Kaikaluru constituency
-
మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత
కైకలూరు: మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి (74) సోమవారం కన్నుమూశారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆమె సోమవారం గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. ఏలూరు జిల్లా కలిదిండి మండలం కొండూరు ఆమె స్వగ్రామం. ముదినేపల్లి నియోజకవర్గం నుంచి 1983లో టీడీపీ తరఫున పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ఉద్దండుడిగా పేరొందిన పిన్నమనేని కోటేశ్వరరావుపై పోటీ చేసి ఓటమి చెందారు. తిరిగి ముదినేపల్లి నుంచి 1985లో కోనేరు రంగారావుపై విజయం సాధించారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 19 89లో ప్రాథమిక, ఉన్నత, సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా ఆమెకు అవకాశం కల్పించారు.ఆ సమయంలో పరీక్ష పేపర్ లీక్ అంశం వివాదాస్పదమైంది. యెర్నేని సీతాదేవి మంత్రిగా ఉన్నప్పుడే మొదటిసారి ఇన్స్టెంట్, బెటర్మెంట్ పరీక్షలు ప్రవేశపెట్టారు. 1994లో పిన్నమనేని కోటేశ్వరరావు కుమారుడు వెంకటేశ్వరరావుపై పోటీ చేసి విజయం సాధించారు. 1999, 2004 ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. 2004 తర్వాత జిల్లా ల పునరి్వభజనలో భాగంగా ముదినేపల్లి నియోజకవర్గం రద్దయి.. కైకలూరు నియోజకవర్గంలో కలి సింది.సీతాదేవి టీటీడీ బోర్డు సభ్యురాలుగా పనిచేశారు. 2013లో బీజేపీలో చేరారు. బీజేపీలో మహి ళా మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలిగా బా ధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం విజయ మిల్క్ డెయిరీ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. సీతాదేవి భర్త యెర్నేని నాగేంద్రనాథ్ (చిట్టిబాబు) రైతాంగ సమాఖ్య, కొల్లేరు పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన గతేడాది అనారోగ్యంతో మరణించారు. సీతాదేవి పార్థివదేహాన్ని సొంతూ రు కొండూరుకు తీసుకొచ్చారు.పలువురు నేతలు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులరి్పంచారు. -
ఆవేశం తప్ప ఆలోచన లేని పవన్: ఎమ్మెల్యే నాగేశ్వరరావు
సాక్షి, ఏలూరు: వారాహి యాత్రలో జనసేన పవన్ కల్యాణ్ ఆరోపణలు, విమర్శలకు కైకలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నియోజకవర్గంలో అవినీతి తప్ప అభివృద్ధి జరగలేదన్న పవన్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్యే నాగేశ్వరావు. అంతేకాదు.. తాను స్వయంగా ఎదిగిన మనిషినని.. అవినీతికి పాల్పడినట్లు నిరూపించాలని పవన్‌కు సవాల్ విసిరారాయన. చంద్రబాబుకి కొమ్ము కాయడం తప్ప.. పవన్‌ను ఏదీ చేతకావడం లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారాయన. గత ప్రభుత్వంలో పవన్ స్వయంగా వచ్చి ప్రచారం చేసి గెలిపించిన కామినేని శ్రీనివాస్(మాజీ మంత్రి) కైకలూరుకు ఏమి చేశారు?.. రాత్రి ఒక పార్టీతో పగలు మరొక పార్టీతో సహవాసం చేశారు. పార్టీ అంటే కన్నతల్లితో సమానం.కానీ, కామినేని నీతి తప్పి ప్రవర్తించారు. కామినేని హయాంలో పూర్తికాని పెద్దింట్లమ్మ వారధిని.. సీఎం జగన్ రూ. 14 కోట్లతో పూర్తి చేశారు అని తెలిపారాయన. వీటితో పాటు జరుగుతున్న అభివృద్ధి పనులను, అందుకు వెచ్చిస్తున్న నిధుల వివరాలను సైతం మీడియాకు తెలియజేశారు ఎమ్మెల్యే నాగేశ్వర్రావు. ‘‘పవన్ కల్యాణ్ చాలా ఆవేశంగా మాట్లాడుతాడు. కానీ ఏమాత్రం ఆలోచన చెయ్యరు. నాకు నా కొడుక్కి కొమ్ములు వచ్చాయి వాటిని విరగ కొడతాను అని పవన్ అన్నారు. అవి కొమ్ములు కాదు ప్రజలు మేము చేస్తున్న సేవకు ఇచ్చిన ఆశీస్సులు. కామినేని ఇచ్చిన స్క్రిప్టును పవన్ చదివారు. కొల్లేరులో మేం వందలాది ఎకరాల ఆక్రమించామన్నారు. పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు చేస్తున్నారంటూ ఆరోపించారు. ఆరోపణలు నిరూపిస్తే.. గుండు గీయించుకుని క్షమాపణలు కోరతా. పవన్.. తన స్థాయిని రోజురోజుకీ దిగజార్చుకుంటున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల్లో ఉన్నారు. కానీ, నువ్వు వారాహి పేరుతో యాత్ర చేస్తూ లేనిపోనివి మాట్లాడుతున్నావ్. కనీసం సర్పంచ్‌గా అయిన గెలిచి ఉంటే.. మౌలిక వసతుల గురించి నీకు తెలిసి ఉండేది. దమ్ముంటే.. పాదయాత్ర చెయ్యి. కైకలూరు నియోజకవర్గంలో నిజాయితీకి నిలువుటద్దం దూలం నాగేశ్వరరావు(తనను తాను ఉద్దేశిస్తూ..). కేరాఫ్ ఫ్లాట్‌ఫారమ్ నుంచి వచ్చిన వ్యక్తిని నేను. అన్నచాటున తమ్ముడిలా ఎదిగిన వ్యక్తివి నువ్వు. ప్రజా జీవితానికి సినిమాకి చాలా తేడా ఉంది. పవన్ అది గమనించాలి. దమ్ముంటే.. 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయండి. అంతేగానీ.. నేరస్తుడైన చంద్రబాబుకి కొమ్ము కాయడం కాదు. అమరావతిలో రైతులు ఇచ్చిన రెండు స్పూన్ల పెరుగు అన్నం తిని.. వెళ్ళిపోయావు. రాజధాని పేరుతో నిలువు దోపిడీకి పాల్పడ్డ చంద్రబాబును ఏనాడైనా ప్రశ్నించావా?.. అవినీతి లేని చోట ప్రశ్నిస్తే పవన్ నవ్వుల పాలవుతారు అంటూ పవన్‌ను ఉద్దేశించి ఎమ్మెల్యే నాగేశ్వరావు హితవు పలికారు. పవన్.. మీ పేరు చెప్పి ఎందరో విద్యార్థులు, యువత తల్లి దండ్రులను పట్టించుకోకుండా రోడ్లపై తిరుగుతున్నారు..వారి భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారని అన్నారాయన. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. ప్రభుత్వ సొమ్మును దోచేస్తేనే ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. తండ్రిని ముఖ్యమంత్రి పదవి నుండి దించేసిన వ్యక్తికి కొమ్ముకాస్తున్న బాలకృష్ణను అసలు మనిషి అంటారా...? ‘‘మీరంతా రండి.. జైల్లో ఉన్న దొంగను ముఖ్యమంత్రి చేస్తానంటే చంద్రబాబుకు ఎవరూ కొమ్ము కాయరు..?. వంగవీటి రంగానే హత్య చేయించిన వ్యక్తిని ఎవరూ కొమ్ము కాయరు. ముద్రగడ పద్మనాభం ను చిత్రహింసలు పెట్టిన వ్యక్తిని ఎవరూ కొమ్ము కాయరు. ముద్రగడ పద్మనాభం భార్యని కొడుకును చిత్రహింసలు పెడితే ఒక్కరోజైనా నువ్వు మాట్లాడవా? అని పవన్‌ను నిలదీశారాయన. -
ప్రగతి ప్రదాత.. సంక్షేమ విధాత
సాక్షి, మచిలీపట్నం: రాజకీయ చైతన్యం కలిగిన కృష్ణా జిల్లాపై మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చెరగని ముద్ర వేశారు. ఆయనతో జిల్లాకు విడదీయరాని అనుబంధం ఉంది. సుదీర్ఘకాలంగా టీడీపీకి కంచుకోటగా ఉన్న కృష్ణా జిల్లాలో ఆ పార్టీ అడ్రస్ గల్లంతు చేసి, తనదైన మార్క్ చూపిన ఘనత ఆయనకే దక్కింది. 2004 సార్వత్రిక ఎన్నికల్లో అంతా తానై వ్యవహరించి రాజకీయంగా కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి ఆయన చేసిన కృషి ఎనలేనిది. అప్పటికే తొమ్మిదేళ్ల బాబు పాలనతో విసిగిపోయిన జిల్లా ప్రజలు చరిత్రలో కనివిని ఎరుగని విజయాన్ని వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టారు. జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. ప్రభుత్వ కూర్పులోనూ వైఎస్ జిల్లాకు పెద్ద పీట వేశారు. కోనేరు రంగారావుకి ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. విప్‌గా సామినేని ఉదయభానుకు ఇచ్చారు. 2009 ఎన్నికల్లోనూ వైఎస్సార్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ అదే ప్రభంజనాన్ని కొనసాగిచింది. అయితే దురదృష్ట పరిణామాల నేపథ్యంలో ఆయన మరణించడంతో జిల్లాలో రాజకీయ పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. మహానేత ఆశయాలను పునికి పుచ్చుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తండ్రికి తగ్గ తనయుడిగా తొమ్మిదేళ్లు ప్రజల పక్షాన పోరాటం చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్‌కు జిల్లా ప్రజలు పట్టం కట్టారు. 2019 ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 16 అసెంబ్లీ స్థానాల్లో 14 స్థానాల్లో విజయఢంకా మోగించి తిరుగులేని శక్తిగా వైఎస్సార్ సీపీ ఆవిర్భవించింది. వైఎస్సార్ హయాంలోనే పట్టణాభివృద్ధి.. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.వందల కోట్ల వ్యయంతో పట్టణాలను అన్ని విధాల అభివృద్ధి బాటలో పయనింపజేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.కోట్ల వ్యయంతో రక్షిత మంచినీటి పథకాలను నిర్మించడమే కాకుండా, పట్టణాల్లోని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. అభివృద్ధి బాట ఇది.. – బందరు నియోజకవర్గంలో పట్టణ ప్రజల చిరకాల కోరిక అయిన బందరు పోర్టు నిర్మాణానికి నాంది పలికింది వైఎస్సారే. ఇందులో భాగంగా రూరల్ మండలంలో శంకుస్థాపన చేసి శిలాఫలకం వేశారు. రూ.130 కోట్లతో బందరు పట్టణంలో డ్రైనేజీ నిర్మాణానికి కృషి చేశారు. – ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు జిల్లా కేంద్రంలో కృష్ణా యూనివర్సిటీని స్థాపించారు. ప్రస్తుతం అక్కడ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. అంతేగాక భవన నిర్మాణానికి రూ.10 కోట్ల మేర నిధులు మంజూరు చేశారు. రోల్డ్‌గోల్డ్ పరిశ్రమకు జీవం పోసేందుకు బందరు మండలంలో పోతేపల్లిలో జ్యూవెలరీ పార్క్ ఏర్పాటుకు స్థలం కేటాయించారు. – పెడన పట్టణంలో ప్రతి నిరుపేదకు ఇళ్లు ఇవ్వాలన్న తలంపుతో 4 వైఎస్సార్ కాలనీలు ఏర్పాటు చేశారు. ఈ కాలనీల్లో 400 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కొన్నేళ్లుగా గూడు లేక అవస్థలు పడుతున్న పేదల జీవితాల్లో వెలుగులు నింపారు. – కైకలూరు నియోజకవర్గంలో సైతం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కైకలూరు పట్టణంలో రూ.3 కోట్లతో కలిదిండి పాలిటెక్నిక్ కళాశాల నిర్మించారు. మండవల్లి జూనియర్ కళాశాల ఏర్పాటు, కైకలూరు పంచాయతీ అభివృద్ధికి రూ.10 కోట్లు నిధులు కేటాయించారు. యానాదుల కాలనీలో ఇళ్లు కట్టుకునేందుకు భూమి కేటాయించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొల్లేరు ఆపరేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పునరావాసం నిమిత్తం రూ.350 కోట్లు కేటాయించి ప్రజలను ఆదుకున్న ఘనత ఆయనకే దక్కింది. రూ.12 కోట్లతో పెద్దింట్లమ్మవారధి నిర్మించారు. ప్రస్తుతం పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. – నూజివీడులో రూ.600 కోట్లతో నూజివీడులో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేసి వేలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్య చేరువయ్యేలా చేశారు. రూ.66 కోట్లతో కృష్ణా జలాల పథకం. 4 వేల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీని చేసి వారి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. మామిడి సాగుకు పేరుగాంచిన నూజివీడులో మామిడి పరిశోధన కేంద్రం అభివృద్ధి రూ.7 కోట్లు కేటా యించారు. అంతేగాక రూ.6 కోట్లతో బాలికల రెసిడెన్షియల్ భవనం నిర్మాణానికి కృషి చేశారు. – జగ్గయ్యపేట నియోజవర్గంలో సైతం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. రూ.37 కోట్లతో వేదాద్రి–కంచల ఎత్తిపోతల పథకం ప్రారంభించారు. పులిచింతల ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. వత్సవాయి మండలం రూ.400 కోట్లతో పోలంపల్లి డ్యామ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం అ పనులు ఇప్పటికే జరుగుతూనే ఉన్నాయి. – అవనిగడ్డ నియోజకవర్గంలో డెల్టా ఆధునికీకరణకు రూ.4,576కోట్ల ని«ధులు మంజూరు చేశారు. 2008 జూన్ 6న అవనిగడ్డ మండలం పులిగడ్డవార్పు వద్ద «ఆధునికీకరణ పనులకు వైఎస్ శంకుస్థాపన చేశారు. కృష్ణా జిల్లాలో రూ. 2,180 కోట్లు, అవనిగడ్డ నియోజకవర్గంలో రూ.547.93 కోట్లు డెల్టా ఆధునికీకరణ పనులు జరిగాయి. రూ.138 కోట్లతో జరిగిన పులిగడ్డ–విజయవాడ కరకట్ట డబుల్‌లైన్ పనులకు ఆయన నిధులు మంజూరు చేశారు. రాష్ట్రంలోనే తొలి ఫిషరీస్ కళాశాలను నాగాయలంక మండలంలోని భావదేవరపల్లిలో ఏర్పాటు చేశారు. రూ.35కోట్లతో అవనిగడ్డలో 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు వైఎస్ హయాంలోనే జరిగింది. రూ.40 కోట్లతో నాగాయలంక మండలం గుల్లలమోద నుంచి కోడూరు మండలం సాలెంపాలెం వరకూ సముద్ర కరకట్టను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలోనే అభివృద్ధి చేశారు. అశ్వరావుపాలెం–మందపాకల పంటకాలువ పనులు చేశారు. ఆయన హయాంలో నియోజవర్గంలో రూ.590 కోట్లు అభివృద్ధి పనులు జరిగాయి. జిల్లాపై మమకారం.. దివంగత మహానేత వైఎస్సార్‌కు జిల్లాతో విడదీయరాని అనుబంధం ఉంది. జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటలో రాజీవ్ పల్లెబాట, జగ్గయ్యపేట పట్టణంలో రాజీవ్ నగర బాట, బైపాస్‌రోడ్డు ప్రారంభోత్సవం ఇలా అనేక కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలో పర్యటించారు. దాదాపుగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభిమానులు, అనుచరులు ఉన్న ఏకైక నేతగా, నిత్యం ప్రజల సంక్షేమమం కోసం పరితపించిన నేతగా, జిల్లా ప్రజల మదిలో ఆ మహానేత ఎప్పటికీ చిరస్మరణీయుడు. -
కలిదిండి బహిరంగ సభలో వైఎస్ షర్మిల
-
సీఎం ఎలా ఉండాలో వైఎస్సార్ చూపించారు: షర్మిల
సాక్షి, కృష్ణా: ‘దివంగత మహానేత రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రతి ఒక్కరిక భరోసా ఉండేది. ఉచితంగానే కార్పొరేటు ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేసుకునే వీలు ఉండేంది. ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో 108 వచ్చేది. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని.. ప్రతి పేదవాడికి ఇళ్లు ఉండాలని వైఎస్సార్ ఆశపడేవారు. ఐదేళ్లలో ఒక్క రూపాయి ఏ చార్జీ పెంచకుండా.. ఏ పన్ను పెంచకుండా.. అన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేసి సీఎం ఎలా ఉండాలో వైఎస్సార్ చూపించారు. కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా వైఎస్సార్ ప్రతి ఒక్కరికి మేలు చేశారు.’ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పేర్కొన్నారు. బుధవారం కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో జరిగిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. ఇంకా షర్మిల మాట్లాడుతూ.. ‘చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో రైతులను, డ్వాక్రా మహిళలను, విద్యార్థులను, ఇలా ప్రతి ఒక్కరిని మోసం చేశారు. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్న చంద్రబాబు వారిని వంచించారు. డ్వాక్రా మహిళలను ఒక్క రూపాయి వడ్డీ కూడా మాఫీ చేయలేదు. పసుపు-కుంకుమ పేరుతో చంద్రబాబు మళ్లీ మహిళలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పసుపు-కుంకుమ పేరిట చంద్రబాబు ఎంగిలి చేయి విదిలిస్తున్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్న చంద్రబాబు దానికి తూట్లు పొడిచారు. వైఎస్సార్ హయంలో ఉన్నట్టు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందా?. ఆరోగ్య శ్రీ జాబితా నుంచి కార్పొరేటు ఆస్పత్రులను తొలగించారు. కానీ చంద్రబాబు నాయుడు కుటుంబం ప్రభుత్వ ఆస్పత్రికి కెళ్లి వైద్యం చేయించుకుంటుందా?. 16వేల కోట్ల రూపాయల అంచనా ఉన్న పోలవరాన్ని తన కమిషన్ల కోసం 60వేల కోట్లకు చంద్రబాబు పెంచారు. తన బినామీల కోసం కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తానే కడతానని తీసుకున్నారు. మూడేళ్లలో పోలవరం పూర్తి చేస్తానన్న చంద్రబాబు మాట మీద నిలబడ్డారా?. తనకు ఏదో అనుభవం ఉందని, ఏదో చేసేస్తానని రాజధాని నిర్మిస్తానని తోపులా కబుర్లు చెప్పారు. చంద్రబాబు ఒక్క శాశ్వత నిర్మాణం అయిన చేపట్టారా?. బీజేపీ ప్రభుత్వం 2500 కోట్లు ఇచ్చామని చెబుతుంటే చంద్రబాబు రాజధానిలో చేసిందేమీ లేదు. అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానని అన్నట్టు ఉంది చంద్రబాబు తీరు. ఐదేళ్లలో అమరావతిలో ఒక శాశ్వత నిర్మాణం చేపట్టని చంద్రబాబు.. మళ్లీ అధికారం ఇస్తే అమెరికా చేస్తానని అంటున్నారు. శ్రీకాకుళంను హైదరాబాద్ చేస్తానని మన చెవుల్లో పూలు పెడుతున్నారు. బాబు వస్తే జాబు వస్తుందన్నారు. కానీ చంద్రబాబు గారి కుమారుడు లోకేశ్‌కు మాత్రమే జాబు వచ్చింది. ఏకంగా లోకేశ్‌కు మూడు మంత్రి పదవులు ఇచ్చారు. లోకేశ్‌కు జయంతికి, వర్ధంతికి తేడా తెలియదు. చంద్రబాబుది పుత్ర వాత్సల్యం కాదా?. ఇప్పుడు చంద్రబాబు మీ భవిష్యత్తు నా భాద్యత అని అంటున్నారు. గత ఐదేళ్లుగా ప్రజల భవిష్యత్తు చంద్రబాబు బాధ్యత కాదా?. ఈ ఐదేళ్లు లోకేశ్ కోసమే చంద్రబాబు పనిచేశారు. 40 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రం ఎంత అప్పు చేసిందో.. చంద్రబాబు ఈ నాలుగేళ్లలో అంత అప్పు చేశారు. పోరాపాటున కూడా టీడీపీకి ఓటేస్తే మన ఊరి మనమే తీసుకున్నట్టు మెన్న ఓ వీడియోలో లోకేశ్ చెప్తున్నారు. బంధు ప్రీతి, మత పిచ్చి, కుల పిచ్చి ఉన్నా పార్టీ టీడీపీ అవునా తమ్ముళ్లు అని లోకేశ్ అడుగుతున్నారు. టీడీపీ పాలనలో ప్రతి దానిలో మాఫియా, అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు కలిసి రాష్ట్రానికి అన్యాయం చేశారు. బీజేపీ రాష్ట్రానికి ఇంత ఘోరంగా మోసం చేసిందంటే అందుకు కారణం చంద్రబాబు. చంద్రబాబు హోదాపై రోజుకో మాట మాట్లాడుతున్నారు. తమకు బీజేపీతో పొత్తు ఉందని విష ప్రచారం చేస్తున్నారు. మాకు ఏ పార్టీతో పొత్తు లేదు... ఆ అవసరం కూడా లేదు. సింహం సింగిల్‌గానే వస్తుంది. నక్కలు మాత్రమే గుంపులుగా వస్తాయి. వైఎస్ జగన్ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తారని అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం బతికి ఉందంటే అది కేవలం వైఎస్ జగన వల్లనే. హోదా కోసం ఢిల్లీ వేదికగా వైఎస్ జగన్ ధర్నాలు, దీక్షలు చేశారు. రాష్ట్రంలో రోజుల తరబడి నిరహార దీక్షలు చేపట్టారు. గొప్ప రాజధాని కావాలంటే, రాజన్న పాలనలో లాగా అభివృద్ధి జరగాలంటే జగనన్న సీఎం కావాలి. ప్రతి ఒక్కరికి మేలు జరగాలంటే ప్రత్యేక హోదా రావాలి.. దానికి జగనన్న ముఖ్యమంత్రి కావాలి. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి రైతన్నకు పెట్టుబడి సాయంగా మే నెలలోనే రూ. 12, 500 అందిస్తారు. గిట్టుబాటు ధర కోసం 3వేల కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేస్తారు. కరువులను ఎదర్కొవడానికి 4వేల కోట్ల రూపాయలతో మరో నిధిని ఏర్పాటు చేస్తారు. విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తారు. ఎంత చదువు చదివిన ఆ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. విద్యార్థులకు హాస్టల్, మెస్ చార్జీలను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్ చేయూత కింద 75 వేల రూపాయలు నాలుగు దఫాలుగా చెల్లిస్తాం. అక్కాచెల్లెమ్మలకు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వడంతో పాటుగా ఎన్నికల నాటికి ఉన్న బకాయిలను నాలుగు దఫాలుగా మాఫీ చేస్తారు. మళ్లీ సున్నా వడ్డీలకే రుణాలు ఇస్తారు. ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తారు. ఈ ప్రాంతంలో నీటి సమస్య లేకుండా.. మీ సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటాం. ఏ ఒక్కరికి అన్యాయం జరగనివ్వం. ఎరువుల ప్యాక్టరీ రాకుండా చూస్తాం. మళ్లీ దుర్మార్గపు పాలన మనకు అవసరం లేదు. రాజన్న రాజ్యానికి మళ్లీ నాంది పలకండిఎంపీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు గార్లను భారీ మెజారిటీతో గెలిపించండి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను తలచుకోండ’ని కోరారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
టీడీపీ నేతలే సామాజిక కార్యకర్తలా?
కైకలూరు మండల ఎస్సీ రుణ మంజూరు కమిటీలపై ప్రజాగ్రహం అధికారులను నిలదీసిన బీజేపీ, బీఎస్పీ నాయకులు నిరసన తెలిపి వెళ్లిపోయిన ఎంపీపీ కైకలూరు : ‘సామాజిక కార్యకర్తలంటే టీడీపీ నాయకులా? ఏం అర్హత ఉందని వారిని కమిటీ సభ్యులుగా తీసుకున్నారు? సామాజిక కార్యకర్తలైతే గుర్తింపు కార్డులు చూపండి?’ అంటూ బీజేపీ, బీఎస్పీ నాయకులు అధికారులను నిల దీశారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న కైకలూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఎస్సీ రుణ మంజూరు మండల కమిటీల్లో సామాజిక కార్యకర్తలుగా టీడీపీ నాయకులనే నియమించారు. ఈ నేపథ్యంలో కైకలూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎస్సీ రుణాల లబ్ధిదారుల ఎంపికకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఎస్సీ రుణ మంజూరు మండల కమిటీ సభ్యులు శనివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తలారి రమేష్ మాట్లాడుతూ సామాజిక కార్యకర్తలంటే టీడీపీ నాయకులా అని ప్రశ్నించారు. ఏం అర్హత ఉందని వారిని కమిటీ సభ్యులుగా తీసుకున్నారని నిలదీశారు. సామాజిక కార్యకర్తలైతే గుర్తింపు కార్డులు చూపండంటూ టీడీపీ నాయకులను డిమాండ్ చేశారు. అయితే టీడీపీ నాయకులు సమాధానం చెప్పలేకపోయారు. టీడీపీ నాయకులు కమిటీల్లో ఉండటం వల్ల ఆ పార్టీ కార్యకర్తలకే రుణాలు మంజూరవుతాయనే అపనమ్మకం కలుగుతోందన్నారు. ఎంపీడీవో నిమ్మగడ్డ బాలాజీ మాట్లాడుతూ జిల్లా స్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకే తాము నడుచుకుంటున్నామని చెప్పారు. కమిటీల విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామంటూ నాయకులు వెనుతిరిగారు. గౌరవం లేదంటూ వెళ్లిపోయిన ఎంపీపీ రుణాల మంజూరు కమిటీల్లో ఎంపీపీకి గౌరవం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఎంపీపీ బండి సత్యవతి ఎంపీడీవో కార్యాలయం నుంచి బయటకు వచ్చేశారు. ఆ సమయంలో ఎంపీపీ భర్త శ్రీనివాసరావు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. కమిటీలో ఎస్సీ సామాజిక వర్గం వారికి ఎందుకు అవకాశం కల్పించలేదని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులను కమిటీ సభ్యులుగా తీసుకోపోవడం వారిని అగౌరపర్చినట్లేనని పేర్కొన్నారు. బీజేపీకి చెందిన ఎంపీపీ బండి సత్యవతి ఆలపాడు ఎంపీటీసీ సభ్యురాలిగా గెలిచారు. అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచి పన్నాస లక్ష్మీకుమారి ఆమెపై పోటీ చేసి ఓటమి చెందారు. రుణ మంజూరు కమిటీలో లక్ష్మీకుమారిని సభ్యురాలిగా నియమించడంతో వివాదం మరింత ముదిరింది. అయితే నాయకులు వెళ్లిపోయిన తరువాత కమిటీ సభ్యులు ఇంటర్వ్యూలు నిర్వహించారు.