sita devi
-
అమావాస్య రోజుని పున్నమి వెలుగులా మార్చే వేడుక..!
దీపావళి అమావాస్య రోజున జరుపుకొనే వెలుగుల వేడుక. సాధారణంగా పండుగలు ఏదో ఒక మతానికి చెందినవి అయి ఉంటాయి. దీపావళి ఒక మతానికి మాత్రమే పరిమితం కాదు, నాలుగు మతాల వారు జరుపుకొనే అరుదైన పండుగ. దీపావళి పండుగ రోజున ఊరూరా ఇంటింటా ముంగిళ్లలో అసంఖ్యాకంగా దీపాలు వెలుగుతాయి. అమావాస్య రాత్రిని పున్నమిని మించిన వెలుగులతో వెలిగిస్తాయి. ముంగిళ్లలో వెలిగించే గోరంత దీపాలు జగమంతటికీ వెలుగులు పంచుతాయి.దీపావళి నేపథ్యానికి సంబంధించి అనేక పురాణగాథలు ఉన్నాయి. దీపావళి మూలాలు భారత్‌లోనే ఉన్నా, ఇది దేశదేశాల పండుగగా విస్తరించింది. చాలా పండుగల మాదిరిగానే అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకొంటారు. దీపావళికి మూలంగా నరకాసుర సంహారం గాథ బాగా ప్రాచుర్యంలో ఉంది. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా ఇదేరోజున అయోధ్యకు తిరిగి చేరుకున్నట్లు పురాణగాథలు ఉన్నాయి.ఐదు రోజుల ఆనందాల పండుగదీపావళి వేడుకలు ఒకరోజుకు మాత్రమే పరిమితం కాదు. ఇది ఐదురోజుల ఆనందాల పండుగ. ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి జరుపుకొంటే, అంతకు ముందు వచ్చే ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశిగా, చతుర్దశిని నరక చతుర్దశిగా జరుపుకొంటారు. దీపావళి మరునాడు కార్తీక శుక్ల పాడ్యమిని బలి పాడ్యమిగా, కార్తీక శుక్ల విదియను యమ ద్వితీయగా జరుపుకొంటారు. ఈ ఐదురోజులకు సంబంధించి వేర్వేరు పురాణగాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.ధన త్రయోదశి: అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేసినప్పుడు అమృతకలశ హస్తుడై ఆరోగ్య ప్రదాతగా ధన్వంతరి ఆవిర్భవించాడు. క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి కూడా ఉద్భవించింది. ధన త్రయోదశి రోజున «నదీ స్నానాలు, సముద్ర స్నానాలు ఆచరించి, ధన్వంతరిని పూజిస్తారు. అలాగే లక్ష్మీదేవి పూజలు కూడా చేస్తారు. ధన త్రయోదశి రోజున బంగారం అమ్మకాలు బాగా జరుగుతాయి. ఈ రోజున బంగారం కొన్నట్లయితే, సంపద పెరుగుతుందని చాలామంది నమ్మకం.నరక చతుర్దశి: ముల్లోకాలనూ పీడించిన నరకాసురుడిని ఇదే రోజు సత్యభామా సమేతుడై యుద్ధానికి వెళ్లిన శ్రీకృష్ణుడు సంహరించాడు. నరకాసురుడి పీడ విరగడైనందున మరునాడు ద్వారకాపురికి చేరుకున్న సత్యభామా శ్రీకృష్ణులను జనాలు దీపాలు వెలిగించి స్వాగతం పలికారని, అప్పటి నుంచి దీపావళి జరుపుకోవడం ఆనవాయితీగా మారిందని ప్రతీతి.దీపావళి: దీపావళికి సంబంధించి ఒక ఆసక్తికరమైన పురాణగాథ ఉంది. ముక్కోపిగా పేరుపొందిన దుర్వాస మహర్షి ఒకసారి స్వర్గానికి వెళ్లాడు. దేవేంద్రుడు ఆయనకు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చాడు. ఇంద్రుడి ఆతిథ్యానికి సంతోషించిన దుర్వాసుడు అతడికి కానుకగా ఒక హారాన్ని బహూకరించాడు. ఇంద్రుడు ఆ హారాన్ని తాను ధరించకుండా, దానిని తన పట్టపుటేనుగైన ఐరావతం మెడలో వేశాడు. ఐరావతం ఆ హారాన్ని నేల మీదకు పడవేసి, కాలితో తొక్కింది. ఆ దృశ్యం చూసిన దుర్వాసుడు మండిపడి, ఇంధ్రుణ్ణి శపించాడు. దుర్వాసుడి శాపంతో ఇంద్రుడు స్వర్గాన్ని, సర్వసంపదలను కోల్పోయి రాజ్యభ్రష్టుడయ్యాడు. దిక్కుతోచని ఇంద్రుడు విష్ణువు వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నాడు. ‘అమావాస్య రోజున ఒక జ్యోతిని వెలిగించి, దానిని శ్రీమహాలక్ష్మీ స్వరూపంగా తలచి ప్రార్థించు. నీకు పునర్వైభవం ప్రాప్తిస్తుంది’ అని చెప్పాడు విష్ణువు. అమావాస్య రోజున జ్యోతిని వెలిగించి పూజించిన ఇంద్రుడు తిరిగి స్వర్గాధిపత్యాన్ని పొందాడు. పోగొట్టుకున్న సంపదలన్నీ మళ్లీ పొందాడు. అందువల్ల దీపావళి అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించడం ఆచారంగా మారినట్లు చెబుతారు. లక్ష్మీపూజ తర్వాత ప్రజలు కొత్త వస్త్రాలు ధరించి, విందు వినోదాలతో సరదాగా కాలక్షేపం చేస్తారు. బలి పాడ్యమి: దీపావళి మరునాడు కార్తీక శుక్ల పాడ్యమి. దీనినే బలి పాడ్యమి అంటారు. వామనావతారం దాల్చిన శ్రీమహావిష్ణువు బాలవటువులా వెళ్లి బలి చక్రవర్తిని దానంగా మూడడుగుల చోటు కోరుకున్నాడు. త్రివిక్రముడిగా మారిన వామనుడు రెండు పాదాలతోనూ భూమ్యాకాశాలను ఆక్రమించుకున్నాడు. మూడో అడుగు ఎక్కడ మోపాలో చోటు చూపించమని బలి చక్రవర్తిని అడిగాడు. అప్పుడు బలి చక్రవర్తి త్రివిక్రముడి పాదాల ముందు శిరసు వంచి, తన తల మీదనే మూడో అడుగు మోపమన్నాడు. వెంటనే బలి తలపై వామనుడు తన పాదాన్ని మోపి, అతణ్ణి పాతాళానికి అణగదొక్కాడు. ఇది కార్తీక శుక్ల పాడ్యమి నాడు జరిగింది. విష్ణువు ఇచ్చిన వరం మేరకు ఈ రోజున బలి చక్రవర్తి భూమ్మీదకు వస్తాడని పలువురు నమ్ముతారు. అందువల్ల కొన్ని ప్రాంతాల్లో బలి చక్రవర్తి గౌరవార్థం వివిధ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు జరుపుతారు. జమ్ము, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో బలి పాడ్యమిని విశేషంగా జరుపుకొంటారు.యమ ద్వితీయ: దీపావళి తర్వాత వచ్చే కార్తీక శుక్ల విదియ రోజును యమ ద్వితీయగా పాటిస్తారు. ఈ రోజున యముడిని, చిత్రగుప్తుడిని పూజిస్తారు. ఈ రోజున యముడికి ఆయన సోదరి యమున ఇంటికి పిలిచి, భోజనం పెట్టిందని, ఎన్ని పనులు ఉన్నా ఏడాదికి ఒకసారి ఇలా తన ఇంటికి వచ్చి తన ఆతిథ్యం స్వీకరించాలని యమున కోరిన కోరికను యముడు సరేనని వరమిచ్చినట్లు పురాణాల కథనం. అందుకే ఈ రోజును ‘భగినీ హస్తభోజనం’, ‘భాయీ దూజ్’ పేర్లతో జరుపుకొంటారు. ఈ రోజున ఆడపడుచులు తమ సోదరులను ఆహ్వానించి విందు భోజనాలు పెడతారు. యమ ద్వితీయ రోజున సోదరులను ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యమిచ్చే ఆడపడుచులు సౌభాగ్యంతో వర్ధిల్లుతారని, సోదరీమణుల చేతి భోజనం తిన్న సోదరులు దీర్ఘాయుష్మంతులు అవుతారని నమ్మకం.దేశదేశాల దీపావళిదీపావళి పండుగను దాదాపు రెండువేల ఏళ్ల కిందట భారత ఉపఖండం సహా అన్ని దక్షిణాసియా దేశాల్లోనూ జరుపుకొనే వారు. ఇటీవలి కాలంలో ఈ పండుగ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. హిందువులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు ఈ పండుగను జరుపుకొంటారు. ఈ నాలుగు మతాలూ భారత భూభాగంలోనే పుట్టాయి. ఈ నాలుగు మతాల వారు ఎక్కువగా ఉండే దేశాల్లో ఈ పండుగ ఘనంగా జరుగుతుంది. బౌద్ధ మతం తొలిరోజుల్లోనే దక్షిణాసియా ప్రాంతమంతటా విస్తరించింది. ఇరవయ్యో శతాబ్ది నుంచి పాశ్చాత్య దేశాలకు భారతీయుల వలసలు పెరిగాయి.ప్రస్తుతం అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో భారత సంతతివారి సంఖ్య గణనీయంగా పెరిగింది. పలు దేశాల్లో భారత సంతతి ప్రజలు రాజకీయంగా కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. దాదాపు డజను దేశాల్లో దీపావళి అధికారిక సెలవు దినం. ఇంకొన్ని దేశాల్లో దీపావళి అధికారిక సెలవుదినం కాకపోయినా, ఆ దేశాల్లో దీపావళి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. అమెరికాలో దీపావళి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం 2003 నుంచి కొనసాగుతోంది. దీపావళి రోజున అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో ఘనంగా వేడుకలు జరుగుతాయి. నేపాల్, భూటాన్, ఇండోనేసియా, మలేసియా, శ్రీలంక, థాయ్‌లండ్, లావోస్, తైవాన్, కంబోడియా తదితర దేశాల్లో బౌద్ధులు, హిందువులు దీపావళిని తమ తమ సంప్రదాయ పద్ధతుల్లో జరుపుకొంటారు. బౌద్ధారామాల్లోను, హిందూ దేవాలయాల్లోనూ దీపాలు వెలిగించి, ప్రార్థనలు, పూజలు జరుపుతారు. కెనడాలో స్థిరపడిన భారతీయుల్లో హిందువులతో పాటు సిక్కులు కూడా పెద్దసంఖ్యలో ఉంటున్నారు. సిక్కులు దీపావళిని ‘బందీ ఛోడ్ దివస్’– అంటే చెర నుంచి విడుదలైన రోజుగా జరుపుకొంటారు. గురుద్వారాలను దీపాలతో అలంకరించి, బాణసంచా కాల్పులు జరుపుతారు. భారత సంతతి ప్రజలు నివసించే పలు ఇతర దేశాల్లోనూ ఇటీవలి కాలంలో దీపావళి వేడుకలను విశేషంగా జరుపుకొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు వందకోట్ల మందికి పైగా జనాలు దీపావళి వేడుకలను జరుపుకొంటారు. అరుదైన విశేషాలుదీపావళికి సంబంధించి రకరకాల ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. కొన్నింటికి విశేష ప్రాచుర్యం ఉంటే, ఇంకొన్ని చాలా అరుదైనవి. దీపావళికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో కొద్దిమందికే పరిమితమైన ఆచారాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఆచారాలకు సంబంధించి ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. వీటిలో ఉదాహరణకు చెప్పుకోవాలంటే, బిహార్‌లో దీపావళి సందర్భంగా ‘హుక్కా పాతీ’ అనే ఆచారం ఉంది. దీని వెనుక కర్ణుడికి సంబంధించిన కథ ఉంది. మహాభారత కాలంలో కర్ణుడు అంగరాజ్యాన్ని పరిపాలించాడు. ఆనాటి అంగరాజ్యం ఇప్పటి బిహార్, ఝార్ఖండ్‌లలోని అంగ, మిథిలాంచల్, కోసి ప్రాంతాలలో ఉండేది. ఈ ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ ఆచారం కొనసాగుతుండటం విశేషం. ఈ ఆచారం ప్రకారం దీపావళి రోజున మధ్యాహ్నం భోజనాలయ్యాక ఇంటిపెద్ద ‘హుక్కా పాతీ’ని సిద్ధం చేస్తారు. జనప కట్టెలను, గోగునారతో పేనిన తాడును కట్టి, ఎండబెడతారు. సాయంత్రం దీపాలు వెలిగించిన తర్వాత ఇంటిలోని పూజా మందిరాల్లో గాని, ఇంటికి చేరువలోని ఆలయ ప్రాంగణాల్లో గాని వాటిని దహనం చేస్తారు. దీపావళి రోజున కర్ణుడు ఈ ఆచారం పాటించేవాడని ఇక్కడి ప్రజలు చెబుతారు. ‘హుక్కా పాతి’ వలన ఐశ్వర్యాభివృద్ధి, కుటుంబాభివృద్ధి, ఆయురారోగ్యాలు కలుగుతాయని వారు నమ్ముతారు.దీపావళికి ముందు రోజును ఎక్కువమంది ప్రజలు నరక చతుర్దశిగా జరుపుకొంటే, పశ్చిమ బెంగాల్‌లోని కొందరు ప్రజలు మాత్రం దీనిని ‘భూత చతుర్దశి’గా పాటిస్తారు. భూత చతుర్దశి రోజు రాత్రివేళ ఇంటి ముంగిళ్లలో మట్టి ప్రమిదల్లో పద్నాలుగు దీపాలను వెలిగిస్తారు. ఈ పద్నాలుగు దీపాలూ పద్నాలుగు లోకాలలో ఉండే తమ పూర్వీకుల ఆత్మలకు దారి చూపుతాయని, తద్వారా వారు తమ ఇళ్లలోకి దుష్టశక్తులు చొరబడకుండా నిలువరిస్తారని నమ్ముతారు.దీపావళి సందర్భంగా పశ్చిమ భారత ప్రాంతంలో కొందరు కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొంటారు. వ్యాపారులు తమ వ్యాపారాల జమా ఖర్చులకు సంబంధించిన కొత్త ఖాతాలను ప్రారంభిస్తారు. మహారాష్ట్రలో ఈ సందర్భంగా ‘చోప్డా పూజ’ జరుపుతారు. ‘చోప్డా’ అంటే జమా ఖర్చుల పుస్తకం. దీపావళి రోజున వారు కొత్త జమా ఖర్చుల పుస్తకాలను ప్రారంభించి, వాటిని లక్ష్మీనారాయణుల పటాల ముందు పెట్టి శాస్త్రోక్తంగా పూజలు జరుపుతారు. కొందరు ఇప్పటికీ జమా ఖర్చుల పుస్తకాలకు పూజలు చేస్తుంటే, ఆధునికత సంతరించుకున్న యువతరం తమ వ్యాపారాల జమా ఖర్చుల వివరాలను నిక్షిప్తం చేసుకున్న లాప్‌టాప్‌లకు, కంప్యూటర్లకు కూడా ‘చోప్డా పూజ’ జరుపుతూ ఈ ఆచారాన్ని కొనసాగిస్తుండటం విశేషం.మనకు దసరా పాటలు తెలుసు. బడుల్లో చదువుకునే పిల్లలు తమ ఉపాధ్యాయులతో కలసి ఇంటింటికీ వెళ్లి దసరా పాటలు పాడుతూ, వారు ఇచ్చే కానుకలు పుచ్చుకునేవారు. దాదాపు ఇలాంటి ఆచారాన్నే దీపావళి సందర్భంగా ఉత్తరాఖండ్‌లో పాటిస్తారు. ఉత్తరాఖండ్‌లోని కుమావూ ప్రాంతంలో ఇప్పటికీ ఈ ఆచారం మిగిలి ఉంది. దీపావళి రోజున మధ్యాహ్నం వేళ బడుల్లో చదువుకునే పిల్లలు తమ చుట్టు పక్కల ఇళ్ల ముంగిళ్లలో నిలిచి, పాటలు పాడతారు. ఇళ్లలోని వారు పిల్లలకు కానుకగా డబ్బులు, బాణసంచా వస్తువులు, మిఠాయిలు ఇస్తారు. దీపావళి రాత్రివేళ వీరంతా ఆరుబయట కట్టెలతో చలిమంటలు వేసుకుని, ఆట పాటలతో ఆనందంగా గడుపుతారు.దీపావళి రోజున అన్ని ప్రాంతాల వారు విరివిగా మిఠాయిలు, పిండివంటలు దేవతలకు నివేదించి, వాటిని ఆరగిస్తారు. తమిళనాడులో మిఠాయిలు, పిండివంటలతో పాటు ప్రత్యేకంగా దీపావళి లేహ్యాన్ని తయారు చేస్తారు. ఇతర పదార్థాలతో పాటు ఈ లేహ్యాన్ని కూడా దేవతలకు నివేదిస్తారు. దీనిని తమిళులు ‘దీపావళి లేగియం’ అని, ‘దీపావళి మరుందు’ అని అంటారు. దీపావళి రోజున వేకువ జామునే పూజలు జరిపి, ఈ లేహ్యాన్ని నివేదించి, పరగడుపునే ఆరగిస్తారు. ధనియాలు, వాము, జీలకర్ర, మిరియాలు, సొంఠి, నెయ్యి, బెల్లంతో తయారు చేసే ఈ లేహ్యం ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెబుతారు.దీపావళి తర్వాత కార్తీక శుక్ల విదియ రోజున కొందరు గోవర్ధన పూజ నిర్వహిస్తారు. ఈ ఆచారం పాటించే పలు ప్రాంతాల్లో ఆవుపేడతో గోవర్ధన పర్వత ప్రతిమను రూపొందించి, పూజలు జరుపుతారు. ప్రసిద్ధ శ్రీకృష్ణ క్షేత్రమైన బృందావనంలో గోవర్ధన పూజ సందర్భంగా ‘అన్నకూట పూజ’ నిర్వహిస్తారు. అన్నాన్ని పర్వతాకారంలో రాశిగా పోసి పూజిస్తారు. తర్వాత శ్రీకృష్ణుడికి ఛప్పన్న నైవేద్యాలను సమర్పిస్తారు.దీపావళికి ముందు ధనత్రయోదశి నాడు దేశంలో పలుచోట్ల ధన్వంతరి పూజలు, లక్ష్మీపూజలు ఘనంగా జరుగుతాయి. మహారాష్ట్రలో మాత్రం పలుచోట్ల ఈరోజున యమధర్మరాజును పూజిస్తారు. మరాఠీ మహిళలు తమ కుటుంబంలో ఉన్న పురుషులందరి పేరిట చెరొక దీపం చొప్పున వెలిగిస్తారు. ఈ క్రతువును ‘యమ దీపదానం’ అంటారు.మొఘల్ సామ్రాజ్యంలో బాణసంచాకు రాజాదరణ మొదలైంది. బాణసంచా తయారు చేసే నిపుణులను ఔరంగజేబు మినహా మిగిలిన మొఘల్ చక్రవర్తులు, వారి సామంతులు బాగా ఆదరించేవారు. అక్బర్ చక్రవర్తి బాణసంచా కాల్పులను, వాటి తయారీ నిపుణులను బాగా ప్రోత్సహించేవారు. బాణసంచా తయారీ నిపుణులకు భారీ నజరానాలను చెల్లించేవారు.మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు బాణసంచా కాల్పులపై నిషేధం విధించాడు. ఆయన 1667లో విధించిన నిషేధం ఆయన మరణించేంత వరకు కొనసాగింది. మొఘల్ పాలన అంతరించి, బ్రిటిష్ పాలన మొదలైన తర్వాత బాణసంచాకు పునర్వైభవం మొదలైంది. -
మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత
కైకలూరు: మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి (74) సోమవారం కన్నుమూశారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆమె సోమవారం గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. ఏలూరు జిల్లా కలిదిండి మండలం కొండూరు ఆమె స్వగ్రామం. ముదినేపల్లి నియోజకవర్గం నుంచి 1983లో టీడీపీ తరఫున పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ఉద్దండుడిగా పేరొందిన పిన్నమనేని కోటేశ్వరరావుపై పోటీ చేసి ఓటమి చెందారు. తిరిగి ముదినేపల్లి నుంచి 1985లో కోనేరు రంగారావుపై విజయం సాధించారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 19 89లో ప్రాథమిక, ఉన్నత, సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా ఆమెకు అవకాశం కల్పించారు.ఆ సమయంలో పరీక్ష పేపర్ లీక్ అంశం వివాదాస్పదమైంది. యెర్నేని సీతాదేవి మంత్రిగా ఉన్నప్పుడే మొదటిసారి ఇన్స్టెంట్, బెటర్మెంట్ పరీక్షలు ప్రవేశపెట్టారు. 1994లో పిన్నమనేని కోటేశ్వరరావు కుమారుడు వెంకటేశ్వరరావుపై పోటీ చేసి విజయం సాధించారు. 1999, 2004 ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. 2004 తర్వాత జిల్లా ల పునరి్వభజనలో భాగంగా ముదినేపల్లి నియోజకవర్గం రద్దయి.. కైకలూరు నియోజకవర్గంలో కలి సింది.సీతాదేవి టీటీడీ బోర్డు సభ్యురాలుగా పనిచేశారు. 2013లో బీజేపీలో చేరారు. బీజేపీలో మహి ళా మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలిగా బా ధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం విజయ మిల్క్ డెయిరీ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. సీతాదేవి భర్త యెర్నేని నాగేంద్రనాథ్ (చిట్టిబాబు) రైతాంగ సమాఖ్య, కొల్లేరు పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన గతేడాది అనారోగ్యంతో మరణించారు. సీతాదేవి పార్థివదేహాన్ని సొంతూ రు కొండూరుకు తీసుకొచ్చారు.పలువురు నేతలు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులరి్పంచారు. -
శ్రీరాముని దివ్య రూపం.. ఏఐ ఫోటోలు
-
సీతమ్మ శాపాన్ని ఉపసంహరించుకుందేమో! అందుకే అయోధ్య..!
అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అయోధ్య నగరాన్ని అత్యంత ఆధునాతనంగా, శోభాయమానంగా తీర్చిదిద్దిలే ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రయాణానికి అనువుగా ఉండేలా రోడ్డు దగ్గర నుంచి రైల్వేలైన్లు, ఎయిర్పోర్ట్ వంటి ఆధునాత హంగులతో పర్యావరణ హితంగా అయోధ్యని బహు సుందర నగరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ సందర్భంగా అయోధ్య రాజుగా పిలిచే బిమ్లేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా అయోధ్య నగర పునరుద్ధరణ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా సీతా మాత శాపం గురించి మాట్లాడారు. ఏంటా శాపం? ఆయన దశరథమహారాజు వంశానికి చెందిన వాడ? తదితరాల గురించే ఈ కథనం! బిమ్మేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా అయోధ్య రాజకుటుంబానికి వారసుడు. ఆయన్ను అక్కడ ప్రజలు అయోద్య రాజు లేదా రాజా సాహెబ్ అని పిలుస్తుంటారు. ఆయన రామజన్మ భూమి ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. పైగా భూవివాదం కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు తర్వాత ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత ట్రస్ట్ సభ్యుడు కూడా. ఈ సందర్భంగా ప్రతాప్ మిశ్రా మాట్లాడుతూ..సుప్రీం కోర్టు తీర్పు వెలువడినప్పటి నుంచి అయోధ్యలో ఆనంద వాతావరణం నెలకొంది. ఆ తర్వాత తాత్కాలిక ఆలయన్ని నిర్మించారు. గానీ సెలువులప్పుడూ, మంగళవారాలు, ఏ పండగు సమయంలో అయినా నడిచివెళ్లడానికి అనువుగా స్థలం లేదు. అలాగే బస చేసేందుకు సరైన హోటల్ కూడా లేదు. ఇప్పుడు అయోధ్య స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతుండడంతో ఫైవ్ స్టార్ హోటళ్లు ప్రారభించేందుకు ఏకంగా 100కు పైగా దఖాస్తులు వచ్చాయని ఆనందంగా చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ప్రజలు కేవలం దర్శనం కోసమే గాక నగరాన్ని వీక్షించేందుకైనా వస్తారని భావిస్తున్నా అన్నారు. ప్రస్తుతం అయోధ్య దేశంలోనే అత్యుత్తమ పట్టణంగా పేరు పొందుతుందని నమ్మకంగా చెప్పారు. జనవరి 22న జరిగే భవ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికల్లా అయోధ్యలో భారీ పునరుద్ధరణ జరుగుతుంది. ఇప్పటికే కొత్త విమానాశ్రయం ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైల్వేస్లేషన్లకు అత్యాధునిక సౌకర్యాలతో కొత్త రూపాన్ని ఇస్తున్నారు. అందువల్ల ఈ నగరాన్ని కోట్లాదిమంది యాత్రికుల వచ్చేలా అత్యాధునిక సౌకర్యాలతో శోభాయామానంగా ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికర పురాణ కథనాన్ని కూడా పంచుకున్నారు. రామాయాణ ఘటంలో ఓ సన్నివేశాన్ని వివరిస్తూ సీతా మాత గురించి ఓ చాకలి వాడు చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా రాముడు ఆమె నగరం నుంచి బహిష్కరించిన ఘట్టం గురించి మాట్లాడారు. ఆమెను లక్ష్మణుడితో పంపించే అడవిలో వదిలేయడం జరగుతుంది. దీంతో సీత పట్టరాని దుఃఖంతో ఈ అయోధ్యను శపించిందని, అందువల్ల అయోధ్య ఇలా అభివృద్ధికి నోచుకోకుండా అయిపోందని ఇక్కడ ప్రజలంతా గట్టిగా నమ్ముతారు. ఇప్పుడు అయోధ్య సర్వతోముఖాభి వృద్ధిని చూస్తే బహుశా సీత తన శాపం ఉపసంహరించుకుందేమో అని అన్నారు. నా జీవితంలో ఇది చూడలేననుకున్నా! రామజన్మభూమి ఉద్యమంతో ప్రతాప్ మిశ్రాకు మూడు దశాబ్దాల నాటి అనుబంధం ఉంది. 1990లో అయోధ్యలో పోలీసులు జరిపిన కాల్పుల్లో కనీసం 50 మంది కరసేవకులు మరణించారు. అపడు ఆయన చాలామంది కరసేవకులకు తన ప్యాలెస్‌లో ఆశ్రయం కల్పించారు. నా జీవిత కాలంలో ఈ రామ మందిరాన్ని చూడగలనని ఎప్పుడు అనుకోలేదన్నారు. బహుశా నా అదృష్టమో ఏమో గానీ అత్యంత సుందరంగా రూపుదిద్దుకుంటున్న ఈ రామమందిరాన్ని చూసే భాగ్యం నాకు దక్కింది అని అయోద్య కింగ్ ప్రతాప్ మిశ్రా భావోద్వేగంగా మాట్లాడారు. (చదవండి: మనదేశంలో చూడదగ్గ 'బెస్ట్ ఆఫ్‌బీట్' పర్యాటక ప్రదేశాలు! సందర్శిస్తే మైమరచిపోవడం ఖాయం!) -
చేతులే నేస్తాలుగా...
కష్టమంటే ఏంటో తెలియని చిన్నతనం. ఊహ తెలియకముందే పెళ్లి పేరుతో జీవనం. ఆదుకోని అయినవారు. అయినా చేతులున్నాయి కదా! అంటూ కొత్త జీవనం వైపుగా అడుగులు వేసి నేడు అందరితో శభాషని అనిపించుకుంటోంది ఆటోడ్రైవర్ సీతాదేవి. రోడ్లు ఊడ్చే పని నుంచి ఆ ఢిల్లీ రోడ్ల మీదే ఆటో నడుపుతూ, ముగ్గురు పిల్లలను చదివిస్తున్న సీతాదేవి ‘ఎన్నో ఒడిదుడుకుల జీవితం. కానీ, సొంత చేతులనే నమ్ముకున్నాను’ అని చెబుతోంది. ‘‘నేను మా అమ్మనాన్నలకు కొడుకుల కంటే తక్కువేమీ కాదని నిరూపించుకున్నాను. కొన్నేళ్ల క్రితం కష్టం వచ్చిందని పుట్టింటికి వెళితే, ఆదరించలేదు. అలాగని వారి మీద కోపం తెచ్చుకోలేదు. మా అమ్మనాన్నలది బీహార్. అక్కడే ఎనిమిదో తరగతి చదువుతుండగానే పెళ్లి చేశారు. ఆ వయసులో నాకెలాంటి తెలివితేటలు లేవు. నా భర్తతో కలిసి ఢిల్లీ వెళ్లిపోయాను. కానీ, ఆయన ఉద్యోగం గుజరాత్లో. పెళ్లయ్యాక ఐదేళ్లయినా పిల్లలు పుట్టలేదని అత్తింటిలో వేధింపులు. నన్ను వదిలేయమని నా భర్తతో బంధువులంతా చెప్పారు. ఆ యేడాదే గర్భవతిని అని తెలియడంతో నా పట్ల మా అత్తింటివాళ్ల ప్రవర్తనలో మార్పు వచ్చింది. కానీ, నా భర్త ఉద్యోగం పోవడంతో కుటుంబపరిస్థితి పూర్తిగా క్షీణించింది. అప్పుల్లో కూరుకుపోయారు. ఎనిమిది నెలల గర్భవతిని. పూట గడవని పరిస్థితి. ఉన్న వస్తువులన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది. పుట్టింటికి వెళితే గడపతొక్కనివ్వలేదు. తిరిగి ఢిల్లీ వెళ్లిపోయాను. తినడానికి ఏమీ లేని పరిస్థితి. మూడు రోజులు మంచినీళ్లు తాగి పడుకున్నాను. తెలిసినవారి ద్వారా రోడ్లు ఊడ్చే పని దొరికింది. దీంతో మరో చిన్న ఇంటికి మారిపోయాం. పురిటిబిడ్డను తీసుకునే పనికి వెళ్లేదాన్ని. ఆ సమయంలో మా అన్న రావడంతో కొద్దిగా వస్తువులు కొన్నాను. వచ్చే కొద్దిపాటి ఆదాయంతో పిల్లలకు పూట గడుస్తుంది కానీ, మున్ముందు రోజులెలా గడవాలా... అని ఆలోచించేదాన్ని. నాలుగు ఇళ్లలో వంటపని చేయడం ప్రారంభించాను. ఆదాయం బాగానే ఉండటంతో స్వీపర్ పని వదిలేశాను. ► పగలు వంటలు నాకు వండడం తెలుసు. కానీ, వెరైటీ వంటలు చేయడం రాదు. వంటల పుస్తకాలు కొని, చదివి వెరైటీ వంటలు నేర్చుకొని, ఇళ్లలో చేయడం మొదలుపెట్టాను. అలా నెలకు 10 నుంచి 12 వేల రూపాయల వరకు వచ్చేవి. ఈ సంపాదనతో నా ముగ్గురు పిల్లల పోషణ బాగానే చూసుకోగలిగాను. ► రాత్రిళ్లు ప్లాస్టిక్ సంచులు ప్రయత్నం లేకుండా మన తలరాతలో ఏది రాస్తే అది జరుగుతుందనుకోవడం తప్పు. పగలు వంటలతో పాటు రాత్రి ఇంటి వద్దే ప్లాస్టిక్ బ్యాగులు కుట్టేదాన్ని. పదకొండువందల రూపాయలతో పాత మెషిన్ కొని, బ్యాగులు కుట్టేదాన్ని. మెటీరియల్ ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చి, వేరేవాళ్లకు కూడా పని ఇవ్వడం మొదలుపెట్టాను. అలా పదివేల ప్టాస్టిక్ సంచులు కుట్టించి ఇస్తే, సంచికి ఇరవై ఐదు పైసలు వచ్చేవి. ఈ సంపాదనతో బీహార్‌లో ఇల్లు కట్టుకున్నాను. ► బిజీ బిజీ చేతుల నిండా పనులు. నా రోజులు డబ్బుతో నిండిపోవడం మొదలయ్యాయి. వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకున్న అత్తమామల రుణం తీర్చేశాం. మా అమ్మనాన్నల లక్షన్నర అప్పు కూడా తీర్చి కొడుకుల కంటే నేనేమీ తక్కువ కాదని నిరూపించుకున్నాను. నాకు ముగ్గురు కొడుకులున్నారు. ఇద్దరు కాలేజీలో, ఒకరు పదోతరగతి చదువుతున్నారు. నా సంపాదనతోనే పిల్లలను చదివిస్తున్నాను. ► డ్రైవింగ్‌లో శిక్షణ దాదాపు పదేళ్ల క్రితం గృహహింసపై మా ప్రాంతంలో అవగాహనా కార్యక్రమం జరుగుతోంది. అప్పుడు ఓ లాయర్ మాట్లాడుతూ ‘‘మహిళలు గృహహింసను ఎందుకు అనుభవించాలి, భర్తపై ఆధారపడకుండా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడగలరు అని వివరించారు. ఆ సమయంలోనే అమ్మాయిలు డ్రైవింగ్‌లో శిక్షణ తీసుకోవచ్చు అని చెప్పారు. దీంతో ఆ ఫౌండేషన్ వాళ్లు ఇచ్చిన ఆరు నెలల డ్రైవింగ్ శిక్షణ తీసుకున్నాను. అదే సంవత్సరం నేను ప్రొఫెషనల్‌గా డ్రైవింగ్ ప్రారంభించాను. అయితే, పిల్లల్ని చూసుకోవడం ఇబ్బందిగా ఉందని కొంతకాలం తర్వాత డ్రైవింగ్ మానేశాను. ఎనిమిదేళ్ల తర్వాత ఈ–ఆటో నడిపే అవకాశం వచ్చింది. కల్కాజీ మెట్రోలో ఈ–ఆటో ప్రారంభించినప్పుడు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాను. ఇప్పుడు నెలకు 15 వేల రూపాయలు వస్తాయి. ఉదయం 10 గంటలకు ఈ–ఆటోతో మెట్రో పార్కింగ్ నుంచి బయల్దేరుతాను. సాయంత్రం 5 వరకు నడుపుతున్నాను. పని చిన్నదనీ, పెద్దదనీ అనుకోవద్దు. అలాగే, మన చుట్టూ ఉన్న జనం ఏం మాట్లాడుతారో కూడా పట్టించుకోవద్దు. పూర్తి విశ్వాసంతో పని చేస్తే చాలు. కొంతమందికి మనం నచ్చకపోవచ్చు. అందుకు చింతిస్తూ కూర్చోకుండా, పనిని చేస్తూనే ఉండాలి. ఒకరోజున విజయం కచ్చితంగా వస్తుంది’అని చెబుతున్న సీతాదేవి కృషి ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిదాయకమని చెప్పాలి. పని చిన్నదనీ, పెద్దదనీ అనుకోవద్దు. అలాగే, మన చుట్టూ ఉన్న జనం ఏం మాట్లాడుతారో కూడా పట్టించుకోవద్దు. పూర్తి విశ్వాసంతో పని చేస్తే చాలు. ఒకరోజున విజయం కచ్చితంగా వస్తుంది. – సీతాదేవి -
అయోధ్య విగ్రహాల కోసం.. సాలిగ్రామ శిలలతోనే ఎందుకంటే..
