అమరావతి: చేతికి మైకు దొరికింది కదాని రెచ్చిపోయి ఊగిపోవాడం తప్ప పవన్ కళ్యాణ్ మాటల్లో వాస్తవం లేదని సాక్ష్యాధారాలతో సహా మరోసారి నిరూపితమైంది. నిజానిజాలు తెలుసుకోకుండా చేతిలో ఉన్న స్క్రిప్టుని యధాతధంగా చదివి నిరాధార ఆరోపణలు చేసి తన రాజకీయ అజ్ఞానాన్ని బట్టబయలు చేసుకున్నారు.
కేంద్ర హోంశాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలో ఐపీసీ 363, 369 (కిడ్నాప్, అపహరణ)సెక్షన్ల కింద నమోదైన మొత్తం కేసుల సంఖ్య కేవలం 867గా ఉంది. శాంతిభద్రతల్లో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్ర రాష్ట్రం చాలా మెరుగ్గా ఉంది. దేశవ్యాప్తంగా కిడ్నాప్ లేదా అపహరణకు గురవుతున్న వారు లక్షకు 7.4 శాతంగా ఉంటే ఆంధ్రాలో కేవలం 1.6 గా ఉంది.
రెండేళ్లలో నమోదైన కేసుల సంఖ్య ఆధారంగా చూస్తే, దేశవ్యాప్తంగా కిడ్నాప్ అపహరణ కేసుల్లో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం అత్యధికంగా 14714 కేసులతో మొదటి స్థానంలో నిలిచింది. 10680 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలోనూ 10252 కేసులతో బీహార్ మూడో స్థానంలోనూ ఉండగా ఆంధ్ర ప్రదేశ్ ఎక్కడో అట్టడుగున 18వ స్థానంలో ఉంది. మహిళలకు రక్షణ కల్పించడంలో ఆంధ్ర ప్రదేశ్ చాలా ముందుందని చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం.
సరైన అవగాహన లేకుండా పవన్ తప్పుడు లెక్కలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఎవరైనా తెలివిగల్లోళ్లు పవన్ పక్కన ఉంటే నివేదికను చక్కగా వివరించే అవకాశమైనా ఉండేది. విషయ సంగ్రాహక శక్తి తక్కువగా ఉన్నందునో, వాస్తవాలు తెలుసుకోవాలన్న ఆసక్తి కొరవడినందునో.. ప్రతి విషయాన్ని వక్రీకరించి అసత్యాలను ప్రచారం చేస్తూ పవన్ ఎప్పటికప్పుడు జనం ముందు నవ్వులపాలవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment