Varahi Yatra
-
రౌడీ రాజకీయం.. గ్రామాల్లో సీఎం రమేష్ అనుచరులు
సాక్షి, అనకాపల్లి: ప్రశాంతతకు మారుపేరుగా పేరొందిన అనకాపల్లి జిల్లాలో ఇప్పుడు కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి. వారి కదలికలు సందేహాస్పదంగా ఉంటున్నాయి. వారి కార్యకలాపాలు శాంతిభద్రతలకు భంగం కలిగిస్తాయేమోనన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థి సీఎం రమేష్ సాగిస్తున్న రౌడీ రాజకీయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. సీఎం రమేష్ అనుచరులైన రౌడీ మూకలు గ్రామాల్లో తిష్ట వేశాయి. స్థానికేతరుడైన ఆయనకు కూటమి నుంచి ఎంపీ టికెట్ ప్రకటించినప్పటి నుంచి.. మనుషులు మొదలుకొని ప్రచార వాహనాల వరకు అన్నీ తన స్వస్థలం కడప నుంచే తెచ్చుకున్నారు. 200మందికి పైగా అనుచరులను అనకాపల్లి జిల్లాకు రప్పించుకున్నారు. జిల్లాలో పట్టణ ప్రాంతాలైన అనకాపల్లి, చోడవరం, పాయకరావుపేట, యలమంచిలి, నర్సీపట్నం, మాడుగుల, సబ్బవరం, పెందుర్తిలలో ఉన్న లాడ్జీలలో వీరు మకాం చేశారు. ఈ పట్టణాల్లో శివారున ఉన్న లాడ్జిల్లో స్థానిక టీడీపీ కార్యకర్తల పేరిట రూమ్‌లు బుక్ చేశారు. కొన్ని రహస్య ప్రాంతాల్లో మద్యం డంపులను కూడా ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల యలమంచిలి నియోజకవర్గం సోమలింగంపాలెంలో భారీగా గోవా మద్యం పట్టుబడింది. ఇందులో ప్రధాన నిందితుడు కర్రి వెంకటస్వామి టీడీపీకి చెందిన కార్యకర్త కావడం.. గోవా నుంచి కంటైనర్‌లో భారీగా మద్యం అనకాపల్లికి దిగుమతి చేయడం.. ఇక్కడ యలమంచిలి నియోజకవర్గ జనసేన అభ్యర్థి సమావేశానికి మద్యం సరఫరా చేయడం వంటివి గమనించిన పోలీసులు దీని వెనక బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఉన్నారా..? అని అనుమానిస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన నలుగురినీ పోలీసులు విచారిస్తున్నారు. జిల్లాలో ఇంకేమైనా ఇలాంటి డంపులు ఉన్నాయా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఐదు గ్రామాలకు ఒక్కరు.. సీఎం రమేష్ తన అనుచరులను ఇప్పటికే ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్న మండల కేంద్రాలకు పంపించేశారు. ప్రతి ఐదు గ్రామాలకు ఒకరు చొప్పున జిల్లాలో ఉన్న 24 మండలాలతోపాటు పెందుర్తిలో కూడా వారిని మోహరించారు. సీఎం రమేష్ సమావేశాలు, టీడీపీ, జనసేన స్థానిక నేతల మీటింగ్‌లు, కుల సంఘాల సమావేశాల ఏర్పాటుకు ఎంత ఖర్చవుతుందో అంచనా వేసుకుని వారే సొమ్ము చెల్లిస్తున్నారు. సమావేశాల్లో పాల్గొనే నాయకులు, కార్యకర్తల ఆటో ఖర్చులు, వారి భోజనం ఖర్చులు, సమావేశ మందిరం అద్దెల చెల్లింపు వారి చేతుల మీదుగా జరుగుతోంది. పవన్ వారాహి యాత్రకు రూ.50 లక్షలు అనకాపల్లి జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగిన వారాహి యాత్ర, బహిరంగ సభ జన సమీకరణకు ఖర్చంతా సీఎం రమేష్ పెట్టుకున్నారు. సభ ఏర్పాట్లకు, జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చిన జనానికి సుమారు రూ.50 లక్షలు వెచ్చించినట్టు సమాచారం. ఈ ఏర్పాట్లను కూడా సీఎం రమేష్ అనుచరులే దగ్గరుండి చూసుకున్నట్లు భోగట్టా. వచ్చీ రాగానే ఘర్షణ మొదలు రమేష్ అడుగు పెట్టారో లేదో.. అప్పుడే తనదైన రౌడీ రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నారు. చోడవరంలో అధికారులపై దౌర్జన్యం, నర్సీపట్నంలో బహిరంగంగా చీరల పంపిణీ, గ్రామాల్లో సీఎం రమేష్ అనుచరుల హల్చల్ వంటి పరిణామాలను జిల్లా ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఇక్కడి ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారన్న భావం వారి మనసుల్లో అప్పుడే నాటుకుపోయింది. స్థానిక బీజేపీ నేతలు ఉండగా ప్రచార కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలను పూర్తిగా తన మనుషులకు అప్పగించడం పార్టీ జిల్లా వర్గాల్లో అసంతృప్తిని రేకెత్తించింది. మామీద నమ్మకం లేదా అని వారు మనస్తాపానికి గురవుతున్నట్టు తెలుస్తోంది. ఇవి చదవండి: ఓటమి భయంతో టీడీపీ అడ్డదారులు -
Pawan Kalyan: ‘ఎక్కడ ప్రచారం చేస్తే బెటర్!’
