ఆవేశం తప్ప ఆలోచన లేని పవన్‌: ఎమ్మెల్యే నాగేశ్వరరావు | Kaikaluru MLA Dulam Nageswara Rao Counter To Pawan Kalyan | Sakshi
Sakshi News home page

ఆవేశం తప్ప ఆలోచన లేని పవన్‌.. ఆరోపణలపై ఎమ్మెల్యే నాగేశ్వరరావు ధ్వజం

Published Fri, Oct 6 2023 12:52 PM | Last Updated on Fri, Oct 6 2023 1:49 PM

Kaikaluru MLA Dulam Nageswara Rao Counter to Pawan Kalyan - Sakshi

సాక్షి, ఏలూరు: వారాహి యాత్రలో జనసేన పవన్‌ కల్యాణ్‌ ఆరోపణలు, విమర్శలకు కైకలూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. నియోజకవర్గంలో అవినీతి తప్ప అభివృద్ధి జరగలేదన్న పవన్‌ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్యే నాగేశ్వరావు. అంతేకాదు.. తాను స్వయంగా ఎదిగిన మనిషినని.. అవినీతికి పాల్పడినట్లు నిరూపించాలని పవన్‌కు సవాల్‌ విసిరారాయన. చంద్రబాబుకి కొమ్ము కాయడం తప్ప.. పవన్‌ను ఏదీ చేతకావడం లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారాయన. 

గత ప్రభుత్వంలో పవన్ స్వయంగా వచ్చి ప్రచారం చేసి గెలిపించిన కామినేని శ్రీనివాస్‌(మాజీ మంత్రి) కైకలూరుకు ఏమి చేశారు?.. రాత్రి ఒక పార్టీతో పగలు మరొక పార్టీతో సహవాసం చేశారు. పార్టీ అంటే కన్నతల్లితో సమానం.కానీ, కామినేని నీతి తప్పి ప్రవర్తించారు. కామినేని హయాంలో పూర్తికాని పెద్దింట్లమ్మ వారధిని..  సీఎం జగన్‌ రూ. 14 కోట్లతో పూర్తి చేశారు అని తెలిపారాయన. వీటితో పాటు జరుగుతున్న అభివృద్ధి పనులను, అందుకు వెచ్చిస్తున్న నిధుల వివరాలను సైతం మీడియాకు తెలియజేశారు ఎమ్మెల్యే నాగేశ్వర్రావు. 

‘‘పవన్ కల్యాణ్‌ చాలా ఆవేశంగా మాట్లాడుతాడు. కానీ ఏమాత్రం ఆలోచన చెయ్యరు. నాకు నా కొడుక్కి కొమ్ములు వచ్చాయి వాటిని విరగ కొడతాను అని పవన్‌ అన్నారు. అవి కొమ్ములు కాదు ప్రజలు మేము చేస్తున్న సేవకు ఇచ్చిన ఆశీస్సులు. కామినేని ఇచ్చిన స్క్రిప్టును పవన్ చదివారు. కొల్లేరులో మేం వందలాది ఎకరాల ఆక్రమించామన్నారు. పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు చేస్తున్నారంటూ ఆరోపించారు. ఆరోపణలు నిరూపిస్తే.. గుండు గీయించుకుని క్షమాపణలు కోరతా.  పవన్‌.. తన స్థాయిని రోజురోజుకీ దిగజార్చుకుంటున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు.

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల్లో ఉన్నారు. కానీ, నువ్వు వారాహి పేరుతో యాత్ర చేస్తూ లేనిపోనివి మాట్లాడుతున్నావ్‌. కనీసం సర్పంచ్‌గా అయిన గెలిచి ఉంటే.. మౌలిక వసతుల గురించి నీకు తెలిసి ఉండేది. దమ్ముంటే.. పాదయాత్ర చెయ్యి. కైకలూరు నియోజకవర్గంలో నిజాయితీకి నిలువుటద్దం దూలం నాగేశ్వరరావు(తనను తాను ఉద్దేశిస్తూ..). కేరాఫ్‌ ఫ్లాట్‌ఫారమ్‌ నుంచి వచ్చిన వ్యక్తిని నేను. అన్నచాటున తమ్ముడిలా ఎదిగిన వ్యక్తివి నువ్వు.  ప్రజా జీవితానికి సినిమాకి చాలా తేడా ఉంది. పవన్‌ అది గమనించాలి. దమ్ముంటే.. 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయండి. అంతేగానీ.. నేరస్తుడైన చంద్రబాబుకి కొమ్ము కాయడం కాదు. 

అమరావతిలో రైతులు ఇచ్చిన రెండు స్పూన్ల పెరుగు అన్నం తిని.. వెళ్ళిపోయావు. రాజధాని పేరుతో నిలువు దోపిడీకి పాల్పడ్డ చంద్రబాబును ఏనాడైనా ప్రశ్నించావా?.. అవినీతి లేని చోట ప్రశ్నిస్తే పవన్ నవ్వుల పాలవుతారు అంటూ పవన్‌ను ఉద్దేశించి ఎమ్మెల్యే నాగేశ్వరావు హితవు పలికారు.  పవన్.. మీ పేరు చెప్పి ఎందరో విద్యార్థులు, యువత తల్లి దండ్రులను పట్టించుకోకుండా రోడ్లపై తిరుగుతున్నారు..వారి భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారని అన్నారాయన. 

ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. ప్రభుత్వ సొమ్మును దోచేస్తేనే ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. తండ్రిని ముఖ్యమంత్రి పదవి నుండి దించేసిన వ్యక్తికి కొమ్ముకాస్తున్న బాలకృష్ణను అసలు మనిషి అంటారా...? ‘‘మీరంతా రండి.. జైల్లో ఉన్న దొంగను ముఖ్యమంత్రి చేస్తానంటే చంద్రబాబుకు ఎవరూ కొమ్ము కాయరు..?. వంగవీటి రంగానే హత్య చేయించిన వ్యక్తిని ఎవరూ కొమ్ము కాయరు. ముద్రగడ పద్మనాభం ను చిత్రహింసలు పెట్టిన వ్యక్తిని ఎవరూ కొమ్ము కాయరు. ముద్రగడ పద్మనాభం భార్యని కొడుకును చిత్రహింసలు పెడితే ఒక్కరోజైనా నువ్వు మాట్లాడవా? అని పవన్‌ను నిలదీశారాయన. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement