ముదినేపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు ఎన్నిక
కైకలూరు: మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి (74) సోమవారం కన్నుమూశారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆమె సోమవారం గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. ఏలూరు జిల్లా కలిదిండి మండలం కొండూరు ఆమె స్వగ్రామం. ముదినేపల్లి నియోజకవర్గం నుంచి 1983లో టీడీపీ తరఫున పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ఉద్దండుడిగా పేరొందిన పిన్నమనేని కోటేశ్వరరావుపై పోటీ చేసి ఓటమి చెందారు. తిరిగి ముదినేపల్లి నుంచి 1985లో కోనేరు రంగారావుపై విజయం సాధించారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 19 89లో ప్రాథమిక, ఉన్నత, సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా ఆమెకు అవకాశం కల్పించారు.
ఆ సమయంలో పరీక్ష పేపర్ లీక్ అంశం వివాదాస్పదమైంది. యెర్నేని సీతాదేవి మంత్రిగా ఉన్నప్పుడే మొదటిసారి ఇన్‌స్టెంట్, బెటర్‌మెంట్ పరీక్షలు ప్రవేశపెట్టారు. 1994లో పిన్నమనేని కోటేశ్వరరావు కుమారుడు వెంకటేశ్వరరావుపై పోటీ చేసి విజయం సాధించారు. 1999, 2004 ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. 2004 తర్వాత జిల్లా ల పునరి్వభజనలో భాగంగా ముదినేపల్లి నియోజకవర్గం రద్దయి.. కైకలూరు నియోజకవర్గంలో కలి సింది.
సీతాదేవి టీటీడీ బోర్డు సభ్యురాలుగా పనిచేశారు. 2013లో బీజేపీలో చేరారు. బీజేపీలో మహి ళా మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలిగా బా ధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం విజయ మిల్క్ డెయిరీ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. సీతాదేవి భర్త యెర్నేని నాగేంద్రనాథ్ (చిట్టిబాబు) రైతాంగ సమాఖ్య, కొల్లేరు పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన గతేడాది అనారోగ్యంతో మరణించారు. సీతాదేవి పార్థివదేహాన్ని సొంతూ రు కొండూరుకు తీసుకొచ్చారు.పలువురు నేతలు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులరి్పంచారు.
Comments
Please login to add a commentAdd a comment