చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. తొలి ప్లేయర్‌గా అరుదైన రి​కార్డు | Virat Kohli Surpasses MS Dhoni And Rohit Sharma To Achieve Record Breaking 279th IPL Match, Check Story Inside | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. తొలి ప్లేయర్‌గా అరుదైన రి​కార్డు

May 13 2026 10:56 PM | Updated on May 14 2026 11:45 AM

Virat Kohli Surpasses MS Dhoni, Rohit Sharma To Achieve Historic High In IPL

టీమిండియా సూప‌ర్ స్టార్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఓపెన‌ర్ విరాట్ కోహ్లి అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఇండియ‌న్ ప్రీమియర్ లీగ్‌లో అత్య‌ధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయ‌ర్‌గా కోహ్లి చ‌రిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌-2026లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఈ ఫీట్‌ను అందుకున్నాడు.

కింగ్ కోహ్లికి ఇది 279వ ఐపీఎల్ మ్యాచ్. ఈ మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ ముగ్గురూ 278 మ్యాచ్‌లతో సమంగా ఉండేవారు. తాజా మ్యాచ్‌తో కోహ్లి వారిద్దరిని అధిగమించి అగ్రస్ధానానికి చేరుకున్నాడు.  2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుండి కోహ్లి ఆర్సీబీకే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

ఎంఎస్ ధోనీ సీఎస్‌కే ప్రాతినిథ్యం వహిస్తుండగా.. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు. మిస్టర్ కూల్ గాయం కారణంగా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ముంబై ఇండియన్స్ ఆడబోయే తదుపరి మ్యాచ్‌లో కోహ్లి రికార్డును రోహిత్ శర్మ సమం చేసే అవకాశముంది. కాగా విరాట్ కోహ్లి ఐపీఎల్‌లో 9,000 పరుగుల మైలురాయిని దాటిన ఏకైక బ్యాటర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఐపీఎల్‌లో అత్యధిక ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లు వీరే
విరాట్ కోహ్లి-279
ఎంఎస్ ధోని-278
రోహిత్ శర్మ-278
రవీంద్ర జడేజా-265
చదవండి: టీమిండియాలోకి భువనేశ్వర్‌ కుమార్!?
 

Advertisement
 
Advertisement
Advertisement