Royal Challengers Banaglore
-
మరి ఇంత చెత్త బ్యాటింగా.. ఆట మర్చిపోయావా మాక్సీ? వీడియో వైరల్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమైన మాక్స్వెల్.. ఇప్పుడు జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌లో మ్యాచ్‌లో అదే తీరును కనబరిచాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన మాక్స్వెల్ తీవ్ర నిరాశపరిచాడు. 3 బంతులు ఎదుర్కొన్న మాక్సీ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. నండ్రీ బర్గర్ బౌలింగ్‌లో బంతిని అంచనా వేయడంలో విఫలమైన మాక్స్వెల్ క్లీన్ బౌల్డయ్యాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన మాక్స్వెల్.. కేవలం 32 పరుగులు మాత్రమే చేశాడు. కేవలం ఒక్కసారి మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ సాధించాడు. ఈ క్రమంలో అతడి ఆర్సీబీ అభిమానులు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఏంటి మాక్స్వెల్ ఆట మర్చిపోయావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది అయితే మరి కొంతమంది దేశం కోసం చెలరేగిపోతాడని.. ఐపీఎల్లో మాత్రం తుస్సుమనిపిస్తాడని పోస్ట్‌లు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై రాజస్తాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. Clean bowled! Nandre Burger picks up the big wicket of Glenn Maxwell. Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱 LIVE - https://t.co/lAXHxeYCjV #TATAIPL #IPL2024 #RRvRCB pic.twitter.com/NCpFBpkMSp — IndianPremierLeague (@IPL) April 6, 2024 -
విరాట్ కోహ్లి విధ్వంసకర సెంచరీ.. 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో! వీడియో
ఐపీఎల్-2024లో తొలి సెంచరీ నమోదైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్‌గా వచ్చిన విరాట్ రాజస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 67 బంతుల్లో విరాట్ తన సెంచరీని మార్క్‌ను అందుకున్నాడు. ఇది విరాట్‌కు 8వ ఐపీఎల్ సెంచరీ. తన ట్రేడ్ మార్క్ షాట్లతో రన్‌మిషన్ అభిమానులను అలరించాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 72 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి.. 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 113 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ ఏడాది సీజన్ తమ తొలి మ్యాచ్ నుంచే కోహ్లి తన అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఇప్పటివరరకు ఈ ఏడాది సీజన్లో 5 మ్యాచ్‌లు ఆడిన కింగ్.. 316 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగతున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆర్సీబీ కోహ్లితో పాటు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్(44) పరుగులతో రాణించాడు. రాజస్తాన్ బౌలర్లలో యజువేంద్ర చాహల్ రెండు వికెట్లు పడగొట్టగా.. బర్గర్ ఒక్క వికెట్ సాధించాడు. It's official: Kohli is the real Gotham's Batman 🦇 #RRvsRCB #KingKohli pic.twitter.com/hTY3Feg2nL — Satan (@Scentofawoman10) April 6, 2024 -
IPL 202: కోహ్లి సెంచరీ వృథా.. ఆర్సీబీపై రాజస్తాన్ ఘన విజయం
IPL 2024 RR vs RCB Live Updates: ఆర్సీబీపై రాజస్తాన్ ఘన విజయం ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా జైపూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో రాజస్తాన్ విజయం సాధించింది. 184 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి రాయల్స్ ఛేదించింది. రాజస్తాన్ బ్యాటర్లలో ఓపెనర్ జోస్ బట్లర్(100,58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆజేయ సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు కెప్టెన్ సంజూ శాంసన్(69) పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఆర్సీబీ బౌలర్లలో టాప్లీ రెండు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, యశ్‌దయాల్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి సెంచరీతో మెరిశాడు. 72 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి.. 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 113 పరుగులు చేశాడు. కానీ తమ జట్టు ఓటమి పాలవ్వడంతో కోహ్లి సెంచరీ వృథాగా మిగిలిపోయింది. రెండో వికెట్ కోల్పోయిన రాజస్తాన్.. శాంసన్ ఔట్ 148 పరుగుల వద్ద రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 69 పరుగులు చేసిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్.. సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. జోస్ బట్లర్(77), రియాన్ పరాగ్(4) పరుగులతో ఉన్నారు. జోస్ బట్లర్, సంజూ ఫిప్టీ.. రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్, స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. ఇద్దరూ తమ హాఫ్ సెంచరీలను పూర్తి చేసుకున్నారు.11 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్ : 109/1. క్రీజులో జోస్ బట్లర్(50), సంజూ శాంసన్(58) పరుగులతో ఉన్నారు. 9 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 84/1 9 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ నష్టానికి 84 పరుగులు చేసింది. క్రీజులో జోస్ బట్లర్(48), సంజూ శాంసన్(35) పరుగులతో ఉన్నారు. 6 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 54/1 6 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. క్రీజులో జోస్ బట్లర్(39), సంజూ శాంసన్(15) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన రాజస్తాన్.. జైశ్వాల్ ఔట్ 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. టాప్లీ బౌలింగ్‌లో మాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులో సంజూ శాంసన్, జోస్ బట్లర్ ఉన్నాడు. సెంచరీతో చెలరేగిన కోహ్లి.. రాజస్తాన్ టార్గెట్ 184 పరుగులు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి సెంచరీతో మెరిశాడు. ఈ ఏడాది సీజన్లో విరాట్‌దే తొలి సెంచరీ కావడం విశేషం. ఓవరాల్‌గా 72 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి.. 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 113 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్(44) పరుగులతో రాణించాడు. రాజస్తాన్ బౌలర్లలో యజువేంద్ర చాహల్ రెండు వికెట్లు పడగొట్టగా.. బర్గర్ ఒక్క వికెట్ సాధించాడు. సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లి.. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 67 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో విరాట్ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రెండో వికెట్ డౌన్.. 128 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి రెండో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన గ్లెన్ మాక్స్వెల్.. బర్గర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 17 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లి 87 పరుగులతో ఉన్నాడు. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ 125 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 44 పరుగులు చేసిన ఫాప్ డుప్లెసిస్.. చాహల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. విరాట్ కోహ్లి ఫిప్టీ.. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 39 బంతుల్లో కోహ్లి తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 12 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 107 పరుగులు చేసింది. క్రీజులో ఫాప్ డుప్లెసిస్(40), విరాట్ కోహ్లి(59) పరుగులతో ఉన్నారు. 9 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 80/0 9 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. క్రీజులో ఫాప్ డుప్లెసిస్(34), విరాట్ కోహ్లి(38) పరుగులతో ఉన్నారు. 6 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 53/0 6 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. క్రీజులో డుప్లెసిస్(14), విరాట్ కోహ్లి(32) పరుగులతో ఉన్నారు. 2 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 21/0 2 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. క్రీజులో డుప్లెసిస్(5), విరాట్ కోహ్లి(10) పరుగులతో ఉన్నారు. ఐపీఎల్-2024లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. ఆర్సీబీ మాత్రం తమ తుది జట్టులో ఒక మార్పు చేసింది. సౌరవ్ దిలీప్‌సింగ్ చౌహాన్ ఆర్సీబీ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. తుది జట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సౌరవ్ చౌహాన్, రీస్ టోప్లీ, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్ రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, నాండ్రే బర్గర్, యుజ్వేంద్ర చాహల్ -
ఆర్సీబీ ఫ్యాన్స్ నాకు సపోర్ట్ చేశారు.. చాలా సంతోషంగా ఉంది: మయాంక్
ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. మయాంక్ తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సంచలనం సృష్టించిన మయాంక్.. తాజాగా ఆర్సీబీతో మ్యాచ్‌లలో మూడు కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. అయితే ఆర్సీబీతో మ్యాచ్ అనంతరం మయాంక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ తమ సొంత గ్రౌండ్లో ఆడుతున్నప్పటికి ఆ జట్టు అభిమానులు మాత్రం తనను ఎంతగానో సపోర్ట్ చేశారని మయాంక్ తెలిపాడు. "జట్టు విజయాల్లో నా వంతు పాత్ర పోషించడం చాలా సంతోషంగా ఉంది. అయితే మా చివరి మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం ఆర్సీబీ అభిమానులతో నిండిపోయింది. ఆర్సీబీకి స్పెషల్ ఫ్యాన్ బేస్ఉంది. కానీ ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ అభిమానులు నన్ను సపోర్ట్ చేశారు. నా స్పెల్ తర్వాత, నేను బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్ చప్పట్లు కొడుతూ నన్ను ఉత్సాహపరిచారు. ఇది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని" మయాంక్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. -
పూరన్ భారీ సిక్సర్.. దెబ్బకు స్టేడియం బయటకు బంతి! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో వెస్టిండీస్ ఆటగాడు, లక్నో సూపర్ జెయింట్స్ వైస్ కెప్టెన్ నికోలస్ పూరన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో పూరన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పూరన్ కేవలం 21 బంతుల్లో 5 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 40 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో పూరన్ కొట్టిన ఓ సిక్సర్ అందరిని షాక్ గురిచేసింది. లక్నో ఇన్నింగ్స్ 19 ఓవర్లో రీస్ టాప్లీ వేసిన ఫుల్ టాస్ బాల్‌ను.. పూరన్ మిడ్ వికెట్ మీదగా 106 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు. దెబ్బకు బంతి స్టేడియం బయట పడింది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. కాగా ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన పూరన్ 146 పరుగులు చేశాడు. 106m monstrous six! 🤯 Nicholas Pooran smashes one out of the park 💥 💯 sixes in #TATAIPL for the @LucknowIPL batter 💪 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE #RCBvLSG pic.twitter.com/7X0Yg4VbTn — IndianPremierLeague (@IPL) April 2, 2024 -
విరాట్ కోహ్లి వరల్డ్ రికార్డు.. తొలి క్రికెటర్‌గా
టీమిండియా స్టార్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో ఒకే వేదికలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2024లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 83 పరుగులు చేసిన కోహ్లి.. ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. చిన్నస్వామి స్టేడియంలో కోహ్లి ఇప్పటివరకు 3,276 టీ20 రన్స్ చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం పేరిట ఉండేది. మీర్పూర్ వేదికగా అతడు ఇప్పటివరకు 3,239 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో ముష్ఫికర్ వరల్డ్ రికార్డును కింగ్ కోహ్లి బ్రేక్ చేశాడు. ఇక మూడు, నాలుగు స్థానాల్లో ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్, బంగ్లాదేశ్ ప్లేయర్ తమీమ్ ఇక్బాల్ ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీపై 7 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ కేవలం 16.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సునీల్ నరైన్(22 బంతుల్లో 47), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(39 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆర్సీబీ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. -
#RCBvsKKR: చెత్త బ్యాటింగ్.. ఇంకా ఎన్ని ఛాన్స్‌లు?
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు రజిత్ పాటిదార్ ఆట ఏ మాత్రం మారలేదు. ఈ మెగా ఈవెంట్లో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ పాటిదార్ నిరాశపరిచాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన పాటిదార్.. రస్సెల్ బౌలింగ్‌లో రింకూ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 21 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో అతడిని ఆర్సీబీ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ‘‘ఇకనైనా నీ ఆట తీరు మారదా’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది అయితే ఆర్సీబీ మెనెజ్‌మెంట్ తీరును తప్పుబడుతున్నారు. అతడు వరుసగా విఫలమవుతున్నప్పటికి అవకాశాలు ఎలా ఇస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాగా రాబోయే మ్యాచ్‌ల్లో పాటిదార్‌పై ఆర్సీబీ వేటు వేసే ఛాన్స్ ఉంది. అతడి స్ధానంలో మహిపాల్ లామ్రోర్‌ను జట్టులోకి తీసుకునే అవకాశముంది. కాగా ఐపీఎల్‌కు ముందు ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ పాటిదార్ దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పుడు అదే పేలవ ఫామ్‌ను పాటిదార్ కంటిన్యూ చేస్తున్నాడు. ఇక మ్యాచ్‌లో ఆర్సీబీపై 7 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది. Rajat patidar 😭😭 pic.twitter.com/MXrogYrPNw — ADITYA 🇮🇳 (@troller_Adi18) March 29, 2024 -
#Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. తొలి క్రికెటర్‌గా రికార్డు
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బోణీ కొట్టింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది. ఆర్సీబీ విజయంలో విరాట్ కోహ్లి, దినేష్ కార్తీక్‌లు కీలక పాత్ర పోషించారు. తొలుత విరాట్ కోహ్లి అద్బుత ఇన్నింగ్స్ ఆడగా.. ఆఖరిలో కార్తీక్ మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి ఆది నుంచే ప్రత్యర్ది బౌలర్లను ఊచకోత కోశాడు. సామ్ కుర్రాన్ వేసిన తొలి ఓవర్లోనే ఏకంగా 4 ఫోర్లతో 16 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత కూడా విరాట్ జోరు ఎక్కడ తగ్గలేదు. ఓవరాల్‌గా 49 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌ను ఆడిన కోహ్లి.. ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20ల్లో 100 సార్లు 50 ప్లస్ రన్స్ చేసిన మొదటి భారత క్రికెటర్‌గా విరాట్ రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా వరల్డ్‌క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన జాబితాలో విరాట్ మూడో స్ధానంలోఉన్నాడు. తొలి స్ధానంలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్(110) ఉండగా.. ఆ తర్వాతి స్ధానంలో డేవిడ్ వార్నర్ (109) ఉన్నాడు. When Virat Kohli returns from break, you know he's lethal 🥵#RCBvsPBKS pic.twitter.com/H4zuHN9hxI — OneCricket (@OneCricketApp) March 25, 2024 -
RCB Vs PBKS: అన్న నీవు మారవా? ఇంకా ఎన్ని ఛాన్స్‌లు! జట్టు నుంచి తీసిపడేయండి
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్. ఆర్సీబీ ఆటగాడు రజిత్ పాటిదార్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్-2024 తొలి మ్యాచ్‌లో విఫలమైన పాటిదార్.. ఇప్పుడు పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అదే తీరును కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 18 బంతులు ఎదుర్కొన్న పాటిదార్ కేవలం 18 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన పాటిదార్ తన ఆట తీరుతో నిరాశరిచాడు. పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ హార్ప్రీత్ బరార్ బౌలింగ్‌లో చెత్త షాట్ ఆడి పాటిదార్ క్లీన్ బౌల్డయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అన్న నీవు మారవా ఇంకా ఎన్ని మ్యాచ్‌లు ఇలా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది ఆర్సీబీ మెనెజ్‌మెంట్‌ను తప్పుబడుతున్నారు. ఫామ్‌లో లేని ఆటగాడికి ఎందుకు ఛాన్స్‌లు ఇస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు. అంతకుముందు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లోనూ పాటిదార్ పేలవ ప్రదర్శన కనబరిచాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది. ఆర్సీబీ బ్యాటర్లో విరాట్ కోహ్లి(49 బంతుల్లో 77, 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఆఖరిలో దినేష్ కార్తీక్ మెరుపు మెరిపించి తన జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందిచాడు. కేవలం 10 బంతులు ఎదుర్కొన్న కార్తీక్.. 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. pic.twitter.com/LPuKzE4G0g — Sitaraman (@Sitaraman112971) March 25, 2024 -
RCB Vs PBKS: వారెవ్వా అనూజ్.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా బెంగళూరు వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ వికెట్ కీపర్ అనూజ్ రావత్ సంచలన క్యాచ్‌ను అందుకున్నాడు. అనూజ్ అద్బుతమైన క్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్ సామ్ కుర్రాన్ పెవిలియన్ పంపాడు. పంజాబ్ ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసిన యశ్ దయాల్ ఐదో బంతిని సామ్ కుర్రాన్‌కు బౌన్సర్‌గా సంధించాడు. ఈ క్రమంలో కుర్రాన్ హుక్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ పై నుంచి వెళ్లింది. ఈ క్రమంలో అనూజ్ రావత్ అద్బుతంగా జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆఖరి బ్యాటర్ సామ్ కుర్రాన్ సైతం నేను ఔటా అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో రావత్ ఏకంగా నాలుగు క్యాచ్‌లు అందుకున్నాడు. Athletic Anuj! A sharp catch behind the stumps from @RCBTweets wicketkeeper-batter as #PBKS reach 154/6 with 8 balls to go Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvPBKS pic.twitter.com/3snw3syupr — IndianPremierLeague (@IPL) March 25, 2024 -
Smriti Mandhana: ఆటలోనే కాదు అందంలోనూ చాంపియన్.. స్మృతి మంధాన (ఫొటోలు)
-
స్మృతి మంధానకు వీడియో కాల్ చేసిన కోహ్లి.. వీడియో వైరల్
'ఈ సాల్ కప్ నమదే'.. ప్రతీ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు ముందు ఆర్సీబీ అభిమానుల నుంచే వినిపించే మాట. కానీ భారీ అంచనాలతో బరిలోకి దిగడం.. ఆఖరికి ఊరించి ఊసురుమన్పించడం ఆర్సీబీకి పరిపాటిగా మారిపోయింది. తమ ఆరాద్య జట్టు ఒక్కసారి ట్రోఫీని ముద్దాడితే చూడాలని పరితపించారు. అయితే ఎట్టకేలకు అభిమానుల కల నేరవేరింది. 16 ఏళ్లుగా ఐపీఎల్లో పురుషుల ఫ్రాంఛైజీకి సాధ్యం కాని టైటిల్‌ను డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లోనే అమ్మాయిల జట్టు సాధించింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసిన ఆర్సీబీ.. తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. దీంతో ఆర్సీబీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఆర్సీబీ పురుషుల జట్టు ఆటగాళ్లు సైతం సంబరాల్లో మునిగితేలిపోయారు. తొలిసారి టైటిల్‌ను సొంతం చేసుకున్న ఆర్సీబీ మహిళల జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి సోషల్ మీడియా వేదికగా తమ మహిళల జట్టును అభినందించాడు. సూపర్ ఉమెన్ అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. అదేవిధంగా టైటిల్ గెలిచిన అనంతరం అర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన వీడియో కాల్ కూడా చేశాడు. మంధానతో పాటు మిగితా ప్లేయర్స్‌తో విరాట్ కాసేపు సంభాషించాడు. విరాట్‌ను చూడగానే ఆర్సీబీ ప్లేయర్లు ఆనందంతో గంతులేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా 2008 తొలి సీజన్ నుంచి ఆర్సీబీకి విరాట్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చదవండి: WPL 2024: డబ్ల్యూపీఎల్ విజేత ఆర్సీబీ... ఫ్రైజ్ మనీ ఎన్ని కోట్లో తెలుసా? #RCBUnbox Virat Kohli was literally dancing on the video call. This Trophy matters sooo much to him#ViratKohli𓃵 pic.twitter.com/uFbIxF037d — SAMAR♡︎ (@119_bholi) March 18, 2024 -
చేతికి 5 కుట్లు.. అయినా 15 ఓవర్ల మ్యాచ్‌లోనే విధ్వంసకర శతకం
Virat Kohli: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో విరాట్ కోహ్లి జర్నీ 15 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టింగ్ పార్ట్నర్ స్టార్ స్పోర్ట్స్ ఓ ప్రత్యేక వీడియోను రూపొందించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కోహ్లితో అనుబంధం ఉన్న పలువురు మాజీ క్రికెటర్లను ఓ గొడుగు కిందకు చేర్చిన స్టార్ స్పోర్ట్స్.. కోహ్లితో వారికున్న అనుభవాలను రివీల్ చేయించింది. ఈ సందర్భంగా భారత మాజీ ఆల్‌రౌండర్ సంజయ్ బాంగర్ను పలకరించిన స్టార్‌స్పోర్ట్స్.. కోహ్లితో ఉన్న అనుభవాలను రివీల్ చేయాలని కోరగా, ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. 2016 సీజన్లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి చేతికి కుట్లు పడినా, ఆ బాధను దిగమింగుతూ విధ్వంసకర శతకం బాదిన వైనాన్ని బాంగర్ గుర్తు చేసుకున్నాడు. కోహ్లి పట్టుదల, అతనికి ఆట పట్ల ఉన్న అంకితభావం ఎలాంటివో తెలియజేయడానికి ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయని బాంగర్ తెలిపాడు. వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. విరాట్ కోహ్లి (50 బంతుల్లో 113; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. కోహ్లికు జతగా క్రిస్ గేల్ (32 బంతుల్లో 73; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) కూడా వీరవిహారం చేశాడు. అనంతరం బరిలోకి దిగిన పంజాబ్.. 14 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 120 పరుగులు మాత్రమే చేసి 82 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్) ఓటమిపాలైంది. కాగా, ఆ సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 81.08 సగటున రికార్డు స్థాయిలో 973 పరుగులు చేశాడు. ఇప్పటికీ ఐపీఎల్లో ఇదే అత్యధిక సీజన్ స్కోర్ (ఓ సీజన్లో ఓ ఆటగాడు సాధించిన అత్యధిక పరుగులు). -
వచ్చే ఏడాది ఈ ఆటగాళ్లకు ఆర్సీబీ గుడ్‌బై..!
ఐపీఎల్-2022లో రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్‌లో ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది సీజన్లో ఫాఫ్ డుప్లెసిస్ నూతన సారథ్యంలో ఆర్సీబీ అద్భుతంగా రాణించింది. ఇది ఇలా ఉండగా.. వచ్చే ఏడాది సీజన్‌కు ముందు ఆర్సీబీ మేనేజ్మెంట్ కొంతమంది ఆటగాళ్లను విడుదల చేసే అవకాశం ఉంది. ఆర్సీబీ విడుదల చేసే ఛాన్స్ ఉన్న ఆటగాళ్లను ఓ సారి పరిశీలిద్దాం. సిద్దార్థ్ కౌల్ ఐపీఎల్-2022 మెగా వేలంలో సిద్దార్థ్ కౌల్‌ను రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే ఈ ఏడాది సీజన్లో కౌల్ ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన కౌల్.. వికెట్లు ఏమి సాధించకుండా 43 పరుగులు ఇచ్చాడు. కాబట్టి వచ్చే ఏడాది సీజన్‌కు ముందు సిద్దార్థ్ కౌల్‌ను ఆర్సీబీ విడిచి పెట్టే అవకాశం ఉంది. కాగా ఆర్సీబీ పేస్ అటాక్‌లో జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్,హర్షల్ పటేల్ వంటి బౌలర్లు ఉండటంతో కౌల్ చోటు దక్కలేదు. డేవిడ్ విల్లీ ఐపీఎల్-2022 మెగా వేలంలో డేవిడ్ విల్లీని ఆర్సీబీ రూ. 2 కోట్లకు దక్కించుకుంది. కాగా టోర్నీ ఆరంభ మ్యాచ్‌లకు గ్లెన్ మాక్స్వెల్ అందుబాటులో లేకపోవడంతో విల్లీకి తుది జట్టులో చోటు దక్కింది. అయితే అతడు ఆ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోలేకపోయాడు. నాలుగు మ్యాచ్‌లు ఆడిన విల్లీ 18 పరుగులతో పాటు ఒకే ఒక్క వికెట్ సాధించాడు. ఇక మాక్స్వెల్ వచ్చాక విల్లీకి తుది జట్టులో చోటు దక్కలేదు. కాగా ప్లేయింగ్ ఎలెవన్‌లో నాలుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే అవకాశం ఉన్నందున.. తదుపరి సీజన్‌కు ముందు ఆర్సీబీ విడుదల చేసే అవకాశం ఉంది. కరణ్ శర్మ ఐపీఎల్-2022 మెగా వేలంలో కరణ్ శర్మను రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే ఈ ఏడాది సీజన్లో ఒక్క మ్యాచ్‌లో కూడా కరణ్ శర్మకు తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ సీజన్లో అన్ని మ్యాచ్‌లకు శ్రీలంక యువ స్పిన్నర్ వనిందు హసరంగాకే ఆర్సీబీ ఛాన్స్ ఇచ్చింది. అదే విధంగా పార్ట్‌టైమ్ స్పిన్నర్స్‌గా మాక్స్వెల్, షబాజ్ ఆహ్మద్ ఉన్నారు. కాబట్టి అతడిని వచ్చే ఏడాది సీజన్ ముందు ఆర్సీబీ విడిచి పెట్టనుంది. చదవండి: Hardik Pandya: 'ఫైనల్ మ్యాచ్‌లు నాకు కలిసొచ్చాయి.. గుజరాత్ టైటాన్స్‌దే కప్' -
'వచ్చే సీజన్లో మళ్లీ కలుద్దాం'.. విరాట్ కోహ్లి భావోద్వేగ ట్వీట్
ఐపీఎల్-2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రయాణం ముగిసింది. శుక్రవారం జరగిన క్వాలిఫయర్-2లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓటమి చెంది టోర్నీ నుంచి ఆర్సీబీ నిష్క్రమించింది. ఈ సారైనా టైటిల్ నెగ్గుతుందని భావించిన ఆర్సీబీ అభిమానులకు మరోసారి నిరాశ తప్పలేదు. ఈ క్రమంలో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి భావోద్వేగ ట్వీట్ చేశాడు. ఈ సీజన్ అంతటా మద్దతుగా నిలిచిన మేనేజ్మెంట్కు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. "కొన్నిసార్లు మనం విజయం సాధిస్తాం, మరి కొన్ని సార్లు విజయం సాధించలేము. కానీ అభిమానులు మాత్రం నిరంతరం మాకు మద్దుతగా నిలిచారు. ఈ అద్భుతమైన ఫ్రాంచైజీలో బాగమైన మేనేజ్మెంట్, సపోర్ట్ స్టాఫ్, అభిమానుల అందరికీ నా ధన్యవాదాలు. వచ్చే సీజన్లో మళ్లీ కలుద్దాం" అని కోహ్లి ట్విటర్లో పేర్కొన్నాడు. ఇక ఈ ఏడాది సీజన్లో కోహ్లి పేలవ ఫామ్‌ను కనబరిచాడు. 16 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి కేవలం 341 పరుగులు మాత్రమే చేశాడు. చదవండి: RCB Tweet On RR: రాజస్తాన్‌కు ఆర్సీబీ విషెస్.. గుండెల్ని మెలిపెట్టే ట్వీట్! హృదయాలు గెలిచారు! Sometimes you win, and sometimes you don't, but the 12th Man Army, you have been fantastic, always backing us throughout our campaign. You make cricket special. The learning never stops. (1/2) pic.twitter.com/mRx4rslWFK — Virat Kohli (@imVkohli) May 28, 2022 -
'విరాట్ కోహ్లి కంటే డుప్లెసిస్ అత్యుత్తమ కెప్టెన్'
ఐపీఎల్-2022లో భాగంగా శుక్రవారం జరిగిన క్వాలిఫైయర్-2లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓటమి చెందిన ఆర్సీబీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాగా ఈ సీజన్లోనైనా కప్ సాధిస్తుందని భావించిన ఆర్సీబీ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. ఇది ఇలా ఉండగా.. గతేడాది సీజన్ కంటే ఈ ఏడాది సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన ప్రదర్శన కనబరిచిందని భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా కెప్టెన్‌గా విరాట్ కోహ్లి కంటే ఫాఫ్ డుప్లెసిస్ అత్యుత్తమంగా రాణించాడని మంజ్రేకర్ తెలిపాడు. "ఆర్సీబీ గత సీజన్ కంటే ప్రస్తుత సీజన్లో మెరుగ్గా రాణించింది. విరాట్ కోహ్లి కంటే డుప్లెసిస్ అత్యత్తుమ సారథిగా కన్పిస్తున్నాడు. కాగా వారిద్దరి నుంచి మరింత మంచి ఇన్నింగ్స్‌లు ఆశించాం. అయితే ప్లే ఆఫ్స్‌కు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా టైటిల్ సాధిస్తారని భావించాను. అయితే క్వాలిఫైయర్-2లో ఓటమి గల కారణాలు వాళ్లకు బాగా తెలుసు. ఇక ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ బౌలర్లు అద్బుతంగా రాణించారు. అయితే బౌలర్లను సరైన సమయాల్లో డుప్లెసిస్ ఉపయోగించాడు. ఇక అతడు బ్యాటింగ్ పరంగా టోర్నీ ఆరంభంలో అద్భుతంగా రాణించనప్పటికీ.. అందరూ బ్యాటర్ల మాదిరిగానే సెకెండ్ హాఫ్‌లో కాస్త తడబడ్డాడు. అయినప్పటికీ కెప్టెన్‌గా మాత్రం డుప్లెసిస్ సరైన ఎంపిక" అని మంజ్రేకర్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: 'ఓవైపు తల్లికి సీరియస్.. అయినా మ్యాచ్‌లో అదరగొట్టాడు' -
ఐపీఎల్లో మహ్మద్ సిరాజ్ చెత్త రికార్డు.. తొలి బౌలర్‌గా..!
ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ మహ్మద్ సిరాజ్ ఓ చెత్త రికార్డు నమోదు చేశాడు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్స్‌లు ఇచ్చిన తొలి బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు. ఐపీఎల్-2022సీజన్లో 30 సిక్స్‌లు ఇచ్చిన సిరాజ్ ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు 2018 సీజన్లో డ్వేన్ బ్రావో 29 సిక్స్‌లు సమర్పించుకున్నాడు. చదవండి: IPL 2022: సెంచరీతో లక్నోకు చుక్కలు చూపించాడు.. ఎవరీ రజత్ పాటిదార్..? Mohammed Siraj became the first bowler in history to concede 30 sixes in an IPL season pic.twitter.com/wXi9voWc5R — ganesh🇦🇷 (@breathMessi21) May 27, 2022 -
ఐపీఎల్లో పాటిదార్ అరుదైన రికార్డు.. తొలి భారత ఆటగాడిగా..!
ఐపీఎల్లో ఆర్సీబీ యువ ఆటగాడు రజత్ పాటిదార్ అరుదైన రికార్డు సాధించాడు. ఒక ఐపీఎల్ సీజన్ ప్లే ఆఫ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డులెక్కాడు. ఐపీఎల్-2022 ప్లే ఆఫ్స్‌లో 170 పరుగులు చేసిన పాటిదార్ ఈ ఘనత సాధించాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 112 పరుగులు, రాజస్తాన్ రాయల్స్‌తో క్వాలిఫైర్ 2లో 58 పరుగులు పాటిదార్ చేశాడు. ఇక ఓవరాల్‌గా ప్లే ఆఫ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఉన్నాడు. 2016 సీజన్లో వార్నర్ 190 పరుగులు సాధించాడు. ఇక 170 పరుగలతో పాటిదార్ రెండో స్ధానంలో ఉన్నాడు. చదవండి: Left Arm Pacers In IPL 2022: ఐపీఎల్ 2022లో అదరగొట్టిన లెఫ్టార్మ్ పేసర్లు వీరే.. -
ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. తొలి జట్టుగా..!
ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చరిత్ర సృష్టించింది. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్స్‌లు బాదిన జట్టుగా ఆర్సీబీ రికార్డులక్కెంది. ఐపీఎల్-2022లో ఇప్పటి వరకు 136 సిక్స్‌లు బాదిన ఆర్సీబీ ఈ ఘనత సాధించింది. గతంలో 2018 ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ కొట్టిన 135 సిక్స్‌లు రికార్డును ఆర్సీబీ బ్రేక్ చేసింది. ఇక ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ యువ ఆటగాడు రజత్ పాటిదార్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 54 బంతుల్లో 112 (12 ఫోర్లు, 7 సిక్స్‌లు) పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. ఇక అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం(మే27) జరగనున్న క్వాలిఫైయర్ 2లో రాజస్తాన్ రాయల్స్‌తో ఆర్సీబీ తలపడనుంది. స్కోర్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: 207/4 లక్నో సూపర్ జెయింట్స్: 193/6 చదవండి: IPL 2022: ఐపీఎల్లో కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు.. తొలి ఆటగాడిగా..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'ఆర్సీబీ అద్భుతంగా ఆడుతోంది.. ప్లే ఆఫ్‌కు ఒక్క మ్యాచ్ దూరంలో'
ఐపీఎల్-2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పర్వాలేదనిపిస్తుంది. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ ఏడు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో ఉంది. కాగా గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 67 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాదించి , ప్లేఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ ఆటతీరుపై భారత మాజీ క్రికెటర్లు వసీం జాఫర్, దీప్ దాస్‌గుప్తా తాజగా ఓ స్పోర్ట్స్ షోలో చర్చించారు. ఆర్సీబీ కొంతమంది ఆటగాళ్లపై ఆధారపడటం లేదని, జట్టు మొత్తం సమిష్టంగా రాణిస్తోందని దీప్ దాస్‌గుప్తా తెలిపాడు. "టోర్నమెంట్ ప్రారంభంలో అనుకున్నట్టుగా ఆర్సీబీ ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లపై ఆధారపడడంలేదు. జట్టు మొత్తం సంయుక్తంగా రాణిస్తోంది. అందుకే వారు పాయింట్ల పట్టికలో ఈ స్థానంలో ఉన్నారు. వారు ప్లేఆఫ్‌కు ఆర్హత సాధించడానికి ఒక్క విజయం దూరంలో ఉన్నారు. ఇక ఆర్సీబీ తమ చివర మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్పై అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచారు" అని దీప్ దాస్‌గుప్తా పేర్కొన్నాడు. చదవండి:IPL 2022: 'ఉమ్రాన్ మాలిక్ పాకిస్తాన్లో ఉండి ఉంటే ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ ఆడేవాడు' -
సీఎస్కేను ఢీ కొట్టనున్న ఆర్సీబీ.. టాస్ గెలిస్తే!
IPL 2022 CSK Vs RCB: ఐపీఎల్-2022లో మరో ఉత్కంఠభరిత పోరకు రంగం సిద్దమైంది. పుణేలోని ఎంసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా బుధవారం(మే 4) చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఇక వరుస మూడు ఓటములతో డీలా పడ్డ ఆర్సీబీ.. సీఎస్కేపై విజయం సాధించి తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. విరాట్ కోహ్లి తిరిగి ఆర్సీబీ కలిసిచ్చే ఆంశం. బ్యాటింగ్‌లో కెప్టెన్ డుప్లెసిస్, మాక్స్వెల్, కార్తీక్ వంటి స్టార్ ఆటగాళ్లు బ్యాట్ ఝుళిపిస్తే.. సీఎస్కే గట్టి పోటీ ఎదుర్కోక తప్పదు. ఇక బౌలింగ్ పరంగా ఆర్సీబీ పటిష్టంగా కన్పిస్తోంది. బౌలింగ్ విభాగంలో జోష్ హాజిల్‌వుడ్, సిరాజ్, హాసరంగా వంటి స్టార్ బౌలర్లు ఉన్నారు. ఇక సీఎస్కే విషయానికి వస్తే.. ధోని తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాక తొలి మ్యాచ్‌లోనే సీఎస్కే విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే గెలిపొందింది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా సీఎస్కే పటిష్టంగా కన్పిస్తోంది. ఇక ఎస్ఆర్హెచ్తో జరిగిన గత మ్యాచ్‌లో సీఎస్కే ఓపెనర్లు రుత్‌రాజ్ గైక్వాడ్, కాన్వే అధ్బుతమైన ఇన్నింగ్స్ ఆడారు. అదే విధంగా మిడిలార్డర్లో రాయుడు కూడా రాణిస్తోన్నాడు. ఇక గత మ్యాచ్‌కు దూరమైన బ్రావో ఈ మ్యాచ్‌కు అందుబాటులోఉండే అవకాశం ఉంది. ఇక ఇరు జట్లలో హిట్టర్లు ఉన్నారు కాబట్టి భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఇప్పటి వరకు ఇరు జట్లు 30 సార్లు ముఖాముఖి తలపడగా.. సీఎస్కే 20 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. ఆర్సీబీ కేవలం 9 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందింది. పిచ్ రిపోర్ట్ ఎంసీఏ స్టేడియం పిచ్ గత మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌కు, బౌలర్లకు అనుకూలించింది. గత మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. అయితే న్యూ బాల్‌తో బౌలర్లు కూడా వికెట్లు పడగొట్టారు. టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. తుది జట్లు అంచనా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, మహిపాల్ లోమ్రోర్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్ చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, MS ధోని (కెప్టెన్), డ్వేన్ బ్రావో, డ్వైన్ ప్రిటోరియస్, సిమర్జీత్ సింగ్, ముఖేష్ చౌదరి, మహేశ్ తీక్షణ చదవండి: IPL 2022 Playoff Venues: ఐపీఎల్ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పిన బీసీసీఐ..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); In sync and 💪Here is the peek into the game tonight with Mr. Cricket @mhussey393!#RCBvCSK #Yellove #WhistlePodu 🦁💛 @amazonIN #AmazonPay pic.twitter.com/zeERmr6CNT — Chennai Super Kings (@ChennaiIPL) May 4, 2022 Captain Faf, Mike Hesson and Josh Hazlewood give us some insights into the team’s preparations and priorities heading into the big game against CSK, on @kreditbee presents Game Day.#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #RCBvCSK pic.twitter.com/3nxwFbGOjB — Royal Challengers Bangalore (@RCBTweets) May 4, 2022 -
115 పరుగులకే కుప్పకూలిన ఆర్సీబీ.. రాజస్తాన్ ఘన విజయం
-
తొలి బంతికే డకౌట్..కోహ్లికి ఏమైంది.. తలదించుకుని పెవిలియన్‌కు!
ఐపీఎల్-2022లో విరాట్ కోహ్లి మరోసారి నిరాశపరిచాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కోహ్లి గోల్డన్ డక్‌గా వెనుదిరిగాడు. ఓపెనర్ డుప్లెసిస్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి.. జానెసన్ వేసిన బంతిని షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బంతి ఎడ్జ్ తీసుకుని నేరుగా సెకెండ్ స్లిప్‌లో ఉన్న మాక్రమ్ చేతికి వెళ్లింది. దీంతో తొలి బంతికే ఔటయ్యన కోహ్లి ఒక్క సారిగా దిగులుగా అలానే చూస్తుండు పోయాడు. ఇక కోహ్లి రియాక్షన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ సీజన్లో కోహ్లికి వరుసగా రెండో గోల్డన్ డక్. ఓవరాల్‌గా తన ఐపీఎల్ కెరీర్లో కోహ్లికి ఇది ఐదో గోల్డన్ డక్. ఇక ఐపీఎల్ 2022లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లి కేవలం 119 పరుగులు మాత్రమే చేశాడు. pic.twitter.com/OOpGL16KdS — Diving Slip (@SlipDiving) April 23, 2022 చదవండి: IPL 2022: 11 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన జోస్ బట్లర్.. తొలి ఆటగాడిగా! -
"చెల్లీ.. మళ్లీ నేను ఆడుతున్నానంటే కారణం నీవే"..
టీమిండియా పేసర్, ఆర్సీబీ స్టార్ పేసర్ హర్షల్ పటేల్ సోదరి మరణించిన సంగతి తెలిసిందే. దీంతో హర్షల్ పటేల్ చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌కు ముందు బయోబబుల్ వీడి సోదరి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. అయితే ఒక్క రోజులో తిరిగి మళ్లీ ఆర్సీబీ జట్టులో చేరి హర్షల్ పటేల్ అందరిని ఆశ్చర్యపరిచాడు. తాజాగా తన చెల్లెలను ఉద్దేశించి ఓ ఎమోషనల్ నోట్‌ను ఇన్స్టాగ్రామ్ వేదికగా హర్షల్ పటేల్ షేర్ చేశాడు. "మా జీవితాల్లో అత్యంత విలువైన వ్యక్తివి నీవు. నీవు లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిది. తుది శ్వాస విడిచే వరకూ నీ ముఖం మీద చిరు నవ్వు పోనివ్వలేదు. నీ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదర్కొన్నావు. నేను నీతో హాస్పిటల్లో ఉన్నప్పుడు నా ఆటపై దృష్టి పెట్టమని.. తిరిగి ఇండియాకు పంపించేశావు. ఆ మాటల వల్లనే నేను వచ్చి మళ్లీ ఆడగాలిగాను. నీ మాటలను గౌరవిస్తూ, నిన్ను ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటానని చెప్పడానికి నేను చేయగలిగింది ఇదే. నేను చేసే ప్రతీ పని నీవు గర్వపడేలా చేస్తాను. నా జీవితంలోని ప్రతీ క్షణం నిన్ను మిస్ అవుతున్నా. అవి మంచివైనా చెడ్డవైనా. ఐ లవ్ యూ సో మచ్... రెస్ట్ ఇన్ పీస్ జదీ’" అంటూ హర్షల్ పటేల్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. చదవండి: IPL 2022 CSK Vs GT: "వెల్కమ్ బ్యాక్ రుత్‌రాజ్.. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడావు" -
"టీమిండియాలో చోటు కోసం చాలా కష్టపడుతున్నా.. అదే నా కోరిక"
ఐపీఎల్-2022లో టీమిండియా వెటరన్ కీపర్, ఆర్సీబీ స్టార్ ఆటగాడు దినేష్ కార్తీక్ దుమ్మురేపుతున్నాడు. శనివారం(ఏప్రిల్ 16) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కార్తీక్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 34 బంతుల్లో అజేయంగా 66 పరుగులు చేసి ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. కాగా మ్యాచ్ అనంతరం దినేష్ కార్తీక్‌ను తన సహచర ఆటగాడు విరాట్ కోహ్లి ఇంటర్వ్యూ చేశాడు. ఈ క్రమంలో కార్తీక్‌పై కోహ్లి ప్రశంసల వర్షం కురిపించాడు. అదే విధంగా కార్తీక్‌ను తన ఫ్యూచర్ గోల్స్ కోసం ఆడగగా.. తన మనసులోని మాటను అతడు బయట పెట్టాడు. టీమిండియాలో చోటు కోసం తాను అన్ని విధాలుగా కష్టపడుతున్నానని కార్తీక్ తెలిపాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు తరపున ఆడాలన్నతన కోరికను కార్తీక్ వ్యక్తం చేశాడు. "భారత్ తరుపున మళ్లీ ఆడాలనేది నా లక్ష్యం. టీ20 ప్రపంచకప్ దగ్గరలోనే ఉందని నాకు తెలుసు.నేను జట్టులో చోటు కోసం చాలా కష్టపడుతున్నాను వరల్డ్‌కప్ జట్టులో బాగమై భారత్ విజయంలో నా వంతు పాత్ర పోషించాలి అనుకుంటున్నాను. భారత్ ఐసీసీ టోర్నమెంట్లను గెలిచి చాలా కాలం అయ్యింది. కాబట్టి భారత్ ఈ ప్రపంచకప్‌లో టైటిల్ నెగ్గాలని కోరుకుంటున్నాను" అని కార్తీక్ పేర్కొన్నాడు. కాగా 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్ జట్టుకు కార్తీక్ ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: IPL 2022: కోహ్లి సింగిల్ హ్యాండ్ స్టన్నింగ్ క్యాచ్.. అనుష్క శర్మ వైపు చూస్తూ.. వైరల్ -
'అది కోహ్లి బ్యాటింగ్ కాదు.. అతడిలో పవర్ తగ్గింది'
ఐపీఎల్ 2022లో ఇప్పటి వరకు ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినప్పటకీ.. జట్టు విజయంలో తన వంతు పాత్ర మాత్రం పోషిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 106 పరుగులు సాధించాడు. కాగా ఏప్రిల్ 9 న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి 48 పరుగులు సాధించి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు ఐపీఎల్లో విరాట్ కోహ్లి ప్రదర్శనపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. కోహ్లి ఇంకా పూర్తి స్థాయిలో ఫామ్‌లోకి రాలేదని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా కోహ్లి బ్యాటింగ్‌లో కాస్త దూకుడు తగ్గిందని మంజ్రేకర్ తెలిపాడు. "ఈ సీజన్లో కోహ్లి పరుగులు సాధిస్తున్నాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ కోహ్లి నుంచి ఎప్పడూ ఇటువంటి ఇన్నింగ్స్ నేను ఊహించను. అతడు గతంలో సిక్సర్ బాదితే బంతి స్టాండ్స్‌లో పడేది. ఇప్పుడు మాత్రం అతడు కేవలం బౌండరీ రోప్‌ను మాత్రమే క్లియర్ చేస్తున్నాడు. అతడు బ్యాటింగ్‌లో పవర్ గేమ్ కాస్త తగ్గింది. ఐదు-ఆరేళ్ల క్రితం అతడు భారీ సిక్సర్లు కొట్టేవాడు. నేను కేవలం అతడు హిట్టింగ్పైన మాత్రమే దృష్టి సారిస్తాను. అంతే తప్ప అతడు 50 లేదా 60 పరుగలు సాధించాడన్నది నాకు ముఖ్యం కాదు" అని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: కేకేఆర్‌తో మ్యాచ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్ న్యూస్! -
ఎవరీ అనుజ్ రావత్... ముంబై ఇండియన్స్‌కు చుక్కలు చూపించాడు!
ఐపీఎల్-2022లో భాగంగా శనివారం(ఏప్రిల్ 9)న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ యువ ఆటగాడు అనుజ్ రావత్ అదరగొట్టాడు. 47 బంతుల్లో 66 పరుగులు సాధించి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్-2022 మెగా వేలంలో భాగంగా రావత్‌ను ఆర్సీబీ రూ.3.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఉత్తరాఖండ్‌కు చెందిన అనుజ్ రావత్ దేశీవాళీ క్రికెట్లో ఢిల్లీ తరుపున ఆడుతున్నాడు. ఎవరీ అనుజ్ రావత్? ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌లో ఓ రైతు కుటంబంలో అనుజ్ రావత్ జన్మించాడు. కాగా చిన్నతనం నుంచే రావత్‌కు క్రికెట్ అంటే మక్కువ. అయితే రామ్‌నగర్‌లో క్రికెట్ అకాడమీలు లేకపోవడంతో అతడి తండ్రి ఢిల్లీకు పంపాడు. ఇక అక్టోబరు 2017లో అనుజ్ రావత్ ఢిల్లీ తరపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. అప్పటినుంచి రావత్ దేశీవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడు తన మొదటి రెండు రంజీ మ్యాచ్‌లలో అర్ధ సెంచరీలు సాధించాడు. అదే విధంగా 2018 రంజీ సీజన్లో మధ్యప్రదేశ్‌పై రావత్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఇక ఇటీవలి జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, జయ్ హజారే ట్రోఫీలోను రావత్ అదరగొట్టాడు. ఐపీఎల్ 2021లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అనూజ్ రావత్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. చదవండి: IPL 2022: సమస్య బయటపెట్టిన మాజీ క్రికెటర్.. ముంబై ఓటములకు బ్రేక్ పడేనా! -
సింగిల్ హ్యాండ్ క్యాచ్.. సూపర్మ్యాన్లా డైవ్ చేస్తూ!
ఐపీఎల్-2022లో భాగంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ వికెట్ కీపర్ షెల్డన్ జాక్సన్ స్టన్నింగ్ క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసిన టిమ్ సౌథీ బౌలింగ్‌లో.. రెండో బంతిని రూథర్‌ఫోర్డ్ లెగ్‌సైడ్ భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్‌కు కుడివైపు నుంచి వెళ్లింది. ఈ క్రమంలో జాక్సన్ డైవ్ చేస్తూ అద్భుతమైన సింగిల్ హ్యాండ్ క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా అద్భుతమైన క్యాచ్ అందుకున్న జాక్సన్‌ను టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రసంశించాడు. ఇక ఈ మ్యాచ్‌లో జాక్సన్ మూడు క్యాచ్‌లు, ఒక స్టంపౌట్ చేశాడు. అంతకుమందు సీఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్‌లోను రాబిన్ ఉతప్పను మెరుపు వేగంతో స్టంపౌట్ చేసి అందరి చేత జాక్సన్ ప్రశంసలు పొందాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీ చేతిలో మూడు వికెట్ల తేడాతో కేకేఆర్ ఓటమి పాలైంది. . తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 128 పరుగులకే ఆలౌట్ అయింది. కేకేఆర్ బ్యాటర్లలో ఆండ్రీ రసెల్ (25), ఉమేశ్ యాదవ్(18) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో వనిందు హసరంగా నాలుగు, ఆకాశ్ దీప్ మూడు, హర్షల్ పటేల్ , సిరాజ్ ఒక వికెట్ సాదించారు. అనంతరం 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 7 వికెట్లు కోల్పోయి చేధించింది. షెల్డన్ జాక్సన్ స్టన్నింగ్ క్యాచ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి చదవండి: IPL 2022: అరె ఇషాంత్ భయ్యా.. ఇదేం కర్మ! @ShelJackson27 what a catch 👏 @msdhoni @KKRiders #whatacatch pic.twitter.com/QLbSg33ZwS — sid (@siddheshnate) March 30, 2022 -
ముందు సంచలన క్యాచ్‌తో మెరిశాడు.. తర్వాత ఈజీ క్యాచ్‌ను..!
ఐపీఎల్-2022 లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు అనుజ్ రావత్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. పంజాబ్ ఇన్నింగ్స్ 15వ ఓవర్ వేసిన కాష్ దీప్ బౌలింగ్‌లో.. లియామ్ లివింగ్‌స్టోన్ ఆఫ్‌సైడ్ భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే అది మిస్టైమ్ అయింది. దీంతో ఆఫ్‌సైడ్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రావత్ ముందుకు డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. రావత్ సూపర్ క్యాచ్ అందుకోవడంతో లివింగ్‌స్టోన్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ మ్యాచ్‌లో రెండు అద్భుతమైన క్యాచ్‌లు ఆందుకున్న రావత్.. పంజాబ్ బ్యాటర్ స్మిత్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను వదిలివేయడం గమనార్హం. ఈ క్యాచ్ వదిలి వేయడంతో స్మిత్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. సిరాజ్ వేసిన 18వ ఓవర్లో స్మిత్ ఏకంగా 25 పరుగులు రాబట్టి పంజాబ్‌కు విజయం అందించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. డుప్లెసిస్(88),విరాట్ కోహ్లి (41) చేలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 205 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. పంజాబ్ బ్యాటర్లలో కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (32), శిఖర్ ధవన్ (43), భానుక రాజపక్స (43),ఒడియన్ స్మిత్(25) పరుగులతో రాణించారు. చదవండి: IPL 2022: సన్‌రైజర్స్ బౌలర్‌కు పూరన్ ఓపెన్ చాలెంజ్! ప్లాన్ ఫెయిల్ కావడంతో.. -
డు ప్లెసిస్‌కు భారీ షాక్.. ఆర్సీబీ కెప్టెన్‌గా దినేష్ కార్తీక్!
ఐపీఎల్-2022 కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ షెడ్యూల్‌ను బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. ఈ సీజన్లో మరో రెండు కొత్త జట్లు అరంగేట్రం చేయడంతో లీగ్ మరింత రసవత్తరంగా జరగనుంది. అయితే ఐపీఎల్-2022 సీజన్ కోసం ఒక్క రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తప్ప అన్ని ఫ్రాంచైజీలు కెప్టెన్లు నియమించుకున్నాయి. ఈ క్రమంలో ఆర్సీబీ కెప్టెన్సీ రేసులో మాక్స్వెల్, డు ప్లెసిస్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే మాక్స్వెల్ తన వివాహం కారణంగా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానుండటంతో డు ప్లెసిస్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేస్తారని అంతా భావిస్తున్నారు. అయితే అనూహ్యంగా దినేష్ కార్తీక్ పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది. గతంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఉండడంతో ఆర్సీబీ మెనేజేమెంట్ కార్తీక్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.వేలానికి ముందు విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్వెల్, మహ్మద్ సిరాజ్‌లను ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. కాగా ఐపీఎల్-2022 మెగా వేలంలో ఆర్సీబీ కార్తీక్‌ను రూ. 5.5 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా ఐపీఎల్ 2022 షెఢ్యూల్‌ను బీసీసీఐ ఆదివారం విడుదల చేసింది. వాంఖడే వేదికగా తొలి మ్యాచ్‌లో చెన్నైతో కేకేఆర్ తలపడనుంది. చదవండి: IPL 2022: 'కోహ్లి మళ్లీ కెప్టెన్ కాలేడు.. ఆర్సీబీ కెప్టెన్‌గా అతడే సరైనోడు' -
"వేలంలో అతడి కోసం 10 జట్లు పోటీ పడడం ఖాయం"
ఐపీఎల్-2022 మెగా వేలంలో శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగా కోసం లక్నో, అహ్మదాబాద్‌తో సహా మొత్తం 10 జట్లు పోటీ పడతాయని భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా అభిప్రాయ పడ్డాడు. రానున్న వేలంలో అత్యంత ఖరీదైన టాప్ 5 బౌలర్లలో హసరంగా ఒకడని చోప్రా తెలిపాడు. హసరంగా అద్భుతమైన ఆటగాడు. అతడు బాల్‌తో పాటు బ్యాట్‌తో కూడా రాణించగలడు. ఒక వేళ నేను వేలంలో పాల్గొంటే మొదటిగా అతడినే ఎంచుకుంటాను. అతడు కొత్త బంతితో కూడా బాగా బౌలింగ్ చేయగలడు. గత ఏడాది ఆర్సీబీ అతడిని తక్కువ ధరకి కొనుగోలు చేసింది. కానీ హసరంగాకి అంతగా ఆర్సీబీ అవకాశం ఇవ్వలేదు. ఫ్రాంచైజీలు అతడి కోసం 4 నుంచి 5 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అతడు టీ20 క్రికెట్లో గత కొన్నాళ్లుగా అద్భుతంగా రాణిస్తున్నాడు. వేలంలో మొత్తం 10 జట్లు కూడా అతడి కోసం పోటీ పడతాయి అనడంలో సందేహం లేదు అని ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. ఇక ఫిబ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరు వేదికగా వేలాన్ని బీసీసీఐ నిర్వహించనుంది. ఇక ఈ మెగా వేలంలో 590 మంది క్రికెటర్లు పాల్గొనబోతున్నారు. చదవండి: IPL 2022 Mega Auction: వేలంలో అతడికి ఏకంగా రూ.11 కోట్లు.. అయ్యర్‌కి మరీ ఇంత తక్కువా! -
వేలంలో అతడి కోసం చాలా జట్లు పోటీ పడతాయి
All IPL franchises would want to buy Yuzvendra Chahal in IPL Auction: ఐపీఎల్-2022 మెగా వేలంకు ముందు 8 ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల రీటైన్ జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్సీబీ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను రీటైన్ చేసుకోలేదు. కెప్టెన్ కోహ్లి, మ్యాక్స్‌వెల్, సిరాజ్‌ను మాత్రమే ఆర్సీబీ రీటైన్ చేసుకుంది. ఈ నేపథ్యంలో రానున్న మెగా వేలంలో చాహల్‌కు భారీ ధర దక్కనుందని భారత మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ అభిప్రాయపడ్డాడు. కాగా గత కొన్ని సీజన్ల నుంచి రాయల్ ఛాలెంజర్స్‌కు చాహల్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్- 2021 తొలి విడతలో పెద్దగా రాణించకపోయినా, యూఏఈ వేదికగా జరిగిన రెండో విడతలో చాహల్ అద్బుతంగా రాణించాడు. అయితే రానున్న మెగా వేలంలో చాహల్‌ను ఆర్సీబీ తిరిగి దక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంది అని అతడు తెలిపాడు. ఈ వేలంలో చాహల్‌ను దక్కించుకోవడానికి చాలా జట్లు తీవ్రమైన పోటీ పడతాయి అని అతడు తెలిపాడు. " ఆర్సీబీ చాహల్‌ని తిరిగి దక్కించుకోవడానికి ప్రత్నిస్తుంది. ఐపీఎల్లో అతని అసాధారణ రికార్డు కారణంగా ఇతర జట్లు కూడా చాహల్ కోసం తీవ్రమైన పోటీపడతాయి. కొత్తగా వచ్చిన ఫ్రాంచైజీలు ఎక్కువ మెత్తం వెచ్చించి అతడిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తాయి. చాహల్ రీటైన్ చేసుకునే మెత్తం కంటే.. వేలంలో ఇంకా ఎక్కువ ధర పొందవచ్చు అని అతడు పేర్కొన్నాడు. ఇక యువ క్రికెటర్లు గురించి మాట్లాడుతూ.. ఆటగాళ్లందరూ తమ దేశం కోసం ఆడడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని అని శివరామకృష్ణన్ సూచించాడు. చదవండి: Rashid Khan: 16 కోట్లు కావాలని పట్టుబట్టాడు!.. అయితే.. అంతకంటే ఎక్కువకే మరి! -
అరుదైన రికార్డుకు చేరువలో హర్షల్ పటేల్..
Harshal Patel On The Brink Of Breaking This Huge IPL Record: ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్ల తీసిన రికార్డు చెన్నై బౌలర్ డ్వేన్ బ్రావో పేరిట ఉంది. 2013 సీజన్లో బ్రేవో ఏకంగా 32 వికెట్లు పడగొట్టాడు. కాగా ప్రస్తుతం ఈ సీజన్లో హర్షల్ ఖాతాలో 30 వికెట్లు ఉన్నాయి. నేడు కోల్‌కతాతో జరగనున్న మ్యాచ్‌లో మరో రెండు వికెట్లు సాధిస్తే ఆ ఘనత అతడి సొంతమవుతుంది. ఇప్పటికే ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా హర్షల్ పటేల్ నిలిచిన సంగతి తెలిసిందే. ఎలిమినేటర్ మ్యాచ్ లో భాగంగా నేడు(సోమవారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. కోల్‌కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. చదవండి: Virat Kohli: కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పుకున్నాడో బయట పెట్టిన కోహ్లి... -
IPL 2021: అందుకే కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నా: విరాట్ కోహ్లి
Virat Kohli Reveals Why he Decided to Step Down as RCB Captain ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించి అభిమానులను విరాట్ కోహ్లి నిరాశపరిచాడు. అయితే కెప్టెన్‌గా ఎందుకు తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడో కోహ్లి తాజాగా వెల్లడించాడు. నేడు( సోమవారం) కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ తలపడనుంది. ఈ క్రమంలో అతడు, డివిలియర్స్‌తో కలిసి స్టార్ స్పోర్ట్స్ వర్చువల్ ఇంటర్వూలో పాల్గొన్నాడు. తన నిర్ణయం వెనుక పనిభారం అతిపెద్ద కారణమని కోహ్లి పేర్కొన్నాడు. ఇక బాధ్యతల విషయంలో తాను నిజాయతీ లేకుండా వ్యవహరించలేని విరాట్ తెలిపాడు. 'కెప్టెన్‌గా తప్పుకోవడానకి పనిభారం ప్రధాన కారణం. నా బాధ్యత పట్ల నేను నిజాయితీ లేకుండా వ్యవహరించలేను. నేను దేనినైనా వందకు 120% ఇవ్వలేకపోతే, దానిని పట్టుకొని వేలాడే వ్యక్తిని కాను. ఈ విషయంలో నేను క్లియర్‌గా ఉంటాను’ అని స్టార్ స్పోర్ట్స్‌లో మాట్లాడుతున్నప్పుడు కోహ్లి చెప్పాడు. కాగా 2013లో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కోహ్లి ఆర్సీబీకి టైటిల్ అందించడంలో విఫలమయ్యాడు. ఇక టోర్నీ ఆరంభమైనప్పటి నుంచీ ఇంతవరకు బెంగళూరు ఒక్కసారి కూడా ఛాంపియన్‌గా నిలవలేదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా కప్ సాధించి కెప్టెన్‌గా కోహ్లికి ఘనంగా వీడ్కోలు పలకాలని ఆటగాళ్లు భావిస్తున్నారు. చదవండి: CSK Vs DC: అతడితో 19వ ఓవర్ వేయించాల్సింది.. ఆ నిర్ణయం తప్పు: గంభీర్ Curious to know what prompted @imVkohli to step down from captaincy? 🤔 The #RCB skipper reveals the reason on #InsideRCB: Tomorrow, 8:30 AM & 12 PM | Star Sports 1/1HD/2/2HD pic.twitter.com/rqcIdonx5o — Star Sports (@StarSportsIndia) October 10, 2021 -
వీరిలో ఎవరైనా ఆర్సీబీ కెప్టెన్ కావొచ్చు..?
Aakash Chopra Lists Options RCB Captain: 2021 ఐపీఎల్ సీజన్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించి అభిమానులును విరాట్ కోహ్లి నిరాశపరిచాడు. అయితే కోహ్లి బాధ్యతలను ఎవరు స్వీకరిస్తున్నది ఇప్పడు ప్రశ్నగా మారింది. ఆర్సీబీకి కెప్టెన్సీ నియామకంపై పలు ఊహాగానాలు చెలరేగుతున్న క్రమంలో కోహ్లీ నుంచి నాయకత్వం స్వీకరించగలరని భావించే కొంత మంది ఆటగాళ్ల జాబితాను భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా వెల్లడించాడు. అతడి జాబితాలో మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, రవి అశ్విన్ మరియు శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. “ఒక వేళ శ్రేయస్ అయ్యర్‌ని ఢిల్లీ వదిలివేస్తుందా? అతడు కెప్టెన్ కావచ్చు. కేఎల్ రాహుల్ పంజాబ్‌లో కొనసాగుతారా? అతడిని వదులుకుంటే, అతడే కావచ్చు. మయాంక్ అగర్వాల్ బయటకు వస్తే , అతడు కావచ్చు. రవిచంద్రన్ అశ్విన్ విడుదలైతే, అతను కావచ్చు అని చోప్రా తన యూట్యూబ్ ఛానెల్లో పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది జరగనున్న మెగా వేలం ముందు ఆర్సీబీ ఎబి డివిలియర్స్, కోహ్లీ, గ్లెన్ మాక్స్వెల్, యుజ్వేంద్ర చాహల్‌లను నిలుపుకుంటుందని కూడా అతడు అభిప్రాయపడ్డాడు. డేవిడ్ వార్నర్ మరొక అభ్యర్థి అని పుకార్లు వస్తుందున.. తదుపరి కెప్టెన్ ఎవరు అవుతారో చూడటం చాలా ఆసక్తికరంగా ఉందని అతడు తెలిపాడు. కాగా పంజాబ్‌పై విజయంతో ఆర్సీబీప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉన్నందున బెంగళూరు గెలవాలని కోరుకుంటున్నాని చోప్రా చెప్పాడు. చదవండి: Sehwag Vs SRH: 'నిద్రమాత్రల్లా కనిపించారు.. ఆ నాలుగు ఓవర్లు నిద్రపోయా' -
టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ ఆ స్ధానంలో బ్యాటింగ్‌కు రావాలి..
Saba Karim Comments On Virat Kohli: వచ్చే నెల ఆరంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లో విజేతలు, జట్టు సమ తుల్యతలపైన మాజీలు, క్రికెట్ నిపుణులు ఇప్పటి నుంచే అంచనాలు వేస్తున్నారు. అయితే ఈ జాబితాలో భారత మాజీ వికెట్ కీపర్ సబా కరీమ్ ముందున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ భారత్ తరపున ఓపెనర్‌గా ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తే బాగుంటుందని కరీమ్ అభిప్రాయపడ్డాడు. అతడు విరాట్ కోహ్లి గురించి మాట్లడూతూ.. "టీ20 విజయాల్లో టీమిండియా తరుపున కోహ్లి కీలక పాత్ర పోషించాడు. గతంలో అతడు టీ20 ఫార్మాట్లో ఓపెనింగ్ చేయాలనే కోరికను కూడా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం జరగుతున్న ఐపీఎల్ సెకెండ్ ఫేజ్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నందున ప్రపంచ కప్‌లో కోహ్లి టీమిండియా తరుపున ఇన్పింగ్స్ ఆరంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి" అని కరీమ్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ రెండో దశలో ఆర్సీబీ రెండు వరుస ఓటముల తర్వాత ముంబైపై విజయం సాధించి గాడిలో పడింది. ఈ విజయంలో సారథి కోహ్లి 51 పరుగులతో కీలక పాత్ర పోషించాడు. రెండు వరుస కోహ్లీ వరుసగా రెండు అర్ధ సెంచరీలు సాధించి అధ్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. టీ20 వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత కోహ్లి.. పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీని వదులుకోనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైస్ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ టీమిండియా టీ20 ఫార్మాట్ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. చదవండి: పూల్‌లో ఎంజాయ్ చేస్తున్న ఆర్సీబీ ఆటగాళ్లు.. ఫోటోలు వైరల్ Virat Kohli: ఆ విషయం అర్థమైనట్లుంది.. అందుకే కెప్టెన్సీ వదులుకుని మరీ.. -
పెళ్లి తర్వాత జీవితం ప్రమాదకరంగా మారుతుంది: ధనశ్రీ
ముంబై: టీమిండియా లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ శనివారం వారి పెళ్లి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. గతేడాది డిసెంబర్లో ధనశ్రీ, చాహల్‌ల వివాహం జరిగింది. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను చాహల్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా పెళ్లి వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోకి చాహల్ ‘‘ఇద్దరు ఉల్లాసవంతమైన, శక్తివంతమైన వ్యక్తులు కలిస్తే’’ అనే క్యాప్షన్ షేర్ చేయగా.. ధనశ్రీ ‘‘పెళ్లి తర్వాత జీవితం చాలా ప్రమాదకరంగా మారుతుంది భయ్యా’’ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోలో వీరి పెళ్లి తతంగాన్ని చూడవచ్చు. ఐపీఎల్ 2021లో భాగంగా చాహల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో భాగంగా ఉన్నాడు. ఇక ఏప్రిల్ 9 ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఐపీఎల్ 2020 లో ఆర్సీబీ ప్లేఆఫ్‌కు చేరుకుంది. చాహల్ మొత్తం 15 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు తీసి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఈ లెగ్ స్పిన్నర్ 99 ఐపీఎల్ మ్యాచ్‌లలో 121 వికెట్లు తీశాడు. కరోనా వైరస్ కారణంగా 2020 ఎడిషన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో జరిగింది. కానీ ఈ ఏడాది మాత్రం ఇండియాలోనే జరగనుంది. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు జరిగే ఐపీఎల్ 2021 కోసం చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్ వేదికగా ఖరారు చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. చదవండి: వైరల్: చహల్ భార్యతో గబ్బర్ చిందులు -
‘నమ్దే’ ఇంకెప్పుడు?
సాక్షి క్రీడా విభాగం: ‘ఓటములు మమ్మల్ని ఓడించలేవు. పోరాట స్ఫూర్తి మమ్మల్ని సజీవంగా ఉంచుతుంది’... తమ అధికారిక వెబ్సైట్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టీమ్ రాసుకున్న వాక్యం ఇది. అదేంటో గానీ పోరాటాలే తప్ప జట్టు ఖాతాలో విజయాలు మాత్రం లేవు. ఐపీఎల్లో పాపులారి టీ విషయంలో మిగతా జట్లతో పోలిస్తే ఎక్కడా తక్కువ కాదు, పెద్ద సంఖ్యలో అభిమాన గణం, వాణిజ్యపరంగా చూస్తే వహ్వా అనిపించే కంపెనీలతో సహవాసం... స్వయంగా భారత కెప్టెన్ సుదీర్ఘ కాలంగా జట్టును నడిపిస్తుండగా, టి20లో విధ్వంసానికి చిరునామాలాంటి డివిలియర్స్, గతంలో గేల్‌లాంటి ఆటగాళ్లు ఐపీఎల్‌ను ఒక ఊపు ఊపారు. కానీ తుది ఫలితానికి వచ్చేసరికి మాత్రం సున్నా! మూడుసార్లు ఫైనల్లో ఓడిన బెంగళూరు ఇప్పుడైనా ఆ గండాన్ని దాటి కన్నడ అభిమానులతో ‘కప్ నమ్దే ( మనదే)’ అనిపిస్తుందో లేదో వేచి చూడాలి! కొత్తగా వచ్చినవారు ఐపీఎల్ వేలంలో ఆర్సీబీ ఇద్దరు ఆటగాళ్ల కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేసింది. న్యూజిలాండ్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కైల్ జేమీసన్ (రూ. 15 కోట్లు), ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (రూ. 14.25 కోట్లు)లకు అనూహ్య మొత్తం ఇచ్చి సొంతం చేసుకుంది. వేలానికి ముందు విదేశీ ఆల్‌రౌండర్, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అవసరం ఆ జట్టుకు ఉంది. అందుకు తగినట్లుగానే ఐపీఎల్ అనుభవం ఉన్న మరో ఆల్‌రౌండర్ డాన్ క్రిస్టియాన్ (రూ. 4.80 కోట్లు)ను కూడా తీసుకుంది. ఈ ముగ్గురు కాకుండా మరో ఐదుగురు భారత వర్ధమాన ఆటగాళ్లను కనీసం మొత్తం రూ.20 లక్షలకే సొంతం చేసుకుంది. సచిన్ బేబీ, రజత్ పటిదార్, మొహమ్మద్ అజహరుద్దీన్, సుయాష్ ప్రభుదేశాయ్‌లతో పాటు ఆంధ్ర జట్టు వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఇంత మొత్తం చెల్లించినా... భారత గడ్డపై ఇప్పటి వరకు ఒక్కబంతి కూడా వేయని జేమీసన్, గత కొన్నేళ్లుగా వరుసగా విఫలమవుతున్న మ్యాక్స్‌వెల్ ఎలా ఆడతారన్నది ఆసక్తికరం. ఒక భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కోసం బెంగళూరు చివరి వరకు ప్రయత్నించినా సరైన ఆటగాడు దక్కలేదు. జట్టు వివరాలు భారత ఆటగాళ్లు: కోహ్లి (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, మొహమ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ, పవన్ దేశ్‌పాండే, షహబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చహల్, హర్షల్ పటేల్, సచిన్ బేబీ, రజత్ పటిదార్, మొహమ్మద్ అజహరుద్దీన్, సుయాష్ ప్రభుదేశాయ్, కోన శ్రీకర్ భరత్. విదేశీ ఆటగాళ్లు: డివిలియర్స్, డానియెల్ స్యామ్స్, ఫిన్ అలెన్, జేమీసన్, డాన్ క్రిస్టియాన్, మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్. సహాయక సిబ్బంది: మైక్ హెసన్ (డైరెక్టర్, క్రికెటర్ ఆపరేషన్స్), సైమన్ కటిచ్ (హెడ్ కోచ్), సంజయ్ బంగర్ (బ్యాటింగ్ కన్సల్టెంట్), శ్రీధరన్ శ్రీరామ్ (బ్యాటింగ్ అండ్ స్పిన్ బౌలింగ్ కోచ్), ఆడమ్ గ్రిఫిత్ (బౌలింగ్ కోచ్). తుది జట్టు అంచనా/ఫామ్ మూడు–కోహ్లి, నాలుగు–డివిలియర్స్, ఐదు–మ్యాక్స్‌వెల్... భారీ మొత్తాన్ని చెల్లించి మ్యాక్సీని తీసుకోవడం ఐదో స్థానంలో ఆడించాలనే వ్యూహంలో భాగమే. కోహ్లి, డివిలియర్స్‌లు కాకుండా ఇన్నింగ్స్ చివర్లో మెరుపు షాట్లు ఆడే ఒక బ్యాట్స్‌మన్ అవసరం ఉన్న టీమ్ ఇప్పుడు ఆసీస్ ఆటగాడిపై ఆశలు పెట్టుకుంది. ఓపెనింగ్‌లో పడిక్కల్‌కు తోడుగా ఫిన్ అలెన్ (కివీస్) బరిలోకి దిగవచ్చు. నాలుగో విదేశీ ఆటగాడిగా జేమీసన్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నా యి. రెండో ఓపెనర్‌గా కూడా భారత ఆటగాడి (అజహరుద్దీన్)కే అవకాశం ఇస్తే జంపా, రిచర్డ్సన్లలో ఒకరిని తుది జట్టులోకి తీసుకోవచ్చు. వేలం తర్వాత ఇలాంటి కూర్పులో కూడా ఆరో స్థానంలో ఒక భారత బ్యాట్స్‌మన్‌పైనే జట్టు ఆధారపడాల్సి వస్తోంది. మ్యాక్స్‌వెల్ విఫలమైతేనే క్రిస్టియాన్‌కు చాన్స్ లభిస్తుంది. స్పిన్నర్లుగా తుది జట్టులో చహల్, సుందర్ ఖాయం. సిరాజ్, సైనీలలో ఎవరికి ఎన్ని మ్యాచ్‌లు లభిస్తాయనేది చూడాలి. అత్యుత్తమ ప్రదర్శన 3 సార్లు రన్నరప్ (2009, 2011, 2016) 2020లో ప్రదర్శన: పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడింది. లీగ్‌లో తొలి 10 మ్యాచ్‌లలో 7 గెలిచి ఒక దశలో టాపర్‌గా నిలుస్తుందనుకున్న ఆర్సీబీ, వరుసగా మిగిలిన నాలుగు మ్యాచ్‌లు ఓడింది. చివరకు అతి కష్టమ్మీద నెట్‌రన్‌రేట్‌తో ముందంజ వేయగలిగింది. కోహ్లి తన స్థాయి మేరకు ఆడకపోవడం కూడా (15 ఇన్నింగ్స్‌లలో 121.35 స్ట్రయిక్‌రేట్‌తో 466 పరుగులు) జట్టు అవకాశాలపై ప్రభావం చూపించింది. -
ఆర్సీబీ ఐపీఎల్ థీమ్.. రోమాలు నిక్కబొడిచేలా
దుబాయ్ : ఐపీఎల్ 2020 సీజన్‌కు సంబంధించి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ థీమ్‌సాంగ్‌ను విడుదల చేసింది. ఆర్సీబీ.. ఆర్సీబీ.. అంటూ మొదలయ్యే పాట.. రోమాలు నిక్కబొడుచుకునేలా సాగింది. జట్టు కెప్టెన్‌గా కోహ్లితో మొదలయ్యే పాట .. డివిలియర్స్, ఆరోన్ ఫించ్, క్రిస్ మోరిస్, చహల్‌తో పాటు ఇతర ఆటగాళ్లు పాట పాడుతూ జట్టును ఎంకరేజ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్ లిస్ట్‌లో నిలిచింది. ఇప్పటికే ఆర్సీబీ ఐపీఎల్ థీమ్ సాంగ్‌ను 5లక్షలకు పైగా వీక్షించారు. ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్‌గా డ్రీమ్11 వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.(చదవండి : 'ఆర్సీబీలో కోహ్లి, డివిలియర్స్ ఫేవరేట్ కాదు') ఐపీఎల్ ప్రారంభమైన మొదటి సీజన్ నుంచి ఫేవరేట్‌గా బరిలోకి దిగుతూనే ఒక్కసారి కూడా టైటిల్ గెలవలే కపోయింది. ప్రతీసారి ఈ జట్టు అన్ని విభాగాల్లోని బలంగా కనిపిస్తున్నప్పటికీ అసలు సిసలు ఆటకు వచ్చేసరికి బలహీనపడుతోంది. పేపర్ పులులు అనే సామెత ఆర్సీబీకి అచ్చంగా సరిపోతుందేమే. 2009, 2016 లో ఫైనల్‌కు చేరడం మినహాయించి ఏ సీజన్లోనూ ఆకట్టుకోలేదు. 2019 సీజన్లోనూ ఆర్సీబీ చివరి ప్లేస్‌కు పరిమితమైంది. విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌లకు ఈసారి వేలం ద్వారా ఆరోన్ పించ్, ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్‌లు కొత్తగా కలవడంతో జట్టు మరింత బలంగా తయారైంది. అంతేగాక బిగ్‌బాష్ లీగ్ లీగ్‌లో రాణించిన జోష్ ఫిలిప్పిని ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం ఆర్సీబీ కొనుగోలు చేయడం ప్రధాన ఆకర్షణగా మారింది. అయితే బ్యాటింగ్ పరంగా చూస్తే బలంగా కనిపిస్తున్న ఆర్సీబీ బౌలింగ్‌లో మాత్రం బలహీనంగా ఉంది. చహల్ డేల్ స్టయిన్, ఉమేశ్ యాదవ్ మినహా చెప్పుకోదగ్గ బౌలర్లు మాత్రం లేరు. దీంతో ఈసారి లీగ్‌లో ఎలాంటి ప్రదర్శన ఇవ్వనుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా సెప్టెంబర్ 21న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆర్సీబీ తమ మొదటి మ్యాచ్ ఆడనుంది. -
సందడి షురూ...
దుబాయ్: అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)– 2020కి రంగం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 19నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని మూడు వేదికల్లో లీగ్ జరగనుండగా... సుమారు నెల రోజుల ముందుగానే జట్లు అక్కడికి చేరుకుంటున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, భారత కెప్టెన్ విరాట్ కోహ్లి నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు శుక్రవారం యూఏఈ గడ్డపై అడుగు పెట్టాయి. మరో రెండు టీమ్‌లు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే అక్కడికి వెళ్లాల్సి ఉంది. నిబంధనల ప్రకారం ఆరు రోజుల వరకు అందరికీ క్వారంటీన్ తప్పనిసరి. ఈ సమయంలో ఒక్కొక్కరికి కనీసం మూడు సార్లు కరోనా పరీక్షలు నిర్వహి స్తారు. ఆ తర్వాతేనుంచి ఆటగాళ్ల ప్రాక్టీస్, లీగ్ వార్తలు క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించనున్నాయి. మలింగ మరింత ఆలస్యంగా... శ్రీలంక స్పీడ్‌స్టర్, ముంబై ఇండియన్స్ ప్రధాన పేసర్ లసిత్ మలింగ కూడా ఆలస్యంగానే యూఏఈ వెళ్లనున్నాడు. దీంతో తొలి దశ మ్యాచ్‌లకు అతను జట్టుకు అందుబాటులో ఉండడు. కుటుంబ కారణాల వల్లే లంక ఆటగాడు కాస్తా ఆలస్యంగా ఐపీఎల్ ఆడనున్నాడు. ఈ పేసర్ తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు త్వరలోనే సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఉండటంతో మలింగ తండ్రి వెంటే ఉండాలనుకుంటున్నాడు. దీంతో సగం మ్యాచ్‌లు అయ్యాకే అక్కడికి వెళ్లే అవకాశముంది. గతేడాది మలింగ మలుపు తిప్పిన ఆఖరి ఓవర్‌తోనే ముంబై నాలుగోసారి చాంపియన్ అయ్యింది. 8 పరుగులు చేస్తే చెన్నై గెలిచే ఆ ఓవర్లో అద్భుతంగా కట్టడి చేయడం వల్లే రోహిత్ సేన నెగ్గింది. చెన్నై బౌలర్ హర్భజన్ సింగ్ కూడా వ్యక్తిగత కారణాలతో జట్టుతో పాటే యూఏఈ వెళ్లలేకపోయాడు. -
'కొత్త కిట్ బాగుంది.. ఈసారైనా సాధిస్తావా'
ముంబై : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రానున్న ఐపీఎల్ 13వ సీజన్లో కొత్త బ్యాటింగ్ కిట్‌తో బరిలోకి దిగుతున్నాడు. కోహ్లి వాడనున్న కొత్త కిట్‌ను ఎంఆర్ ఎఫ్ స్పాన్సర్ చేస్తుంది. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మొదటినుంచి పేపర్‌పై బలంగా కనిపించే బెంగుళూరు జట్టు మైదానంలో మాత్రం బలమైన ప్రదర్శన చేయలేదు. దీనికి తోడు ఆ జట్టును దురదృష్టం కూడా వెంటాడుతుంది. స్టార్ ఆటగాళ్లు కలిగి ఉండి కూడా ఒక్కసీజన్లోనూ టైటిల్‌ను గెలవలేకపోయింది. దుబాయ్ వేదికగా జరగనున్న ఐపీఎల్ 13వ సీజన్లోనైనా జట్టు తలరాత మారుతుందేమో చూడాలి. (అందరికంటే ముందుగా యూఏఈకి చెన్నై జట్టు) గతంలో 2009 ఐపీఎల్ 2వ సీజన్ దక్షిణాఫ్రికాలో జరిగింది. ఆ సీజన్లో బెంగుళూరు జట్టు మంచి ప్రదర్శన నమోదు చేసి ఫైనల్‌కు చేరుకుంది. కానీ ఫైనల్లో అప్పటి డెక్కన్ చార్జర్స్ చేతిలో ఓడిపోయింది. మళ్లీ 11 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ విదేశంలో జరుగుతుంది. మరి ఈసారి అదే ప్రదర్శన కనబరిచి ఆర్సీబీ జట్టు టైటిల్ గెలుస్తుందేమో చూడాలి. ఇక కోహ్లి కొత్త బ్యాటింగ్ కిట్‌పై అభిమానులు సరదాగా ఫన్నీ కామెంట్ చేశారు. కోహ్లి.. నీ కొత్త కిట్ బాగుంది.. మరి ఈసారైనా ఆర్సీబీకి టైటిల్ తీసుకొస్తావా అంటూ పేర్కొన్నారు. కరోనా వల్ల దాదాపు నాలుగు నెలలు ఆటకు దూరంగా ఉన్న కోహ్లి ప్రస్తుతం ఐపీఎల్‌కు సన్నద్దమవుతున్నాడు. లాక్డౌన్ సమయంలో ఇంట్లోనే ఉంటూ పూర్తిగా ఫిట్నెస్ పైనే దృష్టి సారించిన కోహ్లి ఇప్పుడు సీరియస్‌గా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇదే తరహాలో భారత క్రికెటర్లైనా రిషబ్ పంత్, సురేశ్ రైనా, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ తమ ప్రాక్టీస్ వీడియోలను షేర్ చేసుకున్నారు. ఐపీఎల్ 13వ సీజన్ గెలిచే అవకాశాలు కోహ్లి నేత`త్వంలోని ఆర్సీబీ జట్టుకు పుష్కలంగా ఉన్నాయంటూ మాజీ టెస్టు ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్ వాయిదా నేపథ్యంలో ఐపీఎల్ 13వ సీజన్‌ను సెప్టెంబర్ 19 నుంచి దుబాయ్ వేదికగా నిర్వహిస్తున్నట్లు ఐపీఎల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా ఐపీఎల్ నిర్వహణ, షెడ్యూల్, మ్యాచ్ వివరాలపై రేపు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కానుంది. (కొడుకుతో దిగిన ఫోటోను షేర్ చేసిన హార్దిక్) -
అక్కడ ఉంది నేను.. గెలవడం పక్కా!
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 13కు సంబంధించి జరిగిన ఆటగాళ్ల వేళంలో దక్షిణాఫ్రికా వెటరన్ బౌలర్ డేల్ స్టెయిన్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. కనీస ధర రూ. 2కోట్లకు స్టెయిన్‌ను ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఆర్సీబీ జట్టులో తిరిగి చేరడంపై స్టెయిన్ ఉబ్బితబ్బిబవుతున్నాడు. ఈ సందర్భంగా ట్విటర్ వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు స్టెయిన్ తన దైన స్టైల్లో సమాధానాలిచ్చాడు. ఈ సారైనా ఆర్సీబీ ఐపీఎల్-2020 ట్రోఫీ గెలుస్తుందా? అని ఓ అభిమాని ప్రశ్నించగా..‘తప్పక గెలుస్తుంది. ఎందుకుంటే అక్కడ ఉంది నేను’అంటూ రిప్లై ఇచ్చాడు. అంతేకాకుండా ‘ఈసారి వీలైనన్ని ఎక్కువ వికెట్లు తీయాలి. వికెట్లతో పాటు ట్రోఫీ సాధించి తీరాలి’అంటూ మరో ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నాడు. ‘ఆనందంతో పాటు బాధ్యత పెరిగింది’అంటూ ఫ్యాన్స్ అడిగిన దానికి బదులిచ్చాడు ఈ స్పీడ్‌గన్. ఇక స్టెయిన్ ఐపీఎల్ అరంగేట్రం చేసింది ఆర్సీబీ జట్టులో అయినప్పటికీ.. ఆ జట్టుకు తొమ్మిదేళ్ల దూరంగా ఉన్నాడు. తిరిగి ఐపీఎల్-2019లో బెంగళూరు జట్టులో చేరినప్పటికీ రెండు మ్యాచ్‌ల అనంతరం గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. అయితే తాజా వేలానికి ముందు స్టెయిన్‌ను ఆర్సీబీ వదులుకుంది. కానీ వేలంలో అనూహ్యంగా తిరిగి చేజిక్కించుకుంది. స్టెయిన్‌తో పాటు రిచర్డ్సన్, మోరిస్, ఉదానలతో ఆర్సీబీ బౌలింగ్ దుర్బేద్యంగా ఉంది. ఇప్పటికే బ్యాటింగ్‌లో దుమ్ములేపే కోహ్లి జట్టు బౌలింగ్ బలం పెరగడంతో వచ్చే సీజన్లో హాజ్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. కోహ్లితో చర్చించే తీసుకున్నాం: మైక్ హెసన్ ‘వేలం ప్రారంభానికి ముందే అనుకున్నాం స్టెయిన్ అవసరం ఆర్సీబీకి ఉందని, అయితే అతడు కనీసం రూ. 3నుంచి 4 కోట్లు పలుకుతాడని భావించాం. కానీ మేము ఊహించింది జరగలేదు. లక్కీగా స్టెయిన్‌ను వేలంలో చేజిక్కించుకున్నాం. బౌలర్ల ఎంపిక విషయంలో సారథి కోహ్లితో పదేపదే చర్చించాం. మిడిల్ ఓవర్లలో మంచి బౌలర్ కావాలని అతడు కోరాడు. అందుకోసం ఉదాన సరైన వ్యక్తిగా భావించాం. దీంతో స్టెయిన్, ఉదానలను ఎంపిక చేశాం’అని ఆర్సీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైక్ హెసన్ పేర్కొన్నాడు. -
నన్నెవరు ఇష్టపడరు.. అందుకే జట్లు మారుతున్న: ఫించ్
ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ. 4.4 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఫించ్ ఆర్సీబీకి వెళ్లడంపై క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ట్విటర్లో స్పందించింది. ' ఆసీస్ స్టార్ ఆటగాడు ఆరోన్ ఫించ్ ఐపీఎల్ వేలంలో ఆర్సీబీకి వెళ్లాడు. ఆ జట్టులో ఉన్న సభ్యులంతా అతడిని ఇష్టపడతారని ఆశిస్తున్నామంటూ' ట్వీట్ చేయడంతో పాటు ఓ వీడియోనూ షేర్ చేశారు. ఆ వీడియోలో ఆస్ట్రేలియా టిమ్ పైన్, ఆరోన్ పించ్‌లు ఐపీఎల్ గురించి మాట్లాడుకున్నారు. గతంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న రోహిత్ శర్మ దృష్టి మరల్చడానికి టిమ్ పైన్ స్టంప్ మైక్రోఫోన్ ద్వారా ఫించ్‌తో సరదాగా మాట్లాడాడు. ' ఫించ్.. ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో టీమ్‌లు మారావు. దాదాపు అన్ని జట్లతో ఆడావ్' అని పైన్ అన్నాడు. దీనికి బదులుగా ఫించ్.. ' అవును అన్ని జట్లకు ఆడాను.. ఒక్క ఆర్సీబీకి తప్ప' అని బదులిచ్చాడు. అప్పుడు పైన్ అందుకుంటూ.. ' నిన్ను ఆ జట్టు ఎందుకు తీసుకోదు.. ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి నిన్ను ఇష్టపడరా ?' అంటూ సరదాగా అడిగాడు. ' అవును నన్ను ఎవరు ఇష్టపడరు.. అందుకే అన్ని జట్లు మారతున్నా అంటూ' .. ఫించ్ సమాధానమిచ్చాడు. అయితే ప్రస్తుతం ఐపీఎల్ వేలంలో ఫించ్ ఆర్సీబీకి వెళ్లడం విశేషం. ఈ వీడియోనూ కాస్తా క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. 'ఐపీఎల్ వేలంలో ఆరోన్ ఫించ్ ఆర్సీబీకి వెళ్లాడు. ఇప్పుడు కోహ్లి అతన్ని ఇష్టపడతాడులే' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రసుత్తం ఆర్సీబీకి ఆడనున్న ఆరోన్ పించ్ ఐపీఎల్లో ఏడు జట్లకు ఆడాడు. ఇప్పుడు ఆర్సీబీతో కలిపి 8 వ జట్టుకు ఆడనున్నాడు. కాగా, ఐపీఎల్ వేలంలో ఆర్సీబీ ఫించ్‌తో పాటు ఆస్ట్రేలియా బౌలర్ కేన్ రిచర్డ్సన్(రూ. 4 కోట్లు) , దక్షిణాఫ్రికా నుంచి ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్(రూ. 10 కోట్లు), బౌలర్ డేల్ స్టేయిన్(రూ. 2 కోట్లు)లను సొంతం చేసుకుంది. (చదవండి : సహచరులతో ఎంజాయ్ చేస్తున్న కోహ్లి) Aussie star Aaron Finch is off to @RCBTweets in the #IPLAuction2020. Let's hope his new teammates like him 😂😂😂 pic.twitter.com/VGfUFfJffq — cricket.com.au (@cricketcomau) December 19, 2019 -
'అత్యంత శక్తివంతమైన టీమ్‌ను చూడనున్నారు'
ఈసారి జరగబోయే ఐపీఎల్లో అత్యంత శక్తివంతమైన టీంను చూడబోతున్నారని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి ట్విటర్ వేదికగా తమ అభిమానులకు ఒక సందేశాన్ని పంపాడు. 13వ ఐపీల్ సీజన్‌కు సంబంధించి డిసెంబర్ 19న జరగనున్న వేలంలో అన్ని రంగాల్లో సమతుల్యం ఉన్న ఆటగాళ్లను తీసుకోబోతున్నట్లు స్పష్టం చేశాడు. 'మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా! త్వరలో జరగబోయే ఐపీఎల్ వేలంలోకి రానున్న ఆటగాళ్ల ఎంపికకు సంబంధించి మా జట్టు యాజమాన్యంతో పాటు కోచ్‌లు మైక్ హస్సీ, సైమన్ కటిచ్‌లు తమ శక్తి మేర కష్టపడుతున్నారు.ఇప్పటివరకు మీరు మమల్ని ఎంతో ఆదరించారు. ఇకపై కూడా ఇదే అభిమానాన్ని చూపిస్తూ మావెంటే ఉంటారని నమ్ముతున్నా. కాగా మా జట్టు యాజమాన్యంతో ఇప్పటికే వేలంకు సంబంధించి సంప్రదింపులు జరిపాం. వేలంలో అన్ని రకాలుగా నైపుణ్యం ఉన్న ఆటగాళ్లను తీసుకునేందుకు నిర్ణయించాం. 2020లో జరగనున్న 13 ఐపీఎల్ సీజన్‌కు మీరు కొత్త రాయల్ చాలెంజర్స్ టీమ్‌ను చూడబోతున్నారని' కోహ్లి ట్విటర్లో తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఐపీఎల్ సీజన్ ఆరంభం నుంచి నాణ్యమైన ఆటగాళ్లను కలిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఎప్పుడూ దురదృష్టం వెంటాడుతూనే ఉండేది. ఇప్పటివరకు జరిగిన 12 ఐపీఎల్ సీజన్లలో మూడు సార్లు మాత్రమే మెరుగైన ప్రదర్శన నమోదు చేసింది. 2009, 2011, 2016 లో రన్నరప్‌తోనే సరిపెట్టుకోగా మిగతా తొమ్మిది సీజన్లలో నిరాశాజనకమైన ఆటతీరును కనబర్చింది. 2016 తర్వాత జరిగిన మూడు సీజన్లలో అత్యంత చెత్త ప్రదర్శనను నమోదు చేసి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. అయితే డిసెంబర్ 19న కోల్‌కతాలో జరగనున్న ఐపీఎల్ వేలంలో కొత్త ఆశలతో పాల్గొననున్న బెంగళూరు టీమ్ తలరాత ఈసారైనా మారుతుందేమో చూడాలి. కాగా ఈసారి రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు 13 ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా, అందులో ఇద్దరు విదేశీ ఆటగాళ్లున్నారు. మిగతా 12 స్థానాలకు ఆటగాళ్ల ఎంపిక కోసం రూ. 27.90 కోట్లతో వేలంలోకి దిగనుంది. All set for the #IPLAuction? The Captain has a message for you.@imVkohli #ViratKohli #BidForBold #IPL2020 #PlayBold pic.twitter.com/moGkXCz31y — Royal Challengers (@RCBTweets) 17 December 2019 -
ఆర్సీబీ జట్టులోకి డేల్ స్టెయిన్!