హైదరాబాద్, సాక్షి: ఏపీలో ఎన్నికల ప్రచారం హీటెక్కనుంది. ఇప్పటికే అధికార, ప్రధాన ప్రతిపక్షం ఎన్నికల ప్రచారంలోకి దిగాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరిట సభలు పెడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీల సంగతి సరేసరి. ఇక జనసేన పవన్ కల్యాణ్ నేటి నుంచి ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నాడు. ఎలక్షన్ క్యాంపెయిన్‌లో భాగంగా పవన్ మళ్లీ వారాహి యాత్ర చేపట్టబోతున్నాడు. గతంలో.. వారాహి పేరుతో విడతల వారీగా రాష్ట్రం తిరుగుతానంటూ హడావిడి చేసిన పవన్, చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆ వాహనాన్ని పక్కన పడేశారు. ఇక ఈ ఎన్నికల్లో కూటమి తరఫున 21 అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లు దక్కించుకున్న పవన్.. ఇంకా మూడు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి అభ్యర్థుల్నే ఖరారు చేయలేదు. ఈలోపే ఎన్నికల ప్రచారంలోకి దిగుతుండడం గమనార్హం. రాజీనామాల పర్వం జనసేన టికెట్లకు సంబంధించి పలుచోట్ల రగడ నడిచింది. పవన్ తనకు మాటిచ్చి తప్పారని.. అలాంటి నిలకడలేని మనిషితో కొనసాగలేనంటూ ముమ్మిడివరం జనసేన ఇంచార్జ్ పితాని బాలకృష్ణ జనసేనకు గుడ్‌బై చెప్పారు. ఇక రాజోలులో దేవ వరప్రసాద్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి బొంతు రాజేశ్వరరావు సిద్ధమయ్యారు. పవన్ పోటీ చేస్తున్న పిఠాపురంలోనే జనసేనకు రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు మాకినేని శేషు కుమారి. మరోవైపు టికెట్ దక్కకపోవడంతో కాకినాడ సిటీలో స్తబ్దంగా మారిపోయారు జనసేన ఇంచార్జ్ ముత్తా శశిధర్. ఇక.. జనసేన నాయకుల పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసి మరీ పార్టీకి రాజీనామా చేశారు కాకినాడ మాజీ మేయర్ కవికొండల సరోజ. ఇంకోవైపు.. పవన్ కళ్యాణ్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేసి జగ్గంపేటలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు పాఠం శెట్టి సూర్యచంద్ర. నిరసనలు తప్పవా? పవన్ తన వారాహి యాత్రను ఇవాళ పిఠాపురంలో ప్రారంభించబోతున్నాడు. ఇక్కడి నుంచే పవన్ పోటీ చేస్తున్నాడన్నది తెలిసిందే. అయితే పవన్ ఎన్నికల ప్రచారానికి జనసేన నుంచే ఓవైపు అసమ్మతి.. మరోవైపు నిరసనలు సెగలు తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీ తొలి నుంచి ఉన్నవాళ్లకు పవన్ మొండి చేయి చూపించాడు. ధన బలం ఉన్న నేతలకే సీట్లు ఇచ్చాడనే విమర్శను ఎదుర్కొంటున్నాడు. మరోవైపు వలస నేతలకు టికెట్లు ఇవ్వడాన్ని కూడా కేడర్ భరించలేకపోతుంది. పోతిన మహేష్ లాంటి నమ్మకస్తుడికి అసలు టికెట్ దక్కకపోవడంపై కేడర్ రగిలిపోతోంది. దీంతో పవన్ ప్రచారానికి ఆయా చోట్ల ఆటంకాలు ఎదురు కావొచ్చని తెలుస్తోంది. ఇన్ని ప్రతికూలతల నడుమ.. పవన్ తన ప్రచారాన్ని ఎలా కొనసాగిస్తారు? అనే ఆసక్తి నెలకొంది. మరోవైపు పిఠాపురంలో తనకు మొదటి నుంచి పోటీగా వస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మను చల్లబర్చడంలో పవన్ సక్సెస్ అయ్యాడు. ఇవాళ వర్మ ఇంటికి వెళ్లిన పవన్.. తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలనే ఎంచుకుని.. పర్యటన, సభలు నిర్వహించాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
పవన్ మిస్సింగ్..వారాహి ఎక్కడ ?
-
పవన్ ది పావలా పార్టీ
-
ఆవేశం తప్ప ఆలోచన లేని పవన్: ఎమ్మెల్యే నాగేశ్వరరావు
సాక్షి, ఏలూరు: వారాహి యాత్రలో జనసేన పవన్ కల్యాణ్ ఆరోపణలు, విమర్శలకు కైకలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నియోజకవర్గంలో అవినీతి తప్ప అభివృద్ధి జరగలేదన్న పవన్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్యే నాగేశ్వరావు. అంతేకాదు.. తాను స్వయంగా ఎదిగిన మనిషినని.. అవినీతికి పాల్పడినట్లు నిరూపించాలని పవన్‌కు సవాల్ విసిరారాయన. చంద్రబాబుకి కొమ్ము కాయడం తప్ప.. పవన్‌ను ఏదీ చేతకావడం లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారాయన. గత ప్రభుత్వంలో పవన్ స్వయంగా వచ్చి ప్రచారం చేసి గెలిపించిన కామినేని శ్రీనివాస్(మాజీ మంత్రి) కైకలూరుకు ఏమి చేశారు?.. రాత్రి ఒక పార్టీతో పగలు మరొక పార్టీతో సహవాసం చేశారు. పార్టీ అంటే కన్నతల్లితో సమానం.కానీ, కామినేని నీతి తప్పి ప్రవర్తించారు. కామినేని హయాంలో పూర్తికాని పెద్దింట్లమ్మ వారధిని.. సీఎం జగన్ రూ. 14 కోట్లతో పూర్తి చేశారు అని తెలిపారాయన. వీటితో పాటు జరుగుతున్న అభివృద్ధి పనులను, అందుకు వెచ్చిస్తున్న నిధుల వివరాలను సైతం మీడియాకు తెలియజేశారు ఎమ్మెల్యే నాగేశ్వర్రావు. ‘‘పవన్ కల్యాణ్ చాలా ఆవేశంగా మాట్లాడుతాడు. కానీ ఏమాత్రం ఆలోచన చెయ్యరు. నాకు నా కొడుక్కి కొమ్ములు వచ్చాయి వాటిని విరగ కొడతాను అని పవన్ అన్నారు. అవి కొమ్ములు కాదు ప్రజలు మేము చేస్తున్న సేవకు ఇచ్చిన ఆశీస్సులు. కామినేని ఇచ్చిన స్క్రిప్టును పవన్ చదివారు. కొల్లేరులో మేం వందలాది ఎకరాల ఆక్రమించామన్నారు. పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు చేస్తున్నారంటూ ఆరోపించారు. ఆరోపణలు నిరూపిస్తే.. గుండు గీయించుకుని క్షమాపణలు కోరతా. పవన్.. తన స్థాయిని రోజురోజుకీ దిగజార్చుకుంటున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల్లో ఉన్నారు. కానీ, నువ్వు వారాహి పేరుతో యాత్ర చేస్తూ లేనిపోనివి మాట్లాడుతున్నావ్. కనీసం సర్పంచ్‌గా అయిన గెలిచి ఉంటే.. మౌలిక వసతుల గురించి నీకు తెలిసి ఉండేది. దమ్ముంటే.. పాదయాత్ర చెయ్యి. కైకలూరు నియోజకవర్గంలో నిజాయితీకి నిలువుటద్దం దూలం నాగేశ్వరరావు(తనను తాను ఉద్దేశిస్తూ..). కేరాఫ్ ఫ్లాట్‌ఫారమ్ నుంచి వచ్చిన వ్యక్తిని నేను. అన్నచాటున తమ్ముడిలా ఎదిగిన వ్యక్తివి నువ్వు. ప్రజా జీవితానికి సినిమాకి చాలా తేడా ఉంది. పవన్ అది గమనించాలి. దమ్ముంటే.. 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయండి. అంతేగానీ.. నేరస్తుడైన చంద్రబాబుకి కొమ్ము కాయడం కాదు. అమరావతిలో రైతులు ఇచ్చిన రెండు స్పూన్ల పెరుగు అన్నం తిని.. వెళ్ళిపోయావు. రాజధాని పేరుతో నిలువు దోపిడీకి పాల్పడ్డ చంద్రబాబును ఏనాడైనా ప్రశ్నించావా?.. అవినీతి లేని చోట ప్రశ్నిస్తే పవన్ నవ్వుల పాలవుతారు అంటూ పవన్‌ను ఉద్దేశించి ఎమ్మెల్యే నాగేశ్వరావు హితవు పలికారు. పవన్.. మీ పేరు చెప్పి ఎందరో విద్యార్థులు, యువత తల్లి దండ్రులను పట్టించుకోకుండా రోడ్లపై తిరుగుతున్నారు..వారి భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారని అన్నారాయన. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. ప్రభుత్వ సొమ్మును దోచేస్తేనే ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. తండ్రిని ముఖ్యమంత్రి పదవి నుండి దించేసిన వ్యక్తికి కొమ్ముకాస్తున్న బాలకృష్ణను అసలు మనిషి అంటారా...? ‘‘మీరంతా రండి.. జైల్లో ఉన్న దొంగను ముఖ్యమంత్రి చేస్తానంటే చంద్రబాబుకు ఎవరూ కొమ్ము కాయరు..?. వంగవీటి రంగానే హత్య చేయించిన వ్యక్తిని ఎవరూ కొమ్ము కాయరు. ముద్రగడ పద్మనాభం ను చిత్రహింసలు పెట్టిన వ్యక్తిని ఎవరూ కొమ్ము కాయరు. ముద్రగడ పద్మనాభం భార్యని కొడుకును చిత్రహింసలు పెడితే ఒక్కరోజైనా నువ్వు మాట్లాడవా? అని పవన్‌ను నిలదీశారాయన. -
పవన్ వ్యాఖ్యలు.. పోలీసు నోటీసులు
సాక్షి, కృష్ణా: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారాహి యాత్రపై రాళ్ల దాడికి ప్లాన్చేశారంటూ పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆరోపణలకు సాక్ష్యాలు ఏవైనా ఉన్నాయా? అని నోటీసులు ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ జాషువా వెల్లడించారు. ‘‘దాడులు జరగుతాయనే సమాచారం మీకు ఎక్కడి నుంచి వచ్చిందనేది మాకు తెలియపర్చమని నోటీసుల్లో కోరాం. మేం పంపిన నోటీసులకు పవన్ నుంచి ఎలాంటి రిప్లై లేదు. రిప్లై రాలేదంటే ఆయన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారాని అనుకోవాలా?. ఎటువంటి సమాచారంతో పవన్ వ్యాఖ్యలు చేశారు.పైగా.. పవన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. మీరు తిరగబడి కాళ్ళు చేతులు కట్టేయండంటూ పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. పవన్ అందుకే నోటీసులు ఇచ్చాం. సరైన ఆధారాల్లేకుండా వ్యాఖ్యలు, ఆరోపణలు చేయకూడదు.బాధ్యతారాహిత్యంగా ఆరోపణలు చేస్తే పర్యవసానాలు ఉంటాయి. రెచ్చగొట్టే భాష, సైగలు మానుకుని మాట్లాడాలి. మా సమాచార వ్యవస్థ మాకుంది. పవన్ కంటే నిఘా వ్యవస్థ మాకు బలంగా ఉంది. అసాంఘిక శక్తులుంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు ఎస్పీ జాషువా. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాల్గో విడత వారాహి యాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. అయితే.. పెడనలో జరుగనున్న వారాహి యాత్రలో అలజడి సృష్టించేందుకు కుట్ర జరుగుతోందంటూ పవన్ ఆరోపించారు. మచిలీపట్నం జనవాణి కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ సంచలన ఆరోపణలు చేశారు. పెడన వారాహి యాత్రలో గుండాలు, క్రిమినల్స్‌తో రాళ్ల దాడులు చేసి, రక్తపాతం సృష్టించాలని ప్లాన్ వేస్తున్నారని పవన్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇదీ చదవండి: వారాహిని అడ్డుకునే అవసరం ఏంటి? -
పవన్ ఫ్లాప్.. చంద్రబాబు జిమ్మిక్కే!
