వేసవితాపం.. చిన్నారులకు శాపం | Summer warming is curse to the kids | Sakshi
Sakshi News home page

వేసవితాపం.. చిన్నారులకు శాపం

Published Thu, Apr 13 2017 7:23 PM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM

Summer warming is curse to the  kids

– డీహైడ్రేషన్‌తో ఆస్పత్రి పాలవుతున్న వైనం
–  కిటకిటలాడుతున్న విమ్స్‌ పీడియాట్రిక్‌ వార్డు
 
బళ్లారి: బసిల బళ్లారిగా పేరుగాంచిన నగరంలో ఎండలు మండుతూ నిప్పులు కురిపిస్తున్నాయి. వారం రోజులుగా 41 నుంచి 42 డిగ్రీలతో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో పిల్లలే కాదు పెద్దలు సైతం ఎండలకు తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా శిశువులు శరీరంలోని నీటి కొరత(డీహైడ్రేషన్‌)తో అస్వస్థతకు గురై జ్వరాలతో ఆస్పత్రి పాలవుతున్నారు. దీంతో నిత్యం విమ్స్‌ పీడియాట్రిక్‌ వార్డు కిటకిటలాడుతోంది.

ఇప్పటి వరకు సుమారు 70మంది శిశువులు డీహైడ్రేషన్‌తో ఆసుపత్రి పాలైనట్లు విశ్వసనీయ సమాచారం. ఈ వేసవిలో అన్ని విభాగాల కంటే పీడియాట్రిక్‌ విభాగంలోనే చేరే శిశువుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శిశువుల్లో డీహైడ్రేషన్‌ నివారణకు అధికంగా మంచినీటిని తాగాలని, శిశువులు ఉండే గదులు చల్లగా ఉండేటట్లు చూడాలని, శరీరంలో నీటి సాంద్రత తగ్గకుండా చూసుకోవాలని పీడియాట్రిక్‌ వైద్యులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement