curse
-
సీతమ్మ శాపాన్ని ఉపసంహరించుకుందేమో! అందుకే అయోధ్య..!
అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అయోధ్య నగరాన్ని అత్యంత ఆధునాతనంగా, శోభాయమానంగా తీర్చిదిద్దిలే ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రయాణానికి అనువుగా ఉండేలా రోడ్డు దగ్గర నుంచి రైల్వేలైన్లు, ఎయిర్పోర్ట్ వంటి ఆధునాత హంగులతో పర్యావరణ హితంగా అయోధ్యని బహు సుందర నగరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ సందర్భంగా అయోధ్య రాజుగా పిలిచే బిమ్లేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా అయోధ్య నగర పునరుద్ధరణ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా సీతా మాత శాపం గురించి మాట్లాడారు. ఏంటా శాపం? ఆయన దశరథమహారాజు వంశానికి చెందిన వాడ? తదితరాల గురించే ఈ కథనం! బిమ్మేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా అయోధ్య రాజకుటుంబానికి వారసుడు. ఆయన్ను అక్కడ ప్రజలు అయోద్య రాజు లేదా రాజా సాహెబ్ అని పిలుస్తుంటారు. ఆయన రామజన్మ భూమి ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. పైగా భూవివాదం కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు తర్వాత ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత ట్రస్ట్ సభ్యుడు కూడా. ఈ సందర్భంగా ప్రతాప్ మిశ్రా మాట్లాడుతూ..సుప్రీం కోర్టు తీర్పు వెలువడినప్పటి నుంచి అయోధ్యలో ఆనంద వాతావరణం నెలకొంది. ఆ తర్వాత తాత్కాలిక ఆలయన్ని నిర్మించారు. గానీ సెలువులప్పుడూ, మంగళవారాలు, ఏ పండగు సమయంలో అయినా నడిచివెళ్లడానికి అనువుగా స్థలం లేదు. అలాగే బస చేసేందుకు సరైన హోటల్ కూడా లేదు. ఇప్పుడు అయోధ్య స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతుండడంతో ఫైవ్ స్టార్ హోటళ్లు ప్రారభించేందుకు ఏకంగా 100కు పైగా దఖాస్తులు వచ్చాయని ఆనందంగా చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ప్రజలు కేవలం దర్శనం కోసమే గాక నగరాన్ని వీక్షించేందుకైనా వస్తారని భావిస్తున్నా అన్నారు. ప్రస్తుతం అయోధ్య దేశంలోనే అత్యుత్తమ పట్టణంగా పేరు పొందుతుందని నమ్మకంగా చెప్పారు. జనవరి 22న జరిగే భవ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికల్లా అయోధ్యలో భారీ పునరుద్ధరణ జరుగుతుంది. ఇప్పటికే కొత్త విమానాశ్రయం ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైల్వేస్లేషన్లకు అత్యాధునిక సౌకర్యాలతో కొత్త రూపాన్ని ఇస్తున్నారు. అందువల్ల ఈ నగరాన్ని కోట్లాదిమంది యాత్రికుల వచ్చేలా అత్యాధునిక సౌకర్యాలతో శోభాయామానంగా ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికర పురాణ కథనాన్ని కూడా పంచుకున్నారు. రామాయాణ ఘటంలో ఓ సన్నివేశాన్ని వివరిస్తూ సీతా మాత గురించి ఓ చాకలి వాడు చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా రాముడు ఆమె నగరం నుంచి బహిష్కరించిన ఘట్టం గురించి మాట్లాడారు. ఆమెను లక్ష్మణుడితో పంపించే అడవిలో వదిలేయడం జరగుతుంది. దీంతో సీత పట్టరాని దుఃఖంతో ఈ అయోధ్యను శపించిందని, అందువల్ల అయోధ్య ఇలా అభివృద్ధికి నోచుకోకుండా అయిపోందని ఇక్కడ ప్రజలంతా గట్టిగా నమ్ముతారు. ఇప్పుడు అయోధ్య సర్వతోముఖాభి వృద్ధిని చూస్తే బహుశా సీత తన శాపం ఉపసంహరించుకుందేమో అని అన్నారు. నా జీవితంలో ఇది చూడలేననుకున్నా! రామజన్మభూమి ఉద్యమంతో ప్రతాప్ మిశ్రాకు మూడు దశాబ్దాల నాటి అనుబంధం ఉంది. 1990లో అయోధ్యలో పోలీసులు జరిపిన కాల్పుల్లో కనీసం 50 మంది కరసేవకులు మరణించారు. అపడు ఆయన చాలామంది కరసేవకులకు తన ప్యాలెస్‌లో ఆశ్రయం కల్పించారు. నా జీవిత కాలంలో ఈ రామ మందిరాన్ని చూడగలనని ఎప్పుడు అనుకోలేదన్నారు. బహుశా నా అదృష్టమో ఏమో గానీ అత్యంత సుందరంగా రూపుదిద్దుకుంటున్న ఈ రామమందిరాన్ని చూసే భాగ్యం నాకు దక్కింది అని అయోద్య కింగ్ ప్రతాప్ మిశ్రా భావోద్వేగంగా మాట్లాడారు. (చదవండి: మనదేశంలో చూడదగ్గ 'బెస్ట్ ఆఫ్‌బీట్' పర్యాటక ప్రదేశాలు! సందర్శిస్తే మైమరచిపోవడం ఖాయం!) -
కాశీని శపించబోయిన వ్యాసుడు,ఆ తర్వాత ఏం జరిగిందంటే..
విశాలాక్షీ సమేతుడైన విశ్వనాథుడు కొలువుదీరిన కాశీ నగరంలో కొంతకాలం గడుపుదామని భావించి, శిష్యగణాన్ని వెంటబెట్టుకుని అక్కడకు చేరుకున్నాడు. ఆయన వెంట వచ్చిన శిష్యులలో వైశంపాయనుడు, జైమిని, పైలుడు, సుమంతుడు సహా ఎందరెందరో మహామహులు ఉన్నారు. కాశీలో వ్యాసుడు ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. రోజూ వేకువ జామునే కాలకృత్యాలు తీర్చుకుని, గంగలో స్నానం చేసి, సంధ్యవార్చి, ఆశ్రమంలో అగ్నికార్యం, అనుష్ఠానం పూర్తయ్యాక మధ్యాహ్నం భిక్షాటన కోసం ఊళ్లో తలోదారిన బయలుదేరేవారు. కాశీలో వారికి భిక్షకు లోటు ఉండేది కాదు. రోజులు ఇలా గడిచిపోతుండగా, విశ్వేశ్వరుడికి వ్యాసుణ్ణి పరీక్షించాలనిపించింది. ‘వ్యాసుడి అంతరంగం ఎలాంటిదో తెలుసుకుందాం. అతడికీ, అతడి శిష్యులకూ ఎక్కడా భిక్ష పుట్టకుండా చేయి’ అని విశాలాక్షితో చెప్పాడు. ఆమె సరేనంది. మరునాడు వ్యాసుడు, అతడి శిష్యులు యథాప్రకారం భిక్షాటనకు బయలుదేరారు. విశాలాక్షి ప్రభావంతో ఏ ఇల్లాలికీ భిక్ష పెట్టే ఇచ్ఛ లేకుండాపోయింది. వ్యాసుడు ఇల్లిల్లూ తిరుగుతూ గుమ్మం ముందు నిలబడి ‘భిక్షాందేహి’ అని గొంతెత్తి పిలిచినా, కొందరు గృహస్థులు కనీసం తలుపులైనా తీశారు కాదు. వ్యాసుడికి ఎదురైన అనుభవమే అతడి శిష్యులకూ ఎదురైంది. కాలే కడుపులతో, ఖాళీ భిక్షపాత్రలతో ఒక్కొక్కరే ఆశ్రమానికి చేరుకున్నారు. ‘నాకు ఎక్కడా ఒక్క మెతుకైనా పుట్టలేదు. మీలో ఎవరికైనా భిక్ష దొరికిందా?’ శిష్యులను అడిగాడు వ్యాసుడు. ‘లేదు గురుదేవా! ఎవరూ మాకు భిక్ష వేయలేదు’ బదులిచ్చారు శిష్యులు. వ్యాసుడు, అతడి శిష్యులు కడుపులో కాళ్లు ముడుచుకుని పస్తు పడుకున్నారు. మర్నాడు వేకువనే నిద్రలేని స్నాన సం«ధ్యాది నిత్య నైమిత్తిక అనుష్ఠానాలన్నీ పూర్తి చేసుకుని మళ్లీ భిక్షకు బయలుదేరారు. ఎక్కడా భిక్ష పుట్టలేదు. సాయంత్రం అయ్యే సరికి అందరూ నీరసంగా ఆశ్రమానికి చేరుకున్నారు. ఒక రోజు రెండు రోజులు కాదు, వరుసగా ఏడు రోజులు వ్యాసుడికి గాని, అతడి శిష్యులకు గాని కాశీ నగరంలో ఎక్కడా భిక్ష పుట్టలేదు. విశాలాక్షీ సమేతుడైన విశ్వేశ్వరుడు కొలువైన కాశీ నగరంలో ప్రతి ఇల్లాలూ ఒక అన్నపూర్ణ అని లోకం చెప్పుకుంటుంటే, తనకు తన శిష్యులకు ఇలా ఉపవాసాలు ఎదురవడం ఏమిటని వ్యాసుడు అమితంగా బాధపడ్డాడు. ఎనిమిదో రోజు వ్యాసుడు, అతడి శిష్యులు నిత్య నైమిత్తికాలు పూర్తి చేసుకుని, కాశీలో కొలువుదీరిన దేవతలందరికీ నమస్కారాలు పెట్టుకుని భిక్షకు బయలుదేరారు. వ్యాసుడికి ఒక్క ఇంటా భిక్ష దొరకలేదు. వరుస ఉపవాసాలతో వ్యాసుడు వ్యాకుల పడ్డాడు. తన శిష్యుల దురవస్థ తలచుకుని దుఃఖించాడు. అతడికి సహనం నశించింది. ఉక్రోషం ముంచుకొచ్చింది. నడివీథిలో తన భిక్షపాత్రను రాళ్లకేసి కొట్టి పగులగొట్టాడు. కాశీ వాసులకు మూడు తరాల వరకు విద్య, భక్తి, ధనమూ లేకుండా పోవాలని సంకల్పిస్తూ, కమండలం నుంచి శాపజలం అందుకోబోయాడు. వణుకుతున్న చెయ్యి ముందుకు రాకుండా నిలిచిపోయింది. అప్పుడే ఆ వీథిలోనున్న ఒక ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. సర్వాభరణ భూషితురాలైన ఒక నడివయసు స్త్రీ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చింది. ‘ఓ బ్రాహ్మడా! ఏమిటీ అఘాయిత్యం! కోపం మాని ఇలా రా’ అని పిలిచింది. ఆమె పిలుపుతో వ్యాసుడు తెప్పరిల్లాడు. ఆమె ఎవరో కనుక్కోకుండానే అప్రయత్నంగా నమస్కరించాడు. ‘భిక్ష దొరకనంత మాత్రాన కాశీ నగరాన్ని శపించేయడానికి సిద్ధపడ్డావే! ఇది నీకు విశ్వేశ్వరుడు పెట్టిన పరీక్ష. ఇదేనా నీ ధీరత్వం? ఏడురోజులు భిక్ష దొరకనంత మాత్రానికే నీ స్థైర్యం సడలిందేం?’ అని మందలిస్తూ, ‘మధ్యాహ్నానికి వస్తే, భిక్ష పెడతాను’ అంది. ‘తల్లీ! నన్నొక్కణ్ణేనా? నా శిష్యులను కూడానా? నాతో పాటే వాళ్లూ వారం రోజులుగా ఆకలితో అలమటిస్తున్నారు’ అన్నాడు వ్యాసుడు.‘గంగ వద్ద మధ్యాహ్న పూజలు ముగించుకుని అందరూ రండి. కడుపు నిండా భోజనం పెడతాను’ అందామె. మధ్యాహ్నం వెళ్లగానే విస్తర్లు వేసి, అందరూ ఆపోశనలు పట్టండని చెప్పింది. విస్తర్లు ఖాళీగా ఉన్నాయి. ఆపోశనలు పట్టగానే విస్తర్లలో ఎవరికి ఇష్టమైన పదార్థాలు వారికి ప్రత్యక్షమయ్యాయి. ఈమె సాక్షాత్తు అన్నపూర్ణాదేవి అయి ఉంటుందనుకుని అందరూ తృప్తిగా భోజనం చేశారు. భోజనాలు పూర్తి చేసి విశ్రమిస్తుండగా, పార్వతీ సమేతంగా శివుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. పార్వతీదేవి ప్రశాంతంగానే ఉన్నా, శివుడి ముఖం కోపంతో చిరచిరలాడుతూ ఉంది. శివుడు వ్యాసుణ్ణి కోపంగా చూస్తూ ‘ఓరీ దుర్మార్గుడా! నా భార్యలాంటి కాశీ నగరానికే శాపం ఇవ్వబోతావా? నువ్వు కాశీలో అడుగు పెట్టడమే ద్రోహం. నువ్వూ నీ శిష్యులూ కాశీ పొలిమేరలు దాటి వెళ్లండి’ అన్నాడు. చేసిన తప్పుకు బాధపడుతూ వ్యాసుడు శిష్యులతో సహా కాశీ నగరాన్ని విడిచిపెట్టాడు. -
మళ్లీ అదే తేదీ.. ఊగిపోయి కుప్పకూలిన బిల్డింగులు
మెక్సికో సిటీ: దక్షిణ అమెరికా దేశం మెక్సికో అతిభారీ ప్రకంపనలతో చిగురుటాకులా వణికిపోయింది. భారత కాలమానం ప్రకారం.. సోమవారం రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో అక్కడ భారీ భూకంపం సంభవించింది. మరోవైపు మూడు నుంచి తొమ్మిది అడుగుల ఎత్తు సముద్ర అలలు ఎగిసిపడడంతో.. సునామీ హెచ్చరికలు జారీ చేసింది యూఎస్-ఫసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం. రిక్టర్ స్కేల్‌పై 7.6 తీవ్రతతో పశ్చిమ మెక్సికో ప్రాంతంలో ఒక్కసారిగా ప్రకంపనలు సంభవించాయి. శక్తివంతమైన ప్రకంపనల ధాటిగా చెట్లు, భవనాలు కూలి విధ్వంసం చోటు చేసుకుంది. అయితే.. అదృష్టవశాత్తూ తక్కువ ప్రాణ నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు. కాకపోతే భారీగా భవనాలు కూలిపోగా.. దారిపొడవునా చెట్లు వేళ్లతో సహా రోడ్ల మీద కుప్పకూలాయి. En varias partes de nuestro pais estuvo bastante fuerte el #temblor #sismo #mexico #19septiembre pic.twitter.com/ga7LeMRWRn — Tapatio Tradi (@tapatiotrad) September 19, 2022 విశేషం ఏంటంటే.. సెప్టెంబర్ 19వ తేదీ మెక్సికో చరిత్రలో పెనువిషాదాలను నింపిన రోజు కావడం. 1985 సెప్టెంబర్ 19వ తేదీన రిక్టర్‌స్కేల్‌పై 8.0 తీవ్రతతో భూకంపం, పది అడుగుల ఎత్తు అలలతో సునామీ సంభవించగా.. ఐదువేల మందికిపైగా మరణించారు. ఇక.. 2017 సెప్టెంబర్ 19వ తేదీన మెక్సికో మున్సిపాలిటీ పరిధిలోని ప్యూబ్లాలో 7.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఆ దాటికి సుమారు 400 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆరు వేల మందికిపైగా గాయపడ్డారు. అయితే తాజా భూకంపంలో.. మాత్రం కేవలం ఒకే ఒక్క ప్రాణం పోయింది. మాంజానిలో లోని ఓ డిపార్ట్మెంట్స్టోర్ పైకప్పు కూలి ఒక వ్యక్తి మరణించాడు. గ్లాస్ పడి మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. కాకపోతే భారీ ప్రకంపనల ధాటికి భవనాలు, చెట్లు ఊగిపోయాయి. జనాలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఆస్పత్రులు, ప్రయాణాల్లో ఉన్నవాళ్లు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేత పట్టుకుని గడిపారు. మొత్తానికి సెప్టెంబర్ 19 భూకంపం సెంటిమెంట్ మెక్సికోను వణికిపోయేలా చేసింది. సునామీ హెచ్చరికలను ఇంకా ఉపసంహరించాల్సి ఉంది అక్కడ. ఇదీ చదవండి: కంటికి కనిపించని అద్భుతాలను ‘ఆ’ కంటితో చూడొచ్చు.. -
జీవో 111 రద్దు చేస్తే ప్రకృతికి శాపం
బంజారాహిల్స్: హైదరాబాద్‌కు ఒక వరంగా ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్సాగర్లకు రక్షణకవచమైన జీవో 111 రద్దు చేస్తే ప్రకృతికి శాపంగా మారుతుందని సేవ్ అవర్ అర్బన్ లేక్స్ కన్వీనర్ లుబ్నా సారావత్ అన్నారు. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోపోతే పర్యావరణ ప్రేమికులు, చెరువుల పరిరక్షకులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ కొద్దిరోజుల క్రితం జీవో 111 రద్దు చేస్తామని, ఇందుకోసం కమిటీ ఏర్పాటు చేశామని ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో పర్యావరణ ప్రేమికులు, పర్యావరణ ఉద్యమకారులు సమావేశమయ్యారు. లుబ్నా సారావత్ మాట్లాడుతూ జీవో 111 రద్దు నిర్ణయాన్ని, కమిటీని ఉపసంహరించుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు దోచిపెట్టడానికే సీఎం ప్రయత్నిస్తున్నారని, ఆయన రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో చెప్పినవన్నీ అబద్ధాలే.. ఉస్మాన్ సాగర్, హిమాయత్‌సాగర్‌లపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ అబద్ధాలు మాట్లాడారని సారావత్ దుయ్యబట్టారు. వీటిని కాపాడుకోకపోతే భవిష్యత్ కాలుష్యమయం అవుతుందని, ప్రతి ఒక్కరూ తమ ఉద్యమానికి మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. ఈ రెండు చెరువులు వరదలను ఆపడమే కాకుండా ఎన్నో వనరులకు కేంద్ర బిందువుగా ఉన్నాయని, శక్తి మేర నగరవాసుల దాహార్తి తీరుస్తున్నాయని పేర్కొన్నారు. భూగర్భ జలాలు పెరగడానికి, హైదరాబాద్ చుట్టూ ప్రకృతి విరాజిల్లడానికి కారణమవుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరి మద్దతు కూడగడతామని, ప్రజలకు వీటి అవసరాన్ని గుర్తు చేస్తామని వెల్లడించారు. ఐఏసీటీ విశ్రాంత శాస్త్రవేత్త బాబురావు మాట్లాడుతూ జీవో 111 రద్దు నిర్ణయాన్ని ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రకృతికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే, వాటి దుష్పరిణామాలు తట్టుకోలేరన్నారు. ప్రజలందరితో చర్చించిన తర్వాతనే జీవో 111పై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. -
సహచర ఆటగాడికి రోహిత్ శర్మ శాపనార్థం..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహచర ఆటగాళ్లను ట్రోల్ చేయడంలో ముందు వరుసలో ఉంటాడు. తాజాగా హిట్‌మాన్.. ముంబై ఇండియన్స్ సహచర ఆటగాడు ధవల్ కులకర్ణికి శాపనార్థం పెట్టాడు. అదేంటి.. రోహిత్ ఇలా చేయడమేంటి అనుకుంటున్నారా.. అదంతా ఫన్నీ శాపనార్థం మాత్రమే. విషయంలోకి వెళితే.. ధవల్ కులకర్ణి మంగళవారం తన స్నేహితులతో కలిసి కాఫీ షాప్‌కు వెళ్లాడు. ఈ సందర్భంగా స్నేహితులతో కలిసి దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ''మేం ముగ్గురం ఏ విషయంపై మాట్లాడుకుంటున్నామో చెప్పగలరా'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. దీనికి రోహిత్ ఫన్నీగా మరాఠీ భాషలో ఏదో శపించాడు. ''మీ ముగ్గురిలో పెద్ద..'' అంటూ రోహిత్ మరాఠీలో పదాన్ని ఉపయోగిస్తూ కామెంట్ చేశాడు. రోహిత్ ఉపయోగించిన పదం మరాఠిలో ఎవరినైనా శపించడానికి వాడే పదం అని తెలిసింది. మరాఠీ అయిన ధవల్ కులకర్ణికి రోహిత్ పదం అర్థం కావడంతో లాఫింగ్ ఎమోజీ పెట్టాడు. చదవండి: IPL 2022 Auction: మెగా వేలం.. మార్కీ ప్లేయర్ల లిస్టు ఇదే.. ధవల్ కులకర్ణి టీమిండియా తరపున 12 వన్డేల్లో 19 వికెట్లు, 2 టి20 మ్యాచ్‌లాడి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున 35 మ్యాచ్‌ల్లో 36 వికెట్లు పడగొట్టాడు.. ఓవరాల్‌గా 92 మ్యాచ్‌ల్లో 86 వికెట్లు తీశాడు. ఇక హిట్‌మాన్ సారధ్యంలోని ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్ చరిత్ర సృష్టించాడు. ఇక ఈసారి మెగావేలం ఫిబ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరు వేదికగా జరగనుంది. మొత్తం 590 మంది క్రికెటర్లతో కూడిన షార్ట్‌లిస్ట్ జాబితాను బీసీసీఐ మంగళవారం విడుదల చేసింది ఇక దాదాపు 10 వారాల బ్రేక్ తర్వాత రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా బరిలోకి దిగనున్నాడు. నవంబర్‌లో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌లో కెప్టెన్‌గా పనిచేసిన రోహిత్.. ఆ తర్వాత గాయంతో సౌతాఫ్రికా సిరీస్‌కు దూరమయ్యాడు. తాజాగా గాయం నుంచి కోలుకున్న హిట్‌మాన్ విండీస్‌తో టి20, వన్డే సిరీస్‌కు తొలిసారి పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అంతకముందు రోహిత్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో టీమిండియా సౌతాఫ్రికాకు 0-3తో సిరీస్ కోల్పోయిన సంగతి తెలిసిందే. చదవండి: IPL 2022 Auction: వేలంలో పాల్గొనాలంటూ స్టార్ ఆటగాడికి ఫోన్‌కాల్.. కానీ View this post on Instagram A post shared by Dhawal Kulkarni (@dhawal_kulkarni) -
కర్కారేపై ప్రజ్ఞా సింగ్ సంచలన వ్యాఖ్యలు
ముంబైపై ఉగ్రవాద ముష్కరుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన మహారాష్ట్ర పోలీసు అధికారి హేమంత్ కర్కారే పై బీజేపీ భోపాల్ లోక్‌సభ నియోజకవర్గంలో బరిలో నిలిచిన సాధ్వి ప్రజ్ఞా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విచారణలో తనను తీవ్ర వేధింపులకు గురిచేశాడంటూ 2008 మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలు కేసును దర్యాప్తు అధికారి మాజీ ఎటిఎస్ చీఫ్ హేమంత్ కర్కారేపై మండిపడ్డారు. అంతేకాదు తను శపించిన కారణంగానే కర్కారే దారుణంగా చనిపోయాడంటూ వ్యాఖ్యానించడం వివాదానికి దారి తీసింది. నిరపరాధిని, సన్యాసిని అయిన తనను వేధించినందు భగవంతుడు ఆగ్రహించాడు. అందుకే కర్మ అనుభవించాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘సాక్ష్యాలు లేకుండా జైల్లో పెట్టడం అన్యాయని, విడిచిపెట్టాలని కోరాం. కానీ ఆయన (హేమంత్ కర్కారే) వినలేదు.. ఎలాగైనా సాక్ష్యాలు సంపాదిస్తానని ఘీంకరించాడు. నా పై కుట్ర చేశాడు. ఇది ధర్మానికి విరుద్ధం. దేశ ద్రోహం. దాడి ఎలా జరిగింది...ఎందుకు జరిగిందని పదే పదే ప్రశ్నించాడు. నాకేమీ తెలియదు..అంతా ఆ భగవంతుడికే తెలుసని చెప్పారు. అయితే ఆ భగవంతుడి దగ్గరికెళ్లి అడగమంటావా అని గేలి చేశాడు. అందుకే పోయాడు.. కొంచెం ఆలస్యమైనాగానీ, నువ్వు సర్వనాశనం అయిపోతామని కర్కారేని శపించాను. సరిగ్గా నెలన్నర రోజుల్లోనే ఉగ్రవాదులు కర్కారేని అంతం చేశారని’ ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ స్పందిస్తూ సైన్యం, అమరవీరులపై ఎలాంటి రాజకీయ వ్యాఖ్యానాలు చేయరాదని ఈసీ స్పష్టంగా చెప్పిందన్నారు. ముంబై ప్రజల కోసం బలిదానం చేసిన నిజాయితీగల అధికారి హేమంత్ కర్కారేపై ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలు అనుచితమైనవని, ఈ నేపథ్యంలో ఆమెపై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు. అటు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ను భోపాల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ బరిలోకి దింపడాన్ని ప్రశ్నించిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా ప్రజ్ఞా వ్యాఖ్యల్ని తప్పు బడుతూ ట్వీట్ చేశారు. 2008 మాలెగావ్ పేలుళ్ల కేసుకు సంబంధించి తాను జైలులో ఉండగా పోలీసు వేధింపులపై గురువారం మీడియతో మాట్లాడారు. తాను గడిపిన జైలు జీవితం అత్యంత దుర్భరంగా గడిచిందని చెప్పారు. 13 రోజుల అక్రమ కస్టడీలో మొదటి రోజు నుంచే తనను బెల్ట్‌లతో తీవ్రంగా హింసించారనీ ఏ మహిళకూ ఇలాంటి వేధింపులు ఎదురుకాకూడదంటూ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాగా సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ భోపాల్ నుంచి ఎంపీగా బీజేపీ బరిలోకి దింపడపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ సీనియర్‌నేత దిగ్విజయ్ సింగ్‌కు పోటీగా బీజేపీ సాధ్వి అస్త్రాన్ని ప్రయోగించింది. #WATCH Pragya Singh Thakur:Maine kaha tera (Mumbai ATS chief late Hemant Karkare) sarvanash hoga.Theek sava mahine mein sutak lagta hai. Jis din main gayi thi us din iske sutak lag gaya tha.Aur theek sava mahine mein jis din atankwadiyon ne isko maara, us din uska anth hua (18.4) pic.twitter.com/COqhEW2Bnc — ANI (@ANI) April 19, 2019 -
బాబు తీరు రాష్ట్రానికి శాపమైంది: కేవీపీ
సాక్షి, ఢిల్లీ: వ్యక్తిగత ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేశారు.. ఆయన తీరు రాష్ట్రానికి శాపంగా మారిందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. ఈమేరకు ఆయన సీఎంకు లేఖ రాశారు. నాలుగేళ్లయినా విభజన చట్టంలోని హామీలను అమలు చేయించుకోలేకపోయారన్నారు. దోపిడీ వాటాలు కుదరక ప్రాజెక్టులు ఆలస్యం చేస్తున్నారని, అమరావతి లో శాశ్వత భవనాలకు ఇటుక పేర్చలేదని విమర్శించారు. విభజన చట్టం హామీలపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. చివరి నిమిషంలో బిజెపిపై నిందలేస్తే ప్రజలు క్షమించరని హితవు పలికారు. ఆస్పత్రి పేర దుబాయ్ కంపెనీకి భూములు ఇవ్వడంలో ఉన్న ఆసక్తి ఎయిమ్స్ నిర్మాణంపై లేదని, కాంట్రాక్టర్ల రేట్ల కోసం కేంద్రంతో తగాదాపడడం విడ్డూరంగా ఉందని కేవీపీ వ్యాఖ్యానించారు. చంద్రబాబు హెరిటేజ్, బిగ్‌బజార్ ప్రయోజనాల కోసం రాజీపడుతున్నారని ఆరోపించారు. విభజనకు కాంగ్రెస్ ఒక్కటే కారణం కాదంటూ టీడీపీ కూడా రెండుసార్లు విభజన లేఖలు ఇచ్చిందని వెల్లడించారు. -
మమ్మీ శాపం నిజమా?