లక్నో: ఉత్తర ప్రదేశ్ అయోధ్య రామాలయం కోసం భారీ రాతి శిలలు.. గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకున్నాయి. ఆదివారం నేపాల్ నుంచి బయల్దేరిన ట్రక్కు.. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఇవాళ(గురువారం ఫిబ్రవరి 2) అయోధ్యలో అడుగుపెట్టింది. పూజారులు, స్థానికులు దండలేసి.. ఆ పవిత్రమైన రాళ్లను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అప్పజెప్పారు. వాటిని రామ్ సేవక్ పురంలో భద్రపరిచారు ట్రస్ట్ నిర్వాహకులు. మరి వీటికి ఎందుకంత ప్రత్యేకతో చూద్దాం.. ప్రధాన ఆలయంలోని శ్రీరామ, జానకీ విగ్రహాలను చెక్కేందుకు వీటిని ఉపయోగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెండు రాళ్లలో ఒకటి 30 టన్నులు, మరొకటి 15 టన్నుల వరకు బరువు ఉంటాయని శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్టు జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు. నేపాల్‌లోని మయాగ్డి-ముస్తాంగ్ జిల్లాల గుండా ప్రవహించే కలి గండకి నది ఒడ్డున ఉన్న జలపాతం చెంత నుంచి ఈ రెండు భారీ శిలలను తెప్పించారు. అంతకు ముందు సీత జన్మస్థలంగా భావించే జనక్‌పూర్(నేపాల్)లో వీటికి ప్రత్యేక పూజలు జరిగాయి కూడా. శాలిగ్రాముల ప్రత్యేకత ఏంటంటే.. సాలిగ్రామ (శాలిగ్రామ).. సాలిగ్రామ శిలలని కూడా పిలుస్తారు. నేపాల్ గంకీ రాష్ట్రంలో.. దామోదర్ కుండ్ నుంచి గండకీ నది ఉద్భవిస్తుంది. గండకీ నదికి ఉపనది అయిన కలి గండకీ ప్రవాహ తీరంలోనే ఇవి కనిపిస్తాయి. ఆ ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 6వేల ఫీట్ల ఎత్తులో ఉంటుంది. ఈ శిలలను విష్ణు మూర్తికి ప్రతీకలుగా భావిస్తారు. వాస్తవానికి.. ఇవి డెవోనియన్-క్రెటేషియస్ కాలానికి చెందిన అమ్మోనైట్ షెల్ శిలాజాలు. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఇవి ఇక్కడ ఉంటున్నాయి. హిందువులు ఈ శిలాజాలను పవిత్రమైనవిగా గౌరవిస్తారు. ఎందుకంటే.. మధ్వాచార్య, అస్తమూర్తి(వ్యాసదేవ) నుండి అందుకున్నాడని, అందుకు వాటిపై ఉండే విష్ణు చిహ్నాలు, ముఖ్యంగా శంఖాన్ని పోలి ఉండడమే కారణమని భావిస్తారు. అదీ కాకుండా.. జానకీ మాత జన్మించిన నేల కావడంతో ఈ శిలలకు ప్రత్యేకత సంతరించుకుంది. అక్కడ ఉన్న శిలలకు కోట్లాది ఏళ్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఆ విగ్రహాలు కూడా.. ఉడుపి కృష్ణ మఠంలో కృష్ణ విగ్రహం, బృందావనంలోని రాధా రామన్ ఆలయం, తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయంలోని విష్ణుమూర్తి విగ్రహం, గర్వాల్లోని బద్రినాథ్ ఆలయంలోని విగ్రహాలు సాలిగ్రామ్ శిలలతోనే తయారు చేసినట్లు తెలుస్తోంది. దేవీ భాగవతా పురాణా, బ్రహ్మవైవర్థ పురాణా, శివ పురాణాలలో సాలిగ్రామ శిలల ప్రస్తావన కూడా ఉంది. కొన్ని నివేదికల ప్రకారం.. ఆదిశంకర రచనలలోనూ.. సాలిగ్రామ(శాలిగ్రామ) శిలల గురించి ప్రత్యేక ప్రస్తావన ఉంది. తైత్తిరీయ ఉపనిషత్తులోని 1.6.1వ శ్లోకం, బ్రహ్మ సూత్రాలలోని 1.3.14 శ్లోకాలకు ఆదిశంకర తన విష్ణువు ఆరాధనలో శిల ఉపయోగించడం సుప్రసిద్ధ హిందూ ఆచారంగా ఉండేదని ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఇవేకాదు.. చాలాచోట్ల సాలిగ్రామ శిలలు కొన్ని నకిలీవి వాడుకలో ఉండడం గమనార్హం. -
మర్యాద సీతమ్మ.. టీవీలో నిర్మాతగా తొలి మహిళ
ప్రధానమంత్రి పదవికి అనుభవం ఏమిటని అడుగుతారా? నాకు చిన్న అవకాశం ఇవ్వడానికి ఈ ప్రశ్న ఎందుకు వస్తోంది? ‘అవకాశం ఇచ్చి చూడండి... సర్వీస్ నచ్చకపోతే రద్దు చేయండి’ సహనం హద్దు శిఖర స్థాయిని చేరిన క్షణంలో వచ్చిన మాటలవి. ఈ రోజు బ్యూటీ ఇండస్ట్రీకి ఆమె ఒక మార్గదర్శనం. ‘టీవీలో నిర్మాతగా తొలి మహిళ’’ అనే మకుటం ఆమె తొలి విజయం. ఈ రెండు విజయాల మధ్య ఓ విషమ పరీక్ష... అదే ఆమెను ధీరగా నిలిపింది. దూరదర్శన్ తొలి మహిళా ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ సీతాదేవి పరిచయం. ‘మర్యాద రామన్న’ ఈ తీర్పరి పేరు తెలుగు బాల్యానికి చిరపరిచితం. ఈ న్యాయనిర్ణేత గురించి వింటూ పెరిగిన బాల్యానికి ఒక కనువిందు దూరదర్శన్‌లో ప్రసారమైన మర్యాదరామన్న సీరియల్. ఈ జానపద కథాస్రవంతికి దృశ్యరూపం ఇచ్చిన నిర్మాత సీతాదేవి. టెలివిజన్ రంగం తప్పటడుగులు వేస్తున్న రోజుల్లో ఆ రంగాన్ని చేయి పట్టుకుని నడిపించిన అనేకమంది ఉద్దండుల మధ్య ఒక లలితసుమం ఆమె. సీరియల్ నటీనటులు, సంగీత దర్శకులు, దర్శకుల టైటిల్ కార్డుల్లో ‘నిర్మాత: సీత’ రెండక్షరాల పేరు ఆమె. ఆ తర్వాత ఆమె పేరు ముందు మర్యాద రామన్న అనే గౌరవం చేరింది. టెలివిజన్ రంగంలో ఆమె గుర్తింపు ‘మర్యాద రామన్న సీతాదేవి’గా స్థిరపడిపోయింది. తెర నిండుగా వినోదం తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట ఆమె సొంతూరు. నాన్న కోదండ రామయ్య డాక్టర్. తల్లి విజయరాజేశ్వరి గృహిణి. ‘‘మా అమ్మ స్ట్రాంగ్ ఉమన్. నాకు రోల్ మోడల్’’ అన్నారు సీతాదేవి. హైదరాబాద్, వనిత కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత కెరీర్ గురించి సృజనాత్మకమైన ఆలోచనలు చిగురించాయామెలో. అప్పటి వరకు ముందు గదిలో శ్రవణానందం చేసిన రేడియోలు... ముందు గదిని టీవీలకు ఇచ్చి, తాము వెనుక గదులతో రాజీ పడుతున్న రోజులవి. దూరదర్శన్ అంటే పందుల పెంపకం అనే చమత్కారం చిరుదరహాసంగా స్థిరపడుతున్న రోజుల్లో ఓ ప్రయోగం మర్యాదరామన్న సీరియల్. ఆనందోబ్రహ్మ హాయిగా నవ్వించి హాస్యాన్ని కురిపిస్తుంటే, మర్యాద రామన్న ఆలోచింప చేస్తూ అలరించింది. సీతాదేవి ఆ రోజులను గుర్తు చేసుకుంటూ... ‘‘ఆ సీరియల్‌కి స్క్రిప్ట్ ఓకే చేయించుకోవడం ఒక ఘట్టం అయితే, చిత్రీకరించడం మరో ఘట్టం. జానపద కథకు కాస్ట్యూమ్స్ తయారీ పెద్ద సవాల్. సొంతంగా కుట్టించడానికి మా బడ్జెట్ సరిపోదు. సురభి వాళ్ల దగ్గర ప్రయత్నించాను. కెమెరా కంటికి సంతృప్తినివ్వవు అనిపించింది. సింహాసనం సినిమా గుర్తు వచ్చింది. ఆ రాజదర్బారు సెట్టింగ్‌లు, దుస్తులు ఉపయోగించుకోవడానికి అనుమతి తీసుకున్నాను. దాంతో మర్యాద రామన్నలో ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్‌గా వచ్చింది. పట్టును తలపించే జరీ అంచు దుస్తులు, నవరత్న ఖచిత మణిమయ మకుటాలను తలపించే ఆభరణాలు, లైటింగ్‌తో మెరుపులీనుతూ వీక్షకులను టీవీకి కట్టిపడేశాయి. ఇక కథలోని నీతి, మేధోపరమైన తార్కికత పిల్లలను ఆకట్టుకుంది. రెండు వందలకు పైగా ఆర్టిస్టులతో ఐదారు నెలల్లో సీరియల్ చిత్రీకరణ పూర్తి చేశాం. ఇది 1989–90ల నాటి మాట. ఆ తర్వాత ‘ఆణి ముత్యాలు’ శీర్షికన గురజాడ, పురాణం సుబ్రహ్మణ్య శర్మ వంటి మంచి కథకుల కథలకు దృశ్యరూపం ఇచ్చాం. సజావుగా సాగిపోతున్న తరుణంలో ఒక అవాంతరం రాజాజీ గారి మనుమడి నుంచి వచ్చింది. కాపీ రైట్ పోరు ప్రముఖ జాతీయ నాయకులు సి.రాజాజీ గారి కథల ఆధారంగా హిందీలో ‘కన్యాకుమారీ కీ కహానియా’ తీశాం. ఆ కథలు దక్షిణాది రాష్ట్రాల్లోని ఆర్ధోడాక్స్ కుటుంబాల జీవితాలకు దర్పణం అన్నమాట. రాజాజీ తన కథల కాపీరైట్ భారతీయ విద్యాభవన్కి వచ్చారు. మేము ముంబయికి వెళ్లి ఆ సంస్థ నుంచి అధికారికంగా రైట్స్ తీసుకున్నాం. దూరదర్శన్ ప్రయోగాత్మకంగా మొదట ఆరు కథలకే అనుమతి ఇచ్చింది, ఆ ఆరు కథలను చిత్రీకరించాం. అవి టెలికాస్ట్ కావడానికి అంతా సిద్ధమైన తర్వాత డెక్కన్ క్రానికల్‌లో ఒక వార్త. నిర్మాత, దూరదర్శన్ కుమ్మక్కై కాపీ రైట్స్ ఉల్లంఘించి కథలను వాడుకున్నారనేది ఆరోపణ. మా తప్పు లేదని రెండేళ్ల పాటు కోర్టులో పోరాడి పోరాడి, చివరికి కోఠీలో కాపీ రైట్ పుస్తకాలు తెచ్చుకుని చదివి, కాపీ రైట్ బోర్డును సమాధాన పరిచి ఆ ఆరు కథలను ప్రసారం చేయగలిగాం. నేను ఏ సవాల్‌నైనా స్వీకరించగలననేంతటి ఆత్మవిశ్వాసం నాలో ఉండేది. ఆ టైమ్‌లో ఆరోగ్యం కొత్త సవాల్ విసిరింది. అనారోగ్యంతో పోరాటం మామూలు జ్వరం రూపంలో మొదలైన అనారోగ్యానికి మూలం తలలో ఉందని తెలియడానికి ఆరు నెలలు పట్టింది. దాదాపుగా ఇరవై ఏళ్ల కిందట... మల్టిపుల్ స్లె్కరోసిస్ పట్ల పెద్దగా అవగాహన కూడా లేదు. అది నరాల సమస్య. ఆకలి లేదు, తిన్నది కడుపులో ఇమడదు. కంటిచూపు దాదాపుగా పోయింది, నడక పట్టు తప్పింది. అంత తీవ్రమైన అనారోగ్యం బారిన పడ్డాను. ఆ సవాల్‌ని కూడా మనోధైర్యంతో ఎదుర్కొన్నాను. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత నన్ను నేను ఏదో ఒక వ్యాపకం లో బిజీగా ఉంచుకోకపోతే మానసికంగా ఆరోగ్యవంతం కాలేననిపించింది. పని మీద బయటకు వెళ్తేనే మంచిగా తయారవుతాం. బయటకు వెళ్లాల్సిన పని లేకపోతే బద్దకంగా గడిపేస్తాం. ఇలా ఉండకూడదని మళ్లీ పనిలో పడ్డాను. సీరియల్ చిత్రీకరణ వంటి ప్రెషర్ పెట్టుకోవద్దని చెప్పారు డాక్టర్లు. బ్యూటీ ఇండస్ట్రీ అయితే అలవోకగా నడిపేయవచ్చనే ఉద్దేశంతో పింక్స్ అండ్ బ్లూస్ పేరుతో ఈ రంగంలో అడుగుపెట్టాను. అవకాశం కోసం జూబ్లీహిల్స్ క్లబ్లో బ్యూటీ సెలూన్ కోసం అడిగినప్పుడు చాలా రోజులు ఇవ్వలేదు. ‘మీకున్న అనుభవం ఏంటన్నారు, కోర్సు చేశారా’ అన్నారు. ‘కోర్సు చేసిన నిపుణులను ఉద్యోగులుగా నియమించుకుంటాను’ అని చెప్పాను. అయినా ఇవ్వలేదు. ఇక విసిగిపోయి ‘ప్రధానమంత్రి పదవికి అనుభవం అడుగుతున్నారా’ అని అడగడంతో నాకు అవకాశం ఇచ్చారు. అలా 2005 క్రిస్టమస్ రోజు మొదలైన పార్లర్ ఇప్పుడు నలభై బ్రాంచ్‌లకు విస్తరించింది. ఫ్రాంచైజీలు ఇచ్చే స్థాయికి చేరింది. ఇప్పుడు అంతర్జాతీయంగా విస్తరణ గురించి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాను’’ అని చిరునవ్వు నవ్వారు సీతాదేవి. బహుశా ఆ నవ్వులో నిండిన మెండైన ఆత్మవిశ్వాసమే ఆమెను విజేతగా నిలిపినట్లుంది. నేను విజేతనే ‘కన్యాకుమారీ కీ కహానియా’ కథాస్రవంతిలో మిగిలిన కథల చిత్రీకరణకు నేను సిద్ధంగా ఉన్నప్పటికీ దూరదర్శన్ సిద్ధంగా లేకపోవడంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది. ఫ్లాప్‌తో ఆగిపోవడం నాకు నచ్చదు. అందుకే ‘ఆంధ్రరత్నాలు’ పేరుతో తెలుగు ప్రముఖుల జీవితాలను చిత్రీకరించాను. ఇరవై ఏళ్ల ప్రయాణంలో డబ్బు పెద్దగా సంపాదించలేదు, కానీ మంచి ప్రయత్నం చేశాననే సంతృప్తి కలిగింది. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కథకు పార్లమెంట్లో ప్రశంసలు వచ్చాయి. రాజాజీ కథలను అప్పటి రాష్ట్రపతి ఆర్. వెంకటరామన్ మెచ్చుకుని, ఆ వీడియోలు తెప్పించుకున్నారు. ఆ సందర్భంగా మా టీమ్‌ని రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానించారు. – పి. సీతాదేవి, ఫౌండర్, ఐశ్వర్య ఫిలింస్, పీఎన్బీ సెలూన్స్ – వాకా మంజులారెడ్డి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