హైదరాబాద్ : దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ డేల్ స్టెయిన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో చేరుతున్నాడా? అంటే అవుననే అంటున్నారు ఆ జట్టు అభిమానులు. స్టెయిన్ ఐపీఎల్ 2019 సీజన్లో ఆడటానికే భారత్‌కు వస్తున్నాడని ఆర్సీబీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఇండియా వీసాకు సంబంధించిన ఫొటోను స్టెయిన్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ‘అహ్హా.. ఏంటీ ఈ సర్ప్రైజ్’ అనే క్యాఫ్షన్‌తో షేర్ చేయడంతో ఈ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ సీజన్లో పేలవ ప్రదర్శనతో ఆర్సీబీ చెత్త రికార్డును మూటగట్టుకున్న విషయం తెలిసిందే. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడి అభిమానులకు తీరని మనోవ్యథను మిగిల్చింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో స్టెయిన్ జట్టులో చేరితే ఆర్సీబీకి కలుసోస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. నాథన్కౌల్టర్ నీల్ స్థానంలో స్టెయిన్ తుదిజట్టులోకి వస్తునట్లు ప్రచారం చేస్తున్నారు. తమకు మంచిరోజులు రాబోతున్నాయంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక స్టెయిన్ ఆర్సీబీ జట్టులో చేరితే ఆ జట్టుకు కలిసొచ్చే అంశమే. గత ఆరు మ్యాచ్‌ల్లో వారి బౌలింగ్ విభాగం తేలిపోయింది. భారీ లక్ష్యాలను కూడా కాపాడుకోలేక ఆ జట్టు చేతులెత్తేసింది. ముఖ్యంగా ఆ జట్టులో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ లేక పరాజయాలను చవిచూసింది. ఒకవేళ స్టెయిన్ జట్టులో చేరితే మాత్రం ఆ లోటు తీరనుంది. ఇక 2008 సీజన్ నుంచి 2010 వరకు స్టెయిన్ ఆర్సీబీ జట్టుకే ప్రాతినిథ్యం వహించాడు. 2011లో డెక్కన్ చార్జెర్స్ తరపున ఆడాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లయన్స్ జట్ల తరఫున కూడా బరిలోకి దిగాడు. ఇక ఈ విషయంపై ఆర్సీబీ జట్టు మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ.. స్టెయిన్ జట్టులో చేరే అవకాశం లేదని మాత్రం చెప్పలేమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డివిలయర్స్ జట్టులో ఉండటంతో స్టెయిన్ రాకను కొట్టిపారేయలేమంటున్నారు. Dale Steyn to join RCB tomorrow — Merin Kumar ™ (@merin_kumar) April 11, 2019 -
ఆర్సీబీ ఫ్యాన్స్‌గా తట్టుకోలేపోతున్నాం రా.!
హైదరాబాద్ : సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉప్పల్ వేదికగా ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు దారుణ ఓటమిని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. వార్నర్, బెయిర్ స్టోల శతకాల దాటికి కనీస పోరాటపటిమ కనబర్చకుండా కొట్టుకుపోయింది. ఏకంగా 118 పరుగులతో తేడాతో చిత్తయింది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ జట్టుకు సారథ్యం వహిస్తుండటం, ప్రపంచ దిగ్గజ బ్యాట్స్‌మన్ డివిలియర్స్ ఈ జట్టులోనే ఉండటంతో ఆర్సీబీకి అభిమానుల సంఖ్య ఎక్కువే. గత రెండు సీజన్లలో పూర్తి నిరాశజనక ప్రదర్శన కనబర్చి పాయింట్ల పట్టికలో అట్టడుగులో నిలిచిన ఆర్సీబీ ఈ సారి పుంజుకుంటుందని వారంతా వెయ్యి కళ్లతో ఎదురు చూశారు. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్‌తో ఓటమికి పిచ్ కారణమని సర్దుకున్నారు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి దురదృష్టమనుకున్నారు. కానీ తాజా హైదరాబాద్‌తో ఎదురైన ఓటమిని తట్టుకోలేకపోతున్నారు. ఈ ఘోరపరాభావాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని, ఆర్సీబీ అభిమానులుగా తట్టుకోలేకపోతున్నామని సోషల్‌మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లిసేన ఆటతీరుపై మండిపడుతున్నారు. 'ఈ సాలా కప్ కప్ నమ్దే' స్లోగన్ ఈసారి కూడా ఉత్తదేనా? అని నిట్టూరుస్తున్నారు. అసలు ఏమైంది ఆర్సీబీ ఆటగాళ్లకు.. అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసహనంతో కూడిన మీమ్స్‌తో కోహ్లిసేనపై దాడి చేస్తున్నారు. ప్రత్యర్థి 231 పరుగులు చేస్తే.. కనీసం పోరాటపటిమను కనబర్చకపోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. ‘మీరు ఓటమిని తట్టుకుంటున్నారో ఏమో కానీ.. ఆర్సీబీ ఫ్యాన్స్‌గా మా వల్ల కావడం లేదు’ అంటూ కామెంట్ చేస్తున్నారు. 2016 సీజన్లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ వరకు వెళ్లి సన్‌రైజర్స్ చేతిలో పరాజయం పాలైన ఆర్సీబీ.. ఆ తరువాత రెండు సీజన్లలో దారుణ ప్రదర్శనను కనబర్చింది. **After every #RCB match** RCB FANS TO RCB:- pic.twitter.com/5QnRDGKH7I — Kartik rathor (@kartik_craze) March 31, 2019 #RCB #RCB #RCB ! Being An RCB Fan Is Not so Easy ! They Are Like #STR fans ! There Is No Films For The Past Three Years But We Stood For Him ! Likewise #Rcb They Didn't Won Any Cups For The PastSeasons Yet ! BUT #STR Cameback And Gave A BB For us ! It Will Happen soon #RCB pic.twitter.com/xMNPsmRatL — Tyler Durden STR || MI (@WOLFIESTR) March 31, 2019 -
‘స్టువర్ట్ బ్రాడ్లా ఫీలయ్యా..అవునా?!’
బెంగళూరు : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాడు యువరాజ్ సింగ్ హ్యాట్రిక్ సిక్సర్లతో అలరించిన సంగతి తెలిసిందే. క్రీజులో ఉన్నది కాసేపు అయినా ఆర్సీబీకీ ముఖ్యంగా స్పిన్నర్ చహల్‌కు చెమటలు పట్టించాడు. ఈ విషయం గురించి మ్యాచ్ అనంతరం చహల్ మాట్లాడుతూ... ‘ యువరాజ్ నా బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టిన తర్వాత స్టువర్ట్ బ్రాడ్లా ఫీలయ్యాను. అయితే యువీ ఓ లెజండరీ బ్యాట్స్‌మెన్ అని నాకు తెలుసు. పైగా అది చిన్న స్టేడియం. కాబట్టి బంతిని సులభంగా బౌండరీ దాటించవచ్చు. అయినా నా వరకు నేను బాగానే బౌలింగ్ చేశా అనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో చహల్ తనతో పోల్చుకోవడాన్ని గురించి ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ స్పందించాడు. ‘ పదేళ్లలో 437 టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా చహల్ ఫీల్ అవ్వాలని ఆశిస్తున్నా’ అంటూ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా 2007 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సందర్భంగా స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌ను యువీ చీల్చి చెండాడిన సంగతి తెలిసిందే. ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టి అతడికి చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో ఇది తన కెరీర్లోనే చెత్త ప్రదర్శన అంటూ బ్రాడ్ పలుమార్లు పేర్కొన్నాడు. ఇక గురువారం నాటి మ్యాచులో 14 వ ఓవర్లో చహల్ బౌలింగ్‌లో హ్యాట్రిక్ సిక్సర్లతో అలరించిన యువీ.. నాల్గో బంతికి సైతం భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్ చేరాడు. బౌండరీ లైన్‌వద్ద సిరాజ్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో యువరాజ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. కాగా చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. "Felt like Stuart Broad during that over 😂" 3 sixes in 3 balls bowling to @YUVSTRONG12 and even @yuzi_chahal feared a repeat of the 2007 T20 WC, before redeeming himself the very next delivery 😎 #RCBvMI #VIVOIPL @RCBTweets pic.twitter.com/RRqxxmrDZw — IndianPremierLeague (@IPL) March 29, 2019 -
అంపైర్లు కళ్లు తెరవాలి: కోహ్లి
బెంగళూరు : అంపైర్లు కళ్లు తెరవాలి అంటూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లి మండిపడ్డాడు. గురువారం సొంత మైదానం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆర్సీబీ విజయానికి చివరి 5 బంతుల్లో 11 పరుగులు కావాల్సి ఉండగా.. తన అనుభవాన్నంతా ఉపయోగిస్తూ మలింగ 4 పరుగులే ఇచ్చి ముంబైని గట్టెక్కించాడు. అయితే ఆఖరి బంతి ‘నోబాల్’ కాగా... అంపైర్లు గుర్తించడంలో పొరపాటు చేశారు. మ్యాచ్ ముగిశాక రీప్లేలో ఇది ఖరారైనా అప్పటికే ఆలస్యమైపోయింది. అంపైర్ల పొరపాటును బిగ్స్క్రీన్పై చూసిన కోహ్లి.. ప్రజంటేషన్ పోడియం వైపు దూసుకు వచ్చి అంపైర్ల తప్పుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘మేం ఐపీఎల్ ఆడుతున్నాం. క్లబ్ స్థాయి క్రికెట్ కాదు. అంపైర్లు కళ్లు తెరుచుకొని ఉండాలి. ఆఖరి బంతిని నోబాల్‌గా ప్రకటించకపోవటం దుర్మార్గం. ఏకంగా అంగుళం తేడాతో అడుగు పడింది. అంపైర్లు ఏమైనా కళ్లు మూసుకున్నారా! ఇలాంటి చిన్న విషయాలే ఫలితంపై ప్రభావం చూపిస్తాయి. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వాళ్లు మరింత జాగ్రత్తగా, చురుగ్గా ఉండాల్సింది.’ అని ఊగిపోయాడు. ఏది ఏమైనా తమ రెండవ ఓటమని అంగీకరించిన కోహ్లి అనవసర తప్పిదాలతో మ్యాచ్‌ను చేజార్చకున్నామన్నాడు. ‘145/7తో మేం ఓ దశలో పటిష్టంగా ఉన్నాం. కానీ చివరి ఓవర్లు మాకు కష్టంగా మారాయి. ఏబీ అద్భతంగా ఆడాడు. మేం ఇంకా డెత్ ఓవర్లలో మెరుగవ్వాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో మా ఆటగాళ్లు చాలా నేర్చుకున్నారు. ముంబై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. వారి ఆట నుంచి మేం చాలా నేర్చుకున్నాం. నేను కూడా రాంగ్ టైమ్‌లో ఔటయ్యాను. శివం అద్భుతంగా ఆడాడు. జెస్సీ(బుమ్రా) టాప్ క్లాస్ బౌలర్. నేను అతని బౌలింగ్ ఎదుర్కునే విధానంలో తప్పు చేశాను. ముంబై జట్టులో బుమ్రా, మలింగాలు ఉండటం ఆ జట్టు అదృష్టం. జెస్సీ ఫామ్‌లో ఉంటే అది భారత్ జట్టుకు మంచిదే’ అని పేర్కొన్నాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 187 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (33 బంతుల్లో 48; 8 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. సూర్యకుమార్ యాదవ్ (24 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా... యువరాజ్ సింగ్ (12 బంతుల్లో 23; 3 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (14 బంతుల్లో 32 నాటౌట్, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగిపోయారు. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులే చేయగలిగింది. ఏబీ డివిలియర్స్ (41 బంతుల్లో 70 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) పోరాటం జట్టును గెలిపించలేకపోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (32 బంతుల్లో 46; 6 ఫోర్లు) ఆకట్టుకున్నాడు.