బంగారు నిధిని కనిపెట్టాం దాన్ని తవ్వాలంటే నరబలి ఇవ్వాలి. లేదంటే ఆ నిధి మనల్ని శపిస్తుందన్న కారణంతో జరిగే ఆకృత్యాలను మనం అప్పుడప్పుడు వింటూనే ఉన్నాం. గుప్తనిధి, సమాధుల్లో అతీంద్రియ శక్తులు ఉంటాయని వాటిని తవ్వితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుందని చాలామంది విశ్వసిస్తుంటారు. ఈజిప్టులో ఎన్నో ఏళ్లుగా ఉన్న సమాధిని తవ్విన వ్యక్తులు వివిధ కారణాలతో ఆకస్మాత్తుగా మరణించారు. మరి వారి మరణానికి కారణాలేంటి...? నిజంగా సమాధిలోని శక్తి వారిని చంపిందా లేక మరేదైనా కారణాలతో చనిపోయారా అన్న విషయాలను ఈ రోజు తెలుసుకుందాం...! ఈజిప్టువాసులకు పునర్జన్మ, మరణం అనంతరం జీవితంపై అంతులేని విశ్వాసం. అందుకే, వ్యక్తి మరణించినా.. వారు తిరిగి లేస్తారని భావించేవారు. అందుకే, వారి శరీరాలు పాడవకుండా జాగ్రత్తగా ఖననం చేసేవారు. చనిపోయిన వ్యక్తికి తిరిగి ప్రాణమొస్తే.. అతనికి ఉపయోగపడేలా.. కావాల్సిన పాత్రలు, వస్తువులను సమాధిలో ఉంచేవారు. చనిపోయింది రాజులైతే.. వారికి తోడుగా పనివాళ్లని కూడా బతికుండగానే.. మమ్మీలుగా మార్చేవారు. అలాంటిది ఏకంగా ఈజిప్టు రాజు ట్యుట్ అంక్ మూన్ అనే రాజు మరణించాడు. వారి ఆచారాల ప్రకారం అతినికిష్టమైన వస్తువులు, కళాఖండాలు బంగారంతో పొదిగిన ఆభరణాలు అతనితోపాటే సమాధిలో పెట్టారు. అంతేకాదు సమాధిలో ఆయన తినడానికి వీలుగా బంగారు, వెండితో చేసిన పాత్రలను కూడా ఉంచారు. టూట్స్ సమాధిలో ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయని అక్కడి ప్రజలందరికి తెలిసినప్పటికీ దాన్ని ఎవరూ తెరిచేందుకు సాహసించేవారు కాదు. ఎందుకంటే ఆ సమాధిని తెరిస్తే తాము శాపానికి గురై అకాలమరణం చెందుతామని వారి విశ్వాసం. స్థానికులు వారించినా 1923లో బ్రిటిష్ ఆర్కియాలజికల్ సంస్థకు చెందిన లార్డ్ కార్నర్వాన్, హవర్డ్కార్టర్లు టూట్స్ సమాధి తెరిచేందుకు సిద్ధమయ్యారు. ఇందుకుగాను జార్జ్ హెబర్ట్ నిధులు సమకూర్చారు. సమాధి తెరిస్తే శాపానికి గురౌతారని స్థానికులు ఎంత వారించినప్పటికీ వారి ప్రయత్నాన్ని మాత్రం విరమించుకోలేదు. ఇలాంటి మూఢవిశ్వాసాలను తామేమాత్రం లెక్కచేయమన్నారు. కార్నర్వాన్ ఆధ్వర్యంలో సమాధిని తెరిచారు. అయితే సమాధిని తెరిచిన నెలరోజులకు ఒకరోజు ఉదయం కార్నర్వాన్ గడ్డం గీసుకుంటుండగా అతని చెంపపై దోమ కుట్టింది. అది ఇన్ఫెక్షన్గా మారడంతో ఆసుపత్రికి వెళ్లాడు. ఆయన ఎన్ని ఆసుపత్రులు తిరిగినా, ఎన్ని మందులు వాడినప్పటికీ ఇన్ఫెక్షన్ తగ్గలేదు. చివరికి ఆయన శరీరంలోని రక్తం కుళ్లిపోయి కార్నర్వాన్ మరణించాడు. ఇలా ఆ సమాధి తెరిచినప్పుడు ఉన్న వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు మరణించడం మొదలైంది. ఒకరు ఆత్మహత్య చేసుకుంటే మరొకరు అనారోగ్య కారణాలతోగానీ మరేదైనా కారణాలతోగానీ మరణించారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు మరణిస్తుంటే ఆ సమాధిని తెరవడం వల్లనే శాపానికి గురై మరణించారని ప్రచారం మొదలైంది. స్థానికంగా ఉన్న మీడియా కూడా సమాధిలో ఉన్న శక్తే వీరిని శపించిందని కథనాలు రాసింది. కార్నర్ మరణం ఒక్కటే కాదు ఆ సమాధిలో ఉన్న ప్రతిఒక్కరూ మరణిస్తారనుకున్నారు స్థానికులు. సమాధి తెరిచేందుకు సహకరించిన వ్యక్తులు ఆకస్మాత్తుగా మరణిస్తుండటంతో ఈ పుకార్లు మరింత షికారు చేసాయి. ఏది నిజం? ఇలా ఒకరితర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్న ఆకస్మిక మరణాలకు కారణాలేంటని శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు. నిజంగా సమాధిలో ఉన్న శక్తి శపించడం మూలాన వారు మరణించారా? లేదా మరేదైనా కారణాలతో మరణించారా అని అధ్యయనం సాగించారు. దానికి వారు కొన్ని కారణాలను ఉదహరించారు. సమాధిని ఇతరులెవరూ తెరవకుండా ఉండేందుకు ఆ శవపేటికల గోడలకు గుర్తు తెలియని విషాన్ని పూసి ఉంటారన్నది కొందరు విశ్లేషించారు. లేదా వేల ఏళ్లుగా సమాధి గోడలపై ఉన్న ప్రమాదకర బ్యాక్టీరియా వారి చేతుల ద్వారా శరీరంలోకి వెళ్లి అనారోగ్యం బారిన పడిఉంటారని మరికొందరు వివరించారు. అంతేకాదు.. అక్కడున్న వ్యక్తులకు ఇదివరకు వివిధ అనారోగ్య సమస్యలున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. కానీ, పుకారుకు వేగమెక్కువ కాబట్టి.. జనాలు శాపాన్నే ఎక్కువగా నమ్మారు. అయితే, సమాధిని తెరిచిన తర్వాత తొలిసారి అందులోకి దిగిన హవార్డ్ కార్టర్ మాత్రం పది సంవత్సరాలకు పైగా జీవించడం విశేషం.– సాక్షి స్కూల్ ఎడిషన్ -
వేసవితాపం.. చిన్నారులకు శాపం