సాక్షి, గుంటూరు: ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు తర్వాత అనైతిక వ్యక్తి పవన్ కల్యాణేనని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబుతో కలిసొస్తే ఆదరణ ఉండదనే విషయం వారాహి యాత్ర ఫ్లాప్‌తో పవన్‌కు ఇప్పుడు అర్థమైందని అంబటి తెలిపారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. జనసేన చీఫ్ తీరుపై మండిపడ్డారు. కొండనాలికకు మందేస్తే.. ఉన్ననాలిక ఊడిందన్న చందాన వారాహి యాత్ర తయారైంది. చంద్రబాబుతో కలిసి వస్తున్నానని చెప్పగానే వారాహి-4 యాత్ర ఫ్లాప్ అయ్యింది. కాపులు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లి పవన్ సభలు పెడుతున్నారు. ఇదంతా నక్కజిత్తుల చంద్రబాబు జిమ్మిక్కు. పవన్ సభలకు వెళ్లండి అని లోకేశ్ ట్వీట్ చేశారు. కానీ, సాయంత్రం ఆరు గంటలైనా జనం పవన్ సభకు రాలేదు. చంద్రబాబుతో పొత్తును ప్రజలు ఛీ కొట్టారు. బీజేపీతో ఉన్నాను అంటావ్.. టీడీపీతో వెళ్తాను అంటావ్. బీజేపీతో పొత్తులో ఉంటూనే టీడీపీతో కలిసేందుకు సిగ్గు లేదా? అని పవన్‌ను అంబటి ప్రశ్నించారు. పవన్ ఏం చెబుతారో అని ప్రజలంతా ఎదురు చూశారు. కానీ, జైలుకెళ్లి చంద్రబాబును పరామర్శించి పొత్తు పెట్టుకున్నారు. పవన్ చంద్రబాబును వాడుకుంటున్నారు. చంద్రబాబుతో పొత్తు ప్రకటన తర్వాత పవన్ బాడీలాంగ్వేజ్ మారిపోయింది. రాజకీయాలకు పనికి రాని వ్యక్తి.. చంద్రబాబు చెప్పులు మోసిన వ్యక్తి పవన్ కల్యాణ్. జనసేన కార్యకర్తలు ఇక జనసైనికులు కాదు.. సైకిల్సైనికులు. సైకిల్‌కు తప్పు పట్టింది.. టైర్లు లేవు. చంద్రబాబు అవినీతి డబ్బుతో వారాహి యాత్ర జరుగుతోంది. జనసేన అవినీతి జెండా కూడా చంద్రబాబు అవినీతి డబ్బుతోనే ఎదుగుతోంది. ‘‘సర్వనాశనం అయిపోయిన టీడీపీని బతికించాలనుకుంటున్నావ్. బందర్ సభలోనైనా నీ క్యాడర్‌కు ఓ క్లారిటీ ఇవ్వు. బీజేపీతో ఉన్నావో లేదో నీ క్యాడర్కైనా చెప్పు’’ అని పవన్‌ను ఉద్దేశించి అంబటి అన్నారు. ఈసారి తప్పు జరిగితే ఊరుకోనంటూ పవన్ మాటలు చెబుతున్నాడు. మరి 2014 టీడీపీ అరాచకాలను ఎందుకు ప్రశ్నించలేదు అని అంబటి ప్రశ్నించారు. -
పవన్.. లోకేష్, బాలకృష్ణ వ్యాఖ్యల సంగతేంటి?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఊహించిన రీతిలోనే పలాయనవాదంతో ప్రసంగించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వచ్చిన ఆరోపణల గురించి ప్రస్తావించకుండా అవనిగడ్డలో జరిగిన సభను ముగించారు. కేవలం చంద్రబాబు కేసులను జయించి బయటకు వస్తారని ఆశిస్తున్నానని ఒకసారి వ్యాఖ్యానించారు. మరోసారి అనుభవం ఉన్నవారిని కూడా జైలులో పెట్టారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శిస్తూ అన్నారు. అంతే తప్ప చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలు ఏమిటి? వాటిలో మంచి, చెడు ఏమిటి? వాటిని ఆయన నమ్ముతున్నారా? లేదా? అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తామని జనసేన సిద్దాంతంగా ప్రకటించుకున్న పవన్ కళ్యాణ్ ఆ ఊసే ఎత్తకుండా జాగ్రత్తపడ్డారు. పరోక్షంగా టీడీపీని ఎలాగోలా రక్షించడానికి ఆయన విఫలయత్నం చేసినట్లు అనిపిస్తుంది. కేవలం ముఖ్యమంత్రి జగన్‌ను దూషించడానికి, ఓట్ల చీలికను నిలువరించాలని కోరడానికి, తనకు తోచిన అబద్దాలను చెప్పడానికే ఆయన ఈ సభను వాడుకున్నారు. పోనీ అలా అని టీడీపీ, జనసేన అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో కూడా చెప్పలేకపోయారు. సీపీఎస్ రద్దు గురించి మాట్లాడిన ఆయన తాము పవర్లోకి వస్తే అమలు చేస్తామని చెప్పలేకపోయారు. అమ్మ ఒడి స్కీమును అవహేళన చేసే విధంగా మాట్లాడారు. పోనీ దానిని రద్దు చేస్తామని అనలేకపోయారు. ఏతావాతా మొత్తం ప్రసంగం పరిశీలిస్తే ఎలాగోలా తనను ఈసారి అయినా గెలిపించండని ప్రజలను వేడుకున్నట్లు ఉంది తప్ప మరొకటి కాదు. తనకు సీఎం పదవి వస్తుందని కూడా ఆత్మ విశ్వాసంతో అనలేకపోయారు. టీడీపీ అందుకు ఒప్పుకుందని తెలపలేదు. సీఎం పదవి ఇస్తే సంతోషం అని మాత్రమే అన్నారు. గతంలో చంద్రబాబుతో విబేధాలు వచ్చాయని, మళ్లీ రావచ్చని చెబుతూ జాగ్రత్తపడి ఈసారి అలా విబేధాలు రావని చెప్పడం విశేషం. జనసేన విలువలతో కూడిన పార్టీ అని చెప్పిన ఆయన టీడీపీతో ఏ విలువల ప్రాతిపదికతో కలుస్తున్నది వివరించలేకపోయారు. అధికారం కోసం అర్రులు చాచడం లేదని అంటూనే తననైనా గెలిపించాలని పలుమార్లు అన్నారు. ఆయన తన ఓటమిని మర్చిపోలేకపోతున్నారు. పదేపదే ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడ్డారు. వైఎస్సార్సీపీ ఓటమి ఖాయమని అంటూ సీఎం జగన్ చెప్పిన కురుక్షేత్ర యుద్దం గురించి మాట్లాడి తాము పాండవులమని చెప్పుకున్నారు. బీజేపీతో కలిసి ఎన్నికలలో పోటీ చేస్తే గెలవలేమని ప్రకటించారు. ఇంతకీ బీజేపీకి విడాకులు ఇచ్చారో.. లేదో తెలపలేదు. తాను అసెంబ్లీలో ఉండి ఉంటే మెగా డీఎస్సీ గురించి నిలదీసేవాడినని, అనేకం ప్రశ్నించేవాడినని అన్నారు. మరి ఇంతకాలం ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నిలదీయలేకపోయిందని ఆయన చెప్పకనే చెప్పినట్లయింది. మరో చిత్రమైన వ్యాఖ్య చేశారు. సీఎం జగన్ ప్రభుత్వం సుస్థిరంగా లేనట్లుగా, టీడీపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వం వస్తే సుస్థిరత ఉంటుందని అనడం విశేషం. సంకీర్ణంలో సుస్థిరత ఎలా సాధ్యమో తెలియచేయలేదు. ఆయన తనకు ఆత్మగౌరవం ఉందని చెబుతున్నారు కానీ, తన తల్లిని దూషించారని టీడీపీపై గతంలో ఆరోపించిన ఆయన ఇప్పుడు అదే పార్టీతో ఎందుకు కలిశారో చెప్పలేదు. లోకేష్, బాలకృష్ణలు జనసేనను గతంలో అవమానించారని ఆయనే అన్నారు. ఇప్పుడు తనను కలుపుకున్నందుకు వారికి ధన్యవాదాలు చెబుతున్నారు. జనసేన వారిని అలగా జనం అన్న బాలకృష్ణతో రాజీ ఎలా కుదిరిందో వివరించి ఉంటే బాగుండేది. అనుభవం ఉన్న వ్యక్తిని కటకటాల వెనుక పెట్టారని అన్నారే తప్ప, ఆ వ్యక్తి అవినీతికి పాల్పడ్డారా? లేదా? అన్నదాని గురించి మాట్లాడలేకపోయారు. పైగా తనపై కూడా కేసులు పెట్టాలని చూస్తున్నారని, వలంటీర్లు కొందరు తనపై కేసు వేసిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మాట్లాడారు. టీడీపీతో రాజధాని, ప్రత్యేక హోదా విషయంలోనే విబేధాలు వచ్చాయని అన్నారు. మరి ఇప్పుడు ఆ విషయంలో ఎలా ఒప్పందం అయ్యారో చెప్పలేదు. కృష్ణా జిల్లాలో నాలుగున్నర లక్షల మందికి నీటి కుళాయిలు లేవని అన్నారు. మరి అందులో టీడీపీ ప్రభుత్వ వైఫల్యం ఉందో లేదో తెలియచేయలేదు. తనకు కులం తెలియదని చెప్పి, దానిని నమ్మించడానికి ఆయన యత్నించారు. కానీ, ఇంతవరకు ఆయన చేసిన వారాహి యాత్రలన్నీ కేవలం కాపు సామాజికవర్గం అధికంగా ఉన్న చోట్లే చేస్తున్న విషయాన్ని ప్రజలు మర్చిపోయారని పవన్ అనుకుంటుండాలి. ఒకసారి కులం లేదని, ఇంకోసారి కాపులైనా తనకు మద్దతు ఇవ్వరా అని రకరకాలుగా మాట్లాడిన వీడియోలు ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాయి. వైఎస్సార్సీపీకి టీడీపీ-జనసేన పొత్తు వ్యాక్సిన్ అని ఆయన అన్నారు. కాకపోతే ఆ వాక్సిన్‌కు ఇప్పటికే కాలం చెల్లిపోయిందేమో పవన్ ఆలోచించుకోవాలి. రిజిస్ట్రేషన్ విధానంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా తీసుకు వస్తున్న మార్పులపై ఆంధ్రజ్యోతి చేసిన తప్పుడు ప్రచారాన్ని ఆయన కూడా చేశారు. అలాగే ఏపీలో 67వేల మంది పిల్లలు చనిపోయారంటూ పచ్చి అబద్దాన్ని చెప్పడానికి ఆయన సిగ్గపడలేదు. రాష్ట్రం అభివృద్ది చెందడం లేదని ఆరోపించిన ఆయన తాము వస్తే ఎలా అభివృద్ది చేస్తామో వివరించాలి కదా?. అసలు ఆయనకు ఉన్న ప్లాన్ ఏమిటో చెప్పగలగాలి కదా? తీర ప్రాంతం గురించి మాట్లాడిన ఆయన రామాయపట్నంలో నిర్మిస్తున్న ఓడరేవును ఒకసారి చూసి వస్తే అభివృద్ది జరిగింది లేనిది చెప్పవచ్చు. రేపో, మాపో మచిలీపట్నం వెళుతున్నారు కదా? అక్కడ నిర్మించిన వైద్య కళాశాలను, నిర్మిస్తున్న పోర్టును చూస్తే బాగుంటుంది కదా!. పవన్ కళ్యాణ్ ప్రసంగం చూస్తే ఏదో తప్పు చేస్తున్నట్లుగా, టీడీపీతో కలవకపోతే తనకు భవిష్యత్తు లేదన్నట్లుగా మాట్లాడినట్లు ఉంది తప్ప, ఆయనలో ఒక రాజకీయ పార్టీ నడిపే వ్యక్తికి ఉండవలసిన నమ్మకం, విశ్వాసం, ఆత్మగౌరవం, స్పష్టత, ఎన్నికలలో అధికారం వస్తే ఏమి చెస్తామో చెప్పగలిగే ఎజెండా మొదలైనవి ఏవీ లేవని ఈ ప్రసంగాన్ని పరిశీలిస్తే ఇట్టే అర్దం అయిపోతుంది. అందుకే ఆయనను ప్రజలు ఎన్నికలలో ఆదరించడం లేదని తెలుసుకోలేకపోతున్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు అవినీతి అభియోగాలకు గురైన టీడీపీ అధినేతకు కొమ్ము కాసి ఆ సిద్దాంతానికి కూడా తిలోదకాలు ఇచ్చేశారు. ఇలా ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తున్నందునే ఆయనను ప్రజలు ఎన్నుకోవడం లేదనుకోవాలి. కాకపోతే సినీ నటుడిని చూడడానికి కాస్త జనం వస్తారు. కానీ, ఆయన ఉపన్యాసం విన్నాక ఇంతకీ పవన్ ఏం చెప్పినట్లు అని ఎవరికి వారు ప్రశ్నించుకుంటే అంతా శూన్యమే కనిపిస్తుంది. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
పదేళ్లుగా పాలిటిక్స్‌లో ఉన్నా.. సీఎం పోస్టుకు సిద్ధం!
సాక్షి, విశాఖపట్నం: రాజకీయాల్లో తాను పదేళ్ల అనుభవం సాధించానని, అందువల్ల సీఎం పదవిని చేపట్టేందుకు సంసిద్ధంగా ఉన్నానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వారాహి యాత్ర మూడో విడత ముగింపు సందర్భంగా శుక్రవారం విశాఖలోని ఓ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఏ రంగంలోనైనా పరిణతి చెందాలంటే కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి. నాకు రాజకీయాల్లో పదేళ్ల అనుభవం వచ్చింది. సీఎం పదవికి సిద్ధమయ్యా. అయితే అదొక్కటే సరిపోదు. ఎన్నికలయ్యాక సీఎంను ఎమ్మెల్యేలు ఎన్నుకోవాలి. నాతో ఏ పార్టీలు కలిసొస్తాయన్నది ఆలోచిస్తున్నా. అందుకే ఈ ప్రక్రియలో ఓటు చీలకూడదన్నది నా అభిమతం’ అని చెప్పారు. టీడీపీతో పొత్తుపై చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఎన్నికల అనంతరం ఏర్పాటయ్యేది జనసేన – బీజేపీ ప్రభుత్వమా? లేక టీడీపీ – జనసేన మిశ్రమ ప్రభుత్వమా? అన్న దానిపై తేలాల్సి ఉందన్నారు. వైఎస్సార్ సీపీ పాలనతో పోల్చుకుంటే అవినీతి, అక్రమాలు తక్కువనే ఉద్దేశంతో టీడీపీకి మద్దతిస్తున్నట్లు పేర్కొన్నారు. మందుబాబులకు స్టైపెండ్ ఇస్తా.. రాష్ట్రంలో పోలీసు అధికారులు ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తున్నారని పవన్ ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం లేదా నియంత్రణపై దృష్టి సారిస్తామన్నారు. డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి మందుబాబులకు స్టైపెండ్ ఇస్తామని మేనిఫెస్టోలో పెడతామన్నారు. సమాధానం చెప్పలేక అసహనం.. 