కారునుకానీ ఇవ్వకుండా తిప్పుకుంటుండడంతో వారిని బెదిరించాలని భావించారు. మిగతా ఇద్దరు నిందితులతో కలసి ఇందుకోసం పథకం రచించారు. కారు బాడుగకు తీసుకున్నవారు తన బంధువులవడంతో వారి తరఫున ఉదయ్‌కుమార్ అడ్వాన్స్ కింద రూ.3 వేలు ఫోన్‌పే ద్వారా చెల్లించారు. దీంతో అతన్ని పట్టుకుంటే డబ్బు లాగవచ్చని భావించిన నిందితులు సీబీఐ అధికారులమంటూ బెదిరించి అతన్ని కారెక్కించి తమ వెంట తీసుకెళ్లారు. అనంతరం ఉదయ్‌కుమార్ ఇంటి వద్ద ఉన్న తమ కారును తీసుకోవడమే గాక, ఫోన్‌పే ద్వారా రూ.1,14,000ను తమ ఖాతాలకు జమ చేయించుకున్నారు. నిందితులను అరెస్టు చేయడంలో అప్రమత్తంగా వ్యవహరించిన అధికారులను, పోలీసులను జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ అభినందించారు. -
6 నెలల క్రితమే వివాహం.. భార్య పుట్టింటికి వెళ్లిందని..
సాక్షి,గోవిందరావుపేట(వరంగల్): మండల కేంద్రంలో పట్టపగలే సినీఫక్కీలో యువతి కిడ్నాప్ కలకలం రేపింది. మండల కేంద్రంలోని పోస్టాఫీస్ పక్కనే ఉన్న అడ్వకేట్ దామెల్ల సుధాకర్ ఇంటి వద్ద ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే..బుధవారం మధ్యాహ్నం రెండు కార్లలో నంబర్లు కనిపించకుండా జాగ్రత్త పడి యువకులు వచ్చారు. కారుదిగి ఇంటిలోకి వెళ్లి అక్కడే ఉన్న యువతి సోదరుడిని, తల్లిని కొట్టి యువతి శాంతిని బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లారు. ఇదంతా గమనించిన చుట్టుపక్కల వారు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అసలేం జరిగిందో వచ్చిందెవరో అర్థం కాని పరిస్థితి నెలకొంది. వెంటనే యువతి తల్లి దామెళ్ల రజని, కుమారుడితో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి శాంతి భర్త చంద్రగిరి బాలరాజు తన కూతురును బలవంతంగా తీసుకుని వెళ్లినట్లు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పస్రా ఎస్సై కరుణాకర్‌రావు వెంటనే అన్ని మార్గాలలోని పోలీస్స్టేషన్లను అప్రమత్తం చేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 6 నెలల క్రితమే వారికి వివాహమైందని కానీ శాంతి మాత్రం తల్లిదండ్రుల సూచనతోనే తల్లిగారి ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కోపం పెంచుకున్న బాలరాజు కొందరి సహాయంతో ఈ కిడ్నాప్ వ్యవహారానికి పాల్పడినట్లు సమాచారం. భర్తే అయినా ఇలా కార్లలో వచ్చి కిడ్నాప్ చేసేందుకు సాహసించడం మండలంలో కలకలం రేపుతోంది. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. చదవండి: ఏంకష్టం వచ్చిందో.. వివాహమైన ఐదు నెలలకే..