– డీహైడ్రేషన్‌తో ఆస్పత్రి పాలవుతున్న వైనం – కిటకిటలాడుతున్న విమ్స్ పీడియాట్రిక్ వార్డు బళ్లారి: బసిల బళ్లారిగా పేరుగాంచిన నగరంలో ఎండలు మండుతూ నిప్పులు కురిపిస్తున్నాయి. వారం రోజులుగా 41 నుంచి 42 డిగ్రీలతో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో పిల్లలే కాదు పెద్దలు సైతం ఎండలకు తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా శిశువులు శరీరంలోని నీటి కొరత(డీహైడ్రేషన్)తో అస్వస్థతకు గురై జ్వరాలతో ఆస్పత్రి పాలవుతున్నారు. దీంతో నిత్యం విమ్స్ పీడియాట్రిక్ వార్డు కిటకిటలాడుతోంది. ఇప్పటి వరకు సుమారు 70మంది శిశువులు డీహైడ్రేషన్‌తో ఆసుపత్రి పాలైనట్లు విశ్వసనీయ సమాచారం. ఈ వేసవిలో అన్ని విభాగాల కంటే పీడియాట్రిక్ విభాగంలోనే చేరే శిశువుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శిశువుల్లో డీహైడ్రేషన్ నివారణకు అధికంగా మంచినీటిని తాగాలని, శిశువులు ఉండే గదులు చల్లగా ఉండేటట్లు చూడాలని, శరీరంలో నీటి సాంద్రత తగ్గకుండా చూసుకోవాలని పీడియాట్రిక్ వైద్యులు సూచిస్తున్నారు. -
'నేనిక శపించను'
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె గురువారం తన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లోకెక్కారు. జపాన్ నుంచి తిరిగి స్వదేశానికి వస్తూ దవావో నగరంలో మాట్లాడారు. విమానంలో అందరూ నిద్రిస్తున్న సమయంలో తాను మాత్రం ఆకాశం వైపు చూశానని చెప్పారు. ఆ సమయంలో తానొక గొంతును విన్నానని.. భవిష్యత్తులో నిరర్ధక వ్యాఖ్యలు మానుకోపోతే విమానాన్ని ఇప్పుడే కూల్చేస్తాననే మాటలు ఆకాశవాణి రూపంలో తనకు వినిపించినట్లు చెప్పారు. మీరెవరు? అని ప్రశ్నించగా దేవుడనే సమాధానం వచ్చిందని తెలిపారు. ఇక నుంచి తాను ఎవరినీ దూషిస్తూ మాట్లాడనని, శపించనని దేవుడికి ప్రమాణం చేస్తున్నానని చెప్పారు. దేవుడికి ప్రమాణం చేస్తే ఫిలిప్పీన్ ప్రజలందరికీ ప్రమాణం చేసినట్లేనని అన్నారు. డ్యుటెర్టె సంభాషణ గురించి చెప్పడం ముగియగానే ఆ ప్రదేశం అంతా చప్పట్లతో హోరెత్తింది. దీనిపై స్పందిచిన డ్యుటెర్టె ఎక్కువగా చప్పట్లు కొట్టొద్దని దీన్ని కూడా రాద్దాంతం చేస్తారని అన్నారు. కాగా, ఈ ఏడాది జూన్ చివరిలో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి దేశంలో డ్రగ్స్ మాఫియాపై డ్యుటెర్టె ఉక్కుపాదం మోపారు. ఆయన చర్యలకు వేల సంఖ్యలో డ్రగ్ డీలర్లు మరణించారు. పోప్ ఫ్రాన్సిస్ ను వెలియాలి తనయుడు అంటూ డ్యుటెర్టె చేసిన వ్యాఖ్యలతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆయనపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. -
ముఖ్యమంత్రిని శపించిన మాంత్రికుడు!
మైసూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆయన ఇంటివద్ద శపించాడు. కాగా, శపించిన వ్యక్తి రాష్ట్రంలో చేతబడులు ఎక్కువగా చేసే కొల్లెగల ప్రాంతానికి చెందినవాడని సమాచారం. ఇంటి వద్దకు వచ్చిన ఓ వ్యక్తి ఇచ్చిన వస్త్రాన్ని సీఎం సిద్దరామయ్య స్వీకరించకపోవడంతో కోపగించుకున్న అతను కారు డ్రైవర్ పక్కన కిటికీ నుంచి ముఖ్యమంత్రిని శపించారని తెలిసింది. ఈ ఘటనను సీఎం పట్టించుకోకుండా వదిలేశారు. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల వల్ల అసలే సీఎం ప్రతిష్ట దిగాజారుతుండగా, గుర్తుతెలియని వ్యక్తి సీఎంను శపించడం కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది. దీనిపై మాట్లాడిన కార్యకర్తలు అసలే కొంతకాలంగా సీఎంను దురదృష్టం వెంటాడుతోందని, ఈ సమయంలో ఇలాంటి పరిణామం చోటుచేసుకోవడం ఆందోళనకరంగా ఉందని అన్నారు. అందుకే శాపాన్ని వెనక్కు తీసుకోవాలని అతన్ని కోరినట్లు వివరించారు. ఎలా జరిగింది..? మైసూరులోని ముఖ్యమంత్రి నివాసం దగ్గర ఉన్న బారికేడ్లలో నుంచి దూసుకుపోయి, సెక్యూరిటీ నుంచి తప్పించుకున్న ఓ వ్యక్తి అప్పుడే కారులోకి ఎక్కబోతున్న సీఎం సిద్ధరామయ్యను కలిసి పూజచేసిన వస్త్రాన్ని తీసుకోవాలని కోరాడు. అయితే, ఇలాంటి వాటిమీద పెద్దగా నమ్మకం లేని సీఎం అందుకు నిరాకరించడంతో.. అతడు తన భార్యకు ఆరోగ్యం బాగాలేదని, సాయం చేయాలని కోరాడు. దీనిపై స్పందించిన సీఎం ఇలాంటి వాళ్లు చాలా మంది ఉంటారు, అబద్ధాలతో బతకాలని ప్రయత్నిస్తారని కార్యకర్తలతో అన్నారు. దాంతో కోపంతో రెచ్చిపోయిన అతను పోలీసుల నుంచి తప్పించుకుని కారు డ్రైవర్ కు పక్కగా వెళ్లి కిటికీలో నుంచి సీఎంను శపించాడు. కొల్లెగలకు మాంత్రికవిద్యలకు సంబంధం ఏంటి? కర్ణాటకలోని చామరాజనగర జిల్లాలో కొల్లెగల పట్టణం ఉంది. ఈ పట్టణానికి రాజకీయనేతలకు కొన్నేళ్లుగా ప్రత్యేక సంబంధం ఉంది. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల్లో ఎక్కువమంది ఈ ప్రాంతానికి మకాం మారుస్తారు. మాంత్రిక విద్యలను సాధన చేసే వారు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండటంతో ఎన్నికల్లో ప్రత్యర్ధులను ఎలాగైనా ఓడించేందుకు వీరి సాయం తీసుకుంటుంటారు. కాగా, కర్ణాటక రాజకీయాల్లో మాత్రం ఈ ఊరి పేరు పెద్దగా వినిపించేది ఎవరైనా రాజకీయ నాయకుడు అనారోగ్యం పాలైనప్పుడే. జేడీ(ఎస్) నేతలు మంత్రగాళ్లతో తమవారిని శపింపజేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు తరచూ ఆరోపించడం ఇందుకు నిదర్శనం. 2011లో అప్పటి ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప తనకు మాంత్రిక శక్తుల వల్ల ప్రాణహాని ఉందని వ్యాఖ్యనించడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతుంది. -
అమ్మబోతే అడవి...