175 నియోజకవర్గాల్లో పోటీ చేయకుండా, మీ బలాన్ని చాటుకోకుండా మీరు ముఖ్యమంత్రి పదవిని ఎలా ఆశిస్తారు? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా పవన్ సమావేశం నుంచి నిష్క్రమించారు. సినిమాల్లో పాత్రలను పోషించిన మాదిరిగా పదేళ్ల అనుభవంతో సీఎం పోస్టుకు తాను సిద్ధంగా ఉన్నట్లు పవన్ వ్యాఖ్యానించడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో గాజువాకలో జనసేన జెండా ఎగురవేస్తామన్నారు కదా..! మరి అక్కడి నుంచి పోటీ చేస్తారా? అని మరో విలేకరి ప్రశ్నించగా.. అది తర్వాత చూద్దామంటూ దాటవేశారు. ఎర్రమట్టి దిబ్బల పరిసర గ్రామాల్లో స్థలాలను టీడీపీ హయాంలోనే ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించారని, మరి మీరు ఈ ప్రభుత్వంపై ఆరోణలు చేయడం ఏమిటి? క్షేత్ర స్థాయిలో జరిగిన విషయాలపై మీకు అవగాహన లేదా? అని మరో విలేకరి ప్రశ్నించగా.. పవన్ సమాధానం చెప్పకుండా చిరాకు ప్రదర్శించారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఏం చేయబోతున్నారని ఓ విలేకరి ప్రశ్నించగా ‘నువ్వు స్టీల్‌ప్లాంట్ నుంచి వచ్చావా?’ అని పవన్ ఎదురు ప్రశ్న వేశారు. ఓ ఆంగ్ల దినపత్రిక నుంచి వచ్చానని చెప్పగా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులను సమకూర్చలేకపోయిందంటూ పవన్ సమాధానాన్ని దాటవేశారు. -
పవన్ కల్యాణ్‌కు విశాఖ పోలీసులు నోటీసులు
సాక్షి, విశాఖ: వారాహి యాత్ర సందర్భంగా విశాఖలో నిన్న(గురువారం) రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై పవన్ కల్యాణ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారాహి యాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పవన్‌కు విశాఖ ఈస్ట్ ఏసీపీ మూర్తి నోటీసులు ఇచ్చారు. విద్వేష వ్యాఖ్యలు చట్ట విరుద్దమని నోటీసులు పేర్కొన్నారు నిన్న విశాఖ వారాహి యాత్రలో వాలంటీర్లు, ఆంధ్రయూనివర్శిటీపై పవన్ కల్యాణ్ అనేక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: చిరంజీవి ఎందుకు ఉలిక్కిపడ్డారు? అదన్న మాట అసలు సంగతి! సంసారం బీజేపీతో.. సహజీవనం టీడీపీతో.. పవన్‌కు మంత్రి అమర్నాథ్ చురకలు -
నీకు ఇక కేఏ పాల్ ఒక్కడే మిగిలున్నాడు: వెల్లంపల్లి శ్రీనివాస్
-
పవన్ కళ్యాణ్ లారీ యాత్రపై పేర్ని కిట్టు అదిరిపోయే పంచ్
-
పవన్ చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలే.. ఇదిగో సాక్ష్యం
అమరావతి: చేతికి మైకు దొరికింది కదాని రెచ్చిపోయి ఊగిపోవాడం తప్ప పవన్ కళ్యాణ్ మాటల్లో వాస్తవం లేదని సాక్ష్యాధారాలతో సహా మరోసారి నిరూపితమైంది. నిజానిజాలు తెలుసుకోకుండా చేతిలో ఉన్న స్క్రిప్టుని యధాతధంగా చదివి నిరాధార ఆరోపణలు చేసి తన రాజకీయ అజ్ఞానాన్ని బట్టబయలు చేసుకున్నారు. కేంద్ర హోంశాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలో ఐపీసీ 363, 369 (కిడ్నాప్, అపహరణ)సెక్షన్ల కింద నమోదైన మొత్తం కేసుల సంఖ్య కేవలం 867గా ఉంది. శాంతిభద్రతల్లో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్ర రాష్ట్రం చాలా మెరుగ్గా ఉంది. దేశవ్యాప్తంగా కిడ్నాప్ లేదా అపహరణకు గురవుతున్న వారు లక్షకు 7.4 శాతంగా ఉంటే ఆంధ్రాలో కేవలం 1.6 గా ఉంది. రెండేళ్లలో నమోదైన కేసుల సంఖ్య ఆధారంగా చూస్తే, దేశవ్యాప్తంగా కిడ్నాప్ అపహరణ కేసుల్లో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం అత్యధికంగా 14714 కేసులతో మొదటి స్థానంలో నిలిచింది. 10680 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలోనూ 10252 కేసులతో బీహార్ మూడో స్థానంలోనూ ఉండగా ఆంధ్ర ప్రదేశ్ ఎక్కడో అట్టడుగున 18వ స్థానంలో ఉంది. మహిళలకు రక్షణ కల్పించడంలో ఆంధ్ర ప్రదేశ్ చాలా ముందుందని చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం. సరైన అవగాహన లేకుండా పవన్ తప్పుడు లెక్కలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఎవరైనా తెలివిగల్లోళ్లు పవన్ పక్కన ఉంటే నివేదికను చక్కగా వివరించే అవకాశమైనా ఉండేది. విషయ సంగ్రాహక శక్తి తక్కువగా ఉన్నందునో, వాస్తవాలు తెలుసుకోవాలన్న ఆసక్తి కొరవడినందునో.. ప్రతి విషయాన్ని వక్రీకరించి అసత్యాలను ప్రచారం చేస్తూ పవన్ ఎప్పటికప్పుడు జనం ముందు నవ్వులపాలవుతున్నారు. -
ఎలక్షన్ల తర్వాత అనుకుందాంలే! చరిత్రలో ఉంటామో, ఊడ్చుకుపోతామో తెలియదుగా సార్!
ఎలక్షన్ల తర్వాత అనుకుందాంలే! చరిత్రలో ఉంటామో, ఊడ్చుకుపోతామో తెలియదుగా సార్! -
పవన్ కల్యాణ్‌కు జ్వరమా? ఇది నిజమా?
