అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అయోధ్య నగరాన్ని అత్యంత ఆధునాతనంగా, శోభాయమానంగా తీర్చిదిద్దిలే ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రయాణానికి అనువుగా ఉండేలా రోడ్డు దగ్గర నుంచి రైల్వేలైన్లు, ఎయిర్‌పోర్ట్ వంటి ఆధునాత హంగులతో పర్యావరణ హితంగా అయోధ్యని బహు సుందర నగరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ సందర్భంగా అయోధ్య రాజుగా పిలిచే బిమ్లేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా అయోధ్య నగర పునరుద్ధరణ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా సీతా మాత శాపం గురించి మాట్లాడారు. ఏంటా శాపం? ఆయన దశరథమహారాజు వంశానికి చెందిన వాడ? తదితరాల గురించే ఈ కథనం!
బిమ్మేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా అయోధ్య రాజకుటుంబానికి వారసుడు. ఆయన్ను అక్కడ ప్రజలు అయోద్య రాజు లేదా రాజా సాహెబ్ అని పిలుస్తుంటారు. ఆయన రామజన్మ భూమి ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. పైగా భూవివాదం కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు తర్వాత ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత ట్రస్ట్ సభ్యుడు కూడా. ఈ సందర్భంగా ప్రతాప్ మిశ్రా మాట్లాడుతూ..సుప్రీం కోర్టు తీర్పు వెలువడినప్పటి నుంచి అయోధ్యలో ఆనంద వాతావరణం నెలకొంది. ఆ తర్వాత తాత్కాలిక ఆలయన్ని నిర్మించారు. గానీ సెలువులప్పుడూ, మంగళవారాలు, ఏ పండగు సమయంలో అయినా నడిచివెళ్లడానికి అనువుగా స్థలం లేదు. అలాగే బస చేసేందుకు సరైన హోటల్ కూడా లేదు.
ఇప్పుడు అయోధ్య స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతుండడంతో ఫైవ్ స్టార్ హోటళ్లు ప్రారభించేందుకు ఏకంగా 100కు పైగా దఖాస్తులు వచ్చాయని ఆనందంగా చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ప్రజలు కేవలం దర్శనం కోసమే గాక నగరాన్ని వీక్షించేందుకైనా వస్తారని భావిస్తున్నా అన్నారు. ప్రస్తుతం అయోధ్య దేశంలోనే అత్యుత్తమ పట్టణంగా పేరు పొందుతుందని నమ్మకంగా చెప్పారు. జనవరి 22న జరిగే భవ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికల్లా అయోధ్యలో భారీ పునరుద్ధరణ జరుగుతుంది. ఇప్పటికే కొత్త విమానాశ్రయం ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైల్వేస్లేషన్లకు అత్యాధునిక సౌకర్యాలతో కొత్త రూపాన్ని ఇస్తున్నారు. అందువల్ల ఈ నగరాన్ని కోట్లాదిమంది యాత్రికుల వచ్చేలా అత్యాధునిక సౌకర్యాలతో శోభాయామానంగా ఉంటుందని చెప్పారు.
ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికర పురాణ కథనాన్ని కూడా పంచుకున్నారు. రామాయాణ ఘటంలో ఓ సన్నివేశాన్ని వివరిస్తూ సీతా మాత గురించి ఓ చాకలి వాడు చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా రాముడు ఆమె నగరం నుంచి బహిష్కరించిన ఘట్టం గురించి మాట్లాడారు. ఆమెను లక్ష్మణుడితో పంపించే అడవిలో వదిలేయడం జరగుతుంది. దీంతో సీత పట్టరాని దుఃఖంతో ఈ అయోధ్యను శపించిందని, అందువల్ల అయోధ్య ఇలా అభివృద్ధికి నోచుకోకుండా అయిపోందని ఇక్కడ ప్రజలంతా గట్టిగా నమ్ముతారు. ఇప్పుడు అయోధ్య సర్వతోముఖాభి వృద్ధిని చూస్తే బహుశా సీత తన శాపం ఉపసంహరించుకుందేమో అని అన్నారు.
నా జీవితంలో ఇది చూడలేననుకున్నా!
రామజన్మభూమి ఉద్యమంతో ప్రతాప్ మిశ్రాకు మూడు దశాబ్దాల నాటి అనుబంధం ఉంది. 1990లో అయోధ్యలో పోలీసులు జరిపిన కాల్పుల్లో కనీసం 50 మంది కరసేవకులు మరణించారు. అపడు ఆయన చాలామంది కరసేవకులకు తన ప్యాలెస్‌లో ఆశ్రయం కల్పించారు. నా జీవిత కాలంలో ఈ రామ మందిరాన్ని చూడగలనని ఎప్పుడు అనుకోలేదన్నారు. బహుశా నా అదృష్టమో ఏమో గానీ అత్యంత సుందరంగా రూపుదిద్దుకుంటున్న ఈ రామమందిరాన్ని చూసే భాగ్యం నాకు దక్కింది అని అయోద్య కింగ్ ప్రతాప్ మిశ్రా భావోద్వేగంగా మాట్లాడారు.
(చదవండి: మనదేశంలో చూడదగ్గ 'బెస్ట్ ఆఫ్‌బీట్' పర్యాటక ప్రదేశాలు! సందర్శిస్తే మైమరచిపోవడం ఖాయం!)
Comments
Please login to add a commentAdd a comment