- పడకేసిన అపరాల వ్యాపారం - కొనుగోళ్లపై రుణమాఫీ ప్రభావం - రెతుల చేతుల్లో కాసులు లేకపోవడమే కారణం - మార్కెట్లో తగ్గిన ద్రవ్య చలామణి తాడేపల్లిగూడెం : కొత్త పప్పులు మార్కెట్లోకి వచ్చే ఫిబ్రవరి నెలలో అపరాల దుకాణాల వద్ద సందడి ఉంటుంది. కానీ.. అపరాలకు ప్రధాన మార్కెట్‌గా ఉన్న తాడేపల్లిగూడెంలో మూడు నెలలుగా మార్కెట్ మందకొడిగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే దాదాపుగా 50 శాతం అమ్మకాలు పడిపోయాయి. రోజుకు రూ.70 వేల నుంచి రూ.80 వేల మేరకు వ్యాపారం సాగించే దుకాణాల్లో సైతం ప్రస్తుతం రూ.30 వేలకు మించి విక్రయాలు జరగడం లేదని చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్, నిల్వలకు సరుకులు తీసుకెళ్లే సమయంలో బేరాలు ఊపందుకుంటాయని వ్యాపారులు భావించారు. కానీ.. ఆ పరిస్థితి మార్కెట్లో కనిపించడం లేదు. వివిధ కారణాల వల్ల ద్రవ్య చలామణి తగ్గడం ఒక కారణంగా చెబుతున్నప్పటికీ అసలు కారణాలను వ్యాపార వర్గాలు కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నాయి. ఆర్థిక సంవత్సరం చివరిలో టర్నోవర్ పడిపోవడం ఇదే ప్రథమమని వాణిజ్య పన్నుల శాఖ అధికారి బి.వెంకటేశ్వరరావు అంటున్నారు. మార్కెట్లో ద్రవ్య చలామణి ఎందుకు తగ్గింది? కారణాలు ఏమిటనే విషయాలను మార్కెటింగ్ అవసరాల కోసం సరుకులను సరఫరా చేసే బడా వ్యాపారులు, దళారులు సైతం అంచనా వేయలేకపోతున్నారు. అలాగని గత సీజన్ కంటే సరుకులను పెద్దమొత్తంలో నిల్వ చేసిందీ లేదు. ఉన్న కొద్దిపాటి నిల్వలకు ఆర్డర్లు రాని పరిస్థితి. ఇంతకుముందు తెచ్చుకున్న సరుకులు దుకాణాల నుంచి కదలని పరిస్థితులలో ఒక్కసారిగా పప్పుల వ్యాపారం పడకేసింది. అన్ని జిల్లాల్లోనూ ఒక్కసారిగా ఇలాంటి పరిస్థితి రావడం ఇదే ప్రథమంగా వ్యాపారులు చెబుతున్నారు. అసలే బేరం లేదనుకుంటే విజిలెన్స్ దాడులు వ్యాపారులను తేరుకోకుండా చేస్తున్నాయి. మరోపక్క లెసైన్సింగ్, పన్నుల విధానంలో మార్పులు కూడా వ్యాపారాన్ని ముం దుకు సాగనివ్వడం లేదు. అమ్మకాలపై రుణమాఫీ ప్రభావం రుణమాఫీ రైతుల పాలిట శాపంగా మారింది. రెండో పంట వేసే సమయానికి రైతులు సహకార సంఘాలు, బ్యాంకులలో తీసుకున్న రుణాలను పూర్తిగా చెల్లించి కొత్త అప్పులు తీసుకోవడం లేదా రుణాన్ని తిరగ రాసుకోవడం వంటివి చేస్తారు. అప్పులకు పోను, మిగిలిన సొమ్ములు నాలుగు రూపాయలు రైతుల చేతిలో ఆడుతూ ఉంటాయి. దమ్ములు, ఊడ్పులు వంటి వాటికి కొంత ఖర్చు చేసినా.. ఎరువులు, పురుగు మందులు చాలావరకు అరువు తెచ్చుకుంటారు. పంటలు చేతికి వచ్చాక తిరిగి చెల్లించే పరిస్థితి చాలా ప్రాంతాలలో ఉంటుంది. ఇలా మొదటి పంటకు సంబంధించి సొమ్ముతో ఇంట్లోకి కావలసిన అపరాలను నిల్వ కోసం రైతులంతా కొంటుంటారు. అనుకున్నట్టుగా రుణమాఫీ జరగకపోవడంతో తొలిసారిగా రైతులు ఉన్నదంతా ఊడ్చి, ఇంట్లోని నగానట్రా తాకట్టు పెట్టి వ్యవసాయ పనులు చేసుకోవలసిన దుస్థితి దాపురించింది. చేతిలో చిల్లిగవ్వ లేని ఈ పరిస్థితిలో రైతులు నిల్వ కోసం కొనుగోలు చేసే అవకాశం లేకపోవడంతో ఒక్క సారిగా అపరాల వ్యాపారం కుదేలైంది. ధరలు స్థిరం మేలు రకం కందిపప్పు గుత్త మార్కెట్లో కిలో రూ.80 ఉంది. మినపప్పు రూ.70, శనగపప్పు రూ.50, పెసరపప్పు 6నెలలు గా కిలో రూ.110 వద్ద స్థిరంగా ఉన్నాయి. వేరుశనగ పంట దెబ్బతినడం వల్ల కిలో రూ.80 ఉంది. బన్సీ రవ్వ, మైదా రవ్వ, గోధుమ రవ్వ ధరలు కిలో రూ.27కు అటూ ఇటూగా ఉంటున్నాయి. పంచదార క్వింటాల్ రూ.2,900 ఉంది. వ్యాపారాలు మందగించాయి అపరాల వ్యాపారులు మూడు నెలలుగా సంతోషంగా లేరు. అమ్మకాలు దాదాపు 50 శాతం తగ్గాయి. ఇలాంటి పరిస్థితిని తొలిసారిగా ఎదుర్కొంటున్నారు. జనాల చేతిలో సొమ్ములాడక ఈ స్థితి వచ్చింది. - రామచంద్ర అగర్వాల్, అధ్యక్షుడు, చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్, తాడేపల్లిగూడెం పండగ లేదు.. పెళ్లిళ్ల బేరమూ లేదు పండగలు వస్తున్నాయంటే పరమానందంగా ఉండేది. అపరాల వ్యాపారం బాగా సాగేది. సంక్రాంతి అంటే నిజంగా మాకు పెద్ద పండగే. ఈ ఏడాది ఆ బేరమూ లేదు. పోనీ నిల్వల బేరం ఉంటుందని ఆశ పడ్డాం. అదీ లేకుండా పోయింది. రైతుల చేతిలో నాలుగు రూపాయలు ఆడితే బేరం ఉంటుంది. ఇప్పుడా పరిస్థితి లేక అమ్మకాలు బాగా తగ్గాయి. - ఉంగరాల శ్రీనివాస్, అపరాల వర్తక సంఘ నాయకుడు, తాడేపల్లిగూడెం. -
యూ‘నో’ఫాం