పవన్ కల్యాణ్‌కు జ్వరం వచ్చింది. ఏకంగా 102 డిగ్రీల టెంపరేచర్ ఉంది.. అందుకే బస్సు యాత్ర వాయిదా.. ఇదీ నిన్నటి నుంచి జనసేన నాయకులు చేస్తోన్న ప్రచారం. పార్టీ కార్యకర్తలు కూడా ఇదే నమ్మారు. నిజంగానే తమ నాయకుడు అస్వస్థతకు గురయ్యారని, త్వరగా కోలుకొని బస్సుయాత్రకు రావాలని కోరుకున్నారు. కానీ తాజాగా ఓ ఫోటో చూసి మాత్రం అంతా బిత్తరపోయారు. ఇదే జ్వరమా? ఆ సాకుతో ఆడుతున్న పొలిటికల్ డ్రామానా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజులుగా వారాహి వాహనంలో యాత్ర చేస్తోన్న పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయినట్టు జనసేన నేతలు చెప్పుకొచ్చారు. మంగళవారం నుంచి ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని, దీంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని ప్రకటించారు. ఆ కారణంగానే రెండు రోజుల పాటు బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చి భీమవరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ లో పవన్ విశ్రాంతి తీసుకుంటున్నట్టు తెలిపారు. కట్ చేస్తే.. హుషారుగా సినిమాకు డబ్బింగ్ చెప్తూ కనిపించాడు పవన్ కల్యాణ్. భీమవరంలోని పార్టీ కార్యాలయంలోనే తాను నటించిన తాజా చిత్రం ‘బ్రో’ టీజర్ డబ్బింగ్ చెప్పాడు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు సముద్రఖని తెలియజేస్తూ ట్వీట్ చేయడంలో ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. జ్వరం సాకుతో పవన్ కల్యాణ్ పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నాడని పలువురు విమర్శిస్తున్నారు. సినిమాలు, రాజకీయాలు బ్యాలెన్స్ చేయలేక సాకులు చెప్తున్నారని కామెంట్ చేస్తున్నారు. డబ్బింగ్ కోసమే బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చాడని, ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పలేక జ్వరమంటూ పవన్ డ్రామాలాడుతున్నారని కొంతమంది నెటిజన్స్ విమర్శిస్తున్నారు. OUR #BRO ON FIRE 🔥 MODE💪💪💪💪💪 pic.twitter.com/JPQSEordTk — P.samuthirakani (@thondankani) June 28, 2023 పవన్ డబ్బింగ్ చెబుతున్న ఫోటోలను షేర్ చేస్తూ ‘ఆరోగ్యం బాలేదు అని సైనిక్స్ కి చెప్పి బ్రో మూవీ కి సముద్రఖని తో కలిసి డబ్బింగ్ పూర్తి చేస్తున్న కళ్యాణ్ బాబు..ఇదీ రాజకీయాల్లో ఇతని సంకల్పం’ అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. ఈ నెల 29న బ్రో మూవీ టీజర్ విడుదల కావాల్సి ఉంది. కానీ టీజర్‌కు పవన్ డబ్బింగ్ బకాయి ఉంది. ఆ బకాయిని ఈ రోజు తీర్చుకున్నాడు. అయితే జ్వరం సాకుతో బస్సు యాత్రని ఆపి..డబ్బింగ్ చెప్పడం విడ్డూరంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆరోగ్యం బాలేదు అని సైనిక్స్ కి చెప్పి BRO మూవీ కి సముద్రఖని తో కలిసి డబ్బింగ్ పూర్తి చేస్తున్న కళ్యాణ్ బాబు..ఇదీ రాజకీయాల్లో ఇతని సంకల్పం pic.twitter.com/gynKPio2ho — Amar Amar (@amarballa2) June 28, 2023 It's fun-filled entertainer 😂❤️#PawanKalyan enjoyed the teaser while in dubbing session it seems #BroTeaser | #BroTheAvatar pic.twitter.com/fxw3t7tANq — Twood VIP™ (@Twood_VIP) June 28, 2023 -
ఆ ప్యాకేజీ స్టార్ వారాహి అనే ఓ లారీ ఎక్కి ఊగిపోతూ.. : సీఎం జగన్
సాక్షి, పార్వతీపురం మన్యం: ప్రజలకు ఇంత మంచి చేస్తుంటే.. చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని, అబద్ధాలు.. మోసాలతో మళ్లీ ప్రజలను మభ్యపెట్టేందుకు వస్తున్నాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. జగనన్న అమ్మ ఒడి పథకం నిధుల విడుదల కార్యక్రమంలో గభాంగా.. కురుపాం బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. చంద్రబాబుతో పాటు జనసేనాని పవన్ కల్యాణ్‌పైనా మండిపడ్డారు. తన 45 ఏళ్ల రాజకీయంలో చంద్రబాబు ఏనాడూ మంచి గురించి ఆలోచించలేదు. టీడీపీని టీ అంటే తినుకో.. డీ అంటే దండుకో.. పీ అంటే పంచుకోగా మార్చేశారు. దోచుకున్న సొమ్ముతో వాళ్లు బొజ్జలు పెంచుకున్నారని ఎద్దేశా చేశారాయన. 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా ఏ మంచీ చేయని ఈ బాబు.. 3 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఏ ప్రాంతానికీ ఏ మంచీ చేయని ఈబాబు.. ఏ సామాజిక వర్గానికీ కూడా ఏ మంచీ చేయని బాబు. ఎన్నికల ముందు మేనిఫెస్టో బుక్కు తెస్తారు. అధికారంలోకి వస్తే.. మేనిఫెస్టోను చెత్త బుట్టలో పడేస్తారు. ఇదీ వాళ్ల ట్రాక్ రికార్డు. మరోసారి ఇదే దుష్ట చతుష్టయం.. ఇదే బాబు.. మరోసారి అధికారం ఇవ్వండంటూ మరోసారి మేనిఫెస్టోతో మళ్లీ మోసానికి దిగారు.డ్రామాలు ఆడటం మొదలు పెట్టారు. ఈసారి డ్రామాలకు కొంచం రక్తి కట్టించారు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారంట.. మోసం చేసేదానికి ఒక హద్దులు పద్దులు పోయి.. జగన్ ఏం చేస్తున్నాడు.. జగన్ కంటే కాస్త ఎక్కువ చెప్పాలని మోసం చేయడంలో రక్తి కట్టిస్తున్నాడు. వీళ్లందరికీ తోడు ఒక దత్త పుత్రుడు ఉన్నాడు. ఈ దత్త పుత్రుడు.. 2014లో కూడా ఇదే దత్తపుత్రుడు, ఇదే చంద్రబాబుకు మద్దతు పలికాడు. మీ ఇంటికి లేఖలొచ్చాయి. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు దత్తపుత్రుడి సంతకంతో లేఖలు వచ్చాయి. మాదీ బాధ్యత అని.. ఎన్నికలు అయిపోయాయి, ఎన్నికల ప్రణాళిక చెత్త బుట్టలో వేశారు. మన రాష్ట్రంలో మంచిచేయొద్దని చెప్పే నాలుగు కోతులు ఉన్నాయి. మంచి అనోద్దు.. మంచి వినోద్దు..