రాములోరి కల్యాణం.. తరలివచ్చిన శివపార్వతులు, జోగినిలు(ఫొటోలు)
-
నవరసాల నటి సీతాదేవి కన్నుమూత
ప్రముఖ సీనియర్ నటి, దివంగత విలక్షణ నటుడు నాగభూషణం సతీమణి పొట్నూరి సీతాదేవి (87) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం ఉదయం తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1933 అక్టోబర్ 14న కాకినాడలో రామస్వామి దంపతులకు జన్మించారు సీతాదేవి. సమీప బంధువు నీలాబాయి భర్త రాజా శాండో ఫిల్మ్ మేకర్ కావడంతో సీతని కాకినాడ నుంచి మదరాసుకు దత్తపుత్రికగా తీసుకెళ్లారు. బాల్యం నుంచే నృత్యాలపట్ల మక్కువ పెంచుకుని అభ్యాసన మొదలెట్టారామె. 1947లో కేవీ రెడ్డి దర్శకత్వం వహించిన ‘యోగి వేమన’లో బాలనటిగా కనిపించారు సీత. కేవీ రెడ్డి రూపొందించిన ‘మాయాబజార్, గుణసుందరి కథ, పెళ్లినాటి ప్రమాణాలు, పెద్దమనుషులు’ తదితర చిత్రాల్లో హాస్యపాత్రలు, చెలికత్తె పాత్రలు చేశారామె. కేవలం హాస్యమే కాకుండా తనలోని నటిని అన్ని రసాల్లో ఆవిష్కరించారు సీత. 1940 నుండి ప్రారంభమైన ఆమె సినీ ప్రస్థానం 2002లో ‘నేనేరా పోలీస్’ వరకూ సాగింది. దాదాపు 250 చిత్రాల్లో నటించారామె. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే నటుడు నాగభూషణంతో కలిసి ‘రక్తకన్నీరు, పాపం పండింది, ఇనుప తెరలు, అందరూ బతకాలి’ లాంటి నాటకాలు దాదాపు 2వేల ప్రదర్శనలిచ్చారు. ‘లవంగి, జయసింహ, పల్లెటూరిపిల్ల, గుణసుందరి కథ, స్వర్ణసుందరి, స్వప్నసుందరి, పరమానందయ్య శిష్యులు, పల్నాటియుద్ధం, పంతులమ్మ, నలదమయంతి, గృహప్రవేశం, సతీతులసి, అత్తా ఒకింటి కోడలే, ఋష్యశృంగ, సత్యహరిశ్చంద్ర, సంతోషిమాత వ్రతం, దేవదాసు, మాయాబజార్’ వంటి గొప్ప చిత్రాల్లో నటించి తన ప్రతిభ చాటారు సీత. ‘ఋతురాగాలు’ టీవీ సీరియల్లో నటించారు. ఆ తర్వాత పలు సీరియల్స్‌లో నటించి బుల్లితెరపైనా మంచి పేరు తెచ్చుకున్నారు. ‘రక్తకన్నీరు’ నాటకం అనేక ప్రాంతాల్లో తిరిగి ప్రదర్శించే సమయంలో నటుడు నాగభూషణాన్ని 1956లో వివాహం చేసుకున్నారు సీత. పెళ్లయ్యాక దాదాపు కుటుంబానికే పరిమితమయ్యారు. హిందీలో రూపొందించిన ‘అల్బేలా’ చిత్రాన్ని నాగభూషణం తెలుగులో ‘నాటకాల రాయుడు’గా రూపొందించారు. ఆ చిత్రంలో ఆయన వదిన పాత్రలో విషాద ఛాయలు పలికిస్తూ సీత చేసిన నటన అందర్నీ కదిలించింది. ఓ హాస్యనటి జీవితంలో ఓ విలక్షణమైన పాత్రగా అందరూ అభివర్ణించారు. నాగభూషణం, సీతాదేవి దంపతులకు కూతురు భువనేశ్వరి, కొడుకు సురేందర్ ఉన్నారు. వారికి పెళ్లిళ్లు అయ్యాక తనకు వీలు కుదిరినప్పుడల్లా సినిమాల్లో నటించేవారు ఆమె. సినిమా పరిశ్రమలో ఉన్న అనేకమందితో పాటు బంధువుల కష్టాలను విని గుప్తదానాలు ఎన్నో చేశారు సీత. రేలంగితో అనేక హాస్య పాత్రల్లో నటించిన సీతకు ‘యువ కళావాహిని’ సంస్థ వారు రేలంగి పురస్కారం ప్రదానం చేశారు. మంచి నటిగా పేరు తెచ్చుకున్న ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. హైదరాబాద్‌లోని మహా ప్రస్థానంలో సోమవారం ఆమె అంత్యక్రియలు ముగిశాయి. ‘మాయాబజార్’ చిత్రంలో సావిత్రితో... నా తొలినాళ్ల గురువు సీతాదేవి నేను అప్పుడప్పుడే డ్యా¯Œ ్స నేర్చుకుంటున్నాను. ‘రక్తకన్నీరు’ నాటకంలో నటించడానికి ఓ మంచి నటి కావాలని మామ సత్యం అనే మా ఇంటిపక్కనున్న ఓ టెక్నీషియన్ మా అమ్మను, నన్ను నాగభూషణంగారి ఇంటికి తీసుకువెళ్లారు. అప్పుడే సీతగారు నన్ను తొలిసారి చూశారు. నువ్వేమీ భయపడకు, స్టేజీపై మేము ఉంటాం కదా! చక్కగా నటించాలి అని ప్రోత్సహించారు. అలాగే ‘ఎక్కువకాలం మా గ్రూపులో ఉండవు.. పెద్ద హీరోయి¯Œ అయిపోతావు’ అని చెప్పారామె. నా కెరీర్ తొలినాళ్లలో దొరికిన ఓ అద్భుతమైన గురువు ఆమె. – వాణిశ్రీ, నటి -
లండన్ నుంచి తిరిగొస్తున్న రాములోరు
లండన్ : 15వ శతాబ్ధం నాటి సీతారాముల వారి విగ్రహాలను లండన్ నుంచి తిరిగి తెప్పించడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 1978లో తమిళనాడులోని విజయనగర కాలంలో నిర్మించిన ఆలయం నాటి విగ్రహాలు అపహరణకు గురైన సంగతి తెలిసిందే. ఇవి ప్రస్తుతం లండన్‌లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో 2019 ఆగస్టులో లండన్‌లోని భారత హైకమిషన్ ఇండియా ప్రైడ్ ప్రాజెక్ట్ ద్వారా ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. అంతేకాకుండా దొంగతనానికి గురైన రామలక్షణులు, సీత, హనుమంతుని విగ్రహాలకు సంబంధించిన ఫోటో ఆర్కైవ్లను నిపుణుల మందుంచారు. ఇవి ప్రస్తుతం లండన్‌లో ఉన్నవేనని దృవీకరిస్తూ సమగ్ర నివేదికను పంపారు. (ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటాం: రాజ్‌నాథ్) భారత సాంస్కృతిక వారసత్వానికి గుర్తుగా ఉన్న ఈ విగ్రహాలను భారత్‌కు తిరిగి పంపాల్సిందిగా కోరారు. ఈ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన యూకే ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. అయితే ఈ విగ్రహాలను కొన్నవ్యక్తి ప్రస్తుతం జీవించిలేరు. అంతేకాకుండా వీటికి చట్టబద్దమైన ఆధారాలు ఏమీ లేనందున ఈ విగ్రహాలను తిరిగి భారత్‌కు అందించడానికి హైకమిషన్ సముఖత వ్యక్తం చేసింది. త్వరలోనే వీటిని తమిళనాడుకు బదిలీచేయనున్నారు. గతంలోనూ రాణి-కి వావ్, బుద్ధుడి కాంస్య విగ్రహం, 17వ శతాబ్ధపు కృష్ణుడి విగ్రహం సహా పలు భారత సంపదను తిరిగి స్వదేశానికి చేర్చడంలో హెచ్‌సిఐ ముఖ్యపాత్ర పోషించింది. రాబోయే రోజుల్లో, ఎఎస్ఐ, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, స్వతంత్ర దర్యప్తు సంస్థల భాగస్వామ్యంతో ముందుకు వెళ్తామని హెచ్‌సిఐ ఓ ప్రకటన విడుదల చేసింది. (చైనాపై దూకుడు కూడా సానుకూలాంశమే) -
చోటా కె నాయుడి ‘లవ్ స్టోరీ’
చోటా కె నాయుడి పేరులో ‘చోటా’ అని ఉండొచ్చు. సినిమాటోగ్రాఫర్‌గా ఆయన కెరీర్లో ఉన్నవన్నీ పెద్దవే! పెద్ద సినిమాలు.. పెద్ద హీరోలు.. పెద్ద పెద్ద దర్శకులు. అతడి వెనుక కూడా ఓ పెద్ద శక్తి ఉంది. సీతాదేవి! ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ముప్పై ఏళ్లయింది పెళ్లయి. లవ్లీగా, ప్రశాంతంగా ఉన్నారు. ‘క్రెడిట్ గోస్ టు మై వైఫ్ సీతాదేవి’ అంటాడు. అందుకే అతడు.. చోటా కె కాదు.. సీతా కె నాయుడు. ఆమె.. వైఫ్ మాత్రమే కాదు.. అతడి లైఫ్ కూడా. ►30 ఏళ్లకు పైగా మ్యారీడ్ లైఫ్ మీది. ఇద్దరూ చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. సీక్రెట్? చోటా: మగవాడి డామినేషన్ ఉన్న ఈ దేశంలో స్త్రీకి సమాన హక్కులు ఉన్నా ఓ ప్లేసులో పెట్టి ఆమెను ఆపేశారు. అయితే మగవాడి డామినేషన్ ఉన్నప్పటికీ భార్య సపోర్ట్ లేకుంటే ఫ్యామిలీ కరెక్ట్‌గా ఉండదు. అది మగవాళ్లు అర్థం చేసుకోవాలి. నువ్వు ఎక్కువా నేను ఎక్కువా... లాంటివి ఉండకూడదు. అలాగే భార్యకి స్పోర్టివ్‌నెస్, ఓపిక, శక్తి లేకపోతే ఆ ఫ్యామిలీ కంటిన్యూ కాదు. మా సంసారం సాఫీగా ఉందంటే ‘దట్ క్రెడిట్ గోస్ టు మై వైఫ్ సీతాదేవి’. వైవాహిక జీవితం బాగుండాలంటే భార్యాభర్తలిద్దరూ కడదాకా ఒకేమాట మీద ఉండాలి. ►ఇంతకీ మీ ఇద్దరికీ ఎలా పరిచయం? చోటా: నేను చెన్నైలో మా గురువు దాసరిగారి సినిమాలకు కెమెరా అసిస్టెంట్‌గా చేశాను. ఇక కెమెరామేన్ అయిపోదాం అనుకుని ఉన్న పని మానేశాను. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసం వేరే కెమెరామేన్ దగ్గర ఓ సంవత్సరం పని చేస్తే కెమెరామేన్ అయిపోవచ్చు అనుకున్నాను. ఆ టైమ్‌లో చాలామంది దర్శకుల దగ్గరికి వెళ్లి అవకాశం అడిగాను. ఎవరూ ఇవ్వలేదు. ఆ డిప్రెషన్లో ఉండగా హైదరాబాద్ నుంచి ఓ టీవీ సీరియల్‌కి కెమెరామేన్ కావాలని ఫోన్ వచ్చింది. ఆ అవకాశం నాకు రాలేదు, భరత్ పారేపల్లి (డైరెక్టర్) అని నా స్నేహితుడికి వచ్చింది. ఇద్దరం బయలుదేరి హైదరాబాద్ వచ్చాం. నాకూ చాన్స్ వచ్చింది. ‘క్రీస్తు జననం’ అనే టెలీఫిల్మ్ చేశాం. దానికి ప్రొడ్యూసర్ సీతాదేవిగారు, సంగీత దర్శకుడు కీరవాణిగారు, సింగర్ మనో. అందరి నోట్లో నుండి ఈమె పేరు వినేవాణ్ని కానీ, ఈమెను చూడలేదు. షూటింగ్ టైమ్‌లో ఏ కారులో నుంచి ఏ అమ్మాయి దిగినా ఆమె సీతాదేవి అనుకునేవాణ్ని. షూటింగ్ అయిపోయింది. మేం చైన్నై వెళ్లిపోయాం. ఆ తర్వాత ‘మర్యాద రామన్న’ సీరియల్ మొదలుపెట్టాలనుకున్నారామె. ఆ యూనిట్లో పని చేసే దుర్గా నాగేశ్వరరావు ఎవరో కెమెరామేన్ను సజెస్ట్ చేశారట. ‘లేదు.. నా టీమ్ నాకుంది’ అని నన్ను పిలిపించారామె. అప్పుడు నేను ఆమెను కలిశాను. అలా ట్రావెల్ చేస్తున్న టైమ్‌లో నేను ప్రపోజ్ చేశాను. ►ఆమె నిర్మాత కదా.. ప్రపోజ్ చేస్తే ఉన్న పని పోతుందేమో అని భయపడలేదా? చోటా: అలాంటి టెన్షన్ ఏమీ లేదు. ప్రతిరోజూ మా షూటింగ్ ప్యాకప్ అవగానే యూనిట్ అంతా ఎస్.ఆర్. నగర్‌లోని సీతాదేవిగారి ఇంటికి వెళ్లి భోజనం చేసి ఎవరి రూమ్‌లకు వాళ్లు వెళ్లాలి. అలా మేం వెళ్లేటప్పుడు తలుపుకు తాళం వేసుకుని లోపలికి వెళ్లిపోయేది. రోజులానే ఆ రోజు కూడా వచ్చి, తాళమేసుకుంది. నేను బయట నిలబడి ‘ఓ సారి మీ చేయి ఇటివ్వండి’ అన్నాను. ‘ఎందుకు’ అని అడుగుతూనే ఇచ్చింది. ఆ చేతిని ముద్దుపెట్టుకుని ‘ఐ లవ్ యూ’ అని పరుగో పరుగు (నవ్వుతూ). తాళం వేసి ఉంది కాబట్టి ఆమె నన్ను కొడదామన్నా కుదరదు కదా,అందుకే అలా చేశా. తర్వాత ఆమె కలిసినప్పుడు ‘ఇదే విషయం ఓ సంవత్సరం తర్వాత కూడా అనిపిస్తే అప్పుడు చెప్పు’ అన్నారు. ఏడాది తర్వాత అదే చెప్పాను. అలా మా లవ్ ట్రావెల్ కంటిన్యూ అయ్యింది. ►మీది ఇంటర్‌క్యాస్ట్ మ్యారేజ్ కదా? చోటా: నా కూతురికి ఇంతవరకు దాని క్యాస్ట్ ఏంటో తెలియదు. సీతాదేవి: చిన్నప్పుడు ఓసారి ఏదో ఫామ్ నింపుతూ ‘ఎస్.సి’ అని ఉన్నచోట టిక్ పెట్టిందట. ఇంటికొచ్చి ఆ విషయం చెప్పింది. అలా ఎందుకు పెట్టావు అంటే ఎస్.సి అంటే మనం ‘సూపర్ క్యాస్ట్’ కదా అంది. సో... మా ఇంట్లో నో క్యాస్ట్. ►బాగుంది.. ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్‌లో ఓ సెక్యూరిటీ.. ఫైనాన్షియల్‌గా ఫుల్ హ్యాపీ. మరి పెళ్లయిన కొత్తలో ఏమైనా కష్టాలు ఫేస్ చేశారా? చోటా: మా పెళ్లయ్యేసరికి ఓ బ్లాక్ అండ్ వైట్ టీవీ, డబుల్ కాట్ బెడ్, ఓ డైనింగ్ టేబుల్, రెండు కేన్ కుర్చీలుండేవి. అప్పట్లో మూడువేల రూపాయల అద్దె ఇంట్లో ఉండేవాళ్లం. అప్పుడు కూడా పనోళ్లు ఉండేవారు. సొంత కారు ఉండేది కాదు కానీ ట్రావెల్స్ నుండి ఎప్పుడూ ఓ కారు అద్దెకు తీసుకునేవాళ్లం. మా లైఫ్‌సై్టల్ అలా ఉండాలనుకునేవాళ్లం కాబట్టి వాటిని ఫుల్‌ఫిల్ చేసుకోవటానికి ఇద్దరం బాగా కష్టపడేవాళ్లం. సీతాదేవి: అప్పుడు మేం బిజీగా ఉండేవాళ్లం. ఇంట్లో పెద్దవాళ్లు ఎవరూ లేకపోవటంతో మా పాప ఐశ్వర్యను హాస్టల్లో పెట్టాం. హాలిడేస్ అప్పుడు ‘ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం’ అని లిస్ట్ తెచ్చేది. కానీ, ఆయన షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని హాలీడేకి రావడానికి కుదిరేది కాదు. నేను నా పని మానుకుని వెళ్లలేను. ఇలా ఎప్పుడూ బిజీగా ఉండేవాళ్లం. ఒకవేళ ఎక్కడికైనా వెళ్లినా తిరుపతి, షిరిడీ, శ్రీశైలం... అంతే కుదిరేది. అప్పుడు నేను మా పాపతో ‘నీకు పెళ్లయిన తర్వాత 24 గంటలూ హాలిడేకి వెళ్లే ఫ్యామిలీ దొరుకుతుంది’ అనేదాన్ని. ఆ దేవుడి దయ వల్ల అలాంటి ఫ్యామిలీయే వచ్చింది. వాళ్లెప్పుడూ టూర్స్లోనే ఉంటారు (నవ్వుతూ). ►సీతగారు... మీ కెరీర్ గురించి చెబుతారా? సీరియల్ ప్రొడ్యూసర్ ఎలా అయ్యారు? సీతాదేవి: నా ఫ్రెండ్‌ని ఇన్స్పిరేషన్గా తీసుకుని దూరదర్శన్‌లో ‘మర్యాదరామన్న’ అనే సీరియల్ చేశాను. సాయికుమార్, బాబుమోహన్, గౌతంరాజు, సీవీయల్ నరసింహారావు, ‘తెలంగాణ’ శకుంతల, శిల్ప, సుమ... ఇలా మంచి పేరు తెచ్చుకున్న చాలామంది అప్పుడు ఆ సీరియల్లో నటించారు. ఆ సీరియల్ స్పెషాలిటీ ఏంటంటే కృష్ణగారు నటించిన ‘సింహాసనం’ సినిమా సెట్‌ని, కాçస్ట్యూమ్స్ని వాడుకున్నాం. అందుకే ఆ సీరియల్ చాలా రిచ్‌గా ఉంటుంది. అలా ఓ 20 ఏళ్లపాటు ఎన్నో సీరియల్స్ చేశాను. ఫుల్ బిజీగా ఉండేదాన్ని. ►తర్వాత ఎందుకు మానేశారు? సీతాదేవి: ఓ డైలీ సీరియల్ చేస్తున్న సమయంలో హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. కొంచెం జ్వరంతో మొదలై ఆ తర్వాత అది పెద్ద ప్రాబ్లమ్ అయింది. నాలుగైదు నెలల పాటు ఎంతోమంది డాక్టర్ల దగ్గరకు తిరిగాం. ఒక హాస్పిటల్ వాళ్లయితే సరిగ్గా నిర్ధారించకుండానే ఏదో ఆపరేషన్ కూడా చేశారు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. ఏంటీ అని అడిగితే, ‘మీకు ప్రాబ్లమ్ ఏం లేదు, సైకలాజికల్ ప్రాబ్లమ్’ అనేవాళ్లు. కొందరేమో ఎవరో చేతబడి చేసుంటారని అన్నారు. దాదాపు 20 కిలోలు బరువు తగ్గాను. నాకు మెల్లకన్నులా వచ్చేసింది. చూపు కూడా మందగించింది. నడక, మింగడం కూడా కష్టమయ్యాయి. చోటా: అప్పుడు ‘అంజి’ సినిమా విడుదలైంది. బాలకృష్ణగారి పెదపాప వచ్చి సినిమా బావుంది అంకుల్ అని చెబుతుంటే ఈమె దారిన ఈమె వెళ్లి కారులో కూర్చుంది. తర్వాత నేను కారెక్కగానే ముందెళ్లే కార్లన్నీ నాలుగు, నాలుగ్గా కనపడుతున్నాయి అంది. అప్పుడు నేను ఇదేదో సీరియస్ వ్యవహారమే అనుకున్నాను. సీతాదేవి: డాక్టర్లు ఇది న్యూరో ప్రాబ్లమ్ అని కనిపెట్టారు. ‘మల్టిపుల్ స్లె్కరోసిస్’ అన్నారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘గురు’ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. ఆ సినిమాలో మాధవన్‌ని మీ ఆవిడ (విద్యాబాలన్) ఎందుకు మంచంలో ఉంది అంటే మల్టిపుల్ స్లె్కరోసిస్ అని చెబుతాడు. ఆ సినిమా చూస్తూ మణిరత్నం ఎప్పుడూ ఎవరికీ తెలియని, నోరు తిరగని జబ్బులు పెడతారు అన్నా. ఆ జబ్బు నాకొచ్చింది. చోటా: ఆ టైమ్‌లో డాక్టర్లు ‘రోజుల మనిషే’ అన్నారు కానీ స్టెరాయిడ్స్ ఇచ్చిన రెండోరోజు నుంచే మార్పు కనబడింది. మొదట 20 కిలోలు తగ్గిన మనిషి ఆ స్టెరాయిడ్స్ వల్ల 25 కిలోలు పెరిగింది. అలా 3, 4 నెలల్లో 45 కిలోలు పెరిగారు. ►ఆ టైమ్‌లో చోటాగారు ఎలాంటి ట్రస్ట్ ఇచ్చారు? సీతాదేవి: నా లైఫ్‌లో నన్ను బాగా చూసుకున్న వ్యక్తులు ఇద్దరే ఇద్దరు. ఒకరు మా అమ్మ అయితే మరొకరు నా భర్త చోటా. అన్నీ బాగున్నప్పుడు మనతోపాటు ఎవరైనా ఉంటారు. మన కళ్లు మూతబడుతున్నట్లు, చుట్టూ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఎవరో ఒకరు చూసుకోవాలి. వాళ్లకు మెడిసిన్ అందిందా? లేదా? ఏమైనా తిన్నారా? లేదా ఇవన్నీ శ్రద్ధగా పట్టించుకుంటే అదే మంచి పార్ట్నర్షిప్. అలాంటి పార్ట్నర్షిప్నే ట్రస్ట్ అంటాను నేను. నా పార్ట్నర్ (భర్త) ఈజ్ బెస్ట్. ►మామూలు మనిషి అయ్యాక మళ్లీ సీరియల్స్ నిర్మాతగా కంటిన్యూ కాలేదా? సీతాదేవి: ఆరోగ్య సమస్య వచ్చాక ఒక సంవత్సరం ఇంట్లోనే ఉన్నాను. మనం అనుకుంటాం గానీ ఏది జరగాలో ఆ దేవుడు అదే జరిగేలా చేస్తాడు. మనం అహంకారంతో ఏదేదో అనుకుంటాం. కానీ జీవితం వేరేలా డిసైడ్ చేస్తుంది. ‘నేనొక రోల్ మోడల్’ అని నాకు నేను అనుకుని బలవంతంగా చేద్దామనుకున్న పనులు కూడా చేయలేకపోయాను. ఎక్కువ వేడి తగలకూడదని, స్ట్రెయిన్ అవ్వకూడదని డాక్టర్లు చెప్పారు. షూటింగ్ అంటే లైట్స్.. ఆ వేడి ఎక్కువగా ఉంటుంది. దాంతో ఇక సీరియల్స్ జోలికి వెళ్లలేకపోయాను. అలాగని ఖాళీగా ఉండలేను. నాకు చీరలు, డ్రెస్ డిజైన్స్ విషయంలో క్రియేటివిటీ ఉంది. చీరలంటే కలక్షన్ కోసం ఊళ్లు తిరిగి, తేవాలి. ఈ ఊర్లు పట్టుకుని తిరగడం మనవల్ల కాని పని అని బ్యూటీ పార్లర్ అనుకున్నాను. అయితే ఎక్స్పీరియన్స్ ఏం లేదు కదా ఫ్రాంచైజీ తీసుకోండని కొందరు సలహా ఇచ్చారు. ఓన్‌గా చేయాలన్నది నా ఐడియా. అది కూడా గేటెడ్ కమ్యూనిటీస్‌లో నా పార్లర్ ఉండాలనుకున్నాను. గేటెడ్ కమ్యూనిటీ అనే కొత్త కాన్సెప్ట్‌తో హైదరాబాద్‌లో మొదలైన ఫస్ట్ బ్యూటీపార్లర్ మా ‘పింక్స్ అండ్ బ్లూస్’దే. 2005 డిసెంబరులో స్టార్ట్ చేశాను. సంవత్సరం పాటు మామూలుగా సాగింది. ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఫ్రాంచైజీ తీసుకోవాల్సిన స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి ఎదిగాను. ఇప్పుడు 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. ►కెరీర్ పరంగా ఒకర్నొకరు సలహాలు..? చోటా: నాకెప్పుడూ చేతిలో నాలుగు సినిమాలు ఉండేవి. ఆ టైమ్‌లో రెమ్యునరేషన్ అంటే మూడు, నాలుగు లక్షలు ఇచ్చేవారు. నాలుగు సినిమాలకు అవకాశం వచ్చింది.. వీటిలో ఏది చేస్తే బాగుంటుంది? అని నేనే సీతని అడిగేవాణ్ణి. సీతాదేవి: నేను డబ్బు గురించి ఆలోచించకుండా సలహా ఇచ్చేదాన్ని. అది ఖచ్చితంగా కరెక్ట్ అయ్యేది. అందుకే చోటా ఎప్పుడూ నా డెసిషన్ ఫైనల్ అంటారు. ఓ సినిమా వాళ్లు 5 లక్షలు ఇస్తారని తెలిసినా కూడా ‘మన పరిస్థితి బాగాలేని టైమ్‌లో వీళ్లు మనకు అండగా నిలిచారు. 2 లక్షలు ఇచ్చినవాళ్లకే మనం చేద్దాం’ అని చెప్పేదాన్ని. ఆ టైమ్‌లో నిజంగా డబ్బు అవసరం ఉన్నా కూడా నేను చెప్పిన సినిమానే చేసేవారు. కెరీర్‌వైజ్‌గా నేనెప్పుడూ తనని సపోర్ట్ చేయమని అడగను. కాకపోతే మెయిన్ సపోర్ట్ ఏంటంటే.. నేను చేసే పనుల్లో ఇంటర్ఫియర్ అయి ఇలా ఎందుకు చేస్తున్నావు? అలా ఎందుకు చేస్తున్నావు అని అడగకుండా ఉండటమే (నవ్వుతూ). చోటా: నేను నాన్‌స్టాప్ షూటింగ్స్‌లో ఉంటాను. లేట్‌గా వస్తాను. బర్త్ డేలు, పెళ్లి రోజులు, ఫంక్షన్స్ అలాంటి సెలబ్రేషన్స్ ఏవీ ఉండవు. షూటింగ్స్ లో బిజీగా ఉంటే ఇక అవేం ఉంటాయి. సీతాదేవి: సినిమా అంటే తెలుసు కాబట్టి నేను పట్టించుకోను. ►మరి మీకు సెలబ్రేషన్ అంటే ఏంటి? సీతాదేవి: లాంగ్ డ్రైవ్‌లకు వెళ్తుంటాం.. ఇప్పుడు కాదు కానీ పెళ్లైన కొన్నేళ్లు లాంగ్ డ్రైవ్‌లకి వెళ్లాం. చోటా: ఇంట్లో మేం ఇద్దరమే ఉంటాం. మాతో పాటు తొమ్మిదిమంది పనివాళ్లు ఉంటారు. ఇంట్లో చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ►మీవారికి పొగరని ప్రచారంలో ఉంది నిజమేనా? సీతాదేవి: (నవ్వుతూ) మొన్ననే మేం వైజాగ్‌లో ఒకాయన్ని కలవడానికి వెళ్లాం. చోటా అక్కడ ఎవర్నో తిట్టారు. నేను కలవడానికి వెళ్లిన మనిషి ఆ సీన్ చూశాడు. అతను ‘మేడమ్, చోటాగారిని తట్టుకోవటం ఎవరివల్లా కాదు. మీరే ఆయన బలం, బలహీనత’ అన్నాడు. నాకు నవ్వాగలేదు. చోటా: నాకు ఏదైనా ఇది కరెక్ట్ కాదు అనిపిస్తే ముఖానే మాట్లాడేస్తాను. అందరూ కడుపులో పెట్టుకుంటారు, నాకు అది రాదు. ►అలా మాట్లాడినప్పుడు మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తుంటాయా? చోటా: రాకపోవటం ఏముంది? ప్లేటులు పగులుతూనే ఉంటాయి (నవ్వుతూ). సీతాదేవి: మొదట్లో అయితే నేను వాదన పెట్టుకునేదాన్ని, ఇప్పుడు కామ్‌గా ఉంటాను. చోటా: మాకు కోపం వస్తే మా ప్రాపర్టీ మీదే చూపించుకుంటాం తప్ప ఎవరికీ హాని చెయ్యం (నవ్వుతూ) ►ఇటీవల ఓ హీరోయిన్ని చోటాగారు స్టేజీ మీదే ముద్దు పెట్టుకున్నారు. అలాంటివి చూసినప్పుడు? సీతాదేవి: మీరు నమ్ముతారో లేదో కానీ, ఆయన ఇంటర్వూలు, ఫంక్షన్లు నేను చూడను. మా కజిన్స్ అప్పుడప్పుడూ ఫోన్ చేసి, ‘చోటా ఇంటర్వూ్య వచ్చింది, నీ గురించి బాగా మాట్లాడారు’ అంటారు. ఓ అవునా అనుకుంటాను కానీ, నేను చూడను. నా ఎక్స్‌పీరియన్స్‌తో నేర్చుకుంది ఏంటంటే ఎవరూ ఎవరినీ మార్చలేరు. అయితే చోటా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా దేవుడు నాకు సపోర్ట్ చేశాడేమో. చోటా: ప్రతిదానికీ దేవుణ్ణి నమ్ముతుంది. నమ్మనివాళ్లు కూడా తనని చూసి నమ్ముతారు. మా ఇంట్లో ఓ అమ్మవారి ఫోటో ఉంది. దానికో కథ ఉంది. ►ఏంటా కథ? సీతాదేవి: నేను ‘మర్యాదరామన్న’ సీరియల్ షూటింగ్ చేస్తున్నప్పుడు మా ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్రాజుగారు నల్లగా ఉన్న అమ్మవారి బొమ్మను గోల్డ్ పెయింటింగ్ చేసి చాలా రిచ్‌గా తయారు చేశాడు. ఆ బొమ్మను నాతోపాటు ఇంటికి తెచ్చుకున్నాను. దాదాపుగా 36 ఏళ్లనుండి ఆ అమ్మవారి విగ్రహం నాతోనే ఉంది. అమ్మవారు నవ్వుతూ, నాతో మాట్లాడుతుంది అనే ఫీలింగ్‌తో నేను పూజ చేసుకుంటాను. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ►మీ కపుల్ పీస్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు కాబట్టే ‘ఇద్దరూ ప్రశాంతంగా ఉన్నారు’ అనే పాయింట్‌తో ఇంటర్వూ్య మొదలుపెట్టాం.. ఇద్దరూ: ‘యస్.. వియ్ ఆర్ పీస్ఫుల్’. ఇంటర్వ్యూని కూడా ప్రశాంతంగా ముగించాం (నవ్వుతూ). ►మీ ఇద్దరికీ నచ్చే కామన్ విషయాలు? చోటా: క్లియోపాట్రా. అది మా కుక్కపిల్ల. అదికాక ఇద్దరికీ నచ్చేవి కార్లు, బట్టలు, పర్ఫ్యూమ్లు. ఇంకా చాలా ఉన్నాయి. ►ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఓపెన్‌గా షేర్ చేసుకుంటారా? సీతాదేవి: ఏ ప్రాబ్లమ్ వచ్చినా నేను ఈయనతో చెప్పను, టెన్షన్ పడతారు. మా అమ్మ ఉన్నప్పుడు ఆవిడతో షేర్ చేసుకునేదాన్ని. ‘నీకు ఇదేమన్నా పెద్ద ప్రాబ్లమా? నథింగ్ టు వర్రీ, నువ్వు చేయగలవు’ అని ధైర్యం చెప్పేది. ఇప్పుడు అలాంటిదేదైనా ఉంటే మా అమ్మాయి ఐశ్వర్యతో చెబుతాను. షీ ఈజ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్. చోటా: నా ప్రాబ్లమ్స్ అన్నింటినీ 100 పర్సెంట్ ఈవిడతోనే షేర్ చేసుకుంటాను. ►మీ రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది? చోటా: ఈవిడ నాకంటే చాలా బిజీ. ఉదయం పది గంటలకల్లా ఆఫీస్‌కి వెళ్లిపోతుంది. ‘పింక్స్ అండ్ బ్లూస్’ మొత్తం 50 బ్రాంచీలను ఇక్కడినుంచే ఆపరేట్ చేస్తుంది. పొద్దున్నే నేను జిమ్ చేసుకుంటాను. ప్రతిరోజూ నన్ను కలవటానికి ఓ సినిమా బ్యాచ్ వస్తారు. జిమ్ తర్వాత వాళ్లతో స్పెండ్ చేస్తా. 365 రోజులు ఇలానే ఉంటుంది. ఏదైనా సినిమా బాగుంది కానీ ఫ్లాప్ అయ్యింది అనే టాక్ వస్తే, ఆ సినిమా ఎందుకు ఫ్లాపయ్యిందో చూస్తా. మణిరత్నం సినిమా అయితే హిట్, ఫ్లాప్ అని ఉండదు. తప్పనిసరిగా చూస్తాను. సీతాదేవి: మొదట్లో ప్రివ్యూ షోలు వేసేవాళ్లు, వాటికి ఇద్దరం కలిసి వెళ్లేవాళ్లం. ఇప్పుడు పెద్దగా చూడట్లేదు. నా ఆరోగ్యరీత్యా కంటిన్యూస్‌గా ఓ మూడుగంటల పాటు సినిమా చూడాలంటే చాలా స్ట్రెయిన్ అవుతాను. ఏదైనా సినిమా చూసినా కొంచెం కొంచెంగా చూస్తాను. – డి.జి. భవాని -
రక్తకన్నీరు ఆడి మాకు అమృతం పంచారు
‘చరిత్ర అడక్కు.. చెప్పేది విను’ అని నాగభూషణం ఫేమస్ డైలాగ్. కాని– నటుడిగా ఆయన చరిత్ర చెక్కుచెదరక నిలిచి ఉంది. ప్రేక్షకులకు దానిని పదేపదే అడగాలని ఉంటుంది. విలన్ నాగభూషణంగా, ‘రక్తకన్నీరు’ నాగభూషణంగా, మంచి పాత్రల నాగభూషణంగా ఆయన తెలుగువారికి ఆత్మీయుడు. నాగభూషణం కుమార్తె భువనేశ్వరి తండ్రి జ్ఞాపకాలను సాక్షితో పంచుకున్నారు. మాకు ఊహ తెలిసేటప్పటికే నాన్నగారు బాగా బిజీగా ఉన్నారు. షూటింగ్ అయ్యాక సాయంత్రాలు మేకప్‌తో ఇంటికి వస్తూనే అన్నయ్యను పలకరించేవారు. కాస్త ఊహ వచ్చాక నాన్నకు కావలసినవన్నీ నేనే చూసేదాన్ని. ‘మా అమ్మాయి అన్నీ చూసుకుంటోంది’ అని సంతోషించేవారు. నాన్న ప్రతిరోజూ కాకరకాయ రసం తాగేవారు. నేనే స్వయంగా కాకరకాయ రసం చిన్న గ్లాసుతో ఇస్తే తాగేవారు. ఆ తరవాత మేకప్ తీసేవారు. నాన్న చాలా పంక్చువల్. మడి కట్టుకుని వండేది... మాది శాకాహార కుటుంబమే అయినా నాన్నకు నాన్‌వెజ్ అంటే ఇష్టమని, మా అమ్మ (‘రక్త కన్నీరు’ సీతాదేవి) మడి కట్టుకుని నాన్‌వెజ్ వండేది. అమ్మ చేసిన కంది పచ్చడి అంటే నాన్నకు చాలా ఇష్టం. నాన్నగారికి కమ్యూనిస్టు భావాలున్నా ప్రతిరోజూ తెల్లవారుజామున గాయత్రీ మంత్రం జపించేవారు. దేవుడి గురించి ప్రశ్నిస్తే ‘ఒక మానవాతీత శక్తి ఉంది, ఆ శక్తినే గాయత్రీ మంత్రంగా భావించి జపిస్తాను. దానివల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి’ అనేవారు. అమ్మ శ్రావణ శుక్రవారం వరలక్ష్మీవ్రతం చేసుకున్న రోజున, పూజ అయ్యే సమయానికి ఎక్కడ షూటింగ్లో ఉన్నా, మధ్యాహ్నం ఇంటికి వచ్చి తప్పనిసరిగా భోజనం చేసేవారు. చెంప పగలగొట్టారు... ఆయనకు నేనంటే చాలా ఇష్టం. నేను పుట్టాక కలిసి వచ్చింది అంటుండేవారు. కాని నేను లిప్‌స్టిక్ వేసుకుంటే ఆయనకు నచ్చలేదు. ‘బాగుండదమ్మా. ముఖం కడుక్కో’ అని సున్నితంగా మందలించారు. ఒకసారి నేను, మా మామయ్య కూతురు కలిసి ‘అందాజ్’ (1971) సినిమాకు వెళ్లేసరికి టికెట్లు అయిపోయాయి. సాయంత్రం 6.30 షోకి వెళ్దామని అక్కడే ఉండిపోయాం. సినిమా అయ్యేసరికి ఆలస్యం అయిపోయింది. నాన్న టెన్షన్ పడిపోయి బయటకు వచ్చేసరికి, గేట్ దగ్గరే నిలబడి ఉన్నారు. మమ్మల్ని కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకువచ్చారు. భయంతో ఒళ్లంతా వణికిపోతోంది. ఇంట్లోకి రాగానే, చెంప మీద ఒక్కటి లాగి పెట్టి కొట్టారు. చెవి రింగు ఊడిపోయింది. ఎక్కడకు వెళ్లినా, సాయంత్రం ఆరుగంటలకు ఇంటికి వచ్చేయాలన్నది ఆయన స్ట్రిక్ట్ పోలసీ. ఆ ఒక్క దెబ్బతో ‘అందాజ్’ సినిమా కథంతా మరచిపోయాను. మూగమనసులుతో బ్రేక్ నాన్న 1956 నుంచి ‘రక్తకన్నీరు’ నాటకం వేయటం ప్రారంభించారు. అమ్మ సీతాదేవితో అక్కడే పరిచయం ఏర్పడి, కొన్ని రోజులకే వారు ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పట్లో అమ్మ స్పెషల్ సాంగ్స్ చేసేది. మా నాయనమ్మ లీలాబాయమ్మ సినిమాలలో హీరోయిన్గా వేశారు. ఆవిడ మా అమ్మను పెంచుకున్నారు. ఆవిడ అదృష్టం ఏమో కాని, అమ్మను దత్తత తీసుకున్న ఆరు నెలలకు మా మేనమామ పుట్టారు. అమ్మకు 1957లో అన్నయ్య, 1960లో నేను పుట్టాక అమ్మ సినిమాలు మానేసింది. ‘మూగమనసులు’ చిత్రంతో నాన్నకు బ్రేక్ వచ్చినా, నాన్న నాటకాలు మానలేదు. నాన్నగారు ఒక్క డైలాగు కూడా మర్చిపోయే వారు కాదు. భయంతో ఏడ్చేశాను.. రక్తకన్నీరు నాటకంలో ఒక సీన్లో స్టేజీ మీద మొత్తం లైట్లన్నీ ఆర్పేసి, రెడ్ స్పాట్ లైట్ వేశారు. ఒక్కసారిగా నాన్న వెనక్కి తిరుగుతారు. రెడ్ లైట్ ముఖం మీద పడగానే, భయంతో ఏడ్చేశాను. ఆ సీన్లో కుష్ఠురోగంతో ఒళ్లంతా చీమునెత్తురుతో కుళ్లిపోయి ఉంటుంది నాన్న శరీరం. ఆ తరవాత ఎన్నడూ చూడలేదు. రక్తకన్నీరు లేకుండానే... 1995లో నాన్నగారు చేసిన సినిమాలన్నీ అన్నయ్య సేకరించాడు. నిర్మాతలు, దర్శకులతో ఇంటర్వ్యూలు చేసి, మావారికి అందచేశాడు. మావారు దానిని డాక్యుమెంటరీ చేశారు. అది దూరదర్శన్ లో టెలికాస్ట్ అయ్యింది. బషీర్‌బాగ్‌లో షో వేసి నాన్నగారికి చూపిస్తే, ‘ఇంత పెద్ద పనిని ఎలా చేయగలిగారు’ అని సంతోషంతో ప్రశంసించారు. అయితే అందులో రక్తకన్నీరు ప్రస్తావన లేకపోవటంతో – తన ఇంటి ముందు రోడ్డు మీద రాబోయే ఆదివారం నాడు కాండిడ్ షాట్స్‌తో కుష్ఠు సీన్ తీద్దామని, రోడ్డు మీద వాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామనీ అన్నారు నాన్న. ‘సరే’ అన్నాం. ఇది జరిగిన మరుసటి రోజు (ఆ రోజు గురువారం) నాన్నగారిని చూడటానికి వెళ్లాను. ఆయన ‘భువనా! నాకు ఖీమా తినాలని ఉంది’ అన్నారు. ‘రేపు తేనా?’ అన్నాను. ‘ఆదివారం తిందాంలే, అమ్మ చేసినట్లు చెయ్యాలి’ అన్నారు. సరేనని ఇంటికి వచ్చేశాను. శుక్రవారం నాడు ఏదో పని మీద బయటకు వెళ్లి, బాగా అలసిపోయి, ఇంటికి వచ్చాక ఫోన్ ప్లగ్ తీసేశాను. మరుసటి రోజు ఉదయం నాన్న స్నేహితుడు ప్రతాపరెడ్డి ఫోన్ చేసి ‘నాన్న నిన్నే కలవరిస్తున్నారు. రాత్రంతా ప్రయత్నించాను. నీ ఫోన్ కలవలేదు’ అన్నారు. నాకేమీ అర్థం కాలేదు. ఏదో సీరియస్ అయి ఉంటుంది అనిపించి, వెంటనే బయలుదేరి, వెళ్లేసరికి అంతా అయిపోయింది. అది మే 5, 1995. అలా నాన్న రక్తకన్నీరు నాటకం డాక్యుమెంట్ చేయలేకపోయాను, నాన్నకు ఖీమా పెట్టలేకపోయాను అని ఇప్పటికీ బాధ పడుతుంటాను. టైమ్‌కి అన్నం ఉండాల్సిందే.. ఇంట్లో నేను, నాన్న, అమ్మ కలిసి పేక ఆడుకునేవాళ్లం. అన్నయ్యను ఆడనిచ్చేవారు కాదు. ఆడపిల్ల పేకాడితే చెడిపోదులే, మగపిల్లవాడైతే కష్టం అనేవారు. నాన్నగారు భోజనానికి ఆగలేకపోయేవారు. టైమ్‌కల్లా అన్నం పడాలి. ఒకసారి విజయవాడ వెళుతుంటే దారిలో కారు పంక్చర్ అయ్యింది. అక్కడే పక్కన పొలంలో కూలీలు పంట కోస్తున్నారు. మా అవస్థ చూసి ‘ఏమైనా కావాలా?’ అని అడిగారు. అమ్మ మొహమాట పడకుండా, అన్నం కావాలని అడిగి తెచ్చి, నాన్న ఆకలి తీర్చిందని, అమ్మ గురించి నాన్న గొప్పగా చెప్పేవారు. పుట్టినరోజుకి పట్టు లంగా కొనేవారు. ప్రతి పండక్కి నాన్న తప్పకుండా వచ్చేవారు. దీపావళి నాడు అందరి ఇళ్లకూ తీసుకు వెళ్లి స్వీట్స్ ఇచ్చేవారు. ఆడవేషంలో... నాన్నకి పీతాంబరం గారు మేకప్ చేసేవారు. ‘నేనంటే నేనే’ సినిమాలో లేడీ గెటప్ వేసిన రోజున, అదే వేషంతో సందు చివర నుంచి ఇంటి దాకా నడిచారు. అందరూ నాన్నను క్యాజువల్‌గా చూశారు. అంత సహజంగా నడిచారన్నమాట. – సంభాషణ: వైజయంతి పురాణపండ ఫొటోలు: కె. రమేశ్ బాబు మాది మతాంతర వివాహం మా ఇంటి వ్యవహారాలన్నీ మా మేనమామ చూసుకునేవారు. నేను శారదా విద్యాలయలోను, సయ్యద్ మీర్ (ఎస్. డి.లాల్ కుమారుడు) రామకృష్ణ మిషన్‌లోను చదువుకున్నాం. మా అన్నయ్య సురేంద్ర, మీర్ గారు క్లాస్మేట్స్. ఆయన ఇంటికి వస్తుండేవారు. మా మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఇద్దరి మతాలు వేరు కావటంతో నాన్నగారు ఏమంటారోనని భయం వేసింది. మా విషయం అమ్మకు చెపితే మామయ్య ద్వారా అమ్మ నాన్నకి చెప్పించింది. ఇరువైపుల వారినీ కష్టపడి ఒప్పించాకే 1982లో మా వివాహం జరిగింది. అదే సంవత్సరం డిగ్రీ కూడా పూర్తి చేశాను. మా కుటుంబంలో ఎటువంటి గొడవలు రాకుండా జాగ్రత్తపడ్డాను. నా విధానం చూసి మా అత్తగారు సంతోషించారు. మాకు ఇద్దరు బాబులు. ఆబిద్ భూషణ్, ఆసిఫ్ భూషణ్. మా పిల్లలు తాతగారితో బాగా ఆడుకునేవారు. పెద్దబ్బాయి బిటెక్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నాడు. వాడికి యాక్టింగ్ మీద ఆసక్తి ఉంది. చిన్నవాడు విజువల్ ఎఫెక్ట్స్ చేస్తున్నాడు. పెద్దబాబుకి బ్రేక్ రాలేదు. అందుకని పెళ్లి చేసుకోలేదు. చిన్నబాబుకి పెళ్లి చేశాం. కోడలు సంధ్య ఉద్యోగం చేస్తోంది. వాళ్లు చెన్నైలో ఉంటున్నారు. మా వారు పది సంవత్సరాలుగా ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నారు. ఆయనకు వెంకటేశ్వరస్వామి అంటే భక్తి ఎక్కువ. అన్నయ్య డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ చేశాడు. ఉద్యోగం చేస్తూ, సినిమాటోగ్రఫర్‌గా పని చేశాడు. నాలుగేళ్లుగా అనారోగ్యం కారణంగా బయటకు రావట్లేదు. – భువనేశ్వరి, నాగభూషణం కుమార్తె -