కడప ఎడ్యుకేషన్: పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాదీ పాఠశాల విద్యార్థులకు యూనిఫాం కష్టాలు తప్పడంలేదు. ఒకటి రెండు కాదు పాఠశాలలు ప్రారంభమై ఏడు నెలలుగా గడుస్తున్నా ఇప్పటికీ యూనిఫాం అందని దుస్థితి నెలకొంది. జిల్లాలోని 51 మండలాలకుగాను ఇప్పటి వరకు 26 మండలాలలోని విద్యార్థులకే యూనిఫాం దస్తులు అందాయి. మరో మూడు నెలలు గడిస్తే పాఠశాలకు సెలవులు కూడా వస్తాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 3, 305 పాఠశాలల్లో 1 నుంచి 8 వతరగతి చదివే విద్యార్థులకు ఒకొక్కరికి రెండు జతలు చొప్పున యూనిఫాం ఇవ్వాల్సి ఉంది. సంబంధిత యూనిఫాంను సర్వశిక్ష అభియాన్ పథకం ద్వారా ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంది. ఈ పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా దాదాపుగా రెండు లక్షల మంది లబ్ధిపొందనున్నారు. వారు కుట్టేదెప్పుడు.. విద్యార్థులు కట్టేదెన్నడు. విద్యార్థులకు దుస్తులు కుట్టే బాధ్యతను ఎస్ఎస్ఏ అధికారులు మెప్మాకు అప్పజె ప్పారు. జిల్లా వ్యాప్తంగా 38 మండలాలను వారికి కేటాయించారు. మిగతా 13 మండలాలను సంబంధించిన యూనిఫాంను కుట్టే బాధ్యతను బయటి వ్యక్తులకు అప్పగించారు. వారు మాత్రం ఇప్పటికీ 12 మండలాలకు సంబంధించిన దుస్తులను కుట్టి అప్పగించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇంకా ఒక మండలానికి సంబంధించిన యూనిఫాం సిద్ధమవుతోందని తెలిపారు. మరోవైపు మెప్మా వారు ఇప్పటికి 16 మండలాలలోని పాఠశాలల విద్యార్థులకు సంబంధించిన యూనిఫాంను కుట్టి అందజేశారు. మిగతా 4 మండలాలకు సంబంధించిన దుస్తులను కుట్టి సిద్ధం చేయగా వాటికి ఇంకా కాజాలు, గుండీలను ఏర్పాటు చేసి అందజేయాల్సి ఉందని తెలిపారు. యూనిఫాంలకు సంబంధించిన విషయంలో ప్రతి సారీ ఇదే వరుస కనిపిస్తోంది. ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా విద్యార్థుల దుస్తుల విషయంలో మాత్రం పురోగతి కనిపించటం లేదు. ఫిబ్రవరి 15లోపు.. అన్ని పాఠశాలలకు యూనిఫాంలను అందజేస్తాం. ఈ సారి బట్టరావటం కొంత ఆలస్యం అయింది. దీంతోపాటు మరికొన్ని కారణాల వల్ల తీవ్రజాప్యం జరిగింది. ఫిబ్రవరి 15 కంతా అన్ని పాఠశాలలకు అందజేస్తాం. - గంగాధర్‌నాయక్, సీఎంఓ, సర్వశిక్ష అభియాన్. -
రైతుకు శాపం
తోటపల్లిగూడూరు : అధికారులు, మిల్లర్లకు మధ్య తలెత్తిన వివాదం రైతుల పాలిట శాపంగా మారింది. లెవీకి పోనూ మిగిలిన బియ్యానికి సంబంధించి పర్మిట్లు ఇవ్వడం లేదని మిల్లర్లు కొన్నిరోజులుగా అధికారుల మీద ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాక మిల్లర్లకు చెందిన బియ్యం లారీలను భారీగా అధికారులు ఇటీవల వెంకటాచలం సమీపంలో పట్టుకుని సీజ్ చేశారు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన మిల్లర్లు ధాన్యం కొనుగోలును అర్ధంతరంగా నిలిపివేశారు. గిట్టుబాటుకాని ధర ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో వరి సాగవుతోంది. అందులో ఇప్పటికే 20 శాతం వరికోతలు పూర్తయి, నూర్పులు అనంతరం ధాన్యం మిల్లర్లకు కూడా చేరింది. ఓ వైపు 1010 రకానికి సంబంధించి పుట్టికి రూ.12వేలకు తగ్గకుండా రైతులకు చెల్లించాలని అధికారులు మిల్లర్లను ఆదేశిస్తూ వస్తున్నారు. కానీ మిల్లర్లు మాత్రం రూ.10,500లకు మించి రైతులకు ఇవ్వడం లేదు. ఈ క్రమంలో ఆరుగాలాలు కష్టించి పండించిన రైతన్నలు గిట్టుబాటు ధర లభించక లబోదిబోమంటున్నారు. ఇది ఇలా ఉంటే నాలుగు రోజులుగా అధికారులు, మిల్లర్లకు మధ్య తలెత్తిన వివాదంతో మిల్లర్లు ధాన్యం కొనుగోలును నిలిపివేశారు. దీంతో కోతలు పూర్తయి విక్రయాలకు సిద్ధంగా ఉంచిన ధాన్యం కల్లాల్లో దిక్కుమొక్కులేకుండా పడి ఉన్నాయి. అసలే వర్షాకాలం.. వానలు పడితే కల్లాల్లో ఉన్న ధాన్యపు రాసుల్లో గింజ కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. మిల్లర్లపై ఆధారపడకుండా నేరుగా రైతుల నుంచి ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి కన్పించడం లేదు. దీంతో రైతన్నలు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతం మండలంలోని పలు ప్రాంతాల్లో దాదాపు ఐదు వేల పుట్లు వరకు ధాన్యం కల్లాల్లోనే ఉన్నట్లు తెలిస్తోంది. ధాన్యం కొనుగోలు విషయంలో పాలకులు వెంటనే ఓ నిర్ణయానికి రాకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.