మంచి చేయొద్దు అన్నదే వారి విధానం. నమ్మించి ప్రజలను నట్టేటా ముంచడమే వాళ్లకు తెలిసిన నీతి. రాష్ట్రంలో మంచి జరుగుతుంటే భరించలేకపోతున్నారు. వాళ్లకు కడుపులో మంట, ఈర్ష్యతో వాళ్లకు కళ్లు మూసుకుపోయాయి. దత్తపుత్రుడు 2014లోనూ చంద్రబాబుకు మద్దతు ఇచ్చాడు. మరి ఆ తర్వాత చంద్రబాబు చేసిన మోసాన్ని ఎందుకు నిలదీయలేదు. ఆ దత్తపుత్రుడు.. మామూలుగా మాట్లాడడు. ఆ ప్యాకేజీ స్టార్ వారాహి అనే ఓ లారీ ఎక్కి ఊగిపోతూ తనకు నచ్చనివారిని.. చెప్పుతో కొడతానంటాడు. తాట తీస్తానంటాడు. ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. ఆ మనిషి నోటికి అదుపు లేదు.. నిలకడా లేదు. వారిలా నలుగురు నలుగురిని పెళ్లి చేసుకొని నాలుగేళ్లకోసారి భార్యనూ మార్చలేం. పెళ్లి అనే పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకు తీసుకొని రాలేం. దత్తపుత్రుడిలా తొడలు కొట్టలేం.. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ బూతులు తిట్టలేం. అవన్నీ వారికి చెందిన పేటెంట్. దుష్టచతుష్టయం సమాజాన్ని చీల్చుతోంది. కానీ, మన పునాదులు సామాజిక న్యాయంలో ఉన్నాయి. అందుకే పనికి మాలిని పంచ్ డైలాగులు ఉండవ్. బలమైన, పటిష్టమైన పునాదుల మీద నిలబడ్డాం. పౌర సేవలు, సంక్షేమ పథకాల అమలులో మన పునాదులు ఉన్నాయి. పేదల కష్టాల నుంచి మన పునాదులు పుట్టాయి. మన పునాదులు ఓదార్పు యాత్ర నుంచి పుట్టాయి. వాళ్ల మాదిరిగా వెన్నుపోటు, అబద్ధాలపై మన పునాదులు పుట్టలేదు. రాష్ట్రంలో రాక్షసులతో మనం యుద్ధం చేస్తున్నాం. యుద్ధంలో వారి మాదిరిగా మనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లేవు. వారి మాదిరిగా మనకు దత్తపుత్రుడు లేడు. అబద్ధాలను పదే పదే చెప్పి భ్రమ కలిగించే మీడియా మనకు లేదు. మీ బిడ్డ ప్రభుత్వంలో 5 మంది డెప్యూటీ సీఎంలలో నలుగురు నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలే. రాష్ట్రానికి హోం మంత్రి నా దళిత చెల్లెమ్మ. అలాంటి మనందరి ప్రభుత్వం మీద కావాలని పనిగట్టుకొని సమాజాన్ని చీల్చడం కోసం వాళ్లు పడుతున్న పాట్లు చూడాలి. పేదల కోసం తీసుకొస్తున్న విద్యా విప్లవంలో మన పునాదులున్నాయి. పేదల జీవితాలు మార్చేలా వాళ్ల కోసం చేస్తున్న ఇళ్ల స్థలాల్లో ఉన్నాయి. వారి కోసం కట్టిస్తున్న ఇళ్లలో మన పునాదులున్నాయి. గ్రామాల్లో ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా అక్కచెల్లెమ్మలు, రైతన్నలు, అవ్వాతాతలు, పిల్లలకు మంచి జరిగేలా అందిస్తున్న పౌర సేవల్లో నా పునాదులున్నాయి. అక్కచెల్లెమ్మల సాధికారత కోసం అమలు చేస్తున్న పథకాల్లో మన పునాదులున్నాయి. పనికిమాలిన పంచ్ డైలాగుల్లో లేవు వాళ్ల మాదిరిగా. మన పునాదులు మన ఓదార్పు యాత్ర నుంచి, 3,648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో, పేదల కష్టాల్లోంచి నా పునాదులు పుట్టాయి. వారి మాదిరిగా వెన్నుపోటులోంచి నా పునాదులు పుట్టలేదు. అబద్ధాలపైన మన పునాదులు లేవు. దోచుకో, పంచుకో,తినుకో అనే సిద్దాంతం నుంచి పుట్టలేదు. పేద వాడి కోసం నిలబడగలిగాం కాబట్టే 2009 నుంచి ఇప్పటి వరకు ఒకసారి జగన్ అనే మీ అన్నను ఒక్కసారి గమనిస్తే.. ఎక్కడా కూడా ఏ కార్యకర్తా కూడా జగన్ ను చూసినప్పుడు జగన్ నడిచే నడక చూసినప్పుడు అడుగో అతడే మా నాయకుడని కాలర్ ఎగరేసేలా నడత, ప్రవర్తన ఉంది. ఏ రోజూ అధర్మాన్ని, అబద్దాలు చెప్పి గెలవాలని ప్రయత్నం చేయలేదు. అధికారం కోసం, పొత్తుల కోసం పాకులాడలేదు. ప్రతి అడుగులోనూ పేద వాడు బాగుండాలని ఆలోచన చేశా. ఇదీ మన పునాది. ఇదీ మన ఫిలాసఫీ, ఇదీ మన పార్టీ. ఇదీ మన మనసున్న ప్రభుత్వమని తెలియజేస్తున్నా. మీ బిడ్డ పొత్తుల కోసం ఏరోజూ పాకులాడలేదు. రాష్ట్రంలో రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం. మీ బిడ్డ తోడేళ్లను నమ్ముకోలేదు.. దత్తపుత్రుడిని నమ్ముకోలేదు. జరగబోయే కురుక్షేత్రంలో మీ బిడ్డకు మీరే అండ. మీ బిడ్డకు అండగా ఉన్నది ఆ భగవంతుడు.. ప్రజలు మాత్రమే. మీకు మంచి చేశాను అనిపిస్తేనే ఈ యుద్ధంలో మీరే నాకు అండగా నిలవాలి అని కోరారాయన. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో 10 రోజుల పాటు పండుగ వాతావరణంలో జరగబోతున్న వేడుకలో ప్రజా ప్రతినిధులంతా పాల్గొనాలని ఆదేశిస్తున్నా. ఇంకా మీకు మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా అని తన ప్రసంగం ముగించారు సీఎం జగన్. -
లోకేష్ అడ్రస్ లేనోడు.. పవన్‌కు అది అలవాటే!
సాక్షి, కృష్ణా: తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అడ్రస్ లేనిదని.. అందుకే జనం లేక వెలవెల బోతోందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం విజయవాడలో సాక్షితో మాట్లాడిన ఆయన.. లోకేష్‌తో పాటు జనసేనాని పవన్ కల్యాణ్‌పైనా విమర్శలు గుప్పించారు. టీడీపీ నేత నారా లోకేష్ రాత్రిది దిగక హ్యాంగోవర్లో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. లోకేష్ అడ్రస్ లేనోడు. అందుకే పాదయాత్ర వెలవెలబోతోంది. ఓ లక్ష్యమంటూ లేకుండా అదీ రాత్రి పూట వాక్ చేస్తూ.. పాదయాత్ర అని ప్రచారం చేసుకుంటున్నాడు. మేమూ, మా ఎమ్మెల్యేలు చేస్తున్న సవాళ్లకు.. లోకేష్ దగ్గరి నుంచి సమాధానాలు రావడం లేదు అని మండిపడ్డారాయన. ఇక జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పైనా మంత్రి కాకాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘పవన్ భాష చూసి జనం అసహ్యించుకుంటున్నారు. గతంలో రెండుచోట్లా ఓడించి ప్రజలు బట్టలూడదీసినట్లు బుద్ధి చెప్పారు. అందుకేనేమో.. ఇప్పుడు ఇలాంటి భాష వాడుతున్నాడు. పవన్‌కు జనాలతో కొట్టించుకోవడం, తిట్టుంచుకోవడం అలవాటే అని మంత్రి కాకాణి అన్నారు. ప్రస్టేషన్‌లోనే పవన్, లోకేష్‌లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని తేల్చేశారాయన. ఇదీ చదవండి: నీకా దమ్ముందా? నారా లోకేష్‌కు అనిల్ సవాల్