అగ్నిలో సీత
రావణ సంహారం జరిగింది. లంకాయుద్ధం ముగిసింది. రాముడి ఆజ్ఞపై లక్ష్మణుడు విభీషణునికి లంకాధిపతిగా పట్టం కట్టాడు. రామచంద్రుని ఆశీస్సులు అందుకున్న అనంతరం విభీషణుడు సీతాదేవిని రాముని సన్నిధికి తీసుకువస్తున్నాడు. ఇంకొన్ని అడుగులలో రాముని చేరుతుందనగా రాముడి కంఠం కంగున మోగింది. ‘‘సీతా! నీ కోరిక మేరకు యుద్ధంలో రావణుని సంహరించాను. అయితే ఇంతకాలం పర పురుషుని నీడలో ఉన్నావు. ఇప్పుడు కూడా నీవు కావాలంటే విభీషణుడి పాలనలో ఉన్న లంకానగరంలో ఉండిపోవచ్చు లేదంటే కిష్కింధాధిపతి అయిన సుగ్రీవుడి సంరక్షణలో ఉండవచ్చు... ఈ ఇరువురూ కాదంటే సొంత మరుదులైన లక్ష్మణ భరత శత్రుఘ్నుల వద్ద కూడా ఉండవచ్చు. అంతేకానీ నేను మాత్రం నిన్ను యథాతధంగా ఏలుకోలేను’’ అన్నాడు. ఈ మాటలు శరాఘాతంలా తగిలాయి సీతమ్మకు. ఒక్కక్షణం కన్నులెత్తి రాముని వైపు తదేకంగా చూసి, తర్వాత లక్ష్మణునితో–‘‘లక్ష్మణా! నేను అపనిందకు గురయ్యాను. ఇక నేను జీవించి ఉండవలసిన అవసరం లేదు. నీవు ఇక్కడ తక్షణం అగ్నిని రగుల్కొల్పు’’ అంది సీత. లక్ష్మణుడు బాధతో అన్నయ్యవైపు చూశాడు. రాముడు మౌనంగా తలదించుకున్నాడు. అన్నయ్య మౌనాన్నే అంగీకారంగా భావించిన లక్ష్మణుడు అక్కడ చితిపేర్పించాడు. మండుతున్న చితిని చూసింది సీత. రాముని చుట్టూ ప్రదక్షిణ చేసింది. అనంతరం జ్వాజ్వల్యమానంగా రగులు తున్న అగ్నితో ‘‘ఓ అగ్నిభట్టారకా! నా హృదయం సర్వకాల సర్వావస్థలలోనూ శ్రీరాముని యందే ఉంటే గనుక నన్ను రక్షించు. నేను దోషరహితురాలనైతే గనుక నన్ను కాపాడు. నా ప్రవర్తనలో తేడా ఉన్నా, మనసులో ఎటువంటి చెడు తలంపులు ఉన్నా నన్ను వెంటనే నీలో ఆహుతి చేసుకో’’ అని పలికి అక్కడున్న వారందరూ హాహాకారాలు చేస్తూండగా అగ్నిలో ప్రవేశించింది. ఆ దృశ్యాన్ని చూడలేనట్టు అందరూ కన్నులు మూసుకున్నారు. కొద్ది క్షణాలు గడిచాయి. ఉన్నట్టుండి అక్కడ కన్నులు మిరుమిట్లు గొలిపేంత వెలుగు వచ్చింది. చితాగ్ని నుంచి అగ్నిదేవుడు పైకి వచ్చాడు. ఆయన వడిలో పుత్రికలా సీత కూచుని ఉంది. మునుపటికన్నా ఆమె మరింత కాంతిమంతంగా ఉంది. ఆమె సౌందర్యం మరింత పవిత్రంగా ఉంది. అగ్నిదేవుడు సీతను నడిపించుకుంటూ రాముని వద్దకు తీసుకు వచ్చాడు. రామా! ఈమె నిష్కళంకురాలు. నిరపరాధి. పరమ పతివ్రత. ఈమెయందు ఏ దోషమూ లేదు. నీవు ఈమెను నిస్సంకోచంగా స్వీకరించవచ్చు. ఈమెవల్ల నేను పునీతుడనయ్యాను.’’ అంటూ ఆమెను రామునికి అప్పగించాడు. ‘‘అగ్నిదేవా!’’ ఈమారు రాముని కంఠం గద్గదమైంది. ‘‘నా అర్ధాంగి సీత అమలిన చరిత అనీ, సాధ్వీమణి అనీ నాకు తెలుసు. నా ప్రాణేశ్వరి హృదయం ఆమె ప్రాణనాథుడనైన నాకు తెలియదా! అయితే ఆమె ఇంతకాలం పరాయి రాజ్యంలో మహా కాముకుడైన రావణుని ఏలుబడిలో ఉంది. ఆమెను వెంటనే నేను స్వీకరిస్తే నన్ను లోకం తప్పుగా అనుకోదా? ఆమెను గురించిన ఒక్క నిందనైనా నేను కలలో కూడా సహించలేను. ఆమె పాతివ్రత్యం, పవిత్రత అందరికీ తెలియాలనే నేను ఈ పరీక్ష పెట్టాను. ఇక ఆమెను నా నుండి ఎవరూ వేరుచేయలేరు’’ అంటూ ముందుకు నడిచి ఆమె చేతిని తన చేతులలోకి తీసుకున్నాడు. రాముడు సీతను అనుమానించాడనేది అపప్రథ మాత్రమే. ఆమె పాతివ్రత్యం గురించి అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశ్యంతోనే రాముడామెకు అగ్నిపరీక్ష పెట్టాడన్నది యథార్థం. – డి.వి.ఆర్. భాస్కర్ -
సీతపై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
రుద్రాపూర్ : దసరా సమయంలో ఉత్తర భారతంలోని అన్ని గ్రామాల్లోనూ దాదాపు రామ్‌లీలా నాటకం వేస్తారు. సీతారాముల గొప్పతనం నేటి తరానికే తెలియజేసేందుకే ఈ నాటకాన్ని ప్రదర్శిస్తారు. అయితే ఉత్సవాల్లో భాగంగా రామ్‌లీలా నాటకాన్ని ప్రదర్శించిన ఓ బీజేపీ ఎమ్మెల్యే సీతాదేవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘సీత మేరీ జాన్’. అంటూ అసభ్యకరంగా సంభోదించి చిక్కుల్లో పడ్డారు. ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్ బీజేపీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ తుక్రాల్.. గత ఆదివారం నియోజకవర్గంలో ప్రదర్శించిన రామ్‌లీలా నాటకంలో రావణాసురుడు పాత్ర వేశారు. సీతా దేవి, రావణునికి మధ్య వచ్చే సన్నివేశంలో భాగంగా ‘ సీతా మేరీ జాన్’ అంటూ సీతా దేవిని సంభోదించారు. దీంతో ప్రేక్షకులు ఒక్కసారిగా నవ్వారు. అయితే నాటక నిర్వాహకులు మాత్రం అభ్యంతరం తెలిపారు. అయినప్పటికీ ఆయన అలాగే సంభోదించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, ఈ వీడియోపై రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు సూర్యకాంత్ స్పందిస్తూ.. ఈ ఒక్క మాట చాలు రాజ్‌కుమార్‌కు సీతారాములపై ఉన్న గౌరవం ఏంటో తెలిసిపోయిందన్నారు. రావణుడు కూడా సీతమ్మను ఎప్పడూ ‘ సీతా దేవి’ అని సంభోదించేవాడని గుర్తుచేశారు. రాజ్‌కుమార్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, రాజ్‌కుమార్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. నాటకంలో భాగంగానే తాను సీతాదేవిని ‘మేరీ జాన్’ అని సంభోదించానని, అంతేకానీ వేరే ఉద్దేశంతో కాదన్నారు. అక్కడ మాట్లాడింది కేవలం రావణాసుర పాత్రదారే తప్ప రాజ్‌కుమార్ కాదన్నారు. -
మాతృదేవతాౖయె నమః
ప్రేమ, కరుణలను వర్షించే ప్రేమమూర్తులుగా మాతృత్వమనే పదానికే అర్థంగా, నిదర్శనంగా నిలిచిన తల్లులు మన పురాణాల్లో ఎంతోమంది కనిపిస్తారు. అలాంటివారిలో... తలచుకోగానే బొమ్మకట్టే కొందరు మాతృమూర్తుల గురించి తెలుసుకుందాం. పార్వతీదేవి: ఆమె అమ్మల గన్న అమ్మ, శక్తి స్వరూపిణి, తన బిడ్డ ప్రాణం కోసం పతి అయిన పరమ శివుడినే ఎదిరించి, ఆయనతో పోరాడి మరీ బిడ్డను బతికించుకున్న మాతృమూర్తి. తాను నలుగుపిండితో ప్రాణం పోసిన బాలుడికి, తన భర్త అయిన శంకరుడికి మధ్య జరిగిన పోరాటంలో ఆ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని తెలిసి భోరున విలపించింది. తొందరపడి బిడ్డను పొట్టన పెట్టుకున్నాడని ప్రాణనాథుడైన పరమేశ్వరుడినే ఒక సాధారణ స్త్రీలా తూలనాడిన సిసలైన తల్లి ఆమె. ఏనుగు తలైనా ఫరవాలేదు పిల్లవాడు ప్రాణాలతో తిరుగాడితే చాలు అని ఆరాటపడిన అసలైన అమ్మ. ఆ బిడ్డడే అందరి తొలి పూజలందుకునే బొజ్జ గణపయ్య. సీతాదేవి: శ్రీరాముడి పత్ని అయిన సీతాదేవి గర్భిణిగా తనను అడవిలో వదిలేసినప్పటికీ, ఆ బాధను, శోకాన్ని దిగమింగుకుని వాల్మీకి ఆశ్రమంలో కవలలు లవకుశులకు జన్మనిచ్చింది. ఎన్ని కష్టనష్టాలెదురైనా తన కుమారులిద్దరినీ క్షత్రియపుత్రులు, ఇక్ష్వాకు వంశ వారసులుగా ఒంటరిగా పెంచి పెద్ద చేసింది. యశోదాదేవి: దేవకీ నందనుడైన కన్నయ్యను తన ప్రేమ, వాత్సల్యాలతో యశోదా కృష్ణుడిగా మార్చుకున్న ప్రేమమయి యశోదాదేవి. కన్నది దేవకీ దేవి అయినా కృష్ణుడి బాల్యం అనగానే మనకు చటుక్కున స్ఫురించేది యశోదాదేవి పేరే. పాలు, వెన్నలతోపాటు ప్రేమ, వాత్సల్యాలను, మమతానురాగాలను కూడా రంగరించి కృష్ణుడిని పెంచి పెద్ద చేసింది. కన్నయ్య ఆడితే ఆనందపడిపోయి, పాడితే పరవశించిపోయి, పిల్లనగ్రోవి ఊదితే మైమరచిపోయి అల్లరి చేస్తే ముద్దుగా కోప్పడి... ఇలా అతని బాల్యక్రీడలతో, అల్లరిచేష్టలతో మాతృత్వాన్ని తనివి తీరా ఆస్వాదించిన తల్లి.. యశోదమ్మ. అయితే అన్న అయిన కంసుడి క్రౌర్యానికి వెరచి పొత్తిళ్లలోనే బిడ్డను వేరొకరికి అప్పగించవలసిన అగత్యం ఏర్పడినా ఎక్కడో ఒకచోట తన బిడ్డ క్షేమంగా ఉంటే చాలని పుట్టెడు శోకాన్ని గుండెల్లోనే దాచుకున్న దేవకీదేవి కూడా స్మరణీయురాలే.. కౌసల్యాదేవి: దశరథ రాజు పట్టపురాణి, రామచంద్రుడి తల్లి కౌసల్యాదేవి. సవతి కైకేయికి భర్త ఇచ్చిన వరం మూలంగా పద్నాలుగేళ్ల పాటు తన పుత్రుడికి దూరమై తీవ్ర వేదనను అనుభవించిన మాతృమూర్తి. భర్త నిస్సహాయత, కైకేయి దురాలోచన ఫలితంగా రాముడు వనవాసానికి వెళ్లి తాను శోకంలో మునిగిపోయినప్పటికీ తనయుడి పితృవాక్య పరిపాలనకు లోటు రాకూడదన్న సదాశయంతో, సయమనంతో వ్యవహరించిన తల్లి కౌసల్యాదేవి. సుమిత్రాదేవి: భర్త దశరథుడు కైకేయికి ఇచ్చిన వరమే తన పాలిట శాపం కాగా పుత్రుడి ఎడబాటును ఏళ్లతరబడి మౌనంగా భరించిన తల్లి సుమిత్ర. అన్నతోపాటు తాను కూడా వనవాసానికి వెళతానంటూ లక్ష్మణుడు పట్టుబట్టిన వేళ... అతడిని వారించకుండా రాముడిని కూడా తన కుమారుడిలాగే భావించి అతడి పితృవాక్యపరిపాలనకు తన వంతు సహకారాన్ని అందించిన సహృదయురాలు సుమిత్రాదేవి. కైక: పేరుకు భరతుడు తన పుత్రుడైనా రాముడినే తన బిడ్డగా భావించి అపరిమితమైన ప్రేమ, వాత్సల్యాలతో అల్లారుముద్దుగా రామచంద్రుడిని పెంచింది. అనుక్షణం రాముడినే కలవరించి, పలవరించేది. అలాంటిది మంధర చెప్పుడు మాటలు విని తన కుమారుడు భరతుడి భవిష్యత్తుకోసం రాముడిని వనవాసానికి పంపింది. ఫలితంగా కన్నకొడుకే తనను చూసి ఛీత్కరించుకుంటే ఎంతగానో ఏడ్చింది. ఆ తరువాత ఎంతో పశ్చాత్తాప పడ్డ కైక కూడా గుర్తుచేసుకోదగిన తల్లే. వకుళమాత: శ్రీకృష్ణుడి బాల్యం మాత్రమే తాను చూడగలిగానని అనంతరం అతని వద్ద ఉండలేకపోయానని వాపోయిన యశోదమ్మకు మరుజన్మలో ఆ అవకాశం కల్పిస్తానని వాగ్దానం చేశాడు కృష్ణుడు. అన్నట్లుగానే యశోదమ్మ, వకుళమాతగా జన్మించగా తాను శ్రీనివాసుడిగా అవతరించి పుత్రుడిగా ఆమె ప్రేమను అందుకున్నాడు కృష్ణుడు. పూర్వజన్మలో తాను కోరిన కోరికను ఈ జన్మలో నెరవేర్చేందుకు పుత్రుడిగా తన వద్దకు ఏతెంచిన గోవిందుడిని వాత్సల్యంతో ఆదరించి తనలోని మాతృత్వభావనను పరిపూర్ణం చేసుకున్న మాతృమూర్తి వకుళమాత. అనసూయ: ఒకసారి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మారువేషాలతో అత్రి ఆశ్రమానికి అతిథులుగా వెళ్ళి భవతీ భిక్షాందేహి అని నిలబడ్డారు. అతిథులుగా వచ్చిన త్రిమూర్తులకు మర్యాదలు జరిపి భోజనానికి కూర్చోమన్నది అసూయ. అప్పుడు కపటయతులు ముగ్గురూ ఏకకంఠంతో, ‘‘సాధ్వీ! మాకొక నియమమున్నది – అది నీవు నగ్నంగా వడ్డిస్తేనే గాని తినేది లేదు!’’ అని అన్నారు. అనసూయ ‘అలాగా! సరే!’ అంటూ వారిమీద నీళ్ళు చిలకరించింది. ముగ్గురు అతిథులూ ముద్దులొలికే పసిపాపలైపోయారు. అనసూయకు మాతృత్వం పొంగివచ్చింది. పసివాళ్ళకు పాలబువ్వ మెత్తగా కలిపి తినిపించింది. ఒడిలో చేర్చుకొని లాలించి పాలిచ్చింది. త్రిమూర్తులు పసిపాపలై అనసూయ ఒడిలో నిద్రలోకి జారిపోయారు. ముగ్గుర్నీ ఉయ్యాల తొట్టిలో పరుండబెట్టి, ‘‘ముజ్జగాలేలే ముమ్మూర్తులు నా పాపలైనారు. బ్రహ్మాండమే వీళ్ళకు ఉయ్యాలతొట్టి, నాలుగు వేదాలే గొలుసులు, ఓంకార ప్రణవనాదమే జోలపాట!’’ అంటూ జోలపాడింది. ఆ పాటకు మైమరచిపోయిన బ్రహ్మ విష్ణుమహేశ్వరులు కలిసిపోయి, ఒకే ఒక మూర్తిగా దత్తాత్రేయుడు రూపొందాడు. మాతృమూర్తులందరికీ అభివందనం. -
‘సీతాదేవి అందుకు పూర్తి అర్హురాలు’
లక్నో : అఖండ భారతావనిని ఏకం చేసిన సర్ధార్ వల్లభ్‌భాయ్ పటేల్ గౌరవార్థం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ ఐక్యతా విగ్రహం ఆవిష్కరణ అనంతరం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తమ రాష్ట్రంలో శ్రీరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. దాదాపు 221 మీటర్ల ఎత్తు ఉండే రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు యోగి తెలిపారు. రాముడి విగ్రహంతో పాటు సీతా దేవి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలంటూ యోగికి లేఖ రాశారు యూపీ కాంగ్రెస్ నాయకుడు కరణ్ సింగ్. ‘మీరు రాముడి విగ్రహాన్ని నిర్మించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అయితే నా అభ్యర్థన ఏంటంటే రాముడి విగ్రహం ఎత్తును తగ్గించడమే కాక శ్రీరామునితో పాటు సీతాదేవి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయండి. రామున్ని పెళ్లి చేసుకున్న తర్వాత సీతా దేవి అయోధ్య వచ్చారు.. కానీ కొద్ది రోజుల్లోనే శ్రీరామునితో కలిసి వనవాసం చేయడానికి అడవులకు వెళ్లారు. 14 ఏళ్లు అరణ్యవాసంలో ఉన్నారు. చివరకు రావణాసురుడు అమ్మను ఎత్తుకెళ్లాడు. ఆ రాక్షసుడి చెర నుంచి రాముడు సీతాదేవిని విడిపించాడు. కానీ అగ్ని పరీక్షలో నెగ్గినప్పటికి.. చివరకూ ఆ తల్లి మళ్లీ అడవుల పాలయ్యారు. అది గర్భవతిగా ఉన్న సమయంలో.. మొత్తంగా చాలా తక్కువ రోజులు మాత్రమే సీతాదేవి అయోధ్యలో ఉన్నారు. కానీ అయోధ్యలో ఉండటానికి ఆ తల్లికి పూర్తి అర్హత ఉంది. కనుక కేవలం రాముని విగ్రహాన్ని మాత్రమే కాక.. సీతారాముల విగ్రహాన్ని ఏర్పాటు చేయండంటూ’ కరణ్ సింగ్ తన లేఖలో రాశారు. -
భయపెట్టేది ఎవరు?
దేవి చలాకీ అమ్మాయి. అందరినీ నవ్విస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి జీవితంలో జరిగే అనుకోని సంఘటనలే ‘సీతాదేవి’ అంటున్నారు శ్రీనివాస్ మల్లం. సందీప్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ మల్లం దర్శకుడు. భవ్యశ్రీ కథానాయిక. ఈ చిత్రం ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నిర్మాత తండ్రి వెంకన్న కెమెరా స్విచ్చాన్ చేయగా, విజయారెడ్డి క్లాప్ నిచ్చారు. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘భయం కలిగిస్తూనే, ఇంకో పక్క కడుపుబ్బా నవ్వించే చిత్రం ఇది. అసలు ‘సీతాదేవి’ అనే టైటిల్ ఎందుకు పెట్టామో సినిమా చూశాకే తెలుస్తుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: మురుగన్, సమర్పణ: అరుణ. -
నేడు శ్రీరామనవమి
మంచిర్యాల అర్బన్/ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : శ్రీ సీతారాముల కల్యాణం అంతటా కన్నులపండువగా జరుపుకుంటారు. సీతారాముల కల్యాణాన్ని భక్తులు లోక కల్యాణంగా భావిస్తుంటారు. మిథిలా రాజ్య పాలకుడు జనక మహరాజు తనయ సీతాదేవి. శ్రీరాముడు శివ ధనస్సు విరిచి సీతను వివాహామాడుతాడు. వారి కల్యాణం ఎంతో ఘనంగా జరుగుతుంది. అందుకే త్రేతాయుగం నాటి రామాయణాన్ని వాల్మికీ రాసి లక్ష వసంతాలు అవుతున్నా ఇప్పటికి సీతారాముల కల్యాణాన్ని భక్తులు తమ ఇంటిలో వివాహ వేడుకలా భావిస్తారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య మంగళ సూత్రధారణ, తలంబ్రాలు, పట్టు వస్త్రాల సమర్పణ.. తదితర ఘట్టాలు అంగరంగవైభంగా నిర్వహిస్తారు. మానవాళికి ఆదర్శ దంపతులైన సీతారాముల కల్యాణం చూసినా ఎంతో పుణ్యమని భక్తులు విశ్వసిస్తారు. ఏకపత్ని వ్రతుడు... శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు. సీతాదేవిని తప్ప పర స్త్రీని ఎరగని యుగపురుషుడు. సీతాదేవికి దూరమయ్యాక రాముడు తల్లడిల్లిపోతాడు. అశ్వమేధ యాగం సందర్భంగా సీతాదేవి విగ్రహంతో యాగం చేస్తాడు. పితృ వాక్య పరిపాలన దక్షుడు శ్రీరాముడు మంచి భర్తే కాదు తండ్రి మాట జవదాటని పుత్రుడు కూడా. అందుకే ఆయనకు పితృవాక్య పరిపాలకుడన్న పేరుంది. తండ్రి దశరథునికిచ్చిన మాట కోసం రాజ్యాన్ని, పాలనను త్యజించి వనవాసం చేశాడు. ఎన్ని కష్టాలు వచ్చినా తండ్రి మాటను గౌరవించాలే తప్ప ఎదురు చెప్పవద్దనే నీతి ధర్మాన్ని శ్రీరాముడు బోధించాడు. రాజ్య పాలన కోసం తగువు పెట్టుకోలేదు. తమ్ముళ్లనే రాజ్యం ఏలాలని సూచించాడు. రాముడు వనవాసానికి వెళితే సోదరుడు లక్ష్మణుడు కూడా వెంట ఉన్నాడు. భరతునికీ రాముడంటే ఎంతో గౌరవం, భక్తిభావం. సోదరులంతా ఐక్యంగా ఉన్నారు. ఉమ్మడి కుటుంబాలకు ఆరాధ్యుడు శ్రీరాముడు. సకల గుణాభిరాముడు. శ్రీరామునికి సకల గుణాభిరాముడనే నామకరణం ఉంది. ఏ కోణం నుంచి చూసినా సద్గుణాలు తప్ప దుర్గుణాలనేవి మచ్చుకైనా కనిపించవు. పితృ వాక్య పరిపాలకుడిగా, ఏకపత్ని వ్రతునిగా, ప్రజాపరిపాలకుడిగా, గురువుగా, సోదరునిగా, తండ్రిగా, యుద్ధ వీరునిగా ఖ్యాతి గడించారు. ఇప్పటికీ రాముడు మంచి బాలుడనే మాట వాడుకలో ఉంది. పరిపాలన దక్షునిగా పేరు సంపాదించారు. ఎవరైనా మంచి పాలన అందిస్తామనే బదులు గ్రామాన్ని రామరాజ్యంగా తీర్చిదిద్దుతామని అంటారు. అంటే రాముని పాలన ఎలా సాగిందో వాల్మికీ మహర్షి రామాయణంలో చక్కగా కీర్తించారు. వానర సేనకూ రాముడంటే అపారమైన భక్తిభావం ఉంది. సీతాదేవిని దశకంఠుడు అపహరించిన సమయంలో సముద్రంలో రామసేతు నిర్మించి లంకకు దారి చూపింది, అశోకవనంలో ఉన్న సీతమ్మను కనుగొన్నది వానరసేనే. ఇలా రాముడు అందరివాడుగా త్రేతా యుగం నుంచి కలియుగం వరకు ఆదర్శ పురుషుడిగా చిరస్థాయిగా నిలిచిపోయారు. సత్యాన్ని నమ్ముకుని ప్రపంచాన్ని జయించి సత్యమేవ జయతే అనే సూక్తిని ప్రాచుర్యంలోకి తెచ్చారు. విద్యుద్దీపాలతో అలంకరణ శ్రీరామ నవమి సందర్భంగా రామాలయాలు, ఇతర ఆల యాలు అందంగా ముస్తాబయ్యాయి. రంగురంగుల వి ద్యుద్దీపాలతో కళకళలాడుతున్నాయి. ఆలయాల ఆవరణ లో, ఎదుట చలువ పందిళ్లు వేశారు. మామిడి తోరణాలు కట్టారు. ఆలయాల్లో ఇప్పటికే ప్రత్యేక పూజాకార్యక్రమాలు కొనసాగుతుండగా మంగళవారం శ్రీరామనవమి కోసం ఆ యా ఆలయ కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. స్వామివారి కల్యాణానికి ప్రత్యేకంగా ముత్యాల పందిరి ఏర్పాటు చేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యా లు కల్పించారు. ఈ మేరకు మంచిర్యాల ఏసీసీలోని కోదండ రామాలయం, గౌతమినగర్‌లోని ఆలయం, సాయిబాబా ఆలయం, రైల్వే కాలనీలోని విశ్వనాథ ఆలయం, గర్మిళ్ల, హమాలివాడ, మారుతీనగర్‌లోని ఆలయాలు విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. జిల్లా కేంద్రంలోని హౌసింగ్బోర్టుకాలనీ రామాలయం, చాంద(టి), మావల, తలమడుగు మండలం కజ్జర్లలోని రామాలయాలు, మల్లిఖార్జునస్వామి ఆలయాలు, నిర్మల్‌లోని బాగులవాడ, మందమర్రి మూడో జోన్‌లోని కోదండ రామాలయం, చెన్నూర్ మండల సుద్దాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, బోథ్ ప్రాంతాల్లోని రామాలయాలు, హనుమాన్ దేవస్థానాలు అందంగా ముస్తాబయ్యాయి. పానకం.. ప్రత్యేకం.. శ్రీరామ నవమి పర్వదినం రోజున పానకం ప్రత్యేకంగా ఉంటుంది. బెల్లం, మిరియాలు కలిపి పానకం తయారు చేస్తారు. వడ పప్పును ప్రసాదంగా ఆలయాల్లో భక్తులకు అందజేస్తారు. -
ఏడేళ్ల కొడుకును కొట్టి చంపిన తల్లి
కతిహార్(బీహార్): ఆమె పేరు సీతాదేవి. ఆ పేరు పెట్టకుని రాక్షసంగా ప్రవర్తించిందో ఓ ఇల్లాలు. సహనం, సంస్కారం మచ్చకైనా లేని ఆ మహిళ సవిత కొడుకును కొట్టి చంపిన ఘటన సందాల్పూర్ లో సంభవించింది. సీతాదేవి భర్తకు గతంలో పెళ్లయి రోహిత్ అనే కొడుకు ఉన్నాడు. ఈ క్రమంలో అతని ముందు భార్యకు పుట్టిన కొడుకు కూడా వీరితోనే ఉంటున్నాడు. సవతి కొడుకును భారంగా భావించిన ఆ ఇల్లాలు తీవ్రంగా కొట్టింది. ఆ దెబ్బలకు తట్టుకోలేని ఆ బాలుడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.